delhi High Court
-
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సర్వీస్ చార్జీ స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్టీ లేదా సర్వీస్ ట్యాక్స్ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్‌దారులైన ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్హెచ్ఆర్ఏఐ), నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆండియా(ఎన్ఆర్ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. -
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం. -
Justice Yashwant Varma : అలహాబాద్ కోర్టుకే జస్టిస్ వర్మ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : హోలీ పండుగ రోజు రాత్రి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో కోట్లు విలువ చేసే కాలిన కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చాయనే వార్త దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ఉపక్రమించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. నోట్ల కట్టల విషయంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రెండురోజుల కిందట ఘటన జరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లింది.అయితే, సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్లు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన తన పదవిని చేపట్టి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, జస్టిస్ వర్మ విషయాన్ని సమీక్షిస్తున్నామని,ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఒక రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
‘జస్టిస్ యశ్వంత్ తీర్పులన్నీ రివ్యూ చేయాలి’
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. ప్రధానంగా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు(న్యాయవాదులు) తమ నిరసన స్వరం పెంచారు. ఆ జడ్జి మాకొద్దంటూ ఇప్పటికే సీజేఐకి లేఖ రాసిన బార్ సభ్యులు.. మరోమారి అదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నారు.‘ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు విషయాన్ని క్లియర్ గా లేఖ ద్వారా తెలియజేశాం. ఆయన్ని ఇక్కడకు(అలహాబాద్ హైకోర్టు) బదిలీ చేయవద్దని కోరాం. ఎందుకంటే ఏ కోర్టు అయినా చెత్త పడేసి ప్లేస్ కాదు కదా. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగి క్లీన్ చీట్ వచ్చే వరకూ జస్టిస్ వర్మ అక్కడే ఉండాలి. జస్టిస్ వర్మ అక్కడే ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆయనపై విచారణను చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పటివరకూ ఇచ్చిన తీర్పులు అన్నింటిపై రివ్యూ చేయాలి. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలి’ అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు. మాకొద్దంటున్నా.. అలహాబాద్ హైకోర్టకే జస్టిస్ వర్మ -
మాకొద్దంటున్నా... అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ!
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనంకాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.సుప్రీంకోర్టులో పిల్..యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు. -
జస్టిస్ వర్మపై దర్యాప్తు... కీలక దశకు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు దొరికిన ఘటనపై దర్యాప్తు కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చురుగ్గా వ్యవహరిస్తోంది. తొలి దశ దర్యాప్తును ఇప్పటికే పూర్తిచేసింది. విచారణ కీలకమైన రెండో దశకు చేరినట్లు తెలిసింది. ఈ దశలో లభించే సాక్ష్యాధారాలే జస్టిస్ వర్మ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. త్రిసభ్య కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు సీజే జస్టిస్ అనూ శివరామన్ ఉన్న విషయం తెలిసిందే. కమిటీ దర్యాప్తును సీజేఐ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తొలి దశ దర్యాప్తులో ఫిర్యాదు ఆధారంగా కొందరు సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. అందులో తేలిన అంశాల ఆధారంగా రెండో దశలో మరింత లోతుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తవగానే సీజేఐకి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఇందుకు గడువేమీ నిర్దేశించలేదు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. కాలిపోయినట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ అందజేశారు. వాటిని ఆయన సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా తమ సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలేవీ దొరకలేదని ఢిల్లీ ఫైర్ సరీ్వసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తొలుత ప్రకటించారు. తానలా అనలేదంటూ మర్నాడే వివరణ ఇచ్చారు. నోట్ల కట్టల విషయం నిజమేనని తేలితే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ సిఫార్సు చేయవచ్చు. అనంతరం పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించవచ్చు. సీజేఐ ఖన్నాపై ప్రశంసల వర్షం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, కీలక డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం గొప్ప విషయమని న్యాయ నిపుణులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి ఉదంతాల్లో వివరాలను సాధారణంగా గోప్యంగా ఉంచుతుంటారు. కానీ వాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో తేవడం ద్వారా గొప్ప సంస్కరణకు సీజేఐ శ్రీకారం చుట్టారు. ఆయనకు మా సెల్యూట్’’ అని సీనియర్ అడ్వొకేట్లు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిష్ సి.అగర్వాల్ తదితరులు అభినందించారు. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటును కూడా ప్రశంసించారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బు కట్టల వీడియోను చూసి ఆందోళన చెందానని ఆదిష్ చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు కాలిపోయిన స్థితిలో దొరకడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేలాలని సీనియర్ న్యాయవాది మార్కండేయ ఖట్జూ అన్నారు. నాపై కుట్రలు: జస్టిస్ వర్మ నా ఇంట్లో ఎలాంటి నగదూ దొరకలేదు కాలిపోయాయంటున్న నోట్లతో సంబంధం లేదు నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు న్యూఢిల్లీ: తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత నోట్ల కట్టలేవీ లభించలేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయకు ఆయన లేఖ రాశారు. ఆ నోట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవి అక్కడికెలా వచ్చాయో తనకు తెలియదన్నారు. ‘‘అగ్నిప్రమాదం జరిగిన రోజు నేను ఇంట్లో లేను. ప్రమాదం తర్వాత స్టోర్‌రూంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు తొలగించడం గానీ, స్వాదీనం చేసుకోవడం గానీ జరగలేదని నా కుమార్తె, సిబ్బంది చెప్పారు. కాలిన నోట్లను అధికారులు నా కుటుంబసభ్యులకు చూపలేదు. ఆ నోట్లను వారు బయటకు తీసుకెళ్లినట్లు నా కుటుంబీకులు చూడలేదు. నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ స్టోర్‌రూంలో నగదు భద్రపర్చే అలవాటు లేదు. ఆ గదిలో మంటల్లో పాక్షికంగా కాలిన నగదు దొరికినట్లు చెప్పడం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం. దీని వెనక కుట్ర ఉంది’’ అని ఆరోపించారు. అందరూ స్వేచ్ఛగా తిరిగే స్టోర్‌రూంలో ఎవరైనా భారీగా నగదు దాస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు లేని నోట్లు తర్వాత అక్కడెలా ప్రత్యక్షమయ్యాయో దర్యాప్తు అధికారులే తేల్చాలన్నారు. ‘‘మేం బ్యాంకు ఖాతాల నుంచే ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం. నగదు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తుంటాం. వాటికి అన్ని లెక్కలూ ఉన్నాయి’’ అని చెప్పారు. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు!
ఢిల్లీ : హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లోనే కాదు ఇంటి సమీపంలో చెత్త కుప్పలో కాలిన రూ.500 నోట్లు ప్రత్యక్షమవ్వడంతో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక మలుపు తిరిగినట్లైంది.హోలీ పండుగ (మార్చి 14)న ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం,ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.#WATCH | A sanitation worker, Inderjeet says, "We work in this circle. We collect garbage from the roads. We were cleaning here 4-5 days back and collecting garbage when we found some small pieces of burnt Rs 500 notes. We found it that day. Now, we have found 1-2 pieces...We do… pic.twitter.com/qnLjnYvnfe— ANI (@ANI) March 23, 2025 ఈ విచారణ నేపథ్యంలో,జస్టిస్ వర్మ నివాసానికి సమీపంలోని చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో కాలిన రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కాలిన నోట్లు ఎవరివన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుడు ఇంద్రజిత్ మీడియాతో మాట్లాడుతూ.. మేం నాలుగైదు రోజుల క్రితం ఈ వీధిని శుభ్రం చేసే సమయంలో మాకు కాలిన నోట్ల కనిపించాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. శుభ్రం చేయడం మా పని. శుభ్రం చేసే సమయంలో ఇప్పటికీ కాలిన నోట్ల ముక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు, తన ఇంట్లో డబ్బులు లభ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. ఈ ఘటనలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. -
‘నాకే షాకింగ్‌గా ఉంది’.. కాలిన నోట్ల కట్టలపై జస్టిస్ యశ్వంత్ వర్మ
ఢిల్లీ: అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma)తో పాటు అతని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జరగడం షాకింగ్‌గా ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.ఢిల్లీ హైకోర్టు సీజేకు లేఖఆ డబ్బులు తన ఇంట్లో దొరకలేదని, ఆ గది తన ప్రధాన నివాసానికి ఏమాత్రం సంబంధలేదని తెలిపారు. ఇంట్లో సహాయకులు మాత్రమే ఆ గదిని వినియోగించుకునే వారని చెప్పారు. ఈ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు (devendra kumar upadhyaya) జస్టిస్ వర్మ ఒక లేఖ రాశారు. #BREAKING Video shared by Delhi Police Commissioner regarding the fire at Justice Yashwant Varma’s house, when cash currencies were discovered. pic.twitter.com/FEU50vHwME— Live Law (@LiveLawIndia) March 22, 2025 ఖండిస్తున్నానుఆ లేఖలో ‘నోట్ల కట్టలు దొరికాయని ఆరోపణలు వస్తున్న స్టోర్ రూం నిరుపయోగంగా ఉండేది. పాత ఫర్నిచర్, సీసాలు, వంట సామగ్రి, పరుపులు, పాత స్పీకర్లు, తోట పనికి అవసరమైన సామగ్రి, అలాగే సీపీడబ్ల్యుడి (CPWD) మెటీరియల్ వంటివి అక్కడ నిల్వ ఉంచేవారు. ఇంట్లో సహాయకులకు అందుబాటులో ఉండే గది. నా ఇంటికి దీనికి సంబంధం లేదు. కాని దీనిని నా ఇంటి భాగంగా చూపించడాన్ని నేను ఖండిస్తున్నాను.బ్యాంక్ ట్రాన్సాక్షన్‌ను పరిశీలించండిమార్చి 14న నేను, నా సతీమణి మధ్యప్రదేశ్‌లో ఉన్నాం. ప్రమాదం జరిగే సమయంలో తన ఇంట్లో తమ కుమార్తె, తల్లి మాత్రమే ఉన్నారు. మార్చి 15న తాము భోపాల్ నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నా కుమార్తె, నా ప్రైవేట్ సెక్రటరీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి కాల్ రికార్డులను పరిశీలించొచ్చు. అయితే, అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చాక అక్కడ నగదు కనిపించలేదు. నా కుటుంబ సభ్యులెవరూ స్టోర్ రూంలో నగదు ఉంచలేదు. మా డబ్బు లావాదేవీలు అన్ని బ్యాంకింగ్ చానెల్స్ ద్వారానే జరుగుతాయి. యూపీఐ, కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తాంనాకే షాకింగ్‌గా ఉందిఈ సందర్భంగా నాకు షాకింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే? నా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వెలుగులోకి వచ్చిన వీడియోలు,ఫొటోలు.. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే కనిపించలేదు. నా మీద కుట్ర జరుగుతోందని నాకు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటన నా వ్యక్తిత్వాన్ని, న్యాయవ్యవస్థలో నా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో కూడా సోషల్ మీడియాలో నాపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా వాటికి కొనసాగింపు అనేది నా అనుమానం.నా ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర నా న్యాయ జీవితంలో, నా న్యాయ నిర్ణయాల్లో ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నా నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలని కోరుతున్నాను’ అని సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిటీఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్ హర్యాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు.కాగా, ఈ కేసు పరిణామాలు తేలే వరకు జస్టిస్ వర్మకు కొత్త న్యాయపరమైన పనులను కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు. -
మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియోలు..
ఢిల్లీ: దేశంలో భారీ అవినీతి ఆరోపణ నడుమ జస్టిస్ యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలన్నీ మంటల్లో కాలిపోయాయి దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.ఇక, అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ.. శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.BREAKING 🚨Video of the cash pile at Justice Yashwant Varma’s residence. Delhi Police submits video of the cash pile, Supreme Court makes the video public. Justice Varma has said he has no knowledge of any such cash: pic.twitter.com/T0l5pkJvMK— Shiv Aroor (@ShivAroor) March 22, 2025మరోవైపు.. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. -
అప్పుడు కూడా జడ్జి యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టల కుప్ప!
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.2015లో అసలు విషయం వెలుగులోకి..అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది. -
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నగదు
-
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు.యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు. అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్ వర్మ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పదవి నుంచి తొలగించవచ్చా? న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే. ఫైర్ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్ఎస్ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) చీఫ్ అతుల్ గార్గ్ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు. పార్లమెంట్లో అభిశంసించాలి జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్ వికాస్ సింగ్ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది చెప్పారు. యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.పనికిరాని చెత్త మాకొద్దుయశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరీ యశ్వంత్ వర్మ? వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీకాం(ఆనర్స్), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్ సిబల్ స్పష్టంచేశారు. మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు.ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు. -
‘మీకెందుకివ్వాలమ్మా భరణం?’.. మహిళ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్‌కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. అయితే, సింగపూర్‌కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఆ పిటిషన్‌పై జస్టిస్ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్‌లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’
న్యూఢిల్లీ: భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.రూ. 15 కోట్లు పైమాటే..?అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ.. బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదుజస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. -
జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు.. సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.తొలగింపు ఎలాగంటే..అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. -
మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ను అపరిచితులకు చూపించలేం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యసించిన బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ హైకోర్టుకు చూపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈ డిగ్రీని అపరిచితులకు చూపించలేమని తేల్చిచెప్పింది. దీంతో మోదీ డిగ్రీకి సంబంధించిన కేసుపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పరీక్ష ఉత్తీర్ణులైన వారి వివరాలు ఇవ్వాలంటూ నీరజ్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ని కోరారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నీరజ్ వినతిపై సీఐసీ సానుకూలంగా స్పందించింది. 1978లో బీఏ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. అందుకు సహకరించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించింది. ఈ మేరకు 2016 డిసెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. సీఐసీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఐసీ ఆదేశాలపై హైకోర్టు 2017 జనవరి 23న స్టే విధించింది. సీఐసీ ఇచ్చిన ఆదేశాలు న్యాయబద్ధమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకొనే హక్కు ఆర్టీఐ చట్టం కింద దేశ ప్రజలకు ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా గురువారం విచారణ జరిపారు. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘తెలుసుకొనే హక్కు’ కంటే ‘గోప్యత హక్కు’ మిన్న అని వెల్లడించారు. ప్రధానమంత్రికి ఉన్న గోప్యత హక్కు దృష్ట్యా ఆయన డిగ్రీని ఆర్టీఐ చట్టం కింద అపరిచితులకు చూపించడం సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయపరమైన ఉద్దేశాలతో ప్రధానమంత్రి సర్టిఫికెట్‌ను కోరుతున్నారని ఆక్షేపించారు. సీఐసీ ఉత్తర్వులను తిరస్కరించాలని విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
వైఎస్ జగన్ పరువు నష్టం కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తనపై తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వేసిన పరువునష్టం కేసు విచారణ జూలై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో ఆదానీ గ్రూపు పై దాఖలైన కేసులో భాగంగా వైఎస్ జగన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు ప్రచురించాయి. దీనిపై వైఎస్ జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఉషోదయ పబ్లికేషన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ అప్లికేషన్ కు కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరుపు న్యాయవాది దయ కృష్ణన్ హైకోర్టుకు తెలిపారు. దాంతో తదుపరి విచారణ జూలై 16 కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. -
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
గౌనును బట్టి గౌరవం లభించదు
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్.. అనుకున్నదే జరిగిందిగా..!
-
ఎన్టీపీసీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట
జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్‌కు రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ను ఆదేశించిన 2019 మధ్యవర్తిత్వ తీర్పును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ‘పేటెంట్ చట్టవిరుద్ధం’, ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది.వివాదం నేపథ్యంఎన్టీపీసీ, జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) మధ్య 2011లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం కారణంగా ఈ వివాదం తలెత్తింది. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్టీపీసీకి చెందిన ఫరక్కా థర్మల్ పవర్ ప్లాంట్‌కు జాతీయ జలమార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జిందాల్ ఐటీఎఫ్ బాధ్యత వహించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో జాప్యం జరిగింది. ఫేజ్ 1 పనులు.. 400 రోజులు, ఫేజ్ 2 పనులు.. 674 రోజులు ఆలస్యం అయ్యాయి. 2017లో జిందాల్ ఐటీఎఫ్ మధ్యవర్తిత్వ చర్యలను ప్రారంభించింది. జాప్యం వల్ల జరిగిన ఆదాయ నష్టానికి ఎన్టీపీసీ పరిహారం కోరింది. తర్వాత జిందాల్ ఐటీఎఫ్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.ఇదీ చదవండి: మనిషిలా తెలివి మీరుతున్న ఏఐఎన్టీపీసీ ఒప్పందాన్ని రద్దు చేసినందుకు 2019 జనవరిలో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ జిందాల్ ఐటీఎఫ్‌కు మద్దతుగా రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కాంట్రాక్ట్ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, ‘నో డ్యామేజీ’ క్లాజ్ ఉండటం సహా పలు కారణాలను చూపుతూ ఎన్టీపీసీ ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేసింది. ట్రిబ్యునల్ నష్టపరిహారాలను సరైన రీతిలో లెక్కించలేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది. తగిన శ్రద్ధ, నైపుణ్యంతో ప్రొసీడింగ్స్ నిర్వహించడం మధ్యవర్తి బాధ్యతని కోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని జిందాల్ ఐటీఎఫ్ యోచిస్తోంది. -
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం. -
‘శారీరక సంబంధం’ లైంగిక దాడి కాదు
న్యూఢిల్లీ: పోక్సో కేసులో జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలు ‘శారీరక సంబంధం’అని చెప్పినంతమాత్రాన లైంగిక దాడి చేసినట్లు కాదని పేర్కొంది. 2017లో ఓ మహిళ... తన 14 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. నిందితుడితో పాటు బాలిక ఫరీదాబాద్‌లో దొరికారు. తామిద్దరికీ శారీరక సంబంధం ఏర్పడిందని బాధితురాలు వెల్లడించింది. అయితే మైనర్ కావడంతో ఆ వ్యక్తిమీద పోక్సో చట్టం కింద జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై నిందితుడు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం విచారణకు అనుమతించింది. విచారించిన ధర్మాసనం బాధితురాలు స్వచ్ఛందంగా నిందితుడితో వెళ్లినప్పుడు లైంగిక దాడి జరిగిందని ట్రయల్ కోర్టు ఎలా నిర్ధారించిందో స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించింది. -
వివాదాస్పద మాజీ ట్రెయినీ IAS అధికారిణి పూజాకు ఖేద్కర్ కు షాక్
-
పూజా ఖేద్కర్‌కు మరో షాక్.. అరెస్టు తప్పదా?
ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. #BREAKING Delhi High Court denies anticipatory bail to former probationer IAS officer Puja Khedkar accused of “misrepresenting and falsifying facts" in her UPSC application. #PujaKhedkar #UPSC pic.twitter.com/mgw3QYhaux— Live Law (@LiveLawIndia) December 23, 2024పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్‌కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.‘పిటిషనర్ (పూజా ఖేద్కర్) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’ ‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్ల ఆధారంగా పూజా ఖేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్ శాఖ పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదన్న చర్చ మొదలైంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కారు. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపుఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్‌పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరణఈ వివాదంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. -
‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అనుబంధ పిటిషన్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తరువాత మీరు ఏ కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసీ ప్రచురించినట్లుగానే భావిస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.రూ.100 కోట్లకు పరువు నష్టం దావాసౌర విద్యుత్ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు. తనకు కలిగిన పరువు నష్టానికి రూ.వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, ప్రకటనలు ఇవ్వకుండా, నిందారోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు. తనపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, దానిని ప్రముఖంగా ప్రచురించేలా, ప్రసారం చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో హైకోర్టును అభ్యర్థించారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, ట్వీట్లు, ఇతర లింకులను గూగుల్ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.జగన్ ప్రస్తావన ఎక్కడా లేదుఈ పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, న్యాయవాదులు అమిత్ అగర్వాల్, సాహిల్ రావిన్, రాహుల్ కుక్రేజా వాదనలు వినిపించారు. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్మోహన్రెడ్డికి ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు నిరాధారమైనవన్నారు. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు. యూఎస్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలను ఉటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలిపారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా జగన్మోహన్రెడ్డి ప్రస్తావన గానీ, ఆయనకు ముడుపులు ఇచ్చినట్లుగానీ, ఆయన తీసుకున్నట్లుగా గానీ లేనే లేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో యూఎస్ కోర్టు నుంచి జగన్ ఎలాంటి నోటీసు అందుకోలేదని తెలిపారు. అయినా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ కథనాల్లో జగన్మోహన్రెడ్డి ప్రస్తావన తెస్తూ తప్పుడు కథనాలు ప్రచురించాయని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్... తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేశారు.దావాలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సెకీతో ఒప్పందం..ఈ మొత్తం వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించినది. వాస్తవానికి ఈ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చొరవతో జరిగింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. సెకీ స్వయంగా 15.9.2021న ఈ ఒప్పందం ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇందులో సెకీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా లబ్ధి పొందేందుకు సెకీ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. సెకీ ఆఫర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటంటే... రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటి వరకు కొన్న సౌర విద్యుత్ ధరల కంటే సెకీ అందించే విద్యుత్ ధరే అతి తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీ (ఐఎస్‌టీసీ)లను కూడా ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు మినహాయించింది. దీనివల్ల ఏటా రూ.4,420 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైనే ఆదా అవుతుంది.ఆ తప్పుడు కథనాల వెనుక టీడీపీ రాజకీయ ప్రయోజనాలు..నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నా. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి నవంబర్ 21 నుంచి తప్పుడు కథనాలు వెలువరించడం మొదలుపెట్టాయి. అమెరికా కోర్టులోని ప్రొసీడింగ్స్‌లో.. నాకు ముడుపులు ఇచ్చినట్లు, నేను తీసుకున్నట్లు పేర్కొన్నారని, సెకీ అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించలేదని, సెకీతో ఒప్పందాన్ని హడావుడిగా 7 గంటల్లోనే పూర్తి చేశామంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. వాస్తవానికి సెకీతో ఒప్పందంలో ఎలాంటి నేరం జరగలేదు. అమెరికా కోర్టుల్లో దాఖలు చేసిన నేరారోపణలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ కోర్టుల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా కూడా నాకు లంచాలు ఇచ్చినట్లుగానీ, నేను తీసుకున్నట్లు గానీ లేదు. అలాగే అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను సెకీ మినహాయించలేదన్న వాటి కథనాలు అసత్యం. నాపై మోపిన నిందారోపణలు, సాగిస్తున్న దుష్ప్రయోజనాల వెనుక తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఆ తప్పుడు కథనాలపై సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్సీపీ ఖండన కూడా ఇచ్చింది.రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం..అది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. అందులో ఏపీ ప్రభుత్వం, డిస్కంలు, సెకీ మినహా మరెవరూ లేరు. రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విస్మరిస్తుందా? వదులుకుంటుందా? ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి అవకాశాన్ని వదులుకుంటే అది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది. అంతేకాక అలా వదులుకుంటూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావా? దురుద్దేశాలు ఆపాదించరా? సెకీతో ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను అధికారుల కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం సమర్పించిన నివేదిక ప్రకారం మంత్రిమండలి 28.10.2021న ఆమోదించింది. 11.11.2021న ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సైతం తన ఆమోదాన్ని తెలిపింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ 30.11.2021న కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. ఆ తరువాతే 1.12.2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో సెకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడూ మినహా ఈ ఒప్పందంలో మరెవరూ లేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ ఒప్పందం కుదిరింది.టీడీపీ హయాంలో యూనిట్ గరిష్టంగా రూ.6.99నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సౌర విద్యుత్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. ఈ విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు అందరికీ తెలుసు. 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో సౌర విద్యుత్ యూనిట్ ధర రూ.6.99 వరకు ఉంది. టీడీపీ హయాంలో డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వల్ల పవన విద్యుత్ యూనిట్ ధర రూ.4.70 నుంచి రూ.4.84 వరకు ఉండేది. నేను సీఎం అయిన తరువాత ఈ ధరలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల యూనిట్ రూ.2.49కే అందే అవకాశం కలిగింది.యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది...రాష్ట్రంలో రైతాంగానికి నిరాటంకంగా 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు వీలుగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అయితే దానిపై న్యాయ వివాదం నెలకొంది. దీనిపై మేం న్యాయ పోరాటాలు చేశాం. మేం న్యాయ పోరాటంలో ఉండగానే 2021 సెప్టెంబర్ 15న సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర చరిత్రలో తక్కువ ధరకే సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది. ఇçప్పటి వరకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కెల్లా ఇదే అతి తక్కువ ధర. దీనివల్ల వచ్చే 25 ఏళ్ల పాటు నిరాటంకంగా సౌర విద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తూ దూరదృష్టితో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం లేఖ రాసింది.వారు రాసినవేవీ యూఎస్ కోర్టు నేరారోపణల్లో లేవు...యూఎస్ కోర్టులో జరిగిన లీగల్ ప్రొసీడింగ్స్‌ను ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి నాపై తప్పుడు, అవాస్తవ కథనాలను ప్రచురించాయి. నాపై తప్పుడు నిందారోపణలు మోపారు. వారు రాసిన తప్పుడు కథనాల్లోని అంశాలేవీ యూఎస్ కోర్టులో దాఖలైన నేరారోపణల్లో లేవు.నా కుటుంబం పట్ల వారి శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయిఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాలు నా పట్ల, నా కుటుంబం పట్ల వారికున్న శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా వారు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నా పట్ల ఎలాంటి దాపరికం లేని తీవ్ర వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పటికీ వారు అసత్యాలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలు ప్రచురించారు. వీటి వెనుక విస్తృత రాజకీయ అజెండా ఉండేందుకు ఆస్కారం ఉంది. వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చా. బేషరతుగా క్షమాపణలు చెబుతూ, మొదటి పేజీలో దానిని ప్రముఖంగా ప్రచురించాలని సూచించినా వారు తప్పుడు కథనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరికీ హక్కు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడే నెట్వర్క్ తప్పుడు కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విఘాతం కలిగించాయి. ఆ కథనాలు నా జీవితానికి, హుందాతనానికి భంగం కలిగించాయి.సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంరూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అయితే ఆ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు వర్తిస్తుందని స్పష్టంగా ఉంది. -
వైఎస్ జగన్ ఇంటెరిమ్ అప్లికేషన్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
ఢిల్లీ, సాక్షి: తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఈ రెండు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలు రాశాయి. అయితే అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ.. పరువు నష్టం దావా వేశారు వైఎస్ జగన్. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. అయితే జగన్ ఇచ్చిన గడువు ముగిసినా.. ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేదు. దీంతో చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు పంపించారు. ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.కాగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. టీడీపీ తోక పత్రికల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అసత్య కథనాలు ప్రచురించాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావాకు వెళ్లారు. -
ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్‌ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
నచ్చకపోతే భారత్‌లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్‌లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
విజయసాయి రెడ్డిపై తప్పుడు కథనాలు.. ఎల్లో మీడియాకు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్..
-
ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు షాక్
-
14 మంది మృతి యాదృచ్ఛికం కాదు: ఢిల్లీహైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశాకిరణ్ షెల్టర్‌హోమ్‌లో స్వల్ప వ్యవధిలో 14 మంది మృతి చెందడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. షెల్టర్‌హోమ్‌లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్రావ్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం(ఆగస్టు5) విచారించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. షెల్టర్ హోమ్‌లో ఉండాల్సినదాని కంటే ఎక్కువ మంది ఉంటే కొందరిని అక్కడి నుంచి తరలించాలని సూచించింది. షెల్టర్‌హోమ్‌లోని మంచినీటి పైపులైన్లతో పాటు డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించాలని, అక్కడి తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి షెల్టర్‌హోమ్‌లో మొత్తం 25 మంది చనిపోగా కేవలం జులైలోనే 14మంది మరణించారు. -
బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్‌పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించున్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.బెయిల్‌పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుదీ తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కవితకు బెయిల్? ఢిల్లీ హైకోర్టులో విచారణ
-
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తెలిపారు. తమ కౌంటర్ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు. -
కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్‌ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
ఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇక.. గత ఏడాది అక్టోబర్‌లో ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. అమానతుల్లా ఖాన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా ఇప్పటి వరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్ఐఆర్లో నమోదు అయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కథువా కేసు : మీడియాపై హైకోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం పట్ల మీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన కేసులో బాధితురాలి వివరాలను వెల్లడించిన పలు మీడియా సంస్థలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ సుమోటోగా ఈ అంశాన్ని చేపట్టి ఆయా మీడియా సంస్థల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తమపై ఎందుకు చర్యలు చేపట్టరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీప గ్రామం రసానా నుంచి బకేర్వాల్ ముస్లిం వర్గానికి చెందిన బాలిక అదృశ్యమైంది. వారం రోజుల అనంతరం అక్కడికి దగ్గర్లోని అడవుల్లో శవమై తేలింది. ఆమెపై నిందితులు సామూహిక లైంగిక దాడికి తెగబడి, అనంతరం దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు నిందితులపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అభియోగాలు నమోదు చేసింది. -
‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్‌పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ డుప్లెసిస్పై కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్‌కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్‌లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్‌గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. -
ఆధార్ : లాయర్లకు దానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు లేనప్పటికీ రిటర్నులు దాఖలు చేసే అనుమతి న్యాయవాదులకు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు వివరాలు ఇవ్వన్నప్పటికీ అనుమతి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు ముకుల్ తల్వార్, వ్రిండా గ్రోవర్లు దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు డివిజిన్ బెంచ్ నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ మే 14న చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకునే తుది గడువు జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆధార్ చట్టాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంటూ వస్తోంది. ఇది ఒక సరసమైన, సహేతుకమైన చట్టంగా కేంద్రం అభివర్ణిస్తోంది. గోప్యతా హక్కు విషయంలో చారిత్రక తీర్పుకు ఇది కట్టుబడి ఉందని తెలిపింది. కాగ, గతేడాది ఆగస్టులో గోప్యత హక్కు, ప్రజల ప్రాథమిక హక్కు అని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ బెంచ్ చారిత్రక తీర్పు వెలువరించింది. మరోవైపు ఆధార్ స్కీమ్ వాలిడిటీపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్‌తో విచారిస్తోన్న సంగతి తెలిసిందే. -
జూలై వరకు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి గణితం పేపర్ లీకైన నేపథ్యంలో ఆ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సంస్థను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ లీకేజీ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ సోషల్ జ్యూరిస్ట్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. గణితం పేపర్ ఎక్కడెక్కడ లీకయిందో పరిశీలిస్తున్నామనీ, జూలైలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశముందని సీబీఎస్ఈ చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య విద్యార్థులను ముళ్లపై కూర్చోబెట్టడం లాంటిదేననీ, అసలు పరీక్ష నిర్వహణకు జూలైదాకా ఆగాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. గణితం పరీక్షను మళ్లీ నిర్వహించడంపై తమ అభిప్రాయాన్ని ఏప్రిల్ 16లోగా తెలియజేయాలని సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్క్రిప్టెడ్ విధానంలో సీబీఎస్ఈ పరీక్షలు పది, పన్నెండో తరగతి పరీక్ష పేపర్లు లీకైన నేపథ్యంలో సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా సరికొత్త విధానంలో సోమవారం పరీక్షల్ని నిర్వహించింది. పరీక్షకు కేవలం 15 నిమిషాల ముందు ఎన్క్రిప్టెడ్ ప్రశ్నపత్రాన్ని నిర్వాహకుల ఈ–మెయిల్‌కు సీబీఎస్ఈ పంపగా, వారు దాన్ని డౌన్‌లౌడ్ చేసుకున్నారు. కొన్నిచోట్ల బంద్ కారణంగా, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. -
ఆప్ ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు
-
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట!
-
ఆ 20మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పడ్డ అనర్హత వేటును హైకోర్టు పక్కన పెట్టింది. ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కోర్టు తీర్పును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించే అవకాశం గతంలో ఇవ్వలేదు. అందుకే కోర్టు నేడు ఆ ఆప్ ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ ఆప్ ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి పరిశీలించనుందని ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు కారణమిదే.. 2015 జవనరిలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. బీజేపీని ఢీకొడుతూ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చిన కేజ్రీవాల్, మరో 20 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. 20 ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు పొందారాని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ 2017 సెప్టెంబర్ 28న మొదటి సారి, నవంబర్ 2న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘకం ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిన నిర్ణయానికి దోహదపడింది. నోటీసులకు ఓసారి సమాధానం ఇచ్చినా అందుకు ఈసీ సంతృప్తి చెందలేదు. ఆప్ నేతలు ఏకంగా ఈసీని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా! అంటూ ఈసీ గత జనవరిలో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఏకే చావ్లా బెంచ్ ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించిన అనంతరం వారికి ఊరట కల్పిస్తూ తీర్పిచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోర్టు ఆదేశించింది. -
కార్తీ చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును తమకు సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక బెయిల్ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 16న కార్తి, సీబీఐ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, తదుపరి నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది. ప్రస్తుతం కార్తికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను కార్తి తారుమారు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ సీబీఐ వాదించింది. అయితే సాక్ష్యాధారాల టాపరింగ్ చేసిన ఆరోపణలను కార్తి లాయర్లు ఖండించారు. తుదపరి కస్టోడియన్ ఇంటరాగేషన్‌ను సీబీఐ కోరనప్పుడు, ఇంకెందుకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిందని ప్రశ్నించారు. కార్తీపై ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయలేదని వాదించారు. అంతేకాక ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో యూకే నుంచి వస్తున్న కార్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లగా పేర్కొంది. -
రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది. -
రాజా, కనిమొళికి నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్ఏ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. -
శరద్‌యాదవ్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, జేడీయూ బహిష్కృత నేత శరద్‌యాదవ్ అనర్హత కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ కేసులో తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రస్తుతం యాదవ్ అందుకుంటున్న వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి రావొచ్చని జస్టిస్ రాజీవ్ షక్ధర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొనడంతో శరద్‌యాదవ్, అన్వర్ అలీలను జేడీయూ సిఫార్సు మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 2017, డిసెంబర్ 4న అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ యాదవ్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ పూర్తయ్యేవరకూ ఎంపీలకు అందే అన్ని సౌకర్యాలను వీరిద్దరికీ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శరద్‌యాదవ్‌కు అందిస్తున్న సౌకర్యాలను తొలగించాలంటూ జేడీయూ రాజ్యసభ నేత రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానందున ఆయనకు ఎలాంటి వేతనం, అలవెన్సులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ రాజీవ్ తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను సింగిల్ జడ్జీ లేదా డివిజన్ బెంచ్‌లలో ఎవరికి అప్పగించాలన్న దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న యాదవ్ పదవీకాలం 2022లో, అన్వర్ పదవీకాలం వచ్చేఏడాదితో ముగియనుంది. -
మళ్లీ పెళ్లి కోసం కోర్టుకు మాజీ సీఎం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహబంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందనీ.. కాబట్టి మరో వివాహం చేసుకునేందుకు వీలుగా భార్య పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్ దీపా శర్మల ధర్మాసనం.. ఈ విషయమై ఏప్రిల్ 23లోగా స్పందనను తెలియజేయాలని పాయల్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలన్న ఒమర్ విజ్ఞప్తిపై కూడా పాయల్ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది. 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్‌కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తమ వివాహబంధం కోలుకోలేనంతగా దెబ్బతిందని నిరూపించడంలో ఒమర్ విఫలమయ్యారని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్, పాయల్‌లకు 1994, సెప్టెంబర్ 1న వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో ఒమర్–పాయల్ల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2009 నుంచి వీరు విడిగా ఉంటున్నారు. -
నీట్ అర్హత నిబంధనలపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 చివరితేదీ కాగా పరీక్ష మే 6న జరగనుంది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది n eligibility norms for NEET -
పూలన్ దేవి హత్య: పెళ్లిపీటలెక్కిన ప్రధాన నిందితుడు
సాక్షి, న్యూఢిల్లీ: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి హత్య కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణా(41) మరోసారి వార్తల్లో నిలిచాడు. షేర్ సింగ్ నిన్న (మంగళవారం) వివాహం చేసుకోవడంతో పూలన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. పూలన్‌దేవి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న షేర్ సింగ్ కొంతకాలం కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రతిమా సింగ్‌తో కలిసి షేర్ సింగ్ పెళ్లిపీటలెక్కాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వైభవంగా ఈ వివాహం జరిగింది. ప్రతిమాసింగ్‌తో వివాహం అనంతరం షేర్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడాడు. 'అంతా దేవుడి మీద భారం వేశాను. కేసు నుంచి బయట పడేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని' షేర్ సింగ్ అన్నాడు. బందిపోటుగా జీవనం సాగించిన అనంతరం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న పూలన్‌దేవి సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఎస్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను షేర్ సింగ్ రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి ఆమెను కాల్చి చంపారు. 2014 ఆగస్టులో ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించగా.. రాణా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2016లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
సింగ్ బ్రదర్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధ సంస్థ దైచీ శాంక్యో , సింగ్ బ్రదర్స్ వివాదంలో సింగ్ బ్రదర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో 3500 కోట్ల రూపాయల దావాను దైచీ శాంక్యో గెలిచింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జపనీస్ దిగ్గజం దైచీ శాంక్యో దాఖలు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో రాన్‌బాక్సీ మాజీ అధిపతులు సింగ్ బ్రదర్స్‌నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పును అమలు చేయాలంటూ మే, 2016 లో ఢిల్లీ హైకోర్టును దైచీ ఆశ్రయించింది. అయితే, ఈ అవార్డును అమలు చేయడానికి భారత మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం సబ్‌స్టాంటివ్ అభ్యంతరాలున్నాయంటూ సింగ్ బ్రదర్స్ దీన్ని సవాల్ చేశారు. దీనిపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఔషధ సంస్థ దైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పుడు నివేదికలు అందించిన కేసులో అప్పటి ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ భారీ నష్టపరిహార కేసును ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో దైచీ శాంక్యో 2013లో సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. -
డివిజన్ బెంచ్‌కు ఆప్ పిటిషన్
న్యూఢిల్లీ: తమపై అనర్హత వేటును రద్దు చేయాలని ఆప్ మాజీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఆ మేరకు జస్టిస్ విభు బఖ్రుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. కేసును విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలా? అన్నది మంగళవారం ప్రధాన న్యాయమూర్తి తేల్చనున్నారు. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు జారీచేయవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: అనర్హతకు గురైన ఆప్ ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇక ఇక ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించగా, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇక మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. -
సమరానికి సమయం!
పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించారు. మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. అయితే మధ్యంతరంగా వస్తున్న ఈ ఎన్నికల్లో అన్ని పక్షాలూ తమకు ఉన్న ప్రజాదరణను పరీక్షించుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఎన్నికల్లోపార్లమెంటరీ సెక్రెటరీల నియామకం ఎప్పటి నుంచి మొదలైంది? ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం1953 నుంచి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ పదవుల్లో శాసనసభ్యులు కొనసాగుతున్నారు. అయితే, 2014 నుంచి తెలంగాణ, పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణాలో జరిగిన ఈ నియామకాలు హైకోర్టుల తీర్పుల ఫలితంగా రద్దయ్యాయి. 2004లో ఇలాంటి నియామకాలను అనుమతించే అస్సాం చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లో పదవుల్లో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీలు రాజీనామా చేశారు. 2014లో తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు సర్కారు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన ఆరుగురు శాసనసభ్యుల నియమకాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ఏ సందర్భంలోనూ ఈ పదవులు చేపట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రయత్నాలు జరగలేదు. అనర్హత వేటుకు ఆస్కారమిచ్చే లాభదాయక పదవి అంటే? సభ్యత్వం పోవడానికి దారితీసే లాభదాయక పదవి(ఆఫీస్ ఆప్ ప్రాఫిట్) అంటే రాజ్యాంగంలోగాని, ప్రజాప్రాతినిధ్యచట్టం(1951)లోగాని నిర్వచించలేదు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా లాభదాయకపదవులను నిర్ధారిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనం ఉంటే దాన్ని ఇలాంటి పదవిగా పరిగణిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవరించిన 164 (1ఏ) అధికరణ కారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో సభ్యులు ఆయా దిగువసభల సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు. కేంద్రపాలితప్రాంతమైన ఢిల్లీలో మంత్రులు పదిశాతం దాటకూడదు. అదీగాక చీఫ్, పార్లమెంటరీ కార్యదర్శులు ఒక వేళ ప్రభుత్వం అందించే జీతాలు, సౌకర్యాలు పొందకపోయినాగాని ఇప్పుడు వారిని సహాయ మంత్రులుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఆప్ ఎమ్మెల్యేలు ఈ పదవుల్లో ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అయితే, వారిని ఎన్నికల కమిషన్ మంత్రులుగా పరిగణించి వారిపై అనర్హత వేటు ప్రక్రియ ప్రారంభించి ఆదివారం పూర్తిచేసింది. ఢిల్లీ మంత్రులు అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పది శాతం లోపే ఉన్నప్పటికీ అదనంగా నియమించిన 20 మంది పార్లమెంటరీ కార్యదర్శులను సహాయ మంత్రులుగా లెక్కించారు. ఫలితంగా వారు ఈసీ చర్యతో సభ్యత్వం కోల్పోయారు. ఈ పరిణామాలు రెండు ప్రధాన రాజకీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పాలకపక్షం ఆప్‌కు రాజధానిలో ప్రజల మద్దతు ఎంతుందో ఉప ఎన్నికలు తేలుస్తాయనడంలో సందేహం లేదు. హరియాణాలోనూ నలుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు పిటిషన్! గతంలో చీఫ్ పార్లమెంటరీ సెక్రెటరీలుగా హరియాణా ప్రభుత్వం నియమించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను కిందటేడాది హైకోర్టు రద్దచేసింది. రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి అనుమతించే ప్రత్యేక చట్టం ఉన్నందున ఎమ్మెల్యేలపై చర్యకు ఆస్కారం లేదని, దిల్లీ, హరియాణా పరిస్థితులకు పొంతన లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మారని ఆమె కథ!
న్యాయమూర్తి అయినా.. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించే అధికారి అయినా.. ప్రజాప్రతినిధి అయినా.. చివరికి ఓ ఆఫీసులో పనిచేసే క్లర్క్ అయినా.. ఇంట్లో పనిమనిషి అయినా.. ఎక్కడ చూసినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఆకాశంలో సగం అని కీర్తిస్తున్నా.. అణు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ఢిల్లీ ట్రాఫిక్ కోర్టు మహిళా న్యాయమూర్తి ఉదంతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా సీనియర్ న్యాయవాది, హక్కుల ఉద్యమవేత్త వృందా గ్రోవర్‌ను నియమించింది. మరోవైపు హాలీవుడ్ సినీ పరిశ్రమలో పెద్ద తలకాయ హార్వే వెయిన్‌స్టీన్ హీరోయిన్లు, మోడల్స్‌ను వేధించిన బాగోతాలు బయటపడడంతో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. - సాక్షి, తెలంగాణ డెస్క్ ఆమె ఢిల్లీలో ట్రాఫిక్ కోర్టు న్యాయమూర్తి.. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులపై విచారణ జరుపుతున్నారు.. ఓ ముద్దాయికి కాస్త తీవ్రమైన శిక్ష విధించారు.. దీంతో ఆ ముద్దాయి తరఫు సీనియర్ పురుష న్యాయవాది ఒక్కసారిగా రెచ్చిపోయాడు.. కనీస సంస్కారాన్ని మరిచి ‘అసలు నువ్వేంటి? నీ సాయేమిటి? నీ చెడ్డీ చింపి పడేస్తా.. (తెరీ ఔకాత్ క్యా హై.. తెరీ చెడ్డీ ఫాడ్కే రఖ్ దూంగా..)’ అంటూ బూతులు తిట్టాడు.. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చేశారు. పోలీసు కేసు పెట్టారు. కానీ రెండు నెలలు గడిచినా ఆ న్యాయవాదిపై చర్యల్లేవు. కేసులో చార్జిషీటు కూడా దాఖలు కాలేదు. ఇతర న్యాయమూర్తులు, న్యాయ వాదులు కూడా ‘విచారణ అవమానాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? రాజీ చేసుకోవడం మంచిదేమో..’ అన్నట్లుగా మాట్లాడారు. రెండేళ్లయినా ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకంగా న్యాయమూర్తికే ఇలాంటి దుస్థితి. ఆమె బాధ అర్థం చేసుకునేదెవరు? ఆమె 15 ఏళ్ల బాలిక.. తండ్రి చనిపోయాడు.. తనకన్నా ముగ్గురు చిన్నవాళ్లున్నారు.. తల్లి పాచిపని చేసి పోషిస్తోంది.. దీంతో చేదోడుగా ఉండేందుకు ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. ఆ ఇంటి యజమాని తండ్రి 60 ఏళ్ల ముసలివాడు. ఎప్పుడూ ఆ బాలిక వెనకే తిరుగుతూ ఉంటాడు. ఎలాగోలా తాకాలని చూడడం.. చేయి వేయడం.. రాత్రిళ్లు వెళ్లి గది తలుపుకొట్టడం. ఇంట్లో వాళ్లంతా ఎటైనా వెళుతున్నప్పుడు కావాలని ఒక్కడే ఉండిపోవడం.. ఆ బాలికను లొంగదీసుకోవాలని చూడడం.. వంటివి చేసేవాడు. ఈ విషయం అందరికీ చెబుతానంటే.. దొంగతనం చేశావంటూ పోలీసులకు పట్టిస్తానని బెదిరించేవాడు. విషయం తెలిస్తే పని మాన్పించేస్తుందని, ఇంట్లో కష్టమవుతుందని తల్లికి కూడా చెప్పుకోలేకపోయింది.. చివరికి వేధింపులు తట్టుకోలేక పనిమానేసింది. ఈ బాలికే కాదు.. వేలాది మంది నిరుపేద బాలికలు, మహిళలు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు. కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే మహిళా న్యాయమూర్తులకు తరచూ వేధింపులు ఎదురవుతుంటాయని ఓ మహిళా న్యాయమూర్తి వెల్లడించారు. ‘‘కొందరు న్యాయవాదులు మహిళా న్యాయమూర్తిని ఉద్దేశించి.. ‘నువ్వు.. నీకు’ అంటూ ఏకవచనంతో మాట్లాడుతుంటారు. నేరుగా అనకుండా.. మాకు వినిపించేలా మాట్లాడుతుంటారు. కానీ మాలో చాలా మంది అలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేద్దామనుకున్నా బార్ అసోసియేషన్లు, తోటి పురుష న్యాయమూర్తులు ‘రాజీ’ చేసుకొమ్మని.. క్షమించేయాలని ఒత్తిడి తెస్తుంటారు. ఎందుకంటే పురుష న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కదా. ఇక పై స్థాయి కోర్టుల్లోనూ ఏం జరుగుతుందనే దానిని పట్టించుకోరు. అసలు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి జడ్జీల కోసం ఫోరం ఉందా, లేదా అన్నదీ తెలియదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా న్యాయమూర్తుల విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మహిళా న్యాయవాదుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చని వృందా గ్రోవర్ పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా ఈ వృత్తిలో సీనియర్లు, అనుభవజ్ఞులైన లాయర్ల వద్ద పనిచేయాల్సిన స్థితి యువ మహిళా న్యాయవాదులకు మరింత ఇబ్బందికరం. ఎవరెవరికీ దూరంగా ఉండాలనేది వారికి చాలా త్వరగానే అర్థమైపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సమస్యను గుర్తించిన నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. న్యాయాధికారులు, లాయర్లు, కోర్టు సిబ్బందిలో మహిళల శాతాన్ని పెంచితే ఈ సమస్య తగ్గుతుందన్నారు. తాను న్యాయవాద వృత్తిలోకి వచ్చేనాటికి ఈ రంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారని.. తానూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. ఫిర్యాదు చేసేది చాలా తక్కువ దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల అంశంపై జాతీయ బార్ అసోసియేషన్ (ఐఎన్‌బీఏ) ఈ ఏడాది జనవరిలో విస్తృత సర్వే చేసింది. అన్ని రంగాలు, వృత్తుల్లోనూ.. అన్ని స్థాయిల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించింది. అసలు వేధింపులకు గురవుతున్నవారిలో 70 శాతం మహిళలు అసలు ఫిర్యాదే చేయడం లేదని తేల్చింది. ఇక జూన్‌లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చేసిన ఓ సర్వేలో.. ప్రైవేటు సంస్థల్లోని మహిళా మేనేజర్లలో 44 శాతం మంది తాము లైంగికపరమైన వేధింపులకు గురయ్యామని వెల్లడించినట్లుగా పేర్కొంది. తోటి పురుష ఉద్యోగులు, పైఅధికారులు తమ ప్రవర్తన, మాట తీరుతో వేధిస్తున్నారని.. కొందరు భౌతికంగా వేధింపులకు తెగబడుతున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఇలాగైతే ఎలా మరి? - పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. యాజమాన్యాలు కేవలం సదరు పురుష ఉద్యోగులను మరో విభాగానికో, మరో చోటికో బదిలీ చేయడంతో సరిపెడుతున్నాయి. - ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని కూడా సస్పెన్షన్‌లో ఉంచడం, ఉద్యోగం నుంచి తొలగించడం.. సదరు పురుష ఉద్యోగి తప్పు చేసినట్లు రుజువయ్యాకే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం వంటి చర్యలు చేపడుతున్నాయి. దీంతో మహిళలు వేధింపులకు గురైనా ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. - మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేసినప్పుడు.. అది వాస్తవమని ఎలా రుజువు చేయాలనేది ఇబ్బందికరంగా మారుతోంది. - పై అధికారులపై ఫిర్యాదు చేస్తే.. వేధింపులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో మరీ తీవ్రమైన ఘటనలు మాత్రమే బయటికి వస్తున్నాయి. - కనీసం పది మందికన్నా ఎక్కువమంది ఉద్యోగులు ఉండే సంస్థలు, పరిశ్రమలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలనే నిబంధన ఉంది. కనీసం నలుగురితో ఉండే ఆ కమిటీలో.. మహిళా హక్కుల కోసం పోరాడే స్వచ్చంద సంస్థ కార్యకర్త ఒకరు తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏదీ ఉండడం లేదు. వేధింపులపై లెక్కలేవీ? ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తున్నారు. ఐటీ రంగం నుంచి విమాన పైలట్లు, సైన్యం దాకా అన్నింటిలోనూ మహిళల శాతం క్రమంగా పెరుగుతోంది. కానీ ఇది కేవలం పైకి కనిపిస్తున్నదే. ఇప్పటిదాకా మహిళల శాతం అతి తక్కువగా ఉన్న రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతుండగా.. మొత్తంగా ఉద్యోగం చేసే మహిళల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఓ సర్వే ప్రకారం భారత్‌లో గత రెండు దశాబ్దాల్లో పనిలో మహిళా భాగస్వామ్యం 34.8 శాతం నుంచి 27 శాతానికి తగ్గిపోయింది. మహిళలను బయటికి పంపించకుండా.. ఇల్లు, పిల్లల బాధ్యతను చూసుకునేవారిగానే పరిగణిస్తున్నారు. అయితే ఇలా మహిళల భాగస్వామ్యం తగ్గిపోవడానికి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కూడా కారణమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ పని ప్రదేశాల్లో వేధింపులపై గణాంకాలు లేవు. తెలంగాణలో.. కలెక్టర్‌కూ తప్పలేదు.. జూలై 12న మహబూబాబాద్‌లో జరిగిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అమర్యాదకరంగా ప్రవర్తించారు. కలెక్టర్ మీనా చేతులను ఆయన ఉద్దేశపూర్వకంగా తాకారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. శంకర్‌నాయక్ ప్రవర్తనతో కలత చెందిన కలెక్టర్ ప్రీతిమీనా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ శంకర్‌నాయక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టింది. దాంతో కలెక్టర్‌కు శంకర్‌నాయక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చట్టం ఏం చెబుతోంది? పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై 2013లో కేంద్రం చట్టం చేసింది. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు సహా ఎక్కడైనా మహిళలకు వేధింపుల నుంచి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అవ్యవస్థీకృత రంగంలో.. ముఖ్యంగా ఇళ్లలో పని మనుషులుగా, వంటచేసేవారుగా, ఇతర పనుల్లో ఉన్న మహిళలపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఇళ్ల యజమానులతో పాటు అక్కడ పనిచేసే డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, తోటపని, ఇతర ఇంటి పనులు చేసే పురుష సిబ్బంది కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదులు దాదాపుగా ఉండవు. మహిళలు వేధింపులను భరించగలిగినంత కాలం భరించి.. చివరికి అక్కడ పని మానేస్తున్నారు. కానీ మరో చోట పనిలో చేరినా ఇదే తరహా పరిస్థితి ఉంటోంది. నోరు తెరిస్తే మరిన్ని వేధింపులు ఆమె ఓ వార్తా సంస్థలో మానవ వనరుల విభాగం (హెచ్ఆర్)లో పనిచేసేది.. భర్త కొన్నేళ్ల కింద మరణించాడు. ఆ సంస్థను ఓ విదేశీ సంస్థ టేకోవర్ చేశాక ఆమె ఉద్యోగాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పరిధిలోకి మార్చారు. అప్పటికే ఆ ఎండీ ప్రవర్తన బాగోదన్న ప్రచారమున్నా.. అవన్నీ ఉత్త గాసిప్స్ అనుకుంది. కానీ తర్వాత అతడి అసలు స్వరూపాన్ని గుర్తించింది. తరచూ క్యాబిన్లోకి పిలిచి కబుర్లు చెప్పడం, భర్త లేడు కాబట్టి తాను సంతోషంగా చూసుకుంటాననడం, తరచూ తాకడం వంటివి చేశాడు. కొద్దిరోజులు ఓపిక పట్టిన ఆమె చివరికి పై అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫీసులో మీటింగులకు పిలవకపోవడం.. కావాలని గంటలకు గంటలు ఎక్కువసేపు పనిచేయించుకోవడం.. సరిగా పనిచేయడం లేదంటూ నివేదికలు పంపడం వంటివాటితో వేధించారు. చివరికి రాజీనామా చేస్తే.. ఆఫీసు నుంచి వచ్చే గ్రాట్యుటీ కూడా తక్కువగా ఇచ్చారు. ఇలా ఎదుర్కోవచ్చు.. - కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థను ‘షిృబాక్స్’ పేరుతో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఏ రంగంలోనైనా పని ప్రదేశంలో మహిళలు వేధింపులకు గురైతే దానికి ఫిర్యాదు చేయవచ్చు. - కేంద్ర, రాష్ట్రాల మహిళా కమిషన్లను, మహిళల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ముసునూరు తహసీల్దార్‌పై చింతమనేని దాడి నిజాయతీగా విధులు నిర్వర్తించిన కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ ద్రోణవల్లి వనజాక్షిపై ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. 2015 జూలై 8న తమ్మిలేరులో ఇసుక మాఫియా ట్రాక్టర్లను వనజాక్షి అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన చింతమనేని, ఆయన అనుచరులు ఆమెపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. అసలు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లావంటూ ఏపీ సీఎం చంద్రబాబు వనజాక్షినే తప్పుబట్టారు. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేయడంతో.. కంటితుడుపుగా ఓ ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ తూతూమంత్రంగా స్టేట్మెంట్లు రికార్డు చేసింది. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఆమెకు జరిగిన అవమానానికి న్యాయం మాత్రం జరగలేదు. అక్రమాలను అడ్డుకున్నందుకు.. 2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మ.. అక్కడి రంగన్నగారిగడ్డ గ్రామంలో చెరువు ఆక్రమణలను గుర్తించారు. దానిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో.. టీడీపీ మద్దతు ఉన్న సర్పంచ్ రమణారెడ్డి, తన అనుచరులతో కలసి ఆమెపై దాడి చేసి, దుర్భాషలాడారు. దీనిపై ఇప్పటికీ చర్యలు శూన్యం. ఐఏఎస్‌నే వేధించిన మంత్రి అచ్చెన్నాయుడు! ఓ మహిళా ఐఏఎస్ అధికారి పట్ల ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు కలకలం రేపింది. అసభ్యంగా మాట్లాడటంతో ఆవేదన చెందిన ఆ మహిళా అధికారి.. ఇక్కడి ఉన్నతాధికారులతోపాటు ఢిల్లీలోనూ ఫిర్యాదులు చేశారు. వివాదం బయటకు పొక్కితే రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందన్న భయంతో కీలక అధికారులను రంగంలోకి దించి రాజీ చేసినట్లు తెలిసింది. ఆ మహిళా అధికారి కొంతకాలం కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. మహిళా ప్రజాప్రతినిధులకూ తప్పని కష్టాలు.. - గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారిలపైన ఏడాది కింద టీడీపీ ప్రజాప్రతినిధులు వేధింపులకు దిగిన సంఘటనలు వివాదాస్పదమయ్యాయి. - మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవిని సైతం టీడీపీ నేతలు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఏ పనీ చేయకుండా అడ్డుపడి, పదవి నుంచి దిగిపోవాలని బెదిరించారు. ఈ ఒత్తిళ్లతో శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. అయినా శ్రీదేవితో బలవంతంగా రాజీనామా చేయించడంతో.. ఆమె బలన్మరణానికి పాల్పడింది. చివరికి వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. - బాపట్ల ఎంపీపీ విజేత సైతం అధికార పార్టీ ఎమ్మెల్సీ వేధింపులు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగిపోవాలన్న బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఆమెకు గుండెపోటు వచ్చింది. (ఇండియాస్పెండ్ వెబ్సైట్ సౌజన్యంతో..) ఫిర్యాదు చేసినా అన్యాయమే! పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిళ్లు. చివరికి కక్ష సాధింపు చర్యలు. లైంగిక వేధింపుల కేసులపై ఫిర్యాదులు చేసేవారిలో చాలా మందికి అన్యాయమే మిగులుతుందని సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ పేర్కొ న్నారు. దాంతో చాలా మంది ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని.. ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని చెప్పారు. - 2014లో మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు మహిళా న్యాయమూర్తి తనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే గంగూలీ లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘తగిన ఆధారాలు’ లేవంటూ పక్కన పెట్టేసింది. చివరికి 2015 ఏప్రిల్‌లో ఏకే గంగూలీని అభిశంసించాలని కోరుతూ 58 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. దాంతో అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ముగ్గురు న్యాయ నిపుణులతో కమిటీని వేశారు. ఆ కమిటీ తాజాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తన నివేదికను సమర్పించింది. అయితే ఆ మహిళా న్యాయమూర్తి 2014లోనే తన పదవికి రాజీనామా చేసేశారు. - కొద్దిరోజుల కింద ఓ టీవీ చానల్లో పనిచేసే న్యూస్ యాంకర్ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన చానల్ యాజమాన్యం మరే సంస్థలో ఆమెకు ఉద్యోగం దొరక్కుండా చేసింది. - ప్రతిష్టాత్మక ‘టెరి (ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)’ సంస్థలో తన పైఅధికారి ఆర్కే పచౌరీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి 2015 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ఆమెను తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. వేధింపులకు నిరసనగా ‘నేను సైతం’.. ప్రముఖుల లైంగిక వేధింపులపై అమెరికన్ మహిళల ఉద్యమం పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై అమెరికాలో ఉద్యమం మొదలైంది. వేధింపులకు గురైనవారంతా ‘నేను సైతం’ అంటూ బయటికి వచ్చి తాము అనుభవించిన దుష్కృత్యాలను బయటపెడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ తమను వేధించారంటూ కొందరు మహిళలు ముందుకు రావడంతో మొదలైన ఈ ఉద్యమంతో... రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల లీలలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు నెలన్నర రోజుల్లో ఏకంగా 50 మంది ప్రముఖుల బాగోతాలు బయటపడ్డాయి. దీంతో వారిలో చాలా మంది తమ దుశ్చర్యల పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొందరు ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురికాగా.. మరికొందరు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కొందరిపై కోర్టుల్లో కేసులు కూడా దాఖలవుతున్నాయి. ఎందరో ప్రముఖులు తాజాగా డెమోక్రటిక్ పార్టీ మినెసోటా సెనేటర్ అల్ ఫ్రాంకెన్ 2006లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని మాజీ మోడెల్ లియాన్ ట్వీడెన్ ఆరోపించారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన రే మూర్ (70) 1970లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని, మరో ఇద్దరు టీనేజీ ఆడపిల్లల వెంటపడ్డారని గత వారం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ‘బాంబు’ పేల్చింది. ఆయన అలబామా రాష్ట్రం నుంచి సెనేటర్‌గా పోటీచేయడానికి సిద్ధమవుతుండగా ఈ విషయం బయటపడడంతో పోటీ ప్రశ్నార్థకంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ (సీనియర్), హాలీవుడ్ నటుడు డస్టిన్ హాఫ్మన్ (1985లో 17 ఏళ్ల అసిస్టెంట్ అనా గ్రహమ్పై లైంగిక వేధింపుల ఆరోపణ), 1990ల్లో అండర్ సీజ్ వంటి యాక్షన్ చిత్రాల హీరో స్టీవెన్ సీగల్, 1980ల్లో ఫస్ట్ బ్లడ్, రాకీ వంటి హాలీవుడ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కండల వీరుడు సిల్వస్టర్ స్టాలన్‌లు కూడా ఉన్నారు. -
హాఫ్ మారథాన్‌కు ఢిల్లీ హైకోర్టు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో విలవిలలాడుతున్న ఢిల్లీలో హాఫ్ మారథాన్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోయిన క్రమంలో పరుగు నుంచి తప్పుకునే రన్నర్లకు తాము రిఫండ్ పాలసీని ప్రవేశపెట్టామని నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా కాలుష్యం పెరగడంతో ఢిల్లీ,ఎన్సీఆర్ పరిధిలో హెల్త్ ఎమర్జెనీని ప్రకటించారు. స్కూళ్లను కొద్దిరోజులు మూసివేసిన అనంతరం ఇటీవలే అవి తిరిగితెరుచుకున్నాయి. కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. -
‘మహిళలను అగౌరవపరిచిన వారికి శిక్ష పడాల్సిందే’
న్యూఢిల్లీ: మహిళల పట్ల గౌరవభావం లేని వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అమర్యాదకరంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలుంటాయని అటువంటి వారికి హెచ్చరికలు పంపాలని స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ తెలిపారు. ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై మెజిస్టీరియల్ కోర్టు విధించిన శిక్షను తొలగించటానికి ఆయన నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ 2015 మే 25న బల్మీకి బస్తీలోని ఎంసీడీ టాయిలెట్లోకి వెళ్లింది. అదే సమయంలో కుమార్ అనే వ్యక్తి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు అతని నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన మెజిస్టీరియల్ కోర్టు కుమార్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీనిపై కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ గురువారం తీర్పు సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఒక వివాహితతో ఎలా మెలగాలో తెలియని వ్యక్తికి ఆ శిక్ష సబబేనని తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించటం ఐపీసీ ప్రకారం శిక్షార్హమైన తీవ్ర నేరాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని చెప్పారు. దీనిపై బాధితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు మహిళ తప్పుడు ఉద్దేశంతోనే, పథకం ప్రకారం కావాలనే ఈ కేసులో కుమార్‌ను ఇరికించిందని, విచారణ సందర్భంగా ఆమె భర్తను సరియైన రీతిలో విచారణ జరపలేదని పేర్కొన్నారు. -
సునంద కేసు.. స్వామికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఆయన వేసిన పిల్‌ను గురువారం కొట్టేసింది. కేసును శశిథరూర్ ప్రభావితం చేస్తున్నారని.. కోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిగేలా ఆదేశించాలంటూ స్వామి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వామి వేసిన పిటిషన్ ఓ రాజకీయ ప్రయోజన వ్యాజ్యంలా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అయితే స్వామి ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయాడని జస్టిస్ ముదలియర్, జస్టిస్ మెహతా నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని ఈ సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కేసులు వేయటం సరికాదని.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కేసును తప్పుదోవ పట్టించేందుకు శశిథరూర్ జోక్యం చేసుకున్నారంటూ స్వామి ఆరోపణలు చేయగా.. వాటిని ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాటిని ఖండించారు. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. రేప్ కేసులో గుర్మీత్ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె కోసం రెండు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో సోమవారం ముందస్తు బెయిల్‌కు హనీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పంజాబ్-హర్యానా హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించింది. అజ్ఞాతంలో ఉన్న హనీతోపాటు డేరా బాబా సహచరులైన ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్‌ను అరెస్టు చేయాలని పంచకుల కోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో.. ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఆమె ఢిల్లీలోని తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆమె న్యాయవాది ఇంటికి వెళుతుండగా నమోదైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది ప్రదీప్ ఆర్య ద్వారా ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోలీసుల గాలింపులు డేరా బాబా గుర్మీత్ సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్, ఇతర సహచరుల కోసం హర్యానా పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గాలించారు. ఆమె కోసం ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2లోనూ సోదాలు జరిగాయి. డేరా బాబా అకృత్యాలు, ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లులో హనీతోపాటు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. వీరి గురించి అంతర్జాతీయంగా అలర్ట్ ప్రకటించారు. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
-
బాబా రాందేవ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పతంజలి ఆయుర్వేద్ బ్రాండుకు చెందిన సబ్బుల ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేయడం ఆపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పతంజలి తన వాణిజ్య ప్రకటనలలో సబ్బు బ్రాండ్ డెటాల్‌ను తక్కువ చేస్తుందని రెక్కిట్ బెంకైసెర్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పతంజలి సబ్బు బ్రాండు ప్రకటనపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం ఇది రెండోసారి. అంతకముందు బొంబై హైకోర్టు కూడా పతంజలి ఈ ప్రకటనను ఆపివేయాలంటూ ఆదేశించింది. ఎఫ్‌సీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివరీ లిమిటెడ్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు అప్పుడు బొంబై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. పతంజలి తన వ్యాపార ప్రకటనలో డెటాల్ సోప్, హెచ్‌యూఎల్ పియర్స్, లైఫ్‌బాయ్ వాటిని దిగజారుస్తుండటంతో ఈ మొత్తం వివాదం చెలరేగింది. పతంజలి ప్రకటనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు, కోటికిపైగా నష్టపరిహారాల కోసం తాము పోరాడినట్టు రెక్కిట్ బెంకైసర్ న్యాయవాది నాన్సీ రాయ్ పేర్కొన్నారు. పతంజలి తన కొత్త సబ్బు ప్రకటనలో డెటాల్‌ను 'ధిటాల్'గా, పియర్స్‌ను 'టియర్స్'గా, లైఫ్‌బాయ్‌ను 'లైఫ్‌జాయ్'గా విమర్శిస్తోంది. పతంజలి కంపెనీ రూపొందిస్తున్న వివాదస్పదమైన ప్రకటనలపై ఓ వైపు కోర్టులో కంపెనీలు పోరాడుతుండగా.. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన ఈ కంపెనీకి 40 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. పతంజలి ఆయుర్వేదకు కేటాయించిన ఒక్కో ఎకరం రూ.25 లక్షలు. ఈ భూమి కోసం ప్రభుత్వ ఖాతాల్లో రూ.10 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ ఔద్యోగిక్ కేంద్ర వికాస్ నిగమ్ ఎండీ కుమార్ పురుషోత్తం తెలిపారు. -
ఆటోలో కోర్టు విజిట్?!
► ఆటోలో ప్రయాణించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ► కోర్టు పరిసరాలను ఆకస్మిక తనిఖీ చేసిన వైనం న్యూఢిల్లీ: ఆరు ఆటో రిక్షాలు హఠాత్తుగా వచ్చి ఢిల్లీ హైకోర్టు ముందు ఆగాయి. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటోలో ఉన్న వ్యక్తులు యధాలాపంగా బయటకు వచ్చి.. హైకోర్టు పరిసరాలను, న్యాయవాదులను పరిశీలించడం మొదలు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత కానీ ఆటోలో వచ్చింది ఎవరో అక్కడివారికి అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఆటోల ముందు న్యాయవాదులు, అధికారులు పరుగులు పరుగులు తీశారు. ఆటోలో వచ్చింది.. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, ఇతర న్యాయమూర్తులు రవీంద్ర భట్, మురళీధర్, సంజీవ్ ఖన్నా తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆకస్మింగా తనఖీ చేసేందుకు సామాన్యుల్లా ఆటోల్లో వచ్చారు. ఢిల్లీ హైకోర్టులోని అధికారులు, న్యాయమూర్తుల పనితీరు, క్రమశిక్షణను పరిశీలించేందుకే ఇలా వచ్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా గీతా మిట్టల్ చెప్పారు. కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులను సైతం వారు పరిశీలించారు. పరిపాలనాపరంగా కొన్ని లోపాలను గుర్తించామని గీతా మిట్టల్ చెప్పారు. వాటిని దిద్దుకునేందుకు తగిన సూచనలు, సలహాలు చేశామని చెప్పారు. -
సునందాపుష్కర్ కేసు: స్వామికి చుక్కెదురు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్యస్వామికి చుక్కెదురైంది. సునందా పుష్కర్ మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఉంటే రెండువారాల్లోగా సమర్పించాలని, ఆలోగా ఏమీ సమర్పించకపోతే.. ఒక ఈ కేసు విషయాన్ని తామే చూసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి విషం వల్ల సునందపుష్కర్ మరణించిందని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తే.. ఇంకా అది ఏ తరహా విషమో విశ్లేషించడంలో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్‌బీఐ, ఇతర ఏజెన్సీల చేత ఫోరెన్సిక్ దర్యాప్తును విశ్లేషించడం.. కేసు దర్యాప్తులో జాప్యం చేయడమేనని చెప్పారు. -
వైవాహిక అత్యాచారం నేరం కాదు
ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ న్యూఢిల్లీ: భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం మంగళవారం అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. ఈ విషయంలో ఎలాంటి సంక్లిష్టతలకు తావివ్వకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చి వాటి అభిప్రాయాలు తెలుసుకోవాలది. వైవాహిక రేప్‌ను చట్టం లో నిర్వచించలేదని, అందుకోసం సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమవుతుందని తెలిపింది. నైతిక అవగాహన ముఖ్యం: ‘భార్యకు వైవాహిక అత్యాచారంగా కనిపించినది ఇతరులకు అలా కనిపించకపోవచ్చు. వైవాహిక రేప్, వైవాహికేతర రేప్ మధ్య తేడాను స్పష్టంగా నిర్వచించాలి. రేప్ కేసుల విచారణ నుంచి భర్తలకు ఇస్తున్న మినహాయింపు తొలగించడం ద్వారా వైవాహిక రేప్‌లు సమసిపోవు. నైతిక, సామాజిక అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం. భర్త తనపై చేసింది రేపా? కాదా? అని తేల్చే బాధ్యత భార్యపైనే ఉంటుంది. భార్య, భర్తల మధ్య జరిగిన శృంగారానికి సంబంధించి ఎలాం టి సాక్ష్యాలు లేనప్పుడు కోర్టులు ఏ ఆధారాలను నమ్ముతాయి’ అని కేంద్రం ప్రశ్నించింది. అవివాహితురాలి మాదిరిగానే వివా హితురాలికీ తన శరీరంపై హక్కు ఉంటుం దని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. -
ఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులు కలిగిఉన్నారంటూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగిస్తున్న ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆప్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై బదులివ్వాలని జస్టిస్ ఇందర్మీత్ కౌర్ ఈసీని కోరారు. తమ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని, అవి చెల్లుబాటు కావని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున ఈ అంశంపై ఈసీ విచారణ కొనసాగించడం అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులు అన్యాయమని, పక్షపాతపూరితమని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే లాభదాయక పదవులపై ఈసీ తదుపరి విచారణ తేదీని ప్రకటించకపోవడంతో ఈ దశలో ఈసీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు స్టే కోరలేరని హైకోర్టు తెలిపింది. విచారణ తేదీని ఈసీ ప్రకటించిన పక్షంలో అప్పుడు దాన్ని నిలుపుదల చేసేందుకు పిటిషనర్లు అప్పీల్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. గతంలో జూన్ 23న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఈనెల 4న ఢిల్లీ హైకోర్టు ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. -
హైకోర్టుకి బాంబు బెదిరింపు.. తనిఖీలు
ఢిల్లీ: బాంబు పేల్లుళ్ల హెచ్చరికతో గురువారం దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావటంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. జడ్జిలతోసహా కోర్టులో ఉన్నవారందరినీ బయటికి పంపించేసి ఢిల్లీ పోలీసులతోపాటు, స్వాట్ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
సునంద కేసు వివరాలివ్వండి: హైకోర్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో.. సమగ్ర నివేదిక దాఖలు చేయాలని పోలీసులను గురువారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో ఈ నివేదికను అందజేయాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సీబీఐ నివేదికను కోర్టులోనే తనకు అందజేసిందని, వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని ఢిల్లీ పోలీస్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోరారు. దీంతో కోర్టు ఆగస్టు 1 తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ నివేదిక ప్రతిని సునంద పుష్కర్ మృతిపై కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇవ్వాలని సూచించింది. -
మరణ శిక్ష ఆలస్యం అమానవీయం
న్యూఢిల్లీ: మరణ శిక్ష అమలులో ఆలస్యం చేయడం అనేది అమానవీయ చర్య అని, అంతేకాకుండా అది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణ శిక్ష అమలులో జరిగే జాప్యం వల్ల సదరు ఖైదీ మానసిక క్షోభను అనుభవిస్తాడని జస్టిస్ జీఎస్ సిస్తాని, జస్టిస్ వినోద్ గోయల్‌ల ధర్మాసనం పేర్కొంది. 31 ఏళ్ల ఖైదీ సోనూ సర్దార్ తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2004లో జరిగిన ఐదుగురి హత్య కేసులో సర్దార్ సింగ్‌కు 2008లో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తీర్పును 2010లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సమర్థించింది. దీంతో సర్దార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2012లో సుప్రీంకోర్టు ఆ రెండు న్యాయస్థానాల తీర్పును సమర్థిస్తూ మరణశిక్షను ఖరారు చేసింది. 2013లో గవర్నర్‌కు, 2014లో రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరారు. వారు కూడా అతని పిటిషన్‌ను తోసిపుచ్చారు. 2015లో శిక్షను మరోసారి సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం మళ్లీ నిరాకరించింది. ఇక చివరిసారిగా రాష్ట్రపతి, గవర్నర్ ఉత్తర్వులను కొట్టివేయాలని, అలాగే తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ ధర్మాసనం మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. -
భద్రతా సిబ్బంది గోప్యత కాపాడండి
న్యూఢిల్లీ: సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాకుండా చూడాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కొందరు పారామిలిటరీ జవాన్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఇటీవల ఓ టీవీ చానెల్లో ప్రసారం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతో తీవ్రమైన విషయమని, సైనికుల సమాచారం బయటకు ఎలా వచ్చిందని జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ కార్యక్రమం ఎపిసోడ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. సైనికుల వ్యక్తిగత సమాచారం బయటకు తెలిస్తే, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అభిప్రాయపడింది. అలాగే పై రెండు మంత్రిత్వ శాఖలతో పాటు, టీవీ చానెల్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీలకు నోటీసులు జారీచేస్తూ, వాటి సమాధానాలు కోరింది. టీవీ చానెల్ పలువురు పారామిలిటరీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమాచారాన్ని బహిర్గతం చేసిందని ఆరోపిస్తూ మాజీ సైనికుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. -
సీఎం కూడా బోనులోకి రావాల్సిందే: హైకోర్టు
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసే సమయంలో సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకే అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఆయన తప్పనిసరిగా కోర్టుబోనులోకి రావల్సిందేనని జస్టిస్ మన్మోహన్ చెప్పారు. జైట్లీ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగడానికి ముందే ఆయన తన ఆరోపణలను సరైన పద్ధతిలో కోర్టు ముందు ఉంచాలని తెలిపారు. ముఖ్యమంత్రి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను రామ్ జెఠ్మలానీ తనంతట తానే చేశారా లేదా కేజ్రీవాల్ సూచనల మేరకు చేశారా అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని జైట్లీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు రాజీవ్ నాయకర్, సందీప్ సేథి కోరారు. 2000 నుంచి 2013 వరకు తాను డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించిన కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ రూ. 10 కోట్లకు సివిల్ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు రాఘవ్ ఛద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయ్ ఉన్నారు. -
హైకోర్టులో జైట్లీ, జెఠ్మలానీ వాగ్యుద్ధం
కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా... న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సాక్షిగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ అడ్వొకేట్ రామ్ జెఠ్మలానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయ కులు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్ సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయ్ లకు వ్యతిరేకంగా జైట్లీ ఢిల్లీ హైకోర్టులో రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలకు 2000 నుంచి 2013 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీయే బాధ్యుడని ఆప్ నాయకులు ఆరోప ణలు చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ దావా వేశా రు. ఈ కేసు విచారణ సందర్భంగా బుధ వా రం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జెఠ్మ లానీ, జైట్లీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. నిందలకూ ఓ హద్దుంటుంది: జైట్లీ ఈ సందర్భంగా జైట్లీని నిజాయితీ లేని వ్యక్తి అంటూ రామ్‌జెఠ్మలానీ పరుష పదజాలాన్ని వినియోగించారు. దీంతో జాయింట్ రిజిస్ట్రార్ దీపాలీ శర్మ సాక్షిగా జైట్లీ సహనం కోల్పోయారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించారా అని జెఠ్మలానీని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అదే నిజమైతే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇంతకు మించిన పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంద న్నారు. వ్యక్తిగతంగా నిందించడానికీ ఓ హద్దుంటుందని.. నియంత్రణ కోల్పోవడం సరైంది కాదన్నారు. జైట్లీ తరఫు సీనియర్ అడ్వొకేట్లు రాజీవ్ నాయర్, సందీప్ సేథి కూడా జెఠ్మలానీ తీరును ఖండించారు. ఆయ న అవమానకరమైన ప్రశ్నలను వేశారని, అసంబద్ధమైన విషయాలను అడగకుండా తనను తాను నియంత్రించుకోవాలన్నారు. ఇది జైట్లీ, కేజ్రీకి మధ్య కేసు అని, జైట్లీ, జెఠ్మలానీ మధ్య జరుగుతున్న కేసు కాదని వ్యంగ్యంగా అన్నారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించానని రామ్ జెఠ్మలానీ చెప్పగా.. కేజ్రీవాల్ తరఫు మరో న్యాయవాది అనుపమ్ శ్రీవాస్తవ్ ఆ పదం ఉపయోగించాలన్న సూచనేదీ లేదన్నారు. -
నమిలే పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించరేం?
న్యూఢిల్లీ: గుట్కా, పాన్ మసాలా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించేందుకు చర్యలెందుకు తీసుకోరని ఆహార భద్రత ప్రమాణాల శాఖను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంగానీ లేదా ఏదేని రాష్ట్రాలు గానీ నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాయా అని కోర్టు ప్రశ్నించింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోక చెక్క, పొగాకు, మరికొన్ని విషపదార్థాలను తమలపాకులో చుట్టి పాన్ మసాలా తయారు చేస్తున్నారని.. ఇది ఆరోగ్యానికి హానికరమైనదని తెలిసి కూడా సంబంధిత అధికారులు నిషేధం ఎందుకు విధించడంలేదని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నమిలే పొగాకు ఉత్పత్తులమీద నిషేధం విధిస్తే అసలు సమస్యే లేకుండా పోతుంది కదా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఆహార భద్రత ప్రమాణాల శాఖ తరఫున న్యాయవాది ఎం. ప్రచా సమాధానమిస్తూ.. నమిలే పొగాకు ఉత్పత్తుల నిషేధానికి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని.. గుట్కాపై విధించిన నిషేధం వీటికి వర్తిస్తుందన్నారు. అయితే, గుట్కాపై విధించిన నిషేధం చట్టాలు బలంగా అమలు కావడంలేదని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
డొకొమోకు టాటా పరిహారం సబబే
ఆర్బీఐ అనుమతులు అక్కర్లేదు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకొమోకు టాటా గ్రూప్ 1.17 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించిన విషయంలో రిజర్వ్ బ్యాంక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జాయింట్ వెంచర్లో భాగస్వామ్య వాటాలకు కొనుగోలుదారును అన్వేషించలేకపోయినందువల్ల డొకొమోకు టాటా గ్రూప్ పరిహారాన్ని చెల్లించటాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ డీల్‌ను భారత్‌లో అమలు చేయొచ్చని, దీనికోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తమనూ పార్టీగా చేర్చుకోవాలన్న ఆర్బీఐ అభ్యర్ధనను తోసిపుచ్చింది. చెల్లింపు విషయంలో ఇరుపక్షాలకు ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు.. డీల్ అమలుకు ఆటంకాలేమి లేవని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఆర్బీఐ అనుమతినివ్వకుండా నిరాకరించడానికేమీ లేదని స్పష్టం చేసింది. ఇదీ కథ.. టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), ఎన్టీటీ డొకొమో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నిబంధనల ప్రకారం డొకొమో గానీ వైదొలగాలనుకున్న పక్షంలో దాని 26.5 శాతం వాటాను నిర్దిష్ట రేటుకు కొనుగోలు చేసే వారిని టీటీఎస్ఎల్ వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. డొకొమో వైదొలగాలనుకున్నప్పుడు రేటు షేరుకు సుమారు రూ.58.45గా ఉంది. మొదటి ఆప్షన్ కుదరనప్పుడు సముచిత మార్కెట్ వేల్యూ ప్రకారం .. టీటీఎస్ఎల్ స్వయంగా ఆ షేర్లను కొనుగోలు చేసేలా మరో ఆప్షన్ ఉంది. దీని ప్రకారం చూస్తే షేరు ఒక్కింటికి రూ. 23.44 మాత్రమే పలుకుతుంది. రెండో ఆప్షన్‌కు అంగీకరించని డొకొమో ఆర్బిట్రేషన్‌కి వెళ్లగా.. 1.17 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2016 జూన్‌లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలిచ్చింది. సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఇరు సంస్థలు దీనికి అంగీకరించాయి. టాటా ఇప్పటికే 1.17 బిలియన్ డాలర్లు హైకోర్టులో డిపాజిట్ కూడా చేసింది. అయితే, రెండు కంపెనీల మధ్య ఒప్పందం చెల్లదంటూ ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మళ్లీ కోర్టుకు చేరింది. తాజాగా ఆర్బీఐ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. -
‘దళిత’ పద వినియోగం సమంజసమేనా?
న్యూఢిల్లీ: సమాజంలో అసమతుల్యాన్ని సృష్టిస్తున్న ‘దళిత’ పదాన్ని వార్తా కథనాల్లో వినియోగించటంపై అభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ని ఢిల్లీ హైకోర్టు కోరింది. పీసీఐ నిబంధనల ప్రకారం ‘షెడ్యూల్డ్ కులాలు’ అనే పదాన్ని కూడా వినియోగించటం నిషేధమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్, జస్టిస్ అను మల్హోత్రాల ధర్మాసనం తెలిపింది. దళిత పదం వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రెస్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. -
రాజ్యాంగ ధర్మాసనానికి వాట్సాప్ కేసు
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్య మం వాట్సాప్ గోప్యత విధానంపై విచారణను సుప్రీం కోర్టు బుధవారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఏప్రిల్ 18న ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచా రించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును బుధ వారం విచారిస్తూ.. ఇది దేశ ప్రజల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినది కాబట్టి రాజ్యాంగ అంశం అవుతుందనీ, అందువల్ల ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తు న్నామని పేర్కొంది. అంతకుముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ.. ఇది పూర్తిగా ఒప్పంద సంబంధిత విషయమైనందున రాజ్యాంగ ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదన్నారు. గతంలో వాట్సాప్ గోప్యత విధానం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పునిస్తూ, 2016 సెప్టెంబరు 25 వరకు ఉన్న వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థలకు వాట్సాప్ ఇవ్వకూడదని ఆదేశించింది. సెప్టెంబరు 25 తర్వాత వినియోగ దారుల సమాచారాన్ని వాట్సాప్ ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 , ఆర్టికల్ 21 లను ఉల్లంఘించిందని ఇద్దరు వ్యక్తులు వాట్సాప్‌పై కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును కూడా వారు తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ కేసునే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. -
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
-
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన సతీమణికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వారు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, 2015, అక్టోబర్ 1లో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్వరులను కూడా జస్టిస్ విపిన్ సంఘి ఎత్తివేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గతంలో వీరభద్రసింగ్‌ను కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడంగానీ, విచారణ చేయడంగానీ, చార్జీషీట్ నమోదుకానీ చేయరాదు. తాజాగా ఆ ఉత్తర్వులు కూడా లేకుండా పోవడంతో ఇక సీబీఐ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. 2015 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసు వీరభద్ర సింగ్‌పై నమోదైంది. -
యోగేంద్ర యాదవ్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: యోగేంద్ర యాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఉమ్మడి గుర్తు ఇవ్వాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని, ఉమ్మడి గుర్తు లేనంత మాత్రానా ఎటువంటి నష్టం జరగదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గుర్తింపులేని నమోదిత పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృతుడైన యోగేంద్ర యాదవ్.. ప్రశాంత్ భూషణ్ తో కలిసి స్వరాజ్ ఇండియా పార్టీని స్థాపించారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై విమర్శలు చేయడంతో వీరిద్దరూ బహిష్కరణకు గురయ్యారు. -
వేధించే సంతానాన్ని వెళ్లగొట్టవచ్చు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: తమను వేధించే సంతానాన్ని ఆ తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించివేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వారు నివసిస్తున్న ఇల్లు సొంతమా, అద్దెదా అనే విషయం పట్టించుకోనక్కరలేదంది. ఇంటిపై తల్లిదండ్రులకు న్యాయపర హక్కులు ఉన్నంత వరకూ వారిని వేధించే వయోజనులైన పిల్లలను ఆ ఇంటి నుంచి పంపొచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల ఇంటి నుంచి తమను వెళ్లగొట్టాలని 2015లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాగుబోతు అయిన మాజీ పోలీసు, అతని సోదరుడు వేసిన పిటిషన్ పై ఈ తీర్పిచ్చింది. తాము మెయింటెనెన్స్ కోసం డబ్బు కోరకపోయినా.. కేవలం శారీరకంగా వేధించామనే ఆరోపణలపైనే ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిందని ఆ సోదరులు కోర్టులో వాదించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007ను ట్రిబ్యునల్ అతిక్రమించిందని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. వృద్ధులు తమ ఇంటిలో ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించడానికి.. శారీరకంగా, మానసికంగా వేధించే సంతానాన్ని ఇంటినుంచి వెళ్లగొట్టే ఆదేశాలు ట్రిబ్యునల్ ఇవ్వవచ్చని పేర్కొంది. -
అలాంటి పిల్లలను ఇళ్ల నుంచి తరిమేయండి: కోర్టు
పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను తిడుతుంటే, వాల్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లనుంచి బయటకు గెంటేయొచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఇల్లు తాము కష్టపడి సొంతంగా కొనుక్కున్నదైనా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినా సరే పిల్లలను పంపేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని తెలిపింది. తల్లిదండ్రులకు ఆ ఆస్తి మీద చట్టపరమైన హక్కు ఉన్నంతకాలం వాళ్లు తమను తిట్టే కొడుకులు, కూతుళ్లను ఇంటినుంచి నిరభ్యంతరంగా గెంటేయొచ్చని చెప్పింది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం, సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్ మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్లు, లేదా మానసికంగా వేధించే కొడుకులు, కూతుళ్లను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 32కు కావల్సిన సవరణలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్లి అయినా, అవ్వకపోయినా తల్లిదండ్రులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు, కూతుళ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండబోదని జస్టిస్ మన్ మోహన్ అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బాగున్నంత కాలం వాళ్ల ఇష్టం మేరకు కావాలంటే ఇంట్లో ఉండొచ్చని, అంతేతప్ప వాళ్లకు భారంగా ఉంటామంటే మాత్రం కుదరదని తెలిపారు. -
ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యమేనా?!
సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈవీఎం ఎలా పనిచేస్తుంది? బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈవీఎంలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోలింగ్ (నియంత్రణ) యూనిట్, రెండోది బ్యాలెటింగ్ (ఓట్ల ప్రక్రియ) యూనిట్. ఎన్నికల కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారి ఈ కంట్రోలింగ్ యూనిట్‌కు ఇంచార్జీగా వ్యవహరిస్తారు. ఓటర్ తన ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవగానే.. బ్యాలెటింగ్ యూనిట్‌ను ఆయన యాక్టివేట్ చేస్తారు. తర్వాత ఓటర్ తనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న మీటను నొక్కి ఓటేస్తాడు. ఓటు పడగానే ప్రిసైడింగ్ అధికారి.. పోలింగ్ బూత్‌లో ఉన్న వివిధ పార్టీల ఏజెంట్లకు ఓటు నమోదైనట్లు ధ్రువీకరిస్తారు. కౌంటింగ్ సమయంలో నమోదైన ఓట్ల సంఖ్యలో తేడా రాకుండా ఏజెంట్ల లెక్కలతో ప్రిసైండింగ్ అధికారి లెక్కలు సరిపోయేందుకు ఇలా చేస్తారు. ఓటింగ్ సమయంలో ఈవీఎం బాహ్యనెట్వర్క్తో అనుసంధానం ఉండదు. ఒక ఈవీఎం ద్వారా 3,840 ఓట్లను రికార్డు చేయొచ్చు. కౌంటింగ్ సమయలో ఈవీఎంపై ఉన్న ‘రిజల్ట్’ మీటను నొక్కటం ద్వారా ఎవరికెన్ని ఓట్లో తెలుసుకోవచ్చు. ఓటింగ్ సమయలో ఈ బటన్ సీల్ చేస్తారు. ప్రతి ఈవీఎంకు ఓ ఐడీ నెంబరుంటుంది. అది ఎన్నికల సంఘం డేటాబేస్‌లో రికార్డవుతుంది. పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్నపుడు, ఓటింగ్ పూర్తైన తర్వాత ఈ ఐడీని మరోసారి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత వీటిని ఓ భద్రమైన ప్రదేశానికి తరలించి.. కౌంటింగ్ రోజు వరకు కేంద్ర బలగాల పహారాలో భద్రంగా ఉంచుతారు. ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులు 2000లో ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ వార్తలు మొదటిసారిగా తెరపైకి వచ్చాయి. ఓ డచ్ టీవీ ఈవీఎం మెషీన్లను ఎలా హ్యాక్ చేయవచ్చో చూపుతూ డాక్యుమెంటరీని ప్రసారంచేసింది. దీంతో నెదర్లాండ్ ఈవీఎంలను రద్దుచేసి సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహించింది. జర్మనీ, ఐర్లాండ్‌లు కూడా ఈవీఎంలను పక్కన పెట్టేశాయి. భారత్‌లో కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చంటూ పలువురు బ్లాగర్లు పోస్టులు పెట్టారు. 2010లో మిచిగాన్ వర్సిటీ ప్రొఫెసర్ జె అలెక్స్, భారత సైంటిస్టు హరిప్రసాద్‌లు కలిసి ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు ముందే ఎలా ట్యాంపరింగ్ చేసే అవకాశాలున్నాయో ఓ నివేదికలో వెల్లడించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంలను ఎలా మార్చవచ్చో చూపించారు. అయితే దీన్ని భారత ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. తమ దగ్గరున్న ఈవీఎంలు అత్యున్నత ప్రమాణాలతో కూడినవని ట్యాంపరింగ్‌కు వీల్లేనివని స్పష్టం చేసింది. ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలు ► 2004 ఎన్నికల్లో యూపీఏకు అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు దీన్ని తోసిపుచ్చింది. 2005లో మరోకేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు.. ఎన్నికలప్రక్రియలో ఈవీఎంల పాత్ర గొప్పదని, వీటిని ట్యాంపరింగ్ చేయలేమని స్పష్టం చేసింది. ► 2009 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఆ తర్వాత ఎల్కే అడ్వాణీ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. ► 2009లో ఒడిశా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జేబీ పట్నాయక్ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ బీజేడీ విజయం సాధించిందని ఆరోపించారు. ► 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాపింగ్‌కు పాల్పడిందని అప్పటి అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ విమర్శించారు. దీనిపై సామాజిక వేత్త మేథాపాట్కర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓటు ధ్రువీకరణ పత్రం సంగతేంటి? బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 2013 అక్టోబర్ 8న సుప్రీంకోర్టు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ–ఓటు ధ్రువీకరణ పత్రం)ను 2019లోపు దశల వారీగా ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈవీఎంకు అనుసంధానించిన ప్రింటరు నుంచి తను ఓటేసిన గుర్తు, సీరియల్ నంబర్‌తో కూడిన ప్రింట్ డ్రాప్ బాక్స్‌లోకి వస్తుంది. అయితే డ్రాప్‌బాక్స్‌లో పడే ముందు కొద్ది క్షణాలపాటు ఓటరు దీన్ని చూసేందుకు (తను అనుకున్న పార్టీకే ఓటు పడిందా లేదా అని తెలుసుకునేందుకు) వీలుంటుంది. ఒకవేళ ఈవీఎం ఓట్లలో ఏమైనా తేడా ఉందనిపిస్తే.. డ్రాప్బాక్సును తెరిచి కౌంటింగ్ చేసుకోవచ్చు. దీన్ని 2013లో నాగాలాండ్ ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. -
సైబర్ నేరాలు సమాజానికి సవాల్
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి విశాఖ లీగల్: సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన నేరాలు సమాజానికి ఒక సవాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి చెప్పారు. విశాఖలోని ఒక హోటల్లో శనివారం జాతీయ మహిళా న్యాయవాదుల సమాఖ్య రాష్ట్ర విభాగం, విశాఖ శాఖలు సైబర్ నేరాలపై నిర్వ హించిన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పెరు గుతున్న సైబర్ నేరాలపై న్యాయవాదులకు అవగాహన అవసరమన్నారు. ఆన్లైన్, డేటా, ఇంటర్నెట్ వినియోగంలో సమస్యల ను గుర్తించాలన్నారు. సాంకేతికతతో నూతన నేరాలు పుట్టుకొస్తున్నాయని, ఈ మెయిల్, సైబర్, సామాజిక మాధ్యమాలు, క్రెడిట్‌కార్డు, సాంకేతిక ఉగ్రవాదం వంటివి నేర ప్రవృత్తికి అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అధిగమించడానికి పౌరుల్లో అవగాహన పెరగాలని, నూతన సవాళ్ల పరిష్కారానికి ఒక అన్వేషణ జరగాలని చెప్పారు. మహిళా సాధికారత...అభివృద్ధి న్యాయవాద వృత్తిలో పరిస్థితి ఇతర వృత్తులకు భిన్నంగా ఉంటుందని, న్యాయవాద వృత్తిలో నిపుణత సాధిస్తేనే రాణింపు ఉంటుందని జస్టిస్ రోహిణి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో స్త్రీల సంఖ్య పెరుగుతున్నా లింగవివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సైబర్ నేరాలను సమగ్రంగా విశ్లేషించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ టి.రజని మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానంపై అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మంజరి, బార్ కౌన్సిల్ సభ్యురాలు చీకటి మాధవిలత, నగర అధ్యక్షురాలు డి.అరుణకుమారి, డి.మంజులత తదితరులు పాల్గొన్నారు. -
నాట్కో, అలెంబిక్లకు లైన్ క్లియర్
పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ కంపెనీలు నాట్కో, అలెంబిక్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. జర్మన్ ఔషధ కంపెనీ బేయర్స్కు చెందిన రెండు పేటెంట్ ఔషధాలను ఈ సంస్థలు తయారు చేసి క్లినికల్ పరీక్షల కోసం, విదేశీ నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎగుమతి చేసేందుకు కోర్టు అనుమతిస్తూ హైకోర్టు బుధ వారం తీర్పు జారీ చేసింది. దేశీయ జనరిక్ ఔషధ తయారీ దారులు పేటెంట్ రక్షణలో ఉన్న ఔషధాలను నియంత్రణ సంస్థల ఆమోదం కోసం, క్లినికల్ పరీక్షల కోసం వాటిని తయారు చేసి, విక్రయించి, ఎగుమతి చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇందుకు పేటెంట్స్ చట్టంలోని సెక్షన్ 107ఏ వీలు కల్పిస్తోందని కోర్టు ఉదహరించింది. ఈ ప్రాథమిక హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కూడా కల్పిస్తోందని... చట్టం చెబితే తప్ప ఔషధ విక్రయాలను అడ్డుకోలేరని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా స్పష్టం చేశారు. కాగా, ఔషధాలకున్న పేటెంట్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, సెక్షన్ 107ఏలో పేర్కొన్న మేరకు మినహా ఇతర అవసరాలకు పేటెంట్ రక్షణలో ఉన్న వాటిని ఎగుమతి చేయరాదని నాట్కో, అలెంబిక్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. పేటెంట్ ఉల్లంఘన కాదు... బేయర్స్ కేన్సర్ ఔషధమైన సోరాఫెనిబ్ను నెక్సావర్ పేరుతో మార్కెట్ చేస్తోంది. దీనికి పేటెంట్ రక్షణ ఉంది. దీనికి జనరిక్ వెర్షన్ అయిన సోర్ఫెనట్ను నాట్కో ఎగుమతి చేసింది. అలాగే, బేయర్స్కు చెందిన రక్తాన్ని పలుచన చేసే రివరోక్సాబాన్ జనరిక్ రూపాన్ని అలెంబిక్ కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో నాట్కో, అలెంబిక్ పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బేయర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ 107 సెక్షన్ఏలో పేర్కొన్న అవసరాలకు పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయడం ఉల్లంఘనకు పాల్పడినట్టు కాదని, దీన్ని అడ్డకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పేటెంట్ ఔషధాన్ని నియంత్రణ సంస్థల అవసరాల కోసమంటూ ఎగుమతి చేసేం దుకు ఒక్కసారి అనుమతిస్తే, ఆ అవసరాలకే వాటిని వినియోగించేలా కోర్టు హామీ ఇవ్వలేదని బేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది. -
రాజ్యాంగ ధర్మాసనానికి ‘అధికారాల వివాదం’
సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రం, ఆప్ సర్కార్ వాదనలు అక్కడే వినిపించాలన్న జడ్జీలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదు కనుక లెప్టినెంట్ గవర్నర్ చేతిలోనే పాలనాధికారం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ అధికార అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ కేసుల్లో చట్టం, రాజ్యాంగానికి సంబంధించిన అనేక కీలకాంశాలుండటంతో దీన్ని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె. సిక్రీ, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్, ఐదుగురు న్యాయమూర్తులతో ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తమ వాదనలను ఈ ధర్మాసనం ఎదుట వినిపించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు సత్వర పరిష్కారం కోసం ధర్మాసనాన్ని త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఏయే అంశాలపై విచారణ జరపాలన్నది న్యాయమూర్తులు నిర్ధారించలేదు. ఢిల్లీ ప్రభుత్వ విభాగాలపై అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న విషయమై ఆప్ సర్కారు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ల మధ్య గట్టి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు
• గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా లింగ వివక్ష • ఇప్పటికీ మహిళలకు నిర్ణయాధికారాలు లేవు • కుటుంబాల్లో ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా చూడాలి • మహిళా పార్లమెంటులో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే స్థాయికి మహిళలు ఎదగాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటులో రెండో రోజైన శనివారం ఆమె మాట్లాడారు. శతాబ్దాల నుంచి మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇప్పటికీ నిర్ణయాధికారాలు వారికి ఉండడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో వచ్చిన మహిళా రిజర్వేషన్ల వల్లే తాను జడ్జినయ్యానని చెప్పారు. స్త్రీ, పురుష సమాన త్వం గురించి వేదికలపై మాట్లాడుకుం టున్నా.. వాస్తవంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. పనిచేసే చోట వేధింపులు, సౌకర్యాల కొరత ఇబ్బందికరం గా ఉందన్నారు. తాను నగరంలో పుట్టలేదని, తన తండ్రి ఇంజనీరుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడంతో ప్రభుత్వ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తానిక్కడ ఉండడానికి తన కుటుంబమే కారణమని చెప్పారు. తన తల్లితండ్రులు తనను, తన అన్నదమ్ములను వేర్వేరుగా చూడలేదన్నారు. కుటుంబాల్లో ఆడ, మగపిల్లలిద్దరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతి విద్యార్థికి తల్లే మొదటి గురువని చెప్పారు. ఐక్యరాజ్య సమితితో ఒప్పందం ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంతో ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం సహకారం అందించనుంది. ఈ సందర్భంగా సమితి మహిళా విభాగం ప్రతినిధి ఆసా టొర్కెలెన్స్ మాట్లాడుతూ.. స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయని, లింగ వివక్ష ఉన్న సమాజాలు వృద్ధి చెందలేవన్నారు. çసదస్సులో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. మహిళా శక్తిని వినియోగించుకోలేకపోయాం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మహిళలను ఒక శక్తిగా సద్వి నియోగం చేసుకోవడం లో విఫలమయ్యామని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. అన్ని రంగాల్లోనూ వారిని నిర్ణయాత్మక శక్తులుగా తీర్చిదిద్దాల్సి వుందన్నారు. మనిషికి జన్మనిచ్చే మహిళ చివరికి ప్రేక్షకురాలిగానే ఉండిపో తోందని, ఈ పరిస్థితి మారాలన్నారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు దేశంలో మహిళలపై అరాచకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ ఎడిటర్ సాగరికా ఘోష్ అన్నారు. నిర్భయ కేసు తర్వాత రేప్ అనే పదం నిర్వచనమే మారిపోయిందని తెలిపారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా మహిళల మిస్సింగ్ కేసులు భారత్‌లో ఎక్కువగా ఉంటున్నాయని, ఇది చాలా బాధాకరమన్నారు. అమెరికాలోనూ లింగవివక్ష ఉంది అమెరికాలోనూ ఇంకా లింగ వివక్ష ఉందని, ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్, ఏపీ సీఎం కోడలు నారా బ్రహ్మణి చెప్పారు. తన ఇంట్లో మహిళలకు గౌరవం ఇస్తారని, ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం, సీఎం చంద్రబాబు కోడలినవ్వడం గర్వించదగిందన్నారు. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందీ ఆయనే అన్నారు. శనివారం మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జస్టిస్ రోహిణికి జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో చక్రపాణి, గవర్నర్ నరసింహన్, కోడెల నిస్వార్థంగా సేవ చేసే గుణం మహిళలదే: డీకే అరుణ సాక్షి, అమరావతి: సమాజంలో నిస్వార్థంగా సేవ చేసే గుణం ఒక్క మహిళకే దక్కుతుందని మాజీ మం త్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శనివారం మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరై ఆమె ప్రసంగిం చారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ప్పటికీ మహిళగా రాజకీయాల్లో విజయవంతంగా ముందుకెళ్తు న్నానన్నారు. ప్రతి ఒక్క మహిళా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని కోరారు. మహిళలు రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్నప్పటికీ హింస తగ్గలేదని పేర్కొన్నారు. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం ఇంకా రాలేదన్నారు. పొగడ్తలు సరే.. రిజర్వేషన్లు కల్పించండి: అల్కా లాంబా సాక్షి ప్రత్యేక ప్రతినిధి–అమరావతి: ‘‘మహిళలు దేవతా స్వరూపులనీ, మహాలక్షు్మలని, ఆదిశక్తులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాశానికెత్తేస్తే సరిపోదు.. ప్రధాని మోదీకి చెప్పి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేయాలి’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ (చాందినీ చౌక్) ఎమ్మెల్యే అల్కా లాంబా డిమాండ్ చేశారు. మహిళా పార్లమెంటు సదస్సు రెండో రోజు ‘మీరే హీరోలు’ (బీ యువర్ ఓన్ హీరోస్) అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ తొలి రోజు సమావేశాల్లో వెంకయ్య చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూనే చురకలంటించారు. పోరాడండి, సాధించుకోండి! కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోస్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘భారతీయ మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మనకు ఏదీ బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వరు. అత్యున్నత స్థాయికి చేరేందుకు పోరాటం చేయాలి. చదువే ఇందుకు ఆయుధం. చదవండి, పోరాడండి. అత్యున్నత స్థాయికి చేరండి’’ అని కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జోస్ చెర్నో లబోసో పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో ఇప్పటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, చట్టసభల్లో అమలు చేయడమే తమ ముందున్న సమస్య అని డాక్టర్ జోస్ పేర్కొన్నారు. సత్తా నిరూపించుకోవాలి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘హనుమంతుడి మాదిరే మహిళలకున్న శక్తి ఏమిటో వాళ్లు తెలుసుకోవాలి. వాళ్ల సత్తాను నిరూపించుకోవాల్సిన సమయమి దే..’ అని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అభిప్రాయపడ్డారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో సమాజం వారి కి అండగా నిలవాలన్నారు. మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళా పార్లమెంటు లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రస్తుత పార్లమెంటులో 400 మందైనా మహిళలు ఉండాలని చెప్పారు. -
అది అత్యాచారం కాదు: హైకోర్టు
న్యూఢిల్లీ: వివాహానికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత పురుషుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని అతనిపై అత్యాచారం కేసు పెడితే అది చెల్లదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. శృంగారం తర్వాత ఎదురయ్యే పరిణామాలపై స్త్రీకి పూర్తి అవగాహన ఉంటుందనీ, ఆమెను పెళ్లి చేసుకోవచ్చు లేదా నిరాకరించవచ్చని తెలిసినా కలయికకు ఒప్పుకోవడం ఆమె తప్పే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిపై 26 ఏళ్ల మహిళ ఇలాంటి కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రెండుసార్లు శృంగారం చేశాక, ఇప్పడు పెళ్లికి ఒప్పుకోవడం లేదనీ, ఫోన్ లో కూడా మాట్లాడటం లేదని ఆమె ఆరోపించింది. -
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తానీ!
న్యూఢిల్లీ: స్మగ్లింగ్ కేసులో భారత్‌లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌కి చెందిన ఓ వృద్ధుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. శిక్షాకాలం గతేడాది ఏప్రిల్ 6న ముగిసినప్పటికీ గత ఎనిమిది నెలలుగా జైల్లో నిర్బంధించారని, తనని స్వదేశానికి పంపించాలని కోరుతూ మహ్మద్ హనీఫ్(85) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌ను జస్టిస్ ఏకే పతాక్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫిబ్రవరి 2లోపు వివరణివ్వాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుతాల్ని ఆదేశించింది. -
జవాన్ల నాసిరకం తిండిపై స్పందించండి
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: దేశ సరిహద్దులోని సైనికులకు నాసిరకం ఆహారం వడ్డించడంపై స్పందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్‌లతో కూడి ధర్మాసనం విచారించింది. సైనికులకు నాసిరకం వడ్డిస్తున్నట్లుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ ఈ నెల 9న ఫేస్బుక్లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా బీఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు(ఐటీబీపీ), సశాస్త్రసీమ బల్(ఎస్ఎస్బీ), అస్సాం రైఫిల్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, పరిశోధన నివేదకను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అధికారుల్లో అవినీతి పేరుకుపోయిందని, అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయని వీడియో అప్లోడ్ చేసిన యాదవ్‌పై చర్యలు తీసుకునే అంశంలో తాము జోక్యం చేసుకోబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఈ అంశంపై, అభిషేక్ కుమార్ ఛౌదరి అనే న్యాయవాది కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నాసిరకం ఆహారం అంశం సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేయకుండా చూడాలని, సైనికులకు అందిస్తున్న ఆహారం, ఆహారం తయారీ, వివిధ స్థాయిల్లోని అధికారులకు అందిస్తున్న ఆహారంపై స్పష్టతనివ్వాలని పిల్లో కోరారు. -
కేంద్రాన్ని సవాల్ చేసిన జకీర్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ కేంద్రాన్ని సవాల్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థను నిషేధించడంపై ఆ సంస్థ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నాయక్ కోర్టుకు వెళ్లడంతో వెంటనే వివరాలు అందించాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు పూర్వపరాలు పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 15న కేంద్రం ప్రభుత్వం జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థను నిషేధించిన సంగతి తెలిసిందే. -
3 కాపీరైట్ సంస్థలపై హైకోర్టు ఆంక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ కళాకారుల సంగీతం, పాటలను బహిరంగ ప్రదేశాల్లో వినిపించడానికి కావాల్సిన లైసెన్సులను ఇవ్వడానికి తమకు హక్కులు ఉన్నాయని చెప్పుకుంటున్న మూడు కంపెనీలపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 24 వరకు ఈ కంపెనీలు ఎవ్వరికీ లైసెన్సులు ఇవ్వకూడదని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ, ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్, నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొసైటీలు కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 33ను ఉల్లంఘించాయని పిటిషన్ వేసిన సంస్థ ఆరోపించింది. కేసును ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ రెండు సంస్థల రిజిస్ట్రేషన్ 2013 జూన్ 31కే పూర్తవ్వగా, నోవెక్స్ అసలు ఇప్పటిదాకా రిజిస్ట్రేషనే చేసుకోకుండా లైసెన్సులిస్తోందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో పై మూడు సొసైటీలకు భారీగా లైసెన్సు ఫీజలు రావాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులివ్వడంతో కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఉత్తర్వులపై స్పందించాల్సిందిగా కేంద్రం, కాపీరైట్ ఆఫీస్, మూడు సొసైటీలు, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియాలకు నోటీసులిచ్చింది. -
ఢిల్లీ ప్రభుత్వానికీ అధికారాలుండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అధికారాలుండాలనీ, లేకపోతే అది పనిచేయలేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరే(ఎల్జీ) పరిపాలనాధిపతి అని, సీఎం, మంత్రివర్గం నామమాత్రమేనని ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పు నివ్వడం తెలిసిందే. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంలో సవాల్ చేసింది. సుప్రీం తుది విచారణను జనవరి 18కి వాయిదా వేస్తూ.. ‘ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కొన్ని అధికారాలుండాలి. లేకపోతే అది పనిచేయలేదు. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలి’అని పేర్కొంది. ఆప్ ప్రభుత్వం తరఫున న్యాయవాది గోపాల్ సుబ్రమణియం వాదిస్తూ ప్రస్తుతం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి నుంచి నాల్గవ తరగతి ఉద్యోగి వరకు ఎవరినీ నియమించే అధికారం లేదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పాలనలో ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాలను ఎల్జీ తీసుకోవాలనీ, అభిప్రాయ భేదాలుంటే రాష్ట్రపతికి నివేదించాలని వివరించారు. -
జేఎన్‌యూ విద్యార్థి జాడ ఇంకా తెలియలేదా?
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్‌ను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేకపోయారని, అతడి జాడను కనుక్కోలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై పోలీసులు చెప్పిన సమాధానంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 22లోగా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తూ ఈ కేసు విచారణను అప్పటి వరకు వాయిదా వేసింది. అదే సందర్భంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. విద్యార్థి ఎన్నికలకు సంబంధించి అహ్మద్ ఉంటున్న గది వద్దకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు అతడితో గొడవకు దిగారని, దాడి చేశారని అప్పటి నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు పోలీసులు కనుక్కోలేకపోయారని అతడి తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేశారు. -
అత్యాచారం వల్ల పుట్టిన పిల్లలకు పరిహారం
న్యూఢిల్లీ: అత్యాచార బాధితురాలికే గాక, ఆ దారుణం వల్ల్ల జన్మించిన పిల్లలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనార్టీ తీరని బాలికను సవతి తండ్రి అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అత్యాచారం కారణంగా జన్మించిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధనలేవీ చట్టంలోగాని, ఢిల్లీ ప్రభుత్వ నష్టపరిహారం పథకంలో గాని లేకపోవడం శోచనీయమని పేర్కొంది. -
బహిరంగంగా సైనికుల దుస్తుల అమ్మకాలా?
న్యూఢిల్లీ: సైనికులు ధరించే దుస్తులు, షూస్, బ్యాడ్జీలు వంటి వాటిని బయట ప్రదేశాల్లో అమ్మడం తీవ్రమైన విషయమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా అమ్ముతున్న దుస్తులను ఉపయోగించి సైనిక స్థావరాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వీటిపై తమ వైఖరి తెలియజేయాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీకి చెందిన ఎన్జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం వాదనలు వినింది. అనంతరం దీనిపై తమ వైఖరిని తెలియజేయాలని రక్షణ శాఖ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి వాదనలను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. -
కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరుపున న్యాయవాది హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 2013లో ఓ పత్రికా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిబల్ కుమారుడు అమిత్ సిబల్ నేర పూరిత పరువు నష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉందని కింది స్థాయి కోర్టు ఆదేశించగా తాను ముఖ్యమంత్రిగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని, తన తరుపున వేరేవారి హాజరుకు అనుమతిస్తూ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను ఆమోదించింది. అయితే, కేజ్రీవాల్ హాజరుకాకుంటే కేసు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే మాత్రం హాజరుకావాలంటూ ఆదేశించే హక్కు మాత్రం కింది కోర్టుకు ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
‘బోఫోర్సు’ తీర్పు సవాలుకు అనుమతి రాలేదు: సీబీఐ
న్యూఢిల్లీ: బోఫోర్స్ ముడుపుల చెల్లింపుల కేసులో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తరువాత అప్పీలు చేయడానికి తనకు అనుమతి లభించలేదని సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ లాయర్ అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. 2005, మే 31 నాటి తీర్పును సవాలు చేయడానికి సీబీఐకి అనుమతి రాలేదని సంస్థ లాయర్ గురువారం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అప్పీలుకు నిరాకరించిన కేసును తిరిగి కొనసాగిస్తానని అగర్వాల్ చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చాలా అసంబద్ధంగా ఉందని, దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ తీర్పును సవాలు చేయడానికి సీబీఐ ముందుకు రాకపోవడంతో అప్పీలు చేసేందుకు అగర్వాల్‌కు సుప్రీంకోర్టు 2005లోనే అనుమతిచ్చింది. -
‘తల్లిదండ్రుల ఇంట్లో ఉండే హక్కు లేదు’
న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో ఉండవచ్చని, అలాగని కొడుకును అతడి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘తల్లిదండ్రుల కష్టార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస లేదు. అతడికి ఆ ఇంట్లో నివసించే హక్కులేదు’ అని పేర్కొంది. తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ జంట వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము కష్టపడి సంపాదించిన ఇళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేరుుంచాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రరుుంచారు. -
డిజిటైజేషన్ గడువును రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: కేబుల్‌టీవీ నెట్‌వర్క్‌ల మూడోదశ డిజిటైజేషన్ కోసం ఐదు రాష్ట్రాల్లోని 9 సంస్థలకు వివిధ హైకోర్టులు పొడిగించిన గడువును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. మూడో దశ డిజిటైజేషన్ కు 2015 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. ప్రక్రియను పూర్తి చేయడానికి తమకు మరింత సమయం అవసరమనీ, గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, యూపీలలోని 9 కేబుల్‌టీవీ సంస్థలు హైకోర్టులను ఆశ్రయించాయి. ఆ మేరకు హైకోర్టులు సంస్థలకు గడువును పొడిగించాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేసులను విచారించిన ఢిల్లీ హైకోర్టు, 9 నెట్‌వర్క్‌ల గడువును రద్దు చేసింది. -
‘గర్భవతి శృంగారాన్ని వద్దనడం క్రూరత్వంకాదు’
న్యూఢిల్లీ: గర్భవతి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం అనిపించుకోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. గర్భవతిగా ఉన్నపుడు భార్య శృంగారానికి ఒప్పుకోవట్లేదంటూ ఆమె నుంచి విడాకులు కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించిన కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. భార్య ఉదయం త్వరగా నిద్రలేవకపోవడం, మంచం మీదకే టీ తెమ్మని కోరడం లాంటివి ఆమె బద్ధకాన్ని సూచిస్తాయేగానీ క్రూరత్వానికి ఉదాహరణలు కాలేవని కోర్టు అభిప్రాయపడింది. భర్త విడాకుల పిటిషన్‌ను ఓ ఫ్యామిలీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. -
భార్య అలాచేయడం క్రూరత్వం కాదు: హైకోర్టు
న్యూఢిల్లీ: భార్య తనతో శృంగారానికి నిరాకరించినందుకు గాను విడాకులు కావాలంటూ కోరిన ఓ వ్యక్తికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. శృంగారానికి నిరాకరించిన సదరు భార్య ఆ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉంది కావున ఇందులో క్రూరత్వం ఏమీ లేదని.. ఈ కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే.. భార్య ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, నిద్రలేస్తూనే టీ తీసుకురావాలని ఆర్డర్లు వేయడం ఆమె సోమరితనాన్ని సూచిస్తాయి కానీ క్రూరత్వాన్ని కాదని పిటిషనర్ ఆరోపణలపై కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కారణాలతో విడాకులు ఇవ్వడం కుదరదని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును జస్టీస్ ప్రదీప్ నంద్రజోగ్, ప్రతిభా రాణీలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. -
కేసుల్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్
► న్యాయవ్యవస్థపై భారం తగ్గించాలి: ప్రధాని మోదీ ► ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు అమలుపై చర్చ జరగాలన్న మోదీ ► న్యాయ విలువలు పాటించడంలో రాజీపడొద్దు: సీజేఐ ఠాకూర్ ► సర్దార్ పటేల్‌కు మోదీ నివాళులు.. ఘనంగా ఏక్తా దివస్ ► సైన్యంతో కలసి మోదీ దీపావళి వేడుకలు ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే.. ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్ పాలసీ’ ఖరారు చేయడంలో కేంద్రం విఫలమైంది. తాజా పరిణామాల దృష్ట్యా ఈ పాలసీ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న అంశంపై స్పష్టత అవసరం. – నరేంద్ర మోదీ న్యూఢిల్లీ/సిమ్లా: కోర్టుల్లోని కేసుల్లో ప్రభుత్వమే అతి పెద్ద లిటిగెంట్(కక్షిదారు) అని, వీటి పరిష్కారానికే న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోర్టులపై ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరముందని, అందుకోసం జాగ్రత్తగా పరిశీలించాక కేసులు వేయాలని సూచించారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ... దేశంలో ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు(ఏఐజేఎస్)ను ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. పదవీకాలం, పరోక్ష పన్నులు, ఇతర అంశాల కు సంబంధించి కోర్టుల్లోని 46 శాతం కేసు ల్లో ప్రభుత్వం లిటిగెంట్‌గా ఉందని మోదీ చెప్పారు. ‘ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్ పాలసీ’ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న దానిపై స్పష్టత కావాలి’ అని అన్నారు. న్యాయవ్యవస్థకు చెడ్డపేరు: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ మాట్లాడుతూ... న్యాయ విలువలపై ఎప్పుడూ రాజీపడకూడదని, అవకతవకలు మొత్తం న్యాయవ్యవస్థకే అప్రతిష్ట తీసుకొస్తున్నాయని అన్నారు. జడ్జీలు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా వృత్తిపరమైన నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ... తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని జడ్జీలు మాట్లాడుకోవడం విన్నానన్నారు. ఈ ఆరోపణలను కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వేదికపైనే ఖండించారు. అందరివాడు పటేల్ : మోదీ భారత్‌ను శక్తిమంత మైన జాతిగా తీర్చిదిద్దాలని, విభజన శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. ప్రధాని మాట్లాడుతూ... ‘రాజకీయ దృఢ సంకల్పంతో సర్దార్ పటేల్ భారత్‌ను సంఘటిత పరిచారు ’ అని అన్నారు. పటేల్ జ్ఞాపకార్థం ఢిల్లీలో డిజిటల్ మ్యూజియాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘పటేల్ కాంగ్రెస్ నేత . నాది బీజేపీ . అయినా జయంతి వేడుకలను అదే ఉత్సాహంతో జరుపుకోవడమే మంచి ఐక్యతాసందేశం’ అని మోదీ అన్నారు. స్వతహాగా గుజరాతీ అయిన గాంధీ.. మరో గుజరాతీని(పటేల్) ప్రధానిగా ఎంపిక చేయలేదని సరదాగా అన్నారు. ఢిల్లీలోని పటేల్ చౌక్‌లో పటేల్ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఇండియా గేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్టాంపు విడుదల చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొనడానికి వచ్చిన పిల్లలతో ప్రధాని సమైక్యతా ప్రతిజ్ఞ చేయించి... అనంతరం పరుగును ప్రారంభించారు. కాగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 32వ వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. సైన్యంతో కలసి దీపావళి వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో ఆదివారం సైన్యంతో కలసి ప్రధాని మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో హాజరైన మోదీ.. ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), డోగ్రా స్కౌట్స్‌తో పాటు జవాన్లను కలుసుకున్నారు. సుమ్డోలో జవాన్లకు మోదీ స్వీట్లు తినిపించారు. యాపిల్స్‌కు ప్రసిద్ధి చెందిన ఛాంగో గ్రామంలో మహిళలు, చిన్నారులతో కాసేపు గడిపారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ కోసం రూ.5,500 కోట్లు విడుదల చేశామని, సైనికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కొద్దిరోజులుగా జవాన్లు అలుపు లేకుండా పనిచేస్తున్నారని.. వారి త్యాగం వెలకట్టలేనిదని ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రతి పౌరుడు సైనికులను చూసి గర్వపడాలన్నారు. అలాగే దీపావళి సందర్భంగా ‘సందేశ్ 2 సోల్జర్స్’ అభ్యర్థనకు స్పందించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. -
‘మాల్యాలా చేయొద్దు.. భారత్‌కు తిరిగి రా’
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ అధికారులకు మస్కా కొట్టి దుబాయ్‌కి ఎగిరిపోయిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషిని ఢిల్లీ హైకోర్టు బుధవారం విజయ్ మాల్యాతో పోల్చింది. మాల్యాలాగా విదేశాలకు పారిపోయి తిరిగిరాకుండా ఉండొద్దని వ్యాఖ్యానించింది. మీరు భారత్‌లో లేరంటే దానర్ధం కోర్టుకు హాజరు కావాలనుకోవడం లేదని తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. 'ముందు, దేశానికి రండి, ఇంటరాగేషన్‌లో పాల్గొనండి' అని కోర్టు ఆదేశించింది. నవంబరు మధ్య కల్లా భారత్‌కు వచ్చి నవంబరు 22న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాత్కాలిక ఆదేశాలు జారీ చేసేది లేదని న్యాయస్థానం తేల్చి చెప్పా రు. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వాలన్న ఖురేషీ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. (చదవండి....ఇమిగ్రేషన్ అధికారులకు మొయిన్ ఝలక్!) -
ఆప్ అధినేతకు చుక్కెదురు!
-
ఆప్ అధినేతకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు స్థానిక హైకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయాలని కోరిన కేజ్రీవాల్ కు నిరాశ తప్పలేదు. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుమంది ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. 2013 వరకూ దాదాపు 13 ఏళ్లపాటు ఢిల్లీ క్రికెట్ బోర్డు(డీడీసీఏ)లో ఉన్నత పదవిలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డాడని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కొందరు ఆప్ నేతలు బహిరంగంగానే తీవ్ర విమర్శలుచేశారు. తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసే ప్రసక్తిలేదని తీర్పు వెల్లడించింది. రాజకీయ మైలేజీ కోసం కేజ్రీవాల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అది చివరికి ఆప్ నేతలకు నష్టం చేకూరుస్తుందని జైట్లీ పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆరోపణలు చేసిన వారిలో ఆప్ నేతలు అశుతోష్, కుమార్ వివ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్ పాయ్ ఉన్నారు. రాజకీయంగా తమపై కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారని ఆప్ నేతలు మండిపడుతున్నారు. -
ఎక్కువ కాలం శృంగారం నిరాకరిస్తే.. విడాకులివ్వచ్చు
వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు భర్తకు శృంగారం నిరాకరిస్తే.. అది మానసిక క్రూరత్వమే అవుతుందని.. అలాంటి సందర్భాల్లో విడాకులు ఇవ్వొచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. గత నాలుగున్నరేళ్లుగా తన భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదని, తనను మానసికంగా హింసిస్తోందని, ఆమెకు ఎలాంటి శారీరక ఇబ్బందులు లేకపోయినా అలా చేస్తోందని.. అందువల్ల తనకు విడాకులు మంజూరుచేయాలని కోరుతూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టులో అతడి ఆరోపణలను ఖండించినా, హైకోర్టు మాత్రం అతడికి విడాకులు మంజూరుచేసింది. ఈ కేసులో భర్త తాను తన భార్య వల్ల మానసిక క్రూరత్వానికి గురైనట్లు పూర్తిగా నిరూపించారని.. ఒకే ఇంట్లో ఉం టున్నా సుదీర్ఘ కాలంగా అతడికి సంసార సుఖం లేదని, పైగా ఆమె ఎలాంటి శారీరక వైకల్యంతో బాధపడకపోయినా ఎలాంటి కారణం లేకుండా నిరాకరించారని అందువల్ల విడాకులు ఇవ్వడానికి పూర్తి కారణాలున్నాయని జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇంతకుముందు దిగువకోర్టులో తాను దాఖలుచేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేయడంతో ఆ తీర్పును సవాలుచేస్తూ సదరు భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తమకు 2001 నవంబర్ 26న హర్యానాలో పెళ్లయిందని, తమకు 10, 9 ఏళ్ల వయసున్న ఇద్దు కొడుకులున్నారని భర్త చెప్పాడు. తర్వాత కొంత కాలం నుంచి తన భార్య ఇంటి పనులు చేయడం మానేసిందని, రానురాను ఆమె ప్రవర్తన భరించలేనంతగా మారడంతో తాను, తన పిల్లలు చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పారు. దాంతో అదే ఇంట్లోని మరో పోర్షన్లో వేరేగా ఉండమని తన తల్లిదండ్రులు తనకు సలహా ఇచ్చారన్నారు. గత నాలుగున్నరేళ్లుగా భార్య తనను దగ్గరకు కూడా రానివ్వడంలేదని వాపోయారు. -
వైద్య కోర్సుల్లో ‘రక్షణ రిజర్వేషన్ల’పై తేల్చండి
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో రక్షణ శాఖకు చెందిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తేల్చిచెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రక్షణ శాఖ వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని హోంశాఖ గతంలో సిఫార్సు చేసింది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలనీ, తద్వారా రిజర్వేషన్లు ఇచ్చేలా అయితే వచ్చే ఏడాది నుంచే వాటిని అమలు చేయవచ్చని జస్టిస్ సంజీవ్ సచ్దేవ పేర్కొన్నారు. -
మేధోశ్రమకు గుర్తింపు
రాగ రంజితమైన అక్షరం ఉత్సాహపరుస్తుంది... ఉద్వేగపరుస్తుంది... ఉపశమనం కలిగిస్తుంది. సంగీతం విశ్వభాష. దానికి ఎల్లలుండవు. రాగాల వర్షం కురిసిందంటే అందులో తడిసి ముద్దగా మారి తరించడానికి సిద్ధపడనివారుండరు. భాష రాకపోయినా, భావం తెలియకపోయినా ప్రపంచంలో ఏ మూలనున్న హృదయాన్నయినా స్పృశించగల శక్తి సంగీతానికి ఉంటుంది. ఊగించి, శాసించే సంభాషణలైనా అంతే. కానీ ఈ శక్తే వాటి సృష్టికర్తలకు అన్యాయం చేస్తోంది. పాట రచయితకూ, ఆ పాటకు బాణీ కట్టి దాన్ని మరింత సుసంపన్నం చేసే సంగీతకారులకూ, సంభాషణల రచ యితలకూ రాయల్టీ పరంగా దక్కవలసింది దక్కడం లేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు దాన్ని సరిదిద్దుతాయి. సృజనశీలమైన మిగతా రంగాల్లో వాటి సృష్టికర్తలకు మేధోపరమైన హక్కులు అమలవుతుంటే తమ హక్కులు మాత్రం నిత్యం ఉల్లంఘనకు గురవుతున్నాయన్న అసంతృప్తి రచయితలకూ, స్వర కర్తలకూ, గాయకులకూ ఉంటోంది. పాట లేదా సంభాషణలు రాసిచ్చాక వాటి రచ యితలకూ, పాటను స్వరపరిచాక సంగీత దర్శకులకూ, ఆలాపించాక గాయకులకూ దాంతో ఇక సంబంధం లేకుండా పోతోంది. మొదటిసారి ఒక చిత్ర నిర్మాత లేదా రికార్డింగ్ సంస్థ ఇచ్చే మొత్తమే తప్ప అనంతర కాలంలో వారికి వచ్చేదేమీ ఉండదు. వాణిజ్యపరంగా దాన్ని ఎన్నిచోట్ల ఎంతమంది, ఏ రూపంలో ఉపయోగించుకుం టున్నా వారు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. నాలుగేళ్లక్రితం ఈ అన్యాయాన్ని సరిదిద్దాలన్న కృతనిశ్చయంతో కవి, బాలీవుడ్ గీత, సంభాషణల రచయిత జావేద్ అఖ్తర్ కాపీరైట్ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం శ్రమించారు. అంతకు చాన్నాళ్లముందే లోక్‌సభలో ఆమోదం పొందినా అప్పటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకరించక రాజ్యసభలో ఆగిపోయిన ఆ బిల్లును చివ రకు పార్టీల ప్రమేయం లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారంటే దాని వెనక జావేద్ అఖ్తర్ కృషి ఎంతో ఉంది. రచయితలు, కళాకారుల మేధోపరమైన హక్కులకు సంబంధించి అంతర్జాతీయంగా పకడ్బందీ నియమనిబంధనలున్నాయి. మన దేశంలో ఆ స్థాయిలో లేవు. 1957 చట్టానికి 2012లో తెచ్చిన సవరణలతో ఆ లోటు తీరింది. ఒక చిత్రంలోని సంభాషణలైనా, పాటలైనా వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించుకుంటు న్నప్పుడు వాటి సృష్టికర్తలకు రాయల్టీ చెల్లించాలని తాజా సవరణలు నిర్దేశించాయి. ఈ హక్కు యాభైయ్యేళ్లపాటు అమలవుతుంది. చానెళ్లలో కావొచ్చు... రెస్టరెంట్లలో కావొచ్చు... పబ్‌లలో కావొచ్చు వాటిని వినియోగించుకున్న ప్రతిసారి ఇలా రాయల్టీ చెల్లించాల్సిందేనని చట్టం అంటున్నది. అంతక్రితం కేవలం ఆ చిత్ర నిర్మాత లేదా నిర్మాణ సంస్థకు మాత్రమే అలాంటి హక్కు ఉండేది. ఫలితంగా ఏఆర్ రహమాన్ వంటి సంగీత దర్శకులను కూడా మ్యూజిక్ రికార్డింగ్ సంస్థలు శాసించేవి. 2012 చట్ట సవరణల తర్వాత కొద్దో గొప్పో పరిస్థితి మారింది. సృజన హక్కులు గుత్తగా నిర్మాతలకూ లేదా నిర్మాణ సంస్థలకూ ఉండటం సరికాదని చట్టం గుర్తించింది. తమ సృజనకు ఒకసారి ఆదాయం సంపాదించే రచయితలు, ఇతర కళాకారులు ఆ తర్వాత అదే సృజనకు పరాయివారు కావడం, ఆర్ధిక ఇబ్బందులకు లోనుకావడం సరికాదని భావించింది. షెహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్ లాంటివారు వృద్ధాప్యంలో ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులకు లోనయ్యారో, ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే స్తోమత లేక ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో ఎవరికీ తెలియనిది కాదు. కనీసం ఉండటానికి ఇల్లయినా లేనివారు ఎందరో! అయితే దాని అమలు ఇంకా సరిగా లేదన్న అసంతృప్తి మాత్రం అందరిలో ఉంది. గాయకుల హక్కుల రక్ష ణకు భారతీయ గాయకుల హక్కుల సంఘం(ఐఎస్ఆర్ఏ) ఉండగా సినీ రచయి తల సంఘంలాంటివి రచయితలకున్నాయి. అయితే ఈ పరిధుల్లోకి రాని వారి రాయల్టీ హక్కులు ఉల్లంఘనకు గురవుతూనే ఉన్నాయి. ఇక చిత్ర దర్శకులకు ఈ చట్టం న్యాయం చేయలేదనే చెప్పాలి. వారిని చట్టం గుర్తించలేదు. వాణిజ్యపరంగా సూపర్‌హిట్ అయిన దర్శకుల సంగతి వేరుగానీ... ఒకటో, రెండో విజయం సాధించి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే దర్శ కులకు ఇది ఇబ్బందికరమే. ఇప్పుడు గాయకులకు సంబంధించినంతవరకూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పులు ఊరటనిచ్చేవే. ఒక రెస్టరెంట్లో తగిన అనుమతులు తీసుకోకుండా తమ పాటలను వినియోగించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను అనుమతిస్తూ అందుకు జరిమానాతోపాటు తగిన మొత్తం చెల్లించాల్సిందేనని ఆ రెండు కేసుల్లోనూ తీర్పులు వచ్చాయి. వాటిని ప్రదర్శించిన ప్రతిసారీ ఐఎస్‌ఆర్‌ఏకు తగిన మొత్తం చెల్లించి అనుమతి పొందాల్సిందేనని ఆ తీర్పులు స్పష్టం చేశాయి. ఒక పాటను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే రాయల్టీ రుసుమును లేదా లైసెన్స్ ఫీజును చెల్లించాలని తెలిపాయి. చట్టాలు చేస్తే సరిపోదు. దాన్ని అమలు చేయాల్సిన వాణిజ్య సంస్థలు, పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోనట్టయితే గాయకులు, రచయితలు, స్వరకర్తలవంటి సృజనకారులకు అన్యాయం జరుగుతుంది. వారి మేధోశ్రమను సొమ్ము అనేక సంస్థలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునేవారు ఉండటం లేదు. న్యాయ స్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసి కేసు నడిపించే ఆర్ధిక వెసులుబాటు అందరికీ ఉండదు. వాస్తవానికి చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంలో రెండు లక్షల రూపా యల జరిమానా, గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చునని చట్టం నిర్దేశిస్తున్నా అధికారులు తమంత తాము చర్యలు తీసుకున్న ఉదంతాలు చాలా తక్కువ. వివిధ భాషల్లో 700కు పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఇళయరాజానే ఆమధ్య తాను స్వరాలు సమకూర్చిన పాటలు, నేపథ్య సంగీతం వగైరాలు అను మతి లేకుండా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడనని హెచ్చరించారు. ఇక సాధారణ సృజనకారుల సంగతి చెప్పే దేముంది? దీన్ని చక్కదిద్ది మేధోశ్రమ దోపిడీని అరికట్టవలసిన అవసరం ఉంది. -
నమోదైన 24 గంటల్లో వెబ్సైట్లోకి ఎఫ్ఐఆర్
రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటలలోపు వాటిని అధికారిక వెబ్సైట్లలో ఉంచాలని సుప్రీం కోర్టు బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. పోలీసు శాఖ వెబ్సైట్లకు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయాలని, ఏ రాష్ట్రంలోనైనా పోలీసు శాఖకు ప్రత్యేక వెబ్సైట్ లేకపోతే, ఆ రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ను వాడుకోవాలని సూచించిం ది. నవంబరు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని తన తీర్పులో ఆదేశించింది. అయితే తిరుగుబాట్లు, ఉగ్రవాదం, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నమోదు చేసిన వాటితో సహా అన్ని లైంగిక నేరాల ఎఫ్ఐఆర్ వెబ్సైట్లలో ఉంచడం నుంచి మినహాయించారు. ఏ ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో ఉంచాలో, దేన్ని ఉంచకూడదో నిర్ణయించేందుకు పోలీసు అధికారికి కనీసం డీఎస్పీ స్థాయి హోదా ఉండాలి. ఈ చర్య ద్వారా కేసులతో సంబంధమున్న వ్యక్తులు ఎఫ్ఐఆర్లను డౌన్లోడ్ చేసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కోర్టుల్లో దరఖాస్తు చేయగలరని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్లను వెబ్సైట్లో ఉంచాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతా అమలు చేయాలని ‘యూత్ లాయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సుప్రీంలో పిటిషన్ వేయగా కొన్ని మార్పులతో కోర్టు సమ్మతించింది. ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లలో ఉంచితే నేరస్తులు పోలీసులతో లాలూచీపడి కోర్టులో లబ్ధిపొందే అవకాశం ఉందని కేంద్రం ఆందోళ న వ్యక్తం చేయడంతో కోర్టు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. -
ప్రతియేటా ఇలా నీళ్లు నిలిస్తే ఊరుకోం: హైకోర్టు
''ప్రతియేటా ఇలాగే జరుగుతుంటే మేం సహించేది లేదు'' అని ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉండటంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నీళ్లు నిలిచిపోయిన పరిస్థితిపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ఢిల్లీ సర్కారును తీవ్రంగా తప్పుబట్టారు. నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల విషయంలో పరిధి అంటూ ఏమీ ఉండదని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే మాత్రం తాము సహించేది లేదని కోర్టు ఘాటుగా హెచ్చరించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడంతో కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుంది. తాను ఉదయం కోర్టుకు వస్తుంటే ఉపరాష్ట్రపతి నివాసం ఎదుట కూడా నీళ్లు నిలిచిపోయి ఉండటం కనిపించిందని కేసును విచారించిన న్యాయమూర్తి అన్నారు. ఢిల్లీలో డ్రైనేజి వ్యవస్థ ఏమాత్రం బాగోలేకపోవడంతో డ్రెయిన్లలో దోమలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయని, దానివల్ల డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని కూడా న్యాయమూర్తి అన్నారు. దక్షిణ ఎక్స్టెన్షన్ పార్ట్ -1, సమీపంలో ఉన్న కుశాక్ నల్లా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయిన ఫొటోలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దక్షిణ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో డ్రైనేజి వసతి సరిగా లేకపోవడం వల్ల అక్కడి నీళ్లే కుశాక్ నల్లాప్రాంతాన్ని కూడా ముంచెత్తినట్లు ఫొటోల వల్ల తెలుస్తోందని అన్నారు. దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ జలబోర్డులకు కోర్టు నోటీసులు జారీచేసింది. నిలిచిపోయిన నీళ్లను ఎప్పటికప్పుడు పోయేలా చూడాలని తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
వాట్సాప్ పాలసీపై హైకోర్టులో సవాల్
పాపులర్ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకున్న ప్రైవేట్ పాలసీ మార్పులపై సవాళ్లు ఎదురవుతున్నాయి. పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డేటా షేరింగ్‌ను సవాల్ చేస్తూ ఓ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, 2012లో నిర్ణయించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, లక్షలాది యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శ్రేయా సేథీ, కర్మన్య సింగ్ సారిన్ అనే వాట్సాప్ యూజర్లు ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్‌ను ఫైల్ చేశారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్‌తో కూడిన బెంచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)లకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 14లోపు ఈ పిల్‌పై తమ స్పందన తెలపాలని ఆదేశించింది. గతవారంలోనే ఈ కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్ ప్రకటించింది. పేరెంట్ కంపెనీతో యూజర్ల డేటాను షేర్ చేసుకోనున్నట్టు వెల్లడించింది. ఫోటోలు, మెసేజ్‌లు మాత్రం షేర్ చేయడం లేదని వాట్సాప్ తెలిపింది. సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీని కమర్షియల్ అడ్వర్టైజింగ్కు, మార్కెటింగ్‌కు యూజర్ల డేటాను వాడుకోనున్నట్టు ఫేస్బుక్, వాట్సాప్‌లు వెల్లడించాయి. అయితే ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని, ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపించారు. -
క్రెడిట్, డెబిట్ కార్డు సర్‌చార్జీలపై వైఖరేంటి?
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై విధిస్తున్న సర్‌చార్జీలపై వస్తున్న ఫిర్యాదులపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. సక్రమంగాలేని సర్‌చార్జీల విషయంలో నిర్ణీత గడువులోగా తమ వైఖరేంటో చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)లను ఆదేశించింది. నగదు చెల్లింపుల్లో ఎలాంటి పన్ను లేదని, కార్డుల ద్వారా లావాదేవీలపై మాత్రం 2.5 శాతం, అంతకుమించి సర్‌చార్జీలు విధిస్తున్నారని పిటిషన్ వేసిన న్యాయవాది అమిత్ సాహ్ని తెలిపారు. -
ఆ వీడియోలను తొలగించేందుకు ఓకే!
న్యూఢిల్లీ: అమలులో ఉన్న ఏ చట్టాన్నైనా ఉల్లంఘించేలా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తొలిగించేందుకు ఆ సంస్థ ఒప్పుకుందని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే వీడియోలను తాము ఉపేక్షించమని యూట్యూబ్ సంస్థ చెప్పినట్లు న్యాయమూర్తి ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. ఐటీ మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తామని యూట్యూబ్ తెలిపిందన్నారు. టాటా స్కై తొలగించమని చెప్పిన వీడియో లింకులను తొలగించాలని గతేడాది ఆగస్టు 27న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా అభ్యంతకర వీడియోలకు సంబంధించిన లింకులు తొలగించామని న్యాయస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 10న యూట్యూబ్ సంస్థ తెలిపింది. -
లైంగిక వేధింపుల కేసులో శశికళకు ఊరట!
న్యూఢిల్లీ: అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై.. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడిన ఎంపీ శశికళ పుష్పకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. శశికళ, ఆమె కుటుంబంపై పనిమనిషి నమోదుచేసిన లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎంపీ శశికళ, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల్ని ఇచ్చింది. రాజ్యసభ ఎంపీ అయిన శశికళ, ఆమె భర్త, కొడుకుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని హైకోర్టు బుధవారం తమిళనాడు ప్రభుత్వాన్నికి ఆదేశించిన సంగతి తెలిసిందే. శశికళ ఇంట్లో పనిచేస్తున్న పనిమనుషులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. దీనికితోడు పనిమనుషులు వేధింపుల కేసును నమోదుచేశారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభ వేదికగా అమ్మ జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణల్ని సందించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణ హానీ ఉందంటూ రాజ్య సభలో కన్నీళ్లు పెట్టి, ఢిల్లీలోని తన ఇంటికి భద్రతను కల్పించుకున్నారు. పదవికి రాజీనామా చేయాలని అమ్మ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి, రాష్ట్రం వైపుగా తొంగిచూడకుండా, ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఒత్తిడి పెంచేదిశగా అన్నాడీఎంకే వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తమనంటే, తమను శశికళ పుష్ప మోసం చేశారంటూ ఫిర్యాదులు చేశారు. ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృద్వీరాజ్లపై కూడా ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు, ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్నారంటూ కొందరు, తమను వేధించారంటూ మరికొందరు, తమ మీద దాడులకు పాల్పడ్డారంటూ ఇంకొందరు.. ఇలా ఫిర్యాదుల వేగం పెరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శశికళ పుష్ప కుటుంబం కోర్టును ఆశ్రయించింది. -
ఉక్కిరి బిక్కిరి..
సాక్షి, చెన్నై : అమ్మ ఆజ్ఞను ధిక్కరించిన అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తున్నది. ఆమెను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం కూడా ఆమె వైపునకు మళ్లి ఉన్నది. ఫిర్యాదులు హోరెత్తుతుండటంతో ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభ వేదికగా అమ్మ జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణల్ని సందించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణ హానీ ఉందంటూ రాజ్య సభలో కన్నీళ్లు పెట్టి, ఢిల్లీలోని తన ఇంటికి భద్రతను కల్పించుకున్నారు. పదవికి రాజీనామా చేయాలని అమ్మ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి, రాష్ట్రం వైపుగా తొంగిచూడకుండా, ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు. ఈ సమయంలో ఆమె మెడలు వంచే దిశగా అన్నాడీఎంకే వర్గాలు పయనం రాష్ట్రంలో సాగుతున్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. తమనంటే, తమను శశికళ పుష్ప మోసం చేశారంటూ కొందరు, మరి కొందరి ద్వారా ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృద్వీరాజ్లపై కూడా ఫిర్యాదులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. కాంట్రాక్టులు, ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్నారంటూ కొందరు, తమను వేధంచారంటూ మరి కొందరు, తమ మీద దాడులకు పాల్పడ్డారంటూ ఇంకొందరు... ఇలా ఫిర్యాదుల వేగం పెరగడంతో ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి శశికళ పుష్పకు, ఆమె కుటుంబానికి ఏర్పడి ఉన్నది. బుధవారం శశికళ పుష్పపై భానుమతి అనే మహిళ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆమె ఇంట్లో పనిచేసిన తన భర్త కరుప్పుస్వామి అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఆయనతో పాటుగా మరో ఏడుగురి ఇలా మరణించిన వారి జాబితాల్లో ఉన్నారంటూ భానుమతి చేసిన ఆరోపణలతో పోలీసులు విచారణకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో రూ. 20 లక్షలు తీసుకున్న శశికళ కుటుంబం తిరిగి అడిగితే, హతమారుస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు పోలీసులకు చేరాయి. ఇలా ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో ఆత్మరక్షణలో పడ్డ శశికళ పుష్ప, ఇక తమిళనాట న్యాయం జరగదని భావించినట్టున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో, రాజ్య సభ సభ్యురాలి పదవితో దేశ రాజధానిలో తిష్ట వేసి ఉన్న ఆమె, అక్కడి చిరునామా ఆధారంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయడం, ఇందుకు తమిళనాడు ప్రభుత్వం తరపున న్యాయవాది సుబ్రమణ్య ప్రసాద్ ఆక్షేపణ వ్యక్తం చేయడం చోటు చేసుకున్నాయి. ఈ ముందస్తు బెయిల్ విషయంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ, ఇంతకీ శశికళ, ఆమె భర్త లింగేశ్వర తిలగంల మీదున్న కేసులు ఏమిటో, వాటి వివరాలను తమ ముందు ఉంచాలని తమిళ పోలీసుల్ని ఆదేశించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు శశికళ పుష్ప మీద మరెన్ని ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు హోరెత్తనున్నాయో వేచి చూడాల్సిందే. -
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..
-
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..
► లెఫ్ట్‌నెంట్ గవర్నరే అక్కడ పరిపాలనాధికారి ► ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ.. ► ఎల్జీ అనుమతి లేని ప్రభుత్వ నోటిఫికేషన్లు చట్టవిరుద్ధమని ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: అధికారాల విషయమై కేంద్రంతో పోరాడుతున్న కేజ్రీవాల్ సర్కారుకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, దానికి పరిపాలనాధికారి లెఫ్ట్‌నెంట్ గవర్నరే(ఎల్జీ) అని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్ 239ను ఢిల్లీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 239ఏఏ తగ్గించేందుకు అవకాశం లేదని, పాలనాంశాలకు సంబంధించి ఎల్జీ ఆమోదం తప్పనిసరి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ జయంత్‌నాథ్‌ల బెంచ్ తన 194 పేజీల తీర్పులో పేర్కొంది. ఆర్టికల్ 239ఏఏలోని 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఢిల్లీపై పాలనా బాధ్యతలు అంతిమంగా రాష్ట్రపతికే ఉంటాయని తేల్చింది. 239ఏఏ ప్రకారం ఎల్జీ.. సీఎం, కేబినెట్ సలహా మేరకు వ్యవహరించాలని ఆప్ సర్కారు చేసిన వాదనను బెంచ్ తోసిపుచ్చింది. ఎల్జీ అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం చేయలేదని, ముందస్తు అనుమతి తర్వాతే ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల గవర్నర్లకంటే ఢిల్లీ ఎల్జీ విచక్షణాధికారాల పరిధి ఎక్కువని, ఆయన కేబినెట్ సలహా ప్రకారం కాక.. సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చంది. శాసనాధికారాలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీపై పరిపాలనాధికారం తదితర అంశాలకు సంబంధించి కేంద్రం, ఢిల్లీ సర్కారు వేసిన పలు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన పిటిషన్ మినహా మిగతా అన్ని పిటిషన్లలో ఆప్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది.ఎల్జీ అనుమతి లేకుండా ఆప్ ప్రభుత్వం సీఎన్జీ ఫిట్‌నెట్ కిట్ల స్కాం, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవకతవలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు చెల్లవని కోర్టు చెప్పింది. ప్రైవేటు డిస్కమ్‌లకు డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పక్కనపెట్టింది. తమ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) సక్రమంగా పనిచేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరపకుండా నోటిఫికేషన్ జారీ చేసిందనే అంశంపైనా ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. సర్వీసుకు సంబంధించి అంశాలు అసెంబ్లీకి వెలుపలివని, దీనిపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ సరైనదేనని పేర్కొంది. ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక సర్వీస్ కేడర్ లేదని పేర్కొంది. కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకు సంబంధించిన ప్రతిదాన్నీ సుప్రీంకోర్టు మాత్రమే విచారించజాలదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఆప్ ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఎల్జీ ఆధ్వర్యంలో నడుస్తుంటే.. రాజ్యాంగానికి సవరణ చేసి అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేశారని . ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వల్ల అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలకు విఘాతం కలుగుతోందన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను ఎల్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తీర్పుపై బీజేపీ స్పందిస్తూ.. రాజ్యాంగపరమైన చట్టాల గురించి ఢిల్లీ సీఎం శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేసింది. తీర్పు కేజ్రీవాల్‌కు చెంపపెట్టు అని, ఆయన రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని లేకుంటే రాజీనామా చేయాలని సూచించింది. -
కేజ్రీవాల్ సర్కారుకు చుక్కెదురు
అధికారాల విషయమైఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవ ర్నర్ నజీబ్ జంగ్ కు మధ్య జరుగుతున్న పోరులో కేజ్రీవాల్ సర్కారుకు గురువారం ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ రాజధాని ప్రాంతానికి అడ్మినిస్ట్రేటి వ్ అధిపతి లెఫ్టినెంట్ గవర్నరే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లెప్టినెంట్ గవర్నర్ తమ మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరించాలని ఆప్ సర్కారు చేస్తున్న వాదనలో పస లేదని పేర్కొంది. 293, 293 ఏఏ అధికరణం ప్రకారం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, భూమి, రవాణా, శాంతిభద్రతల విషయంలో కేంద్రం మాట చెల్లుతుందని న్యాయస్థానం తెలిపింది. లెప్టినెంట్ గ వర్నర్ అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలో అధికారుల నియామకానికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్‌కు సంపూర్ణ అధికారాలను ఇస్తూ కేంద్రం మే21, 2015న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. రెండవ సారి అధికారంలోకి వచ్చాక ఆప్ సర్కారు జారీ చేసిన అనేక నోటిఫికేషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ సర్కారు ఈ నోటీిఫికేషన్లను లెప్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా జారీ చేసినందువల్ల అవి చెల్లవని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 239 అధికరణం, 239ఏఏ అధికరణాలను న్యాయమూర్తులు ఉటంకిస్తూ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమేనని, ఎల్జీ దానికి పాలనాధిపతి అని న్యాయస్థానం పేర్కొంది.అసెంబ్లీ కి ప్రత్యేక హోదా కల్పించినప్పటికీ ఢిల్లీకి కేంద్ర పాలిత ప్రాంతం హోదా కొనసాగుతుందని స్పష్టంచేశారు.చట్టాల రూపకల్పనకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కేబినెట్ సలహా మేరకు వ్యవరించాలన్న ఆప్ సర్కారు వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లెప్టినెంట్ గవర్నర్ ముందస్తు అనుమతి తరువాతనే ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని న్యాయస్థానం పేర్కొంది. -
ఏజ్ బార్ ఆటగాళ్లను ఆడించవద్దు!
న్యూఢిల్లీ: ఏజ్ బార్ అయిన ఆటగాళ్లు అండర్-17, అండర్-19 విభాగాలలో ఉన్నారని దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బీఏఐ)ను వివరణ అడిగింది. వయసు దాటినా అదే విభాగాలలో భారత్ తరఫున ఆడటం సబబేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల కేరళలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో అండర్-17, అండర్-19 బాలురు, బాలికల విభాగాలలో ఓవర్ ఏజ్ ప్లేయర్స్ ఉన్నారన్న ఆరోపణలపై జూలై 19లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. 15 ఏళ్ల వయసున్న తన కుమారుడిని 19 ఏళ్లకు పైగా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు ఓడించటంతో ట్రయల్స్ లోనే ఇంటిబాట పట్టాడని ఇస్సాక్ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొందరు గేమ్స్ ఆడుతున్నారని కోర్టును ఆశ్రయించాడు. పిటీషనర్ ఆరోపణలు నిజమని తేలితే ఆ క్రీడాకారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మరోసారి వాళ్లు తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా చూడాలని క్రీడా మంత్రిత్వశాఖ గతంలో పేర్కొంది. -
సీఎం.. ఆ మాట ఎందుకన్నారు: హైకోర్టు
‘తుల్లా’ అనే పదం ఎందుకు వాడారు, ఆ పదానికి అర్థం ఏంటో వివరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక పోలీసు కానిస్టేబుల్ ఒకరిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనపై పరువునష్టం దావా దాఖలైంది. ఆ దావా నేపథ్యంలో కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు జారీచేసిన సమన్లపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, తుల్లా పదానికి అర్థం ఏంటో తదుపరి విచారణ రోజున వివరించాలని ఆదేశించింది. అజయ్ కుమార్ తనేజా అనే కానిస్టేబుల్ తనను కేజ్రీవాల్ తిట్టారని, నగర పోలీసులను వివరించడానికి ఆయన ‘తుల్లా’ అనే పదం ఉపయోగించారని అరోపిస్తూ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఒక వార్తా చానల్‌తో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆ పదం ఉపయోగించారని, అది చాలా తూలనాడే పదం అని చెప్పారు. ఢిల్లీ పోలీసుల గురించి చెప్పేందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి మాటలు ఉపయోగిస్తే ఇక సామాన్య ప్రజలకు పోలీసు సిబ్బంది అంటే ఏం గౌరవం ఉంటుందని తనేజా అన్నారు. -
హెరాల్డ్ కేసులో సోనియాకు ఊరట
-
హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట
ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదన మాత్రమే విని ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ హైకోర్టులో అప్పీలు చేయగా.. దీనిపై విచారించిన జస్టిస్ పీఎస్ తేజీ.. ట్రయల్ కోర్టు ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నా యన్నారు. హెరాల్డ్ ఆస్తుల విక్రయంలో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన 2010-11 నాటి ఆర్థిక వివరాలకు సంబంధించి పత్రాలను అందజేయాలని, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలు, కార్పొరేట్ వ్యవహారాలు, ఆదాయపన్ను విభాగాలను, కాంగ్రెస్‌ను జనవరి 11, మార్చి 11న ట్రయల్ కోర్టు ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో దరఖాస్తును పూర్తిగా పరిశీలించకుండా, ప్రతివాదుల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం చట్టరీత్యా చెల్లుబాటు కాదంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నట్టు స్పష్టం చేసింది. -
నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!
- నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి! - ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సమ్మె నిలుపుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు చెప్పారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ ఈ నెల 12 (నేడు), 13న (రేపు) సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. డిమాండ్లపై జరిపిన చర్చల్లో యాజమాన్యాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మె జరపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈలోగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడటంతో వాయిదా వేశాయి. -
అది రేప్ కాదు.. లీవ్ ఇన్ రిలేషన్షిప్
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో 10 ఏళ్లు జైలు శిక్షపడ్డ ఓ నిందితుడికి విముక్తి లభించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలు చేసిన బాధితురాలు నిందితుడితో లీవ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నట్టు తేలిందని, ఇది అత్యాచార ఘటన కాదని కోర్టు తీర్పు చెప్పింది. 2011 జనవరిలో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు వచ్చి తనపై అత్యాచారం చేశాడని సంబంధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల తర్వాత ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భర్తకు దూరంగా ఉంటున్న బాధిత మహిళను తాను అత్యాచారం చేయలేదని, ఆమె తనతో లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని కోర్టుకు విన్నవించాడు. నిందితుడి నుంచి ఆమె 11 వేల రూపాయలు అప్పుగా తీసుకుందని, తిరిగి ఇవ్వమని అడిగినందుకు తప్పుడు కేసు పెట్టిందని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. -
రెజ్లర్ సుశీల్ ఆశలు ఆవిరి
► ట్రయల్స్‌పై పిటిషన్ కొట్టివేత ► నర్సింగ్కు తొలగిన అడ్డంకి న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నర్సింగ్ యాదవ్‌తో తనకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు లభించినట్టయ్యింది. కోర్టు నిర్ణయంతో సుశీల్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి కాగా అటు నర్సింగ్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే నర్సింగ్ యాదవ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయని, అంతిమంగా దేశం నష్టపోతుందని కోర్టు అభిప్రాయపడింది. 66కేజీ విభాగంలో సుశీల్ అంతర్జాతీయంగా అనేక పతకాలు సాధించాడని, అయితే 74కేజీ విభాగంలో అతడిని ఒలింపిక్స్‌కు పంపలేమని జడ్జి మన్మోహన్ అన్నారు. ‘ట్రయల్స్ నిర్వహించి గెలిచిన వారిని రియోకు పంపాలని సుశీల్ కోరడం న్యాయ విరుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలంటే కండ బలం సరిపోదు. బుద్ధి బలం కూడా కీలకమే. చివరి నిమిషంలో జరిగిన ఎంపిక ఆటగాడి మానసిక సన్నాహకాలను చెడగొడుతుంది. క్వాలిఫికేషన్ ఈవెంట్ ముగిశాక ఇప్పుడు ట్రయల్స్ కోరడం సబబు కాదు. నర్సింగ్ యాదవ్ బెర్త్ సాధించాక అప్పటి నుంచి సన్నాహకాల్లో ఉన్నాడు. అందుకే దేశం తరఫున అతడే ఉత్తమ పోటీదారుడు. జాతి ప్రయోజనార్ధం సుశీల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని జడ్జి స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు తేల్చింది. డబ్ల్యుఎఫ్ఐ ఉపాధ్యక్షుడికి నోటీసు: తప్పుడు అఫిడవిట్ సమర్పించిన డబ్ల్యుఎఫ్ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజ్ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. అసత్య కథనాలపై ఎందుకు చర్య తీసుకోరాదో ఈనెల 29లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌కు 48కేజీ గ్రీకో రోమన్ విభాగంలో రెజ్లర్‌ను పంపేందుకు ట్రయల్స్ నిర్వహించామని, ఆ సమయంలో తానే ప్రధాన కోచ్‌గా ఉన్నానని రాజ్ సింగ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ట్రయల్స్ నిర్వహించలేదని, రాజ్ సింగ్ కూడా కోచ్‌గా లేరని సమాఖ్య కోర్టుకు తెలిపింది. డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’: ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన రెజ్లర్ సుశీల్ ఆఖరి ప్రయత్నంగా అదే కోర్టులో డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేసుకోనున్నాడు. అయితే అంతకన్నా ముందు మరోసారి రెజ్లింగ్ సమాఖ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ‘ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా చివరిసారిగా డబ్ల్యుఎఫ్‌ఐని అడగనున్నాం. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చకపోతే డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’ అని తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
సమాఖ్య రాజకీయాల్లో పావులు కావద్దు
► సుశీల్, నర్సింగ్లకు కోర్టు సూచన ► రేపటికి విచారణ వాయిదా న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో ఎవరు పాల్గొనాలనే కారణంతో భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ రచ్చకెక్కడం విచారించదగ్గ విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వీరిద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) రాజకీయంలో పావులు కాకూడదని హితవు పలికింది. దేశానికి గౌరవ ప్రతిష్టలు అందించిన ఈ రెజ్లర్లకు అసలు తామేం చేస్తున్నామో అర్థమవుతోందా? అని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. ‘ఈ పరిస్థితికి సమాఖ్యలో నెలకొన్న రాజకీయాలే కారణం. అందుకే వీరిద్దరు అధికారుల చేతిలో పావులు కారాదు. సుశీల్, నర్సింగ్ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు. వీరి విషయంలోనే ఇలా జరగడం షాకింగ్‌గా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన విచారణలో... దేశానికి ఒలింపిక్ బెర్త్ అందించిన అథ్లెటే పోటీలకు వెళతాడని, గతంలో కూడా ఇలాగే జరిగిందని నర్సింగ్ కౌన్సిల్ వాదించారు. అయితే 74 కేజీ విభాగంలో సెలక్షన్ ట్రయల్స్‌ను గతేడాది ఎందుకు నిర్వహించారని, ప్రపంచ చాంపియన్‌షిప్ సెప్టెంబర్‌లో జరిగిందని, ఆ నెలలోపు జరపాల్సిందని సుశీల్ కూమార్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. -
సుశీల్, నర్సింగ్ వివాదాన్ని పరిష్కరించండి
డబ్ల్యుఎఫ్ఐకు ఢిల్లీ హైకోర్టు సూచన న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 74కేజీల విభాగంలో ఎవరిని గేమ్స్‌కు పంపాలనే సమస్యకు పరిష్కారం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ), సుశీల్ కలిసి తీసుకోవాలని సూచించింది. రియో ఒలింపిక్స్ సన్నాహక శిబిరంలో తన పేరు లేకపోవడం.. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌కు సమాఖ్య సుముఖంగా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా సుశీల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ, డబ్ల్యుఎఫ్ఐ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ‘సుశీల్ గతంలో దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. అలా అని నర్సింగ్ యాదవ్‌ను తక్కువగా చేయలేం. అతడి కృషి వల్లే దేశానికి ఒలింపిక్ బెర్త్ దక్కింది. వ్యక్తిగతంగా ఒకరికి ఇబ్బంది ఎదురైనా.. దేశాన్ని మాత్రం అత్యున్నత స్థాయిలో నిలపాలి. చివరి ప్రయత్నంగా అయితేనే మేం జోక్యం చేసుకుంటాం. ముందుగా డబ్ల్యుఎఫ్‌ఐను నిర్ణయం తీసుకోనిద్దాం’ అని జస్టిస్ మన్మోహన్ అన్నారు. మరోవైపు సుశీల్ కుమార్, డబ్ల్యుఎఫ్ఐ మధ్య నేడు సమావేశం జరగనుంది. -
సుశీల్ కుమార్ తప్పు చేస్తున్నాడు..!
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌లో ‘రియో ఒలింపిక్’ బెర్త్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చివరి ప్రయత్నంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మరోవైపు.. 74 కేజీల విభాగంలో తానే బెస్ట్ అని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అంటున్నాడు. సుశీల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నర్సింగ్ మీడియాతో మాట్లాడాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయాన్ని గౌరవించాలని సుశీల్ కు సూచించాడు. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ ఇద్దరికి ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడాన్ని రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తప్పుబట్టాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. అందుకు తాను కట్టుబడి ఉంటానని నర్సింగ్ యాదవ్ స్పష్టచేశాడు. అసలు ఈ విషయంలో సుశీల్ కుమార్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం, రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధులకు అభ్యర్థించగా, ఎవ్వరి నుంచి కూడా సానుకూల స్పందన రాలేదన్న విషయం తెలిసిందే. దీంతో సుశీల్ చివరగా న్యాయస్థానంలోనే న్యాయం జరగుతుందని ట్రయల్స్ కోసం కోర్టుకు వెళ్లగా, అతడి నిర్ణయాన్ని నర్సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. -
కన్హయ్య కుమార్ కు ఊరట
న్యూఢిల్లీ: జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కన్హయ్యతో పాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఇతరులపై జేఎన్ యూ విధించిన క్రమశిక్షణ చర్యలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ మన్ మోహన్ గవే షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తమపై నమ్మకముంటే జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించింది. ఎటువంటి సమ్మెలు, ధర్నాలకు దిగొద్దని కోరింది. క్రమశిక్షణ ఉల్లఘించారనే ఆరోపణలతో కన్హయ్యకు రూ.10 వేలు, ఖలీద్, భట్టాచార్యలకు రూ. 20 వేలు చొప్పున జేఎన్ యూ అధికారులు జరిమానా విధించారు. దీంతో వీరంతా ఆందోళనకు దిగారు. -
రోహిత్ కుటుంబానికి కేజ్రీవాల్ హామీపై చిక్కులు!
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల సోదరుడికి ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు ఉద్యోగం ఇస్తామంటూ కేజ్రీవాల్ ఇచ్చిన ఈ హామీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పరిహారం రూపంలో రోహిత్ సోదరుడికి గ్రూప్ సీ ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, ప్రభుత్వ వసతి కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మార్చి 3న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయంలో కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం 'అక్రమం, అరాచకం, రాజకీయ దురుద్దేశపూరితమైన'దంటూ న్యాయవాది అవధ్ కౌషిక్ పిల్ దాఖలు చేశారు. హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబం విజ్ఞప్తి మేరకు రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఢిల్లి కేబినెట్ నిర్ణయించినట్టు నోటిఫికేషన్లో తెలిపారు. కానీ, నిజానికి రోహిత్ కుటుంబం ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞాపన సమర్పించకుండానే.. ఆయన సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది చట్టాలను ఉల్లంఘించి, ప్రభుత్వ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పిల్లో న్యాయవాది ఆరోపించారు. ఢిల్లీ కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేయాలని, ఇప్పటికే రోహిత్ సోదరుడికి ఉద్యోగంలోకి తీసుకుంటే ఆ నియామకాన్ని రద్దుచేయాలని హైకోర్టును కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారం కారుణ్య నియామకాలు చేయాలంటే అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
భర్తని 'గున్న ఏనుగు' అని తిట్టినందుకు..
న్యూఢిల్లీ: లావుగా ఉన్న భర్తని భార్య గున్న ఏనుగు అని తిట్టడం కూడా తప్పే. ఈ కారణంతో కూడా భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చు. ఇలా తిట్టడం వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తుందని, కాబట్టి ఈ కారణంతో విడాకులు తీసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. లావుగా ఉండటం, భార్య లైంగిక వాంఛలను సంతృప్తిపరచకపోవడం వల్ల ఆమె తనను క్రూరంగా హింసిస్తోందంటూ ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతనికి 2012లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విడాకులు ఇవ్వడం సబబేనని ఉన్నత న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టును సమర్థించింది. 'ఏనుగు, గున్న ఏనుగు, మోటా ఎలిఫెంట్ అన్న తిట్లు, దూషణలతో వాది తన భర్త ఆత్మగౌరవాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది' అని ఈ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘీ వ్యాఖ్యానించారు. స్పష్టత, నిర్దిష్టత లేని ఆరోపణలను ఆధారంగా చేసుకొని దిగువ కోర్టు విడాకుల ఉత్తర్వులు మంజూరు చేసిందని, తన భర్త పట్ల ఎప్పుడూ తాను క్రూరంగా ప్రవర్తించినో తేదీలు కానీ, ప్రత్యేకమైన సందర్భాలుకానీ ఆయన కోర్టుకు వివరించలేదని, కాబట్టి ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆమె హైకోర్టును కోరింది. అయితే ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. వైవాహిక బంధంలో ఉన్న రెండు పార్టీలు ఏ రోజు ఏ నేరం జరిగింది. ఏ తప్పిదం జరిగింది అంటూ చిట్టాపద్దును ప్రత్యేకంగా రాయరని హైకోర్టు పేర్కొంది. -
ఓలా క్యాబ్స్ పై ఉబర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తమ వ్యాపార కార్యకలాపాల్లో ఓలా క్యాబ్స్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ యాప్ బేస్డ్ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఓలా ఉద్యోగులు, ఏజెంట్లు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని ఉబర్ ఆరోపించింది. తమ యాప్ పై నకిలీ బుకింగ్ లకు పాల్పడుతోందని న్యాయస్థానానికి తెలిపింది. ఉబర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓలా క్యాబ్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అద్దె ట్యాక్సీల రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఉబర్, ఓలా మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. పోటీలో నిలబడేందుకు క్యాబ్ కంపెనీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కృత్రిమంగా చార్జీలు తగ్గించేస్తున్నాయి. ఇటీవలే బెంగళూరులో ఓలా క్యాబ్స్ పై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్స్ ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లఘించినట్టు రుజువైతే ఓలా క్యాబ్స్ పై సీసీఐ చర్యలు తీసుకోనుంది. -
జేఎన్‌యూ విద్యార్థులకు బెయిల్
రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పై బయటికి వచ్చిన రెండు వారాలకు వీరిద్దరికి బెయిల్ మంజూరైంది. మరో వైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయలేదు. -
ఎఫ్ డీసీ ఔషధాల నిషేధంపై ఫార్మా సంస్థలకు ఊరట
మార్చి 21 దాకా స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: కొన్ని ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల నిషేధం అంశంలో ఫార్మా సంస్థలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నిషేధాజ్ఞలపై న్యాయస్థానం మార్చి 21 దాకా స్టే ఇచ్చింది. దీంతో పీఅండ్‌జీకి చెందిన విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా, రెకిట్ బెన్కిసర్ ఉత్పత్తి డీకోల్డ్, పిరమాల్‌కి చెందిన సారిడాన్ తదితర ఉత్పత్తులపై 21 దాకా నిషేధం వర్తించదు. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న కారణంతో నిర్దిష్ట కాంబినేషన్లోని 300 పైగా ఔషధాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా ట్యాబ్లెట్లు మొదలుకుని ఆస్కోరిల్ దగ్గు మందులు, క్యాండిడ్ ఇయర్ డ్రాప్స్ మొదలైనవి ఉన్నాయి. దీంతో నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ ఫైజర్, అబాట్ హెల్త్‌కేర్, మెక్లియోడ్స్ ఫార్మా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లెన్‌మార్క్, రెకిట్ బెన్కిసర్ మొదలైన సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. -
విజయ్ మాల్యాకు హైకోర్టులో చుక్కెదురు!
న్యూ ఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారుగా తనను ఎస్బీఐ పేర్కొనడాన్ని సవాలు చేస్తూ యూబీ గ్రూప్ ప్రమోటర్ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మాల్యా అభ్యర్థనను పరిశీలించి ఆయనకు స్వాంతన చేకూర్చే అంశం తన అధికార పరిధిలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విజయ్ మాల్యాకు గతంలో బాంబే హైకోర్టు నుండి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడి, లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి, అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ను ఇటీవల ఎస్బీఐ కోరింది. డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని ఎస్బీఐ డీఆర్టీని కోరింది. -
ఆ ముగ్గురికి పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: జేఎన్‌యూ ఘటనలో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యతోపాటు రిమాండ్‌లో ఉన్న మరో ఇద్దరు విద్యార్థుల వివరాలపై గోప్యత పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పటిష్టమైన భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను కన్హయ్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది. దీంతో పాటు ఉమర్ , అనిర్బన్ భట్టాచార్యలు పటియాలా కోర్టుకు విచారణకు వస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరటంతో కోర్టు వద్ద భద్రతపై స్పష్టంగా ఉండాలని ఆదేశించింది. కన్హయ్య బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. కాగా ఉమర్, అనిర్బన్‌లను మూడురోజుల పోలీసు రిమాండ్‌ను తరలిస్తూ సిటీ కోర్టు ఆదేశించింది. కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్యే! అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కన్హయ్యే నిర్వహించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతనితోపాటు అరెస్టుచేసిన ఇద్దరు, మరికొందరు విదేశీయులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నారు. కొత్త వీడియోలో బయటి వ్యక్తులు ఫిబ్రవరి 9న దేశ వ్యతిరేక నినాదాలు చేసింది బయటి వ్యక్తులేననే ఆధారాలతో కొత్త వీడియో తెరపైకి వచ్చింది. విదేశీ శక్తులు వీడియోలు ఉన్నాయంటూ పోలీసులు కోర్టుకు చూపించిన ఈ వీడియోతో కేసు కొత్త మలుపు తిరగనుంది. కాగా, లొంగిపోయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఢిల్లీ పోలీసులు బుధవారం ఐదుగంటలపాటు ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోంది.. రాహుల్: జేఎన్‌యూ వివాదం విషయంపై పార్లమెంటులో తను లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక భయపడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలాఉండగా, జేఎన్‌యూలో విద్యార్థుల మెదళ్లను అక్కడి ప్రొఫెసర్లే కలుషితం చేస్తున్నారని మాజీ ఇన్ఫోసిస్ డెరైక్టర్ మోహన్దాప్ అన్నారు. కన్హయ్య, జర్నలిస్టులపై దాడికి యత్నించిన అడ్వకేట్ విక్రమ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రొఫెసర్లు జేఎన్‌యూలో కాగడా ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ ఉద్రిక్తం న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి తీసుకోకపోవటంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘అమ్మతోపాటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులను ఈడ్చేశారు’ అని రాజా తెలిపారు. వీరిని అరెస్టు చేసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గంటసేపటి తర్వాత వదిలిపెట్టారు. ఢిల్లీకి రోహిత్ కుటుంబం మకాం ఢిల్లీలోనే నివాసముండాలని రోహిత్ తల్లి రాధిక తెలిపారు. రాజాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఢిల్లీ సర్కారు అంగీకరించటంతో.. త్వరలోనే ఢిల్లీకి మారతామన్నారు. రోహిత్ ఫెల్లోషిప్ ఆగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలపడంతో అప్లైడ్ జియాలజీలో పీజీ పూర్తిచేసిన రాజాకు ఉద్యోగం ఇస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారన్నారు. -
లొంగుబాటు మీ ఇష్టారాజ్యం కాదు: హైకోర్టు
లొంగుబాటు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదని జేఎన్‌యూ విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వాళ్లు కావాలనుకున్న పద్ధతిలో లొంగిపోయేందుకు అనుమతించేది లేదని తెలిపింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాల్సిందేనని జస్టిస్ ప్రతిభా రాణి తెలిఆపరు. తాము సురక్షితంగా బయటకు వెళ్లేందుకు అనుమతించాలని, తాము అనుకున్న ప్రదేశంలో మాత్రమే లొంగిపోతామని జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పెట్టుకున్న పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తమను నేరుగా హైకోర్టే జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి తప్ప.. పాటియాలా హౌస్ కోర్టు కాదని అడగడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. రిమాండు ప్రొసీడింగ్స్ అన్నీ విచారణ కోర్టు మాత్రమే జరపాలని, ఈ విషయంలో నిందితుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా చేయడానికి వీలుండదని తెలిపారు. నిందితులు అరెస్టయిన 24 గంటలలోగా విచారణ కోర్టులో వారిని ప్రవేశపెట్టాలని, అక్కడే వాళ్ల రిమాండు విషయం నిర్ణయం అవుతుందని చెప్పారు. తమ క్లయింట్లకు 'సేఫ్ పాసేజ్' ఇవ్వాలని విద్యార్థుల తరఫున వాదిస్తున్న న్యాయవాది కామిని జైస్వాల్ అడిగినప్పుడు 'మీరు ఏమనుకుంటున్నారు, నేను మీకు సేఫ్ పాసేజి ఇవ్వాలా? ఈ కోర్టు ఎందుకు? పద్ధతి ప్రకారమే వెళ్దాం' అని న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. -
కన్హయ్య ఆ గ్రూపులో ఉన్నాడు
న్యూఢిల్లీ: జేఎన్ యూ వివాదంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి దర్యాప్తు బృందం మధ్యంతర నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 9న జేఎన్ యూ క్యాంపస్ లో తీవ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను నివేదికలో పొందుపరిచింది. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన గ్రూపులో కన్హయ్య కుమార్ ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్యాంపస్ లో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాల్లోనూ అతడి పాత్ర ఉందని వెల్లడించినట్టు చెప్పారు. కన్హయ్య సహా 8 మంది విద్యార్థులు జాతివ్యతిరేక నినాదాలు చేసినట్టు వర్సిటీ అంతర్గత విచారణలోనూ తేలిందని గుర్తు చేశారు. అయితే తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు కన్హయ్య కుమార్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే. కాగా, కన్హయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి(బుధవారం)కు వాయిదా వేసింది. జేఎన్ యూ వివాదంపై సీలు వేయని కవర్ లో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినా కోర్టు అంగీకరించలేదని పోలీసులు వెల్లడించారు. -
కన్హయ్య పిటిషన్ పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు తమకు భద్రత కల్పించాలని ఉమర్ ఖలీద్, మరికొందరు జేఎన్ యూ విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, ఇతర విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణకు కూడా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టానికి అడ్డుతగులుతున్న జేఎన్ యూ వీసీ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో కోరారు. -
ఢిల్లీలోనే ప్రపంచకప్ టి20 మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరగాల్సిన మ్యాచ్‌లపై ఉత్కంఠ వీడింది. జస్టిస్ (రిటైర్డ్) ముకుల్ ముద్గల్ పర్యవేక్షణలో ఇవి జరుగుతాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్‌ల ఏర్పాటుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తుందని, అయితే కార్పొరేషన్ అధికారుల నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘం అన్ని క్లియరెన్స్‌లను పొందాలని సూచించింది. ముద్గల్ లేకుంటే ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదరక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని జస్టిస్ మురళీధర్, విభు బక్రూలతో కూడిన బెంచ్ తేల్చింది.