Raman Singh
-
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, రమణ్ సింగ్‌కు స్పీకర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. సీఎంగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. 2003 నుంచి 2018 వరకు మూడు సార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు రమణ్ సింగ్‌ను స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి? -
ప్రచారంలో బీజేపీ స్పీడ్.. కాంగ్రెస్‌పై సీఎం యోగి ఫైర్..
రాయ్‌పూర్: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి. మరోవైపు.. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కవార్ధాలో బీజేపీ సభలో సీఎం యోగి మాట్లాడుతూ..‘ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ లవ్ జిహాద్ పూర్తిగా నిషేధం. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి.. బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఆనాడు ప్రధాని వాజ్‌పేయ్ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో ఛత్తీస్‌గఢ్ ఏర్పడింది. రమణ్ సింగ్ నాయకత్వంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచింది. అయితే, ఐదేళ్లుగా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సలిజం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దేశానికి కాంగ్రెస్ పెద్ద సమస్య. సుపరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే చూడగలం. ఛత్తీస్‌గఢ్‌తో ఉత్తరప్రదేశ్ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర భూమిపై ప్రజలకున్న విశ్వాసాలతో కాంగ్రెస్ ఆడుకోవడం దుర్మార్గం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్ -
పొమ్మనలేక పొగ!
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్‌సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు. శివరాజ్‌కు బై బై...! మధ్యప్రదేశ్‌లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్‌కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్‌కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. ► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు. ► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వసుంధరకు వీడ్కోలే..! రాజస్తాన్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్‌సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్‌రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది. రమణ పర్వానికి తెర! కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్‌సింగ్‌ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్‌షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
మెదక్‌జోన్/మెదక్‌రూరల్: తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అవినీతి ప్రభుత్వం అంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్రంలో 1.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాల్లేక యువత అల్లాడిపోతున్నా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో రమణ్‌సింగ్ పాల్గొన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా సోమవారం మెదక్‌జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణలో చీకటి పోతుంది. సూర్యుడు వస్తాడు. కమలం వికసిస్తుంది’ అని రమణ్‌సింగ్ అన్నారు. నరేంద్రమోదీ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించినా చేయలేకపోయిందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజావసరాలకు ఉపయోగపడేంత ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయలేని సీఎం ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తప్పవు: శోభా కరంద్లాజే కేంద్రం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు మంజూరు చేస్తుంటే కేసీఆర్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు. కేంద్రం అమలుచేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పేరు మార్చి రైతుబంధు అని పెట్టారన్నారు. కేసీఆర్ అవినీతిపై సరైన సమయంలో చర్యలు తీసుకొని, పూర్తి ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. సోమవారం మెదక్ మండలం మంబోజిపల్లి గీతా పాఠశాల ఆవరణలో ఆమె బండి సంజయ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
రమణ్‌సింగ్‌కు ఆశాభంగం
రాయ్‌పూర్: 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు ఆయనే గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో లేరు. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్(66) ప్రస్థానం ఇది. 2003, డిసెంబర్ 7న తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తరువాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోదీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా 5వేల రోజులు పూర్తిచేసుకున్నారు. మోదీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు. మహిళలు, విద్యార్థులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇచ్చినందుకు ‘మొబైల్ వాలె బాబా’, ఉచిత బియ్యం పథకానికి ‘చౌర్ వాలె బాబా’, స్వతహాగా ఆయుర్వేద వైద్యుడైనందుకు ‘డాక్టర్ సాహెబ్’ అని రమణ్‌సింగ్‌ను ప్రజలు పిలుచుకుంటున్నారు. కాంగ్రెస్ రుణమాఫీ హామీనే మలుపు.. నాలుగోసారి సీఎం పీఠం అధిష్టించాలనుకున్న రమణ్‌సింగ్‌కు తాజా ఎన్నికల్లో ఆశాభంగం కలిగింది. ప్రజాకర్షక పథకాలకు పేరొందిన ఆయనకు ఎట్టకేలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు ఆయన పాలనకు చరమగీతం పాడాయి. అధికారంలోకి వస్తే రైతు రుణాల్ని మాఫీ చేస్తామన్న రాహుల్ ప్రకటనే కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనలో మావోయిస్టుల సమస్య మరింత ముదిరిందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయగా, నక్సలిజం ప్రాణాధార వ్యవస్థపై ఉందని త్వరలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని రమణ్‌సింగ్ చేసిన ప్రకటనలు ఫలితాలివ్వలేదు. విదూషకుడే గెలుచుకున్నాడు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో రమణ్‌సింగ్ తరచూ వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదూషకుడితో పోల్చారు. రుణమాఫీ చేస్తామని రాహుల్ చెబుతున్న మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అజిత్ జోగి, మాయావతిల పొత్తును ఎగతాళి చేశారు. ‘నాగలి మోసే రైతు’ (జోగి పార్టీ గుర్తు)కు ఏనుగు(బీఎస్పీ చిహ్నం) అవసరం ఏంటని ప్రశ్నించారు. చివరకు రైతులు, గిరిజనులు ‘కమలాన్ని’ వద్దనుకుని ‘హస్తా’నికి పట్టంగట్టారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు రమణ్‌సింగ్.. తన కన్నా చిన్నవాడైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రమణ్‌సింగ్ రాజీనామా రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని చెప్పారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఉండదని నొక్కిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ కోసం కొత్త పాత్రలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. -
ఓటమి షాక్ : రమణ్‌సింగ్ రాజీనామా
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా, బీజేపీని ఓటమి భారం వెంటాడుతోంది. ఇక బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రరమణ్ సింగ్ 15 సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్ సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన నాయకత్వంలో ఎన్నికలు వెళ్లినందున ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు. -
టీఆర్ఎస్ పాలన అబద్ధాలమయం: రమణ్‌సింగ్
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మూడు సార్లు విజయం సాధించిన బీజేపీ నాలుగవ సారి కూడా విజయం సాధిస్తుందని ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రమణ్‌సింగ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన సాగిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతల చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా ధృక్పథం కలిగిన వ్యక్తి చట్టసభల్లో ఉండాలన్నారు. ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే అని అన్నారు. అనంతరం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, రామన్‌గౌడ్, ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు. -
రాహుల్ ఎక్కడా ప్రచారం చేస్తే.. అక్కడ ఓటమే!
సాక్షి, కామారెడ్డి: దేశంలో రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూస్తోందని ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 18 రాష్ట్రాల్లో రాహుల్ ప్రచారం చేస్తే 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తానిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి పథకం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. -
జంగ్..మైదాన్ కా!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల ప్రాబల్యమున్న 18 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగగా.. మిగిలిన 72 స్థానాల్లో మంగళవారం ఓటు పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లో అసలు రాజకీయానికి రెండో విడత వేదిక కానుంది. తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ నెలకొంది. కానీ రెండో దశలో అజిత్ జోగి కారణంగా రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో రెండో విడతలో మూడుముక్కలాట ఖాయంగా కనబడుతోంది. ఈ విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో జోగి–బీఎస్పీ ప్రభావముండే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. దీనికితోడు బీఎస్పీకి సన్నిహితంగా ఉండే సత్నామీలు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకం ఓటర్లు. రాజకుటుంబాల ప్రభావం ఉండే 14 ఆదీవాసీ నియోజకవర్గాల్లోనే రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టిపట్టుండగా.. ఈసారి వీటిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కాగా, అటు రమణ్‌సింగ్ అభివృద్ధి ఇమేజ్ కారణంగా మెరుగైన స్థానాలు సాధిస్తామని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే తమకు సీఎం పీఠాన్ని అప్పగిస్తోందని అనుకుంటోంది. అటు, మొదటి విడతతో పోలిస్తే రెండో దశలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా లేనప్పటికీ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే 76.28% శాతం పోలింగ్ జరగడంతో మైదాన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరిలో కోటీశ్వరులు, నేర చరితులు ఈ సారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు, నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న 1,079 మంది అభ్యర్థుల్లో 130 మందికి నేరచరిత్ర ఉంది. వారిలో 90 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. 17 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోస్థానంలో ఉండగా.. అజిత్ జోగి పార్టీ జేసీసీ నుంచి 15 మంది, బీజేపీ తరఫున ఆరుగురు నేరచరిత కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన అభ్యర్థుల్లో బీజేపీ ముందు వరసలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది కోటీశ్వరులుంటే, కాంగ్రెస్ 53 మందికి, జేసీసీ 35 మందికి టికెట్లు ఇచ్చింది. అంబికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత (కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం) టీఎస్ సింగ్‌దేవ్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. హెల్ప్ అంటే రమణ్ రెండు నెలల క్రితం బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలి కుమారుడికి పాము కరిస్తే, ఆమె సాయం కోసం ఫోన్ చేసింది సీఎం రమణ్ సింగ్‌కే. వెంటనే రమణ్ సింగ్ హెలికాప్టర్లో ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స జరగడంతో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు.. విపక్షాల్లోనూ సీఎం రమణ్‌సింగ్‌కు ఉన్న ఇమేజ్ గురించి చెప్పడానికి. కేవలం ఇదొక్క సంఘటనే కాదు ప్రజలతోనూ ఆయన మమేకమవుతారనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగానే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ‘చావల్ బాబా’గా పౌరసరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారు. సెల్ ఫోన్ విప్లవాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాంకేతికంగానూ పరుగులు పెట్టించారు. సుపరిపాలనతో.. అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో కూడా రమణ్సింగ్ది ప్రత్యేకమైన శైలి. మావో సమస్యను ఉక్కుపాదంతో అణిచేసిన జాతీయవాదిగా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో సామాజికవాదిగా, పారిశ్రామికంగా రాష్టాన్ని పరుగులు పెట్టించిన అభివృద్ధి కారకుడిగా రమణ్ సింగ్‌కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధంగా.. సరిగ్గా ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ అధ్యక్షుడే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. లోటు మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అందుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకముంచింది. గత మూడుసార్లు స్వల్ప తేడాతోనే ఓడినందున ఈసారి ఆ తప్పులు చేయకుండా పట్టుబిగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ చేస్తానని తొలిదశ పోలింగ్ ప్రచారం ముగిసే ముందు ప్రకటించారు. 15 ఏళ్ల పాలన కారణంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు.. రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది. తొలిదశలో 76% పోలింగ్ జరగడంతో (ఎక్కువ పోలింగ్ జరిగితే అధికార పార్టీకి నష్టమనే భావనలో) దీని ప్రభావం రెండోదశలోనూ ఉంటుందని.. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. జోగి ఝలక్ ఎవరికి? ద్విముఖ పోరుంటే గెలిచేది నువ్వా–నేనా అనేది తేలిపోతుంది. మూడో పార్టీ/వ్యక్తి రంగంలో వస్తే.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఊహించడం కష్టం. అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) పేరుతో జోగి పోటీలోకి రావడం సమీకరణాలు మార్చేసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇబ్బందికర పరిణామమే అయినా.. రెండు పార్టీలూ అవతలి పార్టీకే.. జోగితో నష్టమని ప్రచారం చేసుకుంటున్నాయి. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప కారణంగా.. బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అదే సీన్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విషయంలో పునరావృతం అవుతుందనే అంచనాలపై చర్చ జరుగుతోంది. నామమాత్ర తేడాతోనే.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల పరంగా అత్యంత స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంస్థాగత ఇబ్బందులే కారణమనేది సుస్పష్టం. అయితే ఈసారి గతంలోలాగా పొరపాట్లు చేయకుండా.. అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. 15ఏళ్ల రమణ్‌సింగ్ పాలనతో విసిగిపోయిన జనాలు తమ విజయంలో కీలకమవుతారని భావించింది. ఈ ఆశలకు మాజీ సీఎం, గతంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న అజిత్ జోగి రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. జోగి పార్టీ జేసీసీ కారణంగా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్‌కు పట్టున్న దళిత స్థానాల్లో బీఎస్పీతో జోగి దెబ్బకొట్టొచ్చని విశ్లేషణలున్నాయి. హిందీరాష్ట్రాల్లో 2003 నుంచి గణాంకాలు పరిశీలిస్తే కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐల ఓట్లు కలిపితే.. బీజేపీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, జోగి కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ ఓటమి ఖాయమనే వాదన వినిపించింది. కానీ ఇందుకు ఇటు కాంగ్రెస్, అటు జోగి ఇద్దరూ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జోగి కారణంగా అంతిమంగా బీజేపీకే మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఎస్పీ ఎంట్రీతో.. బీఎస్పీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాకపోయినా.. గెలిచే పార్టీల అవకాశాలను మాత్రం దెబ్బతీస్తోంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి బీఎస్పీ.. ఈసారి జోగితో జతకట్టడం ఎవరి ఓట్లకు నష్టమనేది చర్చనీయాంశమైంది. ఈ చర్చే జోగిని ఈసారి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మార్చింది. జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందున.. ఆయన వల్ల కాంగ్రెస్‌కే నష్టమనే వాదనలు వినబడుతున్నాయి. జోగి–బీఎస్పీ కూటమిలో సీట్ల పంపిణీ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఈ కూటమి తరఫున 55 సీట్లలో జేసీసీ బరిలో ఉంది. వీటిలో మెజార్టీ స్థానాల్లో 2008, 2013లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన చూపింది. ఎస్సీ, ఎస్టీలే కీలకం రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మాయావతి, జోగి జట్టుకట్టడంతో.. మూడో కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. 9 ఎస్సీ రిజర్వ్డ్, 17 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మూడో కూటమి ప్రభావం ఉండొచ్చు. కూటమితో పొత్తు ఉండుంటే.. ఈ సీట్లలో కాంగ్రెస్‌కు మేలు జరిగేది. పొత్తు లేకపోవడంలో ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కష్టంమీద గెలిచే అవకాశాలున్నాయని అంచనా. ఈసారి ఎస్సీల్లోని సత్నామీ వర్గం ఓట్లను గెలిచేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం పన్నింది. సత్నామీల గురువులు ముగ్గురిని చేర్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నేటి రెండోదశే నిర్ణయాత్మకం! 72 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. మైదాన ప్రాంతాల్లో జరిగే ఈ ఓటింగే ఎన్నికల్లో నిర్ణయాత్మకం కానుంది. అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) ప్రభావం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో? ఎవరు నష్టపోతారో? అనేది విశ్లేషకులకూ అంతుచిక్కడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ముక్కోణపు, బహుముఖ పోటీల కారణంగా బీజేపీకే లాభం చేకూరింది. ఈ సారి బీఎస్పీతో జతకట్టి బరిలో దిగిన అజిత్ జోగి కూడా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తారనే అంచనాలైతే బలంగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 14% ఉన్న సత్నామీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. జోగికి సత్నామీల్లో పట్టు ఉంది. ఈ వర్గం బీఎస్పీకి శాశ్వత ఓటు బ్యాంకు కూడా. బీఎస్పీ–జేసీసీ కూటమి బలమైన శక్తిగా అవతరించడానికి కారణం కూడా ఈ వర్గమే. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు ఎక్కువగా ఉన్న 10 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జోగి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిలాస్పూర్, జంజీగర్ ప్రాంతాల్లో ఈ కూటమి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలున్నాయి. జంజీగర్, చంపా వంటి స్థానాల్లో బీజేపీ నుంచి పార్టీ ఫిరాయించి బీఎస్పీలో చేరిన వారున్నారు. అలాంటి స్థానాల్లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ఇలా మొత్తం 12 స్థానాల్లో గెలుపోటములు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సత్నామీల గురువు గురు బాలదాస్.. కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ జోగి, మాయావతి కూటమి 6–7% ఓట్లను కొల్లగొట్టగలరని అంచనాలున్నాయి. ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందో.. ఇప్పుడే చెప్పలేని స్థితి. రెండో దశలో ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. జనాభాలో 45% ఓబీసీలుంటే వారిలో 22% మంది సాహులు ఉన్నారు. సాహులు సంప్రదాయంగా బీజేపీకే మద్దతు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే బీజేపీయే సాహులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. రాజ కుటుంబీకులపై ఆశలు ఆదివాసీ ప్రాంతమైన సుర్గుజాల్లో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబాలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ కుటుంబాల వారికే రెండు పార్టీలు కనీసం నాలుగేసి స్థానాల్లో బరిలో దింపాయి. 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ.. ఈ ప్రాంతంపై బీజేపీదే పట్టు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న టీఎస్ సింగ్‌దేవ్ ఈ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆయనపై బీజేపీ అదే రాజవంశానికి చెందిన అనురాగ్ సింగ్‌దేవ్‌ను బరిలో దింపింది. బీజేపీలో నేత దిలీప్ సింగ్ జుదావో కూడా ఇక్కడి జష్పూర్కి చెంది రాజ కుటుంబీకుడు. ఆయన కుమారుడు యుధవీర్ సింగ్ చంద్రపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యుధవీర్ భార్య సంయోగిత సింగ్ ఈసారి చంద్రపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. 2003 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లను సాధించింది. 2013 ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరిసగం సీట్లను పంచుకున్నాయి. -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. తొలి దశ ఎన్నికల ముందు సాహూ పార్టీని వీడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేత రాజీనామా చేయడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాకు సరైన కారణమేమీ తెలపకపోయినా.. ఆయన కోరుకున్న దుర్గ్ సిటీ సీటు విషయంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలవలేదన్న నిరాశతో రాజీనామా చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా తుది దశ పోలింగ్‌లో భాగంగా సోమవారం 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు 12. గత పదిహేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఎలానైనా అధికారం చేజికిచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. నాలుగోసారి కూడా తమదే విజయమని సీఎం రమణ్‌సింగ్ ధీమాతో ఉన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌షా పర్యటన
-
వారికే ఖజానా తాళాలు
చరమా(ఛత్తీస్‌గఢ్): ‘నాలుగేళ్లలో ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఏడాదికి అయ్యే వ్యయానికి ఈ మొత్తం సుమారు 10 రెట్లు. మోదీ ఆ 15 మందికే దేశ ఖజానా తాళాలు అప్పగించారు. కానీ కాంగ్రెస్.. రైతులు, యువత, పేదలు, మహిళలు, గిరిజనులకు ఆ తాళాలు ఇవ్వాలనుకుంటోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ శనివారం ప్రధాని మోదీ, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్‌ఫండ్, పౌరసరఫరా కుంభకోణాల్లో రమణ్‌సింగ్‌కు పాత్ర ఉందని, పనామా పత్రాల్లో రమణ్‌సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ పేరు ఉన్నా, ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు. చేష్టలుడిగిన రమణ్‌సింగ్.. చరామాలో జరిగిన ర్యాలీలోనూ రాహుల్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ చిట్‌ఫండ్ కుంభకోణంలో రూ.5 వేల కోట్లు అదృశ్యమయ్యాయని, సుమారు 60 మంది మరణించగా, 310 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదని, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రమణ్‌సింగ్ వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. ఇక పౌర సరఫరా కుంభకోణంలో రూ.36 వేల కోట్లను దోచుకున్నారని, ఇందులో రమణ్‌సింగ్ పాత్రను తేటతెల్లంచేసే పత్రాలు లభ్యమయ్యాయని అన్నారు. రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనలో 40 లక్షల మంది యువత నిరుద్యోగులుగానే మిగిలారని, 65 శాతం భూభాగానికి సాగునీరు లేదని, గిరిజనుల నుంచి 56 వేల ఎకరాల భూమిని లాక్కుని సీఎం స్నేహితులకు కట్టబెట్టారని ఆరోపించారు. స్థానికులు నిరు ద్యోగులుగా మిగలడానికి కారణమైన ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. స్నేహమే అర్హతా?..: ప్రధాని మోదీకి స్నేహితుడు అయినందుకే అనిల్ అంబానీ రఫేల్ ఒప్పందాన్ని దక్కించుకున్నారని రాహుల్ ఆరోపించారు. దేశానికి కాపలాదారుడిగా చెప్పుకునే మోదీ..తన స్నేహితుడికి లబ్ధిచేకూర్చడానికే యూపీఏలో కుదిరిన ఒప్పందంలో మార్పులు చేశారన్నారు. ఒక్కో విమానానికి రూ.526 కోట్ల చొప్పున మొత్తం 126 విమానాల్ని కొనడానికి యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరితే, ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించడానికి ఎన్డీయే అంగీకరించిందని ఆరోపించారు. ‘తొలి’ ప్రచారం సమాప్తం రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సహా మొత్తం 190 మంది అభ్యర్థులు మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండగా జనతా కాంగ్రెస్(జే), బీఎస్పీ, సీపీఐల కూటమి కూడా ఈసారి తలపడుతోంది. మొత్తం 31,79,520 మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు మావోలు పిలుపివ్వడంతో భద్రత ఏర్పాట్లు పెంచారు.కొండ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెలికాప్టర్లను వినియోగి స్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 72 నియోజకవర్గాలకు 20న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌తో ప్రజలకు వినోదం రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంతో ప్రజలకు వినోదం పంచారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రం గురించి ఆయనకు ఏమీ తెలియదని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన విమర్శలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు రాహుల్ కేవలం వినోదం పంచారు’ అని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాహుల్ ప్రచారం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయలేకపోగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే హాని కలిగించేలా ఉన్నాయి’ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటివి కాంగ్రెస్ హయాం లో జరిగాయని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రభావాన్ని దాదాపు లేకుండా చేశారంటూ సీఎంపై బీజేపీ చీఫ్ బీజేపీ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. -
‘రాహుల్ ఒక ఎంటర్టైనర్ మాత్రమే’
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ ప్రజలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం లేదని, అతన్ని ఒక ఎంటర్టైనర్గా మాత్రమే చూస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు ఛత్తీస్‌గఢ్ గురించి ఏమి తెలియదని, అతని ర్యాలీల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే కాని ఉపయోగం లేదన్నారు. రాహుల్ ర్యాలీలతో ఒక్క ఓటు కూడా పడదని విమర్శించారు. మొదటి విడత ఎన్నికలు దగ్గర పడడంతో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పాలించేటప్పుడే కార్పోరేట్లకు అనుకూలంగా ఉండేదని రమణ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్టాం అభివృద్ధిలో తిరోగమనంలో ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందన్నారు. బీఎస్పీ(బహుజన సమాజ్ పార్టీ), జనతా కాంగ్రెస్ పార్టీలు స్వార్ధ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాయని, ఇలాంటి పార్టీలు ఎన్ని కలిసినా బీజేపీని ఏమీ చేయలేవని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించామని రమణ్‌సింగ్ అన్నారు. త్వరలోనే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్నున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకొని ప్రచారంలో వేగాన్ని పెంచారు. కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రలలో కార్పోరేటు అనుకూల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని శుక్రవారం రాహుల్ గాంధీ మండిపడ్డారు. గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్12 న నక్సల్ ప్రభావం ఉన్న 18 స్థానాలకు ఓటింగ్ జరగనుండగా, మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20 న ఓటింగ్ జరగనుంది. సోమవారం జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన రాజ్‌నాడ్‌గాన్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. -
జై వాజ్‌పేయి!
రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలే. ఒకరిది సుదీర్ఘ రాజకీయానుభవమైతే.. మరొకరిది మాజీ ప్రధాని కుటుంబం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకరు వాజ్‌పేయి శిష్యుడు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ కాగా.. మరొకరు వాజ్‌పేయి అన్న కూతురు కరుణ శుక్లా. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందన్‌గావ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇద్దరికీ వాజ్‌పేయితో ఉన్న ఆత్మీయత కారణంగా.. ఆయన వారసత్వం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్‌నందన్‌గావ్ ప్రచారంలో వాజ్‌పేయి పేరే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. తన గురువు, తమ పార్టీ నేత వాజ్‌పేయి అని సీఎం రమణ్‌సింగ్ ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా కూడా వాజ్‌పేయినే తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తనే వాజ్‌పేయికి అసలైన వారసురాలినంటున్నారు. మాజీ ప్రధాని పేరును వినియోగించుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి ఆదర్శాలను తూచ తప్పకుండా పాటిస్తానని.. మహనీయుడి ఆదర్శాలను బీజేపీ గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ‘బీజేపీ భావజాలం, మార్గం అన్నీ మారిపోయాయి. ఇది ఎంతమాత్రం వాజ్‌పేయి, అడ్వాణీలు నడిపిన పార్టీ కాదు’ అని శుక్లా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి బోధనలు తన రక్తంలో ఉన్నాయంటున్నారు. తనతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలు బీజేపీలో ఉన్న కరుణ 2013లో పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రమణ్‌పై కరుణను కాంగ్రెస్ బరిలో దించింది. రాజ్‌నందన్‌గావ్‌లో రమణ్ సింగ్, కరుణ శుక్లాలు ఎదురెదురు ఇళ్లలో ఉండటం విశేషం. హమారా రమణ్! అయితే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రమణ్ సింగ్‌పై సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాన్ని ఈయన అభివృద్ది చేశారని మధ్యతరగతి విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది రమణ్ సింగ్ వల్లేనని స్థానికులంటున్నారు. అయితే జీఎస్టీ, నోట్ల రద్దుతో స్థానిక వ్యాపారుల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. -
మోదీ పాలనకు రిఫరెండం కాదు..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో వరుసగా నాలుగోసారి బీజేపీ ప్రభుత్వమే కొలువుతీరుతుందని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు రిఫరెండంగా చూడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై కొద్దిపాటి ప్రభావం చూపుతాయని అంగీకరించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. రైతులకు ఇప్పటికే వడ్డీరహిత రుణాలను అందచేశామన్నారు. వ్యవసాయ రంగంలో, ప్రజాపంపిణీ విభాగంలో తాము చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం పట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న క్రమంలో రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని విపక్షాలు పేర్కొంటున్నాయి. -
రమణ్‌కు ఎదురెవరు?
రాజకీయాల్లో జంటిల్‌మ్యాన్ అనే ఘనత సాధించిన కొద్ది మంది నేతల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రంలో సవాళ్లన్నీ ఎదుర్కొంటూ నేర్పుగా పాలన చేయగలరని పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌కు స్వయంకృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేసి సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ జోగి రూపంలో రమణ్ సింగ్‌కు కలిసివస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. మరో పక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌లో రమణ్ సింగ్‌కు పోటీగా సరైన నాయకుడు కనిపించడంలేదు. ఎవర్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎవరు అలుగుతారో తెలీక అసలు సీఎం అభ్యర్ధి పేరే ప్రకటించకుండానే కాంగ్రెస్ కదనంలోకి దూకింది. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుతూ సీతా స్వయంవరంలాగా ఎన్నికల అనంతరం తమ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎన్నిక జరుగుతుందని చత్తీస్‌గఢ్ ప్రతిపక్షనేత టీఎస్ సింగ్‌దేవ్ గంభీరంగా వ్యాఖ్యానిస్తున్నారు. పలు సర్వేల్లో రమణ్‌సింగ్‌కు పోటీగా ఎవరూ దరిదాపుల్లో కనిపించడంలేదు. దీంతో కేవలం రమణ్ సుదీర్ఘ పాలనపై అసంతృప్తే తమకు కలిసిరావచ్చని ప్రత్యర్ధి పార్టీల్లో ఆశావహులు భావిస్తున్నారు. వ్యతిరేకతా.. క్లీన్ ఇమేజా ? ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల ద్వారా చావల్ బాబా అన్న పేరు సంపాదించుకున్న రమణ్ సింగ్‌ను గత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందలం ఎక్కించాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కాస్త తిరగబడ్డట్లుంది. అయిదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన రమణ్ సింగ్, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. చావల్ బాబాగా పేరున్న ఆయన రైతు సమస్యల్ని పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు రమణ్ సింగ్ సర్కార్‌పై ఆక్రోశంతో ఉన్నారు. ఏ ప్రజాపంపిణీ వ్యవస్థనైతే బలోపేతం చేశారో, అదే వ్యవస్థలో మిల్లర్లతో కుమ్మక్కై నకిలీ బియ్యం పంపిణీకి పరోక్షంగా సహకరించారన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రత్యర్ధులందరూ ఈ వ్యతిరేకతపైనే నమ్మకంతో ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికి రమణ్‌ను గద్దె దింపడం ఖాయమని ఆశిస్తున్నారు. కానీ కోర్టుల్లో రమణ్ క్లీన్ ఇమేజ్ పొందారు. దీంతో జనంలో నిజాయితీపరుడని ఆయనకున్న పేరు చెక్కుచెదరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 41శాతం మంది ప్రజలు రమణ్ సింగే సీఎం కావాలనే కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. తర్వాత స్థానాల్లో అజిత్ జోగీ, సింగ్ దేవ్, భూపేష్ తదితరులున్నారు. అజిత్ ఆశ తీరేనా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో రమణ్ సింగతర్వాత అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడు. ఐఏఎస్ నుంచి సీఎంగా ఎదిగిన జోగీ రాజకీయ వ్యూహరచనలో దిట్ట. రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టున్న నాయకుడు. రాష్ట్ర జనాభాలో 12% ఎస్సీలైతే వారిలో సత్నామీలు 75%వరకు ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పట్టున్న బీఎస్పీతో జతకట్టడం, సీపీఐని కూడా తమ గూటికి లాగేసి ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లను జోగి భారీగా చీలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ దఫా జోగి మార్వాహి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఆయన తన పార్టీని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. గత ఏడాదిలో బస్తర్ నుంచి సర్గూజా వరకు దాదాపు 300 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బూత్ స్థాయిలో 10 లక్షల మంది కార్యకర్తల్ని నియమించారు. ఎక్కడికక్కడ రమణ్‌సింగ్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయలేకపోయింది. 2013లో జరిగిన మావోయిస్టు దాడిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎందరినో కోల్పోయింది. అనంతరం జోగి పార్టీని వీడాక కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే భారం మోయాల్సి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ భాఘేల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టిఎస్ సింగ్‌దేవ్ రేసులో ఉన్నప్పటికీ వారిలో ఎవరికీ రమణ్ సింగ్‌కు ఉన్నంత జనాదరణ లేదు. మరో ఇద్దరు సీనియర్ నేతలు చరణ్ దాస్ మహంత్, తామ్రధావజ్ సాహులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో 24% మంది సింగ్‌దేవ్ సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటే, 20% మంది భూపేష్ భాగల్ వైపు మొగ్గు చూపించారు. టీఎస్ సింగ్ దేవ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరిలోకి ధనవంతుడు. రమణ్ సింగ్ అనుకూలం ♦ పరిపాలనాదక్షత, నిజాయితీ ♦ వ్యాపారుల అండదండలు ♦ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నా ఆగని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతికూలం ♦ 15ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ♦ అధికారుల చేతుల్లో కీలుబొమ్మ అన్న పేరు ♦ రైతులు, గిరిజనుల్లో అసంతృప్తి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి అనుకూలం ♦ రాష్ట్ర రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన ♦ గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టు ♦ బీఎస్పీతో పొత్తు ప్రతికూలం ♦ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో కొనసాగడం ♦ గత వైఫల్యాలు, కుంభకోణాల ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకపోవడం కాంగ్రెస్ అభ్యర్ధులు అనుకూలం ♦ బీఎస్పీ, అజిత్ పొత్తుతో బీజేపీ ఓట్బ్యాంక్కు గండిపడుతుందన్న అంచనాలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలం ♦ బలమైన ఇమేజ్ లేకపోవడం ♦ అంతర్గత కుమ్ములాటలు అక్కడ అన్నీ సాధ్యమే! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పలు ప్రయోగాలకు వేదిక. 1998–2003లో అన్నుపూర్లోని సోహాగ్పూర్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ శబ్నం మౌసీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శబ్నం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అంతేకాదు.. దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ మేయర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఎన్నికయ్యారు. 1999లో కత్నీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కమలా జాన్ విజయం సాధించారు. 1977లో పార్లమెంటుకు ఓ అంధుడైన నేతను పంపించిన ఘనత కూడా మధ్యప్రదేశ్‌కే దక్కుతుంది. యమునా ప్రసాద్ శాస్త్రి రేవా నియోజవర్గం నుంచి 1977 నుంచి 1989 వరకు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 1955లో గోవా ముక్తి పోరాటంలో పోర్చుగీసు పోలీసుల చిత్రహింసలతో ఆయన తన రెండుకళ్లూ పోయాయి. ఈ దఫా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బధిర అభ్యర్థి సుదీప్ శుక్లా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% కోటీశ్వరులే! ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% మంది కోటీశ్వరులే. 2008 ఎన్నికల అప్పుడు 40% మాత్రమే ఉన్న ధనిక ఎంఎల్ఏల సంఖ్య ఐదేళ్లలోనే మరింత పెరిగింది. 2013లో ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్ ప్రకారం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.5.24కోట్లు. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఎన్నికల సంఘానికి పేర్కొన్న లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు రూ.121 కోట్లు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తులు రూ.8.94 కోట్లు మాత్రమే. మరో బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్‌కు రూ.120.39 కోట్లు, సంజయ్ శర్మ అనే మరో కమలం పార్టీ ఎంపీకి రూ.65.42 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 161 మందిలో 118 మంది బీజేపీ ఎమ్మేల్యేలు ఉన్నారు. 2013 ఎన్నికలకు ముందు ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 69%, బీఎస్పీ శాసనసభ్యులు 25% ఉన్నారు. 14 ముస్లిం స్థానాలపై కాంగ్రెస్ దృష్టి రాజస్తాన్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అనేక ప్రయత్నాలూ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రంగా నష్టం చేసిన 14 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో చిన్నాచితకా ముస్లిం పార్టీల కారణంగా ఓట్లు చీలడంతో.. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్, ముస్లిం సంఘాల నేతలకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడిందని.. అందుకే ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి అసమ్మతినేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఎలాగైనా 14 స్థానాల్లో గెలుపొందాలని గట్టి యత్నాలు చేస్తోంది. -
సీఎం కాళ్లు మొక్కిన ముఖ్యమంత్రి
రాయ్‌పూర్ : మాములుగానేతై నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కుతుంటారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ఎక్కడ చూసి ఉండరు. కానీ ఈ అరుదైన సంఘటన మన భారతదేశంలోనే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమణ్ సింగ్(66) వయసులో తన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న వాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(46) కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలోల రమణ్ సింగ్ రాజ్‌నందన్‌గావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఇలా యూపీ సీఎం యోగి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే సీనియర్లు ఇలా యోగికి పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యోగి ఆదిత్యనాథ్ ముందు శిరస్సు వంచి నిల్చుని ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. -
సంతాప సమావేశంలో మంత్రులు నవ్వులు
-
సంతాప సమావేశంలో పడీపడీ నవ్విన మంత్రులు
రాయ్‌పూర్ : దేశం గర్వించదగ్గ రాజకీయ నేత వాజ్‌పేయి. కాంగ్రెసేతర ప్రధానిగా మూడు సార్లు పదవి బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి, తీవ్ర అనారోగ్య ఇబ్బందులతో ఈ నెల 16వ తేదీని కన్నుమూశారు. ఆయన మరణవార్తతో యావత్ భారత దేశం మూగబోయింది. వాజ్‌పేయి చితాభస్మాలను అన్ని రాష్ట్రాల నదీ జలాల్లో నిమజ్జనం చేపడుతున్నారు. అంతేకాక సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన వాజ్‌పేయి సంతాప సభలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాపసభ రాయ్‌పూర్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారంతా వాజ్‌పేయికి విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. కానీ, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అజయ్ చంద్రకర్, వ్యవసాయ శాఖా మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ మాత్రం ముందున్న బల్లను కొట్టుకుంటూ పడీపడీ నవ్వుతూ సంతాప సభను అపహాస్యం చేశారు. సంతాప సభలో పక్కపక్కను కూర్చున్న వీరిద్దరూ జోకులేసుకుంటూ బిగ్గరగా నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చంద్రకర్ ముందున్న టేబుల్ కొడుతూ పడీపడీ నవ్వుతున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ ధరమ్‌లాల్ కౌశిక్ ఆయన చేతిని పట్టుకుని, వారి నవ్వులను ఆపాలని పలుసార్లు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా పాల్గొన్నారు. మంత్రుల వ్యవహరించిన తీరుపై వాజ్‌పేయి అభిమానుల నుంచి, విపక్ష సభ్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. నెటిజన్లు ఈ మంత్రులిద్దరిపై సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన వాజ్‌పేయికి సొంత పార్టీ నేతలిచ్చే గౌరవమిదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. వాజ్‌పేయి బతికి ఉన్నప్పుడే, ఆయన్ను బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదని, మీ నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేత శైలేష్ నితిన్ త్రివేది, విమర్శించారు. ‘బీజేపీ నేతలు అటల్ జీకి గౌరవం ఇవ్వలేకపోతే, కనీసం ఆయనను తక్కువ చేయొద్దు. అటల్ జీ చనిపోయిన తర్వాత ఆయనపై బీజేపీ, రమణ్ సింగ్ చూపిస్తున్న ప్రేమ, గౌరవం ఏమీ లేదు. ఇదంతా కేవలం డ్రామానే’ అని అన్నారు. -
వాజ్‌పేయి అస్థికలతో సీఎం రాజకీయం
రాయ్‌పూర్: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మేనకోడలు, కాంగ్రెస్ నేత కరుణ శుక్లా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం రమణ్ సింగ్ గత పదేళ్లలో ఏనాడు వాజ్‌పేయి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించలేదని.. కానీ ఇప్పడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. వాజ్‌పేయి మరణానంతరం బీజేపీ స్వప్రయోజనాల కోసం ఆయన అస్థికలను, పేరును వాడుకోవటం దారుణమని మండిపడ్డారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. తొలుత బీజేపీలోనే కొనసాగిన కరుణ.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే నయా రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టాలని రమణ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం రమణ్ సింగ్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను దేశంలోని పలు నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్థికలను వివిధ రాష్ట్రాలకు తరలించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు ధరమ్‌లాల్ కౌశిక్, వాజ్‌పేయి అస్థికలను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
చత్తీస్‌గఢ్ గవర్నర్ కన్నుమూత
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ గవర్నర్ బలరాం దాస్ టాండన్(90) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని రాజ్‌భవన్‌కు తరలించారు. అనంతరం ఆయన స్వస్థలం పంజాబ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నా తండ్రిలాంటి వారు.. బలరాం దాస్ టాండన్ మరణం పట్ల సీఎం రమణ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నాలుగేళ్ల పాటు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. విశేషానుభవం కలిగిన ఆయన తనకు పితృ సమానులని పేర్కొన్నారు. ఆరెస్సెస్ ప్రముఖ్‌గా... బలరాం దాస్ టాండన్ 1927లో పంజాబ్‌లో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ప్రచారఖ్‌గా పని చేశారు. జన సంఘ్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1969- 70లో పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1975- 77 ఎమర్జెన్సీ సయమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన బలరాం దాస్ జూలై, 2014లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
‘దేశం ధర్మసత్రం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అక్రమంగా ప్రవేసించి నివశించడానికి భారతదేశం ధర్మసత్రం కాదని ఛత్తీస్‌ఘడ్ సీఎం రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అసోంలో నివసిస్తున్న 40 లక్షల మంది పేర్లను కేంద్రం పౌర జాబితా నుంచి తొలగించడాన్ని ఆయన సమర్ధించారు. దేశంలో ఉంటున్న వాళ్లు గుర్తింపును నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, ఇతర దేశస్తులకు నివాసం ఉండడానికి హక్కులేదని పేర్కొన్నారు. దేశ పౌరులుగా గుర్తింపబడినవారు దేశం నుంచి బహిష్కరణకు గురవుతారని అన్నారు. భారత ప్రభుత్వం రూపొందించిన ఎన్ఆర్సీ చట్టం ఎనిమిదేళ్ల అసోం యువత పోరాటాలకు ఫలితమని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం పౌర జాబితా నుంచి తొలగించిన 40లక్షల మంది భారతీయులుగా నిరూపించుకోవాలని, లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. కాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్సీఆర్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను శుక్రవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో భయాందోళలను సృష్టించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని మండిపడ్డారు. -
‘ సోషల్ మీడియా సామాన్యుల గొంతుక కానీ..’
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుల ఆలోచనలు వ్యక్తపరచడానికి, నైపుణ్యాలను ప్రదర్శించడాని సోషల్ మీడియా ఓ చక్కటి వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ సోషల్ మీడియా డే( జూన్30) శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘యువకులకు సోషల్ మీడియా డే శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య దేశంలో సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇది సామాన్యులు గొంతుక. కోట్లాది మంది సామాన్యులు తమ అభిప్రాయాలను వెల్లడించానికి అవకాశం ఇచ్చింది. పద్దతిగా మంచి కోసం ఉపయోగిస్తే సోషల్ మీడియా ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ చెడు కోసం ఉపయోగిస్తే అంతే స్థాయిలో నష్టం కూడా ఉంది. యువకుల్లారా బాధ్యతాయుతంగా సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా మీ భావాలను ,నైపుణ్యాలను వెల్లడించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కూడా ప్రపంచ సోషల్ మీడియా డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు సోషల్ మీడియా ఒక ఉప్పెనలా దూసుకెళ్తోంది. సామాన్యుడు తన భావాలను వ్యక్త పరచడానికి చక్కటి వేదికైంది. సమాజంలో సానుకూల ప్రభావాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను’ అని సింగ్ ట్వీటర్లో పేర్కొన్నారు. -
‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్ అన్నారు. మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు. -
కన్నడ ప్రజలకు ధన్యవాదాలు : రమణ్‌సింగ్
సాక్షి, బెంగళూరు : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తోన్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ పూర్తి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఛత్తీడ్ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కర్ణాటక ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి పట్టి కట్టిన కన్నడిగులు చారిత్రాత్మక విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడిందని, వారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 112 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. -
‘మోదీకి రాహుల్ పోటి కాదు’
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం పోటీ కాదని చత్తీష్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 40 నుంచి 50 స్థానాలకే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. రాయ్‌పూర్‌లో మంగళవారం ఓ వార్త చానల్‌తో ముచ్చటించిన సీఎం పలు అంశాలపై చర్చించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుందని, తిరిగి మోదీనే ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మద్దతు మోదీకి ఉందని, 2014 ఫలితాల కంటే రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మోదీ నాయకత్వానికి పోటీ లేదన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో నాలుగో స్థానానికి పడిపోయి బెంగాల్లో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకే విపక్షాలు కూటమి కడుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ అందరూ ప్రధాని పదవి కోసమే కూటమిలో చేరుతున్నారని ఆరోపించారు. బీజేపీ మోదీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటి చేస్తుందని తెలిపారు. పుల్పూర్, గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన రమణ్‌సింగ్.. స్థానిక పరిస్థితులు ఒక్కో సారి ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్నారు. -
సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్
రాయ్‌పూర్ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరిగి విజయాన్ని సాధిస్తుందని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎం పలు అంశాలను ప్రస్తావించారు. గడిచిన పదేళ్లల్లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని రమణ్ సింగ్ అన్నారు. గడిచిన ఐదేళ్లల్లో దేశంలో బీజేపీ అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని కేంద్రంలో కూడా తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు విశేష స్పందన వస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కరెంట్, మంచినీరు, విద్య, రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 స్థానాల్లో 10 స్థానాలు తమ పార్టీ విజయం సాధించిందని అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాల ఓటమిపై సీఎం స్పందిస్తూ.. ప్రజల ఆలోచనలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని, ఉప ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపి ప్రభుత్వాలు తప్పక ఏర్పాటు చేస్తుందని రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
ఆ సెక్స్ క్లిప్‌లో ఉన్న మంత్రి ఎవరంటే..
సాక్షి, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మరో రాసలీలల కుంభకోణం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో తన దగ్గర ఉందని ఆరోపణలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ అరెస్టయిన కాసేపటికే ఈ వ్యవహారం వెలుగులోకి రావటం విశేషం. బీబీసీ మాజీ పాత్రికేయుడు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడైన వినోద్ వర్మ గత కొంత కాలంగా తన దగ్గర ఓ ముఖ్యనేతకు సంబంధించిన సెక్స్ క్లిప్ ఉందంటూ చెబుతూ వస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ నేత ప్రకాశ్ బజాజ్ ఆ ఆరోపణలపై వినోద్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ఘజియాబాద్‌లో వినోద్‌ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఆయన్ని తీసుకెళ్తున్న సమయంలో ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన మంత్రి పేరు వెల్లడించటం విశేషం. ఆ వీడియోలో ఉంది పీడబ్ల్యూ శాఖా మంత్రి రాజేష్ మునత్ అంటూ వ్యాఖ్యానించినట్లు మీడియా సంస్థ ఏఎన్ఐ ప్రచురించింది. ఒక మంత్రికి సంబంధించిన స్కాండల్ కావటంతో.. కావాలనే తనని ఇరికించినట్లు ఈ సందర్భంగా వినోద్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇక ఆయన అరెస్ట్‌కు ముందు న్యూఢిల్లీలోని ఓ వీడియోపార్లర్ పై దాడి చేసిన పోలీసులు.. వినోద్ 1000 సీడీలను తయారు చేయాలని కోరినట్లు నిర్వాహకుల నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు చివరకు 500 సీడీలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఉన్న సమాచారం గురించి మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన్ని తదుపరి విచారణ కోసం రాయ్‌పూర్‌కి తరలిస్తున్నారు. కాగా, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వినోద్ వర్మ ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ బాఘెల్‌కు అత్యంత సన్నిహితుడని.. గత కొంత కాలం వాళ్లంతా బీజేపీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత వ్యవహారాలపై కన్నేశారని స్వయంగా ముఖ్యమంత్రి రమణసింగే మీడియాకు చెప్పారు. అయితే తమ పరువు పోకూడదనే బీజేపీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అంటోంది. -
ఆవులను చంపితే ఉరితీస్తాం: ముఖ్యమంత్రి
రాయ్‌పూర్: ఆవులను ఎవరైనా చంపితే ఉరితీస్తామంటూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. రాష్ట్రంలో గోవధకు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఛత్తీస్‌గఢ్‌లో గోహత్య జరుగుతున్నాదా? గత 15 ఏళ్లలో ఎవరైనా హత్య చేశారా? ఎవరైనా ఆవులను చంపితే.. వారిని ఉరితీస్తాం' అంటూ ఆయన నవ్వుతూ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు.. గోవధ, అక్రమ మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గోవధను, అక్రమ మాంసం దుకాణాలను మూసివేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యల ప్రభావం బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాలలోనూ కనిపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. #WATCH: Chhattisgarh CM Raman Singh says 'will hang those who kill (cows)' when asked will Chhattisgarh make any law against cow slaughter. pic.twitter.com/V5fdNs4CEk — ANI (@ANI_news) 1 April 2017 -
‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది’
రాయ్‌పూర్: తీవ్రవాదం, ఉగ్రవాదం అనేవి ఒకే నాణేనికి ఉండే బొమ్మా బొరుసుల్లాంటివని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సుపరిపాలనే మార్గమని ఆయన సూచించారు. ‘హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఉగ్రవాదం’అనే అంశంపై ‘ఇండియా ఫౌండేషన్’సంస్థ ఢిల్లీలో ఒక సదస్సును నిర్వహించింది. రాయ్‌పూర్‌లోని తన అధికారిక నివాసం నుంచి రమణ్ సింగ్ ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ఆకాంక్షల ద్వారా పరిపాలనా వ్యవస్థను బలహీనం చేయడం, భయాన్ని వ్యాపింపజేసి సమాజాన్ని దోచుకోవడమే నక్సలైట్ల లక్ష్యమని రమణ్‌సింగ్ అన్నారు. ‘మావోయిస్టుల అసలురూపం బయటపడింది. వారు బస్తర్‌లో విద్య, ఆరోగ్యం, రహదారులు, కమ్యూనికేషన్ సాధనాలు తదితరాలను నాశనం చేశారు’అని రమణ్ సింగ్ పేర్కొన్నారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ డివిజన్లో సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ, అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోందని రమణ్‌సింగ్ వెల్లడించారు. -
సీఎం కేసీఆర్‌కు రమణ్‌సింగ్ లేఖ
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు గతంలో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన లాంఛనాలను సత్వరంగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఖరీదైన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. దీంతో ఇంత వరకు ఈ ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) ఆమోద ముద్ర వేయలేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు తగ్గించేందుకు ఒప్పందంలో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈఆర్సీ సూచిం చింది. ఈ విషయంలో టీఎస్ఈఆర్సీ ఇంత వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వు లు జారీ చేయకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇంధన మంత్రి ఓ సారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుునా, స్పందన లేకపోవడంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ సీఎం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. -
చంపుడు పందెం!
త్రికాలమ్ నోట్ల గందరగోళంలో దేశం యావత్తూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతోంది. ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ చెప్పిందే చట్టం. బస్తర్ రేంజి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి చేసిందే న్యాయం. రాజ్యాంగాన్ని కానీ, న్యాయవ్యవస్థను కానీ, మానవ హక్కులను కానీ అక్కడి ప్రభువులు గుర్తించరు. తమకు రాజ్యాంగంపైన నమ్మకం లేదంటూ మావోయిస్టులు ముందే ప్రకటించారు. జనతన సర్కార్ నడుస్తోంది ఆ సిద్ధాంతం ప్రాతిపదికపైనే. ఆ సర్కార్‌ను నడవనివ్వడం రాజ్యానికి అవమానకరమంటూ పాలకులు భావిస్తున్నారు. రాజ్యాంగంపైన విశ్వాస రాహిత్యాన్ని బాహాటంగా ప్రకటించిన మావోయిస్టులు ఒకవైపు. రాజ్యాంగం ధర్మమా అని అందలాలు ఎక్కి ఆ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కి తమ వ్యక్తిగత రాగద్వేషాలనే చట్టాలుగా చెలామణి చేయిస్తున్న రాజకీయ నాయకులూ, అధికారగణం మరోవైపు. రెండు పక్షాల మధ్యా నలిగిపోతున్న అమాయక ఆదివాసీ ప్రజలది దయనీయ స్థితి. ఈ రక్తచరిత్రకు శాంతియుతంగా స్వస్తి చెప్పడానికి ప్రయత్నించినవారిని శత్రువులుగా పాలకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సైతం మానవహక్కులకు రక్షణ ఉండాలని వాదిస్తున్నవారిని మావోయిస్టుల మద్దతుదారులుగా ముద్రవేసి రాజద్రోహులుగా చిత్రిస్తున్నారు. ఈ నీతిలో భాగమే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన ప్రొఫెసర్ నందినీ సుందర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, వినీత్ తివారీ, సంజయ్ పరాటే, తదితరులపైన ఐజీ కల్లూరి వ్యూహం ప్రకారం పెట్టిన కేసు. నందిని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి నాలుగువారాల వ్యవధి తర్వాతనే వారిపైన చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్హెచ్ఆర్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ధండ్నీ, ఐజీ కల్లూరినీ ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశించింది. మానవ హక్కుల కోసం వీరోచితంగా పోరాడుతున్న అధ్యాపకులపైన పోలీసులు పెట్టిన అన్యాయపు కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది జరుగుతుండగానే గత మూడు రోజులలో 11 మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌లోని భద్రతాదళాలు హతమార్చాయి. మన మేధావులకు పట్టని హక్కులు ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేసి ‘ఎన్కౌంటర్’ చేసినా, శేషాచలం అడవులలో తమిళనాడు కూలీలను దారుణంగా కాల్చి కాల్చివేసినా ఆంధ్రప్రదేశ్‌లోని పౌరసమాజం తగినంతగా స్పందించలేదు. పౌరహక్కుల సంఘాల బాధ్యతగానే పరిగణించారు కానీ పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అతిపోకడలు పోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తించి ప్రతిఘటించలేదు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకులుగా పని చేస్తున్న మేధావులు ఎవ్వరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కొన్ని దశాబ్దాల కిందట వియత్నాంపైన అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు హైదరాబాద్‌లోనూ, విజయవాడలోనూ, విశాఖపట్టణంలోనూ, ఇతర పట్టణాలలోనూ జరిగాయి. ఇప్పుడు పక్కవాడి మీద పిడుగుపడినా చలించని జడత్వం పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ వారిని అభినందించాలి. సల్వాజుడుం అరాచకాలను అరికట్టాలనీ, ఆ సంస్థను రద్దు చేయాలనీ సుప్రీంకోర్టు 2011లో ఆదేశించడానికి కారణం నందినీ సుందర్ చేపట్టిన ప్రజాప్రయోజన వ్యాజ్యమే (పిల్). బస్తర్‌లో కోయ కమాండోలు సృష్టిస్తున్న మారణహోమాన్ని సాక్ష్యాధారాలతో సహా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట నిరూపించిన కారణంగా సల్వాజుడుంకు స్వస్తి చెప్పాలన్న ఆదేశం వెలువడింది. అరుంధతీరాయ్ వంటి అగ్రశ్రేణి రచయిత నక్సలైట్ల వెంట కీకారణ్యంలో నడిచినా, నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, తదితరులు నిజనిర్ధారణ బృందం సభ్యులుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పర్యటించినా చట్టపాలన సవ్యంగా జరగాలనీ, రాజ్యాంగం ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చినవారు అదే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటించాలనీ, మానవ హక్కులను పరిరక్షించాలనీ ఉద్ఘోషించడానికే. ఈ మేధావులు మావోయిస్టులు ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా అత్యంత బలమైన రాజ్యాన్ని ఓడించి అధికారం హస్తగతం చేసుకుంటారనే విశ్వాసం ఉన్నవారు కాదు. ఆ మార్గంలో అధికారం హస్తగతం చేసుకోవాలని అభిలషిస్తున్నవారు సైతం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందరూ ఆదరించాలని తపిస్తున్నవారు. సంవిధానానికి లోబడి పనిచేయవలసిన రాజకీయ నాయకులూ, ప్రభుత్వాధికారులూ, పోలీసు అధికారులూ చట్టపాలనను గౌరవించాలని కోరుతున్నవారు. అంతులేని రక్తచరిత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి 1980లలో నక్సలైట్లు bè త్తీస్‌గఢ్ ప్రాంతానికి వలస వెళ్ళారు. 2000 నవంబర్ ఒకటిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలలో ఏడు జిల్లాలు ఐదవ షెడ్యూల్ కిందికి వచ్చే ఆదివాసీ జిల్లాలు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం 1996లోనే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియా (పెసా) చట్టాన్ని తీసుకువచ్చారు. స్వయంపాలన హక్కులను ఆదివాసీలకు ఇవ్వాలన్నది ఈ చట్టం లక్ష్యం. భారత భూభాగంలో నాలుగు శాతం విస్తీర్ణం ఛత్తీస్గఢ్ది. ఈ రాష్ట్రంలో 44 శాతం విస్తీర్ణంలో అడవులు. దేశంలోని ఖనిజ ఉత్పత్తులలో 13 శాతం ఈ రాష్ట్రం నుంచే. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ వంటి ఖనిజాలు అపారం. వజ్రాలు, బంగారు, రాగి, సీసం, జింక్, తదితర నిక్షేపాలు దండిగా ఉన్నాయి. దేశంలో ఉన్న బొగ్గులో 16 శాతం ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంది. ఇంత ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పెత్తనం కాంట్రాక్టర్లదీ, వ్యాపారులదీ, అధికారులదీ, ఆదివాసీలు కానివారందరిదీ. రమణ్‌సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మ నాయకత్వంలో నక్సలైట్లపైన పోరాటం చేయడానికి కోయతెగకు చెందిన యువకులకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ప్రైవేటు సైన్యం తయారుచేశారు. దానికి వికాస్ సంఘర్ష్ సమితి అని పేరు పెట్టారు. అదే సల్వాజుడుం. అదే సంవత్సరం ఖనిజ సంపద వినియోగానికి టాటాలతో, ఎస్సార్ కంపెనీతో రమణసింగ్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకోవడం కాకతాళీయం కాదు. దశాబ్దాలుగా ఆదివాసీలను దోచుకోవడం నిరాఘాటంగా సాగిపోతోంది. వారు న్యాయవ్యవస్థను ఆశ్రయించి హక్కులను సాధించే అవకాశం లేదు. చట్టాలున్నవి వారికి న్యాయం చేయడానికి కాదు. శాంతిసుస్థిరతలు నెలకొల్పేందుకు అసలే కాదు. హింసించే సాధనాలుగానే ఉపయోగపడుతున్నాయి. వాటివల్ల జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భద్రతాదళాల విడిది ఉంది. కొన్ని గ్రామాలలో అయితే రెండు కిలోమీటర్లకు ఒక మిలటరీ క్యాంపు ఉంటుంది. ప్రతి 45 మంది ప్రజలకు ఒక సాయుధ జవాను ఉంటాడు. మొత్తం 58,772 పారామిలటరీ జవాన్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంటి ఆదాయం నెలకు వేయి నుంచి రెండున్నర వేల వరకూ ఉంటుంది. నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకం) ఇప్పుడు అమలు జరగడం లేదు. ఏడు సంవత్సరాల కిందట ఈ పథకం కింద చేసిన పనికి ఇంతవరకూ ప్రతిఫలం ముట్టలేదు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి రోడ్లు వేయడానికి సిద్ధం. నక్సలైట్లు రోడ్లు వేయడానికి వ్యతిరేకం. అభివృద్ధి శూన్యం. సల్వాజుడుం కార్యకలాపాలకు తోడు 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలయింది. నక్సలైట్లను ఏరివేయాలని సంకల్పం. అది నెరవేరలేదు కానీ సాయుధ దళాలకూ, నక్సలైట్లకూ మధ్య జరుగుతున్న పోరాటంలో నక్సలైట్లూ, భద్రతాదళ సిబ్బందీ, అమాయక గిరిజనులూ చనిపోతున్నారు. 2013లో నక్సలైట్లు సృష్టించిన హింసాకాండలో మహేంద్రకర్మ, వీసీ శుక్లా సహా అనేకమంది కాంగ్రెస్ నాయకులు మరణించారు. మహేంద్రకర్మ కుమారుడు ఇటీవల సల్వాజుడుం–2ను ప్రారంభించాడు. వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు దిక్కుతోచని పక్షులైనారు. ఇద్దరు గ్రామీణ జర్నలిస్టులు సాయిరెడ్డి, నెమీచంద్ జైన్‌ను నక్సలైట్లు చంపివేశారు. ఇటీవల 2016 ఫిబ్రవరి 8న స్క్రోల్ డాన్ ఇన్‌కు పనిచేస్తున్న జర్నలిస్టు మాలినీ సుబ్రమణియన్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. నక్సలైట్లను సమర్థిస్తున్న కారణంగా జగదల్పూర్ వదిలి వెళ్ళాలంటూ ఆదేశించారు. బీబీసీ హిందీ విభాగంలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అశోక్ పుతుల్‌ను ‘సామాజిక్ ఏక్తా మంచ్’ సభ్యులు బస్తర్ వీడి వెళ్ళిపోవాలంటూ ఆజ్ఞాపించారు. ఐజీ, ఎస్పీలను కలుసుకునేందుకు అశోక్ ప్రయత్నిస్తే, ‘మేము జాతీయవాదులతోనూ, దేశభక్తులతోనూ మాత్రమే మాట్లాడతాం’ అంటూ అవమానించారు. ఇది కాదు పరిష్కారం సాయుధ పోరాటం పరిష్కారం కాదని రెండు పక్షాలూ గ్రహించినప్పుడే శాంతి నెలకొంటుంది. అంతవరకూ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధంలో ధర్మాధర్మ విచక్షణ ఉండదనీ, అన్నీ ఆమోదయోగ్యమే కావాలనీ పోలీసు యంత్రాంగం వాదన. పోలీసు అధికారగణం మాట కాదనే సాహసం రాజకీయ నాయకత్వానికి లేదు. అందుకే చంపుడు పందెం ఆగడం లేదు. సల్వాజుడుం అత్యాచారాలకు ప్రతిగా నక్సలైట్ల హింసాకాండ కొనసాగింది. మాజీ నక్సలైట్లకూ, లొంగిపోయిన సంఘసభ్యులకూ, నిరుద్యోగ ఆదివాసీ యువకులకూ ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు (ఎస్పీఓలు)గా పిలిచి నక్సలైట్లమీదికి పురిగొలిపే పేరుతో గ్రామాలపైకి పంపించారు. నక్సలైట్ల దళాలలోని సాయుధులలోనూ ఆదివాసీ యువతీయువకులే అధికం. ఆదివాసీలపైన ఆదివాసీలతోనే యుద్ధం చేయించడం తెలుగు పోలీసులు పాటించిన యుద్ధనీతి. నయీం వంటి నరహంతకుడు రెండు దశాబ్దాలపాటు పోలీసుల మద్దతుతో నేరసామ్రాజ్యాన్ని ఏలడానికి ఇదే నీతి కారణం. అటువంటి నీతి పాటించినందుకు రాజకీయ నాయకులు కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ పశ్చాత్తాపం చెందిన దాఖలా లేదు. ఛత్తీస్‌గఢ్‌లో అంతులేని హింసాకాండతో విసిగిపోయి సుమారు లక్షమంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నారు. ఆదివాసీ మహిళలపైన భద్రతాదళాలు చేసిన అత్యాచారాలనూ, ఇన్ఫార్మర్లంటూ ఆదివాసీలను నక్సలైట్లు హత్య చేసిన ఉదంతాలనూ నమోదు చేసి మానవాధికారాలు ఛత్తీస్‌గఢ్‌లో అడుగంటాయంటూ నందినీ సుందర్ 2007లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పనిచేస్తున్న నందిని ‘సబాల్టర్న్ అండ్ సావరీన్స్ :ఆంత్రొపొలాజికల్ హిస్టరీ ఆఫ్ బస్తర్ (1856–1996)’ పేరుతో ప్రామాణికమైన గ్రంథం రచించారు. ‘ది బర్నింగ్ ఫారెస్ట్: ఇండియాస్ వార్ ఇన్ బస్తర్’ పేరుతో తాజా పుస్తకం వెలువరించారు. ఛత్తీస్గఢ్పైన ఆమెకు పూర్తి అవగాహన ఉంది. తోటి ప్రొఫెసర్లూ, హక్కుల నాయకులూ, న్యాయవాదులతో కలిసి ఆమె మే 12 నుంచి 16 వరకూ బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మ, బస్తర్, కంకెర్ జిల్లాలలో పర్యటించారు. సామ్నాథ్ బఘెల్ అనే ఆదివాసీ యువకుడిని నక్సలైట్లు నవంబర్ నాలుగో తేదీన హత్య చేశారు. హతుడి భార్య విమల పేరు మీద ఐజీ కల్లూరి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు. నందినీ, తదితర హక్కుల కార్యకర్తలు సామ్నాథ్ను ఫోన్లో బెదిరిస్తూ ఉండేవారనీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమానికి స్వస్తి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చేవారనీ ఫిర్యాదు చేసినట్లు కల్లూరి అంటున్నారు. నందినిపైన కానీ, మరొకరిపైన కానీ తాను ఎటువంటి ఆరోపణా చేయలేదంటూ విమల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుడు జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఛత్తీస్‌గఢ్ పోలీసులనూ, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నందిని, తదితరులపైన చేసిన ఆరోపణలను నిరూపించడం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వల్ల కాని పని. కానీ హక్కుల కార్యకర్తలను కోర్టుల చుట్టూ తిప్పడం, వారికి విసుగు కలిగి పోరాటం విరమించుకునే విధంగా వ్యవహరించడం పోలీసు వ్యూహంలో భాగం. మానవ హక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్నవారిని నైతికంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించకపోతే సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించి నియంతృత్వం వైపూ, అమానవీయమైన అరాచక వ్యవస్థవైపూ ప్రయాణం అనివార్యం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
విద్యార్థులకు క్లాస్ చెప్పిన సీఎం
రాజనంద్‌గావ్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. రాజనంద్‌గావ్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పిల్లలకు పాఠాలు బోధించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. తరగతి ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు సబెక్టులు గురించి విద్యార్థులతో చర్చించానని చెప్పారు. తనను విద్యార్థులు వివిధ రకాల ప్రశ్నలు అడగం విశేషమని ఆయన వెల్లడించారు. తమ ఇళ్లలో మరుగుదొడ్లు లేవని నలుగురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చొనట్టు చెప్పారు. నెల రోజుల్లో ప్రభుత్వం టాయిటెట్లు కట్టిస్తుందని విద్యార్థులకు హామీయిచ్చానని రమణ్ సింగ్ తెలిపారు. -
విద్యార్థులకు పర్సనల్ గైడ్ అయిన సీఎం
రాయ్‌పూర్: వీఐపీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గించడంకోసం చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 100 మంది విద్యార్థులకు ఆయన పర్సనల్ గైడ్‌గా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతానికి చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు. రెండు రోజుల విహారయాత్ర కోసం వారు రాయ్‌పూర్‌కు వచ్చేందుకు సీఎం ఏర్పాట్లు చేయించారు. రాయ్‌పూర్‌లో విద్యార్థులు సైన్స్ సిటీ, ప్లాంటోరియం చూశారు. షాపింగ్ మాల్, సినిమాకు వెళ్లారు. 6, 7, 8 వ తరగతులకు చెందిన విద్యార్థులతో రమణ్ సింగ్ తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పక్షులు, చెట్లు గురించి వారితో చర్చించారు. విద్యార్థుల సమస్యలు, చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి తమతో ఆప్యాయంగా మాట్లాడేసరికి విద్యార్థులు సంతోషించారు. -
ఆ ఐఏఎస్ అధికారికి శిక్ష పడింది!
హైదరాబాద్ : అనుచితంగా ప్రవర్తించిన ఓ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీల సందర్భంగా ఓ యువ ఐఏఎస్ అధికారి.. రోగి బెడ్‌పై కాలు ఉంచి మాట్లాడుతుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి ప్రభుత్వం ఆ అధికారిపై సస్పెండ్ వేటు వేసింది. అంతేకాదు.. కొత్తగా వచ్చే అధికారులకు దీనిని ఒక పాఠంగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జగదీష్ శంకర్ 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతవారం బల్రాంపూర్లోని స్థానిక రామానుజ్‌గంజ్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై రోగులతో ఆయన మాట్లాడారు. ఒక రోగితో మాట్లాడుతున్న సమయంలో జగదీష్ శంకర్ తన బూటు కాలిని ఆమె బెడ్‌పై ఉంచారు. దీనిని ఓ ఆగంతకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిని చూసిన వారంతా సదరు ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయటంతోపాటు ప్రజలతో ఎలా మెలగాలో కొత్తగా వచ్చే అధికారులకు నేర్పాలంటూ సాధారణ పరిపాలన విభాగాన్ని ఆదేశించారు. -
చత్తీస్‌గఢ్ సీఎంకు తప్పిన పెను ప్రమాదం
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రమణ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సాంకేతికలోపం ఏర్పడింది. సోమవారం కుసుమా నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ 4 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో అక్కడ నుంచి ఒకేసారి 150 అడుగుల కిందకు పడిపోయింది. కాగా పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను నియంత్రించి సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
పార్లమెంట్లో సీఎంల మంటలు!
బీజేపీ ముఖ్యమంత్రులపై ఆరోపణలతో దద్దరిల్లనున్న సమావేశాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు టార్గెట్ 21 నుంచి మొదలుకానున్న వర్షాకాల సమావేశాలు న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఆరోపణలు ఈసారి పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనున్నాయి. వారు గద్దె దిగాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో గొంతెత్తనున్నాయి. జూలై 21నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణం వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, లలిత్‌గేట్ స్కాంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, పీడీఎస్ స్కాంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లపై ఆరోపణలను అస్త్రంగా మలిచి ప్రధాని నరేంద్రమోదీని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీ సీఎంలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్(కాంగ్రెస్) వ్యవహారాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. త్రిపురలో చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సర్కార్(సీపీఎం)ను నిలదీసేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేకపోతున్నారని విమర్శలపాలవుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), అనేక అంశాలపై కేంద్రంతో విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు సంధించనున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతమంది సీఎంలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించలేదు. ఈసారి మాత్రం ముఖ్యమంత్రులపై ఆరోపణలే ప్రధానాస్త్రాలుగా ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతుండడం గమనార్హం. అలాగే లలిత్‌మోదీకి వీసా సాయమందించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, విద్యార్హతల విషయంలో వివాదంలో చిక్కుకున్న మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ప్రధాని భేటీకి కాంగ్రెస్ సీఎంల డుమ్మా! భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు 15న మోదీ తలపెట్టిన సీఎం సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించనున్నారు. భూసేకరణ బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు, ఈ సమావేశాల్లోనైనా బిల్లును గట్టెక్కించే ఉద్దేశంతో భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కాబోనని బెంగాల్ సీఎం మమత ఇప్పటికే వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత తొమ్మిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరైతే దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలలో ఏకంగా 10 మంది ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టినట్టవుతుంది! నేడు సోనియా ఇఫ్తార్ విందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం పలు పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు తమతో కలసి వచ్చే పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ విందు సమావేశంలో సోనియా.. నేతలతో చర్చించనున్నారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), శరద్‌పవార్(ఎన్సీపీ), సీతారాం ఏచూరి(సీపీఎం), దేవెగౌడ(జేడీఎస్), అహ్మద్(ఐయూఎంఎల్), కనిమొళి(డీఎంకే), డి.రాజా(సీపీఐ), సుధీప్ బంధోపాధ్యాయ(తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)కు ఆహ్వానాలు పంపారు. -
సిగ్గుచేటు.. మృతి చెందిన జవాన్లు ఇంకా అడవిలోనే
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు పోలీసుల మృతదేహాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఇది దేశానికే సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. వీర మరణం పొందినవారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రమణ్‌సింగ్ ప్రభుత్వం అవమానపరిచిందని తప్పుబట్టింది. శనివారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు పోలీసులు చనిపోగా.. 12 మంది గాయాలపాలయ్యారు. గత ఆరు నెలల్లో మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఘటన కూడా ఇదే . 2013లో సాల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ సహా కాంగ్రెస్ నాయకులు, జవాన్లను హతమార్చిన మావోయిస్టులు.. పోలీసులను పెద్ద ఎత్తున చుట్టుముట్టడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం. ఈ విషయంపై కాంగ్రెస్ నేత ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ 'ఛత్తీసగఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమరులైన పోలీసులకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. చనిపోయిన వారి మృతదేహాలు ఇంకా అడవిలోనే ఉండటం సిగ్గు చేటు' అని అన్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం సమయంలో వారి మృతదేహాలు తరలించారు. -
ఆ శక్తి కేసీఆర్ కు ఉంది:రమణ్ సింగ్
రాయ్ పూర్: తెలంగాణ రాష్ట్రంతో బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నామని చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని సమస్యలుంటాయో తమకు తెలుసుని రమణ్ సింగ్ తెలిపారు. ఆ సమస్యలను అధిగమించే శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. కరెంట్ సరఫరా కోసం విద్యుత్ సరఫరా లైన్లను త్వరగా నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు రమణ్ సింగ్ స్సష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఎంఓయూ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. -
దత్తాత్రేయకు చత్తీస్‌గఢ్ సీఎం ఫోన్
హైదరాబాద్: బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివారం ఫోన్ చేశారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై రమణ్ సింగ్ ఆరా తీశారు. రమణ్ సింగ్ దత్తాత్రేయను చత్తీస్‌గఢ్ రావాల్సిందిగా ఆహ్వానించారు. చత్తీస్‌గఢ్, తెలంగాణల మధ్య రేపు జరగనున్న విద్యుత్ ఎంవోయూలో పాల్గొనాల్సిందిగా దత్తాత్రేయను కోరారు. దత్తాత్రేయ కాసేపట్లో చత్తీస్‌గఢ్‌కు బయల్దేరనున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో ప్రజాపంపిణీ బాగుంది:బాబు
-
పోలవరం ప్రాజెక్ట్‌పై రమణ్‌సింగ్‌తో చర్చలు
-
అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్
ఏపీ సీఎం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో రెండు రాష్ట్రాల నిర్ణయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ఉమ్మడి అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ శాఖల సీనియర్ అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు డాక్టర్ పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, ఎంపీలు సి.ఎం.రమేష్, గల్లా జయదేవ్, ఇతర పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం ఉంది. వీరు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. స్థానికంగా పరిపాలన తీరు, పాలనలో ఐటీ వినియోగం, ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చిపుచ్చుకోవాల్సిన సహకారంపై చర్చించారు. చంద్రబాబు బృందం ఆ రాష్ట్ర రాజధాని నయా రాయపూర్ నిర్మాణ తీరుతో పాటు భూ సేకరణకు అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో చర్చించారు. ఆ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామికవేత్తలతో భేటీలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. స్థానికంగా సత్య సాయిబాబా ట్రస్ట్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవిని ఆస్పత్రిని కూడా పరిశీలించారు. కబన గ్రామాన్ని చంద్రబాబు బృందం సందర్శించింది. నా పర్యటన ఫలప్రదమైంది... చంద్రబాబు రాయపూర్‌లో రమణ్‌సింగ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. తన పర్యటన ఫలప్రదమైందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో పరస్పర సహకారం కోసం టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామన్నారు. నయా రాయ్‌పూర్ నిర్మాణానికి భూ సేకరణ జరిగిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ భూ సేకరణ జరిగిందన్నారు. ఏపీ కూడా నూతన రాష్ట్రమేనని, ఛత్తీస్‌గఢ్‌లా తమకూ ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం జరగబోతోందని, అక్కడ మౌలిక సదుపాయాలు, హార్డ్‌వేర్, ఆగ్రో ప్రాసెసింగ్ త దితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశం కోర్టు పరిధిలో ఉందంటూ దీనిపై వ్యాఖ్యానించేందుకు రమణ్‌సింగ్ నిరాకరించారు. పోలవరం నిర్మాణానికి సహకరించాలని కోరా సోమవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ తిరిగివచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 1978, 1980ల్లో జరిగిన ఒప్పందాల గురించి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్‌కు వివరించి.. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ‘‘పోలవరం నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని రమణ్‌సింగ్ పేర్కొన్నారు. కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఉదారంగా పునరావాస ప్యాకేజీ ఇస్తుందని, అందుకు అంగీకరించాలని ఆయనను కోరాను’’ అని సీఎం చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వరకూ జాతీయ రహదారి నిర్మాణం, రోడ్డు, రైలు, విమాన మార్గాలను మెరుగు పరచటంపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బాబు తెలిపారు. నయా రాయ్‌పూర్ నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ, సమీకరణ విధానాలు, కొత్త చట్టాల గురించి, అక్కడి ప్రజా పంపిణీ విధానం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కార్మిక సంక్షేమంతో పాటు పలు శాఖల్లో ఐటీని వినియోగిస్తున్న విధానాలను అధ్యయనం చేశామని వివరించారు. ఈ పర్యటన మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న వారు కూడా తెలుగువారే.. సమానంగా చూడాలి... తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ ఉత్తర్వులపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో ఉన్న వారు కూడా తెలుగువారే. తెలంగాణలో స్థానికతను నిరూపించుకున్న వారికే ఫీజులు చెల్లిస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 58 శాతం ఫీజు భరిస్తానని నేను గతంలోనే ప్రతిపాదించాను. ఆ ప్రభుత్వం నా మీద పడింది. ఇది సరికాదు. అందరినీ సమానంగా చూడాలి. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను. ఈ నగరం వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే తెలంగాణ ఆదాయం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రభుత్వం విభిన్నంగా ప్రవర్తిస్తోంది. అభ్యంతరం పెట్టకుండా సహకరించాలి’’ అని పేర్కొన్నారు. -
ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
దాడి చేసిన నక్సల్స్‌ను వేటాడతామన్న హోం మంత్రి ఛత్తీస్‌గఢ్‌లో షిండే పర్యటన.. నక్సల్స్ దాడి మృతులకు నివాళులు ఎన్ఐఏతో దర్యాప్తు జరిపిస్తాం చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు సహా 16 మందిని బలితీసుకున్న నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శపథం చేశారు. మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. షిండే, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, గవర్నర్ శేఖర్దత్లు.. నక్సల్స్ దాడిలో మృతిచెందిన 15 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలకు జగ్దల్పూర్లో నివాళులర్పించారు. దర్బాఘాట్కు వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జగ్దల్పూర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఘటన పూర్వాపరాలపై చర్చించారు. సీఎం, గవర్నర్, ఇతర సీనియర్ అధికారులతో షిండే సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, భద్రతా దళాలు మోహరించటం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతుండటం వల్ల ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నారని తమకు నివేదికలు అందాయని చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో ఈ దాడికి తెగబడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు... ‘‘మేం తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం ఎలా తీర్చుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘గతంలో చేసినట్లుగానే కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి.. ఈ దాడిలో ప్రమేయం ఉన్న మావోయిస్టులను వేటాడతాయి. వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలుసు’’ అని షిండే బదులిచ్చారు. గత ఏడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల తరహాలోనే.. రాష్ట్రం లో లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని.. తగినన్ని భద్రతా దళాలను అందిస్తామని చెప్పారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి... నక్సల్స్ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తుందని షిండే తెలిపారు. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘ఇలాంటి ఘటన ఇది రెండోది. దీనిపై ఇప్పటికే చర్చించాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు బలగాలు చేయాల్సిన పని చేస్తాయని మాకు విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు. పౌరుడి ప్రాణం తీసిన హెడ్ ఫోన్! ఇదిలావుంటే.. మంగళవారం మావోయిస్టుల దాడిలో భద్రతా సిబ్బందితో పాటు చనిపోయిన పౌరుడు విక్రమ్నిషాద్.. తన చెవులకు హెడ్ ఫోన్ పెట్టుకుని మొబైల్ ఫోన్ నుంచి పాటలు వింటూ బైక్‌పై వచ్చి ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెప్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్ ఉండటం వల్ల అతడు కాల్పుల శబ్దం వినలేదని, సమీపంలోని వారు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. దాడిలో పాల్గొన్న నక్సలైట్ల ఆచూకీ కోసం కూంబింగ్ ఆపేషన్ మొదలుపెట్టినట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. దాడి నేపధ్యంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ విభాగం 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. 9వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్స్ హింస వల్ల గత రెండు దశాబ్దాల్లో 12,183 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో 9,471 మంది పౌరులు కాగా.. 2,712 మంది భద్రతా సిబ్బంది. ఛత్తీస్‌గఢ్ సంతలో నక్సల్స్ కాల్పులు చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో గ్రామీణుల వేషధారణలో వచ్చిన నక్సల్స్ పేట్రేగిపోయా రు. జనసమ్మర్ధంగా ఉండే వారాంతపు సంతలోకి బుధవారం ప్రవేశించిన మావోయిస్టులు అన్నదమ్ములైన వ్యా పారులు రూపేంద్ర కాశ్యప్, కేదార్నాథ్ కాశ్యప్లపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. రూపేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా కేదార్ పరిస్థితి విషమంగా ఉంది. -
జవాన్ల మృతికి షీండే,రమణ్ సింగ్ సంతాపం
-
ఛత్తీస్ సీఎంగా రమణ్‌సింగ్ ప్రమాణం
రాయ్‌పూర్: వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 61 ఏళ్ల డాక్టర్ రమణ్‌సింగ్ వరుసగా మూడోసారి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ శేఖర్ దత్ ప్రమాణం చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ (గుజరాత్), శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ పరేకర్ (గోవా), ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్), ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే సింథియా (రాజ స్థాన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు) హాజరయ్యారు. అలాగే బీజేపీ నాయకులు హర్షవర్ధన్ సింగ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, అనంత్‌కుమార్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా తదితరులు విచ్చేశారు. -
మూడోసారి సీఎంగా రమణ్‌సింగ్ ప్రమాణస్వీకారం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విజయం సాధించిన ఆయన సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టారు. రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రముఖ నేతలు ఎల్కే అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి,నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, శివరాజ్‌చౌహాన్, గోవా ముఖ్యమంత్రి పారికర్ హాజరయ్యారు. కాగా రాష్ట్ర కేబినెట్ మరో వారంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. -
‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌తో రమణ్‌సింగ్ హ్యాట్రిక్
‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌తో రమణ్‌సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా మూడోసారి ఘన విజయాన్ని సాధించారు. విపక్షాల్లో సైతం రమణ్ సింగ్‌ను విమర్శించేవారు కొద్దిమంది మాత్రమే. ఆయుర్వేద వైద్యుడైన రమణ్ సింగ్ 1983లో రాజకీయాల్లో ప్రవేశించి కవర్ధా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ విభజనకు ముందు 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసే పరిస్థితి ఏర్పడలేదు. పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగినా ఇంతవరకు ఆయనపై రాజకీయంగా ఎలాంటి మరకలూ లేవు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల మీదుగా ఆరువేల కిలోమీటర్ల దూరం ‘వికాస్ యాత్ర’ సాగించి, ఓటర్లలో తనకున్న పట్టు నిరూపించుకున్నారు. తొలిసారిగా 2003లో అదృష్టం కలసిరావడం వల్లే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారని అంతా అనుకున్నారు. ప్రజలతో మమేకం కావడం ద్వారా ఆయన విమర్శకుల అంచనాలను పటాపంచలు చేసి, రెండోసారి కూడా అధికారంలోకి రాగలిగారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయానికి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాత్రమే కారణమని మోడీ ప్రచారం ‘బోనస్’ మాత్రమేనని రమణ్ సింగ్ అనుచరులు చెబుతున్నారంటే, ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గల ప్రజాదరణ ఎలాంటిదో అర్థమవుతుంది -
రమణ్‘కింగ్’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ముచ్చటగా మూడోసారి కమలం వికసించింది. కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముకున్న సానుభూతి పవనాలు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఉత్కంఠభరిత పోరులో విజయం చివరికి కమలం పార్టీనే వరించింది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకుగాను 49 స్థానాలను కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి కూడా 39 స్థానాలతో సరిపెట్టుకుని ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైంది. బీఎస్పీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరో చోట నెగ్గారు. గత ఏడాది మావోయిస్టుల దాడిలో అగ్రనేతలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. సానుభూతి పవనాలపై గంపెడాశలు పెట్టుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం తమ ప్రచార సభల్లో నక్సల్ దాడి ఘటననే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లను అభ్యర్థించారు. శాంతిభద్రతలు కాపాడడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రజలు ప్రస్తుత సీఎం రమణ్‌సింగ్‌కే జైకొట్టారు. ఒక్క బస్తర్ డివిజన్ మినహా మిగిలిన చోట్ల ఎక్కడా కాంగ్రెస్ సానుభూతి అస్త్రం పనిచేయలేదు. ఈ డివిజన్లో మాత్రం బీజేపీపై హస్తం ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. మొత్తం 12 స్థానాల్లో ఎనిమిదింటిలో విజయం సాధించి బీజేపీ ఆధిక్యతను గణనీయంగా తగ్గించింది. రెండు పార్టీలకు ఓటరు షాక్.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి వరుసగా ఆరేడు సార్లు నెగ్గినవారితోపాటు రమణ్ సర్కారులో పనిచేస్తున్న ఐదుగురు మంత్రులను ఇంటిదారి పట్టించారు. కాంగ్రెస్ ముఖ్య నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఓటమి పాలయ్యారు. సాజా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందిన ఈయన ఈసారి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పటికి కాంగ్రెస్ తరఫున ఏడు సార్లు నెగ్గిన గిరిజన నేత రామ్‌పుకార్ సింగ్, మరో గిరిజన నేత బోధ్రామ్ కన్వార్ కూడా పరాజయం పాలయ్యారు. ప్రతాప్పూర్ స్థానం నుంచి బరిలోకి దిగిన మరో ముఖ్య నేత ప్రేమ్సాయ్ సింగ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌సేవక్ పైక్రా చేతిలో ఓటమిపాలయ్యారు. అవిభాజ్య మధ్యప్రదేశ్ సీఎం శ్యామ్చరణ్ శుక్లా తనయుడు అమితేష్ శుక్లా కూడా ఓడి పోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కుమారుడు అరుణ్ కూడా దుర్గ్ స్థానాన్ని బీజేపీకి సమర్పించుకున్నారు. ముఖ్య నేతలు ఓటమి పాలైనా మాజీ సీఎం అజిత్‌జోగీ తనయుడు అమిత్ జోగీ మాత్రం బీజేపీ అభ్యర్థిపై నెగ్గడం గమనార్హం. బీజేపీ ముఖ్య నేతలు కూడా మట్టికరిచారు. రమణ్‌సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న నాన్కీ రామ్ కన్వార్, ఇతర మంత్రులు చంద్రశేఖర్ సాహూ, రామ్ విచార్ నేతమ్, లతా ఉసెండీ, హేమ్చంద్యాదవ్లతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నారాయణ్ చందేల్ ఓడారు. కాంగ్రెస్ దెబ్బతింది ఇలా.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవర్నీ ప్రకటించకపోవడం దెబ్బకొట్టింది. క్యాడర్లో ఉత్సాహం నింపాల్సిన నాయకులు జనంలోకి వెళ్లలేదు. దంతేవాడలో జరిగిన నక్సల్స్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ ‘సానుభూతి’ ఓట్లపై ఆశలు పెట్టుకోవడం పార్టీ కొంపముంచింది. పార్టీ సీఎం అభ్యర్థిగా అజిత్‌జోగి పేరు అనధికారికంగా వినిపించినా ఆయనవైపు ప్రజలు మొగ్గుచూపలేదు. గతంలో మూడేళ్లపాటు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన గూండాయిజాన్ని ప్రోత్సహించారని, తమ వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ గెలిచినా అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని బీజేపీ శ్రేణులు కిందిస్థాయిలో చేసిన ప్రచారం కొంతమేర పనిచేసింది. -
నలుగురిలో చౌహానే ధనిక సీఎం
న్యూఢిల్లీ: ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాలుగు రాష్ట్రాలకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నవారి ఆస్తులు, అప్పుల వివరాలివి(ఎన్నికల సంఘానికి వారు తెలిపిన లెక్కల ప్రకారం). మట్టిమనిషి.. శివరాజ్‌సింగ్ చౌహాన్ సాధుశీలి. మృదుభాషి. నిరాడంబరతకు మారుపేరు. సాదాసీదా ఆహార్యంతో చూడగానే ‘మనలో ఒకడు’ అన్పించే వ్యవహార శైలి శివరాజ్‌సింగ్ చౌహాన్ సొంతం. వీటికి తోడు రైతు బిడ్డ అన్న తిరుగులేని ఇమేజీ. సొంత పార్టీతో పాటు దేశమంతా నరేంద్ర మోడీ నామ జపం చేస్తున్నా, 54 ఏళ్ల ఈ హ్యాట్రిక్ వీరుడు మాత్రం ఎప్పట్లాగే లో ప్రొఫైల్‌నే నమ్ముకున్నారు. తనదైన శైలిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. 1959లో శిహోర్ జిల్లా జౌత్ గ్రామంలో ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్ బాయి అనే రైతు దంపతులకు జన్మించిన చౌహాన్లోని నాయకత్వ లక్షణాలు పాఠశాల దశలోనే బయటపడ్డాయి. ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుపాలయ్యారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన చౌహాన్ ఫిలాసఫీలో గోల్డ్ మెడలిస్టు కూడా. 1990లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించిపెట్టిన ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి ఏడాదికే తప్పుకోవడంతో చౌహాన్ దశ తిరిగింది. తర్వాత ఏడాది పాటు సీఎంగా ఉన్న బాబూలాల్ గౌర్ నుంచి 2005లో పగ్గాలు స్వీకరించిన ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈసారి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ‘గత పదేళ్లలో నేను రాష్ట్రాన్ని సీఎంగా పాలించలేదు. మీ సోదరునిగా, కొడుకుగా, మామయ్యగా పాలించాను’ అంటూ గ్రామీణుల మది దోచుకున్నారు. మృదుత్వం పాళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన అంత ప్రభావశీలి కారని విమర్శకులు అంటుంటారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది. మొత్తం 90 స్ఠానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ కు షాకిచ్చింది. కాంగ్రెస్ 39స్థానాల్లో మాత్రమే సరిపెట్టుకుంది. బీస్సీపీ అభ్యర్థి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. రాజ్‌నంద్‌గాం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ 35,866 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రమణ్ సింగ్‌కు 86,797 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అల్కా ముదిలియార్‌కు 50,931 ఓట్లు వచ్చాయి. అల్క భర్త మావోయిస్టుల దాడిలో మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి రామ్ విచార్ నేతం 11,592 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్ వ్యవసాయశాఖ మంత్రి చంద్రశేఖర్ సాహు కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ధనేంద్ర సాహు పై 8354 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
రమణ్‌సింగ్ ఓడిపోవడం ఖాయం: అల్కా
-
రమణ్‌సింగ్ ఓడిపోవడం ఖాయం: అల్కా
జగదల్పూర్ : అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ ఓడిపోవడం ఖాయమని... ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అల్కా మొదలియార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పోటీ చేస్తున్న రాజ్‌నంద్‌గావ్‌లో ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున అల్కా మొదలియార్ బరిలోకి దిగారు. ఆమె భర్త ఉదయ్ మొదలియార్.... మే 25న జరిగిన మావోయిస్టుల దాడిలో కన్నుమూశారు. రాజ్‌నంద్‌గావ్‌లో ఆమె సోమవారం ఉదయం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్నీ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సహజమేనని, కాని తాను గట్టి నమ్మకంతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాని అల్కా అన్నారు. రమణ్ సింగ్ తిరిగి అధికారంలోకి రావటానికి తన పలుకుబడి, ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మరోవైపు తమ నాయకుడ్ని తామే ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఛత్తీస్‌గఢ్ యువ ఓటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది యువ ఓటర్లు తొలి దశ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకుంటే దేశానికి మంచిదని తెలిపారు. -
నక్సలిజం కట్టడిలో విఫలం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ మండిపాటు రాజ్‌నందగావ్/కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పీసీసీ చీఫ్ నంద కుమార్ పటేల్ ముఖ్యమంత్రి కాకుండా ఉండేందుకే మావోయిస్టులు ఆయనను హతమార్చారని, మే 25న మావోయిస్టులు బస్తర్‌లో జరిపిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సొంత నియోజకవర్గమైన రాజ్నందగావ్తోపాటు కాంకేర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మావోల దాడిలో మృతి చెందిన ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ భార్య అల్కా ముద్లియార్.. రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్‌సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. కోడ్ ఉల్లంఘించలేదు... రాహుల్: యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితుల్లో కొందరిని పాకిస్థాన్ ఐఎస్ఐ సంప్రదించిందన్న తన వివాదాస్పద వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ సమర్థించుకున్నారు. తన ప్రసంగంలో ఎక్కడా ఎన్నికల నియమావళికిగానీ, చట్టానికిగానీ విరుద్ధంగా ప్రవర్తించలేదని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి శుక్రవారం పంపిన 8 పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గడువు (శుక్రవారం ఉదయం 11.30 గంటలు) ముగియడానికి కాస్త ముందుగా రాహుల్ వివరణ పత్రం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ)కు అందింది. -
అవినీతిలో రమణ సింగ్ ప్రపంచ రికార్డు: రాహుల్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్‌పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ రాష్ట్రఎన్నికల ప్రచారంలో భాగంగా రాజనంద్‌గావ్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో శుక్రవారం రాహుల్ ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రమణ్ సింగ్ ప్రభుత్వం అవినీతిలో ప్రపంచరికార్డును సొంతం చేసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న ఛత్తీస్‌గఢ్ సాధించిన ప్రగతి మాత్రం శూన్యమని రాహుల్ విమర్శించారు. ఉపాధి కోసం అనేక మంది ఛత్తీస్గడ్ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వలస వస్తున్నారని రాహుల్ అన్నారు. ప్రజలతోనే అధికారం సాధ్యమని కాంగ్రెస్ భావిస్తుందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రుల వల్లే అధికారం సాధ్యమని బీజేపీ ప్రగాఢంగా నమ్ముతుందని ఆ పార్టీపై రాహుల్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. దేశంలో సామాన్యుడి చేతిలో ఆయుధమైన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కాంగ్రెస్ పాలనలోనే చట్టంగా రూపుదిద్దుకుందన్న సంగతిని కాంగ్రెస్ యువరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దర్భాఘట్లో ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు మరణించారని అయితే ....దానిపై రమణ సింగ్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.