రోడ్డును బ్లాక్‌చేసిన టీడీపీ కార్యకర్త వాహనం
● గంటసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్న
ప్రయాణికులు
● పోలీసుల ప్రవేశంతో తీరిన ఇబ్బంది
రాజాం: రాజాం పట్టణంలోని పాలకొండ రోడ్డులో టీడీపీ కార్యకర్త అత్యుత్సాహం కారణంగా ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్‌వీఎస్ పిక్చర్ ప్యాలెస్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ టీడీపీ కార్యకర్త బొలెరో వాహనాన్ని ఆదివారం రోడ్డుపై పార్కింగ్ చేసి స్నేహితులను కలిసేందుకు వెళ్లిపోయాడు. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పుకోలేక ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహన చోదకుడి గురించి పోలీసులు ఆరా తీసి చివరికి విసిగిపోయారు. గంటసేపు అనంతరం సంబంధిత వాహనదారు అక్కడికి వచ్చి బొలెరో వాహనం తీయడంతో సమస్య సద్దుమణిగింది. వాల్మీకి సేవాదళ్ అనే స్టిక్కర్‌తో వాహనంపై టీడీపీ నేతల ఫ్లెక్సీ ఉంది. తాను టీడీపీ నేతను అని వాహనదారు చెప్పడంతో పోలీసులు ఏమీ అనకుండా విడిచిపెట్టేశారు. సుమారు గంటసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులు టీడీపీ కార్యకర్త తీరును దుయ్యబట్టారు. ఈ తంతుతో కిలోమీటర్ మేర పాలకొండ రోడ్డులో వాహనాలు నిలిచిపోగా ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment