Pawan Kalyan
-
పవన్ కల్యాణ్ మానవత్వం లేదా..?
-
సీజ్ ద షిప్! అంతా తూచ్..!
-
సీజ్ ద షిప్.. సర్వం లాస్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘సీజ్ ద షిప్’ వ్యవహారం. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదుకంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డెమరేజ్ చార్జీలు ఎక్కువయ్యాయి. మరోపక్క కార్మికులకూ నష్టం వాటిల్లింది. మొత్తంగా పోర్టు పరువే తీసేసింది కూటమి ప్రభుత్వం. అనేక వివాదాలు, భారీ నష్టం అనంతరం పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక ఆదివారం అర్ధరాత్రి దాటాక 52 వేల మెట్రిక్‌టన్నుల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది.స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపివేశారు. నవంబర్ 29న పవన్ కాకినాడ పోర్టుకు వచ్చి ‘సీజ్ ద షిప్’ అంటూ సినిమా స్టైల్లో ఆదేశించేశారు. కానీ, దాని పర్యవసానాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఇతర సరకులను ఎగుమతి చేసే వారు ఇతర పోర్టులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.పట్టుకున్న బియ్యం విలువ కన్నా డెమరేజ్ చార్జి రూ.1.5 కోట్లు ఎక్కువస్టెల్లా నౌకలోని ఐదు హేచెస్లో 52వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఉంటే కేవలం 4 వేల టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేశారు. చివరకు 3వ నంబరు హేచెస్లో ఉన్న సత్యం బాలాజీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్‌గా లెక్క తేల్చారు. ఈ బియ్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి, నౌకను పంపకుండా పవన్ అన్న ‘సీజ్ ద షిప్’ మాటతో పోర్టులోనే నిలిపివేశారు. ఇలా నౌకను పోర్టులో నిలిపివేసినందుకు దాని యాజమాన్యానికి ఎగుమతిదారులు డెమరేజ్ చార్జీలు చెల్లించాలి. నవంబర్ 29 నుంచి డెమరేజ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటుండగా.. తుపాను కారణంగా డిసెంబర్ 4 వరకు డెమరేజ్ వేయడం కుదరదని ఎగుమతిదారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇంతవరకు తేలలేదు.నౌక పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్నాక షిప్ నిర్వాహకుడు బియ్యానికి చెల్లించాల్సిన సొమ్ము నుంచి డెమరేజ్ను మినహాయించుకుని మిగిలిన సొమ్ము జమ చేస్తాడని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. నౌకకు క్రూతో సహా అన్ని ఖర్చులు చూసుకుంటే రోజుకు 22 వేల యూఎస్ డాలర్లు (రూ.18.73 లక్షలు) వంతున డెమరేజ్ చెల్లించాలి. అంటే నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు రూ.7 కోట్లకు పైగా డెమరేజ్ పడుతుందని లెక్కలేçÜ్తున్నారు. విదేశాలకు ఎగుమతిచేసే బియ్యం ప్రస్తుత ధరల ప్రకారం కిలో రూ.36 పలుకుతోంది. ఈ లెక్కన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఖరీదు రూ.5.50 కోట్లు. అంటే పట్టుకున్న బియ్యం కంటే స్టెల్లా నౌకకు చెల్లించే నష్టమే రూ.1.5 కోట్లకు పైగా అదనం. ఇన్ని రోజులు పోర్టులో నిలిపివేసిన నౌక డెమరేజ్ చార్జీలు పవన్ చెల్లిస్తారా అని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఈ నష్టాన్ని సత్యంబాలాజీ కంపెనీ చెల్లించాలా లేక, ఆ నౌకలో బియ్యం ఎగుమతికి రిజిస్టర్ అయిన 28 ఎక్స్‌పోర్టు కంపెనీలు చెల్లించాలా అనే దానిపైనా వివాదం నడుస్తోంది.మంటగలిసిన పోర్టు ప్రతిష్టఈ వ్యవహారంతో పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాండ్లా, విశాఖపట్టణం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టుకే ఎగుమతిదారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. దేశంలో ఏక కాలంలో బియ్యాన్ని ఏడు నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్త్‌ల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. మిగిలిన పోర్టుల్లో రెండుకు మించి బియ్యం ఎగుమతికి అవకాశం లేదు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చిమ్మడంతో పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బియ్యం ఎగుమతిదారులు కాండ్లా రేవుకు మళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.ఆందోళనలో కార్మికులుపోర్టుపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు మట్టికొట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పోర్టులో ఉన్న 100 బార్జీలపై 2,000 మంది కార్మికులు, టవ్వింగ్లో 1,000 మంది, షోర్ లేబర్ (గోడౌన్ ఎగుమతి, దిగుమతి)లో 8,000 మంది, మరో 2,000 మంది స్టీవ్ డోర్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజూ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఆదాయం లభిస్తుంది. -
ఎల్లోమీడియాకు అంబటి రాంబాబు వార్నింగ్
సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం. గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్‌చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు. -
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్ చేంజర్‌కి పాటించరా?
అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా -
మరణించిన మెగా అభిమానులను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్
-
కొంప ముంచిన డిప్యూటీ సీఎం సీజ్ ది షిప్!
-
‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా!’’
ఒక హీరో కోసం జనాలు ఎగబడితే.. అది కొండంత అభిమానం అంటారు. అదే అభిమానం హద్దు మీరితే.. ఇదెక్కడి అభిమానం? అని తిట్టిపోస్తారు. ప్రాణంపోయేంత అభిమానానికి కూడా అది వర్తిస్తుందని మొన్నటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చూశాం. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫ్యాన్స్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలంటూ సినిమావాళ్లకు నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాఠం చెప్పడం చూశాం. అయితే అది చెప్పడం వరకేనని.. ఆచరణలో లేదనేది తాజాగా రుజువైంది.గేమ్ ఛేంజర్ మెగాఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై ఇవాళ(జనవరి 6) ఎక్స్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు. కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా దుర్మార్గమైన వ్యాఖ్య ఒకటి చేశారు.‘‘సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం.అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది’’సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు, ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని.. అంతా అల్లు అర్జున్, చిత్ర యూనిట్‌దే అని పవన్ మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ సరైన పరిణామమే అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అలాంటప్పుడు ఇప్పుడు రాం చరణ్‌ను అరెస్ట్ చేయిస్తారా?. ఒకవేళ నిజంగా ఆ డిమాండ్ ఒకటి తెర మీదకు(ఆఖరికి సోషల్ మీడియాలో అయినా సరే) వస్తే ప్రభుత్వంలో ఉన్న పవన్ ఏం చేస్తారు?. రోడ్డు ప్రమాదం, అందునా తాను స్వయంగా హాజరైన ఈవెంట్‌కు హాజరై వెళ్తున్న క్రమంలో మరణించిన వాళ్ల పట్ల ఇంత లూస్ టంగ్‌తో మాట్లాడొచ్చా? అనే అభిప్రాయం ఆయన చేసిన ట్వీట్ కామెంట్ సెక్షన్లోనే వ్యక్తం అవుతోంది.(కావాలంటే మీరే పరిశీలించుకోండి.. )నిజానికి.. అభిమానులతో పవన్ వ్యవహరించే తీరు చాలాసార్లు చర్చనీయాంశమైంది. గతంలో ఓపెన్‌గానే ఎన్నోసార్లు వాళ్ల మీద ఆయన చిరాకు ప్రదర్శించారు. ఆఖరికి.. వాళ్లు ఆయన్ని ఆకాశానికెత్తిన సందర్భంలోనూ అసహనం ప్రదర్శించారు. ఇప్పుడు.. చనిపోయింది మెగా అభిమానులు. రాం చరణ్(Ram Charan)ను, ప్రత్యేకించి తనను చూసేందుకు అంత దూరం నుంచి ఆత్రుతగా వచ్చారు. ఆ ఈవెంట్ పవన్ ఎలా మాట్లాడిందో చూశాం.. అభిమానుల్ని, అందునా యువతను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడింది నిజం కాదా?. సినిమా ఫంక్షన్ లో చొక్కాలు చించుకోకపోతే ఎలా?. బైకు సైలెన్సర్లు తీయకుండా, ఎక్సలేటర్లు రేజ్ చేయకపోతే కిక్కు ఏం ఉంటుంది?ఆ వ్యాఖ్యలతో అభిమానులను ఎంతగా కేరింతలు కొట్టిందో చూశాం కదా!. అసలు ఆ ఈవెంట్ జరిగితే రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదుగా!. చనిపోయాక.. చిత్ర నిర్మాత దిల్ రాజు, ఆ వెంటనే గేమ్ చేంజర్‌కు ఏమాత్రం సంబంధం లేదని పవన్ ఆర్థిక సాయం ప్రకటించడం దేనికి?. గత ప్రభుత్వం.. అంటూ ఇంకా ఎంత కాలం నిందలేసి తప్పించుకుంటారు?. ఇక్కడ ఎవరి తప్పు లేకపోవచ్చు. కానీ, అల్లు అర్జున్(Allu Arjun) విషయంలో పవన్ చెప్పినదానిబట్టి.. రాం చరణో, లేదంటే చిత్ర యూనిటో, అంతెందుకు అసలు పవన్ కల్యాణో బాధిత కుటుంబాలను పరామర్శిస్తే సరిపోయేది కదా!. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లు పవన్‌కు అనిపించలేదా?. అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేనికి?. అంటే.. పవన్ నీతిపాఠాలు చెప్తారు కాని పాటించరన్నమాట!. హీరోల అభిమానులు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. అట్టర్ ప్లాపు! -
KSR Live Show: పవన్ టార్గెట్ అతడేనా?.. లోకేష్ కోసం పచ్చ మీడియా కుస్తీ!
-
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోర్టులో స్టెల్లా నౌక డెమరేజ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్‌గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు. అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్‌ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్‌ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్‌ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.సాగని అన్లోడ్ ప్రక్రియస్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్‌పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బాబూ.. జీతాలెప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్ అమరావతి జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్‌లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు. వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్‌వో సంఘం గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో సేవలు అందించే తమకు డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్‌వో) అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్ ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
తుస్సుమన్న బాబు, పవన్ హామీ.. టీచర్లలో ఆందోళన!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల మాటల కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు(chandrababu) పాలనలో చెప్పేదొకటి.. చేసేదొకటి అని మరోసారి రుజువైంది. నెలలో ఐదో తేదీ వచ్చినా ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ(Andhra Pradesh)లో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందలేదు. నెలలో ఐదో తేదీ వచ్చినా టీచర్లకు జీతాలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (pawan Kalyan) మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటి నెలకే ఒకటో తేదీన జీతాల చెల్లింపులకు ప్రభుత్వం పరిమితమైంది. కేవలం ఒకే ఒక నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలు చెల్లించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.ఇక.. చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీ కనీసం మూడు నెలలు కూడా అమలు చేయని వైనం నెలకొంది. సంక్రాంతి(sankranthi) నెలలో జీతాల కోసం ఏపీలో టీచర్ల ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు తెచ్చినా కూడా టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, ఐదో తేదీకి కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
మూలాలు మరచిపోకూడదు: పవన్ కల్యాణ్
‘‘తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి. రామారావుగారిని స్మరించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే దానికి స్ఫూర్తి అక్కినేని నాగేశ్వర రావు, ఎన్.టి. రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబుగార్లు.. ఇలా ఎంతో మంది పెద్దలే. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో మంది పెద్దలు శక్తి యుక్తులు ధారపోశారు... వారందరికీ ధన్యవాదాలు. మన మూలాలను మరచిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్‌చరణ్ ఉన్నా దానికి మూలం చిరంజీవిగారు. నేనెప్పుడూ మూలాలు మరచిపోను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్గార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోందంటే దానికి కారణం శంకర్‌గారు. ‘రంగస్థలం’ చూసి చరణ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్æస్టార్ కాకుండా ఏమవుతాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తే... మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా అనిపించింది. సినిమాని సినిమాగానే చూడండి.కిందపడిపోయి, మీద పడిపోయి, తొక్కిసలాటలో హీరోని చూడటం కంటే కూడా... దూరంగా నిలబడి మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ అండ్ సప్లయ్ వల్లే టికెట్ల ధరలు పెంచుతున్నాం. ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీని పన్ను రూపంలో కడుతున్నాం... చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి... తీయని వాళ్లు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఎన్డీయే కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) తరఫున నేను చెబుతున్నా. సినిమాలు తీసేవాళ్లతోనే మేము మాట్లాడతాం... వారినే గుర్తిస్తాం. సినిమా టికెట్ల ధరల పెంపుకోసం హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు.మహా అయితే నిర్మాతలు రండి... లేదా మీ యూనియన్‌తో రండి. మేము ఇచ్చేస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ని శంకర్‌గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ అని పెట్టారేమో అనిపిస్తోంది’’ అని చెప్పారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్‌గారిని కలిశాను. ఆయనలాంటి మంచి వ్యక్తి మా ‘గేమ్ చేంజర్’ వేడుకకి వచ్చినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు. -
పవన్‌కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్‌లో విజయ్‌తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్‌తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..సాధారణంగా తాను ఎంత గ్రాండ్‌గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్‌పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?. .. టీఎఫ్ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్‌మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్‌కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్‌గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్‌లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్‌కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్‌ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్లో పొలిటికల్‌గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్‌లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్‌లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!. -
జనసేన రేవ్ పార్టీ వీడియో కలకలం
-
విజయవాడలో పుస్తకాల పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
Pawan Kalyan సీజ్ ద షిప్.. ప్చ్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్ అభిమానులకు ఆ డైలాగ్ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ షిప్‌ను అయితే సీజ్ చేయమని చెప్పారో.. ఆ షిప్ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ ఈపాటికే లభించినట్లు సమాచారం.పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్ చేశారు. అయితే నవంబర్ 27న కలెక్టర్ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్ దగ్గరకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు.అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్ బియ్యం అన్లోడ్ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్ సీజ్ ద షిప్ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్..కొసమెరుపు..కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ! -
పవన్ కళ్యాణ్ పై పుత్తా శివశంకర్ ఫైర్
-
‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..
సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేబ్‌నెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కిక్కే.. కిక్కుతల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. -
సినిమా డైలాగులకు తప్ప దేనికి పనికిరాడు.. చంద్రబాబుకు బుద్ధి రావాలని దేవుడ్ని కోరుకున్న
-
మళ్లీ పాడారు
‘తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల తర్వాత హీరో పవన్ కల్యాణ్ మరోసారి పాట పాడారు. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రంలోని ‘మాట వినాలి...’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. పెంచల్దాస్ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్ కల్యాణ్ పాడారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
బాబు.. పవన్.. ఊసరవెల్లి.. సిగ్గు సిగ్గు!
అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్‌కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్! జగన్ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!! పవన్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్ అరెస్ట్‌ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్ అల్లూ అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్‌కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు. బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు. ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.