Bollywood
-
ఓటీటీలోనూ తగ్గేదేలే.. దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్
శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.870 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్లో పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలోనూ అదే రేంజ్లో దూసుకెళుతోంది.టాప్‌లో ట్రెండింగ్ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా ప్రైమ్ వీడియో నేషనల్ వైడ్ గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ చివర్లోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే అక్టోబర్ 10 నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. -
బిగ్‌బాస్ షో నుంచి గాడిద ఎలిమినేట్!
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఓ గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. గత వారం బిగ్‌బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో 19వ కంటెస్టెంట్‌గా గాడిదను ప్రవేశపెట్టారు. దీని పేరు గదరాజ్. దాన్ని బిగ్‌బాస్ హౌస్‌లోనే ఓ చోట కట్టేశారు. కంటెస్టెంట్లు సమయానికి దానికిన్ని నీళ్లు, గడ్డి పెట్టారు. అయితే రియాలిటీ షో కోసం మూగజంతువును వాడుకోవడం చూసి పెటా(పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది.మొదటివారం ఎవరు ఎలిమినేట్?తక్షణమే దాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ రాసింది. పెటా ఆదేశాలతో ఈ వారం గాడిదను ఎలిమినేట్ చేసి పంపించినట్లు సమాచారం. నిజానికి ఈ వారం చాహత్ పాండే, గుణరత్న సదవర్తె, కరణ్ వీర్ మెహ్రా, అవినాష్ మిశ్రా, ముస్కన్ బామ్నే నామినేషన్లో ఉన్నారు. కానీ వీళ్లలో ఒకరికి బదులుగా పెటా ఆదేశాల ప్రకారం గాడిదను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.18 మంది కంటెస్టెంట్లుఇకపోతే ఈ హిందీ బిగ్‌బాస్‌లో వివియన్ డిసేనా, ఐషా సింగ్, కరణ్ వీర్ మెహ్రా, చాహత్ పాండే, షెహజాదా దామి, నైరా బెనర్జీ, అవినాష్ మిశ్రా, ఎలైస్ కౌశిక్, రాజత్ దలాల్, శిల్ప శిరోద్కర్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జిగ్రా విమర్శలపై కరణ్ జోహార్ పోస్ట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన నటి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే జిగ్రా కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత భార్య, నటి దివ్య ఖోస్లా విమర్శలు చేసింది. ఎందుకు ఫేక్ వసూళ్లు ప్రకటిస్తున్నారని మండిపడింది. తాను జిగ్రా థియేటర్‌కు వెళ్తే అంతా ఖాళీగా కనిపించిందని పోస్ట్ చేసింది. అయితే నటి దివ్య ఖోస్లా కామెంట్స్‌పై నిర్మాత కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. నిశ్శబ్దమే మూర్ఖులకు సరైన సమాధానమంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తాజాగా కరణ్ జోహార్ కామెంట్స్‌పై నటి దివ్య రియాక్ట్ అయింది. కరణ్ పేరు ప్రస్తావించనప్పటికీ అతని పోస్ట్‌పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దివ్య కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీకు సిగ్గు లేకుండా ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అలవాటు.. మీరు ఎల్లప్పుడూ మౌనంగానే ఆశ్రయం పొందుతారు. మీకు వెన్నెముకే కాదు.. అలాగే వాయిస్ కూడా లేదంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రస్తావించింది.జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుకాగా.. అంతకుముందు ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు. -
ఫారిన్ గర్ల్ అనుకున్నారు... నేనూ నిజం చెప్పలేదు!
బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ తొలిసారి కెమెరా ముందు నటించిన చిత్రం 1920. ఈ హారర్ చిత్రంతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో చాలామంది తనను చూసి విదేశీ నటి అనుకున్నారట! తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. '1920 సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్‌లోనే జరిగింది. విదేశీ అమ్మాయి అనుకున్నారుఅక్కడ ఎండ అనేదే లేదు. దానికి తోడు విపరీతమైన చలి. అప్పుడు నేను బ్లూ లెన్స్ పెట్టుకున్నాను. నన్నలా చూసి చాలామంది నేను విదేశీ అమ్మాయి అనుకున్నారు. నాకసలు హిందీయే రాదని అభిప్రాయపడ్డారు. చాలాకాలం అదే భ్రమలో ఉండిపోయారు. కానీ నేను భారతీయురాలినే, నాకు హిందీ వచ్చు అని ఏనాడూ క్లారిటీ ఇవ్వాలనిపించలేదు. సోషల్ మీడియాా తెలీదుపైగా అప్పట్లో సోషల్ మీడియా అంటేనే అంతగా తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లేను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అదా నటించిన రీటా సాన్యల్ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 14 నుంచి ప్రసారం కానుంది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటి మసాబా గుప్తా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన మసాబాకు ఇటీవలే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. రిచా చద్దా, శిల్పాశెట్టి, సమీరా రెడ్డి, బిపాసా బసు అభినందనలు తెలిపారు.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మాకు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్న అమ్మాయి మా జీవితంలోకి 11.10.2024న అడుగుపెట్టింది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మసాబా గుప్తా నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.ఎవరీ మసాబా గుప్తా..కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‌బాస్ షూటింగ్ రద్దు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ.. ముంబైలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కుమారుడు ఆఫీస్ బాంద్రాలో ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న సమయంలో సిద్దిఖీపై గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈయన మృతి చెందారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రతి ఏడాది సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు సల్మాన్ కచ్చితంగా హాజరవుతుంటారు. అలానే సిద్దిఖీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే సల్మాన్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తన స్నేహితుడు చనిపోవడం సల్మాన్ విషాదంలో నింపేసింది.సిద్దిఖీ విషయానికొస్తే ముంబైలోని బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. గత ఫిబ్రవరిలో పార్టీని వీడి, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. మరో నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాల్పులు ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)"Difficult times for #SalmanKhan. Some time ago, his father was threatened, and today his close friend #BabaSiddiqui was murdered. When Mumbai's superstars are not safe, what about the common people? This is a danger for everyone!""जीशान सिद्दीकी" pic.twitter.com/MQb7mFzkrt— Arun sisodiya (@kum58993361) October 12, 2024 -
జనాల్ని పిచ్చోళ్లను చేయొద్దు.. ఆలియా భట్‌పై నటి ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. ప్రమోషన్స్‌లో చాలా కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.థియేటర్ ఖాళీ..దీనిపై ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ స్పందించింది. జిగ్రా చూద్దామని పీవీఆర్ మాల్‌కు వెళ్లాను. థియేటర్ అంతా ఖాళీ.. ప్రతిచోటా ఇదే పరిస్థితి.. అయినా ఆలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించినందుకు! పెయిడ్ మీడియా ఎందుకు సైలెంట్‌గా ఉందో అర్థమవట్లేదు. జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుఏదేమైనా మనం ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. అందుకే ఈ కోపం?ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు.చదవండి: కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సోనియా.. అక్కడ కూడా.. -
మామయ్య కోసం మెసేజ్.. రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిన ఐశ్వర్య
లెజండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే, అమితాబ్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య రాయ్ చెప్పే విషెష్ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి. అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్స్టాప్ పెట్టింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్‌తో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆడపిల్ల పుట్టిందని అమ్మ డిప్రెషన్లో.. ఏ పాపం చేశాం?
ఆడపిల్ల ఇంటికి భారం అనుకునే తల్లిదండ్రులు ఎంతోమంది. ఆ జాబితాలో తన పేరెంట్స్ కూడా ఉన్నారంటోంది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. తన సోదరుడికి ప్రేమను పంచి తనపై మాత్రం వివక్ష చూపించారని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా పేరెంట్స్ ఎప్పుడూ నా సోదరుడిని ముద్దు చేసేవారు, అతి గారాబం చేసేవారు. నాపై మాత్రం వివక్ష చూపించేవారు. కొడుకుపై పెట్టుబడివాళ్లు ఎందుకలా చేస్తున్నారో అసలు అర్థమయ్యేది కాదు. కొడుకును బాగా చదివించాలి, విదేశాలకు పంపాలి, అతడికోసం ఎంతైనా ఖర్చు చేయాలి.. ఇలా ఉండేవి వాళ్ల ఆలోచనలు, మాటలు. కుటుంబ ఆస్తి మొత్తం కుమారుడికి, వాడికి పుట్టే కొడుక్కి వెళ్తుంది.. మరి అమ్మాయిలేం పాపం చేశారు? ఓహ్.. వాళ్లకు పెళ్లి చేయాలి, భారం తగ్గించేసుకోవాలి.. అంతేనా?గేమ్స్ ఆడినా తప్పే..పేరెంట్స్ ప్రవర్తన, మాటలు నన్నెంతో బాధించేవి. కానీ ఇలాంటి పరిస్థితి నా ఒక్కదానికే రాలేదని, గ్రామంలోని ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల పరిస్థితి కూడా ఇంతేనని తర్వాత తెలుసుకున్నాను. నా పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు.. ఒక్క స్వాతంత్య్రం తప్ప! వాళ్లకు తెలీకుండా స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఎందుకంటే నీకు కండలు వస్తున్నాయి.. ఇలా మగాడిలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అని అరిచేవారు.అమ్మ డిప్రెషన్లో..అలా ఎన్నో నిబంధనలు పెట్టారు. నేను పుట్టినప్పుడు నా కుటుంబం అంతా విచారం వ్యక్తం చేసింది. మా అమ్మ అయితే కచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్లి ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా మల్లికా షెరావత్.. క్వాశిష్, మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి పలు చిత్రాల్లో నటించింది. ఐటం సాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్ అయింది.చదవండి: రాజకీయాల్లోకి నటుడు 'సాయాజీ షిండే' ఎంట్రీ -
బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు ట్రోలింగ్.. ఆచార్యులు ఏమన్నారంటే?
'బిగ్‌బాస్ షోకి రమ్మని పిలిచారు.. కోట్లు ఇస్తామన్నారు, అక్కర్లేదని తిరస్కరించాను. నేను పాటించే సాంప్రదాయాలకు, విలువలకు అది అనువైన ప్రదేశం కానే కాదు.. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అక్కడికి వెళ్లను. నాకు డబ్బు కన్నా విలువలే ముఖ్యం..' ఆధ్యాత్మికవేత్త, బాబా అనిరుద్ధాచార్య గతంలో అన్న మాటలివి.బాబాపై ట్రోలింగ్బిగ్బాస్ షో అంటేనే గిట్టని ఆయన ఇటీవల హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ లాంచ్‌లో మెరిశారు. అయితే కంటెస్టెంట్‌గా కాదు, కేవలం అతిథిగానే! అయినా సరే ఆ రియాలిటీ షోకి ఎందుకు వెళ్లావంటూ జనాలు విమర్శించారు. దీంతో బాబా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. ఊపిరి ఉన్నంతవరకు అదే చేస్తా..నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసేందుకు, దాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతోనే వెళ్లానే తప్ప ఆ షోలో పాల్గొనాలని కాదు. దయచేసి నన్ను మన్నించండి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. నేను బతికున్నంతవరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు అర్జున్ మాథుర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలి తియా తేజ్‌పాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈనెల 9న వీరి వివాహ వేడుక జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.కాగా.. అర్జున్ మాథుర్ చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్-2 వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో కరణ్ మెహ్రా పాత్రను పోషించాడు ఈ సిరీస్‌లో నటనకు గానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా అర్జున్ మాథుర్.. లక్ బై ఛాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by A r j u n (@arjun__mathur) -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
మరో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి... పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సనా సయ్యద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వెల్కమ్ టూ బేబీ గర్ల్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. గత నెలలోనే తన భర్తతో కలిసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. బుల్లితెర నటి సనా సయ్యద్ ప్రముఖ సీరియల్ కుండలి భాగ్యతో ఫేమస్ అయింది. ఈ సీరియల్లో పల్కీ పాత్రను పోషించింది. తాజాగా సనా సయ్యద్ తనకు కుమార్తె పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రెగ్నెన్సీ తర్వాత కుండలి భాగ్య సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో అద్రిజా రాయ్‌ని తీసుకున్నారు. అంతే కాకుండా సనా సయ్యద్ దివ్య దృష్టి వంటి షోలలో కూడా కనిపించింది. ఆమె 2021లో ఇమాద్ షమ్సీని వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sana Sayyad (@sana_sayyad29) -
ఓటీటీలో రూ.700 కోట్ల సినిమా.. ఉచితంగా చూసేయండి
ఇటీవల థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజై ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా యానిమల్, పఠాన్, బాహుబలి లాంటి పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ స్త్రీ- 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. నేటి నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ. -
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్‌తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
థర్డ్ హ్యాండ్ పాత కారు కొన్న స్టార్ హీరో.. ఎందుకు?
సెలబ్రిటీలు చాలామందికి కార్ల, బైక్ పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం లేటు కొనేస్తుంటారు. తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి ఏమైనా కొంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఎప్పటికప్పుడు హై ఎండ్ లగ్జరీ కార్లు కొనే బాలీవుడ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ప్రస్తుతం ఇతడి దగ్గర టాప్ ఇంటర్నేషన్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అలానే గతంలో ఓసారి థర్డ్ హ్యాండ్ కారు కొన్నాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)'ఓ టైంలో నా దగ్గర ఎలాంటి కారు లేదు. దీంతో ఎలాగైనా సరే కొనలాని అనుకున్నా. రూ.35 వేలు ఖర్చు పెట్టి థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కష్టం ఎంతైనా సరే జీవితంలో బాగా సెటిలై, ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్సయ్యాను. అలా అప్పట్లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఉపయోగించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్న తొలి లగ్జరీ కారు లంబోర్గిని. ప్రస్తుతం నా గ్యారేజీలో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ లాంటి కార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కార్ల విషయంలో నేను ఫుల్ హ్యాపీ. భవిష్యత్తులో ఇంకెన్ని కొంటానో తెలియదు' అని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కార్తిక్ ఆర్యన్.. కామెడీ, వైవిధ్య చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో ఇతడు హీరోగా చేసిన 'చందు ఛాంపియన్' హిట్ అయింది. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!) -
Indian actress Rekha: పన్నీరద్దుకున్న పసిడి రేఖ
రేఖ... నేటితో 70 నిండి 71లోకి అడుగుపెడుతోంది. కాని మొన్న ఐఫా వేడుకలో వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ – ఎన్నో ఆటుపోట్లు జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. కాని ముందుకు సాగడం సౌందర్య భరితంగా జీవించడమే జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?1993.ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్ స్టేజ్ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్ అందుకుని ‘నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’...రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. ‘రేఖ నా కూతురు’ అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.∙∙ స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో ‘అక్రమ సంతానం’ గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. కాని మద్రాసులో రేఖను హీరోయిన్గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్గా నటించిన ‘సావన్ భాదో’ సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. ‘అగ్లీ డక్లింగ్’ అని పేరు పెట్టాయి. ‘33 ఇంచుల నడుము హీరోయిన్’ అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ‘ముద్దు సీన్లు నటించే’ అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.రేఖ బి–గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బోయ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో ‘దో అంజానే’లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్–రేఖల జోడి సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్సిలా. ఆమ్స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్ ఖ్వాబ్ తో ఏ సిల్సిలే హుయే’ పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమింటిక్ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ. ఇందుకు అమితాబ్ గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు. రేఖ కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ‘ఘర్’. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్సూరత్’ (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘ఉమ్రావ్ జాన్’ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగళ్ ‘కలియుగ్’ (1981), గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్లి ‘ఖూన్ భరీ మాంగ్’, ‘ఫూల్ బనే అంగారే’ వంటి సినిమాలు చేసి ‘లేడీ అమితాబ్’ అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది.రేఖ అన్‌స్టాపబుల్. అన్లిమిటెడ్. ఆమె ‘కల్ హోన హో’,‘క్రిష్’ వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్ చేస్తూ కవర్‌గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లిందిగానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది. రేఖ గొప్ప డాన్సర్. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ‘నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను’ అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.రేఖకు జన్మదిన శుభాకాంక్షలు. రేఖ టాప్ 10 సాంగ్స్1. తేరే బినా జియా జాయేనా – ఘర్2. ఆజ్కల్ పావ్ జమీ పర్ – ఘర్3. సున్ దీదీ సున్ తేరేలియే – ఖూబ్సూరత్4. సలామే ఇష్క్ మేరీ జాన్ – ముకద్దర్ కా సికిందర్5. దిల్ చీజ్ క్యా హై – ఉమ్రావ్ జాన్6. ఛోటి సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్7. పర్దేశియా ఏ సచ్ హై పియా – మిస్టర్ నట్వర్లాల్8. మన్ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్9. గుమ్ హై కిసీ కే ΄్యార్ మే – రామ్‌పూర్ కా లక్ష్మణ్10. ఏ కహా ఆగయే హమ్ – సిల్సిలా -
యానిమల్ రిలీజ్ తర్వాత మూడు రోజులు ఏడ్చా: తృప్తి
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలపై ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. లుక్ బాలేకున్నా, సినిమాలో పాత్ర అటూఇటుగా ఉన్నా, ఏం చేసినా, చేయకపోయినా సరే నోరు పారేసుకుంటున్నారు. అలా యానిమల్ మూవీలోని తన పాత్ర వల్ల చాలామంది ట్రోల్ చేశారంటోంది హీరోయిన్ తృప్తి డిమ్రి.ట్రోలింగ్ అంటేనే తెలీదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాకు ముందు విమర్శలనేవే తెలియదు. కానీ ఈ సినిమా వచ్చాక చాలా ట్రోల్ చేశారు. మెయిన్ స్ట్రీమ్‌లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. బుల్బుల్, కాలా సినిమాల సమయంలో ఎవరూ విమర్శించలేదు. ఏ పోస్ట్ కింద చూసినా మంచి కామెంట్లే ఉండేవి. ఓపక్క అలా.. మరోపక్క ఇలా..కానీ యానిమల్ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. నేను నా డ్యూటీ చేశాను. ఏ తప్పు చేశానని ఇలా తిడుతున్నారని బాధపడ్డాను. ఇంత నెగెటివిటీ ఎందుకు చూపిస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఓపక్క సగంమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మరో పక్క మిగతా సగం మంది నన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు.చాలా ఏడ్చా..యానిమల్ రిలీజయ్యాక రెండుమూడురోజులపాటు చాలా ఏడ్చాను. ఇంత ట్రోలింగ్ ఉంటుందని ఊహించలేదు. నేను చాలా సెన్సిటివ్. ఎవరితోనైనా ఫైట్ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటాను. అలాంటిదాన్ని. ఆ సమయంలో విపరీతమైన ట్రోల్స్ చూశాక వర్క్‌పై కూడా శ్రద్ధ పెట్టలేకపోయాను' అని చెప్పుకొచ్చింది.కాగా తృప్తి.. మామ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. లైలా మజ్ను, బుల్బుల్, కాలా చిత్రాల్లో నటించింది. యానిమల్ మూవీతో నేషనల్ క్రష్‌గా మారింది. ఈ బ్యూటీ ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాలో నటించింది.చదవండి: దమ్ములాగిన విష్ణు.. సోనియా చెప్పింది ఈమె గురించేనా? -
ఆత్మల కాన్సెప్ట్‌తో వస్తోన్న హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని హారర్ సీన్స్ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న సింగం ఎగైన్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
చిన్నప్పుడు అలా ఉండేదాన్ని.. ఛాన్స్ దొరికితే చాలు!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. బాల్యంలోనూ కెమెరా ముందు పోజులిచ్చేదాన్నంటూ అందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నేడు (అక్టోబర్ 9న) ఆమె సోదరుడు అక్షత్ బర్త్‌డే. దీంతో అతడికి బర్త్‌డే విషెస్ కూడా తెలియజేసింది. చిన్నప్పుడు వీళ్లిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్న ఫోటోను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసింది.చిన్నప్పుడు అలా ఉండేదాన్ని'నేను పాత ఆల్బమ్స్ చూసినప్పుడు అస్సలు నవ్వాపుకోలేను. ఎందుకంటే చిన్నప్పుడు భలే సరదాగా ఉండేదాన్ని. నేను దాచుకున్న డబ్బుతో చిన్న కెమెరా కొనుక్కుని ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు దిగేదాన్ని. మేము కారులో వెళ్లేటప్పుడు నాన్న ఒక్క నిమిషం కారు ఆపినా సరే వెంటనే బయటకు దిగి మళ్లీ ఫోటోలు క్లిక్‌మనిపించేదాన్ని.క్లిక్.. క్లిక్.. క్లిక్..చదువుకోమంటే గదిలోకి వెళ్లి ఫోటోకు పోజులిచ్చేేదాన్ని. తోటలోకి వెళ్లి ఏదైనా కూరగాయలు తెమ్మంటే కూడా అక్కడున్న మొక్కతో కలిసి ఫోటో దిగేదాన్ని. అద్దం ముందు దిగిన ఫోటోలో అయితే నాలో ఉన్న దర్శకురాలి ఆసక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.సినిమా..హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కంగనా.. సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చింది. 2006లో గ్యాంగ్‌స్టర్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏక్ నిరంజన్, చంద్రముఖి 2 సినిమాల్లో నటించింది. ఈమె ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలకు సన్నద్ధమవుతోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షారుఖ్ ఖాన్ కుమార్తెపై యంగ్ హీరో ఇంట్రెస్టెంగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్‌పై యంగ్ హీరో వేదాంగ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్ సమయంలో ఆమె టీమ్ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్ రైనా మీడియాతో ముచ్చటించారు. (చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్ సుహానా ఖాన్‌పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్‌గా సెట్‌పైకి వచ్చేది. (చదవండి: పెళ్లి గురించి అమితాబ్ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్‌కు తండ్రి షాక్)షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్ చేశారు. అందుకే మేకప్‌కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్ చెప్పారు. -
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు.