అలా ఉండాలంటే పార్టీ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని గెలిపించాలి
కాంగ్రెస్ అభ్యర్థి జైలు జీవితం గడిపిన బ్లాక్ మెయిలర్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్‌బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్‌రెడ్డి గోల్డ్‌మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్‌మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్‌లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment