Automobile
-
రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసిందిబీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు."నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు"ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడం కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడుతుంది" అన్నారు. త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కూడా మంత్రి తెలిపారు. -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు. -
‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు హెల్మెట్ అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులుపాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్లో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్ఈఎంపీఎస్ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
భారత్‌లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత ఆర్థిక వ్యవస్థకు ఇదే కీలకం: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకంభారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు. -
వరద బాధిత కస్టమర్లకు ఉచిత సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన వినియోగదారుల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వరదలతో సతమవుతున్న కంపెనీ వినియోగదారులకు ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.వరద ప్రభావిత ప్రాంతాల్లోని కంపెనీ కస్టమర్లకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా నిస్సాన్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్న వాహనాలను సమీపంలోని కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) సేవలను ప్రారంభించింది. దాంతోపాటు బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు రూ.1000 మినహాయించినట్లు పేర్కొంది. బీమా క్లెయిమ్ చేయాలనుకునే కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కంపెనీ లక్ష్యమని తెలిపింది.ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్(1800 209 3456)ను ఏర్పాటు చేశాం. కస్టమర్లు సత్వర చర్యల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’వరద బాధిత కస్టమర్లకు నిస్సాన్ మోటార్ ఇండియా ఇంజిన్ ఆయిల్ / ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్పై 10%, ఫ్లోర్ కార్పెట్ రీప్లేస్మెంట్పై 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు వరద ప్రభావిత వాహనాలన్నింటికీ కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌ల్లో ఫిట్నెస్ టెస్ట్ వివరాలు అందిస్తామని పేర్కొంది. -
మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్‌పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్‌షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.తగ్గిన విక్రయాలుఈ ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్‌లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి. -
‘బుల్లెట్’ బండ్లపై మోజు తగ్గిందా?
రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ మొత్తం అమ్మకాలలో 5 శాతం తగ్గుదలని నివేదించింది. కంపెనీ గతేడాది ఆగస్టులో విక్రయించిన 77,583 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 73,630 యూనిట్లను విక్రయించింది.గత ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 65,624 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమ్ముడుపోయిన 69,393 యూనిట్లతో పోలిస్తే ఇవి కూడా 5 శాతం క్షీణించాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. రెండు శాతం పడిపోయాయి. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 8,006 యూనిట్లు ఎగుమతి కాగా గత ఏడాది ఆగస్టులో ఎగుమతి చేసిన వాహనాలు 8,190.కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అత్యంత ఆదరణ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు వివిధ ఫీచర్లు జోడించి 2024 వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేసింది. మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో విస్తరణతో పాటు, రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ గేర్లను కూడా వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవల క్రాస్రోడర్స్ రైడింగ్ జాకెట్‌ను లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ రివిట్ ఆల్-వెదర్ రైడింగ్ గేర్‌ను విడుదల చేసింది. -
లాంచ్‌కు సిద్ధమవుతున్న జర్మన్ బ్రాండ్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్‌ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 14.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్‌లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్‌సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
స్కోడా కొత్త కారు.. వివరాలు
గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్‌లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్‌లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్‌తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్ అప్డేటెడ్ ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్‌లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్) అనే ఐదు వేరియంట్లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో రావడం విశేషం. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
భారత్‌లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్
టూవీలర్ మార్కెటింగ్ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్ హెచ్చవుతుందని తెలిపారు.అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్ సెగ్మెంట్ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!‘గతంలో బైక్ వాడిన యూజర్లు స్కూటర్ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక స్లైడింగ్ కాలిపర్‌తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
సెల్టోస్ ఎక్స్లైన్ వెర్షన్లో బ్లాక్ కలర్
న్యూఢిల్లీ: కియా తన సెల్టోస్ ‘ఎక్స్లైన్ వెర్షన్’లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను తెచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కలర్ వేరియంట్లో కేవలం ఎక్ట్సీరియర్‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పు లు చేశారు.సెల్టోస్ ఎక్స్ లైన్ క్యాబిన్ బ్లాక్, స్ల్పెండిడ్ సేజ్ గ్రీన్ 2టోన్ కాంబినేషన్లో వేర్వేరు రంగులను కలిగి ఉంది. రియర్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ ఎగ్జాస్ట్, వెనుక బంపర్‌పై ఫ్రంట్, ఔటర్ రియర్ మిర్రర్లు, టెయిల్ గేట్ గార్నిష్ తో సహా మరికొన్ని మార్పులు చేశారు.‘‘ఇప్పటి వరకు గ్రే కలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండే సెల్టోస్ అతి తక్కువ సమయంలో 5 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా ఉంది. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని బ్లాక్ కలర్ ఆప్షన్లో తీసుకొచ్చాము’’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ తెలిపారు. -
అందమైన సింగర్.. అదిరేటి కార్!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీకి చెందిన కొత్త బీవైడీ అట్టో3 (BYD Atto 3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సింగర్ జస్లీన్ రాయల్ అందుకున్నారు. బీవైడీ ఇండియా తాజాగా ఆమెకు ఈ ఎస్‌యూవీని డెలివరీ చేసింది. దీంతో బీవైడీ అట్టో3 కారును కలిగిన తొలి సెలబ్రిటీగా ఆమె మారారు.సింగర్ జస్లీన్ రాయల్ గురించి చాలా మంది వినే ఉంటారు. అనేక అవార్డులు గెలుచుకున్న ఈమె సింగర్ మాత్రమే కాదు.. సాంగ్ రైటర్, కంపోజర్ కూడా. వివిధ భాషలలో బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెంచారు. ఆమె సొంతంగా మ్యూజిక్ నేర్చుకుని వన్-వుమన్ బ్యాండ్ ప్రదర్శనతో కీర్తిని పొందారు. ఆమె రూపొందించిన హీరియే ఆల్బమ్ అత్యంత ఆదరణ పొందింది.బీవైడీ అట్టో 3 ప్రత్యేకతలుబీవైడీ అట్టో 3లో ఇటీవల పరిచయం చేసిన డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు ఈ ఎస్‌యూవీకి ఆదరణను మరింత పెంచాయి. ఈ ఎస్‌యూవీకి ఇప్పటివరకూ 600 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇక ధర విషయానికి వస్తే డైనమిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షలు ఉంది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ సామర్థ్యంతో 521 కి.మీ.(ARAI), 480 కి.మీ. (NEDC) రేంజ్ అందిస్తాయి. డైనమిక్ మోడల్ 49.92 kWh బ్యాటరీ సామర్థ్యంతో 468 కి.మీ. (ARAI), 410 కి.మీ. (NEDC) రేంజ్‌ని అందిస్తుంది.