విద్యుత్‌ కండక్టర్ల మార్పునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కండక్టర్ల మార్పునకు చర్యలు

Published Sat, Jan 18 2025 2:24 AM | Last Updated on Sat, Jan 18 2025 2:24 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో భీమడోలు–పెదవేగి, భీమడోలు–ఏలూరు ఫీడర్‌లలో కండక్టర్ల మార్పునకు చర్యలు తీసుకున్నట్టు ఈపీడీసీఎల్‌ ఏలూరు డివిజన్‌ ఈఈ కేఎం అంబేడ్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలు–పెదవేగి పనులు శనివారం నుంచి ఈనెల 31 వరకు, భీమడోలు–ఏలూరు పనులు వచ్చేనెల 1 నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఆ సమయంలో పెదవేగి, ఏలూరు విద్యుత్‌ కేంద్రాలకు కానుమోలు విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరాకు ఏర్పాటు చేశామని, ఏదైనా లోపంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సహకరించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement