మద్దిలపాలెం: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)–2020 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్‌కు ఈ నెల 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. చెల్లింపులు, పత్రాల సమర్పణకు సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిర్ధిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా గతంలో వీఎంఆర్డీఏకు 5,803 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ వెల్లడించారు. వీటిలో 2,942 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయగా, 615 దరఖాస్తులు తిరస్కరించినట్లు చెప్పారు. 127 దరఖాస్తుదారులకు చెల్లింపు నోటీసులు జారీ చేశామని, పూ ర్తి సమాచారం లేదని 2,111 మంది దరఖాస్తుదారులకు తెలియజేశామన్నారు. షార్ట్‌ఫాల్స్ ఉన్న దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా సంబంధిత పత్రాలను వీఎంఆర్డీఏకు సమర్పించి, దరఖాస్తుల క్లియరెన్స్‌లో సహకరించాలని కమిషనర్ కోరారు.
పూర్తి వివరాలు సమర్పించి
సహకరించండి
2,111 మందికి వీఎంఆర్డీఏ
కమిషనర్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment