యువకుడి ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): కన్నాల గ్రామ పంచాయతీ పరిధి బోడగుట్టపల్లి గ్రా మానికి చెందిన చిందం శ్రీనివాస్(25) మంగళవా రం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిందం మల్లయ్య– దంపతులకు సత్యనారాయణ, శ్రీనివాస్ కుమారులు. మల్లయ్య 20ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. సత్యనారాయణ ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో ఉన్నా డు. శ్రీనివాస్ బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో అప్రెంటిషిప్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ బుగ్గ రామస్వామి ఆలయం ప్రాంతంలో గడ్డిమందు తాగి, విషయాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు తెలిపా డు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరు కుని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతుడి సోదరుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేస్తారని స్థానికులు తెలిపారు. కాగా శ్రీనివాస్ ప్రేమవ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. తమకు ఫిర్యాదు అందలేదని బసంత్‌నగర్ పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ కిందపడి ఒడిశా కార్మికుడి మృతి
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి): సుద్దాల గ్రామ శివారులోని బ్రిక్స్ కంపెనీలో ఒడిశా కార్మికుడు పరిక్షిత్ మహాకూర్(35) మంగళవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని లాపేరు గ్రామానికి చెందిన పరీక్షిత్ మహాకూర్ ఇటుకల కంపెనీలో కొంతకాలంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ెఈక్రమంలో నల్లమట్టిని ట్రాక్టర్ కేజీవీల్స్‌తో దున్నుతున్నా డు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారిపడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. తోటి కార్మికులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి బానబీహార్ మహాకూర్ ఫిర్యాదు మేరకు కేసు నమమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్
కరీంనగర్ క్రైం: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంలతో దురుసుగా ప్రవర్తించడంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్ వెళ్లి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment