Dec 25th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines Dec 25th Telugu | Sakshi
Sakshi News home page

Dec 25th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Mon, Dec 25 2023 7:11 AM | Last Updated on Mon, Dec 25 2023 8:15 PM

AP Elections Political News Updates Headlines Dec 25th Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

8:10PM, సోమవారం, Dec 25, 2023

  • ఆర్టీవీ ఆఫీస్‌ వద్ద టీడీపీ కార్యకర్తల ఓవర్‌ యాక్షన్‌
  • వ్యూహం సినిమాపై టీడీపీ నేతల కడుపు మంట
  • వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ నేతల దాష్టీకం
  • వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

4:18PM, సోమవారం, Dec 25, 2023

విశాఖ:

బెడిసికొట్టిన టిడిపి నాయకుల ప్లాన్.

  • మైలేజీ కోసం కేఏ పాల్‌ను తగరపువలస తీసుకువచ్చిన టీడీపీ నేత బివిరామ్
  • మీడియాతో మాట్లాడుతూ టిడిపి, పవన్ పై విమర్శలు గుప్పించిన పాల్.
  • పాల్ విమర్శలతో తెల్లమొఖాలేసిన టిడిపి నేతలు.

12:00 PM,  సోమవారం, Dec 25, 2023

ఆలయాలు కూల్చిన చరిత్ర చంద్రబాబుది: వెలంపల్లి శ్రీనివాసరావు

  • చంద్రబాబుది గుడులు కూల్చే ప్రభుత్వం 
  • వన్ టౌన్ పాత శివాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కి దక్కింది 
  • రెండు దఫాలుగా కోటి 60 లక్షల నిధులిచ్చారు 
  • నూతన పాలకమండలి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా 
  • గతంలో శివాలయం చుట్టుపక్కల ఆలయాలను చంద్రబాబు కూల్చివేశాడు 
  • చంద్రబాబుది గుడులు కూల్చే ప్రభుత్వం 
  • దేవాలయాలను నిర్మించిన చరిత్ర  ముఖ్యమంత్రి జగన్‌ది. 
  • విజయవాడ పశ్చిమ  నియోజకవర్గంలోని ఆలయాలను సీఎం జగన్‌ రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు 
  • చంద్రబాబు, పవన్‌కు గెలుస్తామనే ధైర్యం లేదు
  • వైఎస్సార్‌సీపీ పథకాలను కాపీ కొట్టాలని చూస్తున్నారు 
  • పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది వీళ్ల తీరు
  • పులి ఎప్పటికీ పులే.. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అవ్వదు
  • చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు
  • కోవిడ్ సమయంలోనూ పథకాలను ఆపకుండా కొనసాగించారు
  • కోవిడ్ సమయంలో చంద్రబాబు ఉండుంటే పథకాలన్నీ ఆగిపోయేవి
  • నేనుంటే కోవిడ్ వచ్చేదా అంటూ కామెడీ చేస్తున్నాడు
  • చంద్రబాబు ఏం చేసినా సీఎం జగన్‌ను ఢీకొట్టలేడు
  • 175కి 175 కచ్చితంగా సాధించి తీరుతాం
  • సీఎం జగన్‌కు ప్రజాబలం ఉంది
  • చంద్రబాబు పీకేను పిలిపించుకున్నా, రాబిన్ శర్మను పిలిపించుకున్నా ఏం చేయలేరు
  • ప్రజల్లో బలం లేని చంద్రబాబు పొరబాటున కూడా సీఎం కాలేడు
  • చంద్రబాబు, లోకేష్, పవన్‌కు సవాల్
  • విజయవాడ నగరాభిృద్ధిపై చర్చకు నేను సిద్ధం
  • 14 ఏళ్లలో మీరేం చేశారో.. నాలుగున్నరేళ్లలో మేమేం చేశామో చర్చిద్దాం
  • దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ నాతో చర్చకు రావాలి
  • ముఖ్యమంత్రి జగన్‌ 175 చోట్లా గెలవాలని చూస్తున్నారు
  • వాళ్లేమో కుప్పం, భీమవరం, మంగళగిరిలో గెలవాలనుకుంటున్నారు

11:30 AM, సోమవారం, Dec 25, 2023
వ్యూహకర్తలు పార్టీలను గెలిపించలేరు: దేవులపల్లి అమర్‌

  • ఎన్నికల వ్యూహకర్తలు.. ప్రజల మనసులో లేకుండా పార్టీని గెలిపించేయలేరు..
  • వ్యూహాకర్తలే పార్టీలను గెలిపించేటట్లు అయితే..
  • ఈ పాటికి ప్రశాంత్ కిషోర్ ప్రధానమంత్రి కావాలిగా..

10:00 AM, సోమవారం, Dec 25, 2023
చంద్రబాబుకు అంబటి కౌంటర్‌

  • నేడు యజ్ఞాలు ప్రజలకోసమంటావు !
  • నాడు వెన్నుపోటు ప్రజల కోసమే అన్నావు
  • అనడానికి కాస్తంత సిగ్గుండాలి !

9:30 AM, సోమవారం, Dec 25, 2023
జనసైనికులకు దిమ్మ తిరిగింది?

  • ఎన్నికల్లో గెలిస్తే సీఎం చంద్రబాబే
  • బాంబు పేల్చిన చినబాబు నారా లోకేష్‌
  • పవన్‌ గాలితీసేసిన లోకేష్‌

8:40 AM, సోమవారం, Dec 25, 2023
ఎంత మంది పీకేలు వచ్చినా నష్టం లేదు: కొడాలి నాని

  • చంద్రబాబు ఎంత మంది పీకేలను తెచ్చుకున్నా సీఎం వైయస్‌ జగన్‌‌ను ఏమీ చేయలేరు. 
  • ఐప్యాక్‌తో ప్రశాంత్‌ కిషోర్‌కు సంబంధం లేదు. 
  • వైయస్సార్సీపీకి వ్యూహకర్తగా  పీకే ఉన్నపుడు బీహారోడు అని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్నదేంటి? 

6:40 AM, సోమవారం, Dec 25, 2023
విషయం వీక్ అయినప్పుడు..
ప్రచారం పీక్‌లో ఉండాలని నమ్మేవాడు బాబు !!

ఒక పీకే సరిపోడు, ఇద్దరు పీకేలు కావాలంటున్న బాబు 
ఒక వైపు పవన్  కళ్యాణ్,ఇంకో వైపు ప్రశాంత్ కిషోర్ 
ఇద్దరూ జాకీలు పెట్టి లేపితే కానీ కనీస పోటీ ఇవ్వలేమని బాబు ఫీలింగ్

ప్రశాంత్ కిషోర్‌ను బీహార్  డెకాయిట్ అని రకరకాలుగా అనరాని  మాటలు అన్న బాబు, లోకేష్‌లు
ఇదే ప్రశాంత్ కిషోర్  కోసం "పాహిమాం" అంటున్నారంటే జగన్ ఎంత బలంగా ఉన్నాడో తెలియడం లేదా? 

ప్రశాంత్  కిషోర్ టీంలో  ఒకరయిన రాబిన్ శర్మ  బాబు కోసం పని చేస్తుంటే ఇంకొకరు  రిషి రాజ్ సింగ్ జగన్ కోసం పని చేస్తున్నాడు
కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు
కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొని  ఇద్దరు పీకేలతో కలసి జగన్ మీదకి యుద్దానికి వెళ్లాలని వెన్నుపోటు నాయుడు ప్లాన్

అంతే కాకుండా టీడీపీ గెలుస్తుంది అని రోజూ పేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు
3,500 మందితో  మౌత్ క్యాంపెయిన్‌ చేయిస్తున్నాడు బాబు 
కులం కోసం బట్టలు చింపుకొనే ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎలానూ ఉన్నాయి

తాజా సర్వేల ప్రకారం
కోస్తా లో వైసీపీకి 50  శాతం, టీడీపీకి 35-36 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మిగిలిన 3 -4 శాతం  మద్దతు ఉంది 

పవన్‌కు 20  సీట్లకు ముంచి ఇవ్వలేం అని తేల్చి చెప్పాడు బాబు 
దీంతో పవన్ మింగలేక కక్కలేక ఉన్నాడని మొన్న విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగేజ్‌ను చూస్తే  తెలుస్తుంది 

సీఎం పదవి షేరింగ్  లేకుండా, 60  సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదంటున్న కాపు సంఘాలు, భగ్గుమంటున్న కాపు యువత 

ఇంకో వైపు సైలెంట్‌గా పని చేసుకొని పోతున్న జగన్ 
ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ...!!!

6:30 AM, సోమవారం, Dec 25, 2023
బ్రో’...ఇదేం పద్ధతి.. వాపోతున్న జనసేన కార్యకర్తలు

  • సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్‌కళ్యాణ్‌ మొగ్గు
  • కానీ.. గెలిస్తే చంద్రబాబే సీఎం అని... పవన్‌ కూడా అంగీకరించారని చెప్పిన లోకేశ్‌
  • ఇందులో సందేహాలకు తావు లేదని, 150 సీట్లకు అభ్యర్థులూ రెడీ అని చెప్పిన చినబాబు
  • ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు
  • మూడో సారి కూడా మోసమేనా.. అంటూ మండి పడుతున్న జనసేన నేతలు
  • పవన్‌! సీఎం పదవిపై ఆశలు వదిలేశావా?.. అంటూ హరిరామజోగయ్య లేఖ  
  • జనసైనికుల కలలు ఏమవ్వాలంటూ నిలదీత

సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు

  • ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత, నిష్పాక్షికతతో ఎన్నికలు జరగాలి 
  • ఒక్క తప్పూ లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి 
  • పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు 
  • సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి 
  • కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ 
  • 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement