Tharun Bhascker Dhaassyam
-
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్‌గా విజయ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!
గతంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని.. నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు.. ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ సమస్య వచ్చింది. ఏదేమైనా మాకు ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం చేసే చిన్న సినిమాలు మీరు కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. అలా చేయాలనే కోరిక కూడా లేదు. కానీ మా వరకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ఏఐ వచ్చినా కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. మేం చేసినా.. చేయకపోయినా మార్పు అయితే జరుగుతది. మా మధ్య కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ సమస్య ముగిసిపోయింది' అని అన్నారు. అసలేం జరిగిందంటే.. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. -
రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) ఏం జరిగింది? గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు. రూ.కోటి డిమాండ్ ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్‌ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
‘కీడా కోలా’ మూవీ రివ్యూ
టైటిల్: కీడా కోలా నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు నిర్మాతలు: కె.వివేక్ సుదాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గబాటి దర్శకత్వం: తరుణ్ భాస్కర్ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్ ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ విడుదల తేది: నవంబర్ 3, 2023 కథేంటంటే.. వాస్తు(చైతన్య రావు)కి నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పెరెంట్స్ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్)ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో కీడాకోలా(శీతల పానీయం)బాటిల్లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్‌కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తాడు. మరోవైపు వీధి రౌడీ జీవన్(జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానంతో.. ఎలాగైన కార్పోరేటర్ కావాలనుకుంటారు. 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్)తో తన కోరిక ఏంటో చెబుతాడు.దాని కోసం రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని భావించి.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? ఈ రెండు గ్యాంగులతో ఆ కంపెనీ యజమాని(రవీంద్ర విజయ్) కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? చివరకు చేసిందేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘కీడా కోలా’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తరుణ్ భాస్కర్ గత సినిమాలు(పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది) చూస్తే.. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి పాత్రల్ని, కొన్ని సన్నివేశాలను నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్‌ని పక్కకి పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇదొక రోటీన్ క్రైమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టిన మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు కానీ..నవ్వించే సీన్లకు కొదవ ఉండదు. వాస్తు, లంచం పాత్రలని పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే జీవన్ గ్యాంగ్‌ని పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగుల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీని మొదట్లోనే ఇచ్చాడు. ఆ ఏరియా కార్పోరేటర్ జీవన్ పోస్టర్ని డిజైన్ చేసిన సీన్‌తో నవ్వులు ప్రారంభం అవుతాయి. నాయుడి పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్ అంటూ నాయుడు పాత్ర పండించే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కకి పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ని ముగించేశాడు. ఇక సెకండాఫ్‌లో కథనం ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయితే పార్ట్ పార్టులుగా వచ్చే సీన్లు నవ్విస్తాయి. కీడా కోలా యాడ్‌లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ లాగినట్లు అనిపిస్తుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య వచ్చే ‘ సరెండర్ ’ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. షూటర్స్ లోపాలు, బొమ్మతో నాయుడు ప్రేమాయణం.. ఇవన్నీ ఆకట్టుకున్నా.. చెప్పుకోదగ్గ కథ లేదనే వెలితిమాత్రం ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తరుణ్ భాస్కర్లో మంచి నటుడు ఉన్నాడు. గతంలో పలు చిత్రాల్లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇందులో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. నాయుడు పాత్రలో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పైకి నవ్విస్తూనే..అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చే పాత్ర తనది. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకి రాగ్ మయూర్ న్యాయం చేశాడు. ‘మ్యాడ్’ఫేమ్ విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మానందం పాత్ర వీల్ ఛైర్‌కే పరిమితం అయినా.. సందర్భానుసారం నవ్విస్తుంది. జీవన్ కుమార్, రవీంద్ర విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక తరుణ్ గత సినిమాల మాదిరే కీడా కోలా కూడా సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది. ఏజే అరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు కథలో భాగంగా అలా వచ్చిపోతాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి.. సెన్సార్ వాళ్లకు పని తగ్గించాడు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా నిడివి(రెండు గంటలు)తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కీడా కోలా’ ప్రీ రిలీజ్ వేడుకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్
పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్‌తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7 — Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023 -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
ఆ సినిమా ఫ్లాప్, అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది: శర్వానంద్
ప్రముఖ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా అక్కినేని అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు శర్వానంద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా ఆడుతుందనుకున్నాం. అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్లిపోయాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని మరీ కో అంటే కోటి సినిమా తీశాం. ఆ సినిమాకు నేనే నిర్మాతను. డబ్బులు పోయాయి. రిలేషన్స్ దూరమయ్యాయి. తట్టుకోలేకపోయాను. ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాలపాటు ఒక్క షర్ట్ కూడా కొనలేదు. రన్‌రాజా రన్ సినిమా హిట్టయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామా? అని డౌట్లో ఉన్నాను. ఎక్స్‌ప్రెస్ రాజా హిట్టయినప్పుడు కూడా పార్టీకి పిలిచారు. కానీ నేను సోమవారం దాకా నమ్మనని చెప్పాను. అలా సినిమాల సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చాడు శర్వానంద్. చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డు చెప్పారు ఒకే ఒక జీవితం చూసి నాగార్జున భావోద్వేగం -
రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి సాంగ్ వచ్చేసింది..
ఐదు వేరు వేరు కథలతో తెరకెక్కుతున్న చిత్రం `పంచతంత్ర కథలు`. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి... నా గుండెల సరాసరి.. కుర్సియేసి కూసొబెడతనే... నీ అయ్యా పట్వారి.. నీ చిచ్చా దార్కారి... ఏదైతే ఏందే మరి... నిన్నుఎత్తుకొనిబోతనే...' అంటూ ఆహ్లాదరకరంగా సాగుతోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్‌తో స్వరపరిచాడు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేర్చారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ నా ఫేవరేట్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని నా నమ్మకం. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్ప్రైజింగ్గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. చదవండి: భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన బుల్లితెర నటుడు -
అప్పట్లో జేబులో పది రూపాయలు కూడా ఉండేవి కాదు: స్టార్ డైరెక్టర్
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్‌కి ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తనకు ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చానన్నాడు. చదవండి: సింగర్ కేకే మృతికి చిరంజీవి, మహేశ్ బాబు నివాళి ‘మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లో లేరు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. ఏవో కథలు రాసుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో జేబులో పది రూపాయలు ఉండేవి కాదు. అయినా బుర్రలో 100 కోట్ల ఆలోచనలు ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్లే వాడిని. అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. అంతా కలిసి ఒక బ్యాచ్‌గా ఉంటూ సినిమాల గురించిన ఆలోచనలు చేస్తుండేవాళ్లం. అలా చివరికి ‘పెళ్లి చూపులు’ సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇటు నాకు .. అటు విజయ్‌కి ఇద్దరి కెరియర్‌కు ఆ సినిమా చాలా హెల్ప్ అయింది’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి -
ట్రక్కు బ్రేకులు ఫెయిల్, అందరం చచ్చిపోతామన్న విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు నాన్‌వెజ్ వండటం బాగా వచ్చని చెప్పాడు. తనకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నాడు. విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడని చెప్పుకొచ్చాడు. తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వచ్చాక విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్‌లాగా వాడతానన్నాడు. చదువులో తాను బ్యాక్ బెంచర్ అని, తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఒక బిల్డింగ్‌నే కట్టొచ్చని తెలిపాడు. సుమారు 23 సప్లీలు ఉండొచ్చన్నాడు. విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లానని, కాకపోతే ఓ కెమెరా పట్టుకుని దీపికా పదుకోణ్ను ఫాలో అవమని చెప్పారని, తానదే చేశానని పేర్కొన్నాడు. పెళ్లి చూపులు సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను పంచుకున్నాడు. 'ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని ఆన్సరివ్వడంతో ఒక్కసారిగా షాకయ్యా' అన్నాడు తరుణ్ భాస్కర్. చదవండి 👇 భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
కరోనా వచ్చింది ఫ్రెండ్స్.. సీరియస్‌గా తీసుకోండి : డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్‌గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. -
ఎగిరెగిరి తన్నిన రష్మిక.. కోపం వస్తే ఇలా చేస్తుందా?
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్ నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే.. యోగా అయినా చేస్తుంది. ఖాళీగా ఉంటే రోజులో ఎక్కువ భాగం జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అవి వైరల్ అవుతూంటాయి. తాజాగా ఆమె జిమ్ సెంటర్ వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రష్మిక తన ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే..మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్. ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్మిక వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్ కోసం అడుగుతాడా? టేక్ ఓకే’ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
తరుణ్ భాస్కర్ కొత్త సినిమా..స్పోర్ట్స్ డ్రామాలో
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. సాయి సుశాంత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. రోహిత్ తంజావూర్ దర్శకత్వంలో ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ‘ఫీలర్ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ రెడ్డి. -
నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి
హీరో నాగచైతన్య, దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కొద్దిసేపు పోలీస్ ఆఫీర్‌గా కనిపించారు నాగచైతన్య. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే వీరిద్దరి కాంబినేషన్లోనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇక నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. చదవండి: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య! నాకూ ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేదు -
లెక్చరర్ పాత్రలో వెంకటేశ్
‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని రూపొందించారు. మూడో సినిమాకే వెంకటేశ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే విషయమూ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారన్నది తాజా సమాచారం. ఆయన లెక్చరర్‌గా కనిపించే పోర్షన్ మొత్తం వినోదాత్మకంగా ఉంటుందట. సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప, ఎఫ్ 3’ సినిమాలు కమిట్ అయ్యున్నారు. ఇవి పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది వేసవిలో తరుణ్ భాస్కర్‌తో చేసే సినిమా ఆరంభం కానుందని టాక్. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధిన్ సిద్ధిఖీని నటింపజేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. -
క్రేజీ డైరెక్టర్
-
పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్
హైదరాబాద్ : దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై ఆన్లైన్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు అసభ్య పదజాలం వాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తరుణ భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఆయన వివరించారు.(చదవండి : నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) ‘సాధారణంగా సినిమాలకు సంబంధించి చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రొజెక్టు అయింది. గత కొద్ది రోజులుగా కొందరకు నన్ను, నా టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో నేను సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి వివరాలు వారికి అందజేశాను. ఇందుకు సంబంధించి తొలుత మేము వారిని పిలిచి చాలా మార్యాదగా మాట్లాడాం. ట్రోలింగ్ అనేది ఇతరుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించాం. అలాగే వ్యక్తిగత దూషణ అనేది తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించాం. కానీ వారు దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాం. దీనిని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. మాపై తప్పుడు వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా, ఇటీవల మలయాళ చిత్రం కప్పేలా చూసిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తెలుగు సినిమాల్లో ఉండే అనవసరమైన కమర్షియల్ డ్రామా అందులో ఉండదని కూడా పేర్కొన్నారు. దీంతో ఓ హీరో అభిమానులు ఆయనకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. To whomsoever it may concern...@hydcitypolice pic.twitter.com/MX5GXfMVX0 — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) July 1, 2020 -
కొత్త యాంగిల్‌తో ముందుకొస్తున్న తరుణ్ భాస్కర్
‘నీకు మాత్రమే చెప్తా’ షోతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానంటున్నాడు తరుణ్ భాస్కర్. పీపీ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడిగా, నటుడిగా కనిపించిన ఆయన తాజాగా వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు. ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ ఈ నెల 14న ఓ టీవీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్ భాస్కర్, శరత్, నిర్మాతలు ప్రభాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నిర్మాత ప్రజా ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా వెనుక, ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ షోలో చూపించాం. ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్‌కు ధన్యవాదాలు. మార్చి 14 నుంచి ‘నీకు మాత్రమే చెప్తా’ మొదలుకానుంది. డైరెక్టర్ అవ్వకముందు తాను పడిన కష్టాలు ఈ ప్రోగ్రామ్‌లో ఎంటర్టైన్ విధానంలో చెప్పాం. దర్శకుడు శరత్ మాట్లాడుతూ... నిర్మాత శ్రీకాంత్ ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. అలా నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థ్యాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’నని పేర్కొన్నారు. (ప్రతి ఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఒక సీక్రెట్ ఉంటుంది) వాళ్ల మీద అభిప్రాయాలు మారాయి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బుల్లితెరపై ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుంచి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, ఈ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ ఈ కాన్సెప్ట్‌తో మా దగ్గరికి రావడం.. అది నాకు నచ్చడంతో ఈ షో వెంటనే ప్రారంభించాం. ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ దర్శకులతో పాటు రీసెంట్గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్‌లో పరిచయం చేయబోతున్నాము. నేను వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. ఇది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్‌కు చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది. అందులో మంచు లక్ష్మి ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సిరీస్‌తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. తను చాలా బాగా చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను’ అని తెలిపారు. -
టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌కు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ ఐమాక్స్ థియేటర్లోని కౌంటర్లో టికెట్లు అమ్మాడు. అయితే విజయ్ టికెట్లు అమ్ముతున్నట్లు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్ దగ్గర గుమిగూడారు. అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకుఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో తరుణ్ భాస్కర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను ఇలా భిన్నంగా కూడా చేయవచ్చని విజయ్ నిరూపించాడు. టికెట్లు కొన్నవారికి అద్భుత ఆఫర్లు కూడా ప్రకటించాడు. టికెట్లు దక్కించుకున్న ప్రేక్షకులకు ఉచిత పాప్‌కార్న్ అందించాడు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేసిన చిత్రయూనిట్.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సక్సెస్ జోరులోనే మరో సర్ప్రైజ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా తొలి లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ‘ఈ రోజు పొద్దున్నేపెద్ద పులి నన్నే ఎందుకో తరుముతోంది. అరె ఎందుకని తిరగి నేనడిగిగా.. పులి మూస్కోని పరిగెత్తమంది’అంటూ సాగే గీతాన్ని రాకేందు మౌళి రచించగా శివకుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సింగర్ రేవంత్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’తో హీరోగా మార్చాడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్‌ను కూడా చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రిన్స్ మహేశ్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించి సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
-
మీరు చూడబోయే వీడియో మీదే అయితే..?