Family
-
బెడ్ వెట్టింగ్ కట్టడి..!
సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్కతడుపుతుంటారు. మూత్రవిసర్జన వ్యవస్థపై అదుపు చేకూరక అలా జరుగుతుంది. అయితే పిల్లలు క్రమంగా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం మొదలయ్యాక ఈ సమస్య తగ్గుతుంది. సాధారణంగా ఏడు నుంచి ఎనిమిదేళ్ల వయసు వచ్చేనాటికి పిల్లలు తమ మూత్ర విసర్జన కండరాలూ, వ్యవస్థపై అదుపు సాధించాక ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలా పక్కతడిపే ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ ఎన్యురిసిస్’ అంటారు. అయితే కాస్త అరుదుగానైనా పెద్దపిల్లలతో పాటు కొందరు పెద్దల్లో కూడా ఈ సమస్య ఉండవచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అంశాలను తెలిపేదే ఈ కథనం.ఒక నిర్వచనాన్ని బట్టి చె΄్పాలంటే... ఐదేళ్లకు పైబడిన పిల్లలు వారంలో రెండుసార్లు పక్కతడుపుతుంటే దాన్ని బెడ్ వెట్టింగ్‌గా చెప్పవచ్చు. ఇదీ విస్తృతి... బెడ్ వెట్టింగ్ సమస్య వేర్వేరు వయసుల వాళ్లలో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు... ⇒ చిన్నపిల్లల్లో: ఐదేళ్ల పిల్లల్లో దాదాపు సుమారు 15–20% మందిలో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ కనిపిస్తుంది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో ఈ సమస్య కాస్త ఎక్కువ. ⇒ కాస్తంత పెద్ద పిల్లల్లో : పిల్లలకు ఏడేళ్లు వచ్చే నాటికి 15% – 20% ఉన్న దీని విస్తృతి దాదాపు 10 శాతానికి తగ్గుతుంది. ⇒ కౌమార బాలల్లో (అడాలసెంట్ పిల్లల్లో) : 13–18 ఏళ్ల పిల్లల్లో ఇది 1 – 3 శాతం వరకు ఉంటుంది. ⇒ పెద్దలలో: కొందరు పెద్ద వయసువారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. అయితే వాళ్లలో ఇది పిల్లల్లో కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు పిల్లల్లో కనిపించే పక్క తడిపే సమస్యను ప్రైమరీ అన్యురిసిస్ అంటారు. అయితే పెద్దల్లో ఇదే సమస్య కనిపించే దాన్ని సెకండరీ నాక్టర్నల్ ఎన్యురిసిస్గా చెబుతారు. పెద్దవయసు వాళ్లలోని కనీసం 1 – 2 శాతం వ్యక్తుల్లో ఈ నాక్టర్నల్ ఎన్యురిసిస్ కనిపిస్తుందని అంచనా. ఇలా పెద్దల్లో ఈ సమస్య రావడానికి ఇతరత్రా కారణాలు ఉండవచ్చు. కాబట్టి దీన్ని సెకండరీ అన్యురిసిస్గా చెబుతారు. కారణాలు...⇒ ప్రైమరీ ఎన్యురిసిస్లో : పిల్లలకు నిద్రలో తమ మూత్ర విసర్జన వ్యవస్థపై నియంత్రణ లేకపోవడమన్నది మామూలు కారణం. దీనికి ఇతరత్రా ఏవైద్య కారణాలూ ఉండవు. ⇒ జన్యుపరమైనవి : కుటుంబాల్లోని వారికి తమ బాల్యంలో ఈ సమస్య ఉంటే పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ⇒ గాఢనిద్ర కారణంగా : బ్లాడర్ నిండినట్లుగా అందే సూచనలను తమ గాఢనిద్ర కారణంగా వాళ్లు స్వీకరించలేకపోవడం. ⇒ మూత్రాశయం చిన్నగా ఉండటంతో నిల్వ సామర్థ్యం తగ్గడం. ⇒ సెకండరీ ఎన్యురిసిస్ : చిన్నారుల్లోగానీ, అలాగే పెద్దవాళ్లలోనూ ముందుగా కొంతకాలంపాటు పక్కతడిపే అలవాటు లేకుండా... అకస్మాత్తుగా కనిపించడం. ఉదాహరణకు పక్కతడిపే అలవాటు మానేశాక కనీసం ఆర్నెల్ల పాటు పక్కలో మూత్రవిసర్జన చేయకుండా... ఆ తర్వాత ఆ ధోరణి కనిపించడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇందుకు అనేక అంశాలు కారణం కావచ్చు. అవి... ⇒ ఒత్తిడి లేదా భావోద్వేగ సమస్యలు : పిల్లల్లో ఆందోళన, బడిలో ఏవైనా తీవ్రమైన ఒత్తిళ్లు ఉండటం. మూత్ర వ్యవస్థలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్లు (యూరినరీ ఇన్ఫెక్షన్స్) ∙మలబద్ధకం లేదా పేగు సమస్యలు. ⇒ స్లీప్ ఆప్నియా (గురక రావడం) లేదా ఇతరత్రా నిద్ర సంబంధ ఆరోగ్య సమస్యలు. ⇒ డయాబెటిస్ లేదా ఇతరత్రా హార్మోన్ల అసమతౌల్యతల (ఉదా... యాంటీ డై–యూరెటిక్ హార్మోన్ లోపం).సమస్య నిర్ధారణ ఇలా... ⇒ రాత్రివేళల్లో మూత్రవిసర్జన వల్ల సమస్య స్పష్టంగా తెలుస్తుంది. ∙బాధిత చిన్నారులను శారీరకంగా పరిశీలించడం. మెడికల్ హిస్టరీని డాక్టరుకు వివరించడంతో కొన్ని రకాల మూత్ర పరీక్షలు అవసరమవుతాయి.⇒ మూత్ర విసర్జన వివరాలతో డైరీ : పిల్లలు నీళ్లు ఏయే వేళల్లో తాగుతున్నారు, మూత్రవిసర్జన ఎప్పుడెప్పుడు చేస్తున్నారు వంటి విషయాలను నమోదు చేస్తూ ఓ డైరీ రాయడం.⇒ శారీరక పరీక్ష: మూత్ర నాళం, వెన్నెముక, నాడీ వ్యవస్థలో ఏవైనా లోపాలున్నాయా అని పరీక్షించడం. ⇒ యూరిన్ అనాలసిస్ : మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లుగానీ, డయాబెటిస్ లేదా కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయా అని పరీక్షించడం. అవి లేనప్పుడు వాటిని రూల్ అవుట్ చేసుకోవడం. ⇒ అల్ట్రాసౌండ్ పరీక్ష : మూత్ర వ్యవస్థ, యూరినరీ బ్లాడర్, మూత్రపిండాల వివరాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్ష ఇది.⇒ అదనపు పరీక్షలు: ప్రైమరీ అన్యురిసిస్ కాకుండా ఇతరత్రా ఏవైనా కారణలు ఉండవచ్చనని అనుమానించి నప్పుడు హార్మోన్ల మోతాదులు, స్లీప్ ఆప్నియా వంటి అంశాల నిర్ధారణ కోసం చేయాల్సిన స్లీప్ స్టడీస్ వంటి పరీక్షలు. నివారణ ఇలా... ్రపాథమిక కారణాలు తెలిసినప్పుడు వాటిని నివారించడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ద్వారా ఆ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడం. ∙మూత్ర విసర్జన శిక్షణ (టాయిలెట్ ట్రైనింగ్) : పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందర ఒకసారి మూత్రవిసర్జన చేయించి, మళ్లీ రెండు గంటల తర్వాత నిద్రలేపి మరో మారు మూత్రవిసర్జన చేయించడం లాంటి చర్యల ద్వారా. అలాగే పిల్లల్లో మూత్రాశయ సామర్థ్యాన్ని పెంచడం కోసం రోజూ ఓ నిర్ణీతమైన వేళల్లో మూత్రవిసర్జన చేసేలా శిక్షణ ఇవ్వడం. ⇒ ఒత్తిడి దూరం చేయడం : రాత్రివేళ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయేలా వారికి ధైర్యం చెప్పడం. ∙ఎన్యూరిసిస్ అలారం ఉపకరణాలతో: పిల్లలు కొద్దిగా పక్కతడపడం మొదలుపెట్టగానే వాటిని గుర్తించి నిద్రలేపే అలారం ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో పిల్లవాడు నిద్రమేల్కొనేలా శిక్షణ ఇవ్వడం. ⇒ జీవనశైలి మార్పులు: సాయంత్రాలు లేదా రాత్రివేళల్లో ద్రవాహారాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం. అలాగే నిద్రకు ముందు కాఫీ లేదా కోలా డ్రింక్స్ వంటి పానీయాలు తీసుకోకుండా చూడటం. మరేవైనా కారణాలతో ఇలా జరుగుతుంటే... సాధారణ కారణాలు కాకుండా... ఇతర ఆరోగ్యపరమైన అంశాలేవైనా పక్క తడిపేందుకు కారణమవుతుంటే వాటిని గుర్తించి, ఆ సమస్యలకు చికిత్స అందిస్తే పక్కతడిపే అలవాటూ తగ్గుతుంది. ఉదాహరణకు నిద్ర రుగ్మతల కారణంగానో లేదా మానసిక సమస్యల వల్లనో ఇలా జరుగుతుంటే వాటిని గుర్తించి, తగిన చికిత్స అందించడం వల్ల సెకండరీ అన్యురిసిస్ అదుపులోకి వస్తుంది. ఇక సమస్య పెద్దవాళ్లలో అయితే అది సెకండరీ అన్యురిసిస్ కారణంగా జరుగుతుంది కాబట్టి తగిన పరీక్షల తర్వాత సమస్యను బట్టి వారికి అందించాల్సిన చికిత్స ఉంటుంది.తల్లిదండ్రులకు సూచన...ఇది చాలా సాధారణమైన పిల్లల్లో సహజంగా కనిపించే అలవాటు. ఇలా చేసినప్పుడు పిల్లలను కోప్పడటం లేదా వారిని శిక్షించడం సరికాదు. దీనివల్ల మరింత ఒత్తిడి పెరగడం, సమస్య ఇంకాస్త తీవ్రం కావడం జరుగుతుంది. ఇది చాలా తాత్కాలికమైన సమస్య అనీ, దీని గురించి ఆందోళన అవసరం లేదంటూ పిల్లల్లో మానసిక స్థైర్యం కలిగించడం వల్ల ఈ సమస్య వీలైనంత త్వరగా తగ్గుతుంది.మందులతో నియంత్రణ ఇలా...⇒ డెస్మోప్రెసిన్ : రాత్రివేళ మూత్రం ఉత్పత్తిని తగ్గించే మందులివి. (వీటిని కృత్రిమంగా ఉత్పత్తి చేసే యాంటీ డై యూరెటిక్ హార్మోన్లుగా చెప్పవచ్చు). ⇒ ఇమిప్రమైన్ (టోఫ్రానిల్): పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే యాంటీ డిప్రెసెంట్ ఔషధాలివి. ∙⇒ ఆక్సిబ్యూటినిన్: మూత్రాశయం ఉండాల్సినదానికంటే అతి చురుగ్గా ఉన్నప్పడు దాన్ని నియంత్రించే మందు ఇది. -
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
జీడిమెట్ల: సుభాష్‌నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్‌నగర్‌లో ఇండోర్ షటిల్ కోర్టును జీహెచ్ఎంసీ నిర్మించడంపై ఎస్.ఆర్.నాయక్‌నగర్, అపురూపాకాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో షటిల్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుకుంటున్నారు. గతంలో కాలనీవాసులు షటిల్ ఆడాలంటే బాచుపల్లి, చింతల్, సుచిత్ర వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కాలనీలో సదుపాయం కలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు మంచినీటితో పాటు టాయిలెట్స్ సదుపాయం కలుగజేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు. కాలనీ స్థలంలో రూ.3 కోట్లతో నిర్మాణం నవంబర్ 2022లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ హేమలతా సురే‹Ùరెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సూరిబాబు కాలనీ అసోషియేషన్, కాలనీ ప్రజల ప్రోత్సాహంతో 23 నెలల్లో ఇండోర్ కోర్టు పనులను పూర్తి చేశారు. ఎకరం స్థలంలో ఇండోర్ స్టేడియం ఇండోర్ కోర్టు లోపల ఒకేసారి 12మంది క్రీడాకారలు ఆడుకునేల మ్యాటింగ్‌తో మూడు సింథటిక్ కోర్టులను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం కోర్టు లోపల ఎల్ఈడీ లైటింగ్‌లో పాటు టేబుల్ ఫ్యాన్లను అమర్చారు. కోర్టుల చుట్టూ క్రీడాకారులు కురీ్చల్లో కూర్చునేలా కొంత మేరకు స్థలాన్ని వదిలారు. 7వేల చదరపు ఆడుగుల్లో మూడు సింథటిక్ షటిల్ కోర్టులు నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్స్, క్రీడాకారులు ప్రతి నెల కొంత చెల్లించేలా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఒక సిస్టం తీసుకువస్తామని కాంట్రాక్టర్ అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయించిన షటిల్ ఇండోర్ కోర్టు మా కాలనీలో నిర్మించడం అనందంగా ఉంది. మా కాలనీ, అపురూపాకాలనీలో షటిల్ ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. యువ క్రీడాకారులు ఇక్కడ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది మా అకాంక్ష. మా ఇరు కాలనీల తరపున మేము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – టీటీకే శ్రీనివాస్ (ఎస్ఆర్.నాయక్‌నగర్ అధ్యక్షుడు) సంతోషంగా ఉంది ఫిట్‌గా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మనం పట్టు సాధించాలి. అలా అని రోడ్లపైన ఆడలేం. మాకు దగ్గరలో మా కాలనీలో ఇండోర్ షటిల్ కోర్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ షటిల్ ఆడాలని నిర్ణయించుకున్నాం. -సుస్మిత, అపురూపాకాలనీ మేము ఊహించలేదు మాకు షటిల్ ఆటపై మక్కువతో ఇంతకు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆడేవాళ్లం. ఇప్పుడు మా ఇళ్ల మధ్యలోనే షటిల్‌కోర్టును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించలేనిది. – రాఘవయ్య, కాలనీవాసిజీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు నాకు షటిల్ ఆడాలనే కోరిక ఉండేది కాని మాకు దగ్గలో ఎక్కడ ఇండోర్ స్టేడియం లేదు. మా కాలనీలో ఇండోర్ కోర్టు ఏర్పాటు కావడం మాకు వరం. మూడ్రోజులుగా ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుతున్నాం. మా కాలనీలో షటిల్ కోర్టు నిర్మించిన జీహెచ్ఎంసీ వారికి కృతజ్ఞతలు. – దివ్య, అపురూపాకాలనీ -
దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
ఫుడ్ బిజినెస్‌కు ఎపుడూ మంచి డిమాండ్ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్ సక్సెస్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్ స్టాల్‌ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..! -
Waste into Energy : కిచెన్ వేస్ట్ నుంచి బయోగ్యాస్
అసాధారణ జ్ఞానం నుంచి మాత్రమే కాదు అవసరాల నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి అని చెప్పడానికి హరిణి ఒక ఉదాహరణ. వంటగది వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను తయారుచేసే ఆలోచన చేసి విజయవంతం అయింది. ఆ ఆలోచన తనను ఎంట్రప్రెన్యూర్‌ని చేసింది.తమిళనాడులోని సేలంకు చెందిన హరిణి రవికుమార్ ‘గ్రీన్ కనెక్ట్’ వ్యవస్థాపకురాలు. ‘గ్రీన్ కనెక్ట్’ దేశవ్యాప్తంగా వెయ్యి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ΄్లాంట్లు సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధన శక్తిగా మారుస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటాయి. (స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!)హౌజ్‌హోల్డ్ కార్బన్ ఫుట్‌ప్రింట్స్‌ను తగ్గించడానికి ఆచరణాత్మక, శక్తిమంతమైన మార్గాలను ‘గ్రీన్ కనెక్ట్’ అందిస్తుంది. సహజమైన ప్రక్రియ ద్వారా వంటగది వ్యర్థాలను వంట ఇంధనంగా మార్చడానికి రూ పొందించిన ఈ యూనిట్‌ను బాల్కనీలు, టెర్రస్లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది వ్యర్థాలతో బయోగ్యాస్, సేంద్రియ ఎరువుతో పాటు పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగ పడుతుంది. (వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!)ఇలా....చెత్తను సేకరించిన తరువాత నాన్–ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఆర్గానిక్ వేస్ట్‌ను వేరు చేయాలి.ఆర్గానిక్ వేస్ట్‌ను ఎయిర్‌టైట్ కంటెయినర్ లేదా డైజెస్టర్‌లో వేయాలి.టైట్ చాంబర్లో బయోగ్యాస్‌ను స్టోర్ చేయాలి.స్టోర్ చేసిన బయోగ్యాస్‌ను వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు. -
ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?
వశిష్ఠాసనాన్నిసైడ్ ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. ఇది అథ్లెటిక్స్ చేసే వ్యాయామాలను పోలి ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంత చురుకుదనం లభిస్తుంది. శరీర బరువు బ్యాలెన్స్‌ను సరిచూసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగ పడుతుంది.ఎలా చేయాలంటే...మ్యాట్ పైన పడుకొని ఎడమచేతి వైపు తిరగాలి. తర్వాత ఎడమపాదం నుంచి కుడిమోకాలిని వంచి, ఎడమ చేతిని నేలకు ఆనించి శరీరాన్ని పైకి లేపాలి. బరువు మొత్తం చేతి మీద వేయడం సాధ్యం కాని వాళ్లు మోచేతి వరకు ఉంచాలి. కుడిచేతిని కుడి తుంటిపై ఉంచాలి. బరువు మొత్తం ఎడమ పాదం, ఎడమ చేతిపైనే ఉంటుంది కాబట్టిబాడీని బ్యాలెన్స్ చేయడం తప్పనిసరి. ∙తుంటి భాగాన్ని వీలైనంత పైకి ఎత్తి, కుడిమడమ నుండి తల వరకు శరీరాన్ని ఒక సరళ రేఖలోఉంచేలా దృష్టి పెట్టాలి. కనీసం 5 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదిలి ఉండగలగాలి.తర్వాత యధాస్థితికి వచ్చి, తిరిగి కుడివైపు ఇదే విధంగా చేయాలి. ప్రయోజనాలు... ఈ ఆసనం ద్వారా శక్తిస్థాయులు పెరుగుతాయి. కండరాలు, వెన్నుముక సమస్యలు తగ్గి బలం పెరుగుతుంది. శరీరానికి, మైండ్‌కి, కండరాలకు సమతుల్యత నిస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..! -
స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!
సోషల్ మీడియా (Social media) విశేషాల పుట్ట. తాజాగా ఒకవిచిత్రమైన వీడియో తెగ సందడి చేస్తోంది. ‘‘రిమ్జిమ్.. రిమ్జిమ్.. స్కూటీ వాలా జిందాబాద్ అంటూ ఒక ఎద్దు (bull) స్కూటీని ఎంచక్కా రైడ్ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దేంటి, స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోన్న వీడియో చూసి తీరాల్సిందే.ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వీధిలో తిరిగే ఎద్దు స్కూటీని నడుపుతున్న దృశ్యం CCTV ఫుటేజీలో రికార్డైంది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్గారి జాయ్‌రైడ్ వీడియో ఆరు లక్షలకు పైగా వీక్షణలను, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.శుక్రవారం (మే 2) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, రిషికేశ్‌లో ఒక వీధిలో తిరిగే ఎద్దు కన్ను పార్క్ చేసిన తెల్లటి స్కూటర్‌పై పడింది. అంతే.. చలో టెస్ట్ రైడ్’ అంటూ రంగంలోకి దిగిపోయింది. ఎద్దు స్కూటర్ సీటుపై ముందు కాళ్లు, వెనుక కాళ్లను నేలపై ఉంచగానే అది జర్రున ముందుకు దూకింది. ఎక్కాక ఆగేదే లే అన్నట్టు ముందుకు సాగింది. అలా వెడుతూ.. వెడతూ.. మొత్తానికి ఒకచోట ఆగిపోయింది. దీంతో ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆనక.. తప్పుకోండి రా బాబోయ్.. అక్కడినుంచి పరుగు తీశారు. స్కూల్ యూనిఫాంలో, చిన్న పిల్లవాడితో నడుస్తున్న సమీపంలోని ఒక మహిళ వెంటనే ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని పరుగుదీసింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను 'భూపి పన్వర్' అనే ఎక్స్ యూజర్ "మీరు స్కూటీలను దొంగిలించే వ్యక్తులను చూసి ఉంటారు..కానీ రిషికేశ్‌లో వెరైటీగా స్కూటీ దొంగతనం జరిగింది. ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న విచ్చలవిడి ఎద్దులు కూడా బైక్‌లు , స్కూటీలపై మనసు పడుతున్నాయ’’ అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్ చేశారు. దీంతో నెటిజనుల చమక్కులు, కామెడీకామెంట్ల్స్ వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!ఒక వినియోగదారు, "cctv లేకుండా దీన్ని బీమా కంపెనీలకు ఎలా వివరించాలి" అని, మరొక వినియోగదారు, భాయ్ ఆజ్ మే భీ సవారీ కర్ హీ లేతా హూన్” (“బ్రో, ఈ రోజు నేను కూడా రైడ్‌కి వెళ్తాను.”).” అంటూ హాస్యంగా కామెంట్ చేశారు.అలాగే పాపం, స్కూటర్‌పై ముచ్చట పడ్డాక దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చని, దాంతో అది విడిపించుకునేందుకు ప్రయత్నంలో అలా ముందుకు కదిలి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!
ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ ఆర్వోల ను వినియోగించడం పెరిగిపోయింది. ఆర్వో వాటర్ ఆరోగ్యానికి మంచో చెడో అనే విషయాన్ని పక్కన పెడితే... వీటి వినియోగంలో గ్లాసు నీటి శుద్ధికి నాలుగు గ్లాసుల నీరు వృథా అవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఫరవాలేదు కానీ అవి అడుగంటిపోయి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే వారికి ఆర్వోల వినియోగంలో అయ్యే నీటి వృథా ఒక ఇంజినీర్‌కు మంచి ఐడియానిచ్చింది. అది నీటి వృథాకు చెక్ చెప్పింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి మహానగచాలలో రోజువారీ అవసరాల కోసం నీటిని కొనుక్కోవటం గతంలో వేసవికాలానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏడాదిలో రెండు మూడు నెలలు మినహా అన్ని కాలాలు అదే దుస్థితి. ఆర్వోలు వినియోగించడం అనివార్యం అయిపోయింది. ఇదీ చదవండి: Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?బెంగళూరు నివాసి ప్రభాత్ విజయన్ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. హోరామావులో నివసిస్తున్న 45 ఏళ్ల ఈ టెక్ మేనేజర్ తన ఇంట్లో ఉపయోగిస్తున్న వాటర్ ప్యూరిఫయర్ ద్వారా గ్లాసు శుభ్రమైన నీటికి నాలుగింతల నీరు వృథా కావడాన్ని గమనించాడు. ఈ వృథా నీరు ఎలాంటి ఉపయోగమూ లేకుండా నేలలో కలిసిపోవడం అతన్ని తీవ్రంగా బాధించింది. వెంటనే దీనికి ఓ పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. ఒక డ్రమ్ము, స్క్రూడైవర్ ఆయుధాలుగా వెంటనే ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టాడు. చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నానీరు సమృద్ధిగా ఉండే కేరళలోని అలెప్పీకి చెందిన ప్రభాత్, ప్రతి చుక్కకు డబ్బు చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కానీ 2014లో బెంగళూరుకు వెళ్లాక పరిస్థితి మారి΄ోయింది. అతనుండే అపార్ట్మెంట్లో రోజువారీ అవసరాల కోసం కచ్చితంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒక్కో ట్యాంకర్ ధర రూ.1,000. అదే సమయంలో వాటర్ ప్యూరిఫయర్ ద్వారా పెద్దమొత్తంలో నీరు వృథా అవుతుండటం అతని దృష్టికి వచ్చింది. ఈ పరికరం ద్వారా ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని అనిపించింది. ఈ ప్రక్రియలో ఉపయోగించే రివర్స్ ఆస్మాసిస్ గురించి అధ్యయనం చేశాడు. ఈ విధానంలో ప్రతి లీటరు నీటికి నాలుగురెట్ల నీరు వృథా కావడం తప్పనిసరని అర్థం చేసుకున్నాడు. నీటి కొరత, అర్ట్ మెంటు వాసుల ఆందోళన, ఈ సమస్యతో స్వయంగా తాననుభవిస్తున్న కష్టం... ఇవన్నీ ప్రభాత్‌ను పరిష్కారం దిశగా ప్రేరేపించాయి. అందుకే ప్యూరిఫయర్ లో వృథా అవుతున్న నీటిని తిరిగి వినియోగించుకోవడానికి ఒక సెటప్‌ను రూపొందించాడు. రివర్స్ ఆస్మాసిస్ (ఆర్. ఓ.) అంటే...రివర్స్ ఆస్మాసిస్ అనేది నీటి శుద్ధీకరణలో ఒక పద్ధతి. నీటిలోని మలినాలు, క్లోరిన్, లవణాలు, ధూ«ళి ఇతర కలుషితాలను సెమీ–పెర్మెబుల్ పొరతో ఫిల్టర్ చేస్తారు.నీటి వృథా నుంచి-పునర్వియోగం దిశగా... ∙ప్రభాత్ 50–లీటర్ డ్రమ్మును తన ఇంటిలో ఒక మూలన రెండు చదరపుటడుగుల స్థలంలో ఉంచారు. స్క్రూడ్రైవర్‌తో డ్రమ్ మూతకు ఒక చిన్న రంధ్రం చేసి డిశ్చార్జ్ పైపును చొప్పించాడు. దీన్ని ప్యూరిఫయర్‌కు అనుసంధానించడం ద్వారా డ్రమ్‌లోకి వచ్చి చేరిన నీటిని పాత్రల శుభ్రం, టాయిలెట్ క్లీనింగ్, ఇల్లు తుడవడం, గార్డెనింగ్‌కు ఉపయోగించడం మొదలుపెట్టాడు. సింపుల్‌గా.... ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇప్పుడతను స్మార్ట్‌గా వృథా నీటిని రీయూజ్ చేస్తున్నాడు. ‘‘ప్రస్తుతం నేను రూ పొందించిన ఈ వ్యవస్థతో నెలకు కేవలం మా ఇంటినుంచే ఆరు పూర్తి నీటి ట్యాంకర్లకు సమానమైన నీటిని ఆదాచేస్తున్నాం. ఆ ఖర్చును మిగుల్చుకున్నాం. ఇప్పుడు ఇది మా కుటుంబ జీవన విధానంగా మారింది’’ అని సంతోషంగా చెప్పాడు. బాగుంది కదూ... మనం కూడా ఇలా స్మార్ట్‌గా ఆలోచిస్తే నీటి వృథాకు చెక్ చెప్పవచ్చు. -
సెంచరీ దాటేసిన బక్కమ్మ.. ఎక్కడ?
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి 105వ జన్మదిన సంబరాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన చీమల బక్కమ్మ 104 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపైకి చేరుకుని శుక్రవారం గ్రామంలో ఆనందోత్సవాల నడుమ జన్మదినాన్ని నిర్వహించారు. బక్కమ్మకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరి తరఫు కుటుంబమంతా (121) మంది బుధరావుపేటలో శుక్రవారం కలుసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించారు.‘‘సెంచరీలు కొట్టే వయసు మాది పాడుకోవడం కాదమ్మా... ‘శతాయుష్షు’ అనే ఆశీస్సుకు అసలైన అర్థంలా బతకాలి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటూ జీవితంలో సెంచరీ కొట్టేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి’’ అంటోంది శతాధిక మహిళ. ఇదీ చదవండి: Vegan ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!నూరేళ్లు బతకాలనే కల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా మన జీవన శైలి ఉండాలి. ఒత్తిడి లేని , సంతోషకరమైన జీవితం. ఎలాంటి కష్టాన్నైనా సానుకూలంగా మల్చుకుంటూ ముందుకు సాగిపోయే తత్వం, చక్కటి ఆహార నియమాలు, వ్యాయామం ఇవన్నీ సుదీర్ఘ కాలం జీవించేందుకు దోహదపడతాయి. -
Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?
సమ్మర్ (Summer)లో సన్‌స్క్రీన్ (Sunscreen) లోషన్ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్ మార్కెట్ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్లో ఒకవర్గం సన్‌స్క్రీన్ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?ప్రధానంగా రెండు రకాల సన్స్క్రీన్లు ఉన్నాయి. 1. మినరల్ 2. కెమికల్‌మినరల్ సన్‌స్క్రీన్‌లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌లాంటి క్రియాశీల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి యువి కిరణాలను నిరోధిస్తాయి. ఇక కెమికల్ సన్స్క్రీన్లు అధికశక్తి గల యూవీ కిరణాలను గ్రహిస్తాయి. చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవేకాకుండా మార్కెట్లో కాంబినేషన్ సన్స్క్రీన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.డెర్మటాలజిస్ట్‌లు ‘సన్‌స్క్రీన్ వాడడం మంచిదే’ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.‘సన్‌స్క్రీన్‌లోని ఇన్‌గ్రేడియెంట్స్ థైరాయిడ్ హార్లోన్లు, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ స్థాయులను దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి తక్కువస్థాయి ఆధారాలతో కూడిన ప్రాథమిక అధ్యయనాలు మాత్రమే. అందువల్ల సన్స్క్రీన్లు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లు అని నిర్దారించడానికి ఈ ఆధారాలు సరిపోవు’ అంటున్నారు డెర్మటలాజిస్ట్, ఇన్‌ఫ్లూయెంజ్ స్కిన్ అండ్ హేర్ క్లినిక్ ఫౌండర్ గీతికా శ్రీవాస్తవ.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!జింక్‌ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఇన్‌గ్రేడియెంట్స్ ఉపయోగించే ఫిజికల్ సన్‌స్క్రీన్స్ (మినరల్ సన్‌స్క్రీన్స్) సురక్షితమైనవని, ప్రభావ వంతవైనవని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్–రిసెర్చ్) నిర్ధారించింది. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి? -
వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
‘ఒక వ్యక్తి మొక్కల ఆధారిత ఆహారాన్ని (plant-based food) ఎంచుకుంటే రోజుకు 1,100 గ్యాలన్ల నీటిని ఆదా చేసినట్టే. పది కేజీల కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూమికి మేలు చేసినట్టే. ఒక జంతువు జీవితాన్ని కాపాడిన వారవుతారు. మీ భోజన ఎంపిక మీ ఆరోగ్యం గురించే కాదు, భూమిపైన జంతుజాలం నివసించడానికి, ఆరోగ్యకరమైన భూమి కోసం కూడా’ అంటున్నారు వీగన్ ప్రేమికులు. ‘ఉత్సాహంగా తినండి. ఉత్సాహంగా జీవించండి. ఉత్సాహంగా ఉండండి! పోషకాలతో ఉండండి, దయతో ఉండండి, ఆకుపచ్చగా ఉండండి!’ అనేది వీగన్ ప్రేమికుల మాట.మన ఆహారాల్లో శాకాహారం, మాంసాహారం గురించి తెలుసు. కొన్నాళ్లుగా వినిపిస్తున్నది వీగన్ (Vegan) ఆహారం. జంతు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. వీటిలో.. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు మొదలైనవి ఉంటాయి. ‘వీగన్ డైట్ ఎంపికలో సవాళ్లెన్నో ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12 పోషకాల కోసం ఆహార ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఉడికించిన శనగలను తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్.. వంటి ΄ోషకాలు లభిస్తాయి. శనగలను ఉడకబెట్టి, కూర లేదా సలార్ రూపంలో తయారుచేసి తీసుకోవచ్చు. సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు,ఫైబర్ లభిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడానికి సహకరిస్తాయి. ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాక్వినోవాలో ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తుంది. మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 వంటి ΄ోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా, బ్లాక్ బీన్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ బి, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఈ చిక్కుళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి నట్స్ రోజూ కొన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. నట్స్‌లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవాలి. ఇలా మొక్కల ఆధారిత గింజలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికరంగా, ఆరోగ్యకరంగా జీవనశైలిని మార్చుకోవచ్చు.’– శారద, ప్లాంట్ప్రెన్యూర్, సిమీస్ వరల్డ్, హైదరాబాద్చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
బొమ్మను చూస్తే నీలా ఉంది! అమ్మాయికి సంబరమంట!
సాక్షి, వరంగల్: పుట్టినరోజు కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఎవరైనా పుట్టినరోజు స్నేహితులకు చాక్లెట్లు ఇవ్వడం సాధారణమే. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఈ చాక్లెట్లలో ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు చేసుకుంటున్న వారి ఫొటోలను చాక్లెట్ కవర్‌పై ముద్రిస్తున్నారు. వాటిని స్నేహితులు, తోటి విద్యార్థులకు ఇస్తూ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటిని ఇక్కడ తయారు చేస్తున్న సంస్థ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారి నుంచి ఆర్డర్ తీసుకుంటూ.. పిల్లలకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు తమ ఫొటోతో ముద్రించిన చాక్లెట్లు మిత్రులకు ఇస్తూ సంబర పడిపోతున్నారు. అందరికీ నచ్చేలా.. టేస్టీగా.. ఈ చాక్లెట్లు పిల్లల్నే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిపొడి, కొబ్బరి నూనె, తేనె కలిపి వివిధ పద్ధతుల్లో తయారు చేసే ఈ చాక్లెట్ల రుచికి అందరూ ఫిదా అవుతుండటంతో వీటికి మార్కెట్లో యమ డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల (ఓరుగల్లు ఫొటోస్ ర్యాపర్ హోంమేడ్ చాక్లెట్లు) గురించి సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వెనుకాడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పట్టణాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఈ స్చంస్థ నిర్వాహకులు కరుణాకర్, సందీప్ చెబుతున్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! మా అమ్మాయి సంబరపడిందిపరకాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మా కుమార్తె ఆరుషి ఒకటో తరగతి చదువుతోంది. ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల గురించి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా తెలుసుకొని ఆర్డర్ ఇచ్చాం. పాప ఆరుషి ఫొటో చాక్లెట్ల కవర్‌పై ఉండటంతో తెగ సంబరపడిపోయింది. వారి పాఠశాలల్లోని ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చాక్లెట్ల గురించి వాకబు చేశారు. – డి.రవళి, పరకాల -
అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ విశిష్టత విశ్వవ్యాప్తం కానుంది. ఈ నేపథ్యంలో దేశానికే తలమానికమైన భాగ్యనగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న 72వ మిస్ వరల్డ్–2025 పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ చైర్పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగా.. వారికి ఘన స్వాగతం పలికారు.జూలియాతో పాటు విచ్చేసిన మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయం పద్దతిలో ఘన స్వాగతం పలికారు. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్‌ను సువర్ణ అవకాశంగా మలుచుకొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే స్లోగన్‌తో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ, ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్–2025 (Miss World 2025) కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదికలను తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా రూపొందించారు.నగర వేదికగా మిస్ వరల్డ్ థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్.. హైదరాబాద్ హెరిటేజ్ వాక్.. (మే 12న..) హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం, గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా నగరంలోని చారిత్రాత్మక ఆనవాలైన చారి్మనార్, లాడ్ బజార్లలో ప్రత్యేకంగా ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు. చౌమహల్లా ప్యాలెస్ సందర్శన.. (మే 13న..) హైదరాబాద్ (Hyderabad) నగరానికే తలమానికమైన చౌమహల్లా ప్యాలెస్ సందర్శిస్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను తిలకిస్తారు. ఎక్స్‌పీరియా ఎకో పార్క్ సందర్శన.. (మే 16న..) గ్రూప్–2 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మే 16 సాయంత్రం.. హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఎక్సీ్పరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. మెడికల్ టూరిజం పై పరిచయం.. (మే 16న..) వివిధ దేశాల నుంచి రోగులను ఆకర్షించే ఉద్దేశంతో మెడికల్ టూరిజాన్ని సైతం పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్‌కు గ్రూప్–1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. హైదరాబాద్‌లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు. ఘనంగా గ్రాండ్ ఫినాలే.. మే 22న నిర్వహించే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో.. 23న హెచ్ 2 హెచ్ ఛాలెంజ్ ఫినాలేలో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే – జ్యువెలరీ/పెర్ల్ గది షో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ కాంటెస్ట్ నిర్వహిస్తారు. చివరగా 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఇవే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాగార్జునసాగర్, బౌద్ధవనం ప్రాజెక్టు, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్, యునెస్కో గర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రతిష్టాత్మక యాదగిరి గుట్ట దేవాలయం తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. మిస్ వరల్డ్ ఆటల తుది పోటీలు.. (మే 17న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ సందర్శన.. (మే 17న..) ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సేఫ్టీ టూరిజం.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్‌ను పరిశీలిస్తారు. సచివాలయ సందర్శన.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కారి్నవాల్ను కూడా సందర్శిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరు.. (మే 20 లేదా 21..) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు గ్రూప్–1 కంటెస్టెంట్లు హాజరవుతారు. తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్.. (మే 21న..) గ్రూప్–2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్స్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. -
న్యాయపీఠంపై మహిళా తేజం
‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్ గండ్రాతి, ‘సాక్షి’ నెట్వర్క్1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్ఎల్బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు సొంత నోట్స్ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిఖీషా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి? -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్‌గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్‌తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు. -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
వజ్రాల నెక్లెస్, బెనారస్ సిల్క్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పడూ సరికొత్త లుక్‌తో అందర్నీ ఆశ్యర్యపరుస్తుంటారు. మరోసారి తాజాగా అలాంటి మెస్మరైజ్ లుక్‌తో మెరిశారు. ఆ విశేషాలేంటో చూద్దామా..!.నీతా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారతదేశ గొప్ప హస్తకళను ప్రదర్శించే ఫ్యాషన్ ఐకాన్. ఆమె సదా విశాలమైన బంగారు అంచులతో కూడిన చీరలతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు . కేవలం ప్రతిభాపాటవాలే కాదు, అప్పడప్పుడూ మన డ్రెస్ సెన్స్ కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుందని తన స్టైలిష్ ఫ్యాషన్వేర్లతో చెబుతూనే ఉంటారామె. ఈసారి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో అద్బుతమైన లుక్‌తో ఆకర్షించారు. చీరలంటే అమితంగా ఇష్టపడే నీతాని ఈ వేడుకలో బెనారస్ సిల్క్ చీరలో తళుక్కుమన్నారు. సంక్లిష్టమైన బహుళ వర్ణ పూల ఎంబ్రాయిడరీ డిజైన్‌తో చీర హైలెట్‌గా నిలిచింది. ఆ చీర లుక్‌కి సరిపోయే మ్యాచింగ్ బ్లౌజ్ జత చేశారు. ఆ చీరకు తగ్గట్టు స్టేట్మెంట్ డైమండ్ స్టడ్ చెవిపోగులు, ప్రకాశవంతమైన ఎరుపు మాణిక్యాలతో పొదగబడిన డైమండ్ నెక్లెస్‌తో ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కాంతివంతమైన లుక్‌లో కనిపించారామె. అందుకు తగ్గ మేకప్, స్టైలిష్ హెయిర్ స్లైల్‌తో రాజరికానికి అద్దం పట్టేలా ఆమె ఆహార్యం అదిరిపోయింది. కాగా, వేవ్స్ 2025(WAVES 2025) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఈ నెల మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, క్రియేటర్లు, విధాన రూపకర్తలతో సహా 90కి పైగా దేశాల నుంచి సుమారు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
The Midnight Walk’ అ ‘మాయ’కుడు ఎవరు
డార్క్ ఫాంటసీ అడ్వెంచర్ గేమ్.... ది మిడ్నైట్ వాక్. ప్లేయర్స్‌ను ఈ గేమ్ భయానక ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. ఆ ప్రపంచంలోకి వెళ్లే ధైర్యసాహసాలు ఉంటే క్రూరమైన రాక్షసులతో ΄ోరాడాలి. ఎన్నో రహస్యాలను వెలికితీయాలి. కోర్ గేమ్‌ప్లే ఫీచర్స్ఆకట్టుకుంటాయి. ఈ గేమ్ కోసం ఎన్నో సర్రియల్ క్రియేచర్లను సృష్టించారు. ప్రతి ఫ్రేమ్ స్టాప్ మోషన్ మ్యాజిక్‌తో ప్రాణం పోశారు.‘సూర్యుడిని ఎవరు మాయం చేశారు? ఎందుకు?’ అనేది గేమ్‌లో సెంట్రల్ మిస్టరీ.‘ఈ గేమ్ ఇండి గేమింగ్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటుంది. మిడ్నైట్ వాక్ అనేది డార్క్ ఫాంటసీ, స్టాప్–మోషన్ మ్యాజిక్ సమ్మేళనం’ అంటున్నారు గేమ్ మేకర్స్.విడుదల తేది: 8 మే ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, మైక్రోసాప్ట్ విండోస్ జానర్స్: అడ్వెంచర్ గేమ్, ఇండి గేమ్ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా? అవును... ఇది నిజమే! ∙1904లో అమెరికన్ టీ వ్యాపారి ఒకరు చిన్న సిల్క్ సంచులలో టీ పొడిని ఐరోపాకు రవాణా చేశాడు. అయితే....కొందరు తెలియక వాటిని మరుగుతున్న నీటిలో ముంచారు. అలా టీ బ్యాగ్ ఐడియా పుట్టింది! ∙‘ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒకేరకంగా ఉండవు’ అనేది నాలుకకు కూడా వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ‘టంగ్ ప్రింట్’కు దాని స్వంత, విలక్షణమైన ఆకారం, పరిమాణం, రంగు ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ఫోరెన్సిక్ పరిశోధనలలో ‘టంగ్ ప్రింట్’లు కూడా ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్‌మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వుడ్స్, ట్రైల్స్ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్ బే నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్ టూర్లో ఆడియో, వీడియో హాల్లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్‌పై 75 థీమ్ పార్క్‌లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్గార్డ్స్, ఈస్ట్రన్స్ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్ అక్వైరియం, థీమ్ ఫారెస్ట్‌ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్ పార్క్‌కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో బర్డ్స్ వాక్ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్)బొటానికల్ గార్డెన్లో సమ్మర్ డే క్యాంప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్ వాక్, స్నేక్ షో, థీమ్ పార్క్‌లు, వైల్డ్ లైఫ్ సఫారీలను చూపిస్తారు. వివరాల కోసం ఫోన్: 9493549399, 9885298980. -
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు! -
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..) -
Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా.. -
Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.– రాచమడుగు శ్రీనివాసులు -
Pahalgam tragedy ఐక్యంగా నిలబడటం మనకు తెలుసు
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి. ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.-జహారా బేగంవ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి..స్టైలిష్‌గా మార్చేయండిలా..!
అప్ సైక్లింగ్ వార్డ్రోబ్లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్‌లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.అప్‌సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.అంచులను మార్చి...అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్లు డిజైన్ చేయవచ్చు.ప్యాచ్ వర్క్పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్‌వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్‌వర్క్ బోర్డర్లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.లాంగ్ గౌన్లువన్పీస్ లాంగ్గౌన్లు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్‌ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్‌కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు. చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్‌లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్‌తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్‌ను అద్దుతుంది. (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
NCERT చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర?
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసర్చ్ అండ్ ట్రయినింగ్ (ఎన్సీఈఆర్టీ) 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రావడం కోసం ప్రచురింన ఏడో తరగతి పాఠ్య పుస్తకం మొదటి భాగం వెలువడిన సందర్భంగా అందులో గతం నుం కొనసాగిన, రద్దయిపోయిన, మారిన అంశాల గురించి వార్తా కథనాలు ఈ సోమవారం సంచలనం సృష్టించాయి.పాఠ్య పుస్తకాలు మార్చడాన్ని ఎవరూ తప్పు పట్టనక్కరలేదు. తప్పనిసరిగా పాఠ్య పుస్తకాలు ఎప్పటికప్పుడు మారవలసిన అవసరం ఉంటుంది. ఆ రంగంలో కొత్త పరిశోధనలు జరిగి కొత్త ఆవిష్కరణలు బైటపడినప్పుడు ఆ కొత్త విషయాలు విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి పాఠ్య పుస్తకాలలో మార్పులూ చేర్పులూ చేయవలసి ఉంటుంది. కానీ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న మార్పులూ, చేర్పులూ, తొలగింపులూ ఆ యా శాస్త్ర రంగాలలో జరిగిన నూతన అన్వేషణలకు సంబంధింనవి కావు. అవి ఆ సంస్థనూ, విద్యా శాఖనూ, భారత ప్రభుత్వాన్నీ ఇవాళ నడుపుతున్నవారి భావజాలానికి తక్షణ ప్రయోజనాలకు అనుగుణమైనవి. ఏదో ఒక భావజాలం మాత్రమే చెప్పడం విద్యార్థుల చిన్నారి మనసులను కుంంపజేసి, కళ్లకు గంతలు కట్టడమే. అలాగే ఐదు సంవత్సరాల పాలనాధికారం కోసం గద్దెనెక్కిన వారు తమ తక్షణ ప్రయోజనాలను న్నారి పిల్లల మనసులపై సుదూర ప్రభావం పడేలా నింపడం అనుచితం. ఇప్పుడు ఏడో తరగతి కోసం కొత్తగా విడుదల చేసిన ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ – ఇండియా అండ్ బియాండ్ (భాగం 1)’ అనే పుస్తకం ఇప్పటివరకూ ఉండిన చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పౌరనీతి (సామాజిక, ఆర్థిక జీవనం) అనే మూడు విడివిడి పుస్తకాలను తొలగించి ఆ స్థానంలో ఒకే సమగ్ర పుస్తకంగా తయారయింది. రెండో భాగం కూడా త్వరలో వెలువడుతుందని అంటున్నారు గానీ, ఈ పుస్తకం వరకే చూస్తే చాలా మార్పులు కనబడుతున్నాయి. ‘ప్రపంచం’, ‘గత వైభవ దృశ్యం’, ‘మన సాంస్కృతిక వారసత్వం-జ్ఞాన సంప్రదాయాలు’, ‘పాలన- ప్రజాస్వామ్యం’, ‘మన చుట్టూ ఉన్న ఆర్థిక జీవనం’ అనే ఐదు ఇతివృత్తాలతో ఈ పుస్తకం ఉంది. అంతకు ముందరి ఏడో తరగతి చరిత్ర పుస్తకం ఏడో శతాబ్ది నుంచి భారత చరిత్రను పరిచయం చేయగా దానికి భిన్నంగా ప్రస్తుత పుస్తకం ఆరో శతాబ్దితో ముగుస్తుంది. అందువల్ల పాత పుస్తకంలో ఉండిన మధ్య యుగాల చరిత్ర, ఢిల్లీ సల్తనత్, ముఘల్ పాలన వంటి పాఠాలు లేకుండా పోయాయి. చరిత్రలో ఒక భాగాన్ని న్నారి పిల్లల పాఠ్యాంశాల్లోం తొలగించినంత మాత్రాన ఆ చరిత్రను రద్దు చేయగలమని అనుకోవడం హాస్యాస్పదం. కోవిడ్ తర్వాత న్నారి విద్యార్థుల మీద పాఠ్యాంశాల భారం ఎక్కువగా ఉండగూడదనే సదుద్దేశంతో పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠ్యాంశాలను కుదించడం ప్రారంభించారు. ముఘల్ చరిత్రలో కొంత భాగాన్ని, డార్విన్ జీవ పరిణామవాద సిద్ధాంతాన్ని, పీరియాడిక్ టేబుల్‌ను పాఠ్యాంశాలలో కుదించారు. ప్రస్తుత పుస్తకం మరొక అడుగు ముందుకు వేసి కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగానే తొలగింంది. అయితే ‘భారం తగ్గించడం కోసం పాఠ్యాంశాల తగ్గింపు, తొలగింపు’ అనే సూత్రం కూడా త్తశుద్ధితో పాటించలేదు. కొన్ని కొత్త పాఠాలు వచ్చి చేరాయి. ‘భూమి పుణ్యభూమి ఎలా అవుతుంది’ అని ఒక అధ్యాయం చేర్చి, ప్రత్యేక స్థలాలను మతాలు ఎలా పవిత్రంగా భావిస్తాయో ఒక పాఠం చేర్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల గురిం, చార్ ధామ్ యాత్ర గురిం, శక్తి పీఠాల గురిం ఏడో తరగతి పిల్లలకు పాఠాలు పెట్టారు. అలాగే ‘అరవై ఆరు కోట్ల మంది పాల్గొన్న కుంభమేళా’ గురించి పాఠం చేర్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని వ్యాకరణం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం, గుప్త సామ్రాజ్యంలో శాస్త్ర పరిశోధనలు వంటి ప్రాచీన భారత మేధా కృషి గురించి పాఠాలు చేర్చారు. వర్ణ–కుల వ్యవస్థ ప్రాచీన భారత సమాజంలో స్థిరత్వం సాధించడంలో నిర్వహింన పాత్ర గురిం ఒక పాఠం పెట్టి, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ కరడుగట్టి అసమానతలకు దారి తీసిందని రాశారు. ఆరో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దానికి గంతు వేసి ప్రస్తుత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘అటల్ సొరంగం’ నిర్మాణం వంటి విషయాలు రాశారు. ఇలా మనం ఏకీభవింనా ఏకీభవించకపోయినా చరిత్ర లో జరిగిపోయిన వాస్తవ ఘటనలను, పరిణామాలను చెప్పకుండా ఉండాలనుకుంటే ఆ మేరకు చిన్నారి పిల్లల మనసులలో, పరిజ్ఞానంలో అనవసరమైన, ప్రమాదకరమైన ఖాళీలు, శూన్యాలు ఏర్పడతాయి. ఉద్దేశపూర్వకంగా ఖాళీలు వదలడం జ్ఞాన సముపార్జన శక్తిని ధ్వంసం చేసే, ఆలోచనా శక్తిని కురచబరిచే పద్ధతి. ఎటువంటి విషయమైనా చెప్పి, దాని పట్ల విమర్శనాత్మకంగా ఉండాలనే సందేశం ఇవ్వవలసిన చోట, కొన్ని విషయాలను తుడిచేయగలమని అనుకోవడం అనుతం. ఈ పద్ధతి ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అది పాఠశాల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి 1961లో కేంద్ర ప్రభుత్వం రపొందించిన అత్యున్నత ప్రవణాల స్వతంత్ర సంస్థ. అది చేసే అనేక పనులలో భాగంగా పాఠ్యాంశాలను రూపొందించి, వాటి ఆధారంగా ఆ యారంగాల నిపుణుల చేత పాఠ్యపుస్తకాలు రాయిం, మూడు నాలుగు అంచెల పర్యవేక్షణ, పరిశీలన, సవరణల తర్వాత అచ్చువేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేసే పథకం 1970ల నుం సాగుతున్నది. ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, భాషా సాహిత్యాల పుస్తకాలు ఆ యా తరగతుల వారు మాత్రమే కాక యూపీఎస్సీ పరీక్షార్థులు, సాధారణ పాఠకులు కూడా చదువుకునేంత ఆసక్తికరంగా తయారయ్యాయి. నిష్ణాతులు రాసిన, దశాబ్దాల పాటు అపారమైన గౌరవాన్ని చూరగొన్న ఆ పుస్తకాలను అడ్డదిడ్డంగా మార్చి, సంఘ్ శాఖలలో ఇన్నాళ్లుగా చెబుతున్న వక్రీకరింన, సంకుతమైన, కళ్లకు గంతలు కట్టే చరిత్రను ఇప్పుడు పాఠ్యపుస్తకాలకు ఎక్కిస్తున్నారు. ఎటువంటి పరిశోధన లేకుండా, వాస్తవాల పట్ల గౌరవం లేకుండా ఐటీ సెల్స్‌లో వండి వార్చిన అసత్యాల, అర్ధసత్యాల, వాట్సప్ యూనివర్సిటీ చరిత్రకు పాఠ్యపుస్తకాల గౌరవం కల్పిస్తున్నారు. భవిష్యత్ తరాన్ని ధ్వంసం చేస్తున్నారు. -ఎన్ వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్‌లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరంజీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది. దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.పరీక్షలతో లోపాల గుర్తింపుఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి. కండరాల పటుత్వానికి40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలిసమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. – డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్ఎక్స్ హెల్త్ (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
పేరెంటింగ్ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్‌మోడల్ పేరెంటింగ్ రూల్ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్‌లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఈ జెన్ జెడ్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇంటి నిండా బొమ్మలే!జెన్ జెడ్ పేరెంట్స్ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. ఇందులో విపరీతమైన షాపింగ్ ఒకటి. గత తరం పేరెంట్స్ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్‌లు నిండిపోతున్నాయి. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్ జెడ్ పేరెంటింగ్ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్ పేరెంటింగ్ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్పర్సనల్ హోలిస్టిక్ కోచ్ అర్పితాగుప్త. సంతోష క్షణాలు!ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పేరెంట్స్ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్‌కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్ జెడ్ పేరెంటింగ్ రోల్ మోడల్ పేరెంటింగ్ అవుతుంది.ఓ ఆశ్చర్యకరమైన సంఘటనఅది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్‌ని కండిషన్ చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్ కండిషనల్‌గా ఆ ఎమోషన్ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. అయితే పైన చెప్పుకున్న కండిషన్లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్‌ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్ కంట్రోల్ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్ కోచ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: -
భళా వైభవ్...వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
సెరిబ్రల్ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన వైభవ్‌కు చెస్ పరిచయం చేశాడు తండ్రి గౌతమ్. ఆనాటి నుంచి ఒంటరి ప్రపంచం నుంచి చదరంగ ప్రపంచంలోకి వచ్చాడు వైభవ్. తండ్రితో కలిసి తరచుగా చెస్ ఆడేవాడు. క్రమంగా ఆటలో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం అతడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.దిల్లీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వైభవ్ తొలి టోర్నమెంట్. తొలి ప్రయత్నంలోనే రేటింగ్‌ను సాధించడం విశేషం. చెస్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ రేటింగ్ ఇచ్చింది.గ్రాండ్ మాస్టర్’ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే టోర్నమెంట్స్‌కు వైభవ్‌తో పాటు అతడి తండ్రి గౌతమ్ కూడా వెళుతుంటాడు. మ్యాచ్ సమయంలో అతడి పక్కనే కూర్చొని నొటేషన్లు రాస్తుంటాడు. కొడుకు కెరీర్ పట్ల తండ్రి చూపిస్తున్న అంకితభావం మాటలకు అందనిది.ఇదీ చదవండి: అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్ View this post on Instagram A post shared by vaibhav gautam (@vaibhav.gautam_official) ఆటలంటే ఇష్టపడే గౌతమ్ తన కుమారుడు కూడా ఆటలు ఆడాలనుకునేవాడు. న్నప్పటి నుం వీల్‌చైర్‌కే పరిమితమైన వైభవ్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ...లాంటి ఆటలు ఆడలేడు. ‘ఇంతేనా’ అని కుమారుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో ‘చెస్’ అనే ఆలోచన మెరిసింది. ఇక అప్పటి నుంచి కుమారుడికి చెస్‌పై ఆసక్తి కలిగేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తానే గురువుగా మారాడు. మొదట్లో తండ్రి ఒక గేమ్, కొడుకు ఒక గేమ్ గెలిచేవారు. ఆ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారి΄ోయింది. తండ్రిపై ఎప్పుడూ వైభవే విజయం సాధించేవాడు. దీంతో కుమారుడిపై ఆ తండ్రికి మరింత నమ్మకం కలిగింది.‘యస్. మా వాడు సాధించగలడు’ ఒకటికి పదిసార్లు అనుకునేవాడు. ఆటలో మరింత నైపుణ్యం కోసం రామ్‌కుమార్ అనే కోచ్‌తో వైభవ్‌కు ఆన్లైన్లో కొన్ని నెలలు శిక్షణ ఇప్పించాడు. ఆ తరువాత జీబి జోషిని కోచింగ్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ‘మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘ఒక్క పైసా కూడా అక్కర్లేదు’ అంటూ వైభవ్‌కు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జోషి. ఆటలో ఎప్పటికప్పుడు రేటింగ్ పెంచుకుంటూ అద్భుతం అనిపించు కుంటున్నాడు వైభవ్.‘వైభవ్ శారీరక స్థితికి వీల్‌చైర్‌లో కూర్చుని చెస్ ఆడడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. దీని కోసం ఎంతో కఠోర సాధన చేశాడు’ అంటున్నాడు గౌతమ్. జీవనోపాధి కోసం గౌతమ్ దిల్లీలో చిన్న షాప్ నడుపుతున్నాడు. ‘మీరు ఎక్కువ సమయం వైభవ్‌తోనే గడపాల్సి వస్తుంది కదా’ అని అడిగితే ఆ తండ్రి చెప్పిన జవాబు...‘మా అబ్బాయికి కచ్చితంగా మంచి టైమ్ వస్తుంది. అప్పటి వరకు నా టైమ్ గురించి ఆలోచించడం లేదు’ ‘ఇలా అయితే ఎలా?’ అని ఎప్పుడూ బాధ పడలేదు వైభవ్. ఆ యువకుడు నడవలేడు. మాట్లాడలేడు. 90 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు. తనను నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి తీసుకువచ్చి కొత్త ప్రపంచం చూపించింది చదరంగం.... -
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్‌కి నేను దూరం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి: -
ఆడుతూ పాడుతూ మార్కులు
బుధవారం ఐ.ఎస్.సి. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. బెంగళూరులో టాపర్స్‌గా నిలిచిన ముగ్గురూ తమ కాలేజీల్లో సాంస్కృతిక కార్యకలాపాలలో చురుగ్గా ఉన్నారు. చదువు మిస్ కాలేదు. అలాగే ఉల్లాసాన్నిచ్చే కళలను కూడా! ‘మాకు కళలే చదువులో రిలాక్స్ అయ్యేలా చేశాయి’ అని వారు అన్నారు. తల్లిదండ్రులూ, విద్యార్థులూ ఈ విషయాన్ని వింటారా మరి? క్రీడలూ, కళలు చదువును చెడగొట్టవని! ఈ సెలవుల్లో అయినా వాటిని నేర్చుకుందామని!పూర్వం స్కూళ్లల్లో పాతజోకు ఉండేది.స్టూడెంటు ‘హోమ్‌వర్క్ చేయడం మర్చిపోయాను సార్’ అని అంటే ‘అన్నం తినడం మర్చిపోలేదు కదా. ఇదెలా మర్చిపోయావు‘ అని బెత్తంతో ఒక్కటి వేసేవాడు సారు.స్టూడెంట్స్‌కు అన్నం తినడానికి, నిద్ర పోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్పక సమయం ఉంటుంది. అలాగే ఇష్టమైన ఆసక్తి నెరవేర్చుకోవడానికి కూడా టైమ్ ఉంటుంది. ఇవన్నీ చేసి బ్రహ్మాండం గా చదవగలరు పిల్లలు. గతంలో అలా చదివి, ఇంకా చె΄్పాలంటే ఏ సౌకర్యాలు లేకపోయినా కరెంటు స్తంభాల వెలుతురులో చదివి గొప్ప విద్యార్థులు అయిన వారు ఉన్నారు. తల్లిదండ్రులకు అది తెలుసు. అయితే తల్లిదండ్రులు ఆ సంగతి మర్చిపోయారు.కొడుకులు, కూతుళ్లు నేడు అన్ని సౌకర్యాలతో ఉన్నా ఫ్యాను, లైటు, స్కూల్ బస్సు, టిఫిన్ బాక్స్, మంచి స్కూలు ఉన్నా కేవలం చదువుకు మాత్రమే అంకితమైతే తప్ప గొప్ప మార్కులు తెచ్చుకోలేరని భావిస్తున్నారు. పుస్తకం ముందేసుకుని ఉంటేనే ర్యాంకులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కాసేపు చదివినా మంచి మార్కులే వచ్చేవి. కాని ఇప్పటి విద్యార్థులు స్కూలు/కాలేజీ మొదలైన రోజు నుంచే చదువుతున్నారు. అంటే వారు ఎంత లేదన్నా పరీక్ష బాగా రాస్తారు. అయినా సరే వారికి ఆట వద్దు, పాట వద్దు, సినిమా వద్దు, బంధువులు వద్దు అనడం వల్ల పిల్లలను ఐసొలేట్ చేయడమా కాదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి.ఇదిగోండి ఉదాహరణ‘ది కౌన్సిల్ ఫర్ ది స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్’ (సి.ఐ.ఎస్.సి.ఇ.) బోర్డ్ వారు ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ‘స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (ఐ.ఎస్.సి) రిజల్ట్స్ బుధవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ రిజల్ట్స్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులు రేయింబవళ్లు చదువుకే అంకితమైన వారు కాదు. ముఖ్యంగా బెంగళూరుకు టాపర్లు ఆటకూ పాటకూ చోటిచ్చి ఈ మార్కులు తెచ్చుకున్నారు. వీరిలో శామ్యూల్ పింటోకు 96 పర్సెంట్ వచ్చింది. బెంగళూరు కోరమండల లోని బెతాని స్కూల్లో ఇంటర్ చదివిన పింటో ‘నేను స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌కి సెక్రటరీని.అంతేకాదు వ్యక్తిగతంగా పాము విషానికి విరుగుడు మందు విషయంలో నాదైన పరిశోధన చేస్తున్నాను. ఈ రెంటికీ సమయం ఇచ్చినా స్కూల్ చదువును టైమ్‌టేబుల్ ప్రకారం చదువుకున్నాను. నేను భవిష్యత్తులో యాంటీ వీనమ్ టెక్నాలజీలో పని చేస్తాను’ అన్నాడు. హ్యుమానిటీస్‌లో టాపర్‌గా వచ్చిన నటాలీ కూడా అదే స్కూల్లో చదివి 98.2 పర్సెంట్ తెచ్చుకుంది. నేను నా పదో ఏట నుంచి సింగర్‌గా, డాన్సర్‌గా, యాక్టర్‌గా కృషి చేస్తున్నాను. అవి నా చదువుకు అడ్డు కాలేదు. చదువుకు సమయం తప్పకుండా కేటాయించి చదివాను’ అంది.ఐ.సి.ఎస్ ఎగ్జామ్స్‌లో కామర్స్‌లో టాపర్‌గా నిలిచిన సాన్నిధ్య బెంగళూరు గ్రీన్వుడ్ స్కూల్ విద్యార్థిని. 98.75 పర్సెంట్ తెచ్చుకుంది. ‘కథక్ నా స్ట్రెస్ బస్టర్. బాడ్మింటన్ ఆడతాను. ఈ రెంటికీ 3 గంటల సమయం ఇచ్చి మిగిలింది చదువుకు ఇస్తాను’ అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులూ... అన్ని సౌకర్యాలు ఇచ్చి పిల్లలను చదివిస్తున్న మీరు వారికి ఆట పాటలు ఆసక్తులు ఇవ్వలేరా? బడి జరుగుతున్నప్పుడు సరే. కనీసం ఈ వేసవి సెలవుల్లో అయినా. సెలవులను ఆనందాలుగా చేసి వారి దోసిళ్లలో పోయండి. – కె.ఈ పుస్తకం చదవండికొందరు తమకు రెక్కలున్నాయనే గుర్తించరు. మరికొందరు రెక్కలున్నది ఇంతవరకు ఎగిరేందుకే అనుకుంటారు. కాని ప్రయత్నం చేయాలి... ఉన్నదానిని పెంచి సాధించుకోవాలి అని పట్టుపడ్డ సముద్ర పక్షి కథే ‘జోనాథన్ లివింగ్స్టన్ సీగల్’. జోనాథన్ అనే పేరున్న సీగల్ మన కాకిస్థాయి పక్షి. ఎక్కువ ఎత్తు ఎగరలేదు. 500 అడుగుల ఎత్తులోపే ఎగరగలదు. ఎగిరినా ఆహార అన్వేషణ కోసమే. కాని జోనాథన్‌కు ‘నాకు రెక్కలున్నాయి. గద్దలాగా మరింత ఎత్తుకు ఎందుకు ఎగరకూడదు’ అనిపిస్తుంది. అలాంటి ఆలోచనకే భయపడే సీగల్స్ మధ్య 5000 అడుగుల ఎత్తుకు ఎగిరి చరిత్ర సృష్టిస్తాడు జోనాథన్ రిచర్డ్ బాక్ రాసిన ఈ చిన్న నవలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. పిల్లలు తప్పక చదవాలి. తాము కేవలం ర్యాంకులు తెచ్చుకోవడానికే పుట్టలేదు... వాటితో పాటు అనేక పనులు చేయగలం... సాధించగలం... అనే ఆత్మవిశ్వాసం పొందుతారు. -
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
సహజ యోగతో ఆత్మసాక్షాత్కారం
ఒకప్పుడు ఋషులు, మహర్షులు కఠోరమైన తపస్సులు చేస్తేనే కానీ సాధ్యం కాని కుండలినీ శక్తి జాగృతి నేడు సాధారణమైన గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమయిందని అడిగితే శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఇలా వివరిస్తారు‘ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయింది. మొత్తం మానవాళి తమ పరిణామ క్రమంలో తదుపరి దశ అయిన మానవాతీత స్థాయిని చేరుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. అనాది కాలంగా అరణ్యాలు, పర్వతాలలో తపస్సులు చేసి భగవంతుని కోసం పరితపింmrన ఋషి పుంగవులంతా నేడు సామాన్యులుగా జన్మిం ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారు. వారి పూర్వ జన్మల పుణ్యఫలం నేడు అనుభవిస్తున్నారు. వారి లోపల ఉన్న దానినే వారికి పరిచయం చేశాను కానీ నేను కొత్తగా ఏమీ ఇవ్వడం లేదు‘ అని చెప్పారు.ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఉన్న సహజ యోగ సాధకులు వివిధ రకాల వ్యాధులను, అవి ఇంకా భౌతిక శరీరానికి రావడానికి ముందే చైతన్య తరంగాల సహాయంతో సూక్ష్మ శరీరంలోనే వాటిని గుర్తించి, నయం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా సహజ యోగం మరింతగా వ్యాప్తి చెందితే, మానవులకు ఇక ఆసుపత్రుల అవసరం ఉండదు అనేది సత్యదూరం కాదు.ఇదీ చదవండి: Dharmakīrti గెలిచేది, నిలిచేది ధర్మమే...సత్యమే!ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు ‘సహజ యోగం‘ మీద జరిపిన పరిశోధనకి గాను డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు దీనిని ఒక ‘ప్రత్యామ్నాయ వైద్యం‘ గా గుర్తించి గౌరవించారు. ఇంకా శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన పలు విషయాల మీద పరిశోధన జరుగుతుంది. రష్యాలో శాస్త్రవేత్తలు ‘వెగా మెషీన్‘ అనే మెషీన్ ద్వారా సహజ యోగ ధ్యానం చేయటానికి ముందు, ఆ తర్వాత మనిషి శరీరంలో జరుగుతున్న మార్పులను నమోదు చేసి ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. భవిష్యత్తులో సహజ యోగం మరింతగా వ్యాప్తి చెంది, భృగు మహర్షి తెలియజేసిన విధంగా మొత్తం మానవాళి బ్రహ్మానంద అనుభూతిలో ఓలలాడుతుందని ఆశిద్దాం.– డా. పి. రాకేశ్( పరమ పూజ్య శ్రీ మాతాజీనిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
మన సాంప్రదాయ కళకు కొద్దిమంది ప్రాణం పోసి సజీవంగా నిలుపుతారు. వాటిని బావితరాలకు తెలిసేలా కృషి చేస్తారు. ప్రస్తుత ట్రెండ్ కాకపోయినా..ఎవ్వరో ఒక్కరైనా ఆదరించకపోదురా అనే ఆశతో కొనసాగిస్తున్న వారి ఓపిక, పట్టుదల ఎవ్వరినైనా కదిలిస్తాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారంతో గుర్తిస్తే..అది వారి కృషికి తగిన గుర్తింపే గాక, మరికొన్ని కళలు కనుమరగవ్వకుండా నిలుస్తాయి కూడా. అందుకు ఉదాహరణే ఈ కన్నడ బామ్మ భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార. కర్ణాటకకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార(Bhimavva Doddabalappa Shillekyathara) షాడో తోలుబొమ్మలాట(shadow puppetry) కళాకారిణి. కన్నడకు చెందిన ఈ సాంప్రదాయ తోలుబొమ్మలాటను ప్రపంచానికి తెలిసేలా చాలాకృషి చేసింది. నీడ సాయంతో తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు. అది గొప్ప నైపుణ్యానికి సంబంధించిన కళ. దాన్ని వినోదాత్మకంగా అందరికి తెలిసేలా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది. సుమారు 80 ఏళ్లుగా ఈ భీమవ్వ షాడో బొమ్మలాట కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చేతులతో అద్భుతం సృష్టించే కళకు ఆధారం పురాణాలు. ప్రజలను ఆకట్టుకునేలా రంజింప చేసే సంగీతంతో కట్టిపడేసే కదలికలతో ప్రదర్శనలు ఇచ్చేది. ప్రజలు ఆదరించకపోతున్నా..తన కళా ప్రస్థానాన్ని ఆపకుండా..అవిరాళంగా ప్రదర్శిస్తూ..బావితరాలు గుర్తించి తెలుసుకునేలా ఈ విద్య గురించి బోధిస్తూనే ఉంది. మన దేశంలోని జానపద మూలాలతో లోతైన సంబంధం ఉన్న కళ ఇది. పరిమిత వనురులే ఉన్న..అంతమేర మంచి కళాత్మకంగా ప్రదర్శంచేది. దీన్ని కన్నడలో 'తొగలు గొంబెయాట'గా పిలచే నీడ తోలుబొమ్మల నాటకం. భీమవ్వ సాంప్రదాయ నీడ తోలుబొమ్మలాటతో పౌరాణిక కథలు జానపద కథలను ప్రదర్శించేది. ముఖ్యంగా అది సంతానోత్పత్తికి ప్రతీకగా ముడిపడి ఉన్న కళ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన సంప్రదాయ తోలుబొమ్మలాటతో ముడిపడి ఉన్న షాడో తోలుబొమ్మలాట ఇది. మత సంబంధాలకు అతీతంగా కూడా ప్రదర్శనలిచ్చేవారు కూడా. ఇన్నాళ్లుకు ఆమె కృషికి తగిని గుర్తింపు లభించింది. సంప్రదాయ కళను బతికిస్తూ వస్తున్న భీమవ్వకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమె భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మ శ్రీ'(Padma Shri ) అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారామె. శతాబ్దాల నాటి కథలకు ప్రాణం పోసి.. తోలుబొమ్మలను పట్టుకున్న చేతులతో, ఆమె ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది. ఆమె ఆ రాష్ట్రపతి భవన్ హాలులోకి నిశబ్దంగా వస్తూ..ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగానే ఒక్కసారిగా హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. అంతేగాదు ఆమె పురస్కారం తీసుకుంటుండగా..అంతా స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవించి మరీ సత్కరించారు. ఇది నిజంగా కళకు ప్రాణం పోసినవారికే దక్కే అసలైన గౌరవం కదా..! .#WATCH | 96-year-old puppeteer Bhimavva Doddabalappa Shillekyathara receives Padma Shri award from President Droupadi Murmu for her contribution to the field of Art. (Video Source: President of India/YouTube) pic.twitter.com/4PVvqSI9YL— ANI (@ANI) April 28, 2025 (చదవండి: Kilimanjaro Diet: 'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..) -
Adi Shankaracharya ఆ ఘనత... ఆదిశంకరులదే
అద్వైత సిద్ధాంత బోధకుడిగా..నిత్యస్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా... ఆలయస్థాపనకు నడుం బిగింన సాధకుడిగా...జగద్గురువు ఆదిశంకరాచార్యులు (Adi Shankaracharya) తలపెట్టని కార్యంలేదు. రేపు శంకర జయంతి సందర్భంగా జగద్గురు ఆదిశంకరుల గురించి కొన్ని విశేషాలు...!కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మింన శంకరాచార్యులు చిన్నతనం నుంచీ ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవేదాంగాలనూ, ధర్మశాస్త్రాలనూ ఆపోసన పట్టిన శంకరులు తల్లి అనుమతితో సన్యాసాన్ని స్వీకరించారు. గోవింద భగవత్పాదులను గురువుగా భావించారు. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని ప్రపంచానికి తెలియజేశారు. ముప్ఫైరెండేళ్లు మాత్రమే జీవింన శంకరాచార్యులు.. అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు ఆసేతు హిమాచలం దాదాపు మూడుసార్లు ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తూనే సన్యాస వ్యవస్థను పదిరకాలుగా వర్గీకరించారు. నేటికీ సన్యాసాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత శంకరాచార్యులదే. జీవాత్మ–పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు.సామాన్యులూ చదువుకునేలా...శంకరాచార్యులు భక్తిమార్గంలో ప్రయాణించాలనుకునేవారికి ఎన్నో స్తోత్రాలను అందించారు. కనకధార స్తోత్రంతోపాటు దాదాపు 108 స్తోత్రాలూ,గ్రంథాలూ రంచారు. మనం రోజువారీ చదువుకునే శివానందలహరి, మహిషాసురమర్దిని, భజగోవిందం, కాలభైరవాష్టకమ్, గణేశ పంచరత్నం, అన్నపూర్ణస్తోత్రం... వంటివన్నీ అందింంది ఆయనే. -
అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఒక ఆసక్తికరమైన వీడియోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. తన అత్తగారు మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖతో కలిసి కొత్త అవకాయ పచ్చడి పట్టారు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వేసవి కాలం వచ్చిందంటే.. ఆవకాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అత్తా కోడళ్లు ఆవకాయ బిజినెస్ బిజీగా అయిపోయారు. అందులో భాగంగా మామిడి కాయలతో కొత్త ఆవకాయ పచ్చడి కలిపారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. చక్కగా అవకాయ కలిపి జాడిలో పెట్టి, దానిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దీంతో ఈ ఏడాది వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగిపోవాలని కోరుకున్నట్టున్నారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇంకా స్వామి కార్యం స్వకార్యం రెండూ ఒక్కసారే , తెలివైన కోడలు ఉపాసన, ఇది అత్తా కోడళ్ళ అనుబంధం, అది ఆవకాయ పచ్చడైనా..మన సాంప్రదాయం అయినా అని ఒకరు, అత్తమ్మ వంటలు ప్రమోట్ చేస్తున్న కోడలు అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం విశేషం.Surekha Garu aka my dearest Athamma - has truly rocked it with this season’s Avakaya Pachadi. For her, food is not just about nutrition — it’s a way of preserving culture & heritage.Order - https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/l1rDYZRzyr— Upasana Konidela (@upasanakonidela) May 1, 2025 ‘‘సురేఖ గారు నా ప్రియమైన అత్తమ్మ - ఈ సీజన్ కొత్త ఆవకాయ పచ్చడితో మమ్మల్ని ఆకట్టుకున్నారు. ఆమెకు, ఫుడ్ అంటే పోషకాహారం మాత్రమే కాదు , సంస్కృతి & వారసత్వాన్ని కాపాడుకునే వేడుక అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఆహార ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
చాలా రకాల డైట్లు, వాటి ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ డైట్లలో కొన్ని మంచివైతే..మరికొన్ని మన శారీరక ధర్మానుసారం వైద్యులను సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా.. సరికొత్త డైట్ ట్రెండ్ అవుతుంది. దీర్ఘాయువుని అందించే సూపర్ డైట్‌గా శాస్త్రవేత్తలచే కితాబులందించుకుంది. అదీగాక ఈ డైట్‌తో మంచి ఆర్యోగం సొంతం అని హామీ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఏంటీ డైట్..? అదెలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం.!.ఐకానిక్ పర్వతం 'కిలిమంజారో' పేరుతో ఉన్న ఈ డైట్ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపోయాలే సత్ఫలితాలనిస్తోందట. డచ్ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ నమ్మకంగా చెబుతున్నారు. పాశ్చాత్యా ఆహార విధానం కంటే.. ఈ డైట్‌తోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిపారు. అందుకోసం టాంజానియా(Tanzania)లోని ప్రజలు, ముఖ్యంగా అగ్ని పర్వతాలకు సమీపంలో నివశించే ప్రజలపై పరిశోధనలు చేయగా.. వివిధ ప్రాంతాల్లో ఉండే మానవాళి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉండటం గమినించారు. వాళ్లంతా కిలిమంజారో డైట్‌ని అనుసరిస్తారట. పరిశోధకులు సగటున 25 సంవత్సరాల వయస్సు గల దాదాపు 77 మంది ఆరోగ్యకరమైన టాంజానియన్ పురుషులపై అధ్యయనం చేశారు. వారిలో 23 మంది కిలిమంజారో ఆహారాన్ని అనుసరించగా, 22 మంది ప్రాసెస్ చేసిన ఆహారం అందించారు. అయితే కిలిమంజారో డైట్ తీసుకున్నావారిలో వాపు తగ్గుదల, మెరుగైనా రోగనిరోధక పనితీరు ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడితో ఆపకుండా వారాలు తరబడి ప్రయోగాలు కొనసాగించగా..సానుకూల ప్రయోజనాల తోపాటు, దీర్ఘాయువుకి తోడ్పడుతుందని తెలుసుకున్నారు. కలిగే లాభాలు..అనేక దీర్ఘకాలిక పరిస్థితులకు వాపులే మూలం. వాటిని ఈ డైట్ నివారిస్తుంది. జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందిగుండె జబ్బులు, మధుమేహం, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. చివరగా ఇది దీర్ఘకాలిక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఆహారం.ఇక టాంజానియా అధికారికంగా బ్లూ జోన్‌గా గుర్తింపు సైతం దక్కించుకుంది. ఇక్కడ బ్లూజోన్ అంటే ఆ ప్రాంతంలోని ప్రజలు సగటున ఎక్కువ కాలం జీవించడం, మంచి ఆరోగ్యపు అలవాట్లు కలిగి ఉంతే..ఆ దేశానికి ఈ గుర్తింపు ఇస్తారు. అంతేగాదు ఇక్కడ సగటు ఆయుర్దాయమే 67 సంవత్సరాలంటే..ప్రజలంతో ఎంత మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ డైట్లో ఏం ఉటాయంటే..కిలిమంజారో ఆహారంలో ఓక్రా, అరటిపండ్లు, కిడ్నీ బీన్స్, మొక్కజొన్న వంటి సరళమైన ఆహారాలే ఉంటాయట. ప్రాసెస్ ఫుడ్‌కి చోటుండదు. మెక్కల ఆధారిత ఆహారాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు.ప్రోబయోటిక్‌లను కలిగి ఉన్న సౌర్‌క్రాట్, పులియబెట్టిన ఆహారాలు కూడా ఉంటాయి. మెడిటేరియన్ డైట్‌తో సమానంగా సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించాలనుకునే వారికి ఇది బెస్ట్ డైట్ అని అన్నారు. రానున్న కాలంలో కిలిమంజారో ఆహారం దీర్ఘాయువుకు సీక్రెట్‌గా ఉంటుందని అన్నారు నిపుణులు. అలాగే ఈ డైట్లో తీసుకునే ఆహారాలు అకాల మరణాలను చాలా వరకు నివారిస్తాయని నమ్మకంగా చెప్పారు పరిశోధకులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: రన్నింగ్ రేసులో బామ్మ వరల్డ్ రికార్డు ..! ఆమె ఫిట్నెస్కి శాస్త్రవేత్తలు సైతం ఫిదా..) -
అయ్యో అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు, ఫ్యామిలీలో విషాదం!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసంలో విషాదం అలుముకుంది. అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ (Anant Ambani)కి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క, హ్యాపీ ఇక లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అనంత్ అంబానీ తోపాటు కుటుంబ సభ్యులు తమ కుక్కకు భావోద్వేగ నివాళులర్పించారు.ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్టు ప్రకారం అనంత్ అంబానీ పెంపుడు కుక్క ‘హ్యాపీ’ ఏప్రిల్ 30, బుధవారం కన్నుమూసింది. ‘హ్యాపీ’ మృతితో అంబానీ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అంబానీ అప్డేట్ పేజ్ కూడా ‘ఆర్ఐపీ హ్యాపీ’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.ప్రియమైన హ్యాపీ జ్ఞాపకార్థం, మా ప్రియమైన డాగ్ హ్యాపీ మరణించిన విషాదాన్ని బరువైన హృదయంతో ఈ వార్తను పంచుకుంటున్నాం. పెట్ కంటే ఎక్కువగా, కుటుంబంలో మనిషి. చాలా విశ్వాసమైన నమ్మకమైన సహచరుడు, హ్యాపీ మా జీవితాల్లోకి తెచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేము. హ్యాపీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి. మిస్‌యూ’’ అంటూ అంబానీ కుటుంబం తమ ప్రియమైన నేస్తానికి వీడ్కోలు పలికింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)హ్యాపీ మరణంపై నటుడు వీర్ పహారియా కూడా విచారం ప్రకటించారు. హ్యాపీ జ్ఞాపకార్థం అంబానీ కుటుంబం ఒక స్మారక ఫోటోను పోస్ట్ చేశాడు. కుటుంబంలో అత్యంత ప్రియమైన సభ్యులలో ఒకరిగా పరిగణించబడే ఆ కుక్కకు తమ హృదయ పూర్వక నివాళి అర్పించారన్నాడు. అనంత్ అంబానీకి ఈ పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం వేడుకల్లో హ్యాపీ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఫోటోలకు ఫోజులిస్తూ హ్యాపీ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టు కున్నాయి. -
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది. తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటిమీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు. కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. ఔరా అంటారు. హాలీవుడ్ రేంజ్లో..ఇదేం ట్విస్ట్ రా మామా.. అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే..A high school student in China jumps out of building to express his true love pic.twitter.com/m96l96VcbG— Crazy Clips (@crazyclipsonly) April 21, 2025 y"> ప్రియురాలితో గొడవ పడుతూ.. క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీ లోంచి అమాంతం దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తోంది. మొదట దూకడానికి ప్రయత్నించి నపుడు అమ్మాయి తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు. కానీ రెండో సారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసి పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలోని యుహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాలో మాత్రం అసలు విషయం బైటపడింది. కిటీకిలోంచి దూకిన తరువాత అతడు మరో చిన్న వాల్ పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపీగా, సైడ్ వాక్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సో..ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరూ లవర్స్ అని తేల్చి చెప్పింది. ఇద్దరూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, తాము జోక్యం చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రోజర్ రాబిట్ సినిమాను గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లా పనికి వస్తాడంటూ కమెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?చివరిగా సరదాగా అనిపించినా.. ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి.అలాగే ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా కారణం ఏదైనా సయమనం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారమవుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలనుంచి బైటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థం మవుతుంది. క్షణికావేశం..కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆగి ఆలోచించే ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు బాటను చేసుకోవాలి. -
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్‌డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్‌ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు. 90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్‌గా ఉండేలా చేసినవి..పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు. ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్‌ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్‌ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు. ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ స్థానంలో నిలిచింది.తన విజయాలకు బ్రేక్‌పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్నెస్ కెరీర్‌కు దూరంగాఉంది. మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్‌లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ. అదే కారణం..ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్‌గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!) -
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
దొడ్డబళ్లాపురం: అభిమానం పుట్టిందంటే కోతి కూడా ఇంటి సభ్యురాలు అవుతుంది. ప్రేమ కరువైతే ఇంటివారు కూడా పరాయి వారవుతారు. అలాంటిదే ఈ ఉదంతం. పెంపుడు కోతికి ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు చేయించాడో వ్యక్తి. హావేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకా కాకోళ గ్రామంలో చోటుచేసుకుంది.కొత్త బట్టలు, కేక్ కటింగ్గ్రామ నివాసి ప్రభుగౌడకు నాలుగేళ్ల క్రితం మగ కోతి పిల్ల దొరికింది. దాన్ని చేరదీసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పిల్లవాని మాదిరిగా అంగీ, నిక్కర్ తొడిగిస్తారు. కోతిపిల్ల దొరికిన ఏప్రిల్ 29 తేదీని దాని పుట్టినరోజుగా వేడుకలు చేస్తున్నారు.కోతికి హనుమంతగౌడ అని పేరు కూడా పెట్టాడు. బర్త్ డే వేడుకలో హనుమంతగౌడకు కొత్త దుస్తులు వేశారు. పెద్ద కేక్‌ను తెప్పించి కట్ చేయించారు. చుట్టుపక్కలవారిని పిలిచి కేక్, మిఠాయిలు పంచిపెట్టారు. చూసినవారందరూ వానరానిదే వైభవమని ఆశ్చర్య పోయారు. ఈ కోతిపిల్ల ఇంటికి వచ్చాక ఆర్థికంగా బాగా కలిసి వచ్చినట్టు ప్రభుగౌడ చెబుతున్నాడు. గ్రామంలో ఈ కోతి సెలబ్రిటీగా మారింది. పెళ్లి పేరంటాలకు ప్రభుగౌడ తీసుకెళ్తాడు. జనం దాంతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్ -
ఎవరు పేద? ధనం లేకపోయినా పరవాలేదు గానీ..!
ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ (ర) వద్దకు వచ్చి: ‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం నా కాళ్ళూ చేతులూ కట్టి పడేసింది. ఎవరికీ ఏమీ చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?.’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరులపట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘అయ్యా.. అదేకదా నా సమస్య, నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేమున్న దని.?’ అన్నాడా వ్యక్తి నిర్లిప్తంగా..‘అదేమిటీ అలా అంటావు? ఎంతో గొప్పసంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర. ’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడై, ‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి’ అన్నాడు.‘అయ్యయ్యో..! ఆట పట్టించడంకాదు. ఇది నిజం. నేను చెబుతావిను.’ అంటూ.. ‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం కూడా సదఖాతో సమానం అన్నారు మన ప్రవక్త. (జామె తిర్మజీ 1956) దీనికోసం ధనం అవసరంలేదు. ఇది పూర్తిగా ఉతం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.రెండవది కళ్ళు. ఇవి లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయి. ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మవైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. హజ్ అంటే ధనవంతులు చేయగలిగే ఆరాధనే గదా..!’ మూడవది నోరు. నోరు మందైతే ఊరు మందవుతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంని బోధించవచ్చు. మంని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి. ‘నీదగ్గరున్న మరోనిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీసొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మరోగొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచి పనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు.మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై. ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మసంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపోయ్యాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
ఏ శివాలయంలోనైనా వైష్ణవ పూజారులను చూడగలమా? ఏ విష్ణ్వాలయంలోనైనా జైన మతాధికారులు కనిపిస్తారా... అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ పురాతన శైవక్షేత్రానికి మాత్రం ఈ ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ధర్మస్థల ఒకటి. అందుకే భక్తులందరూ కర్ణాటకలోని ధర్మస్థలను ఒక్కసారైనా సందర్శించి, ధర్మదేవతలను దర్శించుకుని, మంజునాథుని మనసారా చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఏదైనా పనిమీద బెంగళూరు వచ్చిన వారు ధర్మస్థలను సందర్శించడాన్ని విధిగా పెట్టుకుంటారు. స్థలపురాణం... పూర్వం కుడుమ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జైన సైనికాధికారి బిర్మన్న, ఆయన భార్య అంబుబల్లాతి నివసించే వారు. నిరాడంబరులుగా, నిజాయితీపరులుగా, అతిథి సేవ, సాటివారికి సాయం చేసే ఆదర్శ్ర΄ాయులైన దంపతులుగా వారిని అందరూ గౌరవించేవారు. ధర్మపరాయణులుగా, ఆపదలలో ఉన్న వారిని ఆదుకునే వారిగా వారికి ఎంతో మంచి పేరుండేది. వారి కీర్తి దేవతల వరకు వెళ్లడంతో నిజంగా వారెంతటి ధర్మనిష్ఠాపరులో తెలుసుకుని, వారు గనక సరైన వారేనని తేలితే, వారి ద్వారా ధర్మపరిరక్షణ, ధర్మప్రచారం చేయిద్దామని ఇద్దరు ధర్మదేవతలు ఒక రాత్రిపూట వాళ్ల ఇంటికి నిరుపేద వృద్ధదంపతుల రపంలో వచ్చారు. హెగ్గడే దంపతులు వారిని సాదరంగా ఆహ్వానిం, అతిథి సత్కారాలు చేశారు. ధర్మదేవతలు వారితో తమకు ఆ ఇల్లు ఎంతో నచ్చిందని, ఇల్లు ఖాళీ చేసి తమకు ఇవ్వమని అడిగారు. వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముక్కూముఖం తెలియని వారి కోసం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వారి ఔదార్యానికి సంతోషింన ధర్మదేవతలు నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు.హెగ్గడే దంపతులు ఎంతో సంతోషంతో వారికి ఆ ఇంటిని అప్పగించి, వారికి పూజలు చేశారు. ఆ ఇంటిని అందర నెలియాడిబీడు అని పిలవసాగారు. కాలక్రమేణా ఆ ఇల్లు కాస్తా ఆలయంగా రపు దిద్దుకుంది. ఆ ధర్మదేవతలకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారందర అక్కడే ఉండి, ధర్మపరిరక్షణ చేయసాగారు. కొంతకాలానికి వారందరూ విగ్రహాల రపంలో ఆ ఇంటిలోనే కొలువు తీరారు. అక్కడి ఆలయ పూజారికి ఒకరోజున పూనకం వచ్చి, ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్టిం, పూజించవలసిందిగా గ్రామప్రజలను ఆదేశించాడు. దాంతో హెగ్గడే దంపతుల వంశీకుడైన అణ్ణప్ప హెగ్గడే అనే అతను మంగుళూరు పక్కనున్న కద్రి నుంచి శివలింగాన్ని తీసుకు వచ్చి ధర్మదేవతల సన్నిధి పక్కనే లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగమే మంజునాథుడుగా పూజలందుకుంటున్నాడు. అనంతరం ఓ వైష్ణవుడు తన ఆస్తి΄ాస్తులన్నింటినీ అమ్ముకుని ఆలయానికి అంగరంగవైభవంగా కుంభాభిషేకం జరిపించాడు. అప్పటినుంచి ఈ పుణ్యస్థలాన్ని అందరూ ధర్మస్థల అని పిలవసాగారు.ఆలయ వర్ణన...చెక్కస్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం అందమైన కళాకృతులతో శోభిల్లుతుంటుంది. ఆలయాన్ని చేరుకోగానే విశాలమైన ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక సన్నిధిలో మంజునాథుడు, మరో సన్నిధిలో నరసింహస్వామి దర్శనమిస్తారు. మరో సన్నిధిలో ΄ార్వతీ దేవి, ధర్మదేవతలు కొలువై ఉంటారు. ధర్మస్థల ప్రాంత్రానికి వెళ్లిన భక్తులు ముందుగా ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో స్నానమాచరించి, మంజునాథుని, అమ్మవారిని, నలుగురు ధర్మదేవతలను, గణపతిని, అణ్ణప్పదేవుని సందర్శించుకుని, ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. అనంతరం ఆలయానికి బయట గల పురాతన రథాలను, వాహన ప్రదర్శనశాలను పుష్పవాటికను, వసంత మహల్‌ను సందర్శించుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో అన్ని కులాలు, మతాలవారూ తృప్తిగా భోజనం చేయవచ్చు. అవసరం అయితే ఆశ్రయం ΄÷ందవచ్చు.గోమఠేశ్వరుడు కొలువుదీరిన శ్రావణ బెళగొళ ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఎలా చేరాలంటే..?బెంగళూరు నుంచి ధర్మస్థలకు చేరుకోవడం సులువు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి ధర్మస్థలకు నేరుగా బస్సులున్నాయి. మంగుళూరు వరకు రైలులో వెళితే అక్కడినుంచి బస్సులో లేదా ప్రైవేటు వాహనాలలో ధర్మస్థలకు వెళ్లవచ్చు. మంగుళూరు ఎయిర్‌పోర్ట్‌నుంచి కూడా నేరుగా ధర్మస్థలకు బస్సులున్నాయి. ఇదీ చదవండి: అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లుఅన్ని విశ్వాసాలకూ, మతాలకూ చెందిన భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి దేవతలను దర్శించుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.ఈ ఆలయంలో నిత్యం పదివేలమందికి అన్నదానం, ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుపట్టని పలు వ్యాధులకు ఔషధ దానాలతోబాటు వేలూ, లక్షలూ వెచ్చించి చదువుకొనలేని పేద విద్యార్థులకు సలక్షణమైన, నాణ్యమైన విద్యాదానమూ జరుగుతుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అభాగ్యులు తలదాచుకునేందుకు వీలుగా ఇక్కడ ఆశ్రయమూ లభిస్తుంది. అదే బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గల ధర్మస్థల.– డి.వి.ఆర్. -
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?) -
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
రోజూ ఉదయం నుంచి వంటింట్లో చెమటలు కక్కుతూ వంటకాలతో కుస్తీ పడుతుంటుంది అమ్మ. ‘నీరసంగా ఉంటోంది.. ఏ పనీ చేయాలనిపించడం లేదు’ అని అంటూనే లేని ఓపికను తెచ్చుకొని పనులు చేస్తూనే ఉంటుంది. ‘కాళ్ల నొప్పులు.. కదలనివ్వడం లేదు’ అంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతుంటుంది బామ్మ. కాలేజీ నుంచి వస్తూనే ‘బ్యాగ్ కూడా మోయలేను.. అలసటగా ఉంది’ అంటూ సోఫాలో కూలబడిపోతుంది కూతురు. రోజూ మూడుపూటలా తింటూనే ఉన్నాం, అయినా ఎందుకిలా?! ఏ ఆరోగ్య సమస్యనో అని వైద్యులను కలిస్తే పోషకాహారం తీసుకోండి’ అని చెబుతుంటారు. మన శరీరానికి ఏయే పోషకాలు అవసరం, సీజన్‌కి తగినట్టు మన ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి. సింపుల్‌గా హెల్తీ వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చు... ఈ వివరాలతో వరుస కథనాలుమహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి సమతులాహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పెరిగాయి. కానీ, మన రొటీన్ ఫుడ్ మాత్రం అలాగే ఉంటోంది. హార్మోన్ల సమతుల్యతకు, శక్తికి తినే ఆహారం చాలా ముఖ్యమైనది. సాధారణంగా మహిళలు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి ఐరన్, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు. శక్తికి ఇనుము... రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనం అవుతారు. త్వరగా అలసిపోతారు. రక్తస్రావం అధికం అవుతుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, తోటకూర. గోంగూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరంలో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి రోజువారీగా అవసరమైన ఐరన్ మోతాదు వారి వయసు, జెండర్‌పై ఆధారపడి ఉంటుంది. గర్భిణులు, బాలికలకు రోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. దీంతో పాటు విటమిన్ – సి ఉండే నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు, రసాలు తీసుకోవడం వల్ల ఒంట్లో ఇనుము శోషణ పెరుగుతుంది.పాల ఉత్పత్తులతో కాల్షియం... ఎముకల బలానికి,,, ప్రత్యేకంగా మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం అధికం. అందుకు పాల ఉత్పత్తులు, బాదం, శనగలు, కాలీఫ్లవర్ .. వంటివి తినాలి. ∙గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ. ఆకుకూరలు, మాంసం, దాల్చిన చెక్క.. వంటి వాటి నుంచి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఒమేగా–3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగ పడతాయి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపల నుంచి ఈ ప్యాటీ యాసిడ్స్ లభిస్తాయి శరీర బలానికి, కండరాల పెంపుకు ప్రోటీన్లు చాలా అవసరం. మినపపప్పు, చికెన్, గుడ్లు, నట్స్... నుంచి ప్రోటీన్లు లభిస్తాయి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం. గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది.వయసుల వారీగా డైట్ చక్రటీనేజ్, యవ్వనం, గర్భధారణ, పిల్లలకు పాలు ఇవ్వడం, మోనోపాజ్, వయసు పైబడటం.. వంటి దశల ఆధారంగా పోషక అవసరాలు మారుతుంటాయి. కానీ, మన ఇళ్లలో సాధారణంగా అందరికీ ఒకేతరహా వంటను వండుతుంటాం. దీనివల్ల వయసుల వారీగా సరైన పోషకాలు శరీరానికి అందక, శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చురుకుదనం తగ్గుతుంది. ఫలితం చేసే పనులపై ప్రభావం చూపుతుంది. అందుకని పోషకాహార చక్రం ఎవరికి వారు, వయసుల వారీగా ఆరోగ్యదాయకంగా మార్చుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. బాల్యం నుంచియవ్వనం (8–18 ఏళ్లు) వరకు శరీరం వృద్ధి చెందడానికి, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల బలానికి ... పాల ఉత్పత్తులు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, మటన్, చికెన్, బచ్చలి, బ్రొకోలి, బీట్రూట్.. మొదలైన ఐరన్ నిచ్చే పదార్థాలు ఈ వయసుకు కీలకం. బ్రేక్‌ఫాస్ట్: ఉప్మా/΄పొంగల్/ ఇడ్లీ.. + ఒక గుడ్డు + గ్లాస్పాలుమధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్/ రోటీ (2)+ పప్పు, ఆకుకూర, బీన్స్, పెరుగుసాయంత్రం స్నాక్స్: బాదం/జీడిపప్పు/ఇతర డ్రై ఫ్రూట్స్‌తో చేసిన స్నాక్స్ (చిన్న మోతాదులో)+ అరటి పండురాత్రి భోజనం: రోటీ (2) లేదా మినప పిండితో చేసిన అట్టు +ఏదైనా కూరగాయ + నిమ్మరసం కలిపిన వెజ్ సలాడ్యువతులకు (19–30 ఏళ్లు)రుతుక్రమం చురుకుగా ఉండటం, సంతానోత్పత్తి ప్లానింగ్‌కి సరైన సమయం. ఈ దశలో... ఐరన్ – ఫోలేట్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు, అరటి మొదలైనవి తినాలి. ఒమేగా–3 యాసిడ్స్ ఉండే ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, వాల్‌నట్స్‌ను కూడా చేర్చుకోవాలి.. పీచుపదార్థాలు ఉండే గోధుమ, కూరగాయలు, జామ వంటి పండ్లు తినాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి. జింక్ సమృద్ధిగా లభించే చిక్కుళ్లు లాంటివి.. ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.గర్భధారణ సమయంలో...పిండం అభివృద్ధికి, తల్లి శక్తికి తీసుకోవాల్సినవి... డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ + ఆకుకూరలు, నువ్వులు, దాల్చిన చెక్క, ప్రోటీన్ల కోసం గుడ్లు, పప్పులు, చికెన్, కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, ఫైబర్‌కి పండ్లు, బ్రౌన్ రైస్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కి చేపలు, ఫ్లాక్స్ సీడ్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.బ్రేక్‌ఫాస్ట్: గోధుమ రవ్వ/ ఓట్స్ ఉ΄్మా+ అరటి పండు + గ్లాసుడు పాలులంచ్: బ్రౌన్ రైస్ /రోటీ (2) / మెంతికూర పప్పు/ పెసరపప్పు+ బెండకాయ కూర, పెరుగు + కారట్/కీరా సలాడ్సాయంత్రం స్నాక్స్: బాదం/వాల్నట్ (4–5) +అరటిపండు / సపోటాడిన్నర్: రొట్టెలు (2) / మినప దోస, బీన్స్ / సొరకాయ కూర + గ్లాస్ మజ్జిగ.పాలిచ్చేతల్లులుతగినంత శక్తిని తిరిగి పొందడానికి, పాల వృద్ధికి తీసుకోవాల్సినవి.. ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పండ్లు, లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ తల్లులకు ప్రోటీన్ అందిస్తాయి. పాల ఉత్పత్తులు, నువ్వులు, ఆహారం జీర్ణం అవడానికి పల్చని మజ్జిగ మొదలైనవి తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్: పెసరట్లు, అల్లం పచ్చడి+గ్లాసుడు పాలు/రాగి జావలంచ్: బ్రౌన్ రైస్+ మటన్/ చికెన్‌కర్రీ, మెంతికూర పప్పు, పెరుగు, గోంగూర పచ్చడి. సాయంత్రం స్నాక్స్: జీరా రసం + బాదం/మెంతి లడ్డు, ఏదైనా ఒక పండు. డిన్నర్: రోటీ (2)/మినప రొట్టె, పల్లీలు, బచ్చలి కూర రాత్రి పడుకునే ముందు (ఒంటిగంట లోపల) గ్లాస్ నీళ్లు లేదా చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చనిపాలు. బాగా ఆకలిగా అనిపిస్తే అర టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు. మెనోపాజ్ దశ 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్లాన్ చేసుకోదగిన పోషకాహారంలో హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలం, కోలెస్ట్రాల్ నియంత్రణ పై దృష్టి పెట్టాలి. కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, సోయా, టోఫు వంటివి తీసుకోవాలి. చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, పీచుపదార్థాలు ఉండే కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బెర్రీస్, నాటు, తాటి బెల్లం, గ్రీన్ టీలను చేర్చుకొని చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి... బ్రేక్‌ఫాస్ట్: (ఉదయం 8:00 – 9:00): ఓట్స్ + పాలు + కొద్దిగా వాల్నట్ లేదా బాదం (లేదా) రాగి దోస + పెసరపప్పు చట్నీ, ఒక అరటి పండు + గ్లాస్ నీరు. మధ్యాహ్న భోజనం (లంచ్ – 1:00): బ్రౌన్ రైస్ లేదా గోధుమ/జొన్న/సజ్జ రొట్టెలు, ఆకుకూరల పప్పు (గోంగూర, తోటకూర వంటివి), దుంపలు కాకుండా దోండకాయ/బీన్స్/బెండకాయ, సలాడ్ (కీరా, గాజర్), పెరుగు. సాయంత్రం స్నాక్స్ (5:30 – 6:00): గ్రీన్ టీ లేదా తులసి టీ (షుగర్ లేకుండా) నట్స్ (బాదం, నువ్వులు లేదా ఫ్లాక్స్సీడ్స్) (లేదా) ఆపిల్ / పియర్ / సపోటా రాత్రి భోజనం (డిన్నర్ – 7:30 – 8:00): గోధుమ రొట్టె (1–2). వెజిటబుల్ సూప్ లేదా తేలికగా జీర్ణం అయ్యే కూర (బెండకాయ, సొరకాయ వంటివి), మజ్జిగ (ఉప్పు తక్కువతో) తీసుకోవాలి.సమతుల్యత అవసరంఓవర్ ఈటింగ్/ తక్కువ తినడం రెండూ సమస్యలు తెచ్చిపెట్టేవే. వ్యక్తి శరీర బరువు, శ్రమను బట్టి డైట్ ΄్లాన్ చేసుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ప్రతి వ్యక్తికి వారి శరీర బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహారణ: 50 ఏళ్ల మహిళ డైట్ చార్ట్. ∙సమతుల్యత, ఎముకల ఆరోగ్యం, శక్తి ఉండేటట్లు డైట్ ప్లాన్ చేయాలి. ప్రత్యేక సూచనలు: రోజూ కనీసం 7,000 – 8,000 అడుగులు నడవాలి / యోగా / లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఉప్పు, స్వీట్స్ తక్కువగా వాడాలి. మెనోపాజ్ దశ కాబట్టి కాల్షియం, విటమిన్–ఇ విషయంలోప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తప్పనిసరి. 15 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి నేరుగా తాకేలా చూసుకోవాలి. – డా.బి. జానకి, పోషకాహార నిపుణులు (చదవండి: 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..) -
May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.! -
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్‌ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ralph Leng (Blue) 💙🇬🇧 (@ralphleng) (చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు) -
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) సరికొత్త ఫ్యాషన్‌తో అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ప్రముఖ డిజైనర్ మనీహ్ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్ చేసిన చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అద్భుతం అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.ట్రెడిషన్ విత్ ట్రెండ్ అనేలా ఊర్మిళ మతోండ్కర్ మనీష్ మల్హోత్రా రోజ్ గోల్డ్ చీరలో ట్రెండీ లుక్‌లో అదిరిపోయింది. ఇందులో అనేక సీక్విన్లు ఉండటం విశేషంగా నిలిచింది. ఆరు గజాల చీర, అందమైన జాకెట్లు మాత్రమే కాదు, అంతకంటే భిన్నంగా అలంకరించుకుని ఆధునిక పద్ధతిలో స్టైలిష్‌గా కనిపించవచ్చు అని ఊర్మిళ రుజువు చేస్తోంది. మనీష్ మల్హోత్రా సిగ్నేచర్ స్టైల్లో ఊర్మిళ, చీరకు జతగా సాధారణ బ్లౌజ్‌ను వదిలివేసి, దానికి బదులుగా సమకాలీన కార్సెట్ టాప్‌ను ఎంచుకుంది. శరీరానికి సరిగ్గా అతుక్కునేలా శిల్పంలాటి ఆకృతిలో, నడుము ఒంపులను ప్రదర్శిస్తూ స్ట్రాప్‌లెస్ నంబర్ ఫిట్‌తో వచ్చింది. పల్లూను దుపట్టా లాగా వెరైటీగా చేతిపై కప్పుకుని ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెప్పింది. నడుము దగ్గర 3D పూల అప్లిక్ వర్క్ మొత్తం లుక్కు రొమాంటిక్ ఫ్లెయిర్ను జోడించింది. View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) షీర్ ఫాబ్రిక్ తో తయారు చేసిన చీరను అంచుల చుట్టూ మల్టీ సీక్విన్స్ తో షైనీగా ఉంది. అల్టిమేట్ కాక్టెయిల్ ఎంసెంబుల్ కోసం ప్రేరణ కోరుకునే ఫ్యాషన్ ఔత్సాహికులందరూ వావ్ అంటున్నారు. డైమండ్ ఆభరణాలు,తన జుట్టును వా లుగా వెనక్కి వదిలేసి10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి చీరలపై అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు. స్లిక్ లుక్‌లో స్టైల్ చేసింది. అటు మనీష్ మల్హోత్రా కూడా ఊర్మిళ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్‌ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి ఇప్పటిదాకా చీరలపై తమ అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు.కాగా బాలీవుడ్లో కర్మ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్మిళ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. కుర్రకారు మనసును ఇట్టే దోచేసింది. ఆ తరువాత అనగనగా ఒకరోజు, రంగీలా, సత్య చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.తనకంటే వయసులో 10 ఏండ్లు చిన్నవాడు అయిన మోడల్ మోసిన్ అక్తార్ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ గత ఏడాది ఆమె భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ నుండి విడాకులకు దరఖాస్తు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. -
'మైండ్‌బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్‌అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్‌ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్‌ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్‌లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్‌లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లను పారిస్‌లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్‌లు, టెక్నికల్ టీమ్‌లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
వేసవి సెలవులు...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు
ఘట్కేసర్: వేసవి సెలవులు అనగానే విద్యార్థులను అమ్మమ్మ, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేరి్పంచాలని తల్లితండ్రులు భావిస్తున్నారు. ఫీజులు చెల్లించి మరీ వారి ప్రతిభకు సానబెడుతు పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుండగా పేద పిల్లలకు ఆ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం నూతనంగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని, శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాము, వైస్ ప్రిన్సిపాల్ రాములు తెలిపారు. ప్రతిభకు సాన... పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు సుశిక్షుతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లలిత కళల పాఠశాలలో రాష్ట్రంలోని ఒక్కో గురుకులం నుంచి ప్రతిభగల ఐదుగురి చొప్పున సుమారు 1200 మంది విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మలు, కార్డున్, ఫొటోగ్రఫీ, నకాసీ పెయింటింగ్, అల్లికలు, జర్నలిజం వేద గణితం, చేతిరాత, బంజారా ఎంబ్రాయిడరీ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అదనపు నైపుణ్యం పెంపొందుంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. సమయం వృథా చేయకూడదని... వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకూడదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రోద్భలంతో వేసవి శిబిరానికి వచ్చాను. బంజారా ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్నా. అందరితో కలిసి నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – రిషిత, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆలేరు నైపుణ్యం పెంచుకునే అవకాశం... వేసవి శిబిరంలో అరుదైన కళ నకాసీ పెయింటింగ్, వేదిక్ మ్యాథ్స్‌లో శిక్షణ పొందుతున్నాను. వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభింంది. జీవితంలో మరిపోలేని శిబిరం. వేసవి శిక్షణ శిబిరం నిర్వాహణ చాలా బాగుంది. –లోహిత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆలేరు ప్రతిభను వెలికి తీయాలని... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభకు సానబెట్టడానికి వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు రాణించడానికి శిబిరం తోడ్పడుతుంది. సెలవులు సద్వినియోగం చేసుకునే వారికి బంగారు అవకాశం లభించింది.– వింధ్యారాణి, జోనల్ ఆఫీసర్ -
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా?
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, ద్రావణాలు, కషాయాలను ఏ రైతుకు ఆ రైతు స్వయంగా తయారు చేసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. నిన్నటి వరకు రసాయనిక వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలన్నీటినీ కొని వినియోగించడానికి అలవాటు పడిన రైతులు ఇప్పుడు అన్నీ ఎవరికి వారు తయారు చేసుకోవటం కష్టమే. ఈ ఇబ్బందిని అధిగమించకుండా ప్రకృతి సేద్యం విస్తరించడం అంత తేలిక కాదు. అందుకే ప్రకృతి సేద్యంలో వాడే ఘనజీవామృతం, జీవామృతం వంటి అన్ని రకాల ఉత్పాదకాలను తయారు చేసి విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ (బిఆర్‌సిలు) ఏర్పాటు చేయిస్తోంది. వీటిని సులువుగా ఉండటం కోసం ‘జీవామృత కేంద్రాలు’ అని చెప్పుకుందాం. తొలి విడద దేశవ్యాప్తంగా 10 వేల బిఆర్‌సిలు ఏర్పాటు చేయాలని 2023–24 బడ్జెట్లోనే పేర్కొన్నారు. అయితే, వీటిని ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను తాజాగా (ఏప్రిల్ 23న) విడుదల చేసింది. ఆ వివరాలు: ప్రతి బిఆర్సి ఏర్పాటుకు ర. లక్ష చొప్పున (ర. 50 వేల చొప్పున రెండు విడతలుగా) ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవటంతో ΄ాటు వాటిని ఎలా ఉపయోగించాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ జీవామృత కేంద్రాల నిర్వాహకులే రైతులకు తెలియజెప్పాల్సి ఉంటుంది. బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్(బిఆర్సి) లను నెలకొల్పే వ్యక్తులు / సంస్థలు / బృందాలు మొదట తాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ ఉత్పాదకాలను వారు వాడుతున్న అనుభవం కలిగి ఉండాలి. స్థానిక రైతుల అవసరాలకు, స్థానిక భూములకు తగిన, స్థానికంగా సాగయ్యే పంటల సరళికి అవసరమైన రీతిలో ద్రావణాలు, కషాయాలను తయారు చెయ్యాలి. వీటి ధరలు స్థానిక చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర స్థాయి ప్రకృతి సేద్య విభాగం, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలపై ఉంది. బీఆర్‌సి ఏర్పాటు కోసం ర. లక్షతో భూమిని, షెడ్డును, డ్రమ్ములు, ఇతరత్రా యంత్ర పరికరాలను సమకర్చుకోవటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా.. దీర్ఘకాలంపాటు బిఆర్‌సిలకు వెన్నుదన్నుగా ఉండేలా ప్రభుత్వం ఆలోంనప్పుడే ఆశింన ప్రయోజనం నెరవేరుతుందని నిపుణులు సూస్తున్నారు. -
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్ 21న శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. ఇక ప్రదీప్ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే రైట్‌సైడ్ జిప్‌లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్. నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్ వద్ద మ్యాగీ ఆర్డర్ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపారు ప్రదీప్. అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్. పైగా అవి బుల్లెట్ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్. వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్‌పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్‌ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ప్రదీప్ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్ హెగ్డే. ఆ పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.విశేష పోషకాలురక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్ 15.75 మి.గ్రా., ఐరన్ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.రక్తశాలి బియ్యాన్ని పాలిష్ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.110 రోజుల ఖరీఫ్ పంటరక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్/జూలై నుండి నవంబర్/డిసెంబర్ వరకు ‘శాలి’ సీజన్లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయిఔషధ విలువలు, పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి. రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు... ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంట ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. వర్క్‌షాప్‌లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి.స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. మార్కెటింగ్ గొలుసులను, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్‌ను మెరుగుపరచవచ్చు. రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే...ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే, ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.అధిక ఫైబర్: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.గ్లూటెన్–ఫ్రీ: గ్లూటెన్ అసహనం లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ముగింపురక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం. ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్ లేదు. గ్లుటెన్ ఇన్టాలరెన్స్ / సెలియక్ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం. -
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అక్షయ తీజ్ లేదా పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ (Akshaya tritiya 2025) అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. అక్షయ అంటే శ్రేయస్సు, నాశనం లేనిది ఆశ, విజయంతో పాటు ఆనందం పరంగా శాశ్వతత్వం ,తృతీయ అంటే చంద్రుని మూడవ దశ.ఈ రోజు ద్రౌపది, కృష్ణుడు , అక్షయ పాత్రకు సంబంధించిన పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi Sripada) ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.అక్షయ తృతీయ అంటే దానం, ధర్మం చేయాల్సిన రోజని గుర్తు చేసింది.ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది. మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులకు కాసింత ఆహారాన్ని పెట్టండి. ఈ దానమే ఇక చాలు అనే తృప్తి నిస్తుంది అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)ద్రౌపది అక్షయ పాత్రకథద్రౌపది, రాజకుమారులైన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన తపస్సు ఫలితంగా పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడికి అక్షయ పత్రం ప్రసాదించాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే పాండవులు వనవాస కాలంలో కృష్ణుడి నుండి అక్షయ పాత్రను పొందారు. ఇది ఒక మాయా పాత్ర, ఇది ఎల్లప్పుడూ వారికి ఆహారాన్ని అందించేది. ఆ అక్షయ పాత్ర ద్రౌపది భోజనం చేసే వరకు ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది , ఆ తరువాత తలక్రిందులుగా ఉంచుతుంది. అంటే అప్పటికి ఆహారం అయిపోతుంది. ఒకసారి కోపానికి, శాపానికి పేరుగాంచిన దుర్వాస ముని తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి భోజనానికి వచ్చాడు. కానీ అప్పటికి ఆహారం అంతా అయిపోయింది . తినడానికి ఏమీ లేదు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు పాత్ర ఖాళీగా ఉండటంతో ద్రౌపది శ్రీకృష్ణుడి సహాయం కోసం ప్రార్థించింది.అలా శ్రీకృష్ణుడికి అనుగ్రహంతో బ్రాహ్మణులందరూ స్వయంచాలకంగా పూర్తిగా సంతృప్తి చెందడంతో, దూర్వాసుడి శాపం నుంచి తప్పించుకుంటుంది ద్రౌపది. ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడాడిన రోజే అక్షయ తృతీయ అని పురాణాల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?అక్షయ తృతీయ రోజును విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఆవిర్భవించిన రోజుగా కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును కొన్నిసార్లు ప్రశురామ జయంతి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం, వేద వ్యాసుడు గణేశుడికి మహాభారతం పారాయణం చేయడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత:అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకు అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలుంటాయని, . ఈ రోజున దానం, ధర్మం, పుణ్యకార్యాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. -
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
ఒరిగామిపై 1988లో ఆసక్తి పెంచుకున్న రవి కుమార్ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేలా ఈ కళ ఉపకరిస్తుందని గుర్తించారు. ‘ఒరిగామి ద్వారా గణితం – రవికుమార్ తోలేటి’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. కోవిడ్ సమయంలో విద్యార్థుల కోసం డీఐవై మోడల్స్ వీడియోలుగా అందించడంతో పాటు, శాస్త్రవేత్తల స్థాయిలో ప్రాజెక్టులు రూపొందించేందుకు ప్రేరణనిచ్చారు. పలు అవార్డులు.. గతంలో రవి కుమార్‌కు ఎన్సీఈఆర్టీ ఇన్నోవేషన్ అవార్డు (2002), రాష్ట్రపతి పురస్కారంగా ‘నేషనల్ టీచర్స్ అవార్డు’ (2005), కేవీఎస్ నేషనల్ ఇన్నోవేషన్ అవార్డులు (2012, 2019) లభించాయి. అలాగే 2022లో ప్రపంచంలో అతి పెద్ద ఒరిగామి నెమలిని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. నాలుగేళ్లు పట్టింది.. ఒరిగామి కళతో ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి సుమారు నాలుగేళ్ల సమయం పట్టింది. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఒరిగామిని వినియోగిస్తున్నా. ఇది ప్రాచీన జపాన్ కళ కాగా, ప్రస్తుతం పలు రంగాల్లో విస్తరిస్తోంది. ఇది కేవలం కళ కాదు, సృజనాత్మకత, ఆవిష్కరణల సమ్మేళనం. – రవి కుమార్ తోలేటి, ఒరిగామి కళాకారుడు (చదవండి: కొవ్వొత్తులతో పీస్ వాక్..! తీవ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనకు..) -
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ (సీసీహెచ్ఎల్) ‘గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజమ్’ పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని క్లబ్ ప్రాంగణంలో కొవ్వొత్తులు చేత పట్టుకొని మోడల్స్ మంగళవారం ప్రదర్శన చేశారు. శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు ముద్రించిన ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా ‘పీస్ వాక్’ చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళిగా 26 కొవ్వొత్తుల ప్రదర్శనలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నటుడు సునీల్ దత్ తో కలిసి ‘గ్రౌండ్ జీరో’ నిర్వహించామన్నారు. అలాగే శాంతి సామరస్యాల పట్ల తమ నిబద్ధతకు ప్రతీకగా లక్ష మంది సంతకం చేసిన చారిత్రాత్మక ‘ఫ్రెండ్షిప్ బ్యాండ్’ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమోదించారన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, తీవ్రవాదం ప్రపంచ ముప్పుగా మారిన నేపథ్యంలో దీనిని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.నైఫ్ షార్ప్‌నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం) -
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!) -
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421 -
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్ బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి. బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి. బిల్లు తీసుకోకపోతే నష్టమే.. బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్‌నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్‌పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో అప్రమత్తత అవసరం స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది. ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.కొనక తప్పడం లేదు బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్‌కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్‌ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే. – ప్రత్యూష, సంతోష్‌నగర్, కర్నూలుధరలు తగ్గించాలి బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. – శైలజ, కోడుమూరు(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?) -
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు. -
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్‌ఫండ్ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?– రాహుల్, ఖమ్మం ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?– సుందర్, హైదరాబాద్చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు. ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు. (చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!) -
ప్లంబర్లుగా మహిళా శక్తి!
లింగ సమానత్వం కార్పొరేట్ రంగాల్లో కాదు శ్రామిక శక్తిలో చూపాలి అని నిరూపిస్తోంది జోర్డాన్ మహిళ. జోర్డాన్‌లో వందలాది మహిళలు ప్లంబర్లుగా విధులను నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనిని అవమానకరంగా భావిస్తూ వీరి పనులపై గతంలో నిషేధం విధించారు. అక్కడి సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఒక సవాల్‌గా ఉంది. ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగి, జోర్డాన్‌లో మహిళా ప్లంబర్లపై ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. 2006లో మొట్టమొదటి లైసెన్స్ పొందిన మహిళా ప్లంబర్ ఖవ్లా షేక్ ఈ పనిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ్ర΄ోత్సహిస్తుండగా, 2014 లో ఏర్పడిన వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ ఈ రంగంలో లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది. జోర్డాన్ సంప్రదాయ కట్టుబాట్ల కంచెను తొలగించుకుంటూ అక్కడి మహిళ తన ఉనికికోసం చేస్తున్న కృషి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా చేస్తోంది. ‘స్త్రీ ఉద్యోగం చేయకూడదు, అది కుటుంబానికే అవమానం. అటువంటిది మరీ చోద్యం కాక΄ోతే పురుషులకు దీటుగా చేసే ఆ పనులేంటి..!?’ తహానీ ఆల్ షాతి, యుస్రా మోహమ్మద్ న్మోర్.. వంటి వాళ్లు ప్లంబర్లుగా శిక్షణ ్ర΄ారంభించినప్పుడు ఇలాంటి ఎన్నో మాటలు తమ సాటి వారి నుంచి వచ్చినవే. జోర్డాన్‌లో సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా జీతంతో కూడిన పనిలో మహిళల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఇప్పటికీ చాలామంది మహిళలకు అతిపెద్ద సవాల్.సమర్థతే సరైన ఔషధంప్లంబర్లుగా శిక్షణ తీసుకుంటున్న తొలి రోజులను అల్షాతి గుర్తుచేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న ఇతర మహిళలు వీధిలో నీళ్లు లీక్ అవుతున్న పైపును చూశారు. లీకేజీని ఆపడానికి తమ వద్ద గల ఉపకరణాలను బయటకు తీశారు. దారినపోతున్న ఒక మహిళ వారిని చూసి ‘మీరేంటి ఈ పనులు చేయడమేంటి?’ అని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ఇంకొంతమంది పోగయ్యారు. వాళ్లు కూడా అవే మాటలు.. అవేమీ ఈ శిక్షణ తీసుకుంటున్న బృందం పట్టించుకోలేదు. నీళ్ల లీకేజీని ఆ΄ాలనుకున్న పనిని సమర్థంగా పూర్తిచేశారు. నీటినష్టాన్ని నివారించారు. దీంతో అక్కడున్నవారి నోళ్లు మూతపడ్డాయి. తమలో తాము గొణుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ అల్ షాతి, న్మోర్ లాంటి వందలాది మహిళా సర్టిఫైడ్ ప్లంబర్లు ఉన్నారు. రాజధాని నగరమైన అమ్మాన్‌లోని ఈ మహిళలంతా ‘ఈ అసాధారణ కెరీర్ మా జీవితాలనే మార్చిందని, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రాన్ని అందించిందని, ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ తమ దేశాన్ని పర్యటించే అవకాశాలను కల్పించిందని’ ముక్త కంఠంతో అంటున్నారు. ‘నా భర్త, పిల్లలు నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. నా పొరుగువారు నన్ను చూసి అసూయపడుతున్నారు’ అని న్మోర్ చెబుతుంది.భిన్నమైన సేవజోర్డాన్లో నీటి కొరత పెద్ద సమస్య. ఇందుకు భౌగోళిక, పర్యావరణ పరమైన కారణాలు మొదటివి కాగా, నీటిని దొంగిలించడం అనేది మరో ముఖ్యమైన కారణం. అందుకే జోర్డాన్‌లో మహిళల కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నీటి పొదుపు కోసం రకరకాల ఉపకరణాలను బిగించడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నీటి వనరుల నిర్వహణలో మహిళలను పాల్గొనేలా చేయడం మంచి నిర్ణయమని నీటి, పారిశుధ్య సలహాదారు హింద్ అల్లైఫాత్ పేర్కొన్నారు. ఎందుకంటే నీటి ప్రాముఖ్యత గురించి వారికే ఎక్కువ తెలుసు. ఈ మేరకు వారు యువత, వృద్ధులలో అవగాహనను తీసుకు రాగలరు. ఈ కోణంలో చూసినపుడు వారు తల్లులే కాదు, టీచర్లు కూడా!ఆర్థిక భద్రతఅల్ షాతి, న్మోర్ తో సహా కొంతమంది మహిళా ప్లంబర్లు 2014లో వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ కార్యక్రమంలో చేరారు. కలిసి పనిచేయడం వల్ల భద్రత, ఆర్థిక స్థిరత్వం, అలాగే పెద్ద ప్రాజెక్టులను లీడ్ చేసే అవకాశాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. ఇందులోని సభ్యులు తమ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఉచిత సర్వీస్ అందిస్తున్నారు.మొదటిసారి 2004లో 15 మంది మహిళలతో కలిసి శిక్షణ తీసుకున్నప్పుడు ‘సంస్కృతికే అవమానం’ అనే కారణంగా ఇతరులెవరూ దానిని ఆమోదించలేదు. కానీ, ‘‘నేడు ఈ పనిరాని వారు కూడా సాధారణ మరమ్మతులు చేయడం నేర్చుకుంటే ఇండ్లలో తమ ప్లంబర్ పనిని తామే చేసుకోవచ్చు’ అని వివరిస్తూ తోటి మహిళలనూ ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్లంబర్ పనిచేసే ఈ మహిళలంతా చాలా కాలంగా తమ సమాజంలోని నిబంధనలను సవాల్ చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. లింగ సమానత్వాన్ని కాపాడుకున్నారు. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం) -
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం (Chandanotsavam) కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.అతిథులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం (Gold) కొనాల్సిందేనా! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం (Akshaya Tritiya Vratham) గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం (Rahu Kalam) వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?ఇంకా గృహనిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్ -
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
‘వంక’లు లేవు వాగులు లేవు... చెప్పడానికి సాకులు లేవు. వేసవి సెలవులు వచ్చేశాయి. సోషల్ మీడియా బందీఖానా నుంచి పిల్లలను ఇప్పుడు రిలీజ్ చేయాలి. పుస్తకాలకు దగ్గరగా తీసుకురావాలి. విక్రమార్కుడి సింహాసనం ఎక్కిస్తే కథల దర్బారులోకి వారే ప్రవేశిస్తారు. వేసవి సెలవుల్లో ఉన్న 50 రోజుల్లో పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి, ఏవి చదవాలి? వేసవి శీర్షిక ‘వేసవి కాలమ్’లో మొదటి కథనం.పిల్లలకు బడి గంట ఇష్టమే. కాని స్కూల్ మొదలయ్యేప్పుడు కొట్టే గంట కంటే స్కూల్ వదిలేప్పుడు కొట్టే గంట ఎక్కువ ఇష్టం. ఆ గంట వినపడగానే పుస్తకాలు తీసుకుని క్లాస్ నుంచి పరిగెత్తుతారు. కొందరు ప్లేగ్రౌండ్‌కు వెళతారు. కొందరు ఇంటికి చేరి వెంటనే చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ను పోగేస్తారు. ఎందుకు? ఇంకెందుకు... ఆటలు ఆడటానికి.ఇంట్లో నుంచి అమ్మ పిలుస్తున్నా... ఏదైనా తిని వెళ్లమని అరుస్తున్నా పిల్లలు లెక్క చేయరు. ఆడుతుంటారు. ఆడుతూ అరుస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. పేచీ పెడుతూ ఉంటారు. ఓడుతూ ఉంటారు. గెలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ చెమట చిందిస్తూ ఉంటారు.పిల్లలూ చెమటా కవలలునేడు... పిల్లలకు చెమటే లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఆడటం లేదు కాబట్టి. ఆడే బదులు ఓ.టి.టి.లో, కంప్యూటర్లో, సోషల్ మీడియానో తమ బాల్యంతో ఆటలాడుకోవడానికి వీలు కల్పిస్తున్నారు కాబట్టి.దొంగ... పోలీస్‘దొంగ పోలీస్’ ఆట అందరికీ తెలుసు. ఇవాళ దొంగ పోలీస్ ఆట ఎంతమంది పిల్లలకు తెలుసు? ఎంత సింపుల్ ఆట ఇది! ఐదారు మంది పిల్లలు కలిసి పంటలు వేసి గెలుస్తారు. ఆఖరున మిగిలినవాడు పోలీస్ అయ్యి గోడ వైపు తిరిగి వంద లెక్కబెడతాడు. ఈ లోపు పిల్లలు దాక్కుంటారు. ఆ దాక్కున్న వాళ్లను పోలీస్ కనిపెట్టాలి. కనిపెట్టలేకపోతే పోలీస్ ఓడిపోతాడు. ఈ ఆట ఆషామాషీ ఆటనా? పిల్లల మెదడుకు తర్ఫీదు ఇస్తుంది.మున్ముందు జీవితంలో తారసపడబోయే వారిలో ఎవరు దొంగ.. ఎలాంటి దొంగ... వాడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది... ఎవరు ఏ మేరకు తప్పించుకోలరు... అదొక్కటేనా? మన వ్యక్తిత్వంలో దొంగ పనులు ఎలా చోటు చేసుకుంటున్నాయి... వాటిని వెతికి పట్టుకొని జైలుకు పంపితే ఎంత మంచి విద్యార్థులం కాగలం... అసలు దొంగలా దాక్కునే బతుకు ఎంత నీచమైనది.... ఇవన్నీ పైకి చెప్పకనే నేర్పిస్తుంది.ఇవాళ్టి పిల్లలకు కామిక్ హీరో, యూట్యూబ్ గేమర్ తెలుసుకాని దొంగ పోలీస్ తెలీదు. పైగా పిల్లలు ఆ ఆట ఆడుతూ కనిపిస్తే పెద్దలే నవ్వి, జోకులేసి ‘మరీ ఈ ఆటలా’ అని ఆపించేలా ఉన్నారు.ఆట లేకుంటే ఆందోళనపిల్లలు ఆడేందుకు పుట్టారు. ఆడి ఆడి వారు పెద్దవాళ్లవ్వాలి. ఆటకు దూరమయ్యి కాదు. ‘పిల్లల చైల్డ్‌హుడ్ యాంగ్జయిటీకి వారు ఆటలకు దూరం కావడమే కారణం’ అంటారు జోనాథన్ హైడ్ అనే సోషల్ సైకాలజిస్టు. ఆటకు బదులు టీవీ, కంప్యూటర్, సోషల్ మీడియాకు బానిసైన ఏ పిల్లవాడైనా దృష్టి చెడి, నిద్ర చెడి, కల్మషం నింపే కలకలం రేపే కంటెంట్‌ను చూసి ఆందోళనకు గురవుతాడు. కదలిక లేని మెదలిక లేని కుర్చీలో కూలబడి కేవలం మెదడుకు ఒత్తిడి ఇవ్వడం ద్వారా మెదడుతో పాటు శరీరం కూడా శుష్కమయ్యి మెదడకు తగిన శక్తి ఇవ్వడంలో వెనుకబడుతుంది.వివాదాల ఇల్లుఅయితే తల్లిదండ్రులు చాలా నియమాలు పెట్టాలని చూస్తారు. టీవీ ఆఫ్ చేస్తారు. రౌటర్ కట్ చేస్తారు. ఓటీటీ రెన్యువల్ చేయరు. ఈ తల్లిదండ్రులే కోవిడ్ కాలంలో ఇవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు వద్దంటే పిల్లలు మానుతారా? ఆటలు ఆడి శ్రమ చేయడానికి ఇష్టపడకపోగా కుర్చీలో కూలబడి పొందే వినోదం కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూ ఉంటారు. దాంతో ఇంట్లో ఆశాంతి నిండిపోతుంది. అందుకే జోనాథన్ హైడ్ ఏమంటారంటే ముందు పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయండి. తర్వాత ఆటల్లోకి తీసుకురండి అని.కట్టెల మోపు కథచనిపోయే ముందు ఒక తండ్రి తన నలుగురు కొడుకులకు ఒక్కొక్క కట్టె ఇచ్చి విరవమంటాడు. వాళ్లు విరుస్తారు. ఇప్పుడు నలుగురి చేతుల్లో ఉన్న కట్టెలను మోపుగా కట్టి విరవమంటాడు. కొడుకులు విరవలేకపోతారు. ‘కలిసి ఉంటే ఇలా బలంగా ఉంటారు’ అని చనిపోతాడు తండ్రి. కొడుకులు ఆ ఐకమత్యాన్ని పాటిస్తారు. కథలు ఎన్నో విషయాలు చెబుతాయి. నేర్పుతాయి. సూక్ష్మబుద్ధిని చూపుతాయి.సమస్యలు ఎదురైతే తెనాలి రామలింగడిలా దొంగల చేతే బావిలోని నీళ్లన్నీ చేదించి పాదులు తడుపుకునే తెలివితేటలను ఇస్తాయి. భారతదేశంలో నుంచి ప్రపంచం కథలను తీసుకుంటే మన పిల్లలకు మనం కథలను దూరం చేస్తున్నాం. పిల్లల నిపుణులు ఏమంటారంటే బొమ్మలున్న కథల పుస్తకాలు చిన్న పిల్లలకు కామిక్సు, గ్రాఫిక్ నవలలు టీనేజర్లకు ఇచ్చి వారికి పుస్తకాలు అలవాటు చేయమని. పుస్తకం చదివిన పిల్లలు ఆ కథను తోటి పిల్లలతో పంచుకోవాలనుకుంటారు. నలుగురు పిల్లలూ కథలు చెప్పుకోవడానికి కూడతారు. ఆ తర్వాత? ఆడుకుంటారు. ఇదీ ఆరోగ్యకరమైన బాల్యం అంటే.క్లాసులు... స్పెషల్ క్లాసులు...ఆటల బదులు మార్కులు, సాటి పిల్లలకు బదులు ట్యూషన్ క్లాసులు చుట్టుముట్టి పిల్లలను ఆందోళనలోకి నెడుతున్నాయి. కాలూ చేయీ కదపని దేహం బుద్ధిని ఎలా కదుపుతుంది? ఫిట్‌గా లేని శరీరం ర్యాంకులు ఎలా తెస్తుంది? ఆటలో పడి లేస్తారు పిల్లలు. అది అలవాటైతే చదువులో పడినా లేవడం తెలుసుకుంటారు. లేదా లేవడానికి కథల్లో చదివిన ఒక ఉదాత్త నాయకుడిని తోడు తెచ్చుకుంటారు. ఆటపాటలు లేకపోవడం వల్లే నేడు పిల్లలు ర్యాంకు రాకపోయినా ఫెయిల్ అయినా చాలా దూరం పోతున్నారు. సెలవులొచ్చాయి. ఆడించండి. చదివించండి. -కె. -
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
శ్రీశైలం టెంపుల్: శ్రీగిరిలో వెలసిన మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు క్షేత్ర పరిధిలో సందర్శించే స్థలాల్లో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. దక్షిణ భారత దేశంపై దండయాత్రకు వచ్చిన మొఘలు చక్రవర్తులను మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ తరిమికొట్టారు. ఆయనకు శ్రీశైల క్షేత్రానికి ఎంతో అనుబంధం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630లో జన్మించగా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన 16వ ఏటా నుంచి యుద్ధాలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా 1677లో దక్షిణ భారతదేశం నుంచి దండయాత్ర మొదలు పెట్టి ముందుగా శ్రీశైలం చేరుకున్నారు. స్వతహాగా అమ్మవారి భక్తుడైన ఆయన అమ్మవారి దర్శనార్థం శ్రీశైలంలోనే 10 రోజుల పాటు బస చేశారు.శ్రీశైలంలో ప్రస్తుతం నిర్మించిన ధ్యాన కేంద్రం ప్రదేశంలో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ధ్యానం చేశారు. ఆయన సాధనకు మెచ్చిన భ్రమరాంబాదేవి సాక్షాత్కరించి దివ్య ఖడ్గాన్ని శివాజీకి ప్రసాదించారని, అందుకు సాక్షంగా ఇప్పటికీ శ్రీశైల ఆలయ ప్రాంగణంలో విగ్రహం కూడా ఉంది. శ్రీశైల ఆలయ ఉత్తర గోపురాన్ని శివాజీ 1677లో శ్రీశైలయానికి వచ్చినప్పుడు తన సైన్యంతో నిర్మించారని తెలుస్తోంది. రామచంద్ర పంత్ అనే తన మంత్రిని సుమారు 2 ఏళ్ల పాటు శ్రీశైలంలోనే ఉంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివాజీ ధ్యానం చేసిన ప్రాచీన కట్టడం శిథిలం కావడం అక్కడే శివాజీ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఛత్రపతి శివాజీ బస చేసిన ప్రదేశంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం విశేషాలు ఇవి.. 1975లో శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీ ఏర్పాటయ్యిది. 1983లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత దాదా పాటిల్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అంచలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. 1994లో పట్టాభిషక్తుడైన శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2004లో నిర్మాణాలు అన్ని పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రంలో పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ (Chatrapati Shivaji) క్యాంస విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే 10 మందితో కూడిన శివాజీ మంత్రి మండలి సాక్షాత్కరించేలా దర్బార్ నెలకొల్పారు. శివాజీ జీవిత చరిత్రను పర్యాటకులు తెలుసుకునేలా ఫైబర్ మెటీరియల్‌తో 23 బ్లాక్‌లలో త్రీడీ చిత్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కనడ భాషలలో జీవిత చరిత్ర విశేషాలను వివరించారు. దర్బార్ హాల్పక్కనే శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశంగా ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ధ్యాన కేంద్రాన్ని పూర్తి రాజస్థాన్ మెటీరియల్‌తో నిర్మించారు. ఈ మందిరం పెద్ద కోటను తలపిస్తుండడంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ధ్యాన కేంద్రంలో శివాజీ ధాన్య ముద్రలో ఉన్న విగ్రహంతో పాటు శివాజీ వినియోగించిన ఖడ్గాన్ని చూడవచ్చు. శివాజీ కాంస్య విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించారు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (శిల్పాలు తయారు చేసే) కళాశాలలో ఈ విగ్రహాన్ని ఖాన్ విల్ ఖర్ అనే శిల్పి తయారు చేశారు. ఛత్రంతో కలిపి 12 అడుగుల ఎత్తుతో, 4.5 టన్నుల బరువుతో ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. శివాజీని ఎప్పుడు గుర్రం పైనే చూస్తాం. కానీ శ్రీశైలంలో మాత్రం సింహాసనంపై కూర్చుని, శివాజీ ధరహాసంతో కనిపిస్తారు. శివాజీపైన (ఛత్రం) గొడుగు ఉండడం విశేషం.చదవండి: సజీవ కళ.. ఆదరణ లేక! 2021లో పుణేకు చెందిన చిత్ర కల్పక్ శిల్ప కళాశాలలో దర్బార్‌హాల్‌లో శివాజీ జీవిత విశేషాలతో ఫైబర్ మెటీరియల్‌తో త్రీడీ పిక్చర్స్‌ను తయారు చేయించి ఏర్పాటు చేశారు. -
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
చార్టర్డ్ అకౌంటెంట్ అవడం అంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన సీఏ ఎగ్జామ్‌లో పాసవడం కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ పరీక్షల్లో నెగ్గేందుకు ఏళ్లబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవారెందరినో మనం చూసుంటాం. అయితే నందిని అగర్వాల్ అలా కాదు. అత్యంత చిన్నవయసులోనే సీఏ ఫైనల్స్ క్లియర్ చేయడమే కాదు, ఏకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచి ప్రపంచ రికార్డు సాధించింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ రాణిస్తోంది నందిని.అన్నయ్యకు క్లాస్మేట్!మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణానికి చెందిన నందిని అగర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జరిగిన సీఏ (న్యూ) పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్‌తో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించినట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్ వెల్లడించింది. 2001, అక్టోబర్ 18న నందిని జన్మించింది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి తన అన్నయ్య సచిన్‌కు క్లాస్మేట్గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్ రాసిన సచిన్‌కు 18వ ర్యాంక్ రావడం గమనార్హం. ఇక సీఏ ఇంటర్‌ను 16 ఏళ్ల వయసులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది.వరల్డ్ ఫేమస్ కంపెనీల్లో జాబ్నందిని ప్రస్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు వరల్డ్ ఫేమస్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. పీడబ్ల్యూసీ కంపెనీలో ఆర్టికల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్మెంట్లు, టాక్స్ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్లలో తనకు మూడేళ్ల అనుభవం ఉందని తన లింక్డ్ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసినట్టు వెల్లడించారు. BCGలో కీలకమైన G20 టీమ్‌లోనూ ఉన్నట్టు పేర్కొన్నారు.చదవండి: కళ్ల తప్పిన బైండ్ల బతుకులుసోషల్ మీడియాలోనూ సంచలనండిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది నందిని అగర్వాల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లోనూ ఆమెకు 2 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ పరీక్షల సంబంధించిన స్టడీ టిప్స్ వీడియోలను యూట్యూబ్‌లో ఆమె షేర్ చేస్తుంటుంది. -
మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్సలు చేస్తున్నారు. వేసవి అంటేనే “స్టోన్ సీజన్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.ప్రధానాంశాలు: రోజుకు సగటున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడంతో పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోంది. 10-17 సంవత్సరాల మధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణం. పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే (సుమారు 40% తక్కువ). కానీ, గర్బవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి, గుర్తించకపోతే ముప్పు ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధారణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వేడి పెరిగిపోవడం, తగినంత నీరు తాగకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్ల సమస్య కేవలం పెద్దవాళ్లది అనుకోకూడదు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీనిపై అవగాహన పొందాలి. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేసవి నెలల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి” అని సూచించారు.జాగ్రత్తగా ఉండండిలా...తగినన్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలి.ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలి.స్కూల్లో ఉన్నప్పుడు, ఇళ్ల దగ్గర కూడా తగినన్ని నీళ్లు తాగేలా చూడాలికుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపునొప్పి రావడం, తరచు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులకు చూపించాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలావరకు ఈ సమస్యను దూరం పెడుతుంది. -
Frogs నన్ను ఇంటికి తీసుకు వెళ్ళు
ఒకటి రెండు కప్పలు సింక్ కింద ఉంటే చాలు, ఇంట్లో బొద్దింకల బెడద తీరిపోతుందని రోమ్ వాళ్ల అమ్మ ఎప్పుడూ అంటుండే వారు. ఆలోచించి చూస్తే, మా అస్తవ్యస్థమైన తోటలాగే, కప్పలు మా ఇంటిలో గుమిగూడి, గంపలు తెంపలుగా చేరాయి, అచ్చం ఆ చెట్టుకప్పల దాడి లాగ. అడవి దారిలో నడిచినట్టు, ప్రతి రాత్రి నేను నా చెప్పులు తొడగని కాలిని ఎక్కడ పెడుతున్నానో చూసుకోవలసి వచ్చేది. నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఆ అద్భుత-పరిమాణం గల జిగురోడే కప్ప మలం ఎగిరోచ్చి నా పాదాలకు అంటుకునేది. నేను ఏమి చేస్తున్నా మరచిపోయి, ఆ నల్ల ‘కప్ప జిగురుని’ కడుక్కోవడానికి వెంటనే కుంటూ కుంటూ వెళ్ళాల్సొచ్చేది. అలా కొన్ని రాత్రి సంఘటనల తరువాత నేను ఆ కప్పల్ని ఇంటి నుంచి అవతల విసిరేశాను కానీ అవి నా కోపాగ్నిని ఎదురుకోవడానికి భయం లేకుండా తిరిగి వచ్చాయి.వాటిని నేనొక ప్లాస్టిక్ డబ్బాలోకి పోగు చేసి, ఒక 250 మీటర్లు అవతల, ఇంటి ముందుపెరటి చివర్న వదిలాను. అవి ఒక మొండి ధైర్యంతో తిరిగి వచ్చాయి. నేను 500 మీటర్ల దూరంలో వాటిని వదిలేముందు వాటికి ముద్ర వేసి (గుర్తించడం కోసం), డబ్బాని గిరగిరా గుండ్రంగా తిప్పి తోటలో వాటిని చాలా గజిబిజిగా త్రోవ మార్చి తిప్పాను (అయోమయం సృష్టింద్దామని అనుకున్నా). కానీ అవి 25 గంటల్లో తిరిగి వచ్చాయి.ఆడ-రాక్షసి వాటికోసం వస్తే వాటి భాగ్యంలో ఏముందో ఈ పాటికి ఆ వేధించే జీవులకి అర్ధమయ్యింది. అవి బాధలో కీచుమన్నాయి, వణుకుతూ ఎక్కడ పడితే మూత్రం చేసాయి, ఇంకా పట్టుబడకుండా వుండే ప్రయత్నం చేసాయి. నేను ఇంచుమించు క్షమించేశా, కానీ నా కుతూహలం నన్ను ఎగదోసింది. 750 మీటర్లు. 30 గంటల్లో తిరిగి వచ్చాయి. ఆ చిన్న ప్రాణులకి నడవటానికి అది చాలా పెద్ద దూరమే. సీసాని గిరగిరా తిప్పి, ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డవతల బురదనిండిన పొడవాటి దారిలో తీసుకెళ్లి, అడవిలో నీటి మడుగు దెగ్గర వదిలేశా. వాటిని ఇంటి నుండి తరిమెయ్యడంలో నేను విజయం సాధించాను కానీ, పెరటి బయట కుండీలో ఒక కప్ప జంటని నేను కనుగొన్నాను. అవన్నీ తిరిగివచ్చాయా లేదా కొన్నే తిరిగివచ్చాయా అన్నది నేనిప్పుడు చెప్పలేను. వేరే జంతువులు వాటిని ఇంటి నుండి దూరంగా తీసుకుపోతే ఏం చేస్తాయి?నేను వెలికి తీసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో...నమీబియాలో ముద్ర వేసి 800 కిలోమీటర్ల దూరంలో వదిలివేసిన ఎనిమిది చిరుతల్లో, 5 నుండి 28 నెలల వ్యవధిలో ఆరు చిరుతలు ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక ఉదాహరణ ఇస్తాను ఉండండి: ఈ చిరుతల్ని చెన్నై నుంచి తీసుకుపోయి గోవాకి కొద్దిగా ఉత్తరాన వదిలినట్టయితే, అవి తిన్నగా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాయాన్నమాట! అమెరికాలో, వాటి ఇంటికి 200 కిలోమీటర్ల అవతల వదిలేసిన 34 నల్ల ఎలుగుబంట్లలో చాలామటుకు విజయవంతంగా వాటి భూభాగానికి తిరిగి వచ్చేశాయి. భారతదేశంలో, టెరాయి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో బక్స పులుల సంరక్షణ కేంద్రంకి మార్చాబడిన ఒక ఏనుగు రెండు నెలల కంటే తక్కువ కాలంలో తిరిగి వచ్చేసింది. ఆస్ట్రేలియాలోని, ఇంటి నుండి 400 కిలోమీటర్ల అవతల వదల బడ్డ ఉప్పునీటి మొసళ్లు తిరిగి వచ్చేసాయ్..అదే నన్ను బెంగుళూరులో వదలండి, నేను మరుక్షణం తప్పిపోతాను.ఏదేమైనా, దూరాల నుండి ఇంటికి చేరుకోవడంలో ఆరితేరినవి మాత్రం ఆల్బట్రాస్, షీర్వాటర్ వంటి సముద్ర పక్షులదే. మధ్య పసిఫిక్ నుంచి 6,500 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పిన్స్ లో ఉన్న ఒక దీవిలో విడిచి పెడితే, అది ఒక ఆల్బట్రాస్ నెలలో తిరిగి వచ్చింది, మరో రెండు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ (అమెరికా) నుంచి తిరిగి వచ్చాయి.ఈ అద్భుత నేర్పు కేవలం పెద్ద జంతువులకు మాత్రమే ఉండదు. U. K లో, వాటి తేనె తుట్ట నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ప్రణాళిక లేకుండా విడిచెయ్యబడ్డ బంబల్ బీ తేనెటీగలు వాటి ఇంటికి తిరిగి వచ్చేసాయి. కాబట్టి, కప్పకు ఒక కిలోమీటర్ ఎంత, ఊఁ?ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇంటికి తిరిగి చేరుకుంటాయన్న వాస్తవం బాగా డాక్యుమెంట్ చేయబడింది. కానీ, దూరతీరాలలోని తెలియని భూభాగం నుంచి అవి ఇంటి దారి ఎలా కనుగొంటాయి? ఈ జంతువులను వాటి ఇంటి నుంచి బయట చోటికి మార్చేప్పుడు, అన్ని వైపులా మూసి ఉన్న వాహనాలలో (లేదా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో) తీసుకు వెళతారు కనుక, అవి దారిలో దాటి పోయే దృశ్యాలను, చెట్లను చూసి, జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం లేదు. చాలా కేసులలో, ఆ జ్వంతువులు తీసుకువెళ్లే దారిలో కాకుండా, దానికి బదులుగా, ఇంటికి రావటానికి డైరెక్ట్ తోవ ఎంచుకున్నాయి. అయితే, అవి అది ఎలా చేస్తాయి?-ఇంకా ఉందిAuthor : Janaki Lenin -- జానకి లెనిన్Photo credit - జానకి లెనిన్ -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
తినదగిన 'రోబోటిక్ కేక్'ను చూశారా?
ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్‌ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్‌ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్‌లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!. వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్నెట్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్ కేక్' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్ కేక్ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు. ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్‌తో తయారు చేశారు. కేక్‌పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు. ప్రముఖ డిజైనర్ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్‌పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్ కలర్స్‌ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్‌ని కలిగి ఉంటాయి. ఎందుకోసం ఇలా..రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట. పైగా తినగలిగే సెన్సార్లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు. (చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!) -
అక్షయ తృతీయ : పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిందా? కొందామా? వద్దా?
వైశాఖమాసం, శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే నాడు జరుపుకునే అక్షయ తృతీయ అంటే ఆ సందడే వేరు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున చేసే ఏ పని అయినా అక్షయం అవుతుందని, ఇంట్లో సిరిసంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అందుకే గోరంతైనా బంగారమో, వెండో కొనుగోలు చేయాలని ఆశపతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అక్షయ తృతీయను అనేది ప్రగాఢ విశ్వాసం.భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. ఇక అక్షయ తృతీయ అనగానే బంగారు నగల్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. బంగారం కొనుగోళ్లు భారతీయులకు అక్షయ తృతీయ వేడుకలలో అంతర్భాగం. కానీ ఇటీవలికాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటేంతగా ఎగిసి అందనంటున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల నస్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు సమీపంలో ఉంది. ఈ క్రమంలో గత పదేళ్లలో బంగారం ధరల్లో మార్పు గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో 11 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో పుంజుకోవడం గమనార్హం.2014లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకురూ. 30,182 వద్ద ఉండగా అదే 2025 నాటి ధరలను గమనిస్తే ఏకంగా 218 శాతం పెరిగి రూ. 95,900 కు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2025లోనే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 30 శాతానికి పైగా పుంజుకుంది.ఇదీ చదవండి : Akshaya Tritiya 2025 : శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా? కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.పదేళ్లలో పసిడి పరుగుబంగారం ధర 10 సంవత్సరాలలో రూ. 68,500 పెరిగింది. 2015లో అక్షయ తృతీయకు నాటి ధరలతో పోలిస్తే నేటికి HDFC సెక్యూరిటీస్ డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 68,500 కంటే ఎక్కువ పెరిగాయి.2019లో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు ధరలు 10 గ్రాములకు రూ.31,729గా ఉంది. అంటే అప్పటి పెట్టుబడిపై 200 శాతం పుంజుకున్నట్టే. గత ఏడాది అక్షయ తృతీయ నుండి పుత్తడి 30 శాతానికి పైగా ర్యాలీ అయింది. 2024లో 10 గ్రాముల రూ. 73,240 వద్ద ఉంది. 2024 మధ్యకాలం నుండి బంగారం ధరలు విపరీతంగా పుంజుకున్నాయి. దాదాపు 22 శాతం పెరిగి రూ. 73,240 వద్దకు చేరాయి.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! హై నుంచి కాస్త తగ్గే అవకాశం, కానీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ “చాలావరకు డిమాండ్ ,సరఫరా కారకాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా మార్కెట్లో అధిక అనిశ్చితులు ఉన్న సందర్భంలో. గత రెండు నెలలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. అందువల్ల ధరల్లో కొత్త తగ్గుదల కనిపించవచ్చు. అయితే బంగారం ధరలకు సానుకూలతలు , ప్రతికూలతలు రెండూ ఉన్నాయి, మిశ్రమ ఆర్థిక డేటా పాయింట్లు, సుంకాల యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ అంచనాలు, నెమ్మదించిన వృద్ధి ఆందోళనలు, రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణాలు లాంటి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. -
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్‌ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్‌కేర్ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు. సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్‌లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్‌గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్‌కేర్ బృందాలతో కనెక్ట్ అయ్యారు. అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్‌లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..DxGPT అంటే ..ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్ చేయదు. జస్ట్ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్‌పుట్‌ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.(చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..) -
అక్షయ తృతీయ శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా?
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి( Lakshmi Devi )కి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. తద్వారా ఏడాదంతా తమ ఇల్లు శుభప్రదంగా ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం. ఇదీ చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం.అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే నాశనం లేకుండా ఉంటాయని నమ్మకం. . నిజానికి ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో అక్షయ తృతీత సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల ఆఫర్లతో ఆకర్షింటారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నమాట.ఈ ఏడాది అక్షయ తృతీయ ముహూర్తం వివరాలు పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ఉదయ తిథినే ప్రామాణికంగా భావిస్తాం కాబట్టి , ఈ సమయంలో ఏ వ్రతమైనా, పూజ అయినా ఆచరించవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం పసిడి ధర కొండెక్కి కూచున్న నేపథ్యంలో ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.అక్షయ తృతీయ- బంగారం కొనడానికి శుభ సమయాలుఏప్రిల్ 29 మంగళవారం బంగారం కొనుగోలు సమయాలు - 05:31 PM నుండి 04:38 AM వరకుఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. -
ఆదర్శం అంటే..!
ఆదర్శం అంటే దర్శనం చేయించేది: ‘చూపించేది’ అని అర్థం. మహనీయుల జీవితం మనకు సరైన నడవడిక ఎలా ఉండాలో చూపుతుంది కనుక అది మనకు ‘ఆదర్శం’. దస్తూరీ మెరుగు పరుచుకునేందుకు రాసే ‘కాపీ’ పుస్తకంలో, పేజీలో పైన ముద్రితమై ఉండే నమూనా పంక్తి– ‘మేలు బంతి’–ని చూసుకుంటూ, దాన్ని అనుకరిస్తూ కింద పదిసార్లు రాస్తే చేతి రాత బాగవుతుంది. ఆ నమూనా పంక్తిని కూడా ఆదర్శం అంటారు.ఏదయినా జటిలమైన శాస్త్ర విషయానికి, ఆ శాస్త్రం బాగా నేర్చిన పండితుడు విపులంగా, సరళంగా వ్యాఖ్య రాసి పెడితే; అది ఆ శాస్త్రం తాలూకూ కిటుకులకూ, మర్మాలకూ అద్దం పట్టి మనకు చూపుతుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఆదర్శాలే. ఉదాహరణకు కావ్య లక్షణాల గురించి దండి రంన గ్రంథం పేరు ‘కావ్యాదర్శం’.వేదాంతవేత్తలు వివిధ సందర్భాలలో మనసునూ, బుద్ధినీ, చైతన్యాన్నీ అద్దంతో పోలుస్తారు. రజోగుణ సముద్భవమైన కామ– క్రోధాలు అనే లక్షణాలు... శుద్ధమైన మనిషి బుద్ధిని, స్వచ్ఛమైన అద్దాన్ని; మాలిన్యమూ, మసీ కప్పివేసినట్టు ఒక్కొక్కప్పుడు కప్పి వేస్తాయి. అప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. అలాంటప్పుడే మనిషి పాపకర్మల ఫలాలు దారుణంగా ఉంటాయని తెలిసి కూడా పాత కాలు చేస్తాడు. నవ్వుతూ చేసిన పాపాల కర్మలను తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడని భగవద్గీత బోధిస్తుంది.మనం చూసే విశ్వమంతా ‘దర్పణ దృశ్యమాన నగరి’ (అద్దంలో కనిపించే నగరపు ప్రతిబింబం) లాంటిది అన్నారు ఆదిశంకరులు. బాహ్య ప్రపంచంలో విశేషాలన్నీ మన అంతఃకరణలో ప్రతిబింబించడం వల్లనే మనకు గోచరిస్తున్నాయి. మన చేతోదర్ప ణంలో బాహ్య ప్రపంచపు విశేషాలు ప్రతిబింబించకపోతే వాటి రపురేఖల, లక్షణాలూ మనం గ్రహించలేం. ఈ అద్దం లేకపోతే ఆ విశ్వం మనకు గోచరించదు. అద్దం మీద మోహమూ, భ్రాంతీ, అజ్ఞానమూ అనే మురికి పేరుకుపోతే కూడా మనకు మన కట్టెదుట ఉన్న సత్యం యథాతథంగా కనిపించదు. ఉన్నది కప్పబడి, లేనట్టుతోస్తుంది. అద్దం మీది మాలిన్యం వల్ల లేనిదేదో ఉన్నట్టు కనిపిస్తుంది. బుద్ధి అద్దానికి మకిలి పడితే మనం భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం. ‘చేతో దర్పణ మార్జనమ్’ (బుద్ధిని శుద్ధి చేసే సాధనం) శ్రీకృష్ణ నామ సంకీర్తనం’ అని చైతన్య మహాప్రభువుల ‘శిక్షాష్టకం’ అంటుంది. దానివల్లనే ‘సమ్యక్ దృష్టి’ కలుగుతుంది.– ఎం. మారుతి శాస్త్రి -
International Dance Day ఆదిమ వారసత్వం నృత్యం
వినసొంపైన సంగీతం వినబడితే శరీరం అప్రయత్నంగా లయ బద్ధంగా కదులుతుంది. దానినే ‘నృత్యం’ అంటారు. 1760లో రచయిత, ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త అయిన జీన్ జార్జెస్ నోవెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని యునెస్కో ఏప్రిల్ 29ని ‘అంత ర్జాతీయ నృత్య దినోత్సవం’గా ప్రకటించింది. నృత్య కళారూపాలను నివేదించడానికీ; ప్రపంచీకరణను, రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను అధిగమించడానికీ... నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికీ కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. ఇంట ర్నేషనల్ డ్యాన్స్ కమిటీ ప్రవేశపత్రం ఆధారంగా ప్రతీ ఏటా ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడిని ఎంపిక చేసి ఆ రోజు వారి సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తారు. ఆదిమ సంస్కృతికి చిహ్నంనృత్యం. అదివాసీలు ప్రకృతిని, సూర్యుని, చంద్రుని దేవుళ్ళుగా భావించేవారు. కొన్ని తెగల వారు ప్రత్యేకించి (గోత్రం పరంగా) కొన్ని జంతువులను మాత్రమే దేవుళ్ళుగా పూజిస్తూ వాటి మాంసాన్ని ముట్టరు. రాతి యుగం నాటి ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా వంటి దేశాలలోని కొండ గుహలలో ఆదిమ మానవుల వేట, నాట్యం, దృశ్యాలు కన్పిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమ కాలం నుండి నాట్యం అనేది ప్రస్తుత మానవునికి వారసత్వంగా లభించిందని చెప్పవచ్చు. నృత్యం లేకుండా ఆదివాసీలలో ఏ సంబురాలూ జరుగవు. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆదిమ తెగలలో థింసా, గుస్సాడీ, రేలా, దండారీ, కొమ్ము నృత్యాలు ప్రసిద్ధి. అయితే భరతనాట్యం, కూపూడి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ ఆట్టం వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలుగా పిలిచేవాటికే ప్రపంచవ్యాప్తంగా మం గుర్తింపు ఉంది. భారతీయ నాట్య ప్రపంచంలో చిందు బాగోతుల వారు ఆడే ఆట, పులినృత్యం వంటి ఎన్నో జానపద నృత్యాలూ ఉన్నాయి. అయితే అనేక నృత్య రీతులు ఇప్పుడు కనుమరుగవ్వడం విచారకరం. భారతీయసంస్కృతి -సంప్రదాయాలలో భాగమైన నృత్యకళను రక్షించుకోవా లంటే సంబంధిత నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవనభృతి కల్పించాలి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం) -
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.. పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్‌కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్కోస్ట్కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్. ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్లర్లు, ఇంప్లాంట్లను తొలగించుకుంది. కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్‌గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
ఆభరణాల క్రియేటివిటీలో సరికొత్త ట్రెండ్..!
ఆభరణం అంటే మగువల అందాన్ని పెంచడానికి విభిన్న సృజనాత్మక రూపాల్లో తయారు చేయడమే. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో ఆభరణాల ప్రపంచంలో ఒక కొత్త ధోరణి చెలామణి అవుతోంది. ‘థీమ్ ఆధారిత ఆభరణాలు’ అనే ఈ ట్రెండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇది విస్తృతంగా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ప్రకృతి, ఋతువుల సౌందర్యానికి ప్రతిగా రూపొందించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఆభరణ బ్రాండ్లు ఈ కొత్త ధోరణిని స్వీకరించి, ప్రతి ఆభరణంలోనూ ప్రకృతి సౌందర్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్లు ప్రత్యేకంగా రూపొందించిన కళాఖండాలు, కశ్మీర్ ఋతువుల మాయాజాలాన్ని ప్రతిబింబిస్తూ మార్కెట్లోకి వస్తున్నాయి. అది బంగారమా, వజ్రమా అనే తేడా లేకుండా వ్యాపార విలువతో పాటు ఆభరణంలోని థీమ్‌ను, వైవిధ్యాన్ని, వినూతనత్వాన్ని ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఆభరణాల తయారీలోని హస్తకళ వైవిధ్యానికి థీమ్ ఆధారిత జ్యువెలరీ మరింత హంగులను అద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆభరణ సౌందర్యాలు. ఋతువుల కవిత్వం తాకిన కళ.. ‘ఈ లోయ గుండా నడిచిన ప్రతిసారీ, ఋతువులు తమ పాటలు పాడతాయి’ అనే భావనతో ఒక కవిత్వ సృష్టిలాంటి ఆభరణాలు అలరిస్తున్నాయి. చినార్ ఆకుల నృత్యం నుంచి మంచుతో కప్పబడిన పైన్ చెట్ల పరవశం వరకూ ప్రతి ఆభరణం ప్రకృతి గాథను చెబుతోంది. శరదృతువులో చినార్ ఆకులు గాలిలో ఊగే తీరు, తెల్లటి మంచుతో అలంకరించిన దృశ్యాలను ప్రతిబింబించే చెవిపోగులు, లాకెట్లు, రౌండ్ కట్లో తెల్ల వజ్రాలతో తయారైన కశీ్మర్ శీతాకాలపు నిర్మలత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రకృతిని ధరించే సోయగాలు.. ఈ కొత్త థీమ్ ఆధారిత ఆభరణాలు ప్రకృతిని మించిన అందాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఋతువుల స్వభావాన్ని, కశీ్మర్ వంటి సుందర ప్రదేశాలను ప్రతిబింబించేలా తయారు చేస్తున్న ఆభరణాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. అధునాతన సంప్రదాయానికి వినూతనత్వాన్ని జోడిస్తున్న ఈ కళాఖండాలు ప్రస్తుత జీవన శైలి, ఫ్యాషన్ ప్రపంచానికి ప్రకృతితో కూడిన కొత్త పంథాను పరిచయం చేస్తున్నాయి. శీతాకాలపు అందాల్లో మునిగిపోయిన పైన్ చెట్లు, కిరణాలపై మెరిసే వజ్రాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన నెక్లెస్‌లు, చెవిపోగులు శీతాకాలపు సౌందర్యానికి నిదర్శనంగా తయారు చేస్తున్నారు. నెమ్మదిగా వెలిసే శీతాకాలం మొదలు వికసించే వసంతానికి మధ్య మార్పును చూపించే ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వసంతపు వర్ణ విహారం.. వసంత ఋతువులో కశీ్మర్ లోయను అలంకరించే తులిప్ పువ్వుల కాంతిని పసుపు వజ్రాలు, గులాబీ క్వార్‌ట్ట్జ రత్నాలతో తయారు చేసినట్టుగా ప్రతిబింబిస్తున్నాయి. తులిప్ పువ్వుల వర్ణాలను దృశ్యాన్ని చేస్తున్నట్లుగా చెవిపోగులు, నెక్లెస్‌లు ప్రతి రూపంలో ప్రకృతి ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. సృష్టి కథను ఆభరణాల్లో వర్ణిస్తూ.. ‘ఇప్పటికీ మిగిలి ఉన్న స్వర్గం’ అనే భావన ఆధారంగా రూపొందించిన ఈ కొన్ని కలెక్షన్ కశీ్మర్ లోయల శాశ్వత అందాన్ని మిళితం చేస్తూ అందమైన కథగా చెబుతున్నాయి. బంగారం పై తయారు చేసిన చినార్ ఆకులు, వజ్రాల కాంతిలో మెరిసే తులిప్ పువ్వులు, కాలానికి అర్థం చెప్పకనే చెబుతున్నాయి. మై ఎంబ్రేస్.. మగువల ఆలోచనలు.. ప్రస్తుత తరుణంలో ఆభరణాలను అందం కోసమే కాకుండా ఒక కళాత్మక జీవనానికి నిదర్శనంగా ధరిస్తున్నారు మగువలు. దీనికి అనుగుణంగానే ఆభరణాల తయారీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే జోయా ఆధ్వర్యంలో మై ఎంబ్రేస్ అనే థీమ్‌తో.. సాధారణంగా మహిళలు జీవితంలో ఎన్ని పాత్రలు పోషించినా, వారి జీవితానికి పరమార్థంగా ‘తనను తాను ఆలింగనం చేసుకునేలా’ అందమైన జ్యువెలరీ రూపొందించాం. మగువ ఆలోచనలు, ఆనందాలు సార్థకం అయ్యేలా తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకునేలా సృష్టించిన ఈ ఆభరణాలు నగరంలోని జ్యువెల్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. – అమన్‌ప్రీత్ అహ్లువాలియా, జోయా బిజినెస్ హెడ్ (చదవండి: ఖాదీ కమ్ బ్యాక్) -
Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?
అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్రూమ్లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్ వేయడం, సిమెంట్ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్ ఆర్థోపెడిక్స్ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్వాల్వ్ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్డ్ యూనియన్’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్ యూనియన్’ అంటారు.డిలేయ్డ్ యూనియన్ / నాన్ యూనియన్‌కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్ స్ప్లింటేజ్). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్ బ్రిడ్జ్ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్ స్పేస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాలస్ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్ బ్రిడ్జ్’ అంటారు. గ్యాప్ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్΄ పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్ సప్లిమెంటేషన్ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్) సమస్య ఉన్నవారిలో నాన్–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్ నెక్ ఫ్రాక్చర్: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్ కాకపోవచ్చు. ఫిఫ్త్ మెటాటార్సల్ (జోన్స్ ఫ్రాక్చర్)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్. స్కేఫాయిడ్ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్–యూనియన్) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్డ్ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్ అయిన చోట వాపు (స్వెల్లింగ్) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్డ్ యూనియన్)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్ బాలవర్థన్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్‌లో..) -
ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్‌లో..
నూక్లియర్ సైన్స్‌లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మకమైన మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్(ఎంఎస్సీఎఫ్పీ)కు ఇండియన్ స్టూడెంట్ హేమంగి శ్రీవాస్తవ ఎంపికైంది. మాస్కో పవర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ (ఎంపీఈఐ) లో హేమంగి ఎలక్ట్రానిక్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ చేస్తుంది.2023లో రష్యాలో నిర్వహించిన ‘వరల్డ్ యూత్ ఫెస్టివల్’కు హాజరైన హేమంగి అక్కడ ఒక మహిళా ప్రొఫెసర్ నోటినుంచి నూక్లియర్ ఎనర్జీ ప్రాముఖ్యత గురించి విన్న మాటలు ‘ఎంపీఈఐ’కి దరఖాస్తు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తాను ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి ‘సైన్స్, ఆర్ట్‌ల సమ్మేళనం’ అంటుంది హేమంగి. మరింతమంది మహిళలు నూక్లియర్ సెక్టర్‌లోకి రావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. (చదవండి: ఖాదీ కమ్ బ్యాక్) -
ఖాదీ కమ్ బ్యాక్
సాంస్కృతికపరంగానే కాదు వాణిజ్యపరంగా కూడా ఖాదీ పునర్జీవనం హైలెవెల్లో ఉంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 2024–25 నాటికి అనూహ్యంగా రూ.1,70,551,37 కోట్లకు పెరిగాయి. గ్రామీణ భారతంలో ఖాదీ జీవనోపాధి వనరు, పట్టణాల్లో మాత్రం ప్రతీకాత్మక వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ దుస్తులు ధరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు ఖాదీతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం విశేషం. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ‘న్యూ ఖాదీ ఫర్ ది న్యూ ఇండియన్’ ధోరణి వేళ్లూనుకుంది. ‘న్యూ ఖాదీ ఫర్ న్యూ ఇండియన్’ నినాదాన్ని తమ ప్రచారానికి వాడుకుంటుంది లూనా బ్రాండ్. ఆధునిక మార్కెట్ కోసం ఖాదీని పునర్నిర్వచిస్తున్న బ్రాండ్లలో బెంగళూరుకు చెందిన లూనా బ్రాండ్ ఒకటి. కొత్త బ్రాండ్లు ట్రెండ్ ఆధారిత ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ‘ఖాదీకి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విలాసవంతమైన, నైతిక, పర్యావరణ హితమైన భవిష్యత్తుకు పునాది వేయవచ్చు’ అంటున్నారు ఖాదీని ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్లు.(చదవండి: Rich Man's Disease: ఇవి తింటున్నారా? జాగ్రత్త!) -
మూడో పంటగా సౌర విద్యుత్తు!
మెట్ట భూముల్లో సోలార్ ప్యానెళ్లను నేలపైనే ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం తెలిసిందే. అయితే, వ్యవసాయ భూమిని ఇలా సోలార్ ప్యానళ్ల మయం చేస్తూ పోతే సాగు విస్తీర్ణం తగ్గిపోతుందన్న భయాందోళనలు లేకపోలేదు. అందుకే, పంటలను సాగు చేస్తూ అదే పొలంలోనే సోలార్ ప్యానళ్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మేలు కదా! ప్యానళ్ల ఏర్పాటులో కొన్ని మార్పులు చేసుకుంటే పొలాల్లో పంటలతో పాటు పనిలో పనిగా సౌర విద్యుత్తును కూడా నిక్షేపంగా పండించుకోవచ్చని విదేశీ అనుభవాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఇది సరికొత్త ట్రెండ్. అదే ‘అగ్రివొల్టాయిక్స్’! ఏడాదికి రెండు (ఖరీఫ్, రబీ) పంటలతో పాటే అదే పొలంలో మూడో పంటగా సౌర విద్యుత్తు ఉత్పత్తిపై మన దేశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఆ సంగతులేమిటో చూద్దాం..!సోలార్ ప్యానళ్ల పక్కన పంటలునేలకు ఒకటి, రెండు అడుగుల ఎత్తులో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానళ్లను వరుసలుగా ఏర్పాటు చేసుకొని, ఆ వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండేలా చూసుకొని.. ఆ ఖాళీలో పంటలను పండిస్తున్న సంస్థలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో, గుజరాత్‌లోని సర్దోయ్లో కూడా ఇలాంటి ప్రయోగాత్మక సోలార్‌లో అంతర సాగు జరుగుతోంది. ప్యానళ్ల వరుసల మధ్యలో గోరింటాకు మొక్కలు సాగు చేస్తున్నారు. బలమైన గాలుల నుంచి సోలార్ ప్యానళ్లను రక్షించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగంగా ఉన్నాయంటున్నారు. ప్యానళ్లను కడిగే నీటిని ఈ మొక్కలకు మళ్లిస్తూ నీటిని పునర్వినియోగిస్తున్నారు.ప్యానళ్ల నీడలో పంటలుమహారాష్ట్రలోని పర్బనిలో 5 ఎకరాల్లో ఒక మోస్తరు ఎత్తున ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల కింద తక్కువ ఎత్తు పెరిగే అల్లం, పసుపు, పెసలు, బెండ వంటి పంటలు పండిస్తున్నారు. 50 మెగావాట్ల ప్రాజెక్టును సన్‌సీడ్ ఎపివి, కనొడా ఎనర్జీ, జిఐజడ్ జెర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉమ్మడిగా నెలకొల్పాయి. ‘సోలార్ ప్యానళ్ల కింద మేం పెట్టిన పంటలు బాగానే పెరుగుతున్నాయి. మామూలు పొలాల్లో సమానంగానే దిగుబడి వస్తోంది. అయితే, చెరకు వంటి బాగా ఎత్తుగా పెరిగే పంటలను సోలార్ ప్యానళ్ల కింద పెంచలేం’ అన్నారు ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న యువ రైతు గోవింద్ రసవె.ద్రాక్ష తోట కూడా,.మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న దేశంలోనే అతి పెద్ద రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పిఓ) సహ్యాద్రి ఫామ్స్ కూడా ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం చేస్తోంది. ఒక ఎకరంలో సోలార్ ప్యానళ్లను 3.75 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసి, వాటి నీడన రకరకాల పంటలను సాగు చేస్తోంది. 250 కె.డబ్ల్యూ. సామర్థ్యంతో కూడిన బై–ఫేసియల్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్యానళ్ల కింద ద్రాక్ష తోటలు పెంచుతున్నారు. ప్రత్యేకంగా పందిళ్లు వేయాల్సిన అవసరం లేకుండా ప్యానళ్ల కోసం ఏర్పాటు చేసే ఫ్రేమ్‌లకే ద్రాక్ష తీగలను పాకించవచ్చు. కీర, టొమాటో వంటి పంటలకు కూడా ప్రత్యేకంగా స్టేకింగ్ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఖర్చు తగ్గుతుందని సహ్యాద్రి ఫామ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మహేశ్ షెల్కె చెప్పారు.బెండ, సొర, కొత్తిమీర..రాజస్థాన్‌లోని జో«ద్పుర్లో కేంద్రీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధనా సంస్థలో, గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలోనూ 3 మీటర్ల ఎత్తున పెట్టిన సోలార్ ప్యానళ్ల నీడన బెండ, సొర, కొత్తిమీర, గోరుచిక్కుడు పండిస్తున్నారు. శీతాకాలంలో టొమాటోలు, కీరదోస, జుకిని, మిరప పంటలు పండిస్తున్నారు. మరో పద్ధతి ఏమిటంటే.. సోలార్ ప్యానళ్లను బల్లపరుపుగా కాకుండా, నిట్ట నిలువుగా ఏర్పాటు చేసి, వాటి మధ్యలో ధాన్యపు పంటలు పండించుకోవటం. మహారాష్ట్రలో ఇటువంటి వర్టికల్ బైఫేషియల్ సోలార్ అగ్రివొట్లాయిక్స్ ప్రాజెక్టును నెక్ట్స్2సన్, వాట్కార్ట్ సంస్థలు నెలకొల్పాయి. ఇలా 90% భూమిలో పంటలు పండించుకోవచ్చు. పది శాతం నేల మాత్రమే సోలార్ ప్యానళ్లకు సరిపోతుంది.ప్యానళ్ల కింద పశువుల పెంపకంమారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్తు దొరకదు. సోలార్ ప్యానళ్ల కింద పంటలు పండించుకుంటే, విద్యుత్తు సమస్య తీరుతుంది, పంటలపై కూడా ఆదాయం వస్తుంది. ఆ విధంగా రైతులకు అగ్రివోల్టాయిక్స్ ద్వారా అనేక ప్రయోజనాలు నెరవేరుతాయని మహేశ్ సంతృప్తిగా చెప్పారు. ఎలివేటెడ్ సోలార్ ప్యానళ్ల కింద పంటలనేæ పండించాలనేం లేదు, పశువులను కూడా పెంచుకోవచ్చు. ఢిల్లీ పరిసరాల్లో 2.5 ఎం.డబ్ల్యూ. సామర్థ్యం గల ఎలివేటెడ్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, అందులో పశువులను మేపితే మంచి ఆదాయం వచ్చిందని రుజువైందని ఆయన అన్నారు.రైతులకు రిస్క్ లేదుసన్సీడ్ ఎపివి సంస్థ అధిపతి వివేక్ సరఫ్ మాట్లాడుతూ ‘ఈ అగ్రివొల్టాయిక్స్ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి రిస్క్ లేదు. పెట్టుబడి మాది. పెట్టుబడి రిస్క్ మాకే ఉంటుంది. భూములు కౌలుకు ఇచ్చిన రైతులకు రిస్క్ ఏమీ లేదు. సాధారణ పంటలు సాగు చేస్తే రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 50 వేల వరకు వస్తాయి. అగ్రివొల్టాయిక్స్కు ఇస్తే ఆ పంట దిగుబడులతో పాటు కౌలు రూ. 50 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ వ్యవసాయ పనులు చేసే రైతులకు ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది’ అన్నారు. అయితే, విడిగా రైతులు దీర్ఘకాలిక కౌలుకు ఇవ్వాలంటే వెనుకాడతారు. రైతులు బృందంగా, ఎఫ్పిఓగా ఏర్పాడితే అప్పుడు ఆ సంకోచం ఉండదు అన్నారాయన. సౌరవిద్యుత్తు ఉత్పత్తితో పాటు పంటల సాగులో వున్న సమస్యలు మున్ముందు తీరిపోతాయి. రైతులకు ఏటా రెండు పంటలతో పాటు సౌర విద్యుత్తును మూడో పంటగా పండించుకోవటం సులభ సాధ్యమవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశిద్దాం. -
హిమాచలంలో ఉమెన్ పవర్
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్‌కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది. -
72 ఏళ్ల వయసులో... కిలిమంజారోపైకి
‘వయసు పరిమితులు’ అంటుంటాం. అయితే క్రమశిక్షణ, సంకల్పబలం ఆ పరిమితులను తొలగించి గెలుపుదారిని చూపుతాయి. అందుకు తాజా ఉదాహరణ విద్యాసింగ్.72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమన్‌గా చరిత్ర సృష్టించింది...విద్యాసింగ్ పారిశ్రామికవేత్త, దాత, అథ్లెట్‌గా ప్రసిద్ధురాలు. 2013 నుంచి ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా... 19 ట్రెక్కింగ్‌లను పూర్తి చేసింది. విజయనగరం రాజకుటుంబానికి చెందిన విద్యాసింగ్ మద్రాస్‌లో పెరిగింది. చర్చ్ పార్క్, స్టెల్లా మేరీస్ కాలేజి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకుంది. ఆమె తండ్రి గోల్ఫ్, టెన్నిస్ క్రీడాకారుడు. గుర్రపు స్వారీ చేసేవాడు. తల్లి అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి.పదమూడు సంవత్సరాల వయసు నుంచే తల్లితో కలిసి టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేది విద్యాసింగ్. ‘టోర్నమెంట్ గెలిచిన తల్లీకూతుళ్ల జట్టు’ అని పత్రికల పతాక శీర్షికలలో వచ్చేది. మద్రాస్ యూనివర్శిటీ మహిళల టెన్నిస్ జట్టుకు విద్యాసింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకుంది. ప్రతి వారాంతంలో తన బృందంతో కలిసి 50–60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తుంది. మారథాన్లలో పాల్గొనడం, గుర్రపు స్వారీ చేయడం ఆమెకు ఇష్టం. కిలిమంజారో ‘ట్రెక్కింగ్ శిఖరం’ అయినప్పటికీ తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి చెందిన ‘గెట్ అప్ అండ్ గో’ అనే ట్రెక్కింగ్ కంపెనీతో కలిసి ట్రెక్కింగ్ చేసింది. ఈ బృందంలో 10 మంది ట్రెక్కర్లు ఉన్నారు.ఆరో రోజు రాత్రి 10.30 గంటలకు పర్వతారోహణ ప్రారంభమైంది. గంటల తరబడి కఠినమైన పర్వతారోహణ తరువాత తెల్లావారేసరికి ఈ బృందం స్టెల్లా పాయింట్‌కు చేరుకుంది. ఆపై మరో 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి కిలిమంజారో ఉహురు శిఖరానికి చేరుకున్నారు. ‘రోజంతా ఆకాశంలో గడపడం అద్భుతంగా అనిపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని ఆరోజును గుర్తు చేసుకుంది విద్యాసింగ్. వయసు పరిమితిని అధిగమించి విద్యాసింగ్ అపూర్వ విజయాన్ని సాధించడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘గుడ్ జీన్స్’ ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం, క్రమం తప్పని వ్యాయామాలు. -
సజీవ కళ.. ఆదరణ లేక!
‘వాద్య వైఖరి కడు నెరవాది యనగా ఏకవీర మహాదేవి ఎదుట నిల్చి పరుశరాముని కథలెల్ల ఫ్రౌడి పాడె చారుతర కీర్తి భవనీల చక్రవర్తి’.. అని 13వ శతాబ్దం నాటి గ్రంథం ‘క్రీడాభిరామం’లో బైండ్ల కళ గొప్పతనం గురించి ఉంది. ‘‘శివుని చిన్న బిడ్డవమ్మ ఎల్లమ్మా.. నీవు శివులెల్లి మాతవమ్మ ఎల్లమ్మా.. పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ.. నీవు పుడమిపై బడ్డవమ్మా ఎల్లమ్మా.. నాగవన్నె చీరలమ్మ ఎల్లమ్మ.. నీకు నెమలికండ్ల రవికలమ్మ ఎల్లమ్మా.. రావె రావె ఎల్లమ్మా... నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మా..’’ తొర్రూరు: ఒంటి నిండా రంగు.. గంభీరమైన ఆకారంతో.. ఇలాంటి పాటలు పాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేసే కళాకారులే బైండ్ల కళాకారులు. జమిడిక తంత్రిని మునివేళ్లతో మీటుతూ రకరకాల శబ్దాలను పలికిస్తారు. ఒకప్పుడు రాజులకు వినోదాన్ని పంచిన ఈ కళ ప్రజలందరికీ చేరువలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చిన కళను కాపాడుతూ జీవం పోస్తున్నారు. నేడు జమిడిక నాదం మూగబోయే స్థితికి.. అలాంటి జమిడిక నాదం ప్రస్తుతం మూగబోయే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో డీజేల హోరు పెరగడంతో భవిష్యత్తులో బైండ్ల కళా ప్రదర్శన కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైండ్ల కళాకారులను భవానీలు అని కూడా పిలుస్తారు. వీళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరి పూజా విధానం కాస్త కష్టంగానే ఉన్నా.. ప్రజలను ఉర్రూతలూగిస్తుంది. గ్రామ దేవతలకు పూజలు చేస్తూ.. తెలుగు చరిత్రలో బైండ్ల కులస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళాకారులు మాదిగ కులస్తులకు పూజారులుగా, శక్తి ఆరాధకులుగా పేరొందారు. పూర్వం మాదిగ కులస్తులు (Madiga Community) జరుపుకొనే శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టడమే కాకుండా పెళ్లితంతు జరిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లిళ్లు, పండుగలు ఇతర కులాల వారితో చేయించడం వల్ల వారి ఉపాధి దెబ్బ తింది. ప్రస్తుతం వారు వంశానుక్రమంగా సంక్రమించిన గ్రామాలకు వెళ్లి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కథలు చెప్పి దేవతలను కొలిచే పూజారులుగా, కళాకారులుగానే మిగిలారు. ‘జమిడిక’ విన్యాసాలు బైండ్ల కళాకారులు ఉపయోగించే వాయిద్యాన్ని ‘జమిడిక’ అంటారు. దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు. జమిడికతో అనేక రకాల సంగీత ధ్వనులు పలికిస్తారు. పాట వరుసను అనుసరించి లయ మారుస్తుంటారు. కథకుడు కథాగానం చేస్తుంటే.. పక్కనున్న కళాకారులు వంత పాడుతూ జమిడిక వాయిస్తుంటారు. పల్లెల్లో ఎక్కువగా చేసుకునే రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ పండుగలప్పుడు పసుపు, కుంకుమలతో పట్నాలు వేసి దేవతలను కొలుస్తారు. దేవుళ్లకు బోనాలు సమర్పించిన రాత్రంతా గుడి దగ్గరే ఉంటారు. తెల్లవారుజాము వరకు ఆటపాటలతో దేవతల చరిత్ర చెబుతారు. పరశురాముడు, మాందాత, పోతరాజు, ఎల్లమ్మతో పాటు పలు రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు.నేడు ఉపాధి కరువై.. ప్రస్తుతం తెలంగాణలో కథాగానం చేసే బైండ్ల కళాకారులు (Baindla Artists) స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో పండుగలు జరిగినప్పుడే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఏటా కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే వీరికి ఉపాధి దొరుకుతోంది. మిగతా రోజులు కూలీ పనులు, వేరే వృత్తులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త తరం ఈ కళారూపాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కళాకారులు తమ వారసత్వ కళా సంస్కృతిని కొనసాగించాలనే పట్టుదలతో తమ పిల్లలను చదివిస్తూనే సందర్భాన్ని బట్టి వారికి కథలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభుత్వ చేయూత కోసం.. శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి దేవతల కథలు చెప్పే సంస్కృతి బైండ్ల కళాకారుల నుంచి అనాదిగా వస్తోంది. ఈ ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద బైండ్ల కళాకారులను చేర్చి అర్చకులుగా అవకాశమివ్వాలని వారు కోరుతున్నారు. దాంతో పాటు కళనే నమ్ముకుని వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారికి.. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు వర్తింపజేయాలని, కళాకారుల పింఛన్లు (Pensions) అందించాలని కోరుతున్నారు. భావితరాలకు ఈ కళను పరిచయం చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: పిలిచిన పలికేవు స్వామి! -
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆధునికయుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు. అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లామహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది. ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.I am shocked to see this happening in 2025.These kinds of people don't deserve to be parents!. pic.twitter.com/0kHYhbZHTf— Anushka Gupta (@Anushqq) April 27, 2025సోషల్ మీడియాలో డాక్టర్ భావోద్వేగ విజ్ఞప్తి21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు స్పందించారు. ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం! -
Rich Man's Disease: అరటి పండ్లు తిన్నారంటే ఇలా..!
ఇదేం వ్యాధి ఆ పేరేంటీ.. అనుకోకుండి. కేవలం ధనవంతులకే వచ్చే వ్యాధా..? అంటే..ఔననే అంటున్నారు నిపుణులు. ధనవంతులు, వారి జీవనశైలి, అలవాట్ల కారణంగా వస్తుంది కాబట్టి దీన్ని Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని అంటారు. ఇంతకీ ఏంటా వ్యాధి..? ఎలా నయమవుతుంది అంటే..బాగా డబ్బున్న వ్యక్తులు(Rich Man's )తీసుకునే మాంసం, పానీయాలు, ప్రత్యేక కూరగాయాలు తదితరాల కారణంగా వచ్చే వ్యాధి కావడంతో Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని పిలుస్తారు. ఆర్థరైటిస్ మరో రూపామైన గౌట్ వ్యాధిని ఇలా పిలుస్తారట. కీళ్లల్లో తరుచుగా బొటనవేలు దిగువన తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపులతో ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా సున్నితంగా ఉండి కొంచెం తాకిన నొప్పితో విలవిలలాడినట్లుగా ఉంటుంది. ఇది ఒకరమైన ఆర్థరైటిస్‌గా చెబుతుంటారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..గౌట్ శరీరంలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది కీళ్లలో సూది లాంటి స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్‌కు ఎలా కారణం అంటే..కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే రసాయనాలను విచ్ఛిన్నం కావడంతో యూరిక్ యాసిడ్ ఉత్ఫన్నమవుతుంది. అదీగాక శరీరం కూడా సహజంగా యూరిక్ యాసిడ్‌ను తయారు చేస్తుంది. ఫలితంగా శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం మొదలై గౌట్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు సాధారణంగా రక్తం నుంచి యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి, మూత్ర విసర్జన రూపంలో బయటకి పంపించేస్తుంది. అయితే శరీరం అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తే.. మూత్రపిండాలను దాన్ని బయటకు పంపించలేకపోతాయి. ఫలితంగా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లల్లో ఏర్పడతాయి. ఆ పదునైన స్ఫటికాలు కారణంగా నొప్పి, వాపు ఇతర సమస్యలు ఉత్ఫన్నమై గౌట్ వ్యాధి వస్తుంది. గౌట్ సంకేతాలు, లక్షణాలు..గౌట్ అటాక్స్ చాలా బాధాకరంగా ఉంటుందితీవ్రమైన, భరించలేని నొప్పిరంగు మారడం లేదా ఎరుపుదనంకీళ్ల దృఢత్వంవాపు తేలికపాటి స్పర్శకు కూడా తట్టుకోలేని సున్నితత్వంవెచ్చదనం, లేదా కీలు మండుతున్నట్లుగా అనిపించడంఏ ఆహారాలు గౌట్‌కు కారణం అంటే..ప్యూరిన్లతో నిండిన ఆహారాన్ని తినడం లేదా త్రాగడం వల్ల గౌట్‌కు దారితీసే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు.కార్న్ సిరప్ ఇది అన్ని ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లోనూ ఉంటుందిఆల్కహాలిక్ పానీయాలలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందిహెర్రింగ్, స్కాలోప్స్, మస్సెల్స్, కాడ్ ఫిష్, ట్యూనా, ట్రౌట్, హాడాక్ వంటి సముద్రపు చేపల్లోరెడ్మీట్నివారణ..ఆహారంలో మార్పులను సూచిస్తారు వైద్యులు. తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని అనుసరించడం ద్వారా సమస్య తగ్గుతుంది. నిపుణులు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను విసర్జించడానికి సహాయపడుతుంది. అలాగే, అరటిపండ్లు విటమిన్ సి పవర్‌హౌస్. ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ కూడా. అలాగే, అరటిపండ్లతో పాటు నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కివి స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్, పైనాపిల్స్ వంటి వాటిల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి గౌట్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి పూజా హెగ్డే (Pooja Hegde). వరుసగా సినిమాలతో టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూజా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది. తాజాగా అందమైన చీరలో, నుదిటిన, బొట్టు, మల్లెపూలు పెట్టుకొని దర్శనమిచ్చింది. 70 ఏళ్ల కాంజీవరం ( Kanjivaram ) చీర ధరించినఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.బుట్టబొమ్మగా పాపులర్ అయిన పూజా హెగ్డే సంప్రదాయ లుక్‌లో ఫొటో షూట్ చేసింది. పాతకాలపు బీరువా.. 70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అజ్జీ (అమ్మమ్మ) కంజీవరంలో రోజు గడుపుతున్న దృశ్యాలు, పెళ్లికి వెళ్ళే ముందు ఇంట్లో ఉండే మల్లెలతాజా వాసన, తొలి చినుకుల తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు... ఓహ్, చిన్న విషయాల్లో అందం’’ అనే కాప్షన్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. సాంప్రదాయ చీరలొ అద్భుతంగా కనిపించిన నటి, మ్యాచింగ్ బ్లౌజ్‌తో సంతోషంగా పోజులిచ్చింది. చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!ఇటీవల తన లేటెస్ట్ మూవీ రెట్రోకు సంబంధించి పూజా హెగ్డే రెండు నిమిషాల టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, "ఈ పాత్రలో నా హృదయంలో ఒక భాగం. భావోద్వేగాల హెచ్చు తగ్గులు 'రెట్రో' వచ్చేసింది" అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ మూవీలో నటి ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఆమె సూర్య మణికట్టుపై స్నేహితురాలిగా రక్ష సూత్రాన్ని కట్టింది. దీని తర్వాత, సూర్య టీజర్లో, "నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటాను, ఈ క్షణం నుండి నేను ప్రతిదీ వదిలివేస్తాను. నేను నవ్వడానికి,సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా జీవిత ఉద్దేశ్యం స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే." కాగా 'రెట్రో' ఈ సంవత్సరం మే 1న థియేటర్లలో విడుదల అవుతుంది. హెగ్డే 'రెట్రో' తో పాటు అనేక ఇతర ప్రత్యేక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పూజా 'దళపతి 69' 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' వంటి అనేక ఇతర ఉత్తేజకరమైన ప్రాజెక్టులను కలిగి ఉంది.చెన్నైలో 'దళపతి 69' షూటింగ్ ప్రారంభం గురించి చెబుతూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం! -
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
ఇటీవల ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్ చేసే సర్వీస్లకే పరిమితం కావడం లేదు. వాళ్లు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా..అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఉబర్ ఆటోలు, క్యాబ్లే నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కారుని సెట్ చేశాడు ఈ డ్రైవర్. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఒక మహిళ తన ఉబర్ రైడ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారు లోపలి విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్ బెడ్రూం ఫ్లాట్లా ఉంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెటప్ చేసి ఉన్నట్లు కనిపిస్తోంది. కూల్‌డ్రింక్స్,వాటర్ బాటిల్స్, చిప్స్ వంటి స్నాక్స్, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటిన్నంటి తోపాటు డస్ట్‌బిన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విశేషం అంటే..ఫీడ్‌బ్యాక్ డైరీ తోపాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ..ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ కూడా సీటుపై అతికించాడు. నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖధీర్ క్రియేటివిటీ అదుర్స్ అనే చెప్పాలి. నెటిజన్లను సైతం ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంది. ఆతిథ్య బ్రాండ్‌కి పేరుగాంచిన క్యాబ్ అని, ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరూ మాత్రం అకస్తాత్తుగా బ్రేక్ వేస్తే..వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ఆ సెటప్ గాయలపాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. Literally traveling in a 1bhk today. Hands down the coolest Uber ride ever! pic.twitter.com/O3cHSF30o2— Akaanksha Shenoy (@shennoying) April 25, 2025(చదవండి: ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..) -
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్‌షాప్
భారతీయులలో పక్షులను వీక్షించడం అనేది అభిరుచిగా అభివృద్ధి చెందుతోంది. అయితే, ఆ అనుభవాన్ని మరింత అందంగా ఆనందకరమైన అనుభవంగా మిగిల్చేందుకు ఎర్లీ బర్డ్ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎర్లీ బర్డ్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది.తద్వారా పక్షుల ప్రపంచంలోకి చిన్నారులు మరింత డీప్‌గా వెళ్లేందుకు ,ఇతర జీవరాశులను నిశితంగా గమనించే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎర్లీ బర్డ్ ప్రకటించింది. ఈ వర్క్‌షాప్‌ను ఆన్లైన్లో అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బర్డ్ లవర్స్ చేరాలని ఆశిస్తోంది.మే 11 నుండి జూన్ 8 వరకు జరిగే 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు ఎర్లీ బర్డ్ తెలిపింది. యంగ్ బర్డర్స్ వర్క్‌షాప్ 2021లో ఆన్లైన్ వర్క్‌షాప్‌గా ప్రారంభమైందనీ,అప్పటి నుండి ఈ ఫార్మాట్లో కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు, దాదాపు 200 మంది పిల్లలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్ 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ పక్షి పరిశీలకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 4 వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటుంది. ప్రతి వారం, పాల్గొనేవారు పక్షులకు సంబంధించిన విభిన్న ఇతివృత్తాలను అన్వేషిస్తారు. ఈ సెషన్లు పూర్తిగా ఆన్లైన్లో ఉంటాయి .మల్టీమీడియా, గైడెడ్ ఇంటరాక్షన్లు, ఉల్లాసమైన చర్చలు , కార్యకలాపాల మిళితంగా ఈ వర్క్‌షాప్ ఉండనుంది.పక్షుల గురించి లోతైన పరిశీలనలను సులభతరం చేయడానికి సంబంధించిన కథనాలు అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పచ్చని ప్రదేశాలను స్వతంత్రంగా అన్వేషించడంలో సహాయపడతాయి. ఇది వారి వేసవి సెలవుల్లో అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారపు ప్రత్యక్ష సెషన్లు వరుసగా వారాంతాల్లో ఆన్లైన్లో అందిస్తాయిరు. ప్రతి ఒక్కటి ఎంచుకున్న థీమ్ గురించి నేర్చుకున్న విషయాలను తిరిగి పొందడమే కాకుండా పాల్గొనేవారు స్వయంగా కొనసాగించగల కొత్త కార్యకలాపాలను కూడా పంచుకునే ఇలస్ట్రేటెడ్ యాక్టివిటీ షీట్‌తో ఉంటాయి.ఈ వర్క్‌షాప్ పాల్గొనేవారు ఎప్పుడూ గమనించిన, తమ ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజంగా తెలుసుకోవడానికి అనుమతిస్తుందని నిర్వహికులు తెలిపారు. వర్క్‌షాప్‌కు హాజరు కావడానికి ఉచితం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టిసిపెంట్స్, మెటీరియల్‌కు సంబంధించి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. https://bit.ly/ybw_2025 అనేలింక్ ద్వారా వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యావేత్తలు, తల్లిదండ్రులు , ప్రకృతి ఔత్సాహికులు ఎవరైనా వారి వారి ప్రాంతాలలోని పిల్లల కోసం ఇలాంటి వర్క్‌షాప్‌ను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారికి, తాము'యంగ్ బర్డర్స్ కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉచిత గైడ్ https://early-bird.in/ybw-guideను ఎర్లీ బర్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎర్లీ బర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎర్లీ బర్డ్ఎర్లీ బర్డ్ అనేది పిల్లలను పక్షులు , ప్రకృతికి దగ్గరగా తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)లో ఒక భాగం. -
ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..
ఇస్రో, నాసా కలిసి చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌ను కొన్ని వారాల్లో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. పైగా ఈ ఆక్సియం-4 మిషన్కి పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా వ్యవహరించనున్నారు. సరిగ్గా ఈ చారిత్రాత్మక మిషన్కి ముందు ఆక్సియమ్ స్పేస్ నాయకత్వంలో అనుహ్యంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అదికూడా మన భారత సంతతి వ్యక్తే నియమాకం కావడం విశేషం. అతనెవరు..? ఎలా ఈ అవకాశం వరించింది అంటే..!ఇస్రో నాసో చారితత్రాత్మక మిషన్ ముందు ప్రధాన నాయకత్వంలో మార్పులు చేసింది ఆక్సియమ్ స్పేస్. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ తేజ్‌పాల్ భాటియాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత నాలుగేళ్లుగా కంపెనీకి చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేసిన భాటియా మునుపటి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ కామ్ గఫారియన్ స్థానంలోకి రానున్నారు. ఇక గఫారియన్ ఆక్సియమ్ స్పేస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఆక్సియమ్ ఆక్స్-4 మిషన్‌లో భారతీయ వ్యోమగామిని ప్రారంభించటానికి ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. నిజానికి ఈ మిషన్‌ని భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణానికి కొత్త యుగంలోకి ప్రవేశించేలా చేసే గొప్ప సహకారంగా పేర్కొనవచ్చు. పైగా ఇది ఐఎస్ఎస్కి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్.భాటియా ఎవరంటే..2021లో గూగుల్ నుంచి ఆక్సియం స్పేస్‌లో చేరినప్పటి నుంచి భాటియా ఎన్నో మైలురాయి ఒప్పందాలు, మిషన్లకు మార్గదర్శకత్వం వహించారు. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య మానవ అంతరిక్ష విమాన మిషన్ల పరిశ్రమకి సంబంధించిన మొట్టమొదటి సార్వభౌమ ప్రభుత్వ కొనుగోళ్లకు నాయకత్వం వహించారు. అందులో ఆక్సియం మిషన్-4 సంచలనాత్మక ఆక్సియం మిషన్-1(Ax-1) కూడా ఉంది. ఆయన ఆర్టెమిస్ III చంద్ర మిషన్ కోసం తదుపరి తరం స్పేస్సూట్లపై ప్రాడాతో భాగస్వామ్యం, చంద్ర అన్వేషణ స్పేస్‌సూట్‌లలో హై-స్పీడ్ సెల్యులార్ కనెక్టివిటీని ఏకీకృతం చేసేందుకు నోకియాతో కలిసి అధిక-ప్రభావ క్రాస్-ఇండస్ట్రీ సహకారాలు తదితరాలను పర్యవేక్షించారు. అలాగే ఆక్సియం స్పేస్‌ని నెలకొల్పి మానవ అంతరిక్ష పరిశోధన కోసం ప్రముఖ ఆవిష్కర్తగానూ, వాణిజ్య సమగ్రకర్తగానూ ఉన్నారు. ఈ మేరకు భాటియా మాట్లాడుతూ.. చిన్పటి నుంచి అంతరిక్ష అన్వేషణ ద్వారా స్ఫూర్తి పొందాను. ఆ క్రమంలో ఈ ఆక్సియమ్ స్పేస్‌ను నడిపించగలిగానని, అదే తన జీవతాశయాంలోని కీలక మలుపు అని అన్నారు. తాము తదుపరి సాంకేతికతలలో స్పేస్సూట్లు, ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైక్రోగ్రావిటీ పరిశోధన, తదితరాలలో పెట్టుబడులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంతరిక్షంలో మానవాళి భవిష్యత్తును నిర్మించడంలో సహాయం చేసేందుకు మరింతమంది చురుకైన సాంకేతిక నిపుణులు, దూరదృష్టిగల ఇంజనీర్లు, వ్యవస్థాపకులు కావాలని అన్నారు. ఇక భాటియా దీనిలో ఫార్చ్యూన్ 100 ఎగ్జిక్యూటివ్‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, స్టార్టప్ వ్యవస్థాపకులను నిమగ్నం చేశాడు. పైగా రూ. 400 కోట్లకు పైగా అమ్మకాలకు మద్దతిచ్చాడు. అలాగే ఆక్సియం ఆలోచనలను వాస్తవ రూపంలోకి మార్చడంలో భాటియా అత్యంత కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు మాజీ సీఈవో కామ్ గఫారియన్. (చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్‌నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్‌కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్‌పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్‌సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్‌బాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్‌ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్‌బాల్ వేదిక: సనత్‌నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్‌కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
షారుఖ్ ఖాన్ న్యూ జెన్ జెడ్ లుక్ అదిరిపోయిందిగా..
ఫ్యాషన్‌కి స్టైల్‌కి పెట్టింది పేరు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). డైలాగ్ చెప్పినా, స్టెప్ వేసినా, బట్ట కట్టినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూల్ న్యూ జెన్ జెడ్(Gen-z) లుక్‌లో అదిరిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.సూపర్ స్టార్ ఇటీవల ముంబైలో అడుగుపెట్టినపుడు తన క్యాజువల్ వేర్లో వావ్ అనిపించాడు. ఎయిర్పోర్ట్ స్టైల్లో తెల్లటి టీ-షర్ట్, నీలిరంగు హూడీ జాకెట్, కార్గో ప్యాంటుకి జతగా కూల్ యాక్సెసరీస్ ధరించాడు. ఎప్పటిలాగానే మోచేతులపైకి స్లీవ్లను మడిచి, జెన్-జెడ్ స్టేపుల్స్ ధరించి అదరహో అనిపించాడు. ఫ్యాషన్‌కు వయస్సు లేదని ఒకసారి నిరూపించాడు. ప్రస్తుతం Gen-Z ఫాలో అవుతున్న బ్లూ కార్గో ప్యాంట్ ధరించి తగ్గేదే లే అన్నట్టు కనిపించాడు. యాక్సెసరీల విషయానికి వస్తే, బ్లాక్ సన్ గ్లాసెస్, క్రాస్బాడీ బ్యాగ్, వాచ్ , క్రిస్పీ వైట్ స్నీకర్లతో లుక్‌ను ఎలివేట్ చేశాడు. మెడలో సిల్వర్ చెయిన్‌తో మరింత కూల్‌గా ప్రతి అంగుళం సూపర్‌స్టార్‌గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కింగ్ ఖాన్ ఫ్యాషన్‌కి, స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాలో షేర్ అయిన షారూఖ్ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కింగ్ తో పాటు, అమర్ కౌశిక్‌తో కలిసి నటించిన అడ్వెంచర్ చిత్రం టైగర్ vs పఠాన్ ,రాజ్ & డికె లాంటి ప్రాజెక్టులు షారూఖ్ చేతిలో ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో బాలీవుడ్లో తిరుగులేని హీరోగాఎదిగాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా అతని కరియర్లో బాజిగర్ ఒక మైలురాయి. ఈ సినిమాకు సండంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ షారుఖ్కాదట. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇద్దరూ ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత మాత్రమే ఈ అవకాశం ఎస్ఆర్కేకి దక్కిందట. ఈ విషయాన్ని స్క్రీన్ రైటర్ రాబిన్ భట్ ఇటీవల వెల్లడించాడు.ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘మినీ స్విట్జర్లాండ్’ లాంటి పహల్గామ్లో ఏప్రిల్ 22న 26 మందిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తరువాత కేంద్రం చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. ముఖ్యంగా అట్టారి-వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తానీల వీసాల రద్దుతో సహా అనేక ఆంక్షలను భారత ప్రభుత్వం విధించింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు దేశాన్ని వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, విచారణకు ఆదేశించవచ్చు ,మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC) వీసాలు కలిగి ఉన్నవారు భారతదేశం విడిచి వెళ్లడానికి చివరి తేదీ ఏప్రిల్ 26. వైద్య వీసాలు కలిగి ఉన్నవారికి, చివరి తేదీ ఏప్రిల్ 29.ఆదివారం నాటికి భారతదేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలు- వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు. ఏప్రిల్ 27 నాటికి భారతదేశం నుండి వెళ్లిపోవాల్సిన 12 రకాల వీసాదారులు : వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు.పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన క్యాబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశంలో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వంనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కాగా తాజా ఆంక్షల నేపథ్యంలో అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా 272 మంది పాకిస్తానీ జాతీయులు భారతదేశం నుండి బయలుదేరారు .మరికొన్ని వందల మంది ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు పొరుగు దేశానికి చెందిన 12 కేటగిరీల స్వల్పకాలిక వీసాదారుల గడువు ముగిసే సమయానికి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రారంభంలో పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. ఆ తరువాత ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. -
చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..!
వేసవి కాలం వచ్చిందంటే చిటారు కొమ్మన కొంచెం పచ్చగా, కొంచెం ఎర్రగా మెరుస్తూ ఊరిస్తూ ఉంటుంది. వగరుగా, వగరుగా, నోటికి పుల్లగా, వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా దీన్ని కాస్త దట్టించామంటే అద్భుతమైన టేస్ట్.. ఆహా ఏమి రుచి అంటూ లొట్ట లేసుకుంటూ తినేయాల్సిందే. ఇంతకీ ఏమిటది. అదేనండీ...తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయే చింత చిగురు. అందుకే చింత చిగురు ఉంటే.. ఆరోగ్యంపై చింత అవసరం లేదు అంటారు పెద్దలు. మరి చింతచిగురుతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేసవి కాలం వచ్చిందంటే.. దీనికి చాలా డిమాండ్ ఎక్కువ. చాలాసార్లు మటన్ ధరతో పోటీ పడుతూ అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా నిలుస్తుంది. చింత చిగురు, రుచి, లభించేపలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. సాధారణంగాచింత చిగురును పప్పుగా, కూరగా , పచ్చడి రూపంలో ఎక్కువగా ఆరగిస్తారు. కానీ చింత చిగురు, రొయ్యలు, చేపల కాంబినేషనే రుచే వేరు. చిగురుతో చేప, రొయ్య, కోడి కూర చింతచిరుగు దట్టిస్తే ఆహార ప్రియులకు పండగే.పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు వేసవికాలంలో చింత చిగురు తినడం చెమటకూడా ఎక్కువ పట్టదట. వేసవిలో వేధించే చెమట పొక్కులనుంచి ఉపశమనం లభిస్తుంది. చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందిమలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తల్లిపాలను మెరుగుపరుస్తుంది. -
'గ్రాండ్‌మాకోర్' అంటే..? యువత ఇష్టపడుతున్న ట్రెండ్..
ఈకాలం యువత ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్ జెడ్ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్‌కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్‌లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్‌మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్ అంటే..గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జెన్ జెడ్ మిలీనియల్స్ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు. గ్రాండ్‌మాకోర్ అంటే..'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్ యుగంలో ఏ కోడింగ్, కంటెంట్ రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్‌సెట్ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ ట్రెండ్‌కి సంబంధించి.. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో గ్రాండ్‌మాకోర్ హ్యాష్‌ట్యాగ్‌లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా. నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్‌ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.ఈ గ్రాండ్‌మాకోర్ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ట్రెండ్ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్..! అడ్వెంచర్కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు) -
తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!
వేగం..వేగం..అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్క బెట్టుకోవడం వరకు ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు. ఆహారాన్ని త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల వల్ల అనేక రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాంఅన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా, బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును నిజమే. ఎందుకంటే గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.త్వరగా తినడం వల్ల తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు, గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం.అంతేకాదు ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. చివరగా .. కూటికోసంమే కోటి విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి. -
కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది. -
ఓపెన్ జిమ్: కసరత్తు.. ఆరోగ్యం మా సొత్తు!
జీవనశైలి మారింది. మారుతున్న కాలంతో పాటు జీవనంలో వేగం పెరిగింది. దీంతో అలసట, ఒత్తిడి అధికమైంది. ఆహార పానీయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. వాటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరైంది. అందుకు ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అక్కన్నపేట(హుస్నాబాద్): జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా గ్రామాల్లోనే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో దాదాపు అన్ని గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను నిర్మించారు. వాటి నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు కేటాయించారు. మండలంలో 31 గ్రామాలు ఉండగా ఇటీవల మరో ఆరు గ్రామాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మొత్తం 37 గ్రామాలు ఉన్నాయి. అందులో సగానికిపైగా గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జిమ్‌లను ఉదయం, సాయంత్రం వినియోగించుకొంటున్నామని, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకొన్న మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు చెప్పారు. కొత్త అనుభూతి బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో కసరత్తు చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్తోమతలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో ఫిట్నెస్తో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకొంటున్నారు. -
పిలిచిన పలికేవు స్వామి!
స్వామివారి దర్శనం చేసుకుందామని బెంగుళూరుకు చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిరుపతి బయలుదేరాడు. నేరుగా అలిపిరి చేరుకున్నాడు. తల పైకెత్తి శేషాచలం కొండలవైపు చూశాడు. గుండెల్లో దడ మొదలయ్యింది. ‘నేను 3550 మెట్లు ఎక్కగలనా?’ అన్న అనుమానం పట్టుకుంది. ‘ముచ్చట గా మూడు మైళ్లు కూడా నడవలేనే, ఈ పన్నెండు కిలోమీటర్ల దూరం నడవటం నా వల్ల అయ్యే పనేనా’ అని దిక్కులు చూడసాగాడు. అక్కడే ఇద్దరు యువతులు ప్రతి మెట్టుకూ పసుపు కుంకుమలు పెట్టి కర్పూరం వెలిగిస్తూ ఉన్నారు.‘‘మీరు చాలాసార్లు కాలినడకన కొండ ఎక్కినట్లు ఉన్నారు. నేను నడవగలనా?’’అని వారిని అడిగాడు. ‘‘కొంచెం కష్టపడాలి. అక్కడక్కడ కూర్చుని వెళ్ళండి’’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. అయినా అతడికి ధైర్యం రాలేదు. ఎప్పుడో వచ్చిన మోకాళ్ళ నొప్పులు గుర్తుకు తెచ్చుకుని కాలినడక విరమించుకున్నాడు. బస్సుకెళ్దామని నిర్ణయించుకుని పక్కకి తిరిగాడు.అప్పుడే ఓ పండు వృద్ధురాలు కట్టె చేతపెట్టుకుని, నెత్తిన సంచి ఉంచుకొని కొండ ఎక్కడానికి వచ్చింది.ఆ యువ ఇంజినీరు ఆశ్చర్యంగా ‘‘ఇన్ని మెట్లు నువ్వు ఎక్కగలవా అవ్వా?’’ అని అడిగాడు. ఆమె బోసినోటితో ‘‘ఎక్కించే వాడు పైన ఉన్నాడు నాయనా, నన్ను ఎలాగోలా ఎక్కిస్తాడులే’’ అని సమాధానమిచ్చింది.‘‘ఆయన ఎలా ఎక్కిస్తాడు? నువ్వుకదా కొండ ఎక్కాల్సింది!’’ అన్నాడు.‘‘నడవాలని అనుకోవడమే నా వంతు నాయనా. మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకవిధంగా తోడుగా వచ్చి నన్ను కొండ చేరుస్తాడు’’ అని మెట్లు ఎక్కసాగింది. ‘ఈ పెద్దామే ఎక్కుతోందే... మనం ఎందుకు ఎక్కలేము?’ అని మనసులో అనుకున్నాడు. చిన్నగా ఆ అవ్వతో కలిసి నడవటం ప్రారంభించాడు. అక్కడక్కడా నిలుస్తూ అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇద్దరూ కొండపైకి చేరారు.చివరి మెట్టు మీద నిలబడుకొని ఆ యువకుడు ‘‘అవ్వా... మీ దేవుడు వచ్చి నిన్ను కొండ ఎక్కిస్తాడని చెప్పావే... ఎక్కడా కనిపించడేమి?’’ అని కొంచెం వెటకారంగా అడిగాడు. ఆ ముసలామె నవ్వుతూ ‘‘నువ్వు ఎవరనుకున్నావు నాయనా... దేవుడు తోడు చేసి పంపితే వచ్చినవాడివి కదా’’ అని చెప్పి హుషారుగా వైకుంఠం వైపు నడవసాగింది. ‘ఆ’ అని నోరు తెరవడం ఆ యువకుడి వంతు అయ్యింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: -
సాహసం చేద్దాం బ్రదర్..! ఈ సమ్మర్లో చూడాల్సిన బెస్ట్ అడ్వెంచర్ స్పాట్స్..
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం. గుహల అన్వేషణ.. హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు. డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్.. ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్‌పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్‌ని అందిస్తాయి. జిప్ లైనింగ్.. నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్లో జిప్ లైనింగ్ ట్రిప్‌లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు. రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్.. ఓ వీకెండ్‌ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాక్ క్లైంబింగ్.. తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్‌కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో ఉంది.బంగీ జంపింగ్.. ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్‌కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు. (చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..) -
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్..! ఏమేమి దర్శించొచ్చంటే..
ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.అన్నింటినీ ఓకే ట్రిప్‌లో చుట్టేయవచ్చు. ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్‌బావి బీచ్‌లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్లో బోనస్.మొదటి రోజుఈ రైలు హైదరాబాద్‌లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్‌పేట, సేలం జంక్షన్, ఈ రోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్గోడ్ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట. ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.రెండోరోజుఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి. ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పాలి. స్టాల్స్‌లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్ ఉంటే సెయింట్ మేరీ ఐలాండ్‌కు వెళ్లిరావచ్చు. ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.మూడోరోజుశృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణంశృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్ గది చెక్ అవుట్ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.నాల్గోరోజునేత్రానందం మంజునాథాలయంధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లున్నాయి. పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్ కార్ మ్యూజియాన్ని కూడా విజిట్ చేయవచ్చు. పరశురాముడి క్షేత్రంకుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.ఐదోరోజుమంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్లో సేదదీరే ప్రదేశం తన్నేర్‌బావి బీచ్. ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్ గుర్తింపు పొందిన బీచ్. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు. ఆరవ రోజురాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు.ప్యాకేజ్ ఇలా...ప్యాకేజ్‌లో బస త్రీ స్టార్ హోటల్లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. భోజనాలు, ట్రైన్లో కొనుక్కునే తినుబండారాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్ – హార్స్ రైడింగ్ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.సింగిల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.డివైన్ కర్నాటక (ఎస్హెచ్ఆర్086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్ ప్యాకేజ్. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్ అవుతాయి.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిది (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..) -
అనుభవాలే పాఠాలుగా...
జీవితంలో పైకి రావాలనుకున్న వారెవరికైనా ముందుగా తాము చేస్తున్న పని పట్ల, తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తమపట్ల తమకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అన్న నమ్మకం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. కావల్సినంత బలాన్నిస్తుంది. అందువల్ల జీవితంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా మనలో ఉన్న మన ఆత్మవిశ్వాసమే మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న విషయాన్ని గుర్తించాలి.తమ లక్ష్యాలను సాధించి జీవితంలో విజయ బావుటా ఎగురవేసిన వారిని మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తుంటాం. వింటూ ఉంటాం. అయితే వారివారి విజయ గాధలలో ఆయా వ్యక్తుల సాఫల్యాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ఆ విజయం వెనుక సదరు వ్యక్తులు పడిన తపన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాల గురించి మనం పట్టించుకోం. నిజానికి ప్రతి విజయ గాధ వెనుక ఎన్నో అపజయాలు, మరెన్నో అవరోధాలు ఉంటాయని తెలుసుకోలేం. నేడు సమాజంలో ఉన్నత స్థితికి వచ్చిన ఏ వ్యక్తినైనా తీసుకోండి. వారి విజయం వెనుక వారెన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో తేటతెల్లమవుతుంది. ఎన్నో అపజయాలు, ఓటములు అనుభవించిన తరువాత గానీ, ఆయా వ్యక్తులకు విజయం సిద్ధించలేదన్న విషయం బోధపడుతుంది. జీవితంలో ఎవ్వరైనా తాము అనుభవిస్తున్న, అనుభవించిన అవమానాలు, అపజయాలు, ఓటముల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి. ఆయా పాఠాలు నేర్పిన గుణపాఠాలను ఆత్మవిశ్వాసం ద్వారా అధిగమించాలి. తమమీద తాము విశ్వాసాన్ని పెంచుకుని అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్న వారే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధించగలరు. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆశావహుల ఆభరణమని తెలుసుకోవాలి. మనం చిన్నపుడు తాబేలు, కుందేలు కథ విని ఉంటాం. నిదానంగా, నెమ్మదిగా పరుగెత్తే తాబేలు, అత్యంత వేగంగా పరుగెత్తే కుందేలుతో పరుగెత్తి విజయం సాధించిందని ఆ కథ సారాంశం. మరి ఈ కథలో తాబేలుకు విజయం వరించడానికి ప్రధానమైన కారణమే ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే వేగంగా కదలలేని తాబేలు, వేగంగా పరుగెత్తే కుందేలు తో పందెం కడుతుంది. ఎంత ఆత్మవిశ్వాసముంటే తాబేలు కుందేలుతో పోటీపడి గెలుస్తుంది. ఎంత అతి విశ్వాసముంటే, పోటీలో గెలిచే సామర్ధ్యమున్నా, కుందేలు విజయానికి దూరంగా ఉందన్న విషయం అవగతమవుతోంది. ఈ కథ ద్వారా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే, మన లక్ష్యాలను గమ్యాలను దూరం చేసే అతి విశ్వాసం పనికిరాదని తేటతెల్లమవుతుంది.ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుదు అబ్రహాం లింకన్ జీవిత గాథ మనకు అవగతం చేస్తుంది. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి విజేతగా నిలిచిన గొప్ప వ్యాపారవేత్త కల్నల్ సాండర్స్. కనుక జీవితంలో విజేతగా నిలవాలనుకున్న ప్రతిఒక్కరూ కష్టాలకు నెరవకుండా, అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకి వెళితే విజయం తప్పక వరిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్ ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు. -
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ప్రతి ఒక్కరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో అది సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచనలకే పరిమితం అవుతాయి. జీవితానుభవం వేరేలా ఉంటుంది. అందుకే మనసుకి - ఆలోచనలకి అస్సలు పొత్తు కుదరదు. మీకు తెలుసా..? మన ప్రవర్తన, ఇతరులతో సంభాషించే విధానం, మన మాటలు, మన హావభావాలు ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయట. అవును.. వీటిని బట్టి ఎదురి వారి మనసును ఇట్టే చదివేయొచ్చు. అలాగే శరీర ఆకారాలు, కళ్ళ రంగు, జుట్టు పొడవు.. ఇలా ఒక్కటేమిటి నఖశిఖ పర్యాంతం వరకు మన వ్యక్తిత్వం ఇట్టే చెప్పేస్తాయ్..అలాగే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా కూడా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించొచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అందులో మీరు మొదట ఏం చూస్తారనే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పొచ్చు. అంతేనా.. ఈ ఫొటోలో మొదట మీరు ఏం చూస్తారో దానిని బట్టి.. మీరు ఇంట్రావర్ట్ లేదా ఎక్స్ట్రావర్ట్ అనే విషయం కూడా తేలిపోతుంది. ఇంతకీ ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అంటే ఏమిటో అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం..! పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా, ఇబ్బందిగా ఫీల్ అవడాన్నే ఇంట్రావర్ట్ అంటారు. అదే ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవారు ఎక్స్ట్రావర్ట్స్. ఇదీ తేడా. సరే ఈ కింది ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీరు ఫస్ట్ ఏం చూశారో నిజాయితీగా చెప్పేయాలి మరీ.. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు, చెట్టు, చెట్టు వేర్లు ఏది ఫస్ట్ చూశారు? ఒక వేళ మీరు చూసింది చెట్టు అయితే.. మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రావర్ట్. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇట్టే చక్కబెట్టేస్తారు. అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ ఇలాంటి వారు ఎక్స్ట్రావర్ట్ అయినప్పటికీ వీరి మనసును చదవడం మాత్రం అంతసులువుకాదు. చాలా టఫ్.అదే ఈ చిత్రంలో మొదట వేర్లు చూసినట్లైతే.. మీరు ఇంట్రావర్ట్. చాలా సౌమ్యంగా, చిన్న విషయానికే హడలేత్తిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరిలో దృఢ సంకల్పం, మొండి పట్టుదల దండిగా ఉంటుంది. వీరి సంకోచ స్వభావం వల్ల తొలుత వీరిని అందరూ పక్కనపెట్టినా.. వీరి సామర్ధ్యాన్ని అర్ధం చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు.పై రెండూకాకుండా ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు చూసినట్లైతే.. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి అని అర్థం. ప్రకృతి సౌందర్యాన్ని, సరళతను ఆస్వాదించే ప్రశాంతమైన, స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇలాంటి వారు ఎదుటి వారి డ్రామాలను అస్సలు సహించలేరు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సమతుల్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. స్ట్రెస్‌కి అంత సులువుగా ప్రభావితం కాలేరు. భావోద్వేగ స్థిరత్వం కలిగి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు.మన చుట్టూ ఉండేవారిలో ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్లేకాదు యాంబీవర్ట్ కూడా ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. ముందు రెండింటిలోని లక్షణాలన్నీ కలగలిపి బాగా ఒంట పట్టించుకున్న వారే యాంబీవర్ట్ వ్యక్తులు. అంటే అంతర్ముఖుడిలా మూతి ముడుచుకొని ఉన్నా.. సమయం వచ్చినప్పుడు బహిర్ముఖుడిలా చెలరేగిపోవడమే యాంబీవర్ట్స్ స్టైల్..!(చదవండి: వాట్ ఏ డేరింగ్..! చెట్టుపైన డ్యాన్స్ అదుర్స్..! కానీ..) -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్‌లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్‌పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
ఈ ఆదివారం పసందైన స్నాక్స్ ట్రై చేయండిలా..!
బనానా– మీల్మేకర్ పకోడాకావలసినవి: అరటికాయ– 1 (తొక్క తీసి, ఉడికించి, చల్లారాక గుజ్జులా చేసుకోవాలి) మీల్మేకర్– 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుము కోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి– అరకప్పు చొప్పున, శనగపిండి, ఉల్లిపాయ తరుగు– పావుకప్పు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు– 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం– 1 టీ స్పూన్ చొప్పున, పసుపు– చిటికెడు, నిమ్మరసం– 2 టీ స్పూన్లు, నీళ్లు, నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, అరటికాయ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తురుము అన్ని వేసుకుని సరిపడా నీళ్లుతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలచగా కలుపుకుని, అందులో కొద్ది కొద్దిగా అరటికాయ మిశ్రమాన్ని ముంచి, శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి, కాగుతున్న నూనెలో పకోడాలు వేసుకోవాలి. దోరగా వేగాక, వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.గుజరాతీ ఖండ్వీ..కావలసినవి: శనగపిండి, పెరుగు– ఒక కప్పు చొప్పున, పసుపు– పావు టీ స్పూన్, ఉప్పు– తగినంత, నీళ్లు– సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, నూనె– 2 టేబుల్ స్పూన్లుఆవాలు, నువ్వులు– ఒక టీ స్పూన్ చొప్పున కరివేపాకు– కొద్దిగా, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము– గార్నిష్ కోసంతయారీ: ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఉండలు లేకుండా సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కళాయిలోకి వడకట్టి తీసుకుని చిన్న మంట మీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడు నాలుగు ప్లేట్లు తీసుకుని వెనుక భాగంలో నూనె రాసి, వాటి మీద ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పలుచగా పూయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని, గుండ్రగా చుట్టుకోవాలి. అనంతరం ఆవాలు, నువ్వులు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివన్నీ నూనెలో తాళింపు వేసుకుని, పచ్చి కొబ్బరి తురుముతో కలిసి.. గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.కొరియన్ యాక్గ్వా స్వీట్కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు (జల్లెడ పట్టుకోవాలి), తేనె, నువ్వుల నూనె– ఒక కప్పు చొప్పున, సోజు లేదా వోడ్కా– ఒక టేబుల్ స్పూన్ (కుకీలను మరింత మెత్తగా ఉండటానికి కొరియన్స్∙వాడతారు), అల్లం పొడి – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, తేనె, నీళ్లు– ఒక కప్పుపైనే, నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్, నట్స్ లేదా నువ్వులు– కొన్ని (నేతిలో వేయించాలి, గార్నిష్ కోసం)తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, నువ్వుల నూనె, ఒక టీ స్పూన్ తేనె, సోజు లేదా వోడ్కా, అల్లం పొడి వేసుకుని, ఉండలు కాకుండా బాగా కలుపుకోవాలి. అనంతరం సరిపడా నీళ్ల పోసి చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ ముద్దను అర అంగుళం మందంతో చపాతీలా ఒత్తుకుని, నచ్చిన మోడల్ కుకీ కట్టర్ సాయంతో కట్ చేసుకుని, వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో తేనె, నీళ్లు పోసుకుని చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం వేయించిన కుకీస్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే ఈ తేనె సిరప్‌లో వేసుకుని నానబెట్టుకోవాలి. అనంతరం ప్లేట్లో పెట్టుకుని నట్స్ లేదా నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..? ఆఫీస్ వర్క్ చేయొచ్చా..?) -
క్షణాల్లో మేకప్ వేసుకోవచ్చు..!
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్‌లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్‌తో మేకప్ లిక్విడ్స్‌ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.ఈ మెషిన్‌తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్‌తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్‌ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్‌బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెప్పల సోయగంఅందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్‌ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి. ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్‌గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్‌గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్‌ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!) -
పక్షులను చల్లగా కాపాడుకుందాం!
వేసవి కాలం పక్షులకు కష్టకాలం. అధిక వేడి పక్షులకు ప్రమాదకరంగా మారుతుంది. డీౖహెడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా పక్షులను రక్షించడానికి... నీరు, నీడ, గాలి ప్రసరణకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కొన్ని జాగ్రత్తలు...పక్షులకు అన్నివేళలా శుభ్రమైన మంచినీరు అందుబాటులో పెట్టాలి ∙ వేర్వేరు ప్రదేశాలలో వాటర్ బౌల్స్ పెట్టాలి ∙ చల్లగా, ఫ్రెష్‌గా ఉండడానికి వాటర్ బౌల్స్‌లో ఐస్ క్యూబ్స్ వేయవచ్చు చల్లని, సౌకర్యవంతమైన స్థలంలో పక్షులు ఉండేలా చూడాలి అవసరమైతే కూలింగ్ మ్యాట్స్ ఉపయోగించవచ్చు పక్షులపై ఒక నిమిషం లేదా అర నిమిషం నీటిని స్ప్రే చేయాలి పక్షులకు సమీపంలో తడి టవల్స్ ఏర్పాటు చేయాలి వేగంగా శ్వాస తీసుకోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం, బద్దకంగా కనిపించడం, తినడానికి ఆసక్తి చూపించకపోవడం...మొదలైనవి పక్షులకు సంబంధించి ఓవర్ హీటింగ్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!)ఆహారం విషయానికి వస్తే.... నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయలాంటివి అందించవచ్చు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో వందలాది గ్రామాల్లో యానిమల్ యాక్టివిస్ట్‌లు వేసవి వేడి నుంచి పక్షులను కాపాడానికి ‘బర్డ్ రెస్టారెంట్స్’ ఏర్పాటు చేశారు. పక్షులకు చల్లని నీడను ఇచ్చేలా నీరు, ఆహార పదార్థాలతో చెట్టు కొమ్మలపై ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: మూగజీవాల పట్ల ఆదరణ చూపండి) -
మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..
విషయమేదైనా ఆకట్టుకనే ప్రచారం ఆతని సొంతం హాస్యం, చతురోక్తులతో ఆకట్టుకునే స్వరం యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్ మైక్‌సెట్ బిగించడంతో ప్రారంభమై నో డేట్స్ ప్లీజ్ అనే స్థాయికి ఎదిగిన నూకరాజుపుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వ్యక్తపరచినపుడే ఆ కళకు సార్థకత. ఇదిగో ఈ పిఠాపురానికి చెందిన నూకరాజు ప్రావీణ్యం అలాంటిదే. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మైక్సెట్లు బిగించడంతో ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు నో డేట్స్ ప్లీజ్ అనే వరకు వెళ్లిందంటే అతనిలోని ప్రతిభను ఏ మేరకు సానబట్టారో. అతని గొంతు వినపడిందంటే చాలు ఏదో ముఖ్యమైన సమాచారమేనని ఇళ్లలో ఏ మూలనున్నా ఓ చెవు అతడు చెప్పే మాటపై వేస్తున్నారంటే ఆ మాటకున్న విలువ అంతటిదని చెప్పడం అతిశయోక్తి కాదు. మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రారంభించే నూకరాజు ధాన్యం కొనుగోళ్లు.. జాతరల కార్యక్రమ వివరాలు.. రాజకీయ సభల వివరాలు, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి పాంప్లేట్లలోని సమాచారం.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రతి మనిషికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తుంటాడు. కరోనా కష్టకాలంలో అయితే అతని సేవలు అంతా ఇంతా కాదు.. ఆరోగ్య భద్రతపై అతను చేసిన ప్రచారం స్థానికంగా ఎంతో మేలు చేసింది. చిన్న సైకిల్‌పై మైక్ సరంజామా అంతా కట్టుకుని అతను చేసే ప్రచారం పేరున్న యాడ్ ఏజెన్సీలు సైతం చేయలేవంటారు స్థానికులు. కారణం లేకపోలేదు. అతని స్టైలే అతని ప్రచారానికి ప్రధాన ఆకర్షణ. కేవలం పాంప్లేట్ లేదా పోస్టర్లో ఉన్న అంశాన్ని చెప్తూ వెళ్లిపోతుంటే ఇంతలా చెప్పుకోవడం ఎందుకూ.. అక్కడే ఉంషమ్మత్తు అంతా.. అతని మాటలో మహత్తు అది. హాస్యం, చతురత, విషయానుకూలంగా హాస్యోక్తులు జోడించి చెప్పడం అతని ప్రత్యేకత. మరి 50 ఏళ్ల ప్రస్థానమది. ఊరికే వస్తుందా ఆ పరిణితి. మైక్ అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయేంతగా. మైక్‌తో అనుబంధం నిరుపేద కుటుంబంలో పుట్టిన మొల్లేటి నూకరాజు మండలంలోని విరవ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి మైక్ సెట్లు అంటే ఇష్టం. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 20 ఏళ్ల వయసులో మైక్సెట్లు బిగించే పనిలో చేరాడు. అన్ని రకాల శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వెళ్లి మైక్ సెట్లు వేసే వాడు. ఆ క్రమంలోనే సరదాగా మైక్‌లో చతురోక్తులు వేస్తూ అందరిని అలరించేవాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సభలు, సమావేశాల్లో ఆయనతో ముందుగా మాట్లాడించేవారు. ఇలా మైక్ ఎనౌన్సర్‌గా మంచి పేరు సంపాదించాడు. ఏదైనా విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగించే దండోరాలకు బదులు మైక్ సెట్లు వినియోగం వచ్చాక రిక్షాలో మైక్ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వచ్చినా నూకరాజుకు మాత్రం ఆ సైకిలే ప్రచార వాహనం.నా జీవితం మైక్‌కే అంకితం మైక్ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అది లేని రోజంటూ లేదు. రోజంతా ఊరంతా తిరిగి ప్రచారం చేసి ఇంటికి వచ్చాక కూడా దానిని మరుసటి రోజుకు సిద్ధం చేయడం తప్ప వేరే పని తెలీదు నాకు. మైక్‌లో ప్రచారం చేసే వాయిస్ కూడా నేనే చెబుతాను. ఐదో తరగతి మాత్రమే చదివినా చదవడం రాయడం బాగానే వచ్చు. విషయం చెబితే దానికి తగ్గట్టుగా వాయిస్ రికార్డు చేసి ప్రచారం చేస్తుంటాను. గతంలో మైక్‌లో మాట్లాడుతూ ప్రచారం చేసే వాడిని. ఇప్పటికీ సైకిల్ తొక్కగలుగుతున్నానంటే ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం అభిమానం మాత్రమే. ఇదే పనితో కుటుంబాన్ని పోషించుకుంటు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నాజీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. – మైక్ నూకరాజు, విరవ, పిఠాపురం మండలం గిరాకీ అంతా ఇంతా కాదు మైక్ ప్రచారాల కోసం ప్రయత్నించే వారు ఆయన కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కార్యక్రమానికి అతని ప్రచారం కావాలంటే నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవలసిన స్థాయి అతనిది. 74 ఏళ్ల వయసులో ఇప్పటికీ సైకిల్ పైనే తిరుగుతు మైక్‌తో ప్రచారం చేస్తున్న అతనిని అందరూ ఇంట్లో వ్యక్తిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
చల్లచల్లగా వేడితాక'కుండ'..!
వేసవి ముదురుతోంది. తెలంగాణ హైదరాబాద్ నగరంలో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. చల్లని నీటిని అందించడానికి ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన చల్లదనం కోసం నగరవాసులు మళ్లీ మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని అందించే మట్టి ప్రత్యేకతను గుర్తించినవారు ఇప్పుడు నగరంలోని మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల నుంచి, ఆర్గానిక్ బజార్ల నుంచి కుండలను కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో దాహార్తిని తగ్గించుకోవాలంటే కుండలోని నీటితోనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంకమట్టిలోని ఖనిజాలు ఎంజైమాటిక్ కార్యకలాపాలకు మద్దతునిస్తాయి. పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. మట్టిలోని ఖనిజాలు నీటి రుచిని కొద్దిమోతాదులో పెంచుతాయి. తద్వారా అధిక పరిమాణంలో నీరు తాగడానికి దోహదం చేస్తుంది. తద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ మట్టి నీళ్లలోని ఆల్కలీన్ స్వభావం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తుంది. అలాగే ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లతో పోలిస్తే, మట్టికుండలో నీరు రసాయనాల రహితం. కుండలో నిల్వవున్న నీటికి కాలపరిమితి కూడా ఉండదు. మట్టికుండలు బయోడీగ్రేడబుల్ అంటే పునరి్వనియోగానికి వీలైనవి. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీరినట్టు అనిపించినా, ఆ తర్వాత శరీరానికి హానినే కలిగిస్తుందని వైద్యులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. సహజంగానే మట్టికి చల్లబరిచే గుణం ఉంటుంది. మట్టి కుండలు సహజంగా ఆవిరి ద్వారా నీటిని చల్లబరుస్తాయి. వాటిని వేడి వాతావరణానికి అనువైనవిగా తయారు చేస్తాయి. అలా నీటిని చల్లబరచడం, సహజమైన శీతలీకరణ, మెరుగైన జీవక్రియ, మెరుగైన జీర్ణక్రియతో పాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు మట్టికుండల్లో నీరుటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది పర్యావరణానికీ మేలు చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, వడదెబ్బను నివారించడంలోనూ సహాయపడుతుంది. కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లతను తగ్గించే సామర్థ్యం ఈ నీటికి ఉండటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తుంది. చేతికుండలకు కేరాఫ్ ఆదిలాబాద్.. నగరంలో ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిలాబాద్ ప్రాంతం మట్టికళలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడి మట్టి అత్యంత మెత్తగా, మరిన్ని అధిక ఫిల్టర్ గుణాలు కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాక ఆదిలాబాద్ కుండలు మిగతా ప్రాంతాల కుండలకంటే గాఢతతో ఉండి, ఎక్కువ రోజుల పాటు నీటిని చల్లగా ఉంచగలుగుతాయి. అలాగే వాటిపై ప్రత్యేకమైన చేతి పనితో ఆకర్షణీయమైన డిజైన్లు కూడా జతచేస్తూ అక్కడి కళాకారులు వాటిని సంపూర్ణంగా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. వేసవిలో టూర్లు ఎక్కువ వెళ్లే వాళ్లు ఉంటారు కాబట్టి వారి కోసం.. బయట ప్రయాణాలకు అనువైన చిన్న పరిమాణంలో క్లే వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆకట్టుకునే వెరైటీలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో గడ్డ కుండలు, జైపూర్ కుండలు, పెయింటెడ్ డిజైన్ కుండలు, ఆదిలాబాద్ మట్టి కుండలు వంటి అనేక రకాలు లభిస్తున్నాయి. చిన్న పరిమాణం గల సాధారణ కుండలు నుంచి పెద్ద డిజైనర్ కుండలు వరకూ ఎన్నో రకాలు వినియోగదారులను ఆకట్టుకునేలా కొలువుదీరాయి. చిన్న చిన్నవి రూ.100 నుంచి ధరల్లో ఉంటే మధ్యస్థాయి మోడళ్లు రూ.250–400 మధ్య ఉన్నాయి. ఇంకా పెద్ద డెకరేటివ్ కుండలు రూ.600 నుంచి రూ.1200 వరకూ ధరక్లూ లభిస్తున్నాయి. ప్రత్యేక హ్యాండీ క్రాఫ్ట్ కుండలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించినవాటి కోసం రూ.1500 ఆపైన కూడా నగరవాసులు వెచి్చస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని లామకాన్, సికింద్రాబాద్‌లోని సాక్రడ్ స్పేస్, వంటి చోట్ల నిర్వహించే ఆర్గానిక్ సంతల్లో గచ్చిబౌలిలోని పలు ఆర్గానిక్ బజార్లలో కుండలు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కుండలు పూర్తి స్థాయిలో హ్యాండ్ మేడ్, రసాయన రహిత మట్టి ఉపయోగించి తయారవుతాయని, అందుకే వీటితో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఆన్లైన్లో.. మట్టి వాసన.. ఏళ్లనాటి మట్టి వాసనకు మళ్లీ మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనంగా ఆన్లైన్లో పలు వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కాంప్లాంట్ మార్కెట్లు, సహజశ్రీ, ఆర్గానిక్ ఇండియా వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నగరవాసులు మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు.. ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించే వెబ్సైట్లలో లభించే ప్రత్యేకమైన ‘ఎకో ఫ్రెండ్లీ వాటర్ పాట్స్‘కి మంచి ఆదరణ ఉంది. ఎర్తెన్ ఫైన్ క్రాఫ్ట్స్ విలేజ్ డెకార్, కావేరీ డెల్టా ప్రాంతం నుంచి హ్యాండీ క్రాఫ్ట్ చేసిన మట్టికుండలు, క్లే కుకింగ్వేర్ సైతం అందించే జిష్తా, కుకింగ్ పాన్లు, కర్రీ పాన్లు, వాటర్ డిస్పెన్సర్లు తదితర మట్టి ఉత్పత్తులు అందించే మడ్ కార్ట్ వంటివి ఆన్లైన్ విపణిలో మట్టికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: చిన్నారులకు వచ్చే సాధారణ డెంటల్ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..!) -
చిన్నారుల నోటి ఆరోగ్యం కోసం..!
పిల్లలు ఎదుగుతూ ఉండే సమయంలో అన్ని ఎముకలతోపాటు ముఖానికి సంబంధించిన ఎముకలూ, దవడ ఎముకల్లోనూ మార్పులు వస్తుంటాయి. దాంతో చిన్నారుల్లో ఈ ఎదుగుదలకు సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించవచ్చు. అలాగే చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్స్, జంక్‌ఫుడ్ వంటివి ఇష్టంగా తింటుంటారు. వేసవిలో కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. పిల్లల్లో వచ్చే కొన్ని సాధారణ డెంటల్ సమస్యలూ, వాటికి పరిష్కారాల కోసం ఈ కథనం. ఎముకలు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పులు స్వాభావికమైనవి. అయితే ఎదిగే వయసులో ఉన్న కొందరు చిన్నారులు అలవాటుగా తమ వేలిని నోట్లో పెట్టుకుని థంబ్ సకింగ్ చేస్తుంటారు. ఇది నివారించాల్సిన విషయమే అయినప్పటికీ... పిల్లల సైకలాజికల్ ఎదుగుదల దృష్టితో చూస్తే వారి ఈ అలవాటును బలవంతంగా మాన్పకూడదనీ, క్రమంగా మాన్పించాలని నిపుణులు పేర్కొంటుంటారు. ఇలా ఎముకల పెరుగుదలతో వచ్చే మార్పులతోనూ, నోట్లో వేలుపెట్టుకునే అలవాటు వల్లా పలువరస షేప్ మారవచ్చు. కొన్ని సాధారణ దంతసమస్యలివి... పిప్పిపళ్లు చిగుర్ల సమస్యలు పాలపళ్లు సరైన సమయంలో ఊడకపోవడం ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు, పళ్ల మధ్య సందులతో సమస్యలు ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు. పిప్పిపళ్లు...దాదాపు 80 శాతానికిపైగా పిల్లల్లో పిప్పిపళ్లు, చిగుర్ల జబ్బులు కనిపిస్తుంటాయి. తీపి పదార్థాల ముక్కలు నోటిలోనే ఉండిపోవడంతో పెరిగిపోయిన బాక్టీరియాతోపాటు వారు సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఆ పెరిగిన బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో నోటిలోనే ఉండిపోవడం, అవి విడుదల చేసే హానికర రసాయనాల వల్ల పళ్లలో రంధ్రాలు ఏర్పడి పిప్పిపళ్లు రావచ్చు. రంధ్రాల పరిమాణం పెరుగుతున్న కొద్దీ ఆహార వ్యర్థాలు అక్కడ ఎక్కువగా ఇరుక్కుపోవడం, దాంతో రంధ్రం మరింతగా పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చి నొప్పిరావచ్చు. ఇలాంటి పిప్పిపళ్ల కారణంగా చిన్నారులు ఆహారం నమలడానికి ఇబ్బందిపడతారు. అన్నం తినడాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు వచ్చే నొప్పిని తల్లిదండ్రులకు సరిగా చెప్పలేక ఇలా అన్నం తినడానికి నిరాకరిస్తుంటారు. దాంతో ఎదుగుదల కూడా ఎంతో కొంత ప్రభావితం కావచ్చు. చికిత్స...పిప్పిపళ్లకు సరైన సమయంలో చికిత్స చేయించక΄ోతే ఇన్ఫెక్షన్ పంటి ఎముక వరకు చేరి, పాల పళ్లతోపాటు తర్వాత రావాల్సిన శాశ్వతదంతాలూ పాడయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి పిల్లలను దంతవైద్యులకు చూపించినప్పుడు వారు పంటిలోని రంధ్రాలను పూడ్చివేయడం, ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తగిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం వంటి చికిత్సలు చేస్తారు. చిగుర్ల జబ్బులు... చిన్నారులకు బ్రషింగ్ నైపుణ్యాలు అంతగా తెలియక΄ోవడంతో పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను సరిగా శుభ్రం చేసుకోక΄ోవడం కారణంగా పిప్పిపళ్ల తోపాటు చిగుర్ల సమస్యలు వచ్చే ముప్పూ ఉంటుంది. దీనికో కారణముంది. నోట్లో విపరీతంగా పెరిగి΄ోయిన బ్యాక్టీరియా, ఆహారపదార్థాలతో కలిసి ప్లాక్, క్యాలికులస్ అని పిలిచే మురికి సున్నితమైన చిగుర్ల చివర్లలోకి చేరుతుంది. ఈ మురికి కారణంగా చిగుర్లలో వాపు, కొందరిలో చిగుర్ల నుంచి రక్తస్రావం కావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా రావచ్చు. చిన్నవయసులోనే చిగుర్ల జబ్బు వస్తే పిల్లలు జీవితకాలం దృఢమైన పళ్లు లేక ఇబ్బంది పడవలసి రావచ్చు. చికిత్స...జింజివైటిస్ వంటి సమస్యలకు తగిన యాంటీబయాటిక్స్ వాడటతోపాటు చిగుర్లకు వచ్చే సమస్యను బట్టి దంతవైద్యులు పలురకాల చికిత్సలు అందిస్తారు. ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు / వంకరపళ్ల వంటి సమస్యలు... ఎత్తుపళ్లు అన్నది పిల్లలను ఆత్మన్యూనతకు గురిచేసే సమస్య. మొదట్లో ఇది నివారించదగిన సమస్యే అయినప్పటికీ, తల్లిదండ్రుల అవగాహనాలోపం, మరికొందరిలో వారి నిర్లక్ష్యం వల్ల ఇది తీవ్రమవుతుంది. ఎత్తుపళ్లు / ఎగుడుదిగుడు పళ్లు / వంకర పళ్లకు కారణాలు... ఎత్తుపళ్లు చాలావరకు వంశపారంపర్యంగా వస్తుంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరికిగానీ లేదా ఇద్దరికీ ఎత్తుపళ్లు ఉంటే పిల్లల్లోనూ వచ్చే అవకాశాలు 70 శాతానికి పైమాటే. పిల్లలకు ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు / వంకరపళ్లు, పళ్లమధ్య సందులు రాకుండా చేసే చికిత్సలు సైతం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నోట్లో వేలుపెట్టుకోవడం, పెదవులు కొరకడం, నాలుకతో పళ్లను ముందుకు తోస్తూ ఉండటం, నోటితోనే గాలిపీల్చడం వంటి అంశాలూ ఎత్తుపళ్లకు కారణమవుతుంటాయి. ఎదుగుతున్న చిన్నారుల దవడ ఎముకలు మైనంలా ఒత్తిడి పడుతున్న దిశకు వంగి΄ోతుంటాయి. ఈ కారణం వల్లనే ఇక్కడ పేర్కొన్న దురలవాట్లు ఉన్న పిల్లల్లో దవడ ఎముకల షేపు మారి΄ోయి పళ్లు ఎత్తుగా రావచ్చు. పాలపళ్లు సమయానికి ఊడిపోకపోయినా, పిప్పిపళ్లను ముందే తీసేయాల్సి వచ్చినా ఎత్తుపళ్లు లేదా ఎత్తు పళ్లు, ఎగుడుదిగుడు పళ్లు రావడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం. ఎదిగే వయసులోనే ఎత్తుపళ్లను, ఎగుడుదిగుడు దంతాలనూ, సరిచేయడం, పళ్ల మధ్యన ఉండే సందులు చక్కదిద్దడం చాలా సులువు. చికిత్స ఫలితాలు కూడా దాదాపు నూరు శాతం ఉంటాయి. ఎదిగే వయసులో వచ్చే ‘గ్రోత్ స్పర్’ అనేది చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చికిత్స త్వరగా, సమర్థంగా జరిగేందుకు ఈ గ్రోత్ స్పర్ అంశం సహాయపడుతుంది. ఎత్తుపళ్ల సమస్య రెండు రకాలుగా ఉండవచ్చు... కేవలం పళ్లు మాత్రమే ఎత్తుగా ఉండటంపళ్లతోపాటు దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉండటం. పిల్లలు నవ్వినప్పుడు చిగుర్లు ఎక్కువగా కనిపించడం, నిద్రపోతున్నప్పుడూ పెదవులు తెరచుకునే ఉండటం, పెదవులు ముందుకు వచ్చినట్లుగా కనపడటం వంటివి ఎముక కూడా ఎత్తు పెరిగిందని చెప్పడానికి గుర్తులు. చికిత్స...ఎదిగే వయసులో ఎత్తుగా ఉన్నట్లు గుర్తిస్తే... ఎలాంటి శస్త్రచికిత్సలూ లేకుండానే పళ్లు, దవడలను ప్రత్యేకమైన క్లిప్స్‌తో సరిచేయవచ్చు. అయితే... ఎదిగిన పిల్లల్లో దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే సర్జరీ చేయాల్సి రావచ్చు. పళ్లు ఎత్తుగా ఉన్నా, పళ్ల మధ్య సందులు ఉన్నా, వంకర టింకరగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా క్లిప్పులతో వాటిని సరిచేయవచ్చు. అయితే పిల్లలకు అమర్చాల్సిన క్లిప్పులు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తిగతమైన పరీక్షల తర్వాతే వారికి సరి΄ోయేవాటిని నిర్ణయించాల్సి ఉంటుంది. పాలపళ్లు సరైన టైమ్‌లో ఊడకపోవడం... సాధారణంగా పాలపళ్లలోని ప్రతి పన్నూ ఓ నిర్దిష్ట సమయం తర్వాత ఊడుతుంది. శాశ్వత దంతం తయారై బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పాలపన్ను ఊడుతుంది. ఊడిన 3 నుంచి 4 నెలల్లో శాశ్వత దంతం వచ్చేస్తుంది. ఏ కారణం వల్లనైనా పాలపన్ను ఊడక΄ోతే, దానికి ముందువై΄ో, వెనకవైపు నుంచో శాశ్వత దంతం వస్తుంది. (కొన్నిసార్లు పాలపన్ను ఊడకపోవడం వల్ల శాశ్వత దంతం బయటకు రాలేక చిగురులోనే చిక్కుకుపోవచ్చు కూడా). దాంతో రెండు వరసల్లో పళ్లు కనపడతాయి. అందుకే ఆరేళ్లు దాటిన పిల్లలను దంతనిపుణులకు తరచూ చూపిస్తూ పాలపళ్లు సరైన సమయంలోనే పడిపోతున్నాయా లేదా అని పరీక్ష చేయిస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి వారి పర్యవేక్షణలో చికిత్స చేయించాలి. పరీక్షలు : ఎక్స్–రే సహాయంతో పాలపళ్లు, శాశ్వత దంతాలను, శాశ్వతదంతాలను చిక్కుకు΄ోయిన తీరును దంతవైద్యులు తెలుసుకోగలరు. ముఖానికి దెబ్బలు తగలడం వల్ల... ఎదిగే పిల్లలు ఆటలాడుతుంటారు. పైగా ఇవి సెలవురోజులు కావడం ఆడుకోవడం మరింత ఎక్కువ. ఆటల్లో పరుగెత్తుతూ పడి΄ోవడం, దెబ్బలు తగలడం, క్రికెట్ బంతి లేదా ఇతర బంతుల వంటివి తగలడం, పిల్లలు ΄ోట్లాడుకోవడం వంటి చర్యలతో ముఖానికి దెబ్బలు తగలడం, పళ్లు విరగడం / వంగి΄ోవడం, దెబ్బలు తీవ్రమైనవైతే పెదవులు చీలడం, ముక్కు వంకర కావడం కూడా జరగవచ్చు. ఇలా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే చికిత్స చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే పలువరస షేపు మారడం, పళ్లపై గుర్తులు ఏర్పడి అలాగే ఉండి΄ోవడం జరగవచ్చు. అందుకే పన్ను విరిగినా, ఊడినా వెంటనే ఆ ముక్కను పాలలో లేదా మంచినీళ్లలో ఉంచి దంతవైద్యులను కలవాలి. వేసవి సెలవులు దంతవైద్యం చేయించడానికి అనువైన సమయం. ఈ సమయంలో స్కూళ్లకు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల చదువులు వృథా కాకుండానే చికిత్స చేయించవచ్చు. పైగా చికిత్స తర్వాత వారు ఇంటిపట్టునే ఉంటారు కాబట్టి టైముకు మందులు ఇవ్వడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి, పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి సెలవులన్నవి సరైన సమయం. కాబట్టి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పంటి సమస్యలున్న పిల్లలకు తగిన వైద్యసహాయం అందించవచ్చు. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) ∙ -
వేసవిలో చిన్నారులకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే..!
వేసవిలో పిల్లలకు ఆహారం ఇవ్వాలంటే రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వేసవి వేడిమి. రెండోది సెలవుల్లో వాళ్ల ఆటలు. నగరాల్లోని పిల్లలు ఎండల్లో పెద్దగా ఆడే అవకాశం లేకపోయినా పట్టణాల్లో, పల్లెల్లోని పిల్లలు ఇలా ఎండ వేడిమిలో ఆడటం మామూలే. అలాగే పెద్ద నగరాల్లోంచి సెలవులకు పల్లెలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గినప్పటికీ... కొంతమంది ఇప్పటికీ ఇలా వచ్చేవారు లేకపోలేదు. ఇలా వేసవిలోని వేడిమిని తట్టుకుంటూ... ఎక్కువ సమయం ఆటలకు ఇచ్చుకుంటూ ఉండేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తూ ఉండటానికి చిన్నారులకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలిపే కథనం. అధిక శక్తికోసం పాల ఉత్పత్తులు... పిల్లలకు తాజా లస్సీ, తాజా మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి ఇవ్వడం వల్ల ఒకపక్క అవి ద్రవాహారాలుగా వారు కోల్పోయే నీరు లవణాలను భర్తి చేయడం తోపాటు ప్రొటీన్లనూ అందజేస్తాయి. ఎదిగే వయసులో ఎముకల బలం కోసం క్యాల్షియమ్‌ను ఇస్తాయి. తాజా పండ్లు... పిల్లలకు తాజా పండ్లు తినిపించడం ఎప్పుడూ మంచిదే. కాకపోతే పండ్ల రసాలకు బదులు వీలైనంతగా పండ్లను కొరికి తినేలా చూడాలి. ద్రవాలను భర్తీ చేయడం కోసం, వేసవి ఉపశమనం కోసం అప్పుడప్పుడూ చల్లగా ఉండే తాజా పండ్ల రసాలనూ ఇవ్వవచ్చుగానీ... వీలైనంత వరకు వాటిలో చక్కెర కలపకపోవడం మంచిది. జంక్‌ఫుడ్ వద్దు... బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి వాటి కోసం వాళ్లు మారాం చేస్తున్నప్పటికీ ఆరోగ్యానికి అవి హానికరమంటూ వాళ్లను సముదాయించడం మంచిది. ఆ వయసు పిల్లలను సమాధానపరచడం కష్టం కాబట్టి వాటిలో పనీర్, తాజాకూరగాయలు పుష్కలంగా నింపి ఇవ్వడం మంచిది. అయితే వాటిల్లో చీజ్ ఎక్కువగా ఉన్నవాటిని తినిపించడం అంతగా మంచిది కాదు. మరీ మారాం చేస్తుంటే గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. ఐస్‌క్రీముల విషయంలో... వేసవిలో ఐస్‌క్రీములు అడగని పిల్లలు ఉండరు. ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్ వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఇవి ఆరోగ్యకరమే. ఇక కూల్‌డ్రింక్స్ కోసమూ డిమాండ్ ఎక్కువగానే ఉండవచ్చుగానీ వాటిని ఇవ్వడం అంతమంచిది కాదని గుర్తుంచుకోండి. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) -
నక్షత్రాలు చూడటానికి బెస్ట్ ప్లేస్ ..!
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు. ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు. (చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్‌గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్‌ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్‌స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..) -
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.ఫీజు కోసం క్లీనింగ్ పనికాలేజ్లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్‌ను 2000లో కాన్ఫినిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్రఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..
వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్‌ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్‌హౌస్ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్‌ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకర్ ఈ సీజన్‌కి సరైన ఎంపిక అవుతుంది.కిచెన్ డెకర్గిన్నెల్లో, వంటగది కౌంటర్‌టాప్ లేదా డైనింగ్ టేబుల్‌పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్ టేబుల్‌పైన సెంటర్ పీస్‌ను క్రియేట్ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. ఫామ్‌హౌస్ శైలిపట్టణవాసులు ఇటీవల ఫామ్ హౌస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్‌హౌస్ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. హెర్బల్ గార్డెన్కృత్రిమ మూలికలతో ఇండోర్ హెర్బల్ గార్డెన్‌ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు. ఎన్.ఆర్(చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
ఆల్‌ఫ్రీ ఊరు
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లి ఉంటామంటే చాలు. మీకు కావాల్సిన ఇంటిని, కావాల్సిన రీతిలో ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. అది కూడా ఉచితంగా.. అర్జెంటుగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ఇస్తుంది. అది కూడా అంతా ఇంతా కాదు, దాదాపు రూ. 94 లక్షలు. నిజం, ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి లక్ష యూరోలు (సుమారు రూ. 94 లక్షలు) ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎందుకంటే, అక్కడి గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో, ప్రస్తుతం అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప, జనాలెవరూ లేరు. దీంతో, ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలా దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందుకే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరానా ఇస్తోంది. అయితే ఈ డబ్బును వారు కేవలం, అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అయితే, 45 ఏళ్ల లోపు ఉన్న ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే దీనికి అర్హులు. -
వేసవి అంటే సెలవులేనా?
వేసవి కాలం వచ్చిందంటే చాలామంది టీనేజర్లు మెల్లగా మధ్యాహ్నం లేచి, తాపీగా రీల్స్ చూసుకుంటూ, సాయం కాలం క్రికెట్ ఆడుతూ కాలం గడిపేస్తుంటారు. కాని, కాస్తంత మనసు పెడితే ఈ వేసవిని మీ మైండ్‌సెట్‌ను మార్చుకునే అద్భుత అవకాశంగా మలచుకోవచ్చు. మెరుగైన ఫోకస్, స్పష్టమైన లక్ష్యాలు, కొత్త స్కిల్స్, నిజమైన ఆత్మవిశ్వాసం గల మీ బెస్ట్ వెర్షన్‌గా మారవచ్చు. అందుకోసం ‘ఎస్.టి.ఏ.ఆర్’ను ఫాలో అయితే సరి.సిట్యుయేషన్ వేసవి సెలవుల వాస్తవంవేసవి అనేది తెల్లవారుఝాము వరకు నెట్‌ఫ్లిక్స్ చూస్తూ, మధ్యాహ్నం వరకు నిద్రపోయే టైమ్ మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చుకునే టర్నింగ్ పాయింట్ కూడా! వేసవి అంటే మూడు అద్భుతమైన అవకాశాలు:రీచార్జ్: ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి రీచార్జ్ చేసుకునే అవకాశంరిఫ్లెక్ట్: మీ అభిరుచులు, ఆలోచనలు గురించి అర్థం చేసుకునే అవకాశంరీ ఇన్వెంట్: మీరు కొత్తగా రూపుదిద్దుకునే అవకాశంథాట్ నిన్ను నీవు తెలుసుకోవడంఈ వయస్సులో మీ మనస్సు ఐడెంటిటీ కోసం వెతుకుతుంది. ‘నేనెవరు?’, ‘ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది?’ అన్న ప్రశ్నలు రోజూ మనసులో తిరుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వేసవిని ఉపయోగించుకోండి. అందుకోసం ఐదు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి.ప్యాషన్స్: నాకు నిజంగా ఏది ఇష్టం? ఫియర్స్: నన్ను వెనక్కి లాగుతున్న భయాలు ఏవి?స్ట్రెంగ్త్స్: నా మానసిక బలాలేంటి?హ్యాబిట్స్: నేను రోజూ చేసే పనులు నన్ను ముందుకు నడిపిస్తున్నాయా? నాశనం చేస్తున్నాయా?విజన్: వచ్చే రెండు మూడేళ్లలో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?యాక్షన్ ఐదు వారాల చాలెంజ్ఈ వేసవిలో వారానికో చాలెంజ్ చొప్పున ఐదు వారాలు ఐదు చాలెంజŒ లు స్వీకరించండి. ఇవేవీ స్కూల్లో, కాలేజీలో కనిపించేవి కావు, బోధించేవీ కావు. కానీ మీ జీవితాన్ని సంతోషమయం చేస్తాయి. మొదటివారం డిజిటల్ డీటాక్స్. అంటే స్క్రీన్ టైమ్‌ను రోజుకు మూడు గంటలకే పరిమితం చేయడం. నిద్రకు గంట ముందు, నిద్రలేచాక గంటపాటు స్మార్ట్‌ఫోన్ ముట్టుకోకుండా ఉండటం. రోజూ 15 నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల మీ మెదడులో డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది. క్లారిటీ, మోటివేషన్ పెరుగుతుంది. రెండో వారం మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదా హాబీని ఎంచుకుని, రోజుకో రెండు గంటలపాటు దానిపై పనిచేయండి. ఇలా డీప్ వర్క్ చేయడం వల్ల మీ ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మూడోవారం రాత్రి నిద్రకు ముందు పదినిమిషాలు డైరీ రాయండి. ఈరోజు హైలైట్స్ ఏమిటి? నన్ను ఏది ఇన్స్పైర్ చేసింది? రేపు ఏం మెరుగుపరచుకోవాలి? ఇలా రాయడం వల్ల మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని పెంచుతుంది.నాలుగోవారం ఐదు బేసిక్ లైఫ్ స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగించండి. మనీ మేనేజ్మెంట్కనీసం రెండు మూడు వంటలు నేర్చుకోవడంఒక లోకల్ ట్రిప్ ప్లాన్ చేయడంప్రాథమిక చికిత్స నేర్చుకోవడంమీకు నచ్చిన సబ్జెక్ట్‌పై మూడు నిమిషాలు మాట్లాడటంఐదోవారం కనెక్షన్ వీక్. ఒక రోజంతా కంప్లయింట్ చేయకుండా గడపండి. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీ అవ్వాతాతలతో కూర్చుని మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. అలాగే దగ్గరలో ఉన్న పిల్లలకు మీకు తెలిసింది నేర్పించండి. ఇలా చేయడం మీ బంధాలను బలపరచడమే కాకుండా, మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది.రిజల్ట్ కొత్త నువ్వుఈ వ్యాసంలో చెప్పినవన్నీ పాటిస్తే ఈ వేసవి ముగిసేసరికి నీ గురించి నీకు స్పష్టత వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మెదడులో డోపమైన్ వ్యసనం తగ్గి, ఫోకస్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. నిన్ను నువ్వే మెచ్చుకునేలా మారిపోతావు. ఆల్ ది బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్‌కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్‌ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్‌ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్‌పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్‌ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్‌కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్‌లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్‌క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్‌తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్‌కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్‌లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్‌ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్‌ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు! -
పద్మ–పిప్పలాదుల చరిత్ర
పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు. వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.∙సాంఖ్యాయన -
తీరంలో తూటా.. సీటీలో బాంబు
కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2009లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్‌ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్‌కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్‌లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్ అఫాఖీకి అప్పగించాడు.అఫాఖీ 2005లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్ భత్కల్ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్‌ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.రియాజ్ భత్కల్ నుంచి కోడ్‌వర్డ్స్ రూపంలో ఈ–మెయిల్ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న మదీనా కాలనీలో దారుల్ ఖాయర్ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. అమోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్పైరీ డేట్ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. ‘మీన్ తూటా’లు పేలింది ఇక్కడే... 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2010 ఏప్రిల్ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు. 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్‌ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు. 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. -
సుఖనిద్రకు ‘స్లీప్ డైవోర్స్’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.నయా ట్రెండ్... స్లీప్ డైవోర్స్‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు. నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్ డైవోర్స్’ అంటున్నారు!కాపురాలను నిలబెడుతుందిభారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్ డైవోర్స్’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్’ గ్లోబల్ స్లీప్ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి. నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్ డైవోర్స్’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్లు. అంటే.. విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా. కళకళలాడుతూ నిద్ర లేస్తారునిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకే విడిపోవటంఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్ డైవోర్స్ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!స్లీప్ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు. ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్ డైవోర్స్’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒకరు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొనసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు. -
యువ కథ: నాన్నతో ఒక రోజు..
‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్ అని పిలవచ్చు కదా!’’ సుందర్ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్.‘‘వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్‌గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్ హైదరాబాద్ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్‌కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. ‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్‌కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్‌మన్‌గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అన్నీ వచ్చేశాయి. ఈ–మెయిల్ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ లెటర్స్ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్‌పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్‌మన్ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్ ఉన్న వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. ‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్.‘‘అసలు ఇప్పుడు పోస్ట్‌మన్ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్.వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్‌తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్నిమరచిపోతున్నారు. కాని, సుందర్‌కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్‌ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్‌లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్‌లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్‌ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
కిడ్‌ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
యూ ట్యూబ్‌లో కిడ్ఫ్లూయెన్సర్ల వైరల్ వీడియోలు ప్రవాహంలా కనిపిస్తాయి. క్యాచీ కంటెంట్‌తో లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన దేశంలో క్లిడ్ఫ్లూయెన్సర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెర వెనుక కథ గురించి చర్చ మొదలైంది. షూటింగ్‌ల కోసం వారు తరచుగా స్కూల్‌కు వెళ్లకుండా ఎక్కువ సెలవులు పెడుతున్నారా? సరిగా తింటున్నారా? తగినంత నిద్ర ఉంటోందా? కంటెంట్‌కు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారా? అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా... ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి.బాగా చదివే పిల్లలు కూడా ‘కిడ్‌ఫ్లూయెన్సర్’ ట్యాగ్‌లైన్ పుణ్యమా అని చదువులో వెనకబడి పోతున్నారు. ‘నేను చాలా సాధించాను. నేను చాలా గ్రేట్’ అనే భావన పెరిగిపోతుంది. ‘యాభై ఏళ్ల క్రితం అకాడమిక్ ఎక్స్‌లెన్స్ గోల్డ్ స్టాండర్డ్, ముప్పై ఏళ్ల క్రితం ఆటలు ఉండేవి. ఇప్పుడు క్రియేటివిటీ, డ్యాన్స్, మ్యూజిక్, విజువల్ కంటెంట్. ఒక్క వైరల్ వీడియో చాలు పిల్లలకు రాత్రికి రాత్రి స్టార్డమ్ తీసుకురావడానికి. ఈ తక్షణ పాపులారిటీ వల్లే పిల్లలు, తల్లిదండ్రులు వైరల్ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.మేఘా పుష్కర్ణ.