TS Special
-
ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్ గార్డెన్స్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మేడిగడ్డ చూద్దాం రండి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు ఈనెల 13వ తేదీన అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ మేడిపండు ఎలా అయిందో అందరూ చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా రావాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఆ కుర్చిని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. మేడిగడ్డపై విచారణ జరుగుతోందని, కొన్ని నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టే వీలుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కాకుండానే విపక్షం పిల్లి శాపనార్థాలు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు నిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజా ప్రయోజనం కోసం విపక్షం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యమ సమయంలోనే టీజీగా రాసుకున్నారు ‘తెలంగాణ రాష్ట్రానికి సూచికగా టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష. ఉద్యమ సమయంలో యువత రక్తంతో దీన్ని రాసుకుంది. తర్వాత టీజీని కేంద్రం నోటిఫై చేసినా బీఆర్ఎస్ విస్మరించింది. బీఆర్ఎస్ సర్కార్ దానిని టీఎస్‌గా మార్చడం వారి అహంకారానికి ప్రతీక. అయితే దీన్ని మేము టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాచరికపు ఆనవాళ్ళను స్ఫురింపజేసేలా బీఆర్ఎస్ సర్కార్ అధికార చిహ్నం రూపొందిస్తే, మేం దాన్ని ప్రజాస్వామ్య చిహ్నంగా మార్చాం. అలాగే దళిత బిడ్డ రాసిన తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ’కన్పించకుండా కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది. కానీ మా సర్కార్ దాన్ని రాష్రీ్టయ గీతంగా ఆమోదించింది..’అని సీఎం చెప్పారు. ప్రజాపాలనపై సత్యదూరమైన ఆరోపణలు ‘ప్రజాపాలనపై విపక్షం సత్యదూరమైన ఆరోపణలు చేస్తోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పినదాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 12 శాఖలకు చెందిన 21 మంది అధికారులను అందుబాటులో ఉంచాం. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో అవకతవకల వల్లే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మేము మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన వాళ్ళం కాదు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చాం. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ప్రగతి భవన్ కంచెలు తొలగించాం. కాళోజీ కవిత్వం గురించి చెప్పే బీఆర్ఎస్ నేతల పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి కాలేదు..’అని రేవంత్ ప్రశ్నించారు. ఇక మొదటి తేదీనే జీతాలు ‘మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం దివాలా తీసిందనడం ఏమిటి? పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపోతుందా? ఉద్యోగులు, పెన్షనర్లకు 25వ తేదీ దాకా జీతాలు ఇవ్వలేని చరిత్ర వాళ్ళది. మేము 4వ తేదీలోగానే జీతాలు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మొదటి తేదీనే ఇస్తాం. రైతు బంధు వేయడం లేదంటూ విపక్షం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 2018–19లో యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలలు, 19–20లో 9 నెలలు, 20–21లో 4 నెలలు, 22–23లో 4 నెలలు తీసుకున్నారు. ఇలాంటి వాళ్లు మమ్మల్ని విమర్శించడం ఏమిటి? పెన్షన్లు 80 శాతం చెల్లించాం. మిగిలినవి 15వ తేదీలోగా చెల్లిస్తాం..’అని రేవంత్ తెలిపారు. ఆటోరాముళ్ళ హైడ్రామా ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతోందంటూ వాళ్ళను రెచ్చగొట్టడం రాజకీయమే. జూనియర్ ఆరి్టస్టుల తరహాలో ఆటోరాముళ్ళు ఆటోలెక్కి అసెంబ్లీకి రావడం, ఆటోలో కూడా కెమెరా పెట్టడం ఓ హైడ్రామా. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే 15.21 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. రూ.535.52 కోట్లు ఆరీ్టసికి ఇచ్చాం. మహిళలు ఈ సదుపాయం వినియోగించుకుని గుళ్ళకు వెళ్ళడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం నవంబర్‌లో రూ.49.28 కోట్లు ఉంటే, డిసెంబర్లో రూ.93.24 కోట్లకు పెరిగింది. జనవరిలో కూడా రూ.68.69 కోట్ల ఆదాయం వచ్చింది..’అని సీఎం వివరించారు. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచుతాం ‘ఉద్యోగాల కల్పన మా విధానం. మేం వచ్చిన రెండు నెలల్లోనే 6,956 స్టాఫ్ నర్సుల నియామకం, సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలోనే 15 వేల పోలీసు నియామకాలు చేపడతాం. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచి నియామకాలు చేపడతాం. పాలక మండలి రాజీనామా చేయకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిందో చెప్పాలి. మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్ సీఎం పేషీలో మైనారీ్టలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. కేసీఆర్ పాలనలో వాళ్ళ కుటుంబ సభ్యులకే కారుణ్య నియామకాలు దక్కాయి. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం చేపడతాం. ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, తాను పుట్టిన ఊరును రెవెన్యూ గ్రామం చేయాలన్న ఆయన చివరి కోరికను కూడా పట్టించుకోలేదు. మేము దాన్ని నెరవేర్చాం. ఆదివాసీల పోరాట యోధుడు కొమరం భీంను కూడా విస్మరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారసులను ఆదుకుంది. ఇంద్రవెల్లి అమర వీరులను కూడా ఆదుకున్నాం. కవి గూడ అంజన్న చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించ లేదు. ప్రగతి భవన్ వద్ద గద్దర్ మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారు. మేము ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తుండేలా ఆయన పేరుతో పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది ఎవరు..’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై వాగ్వాదం కృష్ణా జలాలపై కేంద్రానికి అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ చేసిన విమర్శ సభలో వాగ్వాదానికి దారి తీసింది. కృష్ణా బోర్డు వద్ద సంతకాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులపై అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపిందంటూ బోర్డ్ మినిట్స్‌ను ఆయన ప్రస్తావించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బదులిస్తూ తాము దాన్ని వ్యతిరేకించామని, అధికారులు కేంద్రానికి లేఖ కూడా ఇచ్చినట్టు తెలిపారు. బోర్డు నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించి బడ్జెట్లో నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే నిధులు ఇస్తామని చెప్పామని, అది జరగలేదు కాబట్టే నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు బదులిచ్చారు. ఆ తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది. -
తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. -
కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు!
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. దీనిలో భాగంగా వీరిద్దరూ రేపు(శనివారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు.మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
‘తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి..’
హైదరాబాద్: రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈసారి 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈసారి అసుదుద్దీన్ ఓవైసీ ఓడిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక సర్వేలపై మాట్లాడుతూ.. సర్వేలల వస్తున్న ఫలితాలు నిజం కాదన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయన్నారు. ఇక మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్చేసుకుంటున్నారని, కాళేశ్వరం అవతకకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ లేనిపోని రాద్దాంతం చేస్తోందని, కాళేశ్వరం అవకతవకలపై దృష్టి మళ్లించేందుకు ఈ నాటకమని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి దారుణ హత్య
నిర్మల్: నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. వివరాలు.. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా, రియాజ్.. ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు. అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపైకి దాడికి చేసినట్లు సమాచారం. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
ప్లీజ్ కేటీఆర్.. కాంట్రవర్సీ వద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండ సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇదీ చదవండి: ‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’ -
‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’
సాక్షి, హైదరాబాద్: తాను హోం మంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. హోం శాఖ అడుగుతున్నా.. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు (బీఆర్ఎస్ నాయకులు) కంట్రోల్లో ఉంటారన్నారు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టెకెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు. -
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. త్వరలోనే ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 స్థానాలకు గానూ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 16వ తేదీ లోపు ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు వీళ్లేనా.. తెలంగాణాలోని కీలక లోక్‌సభ స్థానాలకు ప్రధానంగా కొన్ని పేర్లను చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి, కరీంనగర్‌కు బండి సంజయ్, నిజామాబాద్‌కు ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌కి డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజిగిరి టికెట్‌ను మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కాగా మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, మహబూబ్‌బాద్ లలో కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో బీఆర్ఎస్ నేతలపై కమలం పార్టీ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీదే అని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. -
TS: శివబాలకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ, ఐటీ
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెంచాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ ఇప్పటికే లేఖ రాసింది. మనీలాండరింగ్ కోణంలోను శివబాలకృష్ణను ఈడీ విచారించనుంది. మరోవైపు శివబాలకృష్ణ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అధికారాన్ని అపయోగించుకుని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ. 250 కోట్లు ఆస్తులను బాలకృష్ణ కుడబెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో శివబాలకృష్ణ, సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్నారు. ఇదీ చదవండి: HYD: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు -
15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గ్రూప్–1లో 60 కొత్త ఖాళీల భర్తీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో.. 441 మంది సింగరేణి కార్మీకుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సింగరేణి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మీకుల పాత్రను ఎవరూ తగ్గించలేరని, పారీ్టలు విఫలమైన సమయంలోనూ కార్మీకులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సింగరేణి అండగా నిలిచింది రాష్ట్రంలోని గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్రం కూడా సింగరేణికి అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందన్నారు. సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవ లక్షి్మ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా?
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.వెయ్యి కోట్లు రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులకోసం వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని, చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇ చ్చి న ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది. రూ.500 కోట్లు దారి మళ్లింపు తమిళనాడులోని టుటికోరిన్ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తావినల్లూరు, పల్లక్కురిచి గ్రామాల్లో 660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఇందు భారత్ పవర్‌కు రూ.2,655 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ మంజూరు చేసింది. పనులు పరిశీలిస్తూ దశల వారీగా ఈ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. 2014లో ఈమేరకు రూ.947.71 కోట్ల రుణాన్ని అందచేసింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి ఇందు భారత్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఇందులో దాదాపు రూ.500 కోట్లను ఇందు భారత్ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్ఈసీ గుర్తించింది. దీంతో తదుపరి విడుదల కావాల్సిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. 2015 ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ సర్క్యులర్ జారీ చేస్తే ఇతర ఏ బ్యాంకులూ రుణ ఎగవేతదారులకు ఎలాంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. అన్ని అవకాశాలు ఇచ్చాకే పిటిషనర్లకు సర్క్యులర్ తమను రుణ ఎగవేతదారులుగా గుర్తించి 2022 జూన్ 16న సర్క్యులర్ జారీ చేయడాన్ని, క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి అన్ని అవకాశాలు ఇ చ్చి న తర్వాతే ఆర్ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్ జారీ చేసిందని స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఆర్ఈసీ వ్యవహరించిందని, ఆ సర్యు్కలర్లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి పిటిషన్లను కొట్టి వేశారు. ఆర్ఈసీ రుణం మంజూరు చేసే నాటికి పిటిషనర్లు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారన్న వాదనతో ఏకీభవించారు. సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారని, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రివ్యూ కమిటీని ఆశ్రయించకుండా తమ వద్దకు రావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రివ్యూ కమిటీ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి, డి.మధుసూదన్‌రెడ్డి అప్పీళ్లలో వాదనలను ముగించింది. -
తెలంగాణలో 3 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌మాల పరియోజన–1 కింద గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్– విశాఖపట్నం (222 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్, షోలాపూర్ – కర్నూల్ – చెన్నై (329 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇండోర్–హైదరాబాద్ (525 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన –1 కింద తెలంగాణలో రూ.38,279 కోట్లతో 1,719 కి.మీ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.22,749 కోట్లతో 1,026 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వివరించారు. -
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.ఎస్.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్లను రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్ త్రివేణి మెమో జారీ చేశారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్ పోస్టింగ్‌లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. ‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. సొమ్ములు చేతులు మారేందుకేనా అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్‌నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ ఉంటుంది. అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ 18 మంది డీఎంహెచ్‌వోల మాటేమిటి కాగా, డిప్యుటేషన్‌పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి. ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. -
తెలంగాణ కుంభమేళాకు వేళాయె
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజునే ఈ మహా ఉత్సవం మొదలవుతుంది. దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడిమెలిగె పండుగ జరుగుతుంది. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు తలస్నానాలు అచరించి తల్లుల అలయాలను శుద్ధి చేసి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క పూజారి సిద్దబోయిన మనీందర్ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా, ఆడపడుచులు పసుపు, కుంకమలు, పూజారులు, వడ్డెలు పవిత్ర జలం, దూపం, యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టి గడ్డి ఉంచగా, ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా. పూజారులు అమ్మవారికి దూప, దీపాలు వెలగించి పూజలు నిర్వహించి యాటను నైవేద్యంగా సమర్పించారు. కన్నెపెల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడిమెలిగె పండగ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సారలమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు. బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం ఆనవాయితీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మండమెలిగె పండుగ జరుగుతుంది. జాతరకు మరో 13 రోజులే... పనుల పూర్తిలో ఇంకా జాప్యమే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే ఉంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. గతేడాది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో రూ.105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలా వరకు పూర్తి కాలేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది. కొందరు భక్తులు జాతరకు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటోంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు 365వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు. గూడూరు, వరంగల్ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలాలేవు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 189 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అతిపెద్ద జాతరకు ఆ కమిటీనే వేయలే.. మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2012 వరకు సజావుగానే సాగినా 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటులో ప్రతీసారి జాప్యమే అవుతోంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే జాతర నిర్వహించారు. 2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు. 2018 మహాజాతరకు కాక లింగయ్యను చైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 2020, 2022 జాతరలు పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం ప్రకారం ఆదివాసీలనే నియమించాలని కూడా కోరుతున్నారు. అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి మహాజాతరను ధరకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా? లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. -
విజిలెన్స్ ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్)లు, ఇతర అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలి్చంది. నిర్మాణ సమయంలో, తర్వాత చూపిన నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీ విఫలమైందని స్పష్టం చేసింది. బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ పూర్తికాకున్నా ‘వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్’ఇచ్చారని.. కాంట్రాక్టర్‌కు బ్యాంక్ గ్యారంటీలను కూడా విడుదల చేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులను కాంట్రాక్టు సంస్థ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని.. బిల్లుల చెల్లింపులు, ఖాతాల పరిశీలన ద్వారా దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. పని పూర్తికాకున్నా బ్యాంక్ గ్యారంటీల విడుదల బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 2 నుంచి వర్తిస్తుందంటూ అదే ఏడాది నవంబర్ 11న ఈఎన్సీ లేఖ జారీచేశారు. పనులు పూర్తికాకున్నా బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థకు విడుదల చేశారు. సదరు ఈఎన్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒప్పందంలోని నిబంధన 50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయలేదు. ఏటా వానాకాలం ముగిశాక డ్యామ్ ఆప్రాన్ ఏరియాలో ‘సౌండింగ్ అండ్ ప్రొబింగ్’ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. డ్యామ్ పర్యవేక్షకుడు (ఈఎన్సీ రామగుండం) అవి చేపట్టలేదు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, అన్ని కాంక్రీట్ నిర్మాణాల దృఢత్వంపై పరిశీలన అత్యవసరం. బ్యారేజీ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిర్దేశిత పద్ధతిలో బ్యారేజీ నిర్మాణ పనులు జరగలేదు. బ్లాక్–7 పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), ర్యాఫ్ట్ దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్‌ను నిర్దేశిత క్రమపద్ధతిలో నిర్మించలేదని వాటికి సంబంధించిన మెజర్మెంట్ బుక్స్, ఇతర రికార్డుల పరిశీలనలో తేలింది. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండానే చాలా ఉల్లంఘనలను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్వహణ గాలికి వదిలేశారు 2019 జూన్ 19న బ్యారేజీని నాటి సీఎం ప్రారంభించారు. నాటి నుంచి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణను నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖల్లో ఎవరూ చేపట్టలేదు. నిజానికి తొలుత రూ.1,849.31 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యతలను నిర్మాణ సంస్థకు అప్పగించారు. తర్వాత ఈఎన్సీ సిఫార్సుల ఆధారంగా.. 2016 మార్చి 3న రూ.2,591 కోట్లకు, 2018 మే19న రూ.3,260 కోట్లకు, 2021 సెపె్టంబర్ 6న రూ.4,613 కోట్లకు అంచనాలను పెంచారు. ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించి.. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, భద్ర తా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ నిర్మాణ 2019 సెపె్టంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై సూపరింటెండింగ్ ఇంజనీర్ కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు.. 2021 మార్చి 15న పనులు పూర్తయినట్టు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీచేశారు. కానీ ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి ఉత్తర్వులు జారీచేశారు. బ్యారేజీ వైఫల్యానికి కారణాలివీ.. ♦ బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్ పైల్స్‌ను పాతి నిర్మించిన కాఫర్ డ్యామ్‌ను నిర్మాణం పూర్తయ్యాక తొలగించాలి. కానీ కాఫర్ డ్యామ్‌ను, షీట్‌పైల్స్‌ను ఐదేళ్లు గడిచినా తొలగించలేదు. దీనితో గోదావరి నది సహజ ప్రవాహంపై ప్రభావం పడింది. ♦ బ్యారేజీ పునాది (ర్యాఫ్ట్), దాని కింద భూగర్భంలో ‘కటాఫ్ వాల్స్’ నిర్మాణం సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రాయింగ్స్ ప్రకారం ర్యాఫ్ట్, కటాఫ్ వాల్స్ మధ్య కలయిక (కనెక్షన్)ను చేపట్టలేదని బ్యారేజీకి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ర్యాఫ్ట్ కింద భూగర్భంలో ఎగువన, దిగువన షికెంట్ పైల్స్‌ను వేశారు. ఇందులో సెకండరీ పైల్స్ వేసేప్పుడు.. ప్రైమరీ పైల్స్ దెబ్బతిని పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండవచ్చు. 7వ బ్లాకులోని 16–21 పియర్లకు వ చ్చిన పగుళ్లను పరిశీలిస్తే.. పునాదులు ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతోంది. ♦ బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం కనిపించింది. బ్యారేజీని 2019–20లో ప్రారంభించాక దిగువన కాంక్రీట్ బ్లాకులతో ఏర్పాటు చేసిన అప్రాన్ ఏరియాకు ఎలాంటి తనిఖీలు, నిర్వహణ చేపట్టలేదు. వరదల్లో కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాంక్రీట్ బ్లాకులను పునరుద్ధరించి మరమ్మతులు చేయాలని 2020–2023 మధ్య నీటిపారుదల శాఖ నాలుగు సార్లు కోరినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ♦ 7వ బ్లాకులో 11 నుంచి 22 వరకు పియర్లు ఉండగా.. 18, 19, 20 పియర్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 20వ పియర్ పునాదుల దాకా భారీగా దెబ్బతిన్నది. ♦ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఏటా బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నివేదికను రూపొందించాలి. కానీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ తయారు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ విషయంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించారు. -
ఈఎన్సీలపై వేటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యుడిగా గుర్తిస్తూ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రిటైరైనా కొనసాగుతూ.. 2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న సి.మురళీధర్ వాస్తవానికి 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కిందే రిటైరైనా అప్పటి బీఆర్ఎస్ సర్కారు తిరిగి అదే పోస్టులో నియమించింది. ఆయన పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనను ముందే తొలగించింది. తొలగించిన ఇద్దరు ఈఎన్సీల స్థానంలో.. ఇన్చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను ఆదేశించింది. ‘వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్’తో గందరగోళం! గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకు కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాని పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి.. డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగిందని నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ పనులన్నీ పూర్తికాలేదని, అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్అండ్టీ సంస్థ మాటమార్చింది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని అంటోంది. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. ఒప్పందం ప్రకారం పనిపూర్తయినట్టు (వర్క్ కంప్లీషన్) ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) లేఖ సైతం ఇచ్చారని ఎల్అండ్టీ వాదిస్తోంది. నీటిపారుదల శాఖ అందించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని పేర్కొంటోంది. దీంతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేగాకుండా బ్యారేజీ వద్దకు మీడియా బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని.. కానీ ఇప్పటివరకు కేవలం 98,570 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. -
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
సెయింట్ పాల్స్ స్కూల్లో ‘గోల్డెన్ జూబ్లీ’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్లో పదోతరగతి(1973 బ్యాచ్) చదివి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులతా పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్ కోఆర్డినేటర్ వీరస్వామి మాట్లాడుతూ తమ బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులుండగా, 75మంది వస్తారని అనుకున్నామని, 62 మంది గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. అమెరికా, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఒకరు కోల్‌కతా నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. కమిటీ ప్రతినిధులు కెబీఎంఎం.క్రిష్ణ, వి.కిషోర్, కోకా వెంకటరమణ, వి.రమేష్ పాల్గొన్నారు. గురువులకు సన్మానం విద్యాబుద్ధులు నేర్చిన తొమ్మిది మంది గురువులు, ప్రస్తుత ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మజర్అలీ అహ్మద్‌ను 1973 బ్యాచ్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి రూ. 40 లక్షలు విరాళం 1973 బ్యాచ్‌కు చెందిన ప్రొఫెసర్ సుధాకర్, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చల్లా కిషోర్, అతని నలుగురు సోదరులతో కలిసి పాఠశాల కొత్త భవనం కోసం రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. -
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్‌రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
తప్పు.. మీదంటే మీదే
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో డిప్యుటేషన్ల వ్యహారం చిచ్చురేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సమగ్ర వివరాలు అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారంఊ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మండిపడుతున్నాయి. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సాధారణ బదిలీలు చేపట్టకుండా, అయినవారు, ముడుపులు ఇచ్చి న వారిని కోరుకున్న ప్రాంతానికి పంపుతు న్నారని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో టీచర్లు సిటీకి.. చదువులు గాలికి’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొత్త వివాదానికి దారి తీస్తున్న డిప్యుటేషన్లు టీచర్ల డిప్యుటేషన్ అంశం అధికారుల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు కొంతమంది ఈ తంతుతో తమకు సంబంధమే లేదని చెబుతున్నారు. తాను వ్యతిరేకించినా డిప్యుటేషన్ ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదని ఓ అధికారిణి తెలిపారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నా, ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, విద్యాశాఖ ఉన్నతాధికారి మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఫైల్ సంబంధిత అధికారిణి ద్వారానే తనకు వస్తుందని, ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మానవతకోణంలో బదిలీలు చేస్తున్న విషయాన్ని ఆమె ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో తెలియడం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పరస్పరం సీఎంఓకు ఫిర్యాదులు చేసుకుంటున్న వైనం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. రంగంలోకి మధ్యవర్తులు తీవ్ర విమర్శలు వస్తున్నా డిప్యుటేషన్ వ్యవహారం ఆగడం లేదు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు గత నెల 11వ తేదీన ఓ టీచర్‌ను డిప్యుటేషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని డిప్యుటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యుటేషన్ల బేరసారాలు పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయని టీచర్లు అంటున్నారు. అనారోగ్య సర్టీఫికెట్లు సృష్టించి మరీ డిప్యుటేషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని వారు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడిని ముందుకు తెస్తుంటే, మరికొంతమంది తమకు విద్యాశాఖలో ఉన్నతాధికారి తెలుసునని, ఆయనకు కొంత ముట్టజెబితే డిప్యుటేషన్ సులభమని నమ్మిస్తున్నారని పలువురు టీచర్లు తెలిపారు. ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పాటించి విశ్వసనీయతను కాపాడుకోవాలి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ పేరిట జిల్లాలు దాటించి బదిలీలు చేయటం సమంజసం కాదు. అనారోగ్యం, భార్యభర్తలు తదితర సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని అవసరమైన, అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వటం సమంజసం. ఉపాధ్యాయులు బదిలీలకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించారు. నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధానకార్యదర్శి