‘మా ఇంటితో నాన్నకు సంబంధం లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘మా ఇంటితో నాన్నకు సంబంధం లేదు’

Published Wed, Nov 1 2023 12:54 AM | Last Updated on Wed, Nov 1 2023 12:01 PM

- - Sakshi

ఆరిలోవ: సుందరయ్యనగర్‌లోని 133 చదరపు గజాల స్థలంలో ఉన్న ఇంటితో మా నాన్న పోలవరం నాగరాజుకు ఎలాంటి సంబంధం లేదని అతని కుమార్తె రంగాల కనకలక్ష్మి స్పష్టం చేశారు. ఈ ఇంటి విషయంలో తన కుమార్తె కనకలక్ష్మి, అల్లుడు రంగాల పైడిరాజు తనకు అన్యాయం చేశారని నాగరాజు అక్టోబర్‌ 27న దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మా నాన్న చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ స్థలాన్ని తామే కొనుగోలు చేసి, రుణం తీసుకుని ఇంటిని నిర్మించుకున్నట్లు వెల్లడించారు. ఆయన మా మీద కక్షతో దీక్ష చేపట్టి.. ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement