TS Special
-
సహజ వనరుల బ్యాలెన్స్‌షీట్స్ ఏవీ?
చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా, చైర్మన్ బోర్డ్ఆఫ్ స్టడీస్‌గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. 1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ? ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి. పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య... అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్ఈసీ) ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ? ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి. సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ? అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది. పర్యావరణ అంశాలపై .. దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్‌చాంబర్‌గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు. -కె. రాహుల్ -
అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో నీటి లీకేజీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఈ బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుంచి నీళ్లు లీకవుతున్నట్టుగా బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈఈ యాదగిరి వివరణ ఇచ్చారు. బ్యారేజీ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్ ఉంటుందని.. దీనికి వార్షిక నిర్వహణ (ఓఅండ్ఎం)లో భాగంగానే పనులు చేస్తున్నామని తెలిపారు. ఏటా సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుందని, సీపేజ్ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు. పూర్తి నిర్వహణ బాధ్యత అఫ్కాన్ సంస్థదేనని తెలిపారు. ప్రాజెక్టును ఇలాంటి సమస్యలను తట్టుకునే విధంగానే డిజైన్ చేశామన్నా రు. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా చేస్తామన్నారు. కాగా బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 5.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
Updates: గంజి మైదాన్‌లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు. ►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు. ►ఆ తర్వాత రోజే మాట మార్చాడు. ►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించింది. ►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది ►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. ►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం. ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం. ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం. ►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం. ►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు. ►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా. ►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి. ►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా? ►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి. ►సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది. -
కాంగ్రెస్‌లో అందరూ సీఎంలే.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని, కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్బీనగర్లో ఆదివారం ఆయన బీఆర్ఎస్ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం అని మొత్తుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. జగ్గారెడ్డి కూడా సీఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో 6,7 మంది సీఎం కాండిడెట్లున్నారు పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్ అందరూ సీఎంలే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేయొద్దు. 2014కు ముందు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడ్డారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లోకి సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇంకా కొందరు నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. సీనియర్ నేతలు కూడా పార్టీలు మారుతుండటం విశేషం. ఇక, తాజాగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ కీలక నేత అధికార బీఆర్ఎస్లో చేరారు. వివరాల ప్రకారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా పేరున్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి శేఖర్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఇక, ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. మరోవైపు, ఎర్ర శేఖర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్ఎస్ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్‌కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు. తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు. మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్‌ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. వారితో చెడిందా? ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి? -
కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: తాను సిద్దిపేటలో పోటీ చేసేది లేదని, తమ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని.. కానీ అలాంటి ప్రయోగాలు చేస్తుందని తాను అనుకోనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నల్గొండలోనే పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ‘‘కర్ణాటకలో అమలవుతున్న పథకాలను పర్యవేక్షించేందుకు కర్ణాటక వెళ్దాం. బీఆర్ఎస్ నేతల కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేశాను. బావ, బామ్మర్థులు ఎవరు వస్తారో తెల్చుకోండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కర్ణాటక ప్రజల్ని అడుగుదాం. సంక్షేమ పథకాలు అందడం లేదని కర్ణాటక ప్రజలు చెప్తే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా’’ అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ‘‘బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే తొమ్మిది ఏళ్లుగా బాగుపడ్డారు. కేసీఆర్ సొంత కులస్తులు కూడా తెలంగాణలో బాగుపడలేదు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ధరణితో ఎవరు బాగుపడ్డారో కేసీఆర్ చెప్పాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. చదవండి: వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ -
డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కౌంటరిచ్చారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అంటూ ప్రశ్నలు సంధించారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ‘డీకే గారు.. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ? ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది. సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతీ ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ’ అని కామెంట్స్ చేశారు. డీకే గారు... కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది… — KTR (@KTRBRS) October 29, 2023 -
వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో బీజేపీకి వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా నిన్న బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న వివేక్.. రేవంత్ రెడ్డి తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా వివేక్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపాయిమెంట్ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతాయి అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా పోటీకి దూరం అని చెప్పుకోవడం వెనుక అంతరార్థం మరోలా ఉంటుందన్నది ప్రచారంలో ఉంది. వరుస చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
‘కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నాం’
సాక్షి, తాండూర్: కర్ణాటకలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. అక్కడ రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) తాండూర్‌లో పర్యటించారు. ఈ మేరకు ఇంగ్లిష్‌లో మాట్లాడిన డీకే శివకుమార్.. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామన్నారు. ‘మీ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. పదేళ్లయినా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసాం’ అని తెలిపారు. అయితే కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామని డీకే చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘మన భవిష్యత్తు వాళ్ల చేతుల్లో పెడదామా?’
సాక్షి, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి హరీష్‌రావు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం అన్న హరీష్‌రావు.. కాంగ్రెస్ అంటే బూటకమన్నారు. ఆదిలాబాద్‌లో ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన హరీష్‌రావు.. ‘ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారింది. అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందింది..కేసీఅర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే ఒక బూటకం. కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ తెచ్చిండు. ఇంటింటా నళ్లా నీరు ఇచ్చాం.. కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. కొందరు బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు. కుర్చీ కోసం కోట్లాడే నాయకులకు ఓట్లు వేద్ధామా?, మన భవిష్యత్తు వాళ్ల చేతులో పెడుదామా? అని హరీష్‌రావు ప్రజలను ప్రశ్నించారు. చదవండి: ప్రత్యర్థి ఎవరైనా..? 'గులాబీ కార్' స్పీడ్‌కు బ్రేకులు వేయలేరు..! ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
దొడ్డుబియ్యాన్ని పక్కనపెడదాం.. సన్నబియ్యమే తిందాం: సీఎం కేసీఆర్
పాలేరు(ఖమ్మం జిల్లా): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీల వైఖరి గమనించి ఓటేయమని కేసీఆర్ విన్నవించారు. ‘కాంగ్రెస్ మోసం చేస్తే.. కేసీఆర్ శవయాత్రనా?.. తెలంగాణ జైత్రయాత్రనా? అనే తలంపుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి. పార్టీల వైఖరి గమనించి ఓటు వేయండి. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశాం. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ మోసం చేస్తే నేను దీక్ష చేపట్టాను. అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వ్యవసాయం స్థిరీకరణ జరిగేలా చర్యలు చేపట్టాం. రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. రైతులకు గత ప్రభుత్వాలు ఎలాంటి మేలు చేయలేదు. దేశంలో అత్యధిక ధాన్యం పండించే రెండో రాష్ట్రం తెలంగాణ. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారు. 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయి. పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చాం. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాం. అన్ని అవకాశాలు ఇచ్చినా తుమ్మల నిలబెట్టుకోలేకపోయాడు. తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు. ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడు. ఇక్కడ ప్రజలు ఒకటి గమనించాలి. తుమ్మలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందా?, బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేశాడా? అనేది గమనించాలి. పాలేరులో ఉపేందర్‌రెడ్డిని గెలిపించండి. నేను ఒకే ఒక్క మాట చెబుతున్నా. దళితబంధు, రైతు బంధు కొనసాగిస్తాం.ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తాం. రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తాం. 3 కోట్ల టన్నులు వరిధాన్యం పండించే తెలంగాణలో రేషన్‌కార్డు దారలందరికీ సన్నబియ్యమే పంపిణీ చేస్తాం. వచ్చే మార్చి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల -
‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. మైండ్ గేమ్ ఆడుతున్నారు’
హైదరాబాద్: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై డీకే అరుణ స్పందించారు. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టం అని డీకే అరుణ అన్నారు. మీడియా వారు కనీసం తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరికాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్‌లో తన చేరిక పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? -
వాటిని కూడా ఆపెయ్యమంటరేమో?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి అనే విషయం మరోసారి రుజవైందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాతెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. (చదవండి: మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు) ఇంటింటికి మంచినీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? , రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.జై కిసాన్.. జై తెలంగాణ..!!జై కేసీఅర్.. జై బీఆర్ఎస్..!!!’ అని పోస్ట్ పెట్టారు మంత్రి కేటీఆర్. ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే... రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట… https://t.co/4P7DnFJOHd — KTR (@KTRBRS) October 26, 2023 -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
‘కోడ్’ పేరుతో అత్యుత్సాహం!
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది. బుధవారం రామాయంపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించడం కోసమే అన్నట్లు ఈ పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కామారెడ్డిలో లాజిస్టిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన వీళ్లు బుధవారం కారులో తిరిగి వస్తున్నారు. అందులో ఉన్న బ్యాగులో రూ.50 వేలు (రూ.500 నోట్ల కట్ట) ఉంది. రామాయంపేట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారు ఆపారు. బ్యాగ్ తనిఖీ చేసిన ఎస్ఐ నేతృత్వంలోని పోలీసులు అందులో రూ.50 వేలు ఉండటం గమనించారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేల వరకు నగదు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ చెక్‌పోస్టులోని పోలీసులు యువకులను ఆ నగదుకు లెక్కలు చెప్పమని గద్దించారు. అవి తమ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్తున్నా వినిపించుకోలేదు. రూ.50 వేలు సీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పోలీసులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేచారు. ఆ యువకుల జేబుల్లో, పర్సులు తనిఖీ చేశారు. ఒకరి పర్సులో రూ.200 ఉండటంతో ఆ మొత్తంతో కలిపి తాము రూ.50,200 సీజ్ చేసినట్లు, అవి ఒకరి వద్దే లభించినట్లు పంచనామా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా ఒకరి పేరు రాసి ఆ మొత్తం స్వాదీనం చేసుకున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఒకరి వద్ద ఉంటే సీజ్ చేస్తారా? లేక ఒక వాహనంలో ఉంటే సీజ్ చేస్తారా? దానికి సంబంధించి ఈసీ ఆదేశాలు చూపాలంటూ యువకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వులు చూపాలంటే ముందు పేరు చెప్పాలంటూ తెలుసుకుని పంచనామాపై రాశారు. రామాయంపేట పోలీసుల తీరుపై యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ లెక్కల కోసం ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమనిప్రశ్నిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. కోడ్ పేరుతో పోలీసుల చూపిస్తున్న అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు తెచి్చపెడుతోంది. కోడ్ అమలులోకి వచి్చన నాటి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. హైదరాబాద్‌లోనే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకు ఉంది. బోయిన్పల్లి పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్న రూ.55,900 నగదుతో మాత్రమే ఎన్నికల లింకులు ప్రాథమికంగా బయటపడ్డాయి. ఈ నగదు తరలిస్తున్న న్యూ బోయిన్పల్లి వాసి ఎం.భాస్కర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో ఆ కోణంలో ‘ఎలక్షన్ డబ్బు’గా అనుమానిస్తూ స్వాదీనం చేసుకున్నారు. ఇది మినహా మరే ఇతర ఉదంతంలోనూ నగదు స్వాధీనంలో రాజకీయ కోణం బయటపడకపోవడం గమనార్హం. -
అప్పట్లో ఎన్నికల ఖర్చు పది వేలే..! కానీ ఇప్పుడు కోట్లలో..
సాక్షి, ఆదిలాబాద్: ‘‘ఇప్పటి ఎన్నికల తీరు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కోట్లు గుమ్మరిస్తుండ్రు, దీంతో ఓటర్లు కూడా అలానే తయారయ్యారు. ఎవరు ఎంత ఇస్తుండ్రు అని చూస్తుండ్రు తప్పా అభిమానం అనేది పూర్తిగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఎన్నికల ప్రచారానికి లెక్క లేనంతగా ఖర్చు పెడుతుండ్రు. మా అప్పటి ఎన్నికల తీరుకు ఇప్పటి ఎన్నికల తీరుకు చాలా మార్పు వచ్చింది. 1985 ఎన్నికల్లో నేను రూ.10వేలు మాత్రమే ఖర్చు చేశాను..’’ అని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్‌నాయక్ అన్నారు. అప్పటి, ఇప్పటి ఎన్నికల తీరుపై గోవింద్‌నాయక్ ‘సాక్షి’తో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే.. అభిమానంతో ఓటేసేవారు.. నేను మొట్టమొదటిసారి 1977లో ఖానాపూర్ నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశాను. అప్పుడు ఎన్నికలపై ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఆ సమయంలో నేను ఓడిపోయాను. రెండోసారి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను. అప్పుడు నేను ఎన్నికల కోసం ఖర్చు చేసింది రూ.10వేలు మాత్రమే. ఇదీ ఓటర్లకు పంచేందుకో, మరో దేనికో కాదు. గ్రామాల్లో తిరిగేందుకు ప్రయాణ ఖర్చులు, గోడలపై రాతలకు మాత్రమే. నేనే ద్విచక్ర వాహనంతో ఎక్కువగా పర్యటించేవాణ్ని. ఎందుకంటే గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు ఉండేవి కాదు. పెద్ద పెద్ద వాహనాలు లేవు. ఓటర్లు కూడా అభిమానంతో ఓటేసేవారు తప్పా నయా పైసా ఆశించేవారు కాదు. 1994లో రూ.లక్ష మాత్రమే.. రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేశాను. అప్పుడు కూడా ఇప్పటితో పోల్చుకుంటే చాలా తక్కువే. కేవలం లక్ష రూపాయలు అయ్యింది. మేము కూడా జనం కోసం అలా పని చేసి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాం. ప్రజలంతా కూడా మా పై ఉన్న అభిమానంతో మాకు ఓటేసి గెలిపించుకునేది. వారి కోసం మేము పనిచేసేది. నిత్యం ప్రజల మధ్య తిరిగేటోళ్లం. ఖానాపూర్ నియోజకవర్గం చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాలకు విస్తరించింది. దీంతో ప్రచారం చేయడం అభ్యర్థులకు కష్టమే. 2004లో రూ.10లక్షలకు పెరిగింది.. నేను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశాను. మొదట 1985 పోటీ చేసిన సమయంలో ప్రచార ఖర్చు రూ.10వేలు అయితే రెండోసారి 1994లో రూ.లక్ష, ఇక మూడోసారి 2004లో మాత్రం రూ.10లక్షల వరకు పెట్టాను. అంతే తప్పా ఇప్పటిలా కోట్లు ఖర్చు పెట్టలేదు. పోలింగ్ ఏజెంట్‌కు రూ.10 మాత్రమే.. ఎన్నికల రోజున పోలింగ్ సమయంలో ఏజెంట్‌గా వ్యవహరించే వారికి రూ.10 ఇచ్చేది. అది నాకు బాగా గుర్తుంది. నేను రాజకీయంగా ప్రజల ఆదరాభిమానాలు పొందాను. అదే నాకు చాలా సంతోషం. ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు నన్ను మరిచిపోరు. అభిమానంతో నన్ను గెలిపించుకున్నారు. నేను కూడా ప్రజలకు అదే తీరుగా పనిచేశాను. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొందరు సంపాదించుకుంటారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు. మా తాతలు, తండ్రుల నుంచి వచ్చిన కొన్ని ఆస్తులు అమ్మేశాను తప్పా కొనలేదు. వయస్సు పైబడడంతో ప్రస్తుతం స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఇంటి వద్ద ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. - మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్‌నాయక్ -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఐపీఎస్ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్పీఏ) ఐపీఎస్ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ ఆర్) బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్ కావడంతో ‘అమృత్కాల్ బ్యాచ్’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్ డైరెక్టర్ ఎన్.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ... ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సైబర్ క్రైమ్ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్ ట్రైనింగ్ మొదలు కానుంది. మాక్ కోర్టులు సైతం నిర్వహిస్తూ... సాధారణంగా ఐపీఎస్ అధికారులకు ఎఫ్ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో మాక్ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు. ఐఆర్ఎస్ నుంచి ఐపీఎస్‌కు.. అల్వాల్ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్ కావడం సంతోషంగా ఉంది. – ఎస్.చిత్తరంజన్, ఐపీఎస్ ట్రైనీ తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్–కానిస్టేబుల్. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం. – చేతన్ పందేరి, ఐపీఎస్ ట్రైనీ -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్‌లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్‌డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
నేటినుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు కావడంతో సిలబస్ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్‌ను డిసెంబర్లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. దశల వారీగా అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు. -
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్‌పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, సనత్‌నగర్‌లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్‌లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఇసుక పక్కకు జరగడం వల్లే..
సాక్షి, హైదరాబాద్: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్కూ నష్టం జరిగిందని చెప్పారు. పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు. -
‘సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది’
సాక్షి, ఖమ్మం: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతుందన్నారు. 74 నుంచి 78 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు భట్టి విక్రమార్క. త్వరలోనే రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలకు ఓడిపోతామనే విషయం అర్థమైందన్న మల్లు.. బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’