తుమ్మలగుంటలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తిరుపతి రూరల్ : తుమ్మలగుంటలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి పునీతులయ్యారు. మంగళవారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ, దైనందిన పూజాధికాలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, కర్పూర హారతుల నడుమ స్వామి వారి వాహన సేవలు కన్నుల పండువుగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు వాహన సేవల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం
ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత చిన్న శేష వాహనం, గరుడ, హనుమంత వాహనాలపై విహరించారు. అనంతరం ఆలయ పుష్కరణిలో వైఖానస ఆగమోక్తంగా చక్రతాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం ఆచరించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామి వారు కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహన సేవ తరువాత జరిగిన పుష్కరణిలో సాగిన చక్రస్నానానికి భక్తులు కిక్కిరిసిపోయారు.
సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment