Medical Health and Family Welfare Department
-
ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం: మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర’’ అని మంత్రి రజిని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశాం’’ అనిమంత్రి విడదల రజిని తెలిపారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
ఆ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శం కావాలి
సాక్షి, తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిగ్రామంలో క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సీఎం జగన్ స్పందిస్తూ.. అనుకున్నట్లు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ► అలాగే.. మార్చి 1వ తేదీ నుంచి కూడా.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించాలన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ లేదంటే జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడది. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి అని ఆకాక్షించారు సీఎం వైఎస్ జగన్. ► వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు బదులిచ్చారు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న ఆయన.. స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ - ఎస్ఓపీ విలేజ్ క్లినిక్స్ ఎస్ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు చేర్చామని అధికారులు తెలిపారు. దానికి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ ఈ అంశాలపై కూడా సమీక్షించాలని, కలెక్టర్లు కూడా నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలని సీఎం జగన్.. అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎక్కడా రాజీ పడొద్దు గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) నివారణ, చికిత్సలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం. అక్కడి సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. అలాగే పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. దానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలి. ఎక్కడా రాజీ పడొద్దు అని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. దానికి స్పందించిన అధికారులు.. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా పూర్తవుతాయని వివరించారు. అలాగే.. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు. ప్రతీ బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలి. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలి. అన్ని చోట్లా క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారని సీఎం వైఎస్ జగన్.. అధికారులతో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలుగు వారి హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు: సీఎం జగన్ -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పోలవరం పనులు భేష్ జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు ►పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు ►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు ►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం ►సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు ►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు ►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం 16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం ►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు ►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు ►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు: ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059 ♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు. ♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి. ♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు. ♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు ♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం. ♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం. వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష ♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం ♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం ♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు ♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు ♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు. ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం ♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు ♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦మొత్తం పాజిటివ్ కేసులు 3366 ♦పాజిటివిటీ రేటు 0.7 శాతం ♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 ♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ♦15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు వ్యాక్సినేషన్ ♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458 ♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 ♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 ♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌పైనా సీఎం సమీక్ష కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని.. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని సీఎం జగన్ తెలిపారు. స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టి.. దాని రిఫరెల్ మీద ప్రచారం ఉండాలని.. ఆరోగ్య మిత్రల ఫోన్‌నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలలని సీఎం ఆదేశించారు. ఎమ్‌పానెల్ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని అలానే 108 వెహికల్స్ సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. ఏపీ డిజిటల్ హెల్త్‌పై సీఎం సమీక్ష హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్ తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగావైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్ 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్‌చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు... ►రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 9,141 ►రికవరీ రేటు 98.86 శాతం ►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 2201 ►కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 313 ►హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 6627 ►జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997 ►పాజిటివిటీ రేటు 1.62 శాతం ►0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12 ►3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా 1 ►ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బెడ్స్ శాతం 92.27 శాతం ►ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 69.70 శాతం ►104 కాల్‌సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 649 థర్డ్ వేవ్ సన్నద్ధత ►మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 20,964 ►ఇంకా రావాల్సినవి 2,493 ►అందుబాటులో ఉన్న డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లు 27,311 ►రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు 140 ►అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిగా అందుబాటులో రానున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ►సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,38,32,742 ►రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,44,94,731 ►మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 2,83,27,473 ►వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,28,22,204 వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: AP: రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ‘రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట’ -
ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష
-
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్‌హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. రిసెప్షన్ సేవలు కూడా కీలకమని అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందినట్లేనని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు సంబంధించి వివరాలు అందించిన అధికారులు ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ► నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు ► వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు ► జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశం ► అలాగే విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీలను ఖరారుచేయాలన్న సీఎం ► పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలన్న సీఎం ► కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ► ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 14,652 ► పాజిటివిటీ రేటు 2.23 శాతం ► రికవరీ రేటు 98.60 శాతం ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 91.66 శాతం ► ప్రైవైటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 71.04 శాతం ► 104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 753 ► ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫీవర్ సర్వేలు పూర్తయ్యాయి ► రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువ నమోదైన జిల్లాలు 9 ► పాటిజివిటీ రేటు 3శాతం కంటే ఎక్కువున్న జిల్లాలు 4 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలిండర్లు 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు 20,964 ► ఇంకా రావాల్సినవి 2493 ► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు ► 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్న పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► ఇప్పటివరకు సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,08,54,556 ► మొత్తం వ్యాక్సినేషన్ (సింగిల్, డబుల్ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318 ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జే వి యన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: బహ్రెయిన్‌లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి -
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే టీకాలు..!
సాక్షి, హైదరాబాద్: కళాశాలలు తెరిచిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కరోనా టీకాలు వేయడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశంలో థర్డ్‌వేవ్‌పై నిపుణుల హెచ్చరికలు కొనసాగుతు న్నాయి. మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు టీకాలు అందు బాటులోకి తేనున్నారు. అలాగే అన్ని యూని వర్సిటీల్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేయను న్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. కాగా ఇప్పటివరకు టీకాలు తీసుకోనివారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అన్ని వసతిగృహాల్లోనూ వ్యాక్సినేషన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టళ్లలోనూ టీకాలు వేయాలని నిర్ణయించారు. 20–30 మంది ఉన్న వసతిగృహాలు, ప్రైవేట్ హాస్టళ్లలోనూ టీకాలు వేస్తారు. ఏదైనా ప్రైవేట్ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉన్నా, సమాచారం ఇస్తే అక్కడకు కూడా మొబైల్ వాహనంలో వెళ్లి వ్యాక్సినేషన్ చేపడతారు. ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. వీలైతే ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చునేలా చూడాలి. హాస్టళ్లలో విద్యార్థులు గుమికూడకుండా, ఒకే రూములో ఎక్కువమంది ఉండకుండా చూడాలి. భోజనాలకు వేర్వేరు సమయాలు పెట్టాలి. తద్వారా విద్యార్థులు గుంపులుగా ఏర్పడకుండా చూడాలి. ప్రతిరోజూ అన్ని హాస్టళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమాత్రం కన్పించినా తక్షణమే ఆయా హాస్టళ్లలోని ఐసోలేషన్ గదుల్లో ఉంచాలి. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. -
కొత్త కరోనా: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: యూకే స్ట్రెయిన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చూడాలని, కంటైన్మెంట్ వ్యూహాలను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘‘సంక్రాంతి దృష్ట్యా భారీ జనసమూహాలు లేకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న 1,519 నమూనా సేకరణ కేంద్రాలను వికేంద్రీకరించాలి. కరోనా టోల్ ఫ్రీ నంబర్ 104ను కొనసాగించాలి. కంటైన్మెంట్ జోన్లను నోటిఫై చేయడంతో పాటు ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని’’ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. (చదవండి: కరోనా వ్యాక్సిన్.. అతి పెద్ద సవాల్) కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కోవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందించాలని, రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందేలా చూడాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) -
రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ఇందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు. జనరేటర్లు, ఏసీలు పని చేయడం లేదని, శానిటేషన్ సరిగా లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలకు రూ.17,300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు జనవరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు –నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలని చెప్పారు. ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు ప్రతిదీ సక్రమంగా పని చేసేలా దృష్టి పెట్టాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదని హెచ్చరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉండాలి ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి, వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు నవంబర్ లోగా టెండర్లు పిలవాలి. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు డిసెంబర్లో.. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు పిలవాలి. వీటి కోసం రూ.7,500 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడున్న మెడికల్ కాలేజీల్లో నాడు –నేడు పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీటికి అవసరమైన పరిపాలనా పరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ రిఫరల్ విధానం బాగుండాలి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ వచ్చేంత వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్ అసిస్టెంట్/ఏఎన్ఎంల ద్వారా రిఫరల్ చేయించాలి. ఎంపానల్ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి. వైద్యం కావాలనుకున్న వారికి మార్గ నిర్దేశం చేయాలి. ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు ఇప్పటికే 7 జిల్లాల్లో చికిత్స అమలవుతోంది. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స అందుబాటులోకి వస్తుంది. అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి
-
అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు) కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘చిన్న చిన్న టైపింగ్ పొరపాట్లను పని గట్టుకుని ఎత్తి చూపి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారం పై ఎవ్వరికీ సందేహాలున్న సంప్రదించొచ్చు. పూర్తి పారదర్శకంగా కరోనా వైద్య పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రాల్లో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు రోజుకి 2300 పరీక్షల సామర్థ్యం గల వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు 21450 మందికి కరోనా పరీక్షలు జరిపాం. రోజుకి 17, 500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం వైరల్ ల్యాబ్‌లతో పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకున్నాం. లక్ష ర్యాపిడ్ కిట్లు, 50 వేల టెస్టింగ్ కిట్ల కు కొనుగోలు ఉత్తర్వులు ఇచ్చామని’’ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. -
ఆ పనులు చరిత్రాత్మకం కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. నాడు – నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (పురోహితులను ఆదుకోండి) -
‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి.. అక్కడ నుండి వస్తున్న వారి ద్వారా ఇక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున జిల్లాల వైద్యాధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై 13 జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో విధివిధానాలు జారీచేశామని, జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డీఎంహెచ్వోలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనే విషయమై ఆరా తీశారు. కాగా, చైనా నుండి తిరిగివచ్చిన 28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వారు వెంటనే మాస్క్ ధరించి సమీప ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని జవహర్‌రెడ్డి సూచించారు. ఇతర సమాచారం కోసం 1100, 1102 టోల్‌ఫ్రీ నంబర్లకు గానీ లేదా 7013387382 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ఓడరేవుల అధికారులను సంప్రదించి విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చిన వారి వివరాలు సేకరించాలని కూడా ఆదేశించారు. -
‘అమ్మ’కు హైబీపీ శాపం
సాక్షి, హైదరాబాద్: ప్రసవ సమయంలో బీపీ పెరగటం కారణంగానే మాతృత్వపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన మాతృత్వపు మరణాలను ఆ శాఖ విశ్లేషించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో 313 మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక వివరించింది. అందులో బోధనాసుపత్రుల్లో 120 మంది, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 28 మంది, ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోని ఆసుపత్రిలో ఒకరు, ఇంటి వద్ద జరిగిన ప్రసవాల్లో 31 మంది, ప్రయాణ సమయాల్లో 39, ఇతరత్రా కారణాలతో 12 మంది మరణించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 82 మంది మృతిచెందారు. పెద్దాసుపత్రుల్లో పరిశీలిస్తే అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 49 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 21 మంది, వరంగల్ ఎంజీఎంలో 12 మంది చనిపోయారు. మరణాల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 58 మంది చనిపోగా, ప్రసవ సమయంలో 63 మంది చనిపోయారు. ప్రసవమయ్యాక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 124 మంది చనిపోవడం గమనార్హం. ఇక 7 నుంచి 42 రోజుల వ్యవధిలో 68 మంది చనిపోయారు. బీపీ, రక్తస్రావం, షుగర్లతో.. మాతృత్వపు మరణాలకు గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ప్రసవ సమయంలో బీపీ పెరగడం, దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికంగా 81 మంది చనిపోవడం గమనార్హం. ఆ తర్వాత రక్తస్రావంతో 55 మంది చనిపోయారు. మధుమేహం తదితర కారణాలతో 45 మంది చనిపోయారు. ఇన్ఫెక్షన్లతో 44 మంది చనిపోయారు. గుండె సంబంధిత జబ్బుల కారణంగా 40 మంది మృతిచెందారు. తెలియని కారణాలతో 27 మంది, రక్తహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులపైన ప్రభావం చూపడం, సిజేరియన్ వికటించడం వంటి తదితర కారణాలతో మిగతా వారు మృతి చెందారు. హైదరాబాద్‌లో అత్యధిక మరణాలు... ఈ ఏడు నెలల కాలంలో జరిగిన మరణాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే సంభవించాయి. నగరంలోనే 32 మంది చనిపోయారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 18 మంది, రంగారెడ్డి జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 16 మంది చొప్పున మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ఈ మాతృత్వపు మరణాల్లో బోధనాసుపత్రుల పరిధిలోనే 38 శాతం సంభవించాయి. ఇక ఇటీవల కేంద్రం విడుదల చేసిన 2015–17 ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షకు 76 మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సంఖ్య 2001–03లో ఏకంగా 195 ఉండటం గమనార్హం. -
కొండ కోనల్లోనూ ఆరోగ్య భాగ్యం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్ (బైక్) అంబులెన్స్‌లు మరిన్ని రానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈమేరకు ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటి వరకు 15 ఉన్న బైక్ అంబులెన్స్‌లు రెట్టింపు కానున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో 108 అంబులెన్స్‌లు 6 ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్ అంబులెన్స్‌లు 15 ఉన్నాయి. ఎం.సింగుపురం, ఎంఎస్‌పల్లి, ఎస్జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్ అంబులెన్స్‌లు నడుస్తున్నాయి. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు. అలాగే మరో రెండు 108 వాహనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి వస్తే మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదీ పరిస్థితి... ప్రస్తుతం ఉన్న బైక్ అంబులెన్స్‌లు గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించాయి. ఎపిడమిక్ సీజన్లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్‌సీలకు తరలించడానికి ఫీడర్ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. గర్భిణులకు ఫీడర్ అంబులెన్స్‌లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే 15 నిర్వహిస్తున్నాం. మరో 15 కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొత్తవి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం. బైక్ అంబులెన్స్‌లు సకాలం లో సంబంధిత పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోగులను చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి. –ఈఎన్‌వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో మాలాంటి మారుమూల గిరిజనులకు ఉపయోగం మాలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గర్భిణులకు పురిటి నొప్పులు వంటివి వచ్చినపుడు ఏదో ఒక అంబులెన్స్ రావాలని ఫోన్లు చేస్తుంటాం. వాటి రాక కోసం ఎదురు చూస్తుంటాం. వాటికి ముందే బైక్ అంబులెన్స్‌లు వస్తే సకాలంలో వైద్యం అందుతుంది. –ఎస్.రజిని, కోసిమానుగూడ -
కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ థియేటర్‌ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆస్పత్రి సీజ్..? ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్‌కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
నా చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలి
సాక్షి, అమరావతి: ఉద్యోగులు సమస్యలపై కోర్టుకెళ్లడం చూశాం.. భూ తగాదాల విషయంలో కోర్టును ఆశ్రయించిన వారినీ చూశాం.. కానీ ఓ అరుదైన వ్యాధి బాధితుడు తనకు ప్రభుత్వం వైద్య చికిత్స అందించేలా ఆదేశించాలంటూ ఇటీవల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడికి అందించే వైద్యం అత్యంత ఖరీదైనది కావడం, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే సదుపాయాలు లేకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. విజయనగరం జిల్లా నల్లబిల్లికి చెందిన ఓ అరుదైన వ్యాధిగ్రస్థుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులను బాధ్యులుగా పేర్కొంటూ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అరుదైన వ్యాధితో అవస్థలు కోర్టును ఆశ్రయించిన బాధితుడు కొన్నేళ్లుగా ‘గాచర్స్’ (ఎంజైమ్ లోపంతో పుట్టడం)తో బాధపడుతున్నాడు. ఇలాంటి వ్యాధిగ్రస్థులు 50 లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. కాలేయం, మూత్రపిండాల మార్పిడి తరహాలోనే ఈ జబ్బుకు ఎంజైమ్ మార్పిడి చేయాలి. లేదంటే ఖరీదైన మందులు వాడాలి. బాధితుడు విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించగా అంత ఖరీదైన మందులు తమ వద్ద లేవని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స ఖర్చు ఏటా కోటి రూపాయలు... హైకోర్టు ఆదేశాలతో సర్కారు దీనిపై నివేదిక రూపొందించింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని, గ్లూకోసెరిబ్రోసైడస్ ఎంజైము లోపంతో ఈ వ్యాధి సోకడం వల్ల పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీనికి చికిత్స కోసం ఏటా కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని తేల్చారు. దీనికోసం వాడే ఖరీదైన సెరిటైజం ఇంజెక్షన్ దేశంలో అందుబాటులో లేదు. 400 యూనిట్లు ఉన్న ఈ ఇంజెక్షన్ వైల్ (బాటిల్) ధర రూ.1,10,000 ఉంటుంది. వ్యక్తి బరువును బట్టి కిలోకు 60 యూనిట్లు (50 కిలోలు ఉంటే 3000 యూనిట్లు) చొప్పున వాడాలని వైద్యులు తెలిపారు. భారీ వ్యయంపై సర్కారు తర్జనభర్జన చికిత్సకు ఏటా కోటి రూపాయలకుపైనే వ్యయం కానుండడంతో బాధితుడికి వైద్యమందించేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఓ పేషెంట్‌కు ఇంత వ్యయంతో వైద్యం అందించడం కష్టమని అభిప్రాయపడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు స్పెషలిస్టుల అభిప్రాయాలు సేకరించారు. దేశంలో ఈ వైద్యం అందుబాటులో లేనందున తామేమీ చేయలేమని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. బాధితుడు ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాడు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరితే అందుబాటులో ఉన్న వైద్యం అందించేందుకు తమకు అభ్యంతరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలు ఇలా... –గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రోసైడస్ అని కూడా అంటారు –ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది –ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి –ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది –గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది –గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి –ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది –ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది –రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది –ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది –ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి –ఈ వ్యాధిని బెటా–గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. -
3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. అంచనాలను మించి..: కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు. -
పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 7,683 ఆరోగ్య ఉప కేంద్రాల(సబ్ సెంటర్స్)ను టెలిమెడిసిన్ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 సేవలను ప్రైవేట్‌పరం చేసి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థలకు పంచి పెడుతున్న సర్కారు తాజాగా సబ్సెంటర్లను సైతం అప్పగించడం ద్వారా ఏటా మరో రూ.276.58 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది. టెలిమెడిసిన్ కింద పట్టణాల్లో పేదల కోసం ఇప్పటికే 222 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆర్నెళ్లుగా వీటికి బిల్లులు కూడా సరిగా చెల్లించడం లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు చూడటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. మౌలిక వసతులున్న చోటే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని సబ్సెంటర్లలో టెలిమెడిసిన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. టెలిమెడిసిన్ కింద ఒక్కో ఆరోగ్య కేంద్రానికి నెలకు రూ.4.08 లక్షలు చెల్లిస్తున్నా పర్యవేక్షణ లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే లేకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారు. చంద్రన్న సంచార చికిత్స బాధ్యతలు నిర్వహిస్తున్న పిరమిల్ సంస్థ ఒక్క పేషెంట్ వచ్చినా ఆరుగురి ఆధార్ కార్డులు తీసుకుని వైద్యం చేసినట్టు చూపిస్తున్నారు. మండలానికి ఒకటి కూడా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించకుండా సబ్‌సెంటర్లకు ఎలా నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్ / ప్రపంచ బ్యాంకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు పందేరం చేస్తోందని పేర్కొంటున్నారు. 20 సెంటర్లకు ఇంటర్నెట్ లేదు.. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల కింద ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల వరకూ వ్యయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు రుణం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సబ్సెంటర్లలో డాక్టర్లు ఉండనందున టెలిమెడిసిన్ యంత్రం ద్వారా రోగికి సూచనలు, సలహాలు అందచేస్తారు. రోగి వివరాలన్నీ ఎలక్ట్రానిక్ డేటాలో రికార్డు చేస్తారు. అయితే 20 సబ్‌సెంటర్లకు ఇప్పటివరకూ ఇంటర్నెట్ కనెక్షన్లే లేకపోవడం గమనార్హం. ఏజెన్సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. 80% మంది కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు సబ్‌సెంటర్లకు సొంత భవనాలే లేవు. ఈ అంశాలను పట్టించుకోకుండా టెలిమెడిసిన్ పేరుతో కోట్లు కుమ్మరించడం దుబారాకు పరాకాష్టని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సేవలు ఇవీ - అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవగాహన కల్పించడం - మాతాశిశు సంరక్షణపై సూచనలు ఇవ్వడం - జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సకు సహకరించడం - హెచ్ఐవీ బాధితులకు మందులు ఇప్పించడం - కుష్టు, అంధత్వ నివారణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలు - వ్యాధి నిరోధకత, వ్యాధులపై అవగాహన కల్పించడం - సబ్‌సెంటర్ పరిధిలో గర్భిణులను గుర్తించి ప్రతినెలా పరీక్షలు చేయించడం తమిళనాడులో సర్కారు నిర్వహణలోనే.. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యం అమలు తీరు అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారుకు అధికారులు పలుదఫాలు నివేదిక ఇచ్చారు. రాజస్థాన్‌లో సైతం ప్రభుత్వమే నిర్వహిస్తోందని నివేదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని సుమారు 140 గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం తమిళనాడు పీహెచ్‌సీలకే వెళుతుండటం గమనార్హం. -
రెండువేలైతే కుదరదు!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్ ఆపరేషన్‌కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. 11 శాతం మందికి.. ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. పెరుగుతున్న ఆపరేషన్లు కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాటరాక్ట్‌వే ఎక్కువ కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్‌వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్‌కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవలో క్యాటరాక్ట్‌కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. -
నిమ్స్‌లో మరణ మృదంగం
హైదరాబాద్: ఏపీలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తెలంగాణలోని నిమ్స్ వైద్యశాలలో 19 మంది మరణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిమ్స్‌లో వైద్యుల ఆందోళన నేపథ్యంలో సోమవారం 10 మంది, మంగళవారం 9 మంది మరణించారు. అవినీతి ఆరోపణలున్న ఆర్.వి.కుమార్‌ను నిమ్స్‌కు నూతన డీన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి రెసిడెంట్ వైద్యులు, వైద్య బోధకులు విధుల్ని బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2 రోజుల్లోనే 19 మంది మరణించారు. ఇక బుధవారం నాటి మృత్యు గణాంకాలు నిమ్స్ రికార్డుల్లోకి ఎక్కలేదు. లిఖితపూర్వక హామీకి డిమాండ్.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో వైద్యుల సమ్మె గురించి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారుల బృందం బుధవారం మంత్రి లక్ష్మారెడ్డిని కలసి వినతిపత్రం అందించిం ది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుశీల్ శర్మను కలసి తమ సమస్యల సాధన కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కరిస్తామని వారు మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైద్యులు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు వారు నిరాకరించారు. విదేశీ పర్యటన ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో ఈ విధమైన దయనీయ పరిస్థితులు నెలకొంటే.. నిమ్స్ డైరెక్టర్ గురువారం (13న) విదేశీ పర్యటన ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. గెస్ట్ లెక్చర్ ఇచ్చే నిమిత్తం అమెరికా వెళ్తున్న ఆయన ఈ నెల 18న వస్తారు. ఈలోగా వైద్యుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేసే వారు ఉండకపోవచ్చని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగుల పరిస్థితి దారుణం అవుతుందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణ కీలకం.. ఆపద్ధర్మ పాలన ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య అంశాలపై గవర్నర్ పర్యవేక్షణ చాలా కీలకం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ కూడా గతంలో మాదిరిగానే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు, మంత్రి వర్గానికి వదిలేస్తే.. ఇంతవరకూ ఉన్నట్టుగానే ప్రభుత్వమూ తమకే సంబంధం లేదన్నట్లుగా ఉన్న పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని రోగులు చెబుతున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో మరణ మృదంగం మోగుతుంటే ఏ మాత్రం పట్టని పాలక పెద్దలు ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నిమ్స్‌లో గురువారం కేన్సర్ వైద్య విభాగం రెండో అంతస్తు ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ హాజరుకానున్నారు. వీరి రాక సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో నిమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. -
పీహెచ్‌సీల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) మరిన్ని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం అత్యాధునిక వసతులతో డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.37.45 కోట్లు కేటాయించింది. ఆ నిధులను ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి మంజూరు చేయనుంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.5 లక్షల చొప్పున కేటాయించనున్నారు. మొత్తంగా 644 పీహెచ్‌సీలు, 41 సీహెచ్‌సీల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పుతారు. పీహెచ్‌సీల్లో ప్రస్తుతం కొన్ని పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాక పీహెచ్‌సీల్లో 20 రకాలు, సీహెచ్‌సీల్లో 39 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్, హెచ్ఐవీ, మలేరియా రాపిడ్, యూరిన్ షుగర్, ప్లేట్లెట్ కౌంట్, డెంగీ రాఫిడ్, వాటర్ క్వాలిటీ తదితర పరీక్షలను పీహెచ్‌సీల్లో నిర్వహిస్తారు. ఇక సీహెచ్‌సీల్లో పై వాటితోపాటు ఎక్స్‌రే, ఎస్ క్రియాటిన్, సీబీసీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసం సెమీ ఆటో ఎనలైజర్, హెమటాలజీ ఎనలైజర్, మైక్రోస్కోప్, సెంట్రిఫ్యూజ్ వంటి పరికరాలను కొనుగోలు చేస్తారు. రిఫ్రిజిరేటర్, బార్కోడ్ ప్రింటర్ అండ్ స్కానర్, కంప్యూటర్ అండ్ ప్రింటర్లను కూడా కొనుగోలు చేస్తారు. 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు రాష్ట్రంలో 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపింది. దాంతోపాటు వివిధ ఆసుపత్రుల్లో పడకల పెంపు ఫైలును కూడా సీఎం ఆమోదానికి పంపింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.. ముఖ్యమంత్రి వద్దకు ఇతర ముఖ్య ఫైళ్లను కూడా తీసుకెళ్లినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. -
521 గ్రామాల్లో కంటి వెలుగు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం 521 గ్రామాల్లో పూర్తయింది. 7.16 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3.07 లక్షల మంది పురుషులు కాగా, 4.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలే లక్ష మంది అధికంగా కంటిపరీక్షలు చేయించుకోవడం గమనార్హం. మొత్తం జనాభాలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇప్పటి వరకు ఓసీలు 72 వేల మంది, బీసీలు 4.06 లక్షల మంది, ఎస్సీలు 1.41 లక్షల మంది, ఎస్టీలు 55 వేల మంది, మైనారిటీలు 40 వేల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 1.33 లక్షల మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. అంతేకాకుండా చత్వారం కారణంగా ఇతర కంటి అద్దాల కోసం ప్రిస్కిప్షన్ రాయించుకున్న వారు 1.91 లక్షల మంది, కేటరాక్ట్‌కు గురైనవారు 84 వేల మంది ఉన్నారు. తదనంతర వైద్యం అవసరమైనవారు 2.22 లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వచ్చినవారిలో 2.19 లక్షల మందికి ఎటువంటి కంటి సమస్య లేనట్లుగా నిర్ధారించారు. పట్టణాల్లోకంటే పల్లెల్లోనే కంటి పరీక్షలకు భారీ ఎత్తున స్పందన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాదు వచ్చేవారిలో 40 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అలాగే పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే కంటి వెలుగు శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. -
టీకా వికటించి పసికందు మృతి
సాక్షి, సిరిసిల్ల: టీకా వికటించి ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. డాక్టర్ సహా ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధిత కుటుంబానికి సర్కారు రూ.3 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగింది..? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఎప్పటిలాగే కోరుట్లపేటకు చెందిన తాడ మాధవి, బాపురెడ్డి దంపతుల నలభై ఐదు రోజుల (ఇంకాపేరు పెట్టని) పసిపాపకు టీకా వేశారు. అది వికటించి పసికందు మరణించింది. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. టీకాను భద్రపరచడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాయిజన్‌గా మారి నిండు ప్రాణం తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని వైద్యశాఖ అధికారుల విచారణలో నిర్ధారించారు. కదిలిన యంత్రాంగం ఎల్లారెడ్డిపేట వైద్యశాఖ నిర్లక్ష్యపు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు కోరుట్లపేటకు వెళ్లి విచారణ జరిపారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రూ.3 లక్షల పరిహారం అందిస్తామని, ఒకరికి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న చిన్నారిని సైతం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. డాక్టర్ సహా 8 మంది సస్పెన్షన్ పసికందు మృతితో పాటు మరో ముగ్గురు చిన్నారుల విషమ పరిస్థితికి కారణమైన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి మీనాక్షి, పీఎచ్ఎన్ శోభారా ణి, ఎపీఎచ్ఎస్లు అజాం, ప్రేమలత, సీఎచ్ లక్ష్మీ ప్రసాద్, గ్రేడ్2 ఫార్మసిస్ట్ వెంక న్న, ఎంపీఎచ్ఏ శారద, ఏఎన్ఎం పుష్పలతలను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది. -
పాత పద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: పాతపద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంలో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ పాత పద్దతి ప్రకారమే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా జీవో 550లో మార్పులు చేయాలని కూడా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత ఆ స్టేను సమర్థ్ధిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఆగస్టు 31లోపు దేశ వ్యాప్తంగా మెడికల్ కౌన్సెలింగ్‌లు పూర్తి చేయాలి. ఇప్పటికే జాతీయస్థాయి కౌన్సెలింగ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. -
రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రులకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పూర్వ జిల్లాకేంద్రాల్లో వీటిని ప్రారంభించాల ని అధికారులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో 5, కరీంనగర్లో 5, వరంగల్‌లో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టామని తెలిపారు. ‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా సర్కారు ఆస్పత్రుల బలోపేతం, కొత్త దవాఖానాల ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని వివరించారు. డిసెంబర్లో 175 ప్రారంభం గత నెలలో బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఆస్పత్రికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక వైద్యం కోసం ప్రైవేటు క్లినిక్‌లలో డబ్బులు ఖర్చు చేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని చెప్పారన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే వాటి విస్తరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్‌లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి సుమారు 175 దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో మ్యాపింగ్ బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఐటీ శాఖ సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో నెలకొల్పే 500 బస్తీ దవాఖానాలకు భవనాలు గుర్తించాలని, అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న 28 బస్తీ దవాఖానాలను వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్ తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల సేవలను కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెం టర్లకు మంచి స్పందన వస్తోందని మంత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఏజెన్సీల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. వరుసగా వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని వైద్యారోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అపరిశుభ్ర వాతావరణం లేకుండా పంచాయతీలను అప్రమత్తం చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. -
‘కంటి వెలుగు’ ఆపరేషన్ కోసం వచ్చి..
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో శస్త్రచికిత్సకు సిద్ధం చేస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందింది. మత్తు మందు వికటించడం వల్లే చనిపోయిందంటూ విమర్శ లు వస్తుండగా.. ఆ సమయంలో గుండెపోటు రావడం వల్లే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గంట్లవెళ్ళి చెన్నమ్మ (68).. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న గ్రామంలో నిర్వహించిన శిబిరానికి కంటి పరీక్ష కోసం వచ్చారు. ఆమెకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించిన వైద్యులు.. రిఫరల్ ఆస్పత్రి పేరుతో చీటీ రాసిచ్చినట్లు తెలిసింది. ఆ చీటీతో శనివారం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రికి చెన్నమ్మ వెళ్లారు. అక్కడ ఆపరేషన్‌కు ముందు ఆమెకు మత్తు మందు ఇవ్వగా అ తర్వాత కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. ఆరోగ్యంగా వెళ్లి శవమై తిరిగి వచ్చిందని, కంటి వెలుగు కోసమని వెళితే మా ఇంటి వెలుగు పోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యా రు. కాగా, ఆపరేషన్‌కు ముందే చెన్నమ్మకు కంటి చికిత్స కోసం మత్తు మందు ఇచ్చారని, చికిత్స కు ముందే ఆమె శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వెంటనే డాక్టర్లు షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపారని, దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలోనే గుండెపోటుతో చెన్నమ్మ మరణించినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కొద్దిపాటి మత్తుమందుతో ఎవరూ చనిపోవడం జరగదన్నారు. తమ తల్లికి ఆస్తమా ఉందని.. గతంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నట్లు కొడుకు సాయిలు తెలిపారు. ముందే ఆపరేషన్‌కు.. కంటి వెలుగు కింద పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే రెండు వారాల తర్వాత చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. అయితే కొందరు పరీక్షలు చేయించుకున్న వెంటనే రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలూ అందుకు సుముఖత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆపరేషన్ చేయడానికి ముందు వ్యక్తుల శరీర సామర్థ్యం (ఫిట్నెస్) పరీక్షించాలి. అలా చేయనందునే మరణం సంభవించిందని ఆరోపణలున్నాయి. 50 ఏళ్ల తర్వాతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తుంటారు. కాబట్టి ఫిట్నెస్ తప్పనిసరిగా చూడాలి. -
‘కంటి వెలుగు’కు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’కార్యక్రమానికి మూడో రోజూ విశేష స్పందన లభించింది. శుక్రవారం సెలవు కావటంతో వైద్య శిబిరాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒక్క శుక్రవారమే రికార్డు స్థాయిలో 1,07,361 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మహిళలు 61 వేలు, పురుషులు 46 వేల మంది ఉన్నారు. ప్రజలు భారీగా తరలివస్తుండటం తో రాత్రి ఏడుగంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఇంటికీ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లలో సూచించిన సమయానికి రావటం వల్ల వేచిచూసే అవసరముండదని ప్రచారం చేస్తు న్నారు. ప్రభుత్వం ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజుల్లో 1.13 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకోగా..మూడు రోజులకు కలిపి 2.19 లక్షల మంది చేయించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తు న్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాస్ వెల్లడించారు. -
‘మెడికల్’ రెండో విడత మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత తానిచ్చిన స్టేను సమర్థ్ధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసుకొని సీట్లు పొందిన విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో తరగతులకు హాజరవుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జీవో నంబర్ 550పై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున కౌన్సెలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రకారం ఈ నెలాఖరులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి. అప్పటిలోగా కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంసీఐ అనుమతి ఇవ్వాలి. కానీ అంత సులువుగా ఎంసీఐ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. రెండో విడతలో 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. -
కంటి వెలుగుపై గవర్నర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు పథకంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు. ఈ పథకం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కంటి వెలుగు పథకం గురించి వివరించారు. ‘అంధత్వ రహిత తెలంగాణ’దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగని వారు వివరించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు చేశాక అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ, ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. సాధారణ కంటి వ్యాధులున్న వారికి ఉచిత మందులను అందిస్తామన్నారు. -
గ్రామానికి కీడు సోకిందని...
ఆత్మకూర్ (ఎస్), (సూర్యాపేట): గ్రామానికి కీడు సోకిందని ప్రజలందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదు. అంతేకాకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఊరంతా తమ ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నిప్పును కొనుక్కుని వనవాసానికి వెళ్లారు. దీంతో గ్రామంలో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. -
బోధనా వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే మార్గదర్శకాలు విడుదల అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎంఈ ప్రతిపాదనల ప్రకారం బోధనాసుపత్రుల్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఆరేళ్ల సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించనుంది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేల్లో మార్పు తీసుకొస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. 2,700 మందికి ప్రయోజనం... ప్రస్తుతం బోధన వైద్యుల పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలా మందికి లభించడం లేదు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చిన పరిస్థితులున్నాయి. కొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. డీఎంఈ తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. అంతేకాక వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి స్కేల్స్‌ల్లోనూ మార్పులు చేయనున్నారు. అంటే ఆర్థికంగా కూడా వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇక ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి స్కేల్స్‌లో మార్పులు చేయనున్నారు. -
వైద్య,ఆరోగ్యశాఖ, పీబీఎస్ కంపెనీపై హైకోర్టులో పిల్
-
వైద్యశాఖపై విజి‘లెన్స్’
ఆదాయపు పన్ను మినహాయింపునకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి గృహరుణాలు పొందినట్లు కొందరు ఉద్యోగులు సమర్పించిన తప్పుడు అఫిడవిట్లపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంఅండ్‌హెచ్‌ఓ) పరిధిలో పనిచేసే ఉద్యోగులతో పాటు, మలేరియా విభాగం, సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 50 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు తేల్చారు. ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ గుట్టు రట్టయిందని సమాచారం. లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఉద్యోగులు చేసిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రుణాలు తీసుకున్నామంటూ గుట్టుగా సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలేనని నిర్థారించారు. ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. మరింత మంది ఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా మలేరియా విభాగంలో ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ బాగోతం బహిర్గతమైంది. ఆదాయపు పన్ను మినహాయింపునకు తప్పుడు పత్రాలు సమర్పించిన గుట్టు బయటకు పొక్కింది. కొందరు ఉద్యోగులు తప్పుడు పత్రాలతో పన్ను మినహాయింపు పొందుతున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు, విజిలెన్స్‌కు లేఖలు రాశారు. దీంతో ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చింది. విచారణ కోసం వచ్చిన ఉద్యోగులు తామే కాదు... మరింత మంది అలా తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొనడంతో ఆ జాబితా రోజు రోజుకు చాంతాడులా పెరుగుతూ వచ్చింది. మలేరియాతో పాటు, డీఎం అండ్ హెచ్ఓ పరిధిలోని సిబ్బంది, విజయవాడ ప్రభుత్వాస్పత్రి, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలల్లోని పలువురు ఉద్యోగులు ఇలాంటి తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చాయి. ఏటా అంతే.... వైద్య ఆరోగ్యశాఖలో నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకూ జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆదాయపు పన్ను పరిధిలోకి రావడంతో పన్ను నుంచి మినహాయింపు కోసం దొడ్డిదారులు వెతికారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు పొందినట్లు అఫడవిట్లు సృష్టించి ఒక్కో ఉద్యోగి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ పన్ను రాయితీ పొందినట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల వివరాల సేకరణ... వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల నాలుగేళ్ల ఆదాయపు పన్ను వివరాలు తమకు తెలియపర్చాలంటూ విజిలెన్స్ విభాగం ఆయా శాఖల అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరింది. అందులో భాగంగా 2013–14, 2014–15, 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల డేటా ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రి, డెంటల్ కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ డీఎస్పీ విజయపాల్, మరలా మంగళవారం రానున్నట్లు సమాచారం. అప్పటికి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారని తెలిసింది. మలేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తప్పుడు పత్రాలు సమర్పించిన ఉద్యోగులను ఇప్పటికే గుర్తించారు. దీంతో పలువురు ఉద్యోగులు రికవరీ పొందిన మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించేసినట్లు తెలిసింది. ఈ విషయమై విజిలెన్స్ అధికారులను వివరణ కోరగా, విచారణలో ఉన్నందున వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్‌ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్‌లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు. -
కొత్త డాక్టర్లొచ్చారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరుల నేతృత్వంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. భర్తీ చేసిన వెంటనే సంబంధిత వైద్యులకు నియామక ఉత్తర్వులను ఆన్లైన్లో పంపారు. వారం రోజుల్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జిల్లాలు, ఆసుపత్రుల వారీగా పోస్టుల కేటాయింపు చేస్తారు. వివిధ విభాగాల వారీగా 15 రకాల స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేశారు. ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తల్మాలజీ–34, సైకియాట్రిక్–22, అనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. సొంత జిల్లాల్లో కేటాయింపు.. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆసుపత్రులు 31, ఏరియా ఆసుపత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్‌లో ఫస్ట్ రిఫరల్ యూనిట్లు 14 ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 1,133 స్పెషలిస్టు పోస్టుల కోసం వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అందుకు 2,200 మంది స్పెషలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు. 1,133 పోస్టుల్లో 919 పోస్టుల భర్తీ జరిగింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా నియామకాలు జరిపారు. వారు సాధించిన మార్కులు, పాసైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నేళ్లయిందో దానికి వెయిటేజీ, కాంట్రాక్టు పద్ధతిలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే దానికీ వెయిటేజీ, అలాగే రోస్టర్ పాయింట్ల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. నియమించిన 919 మందిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. వైద్యులందరికీ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. అన్యాయం జరిగింది: నియామకాలు జరిపిన ప్రభుత్వం తక్షణమే ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదో చెప్పాలని కొన్ని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొందరు కుమ్మక్కయినందునే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. అలాగే నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈఎన్టీ విభాగపు మెరిట్ లిస్టులో రోస్టర్ ప్రకారం ఐదో స్థానం వచ్చిందని డాక్టర్ అనిల్ చెబుతున్నారు. మొత్తం 18 పోస్టులు ఉన్నందున తప్పక రావాల్సి ఉందని, కానీ తుది నియామకపు ఉత్తర్వులో తన పేరు కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇక డాక్టర్ నరహరి అనే స్పెషలిస్టు మాట్లాడుతూ నోటిఫికేషన్ మార్చి 19న వచ్చిందని, దాని ప్రకారం 46 ఏళ్లున్న వారు అర్హులన్నారు. ఆ తేదీ నాటికి తనకు 45 ఏళ్ల 10 నెలలుందన్నారు. కానీ జూలై 1వ తేదీని కట్ ఆఫ్‌గా తీసుకోవడం శోచనీయమన్నారు. ఈఎన్టీ జాబితాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలోనూ తనకు విషయం చెప్పలేదని, అప్పుడు తన దరఖాస్తును తిరస్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం వయసు లేదంటూ భర్తీలో తన పేరు లేకుండా చేశారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య మంత్రి హర్షం.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి భారీ నియామకాలు జరిపామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీరిందన్నారు. మొదటిసారిగా అందుబాటులోకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల స్పెషలిస్టులు వచ్చారన్నారు. ఈ నియామకాలతో మౌలిక వసతులతో పాటు వైద్యుల కొరత తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ఓపీ, ఐపీలకు అనుగుణంగా నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు. -
‘పీజీ వైద్యుల ప్రభుత్వ సేవలు తప్పనిసరి కాదు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పీజీ వైద్యుల తప్పనిసరి సేవలు ఇక నుంచి వారి ఇష్టానుసారానికే పరిమితం కానున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ పలు సడలింపులతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేయాలన్న డిమాండ్ నేపథ్యంలో సర్కారు ఈ ఏడాది ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేసినట్లయింది. దీంతో జూన్ 30 నుంచి తప్పనిసరి వైద్య సేవల నిలుపుదల అమల్లోకి వచ్చింది. కాగా, రెండు మూడు నెలల్లో ఏడాది సర్వీసు పూర్తయ్యే వైద్యులు స్టైఫండ్ లేకుండా సేవలు చేయాలన్న నిబంధనను విధించారు. అలాగే ప్రస్తుతం పనిచేసే వారే కాకుండా భవిష్యత్‌లో ప్రభుత్వ సేవలు చేయాలనుకునేవారు సర్కారుకే కొంత సొమ్ము చెల్లించి సేవలు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలా ఉచితంగా సేవలు చేయాలనుకునేవారికి ఎలాంటి పారితోíషికం చెల్లించబోమని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఒకే ఒక్కడు!
జగిత్యాల : జిల్లాలో వైద్యశాఖలో ఒకే అధికారి పలు శాఖలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించి రెండేళ్లు అయింది. అయినా వైద్య శాఖలో పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగడంలేదు. దీంతో ఉన్న అధికారులకే పలు శాఖల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారులు కేటాయించలేదు. వైద్యశాఖలో డెప్యూటీ డీఎంహెచ్‌వోగా జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. డీఎంహెచ్‌వో సుగంధిని ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జైపాల్‌రెడ్డికి అదనంగా ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వోతోపాటు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో, రాష్ట్ర బాలస్వస్తీయ కార్యక్రమం(ఆర్బీఎస్కే) జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి చికిత్స అందిస్తుంటారు. 10 వాహనాలు, 10 మంది ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ఈ శాఖకు సైతం ఆయన జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో ఎలా అమలు జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు అధికారులను నియమించారు. కేసీఆర్ కిట్‌కు సైతం జిల్లా ఇన్చార్జిగా జైపాల్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖలో నాలుగు ప్రధానమైన ఈ శాఖలను జైపాల్‌రెడ్డి ఇన్చార్జి. నాలుగు శాఖలకు ఒకరే ఇన్చార్జి కావడంతో ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. -
వైద్యారోగ్యంలో పురోగమనం
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగమన పథంలో పయనిస్తోందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. జాతీయ స్థాయిలో రాష్ట్రం 12వ ర్యాంకు పొందినట్లు వెల్లడించింది. కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా పురోగమించాయని, తెలంగాణ ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలూ పురోగమన దిశలో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్యరంగం మెరుగైన స్థితిలో ఉందని వివరించింది. నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. దేశంలో 101 జిల్లాల్లో నీతి ఆయోగ్ బేస్‌లైన్ సర్వే నిర్వహించింది. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించింది. అందులో ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20వ ర్యాంకు, ఆసిఫాబాద్ జిల్లా వందో ర్యాంకు సాధించాయి. తగ్గిన నవజాత శిశు మరణాల రేటు... నవజాత శిశువుల మరణాల రేటులో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ పేర్కొంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉంది. అలాగే ఐదేళ్లలోపు మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యలో మెరుగుదల కనిపిస్తుంది. అది గతంలో 6.11 శాతముంటే ఇప్పుడు 5.70 శాతానికి చేరింది. సంతాన సాఫల్య అవకాశం ఉన్న వారి రేటు 1.8 ఉంది. అయితే పురుషులు, స్త్రీల నిష్పత్తిలో మాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలే ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 85.35% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే వివిధ రకాల టీకాలు ఇప్పించడంలో రాష్ట్రం కాస్త వెనుకబడింది. కేవలం 89.09 శాతమే టీకాలు ఇస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు మెరుగుపడింది. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉంటున్నారు. అయితే టీబీ చికిత్సలు విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసింది. పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీపై అసంతృప్తి... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లలో మెడికల్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే పరిస్థితి ఏమాత్రం మారలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గతం నుంచీ ఇప్పటికీ పీహెచ్‌సీల్లో 22.31 % మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మాత్రం స్పెషలిస్టుల కొరతను తీర్చడంలో మెరుగుదల ఉంది. ప్రస్తుతం వాటిల్లో స్పెషలిస్టుల ఖాళీలు 54.81% ఉన్నాయి. అదే తమిళనాడులో కేవలం 16.73% మాత్రమే స్పెషలిస్టుల ఖాళీలున్నాయి. ఏఎన్ఎంల కొరత లేకుండా చేయడంలో మెరుగుదల కనిపిస్తోంది. స్టాఫ్ నర్సుల ఖాళీలను నింపడంలో ఇప్పటికీ మార్పు కనిపించడంలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఇప్పటికీ 12.79 % స్టాఫ్ నర్సుల ఖాళీలున్నాయి. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి సేవలు అందించడంలో మార్పు రాలేదు. పీహెచ్‌సీల్లో 26.99 శాతమే 24 గంటలు సేవలందిస్తున్నాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని చెప్పొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)ల గ్రేడింగ్ పరిశీలిస్తే గతం కంటే మెరుగుపడింది. అంతకుముందు వాటి గ్రేడింగ్ శూన్యమైతే ఇప్పుడు 11.63%తో మెరుగ్గా ఉంది. జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూల కొరత ఉంది. -
నేషనల్ పూల్‌కు 15 శాతం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ సీట్ల లో 15% సీట్లను ఆలిండియా కోటా కింద నేషనల్ పూల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి మిగిలిన 85% కోటా సీట్లలో 5% సీట్లను దివ్యాంగులకు కేటాయించింది. గతంలో వీరికి కేవలం 2 శాతమే కోటా ఉండగా.. సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్ సీట్లున్నాయి. సర్కారు తాజా ఉత్తర్వులతో వాటిలోని 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. ఆ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్ సీట్లు, మరో 15 బీడీఎస్ సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. అయితే మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్ పూల్‌లో చేర్చలేదు. తాజాగా చేర్చిన నేపథ్యంలో జూలై 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్ కౌన్సెలింగ్ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. -
వైద్య ఆరోగ్యశాఖలో 4,120 మంది బదిలీ
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆన్లైన్లో చేపట్టిన ఈ ప్రక్రియలో 4 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. ప్రాథమిక ఆస్పత్రి మొదలు పైస్థాయి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ బదిలీలు జరిగాయి. మొత్తం 4,120 మందిని బదిలీ చేయగా.. వారిలో 190 మంది వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. బదిలీల్లో 2,120 హైదరాబాద్ కేంద్రంగా జరిగితే, 2 వేల బదిలీలను జిల్లాల స్థాయిలో నిర్వహించారు. దంత వైద్యులు తక్కువగా ఉన్నందున వారిని బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమకు బదిలీ కావాలని వారు కోరుకున్నందున కౌన్సెలింగ్ చేపట్టామని ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 35 ఏళ్లుగా ఒకే దగ్గర తిష్టవేసిన వారిని కూడా ఈ సారి కదిలించినట్లు ఆయన చెప్పారు. కాగా, బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు వైద్య సిబ్బంది ఆరోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎవరికీ అన్యాయం జరగలేదని.. ఆన్లైన్ ద్వారానే బదిలీల ప్రక్రియ నిర్వహించామని శ్రీనివాసరావు తెలిపారు. -
వైద్య శాఖలో432 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 432 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను వైద్య, ఆరోగ్య శాఖలోని ఎంపిక కమిటీ భర్తీ చేస్తుంది. మిగతా మూడు రకాల పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–108, స్టాఫ్ నర్స్–216, ఫార్మసిస్ట్(గ్రేడ్ 2)– 54, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2)–54. -
‘108’ సేవలు నిలిపేస్తాం
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: ఏదైనా ప్రమాదం సంభవిస్తే ‘108’కు ఫోన్ చేయగానే పరుగెత్తుకు రావాల్సిన అంబులెన్స్ సేవలు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి, ‘108’నిర్వహణా సంస్థ బీవీజీ యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తమ డిమాండ్ల పరిష్కారానికి బీవీజీ సంస్థ అంగీకరించకపోవడంతో సిబ్బంది నాలుగు గంటలపాటు అంబులెన్స్‌లను నిలిపి వేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘108’సిబ్బందిని చర్చలకు ఆహ్వానించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శితో జరిగే చర్చల్లో సిబ్బందికి న్యాయం జరగకపోతే ఇకపై రోజూ 8 గంటలపాటు అంబులెన్స్ సేవలను నిలిపివేస్తామని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘108’కార్యాలయంలో 13 జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు.. బీవీజీ సంస్థ ప్రతినిధులతో బుధవారం చర్చలు జరిపారు. నిబంధనల ప్రకారం తాము రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉండగా 12 గంటలకుపైగా పని చేయాల్సి వస్తోందని వాపోయారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, వేతనాలను 50 శాతం జీతాలు పెంచాలని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను బీవీజీ సంస్థ ఎండీ దేశ్‌పాండే తిరస్కరించారు. -
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి
సూర్యాపేట / హుజూర్నగర్ :రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లను మంత్రులు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయనున్నామన్నారు. శిబిరాల ద్వారా ప్రజలందరికీ పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలి పా రు. సీఎం హామీ మేరకు నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా రు. నల్లగొండలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించామని.. త్వరలో కళాశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరో సిస్ గుర్తుకు వస్తుందన్నారు. ఇలాంటి జిల్లాల ప్రజలకు మేలు చేసేందుకే సీఎం మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ సురేంద్రమోహన్, కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ మురళీమోహన్, డీసీహెచ్ఎస్ సంపత్‌కుమార్, సూర్యా పేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, బైరు దుర్గయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వైవి, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీని వాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, పుట్ట కిషోర్‌నాయుడు, నాతి సవిందర్‌కుమార్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీని వాస్ గౌడ్, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఎంపీపీ జి. నిర్మల, జడ్పీటీసీ ఎండీ.హఫీజా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాముల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ భిక్షానాయక్, వైద్యశాల సూపరింటెండెంట్ డా.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు . -
కంటి పరీక్షలకు సన్నద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ సర్వ సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కంటి పరీక్షలపై ఆదివారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ఓ అంచనాకు రండి.. ‘రాష్ట్రంలో ఎన్ని కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలో తొలుత నిర్ధారించాలి. ఒక వైద్య బృందం ఒక రోజుకు ఎంత మందికి పరీక్ష చేయగలుగుతుందో అంచనాకు రావాలి. అందుకు అనుగుణంగా జనాభాను బట్టి ప్రతి గ్రామానికి అవసరమైనన్ని వైద్య బృందాలను పంపాలి. ఒకే రోజు గ్రామంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలి. వరుసగా ఒక్కో గ్రామం పూర్తి చేయాలి. వైద్య బృందానికి వారంలో ఐదు రోజులు మాత్రమే పని కల్పించాలి. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 900 వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల కంటి వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలి’ అని ఆదేశించారు. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్యశాలలకు రిఫర్ చేయాలన్నారు. విస్తృత ప్రచారం చేయాలి.. ‘గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారు. కంటి జబ్బు ఉన్నా గుర్తించకుండా నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు. అందరికీ ముందుగా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం నిర్వహించే కంటి వైద్య శిబిరాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు జీఆర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ వాకాటి కరుణ, వైద్యారోగ్య శాఖ ఓఎస్డీ గంగాధర్, చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎన్‌పీసీబీ డైరెక్టర్ మోతీలాల్ నాయక్, సీఐవో గోపీకాంత్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
భార్యలకేనా..ఆ బాధ్యత భర్తలకు లేదా!
మగ మహా రాజులుగా మీసాలు మెలేస్తారుమగ ధీరులుమంటూ మాటలు కోటలు దాటిస్తారుధైర్యానికి ప్రతీకలుగా కండలు తిప్పుతారువాస్తవానికి ఇవన్నీ మహిళలకే వర్తిస్తాయి... ఓ యువతా... ఇల్లరికం వస్తావా అంటేకొత్తవాళ్ల మధ్య నే మసలలేననే సమాధానం... ఓ మొగుడా గర్భం దాల్చి బిడ్డను కంటావా అంటేఆ భారం మోయలేను..ఆ బాధ భరించలేనంటావ్ పసి బిడ్డను లాలించగలవా అని ప్రశ్నిస్తే...పసికందు ఏడుపును నేనెలా ఆపగలనంటావ్ కనీసం కు.ని. శస్త్ర చికిత్స చేయి ంచుకో అంటేయోజనాల దూరం పరుగులు తీస్తావ్... మాకు తెలుసులే..మీదంతా మేకపోతు గాంభీ ర్యమేమీరంతా మగ మహా భయస్తులనేది నిజంలే... తూర్పుగోదావరి, కొత్తపేట: ఒక బిడ్డ ముద్దు..ఇద్దరు బిడ్డలు హద్దు..మూడో బిడ్డ వద్దు..అన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. ఆ దిశగానే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. చేయించుకున్నవారికీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాదాపు అందరూ ఒకరు, ఇద్దరితోనే సరిపెట్టుకుని స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే సంతానానికి భార్యా, భర్త ఇద్దరూ కారకులైనా..కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు మాత్రం భర్తలు ఆమడ దూరంలో ఉంటున్నారు. పురుషులకే వేసక్టమీ ఆపరేషన్లు చేయాలని లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. ఆ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ల సంఖ్యనే చూపించి లక్ష్యాలు సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారు. వేసక్టమీ ఆపరేషన్ సులువైనా... పురుషులకు కోత, కుట్టు, కట్టు లేని అతి సులువైన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స అందుబాటులో ఉన్నా ముందుకు రావడం లేదు. ఎక్కడో అతి కొద్దిమంది మాత్రమే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అదీ పట్టణ ప్రాంతాల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో మచ్చుకు కూడా ఆ జాడ కనిపించడం లేదు. మహిళలకు చేసే ట్యూబెక్టమీ కంటే పురుషులకు చేసే వేసక్టమీ ఆపరేషన్లకే ప్రభుత్వం ఎక్కువ పారితోషికం చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు రూ. 660 చెల్లిస్తుండగా పురుషులకు రూ.1,100 ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సహజ ప్రసవమయ్యేలా ప్రయత్నిస్తూ... అత్యవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నారు. అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం సహజ ప్రసవంమయ్యే అవకాశం ఉన్నా పెద్ద మొత్తంలో బిల్లులు దండుకునేందుకు సిజేరియన్ చేస్తుండగా, కొందరు నొప్పులు బాధ నుంచి తప్పించుకొనేందుకు స్వచ్ఛందంగా సిజేరియన్ ద్వారా బిడ్డకు కంటున్నారు. అపోహలు కారణం... వేసక్టమీ శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకపోవడానికి పురుషుల్లో పలు అపోహలే కారణం. పురుషులు వేసక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్ధ్యం, బలం, కోరిక తగ్గుతుందని పురుషులు భావించడం ఒక ప్రధాన కారణం. వాస్తవానికి పురుషులకు కత్తిరింపుతో కాకుండా చిన్న రంధ్రం ద్వారా వేసక్టమీ చేస్తాం... కొంత సేపు అనంతరం ఇంటికి వెళ్లిపోవచ్చు. ట్యూబెక్టమీ కన్నా వేసక్టమీ సులువైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ట్యూబెక్టమీతో మహిళ చర్మం 6 పొరలు కోయాలి. 7 నుంచి 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలి. అదే వేసక్టమీ అయితే పురుషులకు చిన్నగాటు పెట్టి కుట్టు కూడా లేకుండా ఆపరేషన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు.– డాక్టర్ ప్రదీప్తి కరుణ, గైనకాలజిస్ట్, కొత్తపేట -
రూ.3 వేలు వసూలు చేశారు!
‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్లో లేదు. ఇదేం పద్ధతి’ – శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ – వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం. సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు. గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
వడగాడ్పులపై ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. గత వేసవిలో 23 రోజుల పాటు వడగాడ్పులు వీచాయని ఈ సారి అంతకంటే ఎక్కువ రోజుల పాటు గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రతపై అధికార యంత్రాంగానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలను చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తగినన్ని ఓఆర్ఎస్, ఐడీ ఫ్లూయిడ్స్ తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్ అడ్వైజరీస్ విడుదల చేయాలన్నారు. వడగాడ్పుల తీవ్రతపై ప్రచారం.. సమాచార శాఖ ద్వారా వడగాడ్పుల తీవ్రతపై పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్స్, సోషల్ మీడియా, టీవీ, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బందికి వేసవి ప్రణాళికపై శిక్షణనివ్వాలని సూచించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో మంచినీటిని ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో మంచి నీరు, ఐస్ ప్యాక్‌లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సీఎస్ చెప్పారు. -
ఆశల ‘అడవి’లో గోండ్ గొవారీలు!
సాక్షి, హైదరాబాద్: గొవారీ, గోండ్ గొవారీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతా ల్లోని తెగలివి.. పశువుల కాపరులు.. గోండు రాజుల దగ్గర పనిచేస్తూ అటవీ ప్రాంతాల్లోనే జీవించేవారు.. ఇప్పుడిప్పుడే బయటి ప్రపం చం బాట పట్టారు. కానీ వారికి ‘గుర్తింపు’ సమస్య ఎదురవుతోంది. ప్రభుత్వ గెజిట్లోనే ఆ తెగల ప్రస్తావన లేక పోవడంతో అధికారులు వారికి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. సంక్షేమ పథకాలు అం దాలన్నా.. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించాలన్నా కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దీంతో గొవారీలు, గోండ్ గొవారీ లు ఏమీ అర్థంకాని దుస్థితిలో పడిపోయారు. మూడు వేలకుపైగా కుటుంబాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేల, కౌటాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మండలాల్లో మహారాష్ట్ర సరిహద్దులకు సమీపంగా గొవారీలు, గోండ్ గొవారీ తెగలకు చెందిన మూడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. వృత్తిరీత్యా పశువుల కాపరులైనా.. కాలక్రమంలో వ్యవసాయ కూలీలు, ఇతర పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవలికాలంలోనే పిల్లలను బడికి పంపడం మొదలుపెట్టారు. అయితే ప్రాథమికోన్నత స్థాయి వరకు కుల ధ్రువీకరణ పెద్దగా అవసరం లేకున్నా.. పైతరగతుల్లో కుల నమోదుకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు కుల ధ్రువీకరణ తప్పనిసరి. దీంతో కుల ధ్రువీకరణ పత్రాల కోసం గొవారీలు, గోండ్ గొవారీ ల దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ప్రభు త్వ గెజిట్‌లో ఆ కులాలే లేవంటూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి నిరాకరిస్తున్నారు. చదువు కష్టం.. ఉద్యోగం రాదు గొవారీలు, గోండ్ గొవారీలు కుల ధ్రువీకరణేదీ లేకపోవడంతో ఓపెన్ కేటగిరీ కింద పాఠశాలల్లో చేరుతున్నారు. అలా పదోతరగతి వరకు చదివి ఆపేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దుస్థితిలో ఓపెన్ కేటగిరీలో పోటీపడలేక, ఫీజులు చెల్లించి ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎలాగోలా కష్టపడి చదువుకున్నా అటు ఉద్యోగాలు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలూ అందని దుస్థితి ఉంది. కల్యాణలక్ష్మి పథకం వర్తించాలన్నా.. సహకార సంస్థల నుంచి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందాలన్నా కుల ధ్రువీకరణ పత్రం లేక సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఇప్పటివరకు గొవారీ, గోండ్ గొవారీల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు కేవలం ఒక్కరే కావడం గమనార్హం. ఇంటర్ చదివినా.. ‘‘అమ్మ నాన్న ఇద్దరూ వ్యవసాయ కూలీలే. చదువు మీద ఆసక్తితో ఇంటర్ చదివిన. కానిస్టేబుల్, వీఆర్ఓ, వీఆర్ఏ, ఆర్ఆర్బీ లాంటి నోటిఫికేషన్లు వచ్చినా.. దరఖాస్తు చేద్దామంటే కుల ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో కూలికి పోతున్నా’’ – రావుత్ కౌడు, బేల మండలం పోనాల ప్రభుత్వోద్యోగం పొందింది నేనొక్కడినే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం గొవారీ, గోండ్ గొవారీలకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు. అలా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బీసీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. మహారాష్ట్రలో మా తెగల వారికి ఎస్టీలుగా గుర్తింపు ఉంది. ఇక్కడ మా గోడు వినేవారే లేరు. ’’ – లోహత్ జానాజి, విశ్రాంత పోలీసు అధికారి, బేల అవకాశం వదులుకున్నా... ‘‘కష్టపడి ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టి ఎంఎల్టీ కోర్సు చదివిన. వైద్య శాఖలో పారామెడికల్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన. అర్హత ఉన్నా లాభం లేక బాధపడ్డా..’’ – దుద్కుర్ పూజ, బేల -
పోరుబాట..
సూర్యాపేట : వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, రెండో ఏఎన్ఎంలు, ఆర్బీఎస్కే, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 104 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదిరోజులనుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు పోస్టుకార్డుల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉత్తరాలు, నిరసనలు, ధర్నాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,168 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 45 శాతం వేయిటేజీ మార్కులు కల్పించి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులరు భర్తీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ నందు గత ప్రభుత్వాలు అమలు చేసిన పీఆర్సీ బేసిక్ పే విధానాన్ని,హెల్త్‌కార్డులు ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే లోపభూయిష్టమైన ప్రభుత్వ జీఓ నం:16ను వెంటనే పునరుద్ధరించి.. 2006 సంవత్సరంలో జస్టిస్ ఉమాదేవి ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ఈనెల 27న ధర్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈనెల 27వ తేదీన పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట పబ్లిక్ హెల్త్, మెడికల్‌ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. ధర్నాకు అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు తరలిరావాలని ఇప్పటికే యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల మద్దతు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, జేఏసీ నాయకులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి అస్పష్టమైన జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వం అమలు చేసిన రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో 45 శాతం మార్కులు ఇచ్చి రెగ్యులర్ చేయాలి. -ఆర్.మనోజ్‌కుమార్‌రెడ్డి, కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ సూర్యాపేట పీఆర్సీ అమలు చేయాలి గత ప్రçభుత్వాలు అమలు చేసిన విధంగానే రెండో ఏఎన్ఎంలకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -మద్దిరెడ్డి భవాని, రెండో ఏఎన్ఎం, కోదాడ -
గాడితప్పుతున్న ఆరోగ్యశ్రీ!
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ గాడితప్పుతోంది. పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేకపోవడం, ఇతర సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కలసి పలువురు అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి పరిశీలనలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైద్య శాఖ పనితీరు, కేంద్ర పథకాల అమలును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించి వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇన్చార్జి సీఈవో కె.మనోహర్ ఇచ్చిన నివేదికపై ప్రీతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్టు సీఈవో చెప్పగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో లోపాలు సరిదిద్దాలని సూచించారు. -
వెయిటేజీ మార్కులపై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖ, ట్రాన్స్‌కోల్లో ఔట్సోర్సింగ్(పొరుగు సేవలు), కాంట్రాక్టు (ఒప్పంద సేవలు) పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలను నిలుపుదల చేయడంవల్ల ప్రయోజనం ఉండబోదని, ఈ దశలో స్టే మంజూరు అవసరం లేదని సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. మరో సింగిల్ జడ్జి.. పరీక్షలో సమాన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అందుకు విరుద్ధమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఈ వివాదం ధర్మాస నం ముందుకు వచ్చింది. ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతుల్లో సేవలందించే వారికి వెయి టేజీ ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం విచా రిస్తూ.. ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ ఒకే తరహా పశ్నపత్రం ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నందున ఈ కేసులను వీలైనంత త్వర గా విచారణ జరుపుతామని ప్రకటించింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేసేవారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. దీనిపై అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే పరీక్షలు జరిపేసి అర్హుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేర్చేసుకోవడం లేదు కాబట్టి పరీక్షల్ని వాయి దా వేయాల్సిన అవసరం లేదన్నారు. వాదనల అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. -
ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే.. మీకెందుకు జీతాలు?
శ్రీకాకుళం, అరసవల్లి: ‘‘సార్ జిల్లాలో సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు ఎక్కువ. గర్భం దశను కూడా కొంతమంది బయటకు చెప్పరు. ♦ డెలివరీలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రారు.. వస్తున్నవారు ముహూర్తాలంటూ సిజేరియన్ చేయమంటుంటారు. ♦ చాలా మండలాలు ఒడిశా బోర్టర్‌లో ఉన్నాయి సార్.. ఇక్కడ ఇలాంటి సంప్రదాయ పరిస్థితులతో ఇబ్బందులు తప్పడం లేదు.. ♦ చాలా పీహెచ్‌సీల్లో స్టాప్ లేరు...ఓపీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రుల కు వెళ్లిపోతున్నారు’’ గురువారం జిల్లా పరిషత్ సమావే శ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షను నిర్వహిం చిన జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డికి హాజరైన వైద్యులు, అధికారులు దాదాపుగా చెప్పిన సమాధానాలివి..! ఏ విభాగంలో ప్రగతి అంశాన్ని అడిగినా, వైద్యుల నుంచి ఇవే సమాధానాలు వస్తుండడంతో కలెక్టర్‌కు కోపమోచ్చింది. ‘‘ ఎందుకిలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు?. 20 ఏళ్ల నాటి పాత కారణాలు పదేపదే చెబుతుంటే వినడానికి నేను సిద్ధంగా లేను.. వెనుకబడిన జిల్లా కాబట్టే ఇన్ని గంటలపాటు సమీక్షలు చేయాల్సి వస్తోంది..అయినా మీరు పనిచేస్తున్న ప్రాంతాల ప్రజల్లో మార్పులు తేలేకపోతే మీకెందుకు జీతాలు..? ప్రజలు మారడం లేదా...లేదా మీరు హ్యాపీగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారా..! ఎందరు గ్రామాల్లో ఉన్నారో..ఇంకెందరు పట్టణాల్లో ఉన్నారో ..నాకు తెలియదనుకున్నారా...! అంటూ కలెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశం సీరియస్‌గా మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై నమ్మకం పెరగాలి గ్రామీణ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించా లని కలెక్టర్ వైద్యులకు సూచించారు. 24 గంటల ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న వైద్యయేతర పోస్టులను ఈ నెల 20వ తేదీలోగా అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావును ఆదేశించా రు. ఇటీవల తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో 238 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశానని.. అయితే అక్కడ అమ్మాయిలకు చూపు సామర్ధ్యం –6, –4 కూడా ఉండడం బాధించిందన్నారు. ఇక మీదట జిల్లాలో విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు చేయాలని, అవసరమైతే చికిత్సలు కచ్చితంగా జరగాలన్నారు. ఈ ప్రక్రియను వైద్యులు ఉద్యమంలా చేయాలని.. ఇందుకోసం రూ.50 లక్షలైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌పై అనుమానాలు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల వినియోగంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కలెక్టర్ అన్నా రు. జిల్లాలో 2016–17లో 20 వేలకు పైగా డెలివరీలు అయితే 11,205 మంది మాత్రమే ఈ వాహన సేవలను వినియోగిచుకున్నారన్నారు. అలాగే 2017–18లో డెలివరీలు 16,082 కాగా, వాహనాలను విని యోగించుకున్నవారు కేవలం 9,785 మంది మాత్రమే నమోదయ్యావన్నారు. ఓడీఎఫ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించాలి జిల్లాను ఈ ఏడాది మార్చి 31 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఉద్యమంగా పనిచేస్తున్నామని, ఇందులో ప్రతి వైద్యుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. మీ వద్దకు వచ్చే రోగులతో అదనంగా రెండు నిమిషాలు మాట్లాడి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉపాధ్యాయుడు, వైద్యుడికి చాలా గౌరవం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్దానంలోని 8 మండలాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కోరారు. కిడ్నీ వ్యాధుల నిర్ధారణకు కొందరు సోషల్ సిగ్మాతో వెనకంజ వేస్తున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వైద్యం కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో వైద్య పరీక్షలు అందరికీ జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేయగలదని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఏజెన్సీలో రక్తహీనత (హెచ్‌బీ) 11కి మించి పెరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు తగ్గ సూచనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనితీరుపై అసంతృప్తి పీహెచ్సీలో ఆంటీనాటల్ చెకింగ్ (ఏఎన్సీ), ఎర్లీ ఆంటీనాటల్ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని తాడివలస, గోవిందపురం, బూరాడ, బొరివంక, తొగరాం, సారవకోట, కొర్లాం, కంచిలి, వెంకటాపురం, బూరగాం, కె.సైరిగాం, దండుగోపాలపురం, కింతలి తదితర సీహెచ్‌సీల్లో పనితీరు, ప్రగతి రిపోర్టులు బాగాలేవని, దీనిపై వైద్యుల నుంచి వచ్చిన సమాధానాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు డాక్టర్లుగా ఉన్నచోట కూడా డెలివరీలు జరగకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాత్రమే మేం మాట్లాడతాం..బయట వారిని ఏఎన్ఎంలు చూసుకుంటారులే అని వైద్యులు భావిస్తే సహించనని హెచ్చరించారు. మీరంతా అసలు ఆస్పత్రుల్లో ఉంటున్నారా? ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్‌సీల్లో వెంటనే విచారణ చేపట్టి, వైద్యులు చెబుతున్న కారణాలు నిజమో కాదో నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావు కలెక్టర్ ఆదేశించారు. నిజంగా మీకు గుర్తింపు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాలని, ఇక ఇలాంటి కారణాలు, నిర్లక్ష్యం మళ్లీ కనిపిస్తే చర్యలు తప్పవన్నా రు. సమావేశం అనంతరం ఐసీడీఎస్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఈ రెండు శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉందని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బొడ్డేపల్లి సూర్యారావు, డీఐవో బగాది జగన్నాథరా వు, అడిషినల్ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, వై.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, పీవో పక్కి చంద్రకళ, నోడల్ అధికారిణి సీహెచ్. ఝాన్సీ, మాస్ మీడియా ప్రచార అధికారి పాలవలస విశ్వనాథం పాల్గొన్నారు. -
ఆయన మిస్సింగ్.. ఓ మిస్టరీ.!
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)లో జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేసిన ఈగ ఉమామహేశ్వరరెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీన కర్నూలుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఐదు నెలలు దాటినప్పటికీ ఆయనకు సంబంధించిన కనీస సమాచారం కూడా లభించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు కడపకు వచ్చి ఆయన బంధువులను విచారించి వెళ్లారు. తాజాగా మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కర్నూలు నుంచి పోలీసులు వచ్చారు. కొంతమంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి వెళ్లారు. ‘మిస్సింగ్’ వివరాలు ఇలా... కడప నగరం ఎన్జీఓ కాలనీకి చెందిన ఉమామహేశ్వర్‌రెడ్డి వయస్సు 48 సంవత్సరాలు. ఆయన ఇక్కడి డీఎంహెచ్ఓలో ఎస్ఓగా దీర్ఘకాలికంగా పనిచేశారు. ఆయనకు భార్య అనసూయ. ఒక కుమారుడు శివసాయిరెడ్డి ఉన్నారు. ఇతనికి మెడిసిన్‌లో విశాఖపట్నంలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా ఉమామహేశ్వర్‌రెడ్డి మంచి అధికారిగా గుర్తింపు పొందారు. గత జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలులోని హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అయితే ఆయన సేవలు ఇక్కడ కీలకమైనందున నాటి డీఎంహెచ్ఓ రామిరెడ్డి ప్రభుత్వ అనుమతితో ఆయనను ఇక్కడే డిప్యుటేషన్‌పై విధులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన డిప్యుటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో గత ఆగస్టు నెల 30వ తేదీన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఎస్ఓగా బదిలీ అయ్యారు. 14న సాయంత్రం 7.30కి చివరి ఫోన్ కాల్... బంధువుల సమాచారం మేరకు ఉమామహేశ్వర్‌రెడ్డి కర్నూల్లోని తన కార్యాలయం (మెడికల్ కాలేజీకి)కు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జీలో బసచేశారు. సెప్టెంబర్ 14వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు లాడ్జి నుంచి కిందకు వచ్చారు. ఈ సన్నివేశాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు తెలుపు షర్టు, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడు. అనంతరం ఆయన 6.30 గంటలకు తన ఆఫీసు (డీఎంహెచ్ఓ) నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఆయన లాడ్డీకి వెళ్లలేదు. అనంతరం 7.30 గంటలకు ఆఫీస్‌లోని రవి అనే ఉద్యోగికి ఫోన్ చేశాడు. అదే చివరి ఫోన్ కాల్. అనంతరం అతని దగ్గర ఉన్న నాలుగు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్‌లోనే ఉన్నాయి. 15వ తేదీన తెలిసిన విషయం... 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్నూలులోని ఆఫీసు ఉద్యోగి వసంతరెడ్డి కడపలోని ఆఫీసులో ఉమామహేశ్వరరెడ్డి వద్ద పనిచేస్తున్న బాషాకు ఫోన్ చేశారు. ఉమామహేశ్వరరెడ్డి డ్యూటీకి రాలేదని చెప్పారు. దీంతో బాషా ఆ విషయాన్ని ఆయన భార్య అనసూయకు ఫోన్ చేసి తెలిపాడు. అప్పుడు అనసూయ తన భర్త సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ఆమె కర్నూలు డీఎంహెచ్ఓకు ఫోన్ చేయగా ఆయన కూడా ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఆయన బంధువులు కర్నూలు వెళ్లి అక్కడ 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. మూడు బృందాలు ఏర్పాటు... ఉమామహేశ్వర్‌రెడ్డి బంధులు, కర్నూలు జిల్లా పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతాల్లో వెతికారు. ఇంతవరకు స్పష్టంగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే అతను మంత్రాలయం, కోడుమూరు ప్రాంతాల్లో కనిపించినట్లుగా అక్కడ బస చేయడంతో పాటు హోటళ్లలో టిఫిన్ చేశారని ఆయా ప్రాంతాల్లోనివారు కొంతమంది చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరెడ్డి చేతికి ఉన్న వేళ్ల వ్యత్యాసాన్ని పలువురు ప్రశ్నించినట్లుగా తెలిసింది. అయితే ఈ అంశాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ ఆచూకీ కోసం మూడు బృందాలను నియమించినట్లుగా సమాచారం. ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆయన బంధువులు తెలిపారు. గతంలో ఆయన భార్య అనసూయ ‘సాక్షి’తో మాట్లాడారు. మా ఆయన కర్నూలుకు బదిలీ అయ్యాక చాలా డల్‌గా కని పించాడు. అంతేగాక ఆయనకు అప్పుడు కామెర్లు కూడా ఉన్నాయి. బీపీ ఉంది. అక్కడ భోజనం బాగాలేదని, వాతావరణం సరిగా లేదని చెప్పేవాడు. తనను కూడా అక్కడికి తీసుకుపోవడానికి సరైన ఇల్లు కోసం చూస్తున్నట్లుగా చెప్పాడు. ఇంతలోనే ఇలా అయింది. ఆయనకు ఎవరితోనూ గొడవలు, ఎలాంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవు. అయితే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు అని తెలిపారు. మొత్తానికి ఉమామహేశ్వరరెడ్డి మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
‘గాంధీ’లో నవ శకం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కార్పొరేట్ హంగులు సంతరించుకున్న గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక అవయవ మార్పిడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆస్పత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి, ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తే గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కాంక్లీయర్ ఇంప్లాంటేషన్స్, మోకాలి చిప్పల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ సాంకేతిక బృందం ఇటీవల ఆస్పత్రిని సందర్శించింది. రూ.20 కోట్లతో ఆరు థియేటర్లు మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, జన్యుపర లోపాల వల్ల చాలామంది చిన్నతనంలోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, మోకీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి, మూగ, వినికిడి లోపంతో జన్మించడం, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ చికిత్సలు అందడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చాలా ఖరీదుతో కూడినవి కావడంతో ఆ స్తోమత లేని పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ భవనం ఎనిమిదో అంతస్థులో రూ.20 కోట్లతో ఆరు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు కు నిర్ణయించింది. గాంధీలోనే ఎందుకంటే.. అవయవ మార్పిడి చికిత్స కోసం నిమ్స్ జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 4,503 మంది దరఖాస్తు చేసుకో గా, వీరి లో 2,403 మంది కిడ్నీ బాధితులు, 2,012 మం ది కాలేయ బాధితులు ఉన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు 723 కిడ్నీ, 423 కాలేయం, 63 గుండె, 166 హార్ట్వాల్వస్, 391 కార్నియాలు, 8 ఊపిరితితుత్తలు, ఎనిమిది ప్రాంకీయాస్ మార్పి డి చికిత్సలు చేశారు. 250పైగా కాంక్లీయర్ ఇంప్లాం ట్స్ సర్జరీలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రిల్లో గుండె, కాలేయ మార్పిడి చేయించుకో వాలంటే రూ.25 లక్షలకుపైగా ఖర్చు చేయాలి. సాధారణ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకే రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యనిపుణులకు లోటు లేదు. దీంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి.. రోగులకు పైసా ఖర్చు లేకుండానే ఖరీదైన వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావించింది. -
బీబీనగర్‌లో నిమ్సే
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరు కాదని తేలడంతో బీబీనగర్‌లోని క్యాంపస్‌ను రాష్ట్ర స్థాయి ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వైద్య సేవల సంస్థగా పేరొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) బీబీనగర్ క్యాంపస్‌పై కదలిక వస్తోంది. వైద్యసేవల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్‌లోని నిమ్స్ విశ్వవిద్యాలయం క్యాంపస్ పూర్తి స్థాయి కార్యకలాపాల నిర్వహణకు కొత్తగా 873 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు గత నెల 28న కొత్తగా పోస్టులను మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన పోస్టులు కావడంతో ఏ విధానంలో భర్తీ చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుసరించే ప్రక్రియపై అనుమతికోసం వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీబీనగర్ నిమ్స్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులలో 248 బోధన సిబ్బంది కేటగిరీవి ఉన్నాయి. మరో 625 బోధనేతర (వైద్య సహాయక, పరిపాలన, సాంకేతిక) పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ తరహాలోనే నిమ్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని వైద్య శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రతిపాదనల ప్రకారం బోధన సిబ్బంది పోస్టులను నిమ్స్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. నిమ్స్ ఉన్నతస్థాయి కమిటీ బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుడు, నిమ్స్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో ఉన్నతాధికారి ఈ కమిటీలో ఉంటారు. మొత్తం బోధన సిబ్బంది పోస్టులను మెరిట్ ఆధారంగా ఈ కమిటీ భర్తీ చేస్తుంది. జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో... బీబీనగర్ నిమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మొత్తం 873 పోస్టులు 58 కేటగిరీలో ఉన్నాయి. వీటిని మినహాయించి 50 కేటగిరీలోని 625 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
సర్కార్ ఆస్పత్రుల్లో పడకల పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు. వరంగల్ ఎంజీఎంలో 1,500, నిలోఫర్‌లో 1,000 చొప్పున పడకలను పెంచేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పడకల పెంపు పనులు జరగనున్నాయి. మారుతున్న జీవనశైలి, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2016–17లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 4.60 కోట్ల మంది రోగులు వచ్చారు. వీరిలో ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ప్రతి ఏటా 20 శాతం వరకు పెరుగుతోంది. ముఖ్యమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులకు ప్రతి ఏటా 70 లక్షల మంది రోగులు వస్తున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య వసతులు ఉండటంలేదు. ఈ పరిస్థితులను మార్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల పెంపు... ఆస్పత్రి ప్రస్తుతం పెంచేవి ఉస్మానియా 1,168 2,000 గాంధీ 1,012 2,000 ఎంజీఎం 1,000 1,500 నిలోఫర్ 500 1,000 పేట్ల బురుజు 462 750 సుల్తాన్‌బజార్ 160 400 ఆదిలాబాద్ రిమ్స్ 500 650 హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి 100 200 -
వైద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన సడలింపు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయ పూల్‌లోకి చేరేందుకు అడ్డంకిగా ఉన్న 371డి నిబంధనను కేంద్రం సడలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీని వల్ల ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు కూడా వచ్చే ఏడాది నుంచి జాతీయ పూల్ పరిధిలోకి వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో చేరడం వల్ల ఎక్కువ ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లుండగా, రాష్ట్రంలో 1,900 సీట్లు ఉన్నాయని, 15% చొప్పున మనం 285 సీట్లు ఇస్తే 4,482 సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 13,872 పీజీ వైద్య సీట్లున్నాయని, మన రాష్ట్రంలో 660 సీట్లుండగా, 50 శాతం లెక్కన 330 సీట్లు ఇస్తే 7,236 సీట్లలో పోటీ పడవచ్చన్నారు. -
మర్యాదగా కోచింగ్‌లో చేరండి
సాక్షి, అమరావతి: ‘ఇలాగైతే మీకు నీట్లో సీట్లు రావు, గీట్లు రావు.. మర్యాదగా కోచింగ్‌లో చేరి చదువుకోండి’ అంటూ ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులకు సీఎం పేషీ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఓవైపు ఫాతిమా కాలేజీ వ్యవహారమై ఎంసీఐతో చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డా.బాబ్జీ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చర్చలు జరుగుతుండగానే సీఎం పేషీకి చెందిన కొందరు అధికారులు ఫాతిమా విద్యార్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మర్యాదగా నీట్ కోసం కోచింగ్‌లో చేరండి. లేదంటే మీ కెరీర్ పాడవుతుంది’ అని బెదిరింపులకు దిగుతున్నారని బాధిత విద్యార్థులు వాపోయారు. మరోవైపు ఫాతిమా కాలేజీ యాజమాన్యం కూడా తమకు ఫోన్లు చేసి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు వాపోయారు. -
బతకాలని ఉంది.. ప్రాణభిక్ష పెట్టండి..
హైదరాబాద్: ‘నాకు బతకాలని ఉంది. వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టండి..’ఎంజైమ్ లోపం కారణంగా అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ యువతి ఆక్రందన ఇదీ. తనకు జీవించే హక్కు ఉందని, సరైన వైద్యం అందించడం లేదంటూ ఐదు నెలల క్రితం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనికి స్పందించిన న్యాయస్థానం తక్షణమే ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ బాధిత యువతికి సమాచారం అందించడంతో ఆమె గురువారం ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆమె వైద్యానికి ఏడాదికి రూ.3.25 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. అయితే ఈ స్థాయిలో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఆస్పత్రి యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జన్యులోపంతో జీవన్మరణ పోరాటం.. నగరంలోని హస్తినాపురానికి చెందిన శ్రీనివాస్, విజయ దంపతుల కుమార్తె మంగిన నాగసాయి రమ్యశ్రీ(19) పుట్టుకతోనే మ్యూకోపొలి శాకరిడోసిస్–6(ఎంపీఎస్–6) అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న రమ్య వయసు పెరుగు తున్న కొద్దీ శరీరంలోని అవయవాల్లో ఎదుగుదల లేదు. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నిర్థారణ జరగలేదు. దీంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని సెంట్రల్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి ఆమె శరీరంలో నాగల్‌జైమో అనే ఎంజైమ్ లోపం ఉందని, దీంతో శరీరంలోని అవయవాలు క్రమంగా బలహీనపడి మృత్యువుకు చేరువవుతుందని నిర్థారించారు. ఈ ఎంజైమ్‌ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించాలని, దీనిని అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించాలని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ రకమైన ఎంజైమ్ రీప్లేస్మెంట్ చికిత్సకు ఏడాదికి రూ.3.25 కోట్ల్ల వ్యయం అవుతుందన్నారు. వైద్య సేవలు అందిస్తున్నాం:గాంధీ సూపరింటెండెంట్ హైకోర్టుతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమ్యశ్రీని అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. వైద్యానికయ్యే ఖర్చు విషయమై అధికారుల ఆదేశాల మేరకు తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నాగల్‌జైమో ఇంజెక్షన్ డేంజర్: నిపుణుల కమిటీ అమెరికాలో తయారయ్యే నాగల్‌జైమో ఇంజెక్షన్ ప్రాణాంతకమని, ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులే చేయాలని నిపుణుల కమిటీ తీర్మానించినట్లు తెలిసింది. రమ్యశ్రీ వైద్యానికి సంబంధించి పది మంది వైద్యనిపుణులతో కమిటీని ఏర్పాటు చేయగా, గురువారం సాయంత్రం కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించి నివేదిక రూపొందించారు. నాగల్‌జైమో ఇంజెక్షన్‌ను ఇక్కడకు తెప్పించేందుకు అవసరమైన లైసెన్స్ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇవ్వలేదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఇంజెక్షన్ వలన చాలా సైడ్ఎఫెక్ట్స్ ఉన్నట్లు, ఎంజైమ్ వినియోగించవద్దని యూరోపియన్ డ్రగ్ కమిటీ రూపొందించిన పత్రాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రమ్యశ్రీకి నాడీమండల వ్యవస్థ మూసుకుపోతోందని, ఈ సమయంలో నాగల్‌జైమో ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీపై ఇక్కడి వైద్యులకు అవగాహన లేదని, అనుభవలేమితో వైద్యం అందించి యువతి ప్రాణాలను పణంగా పెట్టలేమని తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. సదరు నివేదికను శుక్రవారం హైకోర్టుకు సమర్పించేందుకు వైద్యశాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. అమెరికా వెళ్లి చదువుకుంటా..: రమ్యశ్రీ ప్రస్తుతం తాను ఇందిరాగాంధీ నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు రమ్యశ్రీ తెలిపింది. మనదేశంలో సరైన వైద్యం అందకుంటే తనకు మెడికల్ వీసాపై అమెరికా పంపిస్తే అక్కడ వైద్యం చేయించుకుంటూ ఉన్నతవిద్య అభ్యసిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెపుతోంది. ప్రధాని మోదీని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని ప్రధానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించింది. -
వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 13,496 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో 5,766 నర్సుల పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా సభకొచ్చా: శ్రీనివాస్‌గౌడ్ తన తండ్రికి ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతోందని, అయినా గీత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు సభకు వచ్చానని, తనకు అదనపు సమయం కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పీకర్ మధుసూదనాచారికి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. తాటి, ఈత చెట్లపై దళారీల పెత్తనం పెరుగుతోందన్నారు. బార్లు, రెస్టారెంట్ల లైసెన్సుల్లో గీత కార్మిక యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పద్మారావు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.69 కోట్లకు పైగా ఈత చెట్లు నాటామని, వాటిని సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కల్లును ఔషధంగానే చూస్తున్నామని, దాని వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే భావన ఉందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించే గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. -
133 ఆరోగ్యశ్రీ చికిత్సలు.. మళ్లీ ప్రైవేటు వైద్య కాలేజీలకు!
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్య రక్షణ, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు ప్రతిపాదనలు చేసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే వైద్యం అందించే 133 రకాల చికిత్సలను రాష్ట్రంలోని మొత్తం 15 ప్రైవేటు వైద్య కాలేజీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు మళ్లీ పాత పరిస్థితి వస్తుందని వైద్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలనే లక్ష్యంతో 2008లో ఆరోగ్యశ్రీ పథకం మొదలైంది. ఈ పథకం కింద ప్రస్తుతం 942 రకాల చికిత్సలు అందిస్తున్నారు. మొదట్లో అన్ని చికిత్సలను అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేశాయి. అవసరం లేకున్నా గర్భాశయాలను తొలగించడంతోపాటు థైరాయిడ్, అపెండిక్స్, మొర్రి, ఫిస్టులా, హెర్నియా వంటి సమస్యల పేరుతో భారీగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి. దీనివల్ల చికిత్సల కోసం వచ్చిన పేదల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థికంగా అనవసర భారం పడింది. ఈ అంశాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 133 రకాల చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగిస్తూ 2012లో నిర్ణయం తీసుకుంది. ఈ చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. దీంతో అవసరమైన వారికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ 133 చికిత్సలు నిర్వహణతో ఆరోగ్యశ్రీ నిధులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం అవుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది. మళ్లీ అదే తీరు... ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం తమకు రద్దు చేసిన 133 రకాల చికిత్సలను ఎలాగైనా పొందేందుకు ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చికిత్సల నిర్వహణ బోధించాలనే కారణంతో ప్రైవేటు వైద్య కాలేజీలకు రద్దు చేసిన 133 చికిత్సలను తిరిగి వర్తింపజేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్టును కోరాయి. ఐదేళ్లుగా అవసరంలేదని భావించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అంగీకరించారు. అనంతరం ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం దీనికి అనుమతిస్తే ప్రస్తుతం 133 చికిత్సలను నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ నుంచి నిధులు పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా ప్రైవేటు వైద్య కాలేజీలూ ఆ చికిత్సలను అందిస్తాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు తగ్గి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభావం పడనుంది. -
మరో ఉద్దానం.. చింతలూరు!
రాయికల్: ఇవి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామస్తులు పరిస్థితి ఉదాహరణలు మాత్రమే. పేరులో ‘చింత’మాదిరిగానే ఆ ఊరిలోని ప్రతి ఇంటా రోగాలు ‘చింత’పెడుతున్నాయి. పరిస్థితి విషమిస్తే మరో ‘ఉద్దానం’అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో 280 మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మరో 40మంది టీబీ, 20 మందికిపైగా మంది ఎముకల బలహీనత వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్నారు. చాలామంది వృద్ధులు ఎముకల బలహీనతతో మంచానపడ్డారు. యువకుల్లో సైతం శరీరంలో ఎముకల అరిగిపోవడం శాపంగా మారింది. వెయ్యి మంది జనాభా.. 280 ఇళ్లు ఉన్న ఈ పల్లెలో ఇంటికొకరి చొప్పున కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మట్లగాజం నాగయ్య, ఎండ్లగట్ట పోచయ్య టీబీ వ్యాధితో మృతిచెందారు. వైద్య చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఎందరో మంచానికే పరిమితమయ్యారు. నీటిలో క్యాల్షియం ఎక్కువ.. గ్రామస్తులు తాగే నీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతోపాటు తగిన మోతా దులో నీరు తాగకపోవడంతో ఈ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు సైతం సరిగా వైద్యం అందించకపోవడంతో ఒకరినుంచి మరొకరికి సోకి మృతి చెందుతున్నారని గ్రామంలో ఆందోళన నెలకొంది. చలనం లేని వైద్యారోగ్యశాఖ.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పట్టిపీడిస్తున్నా ఈ వ్యాధుల గురించి వైద్యాధికారులకు తెలియకపో వడం గమనార్హం. వ్యాధుల విజృంభణకు కారణం తెలుసుకోవడంలో విఫలమయ్యారు. వెలుగు చూసిందిలా.. ఒడ్డెర కాలనీకి చెందిన వారు అనారోగ్యం బారిన పడటమే కాకుండా, రెండేళ్లలో ఏడు గురు చనిపోయారు. అయితే, అనారోగ్యాలకు.. చావులకు మంత్రాలే కారణమని కాలనీవాసులు నమ్మారు. ‘సాక్షి’గ్రామస్తులతో మాట్లాడగా కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. జిల్లా వైద్యాధికారిణి సుగంధిని వివరణ కోరగా మంచినీళ్లు తాగక పోవడం, ఆహారం లోపంతో ఇలాంటి సంభవిస్తాయని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఎక్కువ గ్రామంలో కిడ్నీలో రాళ్లవంటి వ్యా« దులతో చాలా మంది బాధపడుతున్నాం. అసలు ఈ వ్యా« ది ఎలా వస్తుందో అర్థమయితలేదు. గతంలో ఆపరేషన్‌కు నాకు రూ. 40 వేలు ఖర్చు అయ్యాయి. వైద్యంకోసం భూమి అమ్ముకున్న. టీబీ, ఎముకల అరుగుదల వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. –సబ్బినేని రాజం, గ్రామస్తుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా గ్రామంలో చాలా మంది కిడ్నీలో రాళ్లవంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేసుకుంటున్నా నొప్పి పదేపదే రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా సమస్య ఎవరు పట్టించుకోవడంలేదు. –అనుపురం శ్రీనివాస్‌గౌడ్ -
ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ కిట్స్ పథకం ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దాంతోపాటే ప్రభుత్వ వైద్యులపై గౌరవం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్య, ఆరోగ్య శాఖ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్య శాఖకు ప్రభుత్వం అవసరమైన చేయూత అందిస్తుందని ప్రకటించారు. రాబోయే కాలంలో తెలంగాణలో ప్రజా వైద్యం ఎలా ఉండాలనే విషయంలో అధికారులు హెల్త్ మ్యాప్ రూపొందించాలని కోరారు. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై ఆయన సంతకం చేశారు. శనివారం ప్రగతి భవన్లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిభారం పెరిగింది. పీహెచ్సీ నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ప్రతీ చోటా గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది. అధిక సంఖ్యలో గర్భిణులు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలా మంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారి సేవలు శ్లాఘనీయం. ప్రజలు వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మారింది. వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి’’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనవసర ఆపరేషన్ల గండం తప్పింది.. ‘‘కేసీఆర్ కిట్స్ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నాయి. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకే రావ డం వల్ల అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడంవల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫలితంగా ఆరోగ్యవంతమైన మరో తరం వస్తున్నది. పేదలకు ప్రసూతి సందర్భంగా అయ్యే ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి ప్రభుత్వమే రూ.15వేల దాకా ప్రోత్సాహకం అందిస్తున్నది. పేదలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గర్భిణుల రద్దీకి తగినట్లుగా వసతులు కూడా పెంచాలి. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి’’అని సీఎం సూచించారు. వైద్య శాఖ చర్యలతో రోగాలు తగ్గాయి.. ‘‘ఆదిలాబాద్‌తో పాటు ఇతర ఏజెన్సీలలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి అనేక మంది చనిపోయేవారు. కానీ ఈసారి వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అంటు వ్యాధులు, జ్వరాలు బాగా తగ్గాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు వచ్చినా తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉంది. ఇది వైద్యుల పనితీరుకు నిదర్శనం’’అని సీఎం ప్రశంసించారు. ఈ సమీక్షలో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్‌రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ లలితకుమారి, మెడికల్ సర్వీసెస్ ఎండీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు... ♦ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచే అవకాశాలు పరిశీలించాలి. ♦ ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటతో పాటు కొత్తగా ఏర్పడే నల్లగొండ, సూర్యాపేటలోని సెమీ అటానమస్ హోదా కలిగిన మెడికల్ కాలేజీల్లో బోధన డాక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ♦ నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో మెడికల్ కాలేజీల స్థాపనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో వసతులు కల్పించాలి. ♦ అర్హులైన వైద్యులకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦ ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు స్థానికంగానే ఉండాలనే నిబంధనను సడలించాలి. వారు సమీప పట్టణాల్లో ఉండేందుకు అనుమతించాలి. ♦ శిథిలమైన ఆసుపత్రి భవనాల స్థానంలో దశల వారీగా కొత్త భవనాలు నిర్మించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలి. ♦ ఆసుపత్రి భవనంతో పాటు డాక్టర్లు, సిబ్బంది నివాసం ఉండటానికి క్వార్టర్లు కూడా నిర్మించాలి. ♦ పెద్దాసుపత్రుల వద్ద రోగుల బంధువుల కోసం షెల్టర్లు నిర్మించాలి. వాటిలో కనీస వసతులు కల్పించాలి. ♦ నిమ్స్ తరహాలో హైదరాబాద్ ఓఆర్ఆర్ వెంట మరో రెండు పెద్దాసుపత్రులు నిర్మించాలి. వరంగల్ దారిలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ వస్తున్నందున, అటువైపు కాకుండా మిగతా రెండు ప్రాంతాల్లో వీటి కోసం స్థలం సేకరించాలి. ♦ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలను అధ్యయనం చేసి, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను నిలబెట్టాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. చికిత్స చేయా ల్సిన ప్రదేశాలే.. తగిన భద్రతా ప్రమాణాలు పాటించక తుదిశ్వాసకు కేంద్రాలుగా మారు తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల కాసుల కక్కుర్తి కూడా ఈ దుస్థితికి కారణామని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రి ఘటనతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీస స్పందనా లేదేం? రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వపరంగా పర్యవేక్షణ కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. రోహిణి ఆస్పత్రి ప్రమాదంలో ఇద్దరు చనిపోయినా వైద్యారోగ్య శాఖలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు రోహిణి ఆస్పత్రి ప్రమాదం నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎలా ంటి చర్యలు తీసుకోబో తున్నారనేది ఆ శాఖలో ఉత్కంఠ కలిగించింది. కానీ ఉన్నతాధి కారులు మాత్రం ఏమీ జరగనట్లు గానే వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై జిల్లా అధికారుల ను ంచి కనీసం ఆరా కూడా తీయలేదని తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉన్న రోహిణిలో ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారులే చెబుతున్నారు. అయితే ఘటనకు కారణాలను తెలుసుకుని విశ్లేషించే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలను ప్రారంభించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికారుల ‘భాగస్వామ్యం’తోనే.. రోహిణి ఆస్పత్రి దుర్ఘటనపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రోహిణి ఆస్పత్రి యాజమాన్యంలో ఓ ఉన్నతాధికారికి భాగస్వామ్యం ఉండడమే చర్యలపై వెనుకంజకు కారణమని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన రోహిణి ఆస్పత్రి సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా. దీంతో అధికారులు ఆస్పత్రిపై చర్యల విషయంలో వెనుకంజ వేస్తున్నా రనే చర్చ జరుగుతోంది. అసలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండడమే రక్షణ చర్యల విషయంలో లోపాలకు కారణామని వైద్య వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అనుమతులు అక్కర్లేదా..? రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి 6,964 వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆస్పత్రులు 537 ఉన్నాయి. ఇలాంటివాటిలో చాలా ఆస్పత్రులు వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యుల భాగస్వామ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణకు ప్రధానంగా 15 శాఖల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ వైద్యశాఖ అధికారుల ‘చల్లని చూపు’ కారణంగా చాలా వరకు అనుమతులు లేకుండానే ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ‘‘వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు భాగస్వాములుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతుల విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా వెంటనే అనుమతులు ఇస్తున్నారు. ఇదే రోగుల భద్రతకు ఇబ్బందిగా మారుతోంది..’’ అని వైద్యారోగ్య శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
టైమ్‌కు రావాలి.. తెల్లకోటు ధరించాలి
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సహాయ సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సిం దేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ సమయాల్లో కచ్చితంగా ఆస్పత్రిలో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను సందర్శించిన సందర్భాల్లో.. ఎక్కువ మంది వైద్యులు, పారామెడికల్, సహాయ సిబ్బంది యూనిఫామ్ లేకుండా వస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సహాయ సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయానికి వచ్చి చివరి పేషెం టును పరిశీలించే వరకు వెళ్లొద్దని పేర్కొన్నారు. వైద్యులు తెల్లకోటు (ఆప్రాన్) ధరించాలని, పారామెడికల్ సిబ్బంది వారి యూనిఫాం వేసుకోవాలని స్పష్టం చేశారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు సైతం యూనిఫాం విషయంలో నిబంధన లు పాటించాలని సూచించారు. పారిశుధ్య పనులు నిర్వహించే సిబ్బంది సైతం యూనిఫాం ధరించాలని ఆదేశించారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘కేసీఆర్ కిట్’ సిబ్బందికి జీతాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ కిట్’ పథకం విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఇలాంటి కీలకమైన పథకం అమలు కోసం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మాత్రం వేతనాలు రావడం లేదు. కేసీఆర్ కిట్ ఉత్తమ పరిపాలన కేటగిరీలో అందించే అవార్డుకు సైతం ఎంపికైంది. కేసీఆర్ కిట్ అమలు బాధ్యతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టింది. వైద్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని, రాష్ట్ర కార్యాలయంలో మరో ఐదుగురు, ప్రతి జిల్లాలో ఒకరు చొ ప్పున సిబ్బందిని నియమించారు. ఈ పథ కం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అధి కారి సహా మిగిలిన వారికి వేతనాలు అంద డంలేదు. ఎవరికి ఎంత వేతనం అనేది ఇప్పటికీ ఖరారు కాలేదని తెలుస్తోంది. -
77 లక్షల మందికి ఎంఆర్ టీకా
సాక్షి, హైదరాబాద్: తట్టు(మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 86 శాతం మంది పిల్లలకు టీకాలు వేశారు. ఎంఆర్ టీకా కార్యక్రమం ఆగస్టు 17న మొదలైంది. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 90,01,117 మంది టీకా వేయాల్సిన పిల్లలు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. సెప్టెంబర్ 12 వరకు రాష్ట్రంలోని 77,21,477 మంది పిల్లలకు టీకాలు వేయడం పూర్తయింది. ఈ నెల 25 వరకు ఎంఆర్ టీకా వేసే కార్యక్రమం అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో గ్రేటర్ హైదరాబాద్‌లో తొలుత ఈ కార్యక్రమం సక్రమంగా సాగలేదు. అనంతరం వైద్య శాఖ చేపట్టిన చర్యలతో పురోగతి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 72 శాతం మంది పిల్లలకు ఎంఆర్ టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదిక పేర్కొంది. ఎంఆర్ టీకా అమలులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. -
చల్లని చూపు... 2019లోపు
రాష్ట్రంలో కంటి వ్యాధుల నివారణకు వైద్య శాఖ ప్రణాళిక - వ్యక్తుల వారీగా వివరాల సేకరణ - మొదటి దశలో 10 జిల్లాల్లో అమలు - 550 గ్రామాల్లో వివరాల సేకరణ - మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి సాక్షి, హైదరాబాద్: కంటి చూపు సమస్యల నివారణపై కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2019లోపు రాష్ట్రంలో కంటి చూపు సమస్య ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. ‘అంధత్వ రహిత తెలంగాణ (అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ)’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కంటి వైద్యంలో ప్రఖ్యాతి పొందిన... స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంటి చూపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. ఏటా కంటి చూపు సమస్యలకు గురవుతున్న వారిలో 60 శాతం మంది 12 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. భవిష్యత్తుతరం జీవనానికి ప్రమాదకరంగా మారుతున్న కంటి చూపు సమస్యల నివారణపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కార్నియా సమస్యలతో ఇబ్బందిపడే వారిని గుర్తించి చికిత్స చేయించేలా కార్నియా అంధత్వ్ ముక్తి భారత్ అభియాన్(కాంబా) కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయంలో మరింత విస్తృతంగా ఆలోచించింది. కార్నియా సమస్యతోనే కాకుండా... రెటీనా, గ్లుకోమా, మధుమేహం.. ఇతర సమస్యలతోనూ కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యపరంగా అండగా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని ప్రతి వ్యక్తి కంటి చూపు సమస్యలను తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లోని 550 గ్రామాల్లో వ్యక్తుల వారీగా కంటి చూపు సమస్యలను తెలుసుకుంటారు. వారికి అవసరమైన వైద్య సేవలను వెంటనే అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఆస్పత్రులలో చికిత్స చేయించడం నుంచి ఇది మొదలవుతుంది. సమస్య తీవ్రత ఆధారంగా... ఆయా వ్యక్తులకు జిల్లా స్థాయి ఆస్పత్రులలో, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, ఆనంద్, పుష్యగిరి, శరత్ ఆస్పత్రులలో చికిత్స చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య చికిత్స పథకాలను వీరికి వర్తింపజేయనున్నారు. ఇదే తరహాలో 2018లో మరో 10 జిల్లాల్లో, 2019లో మిగతా 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానంతోనే చూపు... ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు చూపు వస్తుంది. ఏ వయస్సు వారైనా నేత్రదానం చేయవచ్చు. వ్యక్తి చనిపోయిన ఆరు గంటలలోపు కార్నియా సేకరించాలి. శిక్షణ పొందిన వైద్యుడు మాత్రమే కార్నియా సేకరించి తిరిగి అమరుస్తాడు. నేత్ర బ్యాంకు బృందం... మరణించిన వ్యక్తి ఇంటి వద్ద, ఆస్పత్రిలో, మార్చురీ వద్ద, స్మశాన స్థలాల్లోనూ కార్నియాను సేకరిస్తుంది. గరిష్టంగా 15 నిమిషాలలో కార్నియా సేకరించే ప్రక్రియ ముగుస్తుంది. కార్నియా సేకరణతో వ్యక్తి రూపురేఖలు ఏమీ మారవు. కంటిపై పొరను మాత్రమే తొలగిస్తారు. చాలా మంది అపోహపడుతున్నట్లు పూర్తిగా కనుగుడ్డును తీయరు. దేశంలో కార్నియా అవసరమైన వారు 2 లక్షలు ఏటా కార్నియా సమస్యవల్ల అంధత్వానికి గురవుతున్న వారు 20 వేలు 45 ఏళ్లలోపు వారు 90శాతం వీరిలో 12 ఏళ్ల లోపు వారు 60 శాతం మొదటి విడతలో ఏబీఎఫ్‌టీ అమలు చేసే గ్రామాలు జిల్లాల వారీగా.. -
ఐదు నెలలుగా జీతాల్లేవు
307 మంది కాంట్రాక్టు వైద్యుల అవస్థలు సాక్షి, హైదరాబాద్: పేదలకు సేవచేసే కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారి సేవలను రెగ్యులర్ చేయడం ఎలా ఉన్నా.. కనీసం చేస్తున్న పనికి జీతం కూడా ఇవ్వట్లేదు. సర్వీస్ రెగ్యులర్ కావడంపై ఆందోళనతో ఉన్న కాంట్రాక్టు వైద్యులకు 5 నెలలుగా వేతనాలు రాకపోవడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా 307 మంది వైద్యులు కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం 2014 జూలై 1న జారీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల మార్గదర్శ కాల ప్రకారం వీరు పని చేస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు వైద్యులుగా పని చేస్తున్న వీరు సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఆచరణలోకి రావట్లేదు. కాంట్రాక్టు అసిస్టెంట్ సర్జన్ల సర్వీసును ప్రతి ఏటా కొనసాగిస్తేనే వీరికి వేతనాలు అందు తాయి. వీరి కాంట్రాక్టు సర్వీసును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పొడిగించడంలో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 307 మంది కాంట్రాక్టు వైద్యులకు 2017 మొదటి నుంచి వేతనాలు అందట్లేదు. 307 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ల కాంట్రాక్టు సర్వీసును పొడిగిస్తూ జూలై 25న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 31 వరకు వీరి సర్వీసు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులు విడుదలై 2 వారాలైనా ఇప్పటికీ వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో గ్రామీణ పేదలకు అందే వైద్య సహాయంపై ప్రభావం పడుతోంది. -
అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు!
- జాతీయ సగటు 41.6 శాతం.. రాష్ట్రంలో 37 శాతమే - అవగాహనపై వైద్య శాఖ నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: భావితరాలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సమాజమైనా ప్రగతివైపు అడుగులు వేస్తుంది. అయితే నవజాత శిశువుల ఆరోగ్యంలో కీలక పాత్ర అయిన తల్లిపాల విషయంలో మన రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా పుట్టిన గంటలోగా శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నా, ఈ దిశగా ప్రయ త్నాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నా మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో మాత్రం పురోగతి కనిపించడంలేదు. దేశంలో ఏటా 26 కోట్ల మంది పిల్లలు పుడుతుండగా సగటున ప్రతిరోజూ 70 వేల మందికిపైగా మహిళలు ప్రసవిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41.6 శాతం మంది నవజాత శిశువులకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతు న్నాయి. అలాగే 55 శాతం మంది శిశువులు మాత్రమే పుట్టిన ఆరు నెలలపాటు పూర్తి కాలం తల్లిపాలు తాగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 37.1 శాతం మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే కావడంతో మన రాష్ట్రంలో పాత జిల్లాల వారీగానే ఈ గణాంకాలు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం నవజాత శిశువులకు పుట్టిన గంటలోగా తల్లిపాలు తాగించే విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో తల్లిపాల పాత్ర ఎంతో కీలకమైనది. తల్లీపిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య, ఆర్థిక ప్రగతి, వ్యాధుల నివారణలో తల్లిపాల సంస్కృతి పాత్ర ముఖ్యమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చింది. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు అందించడంతోపాటు అదనపు ఆహారం ప్రారంభిం చిన తర్వాత నుంచి రెండు ఏళ్ల వరకు వీలైతే మరికొంత కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల ఆర్యోకరమైన భావితరం తయారవుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 1989 నుంచి తల్లిపాల సంస్కృతిని పెంచే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. దేశం లోనూ ఏటా ఈ వారోత్సవాలు నిర్వ హిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని మరిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా మాతాశిశు సంరక్షణకు ఏటా కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ మాతాశిశు రక్షణలో కీలకమైన తల్లి పాల వారోత్సవాలను మాత్రం పట్టించుకోవడంలేదు. -
'కుని'కిపాట్లు..!
కుటుంబ నియంత్రణ పట్టని వైద్య, ఆరోగ్య శాఖ.. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,500 స్త్రీలకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,000 సాక్షి, హైదరాబాద్: దేశానికి అతి పెద్ద సవాలు.. జనాభా పెరుగుదల. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ (కు.ని.)కోసం పలు చర్యలు చేపట్టారు. అవగాహన, ప్రోత్సాహకాలతో పాటు దీని పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ శాఖ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. గత మూడేళ్లుగా దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. గతంలో ఏటా జిల్లాలవారీగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రణాళిక సిద్ధం చేసి.. ఆయా జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించేది. ప్రస్తుతం లక్ష్యాలను సైతం నిర్దేశించే పరిస్థితి లేకుండాపోయింది. ఎవరైనా సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించడమేగానీ.. శాఖాపరంగా పర్యవేక్షణ ఉండటంలేదు. దీంతో మూడేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లోనే.. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మిగిలిన నిధులతో పోల్చితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాల నిధులను ముందుగానే విడుదల చేస్తోంది. గత ఏడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు, వైద్య సిబ్బందికి కలిపి రూ.1,500, అదే మహిళ అయితే ఆమెకు సిబ్బంది కలిపి అయితే రూ.వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయినా రాష్ట్రంలో శస్త్రచికిత్సలు బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు వైద్య శాఖ తాజా నివేదికలో పేర్కొన్నాయి. పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో మాత్రమే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నమోదయ్యాయి. ఈ ఏడాది 112 మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారని నివేదికలో వెల్లడైంది. -
వైద్య శాఖలో 251 పోస్టులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ– ప్రాంతీయ కేంద్రం (ఎంఎన్‌జేఐవో–ఆర్సీసీ) కోసం 251 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి కొత్త రూపు తెచ్చేలా ఈ పోస్టులను మంజూరు చేసింది. అలాగే ఆ ఆస్పత్రిలో నిర్వహణ సేవల కోసం 9 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి అనుమతిచ్చింది. పోస్టుల వివరాలు..: ప్రొఫెసర్ 5, అసోసియేట్ ప్రొఫెసర్ 13, అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, సీనియర్ రెసిడెంట్ 23, బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1, మెడికల్ ఫిసిషిస్ట్ 6, నర్సింగ్ సూపరింటెండెంట్ 1, బయో మెడికల్ ఇంజనీర్ 1, ఆఫీస్ సూపరింటెండెంట్ 2, సీనియర్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 4, చీఫ్ రేడియోగ్రాఫర్ 2, రేడియోగ్రాఫర్ 10, ఫార్మసిస్ట్ 2, సోషల్ వర్కర్ 6, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–1) 5, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2) 8, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, బ్లడ్ బ్యాంక్ సూపర్వైజర్ 2, ల్యాబ్ అటెండెంట్ 10, ల్యాబ్ అసిస్టెంట్ 16, మౌల్డ్ టెక్నీషియన్ (సీనియర్) 2, ఈసీజీ టెక్నీషియన్ 2, హెల్త్ సబ్ఇన్స్పెక్టర్ 1, మెడికల్ రికార్డర్ (టెక్నాలజీ) 3, థియేటర్ అసిస్టెంట్ 10, హెడ్ నర్స్ 6, స్టాఫ్ నర్స్ 85. -
ఖాళీగా కాళోజీ వర్సిటీ
మొదలుకాని పూర్తిస్థాయి పాలన - ఖాళీలను భర్తీ చేయని యంత్రాంగం - 82 పోస్టులు మంజూరు.. - ఖాళీగా 61 పోస్టులు - పట్టించుకోని వైద్య ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా వర్సిటీలో పూర్తిస్థాయి పరిపాలన సాగట్లేదు. గతంలో రాష్ట్రంలోని సగం సీట్లనే వర్సిటీ భర్తీ చేసేది. గతంతో పోల్చితే వర్సిటీపై పనిభారం పెరుగుతోంది. నీట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లోని సీట్లన్నింటినీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులతో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసినా.. భర్తీ చేయడంపై దృష్టి పెట్టట్లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్‌ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు. వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. -
2,118 పోస్టుల భర్తీకి గ్రహణం!
వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై ఆరోపణలు - గత ఏడాది జూలైలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి - ఇప్పటికీ పూర్తి ఇండెంట్లు ఇవ్వని వైద్య ఆరోగ్య శాఖ - టీఎస్పీఎస్సీ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని అధికారులు - వైద్య ఆరోగ్యశాఖ తీరుపై చీఫ్ సెక్రటరీకి టీఎస్పీఎస్సీ నివేదిక! సాక్షి, హైదరాబాద్: అధికారుల అలసత్వం నిరుద్యోగులపాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసి ఏడాది కావ స్తోంది. అయితే ఇంతవరకు పోస్టుల వారీగా సమ గ్రంగా ఇండెంట్లు, రోస్టర్ పాయింట్లు ఇవ్వడంలో వైద్య ఆరోగ్య శాఖ అలసత్వం కారణంగా అవి భర్తీకాకుండా ఉండిపోయాయి. రూల్ ఆఫ్ రిజ ర్వేషన్, రోస్టర్ పాయింట్లు ఇస్తే తప్ప నోటిఫికే షన్లను జారీ చేసే అవకాశం లేదు. టీఎస్పీఎస్సీ ఎన్ని సార్లు వైద్య ఆరోగ్య శాఖను అడిగినా ఇండెంట్లు ఇవ్వక పోవడంతో వాటి భర్తీ ముం దుకు సాగడం లేదు. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తోందంటూ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రచారంపై టీఎస్పీఎస్సీ స్పందించింది. పోస్టుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోందన్న అంశంపై జూన్ 29న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది. గత ఏడాది ఉత్తర్వులు జారీ అయినా.. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గతేడాది జూలై 13న ఉత్తర్వులు (జీవో 89) జారీ చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేయాలని అందులో స్పష్టం చేశారు. ఆయా పోస్టులకు సంబంధిం చిన లోకల్ కేడర్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలు, అర్హతలతో కూడిన ఇండెంట్లు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అయితే వాటిని ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ సమగ్రంగా ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న 2,118 పోస్టుల్లో నుంచి 228 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ సర్జన్ పోస్టు లను తొలగిస్తున్నట్లు పేర్కొం ది. కానీ ఈ విషయాన్ని అధికా రికంగా చెప్పడం లేదు. ఆ పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను ఇవ్వకుండా, కావాలనే వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేకుండా చేస్తోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారి కోసమే నోటిఫికేషన్‌ను ఆపు తోందన్న వాదనలూ ఉన్నా యి. అయితే వారికి 30 శాతం వెయిటేజీ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమైనా, అసలు రాత పరీక్ష లేకుండా వారికి ఆ పోస్టులను ఇవ్వాలన్న తలంపుతో జాప్యం చేస్తోందన్న ఆరోప ణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 1,844కు పైగా పారామెడికల్ పోస్టులు ఖాళీ... రాష్ట్ర వ్యాప్తంగా 1,844 పైగా పారా మెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు 2, రేడియోగ్రాఫర్స్ 35, స్టాఫ్ నర్సు పోస్టులు 1,200, ల్యాబ్æ టెక్నీషియన్ పోస్టులు 200, ఫార్మసిస్టు పోస్టులు 238, ఏఎన్ఎంలు 150, ఫిజియోథెరపిస్టు 6, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. పోస్టుల భర్తీలో ఆలస్యంపై సీఎం ఆగ్రహం.. వైద్య పోస్టుల భర్తీ వ్యవహారంలో జరుగుతున్న జాప్యం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు ఏడాది కిందట భర్తీకి ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. నోటిఫికేషన్ల జారీలో ఆలస్యానికి గల కారణాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని సీఎం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గత నెల 29వ తేదీన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు అందజేసినట్లు తెలిసింది. వివాదం లేని పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు! ఎలాంటి వివాదంలేని 274 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇటీవల అందాయని సీఎస్‌కు అందజేసిన నివేదికలో వాణిప్రసాద్ పేర్కొన్నట్లు తెలిసింది. వాటితోపాటు మరో 215 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు, వివరణలు వచ్చాయని, వాటికి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. -
సీజ్ చేయం.. గర్భిణులను తరలించం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మజ వెల్లడి - సాయికిరణ్ ఆస్పత్రిలో మళ్లీ తనిఖీలు.. నోటీసులు జారీ - అనుమతులు లేకుండానే అల్లోపతి ముసుగులో సరోగసీ - ఐదేళ్లలో అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నది 400 మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సరోగసీ దందా నిర్వహిస్తున్న సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. రెండ్రోజుల కిందట తనిఖీలు నిర్వహించిన తాము మరిన్ని రికార్డులు పరిశీలించేందుకు సోమవారం కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సరోగసీ బాధితులను విచారించిన అనంతరం కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రికి అల్లోపతి వైద్యానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, సరోగసీకి అనుమతి లేదని విచారణలో తేలిందన్నారు. సరోగసీ నిర్వహించాలంటే ఆర్టిఫిషియల్ రీ ప్రొడక్షన్ టెక్నిక్స్(ఏఆర్సీ)లో నమోదై ఉండాలని, కానీ ఈ ఆసుపత్రి అందులో రిజిస్టర్ కాలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఈ ఆస్పత్రిపై రెండు మూడ్రోజుల్లో కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘ఇప్పటి కిప్పుడు ఆస్పత్రిని సీజ్ చేస్తే.. అందులో చికిత్స పొందుతున్న సరోగసీ గర్భిణులు ఇబ్బందులకు గురవుతారు. అందుకే మానవతా దృక్పథంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు. ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఉంటుంది’’ అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ 48 మంది సరోగసీ ద్వారా గర్భం దాల్చినట్లు తెలిపారు. ఆస్పత్రి యజమాని సుమిత్ శేఖర్‌కు నోటీసులు అందించి, వివరణ కోరినట్లు తెలిపారు. అద్దె గర్భం దాల్చినందుకు తమకు రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు గర్భిణీలు అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో గత ఐదేళ్లలో ఇప్పటివరకు 400 మంది అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనివ్వగా.. వారంతా పేదరికంలో ఉన్న మహిళలేనన్నారు. ప్రస్తుతం అద్దె గర్భాలను మోస్తున్న బాధితుల్లో అత్యధికులు నాగాలాండ్, నేపాల్, మణిపూర్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు వివరించారు. 400 మందికి సరోగసీ చేసినట్లు లభించిన రికార్డుల్లో కొన్ని సంతకాలు పోలిక లేకుండా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఒక్కో విదేశీ కేసుకు కోటి? సాయికిరణ్ ఆస్పత్రిలో ఐదేళ్ల నుంచి అనుమతులు లేకుండానే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలో 60 శాతం మంది.. విదేశీయులకు పిల్లల్ని కని ఇచ్చేందుకే సరోగసీ ద్వారా గర్భాలను మోస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో విదేశీయుడి నుంచి రూ.కోటి వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్వదేశీయులైతే రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. -
అభ్యంతరాలుంటే తెలియజేయండి
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను శనివారం అధికారులు విడుదల చేశారు. జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 20 లోగా తెలియజేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ కోరారు. వివరాల్లోకి వెళితే.. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద జిల్లాలో కొత్తగా ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 14 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 21 స్టాఫ్‌నర్సులు, ఏడు ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి గతంలోనే దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌తోపాటు సెలెక్షన్ లిస్ట్, ఏడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల రివైజ్డ్ ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. అదేవిధంగా ఆర్బీఎస్కేలో కాంట్రాక్ట్ పద్ధతి కింద మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్ఏ (ఫిమేల్), ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులను గతంలోనే స్వీకరించారు. తాజాగా ఫార్మసిస్ట్‌లకు సంబంధించి ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్, ఇతర క్యాడర్ల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌లను విడుదల చేశారు. వీటిని ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్ఏఎన్టీఏపీయూఆర్ఏఎంయూ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జాబితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం నుంచి 20లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుంది. -
మరో 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు
► మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఏర్పాటు ► కొత్తగా నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఈ మూడు కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీలో 50 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు బీఎస్సీ నర్సింగ్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 280 సీట్లున్నాయి. ఉస్మానియాలో ఎంఎస్సీ నర్సింగ్ ఉంది. అందులో 30 సీట్లున్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు ఆధ్వర్యంలో 9 ఎంఎస్సీ నర్సింగ్ కాలేజీలు, 60 ప్రైవేటు కాలేజీలున్నాయి. అవి కాకుండా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) ప్రభుత్వ కాలేజీలు 6,126 ప్రైవేటు కాలేజీలున్నాయి. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఎంపీహెచ్ఎస్) కోర్సుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు కాలేజీలు, 113 ప్రైవేటు కాలేజీలున్నాయి. అధ్యాపకుల్లేక కుప్పకూలిన నర్సింగ్ విద్య దాదాపు 15 కార్పొరేట్ నర్సింగ్ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన చోట్ల నర్సింగ్ విద్య కుప్పకూలింది. అర్హులైన అధ్యాపకుల్లేకపోవడంతో కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో వైద్య రంగమే ప్రమాదంలో పడుతోంది. భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) నిబంధనల ప్రకారం 40 నుంచి 60 సీట్లు ఉంటే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు అసిస్టెంటు ప్రొఫెసర్లు ఉండాలి. అలాగే 13 నుంచి 18 మంది ట్యూటర్లు ఉండాలి. అయితే చాలా కాలేజీల్లో క్లినికల్ సైడ్‌లో ఉన్న వారితో నడిపించేస్తున్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో వందల్లో సీట్లు ఉంటే.. ప్రైవేటు కాలేజీల్లో వేలాది సీట్లు ఉన్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఐఎన్‌సీ ఇష్టారాజ్యంగా నర్సింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. దాదాపు 90 శాతం నర్సింగ్ కాలేజీలకు అధ్యాపకులే లేరు. వాటికి సరిపడా బిల్డింగ్లు, తరగతి గదులు కూడా లేవు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని పరీక్షలు రాయిస్తారన్న విమర్శలున్నాయి. దీంతో నర్సింగ్ విద్యపై త్వరలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
అంతా గందరగోళం...
విజయనగరం ఫోర్ట్: వైద్య శాఖలో జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగులకు గురువారం రాత్రి నిర్వహించిన బదిలీ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు తమను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని కౌన్సెలింగ్ కమిటీ చైర్మన్ జెసీ–2 నాగేశ్వరరావు, కన్వీనర్ డీఎంహెచ్ఓ పద్మజను కోరారు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి నియమితులైనవారిని అక్కడే వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తాం తప్ప మైదాన ప్రాంతాలకు బదిలీ చేయలేమని స్పష్టం చేశారు. అయితే మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తమకు అనుమతిచ్చారని, కాబట్టి మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు కౌన్సెలింగ్ గది ముందు బైఠాయించారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని భీష్మించారు. అయినా కౌన్సెలింగ్ కమిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే... కౌన్సెలింగ్ పక్రియ కానిచ్చేశారు. హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు పట్టించుకోలేదు 2011 నుంచి మేము గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ఆరేళ్లుగా అక్కడ విధులు నిర్వరిస్తున్నా... మమ్మల్ని మైదాన ప్రాంతాలకు బదిలీ చేయడంలేదు. దీనిపై డీఎంఅండ్‌హెచ్‌ఓను కోరితే హెల్త్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆయన ఉత్తర్వులు ఇచ్చినా ఇక్కడి జేసీ–2, డీఎంఅండ్‌హెచ్‌ఓ చెల్లవని మొండికేస్తున్నారు. ఇదేం న్యాయం. – గిరిజన ప్రాంత ఉద్యోగులు -
వైద్యశాఖలో బదిలీలు ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో తొలిరోజు ఆఫీస్ సబార్డినేట్, ఎంఎన్ఓలు, స్వీపర్లు, తోటీ, కుక్, ఎఫ్ఎన్ఓ, ఫీల్డ్ వర్కర్లు, నైట్ వాచ్మెన్, వాచ్మెన్, డైవర్లు మొత్తం 44 మందికి బదిలీ చేశారు. ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు, మొత్తం సిబ్బందిలో 20 శాతానికి మించకుండా బదిలీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు తెలిపారు. ఈ విభాగాల్లో 52 మంది బదిలీలకు అర్హులుగా 8 మందికి బదిలీలు జరగలేదు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ బి.సూర్యారావు, ఏఓ ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖలో.. శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జలవనరుల శాఖలో అన్ని క్యాడర్లలో బుధవారం 82 మందికి బదిలీలు జరిగాయి. ఆన్లైన్లో ఆప్షన్లు పొందుపరిచిన మేరకు సీనియారిటీని బట్టి వీరిని ఆయా స్థానాలకు బదిలీ చేశారు. గురువారం ఉద్యోగులంతా విధుల్లో చేరినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కేడర్లSవారీగా పరిశీలిస్తే బొబ్బిలి సర్కిల్ నుంచి డీఈ, ఏఈలతో పాటు 23 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ టెక్నికల్ అధికారులు, ఇద్దరు ఐíసీ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లకు బదిలీ అయ్యింది. వంశధార ప్రాజెక్టు పరిధిలో 35మందికి బదిలీ.. బొడ్డేపల్లి రాజగోపాల్ వంశధార ప్రాజెక్టు పరిధిలో 35 మందికి బదిలీలు జరిగాయి. సీనియర్ అసిస్టెంట్లు 11 మందికి, జూనియర్ అసిస్టెంట్లు 10 మందికి స్థాన చలనం కలిగింది. వీరంతా గురువారం విధుల్లో చేరినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖలో.. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీఏలు వారం రోజుల క్రితం విజయవాడలో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఏఓలు 15 మందికి, ఏడీఏలు నలుగురికి బదిలీ జరిగాయని వ్యవసాయశాఖ జేడీ జి.రామారావు తెలిపారు. సూపరింటెండెంట్లు–2, సీనియర్ అసిస్టెంట్లు–2, జూనియర్ అసిస్టెంట్లు–4, టైపిస్టులు–2 చొప్పున మొత్తం 29 మందికి స్థాన చలనం కలిగిందని పేర్కొన్నారు. -
వైద్యులకు 63 ఏళ్ల దాకా కొలువు
-
వైద్యులకు 63 ఏళ్ల దాకా కొలువు
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: రాష్ట్రంలో వైద్యులకు ఇప్పటివరకూ 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖలో పని చేస్తున్న పీజీ వైద్యులు, పీజీ డిప్లొమా వైద్యులందరికీ ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. -
సాఫ్ట్‘వేర్’
– వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలపై గందరగోళం – ఇంకా తయారు కాని ‘సాఫ్ట్వేర్’ – ముగిసిన దరఖాస్తు గడువు – బదిలీలుంటాయో..ఉండవోనని ఉద్యోగుల్లో ఆందోళన అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసినా బదిలీల నిర్వహణకు సంబంధించి సాఫ్ట్వేర్ కూడా తయారు కాలేదు. దీంతో అసలు బదిలీలు ఉంటాయో, ఉండవోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణకుమారి ఈ నెల 8న బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 24వ తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. దరఖాస్తుపైనే ఇప్పటివరకు స్పష్టత రాలేదు. సాఫ్ట్వేర్ తయారు కాకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బదిలీలకు అర్హులైన ఉద్యోగులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే ఆదేశాలందాయి. పారదర్శకత కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ఎంప్లాయీస్ ట్రాన్ఫర్ సిస్టం (ఓఈటీఎస్)లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవడంతో ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గడువు కూడా ముగిసిపోయింది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయి, 20 శాతానికి మించకుండా చేపడితే ఎంత మంది బదిలీ అవుతారో ఈ సాఫ్ట్వేర్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అసలు బదిలీల దరఖాస్తులే కాదు.. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఈ ఏడాది బదిలీలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అటెండర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్‌నర్సులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎంపీహెచ్ఈలు తదితర కేడర్లలో సుమారు 800 మంది బదిలీలకు అర్హత కల్గివున్నట్లు తెలుస్తోంది. సమయం ఇస్తారా? జిల్లాలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఉద్యోగులకు తెలిసేలా ఆన్లైన్లో ఉంచలేదు. ఈ క్రమంలో ఖాళీల వివరాలే తెలియకపోతే ఉద్యోగులు ఏ ప్రాంతం కోరుకోవాలో స్పష్టతకు రాలేరు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి సమయం ఇవ్వాలన్న యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. గతంలోలా కాకుండా కేవలం రెండ్రోజులు మాత్రమే దరఖాస్తు గడువు ఇవ్వవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ వర్గాల నుంచి విన్పిస్తోంది. క్లియర్ వేకెన్సీ లిస్ట్ అడిగారు : డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ జిల్లా వ్యాప్తంగా ‘క్లియర్ వేకెన్సీ’ వివరాలు కావాలని ఉన్నతాధికారుల నుంచి ఈ రోజే (గురువారం) ఆదేశాలు వచ్చాయి. సుమారు 15 కేడర్ల వివరాలు తీస్తున్నాం. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాకపోవడంతోనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. రెండు, మూడ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే లిస్ట్ అడుగుతున్నారనుకుంటా. -
పీజీ వైద్య ఫీజుల పెంపు సబబే..!
- స్టే ఎత్తివేతకు హైకోర్టులో పిటిషన్ వేయాలని సర్కారు నిర్ణయం - పీజీ రెండో దశ అడ్మిషన్ల గడువు 19 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపు సబబేనని, పెంచిన ఫీజులపై విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. స్టే ఎత్తివేతపై ప్రైవేటు మెడికల్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై తీర్పు గురువారం రానుంది. అదేరోజు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. ఫీజుల పెంపుపై ౖహె కోర్టు 4 వారాలపాటు స్టే విధించడంతో ఆ తర్వాత చూసుకోవాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కానీ పీజీ అడ్మిషన్ల గడువు నెలాఖరు వరకే ఉండటం, సమయం తక్కువ ఉండటంతో విద్యార్థులకు నష్టం వాటి ల్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మొండికేయడంతో రాష్ట్ర ప్రభు త్వం వెనకడుగు వేసినట్లు అర్థమవుతోంది. పైగా తామే ఫీజుల పెంపుపై జీవో జారీ చేసినందున ఎందుకు పెంచాల్సి వచ్చిందో హైకోర్టుకు వెల్లడించ నుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైకోర్టు నిర్ణయాన్ని ప్రైవేటు కాలేజీలు అమలు చేయకపోతే అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని పేర్కొన్నాయి. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం వెనకడుగు వేయ కపోవడం, అవసరమైతే పీజీ సీట్లను ఉపసంహరిం చుకుంటామని హెచ్చరించడంతో ప్రభుత్వమే దిగివ చ్చిందని అంటున్నారు. చివరకు ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజీకి వచ్చి ఫీజుల పెంపుపై ఒకే వైఖరిని ప్రదర్శించాయన్న చర్చ జరుగుతోంది. గడువు 19కి పెంపు.. పీజీ మెడికల్, డెంటల్ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరేం దుకు గడువును ఈ నెల 19కి పొడిగిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవంగా బుధవారం నాటికి గడువు పూర్తయింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యా ర్థులను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఈ నిర్ణ యం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చు కున్నారు. గురువారం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. స్టే ఎత్తివేస్తే కాలేజీలు ముందుకెళ్తాయి. లేకుంటే సుప్రీం గడప తొక్కనున్నాయి. అక్కడా న్యాయం జరగకుంటే పీజీ సీట్లను ఉపసంహరించుకుంటామని కాలేజీలు చెబు తున్నాయి. అడ్మిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టే ఎత్తివేయండి.. పీజీ వైద్య విద్య ఫీజుల పెంపుపై స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే ప్రభుత్వం ఫీజులను పెంచిం దని తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించనుంది. -
అటు సరెండర్.. ఇటు రీపోస్టింగ్!
బదిలీల కోసం వైద్యారోగ్య శాఖలో ముడుపుల దందా ► సదరు ఉద్యోగులు తప్పు చేశారంటూ డైరెక్టరేట్‌కు సరెండర్ ► వారం తిరిగేసరికల్లా కోరుకున్న చోటికి పోస్టింగులు సాక్షి, హైదరాబాద్: ఉన్నచోటి నుంచి మరో చోటికి బదిలీ కావాలా? బదిలీలపై నిషేధం ఉంది కదా.. ఎలా? చాలా సింపుల్.. ముందుగా ఉన్నతాధికారికి సరెండర్ చేయడం.. ఆ తర్వాత పోస్టింగ్ పేరిట మరోచోటికి పంప డం.. అంతే! వైద్యారోగ్య శాఖలో అడ్డగోలుగా జరుగుతున్న సరికొత్త బదిలీల దందా ఇది. నిషేధాన్ని అతిక్రమించేందుకు ఆ శాఖ అధికా రులు వేస్తున్న సరికొత్త ఎత్తుగడ ఇది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధిలో.. గత నెల రోజుల్లోనే వైద్యారోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇన్ని బదిలీలు ఎలా జరిగాయని ఆరా తీస్తే.. తెరవెనక బాగో తం బయటపడింది. ఉద్యోగులను ఏదో ఒక కారణం చూపించి సరెండర్ చేయడం.. వారం తిరక్కముందే వాళ్లు కోరుకున్న చోటికి బదిలీ చేయటం జరిగిపోతోంది. సూర్యాపేట జిల్లా కాపుగల్లు పీహెచ్సీలో పని చేసిన ఒక ఎంపీహెచ్‌ఈవో ఇటీవల సరెండర్‌పై డైరెక్టరేట్‌కు చేరి.. అక్కణ్నుంచి వారం వ్యవధిలోనే సరూర్‌నగర్‌కు పోస్టింగ్‌కు తెచ్చుకున్నారు. అంతకు ముందు సరూర్నగర్లోనే డిప్యుటేషన్‌పై పని చేసిన ఆయన.. డిప్యుటేషన్ రద్దయ్యాక వారంలోనే సరెండరైన తీరు బదిలీల బాగో తాన్ని కళ్లకు కడుతోంది. ఇక సూర్యాపేట జిల్లా మోతె పీహెచ్సీ నుంచి ఒక స్టాఫ్ నర్సు జిల్లా కేంద్రానికి మరింత దగ్గరగా చివ్వెంల పీహెచ్‌సీకి పోస్టింగ్ సాధించుకున్నారు. పూర్వపు రంగారెడ్డి జిల్లా నుంచి పనిచేసిన ఒక హెల్త్ ఎడ్యుకేటర్ ఇదే తరహాలో ఏకంగా హైదరాబాద్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే తిష్ట వేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ అసిస్టెంట్ అయితే జోన్లకు అతీతంగా హైదరాబాద్ డైరెక్టరేట్‌కు బదిలీ చేయించుకున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత రంగారెడ్డి జిల్లా నార్సింగి పీహెచ్‌సీకి బదిలీ చేయించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కొండమడుగు పీహెచ్‌సీకు చెందిన మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ యాదాద్రి జిల్లాలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర పీహెచ్సీలో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీ సర్ నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. ఇలా నెలలోనే ఇరవైకి పైగా బదిలీలు జరిగాయి. మరికొందరు ఉద్యోగులు సరెండర్ చేయించుకుని.. కోరుకున్న చోట రీపోస్టింగ్ పొందేందుకు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సరెండర్ వెనుక హైడ్రామా... సాధారణంగా ఉద్యోగి తప్పు చేస్తే లేదా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ముందుగా మెమో జారీ చేయాలి, రాతపూర్వక వివరణ కోరాలి. తప్పిదాలు వరుసగా జరిగినా, వరుసగా మెమోలు జారీ అయినా.. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే, వివరణకు సంతృప్తి చెందకుంటే ఆ జిల్లా వైద్యారోగ్యాధికారి ఆ ఉద్యోగిని డైరెక్టరేట్‌కు సరెండర్ చేస్తారు. ఆ ఉద్యోగి ఇంక్రిమెంట్లలో కోత, కొంతకాలం పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం చేస్తారు. డైరెక్టరేట్ కేంద్రంగానే దందా! ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషే ధం ఉంది. కానీ డబ్బులు ముట్టజెపితే కోరుకున్న చోటికి బదిలీ చేయిస్తామంటూ కొందరు దళారులు డైరెక్టర్ కార్యాలయం కేంద్రంగా దందాకు తెరలేపారు. -
ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ/రేపల్లె: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నర్సులకు 2017 ఏడాదికిగానూ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అవార్డులు అందుకున్నారు. కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సమన్వయ అధికారిణి మాదెల్ల ఎంహెచ్. ప్రమీలాదేవి, గుంటూరు జిల్లా కనగల్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న గోవిందమ్మ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి చింతపల్లికి చెందిన దున్న జయ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. -
'సవాళ్లు గుర్తించండి'
- వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి -‘కేసీఆర్ కిట్’ పథకాన్ని విజయవంతం చేయండి సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఏ యే ప్రాంతాల్లో ఏయే రకాల వ్యాధులు ఎక్కు వగా ప్రబలుతున్నాయో గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్త లు సూచించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రు లను మెరుగుపర్చడానికి, మంచి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి, నిధులు వెచ్చిస్తున్నందున పేదలకు ఉపయోగ పడేలా ఆరోగ్యశాఖ పని తీరు ఉండాలని సీఎం కోరారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రగతి భవన్లో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సి.లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, నర్సింగ్ రావు, కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘స్వైన్ ఫ్లూ, వడదెబ్బలు, కలరా, విషజ్వరాల లాంటి సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోదకాలు లాంటి ప్రత్యేక వ్యాధులు వస్తున్నాయి. వివిధ జిల్లాల్లో, ఏయే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమ స్యలు తలెత్తుతున్నాయనే విషయంలో ఆరోగ్య శాఖ దగ్గర అంచనా ఉండాలి. దానికనుగుణంగా స్పందించాలి. వైద్య సిబ్బందికి కూడా ఎప్ప టికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఓ వంద మంది రిసోర్స్ పర్సన్స్ ను తయారు చేసి, వారి ద్వారా శిక్షణ ఇప్పించాలి. జిల్లా స్థాయిలో హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి’’ అని సీఎం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముందున్న సవాళ్లేంటో ముందు గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గం చూడాలన్నారు. కేసీఆర్ కిట్ పేరుతో ప్రసవ సమయంలో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినందున, ఆ పథకం విజయవంతం గా అమలయ్యేలా చూడాలని íసీఎం కోరారు. -
‘అమ్మ ఒడి’ ఏర్పాట్లు పూర్తి చేయండి
లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. జూన్ 2 కల్లా గర్భిణిల పూర్తి సమాచారం సేకరణ, కంప్యూటరీకరణ కచ్చితంగా జరగా లని సూచించారు. కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జరుగుతున్న హెల్త్ ఎడ్యుకేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం సందర్శించారు. ఆయన మా ట్లాడుతూ... అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న గర్భిణిల వివరాలను నమోదు చేయాలని, చిన్న పొరపాట్లకు కూడా తావీ యవద్దని సూచించారు. పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరులో కేసీఆర్ బేబీ కిట్లు కేసీఆర్ బేబీ కిట్‌ను ఈ నెలాఖ రులో ప్రవేశపెడుతున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రెడ్‌హిల్స్ లోని నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పెరగాలనే లక్ష్యంతో కిట్‌ను అందజేస్తున్నట్లు వివరించారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం ఆడ శిశువుకు రూ.13 వేలు, మగ శిశువుకు రూ.12 వేల చొప్పున పలు విడతలుగా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు నేరుగా బాలింత ఖాతాలోకి చేరేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చామని చెప్పారు. హైరిస్క్ కేసులే మరణాలకు దారితీస్తున్నాయని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లక్ష్మారెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే మరణాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ అన్నారు. -
జూన్ నుంచి గర్భిణులకు రూ.12 వేలు
వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గర్భిణీలకు ప్రోత్సాహకపు సొమ్మును వచ్చే నెల నుంచి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించిం ది. బాలింతలు, శిశువుల కోసం కేసీఆర్ కిట్లను కూడా అదే నెల నుంచి అందజేయాల ని యోచిస్తోంది. ఈ ప్రోత్సాహక నగదు దుర్వినియోగం కాకుండా బ్యాంకు ఖాతాలను గర్భిణుల పేరున తీస్తారు. మూడు విడతల్లో సొమ్ము జమ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరగడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. గర్భిణులు ఎందరు న్నారు? ఇది తొలి కాన్పా.. కాదా తదితర వివరాలను సేకరిస్తారు. పీహెచ్సీ, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా గర్భిణుల సమాచార సేకరణ మొత్తం నమోదు చేస్తారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం సమాచారాన్ని సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గర్భిణులకు రూ.12 వేలు.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో పరీక్షలు చేసే సమయంలో రూ.4వేలు, ప్రసవం సమయంలో రూ.4 వేలు, అనంతరం బిడ్డ టీకాలు వగైరా వాటి కోసం రూ.4వేల చొప్పున ఇస్తారు. ఆడ బిడ్డ పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద బాలింత, పుట్టిన శిశువుకు కేసీఆర్ కిట్ అందిజేస్తారు. ఏటా 6.30 లక్షల ప్రసవాలు.. రాష్ట్రంలో ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని అంచనా. 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించుకుంటున్నారు. మిగిలిన వారికి ఇళ్ల వద్ద ఏఎన్ఎంలు, ఇతరుల సమక్షంలో కాన్పులు జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లోని కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాతిపాదికన తాజా సమాచారాన్ని సేకరించి గర్భిణులను గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు. ప్రోత్సాహకపు సొమ్ము పథకాన్ని, కేసీఆర్ కిట్లను వచ్చే నెలలో ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలు
⇒ 500 మంది వైద్య సిబ్బంది భర్తీకి ఆదేశం ⇒ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు ⇒ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రులు, గుర్తిం చిన ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఐసీయూ 10 పడకలతో ఏర్పాటు చేస్తారు. ఇటీవలే మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేట జిల్లా ఆసుపత్రుల్లో ప్రారంభం కాగా, మరో 17 ఐసీయూలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఆసుపత్రుల్లో ఐసీ యూలు ఏర్పాటు చేస్తారు. అలాగే నాగర్ కర్నూలు, నారాయణ్‌పేట్, మెదక్, జహీరా బాద్, మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబాబాద్, భద్రాచలం, సూర్యాపేట, గద్వాల్ ఏరియా ఆసుపత్రుల్లో నెలకొల్పు తా రు. ఏటూరు నాగారం, ఉట్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐసీయూలకు 500 మంది వైద్య సిబ్బందిని నియమిస్తారు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, నర్సులు, సాంకేతిక సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ వీరిని భర్తీ చేస్తుంది. ఒక్కోఐసీయూకు అధిపతిగా అనెస్థీషియా స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ను నియమిస్తారు. అతనికి నెల వేతనం రూ.లక్ష నిర్థారించారు. అలాగే ఐసీ యూకు జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఇద్దరిని నియమిస్తారు. వారి వేతనం రూ.80వేలు. పల్మనరీ స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఇద్దరిని నియమి స్తారు. వారికీ జీతం రూ.80వేలు. అవసరాన్ని బట్టి కార్డియాలజీ స్పెషలిస్టును ప్రత్యేకంగా కన్సల్టేషన్ ఫీజుతో బయటి నుంచి రప్పిస్తారు. ఒక్కో ఐసీయూకు ఆరుగురు స్టాఫ్ నర్సులను, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషి యన్లను నియమిస్తారు. అలాగే 8 మంది ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలను నియమిస్తారు. ఒక్కో ఐసీయూకు ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ను నియమిస్తారు. వారిలో స్టాఫ్ నర్సు వేతనం రూ.20 వేలు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషియన్లకు రూ.15వేల వేతనం ఇస్తారు. ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వోలకు రూ.12వేలు, సెక్యూరిటీ గార్డు లకు రూ.9వేల చొప్పున వేతనం ఇస్తారు. వైద్య సిబ్బందికి అర్హతలివే... ఐసీయూ అధిపతిగా తీసుకోబోయే అనెస్థీషియా స్పెషలిస్టు ఎండీ (అనెస్థీషియా) చదివి ఉండాలి. జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు ఆ విభాగంలో ఎండీ చేసి ఉండాలి. పల్మనరీ మెడిసిన్ స్పెషలిస్టు డీఎం పల్మనరీ లేదా ఎండీ (ఛాతీ వ్యాధులు) చేసి ఉండాలి. ఇక స్టాఫ్ నర్సులు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంలో డిప్లొమా చదివి ఉండాలి. మెడికల్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ కోర్సు చదివిన అభ్యర్థులను ల్యాబ్ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. రేడియోగ్రాఫర్‌గా డిప్లొమా చేసిన అభ్యర్థులను రేడియాలజీ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. ఇంటర్‌తోపాటు వెంటిలేటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులను వెంటిలేటర్ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. పదో తరగతి పాసై ప్రాథమిక చికిత్సలో సర్టిఫికెట్ ఉన్న వారిని ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలుగా తీసుకుంటారు. పదో తరగతి పాసైన వారిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
వైద్యశాఖలో అస్తవ్యస్తంగా క్రమబద్ధీకరణ
- ఆందోళనలో అభ్యర్థులు.. ఎటూ తేల్చని అధికారులు - ముందు చేరిన వారిని పక్కనపెట్టి తర్వాతి వారికి అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందు విధుల్లో చేరిన వారిని పక్కనపెట్టి తర్వాత చేరిన వారిని క్రమబద్ధీకరించారన్న ఆరోపణలున్నాయి. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఈ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 310 మందినే క్రమబద్ధీకరించారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇలా తక్కువ మందికే అవకాశం కల్పించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. 33 మంది మహిళా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను, 275 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు కంటి వైద్య సహాయ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన వారికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా 900 మంది పనిచేస్తుంటే.. అందులో కేవలం 33 మందినే (మహిళలు) రెగ్యులరైజ్ చేశారు. క్రమబద్ధీకరణ పొందినవారిలో పాత నల్లగొండ జిల్లాకు చెందినవారు ఎవరూ లేరు. ఈ జిల్లా కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అలాగే ఆరోగ్య విభాగంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులనూ క్రమబద్ధీకరించలేదు. వీరితోపాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది మొత్తాన్నీ పక్కనపెట్టారు. వీరికి ట్రెజరీల నుంచి జీతాలను ఇవ్వకపోవడం కారణంగా చూపుతున్నారు. ట్రెజరీల నుంచి జీతాలు పొందుతున్న ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిలోనూ పలువురిని పక్కనపెట్టారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖలో వందలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. -
వైద్య ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో వివిధ జిల్లాల్లో పనిచేసే 310 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీక రిస్తూ ఆ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా రోగ్యం కుటుంబ సంక్షేమ డైరక్టర్ పరిధిలో పనిచేసే 277 మంది, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో పనిచేసే 33 మందిని ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో భర్తీ చేసి క్రమబద్ధీకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రజా రోగ్యం కుటుంబ సంక్షేమ డైర్టెక్టర్ పరిధిలో గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేసే వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 22 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కు చెంది నవారు ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో 31, మహబూబ్‌నగర్ జిల్లాలో∙23, మెదక్ జిల్లాలో 12 మంది ఉన్నారు. వరంగ ల్ జిల్లాలో 15 మంది, రంగారెడ్డి జిల్లాలో10, ఖమ్మంకు చెందిన 36 మంది ఉన్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్– 2లో ఆదిలాబాద్ జిల్లాలో 17 మంది, నిజామాబాద్ జిల్లాలో 8, కరీంనగర్ జిల్లాలో11, మహబూబ్‌నగర్ 8, మెదక్ 10 మంది, హైదరాబాద్ ఇద్దరు, వరంగల్ ఏడుగురు, ఖమ్మం జిల్లాకు చెందిన 38 మంది, రంగారెడ్డి 7 గురు, నల్లగొండ జిల్లాలో 16 మంది, అదే జిల్లాకు చెందిన ఇద్దరు పారా మెడికల్ ఉద్యోగులున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో పనిచేసే 33 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మహిళల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 13 మంది, నల్లగొండ 5 గురు, కరీంనగర్ ఒకరు, నిజా మాబాద్ ఇద్దరు, వరంగల్ జిల్లాలో 12 మంది ఉన్నారు. -
కాన్పుకు పోతే.. కడుపు కోతే!
- ప్రైవేటు ఆసుపత్రుల్లో 75% సిజేరియన్లతో తెలంగాణ టాప్ - రాష్ట్రంలో 81 శాతంతో తొలిస్థానంలో కరీంనగర్ - సామాజిక ఆర్థిక సర్వే–2017లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 74.9 శాతం సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 70.9 శాతం సిజేరియన్ ఆపరేషన్లతో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 40.6 శాతమే సిజేరియన్ ద్వారా జరుగుతున్నా యని తాజాగా విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే–2017 వెల్లడిం చింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి జరిగే కాన్పుల్లో సరాసరి 58 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, అదికూడా అన్ని రాష్ట్రాల కన్నా అధికమని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో జరిగే కాన్పుల్లో 63 శాతం, గ్రామాల్లో జరిగే కాన్పుల్లో 53 శాతం సిజేరి యన్ ద్వారానే జరుగుతున్నాయి. పాత జిల్లాల ప్రకారం.. కరీంనగ ర్లో అత్యధికంగా 81.1 శాతం కాన్పులు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ సిజే రియన్ ఆపరేషన్లు అధికంగా జరుగు తున్న జిల్లాలుగా నిలిచాయి. రాష్ట్రం లో 91.5 శాతం కాన్పులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగు తున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 70.8 శాతమే ఆసు పత్రుల్లో జరుగుతున్నాయి. దీంతో తల్లుల మరణాల రేటు అక్కడ 152గా ఉంది. అనవసర సిజేరియన్లపై ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయాన్ని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. -
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే
జి.సిగడాం: జిల్లాలోని ఉద్దాన తీర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులపై పూర్తి స్థాయిలో సర్వే చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు వెల్లడించారు. స్థానిక 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్దానం తీరప్రాంతాల్లో 7 మండలాల్లో 114 గ్రామాల్లో సుమారుగా 1.30లక్షల మందికి కిడ్నీ వ్యాధులపై సమగ్ర సర్వే జరుపుతామన్నారు. ఇంతవరకు 15 బృందాలతో 77 గ్రామాల్లో 47 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలోని రిమ్స్ కేంద్రంలో ఉచితంగా డెంగీ తనిఖీ, రక్తఫలకికల (ప్లేట్లెట్స్) నమూనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో రోగులకు ఉచితంగా డెంగీ పరీక్ష చేస్తామని, అవసరమైన వారికి ప్లేట్లెట్స్ అందిస్తామని తిరుపతిరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా రాకుండా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చామని వివరించారు. కొన్ని పంచాయతీల్లో తాగునీటిలో ఫ్లోరిన్ ఉండడంతో.. వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ రాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. జ్వరాల కోసం జిల్లాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, శ్రీకాకుళం రిమ్స్ ఆరోగ్యకేంద్రాల్లో 24 గంటలు ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశామని తిరుపతిరావు తెలిపారు. వేసవిలో ఎండలు అధికంగా ఉన్నాయని, వీటి అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయనతోపాటు వైద్యఅధికారులు ముంజేటి కోటేశ్వరరావు, శివప్రసాద్, గౌతమి ప్రియాంకలతోపాటు సిబ్బంది ఉన్నారు. -
ఆరోగ్యశాఖలో టెన్షన్..టెన్షన్!
– నేడు ఎంపీహెచ్‌ఏలకు కౌన్సెలింగ్ – ఎస్ఎంఎస్లతో అభ్యర్థులకు సమాచారం – బీసీ–ఈపై స్పష్టత ఇవ్వని అధికారులు – న్యాయం చేయాలంటున్న ‘మెరిట్ అభ్యర్థులు’ అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో 24 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశం హాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపారు. అయితే ఇది విమర్శలకు తావిస్తోంది. ఏ శాఖలోనైనా పోస్టుల భర్తీ విషయంలో అధికారులు తప్పనిసరిగా పత్రికా ప్రకటనలు ఇస్తారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దీనికి తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం సూచన, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 24 మంది ఎంపీహెచ్ఏలను తొలగించి వారి స్థానంలో 24 మందికి గత ఏడాది డిసెంబర్లో పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతిభకు పాతరపై వరుస కథనాలు : ఇందులో ప్రతిభకు పాతరేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టలేదు. కార్యాలయంలోని కొందరు అధికారులు ‘ముడుపులు’ తీసుకొని వారికి ఇష్టం వచ్చిన ప్రాంతానికి ఆర్డర్స్ ఇచ్చేశారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కలెక్టర్ కోన శశిధర్ స్పందించి కౌన్సెలింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను ఆదేశించారు. ఇదే సమయంలో 14 ఏళ్ల పాటు పని చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో జనవరి 10న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఇటీవల వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా కౌన్సెలింగ్ వాయిదా పడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నేడు కౌన్సెలింగ్ : కలెక్టర్ కోన శశిధర్ నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో సోమవారం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఈ 24 మంది జాబితాలో ఒక నాన్‌లోకల్ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు నాన్‌లోకల్‌కు పోస్టులు ఇవ్వరాదు. పైగా 2003 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఈ పోస్టుల విషయంలో బీసీ–ఈ రిజర్వేషన్ వర్తించదు. కానీ గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ వద్దకు ఫైల్ వెళ్లిన సమయంలో బీసీ–ఈకి చెందిన ఇద్దరు అభ్యర్థులను సైతం జాబితాలో ఉంచారు. ఈ విషయంలో కూడా కలెక్టర్ సీరియస్ కావడంతో వారిద్దరినీ విధుల్లోకి తీసుకునే విషయంలో వెనకడుగు వేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన రోజే వారిద్దరినీ ‘మళ్లీ చూద్దాం’ అని వెనక్కు పంపారు. ఈ క్రమంలో తాజాగా చేపడుతున్న నియామకాల్లో బీసీ–ఈ అభ్యర్థులను అలాగే ఉంచారా? లేదా? అన్నది బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే కౌన్సెలింగ్ తేదీకి సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోంది. న్యాయం చేయండి : ఇటీవల 24 మంది ఎంపీహెచ్ఏలు విధుల్లో చేరిన విషయం తెలిసిందే. వీరి కంటే మెరిట్లో కొందరు అభ్యర్థులు ముందున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను కలిశారు. కలెక్టర్ కోన శశిధర్‌ను సైతం గ్రీవెన్స్‌లో కలిసి విన్నవించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను పలుమార్లు కలిసి తమకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలపై గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ దృష్టికి తీసుకెళ్తే ‘మీ కంటే మెరిట్ తక్కువగా ఉన్నవాళ్లు ఉంటే చెప్పండి. మీకు న్యాయం చేస్తా’మని చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీహెచ్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో మెరిట్ ప్రకారమే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగే కౌన్సెలింగ్ వద్దకు రావడానికి కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ అధికారుల్లో నెలకొంది. -
నిమ్స్‌లో రెండు కొత్త ఓపీ టవర్లు
⇒ కిడ్నీ టవర్‌కూ రంగం సిద్ధం ⇒ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో రెండు కొత్త ఔట్ పేషంట్(ఓపీ) టవర్లు, కిడ్నీ టవర్ నిర్మాణం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య పథకం అమలులోకి రావడం.. చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు చెల్లించలేక నిమ్స్ వైపు చూస్తున్నారు. దీంతో నిమ్స్‌కు వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ప్రతి రోజూ ఓపీ 1,500 కాగా.. ఇప్పుడు 2,500కు పెరిగింది. ఆరోగ్యశ్రీ ఓపీ గతేడాది 1.11 లక్షలు, ఇన్‌పేషెంట్(ఐపీ) రోగులకు 13,422 చికిత్సలు చేశారు. దీంతో నిమ్స్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల కొత్త పేయింగ్ రూమ్స్ బ్లాక్‌లో 90 స్పెషల్ రూములను రూ.10 కోట్లతో ఆధునీకరించారు. రాబోయే రోజుల్లో పాత వాటి స్థానంలో 700 పడకలను ఆధునీకరించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రూ.52 కోట్లతో అపెక్స్ డయాగ్నసిస్ పరీక్షా కేంద్రాలను మిలీనియం బ్లాక్ ఏడో అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అవి రోగులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రూ.2.5 కోట్ల కేంద్ర నిధులతో జీరియాట్రిక్(వయోవృద్ధుల) మెడిసిన్ విభాగాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. రూ.150 కోట్లతో నెఫ్రో యూరో టవర్స్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా మరో 10 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో 8 కొత్త కోర్సుల కోసం ప్రణాళికలు రూపొందించింది. పెరుగుతున్న పనిభారం.. నిమ్స్‌లో ఇప్పటివరకు ఉన్న 1,140 పడకల సంఖ్యను 1,500కు పెంచారు. అయితే దానికి తగ్గట్లుగా వైద్య సిబ్బంది, నర్సుల నియమకాలు జరపలేదన్న విమర్శలున్నాయి. పడకలు పెరిగి సిబ్బంది సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడంతో ఉన్నవారిపై భారం పడుతోంది. ఈ క్రమంలో పలు నియామకాలు జరపాలని నిమ్స్ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
ఆయుష్‌పై షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్!
వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వని కారణంగానే... సాక్షి, హైదరాబాద్: ‘ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేస్తే.. విద్యార్థులంతా నీట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ఉంటుంది’ అన్న షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా? లేక ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ గత నెల 21వ తేదీన తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖ రాసినా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా తామెలా స్పష్టత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మౌఖికంగా చెబుతున్న నేపథ్యంలో.. షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక ఎంసెట్‌తోపాటు ఐసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
సీట్లు కాపాడుకునేందుకు పాట్లు!
⇒ నిబంధనలు పాటించకపోవడంతో ⇒ తాజాగా కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది. ప్రతీ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు రావడం.. లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. 3 నెలల కిందట ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 100 సీట్లను 2017–18 సంవత్సరానికి పునరుద్ధరించడానికి ఎంసీఐ నిరాకరించింది. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, కొత్తగా ఏర్పడిన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల పునరుద్ధరణకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, ఉస్మానియాల్లోని ఎంబీబీఎస్ సీట్ల అనుమతి కోసం లేఖ రాయగా.. తాజాగా తిరస్కరించిన మహబూబ్‌నగర్, కాకతీయ మెడికల్ కాలేజీల్లోని సీట్ల పునరుద్ధరణకు లేఖ రాయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లను బుధవారం ఆదేశించారు. వారితో ఆయన సమావేశం నిర్వహించారు. తరచూ ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోందని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్లే.. కాకతీయ మెడికల్ కాలేజీలో 19.06 శాతం బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 30.85 శాతం బోధన సిబ్బంది.. 17.02 శాతం రెసిడెంట్ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించారు. గతంలో ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేకపోవడంతో ఎంసీఐ సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పట్లో లేఖ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు ఉస్మానియా, నిజామాబాద్ కాలేజీ సీట్ల పునరుద్ధరణకు అనుమతిచ్చారు. -
అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర
ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేస్తున్న ఆరు ఆసుపత్రుల సీజ్ ⇒ మంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభం ⇒ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు సాక్షి, హైదరాబాద్: అనవసరంగా శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్యశాఖ కన్నెర్ర చేసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తన సొంత జిల్లా కేంద్రంలోనే ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తున్న ఆరు ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేశారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో గుబులు రేగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని యశోధర, షిర్డిసాయి, వసుధ, సాయి చందన్, మేఘన, ధనుష్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఆయా ఆసుపత్రులు అనవసర శస్త్రచికిత్సలు, సిజేరియన్లు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కనీస నిబంధనలు పాటించకపోవడం, మౌలిక వసతులు కల్పించక పోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ ఆసుపత్రుల్లో కొన్ని ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారికి అర్హత లేకున్నా శస్త్రచికిత్సలు చేయడంపై జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని.. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా హెచ్చరించారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులు 90% ఆసుపత్రుల ప్రొటోకాల్ ప్రకారం ప్రతీ శస్త్రచికిత్స వివరాలు ప్రభుత్వానికి నివేదించాలి. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే దానికి గల కారణాలను వివరించాలి. కానీ 90 శాతానికి పైగా ఆసుపత్రులు ఆ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు తీవ్ర యాంటీ బయాటిక్స్ మాత్రలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎందుకు రాయాల్సి వచ్చిందో నివేదించాలి. ఆ మేరకు ఆసుపత్రికి ఒక కమిటీ ఉండాలి. ఇవేవీ ఆయా ఆసుపత్రులు పాటించడం లేదు. ఇక అనేక ఆసుపత్రుల్లో రోగులకు కనీస వసతులు ఉండటం లేదు. అవసరమున్నా లేకున్నా ప్రతీ దానికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులైతే వైద్య పరీక్షలు చేయించే విషయంలో డాక్టర్లకు టార్గెట్లు కూడా పెడుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు వైద్యాధికారులకు సమాచారం ఉంది. మొత్తం ప్రసవాల్లో 58% సిజేరియన్లే రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరిగితే.. అందులో 58 శాతం సిజేరియన్ ఆపరేషన్లే. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 74 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతోన్న కాన్పుల్లో 40 శాతం సిజేరి యన్ ద్వారా జరుగుతున్నాయి. సిజేరి యన్ కోసం రూ. 30 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎటువంటి శస్త్రచికిత్స, సిజేరియన్ అయినా కూడా నిబంధనల ప్రకారమే చేశారా? లేదా? అన్న వివరాలను తప్పనిసరిగా ప్రభు త్వానికి నివేదించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని.. నిబం ధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు విన్నవించినట్లు తెలిసింది. అనవసర సిజేరియన్లు చేస్తే ఆసుపత్రుల సీజ్: లక్ష్మారెడ్డి అనవసర సిజేరియన్లు చేసే ఆసుపత్రులను సీజ్ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ఆసుపత్రిని సీజ్ చేశామన్నారు. ఆసుపత్రుల్లో చేసే ప్రతీ శస్త్రచికిత్స వివరాలను ప్రతి నెలా తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపాల్సిందేనన్నారు. ఏఎన్ఎంలకు ఆన్లైన్ ట్యాబ్ బేస్డ్ యాప్ అన్మోల్ను మంగళవారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. శస్త్రచికిత్సల ప్రొటోకాల్ ఉంటుందని... ఆ వివరాల ద్వారా అనవసరమైన వాటిని గుర్తించొచ్చన్నారు. శస్త్రచికిత్సల వివరాలు పంపని ఆసుపత్రులపైనా చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో 4,900 మంది ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు ఇస్తామని, వారికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం నుంచి ఆరుగురు అధికారులను రాష్ట్రానికి నియమించామని తెలిపారు. కొందరు ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. -
శవాలపై చిల్లర ఏరుకుంటున్నారు!
మృతదేహాల తరలింపులో కాసుల కక్కుర్తి ⇒ ఉచిత వాహనాలున్నా బాధితులను డబ్బులు డిమాండ్ చేస్తున్న సిబ్బంది ⇒ 3 నెలల్లో పేద బాధితుల సొంతూళ్లకు 3,390 మృతదేహాల తరలింపు ⇒ మరో 50 వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉంచిన ఉచిత శవాల తరలింపు వాహనాల (పార్థివ)కు డిమాండ్ ఏర్పడడంతో కొన్నిచోట్ల వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్త శవాన్ని తరలించేందుకు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఉచిత వాహన సదుపాయానికి అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటుండడంతో మృతదేహాలను ఉచితంగా తరలించాలన్న వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యానికి తూట్లుపడుతు న్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బాధితులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఉచిత తరలింపు వాహనాలకు డబ్బులు డిమాండ్ చేస్తే సహించబోమని.. సస్పెండ్, బదిలీ వంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి కార్యాలయం హెచ్చరించింది. సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి సూపరింటెం డెంట్ లేదా ఆర్‌ఎంవోను కలసి పార్థివ వాహన సౌకర్యంకోసం సంప్రదించాలని, తక్షణమే వారు వాహనాన్ని సమకూర్చుతా రని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే స్వగ్రామాలకు మృతదేహాలను తరలిస్తార ని... ఎవరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. 3 నెలల్లో 3,390 శవాల తరలింపు.. మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితం గా తరలించేందుకు 50 వాహనాలను సమకూర్చిన సంగతి తెలిసిందే. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే కేన్సర్ తదితర ఆసుపత్రుల వద్ద 32 వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇక మిగిలిన వాహనాలను పాత జిల్లా కేంద్రాలకు రెండు మూడు చొప్పున కేటాయించారు. గతేడాది నవంబర్ 18వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 3,390 మృతదేహాలను ఉచితంగా తరలించారు. అందులో ఒక్క హైదరాబాద్ నుంచే 2,463 శవాలను తరలించారు. వరంగల్ నుంచి 202 శవాలను తరలించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 155 శవాలను, కరీంనగర్లో 79, ఖమ్మం జిల్లాలో 144, మహబూబ్‌నగర్‌లో 83, మెదక్‌లో 79, నల్లగొండ జిల్లాలో 92, నిజామాబాద్‌లో 93 మృతదేహాలను తరలించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో రోజుకు సరాసరి 30 మంది చొప్పున చనిపోతుంటారని అంచనా. వారంతా కూడా దాదాపు పేదలే ఉంటారు. వారికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుదూరంలో ఉన్న ప్రాంతానికి శవాన్ని తరలించాలంటే కనీసం రూ. 15 వేలు అడుగుతున్న నేపథ్యంలో ఉచిత సర్వీసులు చాలా ఉపయోగపడు తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన ఆసుపత్రుల వద్దే కాకుండా సమీపంలో ఎక్కడైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ శవాలను కూడా తరలించడానికి పార్థివ వాహనాలను ఉపయోగిస్తున్నారు. మరో 50 కొత్త వాహనాలు మృతదేహాల తరలింపు వాహనాలను పేదలు ఉపయోగించుకుంటున్న నేప థ్యంలో మరో 50 వాహనాలను సమకూ ర్చాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇవి అందుబాటులోకి వస్తే కొత్త జిల్లా కేంద్రా ల్లోనూ సేవలు అందించే అవకాశం ఉంది. -
ఈ బియ్యం.. అమృతతుల్యం
పోషకాల మిశ్రమంతో బియ్యం ⇒ అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్‌వో సూచన ⇒ విటమిన్ల లోపంతో బాధపడే వారికోసం ఏర్పాట్లు ⇒ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టి ⇒ రాష్ట్రంలో 60 శాతం పిల్లల్లో ఐరన్ లోపమున్నట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: రక్తహీనత, డయేరియా, గుండె జబ్బులు, షుగర్ తదితర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఐరన్, విటమిన్లు, లవణాల లోపాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. పోషకాలు, లవణాలు, విటమిన్లు కలిగిన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. ఇటువంటి బియ్యాన్ని తయారుచేసి ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రజలకు అందజేస్తే ఎలా ఉంటుందన్న దానిపై జాతీయ పోషకాహార సంస్థతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 60 శాతం చిన్నారుల్లో రక్తహీనత... దేశంలో అత్యధికమంది బియ్యంతో తయారైన ఆహారాన్నే తీసుకుంటారు. దక్షిణ భారతంలో ఇదే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఐరన్ వంటివి ఉండటంలేదు. దీంతో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు పోషకాల లోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు. 2015–16 జాతీయ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 6 నుంచి 59 నెలల పిల్లల్లో 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15–49 ఏళ్ల మహిళల్లో 56.9 శాతం మంది, అదే వయస్సు గల గర్భిణీల్లో 49.8 శాతం మంది, అదే వయస్సులోని 15.4 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరంతా ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 25 శాతం మంది పోషకాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాలు లేకపోవడంతో అనేకమంది రక్తహీనత, డయేరియా, అధిక బరువు, ఎముకల జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రధానంగా పేదల్లో ఉండటం గమనార్హం. పోషకాలతో బియ్యాన్ని ఎలా తయారుచేస్తారంటే..? బియ్యంతో తయారైన అన్నం బదులు ఇతరత్రా ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల మిశ్రమంతో బియ్యాన్ని తయారు చేయాలనేది డబ్ల్యూహెచ్‌వో సూచన. నిర్ణీత నిష్పత్తిలో ఐరన్, అయోడిన్, జింక్, ఫోలిక్ యాసిడ్, బీ1, బీ2, బీ6, బీ12, నియాసిన్ వంటి నీటిలో కరిగే విటమిన్లు సహా ఏ, డీ వంటి కొవ్వులో కరిగే విటమిన్లతో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని తయారు చేస్తారు. అలాగే బియ్యాన్ని దంచి, అందులో ఈ పోషకాల మిశ్రమాన్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వండడానికి అనువు గా తిరిగి బియ్యంగా తయారుచేస్తారు. ఈ బియ్యంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఈ బియ్యంతో పోషక లోపం నివారించవచ్చు ‘పోషకాహార బియ్యాన్ని ప్రజలకు అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఆయా దేశాలకు సూచించింది. ముఖ్యంగా విటమిన్లు, ఐరన్ వంటి లోపంతో బాధపడే పిల్లలు, పెద్దలకు ఇవి అందజేయాలి. దీనిపై జాతీయ పోషకాహార సంస్థ కూడా దృష్టిసారించింది. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదలకు అందజేస్తే పోషకాహార లోపాన్ని సరిదిద్దవచ్చు.’ –డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
590 మంది చిన్నారులకు కుష్టు వ్యాధి
జిల్లాల వారీగా సమీక్షలో అధికారుల వెల్లడి సాక్షి, అమరావతి: కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. తాజాగా నమోదైన కేసులు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 590 మందికిపైగా చిన్నారులకు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. ఈ ఏడాది 4,200 కేసులకుపైగా నమోదయ్యాయి. కుష్టువ్యాధి (లెప్రసీ)పై అన్ని జిల్లాల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలు బయటపడ్డాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోనే గడచిన ఏడాది కాలంలో 67 కుష్టు వ్యాధి కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలోనూ 2016–17లో 41 కేసులు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం) పథకం అమలు అధ్వానంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో చిన్నారుల్లో తొలి దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించే అవకాశం లేకుండా పోతోందని తెలుస్తోంది. 2016–17లో రూ.2 కోట్లకుపైగా నిధులిస్తే అందులో 25 శాతం కూడా ఖర్చు చేయలేక పోయారని ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. -
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆంధ్రా బ్యాంకు రుణం
హైదరాబాద్‌లో 4 ఆస్పత్రులకు రూ.800 కోట్లు ఇచ్చే అవకాశం ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ చర్చలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించబోయే నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రుణం ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంకు ముందుకు వచ్చింది. ఒక్కో ఆస్పత్రికి రూ.200 కోట్ల చొప్పున రూ.800 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. బుధవారం ఈ మేరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరిపారు. రుణ షరతులు తదితర అంశాలపై ఓ అంచనాకు వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోనూ చర్చలు జరుపుతారు. ఎల్బీ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం వద్ద, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతో పాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు. ఒక్కో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మిస్తారు. ఆయా ఆస్పత్రులను నిర్మించడానికి అవసరమైన అంచనాలు, ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. గతంలో ఒక విదేశీ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఆ దేశ కరెన్సీ ద్వారా వాయిదాలు చెల్లించే సందర్భంలో రూపాయి విలువ పడిపోతే మరింత భారం కావచ్చొని భావించింది. దీంతో ఆ రుణాన్ని వద్దనుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. -
‘అమ్మ’ ఆరోగ్యంపై అలక్ష్యమేనా..?
⇒ మొన్న నిలోఫర్, నిన్న గాంధీలో వరుస సంఘటనలు ⇒ నిలోఫర్‌లో మరణాలపై ఇప్పటికీ రాని కలెక్టర్ నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న బాలిం తల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిలోఫర్‌లో ఐదుగురు బాలింతల మృతి మరవకముందే... తాజాగా గాంధీ ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. ఈ ఘటనలు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిలోఫర్ ఘటన ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులే చెప్పారు. నిలోఫర్ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించారు. ఇన్నేళ్లయినా కలెక్టర్ నివేదికను సమర్పించకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వకుం డా, బాధ్యులను ఆస్పత్రిలోనే కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడి ఇద్దరు అధికారులను సరెండర్ చేసి వదిలేయడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలపై సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అసలు నిర్లక్ష్యపు మరణాలకు బ్రేక్ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యుల పై చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ జంకుతోందన్న విమర్శలూ ఉన్నాయి. బాధ్యులైన అధికారులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ఉద్యోగులనుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఉంది. మరణాలు సహజమన్న సర్కారు..! రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రం లో ఏడాదికి 650 మంది తల్లులు చనిపోతున్నారని అంచనా. సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య వసతి లేకపోవడం వంటి కార ణాలతో తల్లుల మరణాలు సంభవి స్తుం టాయి. కానీ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో కేవలం నిర్లక్ష్యంతో తల్లుల మరణాలు సంభవించడమేంటి? నిలోఫర్ çఘటనపై కలెక్టర్ నివేదికంటూ కాలయాపనకే వైద్య ఆరోగ్యశాఖ యత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. గతంలో సరోజిని కంటి ఆస్పత్రి ఘటననూ కాలయాపనతో మరుగునపడేశారంటున్నారు. ‘బాలింత ఎం దుకు చనిపోయిందో నిర్ధారించడం 51% సాధ్యం కాదు. ఫలానా కారణంగానే చనిపోయారని చెప్పడం అసాధ్యం ’అని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. సరోజిని, నిలోఫర్, గాంధీ ఆస్పత్రులన్నీ బోధనాసుపత్రులే. వాటన్నింటికీ ప్రధాన బాధ్యత వహించే వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేకపోవడం గమనార్హం. ‘మేము ఎంతో చేయాలనే వచ్చాం. కానీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం కారణంగానే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులకు వైద్యులెలా బాధ్యులవుతారు?’ అని ఒక వైద్యుడు వ్యాఖ్యానించారు. -
ఆయుష్ ప్రవేశాలెలా?
వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నత విద్యా మండలి లేఖ సాక్షి, హైదరాబాద్: ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపడతారా లేదా తెలంగాణ ఎంసెట్ ద్వారా చేపడతారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం లేఖ రాసింది. ఈ నెల 27న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఆలోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఆయుష్ పరిధిలోని ఆయుర్వేద (బీఏఎంఎస్), హోమియోపతి (బీహెచ్ఎంఎస్), నేచురోపతి, యోగా కోర్సుల్లో ప్రవేశాలను నీట్ ద్వారా చేపడితే ఎంసెట్‌లో వాటిని తొలగించి అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ, బీఫార్మా తదితర కోర్సులకే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని లేఖలో ఉన్నత విద్యా మండలి పేర్కొంది. 2017–18 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 7న నీట్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసిందని, కానీ అందులో ఈ కోర్సులు లేవని గుర్తుచేసింది. అయితే ఆయుష్ ప్రవేశాలనూ నీట్ ద్వారానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం గత నెల 25న రాష్ట్రాలకు లేఖ రాసిందని వివరించింది. ఈ నేపథ్యంలో నీట్ పరిధిలోకి తెచ్చే కోర్సులపై సీబీఎస్ఈ నుంచి ఉన్న ఆదేశాలేమిటి... ఎంసెట్ పరిధి లోంచి వాటిని తొలగించాలా వద్దా... ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించా లా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. యునానిపై మరింత స్పష్టత అవసరం యునాని కోర్సులో ప్రవేశాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్లో ఉర్దూ ద్వితీయ భాషగా చదువు కున్న వారే దానికి అర్హులు కావడంతో ప్రత్యేక పరీక్ష ద్వారానే యునానిలోని 175 సీట్లను భర్తీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యునానిని నీట్లో చేరుస్తారా లేదా అనే అంశంపైనా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను నీట్ నీట్ నోటిఫికేషన్లో చేర్చడమే మిగిలింది. సీబీఎస్ఈ ఈ దిశగా చర్యలు చేపడితే గందరగోళం ఉండదు. -
రక్తహీనత మహిళలకు పోషకాహారం
⇒ ఇక్రిశాట్‌తో ఒప్పందానికి వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం ⇒ పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లా ఎంపిక ⇒ జొన్న, ఇతర తృణధాన్యాల మిశ్రమ పొట్లాల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రక్తహీనతతో బాధపడే గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు పోషకాహారం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్రిశాట్ అధికారులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చర్చించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఏరియాలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళలకు పోషకాహారంతో కూడిన ఆహారా న్ని రోజువారీగా సరఫరా చేయ నున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. 60 శాతం మందికిపైగా రక్తహీనత బాధితులే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 60 శాతానికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. రక్తహీనత కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతు న్నాయి. వాకాటి కరుణ ఆధ్వర్యంలో జిల్లాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎక్కడ చూసినా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. దీంతో పోషకాహార సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్రిశాట్ ఇప్పటికే పోషకాహార మిశ్రమాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచింది. జొన్నలు, శనగలు, రాగులు, ఇతరత్రా సమపాళ్లలో కలిపిన ఆహారపదార్థాలను కలిపి ఉంచిన పొట్లాలను సిద్ధం చేసింది. అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాహార బిస్కెట్లను కూడా ఇక్రిశాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని రక్తహీనతతో బాధపడుతున్న మహిళలతోపాటు ఇతర మహిళలకు కూడా సరఫరా చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఉద్దేశం. దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను ఉపయోగించుకోనుంది. ఉట్నూరులోని మహిళల సంఖ్య, వారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారెందరు వంటి వివరాలను సేకరించి త్వరలో అక్కడ పోషకాహారాన్ని సరఫరా చేయనుంది. -
పొడగరి గురించి పోలీసుల ఆరా
తన వద్దకు పిలిపించుకుని వివరాలు కనుక్కున్న ఎస్పీ రాజాం: శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లానికి చెందిన పొడగరి ఇజ్జాడ షణ్ముఖరావు(24)గురించి పోలీసులు ఆరా తీశారు. 8 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న ఈ యువకుడి పరిస్థితిపై సోమవారం సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ‘అబ్బో..ఎంతెత్తున్నాడో..!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి స్పందించి ఆరా తీశారు. షణ్ముఖరావును తన వద్దకు తీసుకురావాలని సంతకవిటి ఎస్ఐ ఎస్.చిరంజీవిని ఆదేశించడంతో రేగిడి మండలం సంకిలి పారిస్ చక్కెర కర్మాగారం వద్దకు వచ్చిన ఎస్పీ ఎదుటకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే! తన పెరుగుదలతో పాటు ఆరోగ్యం, చదువు గురించి ఎస్పీ వాకబు చేశారని, ఎత్తు, బరువు వివరాలు సేకరించినట్టు షణ్ముఖరావు ‘సాక్షి’కి తెలిపారు. మరోసారి పిలుస్తామని, రావాలని ఎస్పీ చెప్పారన్నారు. ఈ పొడగరి గురించి ‘సాక్షి’లో కథనం రావడంతో వివిధ చానళ్ల ప్రతినిధులు బిళ్లానికి క్యూకట్టారు. వైద్య శాఖకు చెందిన అధికారులు కూడా ఇతని పెరుగుదలపై ఆరా తీశారు. -
సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట
కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో సరోగసీ బోర్డు ⇒ ఫైలును సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ ⇒ అద్దె గర్భం ఇచ్చే వారికి, సంతానం కోరుకునే వారికి బంధుత్వం తప్పనిసరి ⇒ రిజిస్టర్డ్ క్లినిక్‌లలో మాత్రమే సరోగసీకి అనుమతి ⇒ నిబంధనలు కట్టుదిట్టం.. దుర్వినియోగానికి చెక్ సాక్షి, హైదరాబాద్: పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు వరంగా ఉండాల్సిన సరోగసీ దుర్వినియోగం అవుతుండడంతో.. దానికి అడ్డుకట్ట వేసేలా సరోగసీ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఫైలును సిద్ధం చేసింది. త్వరలోనే సరోగసీ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి, న్యాయ శాఖ ప్రతినిధి, పేరెన్నికగన్న మహిళా సంఘానికి చెందిన ప్రతినిధి, ప్రముఖ వైద్యులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. సరోగసీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి బోర్డు కృషి చేస్తుంది. తెలంగాణలో దాదాపు 20 వరకు సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని అంచనా. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు నియంత్రణ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని.. పిల్లలు పుట్టనివారు, పిల్లలను కనడానికి సమయం కేటాయించలేని కొందరు సెలబ్రిటీలు సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులు అవుతున్నారు. పిల్లలు కలగనివారి కోసం టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ఉన్నా.. అందులో సక్సెస్ రేటు తక్కువ కావడంతో సరోగసీ వైపు మొగ్గుతున్నారు. కానీ ఇది తీవ్ర స్థాయిలో దుర్వినియోగానికి గురవుతోంది. పేద మహిళలకు గాలం వేసి సరోగసీ తల్లులుగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరోగసీ విధానం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్ర చట్టంలోని కీలక అంశాలు.. ► వ్యాపారపరమైన సరోగసీపై నిషేధం. సరోగసీ తల్లికి, పిల్లల తల్లిదండ్రులకు మధ్య బీమా, వైద్య ఖర్చులు తప్ప ఇతర ఆర్థిక లావాదేవీలేవీ ఉండకూడదు. ► దేశంలో సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకునేవారు భారతీయులై ఉండాలి. సంతానం కావాలనుకునే దంపతుల వయసు మహిళలైతే 23 నుంచి 50 ఏళ్లు, పురుషులైతే 26 నుంచి 55 ఏళ్లు ఉండాలి. వారికి వివాహమై కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. వారికి అప్పటివరకు ఎటువంటి సంతానం ఉండకూడదు. దత్తత కూడా తీసుకుని ఉండకూడదు. ► పిల్లలు కలిగే అవకాశం లేదని, సరోగసీ అవసరమని జిల్లా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. ► సరోగసీ ద్వారా పుట్టే బిడ్డకు సాధారణ పిల్లల్లాగే సర్వహక్కులూ ఉంటాయి. ► సరోగసీ ద్వారా సంతానం కోరుకునేవారికి, అద్దె గర్భం దాల్చేందుకు సిద్ధమయ్యే వారికి మధ్య దగ్గరి బంధుత్వం ఉండాలి. ► అద్దె గర్భం దాల్చే మహిళ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఆమెకు అంతకుముందు సంతానం ఉండాలి. ఆమెకు ఒక్కసారికి మాత్రమే ఆమె అద్దె గర్భం దాల్చడానికి అనుమతిస్తారు. సరోగసీకి ఆమె ఆరోగ్యం సహకరిస్తుందన్న ధ్రువీకరణ పత్రం సైతం తప్పనిసరి. ► సరోగసీ క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి. ప్రమాణాల మేరకు సరైన చికిత్స, వసతి, పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశాకే అనుమతివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం కోసం వాటిని నడపకూడదు. ► సరోగసీ క్లినిక్‌లు సంబంధిత రికార్డులను 25 ఏళ్లపాటు తప్పనిసరిగా దాచిపెట్టాలి. ► సరోగసీ పద్ధతిలో పుట్టిన బిడ్డను అమ్మటం గానీ, విదేశాల వారికి అప్పగించడంగానీ నేరం. ఎన్నో చిక్కులు.. సందేహాలు కొందరు విదేశీయులు భారత దేశంలోని పేద మహిళలను సరోగసీ కోసం వినియోగించుకుని పిల్లలను కంటున్నారు. అయితే ఇలా కన్న బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాక సరిగా చూసుకుంటున్నారా, ఎవరికైనా అమ్మేస్తున్నారా? అన్న సందేహాలు ఉన్నాయి. సరోగసీ తల్లి ప్రసవించిన తర్వాత పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉన్నా, ఏవైనా శారీరక లోపాలు ఉన్నా వదిలేసి పోతున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ఇక ఒకే మహిళ పలుమార్లు సరోగసీ విధానంలో గర్భాన్ని మోస్తుండడంతో.. ఆమె ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. పలుమార్లు సరోగసీ తల్లులు 9 నెలలు కడుపులో మోసి, కన్న పిల్లలను ఇవ్వడానికి మానసికంగా సంఘర్షణ పడుతున్నారు. దాంతో న్యాయపరమైన చిక్కులూ వస్తున్నాయి. మరోవైపు దళారులు, పలు సరోగసీ కేంద్రాలు దీనిని ఓ వ్యాపారంలా నిర్వహిస్తున్నాయి. ఒక్కో జంట నుంచి మూడు నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. -
స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరి మృతి
45 రోజుల్లో 12 మంది మృత్యువాత.. 183 కేసులు నమోదు హైదరాబాద్: రాజధానిలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరిని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వెంకటరాంరెడ్డి (35), మెదక్ జిల్లా ఆర్సీపురం ఎస్ఎన్ కాలనీవాసి రవీంద్ర (53) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వెంకటరాంరెడ్డి స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 6.30 గంటలకు రిఫరల్‌పై గాంధీకి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కొద్ది సేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి ఫ్లూ పాజిటివ్‌తో పాటు హెచ్ఐవీ, టీబీ, బీపీ కూడా ఉన్నట్లు చెప్పారు. మరో మృతుడు రవీంద్ర (53) రెమిడీ ఆస్పత్రి నుంచి వెంటిలేటర్‌పై 14న రిఫరల్‌పై గాంధీకి వచ్చారు. ఆయన గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 183 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 12 మంది మరణించారు. చివరి క్షణాల్లో వస్తున్నారు..: చివరి క్షణాల్లో వస్తుండటం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండా పోతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేవీ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 10 మంది ఫ్లూ పాజిటివ్ బాధితులు, మరో పది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరో 10 మంది స్వైన్‌ఫ్లూ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతుండగా, 20 మందికి పైగా ఫ్లూ అనుమానితులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
⇒ ఆరు నెలల్లో 521 పాజిటివ్ కేసులు... 17 మంది మృతి ⇒ 14 తేదీ ఒక్కరోజే 39 పాజిటివ్ కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ రోజు రోజుకూ విజృంభిస్తోంది. వారం పది రోజు లుగా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంగళవారం(14) ఒక్క రోజే 137 మంది రక్త నమూనాలను పరీక్షించగా... అందులో 39 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ నెల 14 వరకు ఆరు నెలల కాలంలో 4,633 మంది రక్త నమూనాలను పరీక్షించగా... 521 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. అందులో 17 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు. ఇదిలా ఉండగా వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. ఏ ఆసుపత్రికెళ్లినా వైరల్ ఫీవర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గాంధీ ఆస్ప త్రిలో బతకడం కష్టమని తేల్చిన సీత అనే మహి ళను.. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూ. 4 లక్షలు తీసు కుని చికిత్స అందించి బతికించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శన మిది. స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచిత వైద్యం అందించాలని... మందులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం జరపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణ లున్నాయి. ఇదిలా ఉండగా ఈసీఐఎల్‌కు చెందిన వ్యక్తి(69) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఈనెల 13న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నమూనాలు సేకరించి వైద్య సేవలు అందిస్తుండగా అదే రోజు మృతి చెందాడు. బుధవారం అందిన నివేదికలో అతనికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. -
వైద్యశాఖపై దృష్టిపెట్టండి: పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో అన్నిశాఖలు కుంటుపడ్డాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనునిత్యం ఏదో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్న వార్తలు ఎన్నో వింటున్నాం.. అయినా వైద్యశాఖ అధికారులు చలించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనన్నారు. ఇటీవలి కాలంలో సరోజిని హాస్పిటల్, నీలోఫర్, గాంధీ ఆస్పత్రులలో సరైన సదుపాయాలు లేక, వైద్య పరికరాలు లేక అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యశాఖ పై దృష్టిపెట్టాల్సిన అవసరముందున్నారు. హైదరాబాద్ నగరంలో అయినా, లేదంటే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని వసతులను పరిశీలించడానికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. -
రూ.9,306 కోట్లు కేటాయించండి
సర్కార్‌కు ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో అందుకోసం 2017–18 రాష్ట్ర బడ్జెట్లో రూ.650 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపా దించింది. అమ్మఒడి పద్దు కింద కొత్తగా ఈ ప్రతిపాదన చేసింది. మొత్తంగా 2017–18 బడ్జెట్లో రూ.9,306 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించి నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 834 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.484 కోట్లు కేటాయించగా... వచ్చే బడ్జెట్లో రూ.740 కోట్లు కేటాయించాలని కోరారు. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి కొత్తగా రూ.834 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్‌లో నిర్మించబోయే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. -
డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో పోలియో నియంత్రణలో ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. గత రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్యతో పాటు మరణాల శాతం కూడా బాగా తగ్గిందని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిని నయం చేసేందుకు అన్ని రకాల వసతులు, మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పోలియోపై పూర్తి స్థాయిలో నివారణ ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కిడ్నీ బాధితులకు ఉచిత మందులు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితకాలం ఉచితంగా మందులు అందిస్తా మని, త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తా మని లక్ష్మారెడ్డి తెలిపారు. మరో 40 డయాల సిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్ రూ.70 లక్షలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లా డుతూ ప్రస్తుతం సుమారు 8 వేల మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అంది స్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నాన్ కమ్యూని కబుల్ డిసీజెస్ సెంటర్లనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. నిరుపేద రోగుల కోసం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాహకు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ కార్య దర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, గాంధీ్ర పిన్సిపాల్ బీవీఎస్ మంజుల, సూప రింటెండెంట్ జేవీ రెడ్డి, అగర్వాల్ ట్రస్ట్ నిర్వాహకులు కరోడిమల్ అగర్వాల్, రాజేష్ కుమార్, కపూర్‌చంద్, నరేశ్‌కుమార్ చౌదరి, దుర్గాప్రసాద్ నరెటా పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం
వైద్యాధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై ప్రజల ను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, నిమ్స్ సూపరింటెండెంట్ మనోహర్, గాంధీ ఆస్ప త్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రజా రోగ్య సంచాలకుడు లలిత తదితరులు పాల్గొ న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని... నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)తో పాటు ఫీవర్ ఆసుపత్రిలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని ఆదేశించారు. నిమ్స్ సూపరింటెండెంట్‌ను నోడల్ అధికారిగా నియమించాలని... గాంధీ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా చికిత్సలు అందించాలని సీఎస్ ఆదేశించారు. స్వైన్ ప్లూపై ప్రతి రోజు సమీక్షించాలని, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో స్వైన్ ప్లూ లక్షణాలతో చేరిన వారికి వెంటనే తగు పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన పక్షంలో తదుపరి చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించాలని సీఎస్ సూచించారు. రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ అన్ని జిల్లా ఆస్పత్రు ల్లోనూ... హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రు ల్లోనూ మందులు, కిట్లు సరిపడినంత ఉన్నా యన్నారు. గాంధీ ఆసుపత్రిలో 60 పడకలను ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించామన్నా రు. అక్కడ 20 వెంటిలేటర్లు ఉన్నాయని... 24 గంటలూ పల్మనాలజిస్టు సేవలు అందు బాటులో ఉన్నాయని సీఎస్‌కు వివరించారు. జిల్లాల నుంచి... ప్రధాన ఆసుపత్రుల నుంచి వచ్చే నమూనాలను ఐపీఎం ద్వారా 24 గంటల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తివారీ వివరించారు. 2015 నవంబర్‌లో 9, అదే ఏడాది డిసెంబర్లో 31 , గత ఏడాది జనవరిలో 99 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఆందోళన పడేంత పరిస్థితులు లేవని ఆయన వివరించారు. -
చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో ఇప్పటికే స్వైన్ ఫ్లూ బారిన పడి ఒకరు మృచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రుయాలో ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కర్నూలులో స్వైన్‌ప్లూ కలకలం
కర్నూలు : కర్నూలు నగరంలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో ఏఎంసీ విభాగంలో ఇద్దరు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు స్వాప్ ద్వారా పరీక్షకు పంపించారు. ఒకే రోజు నగరంలో ముగ్గురు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. -
మరణాలకూ మీ గుండె కరగదా?
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్న ♦ కిడ్నీ వ్యాధితో 424 మంది చనిపోయినా పట్టించుకోలేదు ♦ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయొద్దు.. బతికించుకుందాం..ఇంకా 1460 కోట్లు బకాయిలున్నాయి.. ♦ కిడ్నీ వ్యాధి మృతులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి ♦ నెలకు రూ.10వేలు మందులకు ఇవ్వాలి ♦ డయాలసిస్ యూనిట్లకు కోట్లు అవసరమేలేదు.. ♦ నేను వస్తున్నాననే హడావుడిగా జీవోలు జారీ.. ♦ పనిచేయని కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులేమిటి? ♦ వెలిగొండ పనులు పూర్తి చేస్తే ప్రకాశంలో వెలుగులే.. ♦ ప్రకాశం పర్యటనలో ప్రతిపక్షనేత పిలుపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైద్యం అందక పేదలు మరణిస్తున్నా మీ గుండె కరగదా అని సీఎం చంద్రబాబును ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. అపర సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వైద్యం చేసే స్థితి లేదని ఆయన విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందకపోవడంతోనే ప్రకాశం జిల్లాలో గత రెండేళ్లలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందారని జగన్ వివరించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లిలో జగన్ ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలసి పరామర్శించారు. వారి కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత వైద్యం అందటం లేదని ప్రైవేట్ వైద్యం కొనే స్థోమత లేక ఇప్పటికే వేల సంఖ్యలో మృతి చెందారని బాధితులు జగన్‌కు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. గుండె తరుక్కుపోతోంది.. ‘‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. చంద్రబాబుకు జిల్లాలోని ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగులుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు కళ్లారా చూశాకైనా బాబు మనస్సు కరిగించుకోవాలి. కిడ్నీ వ్యాధి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. వ్యాధిగ్రస్తులకు మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలి. వారి కుటుంబాలు గడవడం కోసం భృతి చెల్లించాలి. బాబు పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందటం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో వారు వైద్యాన్ని నిలిపివేశారు. రూ.910 కోట్లు కావాలని వైద్య ఆరోగ్యశాఖ కోరితే రూ.568 కోట్లు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అందులో పాత బకాయిలకే రూ.368 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి రూ.1460 కోట్లు అవసరం ఉంది. నిధులివ్వకుండా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత రెండేళ్లలో ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి బారిన పడి 424 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నాన్న హయాంలో పేదలకు ఉచిత వైద్యం.. కిడ్నీలు పాడైనా.. అనారోగ్యం వచ్చినా నేనున్నా... అని, లక్షలు ఖర్చయినా భయపడవద్దంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలనలో పేదలు అప్పులపాలు కాకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొని నవ్వుతూ తిరిగి వచ్చేవారు. ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిడ్నీలు పాడైపోయి వైద్యం అందక పేదలు మృత్యువాత పడుతున్నారు. పేదవాడికి సంఘీభావంగా వారికి భరోసా కల్పించేందుకే ఈ సభ. ఆరోగ్యశ్రీ కోసం పోరుబాట.. ఆరోగ్యశ్రీ అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశాం. ప్రకాశం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో నేను కూడా పాల్గొన్నా.. దీనికి భయపడి చంద్రబాబు ప్రభుత్వం రూ.270 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవం తంగా అమలు చేసి పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకే మరిన్ని మెరుగైన మార్పులు చేసి 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. పేదలకు వైద్యం అందించటంతో పాటు అనారోగ్యానికి గురై కిడ్నీలు, గుండె, కాలు తదితర ఆపరేషన్లు చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు భృతి కూడా ఇస్తామని చెప్పాం. ఆరోగ్యశ్రీని నాశనం చేస్తున్నారిలా... నెట్వర్క్ ఆసుపత్రులకు నెలల తరబడి డబ్బులివ్వలేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి 2007లో వైఎస్ ఇచ్చిన రేట్లే ఇçప్పుడూ కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ఆపరేషన్ల ఖర్చులు పెరగడంతో రేట్లు పెంచమని ప్రైవేట్ ఆసుపత్రులు పదే పదే అడుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ పేషెంట్లకు కీమో థెరపీ చేయాలి. ఒక్కసారికి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. కీమో థెరపీ ఎనిమిది సార్లు చేస్తే రూ.8 లక్షలు ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీలో ఎంత ఇస్తారో అంత మొత్తానికి సరిపడా మాత్రమే కీమోథెరపీ చేస్తున్నారు. దీంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యశ్రీలో మూగ, చెవుడు పిల్లలకు వైద్యం అందటం లేదు. దివంగత నేత వైఎస్ హయాంలో మూగ, చెవిటి పిల్లలకు 12 సంవత్సరాల వరకు ఆపరేషన్లు చేసేవారు. ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపు వారికే ఆరోగ్యశ్రీ వైద్యం అంటూ ఆంక్షలు పెట్టింది. దివంగత నేత వైఎస్ హయాంలో 108కు ఫోన్ కొట్టగానే కుయ్..కుయ్... మంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్సు వచ్చేది. ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి చేర్చేవారు. ఇవాళ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. పేదల వైద్యానికి సహకరించే ఆరోగ్యమిత్ర లను తొలగించటంతో వారు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆశా వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ఇక 104కు ఫోన్ చేస్తే అవి రావు... వచ్చినా మందులుండవు... పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఖర్చులు తడిసిమోపెడు... కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రలు, రక్తపరీక్షలకు రూ.4 వేలు ఖర్చవుతుంది. ఆ స్థాయి దాటి డయాలసిస్ స్టేజ్‌కు వెళితే వారానికి 2, 3 సార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక్కోసారి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. నెలకు రూ.16 వేల నుంచి రూ.24 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఏడాదికి ఇది లక్షల్లోకి చేరుకుంటుంది. ఇది పేదవాడికి మోయలేనంత భారం.కిడ్నీ వ్యాధిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ’నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి సర్వే చేసింది. జిల్లాలో 56 మండలాలు ఉండగా 48 మండలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండి తాగేందుకు నీళ్ళు పనికిరాకుండాపోయాయని నివేదిక ఇచ్చింది. 787 గ్రామాల్లో ఫ్లోరైడ్ అధిక మోతాదులో ఉందని నివేదించారు. ఫ్లోరైడ్ నీటితో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. వెయ్యి అడుగుల వరకు బోరు తవ్వితే తప్ప జిల్లాలో నీళ్లు పడే పరిస్థితి లేదు. దీని వలన ఫ్లోరైడ్ వాటర్ బయటపడుతుంది. ఈ నీళ్లు తాగి ఒళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడి ఉపశమనం పొందేందుకు పెయిన్‌కిల్లర్స్‌ను వాడుతుండటంతోనే కిడ్నీలు పాడైపోతున్నాయి. వైఎస్ హయాంలో నల్గొండకు కృష్ణాజలాలు ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నల్గొండ జిల్లాకు సురక్షిత నీరు అందించిన ఘనత దివంగత నేత వైఎస్‌కే దక్కింది. రూ.1700 కోట్లతో ఎస్ఎల్బీసీ నుంచి కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు అందించారు. సాగర్ నీటి వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి తగ్గింది. ప్రకాశం జిల్లాలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా... ఫ్లోరైడ్ పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం లేదు. ఆర్వో ప్లాంట్లలో రికవరీ 30 నుండి 40 శాతం నీళ్ళే ఉంటాయి. 60 శాతం నీటిలో ఫ్లోరైడ్ పూర్తిస్థాయిలో ఉంటుంది. దీన్ని బయటకు వదిలితే తిరిగి భూమిలోకి చేరి మళ్ళీ ఫ్లోరైడ్‌గా మారుతుంది. అందువల్ల రక్షిత నీరే మార్గం. కాలువల ద్వారా నీటిని తరలించాల్సిందే. ఫ్లోరైడ్ పోవాలంటే.. వెలిగొండ నీరే శరణ్యం ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి తగ్గాలంటే వెలిగొండ ప్రాజెక్టు నీరే శరణ్యం. వెలిగొండకు మరిన్ని నిధులిచ్చి పనులు వేగవంతం చేసిన ఘనత వైఎస్‌దే. ఆయన హయాంలో వెలిగొండకు రూ.4,700 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేశారు. వెలిగొండకు నీళ్ళు వచ్చే టన్నెల్–1, 2 పనులు దాదాపు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. టన్నెల్–1 పనులు 5 కి.మీ. పెండింగ్‌లో ఉన్నాయి. టన్నెల్–2కు 8 కి.మీ. పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనిచేయని కాంట్రాక్టరుకు అదనపు చెల్లింపులా..? వెలిగొండ పనుల్లో టీడీపీ మంత్రికి వాటాలున్నాయి.. ముఖ్యమంత్రికి ఆ మంత్రి వాటా ఇస్తున్నారు కాబట్టి వెలిగొండ కాంట్రాక్టరు ఏ పనీ చేయకపోయినా అదనంగా చెల్లిస్తున్నారు. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌కు అధికంగా నిధులివ్వకూడదన్న నిబంధన ఉంది. పనులు చేయని వెలిగొండ కాంట్రాక్టరును ఊడబెరకాల్సింది పోయి 65 కోట్లు అదనంగా చెల్లించారు. కాంట్రాక్టర్ పని చేయకపోయినా, అతనికి చేతకాకపోయినా అతనికి చంద్రబాబు తోడుగా ఉన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు ఎంపీ వై.వి.కృషి ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేం దుకు ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శాయశక్తులా కృషి చేశారు. బాధితుల గోడు చూసి తట్టుకోలేక 2015 నుండి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ వై.వి. 10 లేఖలు రాశారు. ప్రధానిని కూడా కలిశారు. ఈ ప్రాంత వాసులకు పైప్లైన్ల ద్వారా సాగర్ నీటిని అందించేందుకు రూ.996 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను రాష్ట్రానికి చేర్చగా అది పక్కన పెట్టింది’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఒత్తిడి వస్తేనే చంద్రబాబు పలుకుతాడు ఒత్తిడి వస్తేనే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుకు తాడు. మూడు సంవత్సరాల పాలనలో ప్రకాశం జిల్లా కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకోని చంద్రబాబు జగన్ కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు వస్తున్నాడని పత్రికల్లో రాగానే స్పందించాడు. అందుకే నా పర్యటనకు ఒక్క రోజు ముందు కందుకూరు, కనిగిరి, మార్కాపురం కేంద్రాలలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చాడు. డయాలసిస్ సెంటర్ల కోసం కోట్లు అవసరం లేదు. ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.10 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. కనిగిరిలో డయాలసిస్ యూనిట్ కోసం ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఏప్రిల్ 2016లో తన ఎంపీ నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయించారు. గ్రాంటు ఉన్నా ప్రభుత్వం యూనిట్ పెట్టేందుకు ముందుకు రాలేదు. -
దవాఖానాలో మర్యాద రామన్నలు..!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇకపై మర్యాదే మర్యాద పారిశుద్ధ్యం, బాత్రూమ్లు ఇక క్లీన్ అండ్ గ్రీన్ శాస్త్రీయ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు వంద మార్కులొస్తేనే కాంట్రాక్టర్లకు 100% చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల చీదరింపులు.. ఛీత్కారాలు.. మనం చూస్తూనే ఉంటాం. రోగులను ఎక్కడా నిలబడనీయరు.. కూర్చోనీయరు. ఇక పారిశుద్ధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాయిలెట్లు అధ్వానంగా ఉంటే.. ఆస్పత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తుం టుంది. దీంతో సర్కారు దవాఖానాకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇకపై ఇలాంటి పరిస్థితు లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. సమగ్ర ఆస్పతుల నిర్వహణ, వసతులు, సేవల విధాన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 18 వేల పడకల కు ఒక్కో పడకకు నెలకు రూ.6 వేల చొప్పున నిర్వ హణ ఖర్చు కింద ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. దీంతో అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మర్యాదలు చేసేందుకు, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు.. బాత్రూంలు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తగు సిబ్బందిని నియమించుకోనున్నారు. సర్వే అనంతరం శాస్త్రీయ నిర్ణయం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల మొదలు ఉస్మానియా, గాంధీ వరకు అన్ని బోధన, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అధ్వా నంగా ఉన్నాయని సర్కారు అంచనా వేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో శాంపిల్ సర్వే చేసింది. ఆస్పత్రులు అధ్వానంగా ఉండటానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిం ది. ఒక ఆస్ప త్రిలో చేసిన సర్వే ప్రకారం అక్కడ భద్రతా సిబ్బంది 110 మంది, రోగులకు అవసరమైన సేవలు చేసేందుకు 267 మంది, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు 239 మంది అవసరమని, ప్రస్తుతం వీటిలో సగానికి సగం కూడా లేదని తెలిపింది. అందువల్ల సిబ్బందిని వివిధ ప్రైవేటు సంస్థల నుంచి నియమించుకుని ఆస్పత్రుల్లోని ఆయా రంగాల ను మరింత మెరుగుపరచాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. బోధనాస్ప త్రులను రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదు పా యాల అభివృద్ధి సంస ఎండీ, జిల్లా స్థాయిలోని ఆసుపత్రులన్నింటినీ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో అన్ని బోధనాసుపత్రుల్లో 10 వేల పడ కలున్నాయి. వాటి నిర్వహణకు రూ.60కోట్లు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 8 వేల పడకలకు రూ.48 కోట్లు కేటాయించారు. ‘వంద’వస్తేనే వంద శాతం చెల్లింపులు.. మార్కుల ఆధారంగా ఆçస్పత్రుల పారి శుద్ధ్యం, బాత్రూంలు, భద్రత, రోగుల పట్ల మర్యాదగా మెలగటం వంటి అంశాలను అంచనా వేస్తారు. వచ్చే మార్కులను బట్టే కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తారు. లేకుంటే ఆ ప్రకారం వారికి చెల్లించే నిధుల్లో కోత విధిస్తారు. 11 విభాగాలుగా నిర్వహణ పనులను విభజించారు. ఒక్కో విభాగానికి మార్కులను నిర్ధారించారు. అటెండర్ల తీరు, వారి యూనిఫాంకు 5 మార్కులు, రోగుల పట్ల మర్యాదగా ఉంటే 10 మార్కులు, బాత్ రూం, వాష్‌రూంల క్లీనింగ్‌కు 10, వార్డుల క్లీనింగ్‌కు 10, ఓపీ, లేబరేటరీలు, లేబర్ రూంల క్లీనింగ్‌కు 10, డ్రైౖనేజీ నిర్వహణకు 10, పారిశుద్ధ్యంలో ఉపయోగించే పరిక రాలు, కెమికల్స్ తదితరాలకు 10, పబ్లిక్‌ను నియంత్రణలో ఉంచేందుకు 10, ఫిర్యాదులు లేకుండా నిర్వహించడానికి 10, భద్రతకు 10, పార్కింగ్, గుంపులు లేకుండా చూసేం దుకు 5 మార్కులు కేటాయించారు. నూటికి నూరు మార్కులు వస్తేనే నూరు శాతం నిధులు విడుదల చేస్తారు. లేకుంటే ఎంత శాతం మార్కులు వస్తాయో అంత శాతమే నిధులను విడుదల చేస్తారు. ఇలా అనేక మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. -
మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ
రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి 18 రోజుల్లో 15 కేసులు నమోదు అప్రమత్తమైన ప్రభుత్వం.. గాంధీలో స్వైన్‌ఫ్లూ ఓపీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో హెచ్1ఎన్1(స్వైన్‌ఫ్లూ కారక) వైరస్ మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. 18 రోజుల్లో 15 కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(58) మంగళవారం రాత్రి చనిపోగా, జహను మాకు చెందిన సనజ్ బేగం(39)సోమవారం మృతి చెందింది. అలాగే దోమలగూడకు చెందిన మంజుల(35) ఈ నెల 5న మృతి చెందింది. ప్రస్తుతం బహదూర్‌పురాకు చెందిన వృద్ధురాలు (64)లు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో చికిత్స పొందుతోంది. ఇతర ఆస్పత్రుల్లో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో విక్రంపురి, రామంతాపూర్, తిరుమలగిరి, చిలకలగూడ, జవహార్‌నగర్, సుల్తాన్‌బాగ్, ఉస్మాన్‌గంజ్, సైదాబాద్, మలక్‌పేట్, రాణిగంజ్, తీగలకుంట, దోమలగూడకు చెందిన వారే. నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆ మేరకు బుధవారం గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ ఓపీ విభాగాన్ని పునరుద్ధరించింది. ఇన్‌పేషంట్ల కోసం ఎనిమిదో అంతస్థులోని స్వైన్‌ఫ్లూ వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైరిస్క్ గ్రూప్‌ను వెంటాడుతున్న ఫ్లూ భయం... ఇదిలా ఉంటే ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా వర్గాలన్ని ఆందోళన చెందుతున్నాయి. గ్రేటర్‌లోని కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకే తరలిస్తుండటంతో వైరస్ ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్ జోన్లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్ సోకిన దాఖలు ఉండటమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి...డాక్టర్ మసూద్, గాంధీ ఆస్పత్రి ► సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ► ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ► గర్భిణులు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధుల కు సులభంగా వ్యాపించే అవకాశం. ► ముక్కుకు మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ► అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. -
చిత్తూరులో స్వైన్‌ఫ్లూ కలకలం : మహిళ మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించింది. స్వైన్‌ఫ్లూతో ఓ వివాహిత మృతి చెందడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఐరాల మండలం చుక్కావారిపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి, జయమ్మ(28)దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. ఐదు రోజుల క్రితం జయచంద్రారెడ్డికి జ్వరం రాగా, చికిత్స తీసుకోవడంతో ఆరోగ్యం కుదటపడింది. మరుసటి రోజు భార్య జయమ్మకు కూడా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. అయినా కోలుకోకపోవడంతో చిత్తూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో వేలూరు సీఎంసీకి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ జయమ్మ సోమవారం మృతి చెందింది. జయమ్మకు స్వైన్‌ప్లూ (హెచ్ 1, హెచ్ 2) సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారిద్దరి పిల్లలను వైద్య పరీక్షలకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నట్లు మండల వైద్యాధికారిణి లీలావతి తెలిపారు. రుయాలో ప్రత్యేక ఏర్పాట్లు... స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం తిరుపతిలోని వైద్యాధికారులను పరుగులు పెట్టిస్తోంది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో నిత్యం వేలాదిమంది యాత్రికులు, శ్రీవారి భక్తులు తిరుపతికి వస్తుంటారు. పైగా చలి గాలులు, మంచు, గాలిలో తేమ అధికంగా ఉంది. ఈనేపథ్యంలో ఎవరైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వస్తే ఆ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదని వైద్యాధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా స్వైన్ ఫ్లూ లక్షణాలతో వస్తే వారికి తక్షణమే వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ ఆదేశాల మేరకు ప్రత్యేక గది, అందులో ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించారు. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ వంటి లక్షణాలతో ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ, ఇద్దరు చిన్నారులకు లక్షణాలు ఉండటంతో వారు కోలుకునేలా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు వైద్యులు సిద్దంగా ఉన్నారు. గదిలో నాలుగు బెడ్లు, వెంటి లేటర్లు, అవసరమైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని రుయా సిఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ గీతాంజలి, సిఏఎస్ ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిక్రిష్ణ పరిశీలించారు. వైద్యులకు తగు సూచనలు, సలహాలను అందించారు. -
ఇక బయోమెట్రిక్ ఆధారిత వేతనాలు!
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, అమరావతి: కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ఆసుపత్రులు, విద్యాలయాలన్నింటి లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇప్పటికే తాత్కాలిక సచివాలయంలో ఈ విధానం కొనసాగుతుండగా.. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో చిత్తూరు జిల్లాలో వైద్య ఆర్యోగ శాఖ ఉద్యోగులందరికీ ఫిబ్రవరి 1వ తేదీన వేతనాలను బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మెమో జారీ చేశారు. -
పేద గర్భిణులకు చేయూత
ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం: సీఎం కేసీఆర్ ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా చర్యలు తీసుకోండి ♦ అందుకు ప్రోత్సాహకాలు అందించండి ♦ బిడ్డకు అవసరమయ్యే వస్తువులను కిట్ రూపంలో ఇవ్వండి ♦ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం ప్రజలకు కలిగించాలి ♦ శిశు మరణాలను సున్నా స్థాయికి తీసుకురావాలి ♦ పేదలకు వైద్యం అందించే వైద్యుల జీతాలను సవరిస్తాం ♦ వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: పేద గర్భిణులకు తగినంత ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు పెంచడంతోపాటు వాటిని ఎప్ప టికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో తీసుకోవా ల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రసూతి సమయంలో పేద గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయల బిల్లులు చెల్లించడం కష్టమన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో పేద గర్భిణులు కచ్చితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి ప్రసూతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం పేదలకు కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. అమ్మ ఒడి పేరుతో గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడం... తీసుకుపోవడం చేస్తున్నారన్నారు. ఇంకా అనేక చర్యలు చేపట్టాలన్నారు. పేదలు.. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చెందినవారు ఇంకా ఇళ్లల్లోనే ప్రసవమవుతున్నారని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వందకు వందశాతం ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సాంస్కృతిక సారథి ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో మీడియా కూడా సహకరించాలని కోరారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యే వారికి ప్రోత్సాహకాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గర్భిణీగా ఉన్నప్పుడు వారు కూలీ, వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకోలేరన్నారు. ఆ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని, అయితే ఇది పేద కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతుందని, అందుకే వారికి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా ఒక పూట పౌష్టికాహారం అందిస్తున్నా.. వారికి మరింత సాయం అవసరం అన్నారు. ప్రసవం అయ్యాక తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రసూతి సమయంలో శిశువుల మరణాలను జీరో స్థాయికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు మూడో నెల వచ్చే వరకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వమే ఒక కిట్ రూపంలో బహుమానంగా అందించాలన్నారు. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి 2017–18 బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదన్నారు. సర్కారీ వైద్య సేవలు మెరుగయ్యాయి గతేడాది బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తెస్తూ భారీగా నిధులు కేటాయించామని సీఎం వివరించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో... మందుల పంపిణీలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు. ఈసారి బడ్జెట్లో.. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యుల జీతాలు కూడా సవరించాలనే యోచన ఉందన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్ పేరుతో బస్తీల్లో వైద్య సేవలు విస్తరించారన్నారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలన్నారు. దీనిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పేదలకు అందుతున్న వైద్య సేవల విధానాన్ని అధ్యయనం చేస్తున్న అధికారుల బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లొచ్చిందని.. ఢిల్లీతోపాటు మరిన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని సీఎం సూచించారు. -
వెల్నెస్ కేంద్రం సమయం కుదింపు
ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్ పేషెంట్ (ఓపీ) వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కేంద్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా 12 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సి ఉంది. మొదట్లో రెండు మూడు రోజులు 12 గంటలపాటు సేవలు అందించింది. కానీ ఆ తర్వాత సమయాన్ని కుదించారు. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పరిమితం చేశారు. ఇప్పుడు 8 గంటలే సేవలు అందిస్తోంది. రాత్రి 8 గంటల వరకు సమయం ఉండటం వల్ల విధులు ముగించు కొని ఇంటికి పోయే ఉద్యోగులు వెల్నెస్ కేంద్రానికి వెళ్లడానికి అవకాశం ఉండేదని... కానీ ఆఫీసు సమయంలోనే పనిచేస్తే వెల్నెస్ కేంద్రానికి వెళ్లడం కుదరదని అంటున్నారు. సిబ్బంది కొరత.. వైద్యులు అనాసక్తి వల్లే... ఓపీతో పాటు రిఫరల్ సేవలు అందించే కీలకమైన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించడం వల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, మరో 15 మంది పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరందరినీ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే ఆయుష్ కేంద్రం కూడా ఉంది. రోజుకు 300 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది సరిపోవడంలేదు. దీనికి తోడు తాజాగా పని గంటలు కూడా తగ్గించడంతో ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాగా... వైద్యులు, ఇతర సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండటానికి ఒప్పుకోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకు న్నామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదనపు సిబ్బందిని నియ మించుకోవాలంటే ఆర్థిక సమస్యలు న్నాయని ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఎంబీబీఎస్ పూర్తయ్యాక ‘నెక్ట్స్’ తప్పనిసరి
- ఆ పరీక్ష పాసైతేనే మెడికల్ ప్రాక్టీసుకు రిజిస్ట్రేషన్ - ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం - నెక్ట్స్ వద్దన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బుట్టదాఖలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివిన వారికి జాతీయ స్థాయిలో మరో అర్హత పరీక్ష ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)’తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ముసాయి దాపై చర్చించాక దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం అది చట్టంగా ఉనికిలోకి రానుంది. రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ‘నెక్ట్స్’పై కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన సంగతి తెలి సిందే. నెక్ట్స్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎంబీబీఎస్ తర్వాత మరో అర్హత పరీక్ష అవసరమే లేదని స్పష్టం చేసింది. నెక్ట్స్ పాసయితేనే మెడికల్ ప్రాక్టీస్‌కు రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ముడిపెట్టడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. దీని వల్ల జాతీయ స్థాయి లో వైద్య విద్య నిర్వ హణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. ఎంబీబీఎస్ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాల యమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని.. అనంతరం విశ్వ విద్యాలయం ఆధ్వ ర్యంలోనే వాల్యుయేషన్ చేస్తారని.. ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్’అవసరం ఏముం టుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రానికి విన్నవించారు. అనేక రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని తెలిసింది. అయితే కేంద్రం మాత్రం నెక్ట్స్‌ను అమలు చేయడానికే మొగ్గు చూపుతోంది. వైద్య ప్రమాణాలు పడిపోతున్నాయనే.. వైద్య విద్యలో ప్రమాణాలు పోతున్నాయన్న భావన తోనే కేంద్రం నెక్ట్స్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అనేకచోట్ల వైద్య విద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు వెళ్తున్న సందర్భంలో అనేక కాలేజీలకు సొంతంగా ప్రొఫెసర్లు ఉండటం లేదు. వైద్య విద్యార్థులకు హాస్టల్స్, లైబ్రరీ వంటి మౌలిక సదు పాయాలు ఉండటం లేదు. ఉదాహరణకు ఇటీవల నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడి కల్ కాలేజీ, హైదరా బాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలను ఎంసీఐ తనిఖీ చేసినప్పుడు రెండు చోట్లా అవసరమైన ప్రొఫెసర్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేవని తేలింది. దీంతో నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 150 ఎంబీబీఎస్ సీట్లు, ఉస్మానియాలో 50 ఎంబీబీఎస్ సీట్లకు వచ్చే ఏడాదికి ఎంసీఐ అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితులు అత్యంత అధ్వా నంగా ఉంటున్నాయన్న భావన కేంద్రంలో ఉంది. అనేకచోట్ల పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఎంసీఐ అధికారుల్లో నెలకొని ఉంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు డొనేషన్లు తీసుకుని సంబంధిత విద్యార్థులకు పరీక్షల్లో సహకరిస్తున్నా యన్న అను మానాలూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వీటన్నింటినీ కట్టడి చేయడం కష్టమని.. అందుకే జాతీయస్థాయిలో అర్హత పరీక్ష నిర్వహిస్తే.. నిజమైన అర్హులెవరో తేలుతారని.. వారికే మెడికల్ ప్రాక్టీసు రిజిస్ట్రేషన్ చేయవచ్చనేది కేంద్రం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. -
వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడిగా జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జూపల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన కార్యదర్శిగా కలిముద్దీన్ అహ్మద్ ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో ఉంటారని పేర్కొన్నారు. -
ఫలించిన పోరాటం
► కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు ► రిలే దీక్షలు విరమణ పాడేరు: తమను విధు ల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఫలించాయి. ఎపిడమిక్ కాలానికి 6 నెలలు పాటు కాంట్రాక్టు ప్రాతి పదికన పనిచేస్తున్న వీరి ని నవంబరు 30న విధుల నుంచి తొలగిం చారు. అయితే తమను కాంట్రాక్టు హెల్త్ అసి స్టెంట్లుగా కొన సాగిం చాలంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. స్పందించి న ఐటీడీఏ పీవో రవిసుభాష్ వీరిని విధుల్లో కొనసాగించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించా రు. ఈ మేరకు మరో 6 నెలలు కాంట్రాక్ట్ పొడిగిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిుషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 95 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల ను విధుల్లోకి తీసు కుంటూ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు తెలిపారు. తమ పోరాటం ఫలించడంతో 12 రోజులుగా ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ శర్మ, ఏపీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనర్శ, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు శెట్టి నాగరాజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లతో దీక్షలను విరమింపజేశారు. -
సిద్దిపేటకు మెడికల్ కాలేజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇటీవల సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి వచ్చింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని కమిటీ తేల్చి చెప్పడంతో సీఎం అందుకు అధికారికంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎసెన్షియల్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి పంపిస్తారు. ఆ తర్వాత ఎంసీఐ ప్రతినిధి బృందం సిద్దిపేటకు వెళ్లి పరిశీలించాక అక్కడ మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి ఇవ్వనుంది. ఈ తతంగానికి సాంకేతికంగా కొంత సమయం పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది కాకుండా 2018–19 సంవత్సరానికి సిద్దిపేట మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరనుంది. నర్సింగ్ సీట్లకు కూడా అనుమతి కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మహబూబ్‌నగర్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిద్దిపేటకు మంజూరు కానుంది. -
ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల సాక్షి, అమరావతి/భీమవరం టౌన్: పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన బహిరంగ లేఖ, ధర్నా చేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం ఉత్తర్వులిచ్చారు. జగన్ లేఖ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సెలవు రోజైనా బడ్జెట్ కేటారుుంపులకు అదనంగా రూ.262.35 కోట్లు కేటారుుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల వ్యయానికి త్రైమాసిక, ట్రెజరీ ఆంక్షలను మినహారుుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేనాటికి ఆరోగ్యశ్రీ బకారుులు రూ.395.69 కోట్లు. ఈ ఏడాది అవసరం రూ. 910.77 కోట్లు. అంటే మొత్తం రూ. 1306.46 కోట్లు. కానీ ఈ ఏడాది కేటారుుంచింది రూ.568.23 కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. 738.23 కోట్లు ఆరోగ్యశ్రీ బకారుులకు అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం హడావిడిగా రూ. 262.35 కోట్లు కేటారుుంచింది. అంటే ఇంకా రూ. 475.88 కోట్లు అవసరమన్నమాట. -
‘నెక్ట్స్’ పరీక్ష అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి జాతీయ స్థారుులో ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)’ పేరిట మరో అర్హత పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘నెక్ట్స్’లో ఉత్తీర్ణులైతేనే వారు ప్రాక్టీస్ చేసేం దుకు అనుమతించే (రిజిస్ట్రేషన్ చేసే) అంశం ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. దానివల్ల జాతీయ స్థారుులో వైద్య విద్య నిర్వహణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. వైద్య విద్యకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించిన కేంద్రం... వాటిపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ ఇటీవల చెక్ లిస్ట్ పంపిన సంగతి తెలిసిందే. ఈ చెక్లిస్టులపై కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరె న్స కూడా నిర్వహించింది. ఇందులో తెలంగాణ వైద్యాధికారులు కేంద్రానికి తమ అభిప్రాయాలను వివరించారు. ఎంబీబీఎస్ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాలయమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని, అనంతరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే మూల్యాంకనం చేస్తారని... ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్’ అవసరం ఏముంటుందని రాష్ట్ర అధికారులు ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ‘నెక్ట్స్’ను కచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. విరమణ వయసుపై అస్పష్టత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచే విషయంపై కేంద్రం అభిప్రాయం కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేయలేదు. తదుపరి జరిగే సమావేశంలో దీనిపై అభిప్రాయం వెల్లడిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు వైద్య అధ్యాపకుల విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు అమలు చేస్తున్నారుు. రాష్ట్రంలో మాత్రం ఇది 58 ఏళ్లుగా మాత్రమే ఉంది. దీనిపై రాష్ట్ర వైద్య వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అరుుతే వైద్య అధ్యాపకుల విరమణ వయసు పెంచితే ఇతర ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంలో తెలంగాణ సర్కారు ఉంది. వైద్య విద్యకు సంబంధించి కేంద్రం తదుపరి ఢిల్లీలో ఒక వర్క్‌షాప్ నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రచించనుంది. వైద్య ప్రవేశాలకు ఒకే కౌన్సెలింగ్ ‘నీట్’ పరీక్ష తదనంతరం రాష్ట్ర స్థారుులో ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ ఏడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు ప్రారంభమైనా కౌన్సెలింగ్‌లు మాత్రం వేర్వేరుగా జరిగారుు. బీ కేటగిరీ సీట్లకు నాన్ మైనారిటీ కాలేజీలు ప్రత్యేకంగా ఒక కౌన్సెలింగ్ నిర్వహించగా.. మైనారిటీ కాలేజీలు మరో కౌన్సెలింగ్ నిర్వహించారుు. అలాగే ఎంసెట్ ఆధారంగా ఈసారి ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు మరో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలా వేర్వేరుగా కాకుండా ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యాధికారులు కేంద్రాన్ని కోరారు. అలాగే నీట్ పరీక్షను తెలుగు మీడియంలోనూ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆసుపత్రుల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జనన మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జారీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్ బజారులోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, పేట్లబుర్జు మోడ్రన్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రం, చెస్ట్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రి, నిమ్స్, రైల్వే ఆసుపత్రి, ఆర్టీసీ ఆసుపత్రి, గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి, తిరుమలగిరి మిలటరీ ఆసుపత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, సీకేఎం మెటర్నిటీ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, టీబీ ఆసుపత్రి, నిజామాబాద్, మహబూబ్నగర్ల్లోని జనరల్ ఆసుపత్రులు, ఆదిలాబాద్ రిమ్స్, అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని సివిల్ సర్జన్ హోదా కలిగిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు (ఆర్ఎంవో) ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అలాగే సీహెచ్ఎస్ డిప్యూటీ సివిల్ సర్జన్లు, పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వీళ్లకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీలుగా రిజిస్ట్రార్ హోదా కల్పిస్తారు. అలాగే జనన మరణ ధ్రువీకరణ పత్రాల్లో ప్రస్తుతం పురుషులు, మహిళలు అనే కాలమ్ మాత్రమే ఉంది. ఈ రెండు కాకుండా మరో మూడో వర్గం కోసం కాలమ్‌ను కొత్తగా ఉంచుతారు. మరణానికి కారణమేంటో చెప్పాలి.. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతికి కారణాలను వైద్యం చేసిన డాక్టరే ప్రతీ నెల ఐదో తేదీ నాటికి రాష్ట్రస్థారుు కమిటీకి తెలపాలి. ఇక మరణాలపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో ఎంపీడీవోలు విచారణ చేసి జిల్లా డీఎంహెచ్‌వోలకు నివేదిక అందించాలి. -
గాంధీ, ఉస్మానియాల్లో హుండీలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో హుండీలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. పెద్ద మొత్తంలో నగదు, నల్ల ధనం ఉన్నవారు హుండీలో డబ్బులేయొచ్చని, ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామని, సొమ్మును పేదల వైద్యానికి ఖర్చు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఉన్న వారు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు తప్పవని భావించే అవకాశముండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపారుు. -
ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకు ‘యాప్’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మొబైల్ యాప్‌ను తయారు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా ఏ ఆసుపత్రుల్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అందులోని వైద్యుల పేర్లు, వెల్నెస్ కేంద్రాల వివరాలు, వాటి సమయాలు, నగదు రహిత వైద్యం నిర్వహించే ఆసుపత్రులు తదితర సమాచారాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు నిర్వ హించిన వైద్య పరీక్షలు, వివిధ ఆసుపత్రుల్లో నిర్వహించిన సేవల వివరాలు కూడా యాప్‌లో ఉంచుతారు. ప్రతీ ఉద్యోగి, జర్నలిస్టుకు యూనిక్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే వారి ఆరోగ్య వివరాలన్నీ అందులో ఉంటాయి. ఈ నెలాఖరు నుంచి వెల్నెస్ కేంద్రాలు...: ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం నగదు రహిత ఓపీ సేవలను అందించే వెల్నెస్ (రిఫరల్) కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా ఈ వారంలోనే అందుబాటులోకి తేవాలని నిర్ణయించినా పెద్ద నోట్ల రద్దుతో ఈ నిర్ణయం వాయిదా పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింట్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఎవరైనా ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలను పొందాలనుకుంటే నేరుగా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొచ్చని తెలిపాయి. దీనికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వెల్నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలు, ఉచిత పరీక్షలు, మందులు ఇచ్చే పరిస్థితి అమలులోకి వచ్చాక... కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాక ప్రస్తుతం అమల్లో ఉన్న రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేస్తారు. -
పేదల శవాల తరలింపునకు వాహనాలు
- ‘సాక్షి’ కథనానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పందన - సీఎంకు ఆగమేఘాల మీద ఫైలు పంపిన అధికారులు - వారం, పది రోజుల్లో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. పేద రోగులు చనిపోతే మృతదేహాలను స్వస్థ లాలకు ఉచితంగా తరలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ‘పేదల శవానికి వాహనం దొరకదు’ శీర్షికన సోమ వారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందిం చారు. ఇప్పటికే మూలనపడి ఉన్న 50 శవాల తరలింపు వాహనాలను వెంటనే ఉప యోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అనుమతి కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫైలు పంపించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారుు. సీఎం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రస్తుతమున్న 50 వాహనాలను పేదల శవాల తరలింపునకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. వారం, పది రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతను తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థకు అప్పగిస్తామన్నారు. తర్వాత టెండర్లను ఆహ్వానించి పీపీపీ పద్ధతిలో అప్పగిస్తామని వెల్లడించారు. ప్రస్తుతమున్న వాహనాలను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రధాన ఆసుపత్రుల వద్ద సిద్ధంగా ఉంచుతారు. ఈ వాహనాలు అవసరమున్న వారు ‘108’కు ఫోన్ చేస్తే అరగంటలో వాహనాన్ని సిద్ధం చేస్తారు. -
రాష్ట్రంలో డెంగీ మృతులు ఇద్దరే
- అదుపులోనే ఉంది.. ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి - అన్ని రకాల వ్యాధులు ఎదుర్కొనేందుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: డెంగీ ప్రాణాంతకం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, గోవిందాపురం, రావినూతలలో విష జ్వరాల విజృంభణ విచారకరమన్నారు. మరణాలపై ఆడిట్ చేరుుంచామని, ఆ నివేదిక ప్రకారం ఇద్దరు మాత్రమే డెంగీ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతి చెందారని వెల్లడించారు. కొందరు గుండెపోటు, కిడ్నీ ఫెరుుల్యూర్, వివిధ వ్యాధి లక్షణాలతో మృతి చెందారని, మరికొందరు డెంగీతో చనిపోరుునట్టు అను మానాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ డెంగీ కనిపిస్తున్నా అదుపులోనే ఉందని చెప్పారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, అనుభవం లేని డాక్టర్లు డెంగీ బూచీతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డెంగీతో అనేక మంది చనిపోతు న్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డెంగీ సహా అన్ని రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ వర్షాకాల సీజన్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. జ్వర లక్షణాలున్న ప్రతి ఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేరుుంచామని పేర్కొన్నారు. -
పేదల శవానికి వాహనం దొరకదు!
- నిరుపేదలు తమవారి శవాలను మోసుకెళ్లాల్సిందేనా? - ప్రభుత్వ ఆసుపత్రుల్లో అష్టకష్టాలు - 50 వాహనాలను సిద్ధం చేసినా వినియోగించని వైనం - ప్రభుత్వ అనుమతి లేక ఆరు నెలలుగా మూలనపడిన వాహనాలు సాక్షి, హైదరాబాద్: ఒడిశాలో ఆగస్టు నెలలో మాఝీ అనే గిరిజనుడు తన భార్య శవాన్ని వాహనంలో తరలించే స్థోమత లేక 12 కిలోమీటర్లు భుజంపై మోసుకుంటూ వెళ్లాడు! తాజాగా భాగ్యనగరంలోనూ అలాంటిదే మరో దీనగాథ! సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మైకోడ్కు చెందిన రాములు డబ్బుల్లేక తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిలో పెట్టుకొని కాలినడకన 60 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇలా పేదలు చనిపోతే వారి శవాలను సొంతూరుకు వాహనాల్లో ఉచితంగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక ప్రమాదాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం పేదలు చనిపోతున్నారు. ఆ శవాలను సొంతూరుకు తరలించడం వారి బంధువులకు ఆర్థికంగా శక్తికి మించిన భారంగా మారుతోంది. భార్య శవాన్ని సంగారెడ్డి జిల్లా మానూరుకు తరలించడానికే రాములును రూ.5 వేలు అడిగారు. రాష్ట్రంలో ఇతర సుదూర ప్రాంతాలకు తరలించాలంటే రూ. 15 వేలకు మించి ఖర్చు కానుంది. పేదలు అంత మొత్తాన్ని భరించడం కష్టమే. పేదల శవాలను తరలించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఆరు నెలల కిందటే వాహనాలను సిద్ధం చేసినా.. అవి మూలకు పడి ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో రోజుకు ఒక్కో ఆసుపత్రిలో సరాసరి 30 మంది వరకు చనిపోతుంటారని అంచనా. జిల్లా ఆసుపత్రుల్లో ఐదుగురు చొప్పున మృతి చెందుతారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిని హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల నుంచి సొంతూళ్లకు తరలించడం పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. దీంతో శవాలను వారి స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించి ఏడాది కావొస్తోంది. ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వాహనాల్లో ఉచితంగా శవాలను తరలించాలని భావించారు. ఇందుకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తర్వాత జిల్లా ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేయాలనుకున్నారు. వీరేగాకుండా ప్రమాదాల్లో పేదలెవరైనా చనిపోయినా వారిని తరలించేలా ఏర్పాట్లు చేయాలనుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ లోపు అందుబాటులో ఉన్న ‘108’కు చెందిన 50 పాత అంబులెన్సులను మరమ్మతు చేసి శవాల తరలింపునకు సిద్ధంగా ఉంచారు. వాటిని తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా నడిపించాలని నిర్ణయించారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అవి ఆరు నెలలుగా మూలనపడి ఉన్నాయి. సిద్ధం చేసిన 50 వాహనాల్లో 25 వాహనాలు ఒక శవాన్ని తరలించేలా... మరో 25 వాహనాలు రెండు శవాలను తరలించేలా ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. అవసరాలకు అనుగుణంగా 150 శవ తరలింపు వాహనాలను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. -
ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్య
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి సాక్షి, అమరావతి/గుంటూరు: గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే పీజీ వైద్య విద్యార్థిని డా.సంధ్యారాణి మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నివేదిక ఆధారంగా ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన మంగళవారం వెలగపూడిలో సచివాలయంలో డిస్పెన్సరీని ప్రారంభించారు. తన కుమార్తెకు సీటు రాలేదన్న అక్కసుతోనే? తన కుమార్తెకు కాకుండా సంధ్యారాణికి సీటు రావడం పట్ల ప్రొఫెసర్ లక్ష్మి అక్కసుతో తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేసిందని తాము భావిస్తున్నట్లు సంధ్యారాణి తండ్రి సత్తయ్య చెప్పారు. బాగా చదివి మెరిట్లో సీటు సాధించడమే తన బిడ్డ పాలిట శాపంగా మారిందని ఆయన గుండెలు బాదుకున్నారు. నిందితురాలిని కాపాడేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే యత్నాలు ప్రొఫెసర్ లక్ష్మిని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు సమాచారం. పోలీస్ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న సదరు సీనియర్ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయసారథి, మరికొందరు వైద్యులతో కలసి పల్నాడు ప్రాంతంలో అతి పెద్ద ప్రైవేట్ ఆస్పత్రి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయకుండా ఆ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. -
తెలంగాణ రాష్ట్రంపై డెంగీ పంజా
-
హెల్త్ కార్డులతో ‘కార్పొరేట్’ చికిత్స
అందించాలని వైద్యారోగ్య మంత్రిని కోరిన పీఆర్టీయూ, ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్ కోరారు. ఔట్ పేషెంట్ సదుపాయం కూడా కల్పించేలా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయులంతా నెలవారీ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మూడుసార్లు మాట్లాడామని, చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీల రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారని వారు పేర్కొన్నారు. -
డెంగీ బెల్స్
► డెంగీ బెల్స్ ► రాష్ట్రానికి దోమ కాటు ► సోమవారం ఒక్కరోజే 67 కేసులు ► ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పరిస్థితి తీవ్రం ► ఇప్పటిదాకా 22 మంది మృతి ► 351 పాజిటివ్ కేసులు.. దేశంలోనే అత్యధికం ► మూడునెలలుగా జ్వరంతో అల్లాడుతున్న 15 గ్రామాలు ► ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 వేల మందికి డెంగీ నిర్ధారణ ► చేష్టలుడిగి చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ► డెంగీతో మరణించింది ఐదుగురేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా డెంగీ కేసులు నమోదవుతున్నా.. ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్క బోనకల్ మండలం లోనే 22 మందిని డెంగీ పొట్టనబెట్టుకుంది. డెంగీ ఏ స్థాయిలో విజృంభించిందంటే ఒక్క సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా 146 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 67 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. అందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 58 మంది ఉన్నారు. డెంగీ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోలేదు. బోనకల్ మండలంలో 22 మంది చనిపోయినా కేవలం ఐదుగురే చనిపోయారని చెబుతోంది. గత మూడు నెలలుగా ఈ మండలంలోని 15 గ్రామాలు డెంగీతో అల్లాడుతున్నాయి. బోనకల్ మండలంలో దేశంలోనే అత్యధికంగా 351 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 10 నెలల్లో 1,983 కేసులు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా కేసులు పెరిగాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారమే.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 1,983 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా మృతులు మాత్రం ఐదుగురేనని చెబుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22 మంది చనిపోయినా.. మృతుల సంఖ్యను తక్కువగా చూపడంపై విమర్శలు వస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో (జనవరి–అక్టోబర్ మధ్య) 2,284 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 894 మందికి డెంగీ సోకినట్లు తేలింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 3,072 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 377 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లాలో 204 మందికి డెంగీ ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 1118 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 825 కేసులు నమోదయ్యాయి. బోనకల్‌కు మంత్రి లక్ష్మారెడ్డి! రెండు మూడ్రోజుల్లో బోనకల్ మండలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించే అవకాశాలున్నాయని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. డెంగీపై మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌తోపాటు రావినూతల, గోవిందాపురం గ్రామాలకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. డాక్టర్లు, సిబ్బంది, సెల్ కౌంట్ మిషన్లను కూడా పంపుతామని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని స్ప్రేయర్లను బోనకల్‌కు పంపాలని ఆదేశించారు. వారానికి రెండుసార్లు బాధిత ఇళ్లల్లో స్ప్రే చేయాలన్నారు. సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఒక బృందాన్ని బోనకల్ పంపామన్నారు. గ్రామానికి ఒకటి చొప్పున 108, మూడు 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆ మండలంలో ఇంటింటికి జ్వరమే ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీతో రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మండలంలోని రావినూతలలో 8 మంది మృతి చెందగా.. 31 మంది డెంగీతో బాధపడుతున్నారు. మరో 56 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. జ్వరం లక్షణాలు కనపడితే జనం బెంబేలెత్తిపోతున్నారు. డెంగీ భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బోనకల్లో ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, అక్టోబర్‌లో 6,735 మందికి విష జ్వరాలు సోకాయి. మండలంలోని 21 గ్రామాల ప్రజలు ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్యం కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 790 డెంగీ కేసులు నమోదైతే.. ఈ మండలంలోనే సగం కేసులు నమోదయ్యాయి. మండలంలో డెంగీతో మరణంచిన 22 మందిలో 15 మంది వరకు 40 ఏళ్ల లోపు వారే ఉన్నారు. జ్వరాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు భయంతో గ్రామాలను వీడుతున్నారు. చేతికందిన కుమారుడిని కోల్పోయి.. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గుగులోతు రూప్లా కుమారుడు సైదులు(30) డెంగీతో అక్టోబర్ 14న మృతి చెందాడు. గత నెల 11న సైదులుకు జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ వద్ద తగ్గకపోవడంతో మరుసటిరోజు ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒక్కరోజు వైద్యం చేసిన తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డెంగీ జ్వరం వచ్చిందని, కిడ్నీ, లివర్‌పై ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. రూ.2.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ కుమారుడు దక్కలేదంటూ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. కూలీనాలీ చేసి కుమారుడిని ఎమ్మెస్సీ బీఈడీ చేయించాడు. ఆరునెలల కిందటే వివాహం చేశాడు. పెద్దదిక్కుని కబలించింది.. రావినూతల గ్రామానికి చెందిన అజ్మీరా రఘుపతి(65) గతనెల 19న డెంగీతో మృతి చెందాడు. ఈయనకు 17వ తేదీన జ్వరం రావడంతో మరుసటి రోజు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరంతోపాటు ప్లేట్లెట్లు పడిపోయాయి. వైద్యానికి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయన భార్య మస్రు కన్నీరు మున్నీరవుతోంది. జ్వరం వచ్చిన రెండు రోజులకే.. రావినూతలకు చెందిన పుచ్చకాయల లక్ష్మి (35)కి అక్టోబర్ 24న జ్వరం వచ్చింది. ఆమె భర్త జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తగ్గకపోవడంతో కోదాడలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. డెంగీ జ్వరం వచ్చిందని, ప్లేట్లెట్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో 26న లక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శక్తివంతమైన వైరస్ వల్లే..: డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం శక్తివంతమైన విరువెంట్ వైరస్ వల్లే బోనకల్ మండలంలో 22 మందికిపైగా మరణించారు. పారిశుద్ధ్య లోపం కూడా ప్రధాన కారణం. సాధారణ జ్వరంగా భావించి కొందరు స్థానిక వైద్యులను సంప్రదించారు. వాళ్లు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ప్లేట్లెట్లు తగ్గినా చివరి వరకు తెలియని పరిస్థితి నెలకొంది. మా అంచనా ప్రకారం 22 మంది కంటే ఎక్కువగానే చనిపోయి ఉంటారు. ==== జిల్లాల వారీగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు డెంగీ, మలేరియా కేసుల వివరాలు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లా డెంగీ మలేరియా ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆదిలాబాద్ 23 1,118 కరీంనగర్ 134 48 వరంగల్ 140 438 ఖమ్మం 894 825 మహబూబ్‌నగర్ 64 46 మెదక్ 19 66 నల్లగొండ 28 17 హైదరాబాద్ 377 138 రంగారెడ్డి 100 30 నిజామాబాద్ 204 32 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 1,983 2,758 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
ఆయుష్ ప్రైవేటు ఫీజులు పెంపు
- బీ-కేటగిరీ సీట్లకు రూ.42 వేల నుంచి రూ.50 వేలు - సీ-కేటగిరీ సీట్లకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలు సాక్షి, హైదరాబాద్: ఆయుష్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్ల ఫీజులను పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2011 తర్వాత ఈ ఏడాది ఫీజులను పెంచారు. ప్రైవేటు ఆయుష్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా (50 శాతం) సీట్ల ఫీజును మాత్రం పెంచలేదు. గతంలో ఉన్నట్లుగానే రూ.21 వేలు ఏడాదికి వసూలు చేస్తారు. బీ-కేటగిరీ (10 శాతం) సీట్లకు గతంలో ఉన్న రూ.42 వేలను ఇప్పుడు రూ.50 వేలకు పెంచారు. రూ.లక్ష ఉన్న సీ-కేటగిరీ (40 శాతం) సీట్ల ఫీజును రూ.1.25 లక్షలకు పెంచారు. పెంచిన ఫీజులు ఈ ఏడాది అడ్మిషన్ల నుంచి అమలులోకి వస్తాయి. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎటువంటి క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్సు ప్రారంభంలోనే ఫీజును వసూలు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. ఒకేసారి కానీ... వాయిదా పద్ధతిలో కానీ వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తి... కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆయుష్ కోర్సులకు శుక్రవారం వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. మొత్తం 1,800 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా... వారి ర్యాంకుల ప్రకారం సీట్ల కేటాయింపు చేసినట్లు వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఏ, బీ కేటగిరీ సీట్లకు కూడా తామే కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. సీ కేటగిరీ సీట్లను ప్రైవేటు కాలేజీలు నింపుకోవడానికి వీలుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఆయుర్వేద, హోమియో కోర్సులకు 100 చొప్పున సీట్లున్నాయి. రెండు ప్రైవేటు కాలేజీల్లో కలిపి 200 సీట్లున్నాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం 4 గంటల్లోగా వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని వీసీ తెలిపారు. సీట్లు మిగిలితే రెండో విడత కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తామన్నారు. 15 రోజుల్లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. -
సీఎం ఆదేశించినా పట్టదా..
కార్పొరేట్ ఆస్పత్రులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఫైర్ సాక్షి, ఖమ్మం: ‘హెల్త్‌కార్డులుండీ.. వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టు కుటుంబాలను రాజధానిలోని 9 కార్పొరేట్ ఆస్పత్రులు అడ్మిట్ చేసుకోకుండా నానుస్తున్నాయని, ఇలా చేస్తే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని, సీఎం స్వయంగా ఆదేశించినా.. ఇంత జాప్యమా.. తెలంగాణలో ఇది కుదరదు.’ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని వ్యాపారంగా చేశారని, ఉద్యోగుల కుటుంబాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రులకు 15రోజులు గడువిస్తున్నామని, ఆ తర్వాత చర్యలకు వెనుకాడమన్నారు. గత ప్రభుత్వాలు అపోలో ఆస్పత్రికి రూ.వేలకే రాజధాని నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూమిని ఇచ్చాయని, ఉద్యోగులకు వైద్యం అందించాల్సిన విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత మీది కాదా..? అని ప్రశ్నించారు. -
ఆరోగ్యమస్తు..
► ‘కార్పొరేట్’లో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు ►దీర్ఘకాలిక రోగులకు నెలవారీగా ఉచితంగా మందులు ►700 రకాల బ్రాండెడ్ మందులు అందించే యోచన ► వైద్యం కోసం ముందుగా రిఫరల్ ఆసుపత్రులకు... ► అక్కడ్నుంచి పై ఆసుపత్రులకు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ చికిత్స ► అత్యవసర సమయాల్లో మాత్రం నేరుగా వెళ్లేందుకు వెసులుబాటు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం ► వచ్చేనెల నుంచే ఈజేహెచ్ఎస్ పథకం అమలుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి ప్రైవేటు, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ కింద ఉచితంగా సమగ్ర వైద్య పరీక్షలు (మాస్టర్ హెల్త్ చెకప్) నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకున్న, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలవారీగా ఉచితంగా బ్రాండెడ్ ఔషధాలు అందజేయనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)లో ఈ సదుపాయాలను చేర్చనుంది. వచ్చేనెల నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమల్లోకి తీసుకొస్తామని ఈజేహెచ్‌ఎస్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జనరిక్ మందులను సరఫరా చేస్తున్నామని, అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. ఇక నుంచి బ్రాండెడ్ ఔషధాలను సరఫరా చేసేలా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈజేహెచ్ఎస్ పథకంలోని వ్యాధులకు ఇవ్వాల్సిన మొత్తం 700 రకాల మందులను బ్రాండెడ్వే అందించనున్నారు. అందుకు సంబంధించిన జాబితాను ఈజేహెచ్ఎస్ అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు అందజేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం పీహెచ్సీ స్థాయి నుంచి నిమ్స్ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ మందులను అందుబాటులో ఉంచుతారు. ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల ప్యాకేజీపై కసరత్తు రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతారు. అలాగే దాదాపు 23 వేల మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు 40 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికోసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకునే వీలుంది. అలాగే ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే జబ్బును బట్టి ఉచిత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఏడాదికోసారి మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు వీలు కల్పించాలని నిర్ణయించింది. అంటే సంబంధిత కార్పొరేట్ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అత్యున్నతస్థాయి ప్యాకేజీని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అమలుచేస్తారు. సాధారణంగా కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్ కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తారు. అలా నలుగురు కుటుంబ సభ్యులున్న ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్ చెకప్ చేయించుకోవాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలకుపైనే ఖర్చు కానుంది. ఇలాంటి అవకాశం ఉచితంగా కల్పించాలని ఈజేహెచ్ఎస్ నిర్ణయించింది. దీనిపై ఆయా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో చర్చిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీకి ఎంత చెల్లించాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. హెల్త్ చెకప్ వల్ల ముందుగానే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకునే వీలుంటుందన్నది సర్కారు ఆలోచన. బీపీ, షుగర్ మొదలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతరత్రా అన్ని రకాల పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్‌లో చేస్తారు. ముందు రిఫరల్... ఆ తర్వాతే కార్పొరేట్ శస్త్రచికిత్సల ప్యాకేజీ సొమ్ము తక్కువగా ఉన్నందున ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదు. దీనిపై ఇటీవల నాలుగైదుసార్లు ఈజేహెచ్ఎస్ సీఈవో డాక్టర్ పద్మ ఆయా ఆసుపత్రులతో చర్చించారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. వైద్య వర్గాల సమాచారం ప్రకారం కార్పొరేట్ వైద్య ప్యాకేజీ సొమ్మును 60 శాతం వరకు పెంచే యోచనలో సర్కారు ఉంది. అయితే ఉచిత ఓపీ సేవలు కాకుండా ఉద్యోగులకు ఏడాదికి రూ.5 వేలు ఇవ్వాలన్న ఆలోచనను సర్కారు ఉపసంహరించుకుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం రిఫరల్ వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఒకరిద్దరు సీనియర్ వైద్యులుంటారు. వారు పరీక్షలు నిర్వహించాక పై ఆసుపత్రికి రిఫర్ చేస్తేనే రోగి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే ఆ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందులే వాడాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాగే సేవలందిస్తున్నారు. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ లేదా ఇతర నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లొచ్చు. రిఫరల్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తే అందుకు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించారు. వాటికి ఫిక్స్డ్ ధరలు నిర్ణయించి అమలుచేస్తారు. -
జిల్లా ఆస్పత్రుల్లో ‘పడకలు’ పెంపు
కొత్త జిల్లాల నేపథ్యంలో 500కు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పడకల స్థాయిని 500లకు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే ఏరియా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుత జిల్లా ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 200 నుంచి 350 వరకు ఉండగా.. వాటిని 500లకు పెంచనుంది. కొత్త జిల్లాల్లో ఏరియా ఆస్పత్రుల్లో 100 పడకల చొప్పున ఉండగా.. వాటిని 500 పడకలకు పెంచుతారు. ఆ ప్రకారం వైద్య సిబ్బంది కూడా రెట్టింపునకు మించి పెరగనున్నారు. ప్రస్తుతం 16 ఏరియా ఆస్పత్రులైన మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్, కామారెడ్డి, గద్వాల, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, వికారాబాద్, మల్కాజిగిరి, మంచిర్యాల సహా పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లోని మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తారు. శంషాబాద్‌లో కొత్తగా జిల్లా ఆస్పత్రిని నిర్మిస్తారు. బోధనాసుపత్రుల్లో మాత్రం ఎలాంటి మార్పులుండవు. అడిషనల్ డీఎంహెచ్‌వోలే బాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు జిల్లా చీఫ్లుగా డీఎంహెచ్వోలు ఉంటున్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. కొత్తగా వచ్చే జిల్లాల్లో తొమ్మిది చోట్ల అడిషనల్ డీఎంహెచ్‌వోలకు ఇన్చార్జి డీఎంహెచ్‌వోలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మిగిలిన కొత్త జిల్లాల్లో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రత్యేకాధికారులుగా ఉన్న వారిలో సమర్థులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తారు. మరోవైపు నాలుగైదు పీహెచ్‌సీలకు కలిపి ప్రస్తుతమున్న క్లస్టర్ల సంఖ్యను కుదించి వాటికి డిప్యూటీ డీఎంహెచ్వోలను నియమిస్తారు. చిన్న మార్పులు మినహా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్ విభాగాల అధికారాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తారు. -
ఏరియా ఆస్పత్రులే ఇక జిల్లా ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 21 కొత్త జిల్లాల్లో వరంగల్ మినహా మిగతా 20 జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు పదోన్నతులు కల్పించి డీఎంహెచ్‌వోలుగా నియమించనున్నారు. మరికొన్ని చోట్ల సీనియర్ సివిల్ సర్జన్లకు డీఎంహెచ్‌వో బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోని ఏరియా ఆస్పత్రులను ఇప్పటివరకు పర్యవేక్షించిన జిల్లా వైద్య సేవల పర్యవేక్షణాధికారి (డీసీహెచ్ఎస్) వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న అధికారులను వైద్య కార్యక్రమాల పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తారు. దీంతో ఇప్పటివరకు డీసీహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రులు ఇక నుంచి వాటి సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఇక నాలుగైదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్లు ప్రస్తుతం 137 ఉన్నాయి. వాటిని 63కు తగ్గించి.. బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ డీఎంహెచ్‌వోల పర్యవేక్షణలోకి తీసుకొస్తారు. -
విమర్శలకు తావిస్తున్న నిర్ణయాలు
దామెర పీహెచ్సీ వివాదంపై మళ్లీ విచారణ మహిళా ఉద్యోగికి ఇబ్బందులు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు రామన్నపేట : వైద్య, ఆరోగ్య శాఖలో మహిళా సిబ్బం దిపై వేధింపుల విషయంలో ఉన్నతాధికారుల నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడు, మహిళా సిబ్బందిని వేధిం చినట్లు ఉన్నతాధికారులే నిర్ధారించి చర్యల కోసం ఉత్తర్వులు జారీ చేసిన నెలల తర్వాత ఇదే అంశంలో మరోసారి విచారణ జరపాలని నిర్ణయం తీసుకోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైద్యు లు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కింది స్థాయి మహిళా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఆత్మకూరు మండలం దామెర పీహెచ్సీ వివాదంపై వైద్య ఆరో గ్య శాఖ జాయింట్ డైరెక్టర్(ఎపిడమిక్) సుబ్బలక్ష్మీ శనివారం విచారణ చేపట్టారు. ఇందులో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్టర్ గోపాల్‌రావు అసభ్యకరంగా ప్రవరిస్తూ, వేధింపులకు గురిచేశారని మహిళా ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది ఆయనను ఈ ఏడాది మార్చి నెలల్లో నిలదీశారు. గోపాలరావు ఆ సమయంలో క్షమాపణ చెప్పా రు. ఆ తర్వాత అదే తరహాలో వ్యహరిస్తూ సెల్మెసేజ్లతో వేధింపులకు పాల్పడుతుండడం తో మహిళా ఫార్మసిస్టు ఈ ఏడాది మార్చి 22న జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు ఫిర్యాదు చేసింది. ఫార్మాసిస్టు అభియోగాలపై విచారణ కోసం అదనపు జిల్లా వైద్యాధికారి శ్రీరాం, డాక్టర్ పద్మజలను నియమిస్తూ జిల్లా వైద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు. దామెర పీహెచ్సీలో ఈ ఏడాది మార్చి 31న అధికారులు విచారణ నిర్వహించి జిల్లా వైద్యాధికారికి నివేదిక అందజేశారు. ఈ అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరు కార్యాలయానికి జిల్లా వైద్యాధికారి నివేదిక పంపారు. అనంతరం డాక్టర్ గోపాల్‌రావును సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫార్మాసిస్టును పీహెచ్సీ నుంచి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తుర్వులు జారీ చేశారు. అన్యాయం జరిగిందని తాను చేసిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి వైద్యుడిని సస్పెండ్ చేసిన అధికారులు తనను బదిలీ చేయడం ఏమిటని ఫార్మసిస్టు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.ఆమె బదిలీని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు చేసింది. దామెర పీహెచ్సీ ఘటనలో ట్రిబ్యునల్ నిర్ణయంతో కొందరు వైద్యులు కొత్త ప్రణాళిక రచించారు. వైద్యుడిపై ఫిర్యాదు చేసిన మహిళా ఫార్మసిస్టును బదిలీ చేయించాలనే ఉద్దేశంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిం చాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. విచారణ అధికారులు తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని, మళ్లీ విచారణ జరపాలని డాక్టర్ గోపాలరావు కోరడంతో దీనిపై పునఃవిచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో జెడీ సుబ్బలక్ష్మీ శనివారం వరంగల్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించా రు. పీహెచ్సీలో పని చేస్తున్న మొత్తం సిబ్బం దిని విచారించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని దామెర పీహెచ్సీలో విచారణ జరపకపోవడంపైనా చర్చ జరుగుతోంది. విచారణతో సంబంధలేని ఒక ప్రభుత్వ వైద్యుడు ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు అక్కడే ఉండడం విమర్శలకు తావిస్తోంది. కింది స్థాయి వారికి న్యాయం జరగదా? పీహెచ్సీ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి మహిళా సిబ్బందికి న్యాయం జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక శాఖలో మహిళకు ఇబ్బంది అయినప్పుడు ఐదుగురితో ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీలో కచ్చితంగా ముగ్గురు మహిళలు ఉండాలి. జిల్లాలో ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు. మొదటిసారి విచారణ నిర్వహించిన సమయంలో ఫార్మసిస్టు. డీఎంహెచ్‌వోను, ఆరోగ్య శాఖ డైరెక్టరును కలిశారు. వైద్యుడి మానసిక ఆరోగ్య పరిస్థితి తీరు సరిగాలేదని రాజీ చేసుకోవాలని ఇద్దరు ఉన్నతాధికారులు ఫార్మసిస్టుకు చెప్పారు. ఇలాంటప్పుడు మళ్లీ విచారణ ఏమిటి, విచారణ తీరు ఇలా ఉంటే కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. – జానపట్ల సునీత, జిల్లా అధ్యక్షురాలు, మెడికల్ హెల్త్ ఉమె¯ŒS అసోసియేష¯ŒS