Food
-
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్‌ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్‌కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్‌డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్‌ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మన భారతీయ మూలాలున్న మహిళనే పరిణయమాడారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ వంటకాలతో బాగా సుపరిచయం ఉంది. అందువల్ల ఇటీవల వ్యాన్స్ వెల్నెస్ నిపుణుడు జో రోగన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కూడా భారతీయ వంటకాలపై ఉన్న ఇష్టాన్ని సవివరంగా తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శాకాహార వంటకాల గురించి చాలా గమ్మత్తైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో చూద్దామా..!. వాన్స్ భారతీయ రుచులకు ఫిదా అవ్వడమే గాక వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు వాటి ప్రయోజనాలపై ప్రసంసల జల్లు కురిపించాడు. తాను ఇంట్లో వండిన భారతీయ భోజనమే తింటానని చెప్పారు. అంతేగాదు దానిలో ఉండే పోషక ప్రయోజనాలను హైలెట్ చేసి మరి వివరించారు. అయితే ల్యాబ్‌లో కృత్రిమంగా చేసే మాంసాన్ని చెత్తగా అభివర్ణించాడు. అందుకు బదులు భారతీయ శాకాహారమే చాలా మంచిదని అన్నారు. తన భార్య ఉషా చాలా రుచికరమైన భారతీయ వంటకాలను తయారు చేస్తుందని, ముఖ్యంగా పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు..మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే గాక శరీరానికి కావాల్సిన పోషకాల అందుతాయి. అంతేగాదు అమెరికన్లు 2020-2025 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్యం పెంపొందించుకునేలా కొత్త ఆహార మార్గదర్శకాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో శాకాహారానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతుంది.బాడీ మాస్ ఇండెక్స్‌ను 0.96 తగ్గిస్తాయి. ఈ ఆహారాలు మధుమేహం మందులను తగ్గించడానికి కూడా అనుమతిస్తాయి. మాంసాహార ఆహారాలతో పోలిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని సుమారు 10 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. భారతీయ ప్రధాన ఆహారాల్లో.. పెరుగు, సలాడ్, రోటీ, పప్పులు, బియ్యం, గోధుమపిండి తదితరాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు ఏ, సీ, కే, ఫోలిక్ ఆమ్లాలు, కాల్షియం వంటి ఇతర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, దీర్ఘాకాలిక వ్యాధులను నివారించడానికి తోడ్పడతాయి. (చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?) -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా. రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇలాగే ఓట్స్తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
కింగ్ చార్లెస్, కెమిల్లా దంపతులు ఇటీవల బెంగూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాజ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్‌ని కూడా సందర్శించారు. అక్కడ దాదాపు ముప్పై ఎకరాల్లో ఉండే వెల్నెస్ రిట్రీట్‌లో మూడు రోజులు గడిపారు. అంతేగాదు అక్కడ జరిగే యోగా సెషన్లు, ధ్యానం, ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సలన్నింటిలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కింగ్ చార్లెస్ అక్కడి వంటకాలకు ఎంతగానో ఫిదా అయ్యారు. అక్కడ ఆయన రెండు కేరళ వంటకాలను అమిత ఇష్టంగా తిన్నట్లు సమాచారం. అవేంటో చూద్దామా..కింగ్ చార్లెస్ కేరళ సంప్రదాయ కోడి గుడ్డు కూర, ఇడియప్పం ఎంతో ఇష్టంగా తిన్నారు. అవే కూరలు మరుసటి రోజు కూడా వడ్డించమని కోరారట. కింగ్ చార్లెస్ మనుసును దోచుకున్న రెండు రెసీపీల తయారీ విధానం, వాటి చరిత్ర గురించి సవివరంగా చూద్దామా..!.సాంప్రదాయ కేరళ గుడ్డు కూర..ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే ఈ కూరని కేరళ పాకశాస్త్ర నిపుణులు చాలా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, కొద్దిపాటి మసాల దినుసుల వేసి.. విలక్షణమైన రుచితో అందిస్తారు. ఇడియప్పం..ఇక ఇడియప్పం క్రీస్తూ శకం ఒకటొవ శతాబ్ద కాలం నుంచి గొప్ప చరిత్ర కలిగిన వంటకం. బియ్యం పిండిని న్యూడిల్స్ మాదిరిగా సతాంగై అనే ప్రత్యేక పరికరంలో ప్రెస్ చేసి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటకం సరిహద్దులు దాటి శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటకాల్లోకి కూడా ప్రవేశించడం విశేషం. అంతలా ఈ వంటకం ఎందరో ఆహరప్రియుల మనసులను గెలుచుకుంది. కాగా, కింగ్ చార్లెస్ దంపతులు అక్కడ క్యూరేటెడ్ వెల్నెస్ డైట్‌ని అనుసరించారు. గతంలో 2019లో ఇదే వెల్నెస్ రిట్రీట్‌లో కింగ్ చార్లెస్ 71 పుట్టిన రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచే రాజ దంపతులు ఇక్కడ వంటకాలపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..) -
శాండ్విచ్.. పోషకాలు రిచ్..
శాండ్విచ్ నగరంలో అత్యంత క్రేజీ స్నాక్స్‌లో ఒకటి. అల్పాహారం, భోజనం లేదా సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్ డిన్నర్గా కూడా తీసుకోగలిగిన ఏకైక ఫుడ్ ఐటమ్. దీంతో నగరంలో ఫుడ్ లవర్స్‌కి మాత్రమే కాదు యువత నుంచి ముసలి వారి వరకూ, ఉద్యోగుల నుంచి లైట్ ఫుడ్‌ని తీసుకునేవారి వరకూ బాగా దగ్గరైన ఫుట్ ఐటమ్‌గా చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉండే ఈ రుచికరమైన శాండ్విచ్ పోషకాహారంగా కూడా పేరొందింది. బ్రిటిష్ పాలకుడు జాన్ మోంటాగు 18వ శతాబ్దంలో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మటన్ స్లైసెస్ ఉంచి సర్వ్ చేయమని సిబ్బందిని ఆదేశించాడట. దాని వల్ల తాను అవి తింటూనే పేకాట ఆడు కోవచ్చని ఆయన భావించాడట. అలా పుట్టిన శాండ్విచ్ ఆ తర్వాత క్రమంలో విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. మన భాగ్యనగరంలోనూ సిటిజనులకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్‌గా అవతరించింది. తయారీ సులువుగా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటం కూడా శాండ్విచ్ పాప్యులర్ అవ్వడానికి ప్రధాన కారణం.. కనీసం రూ.100 మొదలుకుని రూ.600 దాకా కూడా నగరంలో విభిన్న రకాల శాండ్విచ్లు అందుబాటులో ఉన్నాయి.ట్రెడిషన్స్‌ను కలుపుకుంటూ టేస్టీగా.. బ్రిటీష్ డచ్ జాతీయులు యూరోపియన్ బ్రెడ్–మేకింగ్ పద్ధతులను మన నగరం స్వీకరించి సంప్రదాయ మసాలా దినుసులు. నాన్, రోటీ వంటి స్థానిక ఫ్లాట్‌బ్రెడ్‌లను కూడా ఉపయోగించి సరికొత్త శాండ్విచ్ రుచులను సృష్టించింది. ‘టిక్కా మసాలా వంటి మన సంప్రదాయ రుచులు శాండ్‌విచ్‌లలో చేర్చారు’ అని మకావు రెస్టారెంట్ హెడ్ చెఫ్ రవి చెబుతున్నారు. ‘కేఫ్‌కి వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ వెరైటీ కోసం చూస్తారు. అందుకే సోర్‌డౌ శాండ్విచ్ల నుంచీ క్రోసెంట్ బన్స్ వరకూ మెనూలో చేరుతున్నాయి’ అని చెఫ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. స్థానిక అభిరుచులకు గ్లోబల్ ట్రెండ్ మిళితం చేసి అవొకాడో లేదా పెస్టోతో ఓపెన్–ఫేస్డ్ శాండ్విచ్లను కూడా ఇక్కడి కేఫ్స్ పరిచయం చేశాయి. మారుతున్న ఆధునికుల అభిరుచికి అనుగుణంగా వీగాన్ శాండ్విచ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ..శాండ్విచ్లను చాలా సులభంగా ఇంట్లో సైతం వేగంగా తయారు చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి మిడ్ డే స్నాక్స్‌గానూ, సాయంత్రం టీ టైమ్ దాకా ఎనీ టైమ్ శాండ్విచ్ బెస్ట్ కాంబినేషన్.. నచి్చన కూరగాయలను లేదా విభిన్న రకాల మేళవింపులను దీనికి జతగా ఉపయోగించవచ్చు. రుచికరమైన సాస్‌లు, చీజ్‌లతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్ మేళవింపునకు అనుకూలం కావడంతో ఆరోగ్యకర పోషకాహారంగానూ ప్రాచుర్యం పొందింది.ఇంట్లోనే.. రుచికరంగా..రుచికరమైన శాండ్విచ్ చేయడానికి ఎల్లప్పుడూ చీజ్, బ్రెడ్ రెండూ కలపడం మంచిది. సోర్డోఫ్ బ్రెడ్, చీజ్ తాజా దోసకాయ ముక్కలతో దోసకాయ–చీజ్ శాండ్విచ్, సాయంత్రం టీ సమయంలో తినాలనిపిస్తే, బ్రెడ్ మష్రూమ్లను ఉపయోగించి మష్రూమ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. దీనికి వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మోజారెల్లా చీజ్, బ్రెడ్ స్లైసెస్, మసాలా దినుసులు జోడించవచ్చు. మొక్కజొన్న, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, టొమాటోలు వంటి తాజా కూరగాయల కలయికతో ఇంట్లో తయారుచేసిన స్ప్రెడ్లు, సాస్‌లతో వెజ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. ఇదే విధంగా చికెన్, ఎగ్స్ రకరకాల మేళవింపులతో నాన్‌వెజ్ వెరైటీలూ తయారు చేసుకోవచ్చు. సూప్స్ నుంచి తేనీటీ దాకా పీనట్ బటర్ నుంచి జామ్ దాకా ఏ కాంబినేషన్‌లోనైనా అమరిపోతాయి. రోస్ట్ చికెన్, మస్టర్డ్ శాండ్విచ్ స్పినాచ్ అండ్ కార్న్, రోస్టెడ్ వెజిటబుల్ అండ్ ఛీజ్ వంటి ఫిల్లింగ్స్‌తో ఇంట్లో వీట్ బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు.నగరం నలువైపులా.. నగరంలో దాదాపు అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో రుచికరమైన శాండ్విచ్ వెరైటీలు లభిస్తాయి. అలా చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని ఎగ్ బటర్‌తో బేక్ చేసిన ఫ్రెంచ్ బ్రెడ్ మెల్ట్ శాండ్విచ్లు ప్యాటీ మెల్ట్ పేరుతో మాదాపూర్‌లోని సిగుస్తా అందిస్తుండగా, గండిపేటలోని బృందావన్ కాలనీలోని కేఫ్ శాండ్‌విచో, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రోస్టరీ కేఫ్, మాదాపూర్‌లోని బేక్లోర్, నగరంలో పలు చోట్ల ది బేక్ ఫ్యాక్టరీ, అమెరికన్ శాండ్విచ్లకు పేరొందిన హిమాయత్ నగర్‌లోని కింగ్ అండ్ కార్డినల్, సింధి కాలనీలోని చత్వాలా, కొండాపూర్‌లోని శాండ్విచ్ స్క్వేర్, జూబ్లీహిల్స్ లోని కోర్ట్‌యార్డ్ కేఫ్స్ కూడా శాండ్విచ్లకు పేరొందాయి. ఇక శాండ్ విచ్ ఈటరీ పేరుతో నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకించిన ఔట్లెట్స్ ఫుడ్ లవర్స్‌కి చిరునామాగా మారాయి. ‘మాంసం లేదా చీజ్‌తో నిండిన బ్రెడ్ లేదా పేస్ట్రీ కలయికలు, మసాలా దినుసులు ధరించడం పురాతన కాలం నుండి ఆనందించబడింది’ అని ఫ్యూ డెసర్ట్, బార్ మరియు కిచెన్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ జో ఫ్రాన్సిస్ వివరించారు. గిన్నిస్ రికార్డ్స్‌లో శాండ్విచ్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్ కూడా ఉంది. గిన్నిస్ రికార్డుల ప్రకారం.. పేరొందిన అంతర్జాతీయ చెఫ్ జోయ్ కాల్డరోన్ తయారు చేసిన గ్రిల్డ్ ఛీజ్ శాండ్ విచ్ 214 డాలర్లు అంటే దాదాపు భారతీయ కరెన్సీలో రూ.17వేల ఖరీదు చేస్తుందట. న్యూయార్క్‌లోని 3 రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. షాంపేన్ తదితర ఖరీదైన వాటిని ఇందులో మేళవించడమే దీనికి కారణమట. -
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
నోరూరించే చాక్లెట్ల చరిత్ర తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
క్యాడ్బరీ డైరీమిల్క్, ఫైవ్‌స్టార్, కిట్‌కాట్, జెమ్స్... చెబుతుంటేనే నోరూరి΄ోతోంది కదా. అమ్మానాన్నలు ఏదైనా పని చె΄్పాలంటే ‘చేశావంటే చాక్లెట్ ఇస్తా’ అంటుంటారు. నోట్లో వేసుకోగానే కరిగి΄ోయే చాక్లెట్లంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టమే. ఈ చాక్లెట్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో అమెరికాలో చాకో చెట్లను తొలిసారి గుర్తించారు. ఆ చెట్టు పళ్లలోని గింజల నుంచి రసం తీసి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచికరమైన ఆ రసం అందరికీ తెగ నచ్చింది. దీంతో కోకో చెట్టును దైవప్రసాదంగా భావించేవారు. ప్రధాన వేడుకల్లో ఈ చెట్లను కానుకలుగా ఇచ్చేవారు. డబ్బు చలామణీ లేని ఆ కాలంలో ఈ చెట్టునే విలువైన వస్తువుగా భావించేవారు. ఆ తర్వాత 1519లో స్పెయిన్ దేశస్థులు ఆ చాకో చెట్టు రసాన్ని తమ దేశానికి తెచ్చారు. అక్కడే మొదటిసారి ఆ రసానికి ‘చాకొలేట్’ అనే పేరు పెట్టారు. అక్కడి నుంచి అది యూరప్ ప్రాంతానికి పరిచయమై ప్రాధాన్యాన్ని పొందింది. వందల ఏళ్లపాటు రసంగానే ఉన్న ఆ ద్రవం 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనంతరం బిళ్లల రూపంోకి మారింది. ఆ రసంలో మరిన్ని కొత్త దినుసులు కలిపి కొత్త తరహా రుచుల్ని తీసుకొచ్చారు. 1819లో స్విట్జర్ల్యాండ్ దేశంలో ‘ఫ్రాంకోయిస్ లూయిస్ కైల్లర్’ తొలిసారి చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. ‘స్విస్ చాక్లెట్’ సృష్టికర్త ఆయనే. ఇప్పటికీ కైల్లర్ బ్రాండ్ చాక్లెట్ ప్రపంచంలోనే శ్రేష్ఠమైన చాక్లెట్.మొదట్లో ఒకే రంగులో ఉండే చాక్లెట్లు ఆ తర్వాత కొత్త కొత్త రంగులతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల వ్యాపారం లక్షల కోట్ల ఆదాయంతో నడుస్తోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చిన్నారులకు వేడుకలు... ఇలా ఏ శుభకార్యం జరిగినా చాక్లెట్లు ఉండాల్సిందే అనేంతగా పేరు పొందాయి. అయితే మీకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమున్నా వాటిని ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. తరచూ చాక్లెట్లు తింటే పళ్లు పాడవుతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చాక్లెట్లు తినండి. ఇది కూడా చదవండి: ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే! -
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
మయోనైజ్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్‌లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్‌్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు. -
డైట్ ప్లాన్‌లో ఉన్నారా : డిన్నర్ కోసం అదిరిపోయే పరాటా
పోషకాలు విరివిగా లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్ మొక్కలాగా కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం.సోయాకూరలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.సోయా, ఓట్స్ పరాటాకావాల్సినవి :దిల్ ఆకులు : ఒక కప్పు ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి : ఒక కప్పు నెయ్యి రెండు టీస్పూన్లునాలుగు పచ్చిమిర్చి జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు : అర కప్పుతయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి. తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్ వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్చేసి పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం మీద నెయ్యివేసి, సన్నని మంటమీద కాల్చుకుంటే, టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్ పరాటా రెడీ. దీన్ని ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు. -
Diwali 2024 : దివ్యంగా వండుకోండిలా
దీపావళి వస్తోంది...ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది.పిల్లల ముఖాల్లో మతాబులు వెలుగుతాయి.మరి... వంటిల్లు బోసిపోతే ఎలాగ?ఫ్రిజ్‌లోంచి బ్రెడ్... క్యారట్ తీయండి.స్టవ్ వెలిగించండి... చక్కెర డబ్బా మూత తీయండి. దివ్యంగా వండండి! షాహీ తుకడాకావలసినవి: బ్రెడ్ స్లయిస్‌లు –5; నీరు – టీ స్పూన్; పాలు– 3 కప్పులు; జీడిపప్పు– గుప్పెడు; పిస్తా– గుప్పెడు; బాదం – గుప్పెడు; యాలకులు – 2 (పొడి చేయాలి); నెయ్యి – అరకప్పు; చక్కెర – అర కప్పు; కుంకుమ పువ్వు – 6 రేకలు;తయారీ: బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న పెనంలో చక్కెరలో నీటిని పోసి సన్న మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తరవాత అందులో కుంకుమ పువ్వు రేకలు వేయాలి. చక్కెర తీగపాకం వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి. ఒక పాత్రలోపాలు పోసి మరిగించాలి. మధ్యలో గరిటెతో అడుగు పట్టకుడా కలుపుతూ పాలు చిక్కబడి పావు వంతుకు వచ్చే వరకు మరిగించి యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత పైన తయారు చేసి సిద్ధంగా ఉంచిన చక్కెరపాకంలో నాలుగవ వంతు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ఇది రబ్రీ. బ్రెడ్ స్లయిస్‌లను అంచులు తీసేసి త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ∙మరొక పెనంలో నెయ్యి వేడి చేసి బ్రెడ్ ముక్కలను అన్ని వైపులా దోరగా కాల్చాలి. పెనం మీద నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి వెడల్పుగా, అంగుళం లోతు ఉన్న ప్లేట్లో అమర్చాలి. ఇలా అన్ని స్లయిస్‌లను వేయించి, చక్కెర పాకంలో ముంచి తీసి ప్లేట్లో సర్దాలి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న బ్రెడ్ స్లయిస్ల మీద రబ్రీ పోసి, ఆ పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను చల్లాలి.గమనిక: పాలను రబ్డీ చేసే సమయం లేకపోతే కండెన్స్డ్ మిల్క్ వాడవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు తినాలంటే చక్కెర బదులుగా మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ లేదా స్టీవియాలను వాడవచ్చు. క్యారట్ బర్పీకావలసినవి: క్యారట్ – అర కిలో; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు పాలు – కప్పు; చక్కెర – అర కప్పు; యాలకుల పొడి– అర టీ స్పూన్; పిస్తా – గుప్పెడు (తరగాలి);తయారీ: క్యారట్‌ను కడిగి చెక్కు తీసి తురమాలి. మందపాటి బాణలిలో రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో క్యారట్ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి సన్నమంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారట్ తురుములో పాలు పోసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల సేపు ఉడికించాలి. క్యారట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేకొద్దీ మిశ్రమం ద్రవంగా మారుతుంటుంది. కొద్ది సేపటికి తిరిగి దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మిశ్రమం అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా దగ్గరయ్యే వరకు ఉంచాలి. ఈ లోపు ఒక ట్రేకి నెయ్యి రాసి క్యారట్ మిశ్రమంపోయడానికి సిద్ధం చేసుకోవాలి. క్యారట్ పాకం గట్టి పడిన తరవాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి రాసిన ట్రేలో పోసి సమంగా సర్ది పిస్తా పలుకులను అద్దితే క్యారట్ బర్ఫీ రెడీ. బర్ఫీ వేడి తగ్గిన తర్వాత చాకుతో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కలను ప్లేట్ నుంచి సులువుగా వేరు చేయవచ్చు.గమనిక: క్యారట్ మిశ్రమాన్ని ఎప్పుడు ట్రేలోపోయాలనేది స్పష్టంగా తెలియాలంటే... స్పూన్‌తో కొద్దిగా తీసుకుని చల్లారిన తరవాత చేత్తో బాల్‌గా చేసి చూడాలి. తురుము జారిపడకుండా బాల్ గట్టిగా వస్తే అప్పుడు మంట మీద నుంచి దించేయవచ్చు. -
ఆనంద్ మహీంద్రా మెచ్చే వంటకాలివే..! శాకాహారుల..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అంటూ మంచి ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. ఆయన ఇతరుల టాలెంట్‌ని, గమ్మత్తైన విషయాలను షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి మహింద్రా ఈసారి తన కిష్టమైన వంటకాలు గురించి చెప్పుకొచ్చారు. తాను కూడా మంచి ఆహారప్రియుడేనని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆయన మెచ్చే వంటకాలేంటంటే..ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో శాకాహార పంజాబీ వంటకాల పోస్ట్‌తో నెటిజన్లను ఆకర్షించారు. వంటకాల్లో మాంసాహార వంటకాల రుచే అగ్ర స్థానం అయినా ఆయన శాకాహార వంటకాలకే ప్రాధాన్యాత ఇచ్చారు. అంతేగాదు పంజాబ్ వంటకాలను శాకాహారుల స్వర్గంగా అభివర్ణించారు. ఎప్పుడైన సరదాగా పంజాబ్ నడిబొడ్డున తప్పనిసరిగా ఘుమఘుమలాడే ఈ ఏడు రకాల పంజాబీ వంటకాలను ట్రై చేయాల్సిందే అంటూ వాటి గురించి సవివరంగా వివరించారు.షాహి పనీర్పర్ఫెక్ట్ రుచి కోసం క్రీమీ గ్రేవీతో ఉంటే పనీర్ క్యూబ్స్ వంటకం బెస్ట్. ఇది తేలికపాటి సుగంధద్రవ్యాలు, పెరుగుతో రుచికరంగానూ, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పరాఠాతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు అని చెబుతున్నారు మహీంద్రా. రాజ్మా చావల్గ్లూటెన్ ఫ్రీ మీల్ కోసం ట్రై చేయాలనుకుంటే..రాజ్మా డిష్‌ని తినాల్సిందే. చక్కగా ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో చేసే వంటకం లంచ్‌లో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీన్ని రైతా, ఊరగాయలతో తింటే టేస్ట్ అదుర్స్.పాలక్ పనీర్పంజాబీ-స్టైల్ పాలక్ పనీర్‌ను ఆస్వాదించాలంటే ముందుగా పాలక్‌ని మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఆ మిశ్రమన్ని ఉల్లిపాయాలు, టమాటాల మిశ్రమంలో వేసి ఉడికించి చివరగా క్యూబ్డ్ పనీర్లతో ఉడికించి తింటే అబ్బబ్బా..! ఆ రచే వేరేలెవెల్..!దాల్ మఖానీకిడ్నీ బీన్స్‌తో తయారు చేసే వంటకం. దీన్ని వెన్నతో తయారు చేసే క్రీమ్ లాంటి గ్రేవీతో కూడిన వంటకం. ఉత్తర భారతీయుల వంటకాల్లో అత్యంత టేస్టీ వంటకం ఇదే. తప్పక రుచి చూడాల్సిందే.పనీర్ టిక్కామంచి ఆకలితో ఉన్నవారికి తక్షణమే శక్తినిచ్చి సంతృప్తినిచ్చే మంచి వంటకం. చక్కగా మెరినేషన్ చేసిన క్యూబ్డ్ పనీర్‌ని బంగారు రంగులో వేయించి వివిధ కూరగాయలతో సర్వ్ చేస్తారు. ఇది ప్రతి వేడుకలో ఉండే అద్భుతమైన వంకటం. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చోలే భాతురేశెనగలతో చేసే కర్రీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండే రుచికరమైన వంటకం. పూరీ, పరాఠాలలో అదిరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు, ఊరగాయ వేసుకుని చాట్ మాదిరిగా తిన్నా ఆ టేస్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. మక్కీ డి రోటీ విత్ సర్సన్ డా సాగ్సార్సన్ డా సాగ్ అనేది సుగంధ ద్రవ్యాలు, ఆవపిండితో చేసే కర్రీ. మక్కీ డి రోటీ అంటే మొక్కజొన్న పిండితో చేసే ఒకవిధమైన రోటీ. వీటిని పెనంపై కాల్చరు. బోగ్గుల మీద లేదా వేడి గ్రిడిల్‌పై నేరుగా కాల్చుతారు. ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ మహీంద్రా మెచ్చే ఈ వంటకాలను ఓసారి ట్రై చేయండి మరీ..!.(చదవండి: యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?) -
యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. యాపిల్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్‌లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..అంబ్రి యాపిల్జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబ్రి రకం యాపిల్. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్లోల ఉపయోగిస్తారు. చౌబత్తియా అనుపమ్ ఇది ఎరుపురంగులో పండిన యాపిల్‌లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్ యాపిల్ రం. వీటిని ఎర్లీషాన్బరీ, రెడ్ డెలిషియన్ మధ్య క్రాస్ చేసి పడించిన యాపిల్స్. దీన్ని ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేస్తారు. గోల్డెన్ ఆపిల్దీన్ని గోల్డెన్ డెలిషియస్ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్ ప్రదేశ్‌లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్ సాస్, యాపిల్ బటర్, జామ్‌ల తయారీకి అనువైనది. గ్రానీ స్మిత్యాపిల్కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్ యాపిల్స్. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్లు, జ్యూస్‌లు, బేకింగ్ పదార్థాల్లో ఉపయోగిస్తారు. సునేహరి యాపిల్ఇది కూడా హైబ్రిడ్ యాపిల్‌కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. పార్లిన్ బ్యూటీ ఈ యాపిల్స్ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్ కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ రకం యాపిల్స్ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.ఐరిష్ పీచ్అత్యంత చిన్న యాపిల్స్. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్ ఇవి. స్టార్కింగ్ ఈ యాపిల్స్ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది రకకాల యాపిల్స్ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్‌లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
సీటీ చెఫ్.. టేస్ట్‌కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి