Krishna
-
బందరులో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
మచిలీపట్నంటౌన్: నగరంలో అతి పెద్ద వ్యాపారసంస్థ సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీతారలు నయన్ సారిక, పాయల్ రాజ్‌పుత్ పాల్గొని సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేసి, సెల్ఫీలతో ఉత్సాహపరిచారు. వీరిద్దరూ జ్యోతిప్రజ్వలన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. అమ్మకాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ, మచిలీపట్నం మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. సీఎంఆర్ ఫౌండర్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను నాలుగు దశాబ్దాలుగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని 37వ షోరూమ్‌ను మచిలీపట్నంలో ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహనబాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 15 వరకు ‘బ్రూసెల్లోసిస్ టీకా’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా.. పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పశువుల నుంచి మనుషులకు సోకే గుణం ఈ వ్యాధికి ఉందని.. పశు వ్యాధుల నియంత్రణ ద్వారా 4 నుంచి 8 నెలల వయసు ఆడ దూడలకు టీకా వేస్తారన్నారు. ఒకసారి టీకా వేస్తే జీవితంలో మరెప్పుడూ వ్యాధి రాదని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్, సీడీవో వెంకటేశ్వరరావు, డాక్టర్ మనోజ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనే
లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బెంజి సర్కిల్లోని సంఘం హాల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వెసులుబాటు వస్తుందని వాహన యజమానులు అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రగతి నుంచి వాహన్‌కు డేటా మైగ్రేషన్‌తో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. నాలుగు నెలల నుంచి ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. రవాణాశాఖ, ఎన్ఐసీ అధికారులు ఎంత చేసినా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని వివరించారు. దీంతో కొన్ని లారీలు నెలల పాటు ఆగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వెహికల్ ఈ ప్రగతిలో స్టాపేజీ వేసి తదుపరి వెహికల్ రీ వోకేషన్ పెట్టుకుంటే నాలుగు నెలల నుంచి ఆ పని కాలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాసిన కేసులు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్లు ఈశ్వరరావు తెలిపారు. ఇలా అనేక సమస్యలు ఉన్నా యని, ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేదీప్యమానం..
మచిలీపట్నంటౌన్: కార్తికమాసం సందర్భంగా రాబర్ట్సన్ పేటలోని శ్రీ పర్వత వర్ధిని రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు వత్తులను వెలిగించి శివనామ స్మరణ చేశారు. ఆలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడి విగ్రహం ముందు కోటి దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొంది. కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, దేవదాయ శాఖ జిల్లా అధికారి సాంబశివరావు, ఈఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 23, 24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం–2025 పై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫొటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 29వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామన్నారు. అందులో ఏమైనా అభ్యంతరాలు, క్లయిమ్‌లు గాని చేయదలచిన వారు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రత్యేక శిబిరాల్లో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవటంతో పాటు చిరునామా, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు బూత్‌స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు వారి బూత్ ఏజెంట్లను కూడా ప్రత్యేక శిబిరాల్లో భాగస్వాములను చేయాలన్నారు. 2025 జనవరి 1వ తేదీన ఓటర్ల జాబితాను పరిశీలించి తాజా సమాచారంతో రూపొందించిన నివేదికను ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపుతామని, అనంతరం జనవరి 6వ తేదీన ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 61,187 దరఖాస్తులు వచ్చాయన్నారు. గతంలో 50 పోలింగ్ కేంద్రాలు ఉండేవని, వీటికి అదనంగా మరో 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తామని, అనంతరం డిసెంబర్ 30వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. బీఎస్పీ ప్రతినిధి బాలాజీ మాట్లాడుతూ హిందూ, హైనీ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 2 వేలకు మించి ఓటర్లు ఉన్నారని, ఇతర పోలింగ్ కేంద్రాలకు మార్చాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డీవోకు సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, షారోన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు జాస్తి
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు సమస్యల నిలయంగా మారాయి. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ చేరిన పేద విద్యార్థులు శిథిల భవనాలు, చాలీచాలని గదుల మధ్య నివసిస్తున్నారు. అధ్వాన మరుగుదొడ్లు, అపరిశుభ్ర వాతావరణం, గదులు, కిటికీలకు డోర్లు లేక దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన ఆహారం కరువైపోవడంతో పాటు కొన్నిచోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినీ విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 83 సంక్షేమ హాస్టళ్లు ఉండగా 4,656 మంది వసతి పొందుతున్నారు. ఇందులో 40 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 2485 మంది, బీసీ సంక్షేమ హాస్టళ్లలో 2171 మంది ఉన్నారు. మొత్తం హాస్టళ్లలో అబ్బాయిలు 2,262 మంది, బాలికలు 2,394 మంది ఉన్నారు. సమస్యల నిలయాలు.. సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయి. గుడివాడ మండలం మోటూరు బాలికల హాస్టల్లో చిన్నారులు భోజనం బాగుండటం లేదని, పురుగులు వస్తున్నాయని, ఈ విషయం చెబితే, గుంజీలు తీయించడంతో పాటు కొడుతున్నారని ఇటీవలే వీడియోలో చెప్పుకున్న ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌తో పాటు పలు హాస్టళ్లలో గదులు, విండోలకు డోర్లు లేవు. దీంతో విద్యార్థులు చలి, దోమలతో ఇబ్బందులు పడుతూ పడుకుంటున్నారు. మచిలీపట్నంలో హాస్టల్లోని టాయిలెట్స్ (మరుగుదొడ్లు, స్నానగదులు)కు డోర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల మంజూరులో జాప్యం కళాశాల విద్యార్థులకు మెస్ బిల్లులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. జూలై నుంచి ఇప్పటి వరకు రూ.లక్షల్లో బిల్లులు ఉన్నా.. రూపాయి కేటాయించలేదు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.52 (మూడు పూటలా తిండి, స్నాక్స్ కలిపి) చెల్లించాలి. ఈ సమస్య బీసీ సంక్షేమంతో పాటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉందని, విద్యార్థులను పస్తులు ఉంచలేక అప్పులు చేసి విద్యార్థులకు పెడుతున్నామని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్లు) చెబుతున్నారు. జిల్లాలో హాస్టళ్లలో పరిస్థితి ఇలా మచిలీపట్నంలోని సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయి. సాంఘిక సంక్షేమశాఖ సమీకృత బాలుర వసతిగృహంలో పడుకునే గదులతో పాటు మరుగుదొడ్లు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ తొలగించారు. ఎస్సీ కళాశాల బాలికల వసతిగృహంలో వసతులు అరకొరగానే ఉన్నాయి. బీసీ కళాశాల బాలికల వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 88 మంది విద్యార్థినిలు ఉండగా వారు నేలమీదే పడుకుంటున్నారు. వీరికి దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. ● అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహం పాత భవనం పూర్తిగా శ్లాబు పెచ్చులూడి ప్రమాదకర స్థితికి చేరింది. విద్యార్థినులు వేరే హాలులోకి వెళ్లి నిద్ర పోతున్నారు. బీసీ బాలుర వసతి గృహం ముందు మురుగు వాసన కొడుతోంది. ఏప్రిల్ తరువాత నుంచి కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం హయాంలో దుప్పటి, బ్లాంకెట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో దుప్పటి ఒక్కటే ఇచ్చి బ్లాంకెట్ ఇవ్వలేదు. నాగాయలంక బీసీ గరల్స్ హాస్టల్లో కొన్ని బాత్రూం డోర్లు విరిగి పోయాయి. కోడూరు ఎస్సీ హాస్టల్లో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. కిటికీలకు డోర్లు లేవు. శ్లాబు పెచ్చులూడి కనిపిస్తోంది. ● పెడనలో బీసీ బాలికల హాస్టల్లో వాష్‌రూమ్స్ సక్రమంగా లేవు. వసతి గృహం శిథిలావస్థకు చేరింది. బీసీ బాలుర వసతి గృహంలో సమస్యలు వెంటాడుతున్నాయి. కళాశాల విద్యార్థుల బీసీ వసతి గృహం అద్దె భవనంలో ఉంది. వర్షం వస్తే నీరు కారుతుందని విద్యార్థులు వాపోతున్నారు. కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం బీసీ హాస్టల్లో రాత్రి ఎవరూ ఉండటం లేదు. ● గుడివాడ మండలం మోటూరు బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో నాసిరకం భోజనం, కంపుకొడుతున్న మరుగుదొడ్లు విద్యార్థినులకు శాపంగా మారాయి. దోమలు, ఈగలతో వారు ఇబ్బంది పడుతున్నారు. ● పెనమలూరులో ఈడుపుగల్లులోని సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. తాగునీరు తగినంత లేదు. ఆరు వాష్ రూమ్స్‌లో రెండు పంపులే పని చేస్తున్నాయి. గొడవర్రు ఎస్సీ బాలికల వసతిగృహంలో శ్లాబు కారుతోంది. ఉయ్యూరులోని ఏపీ గురుకుల వసతి గృహంలో కిటికీలకు మెష్ డోర్లు లేక దోమల ఎక్కువగా ఉన్నాయి. ● గన్నవరంలో సంక్షేమ హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. డైట్ చార్జీలు చెల్లించడం లేదు. టాయిలెట్స్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. బాపులపాడు హాస్టల్ గదులకు తలుపులు, కిటికీలు లేవు. దీంతో దోమల బెడదతో పాటు చలి కాలంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం నాణ్యత లేదని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని నున్నలో ఎస్సీ బాలికల వసతి గృహంలో శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. ● పామర్రులోని బీసీ హాస్టల్లో సక్రమంగా సేవలు అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మొవ్వ మండలంలోని బీసీ ఎస్సీ హాస్టల్లో డైట్ చార్జీలు చెల్లించడం లేదు. కాస్మెటిక్ చార్జీలు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. బెడ్షీట్లు, కార్పెట్లను విద్యార్థులకు అందజేయలేదు. దీంతో కొందరు నేలపైన పడుకుంటుండగా, కొందరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. శిథిలావస్థలో భవనాలు, తలుపులు లేని మరుగుదొడ్లు, ఊడిపోయిన కిటికీలు, అర కొరగా నీటి వసతి, అపరిశుభ్ర వాతావరణంతో సమస్యల నిలయాలుగా కనిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు. ఇక్కడ ఇబ్బందులు ఎదురవడంతో విద్యార్థినీవిద్యార్థులకు ‘వసతి’ అసౌకర్యంగా మారింది. నాణ్యమైన ఆహారం అందకపోవడంతో వీటిలో ఉంటున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సంక్షేమ వసతి గృహాలను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి. నాణ్యమైన భోజనం కరువు టాయిలెట్స్‌కు డోర్లు ఉండవు కళాశాల హాస్టళ్లకు బియ్యం తప్ప బిల్లులు ఇవ్వని ప్రభుత్వంజిల్లా వసతి గృహాల సమాచారం వసతి గృహం వసతి కేటాయించిన ప్రస్తుతం గృహాల సీట్లు విద్యార్థుల సంఖ్య సంఖ్య సాంఘిక సంక్షేమ బాలుర 12 1400 641 బాలికల 19 1900 1067 కళాశాల బాలుర 5 500 344 కళాశాల బాలికల 4 400 433 బీసీ సంక్షేమ బాలుర 19 1900 843 బాలికల 8 800 350 కళాశాల బాలుర 7 700 434 కళాశాల బాలికల 9 900 544 మొత్తం 83 8500 4656 -
పీహెచ్‌సీల నిర్వహణపై శ్రద్ధ చూపండి
వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ వాకాటి కరుణ చిలకలపూడి(మచిలీపట్నం): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం జెడ్పీ సమావేశ హాలులో కలెక్టర్ బాలాజీతో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఇమ్యునైజేషన్ నూరుశాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం గర్భిణులు ఎనిమియా రీడింగ్స్ కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే పటిష్టంగా చేయాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ కొత్త పీహెచ్సీ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. తొలుత జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు క్లస్టర్ల వారీగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, పరీక్షలు ఆమె పరిశీలించారు. సమావేశంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గణపతి, డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి, వైద్యాధికారులు పాల్గొన్నారు. 24న ఉమ్మడి కృష్ణాజిల్లా బాడీబిల్డింగ్ జట్టుకు ఎంపికలు పెనమలూరు: బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనటానికి క్రీడాకారులను ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కానూరు అశోక్ జిమ్‌లో జరగనున్న జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358 ఫోన్లో సంప్రదించాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు బత్తుల మనోహర్, గోల్డ్ ఫిట్నెస్ రాజు పాల్గొన్నారు. ముగిసిన పోలీస్ స్పోర్ట్స్‌మీట్ ఓవరాల్ విన్నర్‌గా ఏఆర్ టీం కోనేరుసెంటర్: జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో రెండు రోజులుగా జరుగుతున్న పోలీస్ స్పోర్ట్స్‌మీట్–2024 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్‌కుమార్ బహుమతులను అందజేశారు. పోటీల్లో కృష్ణాజిల్లా ఏఆర్ టీం ఓవరాల్ విన్నర్‌గా నిలించింది. ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన పోటీలకు జిల్లాలోని అవనిగడ్డ, బందరు, గుడివాడ, గన్నవరం సబ్డివిజన్లకు చెందిన పోలీసు సిబ్బంది హాజరయ్యారు. ఏఆర్ టీం ఓవరాల్ విన్నర్‌గా ట్రోఫీ గెలుచుకోగా వాలీ బాల్లో గుడివాడ సబ్‌డివిజన్ టీం రన్నర్‌గా నిలిచింది. కబడ్డీలో ఏఆర్ టీం విన్నర్‌గా నిలవగా అవనిగడ్డ సబ్‌డివిజన్ రన్నర్‌గా నిలి చింది. ఎస్పీ ఆర్ గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మ, కార్యక్రమంలో ఏఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ టెన్నిస్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టెన్నిస్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వి.రాకేష్ వెంకటేశ్వరచౌదరి(జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజ మండ్రి), జి.విష్ణుసాహిత్ (జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజమండ్రి), సి.హెచ్.ప్రభవ్(ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం), సి.హెచ్. జనార్దన్సాగర్(సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), ఎం.శివకుమార్(ఎన్ఆర్ఐ వైద్య కళాశాల, చినకాకాని) జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. -
పారిశుద్ధ్యంపై అవగాహన అవసరం
కోనేరుసెంటర్:పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరు మండలం చిన్నాపురం ఎంపీపీ పాఠశాలలో అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ‘మరుగు దొడ్లు వాడదాం–పరిసరాలు పరిరక్షిద్దాం‘, మరుగుదొడ్లు వాడదాం– ఆరోగ్యాన్ని రక్షించుకుందాం‘ అంటూ విద్యార్థులు నినాదాలతో గ్రామంలో ర్యాలీగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తగినంత పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల బిలియన్ల మంది ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తేవడానికి ప్రపంచ టాయిలెట్ దినోత్సవం దోహద పడుతుందన్నారు. సురక్షితమైన టాయిలెట్ల సౌకర్యాల ప్రాముఖ్యతను చెప్పడానికి 2013 నుంచి ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఏటా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 10 వరకు వరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ గోపాలరావు, జిల్లా పరిషత్ సీఈవో కన్నమ నాయుడు, పురుషోత్తం, నటరాజ్ తదితరులున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వేలమూరు గ్రామవాస్తవ్యులు కోయ వెంకట గౌరీ రత్నకుమారి రూ. 1,01,116 విరాళంగా ఆలయ సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందజేశారు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ సమక్షంలో ఈ విరాళాన్ని నగదు రూపంలో అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారులు బర్మా ప్రసాద్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్‌రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్‌రోడ్డులో కొండ రాళ్లు జారిపడకుండా రక్షణ చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయి. పనులు వేగవంతంగా చేపట్టేందుకు మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్డులో రాకపోకలను పూర్తిని నిలిపివేస్తామని అధికారులు పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఘాట్‌రోడ్డు మీదగా సాధారణ భక్తులతో పాటు వీఐపీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తులందరూ కనకదుర్గనగర్, మహా మండపం మీదగా లిప్టు, మెట్ల మార్గం ద్వారా అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని క్యూలైన్లలో దర్శనానికి వెళ్లాలని సూచించారు. పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం ఉంగుటూరు: గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, దావాజిగూడెంలో పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ఆత్కూరులో అన్నే సీతారామయ్య జెడ్పీ హైస్కూల్, దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో విద్యావిధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయ బోధన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ఆర్థికవేత్త, టాస్క్ టీమ్ లీడర్ క్రిస్టెల్, దక్షిణ ఆసియా ప్రతినిధి కికో ఇనోయూ, జుంకో ఒనిషి (లీడ్ సోషియల్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లీడర్ ఇండియా), డి.హెచ్.సి. అటూరుపనే (లీడ్ ఆర్థికవేత్త), కార్తిక్ పెంటల్ (సీనియర్ ఎడ్యూకేషన్ స్పెషలిస్ట్), తనుజ్ మథూర్ (సీనియర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్), కన్సల్టెంట్ ప్రియంకా సాహూ, మన బడి మన భవిష్యత్తు జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఏపీఈడబ్ల్యూడీసీ ఎంపీ దివాన్రెడ్డి, డీఈవో రామారావు, సత్త్వాకై వల్య టీచ్ టూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ కోశాధికారి ఎన్.సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తూ గురుకులాలు రూపొందించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామన్నారు. గత వది సంవత్సరాల నుంచి తమ సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నేతలు మల్లిఖార్జున నాయక్, యన్ పరమేష్, యం.విజయ్ కుమార్ నాయక్, జి. బ్రహ్మయ్య, టీచర్లు పాల్గొన్నారు. -
మసకబారిన మత్స్యకారుల సంక్షేమం!
నాగాయలంక: కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం మసకబారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారుల కుటుంబాల్లో ఆవిష్కృతమైన కొత్త వెలుగులు ప్రస్తుతం కనుకరుగమవుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో తొమ్మిది రూపాయల ఆయిల్ సబ్సిడీతో నెలకు 300 లీటర్లు ఇచ్చారు. ఆమేర సబ్సిడీ వరకు తగ్గించి ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్ తీసుకునే సదుపాయం కూడా కల్పించారు. చేపలవేట నిషేధకాలంలో రూ.4 వేలు ఉన్న భృతిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఏకంగా రూ.10 వేలకు పెంచి సకాలంలో సాయం అందించింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ ఏడాది జీవనభృతి నవంబరు వచ్చినా అందకపోవడంపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వేట నిషేధ కాలంలో చెల్లించాల్సిన జీవనభృతి తక్షణం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. దివిసీమలో పరిస్థితి ఇదీ.... దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో సంగమేశ్వరం నుంచి నాలి, సొర్లగొంది, దీనదయాళపురం, పర్రచివర, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఎదురుమొండి, నాగాయలంక, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, హంసలదీవి తదితర గ్రామాల్లో బంగాళాఖాతం, కృష్ణానదిలో అత్యధిక మత్స్యకార కుటుంబాలు నిత్యం చేపలవేట సాగిస్తున్నాయి. దివిసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల కుటుంబాలకు పైగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణానది తీరంలోని నాగాయలంకలో దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం (ఇపుడు శనివారమే ముగుస్తుంది) జరిగే వారపుసంతలో డ్రై ఫిష్ అమ్మకాలు మత్స్యకార మహిళల బతుకు వైవిద్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అవనిగడ్డ డివిజన్ పరిధిలో 17,844.26 ఎకరాల్లో ఆక్వా సాగు (చేపలు, రొయ్యలు, పీతలు) జరుగుతుంటే ఆక్వా జోన్లో 11,362.19 ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 6,554.07 ఉన్నాయి. ఆక్వా జోన్‌లోని 1042ఎకరాలకు ఆక్వా విద్యుత్ యూనిట్‌కి రూ.1.50 ఆక్వా సబ్సిడీ లభిస్తుంది. గత ప్రభుత్వం అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వాలాబ్, మొబైల్ ఆక్వాలాబ్ల ద్వారా మట్టి, నీటి పరీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణానది, డ్రెయిన్లలో వేట సాగించే 1481 మందికి లైసెన్స్‌లు ఇవ్వడం జరిగిందని ఫిషరీస్ అధికారులు తెలిపారు. రికార్డుల మేరకు 1163 బోట్లకు సముద్రంలో వేట సాగిస్తున్నాయి. నవంబరు నెల ముగుస్తున్నా ఇంకా అందని నిషేధ కాలం జీవనభృతి దివసీమ తీరంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడిన 15 వేల కుటుంబాలు రేపు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పటివరకు భృతి అందలేదు వేట నిషేధం ముగిసి ఐదు మాసాలు గడుస్తున్నా ఇంత వరకు భృతి అందించలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవనభృతిని రూ.20 వేలకు పెంచారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తూచ తప్పకుండా ప్రతి ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవాళ్లు. దేశంలోని అన్ని కోస్తా రాష్ట్రాలు నిర్ణీత సమయానికే వేట విరామ భృతి చెల్లిస్తున్నాయి. కానీ ఏపీలో నవంబర్ వచ్చినా భృతి ఇవ్వలేదు. లకనం నాగాంజనేయులు, ఏపీ సంప్రదాయ మత్స్యకారుల సేవా సమతి ప్రధాన కార్యదర్శి ప్రతిపాదన పంపించాం దివిసీమ తీరంలో దరిదాపు 15 వేల కుటుంబాలు ప్రత్యక్ష, పరోక్షంగా మత్స్యపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. 1163 నావలకు ఆయిల్ సబ్సిడీ రూ.9 ఇస్తున్నాం. ఈ ఏడాది 5869 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి 280 ఐస్ బాక్స్‌లు ఇచ్చాం. నాగాయలంక మండలం గుల్లలమోద, సొర్లగొంది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ సీసీఆర్సీఎఫ్ కింద జెట్టీలు, ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటుకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఆర్. ప్రతిభ, మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు -
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి
కనుమూరు(పామర్రు): రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి చెందిన సంఘటన పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కురుమద్దాలి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఆర్ఎంపీ పిడుగు సురేంద్ర(45) విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిలో ఉయ్యూరు వైపు వెళ్తున్నాడు. కనుమూరు చెక్‌పోస్టు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టి వెళ్లి పోయింది. దీనితో సురేంద్ర రహదారిపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎంపీ మృతితో కురుమద్దాలి గ్రామం ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
కంకిపాడులో ఉద్రిక్తత
కంకిపాడు: వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుతో కంకిపాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి సర్కారు ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించటం వివాదాస్పదం అయింది. మంగళవారం చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు ఒ.మోహనరంగా, ఎంపీపీ అనగాని రవి, బిహెచ్ యతీంద్ర రామకృష్ణ (రాము), మేచినేని బాబు, సూరపనేని అనిల్, గొన్నూరి సీమయ్య, గుర్రం నాని, కె.నిరంజన్కుమార్లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదనపు ఎస్పీ వీవీ నాయుడు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సీఐలు, ఎస్ఐలు పోలీసుస్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా పోలీసులు వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు వ్యవహారంలో వ్యవహరించారు. పోలీసుస్టేషన్ రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేసి ఆ వైపుగా ఏ ఒక్కరూ వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశారు. స్టేషన్ తలుపులు మూసి... పోలీసుస్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ మాదిరిగా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు స్టేషన్‌కు తలుపులు వేసి రోడ్డు మీద కాపలా కాయటం విడ్డూరం. అరెస్టయిన వైఎస్సార్ సీపీ నేతలను పరామర్శించేందుకు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు భారీగా చేరుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ రోడ్డులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కమ్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామినేని రమాదేవి స్టేషన్లో ఉన్న తమ నేతలను కలుస్తానని, కాళ్లు పట్టుకుంటా ఒప్పుకోండి అంటూ బతిమాలారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి వణికిపోమని, భయపడేది లేదని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అన్నారు. మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, అనగాని రవి తనయుడు సుందర్ చైతన్య, ఎంపీటీసీ చిట్టూరి ప్రసాద్, నేతలు శీలం రంగారావు, పిడికిటి రామకోటేశ్వరరావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు పరామర్శకు వెళ్లనీయకుండా అడ్డగింత స్టేషన్ రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు -
పెడనలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
పెడన: పెడన బైపాస్ రోడ్‌లోని రైల్వే గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రైలు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలు కిందపడి ఓ వ్యక్తి చనిపోయినట్లు రైలు డ్రైవర్ పెడన రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారన్నారు. వారు రైల్వే పోలీసులకు సమాచారమివ్వవడంతో మచిలీపట్నంకు చెందిన తాను సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టామని చెప్పారు. మృతుడి వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, ఒంటిపై లైట్ గ్రీన్ షర్టు, ఎరుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు వ్యక్తిని ఢీకొందా లేక ఆ వ్యక్తి కావాలని రైలు కింద పడ్డాడా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. -
పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కోనేరుసెంటర్:క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. కృష్ణా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ క్రీడలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. విధుల్లో భాగంగా పోలీసులు ఎన్నో రకాల కర్తవ్యాలు నిర్వహిస్తూ సతమతమవుతూ ఉంటారని చెప్పారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదల సమయంలోనూ పోలీసు అధికారులు ఎంతో సాహసంతో విధులు నిర్వర్తించి ప్రజలను కాపాడేందుకు రిస్క్ తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో స్పోర్ట్స్ మీట్లో పాల్గొనాలని కోరారు. పోలీస్ అంటేనే 365 రోజులు మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ విధులు నిర్వహించడమని తెలిపారు. అటువంటి పోలీస్ సిబ్బందికి క్రీడా పోటీలు మానసిక స్థైర్యాన్ని పెంపొందించి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. స్పోర్ట్స్ మీట్ జరుపుకోవటానికి అవకాశం కల్పించిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌కు కృష్ణాజిల్లా పోలీసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఏఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు సబ్డివిజన్ల అధికారులున్నారు. కృష్ణా జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక వివిధ క్రీడల్లో పోటీల నిర్వహణ -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024u8లో యార్డుకు 43,356 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు వచ్చాయి. 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి.శివయ్యకు అన్నాభిషేకం నాగాయలంక: నాగాయలంక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీరామ లింగేశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లో మంగళవారం యుఎఫ్బీఆర్వో ఆధ్వర్యంలో ధర్నా చేశారు.సాక్షి, మచిలీపట్నం: ‘గూడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవలే పెడన ఎమ్మెల్యేతో తమ సమస్య చెప్పుకొని పరిష్కారం కోసం ఆయన కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న ఓ వ్యక్తి వారిని ఎమ్మెల్యే కంటే ముందుగా అక్కడున్న ఓ పీఏ సార్‌ని కలవమని చెప్పారు. రెండు గంటల తరువాత ఆ పీఏను కలిసే వీలు కాగా.. డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న తమ కుర్రాడికి ఫీల్డ్ అసిస్టెంట్ గానో.. లేదా ఏదో ఓ కాంట్రాక్టు ఉద్యోగం చూపించమని ఎమ్మెల్యేని కలిసి కోరేందుకు వచ్చాం అని చెప్పారు. అయితే, సార్‌ను కలవాల్సిన అవసరం లేదు. నేను ఎంత చెబితే అంత. నేను చెప్పాక సార్ కాదనరు. ఎంత ఇచ్చుకోగలరో చెప్పండి. మీరిచ్చుకునే డబ్బును బట్టి పోస్టు ఉంటుందని చెప్పారు. తాము పేదోళ్లమని చెప్పినా.. పోస్టును బట్టి రేటు ఉంటుందని ఎమ్మెల్యే పీఏ చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు.’ జిల్లాలో పరిస్థితి ఇలా.. ● మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓ పర్సనల్ సెక్రటరీ షాడోగా మారారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు పనులకు సిఫార్సులు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈయనతో పాటు ఓ టీడీపీ సీనియర్ నాయకుడు ఇటీవలే జరిగిన బదిలీల్లో.. కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పోస్టింగ్స్, పలు అంశాల్లో షాడోగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. ● పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వద్ద పనిచేస్తున్న ఓ పీఏ షాడో ఎమ్మెల్యేగా మారినట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తండ్రి కాగిత వెంకటరావు నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో కూడా ఆయన హవా నడిచిందని, ఇప్పుడు తనయుడి వద్ద ఉంటూ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు అనుకుంటున్నారు. ● అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ వారసుడు అన్ని పనులు చక్కబెడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరంగా జరిగే అధికారిక సమావేశాలు, కార్యక్రమాలు, గ్రామసభల్లో పాల్గొనడంతో పాటు అధికారులనే ఇంటికి రప్పించుకుని సమీక్ష జరుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామసభలు, రైతులకు ఎరువులు పంపిణీ, ఇతర పథకాల పంపిణీలో పాల్గొంటున్నారు. ఇటీవలే జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని, కేక్ కట్ చేయించడం చర్చనీయంశంగా మారింది. ● గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి సోదరుడి వరుస అయిన ఓ వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా మారారు. ప్రజా ప్రతినిధి వద్దకు వచ్చే ఉద్యోగులు, ఇతర వర్గాల వారు, జనం ముందు ఆయనను సంప్రదించి, తమ పనులు చెప్పుకోవాల్సి వస్తుందని, ఆయన ఒప్పుకుంటే అన్ని పనులు అయిపోతాయని చెప్పుకుంటున్నారు. ● పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రధాన అనుచరుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉంటూ, ఎమ్మెల్యే కోసం వచ్చిన వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. పనికో రేటు కట్టి, సెటిల్మెంట్ అయిన తరువాత అన్ని పనులు చేయిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. విజయవాడ నగరం మంగళవారం కోలాహలంగా మారింది. శ్రీ శృంగేరి శారదాపీఠానికి మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతిస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివ వచ్చారు. – గాంధీనగర్(విజయవాడసెంట్రల్)7న్యూస్రీల్నగరంలో జగన్నినాదంచిన్నసార్లు పెద్ద పెత్తనం... షాడో ఎమ్మెల్యేలుగా సోదరులు, పీఏలు, అనుచరులు అన్నీతామై చూసుకుంటూ పైరవీలు పనులు, పోస్టింగ్స్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర ఎమ్మెల్యే లెటర్లు, సిఫార్సులు వీరి చెప్పిన వారికే ఇబ్బందులు పడుతున్న జనం కృష్ణా జిల్లాలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల వద్ద ఉంటున్న చిన్న సార్లు పెద్ద పెత్తనం చెలాయిస్తున్నారు. ఎమ్మెల్యేల వద్ద పీఏలుగా ఉన్న వాళ్లు కొందరైతే.. మరి కొంతమంది బంధువులు అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారిని కలిస్తే చాలు.. అన్ని పనులు చేసి పెడుతామంటున్నారని చెబుతున్నారు. పనికో రేటు కట్టి.. డబ్బు వసూలు చేయడంతో పాటు పనులపై హామీ ఇస్తున్నారు. పైగా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి, ఫలానా మనిషిని పంపిస్తున్నాను... ఆయనకు కావాల్సిన పని చేసి పెట్టండి అని హుకుం జారీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. అని తామే అన్నట్లు పెత్తనం చెలాయిస్తూ.. షాడో ఎమ్మెల్యేగా మారినట్లు చర్చ జరుగుతోంది. దీంతో పనులు కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల మంగళవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం నగరానికి చెందిన చలువాది ఓంప్రకాష్ స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2021లో తమతో పాటు కుటుంబ సభ్యులకు హెల్త్ పాలసీని తీసుకున్నారు. 2023లో ఓంప్రకాష్‌కు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి హెర్నియా ఆపరేషన్ చేయించుకోవటంతో రూ.63,256 ఖర్చు అయ్యింది. ఈ మొత్తాన్ని క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా హెర్నియా ఆపరేషన్‌ను తమ పరిధిలో లేని ఆస్పత్రిలో చేయించారని క్లయిమ్‌ను తిరస్కరించారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్ సభ్యులు ఓంప్రకాష్ కు రూ.58,714 లు బీమా మొత్తాన్ని 2023 సెప్టెంబరు 13వ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు రూ.15 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఉయ్యూరు: ఉయ్యూరు పుల్లేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఉయ్యూరు పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటరులో వంతెన వద్ద స్థానికులు కాలువలో మృతదేహాన్ని గుర్తించి, తమకు సమాచారం అందించారన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించమని చెప్పారు. మృతుడు వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు, నలుపు రంగు గళ్ల చొక్కా, జీన్స్ నిక్కరు ధరించి, 5.3 అడుగులు ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి వివరాలకు ఉయ్యూరు పట్టణ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ శేషగిరిరావు, సలహాదారు ఎం.తిరుపతిరావు ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని)ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్కు సంబంధించి అధికారుల సమగ్ర పరిశీలన అనంతరం 2019లో ఒక సర్క్యులర్ విడుదల చేశారని, తద్వారా ఉద్యోగులకు మేలు జరిగేదని ఎంపీ చిన్నికి వివరించారు. ఆ సర్క్యులర్ అమలులో ఉండగానే మళ్లీ 70, 71 జీఓలను జారీ చేసి వాటి ద్వారా పాత పద్ధతుల్లోనే చర్యలు తీసుకుంటూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు జీఓలను రద్దు చేసి 2019 సర్క్యూలర్‌ను మాత్రమే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు శేషగిరిరావు తెలిపారు. -
టెన్నిస్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం
విజయవాడస్పోర్ట్స్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజయవాడ క్రీడాకారుడు ఎం.మల్లికార్జునరావు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పాలకొల్లులో జరిగిన ఈ పోటీల్లో 75 ప్లస్ డబుల్స్ విభాగంలో మల్లికార్జునరావు(విజయవాడ) – వై.భాస్కరరావు(హైదరాబాద్) జోడి ఫైనల్స్‌లో ప్రత్యర్థి శేషసాయి(బెంగళూరు) – వీఏఎస్ నాయుడు(అనకాపల్లి) జోడిని ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకున్నారు. జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో మెడల్ సాధించిన వారిని పలువురు క్రీడా ప్రముఖులు అభినందించారు. -
కార్మికుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
విజయవాడస్పోర్ట్స్: పౌండ్రీ కార్మికుడిని లారీతో ఢీ కొట్టి, అతని మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ విజయవాడ మూడో అడిషనల్ చీఫ్ జుడి షియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పి.తిరుమలరావు మంగళవారం తీర్పునిచ్చారు. ఎనికేపాడులోని ఓ పౌండ్రీలో స్టోర్ కీపర్‌గా పని చేసే తిరుమలరావును అదే ప్రాంతంలోని హైవేపై గన్నవరం నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సహోద్యోగి అప్పారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 2017వ సంవత్సరం జూన్ ఏడో తేదీన జరిగిన ఈ ప్రమాదంలో తిరుమలరావు అక్కడికక్కడే మరణించాడు. అతి వేగంతో నిర్లక్ష్యంగా లారీని నడిపి తిరుమలరావు మృతికి కారణమైన లారీ డ్రైవర్ వాడపల్లి బాలజోజప్పను పటమట పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ప్రాసిక్యూషన్ తరుఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.గంగాధర్ కోర్టుకు వాదనలు వినిపించారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో లారీ డ్రైవర్‌కు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లో మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ (యుఎఫ్బీఆర్వో) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పెన్షన్ మెరుగుపరచాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి ఎఐబీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌నాయక్ మాట్లాడుతూ బ్యాంక్‌లు జాతీయం చేసిన నాటి నుంచి దేశాభివృద్ధికి బ్యాంక్‌లు చేసిన సేవలను వివరించారు. 1993 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ అప్డేట్ చేయలేదని, ఇది ప్రభుత్వాలు, బ్యాంకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. పన్నులు విధించడం అన్యాయం.. ఎం.ఎన్. రావు మాట్లాడుతూ బ్యాంక్ రిటైర్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం బ్యాంకులే భరించాలన్నారు. పాత పెన్షన్ అప్డేట్ చేయకుండా పన్నులు విధించడం అన్యాయమని చెప్పారు. ఏపీ బీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీవీవీ కొండలరావు మాట్లాడుతూ.. రిటైర్ ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మద్దతు తెలిపారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్లారావు, వి.జగన్మోహన్రావు, బి.ఆంజనేయరాజు, ఎంబీ శంకరరావు, పి.వీరారెడ్డి, చంద్రశేఖర్, హరిబాబు, రాజేశ్వరరావు, రామచంద్రరావు, నారాయణరావు, నరేంద్రదేవ్, కామేశ్వరరావు, ఏ.రమణ, ఎంఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
శబరిమలకు 16 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి – కొల్లం(07143) డిసెంబర్ 6, 13, 20, 27(శుక్రవారాలు) తేదీల్లో ఉదయం 11.30 గంటలకు మౌలాలిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07144) డిసెంబర్ 8, 15, 22, 29(ఆదివారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మచిలీపట్నం టూ కొల్లం మచిలీపట్నం – కొల్లం(07145) డిసెంబర్ 2, 9, 16(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07146) డిసెంబర్ 4, 11, 18(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం – కొల్లం(07147) డిసెంబర్ 23, 30(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07148) డిసెంబర్ 25, జనవరి 1(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. విజయవాడ డివిజన్లో పలు రైళ్ల దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని గన్నవరం – ముస్తాబాద్, చేబ్రోలు సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి 23, 25 నుంచి 30 వరకు దన్బాద్ – అలప్పుజ(13351), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా – యశ్వంత్‌పూర్(18111), ఈ నెల 20, 27 తేదీల్లో జసిదీహ్ – తాంబరం(12376), ఈ నెల 23, 30 తేదీల్లో హతియ – బెంగళూరు(18637), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా – బెంగళూరు(12889), ఈ నెల 25న హతియ – యర్నాకులం(22837), ఈ నెల 19, 26 తేదీల్లో హతియ – బెంగళూరు(12835), ఈ నెల 28న విశాఖపట్నం – షిర్డీ సాయినగర్(18503), ఈ నెల 29న విశాఖపట్నం – హజరత్ నిజాముద్దీన్(12803) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయని చెప్పారు. -
నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో మంగళవారం ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధిహామీ పథకం కింద రూ.163.17 కోట్లతో సిమెంటు రహదారులు, ప్రహరీలు, కాలువలు, షెల్టర్ల నిర్మాణానికి 2043 పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో 67 శాతం పనులు ప్రారంభించామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సత్వరమే ప్రారంభించాలన్నారు. కాంట్రాక్టర్లను ఎక్కువ మందిని వినియోగించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. పనుల నాణ్యతలో రాజీపడరాదని హెచ్చరించారు. గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యం ఎంపీ నిధుల ద్వారా రూ.16.13 కోట్లతో 254 పనులు మంజూరు చేశామని కలెక్టర్ బాలాజీ చెప్పారు. వీటిలో 211 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా ఖనిజాల ఫౌండేషన్ ట్రస్ట్ నిధుల ద్వారా రూ.6.82 కోట్లతో 108 పనులు మంజూరు చేయగా 74 పనులు ప్రారంభించారని మిగిలిన పనులు సత్వరమే ప్రారంభించాలన్నారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.16.28 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా జిల్లాలో 45 పనులు మంజూరు చేయటం జరిగిందని ఇవన్నీ పురోగతిలో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
ప్రమాదాల నివారణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం ఆయన చాంబర్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెలలో జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రమాదాలు జరిగే 61 బ్లాక్ స్పాట్లు గుర్తించి, అందులో 13 మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నియంత్రించామని చెప్పారు. రానున్న సమావేశంలోగా జాతీయ రహదారిపై ఉన్న మిగిలిన 13 బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నెలకోసారి సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ జాతీయ రహదారులకు సంబంధించి గత నెలలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సరైన సమాచారంతో రాకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.80 లక్షల మేర ప్రతిపాదనలు మచిలీపట్నం నగరంతో పాటు పెడన, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీల పరిధిలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాల వద్ద సూచికలు ఏర్పాటు కోసం రూ.80 లక్షల మేర ప్రతిపాదనలు రవాణాశాఖ కమిషనర్‌కు పంపామని కలెక్టర్ బాలాజీ చెప్పారు. బందరు డీఎస్పీ అబ్దుల్ సుభానీ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి మార్గంలో టోల్‌ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదంలో పోలీస్ చనిపోయారన్నారు. సంబంధిత సీసీ ఫుటేజీలు కోరితే లేవని చెప్పారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి, జిల్లా రవాణాధికారి శ్రీనివాసనాయక్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, ఆర్టీసీ డీఎం పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి రిజిస్ట్రేషన్‌కూ తిప్పలే
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న అంశంగా తయారైంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లే ఉన్నా, మధ్యవర్తులు రూ.వేలల్లో తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులో భార్య ఇంటిపేరు మార్చడం, కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. అంతేకాదు భర్త ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగి అయితే, పీఎఫ్, ఈఎస్ఐ రికార్డుల్లో భార్య పేరు ఎక్కించేందుకు కచ్చితంగా ఇంటిపేరు మార్చాలని చెబుతున్నారు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నిబంధనలతో పాటు, రూ.వేలల్లో తీసుకోవడంతో ఆర్థిక భారంతో చేయించుకోలేని స్థితి నెలకొంది. ఇబ్బందులు ఇలా.. ● సింగ్‌నగర్‌కు చెందిన వెంకట్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకమ్మలకు గతేడాది అక్టోబరులో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెళ్లి జరిగింది. ఇప్పుడు వాళ్లు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబరులో వచ్చిన వరదల్లో వారి పెళ్లి ఫొటోలు అన్నీ తడిసిపోయాయి. కార్డులు కూడా లేవు. దీంతో మధ్యవర్తులను సంప్రదిస్తే రూ.5 వేలు అడుగున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నట్లు చెబుతున్నారు. ● మధురానగర్‌కు చెందిన శ్రావణ్, కంకిపాడుకు చెందిన మాధురిని ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు వెళితే రూ.3 వేలు అడుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది నిత్యం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ నిబంధనలు ఇలా.. హిందూ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే భార్య, భర్త తరఫున ముద్రించిన వెడ్డింగ్ కార్డులు, వయసు నిర్థారణ ధ్రువపత్రాలు,(10వ తరగతి మార్కుల లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లలో ఏదొకటి), పెళ్లి కల్యాణ మండపంలో జరిగితే సంబంధిత రసీదు, పెళ్లి ఫొటోలు జీలకర్ర బెల్లం పెట్టేవి, తాళి కట్టేవి, పెద్దలు ఆశీర్వదించే ఫొటోలు, భార్య భర్తలతో పాటు, మరో ముగ్గురు ఆధార్ కార్డులు ఉండాలి. పెళ్లి జరిగి రెండు నెలలు దాటితే రూ.10ల స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లు ఆన్లైన్లో చెల్లిస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఆ తేదీన వెళితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలా చేసినా మధ్యవర్తులు రూ.3,500ల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాదు వయసు ధ్రువీకరణపత్రం లేకుంటే దానికోసం మరో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ లేని వారికి రిజిస్ట్రేషన్ పెద్ద సమస్యగా మారింది. క్రిస్టియన్ మ్యారేజీకి మరింత ఇబ్బంది క్రిస్టియన్ మ్యారేజీ చేసుకున్న వారు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకోసం పెళ్లి సమయంలో పాస్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు, పెళ్లి ఫొటోతో పాటు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పాస్టర్ పంపిన లిస్టు ఫొటోస్టాట్ పెట్టాలి. చాలా మంది పెళ్లి చేసిన తర్వాత ఆ లిస్టులను జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపడం లేదు. దీంతో క్రిస్టియన్ పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కుదరని వాళ్లు డబ్బు ఖర్చు చేసి స్పెషల్ మ్యారేజీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ప్రతి పనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో ముడి రేషన్ కార్డు, భార్య ఇంటిపేరు మార్పు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌కు రూ.3,500 పైనే వసూలు చేస్తున్న మధ్యవర్తులునిబంధనలు సులభతరం చేయాలి.. ప్రస్తుతం అన్నింటికీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ముఖ్యంగా పేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు అవసరమవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి పెళ్లి రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనలను సులభతరం చేయాలి. – వడ్లమూడి సంపత్, మొగల్రాజపురం