Business
-
జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్‌కు తీసుకెళ్లింది. స్కామర్లు.. రిక్రూటర్లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ను అందించారు.అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్‌లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుస్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. -
పాకిస్తాన్ చాయ్‌వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..
పాకిస్తాన్ చాయ్‌వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్లో తన కేఫ్ బ్రాండ్ చాయ్‌వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్‌వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Arshad Khan (@arshadchaiwala1) -
పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి, చిన్న బ్యాటరీలను కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, రిమూవబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో పెద్ద బ్యాటరీలను కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి తెలుసుకుందాం.4 కిలోవాట్ బ్యాటరీఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, రివర్ ఇండీ, టోర్క్ క్రటోస్ ఆర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా 195 కిమీ (ఓలా ఎస్1 ప్రో), 190 కిమీ (ఓలా ఎస్1 ఎక్స్), 161 కిమీ (రివర్ ఇండీ), 180 కిమీ (టోర్క్ క్రటోస్ ఆర్)గా ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న బ్యాటరీని కలిగి ఉన్నప్పటికీ రేంజ్ తేడా ఏంటా? అని బహుశా ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఒక వాహనంలో ఉన్న ఫీచర్స్.. దాని పరిధిని (రేంజ్) నిర్థారిస్తారు. అంతే కాకుండా ఎంచుకున్న మోడ్.. ప్రయాణించే రోడ్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి.4.4 కిలోవాట్ బ్యాటరీఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైకులో 4.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 187 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఏకైన మోడల్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కావడం గమనార్హం.5 కిలోవాట్ బ్యాటరీసింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఫిక్డ్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. 5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జీతో 212 కిమీ రేంజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు 525 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.5.1 కిలోవాట్ బ్యాటరీటీవీఎస్ ఐక్యూబ్ వివిధ పరిమాణాల బ్యాటరీలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేసిన రెండేళ్ల తరువాత 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జీతో 185 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఇది దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు.ఇదీ చదవండి: రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..7.1 కిలోవాట్ బ్యాటరీ & 10.3 కిలోవాట్ బ్యాటరీబెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైకులో 7.1 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన ఎఫ్77 మ్యాక్ 2 రీకాన్ మోడల్ 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 323 కిమీ రేంజ్ అందిస్తుంది. -
జొమాటో కొత్త యాప్ లాంచ్: ఇదెలా ఉపయోగపడుతుందంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' ఎట్టకేలకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం డిస్ట్రిక్ట్ (District) పేరుతో ఓ కొత్త యాప్ లాంచ్ చేసింది. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసింది. దీనికోసం జొమాటో రూ. 2048 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్‌షిప్‌లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. -
6 శాతం తగ్గిన బంగారం ధరలు..
దసరా, దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ్వలా పైకి లేసాయి. ఈ పండుగలు ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వడం జరిగిన తరువాత పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి గోల్డ్ రేట్లు దాదాపు 6 శాతం క్షీణించాయి.2024 నవంబర్ 1న 80,710 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 16) 75,650 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ముఖ్యంగా భారతదేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం విక్రయాలను గణనీయంగా పెంచాయని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే బంగారం ధరల తగ్గుదల మరింత ఎక్కువ మందిని బంగారం కొనేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల కంటే కూడా.. బంగారం మీద పెట్టే పెట్టుబడులు చాలా సురక్షితమని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణంగానే.. పెట్టుబడిదారులు కూడా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుత పరిస్థితి మాదిరిగానే.. బంగారం రేటు తగ్గుతూ పోతే మళ్ళీ పాత ధరలకు చేరుకునే అవకాశం ఉంది. -
కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం. -
శబరిమల భక్తులకు ‘స్వామి చాట్‌బాట్’
శబరిమల దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తులకు సమగ్ర సమాచారం అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందులో భాగంగా శబరిమల దర్శనార్థం వెళ్లేవారికి ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళలోని పథనంథిట్ట జిల్లా అధికారులు తెలిపారు.ముత్తూట్ గ్రూప్‌తో కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఏఐ డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించారు. శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు దీన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?రోజులవారీగా ఆలయ దర్శన సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ను ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సిద్ధం చేశారు. శబరిమల దగ్గర్లోని చూడదగిన దేవాలయాల వివరాలు కూడా అందులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్‌లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం’
న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్’ అధ్యయనంలో వెల్లడైంది.58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్ టూల్స్ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్ నివేదికను విడుదల చేసింది. » పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు. » ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు. » పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. » యువతరం టెక్ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్ సేవింగ్ టూల్స్ వాడుతున్నారు. » 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు. -
పండుగలో 42,88,248 వాహనాలు కొనేశారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్‌లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్‌ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్ఏడీఏ కోరింది. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్ ప్లాన్ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.కొత్త డేటా ప్లాన్జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్‌ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్‌తో సహా 10 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్.» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్ -
చిన్న ఐటీ కంపెనీ.. భారీ లాభాలు
సాంకేతిక శిక్షణ, ఐటీ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ఈ ఏడాది(2024–25) తొలి ఆరు నెలల్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. చిన్న సంస్థల కోసం ఏర్పాటైన ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన కంపెనీ నికర లాభం ఏప్రిల్–సెప్టెంబర్‌లో 36 శాతం జంప్‌చేసి రూ. 11 కోట్లకు చేరింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 92 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. నిర్వహణ లాభం(ఇబిటా) 53% జంప్‌చేసి రూ. 15 కోట్లను దాటింది."ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా భారత్‌లో డిమాండ్ మందగించడం, సిబ్బంది వ్యయం పెరగడం వంటి ఇబ్బందులు పడ్డాం. అయితే మా సామర్థ్యాలు, భౌగోళికాలు, సౌకర్యాలపై సకాలంలో పెట్టుబడి పెట్టగలిగినందున అటువంటి అనిశ్చితులను ఎదుర్కొనేందుకు బలమైన పునాదిని ఏర్పాటు చేశాం" అని విన్సిస్ చైర్మన్, ఎండీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. -
ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపుఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపు
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్‌లో చైనా మార్కెట్లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్‌లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్‌లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్ఎల్ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్ఎస్ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్‌వైపు సీఎల్ఎస్ఏ మొగ్గు చూపుతుంది.ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్ఎస్ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్‌పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ఎంతకొచ్చిందంటే..
Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో నేడు (నవంబర్ 16) స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజున ఎంత మొత్తం పెరిగిందో ఈరోజు అంతే మొత్తంలో దిగివచ్చింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర స్వల్పంగా రూ.100 తగ్గి రూ.69,350 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ. 75,650 వద్దకు క్షీణించింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా తగ్గుదల నమోదైంది.ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.69,500 వద్దకు రాగా, 24 క్యారెట్ల పసిడి రూ.110 క్షీణించి రూ.75,800 వద్దకు తగ్గింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు వరుసగా రెండో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
స్మార్ట్‌ఫోన్స్ జోరు.. టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.16 శాతం షేర్‌తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్‌లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.అందుబాటు ధరలోని వై సిరీస్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్‌ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్‌ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది. మిగతా విశేషాలు.. » రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 12 ప్రధాన మోడల్స్‌గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది. » 5జీ స్మార్ట్ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి. -
హైదరాబాద్‌లో సైయెంట్–అలెగ్రో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్, సెన్సింగ్ సొల్యూషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ కలిసి హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు చేశాయి. ఇది ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమకు కావాల్సిన కొత్త తరం మ్యాగ్నెటిక్ సెన్సార్లు, పవర్ సెమీకండక్టర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.ఇందులో పోస్ట్–సిలికాన్ వేలిడేషన్, డిజైన్ వెరిఫికేషన్ తదితర విభాగాల్లో 100 పైచిలుకు నిపుణులైన ఇంజినీర్లు ఉంటారు. ఇరు సంస్థల భాగస్వామ్యం మరింత పటిష్టమయ్యేందుకు ఇది దోహదపడగలదని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. భారత్‌లో ఆటోమోటివ్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉంటాయని అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్వాలా పేర్కొన్నారు. -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.లక్ష దాటిన ఇన్వెంటరీ..హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.3–5 శాతం ధరల వృద్ధి..నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!లగ్జరీ గృహాలే ఎక్కువ..నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది. -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది.