TS Special
-
Hyderabad: సీపీ ఆకస్మిక తనిఖీ.. బోరబండ సీఐపై వేటు
హైదరాబాద్: బోరబండ పీఎస్‌ను హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్‌కు ఆకస్మికంగా వచ్చిన సీపీ.. సీఐ రవికుమార్‌ను రౌడీ షీటర్ల లెక్క అడిగారు. దీనికి సీఐ రవికుమార్ తటపటాయించారు. అసలు రౌడీ షీటర్లు ఎవరో గుర్తించు అంటూ సీఐని సీపీ వెంట తీసుకెళ్లారు. రౌడీ షీటర్ల ఇళ్లను సీఐ రవికుమార్ గుర్తించలేకపోయారు. దాంతో సీఐను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సందీప్ శాండిల్య. పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది. బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుండి ఎనిమిదవ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో లక్ష్మీ బ్యారేజ్‌ను నిర్మించారు. 24 నెలల్లో బ్యారేజ్ నిర్మాణాన్ని ఎల్అండ్ టీ పూర్తి చేయగా, దీని నీటీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ పొడువు 1.6 కిలోమీటర్లు. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు. ‘‘మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ని చేసిండ్రు. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈ పదేళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు కాపాడుకోండి. విజయదశమీ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా ఆశీర్వదించండి’’ అని కోరారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి వాలిపోతానని జగ్గారెడ్డి చెప్పారు. చదవండి: ఒవైసీ ఫ్యామిలీ ది గ్రేట్@61 నాటౌట్ -
కామారెడ్డిలో పోటీపై షబ్బీర్ అలీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్ ఆలీ తేల్చిచెప్పారు. ‘కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అట్టర్ ఫ్లాప్’
సాక్షి, హైదరాబాద్: లక్ష్మి బ్యారెజ్ దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ బ్యారెజ్‌కు సంబంధించి ఇరిగేషన్ ఇంజనీర్లు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు అది దెబ్బతిన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఆ బ్యారెజిని పరిశీలించడానికి ఈటెల రాజేందర్ వెళ్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అట్టర్ ఫ్లాప్. కాళేశ్వరం తెలంగాణ సంపదకు చిల్లుగా మారింది. కాళేశ్వరానికి భారీగా నిధులు కేటాయించారు మూడేళ్లలోనే మేడిగడ్డ వంతెన కుంగిపోవడం దారుణం. ఎక్స్‌పర్ట్‌గా, సూపర్ ఇంజనీర్‌గా భావించి తనకు తాను కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు చేయాలి. అవినీతి పరిపాలనపై బీజేపీ పోరాటం. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కవలపిల్లలు. ఎన్ని టీఎంసీల నీరు వ్యవసాయానికి అందించారు.ఇప్పటి వరకు 150 టీఎంసీల నీటిని మాత్రమే అందించారు.హడావిడి గా ప్రచారం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు.గోదావరి వరదలతో నీటి పంపులు మునిగిపోయి చాలా నష్టం జరిగింది.ప్రాజెక్ట్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డ్యాం సేఫ్టీ అథారిటీ ఆహ్వానించి పరిశీలించాలని కోరుతున్నా. డ్యాం సేఫ్టీ పై నిపుణుల బృందాన్ని పంపాలని జలశక్తి మంత్రికి లేఖ రాస్తున్న. జనసేన పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
‘హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారు’
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్.. తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దు. మేము కూడా ఉద్యమ కారులమే. పోయిన ఉద్యమ కారులను మళ్ళీ మాట్లాడి పిలుపిస్తున్నం. అందుకే వచ్చి చేరుతున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా చాలా ఉద్యోగాల నియామాలు జరిగాయి. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాం. హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారు. గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటెల గెలవరు’ అని అన్నారు కేటీఆర్. -
తుమ్మల ఫైర్.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అజయ్ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు.. -
రసవత్తరంగా నాగార్జున సాగర్ రాజకీయం
నల్గొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ముగ్గురు యువ నాయకుల మద్య పోటి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇటీవల భగత్‌కే భీఫాం ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు చెక్‌పడింది. ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతన్ని కాదని భగత్‌ను టికెట్ ఇవ్వడంతో మన్నెం రంజిత్ యాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో చేరి భగత్‌కు ప్రత్యర్థిగా మారారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. అయితే నియోజకవర్గంలో యాదవ వర్గం వారు ఎక్కువగా ఉండటం మన్నెం రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో నాగార్జున సాగర్‌లో కమల జెండా ఎగరేసి తీరాతామని రంజిత్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నాగార్జున సాగర్ ఎవరి వశం కానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్ టన్నులు. గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు? ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం. -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
‘నమో భారత్’ అదిరెన్.. హైదరాబాద్‌లోనే డిజైన్!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైలు తర్వాత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రైలు సర్వీసు ‘నమో భారత్’. మెట్రో రైళ్ల కంటే చాలా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు.. వసతుల్లోనూ వాటికంటే మెరుగ్గా ఉంటాయి. బుల్లెట్ రైలు మాదిరిగా ముందు భాగం ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే.. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. దాదాపు 160 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ రైళ్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాగ్యనగరంతో బంధం... ఎన్నో ప్రత్యేకతలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు భాగ్యనగరంతోనూ ఓ బంధం ముడిపడి ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపం, అత్యధిక వేగం, మెట్రో రైళ్లకంటే వెడల్పు, ఎత్తుగా ఉండటంతో విశాలమైన కోచ్‌లు.. ఇలా పలు ప్రత్యేకలతో ఉన్న ఈ రైలును డిజైన్ చేసింది ఆల్స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్‌లోనే కావటం విశేషం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా రైలు రోలింగ్‌స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా మన దేశంలో ఆల్స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఏర్పాటై, మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. ఎరోడైనమిక్ నోస్ మోడల్‌తో రూపొందించిన ఈ డిజైన్ టెండర్ ద్వారా అమోదం పొందింది. ఎన్నో ప్రత్యేకతలు... గంటకు దాదాపు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే సామర్ధ్యంతో దీన్ని రూపొందించారు. అంత వేగంతో వెళ్లేప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఎరోడైనమిక్ నోస్ మోడల్‌ను రూపొందించారు. దేశంలో సాధారణ మెట్రో రైళ్లు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి. కానీ నమో భారత్ ఏకంగా 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సీటింగ్ సిస్టం ఉండగా, ఇందులో వందేభారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని వేగంగా ఢిల్లీ నగరంలోని అసుపత్రులకు తరలించేందుకు కూడా అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. రోడ్డు మార్గాన రెండు గంటల్లో వెళ్లే దూరాన్ని ఈ రైలు కేవలం అరగంటలో చేరుతుంది. స్ట్రెచర్‌తో సహా రోగిని రైలు కోచ్‌లో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్ట్రెచర్‌ను అటాచ్ చేసే సిస్టమ్ ఉంది. ఆ కంపెనీ టేకోవర్.. నమో భారత్ రైలు డిజైన్‌ను హైదరాబాద్‌లో రూపొందించగా, గుజరాత్‌లోని సావ్లీ గ్రామంలో ఉన్న బాంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే మరో బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్లో ఈ రైళ్లను తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని కూడా ఆల్స్టోమ్ కంపెనీ టేకోవర్ చేయటం విశేషం. త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కూడా ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం నగరంలో 90 కి.మీ. వేగంతో తిరుగుతున్న మెట్రో రైళ్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో రైళ్లు కనీసం 30 కి.మీ. అధిక వేగంతో తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఎరో డైనమిక్ లుక్‌తో ఉండనున్న ఈ రైళ్ల తయారు కోసం ఈ కంపెనీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. -
సారూ... జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ‘సోషల్’ మయం.. ప్రచారమేదైనా సోషల్ మీడియాదే హవా! ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు ఎవరికి నచ్చినట్లుగా వారు సోషల్ మీడియా పోస్ట్‌లతో చెలరేగిపోతున్నారు. అయితే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటోంది ఎన్నికల కమిషన్. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, ఈసారి సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్‌లు, ప్రచార కోణాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉద్యోగి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొంతమందికి శిక్షణ ఇచ్చారు. వారు జిల్లా స్థాయిలో, వారి ద్వారా మండల స్థాయిలో అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తారు. ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్లను కోరింది. ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు రుజువైతే తక్షణం సస్పెండ్ చేయాలని నియమావళి పేర్కొంటోంది. మీటింగ్‌లకు వెళ్ళినా నేరమే.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఈ కారణంగా ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు వారి నుంచి రాకుండా ఉండాలని ఎన్నికల నియామవళి పేర్కొంటోంది. పార్టీల బహి రంగ సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో ఉద్యో గులు పాల్గొన్నట్టు ఫిర్యా దులొస్తే తేలికగా తీసుకోవద్దని పేర్కొంటూ పరిశీలనకు కొన్ని సూచనలు చేసింది. సభ జరిగినప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్టు భావిస్తే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరపత్రాలు పంచడం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా పరిగణించాలని, ఆధారాలుంటే తక్షణమే సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త ప్రతీ ఉద్యోగికి వ్యక్తిగత అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. ఇది విధి నిర్వహణపై ప్రభావం చూపడానికి వీల్లేదు. ఎన్నికల నియామవళి ప్రకారం పారదర్శకంగానే వ్యవహరించాలి. పూర్తి సాంకేతికతతో నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) -
కోడ్ కూత ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (కోడ్) ఏయే పథకాలకు వర్తిస్తుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న పథకాలే అయినప్పటికీ ఆ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే వెసులుబాటు కోడ్ అమల్లో ఉంటే సాధ్యం కాదు. కానీ, ఈ కోడ్ సాకుగా కొన్ని పాత పథకాలు, ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను అమలు చేయడంలో కొందరు అధికారుల గందరగోళ వైఖరి చర్చకు దారితీస్తోంది. రెవెన్యూ కార్యకలాపాలు ‘యథాతథం’ ఇక, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతారే తప్ప దైనందిన రెవెన్యూ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ధ్రువీకరణ పత్రాల మంజూరు, ధరణి దరఖాస్తుల పరిష్కారం లాంటివి కోడ్ కారణంగా ఆగిపోవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో 58, 59ల ద్వారా భూముల క్రమబద్ధీకరణ కూడా ఆగదని అంటున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక విడత నిధులు మంజూరైన లబ్ధిదారునికి రెండో విడత నిధులు మంజూరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జిల్లాకో తీరుగా గొర్రెల పంపిణీ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం విషయంలో ఎన్నికల కోడ్‌ను జిల్లాకో రీతిలో అమలుపరుస్తున్న తీరు విస్మయపరుస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రెండో విడత రాష్ట్రంలో అమలవుతోంది. మొత్తం 3.5లక్షలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 1.25లక్షల మందికి పైగా లబ్ధిదారులు వారి వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు. ఇందులో కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కేవలం 28వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోకుండా చేతులెత్తేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయాధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు వదిలేశారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు గొర్రెలను పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఆయా జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు వచ్చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా కొనుగోళ్లు చేస్తుండడం గమనార్హం. కొసమెరుపేమిటంటే... 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత గొర్రెల పథకం అమలు కావడం గమనార్హం. ఆ బాధ్యత అధికారులదే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజలపై ఉంది. కోడ్ అడ్డురాని పథకాలను, కార్యక్రమాలను, జీవోలను, రోజువారీ కార్యకలాపాలను యథాతథంగా అమలు చేసే బాధ్యత అధికారులదే. ఈ విషయంలో అధికారులదే తుది నిర్ణయం’ అని స్పష్టం చేశారు. డబ్బుల్లేవని కోడ్ మాట చెపుతున్నారు ‘అసలు కోడ్‌కు గొర్రెల పథకానికి సంబంధం లేదు. 2018లో ఎన్నికలు జరిగే రోజున కూడా గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ సమస్య కాదు. సరిగా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసి గొల్లకుర్మలను మోసం చేసింది. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో కోడ్ అనే సాకు చూపెడుతున్నారు.’ – ఉడుత రవీందర్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఓటింగ్‌పై అవగాహన గ్రామీణ ఓటర్ల కంటే.. పట్టణ ఓటర్లకే తక్కువ..
నల్లగొండ: ‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే.. పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ వంటి అర్బన్, మున్సిపల్ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈసారి దానిని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. కలెక్టర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. పట్టణాల్లో 356 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో చాలా తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో కేవలం 356 పోలింగ్ స్టేషన్లే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 1,410 పోలింగ్ కేంద్రాల పరిధిలోనే దాదాపు 80 శాతం వరకు ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తంగా 14,26,480 ఓటర్లు ఉన్నారు. ఏర్పాట్లు ముమ్మరం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. శుక్రవారం నుంచే ఈవీఎంలను నియోజకవర్గాలకు పంపిస్తున్నాం. శనివారం నాటికి అవి నియోజకవర్గాలకు చేరుతాయి. ఒక్కో నియోజకవర్గానికి అవసరమైన ఈవీఎంల సంఖ్య కంటే అదనంగా 25శాతం ఈవీఎంలను పంపిస్తున్నాం. అనుకోకుండా ఏదైనా పని చేయకపోయినా, రిపేర్ వచ్చినా ఉపయోగించుకునేలా వాటిని అందుబాటులో ఉంచుతున్నాం. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జిల్లాలో 521 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాం. వాటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. వాటిల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. వీడియో కెమెరాల రికార్డింగ్ ఏర్పాటు చేస్తాం. వెబ్ క్యాస్టింగ్ ఉంటుంది. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నగదు, విలువైన వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటివరకు పోలీసు, ఇతర శాఖలు రూ.11.54కోట్ల నగదును పట్టుకోగా, రూ.27.49కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను పట్టుకున్నాయి. గురువారం ఒక్కరోజే పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. అది ఎన్నికల రిలేటెడ్ కాకపోయినా డాక్యుమెంట్లు లేకపోవడంతో సీజ్ చేశాం. పన్ను ఎగవేసేందుకు డాక్యుమెంట్లు లేకుండా బంగారాన్ని విజయవాడవైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించాం. దానిని కమర్షియల్ టాక్స్ విభాగానికి అప్పగించాం. టాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు కనుక జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మొత్తంగా దాదాపు రూ.40కోట్ల విలువైన డబ్బు, వస్తువులు సీజ్ చేయగా, రూ.3కోట్ల డబ్బుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఆర్ లేకుండా మరో 3,26,24,000 సీజ్ చేశాం. అందులో రూ.2.89కోట్లు రిలీజ్ చేశాం. రూ.10లక్షల కంటే ఎక్కువ ఉంటేనే సమస్య వస్తోంది. వారే లెక్కలు చూపించుకోవాలి. 24 గంటల్లో డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే రిలీజ్ చేస్తాం. లేదంటే ఆదాయ పన్నుల శాఖకు వారికి అప్పగిస్తాం. వారికి లెక్కలు చూపించుకోవాల్సి ఉంటుంది. వారు రిలీజ్ చేయమంటేనే చేస్తాం. 86 ఫిర్యాదులు పరిష్కరించాం ఎన్నికలు, కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సి–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు 113 ఫిర్యాదులు రాగా, అందులో సరైనవి 86 ఫిర్యాదులను పరిష్కరించాం. మిగతావి సరైనవి కావు. ఉల్లంఘనలపై 1950 టోల్ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేస్తే.. 100 నిమిషాల్లో పరిష్కరిస్తాం. వృద్ధులు, వికలాంగులకు హోం బేస్డ్ ఓటింగ్ 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు హోంబేస్డ్ (ఇంటి నుంచి) ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తాం. జిల్లాలో వికలాంగులు 32వేల మంది ఉండగా, వృద్ధులు 17వేల మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌కు రాలేను అనుకున్నవారికే ఈ అవకాశం కల్పిస్తాం. రావాలనుకునే వారు రావచ్చు.. రాలేని వారు ఫారం 12(డి) సబ్మిట్ చేయాలి. వికలాంగులైతే 40శాతం వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్ ఉండాలి. మునుగోడు ఎన్నికల్లో వెయ్యి మంది హోంబేస్డ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాం డాక్యుమెంట్‌తోనే డబ్బు తీసుకెళ్లండి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తున్నప్పుడు వాటికి సంబంధించి డాక్యుమెంట్లు, ప్రూఫ్ కచ్చితంగా తీసుకెళ్లండి, నగదు రవాణాతో మిస్ యూజ్ జరిగే అవకాశం ఉన్నందును ఎన్నికల కమిషన్ ఈ నిబంధన విధించింది. వీలైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్యాష్ తీసుకెళ్తే మాత్రం ప్రూఫ్ ఉండేలా చూసుకోండి. సీజ్ చేసిన మొత్తాన్ని విడిపించుకునేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీకి దరఖాస్తు చేసుకోండి. డాక్యుమెంట్లు సమర్పిస్తే ఒక్క రోజులోనే రిలీజ్ చేస్తాం. -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
మన బతుకు ఇంతేనా అని బాధపడేవాళ్లం: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఇందులో తనకు ఎలాంటి సందేహాం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఒక్కరోజు మొత్తం గజ్వెల్లోనే ఉంటూ. నియోజకవర్గ ప్రజలతో గడుపుతానని తెలిపారు. గజ్వేల్‌కు కావాల్సింది ఇంకా చాలా ఉందని, అవన్నీ చేపిస్తానని భరోసా ఇచ్చారు. అయతే కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందన్న కేసీఆర్.. ఆ కారణం ఏంటో మాత్రం వెల్లడించలేదు. గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించగా.. ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మోటర్ లేకున్నా సంపు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు ఉండేనని.. అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుంచి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాయని గుర్తు చేశారు. అదే నేడు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. మన బతుకు ఇంతేనా అని బాధేపడ్డాం ఈ మేరకు రాజకీయ జీవిత మొదలు పెట్టినప్పటి నుంచి తన ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, తెలంగాణ ఉద్యమంలో అనుభవించిన కష్టాలను కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. ‘24 ఏళ్ల క్రితం ఒక్కడినే బయల్దేరి వెళ్ళాను. ఆనాడు కొంత మంది మిత్రులము కూర్చొని మన బతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం. నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఏం చేయాలో తెల్వని పరిస్థితి. ఎక్కడ చూసిన చిమ్మని చీకటి, ఎవరిని కదిలించిన మన బతుకులుబేం ఉన్నాయి అనే ఆవేదన ఉండేది. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మన జిల్లా కేంద్రం సంగారెడ్డి. అక్కడకు పోవాలి అంటే 5, 6 గంటల సమయం పట్టేది. మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవి. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒక్కో బావికి 2, 3 వేలు ఖర్చు చేసిమంచిగా చేయించే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ దగ్గరకు 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని వెళ్ళాను. కానీ అప్పటి విద్యుత్ సంస్థల చైర్మన్ అన్ని ఒప్పుకుంటా కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయం అని చెప్పారు. కానీ గట్టిగా పట్టిపడితే స్లాబ్ చేంజ్ చేశారు. చదవండి: కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ చంద్రబాబు మోసం చేశారు ఆనాడు కరెంటు బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చేస్తూ ముందుకు వచ్చా. నాతో ఎవరు కలిసి రాలేదు. నేను వస్తే కూడా జాకున్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. వలసలు ఆగాలని అనుకున్నాం తెలంగాణ వచ్చిన రోజు చెట్టుకు ఒక్కరూ గుట్టకు ఒక్కరు అయ్యారు. మహబూబ్ నగర్‌తోపాటు మన మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి జరిగితే వలసలు అగుతాయని ఆలోచించాం. ఇప్పుడు వలసలు వాపసు వచ్చి అద్భుతమైన వ్యవసాయ రంగం పురోగమించింది. వీటన్నింటి నుంచి బయటకు రావాలి అంటే ఎలా అని ఆలోచించాం.ఎంతో మంది ఆర్ధిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడం.అప్పుడే వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. ఒక్కసారే ఓడిపోయాను నేను ఒక్కసారే ఓడిపోయాను. అప్పుడు కూడా నేను ఓడిపోలేదు ఓడించబడ్డాను. ఆ సమయంలో ఈవీఎంలు లేవు. బ్యాలెట్ పేపర్లు ఉండే. కేవలం ఆరు ఓట్లతో ఓడించారు. గజ్వెల్ బిడ్డలు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించారు. అయితే గజ్వేల్‌కు కొంత చేశాం ఇంకా చేయాలి. కరోనాతో కొంత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. నాకు కూడా కరోనా వచ్చింది. పదవులు వస్తాయి పోతాయి ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ముఖ్యం. రైతాంగం పంటలు పండించాలి. భూములు పోయిన భాధ చాలా పెద్దది. నాకు కూడా భాధ ఉంది. నా కూడా భూమి పోయింది. మా అత్తగారి ఊర్లో నా అత్తగారి భూమి, నా ఊర్లో భూమి కూడా పోయింది. మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు. మీకు ఇవాళ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుంది. తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యం అయింది.మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం.అయిన కాంగ్రెస్ వాళ్లు ,కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందాం. గజ్వెల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నాము. మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్నా. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి.గెలుస్తుంది.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై స్పష్టత కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సాక్షి, హైదరాబాద్: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్‌షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు. -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు(ఉచిత గుర్తులు) విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బీఆర్ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్ఎస్ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించారు. ఇక, ఎన్నికల్లో ఈ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యారు. ఒక రకంగా బీఆర్ఎస్ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్! -
తెలంగాణ ఎన్నికలు.. రంగంలోకి 20వేల కేంద్ర బలగాలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేంద్ర బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో, రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు రానున్నాయి. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 100 కంపెనీల నుంచి 20వేల కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. రెండు రోజుల్లో బలగాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర హోం శాఖ బలగాలను రాష్ట్రానికి పంపించనుంది. ఒక్కో కంపెనీలో.. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ వంటి బలగాలకు చెందిన 60-80 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ క్రమంలో మొత్తం 20 వేల మందికి పైగా కేంద్ర బలగాల సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని ఈ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. కీలక ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల ఏర్పాటుతో పాటు సరిహద్దుల్లోనూ తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకోనున్నాయి. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బృందాలు పలు విడతల్లో కవాతు జరపనున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నాయి. ఓటర్లలో భయాందోళనలకు తావులేకుండా చేయడంలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల ద్వారా భరోసా కల్పించనున్నాయి. ఈ సిబ్బంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎంపిక చేసిన కొన్నింటి వద్ద సొంతంగానే విధులు నిర్వర్తించనున్నారు. మరికొన్ని కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో కలిసి బందోబస్తులో పాల్గొంటారు. మరోవైపు పోలింగ్ సమయంలో ఆయా కేంద్రాల వద్ద ఈ బలగాల బందోబస్తు కీలకం కానుంది. పోలింగ్ ముందురోజే ఆ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని బందోబస్తులో నిమగ్నం కానున్నారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు వీరి అధీనంలోనే ఉండనున్నాయి. ముందు వాటిని భద్రపరిచిన కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం.. పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్‌రూం కేంద్రాలకు తరలించడం వంటి ప్రక్రియ కేంద్ర బలగాల నియంత్రణలోనే జరగనుంది. బందోబస్తు మాత్రమే కాకుండా.. డబ్బు, మద్యం వంటివాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే తనిఖీల్లోనూ ఈ బలగాలు నిమగ్నం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు -
ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!
సాక్షి, తెలంగాణ: కేసీఆర్‌కు భాష మీదా, సామెతల మీద పట్టెక్కువ. మొన్ననే జడ్చర్ల, మేడ్చల్ సభల్లో ‘కాంగ్రెస్ వస్తే కాటగలుస్తం’, ‘గోల్మాల్ చేసేటోళ్లతోని గోసవడ్తం’, ‘రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటరు’.. అంటూ ప్రసంగించారు. సామెతల్తో చెప్పే మాట చట్టుక్కున ఎక్కుతది. అదే ధోరణి అన్ని పార్టీలు అనుసరించినప్పుడు.. కారు సారు కేసీయారు మాట తీరు.. ఈ కాంగ్రెసోళ్లు ఎట్లాంటోళ్లంటే..‘ముచ్చటపెట్టేటాయన బిచ్చం బెట్టడు. ఊరబిస్కెను గోసి ఊరంత పంచుతనంటడు’. ఈళ్ల పనితీరు ఎట్లుంటదంటే..‘పప్పుల ఉప్పేసెటప్పుడు చెప్పెయ్యే కోడలా అంటే.. కాళ్ల ఏసుకునే చెప్పేసి అత్తకు ఇస్తర్ల అంచుకుపెడతరు’. ఇగ ఈళ్ల కత ఎట్లుంటదో తెలుసా? కర్ణాటకల 20 గంటలు కరెంటిస్తనన్నరు. ఇప్పుడు కటకట బడ్తున్నరు. ‘ఏం లేనోనికి ఎచ్చులెక్కువ..చిన్నకుండలో అన్నానికి పొంగులెక్కువ’. ఇంగ వాళ్ల పార్టీలో సీఎమ్ములెక్కువై.. ’సచ్చినపామును కొట్టడానికి అందరూ సిపాయిలే’. ఇగ ఈ పువ్వుపార్టీవోళ్లయితే ఏ రాష్ట్రంల ఎవడు ఏ పార్టీల గెలిసినా వాళ్లు కొని.. ‘ఎక్కడ మేస్తె ఏంది, మా ఇంట్లె ఈన్తె సాలు, మా సావిట్లె పాలిస్తె సాలు’ అంటరు. మా ఎమ్మెల్యేలను కూడా కొనబోయిన్రు కదా. ‘ఆగబోగాలు అంకాళమ్మవైతే.. పొలికేకలు పోలేరమ్మవి’ అన్నట్టు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తరు. ఆ కొనుడు కూడా ‘ఎర్రను చూపిచ్చి, చాపను పట్కపోతరు’. వీళ్లకంతా ఆస్తులు అమ్ముకోవడమే పని. ‘కతలమారి మొగుడు కమ్మలు జేయిస్తె.. అప్పుల గల మొగుడు అమ్ముకుతింటడు’ బాపతు ఈ పార్టీ. ఇసొంటోళ్లను ఎన్నుకోకండి. ‘సంకకు ఎక్కిన పిల్ల సచ్చినా దిగద’ని గుర్తుంచుకోండి. ఇదే స్టైల్లో... కాంగ్రెస్‌వాళ్ల సభల మాటల తీరు.. తెలంగాణ మేమే ఇచ్చినా.. ఇప్పిచ్చినాయనే మీకు ముద్దొచ్చిండు. ఏమైంది? ‘ఎద్దును చూస్తె ముద్దొస్తదీ, దున్నబోతె దుక్కమొస్తది’ అన్నట్టయింది. ఇచ్చిన మమ్మల్నే ఇడిసిపెట్టి ‘నవ్వుకుంట తిడితిరి.. నరకాన బడ్తిరి’. అందుకే ‘ఊరికి పొయ్యేటోన్ని ఇడిసిపెట్టి, నిద్రపొయ్యేటోనికి సద్దిగట్టకున్రి’. వాళ్లను ఎన్నుకున్రా.. ఏమైతది? ‘జీవి ఇడిసిందాక మంచినీళ్లూగూడ పొయ్యజాలనోళ్లు.. సచ్చింతర్వాత మీ బొందమీద పాలిచ్చే బర్రెను కట్టేస్తా’ అన్నట్టే ఉంటది. దీనికి నిదర్శనమే రూ. 400కు సిలండరు. మరి అంతగనం ఇచ్చేటోళ్లు మేము రూ.500 అన్నదాక ఎందుకియ్యలే. ఇప్పుడు వీళ్లైనా, ఆ పువ్వు పార్టీవోళ్లైనా ‘తాత సంపాయించిన ఆస్తి.. మనవడితో మట్టిపాలు’ అన్నట్టుగా అమ్ముకుని తింటున్నది మా హయాంలో జరిగిన అభివృద్ధినే కదా. ఇగ పువ్వు పార్టీలోళ్లు అచ్చం సంప్రదాయాలే మాట్లాడతరు. ‘ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పున్నెం’ అనుకుంట ఆకే ఇస్తరు గని అన్నం పెట్టరు. మనమేదన్న మర్యాద జెయ్యబోతె..‘అల్లుడొచ్చిండని కల్లు దెస్తె నీసులేదని కేసుపెట్టినట్టు’ సీబీఐ, ఈడీలతోని కేసులు పెట్టిస్తరు. అన్నింటికి ట్యాక్సులేసి ‘ఇంటి ఎద్దుకు కూడ కిరాయికట్టమంటరు’. ‘ఆటాపాటా మా ఇంట్ల... మాపటి బువ్వ మీ ఇంట్ల’ అంటరు. ఇప్పుడు పువ్వుపార్టీవాళ్ల ప్రసంగాలు.. మాది పువ్వు గుర్తు. మేము ఆవు పార్టీ. ‘ఆవు పాలల్ల అరవైఆరు పిండివంటలు’ ఉంటయి. అందుకే ఎవడన్న ‘ఆవును ఇచ్చి.. పలుపు దాచుకుంటడా?’ అట్లాంటి పని ఎప్పుడూ చేయకండి. ‘ఆవులేని ఇంట అన్నమే తినవద్దు’ అంటరు. ఆట్లాంటిది మన సొంత రాష్ట్రంలో ఆవు పార్టీని లేకుండా చేసుకుంటరా.. మీరే చెప్పండి. అప్పుడు జనాలు.. మా బతుకులన్నీ ‘ఎంత పెరిగినా గానీ.. గొర్రెకు బెత్తెడే తోక’ అన్నట్టు. ప్రతిపూటా మా ‘గతిలేనోళ్లకు గంగే పాయసం’. ఎంత చెడ్డా మీరంత ఒక్కటే. ‘ఈత కాయ ఇచ్చినట్టే ఇచ్చి.. తాటికాయ తీసుకుంటరు’. ‘అన్నం పెడితే అరిగిపోతది.. చీరె ఇస్తె చినిగిపోతది.. వాత పెడ్తె కలకాలం ఉంటది’ అని మాకు వాతలు బెడతరు. మీ ధోరణంతా ‘ఆశ గలమ్మ దోషమెరగదూ.. పూటకూళ్లమ్మ పుణ్ణెమెరగదు’లా అందరూ అందరే. అందరూ ఒక్కటే. అందుకే ‘కర్రుగాల్చి వాత పెట్టాలె’. అది ఎవరికి పెడతామో చూద్దురుగానీ. -
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోంది
సాక్షి, జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్లపాలనలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భగేల్ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన స్కాముల ప్రభుత్వంగా తయారైందని పేర్కొన్నారు. జగదల్పూర్, కొండగావ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. ‘రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అర్ధించటానికే మీ ముందుకు వచ్చా. స్కాములకు పాల్పడటం ద్వారా గిరిజనుల డబ్బును దోచుకున్నవారిని తలకిందులుగా వేలాడదీస్తాం’అని ఆయన అన్నారు. బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరిన అమిత్ షా, ‘మీ ముందు రెండు అవకాశాలున్నాయి..ఒకటి నక్సలిజాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్, మరోవైపు ఈ బెడదను నిర్మూలించే బీజేపీ. కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్‌కు పంపే కాంగ్రెస్.. కోట్లాది మంది పేదలకు గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రేషన్, ఇళ్లు అందజేస్తున్న బీజేపీ. ఈ రెండింట్లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు?’ అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దీపావళి పండుగను ఈసారి మూడుసార్లు జరుపుకుంటారంటూ... మొదటిది దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, మూడోది జనవరిలో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక (శ్రీరాముడి మాతామహుల నివాసం ఛత్తీస్‌గఢ్ అని ప్రజల విశ్వాసం)అని అమిత్ షా చెప్పారు. ‘రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తి కలి్పస్తాం. మోదీ ప్రభుత్వ పాలనలో 9 ఏళ్ల కాలంలో నక్సల్ సంబంధ హింస 52% తగ్గగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 62% మేర క్షీణించింది’అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో జరిగే తీవ్రవాద సంబంధ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే పోలీసులైనా, పౌరులైనా, నక్సలైట్లయినా అందరూ గిరిజనులేనని ఆయన చెప్పారు.