వరి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం
తిరుపతి అర్బన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సివిల్ సప్లయ్ అధికారులు మొదలుపెట్టారు. రెండు రోజులుగా జిల్లాలోని ఆరు మండలాల్లో కొనుగోలు చేస్తున్నారు. వారం క్రితం సాక్షి దినపత్రికలో ‘ఇదేం మెలిక’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లాలోని వరదయ్యపాళెం, బీఎన్ కండ్రగ, పిచ్చాటూరు, నాగలాపురం, డీవీ సత్రం, సూళ్లూరుపేట మండలాల్లో ఒక్కో మండలంలో రెండు నుంచి నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సాధారణ రకం (75 కేజీలు) రూ.1,725, గ్రేడ్ –ఏ రకం (75 కేజీలు) రూ.1,740 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
ఈ రూల్స్ తప్పనిసరి
● చెడిపోయినా, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యపు గింజలు 4 శాతం మించి ఉండరాదు
● వ్యర్థ పదార్థాలు, మట్టి, రాళ్లు, ఒక శాతానికి మించి ఉండరాదు
● చెత్త, తాలు(జల్లు) ఒక శాతం మించి ఉండరాదు
● రంగు మారిన ధాన్యం ఐదు శాతానికి మించ ఉండరాదు
● పరిపక్వం లేని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యం మూడు శాతం మించరాదు
● కేళీలు ఆరు శాతం మించి ఉంటే కొనుగోలు చేయరు
● తేమ 17 శాతం మించి ఉండరాదు
Comments
Please login to add a commentAdd a comment