మహబూబాబాద్, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ముఖ్యమంతత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబాబాద్‌లో వరద ప్రభావిత పప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్రమ కట్టడాల వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నా.. అపార నష్టం వాటిల్లింది. అయితే ప్రభుత్వ ముందు చూపు వల్లే ప్రాణాపాయం మాత్రం తప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు మాత్రం దెబ్బ తిన్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ల కష్టనష్టాల గురించి తెలుసుకున్నాం
వరంగల్‌పై ప్రత్యేక దృష్టి డతాం. రాంనగర్ అక్రమకట్టడాలను తొలగించడం వల్లే వరద ముప్పు తప్పింది. చెరువ అక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఇలాంటి కట్టడాలకు సహకరించిన అధికారులపైనా చర్యలు ఉంటాయి. కొంతమంది ఆనయకులు నాపై విమర్శలు చేస్తుంటారు. ప్రజల మంచి కోసం అన్నింటిని భరిస్తా.
.. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అక్రమ కట్టడాలు కట్టారు. పువ్వాడ అక్రమ కట్టడాలు తొలగించాలని హరీష్‌రావు డిమాండ్ చేయగలరా?. తెలంగాణలో గత పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఏనాడైనా పరామర్శించారా?. మాసాయిపేటలో రైలు కింద పడి పిల్లలు చనిపోతే వెళ్లారా?. అవుటర్ రింగ్ రోడ్డు కింద అమ్మాయిని హత్యాచారం చేస్తే.. ఆ కుటుంబాన్ని ఓదార్చారా?. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్లలేదా? అని సీఎం రేవంత్ నిలదీశారు.
ఆకేరు వరదలతో విపరీతమైన నష్టం జరిగింది. మరిపెడ మండలంలోని మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. మూడు తండాలను కలిపి ఓకే చోట కాలనీలను నిర్మిస్తాం. అందరికీ ఓకేచోట ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు.. మేకలు చనిపోతే రూ.5 వేలు అందిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం. పంట నష్టాన్ని అంచనా వేసి.. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తాం. వరద సహాయక చర్యలపై కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం.
మెడికల్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులు, అధికారులు కలిసి. పని చేయాలి. బురద కడగడానికి వీలైనన్ని ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలి. ఈ వరదలను కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే ప్రయత్నం చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment