Extra
-
కొత్త పెళ్లికూతురు సోనాక్షి ‘ఫ్యామిలీ’ విశేషాలు, సల్మాన్‌తో లింకేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి. రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్‌కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎవరీ రతాన్సీ?ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్‌స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు రతాన్సీ.ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం 2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు.ఇక్బాల్ రతాన్సీ కుటుంబంరతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్‌గా పేరొందింది.సల్మాన్ ఖాన్‌తో ఇక్బాల్ రతాన్సీ బంధంఇక్బాల్ , సల్మాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్‌ను బాలీవుడ్లో నోట్‌బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. -
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!
శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. పైగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. మన దేశంలో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినడం సాధ్యం కాదు. పైగా ఈ నగరాలను భారత దేశ పూర్తి శాకాహార నగరాలుగా పిలుస్తారు. ఆ నగరాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి , మోక్షం కోసం చాలా మంది ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ఈ నగరానికి వస్తారు. నగరం చుట్టూ ముళ్ల చెట్లు , పచ్చని కొండలు ఉన్నాయి. దీన్ని దేవతల భూమిగా పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా అంటారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ మీరు అన్ని రకాల రుచికరమైన,స్వచ్ఛమైన శాఖాహారం తినవచ్చు.హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగానది ఒడ్డున హరిద్వార్ ఒక ప్రకాశవంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా అలరారుతుంది. ఇక్కడ వేయించిన ఆహారం నుంచి సలాడ్లు , సూప్‌ల వరకు అన్ని రకాల శాకాహారాలను ఇక్కడ ప్రయత్నించవచ్చు.మదురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని రాష్ట్రానికి గుండెకాయ అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాఖాహారం. కానీ ఈ నగరం భారతదేశపు నిజమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. అత్యంత రుచికరమైన, పోషక విలువలు కలిగిన శాకాహార వంటకాలు ఇక్కడ లభిస్తాయి.అయోధ్య, ఉత్తరప్రదేశ్ : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా మాంసం దొరకడం లేదు. అయోధ్య పురి మొత్తం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక్క మాంసాహార రెస్టారెంట్ కూడా లేదు.పలిటానా, గుజరాత్: ఈ నగరం (గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా) కూడా పూర్తిగా శాకాహామే.. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా పేరుగాంచింది. కనుక ఇది శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది జైనులను కఠినమైన శాకాహారులుగా పిలుస్తారు. కాబట్టి ఈ నగరంలో శాకాహారం మాత్రమే వడ్డిస్తారు.బృందావన్, ఉత్తరప్రదేశ్: ఇది మథుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం.ఇది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు , మాంసం అమ్మకాలు నిషేధం.తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరం కొండపై ఉన్న తిరుమలలలో కూడా మాంసాహారం పూర్తిగా నిషేధం. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ మాంసాహారం పూర్తిగా నిషేధం.(చదవండి: 60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!) -
ఇద్దరు దొంగల ఫైటింగ్ కథ..
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక.. -
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్‌హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్‌లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్‌లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్‌కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్‌కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్‌బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్‌తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
ఐసీయూలో వెంటిలేటర్‌పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో
షవర్ బాత్ తెలుసు.. ఐస్ బాత్ గురించి విన్నాం...కానీ మీరెపుడైనా ఫైర్ బాత్ గురించి విన్నారా? అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి, నీళ్లు, నిప్పుతో కలిసి బాత్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.ఈ వీడియోలో ఒక పైప్ నుంచి నీళ్లతోపాటు, అగ్ని కూడా సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. లావాలా ఉబికి వస్తున్న ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి ఎంచక్కా షవర్ బాత్ చేస్తున్నాడు. అచ్చం పైనుంచి జాలువారే జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తున్నట్టుగా. ఈ వీడియోపై నెటిజనులు విభిన్నంగా స్పందించారు. అతని ఆరోగ్యంపై కొందరు ఆందోళనవ్యక్తం చేశారు. ఇలాంటి ఫీట్స్ ప్రమాదకరమని కొందరు, ఇలా చేస్తే కేన్సర్ బారిన పడటం ఖాయమని కొందరు వ్యాఖ్యానించారు.This must be one of the strangest showers in the world! 🚿🔥It's apparently located in Russia & spews both water and fire at the same time! 🤔 pic.twitter.com/Gh5fpW3ZQ4— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) June 17, 2024 సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని కమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అలాగే చాలా చల్లగా ఉంటుంది కానీ దుర్వాసన కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని, ఇలాంటి ఘటనలు రష్యాలోనే మాత్రమే చోటు చేసుకుంటాయంటూ మరికొందరు కమెంట్ చేశారు. -
భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్ వీడియో
TW ⚠️Instead of hitting the brake, she pushed the accelerator at the edge of the hill…Despite not knowing how to drive, she reversed a Toyota Etios as her friend Shivraj Mule recorded. Shweta Survase, 23, from Ch. Sambhaji Nagar, died while making a reel near Dutt Dham… pic.twitter.com/eadsWau9AT— Sneha Mordani (@snehamordani) June 18, 2024అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం. కొత్త కారు.. డ్రైవింగ్ సరిగ్గా రాదు. పైగా ఎత్తైన కొండ మీద రివర్స్ తీసుకుంటోంది. ఈ క్రమంలో బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సిలరేటర్ రైజ్ చేసింది. అంతే కళ్లు మూసి తెరిచే లోపే 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేతా దీపక్ సుర్వాసే (23)గా గుర్తించారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ ధామ్ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది.స్నేహితుడు సూరజ్ సంజౌ ములేతో కలిసి శ్వేతా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్‌లోని సులిభంజన్ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్ కారు డ్రైవ్ చేయాలని ఉత్సాహ పడింది. ఎత్తైన కొండమీద కారును రివర్స్ చేస్తోంది. దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు. మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున యాక్సిలరేటర్ మీది కాలు వేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, "క్లచ్, క్లచ్, క్లచ్" అంటూ అరిచాడు. ఆమెను ఆపడానికి పరిగెత్తాడు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్ మౌత్ వాష్ వాడితే కేన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. బెల్జియంలోని యాంట్వెర్ప్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్‌వాష్ రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నారు. మౌత్ ఫ్రెష్నర్లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది. నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నివారణలో శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.అయితే కెన్వ్యూ వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.మౌత్ వాష్‌లో ఏముంటుంది?సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్ ముప్పును కూడా పెంచుతుంది. -
లోకో పైలట్ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు
గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా 2020 జూన్ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి. -
లైఫ్‌లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం! బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు. కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది. పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి. -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్‌గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్‌గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్ నిఖిల్..
నిఖిల్ అనిల్ బ్రిజ్‌లాల్ కుమార్ శర్మ aka నిఖిల్ ముంబైకర్.. మోటో వ్లాగర్, బిజినెస్‌మన్. టాప్ టెన్ రిచెస్ట్సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ర్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్ ఎయిర్వేస్లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేశాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ ఆ ఎయిర్వేస్ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్‌ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్‌ని అటువైపు మోల్డ్ చేసుకున్నాడు. యూట్యూబ్‌ని వేదికగా మలచుకున్నాడు. మోటర్ బైక్ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్ మోటో ట్రిప్ వ్లాగ్ తన చానెల్ సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ని కలవడానికి నిఖిల్ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్) బైక్ రైడ్ చేశాడు. ‘ముంబైకర్ నిఖిల్’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్‌ల బ్రాండ్‌ని స్థాపించాడు. ఇవి ఎక్స్క్లుజివ్గా అమెజాన్లోనే దొరుకుతాయి.ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్.. -
18 ఏళ్ల అందమైన అమ్మాయితో 90 ఏళ్ల తాత పెళ్లి : వీడియో మామూలుగా లేదుగా!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట... అయిదు రోజుల పెళ్లి ఇది ఒకప్పటి పెళ్లిళ్ల చరిత్ర. అంతేకాదు చిలకా గోరింకల్లా, రాధి కృష్ణుల్లా జంట భలే ముచ్చటగా ఉన్నారు అని పెద్దలు దీవించే వారు. ఇపుడు ట్రెండ్ మారింది గురూ. లేటు వయసులో ఘాటు ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూస్తున్నాం. తాజాగా 90 ఏళ్ల వృద్ధుడు, 18 ఏళ్ల అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అంతేకాదు డీజేకి తగ్గట్టుగా వరుడు, వధువుతో స్టెప్పులేశాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమేజింగ్ బిహార్ అనే ఇన్‌స్టాలో ‘పవర్ ఆఫ్ మనీ’ పేరుతో షేర్ అయింది. పెళ్లి అనేది వ్యక్తిగత అవసరం అభీష్టం. కానీ సోషల్ మీడియా మాత్రంలో నెటిజన్లు రక రకాల కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. ‘అరే..కాస్త విషంతీసుకుండిరా... ఈ వీడియో చూస్తూ..చూస్తూ చచ్చిపోతా’’ అనే కామెంట్ మాత్రం క్రేజీగా నిలిచింది. View this post on Instagram A post shared by ⚠️⃝⃜ LAKHISARAI BIHAR ⚠⃤ (@amazing__bihar) -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
Lavender : అద్భుతమైన ప్రయోజనాలు
వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా. లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది. -
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు -
Happy fathers day 2024 లవ్లీ డాడీతో సెల్పీ పంపండి, సాక్షితో సెలబ్రేట్ చేసుకోండి!
నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రత్యేకంగా ప్రతి యేడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటాం. అంటే ఏడాది జూన్ ఆదివారం 16న ఫాదర్స్ డే. ప్రతీ ఫాదర్స్ డే రోజు లవ్లీ డాడీని అనేక బహుమతులతో సర్ప్రైజ్ చేస్తారు కదా. ఈ ఏడాది మాత్రం సాక్షి. డాట్కాంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఎలా అంటారా? సింపుల్.. నిస్వార్థంగా ఆకాశమంత ప్రేమను పంచే మీ డాడీతో ఒక సెల్ఫీ తీసుకోండి. సాక్షి డాట్.కామ్‌కు ఈ కింద ఫోటోలో ఉన్న నెంబరుకు వాట్సాప్ చేయండి...హ్యాపీ ఫాదర్స్ డే! -
పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా? కారణాలేంటో తెలుసా? చిన్ని చిట్కాలు
పుట్టబోయే బిడ్డ కడుపున పడింది మొదలు తల్లిదండ్రులకు బిడ్డలపై ఆపేక్ష మొదలవుతుంది. ఇక బోసి నవ్వులు నవ్వుతూ, పారాడుతూ, బుల్లి బుల్లిఅడుగులూ వేస్తూ, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంటే ఆ మురిపమే వేరు. ఏ చిన్ని అనారోగ్యం వచ్చినా ఆందోళనే. పసిబిడ్డలను ఎదుగుతున్న క్రమంలో కంటికి రెప్పలా చూసుకోవాలి. వయసు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవడంతో పాటు, సమయానికి టీకాలు వేయించాలి. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, సబ్బు, పేపర్లు, సుద్ద లేదా గోడ గోళ్లతో గీరి తింటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తిట్టి, కొట్టి దండించడం కాకుండా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యులను సంప్రదించాలి. పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? ఈ బురద తినే అలవాటు లేదా అలాంటి ఇతర తినకూడని వస్తువులను తినే అలవాటు రెండేళ్లకు మించి కొనసాగితే, శిశువు పికా అనే రుగ్మతతో బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకు అలా తింటారుపోషకాహార లోపం, జింక్, కాల్షియం ,ఇనుము మొదలైన మూలకాల లోపంకుటుంబలో నిర్లక్ష్యం/ అశాంతి వాతావరణంఆటిజం , మేధో వైకల్యం, ఇతర అభివృద్ధి సమస్యలు. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలుసుద్ద, బలపం, సున్నం, లాంటి వాటిని తినడం వల్ల పిల్లలు అనీమియా వస్తుంది. మరింత బలహీనంగా తయారవుతారు. కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి?పిల్లల వైద్యుల సలహా ప్రకారం పిల్లలకు తగిన ఆహారం ఇస్తే ఈ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా లభించే అరటి పండ్లను తినిపించాలి. కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు. పిల్లల్లో అభద్రత తొలగించేలా, వారితో మరింత సన్నిహితంగా మెలగాలి. వారి పట్ల ప్రేమను మరింత ఎక్కువ పంచాలి. పిల్లల అలవాటు, ఆరోగ్య ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. మినరల్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్‌తో పాటు డీవార్మ్ మందులను సిఫారసు చేస్తారు. కొంతమందిలో ప్రవర్తనా లేదా మానసిక చికిత్స కూడా అవసరం కావచ్చు. సమస్య ఏంటి అనేది వైద్య నిపుణుడు నిర్ధారిస్తారు. -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు.