టీ20 ప్రపంచకప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఐసీసీ ముహూర్తం ఖారారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వరకు ఈ మెగా ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ మెగా టోర్నీ 10 వేదికల్లో జరగనున్నాయి.
అందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్ దీవుల్లో ఉండనున్నాయి. ఇక ఐసీసీ బృందం ఇప్పటికే యూఎస్‌ఎలో 5 వేదికలను ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్ ఉన్నాయి. కాగా గత కొన్ని ఎడిషన్లగా ఈ పొట్టి ప్రపంచకప్ ఆక్టోబర్-నవంబర్‌లో జరుగుతూ వస్తుంది. కానీ ఈ సారి జూన్‌లో జరగనుండడం గమనార్హం. ఐపీఎల్ సీజన్ పూర్తి కాగానే ఈ మహాసంగ్రామం మొదలు కానుంది.
ఈసారి సరి కొత్తగా..
ఈ సారి పొట్టి ప్రపంచకప్ గత కొన్ని ఎడిషన్లకు భిన్నంగా జరగనుంది. ఈ టోర్నీలో 16 జట్లకు బదులుగా 20 జట్లు పోటీపడనున్నాయి. మొత్తం 20 జట్లను 5 జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ఎనిమిది జట్లను 4 చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ప్రతీ గ్రూపు నుంచి తొలి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అవుతాయి.
అమెరికా, వెస్టిండీస్ కూడా..
కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. అమెరికా, వెస్టిండీస్ అతిథ్య హోదాలో తమ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా,శ్రీలంక జట్లు ఈ మెగా ఈవెంట్‌కు తమ స్ధానాలను రిజర్వ్ చేసుకున్నాయి.
మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఈ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్ధానాలకు ప్రస్తుతం రీజినల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Ashes 2023: ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment