swaroopanandendra saraswati
-
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ యాగం
-
విశాఖ శారదా పీఠాధిపతిని కలిసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్మతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పీఠాధిపతుల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు విశాఖ శారదా పీఠాధిపతులు హాజరైన సంగతి తెలిసిందే. చదవండి: బిల్లుల పెండింగ్.. గవర్నర్ విజ్ణతకే వదిలేస్తున్నాం: హరీష్ రావు -
పూర్ణాహుతితో పరిపూర్ణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అష్టోత్తర శత కుండాత్మక, చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతులు ముందుండి నడిపించగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మహాయజ్ఞ అఖండ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా పూర్తైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి సౌభాగ్యాలు, పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రకృతి అనుగ్రహం ఎల్లప్పడూ కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈనెల 12వ తేదీన మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆరు రోజులపాటు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, వివిధ క్షేత్రాల కల్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, ప్రవచనాలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన మహాయజ్ఞ క్రతువులో 600 మందికి పైగా రుత్వికులు, వేదపండితులు పాలుపంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ దంపతులు దీక్షాధారణ చేపట్టి రోజువారీ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాంచరాత్ర, వైదిక స్మార్త, వైఖానస, శైవ ఆగమ యాగశాలలను సందర్శించిన సీఎం జగన్ వేద పండితుల సూచనలకు అనుగుణంగా హోమగుండంలోకి సుగంధ ద్రవ్యాలను జారవిడిచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన అనంత(మహా)లక్ష్మీ అమ్మవారికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి పేర్లతో, గోత్రనామాలతో వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన దుర్గ గుడి మాస్టర్ ప్లాన్ నమూనాను యజ్ఞశాల వద్ద ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆశీర్వదించిన పీఠాధిపతులు మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామితోపాటు శ్రీత్రిదండి దేవనాథ జియ్యర్ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు కోరుతూ ప్రత్యేక సంకల్పం తీసుకుని మహాయజ్ఞ దీక్షను నిర్వహించిన సీఎం జగన్‌కు పీఠాధిపతులు వేర్వేరుగా వేదాశీర్వచనం అందజేశారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణంగా ఫలప్రదం: ఉప ముఖ్యమంత్రి కొట్టు వేదాలు సూచించిన ఎనిమిది ఆగమాల ప్రకారం దేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు నిర్వహించిన మహాయజ్ఞం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముందురోజు వరుణ దేవుడు వర్షం కురిపించి ఆశీస్సులు అందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా శ్రీనగర్ నుంచి తెప్పించిన కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని విశేష ద్రవ్యాలతో పూజల్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశార న్నారు. సనాతన హిందూ ధర్మం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రమంతా ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ధర్మపరి రక్షణ పరిషత్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈనెల 25 నుంచి 31వతేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై బంగారు కలశం ఏర్పాటు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునస్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాయజ్ఞం క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేసిన అర్చన ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి, గోపాలాచార్యులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కండవల్లి సూర్యనారాయణాచార్యులు, మృత్యుంజయప్రసాద్, దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు. ముఖ్యమంత్రి జగన్‌కు కాణిపాకం గణపతి ఆశీస్సులు యాదమరి (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను వేదపండితులు అందచేశారు. బుధవారం విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ను కాణిపాకం ఆలయం చైర్మన్ మోహన్‌రెడ్డి కలసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే..
సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు. హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చెప్పారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నారు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్‌శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్‌లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు. ఆశీస్సులందుకున్న గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైభవంగా మహాపూర్ణాహుతి వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్‌రాజ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్ లా ట్రిబ్యునల్ చైర్మన్ బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు. -
నేటి నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చాతుర్మాస్య దీక్ష
-
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్‌ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
భువనేశ్వర్‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి అలిపిరి/పెందుర్తి/భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో గురువారం మహాసంప్రోక్షణ కనుల పండువగా జరిగింది. ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజీ ప్రశంసించారు. -
యాదాద్రిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి (ఫొటోలు)
-
‘యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం’
యాదాద్రి: తిరుమల తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రి కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ ఆకాంక్షించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆ తండ్రి పాదాలచెంత ఏకాదశి నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శననం చేసుకోవాలని పది రోజుల క్రితం ఆకాంక్ష కలిగింది.కరోనా భయకర పరిస్థితుల్లో ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి.తమ శాఖలకు చెందిన భక్తులు అద్భుతంగా నిర్మిస్తున్నారని చెప్పారు. యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం. అలనాడు కృష్ణదేవరాయలు అహోబిలం, తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిర్మిస్తే ఈరోజుకు కూడా చిరస్థాయిగా మిగిలాయి. హిందువులకు ఆజన్మాంతం పేరు ఉండేలా యాదాద్రి లాంటి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారు. ఈకాలంలో ఇలాంటి నిర్మాణం మహాద్భుతం. దేవాలయం ఇప్పుడే ప్రారంభం అయింది కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి* అని స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. -
అమ్మవారి సేవలో సీఎం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: అత్యంత వైభవంగా సాగుతున్న విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం పెందుర్తి మండలం చినముషిడివాడలోని పీఠాన్ని సందర్శించిన సీఎం జగన్ దాదాపు మూడున్నర గంటల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు గన్నవరం విమానాశ్రయం నుంచి 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 12.10 గంటలకు పీఠానికి చేరుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామీజీ, స్వాత్మానందేంద్ర స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేసిన అనంతరం విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. రాజశ్యామల పూజల కోసం సీఎం జగన్ చేతుల మీదుగా పండితులు సంకల్పం చేయించి కలశ స్థాపన చేపట్టారు. వనదుర్గ, రాజశ్యామల యాగాలను సీఎం దర్శించుకున్నారు. రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో స్వామీజీలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం జగన్‌ను స్వామీజీ సత్కరించి ఆశీస్సులు అందించారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం జగన్ స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుగు పయనమైన ముఖ్యమంత్రిని పీఠం ప్రతినిధులు సాదరంగా సాగనంపారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు. మహా విద్యాపీఠం: స్వాత్మానందేంద్ర జగద్గురు శంకరాచార్య సంప్రదాయ పీఠంగా ఆవిర్భవించిన విశాఖ శ్రీశారదాపీఠం మహావిద్యాపీఠంగా అవతరించిందని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం నిర్వహణలో 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ఎందరో వేద పండితులను తీర్చిదిద్దిందని తెలిపారు. ఇక్కడ పట్టాలు పొందిన వారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడిస్తుండడం ఆనందాన్నిస్తోందన్నారు. వేదానికి పుట్టినిల్లుగా పేరున్న ప్రాంతంలో ఏర్పాటైన వేద పాఠశాల మంచి పేరు సంపాదించిందన్నారు. తమ పీఠం పరంపరకు 200 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హోళే నర్సిపూర్ కేంద్రంగా పరంపర మొదలైందన్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కావడం, వరుసగా ఎనిమిదేళ్లుగా పీఠానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. -
పెదఅమిరంలో ఘనంగా అంతర్జాతీయ తెలుగు సంబరాలు
-
కోటి దీపోత్సవం కాంతులతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి
-
హైందవ ధర్మ సంరక్షణే ధ్యేయం
పెందుర్తి: వేద పరిరక్షణ, హైందవ ధర్మ రక్షణే ధ్యేయంగా శ్రీ శారదాపీఠం ముందుకు సాగుతోందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందంటే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధర్మ మార్గమే కారణమని తెలిపారు. ఆదిశంకరుడి అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా నాగుల చవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామీజీ చేతుల మీదుగా పీఠ ఆస్థాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్వామీజీకి కూపి స్నపనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ పాదపూజ చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీ శారదా పీఠమన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, చెట్టి పాల్గుణ, కారుమూరి నాగేశ్వరరావు, వెంకట చిన్నఅప్పలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. -
అన్నపూర్ణగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో నాలుగో రోజు ఆదివారం అన్నపూర్ణదేవిగా శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. లోకకల్యాణార్థం పీఠంలో చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్ భాగవత పారాయణం, వేదపారాయణం, నవావరణ అర్చన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి స్వామీజీల చేతుల మీదుగా ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (నేడు) లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. -
స్వరూపానందేంద్ర స్వామికి విశ్వగురు పురస్కారం
విశాఖపట్నం: విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ ‘ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్-2021’ ప్రదానం చేసింది. స్వరూపానందేంద్ర స్వామి ఆథ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యవోలు రాంబాబు తెలిపారు. సోమవారం విశాఖ శారదాపీఠంలో జరిగిన కార్యక్రమంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి కూడా ‘విశ్వగురు పురస్కార్- 2021’ అవార్డు ప్రదానం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తాను ముక్కుతో గీసిన నాసికా చిత్రాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి అందజేసి ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారులు తుమ్మిడి రామ్‌కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, బ్రహ్మశ్రీ బానాల దుర్గాప్రసాద్, తుమ్ముడి మణి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ రూపంలో హిందూ మత ప్రచారం: స్వరూపానందేంద్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదాపీఠం యావద్ భారతదేశానిదని.. గిరిజన భక్తులను తిరుమల తీసుకెళ్లటం ఆనందంగా ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు సోమవారం ఆయన ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. చిన్నముసిడివాడ శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో గిరిజన భక్తులు తిరుమలకు బయలుదేరారు. సింహాచలంలో భక్తుల తొలిపూజ అనంతరం తిరుమల యాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, హిందూమత ప్రచారాన్ని ఉద్యమ రూపంలో శారదాపీఠం తీసుకెళ్తోందని.. స్వాత్మానందేంద్ర సరస్వతి త్వరలో భారతదేశ యాత్ర ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందని పేర్కొన్నారు. ఏటా దళిత గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని శారదాపీఠం కల్పిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర పీఠాధిపతి పర్యటన పూర్తైందని ఆయన వెల్లడించారు. శారదాపీఠం కేవలం తెలుగు రాష్ట్రాల పరిధి కాదని.. యావత్ ప్రపంచంలో హిందూమత పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా హైందవ ధర్మం కోసం విశాఖ శారదాపీఠం పోరాడుతోందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు -
శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్రస్వామి
తిరుమల: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల స్వరూపానందేంద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరగా దూరం చేయాలని స్వామిని ప్రార్ధించినట్టు చెప్పారు. ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి, తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలను శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి చేతుల మీదుగా అందచేశారు. -
దర్మ ప్రచార కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్ సమీక్ష
తిరుమల: హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ధర్మ ప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. శారద పీఠాధిపతిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఏఈవో ఏవీ ధర్మారెడ్డిలు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారద పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. నేడు డయల్ యువర్ ఈవో: తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు జరుగనుంది. భక్తులు 0877–2263261 నెంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డికి నేరుగా తెలుపవచ్చు. -
ఆగష్టు 5, భారతీయ చరిత్రలో సుదినం: స్వామి స్వరూపానందేంద్ర
-
శారదా పీఠాధిపతులను కలిసిన వీహెచ్‌పీ నేత
సాక్షి, రుషికేశ్: విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు సోమవారం రుషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. పీఠాధిపతులు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఈ సందర్భంగా చర్చించారు. రామ మందిరం భూమి పూజ వివరాలను పీఠాధిపతులకు వివరించారు. నిర్మాణానికి స్వామిజీ ఆశీస్సులు ఉండాలని కోరారు. రామ మందిర నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామ మందిర నిర్మాణంపై ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ఉన్నారని వివరించారు. -
వివాదాలు లేకుండా నిర్ణయాలు తీసుకోండి
పెందుర్తి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తుల విక్రయాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు శ్రీ శారదా పీఠం ప్రకటన విడుదల చేసింది. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని స్వామీజీ కోరారు. పాలకమండలి నిర్ణయం భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉండాలన్నారు. కాగా, సోషల్ మీడియా వేదికగా కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొంతమంది పీఠంపై, తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని, వారిని ఉపేక్షించబోమని స్వామీజీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టుల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవో ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గ్యాస్ లీక్ దురదృష్టకరం: స్వామి స్వరూపానందేంద్ర
సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటన దురదృష్టకరమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలోని బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి సద్దుమణగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం వృద్దాశ్రమం చేయూత అందిస్తాయని తెలిపారు. (గ్యాస్ లీక్.. కారణం అదే!) పదివేల మందికి వానప్రస్థం వృద్దాశ్రమంలో మధ్యాహ్న భోజనం అందించటం కోసం ఆహారం పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ బాధ్యతలను శరదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్‌కు అప్పగించినట్లు స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు. (లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరం: నిపుణులు) -
విశాఖ : శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
‘గ్రహ కూటములు తొలగించడానికే ఈ యాగాలు
సాక్షి, విశాఖ : శారద పీఠంలో అయిదు రోజుల పాటు అతిరుద్ర, లక్ష చండీ యాగ నిర్వహణ జరిగిందని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. దేశానికి చతుగ్రహా కూటమి, షష్ట గ్రహ కూటమి నడుస్తున్నాయని.. గ్రహ కూటములు తొలగించడానికి రెండు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులతో యాగాన్ని నిర్వహించామన్నారు. ఈ యగాన్ని సుబ్బిరామిరెడ్డి సారధ్యంలో నిర్వహించినట్లు.. రాష్ట్రానికి మంచి జరగాలనే ప్రధాన ఉద్ధేశ్యంతోనే ఈ యాగ నిర్వహించారని వారు తెలిపారు. -
అప్పన్న సన్నిధిలో స్వరూపానందేంద్ర సరస్వతి
-
అప్పన్న సన్నిధిలో స్వరూపానందేంద్ర సరస్వతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. సింహాద్రి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వెంకటేశ్వరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పన స్వామి 32 బీజ మంత్రాలు పురస్కరించుకుని 32 రోజుల అప్పన్న దీక్షను స్వరూపానందేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యద్భుతమై దేవాలయం అప్పన్నస్వామి ఆలయమని తెలిపారు. సింహాద్రి అప్పన్న గిరిజనులకు, చెంచు కులాల వారికి ఆరాధ్య దైవంగా త్రేతా యుగం నుంచి పూజలు అందుకున్నారని పేర్కొన్నారు. నారాసింహ క్షేత్రాల్లో అత్యధికంగా ఇష్టపడే దేవాలయం సింహాద్రి అప్పన ఆలయం అని పేర్కొన్నారు. -
‘తెలుగు రాష్ట్రాల్లో అద్భుత జ్యోతిష్య విజ్ఞానం’
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అద్భుతమైన జ్యోతిష్య విజ్ఞానం ఉందని, ఇది దేశవ్యాప్తం కావాలన్నదే ఆకాంక్ష అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేదాలు ఎంత గొప్పవో ప్రపంచానికి తెలియకపోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో వేదం స్వరాలతో ఆగిపోయిందన్నారు. వేదం భాష్యం చెప్పుకునే వాళ్ళు, సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాళ్లు, చందస్సు తెలిసినవాళ్ళు తగ్గిపోతున్న సమయంలో వేదం గొప్పతనం ప్రపంచంలో తగ్గిపోతోందన్నారు. ‘నేటికి కూడా జ్యోతిష్యం పేరుతో నక్షత్ర , భూ మండలం రెండింటి గురించి దశ దిశ నిర్ధేశం చేసి లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రహణం ఎప్పుడు వస్తుందో విదేశాల్లో వెతుకుతారని.. ఓ సామాన్య వస్త్రధారణతో గ్రహణం గురించి చెప్పే దేశం ఏకైక దేశం భారతదేశం’ అని అన్నారు. రూపం లేని కాలానికి కొలత చంద్రమానం, సౌరమానం, మంత్రదష్టలు, రుషులు అందించిన అద్భుత సంపద మన జ్యోతిష్కులని అన్నారు. రూపం లేని కాలానికి ఎప్పుడు ఏమి జరుగుతుంది, గ్రహాల కలయిక, పరిణామాలు ఎలా ఉంటాయనే వివరాలు కేవలం 15, 20 రూపాయలతో దొరికే పంచాంగంలో నిక్షిప్తం చేసే జ్ఞానులు జ్యోతిష్కులని కొనియాడారు. భారత దేశం జ్యోతిష్కులు రుణం తీర్చుకోలేదన్నారు. జ్యోతిష్యం లేకపోతే సొంత కర్మలు, అగ్నిహోత్ర కర్మలు కూడా జరగవన్నారు. అగ్నిహోత్ర, వైదిక కర్మలకు జ్యోతిష్యమే ప్రధానమన్నారు. జ్యోతిష్యం అనేది సార్వత్రిక అనుభవం అని పేర్కొన్నారు. జ్యోతిష్యం పై ప్రభుత్వం ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల జ్యోతిష్కులతో సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, టీటీడీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఉగాది తర్వాత ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉందని, అందుకు ప్రారంభ సూచకంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. పండగల తిథుల్లో వచ్చే చిచ్చును మధ్యలో కొందరు నాస్తికులు అవహేళన చేస్తున్నారన్నారు. మీడియా చర్చల్లో నాస్తికుల అవహేళనకు సరైన వివరణ ఇవ్వలేని జ్యోతిష్యులు పాల్గొంటే జ్యోతిష్య శాస్త్రం శక్తి తగ్గిపోతుందన్నారు. కొత్త పంచాంగం రూపకల్పనలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు వచ్చేలా జ్యోతిష్యులు సహకరించాలని కోరారు. ఇతర దేశాలకు మార్గనిర్దేశనం: స్వాత్మానందేంద్ర మన దేశం ఇతర దేశాలకు గురుస్థానంలో ఉందని శారద పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర అన్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, నదులు, తీర్థాలు, విజ్ఞాన సంపదతో ఇతర దేశాలకు మనం దేశం మార్గ నిర్దేశనం చేస్తోందన్నారు. వేదాలు, వేదంగాల్లో జ్యోతిష్యం గొప్పదన్నారు. మన దేశమే కాదని, ఇతర దేశాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలతో గ్రహస్థితులను తెలుసుకుని బయటకు వెల్లడిస్తారని.. కానీ పంచాంగకర్తలు మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, చెట్ల కింద వేదంతో కూడిన గణిత శాస్త్రంతో అధ్యయనం చేసి సూర్య, చంద్ర గ్రహణాలు, గ్రహ స్థితిగతులను పంచాంగంలో పొందుపరుస్తారన్నారు. పంచాంగ రూపకర్తలు చెప్పినది నూటికి నూరు శాతం నిజమవుతున్నాయన్నది ప్రత్యక్ష అనుభవం అని తెలిపారు. సూక్ష్మమైన అంశాలను కూడా క్షుణ్ణంగా బాహ్య ప్రపంచానికి అందించే జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు ఉండటం అందరి అదృష్టం అని స్వామి స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు. -
శారద పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు
-
ఆర్టికల్ 370 రద్దు భారతావనికి వరం
పెందుర్తి: భారతదేశంలో జమ్మూకశ్మీర్ ఒక అవిచ్ఛిన్న అంతర్భాగమయ్యేలా, దేశం కల సాకారమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అమోఘమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు దేశానికి అత్యంత ఆవశ్యకమన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రుషికేష్ గంగానదీ తీరంలోని శారదాపీఠంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి చాతుర్మాస దీక్ష ఆచరిస్తున్న స్వామీజీ.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై స్పందించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా బిల్లును తీసుకురావడం సాహసమైన, సమర్థమైన నిర్ణయమన్నారు. మంచుకొండల కశ్మీరంలో చల్లనితల్లి సరస్వతి శక్తిపీఠం నెలకొని ఉందని, ఆ తల్లిని దర్శించుకునేందుకు దేశంలోని కోట్లాది మంది భక్తులకు మోదీ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కశ్మీర్లో సరస్వతి పీఠం పునరుద్ధరణ జరగాల్సి ఉందని, ఇందుకు భారత సర్కారు పూనుకుని ముందుకొస్తే శారదాపీఠం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రామజన్మభూమి విషయంలోనూ ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. గో రక్షణకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోవును భారతదేశ అధికార ఆధ్యాత్మిక చిహ్నంగా ప్రకటించాలని కోరారు. కశ్మీర్‌పై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందనలు తెలియజేస్తూ స్వామీజీ మంగళశాసనాలు అందజేశారు. -
జాతీయ జంతువుగా గోమాత
పెందుర్తి: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ ప్రతిపాదించారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా నడుం బిగించాలని కోరారు. చాతుర్మాస్య దీక్షా యాత్రలో భాగంగా ఆదివారం రుషికేష్ శారదాపీఠంలో సాధుసంతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ రుషికేష్, హరిద్వార్‌లో నివసించే స్వాములు ఈ తపో భూమికే అంకితం కాకుండా యావత్ భారతదేశం పర్యటిస్తూ హిందూధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గోహత్యలు జరగకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరభారతంలో హిందూధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో సదస్సులో చర్చించారు. పలు ఆధ్యాత్మిక విషయాలపై సందేహాలను స్వామీజీ నివృత్తి చేశారు. అనంతరం స్వాములు, సాధుసంతులకు బండారా (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి అందరికీ నూతన వస్త్రాలు, విశేష దక్షిణ అందజేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తరఫున రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయనకు కుమారుడు ఎమ్మెల్యే సతీష్ స్వామీజీకి నూతన వస్త్రాలు అందజేశారు. పవిత్ర గంగాతీరంలో ప్రత్యేక పూజలు ఆచరించారు. తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. వచ్చే జవవరిలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాలని స్వామీజీని ఆహ్వానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, రంగారావు, డాక్టర్ ఓంప్రకాశ్, ఎలక్షణ్‌రెడ్డి, ప్రసాద్ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. -
శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర
సాక్షి, విజయవాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని నియమిస్తున్నట్టు పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అధికారిక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా తీరంలో గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మూడు రోజులపాటు నిర్వహించిన శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం సోమవారంతో పరిసమాప్తమైంది. సుమారు 10గంటలకు పైగా పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. స్వాత్మానందేంద్రకు స్వామిజీ సమక్షంలో సన్యాసాంగ అష్ట్రశాద్ధ కర్మలను వేదోక్తంగా నిర్వహించారు. తొలుత రుత్వికులు వేద క్రతువును నిర్వహించారు. శారదా పీఠం వేదపండితులు కృష్ణశర్మ, కేశవ అవధాని వేదోక్తంగా క్రతువును నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కాషాయ వస్త్రాలు, దండకమండలాలను స్వాత్మానందేంద్రకు అందించి సన్యాసం ఇప్పించారు. అనంతరం శారదా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సమక్షంలో బాలస్వామికి యోగపట్టా అనుగ్రహం చేశారు. ఈ సందర్భంగా మహాస్వామికి, ఉత్తరాధికారికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండ్లు, వస్త్రాలు బహూకరించారు. మహాస్వామికి కుడివైపున ఉత్తరాధికారి ఆశీనులవగా ఎడమ వైపు రెండు కుర్చీలలో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ కూర్చున్నారు. సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేసిన తరువాత తన ఆసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలకు మహాస్వామి సాష్టాంగ నమస్కారం చేసి హారతి ఇచ్చారు. మహాస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతి వేదమంత్రాల మధ్య పుష్పాభిషేకం చేశారు. దేవదాయశాఖ కమిషనర్ ఎం.పద్మ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలను మహాస్వామికి అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లను మహాస్వామి సత్కరించి ప్రసాదాలు అందజేశారు. తర్క, మీమాంస, వ్యాకరణ, ఉపనిషత్తుల్లో ఉత్తరాధికారి నిష్ణాతుడు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ.. నా తొడపైనే పెరిగి, నా వద్ద చదువుకుని తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాత్రింబవళ్లు విని, కాశ్మీర్ నుంచి లఢక్ వరకు పాదయాత్ర చేసి మంచు కురుస్తున్న వేళ కూడా తపస్సు చేసిన తపోనిధి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అని కొనియాడారు. 2024లో శారదా పీఠం పూర్తి బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించి తాను తపస్సులో నిమగ్నమవుతానని తెలిపారు. ఎండలు 46 డిగ్రీలతో మండిపోతున్న వేళ శారదా పీఠం ఉత్తరాధికారిని ప్రకటించే సమయంలో చినుకులు పడి చల్లటి వాతావరణం ఏర్పడటమంటే భగవంతుడి కృప పూర్తిగా ఉన్నట్టేనని పేర్కొన్నారు. తామిద్దరం అద్వైత స్వరూపులమేనని చెప్పారు. ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు దిగ్విజయంగా పాలించాలి ధర్మం గెలుస్తుందని, అధర్మం ఓడిపోతుందని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల గెలుపే అందుకు ఉదాహరణ అని మహాస్వామి చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, హిందూ ఆలయాలు బాగుపడాలని, ధూపదీప నైవేద్యాలు బాగా జరగాలని కోరుకున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాబోయే 15 ఏళ్లు ఇద్దరు సీఎంలు వారి రాష్ట్రాలను దిగ్విజయంగా పరిపాలించాలని శారదా పీఠం తపస్సు చేస్తుందన్నారు. స్వాత్మానంద సరస్వతి స్వామీజీ అంటే వైఎస్ జగన్‌కు చాలా అభిమానమని చెప్పారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ సన్యాసం తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు, తల్లి, కన్నీటి పర్యంతమయ్యారు. సన్యాసం తీసుకున్న వ్యక్తి భవబంధాలకు దూరంగా ఉండాల్సి రావటంతో వారి కన్నీటికి అంతులేకుండా పోయింది. 5వ ఏటే పీఠానికి.. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర అసలు పేరు కిరణ్‌కుమార్‌శర్మ. విశాఖ జిల్లా భీముని పట్నానికి చెందిన హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతుల జ్యేష్ట సంతానంగా 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. ఆయనకు కిషోర్‌కుమార్ అనే సోదరుడు ఉన్నారు. తన 5వ ఏటనే శారదా పీఠానికి వెళ్లిన కిరణ్‌కుమార్‌శర్మ నాటినుంచీ మహాస్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతనే ఉన్నారు. పీఠంలోనే పెరిగారు. మహాస్వామికి ఆంతరంగిక శిష్యునిగా కొనసాగారు. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలును ఔపోసన పట్టారు. లోక కళ్యాణమే ధ్యేయం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ లోక కళ్యాణమే ధ్యేయంగా శ్రీ శారదా పీఠం పనిచేస్తోందని అనుగ్రహ భాషణంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పండితులు, స్వామీజీలను సత్కరించారు. శ్రీశారదా పీఠం అభివృద్ధికి కృషి చేసిన సుబ్బిరామిరెడ్డిని స్వామీజీ సత్కరించారు. -
అందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలే నిదర్శనం
-
శ్రీ శారదా పీఠం ముందే చెప్పింది
సాక్షి, విజయవాడ: అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం ఆనాడే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భవిష్యత్తును ఊహించే ఏకైక పీఠం శ్రీ శారదాపీఠం ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవం ముగింపు సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. (చదవండి: ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం) శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి నియమితులైన ఈ రోజు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశామని, తన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి అని, స్వరూపం అన్నా, స్వాత్మ అన్న ఒక్కటేనని, తామిరువురం అద్వైత స్వరూపులమని ఆయన పేర్కొన్నారు. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని నియమిస్తున్న విషయాన్ని నాలుగేళ్ళ కిందటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను చెప్పానని, ఆయన ఎంతో సంతోషించారని తెలిపారు. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసుకొని.. రాజశ్యామల యాగం సందర్భంగా బాలస్వామిని ఘనంగా సత్కరించి తెలంగాణ నుంచి ఆంధ్రకు పంపారని తెలిపారు. అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం గతంలోనే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు నిదర్శనమని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులని, వారిద్దరికి అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. రాజశ్యామల మాత సాక్షిగా 2024 నాటికి పూర్తిగా పీఠం బాధ్యతలను స్వాత్మానంద్రేంద్ర సరస్వతీకి అప్పగిస్తానని స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఆ తరువాత తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేస్తానన్నారు. కశ్మీర్ నుంచి లడఖ్ వరకు పాదయాత్ర చేసి.. అక్కడి మంచులోనూ తపస్సు చేసి వచ్చిన యోధుడు స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఈ లోకానికి స్వాత్మానందేంద్ర సరస్వతీ రూపంలో ఆధ్యాత్మిక శక్తిని అందించిదని అన్నారు. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి కేసీఆర్ అని, యాదాద్రి ఆలయాన్ని, వేములవాడ ఆలయాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన అంటే తనకు పరమప్రాణమని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం వైఎస్ జగన్ పరితపించారని తెలిపారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం తపస్సు చేస్తూనే ఉంటుందని అన్నారు. -
విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
ఆధ్యాత్మిక శోభ.. పండిత సభ
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. పండిత సభ మహోన్నతంగా సాగింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండో రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖులు, భక్తులు తరలి రావడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండవ రోజైన ఆదివారం సన్యాసాంగ అష్ట శ్రాద్ధాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కూష్మాండ, పురుష సూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశ మహాదానాలు జరిపారు. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి శారదా చంద్రమౌళీశ్వరులకు అర్చన, అభిషేకాలను నిర్వహించగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కన్నుల పండువగా వీక్షించారు. స్వామి చేపట్టిన అభిషేక క్రియకు వేదపండితులు తమ గళాన్ని జతపరిచి ప్రాంగణమంతటినీ వేదమయం చేశారు. మరోవైపు బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ సందర్భంగా శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్థ శాస్త్ర మహాసభలు నిర్వహించగా.. వ్యాకరణ, తర్క, మీమాంస సహా ఆరి శాస్త్రాలను ఔసోసన పట్టిన పండితులు పాల్గొన్నారు. సన్యాస దీక్ష ఫలితం ఏమిటి? సన్యాసం దేనికోసం తీసుకోవాలి? సన్యాసం తీసుకుంటే ఎలా ఉండాలి? నియమాలు ఏమిటనే అంశాలపై పండితులు చర్చాగోష్టి చేశారు. సన్యాస జీవితం చాలా గొప్పది స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రవచనం చేస్తూ.. సన్యాసం గురించి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పారని వివరించారు. ద్వివిద సన్యాసం, విద్వత్ సన్యాసం, ఆశ్రమ సన్యాసం తదితర ఆశ్రమాలపై ఉపనిషత్తుల్లో చాలా చర్చ సాగిందని చెప్పారు. తమ పీఠం ఉత్తరాధికారి విద్వత్ సన్యాసి అని సగర్వంగా ప్రకటించారు. ఆది శంకరాచార్యుల కృప తమ పీఠ ఉత్తరాధికారికి పూర్తిగా ఉందని, పరమ గురువు సచ్చిదానందేంద్ర సరస్వతి వారి అనుగ్రహం కలిగిందని తెలిపారు. భారతదేశంలోని శాస్త్ర పండితులు తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం ఇత్యాది శాస్త్రాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందని చెప్పారు. భారత ప్రభుత్వం వాటిని దూరంగా ఉంచినా.. పీఠాలు, మఠాలు పురాతనమైన శాస్త్రాలను కాపాడుతున్నాయని స్వామీజీ అన్నారు. భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకలైన తర్కం, వ్యాకరణం, వేదాంతం, ఉపనిషత్తులు, అగ్నిహోత్ర సభలు ఏటా తమ పీఠం వార్షికోత్సవంలో జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఉత్తరాధికారి సన్యాస దీక్ష ఉండటంతో అగ్నిహోత్ర సభలు, శాస్త్ర సభలు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ సుందరశర్మ, దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ, సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాథం భరత్‌రెడ్డి హాజరయ్యారు. సన్యాస దీక్ష చివరి రోజైన సోమవారం జగద్గురు శ్రీచరణులచే బాలస్వామికి యోగపట్టా అనుగ్రహిస్తారు. -
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
సాక్షి, విజయవాడ : కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండోరోజు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. సోమవారం ఈ ఉత్సవంలో గవర్నర్ నరసింహన్‌తోపాటు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ పాల్గొననున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులవ్వడం సంతోషంగా ఉందని బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మ అన్నారు. తాను చిన్నప్పుడే ఆశ్రమానికి వచ్చానని తెలిపారు. మహాస్వామి దగ్గర ఉంటూ అన్ని విద్యలు నేర్చుకున్నానని, ఆయనకు ప్రధాన శిష్యూడయ్యానని చెప్పారు. -
అర్చక వ్యవస్థలో ప్రభుత్వాల జోక్యం తగదు
-
స్వరూపానందేంద్ర సర్వస్వతి ఆసీస్సులు తీసుకున్న కేసీఆర్
-
‘బలమైన నాయకుడు సీఎం కావాలి’
పెందుర్తి: పవిత్ర నాగులచవితి నాడు భగవంతుడు తనకు శరీరాన్ని ప్రసాదించడం.. శారదా పీఠానికి పీఠాధిపతిగా నియమించడం తన పూర్వజన్మ సుకృతమని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్వామి జన్మదినం సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రాష్ట్రానికి ప్రజలు మెచ్చే బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరముందన్నారు. పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకుంటే అనర్థాలే తప్ప మంచి జరగదని హెచ్చరించారు. భక్తులకు మానవసేవ గురించి వివరించాలన్న తలంపుతోనే.. వారి కోరిక మేరకు ఈ వేడుకలకు ఒప్పుకున్నానని వెల్లడించారు. నాగులచవితి ఎంతో విశిష్టత కలిగిన పర్వదినమన్నారు. పీఠం తరపున తెలుగు రాష్ట్రాలు, దేశానికి ఉపద్రవాలు సంభవించకుండా పరమాత్ముడిని పూజిస్తూ అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం లో శారదా పీఠం ముందుందన్నారు. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రతినిధి ద్వా రా స్వామికి పట్టువస్త్రాలు, ఫలాలందించా రు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పూజల్లో పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం గురించి స్వామి బొత్సను ఆరా తీశారు. -
కేరళ బాధితులకు శారదాపీఠం సాయం
పెందుర్తి: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న గిరిజన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పించారని, ఆయన ఆదేశాల మేరకు అనేక మంది దాతలను సహాయసహకారాల కోసం సంప్రదించినట్టు ఆ పీఠం ట్రస్ట్ రొబ్బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీపీ సెంచరీ క్లబ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విలయతాండవంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలుసుకుని రుషికేష్‌లో చాతుర్మాసదీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి అక్కడి ప్రజలకు దుస్తులు, పప్పుదినుసులు తదితర వాటిని అందించాలని శ్రీశారదాపీఠం ట్రస్ట్ సభ్యులను ఆదేశించారన్నారు. కేరళలో కూడా శంకర సేన సేవా ట్రస్ట్ శారదాపీఠానికి అనుబంధంగా ఉందని పేర్కొన్నారు. సేవలందించేవారు శారదాపీఠానికి తెలియజేస్తే శంకర సేన సేవా ట్రస్ట్, శారదాపీఠం ట్రస్ట్ సభ్యులు, శారదాపీఠం భక్తులు అంతా కలిసి కేరళ ప్రాంతంలో వాటిని అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే తొలివిడతగా శంకరసేన సేవా ట్రస్టుకు 5వేల దుప్పట్లు, 2వేల చీరలు, 1500 పంచెలు, 3వేల టవల్స్, ఆహారపదార్థాలు పంపించామని తెలిపారు. రెండో విడతగా ఆదివారం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కృతుంగా రెస్టారెంట్స్ ఎండి నరేందర్‌రెడ్డి, అభిరుచి స్వీట్స్ అధినేత రామకృష్ణ, హూలీమేరీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మహిణ ఇన్ఫ్రా అధినేత సతీష్‌బాబు విరాళాలు ప్రకటించారు. శ్రీదుర్గా ఐబీపీ సెంచరీ క్లబ్ తరఫున లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం అందించారన్నారు. శారదాపీఠం ట్రస్టీలు చల్లా రామారావు, సభ్యులు కె.చలపతిరావు, పి.హనుమంతరావు, పి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
బాబుపై స్వరూపానందేంద్ర ఫైర్
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. చంద్రబాబు పరిస్థితి అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టుగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆదిశంకరాచార్యుల విగ్రహం పెట్టాలని అడిగితే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఆయన విగ్రహాలున్న తిరుమల, శ్రీశైలం, బదరీ, కేదార్నాథ్ వంటివన్నీ చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. బాబు దీనిపై స్పందించకపోయినా.. రాష్ట్ర అభివృద్ధి కోసం శంకరాచార్యుల విగ్రహాన్ని రాజధానిలో మేమే ప్రతిష్టిస్తామన్నారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టి దోచుకునే అలవాటున్న ప్రభుత్వ పెద్దలు నా ప్రతిపాదనలను పట్టించుకోలేదని చెప్పారు. బుద్ధుడు వైరాగ్యం, శూన్య వాదం, నిస్సారమైన ధర్మాన్ని ప్రచారం చేశారు.. అలాంటి బుద్ధుని పేరు పెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రతి మహిళ అమ్మవారిలా ఉండాలని కోరుకున్నది శంకరాచార్యులే అని, అందుకే ఆయన విగ్రహాన్ని రాజధానిలో ప్రతిష్టించాలని అన్నారు. -
‘దేవాలయాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది’
-
రాష్ట్ర ప్రయోజనాల కోసం చండియాగం
-
కాశీలో శారదాపీఠం శాఖ ప్రారంభం
పెందుర్తి: పవిత్ర గంగానదీ తీరం సమీపంలోని కాశీ (వారణాసి)లో నూతనంగా నిర్మించిన శారదాపీఠం శాఖను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ముందుగా గంగానదీ స్నానమాచ రించి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్న పూర్ణాదేవి దేవాలయాలను సందర్శించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠం శాఖలోకి పీఠం మర్యాదలతో స్వామీజీని ప్రతినిధులు, వేదపండితులు ఆహ్వానించారు. శాస్త్రోక్తం గా పీఠం భవనాన్ని ప్రారంభించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ కాశీ క్షేత్రంలో నివసించే దండి స్వాములకు వారానికికోసారి యతిభిక్ష (అన్నదానం) ఏర్పాటు చేయాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. దత్త జయంతి సందర్భంగా పీఠంలో అన్నదాన కార్య క్రమాన్ని స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. దండిస్వాములకు భిక్ష పెట్టి దక్షిణలు అందజేశారు. కార్యక్రమం లో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, ఆస్థాన పండితుడు కృష్ణశర్మ, శారదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్, కాశీ శారదాపీఠం శాఖ భవనం మేనేజర్ పి.కిశోర్‌కుమార్, ఆంధ్రా ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వి.వి.సుందర శాస్త్రి, వి.వి సీతారాం, ప్రముఖ న్యాయ వాది వై.నీలలోహిత్, కరివేణ సత్రం మేనేజర్ శ్రీనివాస్, సాధుసంతులు పాల్గొన్నారు. -
‘నిర్ణయాత్మక చర్యలు అభినందనీయం’
విశాఖ : దేశవ్యాప్తంగా పశువధ నిషేధంపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఇలాంటి నిర్ణయత్మక చర్యల అభినందనీయమని ఆయన ప్రశంసించారు. మాటలకే పరిమితం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
-
శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమమంలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిలాండం వద్ద ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
కొమురవెల్లి ఆలయంలో గోవులను సంరక్షించాలి
• ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా • విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్: కొమురవెల్లి దేవాలయంలో భక్తులు సమర్పిం చే ఆవులను కబేళాలకు తరలించడం దురదృష్టకరమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గోవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు స్వామిజీ తెలిపారు. హైదరాబాద్ చందానగర్‌లోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం లో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం గురువారం వైభవంగా నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతి శారద మాత పీఠ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు, దేవాలయాల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నా.. కొమురవెల్లిలో మాత్రం దారుణం జరుగుతోందన్నారు. గోసంరక్షణ ద్వారా అంతా మంచే జరుగుతుందన్నారు. గోవధ మంచిది కాదని, వాటి ఏడుపు రాష్ట్రానికి కీడు చేస్తుందని అన్నారు. భక్తులు సమర్పించే గోవుల ద్వారా వచ్చే పాలను దేవతామూర్తులకు వినియోగించాలని కోరారు. విదేశీ విద్య సరికాదు: ప్రస్తుత ప్రభుత్వాలు, కొంతమంది హిందూవాదులమని చెప్పుకొనేవారు ఆధ్యాత్మిక వ్యాపా రాలు చేస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయాలకు, ఆచా రాలకు తిలోదకాలిచ్చి యువతీ యువకుల ను, కుటుం బాలను మోసం చేస్తున్నారన్నారు. భారతీయ సంప్రదా యంతో కూడిన చదువులను వదిలేసి, విదేశీ పద్ధతులకు అనుగుణంగా విద్యను అందించడం సరికాదన్నారు. రామాయణం, భారతం, భగవద్గీత, మనిషి జీవన విధానాలకు ఉపకరించే వేదాలను ఇచ్చిన దేశం మనదని గుర్తు చేశారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో గురువారం చండీహోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నవగ్రహ పుండలిని హోమం, సుబ్రహ్మణ్య హోమం తదితర ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. -
హిందూ మతాచారాల్లో కోర్టుల జోక్యం తగదు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర హైదరాబాద్: హిందూ మతాచారాల్లో కోర్టుల జోక్యం తగదని, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులతో కమిటీ వేసి వారి అభిప్రాయం తెలుసుకోవాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శనిశింగనాపూర్ దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కోర్టులు నిర్ణయం తీసుకోవడంపై స్పందిస్తూ... హిందూ దేవాలయాల ఆచారాలు, సంప్రదాయాల మీద కుట్రపూరిత ఆందోళనతో కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ‘హిందూ మతంలో అందరూ సమానమే అయినప్పుడు.. మహిళలపట్ల వివక్షత చూపడం ఎంతవరకు సబబనే అంశాన్ని కోర్టు ఎత్తి చూపింది. ఏ మతంలో లేని విధంగా హిందూ మతంలో మహిళలకు అగ్రస్థానం ఉందన్న విషయాన్ని నవసమాజం గుర్తించాలి. ఇంటికి దీపం ఇల్లాలనే పిలుపుతో మహిళలను అమ్మవారిగా గుర్తించడం హిందూ మతంలో తప్ప మరే మతంలో లేదు. హిందూ మతంలో మాదిరి ఇతర మతాల్లో ధూప, దీప, కైంకర్యాలతో కూడుకున్న విలక్షణమైన దైవారాధనలు ఉండవు. రుతుక్రమాలు, గర్భధారణ వంటి ఇబ్బందులు ఉన్నాయి కనుకనే మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం లేదనడం తప్పితే హిందూమతంలో వారికి అపార గౌరవం ఉంది’ అని స్వామి చెప్పారు. లౌకికవాదం పేరుతో కుట్ర... ‘లౌకికవాదం పేరుతో హిందూ మతంపై అనేక రకాలుగా కుట్రపూరిత దాడులు జరుపుతూ కొంత మంది సామాజికవేత్తలు కోర్టులకు వెళ్తున్నారు. అదే నెపంతో హిందూ మతాన్ని అవహేళన చేస్తున్న రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు ఇతర మతాల్లో ఉన్న వివక్షను ఎందుకు ప్రశ్నించరు? ఓ మతంలో మహిళలు పర పురుషులు చూడకూడదనే కట్టుబాట్లను ప్రయోగించి ఆమె ముఖాన్ని కూడా కప్పుకొని తిరుగుతుంటే సమాజంలో సమాన హక్కులు లేవని ఎందుకు అడగరు? ఆ మతంలో మహిళలను ప్రార్థనాలయాలకే రానివ్వరు. ఇది మహిళా వివక్ష కాదా? సమాజంలో ఉన్న అన్ని మతాల్లో మహిళల పట్ల వివక్షత ఎత్తి చూపి సుప్రీంకోర్టు న్యాయ నిర్ణయం చేస్తే బాగుంటుంది. గతంలో ఉన్నత న్యాయస్థానాలు హిందూ దేవాలయాల విషయమై చురకలు వేసినా... నేటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ రకమైన దాడి తిరుమల దేవాలయంలో కూడా జరిగితే హిందూ సమాజం ఏమైపోతుంది? ఉన్నత న్యాయస్థానాలు హిందూ మతపెద్దలను కమిటీగా వేసి నవసమాజానికి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళికలు తయారుచేయాలి. ఇతర మతాల విషయంపై కూడా కోర్టులు ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. కానీ హిందూ మతంపై ఇచ్చిన నిర్ణయాలపై ప్రభుత్వాలు అత్యుత్సాహం చూపించడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే’ అని స్వరూపానందేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
'ఈ ఏడాది వర్షాలు తక్కువ... ఎండలు ఎక్కువ'
విశాఖపట్నం: సెక్యూలర్ పేరుతో హిందూ శాస్త్రాలు మోసానికి గురవుతున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ 14 నుంచి 18 వరకు పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని.. ఎండలు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు. భూకంపాలు, అగ్రి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉందన్నారు. దేవాలయాల సనాతన సాంప్రదాయాన్ని, శాస్త్రాలను అమలు పరచడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా 17న వేద పండితులకు సత్కారం, సువర్ణ కంకర ధారణ కార్యక్రమం నిర్వహిస్తామని స్వరూపానందేంద్ర వెల్లడించారు. -
ధార్మిక సదస్సుపై పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల ధార్మిక సదస్సుపై శారదా పీఠాధిపతి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు విచ్చేసిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సు కంటితుడుపు చర్య మాత్రమేనని విశాఖపట్టణం శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరుపానందేంద్ర సరస్వతీ వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ధార్మిక సదస్సు కార్యక్రమానికి టీటీడీ నుంచి గాని, హిందూ ధార్మిక ట్రస్ట్ నుంచి గానీ తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. అందుకే తాను ఆ సదస్సుకు రాలేదని వివరించారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలు పాటించకుండా ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహణ వ్యర్థమని స్వరుపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆలయాలు నిర్మించడం అదనపు భారమని టీటీడీ భావిస్తుందన్నారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 2న తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సులో 40 మందికి పైగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక వేత్తలు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. -
'నిన్నటి దుర్ఘటనకు చింతిస్తున్నా'
రాజమండ్రి: గోదావరినది అతి పవిత్రమైందని ... ఆ నదీ స్నానం ఎక్కడైనా ఆచరించవచ్చునని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంగళవారం కోటగుమ్మం పుష్కరఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట దుర్ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు సంయుక్తంగా పని చేయాలని రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖలకు స్వరూపానందేంద్ర సూచించారు. అలాగే ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. అయితే గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రిలోకి కోటగుమ్మం పుష్కరఘాట్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 35 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
దీపారాధనతో లోకశాంతి
రావివలస(టెక్కలి): ప్రతి ఇంటిలో భగవంతునికి దీపాన్ని వెలిగించి ఆరాధిస్తే ఆ కుటుంబానికే మంచిదని, మహా పుణ్య క్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తే ఆయా వంశంతో పాటు లోకశాంతి జరుగుతుందని విశాఖపట్టణం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో గురువారం ‘కైలాస ప్రస్థార ప్రయుక్త యంత్రం లక్షదీపారాధన’ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథ/గా హాజరైన స్వరూపానందేంద్ర స్వామిజీ దీపారాధన ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు. హృదయంలోని దివ్యజ్యోతి స్ఫూర్తితో భగవంతునికి వెలుగు రూపంలో వెలిగించేది దీపారాధనగా పేర్కొన్నారు. పవిత్రమైన హిందూమతంలో ప్రతిచిన్న శుభకార్యానికి దీపాన్ని వెలిగించి భగవంతున్ని ప్రార్థించడం సాంప్రదాయమన్నారు. జీవన్ముక్తి స్థితితో దీపాన్ని వెలిగిస్తే ముక్తి కలుగుతుందన్నారు. దీపాన్ని వెలిగించే మతం హిందూమతం అని, దీపాలు ఆర్పే మతం విదేశీ మతంగా పేర్కొన్నారు. మల్లన్న సన్నిధిలో కైలాస ప్రస్థార యంత్రంతో నిర్వహించిన దీపారాధనలో పాల్గొన్న భక్తులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆరేళ్ల కిందట ఈ దేవస్థానాన్ని సందర్శించిన తరువాతే తనకు శక్తివంతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయాన్నరు. అనంతరం మొదటి దీపాన్ని వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వాహకులు మల్లన్న చిత్రపటాన్ని స్వరూపానందేంద్ర సరస్వతికి జ్ఞాపికగా అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 275 కుటుంబాలు హాజరై లక్షదీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆనందాశ్రమం నిర్వాహకుడు శ్రీనివాసానంద స్వామి, దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి, సూపరింటెండెంట్ పరమహంస, సంతబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యురాలు లమ్మత లక్ష్మి, రావివలస సర్పంచ్ బడే జగదీష్, నిర్వాహకులు ఎల్.ఎల్.నాయుడు, లమ్మత మధు, ఎంపీ రామ్మోహన్నాయుడు తల్లి విజయలక్ష్మి, దేవస్థానం ఈవో జి.గురునాథరావుతో పాటు 16 మంది రుత్వికులు పాల్గొన్నారు. -
స్త్రీని కాపాడుకోవాలి
ముదితలెందరో.. మిలమిలలతో, తళతళలతో ‘వెన్నెల్లో నిండు గోదారుల్లా’.. మెరిశారు. వేదికను ఇంధ్రధనువుల కొలువుగా మార్చారు. అంతేనా.. కన్ను చూసేదే కాక.. మనసు మెచ్చే అంతస్సౌందర్యమూ తమకుందని నిరూపించారు. విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి.. ‘శ్రీమతి రాజమండ్రి’ కార్యక్రమం ఓసాంస్కృతిక సంగమమని చాటారు. విక్టరీ ఈవెంట్ మేకర్ శనివారం రాత్రి రాజమండ్రి రివర్‌బేలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్యఅతిథిగా పాల్గొని భారతీయ సంస్కృతిని, స్త్రీ ఔన్నత్యాన్ని వివరించారు. అమావాస్య రాత్రుల్లో హఠాత్తుగా పండు వెన్నెల విరిసి.. ఆ కాంతుల్లో నిండు గోదావరి ప్రవహిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అటువంటి దృశ్యమే రాజమండ్రి రివర్ బే హోటల్లో శనివారం రాత్రి ఆవిష్కృతమైంది. డాక్టర్ ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్, భాస్కర్ ఎస్టేట్స్ సహకారంతో విక్టరీ ఈవెంట్ మేకర్స అధినేత విక్టర్ మేడిద ఆధ్వర్యంలో ‘శ్రీమతి రాజమండ్రి’ పేరుతో పరిపూర్ణ వనితల పోటీ-2014 నిర్వహించారు. దీనికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జార్జి విక్టర్ అధ్యక్షత వహించారు. పోటీల్లో 16 మంది శ్రీమతులు పాల్గొన్నారు. మూడు రౌండ్లుగా పోటీలు జరిగాయి. మొదటి రౌండ్ పరిచయం కార్యక్రమం, రెండో రౌండ్ టాలెంట్ టెస్ట్, మూడోది జనరల్ నాలెడ్జ్ రౌండ్ నిర్వహించారు. స్త్రీని కాపాడుకోవాలి విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందన్నారు. స్త్రీని, స్త్రీశక్తిని కాపాడుకోవాల్చిన అవసరముందన్నారు. భ్రూణహత్యలు, అత్యాచారాలు రూపు మాపడానికి రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. స్త్రీమూర్తిని అమ్మవారిగా పూజించే దేశం భారతదేశం ఒక్కటేనన్నారు. విదేశాల్లో స్త్రీని అంగడిబొమ్మగా చూస్తున్నారన్నారు. విదేశీ సంస్కృతి రావడం వల్ల మన దేశంలో మహిళల నుదుట బొట్టు పెట్టుకోని పరిిస్థితి ఏర్పడిందన్నారు. కట్టు, బొట్టు, జుట్టు మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు పరిపూర్ణత సాధించాలని, వారు చట్టసభల్లో ప్రవేశించడం ద్వారా స్త్రీల రక్షణకు పదునైన చట్టాలు తీసుకు రావాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మేయర్ పంతం రజనీ శేషసాయి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున దంపతులు తమ గీతాలతో ఆహూతులను అలరించారు. డీటీఎస్ ఆనంద్ తన గళ విన్యాసంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశవాణి అనౌన్సర్ రాంభట్ల నృసింహశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. - రాజమండ్రి సిటీ -
దేశంలో దేవుళ్ల గొడవ పెరిగింది
న్యూఢిల్లీ : ప్రస్తుత సమాజంలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అన్న తగవులు పెరిగాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటోలో, వీధుల్లో రాజకీయాల్లో గొడవల కంటే దేశంలో దేవుళ్ల గొడవే అధికంగా ఉందన్నారు. 'విశుద్ధ వేదాంత సర్' అనే హిందీ అనువాద వేదాంత గ్రంథాన్ని ఆయన నిన్న టీటీడీ ధ్యానమందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ పీఠాల ద్వారా శంకరాచార్యులు ఏం చెప్పారు. వేదాంతసారం ఏమిటన్నది చెప్పడానికే ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. ఈ అంశాలను ఉత్తర భారతీయులకు తెలియజెప్పేందుకే హిందీలో ఆవిష్కరించినట్లు చెప్పారు.