Treatment
-
విడాకులకు దారితీసిన కిడ్నీదానం! ఆరోగ్యానికి ప్రమాదమా?
శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. అలాంటి మూత్రపిండాలను దానం చేసే విషయంలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ కిడ్నీ దానం చేసే విషయంలో చాలా మూర్ఖంగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడొక భర్త కూడా తన నమ్మి వచ్చిన భార్యను కిడ్నీ దానం చేసిందని విడాకులు ఇచ్చేశాడు. తన సోదరుడి గురించి కిడ్నీ దానం చేసిందని అతను ఇలాంటి దారణమైన పనికి పూనుకున్నాడు. కిడ్నీ దానం చేసినంత మాత్రాన వారిని ఇక ఎందుకు పనిరారని, రోగుల కింద ట్రీట్ చేయాల్సిన పనిలేదు. ఎందువల్ల ఈ కిడ్నీ దానం విషయంలో చాలామందికి చెడు అభిప్రాయాలే ఉన్నాయి. ఇంతకీ ఇది మంచిదా కాదా? ఇదివరకటిలా దాతలు జీవనం సాగించలేరా? తదితరాల గురించే ఈ కథనం!. ఈ కిడ్నీ దానం విషయంలో ఎంతలా చెడు అభిప్రాయం ఉందంటే.. ఉత్తరప్రదేశంలో ఈ విషయం గురించి ఓ జంట కాపురంలో చిచ్చు రేగింది. ఏకంగా విడాకుల వరకు దారితీసింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో బైరియాహి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. భార్య ఉత్తరప్రదేశ్‌లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. తన సోదరుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో అతనికి కిడ్నీ దానం చేసింది ఆ మహిళ. ఐతే ఆమె ఈ విషయాన్ని భర్తకు కూడా తెలిపింది. అంతే వెంటనే ఆమె భర్త వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు నమోదు చేసింది. ఇలాంటి అమానుష ఘటనలు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. చాలామంది దీన్ని తీవ్రంగా పరిగిణించటానికి ప్రధానం కారణం ఆ విషయంపై ఉన్న అపోహలే. కీడ్నీ దానం ప్రాముఖ్యత.. ఒక కిడ్నీ ఉన్న చాలా మంది రెండు కిడ్నీలు బాగా పనిచేసే వారిలాగే జీవితాన్ని గడపగలరు. అలాగే దాతలకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదు. కిడ్నీని దానం చేసే స్త్రీలు ఇప్పటికీ గర్భం దాల్చవచ్చు. సురక్షితమైన ప్రసవం పొందగలరు. దెబ్బతిన్న రెండు కిడ్నీల కంటే ఒక ఆరోగ్యకరమైన కిడ్నీ చాలా మెరుగ్గా పని చేస్తుంది. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, ఆరోగ్యకరమైన మూత్రపిండాలను కలిగి ఉంటే..కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌కు దానం చేసేందుకు ముందుక రావొచ్చు. దీనివల్ల వారి జీవన నాణ్యతను పెంచినవారవుతారు. డయాలిసిస్ చేయించుకోవాల్సిన బాధకరపరిస్థితిని తప్పించిన వారవుతారు. అలాగే దాత కిడ్నీ సర్జరీ తాలుకా మచ్చలు పోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇక్కడ సర్జరీ చేసిన విధానం, శరీరం తీరుపైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు వ్యక్తి జీవనశైలి ఆధారంగానే ఉంటాయో తప్ప ప్రత్యేకంగా కాదు. ఆరోగ్యకరమైన రీతిలో జీవనశైలి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. దాత తదుపరి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నిపుణులను అడిగి తెలుసకుని పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇది దారమైన పని కాదు. ఓ వ్యక్తి బతకగలిగే అవకాశం ఇవ్వడం లేదా ప్రాణం పోసిన దానితో సమానం. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్‌పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్‌కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్‌పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు
పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ జంట. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె జీవితం పూర్తి నిరాసక్తతతో కూడిన చీకటి ఆవరించింది. కనీసం పిల్లలైన కలిగిన వారిలో తన భర్తను చూసుకునేదాన్ని కదా! అన్న బాధ ఆమెను తొలిచేసింది. మరోవైపు భర్త దూరమయ్యాక అత్తింటి వారెవ్వరూ ఆమెను చేరదీయలేదు. ఒంటరి జీవితం వెళ్లదీస్తున్న ఆమెకు తన భర్త ఉండగా పిల్లల కోసం తాము ఎంచుకున్న ఐవీఎఫ్ పద్ధతి గుర్తుకొచ్చింది. దీంతో తామప్పుడూ సంప్రదించి వైద్యులను సంప్రదించి తల్లి అయ్యి తన కోరికను నెరవేర్చుకుంది. పైగా ఆమె కారణంగా వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. బెంగాల్‌లోని బీర్భూమ్‌కి చెందిన సంగీతా కేశారి, ఆమె భర్త అరుణ్ ప్రసాద్ కేశారి రెండేళ్లుగా గర్భం దాల్చడంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరిగా వారు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 2021లో భర్త స్పెర్మ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేయడం జరిగింది. అయితే అంతలోనే ఆమె భర్త కరోనా మహమ్మారికి బలైయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైన పిల్లలను కనాలి తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనపాలనలో గడపాలని గట్టిగా కోరుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పిల్లల్లో తన భర్తను చూసుకోవాలని ఆరాటపడింది. ఎందుకంటే..? ఆమె భర్త దూరమయ్యాక కనీసం అత్తింటి వారు ఆమెను చేరదీయలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటిరిగానే జీవితం కొనసాగిస్తోంది. తన భర్త నడిపే కిరాణ దుకాణాన్ని ఆమె నడుపుతూ జీవిస్తోంది. సరిగ్గా అప్పడే తన భర్త ఉండగా సంప్రదించిన ఆస్పత్రి గుర్తుకొచ్చింది. అక్కడ భర్త స్పెర్మ్ దాచిన సంగతి జ్ఞప్తికి వచ్చి పిల్లలను కనడం సాధ్యమవుతుందా? తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా? అని ఆ ఆస్పత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మహిళకు 48 ఏళ్లు పిల్లలను కనగలిగే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ పద్ధతి కాస్త రిస్క్ అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆమె సంకల్పానికి తగ్గట్టుగానే ఆ పద్ధతి విజయవంతమై పూర్తి ఆరోగ్యంతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు వైద్యుడు పలాష్ దాస్ మాట్లాడుతూ..ఆ మహిళ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యిందని అన్నారు. ఆమె పిల్లలను కనే వయసు ముగిసే సమయానికి ఆమె శుక్రకణాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. ఇక్కడ ఆమె తల్లి కావాలనే తాప్రత్రయంతో కనడం అనేది ఆమెకు రిస్క్ అయినా లెక్కచేయకుండా డేర్ చేసిన తీరు ప్రశంసంచదగ్గ విషయమని అన్నారు. నిజంగా ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిదేనని అన్నారు. (చదవండి: మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!) -
మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!
కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునేలోపు ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై నేనింకా ఉన్నానని చెబుతూనే ఉంటోంది. ఇప్పటి వరకు దాని రూపాంతర వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.86 వంటి కేసులను ఫేస్ చేశాం. మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్ 1 అనే కరోనా కొత్త వేరియంట్ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు.ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు భారత్‌లో కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్.1 లక్షణాలు సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..
కొన్ని జబ్బుల తీరు వైద్యులు చెప్పిన లక్షణాలేవి కనిపించకుండానే సైలంట్‌గా దాడి చేస్తాయి. అందువల్లే ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అలాంటి వాటిని కట్టడి చేసి ప్రజల్లో ఆ వ్యాధులపై అవగాహన కల్పిద్దామన్నా పరిస్థితుల దృష్ట్యా లేదా జీవనశైలి కారణంగానో ఆ వ్యాధుల లక్షణాలు కూడా ఆశ్చర్య కలిగించే రీతిలో వస్తున్నాయి. అలాంటి షాకింగ్ లక్షణాలే ఇక్కడొక మహిళలో కనిపించడంతో లైట్ తీసుకుంది. అదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆస్పత్రి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన యూఎస్ఏలో చోటు చేసుకుంది. జెన్నా టాన్నర్ అనే 48 ఏళ్ల మహిళ గతేడాది మహమ్మారి సమయంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే ఆమె ఇంటిల్లపాది ఆ మహమ్మారి బారిన పడి బయటపడ్డారు. అయితే ఆమెకు ఒక రోజు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సేమ్ కరోనా మాదిరి సమస్యే అనుకుంది ఆమె. బహుశా ఫ్లూ లాంటి జ్వరం కాబోలు అనుకుని లైట్ తీసుకుంది. భర్తకు కూడా చెప్పకూడదనుకుంది. ఎందుకంటే? ఆస్పత్రిలో చేరిపోమంటారన్న భయం తోపాటుపైగా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో టాన్నర్ చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అది కాస్త తీవ్రమై సడెన్‌గా ఓ రోజు ఇంట్లోనే స్ప్రుహతప్పి పడిపోయింది. కట్ చేస్తే.. ఆమె రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే కోమాలో ఉంది. రెండో రోజు సాయంత్రం మెలుకువ వచ్చి అంతా తెలుస్తున్నా.. ఏది తన కండిషన్లో లేనట్లు, గుండెపై ఏనుగులాంటి పెద్ద బరువు ఏదో ఉన్నట్లు తోచింది ఆమెకు. కనీసం బెడ్ మీద నుంచి కదలాలనుకున్న కొంచెం కుడా కదలలేకపోతోంది. కనీసం చేతిని కూడా కదపడం కష్టంగా ఉంది. ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి తనవాళ్లు వచ్చి తనకు గుండె పోటు వచ్చిందని చెప్పేంత వరకు కూడా ఆమెకు ఏం తెలియదు. అయితే తనకు వచ్చింది గుండెపోటా..? అని నిర్ఘాంతపోయింది. నాకలాంటి సంకేతాలేం కనిపించలేదు కదా! అని ఆలోచిస్తూ షాక్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు బైపాస్ సర్జరీ చేసి స్టంట్ వేశారు. అస్సలు గుండెపోటు వచ్చినప్పుడు ఇలా గాలి పీల్చుకోవడం వంటి రెస్పిరేషన్ సమస్యలు కూడా వస్తాయ? అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆమె తనలా ఎవరూ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో తన ఉదంతాన్ని అందరికీ చెప్పి గుండెపోలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించే యత్నం చేస్తోంది టాన్నర్. కాగా,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మహిళలకు గుండెపోటులో యూఎస్ తొలి స్థానంలో ఉంది. నిజానికి గుండెపోటు అనంగానే ఛాతీ నొప్పిలా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మహిళ్లల్లో ఇలా కాకుండా వేర్వేరు లక్షణాలతో కూడా సంకేతాలిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలల్లో ముఖ్యంగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వెన్ను, భుజం, దవడ నొప్పి వంటి ఇతర లక్షణాల రూపంలో కూడా సంకేతమిస్తుందని అన్నారు. ఏదీ ఏమైనా 45 ఏళ్లు దాటాక ఏ వ్యక్తి అయినా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు
ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్‌లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్‌గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్‌లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు. (చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..) -
ఆల్కహాల్ అలర్జీ అని పొరబడింది! చివరికి ఏకంగా..
పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్ ట్రెండ్ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్ ఎలర్జీయే కదా!.. అని లైట్ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్‌కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్ ఎలర్జీ అనుకుంటా అని లైట్ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్ అయ్యింది. అప్పుడు డాక్టర్ ఆమె ఫేస్ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్‌గా వివరించలేదు. అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్‌గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్‌లోనే ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది. అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్‌కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంటేనే వైద్యులు క్యూర్ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. (చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్) -
యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్
యూకేలో వంద రోజుల దగ్గు(100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతట వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. గతనెల జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు. ఇది గతేడాది 2022లో కాలంలోనే మూడు రెట్లు అధికంగా ఉండేదని, అదికాస్తా ఇప్పుడు మరింత తీవ్రమయ్యిందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్డౌన్, సామాజిక దూరం వంటి ఆంక్షలు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి తక్కువుగా ఉండేదని, ఇప్పుడూ మాత్రం కేసులు మళ్లీ వేగంగా పెరుతున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇది కోరింత దగ్గు రకానికి చెందిన సుదీర్ఘ దగ్గే ఈ వంద రోజుల దగ్గు. ఇంతకీ అసలు కోరింత దగ్గు అంటే.. కోరింత దగ్గు అంటే.. ఇది బోర్టెటెల్లా పెర్టుస్సిస్ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల వాయుమార్గాల ఇన్ఫెక్షన్ అయ్యి అదేపనిగా దగ్గు వస్తుంది. కనీసం ఏం తినలేక దగ్గి.. దగ్గి.. శరీరం అంతా పులపరంగా ఉండి నీరసించిపోతారు. ఇది శిశువుల్లో, వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 1950లలో టీకా రావడంతో ఆ సమస్య నెమ్మదించింది. అంతేగాదు 1960లలో ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి ఈ అంటు వ్యాధులు ప్రబలేవని, టీకాలు వేయడంతో నియంత్రణలోకి వచ్చేదని బ్రిటన్‌కి చెంది బ్రిస్ట్ విశ్వవిద్యాలయ పీడియాట్రిక్స్ చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన ముఖ్యంగా శిశువులు, వృద్ధులే పడతారని చెబుతున్నారు. ఎదురయ్యే సమస్యలు.. జలుబుని పోలీ ఉండే లక్షణాలు ఉత్పన్నమవుతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తీవ్రమైన దగ్గు ఒక్కోసారి వాంతులు లేదా పక్కటెముకలు విరగడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. నివారణ శిశువుల్లో, వృద్ధుల్లో వచ్చే ఈ కోరింత దగ్గుని తగ్గించొచ్చు. దీనికి అందుబాటులో టీకా కూడా ఉందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది. చదవండి: భారత్‌లో 'వాకింగ్ న్యూమోనియా' కేసుల కలకలం! ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..? -
భారత్‌లో అంతకంతకు పెరుగుతున్న 'వాకింగ్ న్యూమోనియా కేసులు'!
భారత్‌లో కూడా చైనా మాదిరి కేసులు పెరగుతున్నాయంటూ కలకలం రేగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు సంబంధించిన ఏడు కేసులు గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ ఆందోళన రేకెత్తింది. ఐతే ఎయిమ్స్ ఆస్పత్రి ఈ కేసులకి చైనా న్యూమోనియాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అవి సాధారణ 'వాకింగ్ న్యూమోనియో' కేసులేనని తేల్చి చెప్పింది. అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు చెందొద్దని పేర్కొంది. అసలేంటీ వాకింగ్ న్యూమోనియా? దానికీ ఆపేరు ఎలా వచ్చింది? అంత ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం. వాకింగ్ న్యూమోనియో అంటే..? ఈ న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. వారే సులభంగా ఈ వ్యాధి బారినపడుతారు. రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబతున్నారు. ఇది చాలా వరకు సాధారణమైన తేలిక పాటి లక్షణాలు గల వ్యాధేనని తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులను తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ రోగ నిర్థారణ అనేది సరైన పద్ధుతుల్లో చేయాలి. అందుకు తగట్టుగా చికిత్స తీసుకుంటే చాలని పేర్కొన్నారు డాక్టర్లు. ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 'వాకింగ్ న్యూమోనియా' అనేది ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్తో బాధపడే రోగులను ఉద్దేశించి పెట్టిన పేరు. దీని కారణంగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పైగా జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి సాధారణ లక్షణాలే కనిపస్తాయి. ఇవి కూడా రెండు నుంచి మూడు వారాలు మాత్రమే కనిపిస్తాయి. పరిస్థితి సాధారణ న్యుమోనియా కంటే తక్కువగానే ఉంటుంది. తేలికపాటి లక్షణాలే ఉండటంతో ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతారు. కాబట్టి దీన్ని 'వాకింగ్ న్యుమోనియాగా' పిలిచారు వైద్యులు. ఐతే చైనాలో వచ్చే న్యూమోనియాకు దీనికి సంబంధం లేదు. అది అడెనోవైరస్, రెస్పిరేటరి సిన్సిటియల్ వైరస్(ఆర్ఎస్వీ) వల్ల వన్తున్నట్లు నివేదికలో తెలిపింది. అవి విలక్షణమైన న్యూమోనియాకి సంబంధించిన కేసులు. అయితే ఇది కరోనా మాదిరిగా ప్రబలంగా లేదని తీవ్రత తక్కువగానే ఉందని చైనా స్పష్టం చేసింది కూడా. వైద్యులు సైతం ఈ న్యూమోనియా తీవ్రత రేట్లు ఒక్కోసారి మారుతూ ఉంటాయిని చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి అని, ఇది దగ్గినా లేదా తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అందువల్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది యాంటీబయోటిక్‌లకు లొంగినప్పటికీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెడుతుంటుందని తెలిపారు. ముఖ్యంగా కౌమరదశలో ఉన్న పిల్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆందోళన చెందాలా? వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తి గ్రత శుభ్రత తోపాటు జాగ్రత్తుల పాటిస్తే చాలని చెప్పారు. ముక్కుకి మాస్క్‌ల ధరించడం, చేతి పరిశుభ్రత పాటించడం వంటివి చేస్తే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అన్నారు. చికిత్స.. నోటి ద్వారా తీసుకునే యాంటీబయోటిక్స్‌ని ఐదు నుంచి 10 రోజుల వాడితే చాలు. పొరపాటును కూడా దగ్గును తగ్గించే మందులను వాడకూడదు. ఎందుకంటే వచ్చింది వాకింగ్ న్యూమోనియా అని తేలితే వైద్యుల సూచించిన మందులే వాడాలి. దగ్గుని కంట్రోల్ చేసే మందులు వాడితే శ్లేష్మం ఊపిరితిత్తులోనే ఉండి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కుటుంబంలో ఎవ్వరైన ఈ వ్యాధి బారినపడి అందరూ జాగ్రత్తలు పాటించాలి. అంటువ్యాధి కావున ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. అందువల్ల చేతి పరిశుభ్రతలు, వ్యక్తిగత శుభ్రత పాటించటం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!
ఇటీవల కాలంలో చాలా అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. వైద్యుల సైతం రోగుల స్థితిని చూసి కంగుతింటున్నారు. మొన్నటికి మొన్న స్కానింగ్‌లో పెద్దపేగులో సజీవంగా ఉన్న ఈగను చూసి విస్తుపోయారు. అది మరువకమునుపే చైనాలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. వైద్యులు సైతం ఇదేలా సాధ్యం అని షాకయ్యారు.! అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన ఓ మహిళ భరించలేని కళ్ల దురదతో బాధపడింది. ఇది సాధారణమైన సమస్యగానే భావించి వైద్యులను సంప్రదించలేదు. ఒక రోజు ఆ బాధను తట్టుకోలేక కళ్లను గట్టిగా నలుపుకుంది. ఇంతలో ఒక పురుగు కిందపడటం చూసి కంగుతింది. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర భయాందోళనకులోనై సమీపంలో ఆస్పత్రికి వెళ్లింది. వాళ్లు ఆమె కంటిని పరీక్షించగా కనురెప్పలు, కనుబొమ్మల మధ్య చాలా పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. దీంతో తక్షణమే వాటిని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్యులు. ఆమె కుడి కన్ను నుంచి 40కి పైగా సజీవ పురుగులను తీయగా, ఎడమ కన్ను నుంచి 10కి పైగా సజీవ పురుగులను తొలగించారు. మొత్తంగా ఆమె కళ్ల నుంచి దాదాపు 60కి పైగా సజీవ పురుగుల(పరాన్నజీవులు) తొలగించరు. ఇలా అసాధారణ స్థాయిలో పరాన్నజీవులు ఉండటం అనేది చాలా అరుదని. ఇది చాలా అసాధారణమైన కేసు అని డాక్టర్ గువాన్ అన్నారు. ఆమె కంటిలో ఫిలారియోడియా రకానికి చెందిన పరాన్నజీవులు ఉన్నట్లు భావిస్తున్నారు వైద్యులు. ఇవి ఎక్కువగా కుక్కలు, పిల్లలు శరీరాలపై ఉండే లార్వాలని, అవే ఆమెకు సంక్రమించి ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే చాలామంది తమ పెంపుడు జంతువులను తాకి ముద్దు చేసి మళ్లీ ఆ చేతులనే కళ్లను తాకడం, రుద్దడం వంటివి చేస్తారు. అందువల్ల ఆమెకు ఈ వ్యాది సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు. అలాగే సదరు మహిళను కంటిలో అవశేష లార్వాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అని దాని గురించి తరుచుగా చెక్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఆమెను పెంపుడు జంతువులను తాకితే గనుక వెంటనే కడుక్కోవాలని సూచించారు వైద్యులు. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
ఆ పాఠమే చెప్పకపోయి ఉంటే..ఆ స్టూడెంట్ ప్రాణాలు..!
మన నేర్చుకున్న విద్య మనకే ఉపయోగపడితే ఆశ్చర్యం ఆనందరం రెండూ వస్తాయి. ఎన్ని విద్యలైనా.. కూటి కొరకే అంటారు. మరీ మనం నేర్చుకున్న విద్య మనకు ఉపయోగపడటం ఏమిటీ? మన అభ్యున్నతి కోసమే కదా ఇంత కష్టపడి చదువుకునేది అంటారా? నిజమే గానీ మనం నేర్చుకున్న విద్య ఆపదలో ఉన్నప్పుడూ లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడూ ఉపయోగపడితే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. అలాంటి అద్భుత ఘటనే ఓ స్టూడెంట్ విషయంలో చోటు చేసుకుంది. ఏం చేశాడంటే..? యూఎస్‌లో న్యూజెర్సీకి చెందిన 27 ఏళ్ల వైద్య విద్యార్థి సల్లీ రోహన్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్టడీలో భాగంతో ఓ రోజు థెరాయిడ్ను ఎలా అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించాలో భోదిస్తున్నారు ప్రోఫెసర్లు. థెరాయిడ్ గురించి బోధిస్తుండగా తనకు కూడా ఉందన్న అనుమానం సల్లీలో వచ్చింది . అనుహ్యంగా ఒక్కో విద్యార్థికి టెస్ట్ చేస్తూ.. సల్లీకు కూడా చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే ఆయన డాక్టర్ని సంప్రదించమని ఆమెకు సలహ ఇచ్చారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి వివిధ వైద్య పరీక్షలు చేయగా రిపోర్ట్‌లో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తేలింది. అయితే సల్లీ థైరాయిడ్ సమస్యను సూచించే ఎలాంటి లక్షణాలను గానీ సమస్యలను గానీ ఫేస్ చెయ్యలేదు. ఇది నాలుగు ప్రాథమిక రకాల థైరాయిడ్ క్యాన్సర్లలో అత్యంత ప్రబలమైనది. అల్ట్రాసౌండ్ గురించి క్లాస్ జరగకపోతే గనుక తన వ్యాధిని కనుగొనకపోవచ్చని చెబుతోంది. సల్లీకి వచ్చిన థైరాయిడ్ క్యాన్సర్ శోషరస కణువుల వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. వెంటేనే ఆమె ఆరోగ్య ఖర్చులు కవరయ్యేలా భీమా చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవడవం ప్రారంభించింది. ముందుగా థైరాయిడ్ ప్రభావిత శోషరస కణువులను తొలగించే శస్త్ర చికిత్స చేయాలి తర్వాత రేడియో అయోడిన్ అనే ఒక రకమైన రేడియేషన్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. కళాశాలలో ఆ క్లాస్ జరగడం ఆ స్టూడెంట్ వరం అయ్యింది. లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు ఆ క్యాన్సర్‌ని గుర్తించి ఉండేవారు కాదు. పైగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది. మనం నేర్చకుంది ప్రాణాంతక సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడేలా చేస్తే అంతకుమించిన ఆనందం మరోకటి లేదు కదా!. (చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..) -
ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ..
ఎన్నో రకాల క్యాన్సర్ల గురించి విన్నాం. కానీ ముక్కు క్యాన్సర్‌గా గురించి విని ఉండం. ఐతే ఇది ఎందువల్ల అనేది? కారణాలు తెలియాల్సి ఉంది. గానీ దీని కారణంగా పలువురు పేషెంట్లు ముక్కును కోల్పోయారు. తాజాగా బ్రిటన్‌కి చెందిన ఓ మహిళా ఇలానే మొత్తం ముక్కును కోల్పోయింది. అసలేంటి ముక్కు క్యాన్సర్? వస్తే మొత్తం ముక్కునే తొలగించక తప్పదా..? ముక్కు లోపాల కణితి వచ్చి అసాధారణంగా పెరగడం ప్రారంభమైతే దాన్ని ముక్కు క్యాన్సర్ లేదా నాసికా క్యాన్సర్ అంటారు. వీటిలో రకాలు కూడా ఉంటాయి. కణ క్యాన్సర్, అడెనోకార్సినోమా, న్యూరోబ్లాస్టోమా, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, సార్కోమా తదితరాలు. ఇది నాసికా కుహరం లేదా పారానాసల్ లోపల ప్రారంభమయ్యే స్థితిని బట్టి ముక్కుకి సంబంధించిన ఆ రకమైన క్యాన్సర్లుగా నిర్థారిస్తారు వైద్యులు. ఈ వ్యాధి బారిన బ్రిటన్‌కి చెందిన 40 ఏళ్ల టీనా ఎర్ల్స్ పడింది. ఆమె ఐదుగురు పిల్లల తల్లి. ఆమె తరుచుగా ముక్కు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండేది. ముఖం ఎడమవైపు మొద్దబారిపోతున్నట్లు ఉండేది. లోపాల ఒక విధమైన గడ్డ ఉండి నొప్పి వచ్చేది. సాధారణంగా ముక్కులో వచ్చే గడ్డలనే ఆమె భావించింది. తరచుగా ముక్కు రక్తస్రావం అయ్యేంది కూడా. ఇక ఈ బాధను భరించలేక వైద్యలను సంప్రదించింది టీనా. అక్కడ తాను ముక్కుకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. రెండో దశలో ఉందని సత్వరమే రెడియోథెరఫీ వంటి చికిత్సలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఈ చికిత్సలో ముక్కును తొలగించక తప్పదని కూడా చెప్పారు. దీంతో టీనా ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ప్రాణాలు నిలబడాలంటే టీనా ఆ ట్రీట్మెంట్ తీసుకోక తప్పలేదు. చికిత్సలో భాగంగా టీనా ముక్కును తొలగించారు వైద్యులు. ముక్కు లేకపోవడం కారణంగా గొంతు తడిగా ఉండకుండా పొడబారిపోతుంది. అందుకోసం ప్రోస్టేటిక్స్తో తయారు చేసిన ముక్కు లేదా మరేదైన రక్షణ కవచాన్ని ధరించాల్సి ఉంటుంది. అయితే ఆమెకు కృత్రిమ ముక్కు అసౌకర్యంగా ఉండటంతో క్లాత్ మాదిరి గాజును ధరించి బయటకు తిరిగేది. అంతేగాదు ఈ పరిస్థితి కారణంగా జీవితాంతం ట్యూబ్ ద్వారే ఆమెఆహారాన్ని స్వీకరించాల్సి ఉంది. ఇన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా టీనా పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న కృతనిశ్చయంతో ఉండటం విశేషం. తన ముఖాన్ని చూసి ఎవరైనా కామెంట్ చేసినా వాటిని ఎదుర్కొనగలను, ఇదివరకటి టీనాలా కాకుండా మరింత స్ట్రాంగ్‌గా ఉంటానని నమ్మకంగా చెప్పింది. ఎవరికీ వస్తుందంటే.. నిపుణులు అభిప్రాయం ప్రకారం 55 ఏళ్ల పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధూమపానం, కలప, తోలు దుమ్ము, వంటి వాటికి సంబధించిన వృత్తులు చేసే వారికి ఈ నాసికా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం.. కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులు దెబ్బతిన్నప్పుడు లేదా అసాధారణంగా మారినప్పుడు కణితులు ఏర్పడతాయి. ఈ జన్యు మార్పులు ఎందుకు సంభవిస్తాయో ఇప్పటి వరకు నిపుణులకు కచ్చితమైన కారణాలు తెలయరాలేదు. లక్షణాలు.. దీర్ఘకాలిక ముక్కు సమస్య లేదా సైనస్ వాసన కోల్పోవడం ముక్కు నుంచి రక్తం కారడం తలనొప్పులు తరుచుగా ముక్కు కారిపోవడం(జలుబు) నీళ్ళు నిండిన కళ్ళు ముక్కు, కళ్ళు, చెవులు బుగ్గల చుట్టూ నొప్పి ముక్కు, ముఖం, మెడ లేదా మీ నోటి పైభాగం పెరుగుదల దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు వినికిడిలో ఇబ్బంది అస్పష్టమైన దృష్టితో కూడిన కంటి సమస్యలు (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
చపాతీలు మిగిలిపోతే పడేస్తున్నారా?.. అయ్యయ్యో వద్దమ్మా!
ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..? తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణక్రియకు.. రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. మంచి శక్తిని అందిస్తాయి.. అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. 30 రోజుల్లో బరువు తగ్గడానికి.. మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ నియంత్రణలో.. డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..! రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్‌ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్‌గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్‌కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
పేరెంట్స్‌కి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా?
మా పేరెంట్స్ ఇద్దరికీ సుగర్ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్‌కి సుగర్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. మాధవి, హాసన్పర్తి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే.. గర్భిణీలో సుగర్ కనపడుతుంది. కనపడే రిస్క్ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే చాన్స్ ఎక్కువ. తండ్రికి సుగర్ ఉంటే 30 శాతం రిస్క్ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్లో జీడీఎమ్ ఉంటుంది. దీనికి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం. వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వంటివన్నీ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్‌ని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్ సుగర్’ అంటే వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, కార్న్ సిరప్స్ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్ డయాబెటీస్ లేదా తరువాతైనా సుగర్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
కాపాడే కన్నీరు పొడిబారితే..!
కన్ను ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఏదైనా కాస్త తగలగానే కళ్లల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. కన్ను పొడిబారితే ప్రమాదమని ప్రకృతి ఈ కన్నీళ్లను ఏర్పాటు చేసింది. నిత్యం ఏసీ గదుల్లో ఉండటం, కంప్యూటర్దో, ల్యాప్టాప్లదో, ఆఖరికి మొబైల్ స్క్రీన్నో ఎప్పుడూ చూస్తూ ఉండటంతో పాటు... కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా కన్నుపొడిబారుతుంది. ఇలా పొడిబారడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకూ, ఒక్కోసారి చూపు కోల్పోయేందుకూ అవకాశముంది. కన్ను పొడిబారే సమస్యను వైద్య పరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’(డ్రై ఐ) అని చెబుతారు. ఈ కండిషన్ అవగాహన పెంచుకుని, కంటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. కంటిని తడిగా ఉంచడానికి లాక్రిమల్ గ్లాండ్స్ అనే ప్రధాన కన్నీటి గ్రంథితో పాటు మ్యూసిన్ గ్లాండ్స్, మొబిమియన్ గ్లాండ్స్ అనే మరో రెండు రకాల గ్రంథులూ తోడ్పడతాయి. ఇందులో లాక్రిమల్ గ్లాండ్స్ నీటి మోతాదులెక్కువగా ఉండే కన్నీటినీ, మ్యూసిన్ గ్లాండ్స్ కాస్త జిగురుగా ఉండే పదార్థ్ధాన్నీ, ఇక మెబొమియాన్ గ్లాండ్స్ అనేవి కాస్త నూనెలా ఉండే పదార్థాన్ని (ల్యూబ్రికెంట్గా ఉపయోగపడేందుకు) స్రవిస్తాయి. ఈ మూడూ కలిసి పూర్తి కన్నీటి స్రావాలకు కారణమవుతాయి. గ్రంథుల పనితీరు మారుతుండే లోపాలు... ఈ మూడు గ్రంథుల పనితీరుల్లో, దేనిలో లోపం వచ్చినా... కన్నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఏయే గ్రంథుల్లో లోపాలుంటాయో, దాన్ని బట్టి కన్నుపొడిబారడమనే ప్రక్రియలోనూ తేడాలొస్తాయి. ఉదాహరణకు... లాక్రిమల్ గ్లాండ్ కన్నీటిలోని నీళ్లను స్రవిస్తుంది. కాబట్టి దీనిలో లోపంతో కన్నీటిలోని నీరు మోతాదులు తగ్గుతాయి. మ్యూసిన్ తగ్గితే ‘టియర్ బ్రేకింగ్ టైమ్’ తగ్గుతుంది. అంటే కన్నీరు స్రవించాక అది ఓ పొర (ఫిల్మ్)లా ఏర్పడి... కొంతసేపు కన్ను ఉపరితలం మీద ఉంటుంది. ఏర్పడ్డ తర్వాత ఆ ఫిల్మ్ ఎంతసేపు ఉంటే... కంటికి అంత రక్షణ. ఇక కన్ను త్వరగా పొడిబారుతుందంటే... (అంటే నీరు త్వరత్వరగా ఆవిరైపోతుందంటే) మెబోమియన్ గ్లాండ్స్ పనితీరు తగ్గిందని అర్థం. బయట గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు (విసురుగా గాలి వీస్తున్నప్పుడు), టూవీలర్ డ్రైవింగ్‌లో కన్నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. కానీ జీవనశైలి మార్పులతో అంటే ఏసీలు, స్క్రీన్‌ను చాలాసేపు చూడటం, పొగతాగడం వంటి అలవాట్లతో ఆవిరి కావడం పెరుగుతుంది. దీన్నే ‘ఎవాపరేటివ్ డ్రై ఐ’ అంటారు. కన్ను పొడిబారడానికి మరికొన్ని కారణాలు... కన్ను పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి... ∙వయసు పైబడటం: వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను పొడిబారడమూ పెరుగుతుంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇది ఎక్కువ. ∙కొన్ని వైద్య సమస్యలు: థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సాధారణ ఆటోఇమ్యూన్ సమస్యలు, కొలాజన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక డయాబెటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమటోసిస్ వంటి రుగ్మతలు ఉన్నవారిలో, కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీని తగ్గించే మందులు, శరీరంలో నీటిని బయటకు పంపించే డైయూరెటిక్స్, మహిళల్లో గర్భనిరోధక మందులు, స్టెరాయిడ్స్, దీర్ఘకాలం పాటు గ్లకోమాకు మందులు వాడేవారిలో... ఇలా అనేక మందులతో ఈ సమస్య పెరుగుతుంది. జీవనశైలి మార్పులతో : ∙ ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం కనురెప్పలను తక్కువగా కదిలించడం... కంప్యూటర్‌పైనా లేదా ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ వరకూ ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువగా సేపు చూస్తుండటం, మైక్రోస్కోప్ వంటి ఉపకరణాలపై ఎక్కువగా పనిచేయడం. ∙కనురెప్పలను పూర్తిగా మూయలేకపోవడం. కంటికి గాయం కావడం వల్ల కనురెప్పలను తగినంత కదిలించలేనప్పుడు. ∙కనురెప్ప అంచుల్లో ఇన్ఫెక్షన్ (బ్లెఫరైటిస్) ఉన్నవారిలో కన్ను పొడిబారడం ఎక్కువ. ∙కంటికి లేజర్ చికిత్స చేయించుకున్నవారిలో మొదటి మూడునెలల్లో మాత్రం కన్నుపొడిబారే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక కొందరిలో కారణాలేవీ కనిపించకుండానే ఈ సమస్య రావచ్చు. కళ్లలో మంట: కళ్లలో తగినంతగా నీరు స్రవించనప్పుడు కళ్లు మంటలు వస్తాయి. కానీ కళ్లు ఎర్రబారవు. మసక బారడం: కొందరిలో చూపు కాస్తంత మసకబారవచ్చు. వెలుగును చూడలేకపోవడం: ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునేవారిలో: కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటంలో ఇబ్బందిగా ఉండటం. ఇబ్బందులివీ.. కన్ను పొడిబారడం వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలా ఉండవు. ఈ కింద పేర్కొన్న వాటిలో కొన్ని కనిపించవచ్చు. ∙కొందరిలో కంటిపైన ఉండే కంజెక్టివా పొరలో ఇన్ఫెక్షన్ రావచ్చు. (కంజంక్టివైటిస్). ∙కొందరిలో కార్నియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి కొందరి కళ్లలో చిన్న చిన్న పుండ్లు రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో కార్నియా దెబ్బతినే ప్రమాదంకూడా ఉండవచ్చు. నిర్ధారణ ఇలా... లక్షణాలను బట్టి కంటి డాక్టర్లు సమస్యను నిర్ధారణ చేస్తారు. అయితే కొందరిలో కొన్ని రకాల ఇతర వ్యాధుల వల్ల (జోగ్రన్స్ సిండ్రోమ్ వంటి వాటి కారణంగా) ఇలా జరుగుతుందేమో అని చూస్తారు. అందుకే కన్ను పొడిబారిన లక్షణాలు ఉండేవారికి వ్యాధి నిర్ధారణ చేసే సమయంలో అనేక ఇతర లక్షణాలను కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ష్కిర్మర్ టియర్ టెస్ట్: కొన్ని సందర్భాల్లో ష్కిర్మర్ పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఒక రకం ఫిల్టర్ పేపర్‌ను కంటి కిందివైపు రెప్ప కింద ఐదు నిమిషాల పాటు ఉంచుతారు. ఆ వ్యవధిలో ఆ పేపర్ ఎంత తడి అవుతుందో పరిశీలించడం ద్వారా లాక్రిమల్ గ్లాండ్ లోపాల్ని పరీక్షిస్తారు. టియర్ బ్రేకప్ టైమింగ్ : కంటి ఉపరితలంపై ఏర్పడే టియర్ ఫిల్మ్ ఎంతసేపటికి బ్రేక్ అవుతుందో తెలుసుకునే ఈ పరీక్షతో మ్యూసిన్ గ్రంథి లోపాలను తెలుసుకుంటారు. మెబోమియోగ్రఫీ : ఈ టెస్ట్‌తో మెబోమియన్ గ్రంథి లోపం తెలుస్తుంది. ఓసీటీ : ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరీక్ష ద్వారా టియర్ ఫిల్మ్ మందం ఎంత ఉందో తెలుసుకుంటారు. చికిత్స... గతంలో కన్నీటిని స్రవించే చుక్కల మందులు, జెల్స్‌తో చేసే చికిత్స స్థానంలో ఇప్పుడు ఏయే గ్రంథి లోపాలు ఏమిటో తెలుసుకుని, వాటికి అనుగుణంగా చేసే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు... కృత్రిమ కన్నీటి మందులు: కృత్రిమంగా కన్నీళ్లను పెంచే చుక్కల మందులు, జెల్ రూపంలో లభ్యమయ్యే మందుల్ని వాడటం ద్వారా డాక్టర్లు లాక్రిమల్ గ్లాండ్ పనితీరును చక్కదిద్దుతారు. ‘సైక్లో ఇమ్యూన్ ఐ డ్రాప్స్’ కూడా డ్రై ఐ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే లాక్రిమల్ ప్లగ్స్‌ను వాడతారు. వీటివల్ల కన్నీళ్లు ముక్కులోకి జారిపోవు. దాంతో అవి కళ్ల లోనే ఎక్కువసేపు ఉండి కళ్లను తడిగా ఉంచుతాయి. ఇక మ్యూసిన్ గ్రంథి పనితీరు మెరుగుపరచడానికి ‘సెక్రిటోగ్యాగ్స్’ అనే ఉపకరణాలు ఉపయోగిస్తారు. మొబోమియన్ గ్లాండ్స్ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని రకాల మసాజ్‌లు, థెర్మో థెరపీలతో పాటు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. డ్రై ఐ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో సంప్రదాయ చికిత్సలతో తగ్గనప్పుడు బాధితుని నుంచి సీరమ్ (ఆటోలాగస్ సీరమ్) సేకరించి, చుక్కల రూపంలో వాడతారు. ∙శస్త్ర చికిత్స : ఈ చికిత్సలో భాగంగా నోటిలోని అతి మృదువైన పొరలను తీసి, కంటిలో అమర్చి... పరిస్థితిని చక్కబరుస్తారు. ఇవేకాకుండా... పని ప్రదేశాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, కంప్యూటర్ ముందు కంటిని హాని తక్కువగా ఉండేలా ఎలా కూర్చోవాలో, తగిన వ్యాయామాలేమిటో, బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి పనిచేసే గదిలో తేమ (హ్యుమిడిటీ) పెంచుకోవడం... ఇవన్నీ బాధితులకు కౌన్సెలింగ్‌లో డాక్టర్లు చెబుతారు. కన్నుపొడిబారిపోవడం వల్ల ఒక్కోసారి చూపుకోల్పోవడం లాంటి పెను ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే కన్నుపొడిబారుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వాడాలి. ∙ (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు.. -
ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!
హాలీవుడ్ నటి క్యాన్సర్ బారిన పడింది. అది కూడా ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. బతికే అవకాశాలు లేవు. కానీ ఆమె మాత్రం నేను చనిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి బతుకుతాను అంటూ మొండి ధైర్యంతో జయించే ప్రయత్నం చేస్తుంది. పైగే ఈ దారుణ స్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారిస్తుంది. ఆమె అచంచలమైన ధైర్యం తనలా అనారోగ్యంతో బాధపడేవాళ్లలో ఓ కొత్త ఊపిరిని, స్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె హీరోయిన్గా వెండి తెరపైనే కాదు బయట కూడా హీరోయినే అని ప్రూవ్ చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికా నటి షానెన్ డోహెర్టీ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. అది గుర్తించే నాటికే ఫోర్ట్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఆమె ఎముకలంతటికి వ్యాపించి పరిస్థితి కాస్త సివియర్‌గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అయినా కూడా ఎక్కడ కించెత్తు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ స్థితిలో కూడా 'నేను చనిపోవాలని కోరుకోవడం లేదు' కాబట్టి బతుకుతా. 'నేను పూర్తిగా జీవించలేదు'. 'పూర్తిగా ప్రేమించబడ లేదు'. కాబట్టి కచ్చితంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని ధీమాగా చెబుతుంది. పైగా తనలా మరెవరూ ఈ క్యాన్సర్‌తో బాధపడుకుండా ఉండేలా పరిశోధనలు మరింత విస్తృతంగా చేసేందుకు నిధులు వెచ్చిస్తుంది. అంతేకాదు ఈ క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది? అది కూడా స్టేజ్4లోనే ఎందుకు ఉన్నా? ఇందంత ఏదో తన వల్ల అయ్యే గొప్ప ప్రయోజనం కోసమే ఇలా అయ్యి ఉంటుంది. అందుకే ఆ దిశగా నన్ను నేను బతికేలా ధైర్యం కూడగట్టకుంటూ క్యాన్సర్ అంతమొందించే ప్రపంచానికై తపస్సు చేస్తున్నానని నిర్భయంగా చెబుతోంది. ఈ వ్యాధి కారణంగా నడవలేం, తినలేం కనీసం పనిచేయలేం అని ఆవేదనగా చెబుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ వ్యాధిని చూసి డీలా పడకుండా భిన్నమైన దృక్పథంతో మాలాంటి పేషెంట్లు ఉండి జీవితాన్ని నూతనోత్సాహంతో ఆస్వాదించాలి. అప్పుడే మళ్లీ మునుపటి జీవితాన్ని పొందగలరు అని నిరాశ నిస్ప్రుహలో ఉన్న క్యాన్సర్ పేషంట్లందరికి స్ఫూర్తినిచ్చేలా చెబుతోంది. నటి షానెన్ డోహెర్టీ 1990ల బ్లాక్‌బస్టర్ బెవర్లీ హిల్స్, 90201లో బ్రెండా వాల్ష్ వంటి పాత్రలతో అభిమానుల మనుసులను గెలుచుకుంది. ఈమెకు 2015లో క్యాన్సర్ నిర్థారణ అయినప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది కూడా. అయితే అది మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4లో ఉండటమే బాధాకరం. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్!
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్‌లైన్స్‌లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్ యూనిట్లతో సహా మెడిసిన్ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్‌లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. (చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా) -
ఏట్రియల్ ఫిబ్రిలేషన్! సైలెంట్‌గా దాడి చేసే డేంజరస్ వ్యాధి!
కొన్ని వ్యాధులు అంత తేలిగ్గా బయటపడవు. ఎటువంటి సంకేతాలు ఇవ్వవు. కానీ ఇతరత్ర వ్యాధులకు దారితీసేంత వరకు దాని వల్లే మనకు ఆ వ్యాధి వచ్చిందనేది కూడా తెలియదు. దీంతో పరిస్థితి విషమించిన సందర్భాలు కోకొల్లలుగా జరగుతున్నాయి. అలాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(గుండెదడ). ఇదే స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకంగా మారుస్తోంది. అసలు ఏంటీ ఏట్రియల్ ఫిబిలేషన్(ఏఎఫ్)? ఎలా సైలెంట్‌గా దాడి చేసేంత డేంజరస్ వ్యాధి తదితరాల గురించే ఈ కథనం!. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(ఏఎఫ్)గుండెదడ)) బాధపడుతున్న రోగులలో దాదాపు 1/3వ వంతు రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం చాలామంది రోగుల్లో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఏట్రియా అంటే గుండె గదులు. వీటిలో గుండె లయలు సక్రమంగా లేకపోతే గుండెలోని దిగువ గదులకు రక్తప్రవాహం సవ్యంగా జరగదు. దీంతో స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తంచారు వైద్యులు. నిజానికి భారతదేశంలో పలు ఆస్పత్రుల అధ్యయనాల ప్రకారం..దాదాపు 10 నుంచి 25% స్ట్రోకు రోగులకు అంతర్లీనంగా ఉన్న ఈ ఏట్రియల్ ఫిబ్రలేషన్ కారణమని చెబుతున్నారు. సుమారు మూడింట ఒక వంతు మందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి రావడం, జీవన నాణ్యత దారుణంగా పడిపోయింది, ప్రాణాంతక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఎఫ్ని గనుక ముందుగా గుర్తించగలిగితే (ఓరల్ యాంటీ కోగ్యులెంట్ థెరపీ) నోటి ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ఔషధాలతో స్ట్రోక్‌లు వంటివి రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు. ఎవరికీ వచ్చే ఛాన్స్ ఎక్కువంటే.. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, స్లీప్ అప్నీయా లేదా హైపర్ థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఈ ఏఎఫ్ బారినపడే అవకాశం ఎక్కువుగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు మాట్లాడుతూ..చాలా సందర్భాలలో ఈ ఏఎఫ్ లక్షణ రహితంగా ఉంటుంది. ఈసీజీ, రొటీన్ చెకప్‌లు లేదా సంబంధిత స్ట్రోక్ కారణంగా యాదృచికంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ ఏఎప్లో ముందుగా స్ట్రోక్ రాకుండా చూడటం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాధి బారినపడిన రోగులు రక్తాన్ని పలుచగా చేసే మందులు లేదా గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడటం అత్యంత కీలకం. సరైన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సక్రమమైన జీవనశైలిని పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలను అనుసరిస్తే స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా నివారించగలుగుతామని హైగ్రీవ్ రావు చెప్పారు. ఏఎఫ్ వచ్చిన రోగుల లక్షణాలు.. అలసట, హృదయ స్పందన సరిగాలేకపోవటం దడ, గుండెలు అదరటం మైకము, మూర్ఛ శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి తిమ్మిరి, నీరసం, గందరగోళం దృష్టి సమస్యలు నడకసమస్యలు మైకము, వివరించలేని తలనొప్పి వంటివి కనిపిస్తే స్ట్రోక్‌కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉదని అర్థం. చికిత్స దీనికి మూడు ప్రధాన రకాల ఔషదాలు ఉన్నాయి, గుండె స్పందన రేటు నియంత్రణ మందులు (హృదయ స్పందన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి), రిథమ్ నియంత్రణమందులు (సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి పని చేస్తాయి), చివరిగా రక్తంపలచబడటానికి ( రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించేవి) మందులు ఉంటాయి . కొంతమంది రోగులకు ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ లేదా పల్మనరీ వీన్ అబ్లేషన్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం. వీటితో పాటుగా , ధూమపానానికి దూరంగా ఉండటం, గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్నే తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యం. వీటన్నింటిని పాటిస్తే ఈ ఏఎఫ్ సమస్య నుంచి సత్వరమే బయటపడొచ్చని అంటున్నారు కిమ్స్ వైద్యులు హైగ్రీవ్ రావు. --కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు..) -
చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్లు! అది ప్రీమెచ్యుర్ చిన్నారుల్లోనే ఎక్కువ ఎందుకు?
ఇటీవల చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్ల (మెదడులో గడ్డల) కేసులు చాలా ఎక్కువగా వస్తుండటం అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు... ఇలా అన్ని వర్గాల్లోనూ బెంబేలు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళన పెంచుతోంది. మామూలుగానైతే బిడ్డ తన తల్లి కడుపులో 37 వారాలు పెరగాలి. తల్లి కడుపులో అంతకంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని శారీరక వ్యవస్థలు పూర్తిగా ఎదగకుండాపోయే ప్రమాదముంటుంది. ఇలాంటి చిన్నారుల్లోనే మెదడు గడ్డలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనే అంశంపై వైద్యవర్గాలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్న ఈ తరుణంలో... చిన్నారుల్లో మెదడు గడ్డల సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారులు తమ తల్లి కడుపులో ఉండాల్సిన వ్యవధి కన్నా తక్కువ కాలం ఉండటం వల్ల... ప్రీ–మెచ్యుర్ బేబీస్‌లో కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవచ్చు. మిగతా అవయవాల సంగతి ఎలా ఉన్నా, అన్ని అవయవాల్లోకెల్లా మెదడు ఎదుగుదల చాలా కీలకం. కాబట్టి అదొక్కటి ఎదగకపోవడం వల్ల చాలా వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశముంటుంది. ప్రీమెచ్యుర్ బేబీస్కీ, అవయవాల పెరుగుదల లోపాలకీ సంబంధమేమిటంటే... కడుపులో పూర్తికాలం లేకపోవడం వల్ల మెదడు సహా, కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం ఒక ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)కాగా... మెదడులో గడ్డలు రావడం, క్రమేణా అవి పెరగడం, దాంతో... కొన్ని వ్యవస్థలను నియంత్రించే సెంటర్లను ఆ పెరిగే గడ్డలు నొక్కేయడంతో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డలతో పోలిస్తే... ప్రీ–టర్మ్ చిన్నారుల్లో ఈ ముప్పు పెరిగేందుకు ఈ అంశాలు దొహదపడతాయి. దానికి తోడు జన్యుపరమైన సమస్యలతో పుట్టుకతోనే (కంజెనిటల్గా) వచ్చే ఆరోగ్య సమస్యలూ, పర్యావరణ కారణాలతో వచ్చే ఆరోగ్యలోపాలూ... ఇవన్నీ కలిసి ప్రీ–మెచ్యుర్ బేబీల రిస్క్‌ను మరింతగా పెంచేస్తాయి. లక్షణాలు మెదడులో గడ్డలున్న పిల్లల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఎంతకూ తగ్గని తలనొప్పి... ఇది నిరంతరమూ చిన్నారులను వేధిస్తుంటుంది. కారణం తెలియకుండా కనిపించే వాంతులు ∙పిల్లల ప్రవర్తనలో తేడాలు, మెదడులో గడ్డలు ప్రభావితం చేసే చోటు (సెంటర్)ను బట్టి కొన్నిసార్లు పిల్లలు వింతగా ప్రవర్తించవచ్చు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కారణం వెంటనే తెలియకపోవచ్చు. చిన్నారుల ఎదుగుదల ఆలస్యం కావడం (డెవలప్మెంటల్ డిలే) సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడమెలా... పిల్లలు తమ సమస్యను పెద్దవారిలా చెప్పలేరు. పైగా మెదడులో గడ్డలు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు కూడా మామూలు పిల్లల్లోనూ ఏదో ఒక సమయంలో కనిపించేవే. ఈ అంశం కూడా సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడంలో సమస్యగా మారుతుంది. ఇక నిర్ధారణ కోసం లక్షణాలను బట్టి ఈఈజీ, అల్ట్రాసౌండ్ లేదా ఎమ్మారై స్కాన్‌లాంటి మెదడు స్కానింగ్ ప్రక్రియలతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చిన్నారుల్లోని మెదడులో గడ్డలు ఉన్నట్లుగా ఎంత త్వరగా గుర్తిస్తే... చికిత్సకు అంతగా మేలు చేస్తుంది. నిజానికి ఈ అంశమే చికిత్సలో చాలా కీలకం. అందుకే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా... పిల్లల స్కూలు టీచర్లు, ఇతరత్రా వారికి సేవలందించేవారు, సహాయకులు (కేర్ గివర్స్), డాక్టర్ల వంటి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అందరూ చిన్నారుల మెదడులో గడ్డలున్నప్పుడు కనిపించే లక్షణాలు, ఇతరత్రా అంశాలూ, సవాళ్లపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎన్నో కొత్త పరిశోధనలు ఇటీవల మెదడులో వచ్చే రకరకాల గడ్డలు... అందునా మరీ ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల్లో వచ్చే మెదడు గడ్డల విషయంలో చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని అధునాతన పరిశోధన ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మెదడు సర్జరీల్లో ‘న్యూరోనావిగేషన్’, ‘న్యూరోమానిటరింగ్), అలాగే కోత తక్కువగా ఉండే విధానాలు. ఈ పద్ధతుల్లో చేసే శస్త్రచికిత్సలో మెదడులోని అత్యంత సంక్లిష్టమైన భాగాలను 3–డీ ఇమేజ్‌లో గడ్డ నిర్దిష్టంగా ఎక్కడ ఉందో చూస్తూ, సర్జన్ సరిగ్గా అక్కడికే చేరడానికి వీలవుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి బాగా తగ్గడంతో పాటు, కోత కూడా తక్కువ కావడంతో బాధితులైన చిన్నారులు చాలా త్వరగా కోలుకుంటారు. మెదడులోని అత్యంత సున్నితమైన భాగాలకు చేరే సమయాల్లో కలిగే రిస్క్‌లను అంచనా వేసి, మిగతా భాగాలకు ఎలాంటి విఘాతం లేకుండా గడ్డ ఉన్న చోటికి చేరడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సునిశిత పరికరాలు బాగా తోడ్పడతాయి. అందువల్ల గతంతో పోలిస్తే ఇప్పుడీ సమస్య పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చికిత్స ఒకసారి సమస్య నిర్ధారణ జరిగాక చికిత్స అన్నది కేవలం ఒక స్పెషలిస్టు డాక్టరుతో కాకుండా అనేక రకాలుగా (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) జరగాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటు మెదడులో గడ్డ ఉన్న ప్రాంతాన్ని బట్టి... కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలూ అవసరమవుతాయి. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే... మెదడులో గడ్డ ఎలాంటి ప్రాంతంలో ఉంది, దానికి శస్త్రచికిత్స చేసే సమయంలో ఏయే వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది...లాంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సునిశితమైన, అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకూ... ఈ సమస్యలపై ప్రత్యేక అవగాహన ఉండటం చాలా అవసరం. --డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ (చదవండి: గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ఎన్నో? ఒక్కోసారి మరణానికి దాతీయొచ్చు!) -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‌తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్‌లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్‌లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్‌లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
ఉత్తరకాశీ: కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్, స్టేట్ డిజాస్టర్ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!. మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు. ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు. అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. (చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్ విషయాలు)