తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగలను అక్రమ రవాణా చేసిన కేసులో డక్కిలి మండలం, వెల్లికల్లుకు చెందిన ఆటో డ్రైవర్ ఎం.గురునాథంకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. 2012 సెప్టెంబర్ 25వ తేదీ వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది బాలయ్యపల్లి మండలం, అక్కంపేట– కయురు చెరువు అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా నిందితుడు గురునాథం తన వాహనంలో 373 కిలోల 18 ఎరచ్రందనం దుంగలను తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వెంకటగిరి రేంజ్, బాలయ్యపల్లి సెక్షన్ ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శిరీష వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment