Bapatla
-
విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా వెంకట్రావు
బాపట్ల టౌన్: విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా డి. వెంకటరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పనిచేస్తున్న ఆయన బదిలీపై బాపట్ల వచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణలు ఇచ్చే ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా బాపట్ల ఉంటుందని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం చేసే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నతాధికారుల సమన్వయంతో శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
ఆశలన్నీ కడలిపాలు
వేట నిషేధ కాలం ముగిసి ఐదు నెలలు పూర్తయినా టీడీపీ, కూటమి ప్రభుత్వానికి గంగపుత్రుల ఆవేదన మచ్చుకై నా పట్టడం లేదు. సూపర్ సిక్స్‌లో ఒక్కో పథకం కనుమరుగైన విధంగా భరోసా సాయం పథకం కూడా కూటమి ప్రభుత్వం కప్పెట్టేసింది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్యకారులకు వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొంత సాయాన్ని భృతిగా అందజేస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం పథకంపై నీలినీడలు కమ్ముకోవడంతో మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. బతుకు దుర్భరంగా మారింది. చీరాల టౌన్: ‘గంగ పుత్రులంటే నాకు విపరీతమైన ఇష్టం.. ప్రాణాలకు తెగించి వేట సాగిస్తారు.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేట నిషేధ సాయం ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.20వేలు ఇస్తా.. డీజిల్ సబ్సిడీ పెంచుతా. పక్కా ఇళ్లు కట్టిస్తా’ అని చీరాల్లో ఎన్నికలకు ముందు జరిగిన సభలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా నేటికీ వేట నిషేధ సాయం ఇవ్వకుండా మత్య్సకారులకు మొండి చెయ్యి చూపారు. రీ సర్వేల పేరుతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. 2024 జూన్‌లో ఇవ్వాల్సిన నిషేధ సాయం నేటికీ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో 53,000 మంది మత్య్సకారులు కాగా ఇందులో సముద్రంలో వేటకు వెళ్లే వారు 16500 మంది ఉన్నారు. అధికారులు ఇప్పటివరకు సర్వేచేసిన సమాచారం మేరకు భరోసాకు ఈ ఏడాది 12,350 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కేవలం 10.500 మందిని అర్హులుగా నిర్ధారించారు. వీరికి రూ. 20 వేల చొప్పున రూ. 25 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో ఐదేళ్లు క్రమం తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీంతో మత్స్యకారులు అవస్థలు పడకుండా వేట నిషేధ సమయాన్ని గడిపేవారు. పట్టించుకోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పటికి భృతి మంజూరుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే భరోసా సాయం రూ.10 వేల నుంచి రూ. 20 వేలు పెంచుతామంటూ హామీ ఇచ్చింది. దాన్ని నేటికీ అమలు చేయకపోవడంతో మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌దారులు, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందుతున్న వారిని జాబితా నుంచి తొలగిస్తారనే అనుమానాలు మత్స్యకారుల్లో ఉన్నాయి.నేడు అంతర్జాతీయ మత్య్సకార దినోత్సవం ఎన్నికలకు ముందే అలవికాని హామీలు గుప్పించిన చంద్రబాబు, కూటమి నేతలు అధికారం చేపట్టాక వాటి ఊసే లేదు వేట నిషేధం పూర్తయ్యి ఐదు నెలలు దాటినా దక్కని మత్స్యకార భరోసా సాయం ఐదేళ్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వైఎస్. జగన్ సర్కార్ నిధులు విడుదల కాగానే సాయం మత్య్సకారులకు వేట నిషేధ సాయం అందించే భరోసా పథకానికి ఇప్పటికే అర్హులను జిల్లాలో గుర్తించాం. ఆరు నియోజకవర్గాల్లో వివరాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందించాం. మత్య్సకార భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం మాకు రాలేదు. నిధులు విడుదల కాగానే వెంటనే సాయం అందిస్తాం. – పి.సురేష్, డెప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖసముద్రంలో వేట సాగించే మత్య్సకారుల్లో పలువురికి డీజిల్ సబ్సిడీ అందడం లేదు. ఏడాదిలో వేట నిషేధ కాలం రెండు నెలలు మినహాయించి కేవలం 10 నెలలకే డీజిల్ సబ్సిడీ అందిస్తున్నారు. అదికూడా లీటర్‌కు రూ.9లు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని రూ.15కి పెంచి అందరికీ నెలకు 500 లీటర్లు ఇవ్వాలని మత్య్సకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్టర్ బోట్లు ఒక్కోదానికి నెలకు 300 లీటర్లు మాత్రమే డీజిల్ ఇస్తున్నారు. ఇది కేవలం మూడు దఫాలుగా వేట చేసేందుకు ఉపయోగపడుతుందని, తర్వాత వెళ్తే అదనంగా డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు. -
సంక్షామ హాస్టళ్లు
బాపట్ల టౌన్: జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి.మౌలిక వసతులు కరువయ్యాయి. అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. హాస్టళ్లలో విద్యార్థుల వివరాలు ● జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ మొత్తం 27 ఉండాల్సి ఉండగా వాటిల్లో విద్యార్థులు లేక రెండు మూతపడ్డాయి. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న 25 వసతి గృహాల్లో 1662 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ● జిల్లాలో మొత్తం ఎస్టీ వసతి గృహాలు 3, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు 7 చొప్పున మొత్తం 10 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 1084 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ● బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 42 వసతి గృహాలు ఉండగా వాటిల్లో 15 విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం 27 వసతి గృహాల్లో 1170 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వాటిల్లో 8 కళాశాల వసతిగృహాలు, 19 పాఠశాలల వసతిగృహాలు ఉన్నాయి. వసతులు అధ్వానం ● రేపల్లె బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. తలుపులు లేకపోవడంతో విద్యార్ధులు ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎస్సీ బాలుర వసతి గృహంలోని పలు గదుల్లో శ్లాబు పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. కిటికీల వద్ద ఏర్పాటు చేసి ఉన్న సన్ సైడ్లు పూర్తిగా శిథిలం అవ్వటంతో చిన్నపాటి వర్షానికే నీరు గదుల్లోకి చేరుతోంది. పట్టణంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వసతిగృహంలోని కిటికీలకు ఒక్కదానికి కూడా మెస్‌లు లేవు. దీంతో దోమలు విద్యార్థుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.వంటగదిలో చెత్తాచెదారం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వసతిగృహంలో మొత్తం 10 మరుగుదొడ్లు ఉండగా వాటిల్లో ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థులు సైకిళ్లపై కిలోమీటర్ల మేరా బహిర్భూమికి వెళ్తున్నారు. నిజాంపట్నం మండలం శింకపాలెం బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● వేమూరు నియోజకవర్గం చుండూరు బాలుర గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. భట్టిప్రోలులో ఎస్సీ బాలుర వసతిగృహంలో ఫ్యాన్ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు మండలంలో బాలికల సంక్షేమ వసతి గృహంలో తాగునీరు సమస్య ఉంది. వలపర్లలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో శ్లాబునుంచి పెచ్చులూడి పడుతున్నాయి. వసతిగృహం అధ్వానంగా ఉంది. ● చీరాలలోని బీసీ బాలుర వసతి గృహాల్లో ఇన్చార్జ్ వార్డెన్ల పాలన కొనసాగుతోంది. వేటపాలెంలోని బీసీ బాలుర వసతి గృహం రేకుల షెడ్డు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. ● అద్దంకిలోని బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్నాయి. భవనం కిటికీల తలుపులు లేకపోవడంతో వర్షపు జల్లులు పడుతున్నాయి. తాగునీటి సౌకర్యం సరిగాలేదు. సమస్యల చెరలో వసతి గృహాలు విద్యార్థులే వంటమాస్టర్లు, స్వీపర్లు కనీస వసతులు కరువు అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు జిల్లాలో రూ. 3.1 కోట్ల మేర నిలిచిన బకాయిలు అప్పుల ఊబిలో వార్డెన్లు గడిచిన ఆరునెలలుగా వార్డెన్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3నుంచి 6వ తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ. 1150, 6నుంచి10 తరగతిలోపు విద్యార్థులకు రూ. 1400, ఇంటర్ నుంచి డిగ్రీలోపు విద్యార్థులకు రూ. 1600 చొప్పున చెల్లించాలి. జిల్లాలో మొత్తం 3860 మంది విద్యార్థులు వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్నారు. సగటున ఒక్కొ విద్యార్థికి నెలకు రూ. 1300 చొప్పున నెలకు రూ. 50.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలకు గానూ వార్డెన్లకు ప్రభుత్వం రూ. 3.1 కోట్లను ఇవ్వాలి. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బాపట్ల టౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. మండలంలోని సూర్యలంక సమీపంలోని నగరవనంలో బుధవారం కలెక్ట్రేట్ సిబ్బంది ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన నిర్వహించారు. తొలుత కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. ఆయనతో పాటు పలువురు జిల్లా అధికారులు కూడా నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించడంతో పాటు కాపాడాలని తెలిపారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆగస్టు 30 నుంచి వనసమారాధన వరకు విస్తృతంగా మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారని జిల్లా కలెక్టర్ చెప్పారు. రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి ఇప్పుడు నాటే మొక్కలు ఎంతో మేలు చేస్తారని తెలిపారు. ఇప్పటి దాకా అటవీశాఖ ద్వారా 63 వేల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యలంక బీచ్‌లో అందమైన వనం ఏర్పాటు లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులంతా అటవీ ప్రాంతంలో వన భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి భీమయ్య పాల్గొన్నారు. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు ఈనెల 27 వరకు వేటకు వెళ్లొదని, ఇప్పటికే వెళ్లిన వారిని బయటకు రప్పించాలని ఆదేశించారు. వరి చేలను 22 నుంచి 27వ తేదీ వరకు కోయరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ● అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. రెండు అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగానికి ముగ్గురు హాజరు కాగా, 44 ఆయాల ఉద్యోగాలకు 106 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళ శిశు అభివృద్ధి శాఖ పీడీ ఉమా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ● చిన్నారులను దత్తత తీసుకునే విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో దత్తత అవగాహన మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ జె. వెంకటమురళి -
పని చేయకపోతే తొలగిస్తాం
ఆర్అండ్బీ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి బాపట్లటౌన్/చీరాలటౌన్: రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చే విషయంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం గుంతల రహిత కార్యక్రమంపై ఆర్అండ్బీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 337 కి.మీ పొడవైన రహదారులపై 67 పనులను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.17.23 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం 12 పనులే ప్రారంభం కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. మరికొన్ని పనులు టెండర్ దశ దాటి గుత్తేదారులకు పనులు అప్పగించినప్పటికీ ప్రారంభం కాలేదన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు మొదలు పెట్టకపోతే నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసుల జారీచేసినప్పటకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని తక్షణమే తొలగించాలన్నారు. ఆర్అండ్బీ డీఈ గీతారాణి, డీఈ అరుణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కృషి.. ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు. మంగళవారం మండలంలోని ఈపురుపాలెం శేఖరస్వామి పుట్ట సమీపంలోని స్ట్రయిట్ కట్ కాలువ కరకట్టపై నివాసం ఉంటున్న ఎస్టీల (యానాదులు) గృహాలను కలెక్టర్ పరిశీలించారు. గిరిజన సంఘం నాయకుడు దేవరకొండ రాము ఆధ్వర్యంలో 100 మంది యానాదులకు కలెక్టర్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎస్టీల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలిచి అన్ని రకాల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి నెలా నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. డీఎంహెచ్ఓ విజయమ్మ, ఆర్డీఓ టి.చంద్రశేఖరనాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ శివసుబ్రమణ్యం, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వ్యవహరించారు. వీరితోపాటు 14 శాఖల జిల్లాస్థాయి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కొళాయి కనెక్షన్లతో స్వచ్ఛమైన నీటిని ప్రతి ఇంటికి అందించడం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగేలా చూడటం కమిటీ బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.64 లక్షల గృహాలు ఉండగా, 1.48 లక్షల గృహాలకు కొళాయిలు బిగించినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన పనుల్లో 994 పెండింగ్ పనులు చేపట్టడానికి అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణ, మరమ్మతులకు రూ.6.9 కోట్లు నిధులు కావాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కలెక్టర్ ప్రకటించారు. చీరాల, వేటపాలెం మండలాల్లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.160 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ ఆర్డబ్ల్యూ ఎస్ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
వెలుగులో చీకట్లు !
రుణం దక్కిందన్న ఆనందం కాసేపు కూడా నిలవకుండా వచ్చిన దాంట్లో నుంచి కొంతమొత్తం నొక్కేస్తున్నారు. అదేమంటే మీకు రుణం వచ్చేందుకు అక్కడ తిరిగాం.. ఇక్కడ తిరిగాం.. వాళ్లకివ్వాలి.. వీళ్లకివ్వాలి అంటూ దబాయించి మరీ పేద మహిళల నోటికాడ డబ్బులు గద్దల్లా లాగేసుకుంటున్నారు. అడిగితే మళ్లీ రుణాలిప్పిస్తారో లేదో అంటూ భయపడుతూ.. వారి అడిగినంత ముట్టజెపుతూ కిమ్మనకుండా ఉంటున్నారు గ్రామీణ మహిళలు. డ్వాక్రా మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని రుణానికింతని రేటు కడుతూ అడ్డంగా దోచేస్తున్నారు మండలంలోని కొందరు వీఓఏలు. వెలుగు పథకంలో వసూళ్ల పర్వంచీరాల టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ప్రభుత్వం వెలుగు పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా 10 మంది మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని 6 నెలల పాటుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటే తర్వాత మండల వెలుగు అధికారులు గ్రూపునకు మొదటగా రూ.50 వేలు రుణం అందిస్తారు. అనంతరం గ్రూపు పనితీరు మెరుగుపర్చుకుని రూ.5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణం తీసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీఓఏ) కొందరు రుణం దక్కాలంటే నగదు వసూళ్లు చేస్తున్నారు. చీరాల మండలంలోని గ్రామాల్లో ఉన్న వీబీకేలు చేస్తున్న వసూళ్లలో అధికారుల పాత్ర కూడా అధికంగా ఉందని గ్రామాల్లోని పొదుపు మహిళలు విమర్శిస్తున్నారు. ఒక్కో రుణానికి ఒక్కో రేటు... గ్రామాల్లోని వీఓఏలు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. రూ.50 వేల రుణం మంజూరుకు ఒక్కో పొదుపు మహిళ నుంచి రూ.200 చొప్పున రూ.3 వేలు వసూళ్లు చేస్తున్నారు. రూ.లక్ష రుణానికి ఒక్కో మహిళ నుంచి రూ.500 చొప్పున రూ.5 వేలు, రూ.3 లక్షల రుణానికి రూ.600 చొప్పున రూ.6 వేలు, రూ.4 లక్షల రుణానికి రూ.8 వేలు, రూ.5 లక్షల రుణానికి ఒక్కో మహిళ నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. రూ.20 లక్షల రుణం తీసుకునే పొదుపు మహిళా గ్రూపు నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల చొప్పున రూ.20 వేలు వసూలు చేస్తూ పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా మలుచుకుని వీఏఓలు దోచుకుంటున్నారు. ఇలా మండలంలోని గ్రామాల్లో బ్యాంకు లింకేజీ రుణం వచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, వారి ఖర్చులు కూడా ఉంటాయని ప్రచారం చేస్తూ పొదుపు మహిళల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.20లక్షల వరకు వసూలు..! చీరాల మండలంలోని పొదుపు గ్రూపుల్లోని మహిళల వద్ద నుంచి సగటున ఏడాదికి గ్రూపు చెల్లింపుల కాలానికి వీఏఓలు అధికారుల సాయంతో రూ.20 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని సమాచారం. అధికారులు తమకు రుణం అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా తమకు రుణం వచ్చినందుకు ప్రతిసారి వీఏఓలకు చెల్లింపులు చేస్తున్నామని పొదుపు మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు వీఏఓ లాంటి మధ్యవర్తుల సాయంతో రూ.లక్షలు సొమ్ము చేసుకోవడం దారుణమని పలువురు వ్యాఖ్యా నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు గ్రామాల టీడీపీ నాయకుల పాత్ర కూడా ఉందని ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. రుణం దక్కాలంటే..రొక్కం ఇచ్చుకోవాల్సిందే రుణం మంజూరుకు నగదు వసూళ్లు చేస్తున్న కొందరు వీఓఏలు అధికారుల అండతోనే గ్రామాల్లో వసూళ్లు! రుణానికింతని ధర నిర్ణయిస్తున్న వైనం1948 గ్రూపులు.. 19,480 మంది మహిళలు... చీరాల మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో వెలుగు పథకంలో 1948 మహిళా పొదుపు గ్రూపులు ఉండగా 19,480 మంది పొదుపు మహిళలు ఉన్నారు. ఈ గ్రూపులకు 2024లో గడిచిన 7 నెలలకు 592 గ్రూపులకు రూ.30.50 కోట్లు బ్యాంకు రుణాలను అందించారు. సీ్త్ర నిధి రూ.5.50 కోట్లు, ఉన్నతి పథకంలో రూ.30 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల మేర బ్యాంకు లింకేజీ రుణాలను పొందుతున్న గ్రూపులు అనేకం ఉన్నాయి. చీరాల మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలైన ఈపూరుపాలెంలో 475, వాడరేవులో 259, దేవాంగపురిలో 345, గవినివారిపాలెంలో 326, తోటవారిపాలెంలో 270తో పాటుగా మిగిలిన మైనర్ పంచాయతీల్లో పొదుపు గ్రూపులు అనేకం ఉన్నాయి. పొదుపు సంఘాలకు నెలవారీగా సమావేశాలను నిర్వహించడంతో పాటుగా గ్రూపుల పుస్తకాలను నిర్వహించేందుకు గ్రామ సంఘాలకు వీఓఏలను మండలంలో 56 మందిని నియమించారు. పొదుపు గ్రూపులకు నెలనెలా మీటింగులు, పుస్తకాల్లో నమోదులు, రుణం పూర్తి అయిన గ్రూపులకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయించడం వీరి పని. కానీ వీరు చేస్తున్నది మాత్రం రుణాల మంజూరుకు వసూళ్లు అని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. వెలుగు ఏపీఎం ఏమన్నారంటే.... ఈవిషయమై మండల వెలుగు పథకం ఏపీఎం మధుబాబును వివరణ కోరగా.. గ్రామాల్లోని వీఏఓలకు పొదుపు గ్రూపులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి ప్రభుత్వం జీతాలు కూడా ఇస్తుందని, రుణం వచ్చిన ప్రతిసారీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా వీఏఓలు పొదుపు గ్రూపుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తే ఫిర్యాదు చేయవచ్చని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీఏఓల వసూళ్ల గురించి వెలుగు అధికారులకు ఫిర్యాదులు రాలేదని తెలిపారు. -
ధాన్యం కొనుగోలుకేంద్రం ప్రారంభం
అమర్తలూరు(వేమూరు): కోతలు మొదలైనా ప్రభుత్వం ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఈనెల 18న ‘కోత మొదలైంది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వ్యవసాయ అధికారులు స్పందించారు. మంగళవారం అమర్తలూరు మండలంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. మండలంలోని కూచిపూడి, యడవూరులో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారి ఉయ్యూరి లోకేశ్వరి ఈమేరకు తెలిపారు. రైతులకు ప్రభుత్వం రూ.1740 మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి టి.శ్రీకాంత్, వ్యవసాయ సహాయకులు కె.తిరుపతిరావు, ఎ.శ్రీవల్లి, రైతులు పాల్గొన్నారు. 24న మహిళా కబడ్డీ జట్టు ఎంపిక నరసరావుపేట ఈస్ట్: గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 24న కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, అసోసియేషన్ కార్యదర్శి మంతెన సుబ్బరాజు మంగళవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న 71వ అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు 9502925925 నంబరును సంప్రదించాలని కోరారు. వీర్ల అంకాలమ్మకు వెండి మకరతోరణం దాచేపల్లి : స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లికి దాచేపల్లికి చెందిన దేవరశెట్టి బాలాంజనేయులు కుమారుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ10 లక్షల విలువ చేసే వెండి మకర తోరణం తయారు చేయించి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. దాత నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేసి మకర తోరణంతో అంకమ్మ తల్లిని అలంకరించారు. కమిటీ సభ్యులు దాత కుటుంబ సభ్యులను సన్మానించారు. 3 మార్కెట్ యార్డులు, 42 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు నరసరావుపేట: పత్తి కొనుగోలుకు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని మూడు మార్కెట్ యార్డులు, 42 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని విజయవాడ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు కె.సూర్యప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024–25 ఏడాదికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7521గా నిర్ధారించినట్టు వివరించారు. పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో ఆరపెట్టుకొని రావాలని రైతులకు సూచించారు. ఈ కేంద్రాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయన్నారు. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేయవని పేర్కొన్నారు. రామలింగేశ్వరునికి అన్నాభిషేకం నగరంపాలెం: స్థానిక మల్లారెడ్డినగర్ అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీపర్వత వర్దిని సమేత శ్రీరామలింగేశ్వరస్వామికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీగణపతి సహిత రుద్ర హోమం చేశారు. కార్యక్రమాలను చంద్రశేఖరశర్మ, శివకుమార్‌శర్మ చేపట్టారు. మహా హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఎంకేఆర్ ఫౌండషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వంట ఏజెన్సీ నిర్వాహకురాలు ఆత్మహత్యాయత్నం
చీరాల అర్బన్: మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీని రద్దు చేయడంతో మనస్తాపం చెందిన ఏజెన్సీ నిర్వాహకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పుష్పలత మంగళవారం పాఠశాలలో చీమల మందు నీళ్లలో కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన హెల్పర్ పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స అందించారు. ఈ సంఘటనపై ఆమె భర్త కిషోర్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నామన్నారు. అయితే కొద్ది నెలలుగా ఏజెన్సీ నిర్వహణ బాగాలేదంటూ ఏదో ఒక కారణంతో తమను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యార్థుల చేత తప్పుడు ఫిర్యాదు చేయించి ఏజెన్సీని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా నోటీసు ఇవ్వడంతో వివరణ ఇచ్చామన్నారు. ఏజెన్సీ రద్దుకు పేరెంట్స్ కమిటీ ఆమోదం తెలిపారంటూ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేస్తున్నామని మంగళవారం హెచ్ఎం చెప్పారని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఈ విషయమై స్కూల్ హెచ్ఎం కృష్ణమోహనరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషి విధుల్లో నిర్లక్ష్యంగా ఉందని, ఆమెను తొలగిస్తూ మండల విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. భోజనం నాణ్యతగా ఉండడం లేదంటూ గతంలో రెండు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయినా ఎలాంటి మార్పు లేనందున తొలగిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులను ఆమెకు ఇవ్వగా తన భర్తతో చెప్పి తీసుకుంటానని చెప్పి వెళ్లిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెను తొలగించామన్నారు. ఏజెన్సీ రద్దు చేయడంతో మనస్తాపం -
అయ్యో.. పాపం
‘‘ఒంటిపై బట్టలేక.. చలికి వెట్టలేక ..ఆకలికి డొక్కలు ఎండిపోతుండగా.. పాలు లేక పెదాలు తడి ఆరిపోతుండగా.. క్యార్.. క్యార్ మంటున్న శిశువు ఏడుపు అరణ్యవేదనగానే మిగిలింది. చలిపులికి గజగజ వణుకుతూ.. రాత్రంతా దోమలు, చీమలు, ఎలుకలకు దేహాన్ని అప్పగించి ఏం చేయలేని.. నిస్సహాయ స్థితిలో ఏడ్చేందుకు సైతం శక్తిలేక మూలుగుతూ పడిఉన్న ఆ శిశువును చూసి చెమ్మగిల్లని కళ్లు లేవు.. వేదనపడని హృదయాలు కానరావు. పేగు బంధాన్ని మరిచి.. బొడ్డుకున్న పేగుతో సహా అలాగే కుప్పతొట్టి పక్కన వదిలేసిన వైనం చూపరులను చలింపజేసింది. కళ్లు తెరిచిన తొలిరోజు తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉంటూ.. ఆకలి తీర్చుకోవాల్సిన శిశువు.. దిగంబరిగా ఉంటూ రాత్రంతా ప్రాణాల కోసం పోరాడడం అందరినీ కలిచివేసింది.’’ సంతమాగులూరు (అద్దంకి రూరల్): అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు పొలాల్లో వదిలేసి వెళ్లిన ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఫత్తేపురం గ్రామంలో మంగళవారం జరిగింది. అటుగా పొలాలకు వెళుతున్న స్థానిక రైతులు పసిపాప ఏడుపు విని పొలాల్లోని వెళ్లి చూడగా ఆడశిశువు అక్కడ ఉంది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ పట్టాభిరామయ్య వివరాలు సేకరించారు. ఆ పసిపాపను సంరక్షించి పాపకు వైద్యం చేయించేందుకు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి స్థానికుల సమాచారంతో వైద్యశాలకు చేర్చిన పోలీసులు -
నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి
తెనాలి : అద్వైత పీఠాల్లో అత్యంత ప్రశస్తమైన శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీస్వామి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో విజయవాడలో బస చేశారు. 20, 21వ తేదీల్లో నరసరావుపేట, 22, 23వ తేదీల్లో గుంటూరులో ఉంటారు. చిన్న వయసులోనే శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వామి శ్రీశృంగేరీ పీఠానికి తదుపరి 37వ జగద్గురువులని తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాతో స్వామికి అనుబంధం ఉంది. తెనాలి సమీపంలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనంతవరం వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి, కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని. వేదాలు, వేదభాష్యంలో ప్రఖ్యాత పండితుడైన శివసుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని టీటీడీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌గా, ఎస్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ వేదిక్ స్టడీసీ, టీటీడీ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్నారు. వీరి రెండో కుమారుడు వెంకటేశ్వరప్రసాద శర్మ. 1993 జులై 24న తిరుపతిలో జన్మించారు. అయిదేళ్ల వయసులోనే కుమారుడికి ఉపనయనం చేయించారు. కృష్ణ యజుర్వేదమే తొలి పాఠం... తాత కృష్ణ యజుర్వేద పాఠాలే తొలి అభ్యాసం. తండ్రి వద్ద కృష్ణ యజుర్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. కుప్పా వంశీకులు హంసల దీవిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక భాగవత సప్తాహాలు జరుపుతుంటారు. వేద విద్యలో కొనసాగుతున్న ప్రసాద శర్మ, ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటూ, తండ్రితో కలిసి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ సందర్శించారు. 2006లో శృంగేరీ శారదా పీఠంలో తాత, తండ్రితో కలిసి ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో శృంగేరీ పీఠం జగద్గురును దర్శించుకున్నపుడు స్వామి శిష్యరికంలో శాస్త్రాలు నేర్చుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. జగద్గురు బోధనలతో... ఆ విధంగా శృంగేరీ జగద్గురు అనుగ్రహానికి 22 ఏళ్ల వయసులోనే నోచుకున్నారు. న్యాయ, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలను, అక్కడి ఉద్దండ పండితుల వద్ద సంస్కృతం, కవిత్వం, సాహిత్యం తదితరాలను అధ్యయనం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే అపార పాండిత్యం గడించారు. ఆయా శాస్త్రాలను అధ్యయనం చేసిన కాలంలో అనుష్టానం, తపస్సు మినహా లౌకికమైన విషయాల్లో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆయన ప్రతిభను గ్రహించిన జగద్గురు తానే స్వయంగా శాస్త్రాలను బోధించారు. దీంతో తర్కశాస్త్ర పండితుడుగా అవతరించారు. ప్రతిష్ఠాత్మక వ్యాక్యార్థ విద్వత్ సభలు, ఏటా జరిగే జాతీయ శాస్త్ర పండితుల సభల్లోనూ తన ప్రసంగాలతో అందరినీ ఆశ్చర్యపరచ సాగారు. తర్వాత మీమాంస శాస్త్రం నేర్చారు. వేదాంతం నేర్చుకుంటూనే విద్యార్థులకు తర్కం, మీమాంస, వ్యాకరణశాస్త్రం బోధించసాగారు. తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి, కుప్పా శివసుబ్రహ్మణ్య అవధానితో.. చిన్న వయసులోనే సన్యాస దీక్ష... విద్యార్జనలో అసాధారణ ప్రజ్ఞ చూపిన వెంకటేశ్వర ప్రసాద శర్మకు అరుదైన గౌరవం లభించింది. 2019 జనవరి 22, 23వ తేదీల్లో శృంగేరీలోని తుంగానదీ తీరంలో శారదాదేవి ఆలయ సమక్షంలో యోగ పట్టాను, సన్యాస దీక్షను శ్రీభారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా స్వీకరించారు. శ్రీవిదుశేఖర భారతీస్వామిగా నామకరణం చేసి, తదుపరి 37వ జగద్గురుగా నిర్ణయించి ఉత్తరాధికారిగా నియమించారు. పీఠం చరిత్రలో ఈ పదవిలో నియమితులైన పిన్న వయస్కుల్లో వీరిని రెండో వారుగా చెబుతారు. పీఠం నియమాల ప్రకారం శ్రీభారతీ తీర్థ మహాస్వామి ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దక్షిణ భారతదేశ శోభాయాత్రలో పాల్గొన్నారు. అతి చిన్నవయసులోనే దక్షిణ భారతదేశంలో పూర్తిగా సంచరించి, ప్రజలకు స్వధర్మ ఆచరణ వైశిష్ట్యాన్ని వివరిస్తూ, ధర్మాచరణ ఆవశ్యకతను బోధించారు. శోభాయాత్రలో భాగంగా నాడు తెనాలినీ సందర్శించారు. మళ్లీ ఇప్పుడు ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటను విచ్చేసిన భారతీస్వామి ఉమ్మడి గుంటూరు జిల్లాకు వస్తున్నారు. గుంటూరు జిల్లాతో శ్రీవిదుశేఖర భారతీ స్వామీజీకి ప్రత్యేక అనుబంధం శ్రీవిదుశేఖర భారతీ స్వామి పెద్దలకు 1961 నుంచి శృంగేరీ పీఠంతో అనుబంధముంది. అప్పట్లో 35వ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వచ్చినపుడు, వీరి తాత సోదరుడు బైరాగిశర్మ స్వాగతం పలికి పాదపూజ చేశారు. 1985లో శృంగేరీ పీఠాధిపతికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. వీరి మరో తాత కుప్పా వెంకట చలపతి యాజీ 2002లో పీఠాధిపతి అనుమతితో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన సోదరుడు కుప్పా రామ గోపాల వాజపేయీ కృష్ణ యజుర్వేద పండితుడు. శృంగేరీ జగద్గురు భక్తుడు. ఆ క్రమంలోనే శ్రీవిదుశేఖర భారతీస్వామి తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని జగద్గురు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో చదివారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై నిరంతరం అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మా టాయ్‌లెట్– మా గౌరవం‘ నినాదంతో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10వ వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా లిక్విడ్ వేస్ట్ నిర్వహణకు వ్యక్తిగత సోప్ పిట్లు, కమ్యూనిటీ సోప్ పిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. గో వ్యర్థాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్ పనులు సక్రమంగా అమలు చేయాలన్నారు. రోజూవారీ కార్యక్రమాల అమలును జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఓ సాయి కుమార్, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, డీఎంహెచ్ఓ డీఐఓ డాక్టర్ శ్రావణ్ కుమార్, సర్పంచ్‌లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీ : డ్రైవర్ మృతి
చేబ్రోలు: ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీ కొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పొన్నూరు ప్రాంతానికి చెందిన మినీ లారీ డ్రైవర్ బండారుపల్లి శ్రీనివాసరావు (42) పనుల నిమిత్తం మినీ లారీలో విజయవాడ వెళ్లాడు. తిరిగి పొన్నూరు వైపు మంగళవారం రాత్రి వస్తుండగా నారాకోడూరు గ్రామ శివారులో ఎదురుగా ఆర్టీసీ బస్సు వచ్చింది. రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించాడు. ఆర్టీసీ బస్సులోని పది మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో పొన్నూరు, గుంటూరు వైపు కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు ప్రాంతానికి చెందిన కందుకూరి గురుబ్రహ్మాచారి, డి.బుజ్జి, నారాకోడూరుకు చెందిన మధుసూదనరావు తదితర క్షతగాత్రులను 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
కష్టపడే తత్వం అలవర్చుకోవాలి
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ బాపట్లటౌన్ /కారంచేడు: కష్టపడే తత్త్వాన్ని అలవర్చుకున్నప్పుడే లక్ష్యాలు సాధించగలమని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నగదు బహుమతులు, ధ్రువపత్రాలను అందజేశారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలు చొప్పున అందించామన్నారు. పోలీస్ సిబ్బంది విభాగంలో విజేతలు వీరే.. బాపట్ల ఐటీ కోర్ విభాగంలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఐ.కీర్తి ప్రథమ బహుమతి సాధించారు. వేమూరు పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ గాస్పెల్ జ్యోతి ద్వితీయ బహుమతి, కారంచేడు పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగతులసి తృతీయ బహుమతి సాధించారు. విద్యార్థి విభాగంలో.. వేమూరు మండలం పెరవలి గ్రామంలోని సీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని బండారు ధను శ్రీ ప్రథమ బహుమతి, చీరాల కొత్త పేటలోని బి.ఆర్.కె హైస్కూల్ విద్యార్థి ఎన్.లక్ష్మీసాయి రాహుల్ ద్వితీయ, మార్టూరులోని శ్రీ శ్రీనివాస హైస్కూల్ విద్యార్థిని పి.సాయి కీర్తి తృతీయ బహుమతి సాధించారు. వెల్ఫేర్ ఆర్.ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైద్యులకు సేవాభావం అవసరం
పెదకాకాని: రోగులకు సేవాభావంతో వైద్యులు సేవలు అందించాలని ఢిల్లీలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రితూ దుగ్గల్ అన్నారు. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు సిబార్ దంత వైద్య కళాశాలలో మంగళవారం 24వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. కళాశాల డీన్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా భారతీయ దంత వైద్యమండలి మెంబర్ డాక్టర్ పి. రేవతి హాజరయ్యారు. డీన్ మాట్లాడుతూ.. కళాశాల కృషి, విద్యార్థుల ప్రతిభ తదితరాలను వివరించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ రితూ దుగ్గల్ మాట్లాడుతూ.. కళాశాల జీవితం ఎంతో మధురమైనదన్నారు. ఇక్కడే జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు. మంచి వైద్యులుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను మరవరాదని సూచించారు. 95 మంది విద్యార్థులు బీడీఎస్ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమములో కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి.కృష్ణమోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ రమణారెడ్డి, వైస్ డీన్లు డాక్టర్ ఎం.ప్రకాష్, డాక్టర్ బి.నగేష్ పాల్గొన్నారు. -
హత్యకేసులో నిందితుల అరెస్టు
గురజాల రూరల్ : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం హయత్ నగర్ మండలం కుట్లురు గ్రామవాసి మహమ్మద్ షరీఫ్ మృతదేహం ఈనెల 12న అంబాపురం–గోగులపాడు గ్రామాల మధ్య పంట కాలువలో లభించింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్యగా భావించి విచారణ చేచేపట్టారు. ఎస్పీ కంచిశ్రీనివాసరావు ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. విచారణలో గురజాల మండలం పాత అంబాపురం గ్రామానికి చెందిన ఆనం అంకిరెడ్డి పొలాలకు షరీఫ్ కూలీలను తీసుకు వచ్చేవాడని, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు రూ.లక్ష కోసం ఒత్తిడి చేస్తుండడంతో విసుగుచెంది ఈనెల 11న రాత్రి ఆనం అంకిరెడ్డి, అతని భార్య ఆనం సైదమ్మతోపాటు అదే గ్రామానికి చెందిన కసుకుర్తి సంసోన్ సాయంతో పథకం ప్రకారం మొద్దు కత్తితో షరీఫ్ తలపై కొట్టి, మెడపై కాలుతో నొక్కి హత్య చేసినట్టు తేలింది. అనంతరం మృతదేహాన్ని గోనెసంచుల్లో చుట్టి, ఆర్థరాత్రి సమయంలో పంట కాలువలో పడవేసి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులు హత్య గురించి తెలుసుకున్నట్టు పసిగట్టిన నిందితులు పారిపోయేందుకు యత్నిస్తుండగా గ్రామంలోని పాత రైసుమిల్లు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులను కోర్టుకు హజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పి.భాస్కర్‌రావు, ఎస్ఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడలూ ముఖ్యమే గుంటూరు రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. మంగళవారం నగర శివారు లాం నందున్న కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న అంతర కళాశాలల పురుషులు, మహిళల చదరంగం పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మంగళవారం 6 టీమ్‌లు పాల్గొన్నాయని, బుధవారం ఫైనల్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
24న యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ సభలు
గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ 17వ జిల్లా స్వర్ణోత్సవ సభలను ఈ నెల 24న గుంటూరులోని ఎన్జీవో కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. ఆదిలక్ష్మి, ఎం. కళాధర్ తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం మహాసభల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే బడులు బాగుపడతాయని, ఆ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. మహాసభల సందర్భంగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉదయం స్వర్ణోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎండీ దౌలా, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి. వెంకటేశ్వరరావు, ఎం. గోవిందయ్య, అడవి శ్రీనివాసరావు, కె. ప్రేమ్‌కుమార్, ఎం. కోటిరెడ్డి, కె. ప్రభూజీ తదితరులు పాల్గొన్నారు. -
‘పనివేళల పెంపు’ నిలుపుదల చేయాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు బాపట్లటౌన్: పాఠశాలల పనివేళల పెంపు ప్రయోగం వెంటనే నిలుపుదల చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని జిల్లా ఎస్టీయూ కార్యాలయంలో మంగళవారం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉన్నత పాఠశాలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల పనివేళల్లో మార్పు చేస్తూ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలన్న నిర్ణయాన్ని సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో పలురకాల వర్క్‌షాపులు, ఆన్లైన్ పనుల వంటి బోధనేతర పనులు, రెసిడెన్షియల్ శిక్షణలతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, మొదటి దశగా బోధనకు ఆటంకం కలిగిస్తున్న యాప్‌లను ను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రం అమలు చేయని ఈ సరికొత్త పనివేళల మార్పు ప్రయోగం ఇక్కడ అమలు చేయడం సమంజసం కాదన్నారు. ఆర్థిక కార్యదర్శి బొంత వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పి.వి.నాగరాజు, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్బీ సుభాని, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల రక్షణ చట్టాల అమలు కీలకం
నగరంపాలెం: బాలల రక్షణ చట్టాలను అమలు పరచడంలో ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎ.ఎస్.బి.జి.పార్థసారథి అన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం మండల, మున్సిపల్ స్థాయిలో బాల్య వివాహ నిషేధ అధికారులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా మహిళాశిశు అభివృద్ధి సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమన్వయంతో కార్యక్రమం ఏర్పాటైంది. అధ్యక్షత వహించిన సంస్థ కార్యదర్శి టి.లీలావతి అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధం చట్టం గురించి జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ విజయ్‌కుమార్ వివరించారు. జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ నోడల్ అధికారిణి వాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం న్యాయ, పర్యవేక్షణాధికారిణి బి.వాసంతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
వీఓఏల తొలగింపు సరికాదు
రేపల్లె రూరల్: వీఓఏల అక్రమ తొలగింపులను నిలుపుదల చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ ధ్వజమెత్తారు. వీఓఏ యానిమేటర్ల అక్రమ తొలగింపులకు నిరసనగా పట్టణంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే మండలంలో ఎనిమిది మందిని నోటి మాట ద్వారా బలవంతంగా అక్రమ తొలగింపులు చేశారన్నారు. గ్రామైక్య సంఘాలు, గ్రూపుల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా తొలగించటం అన్యాయమన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏపీఎం గోపీకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు కె.గోపీ, కె.ఆశీర్వాదం, రేపల్లె మండలం ఐకేపీ వీఓఏ యానిమేటర్లు గడ్డం జయలక్ష్మి, రోజామణి, జయశ్రీ, విజయ, సుకన్య, నాగలక్ష్మి, స్వాతి, అనురాధ పాల్గొన్నారు. -
జొన్నలగడ్డలో చైన్ స్నాచింగ్
నరసరావుపేట రూరల్: మండలంలోని జొన్నలగడ్డలో మంగళవారం చైన్‌స్నాచింగ్ జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలోని గొలుసును తెంచుకుని పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. నల్లపాటి విజయమ్మ గ్రామంలోని గాంధీ బొమ్మసెంటర్లోని వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న సమయంలో యువకుడు వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని అడిగాడు. నీళ్లు ఇచ్చే యత్నంలో ఉన్న విజయమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును యువకుడు లాక్కొని సమీపంలో ద్విచక్రవాహనంపై సిద్ధంగా మరో యువకుడితో కలిసి పరారయ్యాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తాడేపల్లి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద మంగళవారం గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్ధానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ కోటయ్య సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉన్నాయని, బహుశా కెనాల్లో స్నానానికి దిగి మృతి చెంది ఉండవచ్చని ఆయన అన్నారు. మృతదేహాన్ని గుర్తిస్తే 08645–272186 లేదా 86888 31355 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
22 నుంచి ‘డీఆర్ఎం కప్’ క్రీడా పోటీలు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధి గుంటూరు రైల్వే డివిజన్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిజస్టర్డ్ ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు రెండో విడత డీఆర్ఎం కప్ టోర్నమెంట్‌ను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్ఎం ఎం.రామకృష్ణ పట్టాభిపురంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరులకు తెలిపారు. 20వ తేదీలోగా జట్ల పేర్ల నమోదు చేసుకోవాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, నల్గొండ, యాదాద్రి జిల్లాల వారు మాత్రమే అర్హులని చెప్పారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు ఉంటాయని, పాల్గొనే వారు ఆధార్ కార్డు తీసుకురావాలని కోరారు. తర్వాత కప్ పోస్టర్‌ను విడదల చేశారు. వివరాలకు సీహెచ్ విజయకుమార్ 97013 79911, వై.శ్రీనివాసరావు 934778 5888, 76750 84888 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. ఏడీఆర్ఎం కె.సైమన్, సీనియర్ డీఓఎం, షహబాజ్ హనూర్, ప్రదీప్‌కుమార్, దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
చినగంజాం: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రాజుబంగారుపాలెం గ్రామానికి చెందిన ఆట్ల సందీపిక ఎంపికై ంది.రాజుబంగారుపాలెం జెడ్పీహెచ్ఎస్లో ఏడోతరగతి చదువుతోన్న సందీపక ఈనెల 15,16,17 తేదీల్లో నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన 38వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ తైక్వాండో పోటీల్లో పాల్గొని 41 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన సందీపికను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సందీపిక ఈ నెల 29,30 తేదీల్లో హరియాణా రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొనున్నట్లు పాఠశాల హెచ్ఎం ఎన్.ఖాలీషావలి తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం సందీపికను పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ఎస్వీ పోతురాజు, ఎస్.అంకయ్య, బి.శ్రీనివాసరావు, పి.శ్రీలక్ష్మి, కోచ్‌లు వాటుపల్లి సుబ్రహ్మణ్యం, సుల్తాన్బాషాలు అభినందించారు. -
బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌లో ఓ బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి పోలీసులు దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... డోలాస్‌నగర్ గాంధీనగర్ సమీపంలోని ఓ వ్యక్తి నివాసానికి పెదవడ్లపూడికి చెందిన నాంచారయ్య అనే వృద్ధుడు తరచు వస్తుంటాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ వ్యక్తి కుమార్తెను లోపలకు లాక్కెళ్లాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక తెలివిగా వ్యవహరించి అతడి నుంచి తప్పించుకోవడంతోపాటు నాంచారయ్య అసభ్య ప్రవర్తనను సెల్లో బంధించి తల్లిదండ్రులకు ఇచ్చింది. వారు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నాంచారయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు. పెదవడ్లపూడి నుంచి వచ్చి ప్రతిరోజు నులకపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నాంచారయ్య తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆశ చూపి పలువుర్ని లొంగదీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యలు ఎన్నో చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లను తన పేరిట రాయించుకుని, కొంతకాలం అనంతరం వారిని తన రాజకీయ పలుకుబడితో ఖాళీ చేయించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నులకపేట, బాబూ జగ్జీవన్‌రావు కాలనీ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇలా రాయించుకున్న ఇళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు -
150 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు
జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బాపట్లటౌన్: జిల్లాలో 150 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ 2024–25 ఖరీఫ్‌కు సంబందించి జిల్లాలోని 300 రైతు సేవ కేంద్రాలను 150 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్–ఏ రకానికి క్వింటాలుకు రూ.2,320, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,300 చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోతాలు వాహనాలలోకి ఎక్కించటానికి కూలీలకు ఇవ్వాల్సిన హమాలి ఖర్చు, మిల్ పాయింట్‌కు చేర్చటానికి అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకవేళ రైతులు ఆ ఖర్చును భరించినట్లయితే, ఖర్చు చేసిన సొమ్ము మొత్తం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు జమచేస్తామన్నారు. ధాన్యం జీపీఎస్ అమర్చిన వాహనాల్లో మాత్రమే రవాణా చేయాలన్నారు. -
మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 51 మంది వీవోఏలను తొలగించారు. జె.పంగులూరు మండంలో మొత్తం 38 మందికి గాను ఇప్పటివరకూ 18 మందిని తొలగించగా అద్దంకి, సంతమాగులూరు మండలాల్లో తొమ్మిది మంది చొప్పున 18 మందిని, మేదరమెట్లలో 8 , బల్లికురవలో 7 మందిని తొలగించారు. ● అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం రేపల్లెలో నగరం మండలంలో 18 మందిని, నిజాంపట్నంలో 11, చెరకుపల్లిలో 13, రేపల్లెలో 7గురిని మొత్తం 49 మందిని తొలగించారు. ● పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో 11 మందిని, యద్దనపూడిలో 9, పర్చూరు 7, చినగంజాం 6,ఇంకొల్లులో 6, కారంచేడులో నలుగురిని మొత్తం 43 మందిని తొలగించారు. ● మాజీమంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలంలో 12 మందిని, భట్టిప్రోలు 7, కొల్లూరు 6, వేమూరు 4, అమృతలూరులో ఒకరిని మొత్తం 36 మందిని తొలగించారు. ● చీరాల, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ కొందమందిని తొలగించినట్లు తెలుస్తున్నా వెలుగు అధికారులు సమాచారం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. అసలు జిల్లాలో ఎంతమందిని తొలగించారో అన్న సమాచారం తమ దగ్గర ఉండదని వెలుగు జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం. విధుల్లో నుంచి తొలగించడంతో పలువురు వీవోఏలు కోర్టునూ అశ్రయించారు.