మరో 30 వేల చ.అ.ల విస్తీర్ణంలో..
బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయ శ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖ వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతోనే సాధ్యమైందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్‌టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని 2023లో నిర్ణయించింది. రూ.18.95 కోట్లతో 4 అంతస్తుల్లో ఈ భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఎస్‌టీపీఐ సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment