Corporate
-
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
తుక్కు విక్రయంతో రూ.4.5 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), ఆర్థిక సంస్థలు తుక్కు విక్రయం ద్వారా రూ.4.5 కోట్లు సమకూర్చుకున్నాయి. అక్టోబర్ 2–31 తేదీల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ స్వచ్ఛత కార్యక్రమాన్ని (ప్రత్యేక ప్రచారం 4.0) చేపట్టింది.కస్టమర్ అనుకూల చర్యలు, వసతిని మెరుగ్గా వినియోగించుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, తుక్కును వదిలించుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలతోపాటు, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జి మ్ బ్యాంక్, ఎన్‌హెచ్‌బీ, ఐఐఎఫ్‌సీఎల్ ఇందులో పాల్గొన్నాయి.వ్యర్థాలను వదిలించుకోవడం ద్వారా 11.79 లక్షల చదరపు అడుగుల వసతి అదనంగా వినియోగంలోకి వచ్చిందని, రూ.4.50 కోట్లు సమకూరాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. ప్రజల ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కరించినట్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరు ఇలా..
ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?డాబర్ లాభం నేలచూపుఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది. -
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్విల్లే జాగ్వార్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుల్హామ్ ఎఫ్‌సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్‌కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్‌కేబ్'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి. -
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్
చదువుకునే చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యమవుతుందంటున్నాడు.. పూణేకు చెందిన ఓ యువకుడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.పూణేకు చెందిన 'ధృవ్ లోయ' అమెరికాలో ఉద్యోగం కోసం ఐదు నెలలు శ్రమించాడు. జాబ్ కోసం 300 అప్లికేషన్స్, 500 కంటే ఎక్కువ ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా తాను 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరైనట్లు పేర్కొన్నాడు. చివరకు ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు.ఉద్యోగం సాధించిన తరువాత.. జాబ్ కోసం ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇందులో తాను ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. మూడు ఇంటర్న్‌షిప్‌లు పొందినా, మంచి జీపీఏ ఉన్నప్పటికీ.. జాబ్ తెచ్చుకోవడానికి ఐదు నెలల సమయం పట్టిందని చెప్పాడు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..వీసా గడువు పూర్తయిపోతుందేమో అన్న భయం.. ఉద్యోగం లేకుండానే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనేలా చేసింది. అయినా ప్రయత్నం ఆపకుండా.. అమెరికాలో ప్రతి డాలర్‌ను జాగ్రత్తగా వినియోగించాను. మిత్రుల అపార్ట్మెంట్లలో ఉండాల్సి వచ్చింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని టెస్లా కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నాడు. -
డిసెంబర్ నాటికి వెయ్యి సర్వీస్ సెంటర్లు: భవిష్ అగర్వాల్
బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ సర్వీస్ సెంటర్లను 30 శాతం మేర పెంచుకుంది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడగలదని వివరించాయి. అలాగే, సర్వీస్ వ్యూహాలు, ప్రక్రియలను మెరుగుపర్చుకునేందుకు తగు సూచనలు ఇచ్చేందుకు ఎర్న్స్ట్ అండ్ యంగ్‌ను నియమించుకున్నట్లు పేర్కొంది.ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యుత్తమ ఆఫ్టర్–సేల్స్ అనుభూతిని అందించేందుకు 2024 డిసెంబర్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్ అగర్వాల్ సెప్టెంబర్‌లో ప్రకటించారు. -
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
పెరిగిన గ్యాస్ ధర.. వరుసగా నాలుగోసారి..
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్పీజీ ధరలు పెరిగాయి.ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది. -
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్‌ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూత
ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ (బ్రిటిష్ ఫిజికల్ లేబొరేటరీస్ ఇండియా ) గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎమిరిటస్ చైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో మరణించారు.టీపీజీగా ప్రసిద్ధి చెందిన ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కి మామగారు. ఈ వార్తను ధ్రువీకరిస్తూ చంద్రశేఖర్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “బీపీఎల్ గ్రూప్ చైర్మన్, నా మామగారు టీపీజీ నంబియార్ మరణించడం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం శాంతి.." రాసుకొచ్చారు.నంబియార్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేశారు. “టీపీజీ నంబియార్ భారతదేశ ఆర్థిక బలోపేతాన్ని బలంగా కాంక్షించిన మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. ఆయన మృతి బాధ కలిగింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్