AP Elections Political Latest Updates Telugu
6:41PM, శుక్రవారం, Dec 22, 2023
నారా లోకేష్‌కు ఎలాంటి ఎమోషన్స్ లేవు: మంత్రి ఆర్‌కే రోజా
- పిల్లలు బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తూ ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారు
- అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేష్‌కు ఉంది కాబట్టి, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు
- నారా లోకేష్ ఎలాంటి ఎమోషన్స్ లేవు, తారక రత్న చనిపోయిన పట్టించుకోలేదు
- జగనన్న పాదయాత్ర చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా 4వేల కిలో మీటర్లు, 400 రోజు అని చెప్పి 40 కి.మీ కూడా కంటిన్యూగా నడవలేదు200 రోజులు అని చెప్పి 200 సార్లు బ్రేక్ తీసుకున్నాడు లోకేష్
- ఫెయిల్యూర్ పొలిటీషియన్ లోకేష్
- 4 కోట్ల లోకల్ ఓటర్లు, 4 నాన్ లోకల్ లీడర్స్కు మధ్య రానున్న ఎన్నికలు జరగ బోతున్నాయి
- పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను ప్రజలు తరిమి కొడతారు
6:15PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబు, పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్
- ఒకడు ప్యాకేజీ కోసం @పవన్ కల్యాణ్
- ఒకడు పుత్రుడి కోసం @చంద్రబాబు
- ఒకే ఒక్కడు ప్రజల కోసం @సీఎం జగన్
ఒకడు ప్యాకేజీ కోసం @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) December 22, 2023
ఒకడు పుత్రుడు కోసం @ncbn
ఒకే ఒక్కడు ప్రజల కోసం @ysjagan
4:15PM, శుక్రవారం, Dec 22, 2023
లోకేష్‌ది జంపింగ్ జపాంగ్ యాత్ర: పేర్ని నాని
- లోకేష్‌ది అట్టర్ ఫ్లాప్ యాత్ర
- రాజకీయ లబ్దికోసమే లోకేష్ యాత్ర
- మేనమామ కొడుకు చనిపోతే లోకేష్ కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదు
- లోకేష్‌యాత్ర చేసిన కిలోమీటర్లన్నీ దొంగలెక్కలే
- సాయంత్రం సూర్యడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారు
- ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు. వీళ్లను పెట్టి దీన్ని పెద్ద సినిమా అంటారు
- చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారు
- చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏదైనా నెరవేర్చారా?
- హామీలను గాలికొదిలేసి చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారు
- ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయటం చంద్రబాబు అలవాటు
- ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు
- చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారు
- తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలనేదే చంద్రబాబు ఆలోచన
- ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన బాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
- అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
- సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించారు
- అలా విమర్శించినవారే మూడురెట్టు ఎక్కువ సంక్షేమం అందిస్తామంటున్నారు
3:22 PM, శుక్రవారం, Dec 22, 2023
కర్నూలులో సైకిల్ సీన్ రివర్స్
- చంద్రబాబు, లోకేష్ తీరుపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం
- యువగళం సభకు హాజరుకాని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
- కర్నూలు ఎంపీ, ఆలూరు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న కోట్ల కుటుంబం
- తమకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు దాటవేస్తున్నాడన్న భావనలో కోట్ల
3:03 PM, శుక్రవారం, Dec 22, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం
- ఏపి హైకోర్టు: IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం
- దర్యాప్తు అధికారులకు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో మెమో ఫైల్ చేసిన సీఐడీ
- చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులపై లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు కోర్టులో మెమో ద్వారా తెలిపిన సీఐడీ
- ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరిన సీఐడీ
- కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు కు ఏపీ హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు
- CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
- టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
- కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
- లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు
- స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు
- అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
- 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు
- ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
- అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
- ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్
- కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
- కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
- లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
- సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు
2:00PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబుకు మతిస్థిమితం లేదని మేము ఎప్పట్నుంచో చెబుతున్నాం: మంత్రి మేరుగ
- నిన్న చంద్రబాబు రాష్ట్రంలో 7వేల కోట్ల క్రైస్తవ ఆస్తులు కాజేస్తున్నమని ఆరోపణ చేశారు
- మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
- క్రైస్తవ ఆస్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబు, బాబు నాయకులు
- రాజకీయంగా తన మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు
- గుంటూరు,విజయవాడలో ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తాం
- ఎన్నికలు వస్తున్నాయనినోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు
- చంద్రబాబు ఓ గజదొంగ..మా మీద దాడులు,అఘాయిత్యాలు చేయించారు
- చంద్రబాబు హయాంలో దళితుల పై జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి
- దళితులపై చంద్రబాబు అమానుషంగా కేసులు పెట్టారు,వైఎస్ జగన్ ఆ కేసులు ఎత్తివేశారు
- చంద్రబాబు నువ్వు మనిషివా,మానవత్వం ఉందా?
- చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు
- క్రైస్తవ ఆస్తులు పై చర్చకు ఎక్కడి రమంటే వస్తా
- రాజధాని ప్రాంతంలో మా పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు
- నాడు-నేడు కింద స్కూల్స్,సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగు పరిచిన చరిత వైఎస్ జగన్‌ది
- దళితులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది
1.33 PM, శుక్రవారం, Dec 22, 2023
AP ఎన్నికలకు రెడీ :
- రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం
- సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ లతో కూడిన ఏడుగురు బృందం
- సీఎస్, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం
- ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ కలెక్టర్ల ప్రెజెంటేషన్
- 2024 ఓటర్ల జాబితాల రూపకల్పన తో పాటు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షలు
- జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్ల నివేదికలు
- రేపు సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ భేటీ కానున్న ఈసీ బృందం
1.05 PM, శుక్రవారం, Dec 22, 2023
లోకేష్ ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలపై CID సీరియస్
- విజయవాడ : లోకేష్ వ్యాఖ్యలపై ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి
- లోకేష్ కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారని, ఆధారాలతో సహా ACB కోర్టు ముందు ఉంచిన CID
- లోకేష్ కి NBW వారెంట్ జారీ చేయాలని పిటీషన్ లో పేర్కొన్న CID
- యువగళం ముగింపు సంధర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
- కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాద్పద వ్యాఖ్యలు
- కోర్టు ఆదేశాలని దిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటీషన్ లో పేర్కొన్న సిఐడి
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్
- చంద్రబాబుకి రిమాండ్ విధించడం తప్పని తేల్చేసిన లోకేష్
- ACB న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో పేర్కొన్న సిఐడి
- చంద్రబాబుపై స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్
- సిఎం హోదాలో నాడు చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్న CID
- నాడు తమ అభ్యంతరాలని బాబు పట్టించుకోలేదని న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్ పిసి క్రింద ఉన్నతాధికారుల వాంగ్మూలం
- ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
- అధికారులు 164 CrPC క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారని హెచ్చరికలు జారీ చేసిన లోకేష్
- రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశానంటూ తరచూ బెదిరింపులకు దిగుతోన్న లోకేష్
- భవిష్యత్తులో వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరిక
- దర్యాప్తు సంస్థ విధివిధానాలను ఎలా తప్పుబడుతారంటున్న న్యాయ నిపుణులు
- 164 CrPC క్రింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం
- సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ దురుద్దేశంగా మెమోలో పేర్కొన్న సిఐడి
- గతంలో లోకేష్ కి జారీ చేసిన 41 ఎ నోటీసులలో పేర్కొన్న షరతులకి విరుద్దమన్న సిఐడి
12.42 PM, శుక్రవారం, Dec 22, 2023
మీడియా ఇంటర్వ్యూల్లో లోకేష్ చెప్పిందేంటీ?
- జనసేన - తెలుగుదేశం పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తాయి
- ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్కరే ఉంటారు
- ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడు
- ఈ విషయంలో ఎలాంటి సందేహం, అనుమానం అవసరం లేదు
- అస్సలు పవన్ కళ్యాణ్‌తో మాకు ముఖ్యమంత్రి పదవి అంటే CM సీట్ షేరింగ్ అనే కాన్సెప్టే లేదు
- ఈ విషయం పవన్ కళ్యాణ్‌కు ముందే చెప్పాం
- అన్నీ అర్థం చేసుకున్నాకే పవన్ పొత్తు విషయాన్ని ప్రకటించాడు
- అదే విషయాన్ని వేర్వేరు సభల్లో కూడా పవన్ ప్రకటించాడు
- అనుభవజ్ఞుడి నాయకత్వం అవసరం ఉందని పవనే తెలిపాడు
12.22 PM, శుక్రవారం, Dec 22, 2023
పవన్ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
- లోకేష్ వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కి ప్రశ్నలు సంధించిన హరిరామ జోగయ్య
- లోకేష్ అశిస్తున్నట్టు చంద్రబాబునే పూర్తి కాలం సీఎం చెయ్యడానికి మీ ఆమోదం ఉందా...?
- మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలి..?
- యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలి..?
- ఈ ప్రశ్నలకు మీ జనసైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారు..?
- రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఎంటో జనసైనికులకు అర్థమయ్యేలా సమాధానం ఎప్పుడు చెప్తారు..?
12.10 PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి: కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపాశేషు
- ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్
- చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు ఈ రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదు
- అర్జంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన
- తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్
- జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదు
- పవన్‌కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు,లోకేష్ బాగోగులే
- జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేం ఎప్పుడో చెప్పాం
- జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు
- పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడు
- పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారు
- చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన
- పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయం
- చంద్రబాబు,లోకేష్,పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరు
- యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాఫ్
- చంద్రబాబే సీఎం అభ్యర్ధని ఓ ఇంటర్యూలో లోకేష్ స్పష్టంగా చెప్పాడు
- పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటే మమ్మల్ని అందరూ విమర్శించారు
- లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు
- పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే
- జన సైనికులు,కాపు సామాజికవర్గ పెద్దలు ఆలోచన చేయాలి
- భారతదేశంలో ఎవరూ చేయలేనంత గొప్పగా సీఎం జగన్ సంస్కరణలున్నాయి
- చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తోంది
- ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు
- ఆ సంపద కోసం ఆశపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
- చంద్రబాబుకి పవన్ అమ్ముడుపోయాడు
- తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిదిచోట్ల పోటీచేసి తుస్సుమన్న పవన్ పార్టీ
- తనను నమ్ముకున్నవారిని ఇంకా పిచ్చోళ్లను చేసే ప్రయత్నంలో పవన్ ఉన్నాడు
- కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఎస్సార్ కుటుంబమే
- కాపులను రోడ్ల పై ఈడ్చి తన్నించిన చరిత్ర చంద్రబాబుది
- కాపులకు కొమ్ముకాసిందెవరో.. అమ్ముకున్నదెవరో తెలుసుకోండి
- ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. కాపులను పవన్.. చంద్రబాబుకు అమ్మేశాడు
- సీఎం జగన్ 2వేల కోట్లు కాపు నేస్తానికి ఖర్చు చేశారు
- పవన్ కు దమ్ముధైర్యం ఉంటే తనకు ఎన్ని సీట్లిస్తారో ప్రకటించాలి
- అచ్చెన్నాయుడికి టిక్కెట్ ఇవ్వనని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా?
- సమర్ధవంతమైన వ్యక్తిని ప్రకటించే దమ్ము జగన్ మోహన్ రెడ్డికే ఉంది
- సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తాడు...175 సీట్లలో గెలుస్తారు
11.44 AM, శుక్రవారం, Dec 22, 2023
పవన్‌కు రాజకీయాలు, సిద్ధాంతాలపై క్లారిటీ లేదు: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
- మొన్నటి దాకా లెఫ్ట్ అన్నారు.. ఇప్పుడు రైట్ అంటున్నారు
- తెలంగాణలో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ అయ్యారు
- ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ కావడం ఖాయం
- తెలంగాణలో పవన్ కళ్యాణ్, బీజేపీ.. బీసీ సీఎంను ప్రకటించారు
- మరి ఏపీలో కూడా పవన్ చంద్రబాబు బీసీని సీఎంను చేస్తామని ప్రకటిస్తారా?
- వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ, సీపీఎంతో కలిసి పొత్తు పెట్టుకుంటాం
- ఈ అంశంపై త్వరలోనే ఏఐసీసీ పెద్దలతో స్ట్రాటజీ మీటింగ్ ఉంది
- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచురిని కలుస్తాం
- తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి
- ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తాం
- దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది
- పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ దీనికి నిదర్శనం
- దీనికి నిరసనగానే జంతర్ మంతర్‌లో ధర్నా కు దిగాం
10.42 AM, శుక్రవారం, Dec 22, 2023
బాలయ్య మిస్సింగ్.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్
- యువగళం ముగింపు సభలో బాలకృష్ణ పాల్గొన్నప్పటికి ఆయన పేరు, ఫోటో ప్రచురించలేదని ఆగ్రహం
- కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తలగబెట్టిన బాలకృష్ణ ఫ్యాన్స్
- ఆంధ్రజ్యోతి యాజమాన్యం బాలకృష్ణ పట్ల వివక్షత చూపుతోందని అభిమానుల ఆగ్రహం
10.12 AM, శుక్రవారం, Dec 22, 2023
పవన్ నియోజకవర్గంపై కన్‌ఫ్యూజన్
- మళ్లీ రెండు నియోజకవర్గాలు కావాలంటోన్న పవన్ కళ్యాణ్
- ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పవన్ కళ్యాణ్
- గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పవన్
- గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
- భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
- ఈ సారి మళ్లీ గాజువాకలో పోటీ చేస్తానంటోన్న పవన్ కళ్యాణ్
- విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచిందని గుర్తు చేస్తోన్న పవన్
- ఈ సారి కలిసి పోటీ చేస్తాం కాబట్టి తనకు గాజువాకలో అవకాశం ఉంటుందంటున్న పవన్
- ఇదే విషయాన్ని రివర్స్‌లో చెబుతోన్న తెలుగుదేశం నాయకులు
- తమకు బలమున్న చోట పవన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వడమంటోన్న టిడిపి సీనియర్లు
- తనకు మాటిచ్చారు కాబట్టి గాజువాక ఇవ్వాల్సిందేనంటోన్న పవన్
- పవన్‌కు అదే హామీ ఇచ్చి లోకేష్ సభకు రప్పించానని సీనియర్లకు నచ్చజెబుతోన్న చంద్రబాబు
- గాజువాకలో మరోసారి ఓటమి తప్పదంటున్న టిడిపి సీనియర్లు
- ఈ సారి రెండో నియోజకవర్గంగా పిఠాపురం అయితే బాగుంటుందన్న పవన్
- పిఠాపురంలో 14,992 ఓట్ల మెజార్టీతో గెలిచిన YSRCP అభ్యర్థి దొరబాబు పెండెం
- పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తనకు అడ్వాంటేజ్ అంటోన్న పవన్
- తెలుగుదేశం అభ్యర్థి వర్మకు ఎసరు పెట్టేందుకు జనసేన ఇన్‌ఛార్జ్‌గా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
- తంగెళ్ల గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే పవన్ పోటీకి అనుకూలంగా ఉంటుందని జనసేన ప్లాన్
08.49 AM, శుక్రవారం, Dec 22, 2023
వేడేక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం
- అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో ముందుకెళ్తోన్న సీఎం జగన్
- సింగిల్‌గా పోటీ చేయలేక దిక్కులు చూస్తోన్న టిడిపి, జనసేన
- పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు, పవన్
- నిన్నంతా సీట్ల లెక్కలో తలమునకలయిన బాబు, పవన్
- పవన్ లెక్క 50/5, చంద్రబాబు లెక్క 25/2
అధికార యావతో చంద్రబాబు, @PawanKalyan కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. గత ఎన్నికల వేళ @ncbn లో కనపడని నీతి... ఇప్పుడెలా కనపడిందో పవన్ చెప్పాలి. @naralokesh యువగళం అట్టర్ ఫ్లాప్ కావడంతో @JaiTDP పూర్తి నిరాశలో కూరుకుపోయింది.
— YSR Congress Party (@YSRCParty) December 21, 2023
-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల… pic.twitter.com/7N7PqXplwO
7.19 AM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబుది దిగజారుడు రాజకీయం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
- జనాకర్షణ కోసం పవన్‌కళ్యాణ్, బాలకృష్ణతో సభలు
- ఎంతమంది వచ్చినా వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేరు
- అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని లూటీ చేసి.. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు
- అధికార దాహంతో అలమటిస్తూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు
- తన కుమారుడు చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభకు పవన్‌కళ్యాణ్ వస్తేనే కానీ నిర్వహించుకోలేని దుస్థితికి టీడీపీ దిగజారిపోయింది
- యువగళం సభకు జనసమీకరణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ట్రైన్‌లు, బస్సుల్లో కార్యకర్తలను తరలించిన విషయం అందరికీ తెలిసిందే
- జనాకర్షణ కోసం బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ను సభలకు ఆహ్వానించారు
- ఎన్ని పార్టీలు, ఎంతమంది కలిసి వచ్చినా 2024 జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యం
- ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, రైతులకు మేలు చేస్తాం, ప్రజలకు ఉపకారం చేస్తామని చెబుతున్న ప్రతిపక్ష టీడీపీ నాయకులు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు?
- జాబు కావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగమంటూ యువతను మభ్యపెట్టిన చంద్రబాబు తన కొడుకు నారా లోకేశ్‌కు రాజకీయ ఉద్యోగం ఇప్పించుకున్నారే తప్ప సామాన్య నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు
7.14 AM, శుక్రవారం, Dec 22, 2023
ఆ నలుగురూ నాన్‌లోకల్.. ఇక్కడ రాజకీయాలతో ఏం పని: మంత్రి ధర్మాన ప్రసాదరావు
- రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఆ నలుగురూ వేరే రాష్ట్రంలోనే నివాసం
- మన రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు వారికి అర్హత లేదు
- చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ వేరే రాష్ట్రంలో ఉంటూ.. ఇక్కడకు ఎందుకు వచ్చారు?
- వారిలో ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటున్నారని, మరో ఇద్దరు సినిమాలు చేసుకుంటున్నారు
- ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతామంటే ఒప్పుకుంటామా?
- విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ఈనాడు దుష్ప్రచారం
7.00 AM, శుక్రవారం, Dec 22, 2023
ఈనాడు.. ఇంత దిగజారుడు రాతలా?: సీఎం జగన్ మండిపాటు
- అది పేపరా.. పట్టిన పీడా?
- మీ పిల్లలు, మనవళ్లకేమో ఇంగ్లీషు మీడియం చదువులు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లా?
- మేం పేద పిల్లలకు ఇస్తుంటే చెడిపోతారా?
- నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలపై తప్పుడు కథనాలా?
- మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలోనేమో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండొచ్చు! స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు!
- కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం అవి ఉండకూడదా? ఇది సరైన పోకడేనా
- ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరంతా ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు
- పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా అంటున్నారు
- ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు
- మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలపై తప్పుడు రాతలు రాస్తున్నారు
- ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వొద్దని ప్రతి రోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు
6.55 AM, శుక్రవారం, Dec 22, 2023
ఈసీ బృందం రెండు రోజుల పర్యటన..
- కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీలో పర్యటన
- రెండు రోజుల పాటు సీఎస్, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశం
- సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు బృందం రాష్ట్రంలో పర్యటన
- రెండు రోజుల పాటు 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష
- జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు.
- ఈ నెల 23వతేదీన సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ
Comments
Please login to add a commentAdd a comment