![క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04tpl62-300008_mr-1738695623-0.jpg.webp?itok=NmNm_h9g)
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలి
తిరుపతి తుడా: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ప్రాణ హాని వుండదని స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని స్విమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణంలో ఉందని, అందులో 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. స్విమ్స్‌లో బోన్ మ్యారో సేవలు కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. క్యాన్సర్ గుర్తించడానికి పింక్ బస్ ద్వారా అన్ని పరీక్షలు చేస్తున్నట్టు తెలియజేశారు. డీన్ అల్లాడి మోహన్, అంకాలజీ వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రుయాలో...
రుయా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమ్యూనీటీ పారామెడికోస్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియషన్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీరోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకుడు పి.నవీన్‌కుమార్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment