YSR raithu barosa
-
ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా నిలిచామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెట్టుబడి సాయంతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 64 లక్షల 37 వేల మంది ఖాతాలకు 1,294 కోట్ల రూపాయలు బదిలీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
Live: వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం
-
నేడు మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా
-
ఆర్బీకేలపై గలీజు రాతలు
-
రైతు భరోసా ఎగ్గొట్టారంటూ రామోజీ తప్పుడు రాతలు
-
రబీకి ముందే రైతుల ఖాతాల్లో డబ్బు జమ
-
దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు అండగా నిలుస్తున్నామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భూమి లేని పేదలకు అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారాయన. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడుత నిధుల జమ కార్యక్రమం జరిగింది. ‘‘దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి.. వారితో పాటు దేవాదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24 తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నాం. రెండో మంచి కార్యక్రమం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం రైతన్నల చేతులో పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమో. ఏ వ్యవసాయ భూమి లేని నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ప్రతీ వాళ్లకు నా అని సంభోదిస్తూ అందరికీ అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరణ్యభూములు సైతం సాగు చేసుకునే గిరిజనులకు తోడుగా ఉండే కార్యక్రమం ఇది’’ అని సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తోంది. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది అని తెలియజేశారాయన. ఇప్పటివరకు.. 50 నెలల కాలంలో 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది(నేటి సాయంతో కలిపి). ఇక మొత్తంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేయగలిగామని అందించామని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో అర హెక్టారులోపు ఉన్న రైతులు దాదాపు 60 శాతం ఉన్నారు. ► ఒక హెక్టారు దాకా దీన్ని తీసుకుపోతే 60 శాతా కాస్తా 70 శాతం పైచిలుకు దాకా పోతోంది. ► రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. ఈ సొమ్ము 60 శాతం మంది రైతులు అందరికీ 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సాయంగా అందుతోంది. ► దీని వల్ల వాళ్లు బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం రాదు. కరెక్టుగా మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం. ► పంట వేసే టయానికి, కోసేటప్పుడు వాళ్ల చేతిలో డబ్బులు పడే సరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చింది. ► వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒక్క కార్యక్రమం ద్వారా రూ.13,500 అన్నది హెక్టారులోపు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ► ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి మొన్న వర్షాల వల్ల గోదావరి, భారీ వరదలు వచ్చాయి. ► ఈ సీజన్ ముగిసేలోగానే 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఆగస్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీగా ఈరోజు రూ.11 కోట్లు వాళ్ల చేతిలో కరెక్టుగా సమయానికి పెట్టడం జరుగుతోంది. ► ఈ గొప్ప కార్యక్రమం ద్వారా రూ.1,977 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తూ రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. దాంతోపాటు ఇప్పటికే 38 కోట్లు ఫ్లడ్ రిలీఫ్‌లో భాగంగా వాళ్లందరికీ సాయం చేశాం. ► వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నాం. ► పంటలు వేసుకొనేందకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇప్పటికే సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. ► రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగాం అని గమనిస్తే.. ► కళ్ల ఎదుటనే కనిపించే కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పదలచుకున్నా. ► ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. ► గ్రామ స్థాయిలో సచివాలయం, పక్కనే 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. ► అక్కడే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తూ, చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ► బ్యాంకింగ్ సేవలు, కియోస్క్ అక్కడే ఉంది. కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే గొప్ప వ్యవస్థ. ► ఈక్రాప్ వ్యవస్థ అమలవుతోంది. ఏ పంట ఎవరు వేశారనే ఫిజికల్ డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తెస్తున్నాం. ► సోషల్ ఆడిట్లో డిస్ప్లే అవుతోంది. మంచి జరగకుంటే ఎలా కంప్లయింట్ చేయాలనేది అక్కడే రాసుంది. ► వెంటనే రీ వెరిఫై చేసి నష్టం జరగకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది. ► ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధర డిస్ప్లే చేసి తక్కువ ధరకు పడిపోతే ఆర్బీకేలు ఇంటర్ఫియర్ అయ్యి రైతుకు సాయంగా పంట కొనుగోలు చేస్తున్నారు. ► ధాన్యం కొనుగోలు అయితే ఎంఎస్పీ రాని పరిస్థితి నుంచి ఎంఎస్పీ ఇవ్వడమే కాకుండా, గన్నీ బ్యాగ్స్, లేబర్ ట్రాన్స్‌పోర్టు ఖర్చు ఎకరాకు రూ.10 వేల చొప్పున అదనంగా రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వస్తోంది. ► పంట నష్టపోయిన అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అడుగులు నాలుగేళ్లలో పడ్డాయి. ► ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్ నమోదవుతోంది. ► రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. ► రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ► మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్‌గ్రేడ్ చేయాలని డిపార్ట్మెంట్ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నాం.. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ► రైతుకు సాగు ఒక్కటే కాకుండా అదనపు ఆదాయం రావాలంటే వ్యవసాయం ఒక్కటే కాకుండా గేదెలు, ఆవులు కూడా రైతులకు తోడుగా ఉండాలి. ► వాటిలోంచి వచ్చే ఆదాయం మెరుగ్గా ఉండాలని, సహకార రంగంలో గొప్ప మార్పు తెస్తూ అమూల్‌ను తీసుకొచ్చాం. ► ఏకంగా 8 సార్లు అమూల్ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. ► లీటరు గేదె పాలు రూ.22, ఆవు పాలు లీటరుకు రూ.11 పెరిగింది. కేవలం ఈ నాలుగు సంవత్సరాల మనందరి ప్రభుత్వంలో జరిగిన మార్పులకు తార్కాణం. ఈరోజు చేస్తున్నవి కూడా అందులో భాగంగా కొనసాగిస్తున్నాం. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేశారు సీఎం జగన్. -
రైతన్న కష్టాలు తీరేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
-
చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ లేవు: సీఎం వైఎస్ జగన్
-
పత్తికొండ సభకు తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
కరువుల్లేవ్.. వలసలు తగ్గాయ్: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మధ్య మీ బిడ్డకు, మీ అన్నకు మీరు తోడుగా ఉంటున్నందుకు ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈ రోజు రైతన్నల కోసం, పొలాల్లో శ్రమించే ఆ కష్ట జీవుల కోసం పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దాదాపుగా 52.30 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు ఈ రోజు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.3900 కోట్లు జమ చేయబోతున్నాం. వరుసగా ఐదో ఏడాది– తొలివిడత సాయం.. ఈ రోజు మేనిఫెస్టోలో రైతన్నలకిచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే ప్రభుత్వంగా వైఎస్ఆర్ రైతుభరోసా– పీఎం కిసాన్ ఐదో ఏడాది తొలివిడత సాయం ఇక్కడ నుంచే విడుదల చేస్తున్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, పెట్టుబడి కోసం రైతన్న అప్పులు పుట్టని పరిస్థితి ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. చెప్పిన దాని కన్నా మిన్నగా - రైతుభరోసా... రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టారు కూడా లేని రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతులు దాదాపు 50 శాతం ఉన్నారు. అటువంటి ప్రతి రైతుకు మంచి జరగాలన్న తపనతో ప్రతియేటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాలలో రైతలు చేతుల్లో రూ.50వేలు పెడతామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. ఈ రోజు మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా... ఈ రోజు రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లు అని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతులు ఇబ్బంది పడకూడదని ఐదేళ్లు ఇస్తామని చెప్పి.. రూ.50వేలు కాకుండా రూ.67,500 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినదానికన్నా మిన్నగా.. ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా ఇచ్చే దిశగా అడుగులు వేశాం. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పై చిలుకు మంది రైతులకు.. ప్రతి రైతుకు రూ.54వేలు వైఎస్ఆర్ రైతుభరోసాగా ఆ కుటుంబం చేతిలో పెట్టాం. ఈ దఫా ఇచ్చే రూ.7,500 కలుపుకుంటే ప్రతి రైతన్న కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.61,500 ఇచ్చినట్టవుతుంది. రైతు భరోసా కింది ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయాన్ని ఐదో ఏడాది తొలివిడతగా ఈ దఫా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాలా రూ.3923 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి రైతుకు రూ.5,500 రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన రూ.2వేలు త్వరలో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. వాళ్లు ఇచ్చేది కాస్తా ఆలస్యమైనా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. మీ బిడ్డ కచ్చితంగా మే నెలలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిపిస్తూ మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ చేస్తున్నాం. ఒక్క రైతు భరోసాతోనే రూ.31వేల కోట్లు సాయం.. ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి కేవలం రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే... రూ.31 వేల కోట్లు జమ చేశాం. ఈ రోజుమరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పును మీ బిడ్డ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ సీజన్లోనైనా పంట నష్టం జరిగితే... ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పెడితే ఆ రైతన్న తన కాళ్లమీద తాను నిలబడగలుగుతాడని చెప్పి... ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. రూ. 54 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ.. ఈ సారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా, రైతన్న ఇబ్బంది పడకూడదని ఈ సంవత్సరం మార్చి, ఏఫ్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.54 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా జమ చేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా 22.70 లక్షల మంది రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్లో రైతన్నలను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.1965 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం. సాగులో విప్లవాత్మక మార్పులు... మన ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు ఈ రంగంలో తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పది.. రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాలంలో ఇలాంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా? రైతు భరోసా కేంద్రాల ఊసే అప్పుడు లేదు. మన ప్రభుత్వంలో గ్రామస్ధాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, చేయిపట్టుకుని నడిపిస్తూ.. 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా,అండగా ఉంటూ వారితో పాటు కలిసి అడుగులు వేస్తున్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ వీటన్నింటినీ ఒక్కచోటుకి తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది. 2014–19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నుల మాత్రమే ఉంటే... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ప్రతిఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి గమనిస్తే.. చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నుల మాత్రమే ఉంటే...మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 332 లక్షల టన్నులకు పెరిగింది. తేడా గమనించండి. బాబు పాలనంతా కరువే.. గతంలో చంద్రబాబు హయాలంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే.. కరువు. బాబు హయాలంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలు కరవు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అప్పట్లో 1623 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరవు మండలాలుగానే ఉండేవి. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడిదయతో మంచి వానలు పడ్డాయి. కరువులు లేవు. వలసలు కూడా తగ్గాయి. నాటికీ – నేటికీ తేడా చూస్తే... దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగింది. గతంలో చంద్రబాబు పాలనలోని ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద రుణాల మీద 40.60 లక్షల మంది రైతన్నలకు కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందిస్తే.. మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీ కింద రూ.1835 కోట్లు ఇచ్చాం. 74 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద ఇవ్వకుండా పెట్టిన బకాయిలు సైతం మీ బిడ్డ హయాంలో చిరునవ్వుతో చెల్లించాం. గతంలో చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతులకు కేవలం ఐదేళ్లలో రూ.3411 కోట్లు పంటల బీమా కింద ఇస్తే... మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో మాత్రమే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో 44లక్షల మంది రైతన్నలకు రూ. 6685 కోట్లు బీమాగా చెల్లించాం. ఈ సంవత్సరం కూడా నిరుడు ఖరీప్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా జూలై 8, (నాన్నగారి పుట్టిన రోజు) వైఎస్ఆర్ జయంతి రోజున జమ చేయనున్నాం. ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమయం కట్టాల్సిన అవసరం లేకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా, పూర్తిగా బీమా ప్రీమియం కూడా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే. మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇ–క్రాప్ బుకింగ్ జరుగుతుంది. రైతుల పేరులన్నీ సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో డిస్ప్లే చేస్తున్నారు. గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీ బిడ్డ హాయంలోనే జరుగుతున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో ఇ– క్రాప్ అనే మాటే లేదు. ఆర్బీకే అన్న మాటే లేదు. సోషల్ ఆడిట్ కింద మొత్తం జాబితా పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా గమనించండి. ధాన్యం సేకరణలో నాడు– నేడు మరోవైపు ధాన్యం సేకరణ మీద కూడా గతానికి ఇప్పటికి ఉన్న తేడా గమనించండి.గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో సేకరించిన మొత్తం ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే, మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సేకరించిన ధాన్యం మొత్తం 3.09 కోట్ల టన్నులు. ఇంకా రబీలో సేకరణ జరుగుతుంది. ఎన్నికల్లోగా మరో ఏడాది ధాన్యం సేకరణ మళ్లీ జరుగుతుంది. గతంతో పోలీస్తే.. అప్పుడు ఏటా సగటున 53 లక్షల టన్నుల సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఇవాళ సగటున ఏటా 75 లక్షల టన్నుల సేకరిస్తున్నాం. ధాన్యం సేకరణపై గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఇప్పటికే రూ.60వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేశాం. రబీ పూర్తి కాలేదు. ఐదేళ్లకు ఇంకా మరో ఏడాది పెండింగ్ ఉంది. అది కూడా కలుపుకుంటే కనీసం రూ.77వేల కోట్లు అవుతుంది. తేడా మీరే చూడండి. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు విత్తనాలు దగ్గర నుంచి ఎరువులు వరకు నకిలీలు గుర్తించే విషయంలోనైనా, భూసార పరీక్షలు చేసే విషయంలోనూ, గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజవర్గస్ధాయిలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు కనిపిస్తున్నాయి. 2 జిల్లా స్ధాయి ల్యాబ్‌లు, మరో 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు కడుతున్నాం. మరో 11 జిల్లా స్ధాయి ల్యాబ్స్ నిర్మాణం మొదలయ్యింది. ఆర్బీకే స్ధాయిలో కూడా సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ దిశగా అడుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీకేలు గ్రామ స్ధాయిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే... మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. రైతన్నలకు పంట ఎంత ముఖ్యమో.. భూమిమీద సర్వహక్కులు కూడా వారికి అంతే ముఖ్యం.వందేళ్లక్రితం బ్రిటీష్ హయాంలో భూసర్వే జరిగితే... ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్ధాయిలో సరిహద్దు రాళ్లు లేవు. గ్రామస్ధాయిలో సబ్‌డివిజన్ అప్డేట్ కార్యక్రమం కూడా జరగలేదు. భూవివాదాలు గ్రామాల్లో మన కళ్లెదుటనే కనిపిస్తున్నా.. పరిష్కారం రాని పరిస్థితులలో రైతులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వంగా.. వీరికి మంచి జరగాలని మన ప్రభుత్వం హయాంలో వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులు నిర్ణయించి, సర్వేరాళ్లను పాతించి, రికార్డులన్నీ అప్డేట్ చేయించి, వివాదాలకు ఏమాత్రం తావులేకుండా రైతన్నల చేతిలో భూహక్కు పత్రాలను పెట్టే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు... గ్రామ సచివాలయాలన్నింటిలోనూ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ అక్కడే జరగాలన్న ఆలోచనతో.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వహక్కులు వారికి ఇప్పించాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూముల మీద, బ్రిటీష్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వ హయాలంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద సర్వహక్కులూ రైతులకు ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనది. 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ కోసం.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకూడదని, పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే. రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే.. రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫీడర్లను బలపరుస్తే తప్ప ఉచిత విద్యుత్ ఇవ్వలేమంటే మీ బిడ్డ హయాంలో ఆ ఖర్చు కూడా చేసి ఫీడర్లను బలపర్చే కార్యక్రమం చేశాం. ఆక్వా సాగుకు సాయంగా.... ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటివరకూ ఈ ఆక్వా రైతులకు మంచి చేస్తూ.. వాళ్లందరి తరపున నిలబడి వారికి రూ.2967 కోట్ల సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరించింది. దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కరవుసీమగా పేరున్న రాయలసీమ కూడా కళకళలాడుతుంది. రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఎప్పుడూ ఊహకందని విధంగా పెరిగాయి. రైతన్నలకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి, రైతన్న వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, వ్యవసాయం మీద వచ్చే ఆధాయానికి అదనంగా ఇంకా ఆధాయం రావాలని చెప్పి వారికి తోడుగా నిలబడుతూ.. అక్కచెల్లెమ్మలకు మరో నాలుగు రూపాయలు అదనంగా రావాలన్న తపనతో అమూల్‌ను తీసుకొచ్చి, రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన అమూల్‌ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం. అమూల్– పాడి రంగంలో మార్పులు.. అమూల్ ఇక్కడకు వచ్చింది కాబట్టి.. అంతకముందు దోచుకుంటున్న హెరిటేజ్ వంటి పాలడెయిరీలన్నీ తలవంచి పాడిరైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్ వచ్చేనాటికి ఇప్పటికీ పాలధరల్లో తేడా చూస్తే... అమూల్ వచ్చిన తర్వాత నాలుగు సందర్భాలలో ధరలు పెంచుకుంటూ పోయింది. లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు ధర అమూల్ పెంచింది. దీంతో హెరిటేజ్ వంటి పాలడెయిరీలు కూడా రేటు పెంచకతప్పనిసరి పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. మీ బిడ్డ హయాంలో ఆర్బీకే స్ధాయిలోనే ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అన్నది పోస్టర్లు ద్వారా డిస్ప్లే చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్ధతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మార్కెట్లో పోటీ పెరిగి ఈ రోజు ప్రతీ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర ఆర్బీకే స్దాయిలోనే వచ్చేట్టు, దళారులు లేకుండా అమ్ముకునే కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతోంది. మూగజీవాల కోసమూ... పశునష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్‌ఫాం రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలుచేసి.. తద్వారా అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడ్డాం. వైఎస్ఆర్ పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు సైతం 340 ఆంబులెన్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో యానిమల్ డిసీజెస్ డయాగ్నొస్టిక్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. చంద్రబాబు పెట్టిన బకాయిలూ చెల్లించాం... చివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. అప్పట్లో చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ మన ప్రభుత్వమే చెల్లించింది. రూ.8845 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన విద్యుత్ బకాయిలునూ రైతన్నల కోసం మన ప్రభుత్వమే చెల్లించింది. ఫామ్ మెకనైజేషన్ అన్నది ఎప్పుడూ జరగని విధంగా చేస్తున్నాం. గతంలో ఎవరికిచ్చామో, ఎందుకిచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విధానం తీసుకొచ్చాం. ఫామ్ మెకనైజేషన్... ప్రతి ఆర్బీకే స్దాయిలో ఒక సీహెచ్‌సీ(కమ్యూనిటీ హైరింగ్ సెంటర్‌ను) స్ధాపించాం. ప్రతి ఆర్బీకే స్దాయిలోనూ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫామ్ మెకనైజేషన్ కోసం రూ.1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికాలను ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఆర్బీకే స్ధాయిలో రైతులు ఒక గ్రూప్ కింద ఏర్పడి వారు కేవలం 10 శాతం చెల్లిస్తే.. 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరో 50 శాతం రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఆర్బీకే స్ధాయిలోనే దాదాపు రూ.15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న రైతులు ఆ వ్యవసాయ ఉపకరణాలను మిగిలిన రైతులకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి వారికి మేలు జరిగే విధంగా ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఇప్పుడు అర్ధవంతంగా సాగుతుంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్ధాయిలోనే డ్రోన్లు తీసుకువచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ మన రైతులే డ్రోన్లు ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా.. బాధ్యతతో, రైతుల మీద మమకారంతో చేసాం. నేరుగా రైతులకిస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతుకు మేలు జరిగేటట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా పేద కుటుంబాలన్నింటికీ వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తున్నాం. రైతుల కోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మనది అయితే.. మరోవంక రైతుకు శత్రువైన చంద్రబాబు నాయుడుని చూడండి. సాగు దండగన్న బాబు... వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమవుతాయని చెప్పాడు. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి, పొరపాటున ఓటు వేసిన రైతులను చంద్రబాబు నిలువుగా ముంచాడు. రాజమండ్రిలో డ్రామా షో... నిన్నకాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామ కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అందులో 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని .. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, శకపురుషుడని, ఆ మనిషి రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండ వేశారు. మహానాడులో సాక్షాత్తుగా జరుగుతున్న డ్రామా ఇది. ఆ మహానాడు డ్రామాకు మందు వీళ్లంతా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటంటే... తమ పార్టీ ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ముందే ప్రకటించారు. మేనిఫెస్టోను ఆకర్షణీయమైన అని సంబోంధించి ప్రకటించడం..నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యమనిపించింది. ఈ మాట వింటే కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకువస్తాయి. పూతన, మారీచుడు, రావణుడు కలిసి చంద్రబాబులా... పసిపిల్లవాడైన కృష్ణుడుని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెపుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగా మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకువచ్చింది. అందమైన మాయ లేడీ రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్ మార్చుకుని భవతీ భిక్షాందేహీ అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ ముగ్గురు ఆత్మలూ కలిసి, ఈ మూడు క్యారెక్టర్లూ కలిపి మన ఏపీలో ఒక మనిషిగా నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి జన్మించాడు. బాబు – విలువలు, విశ్వసనీయత లేని క్యారెక్టర్.. మేనిఫెస్టో పేరుతో ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు. వాగ్ధానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారి క్యారెక్టర్ ఏమిటంటే ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు, విశ్వసనీయత అçసలే లేవు. తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీరామారావునైనా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనుకాడడు. చంద్రబాబు పొలిటిలక్ ఫిలాసపీ ఏమిటంటే... ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. మేనిఫెస్టోను చూపిస్తూ.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెపుతూ.. దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతారు. అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందన్నది బాబుకు తెలుసా ? మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందో ఈ పెద్ద మనిషికి అవగాహన ఉందా ? మన మేనిఫెస్టో... ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర, పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారిæ గుండెచప్పుడుగా పుట్టింది. మన రైతులు, మన పేదలు, నా అక్కచెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాలు నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం, వారికి మంచి భవిష్యత్ చూపించడం కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. బాబు మేనిఫెస్టో – బిసిబెళ బాత్... చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదు. వారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి.. ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజీపీ కాంగ్రెస్ రెండూ ఎదురెదురుగా తలపడి, రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక బిసిబెళ బాత్ వండేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అంతటితో సరిపోదు అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, చేయూత, రైతుభరోసా మన పథకాలన్నీ కలిపేసి ఇంకో పులిహోర వండేశాడు. వైయస్సార్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలూ కాపీ, బీజీపీ పథకాలూ కాపీ, కాంగ్రెస్ పథకాలూ కాపీ. చివరకు బాబు బ్రతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీలేదు. కేరెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంత కన్నా లేదు. పోటీ చేసేందుకు ఈపెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది కేండిడేట్లు కూడా లేని పార్టీ ఇది. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ... మైదానాల్లో మీటింగ్‌లుపెడితే జనం రారని, మనుషులు చనిపోయినా ఫర్వాలేదని ఇరుకైన సందులు, గొందులు వెదుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబు పార్టీ. జనంలో లేని బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే వీళ్ల పార్టీ ఫిలాసపీ. ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి – బాబు 1995లోనే సీఎం అయ్యి కూడా... సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఎన్నికలు మరలా వస్తుంటే... ఈ పెద్ద మనిషి ఏం అడుగుతాడంటే.. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా. మరో ఛాన్స్ ఇవ్వండి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోటిలోనుంచి మాటలు రావు. డీబీటీ రూపంలో మీ ఇంటికి ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇళ్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని, గ్రామానికి మంచి చేశానని, పిల్లలకు ఈ మంచి చేశానని కనీసం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకునే చరిత్రలేని వ్యక్తి చంద్రబాబు ఆయన పార్టీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు.. కానీ చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేని పరిపాలన ఆయన హయంలో సాగింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్ల ముందు నిలబడి మీ ఇంటికి ఈ మంచి చేశానని చెప్పలేని బాబు, సామాజిక వర్గాల ఎదురుగా నిలబడి మీకు ఈ మాట ఇచ్చి, నెరవేర్చా అని చెప్పలేని ఈ బాబు, ఏం చేశాడో తెలుసా ? నమ్మిన రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, యువతను, అవ్వాతాతలని అందరినీ హోల్‌సేల్‌గామోసం చేశాడు. అందరికీ అప్పులు పాలుజేసి, నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. చంద్రబాబు –మొదటి సంతకమే మోసం మామాలుగా ఎవరైననా ముఖ్యమంత్రి అయ్యి.. మొదటి సంతకం చేస్తే దానికి క్రెడిబులిడీ ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొదటి సంతకాలనే మోసం, వంచన, దగాగా మార్చి.. మరోసారి మళ్లీ కొత్త వాగ్ధానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలెట్టాడన్నది గమనించండి. మంచి చేయడం అన్నది చంద్రబాబు డిక్షనరీలో లేనేలేదు. ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయడం, ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి.. నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం, సత్తా ఈ మనిషి డిక్షనరీలోనే లేవు. చంద్రబాబు నాయుడు ఆయన గజదొంగల ముఠాలో వారికి తోడుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్లు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. వీరిది అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకంటే... దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకుని తినడానికి. పేదలకు– పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం... రాబోయే రోజుల్లో ఎన్నికల్లో యుద్ధం జరగబోతుంది. ఈ కురుక్షేత్రంలో.. యుద్దం జరగబోతున్నది వారు దోచుకోవాడనికి, పంచుకోవడానికి, తినడానికి మధ్య... మన ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకివెళ్లే కార్యక్రమం (డీబీటీ) మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారీ డీపీటీ కావాలో.. మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలో ఆలోచన చేయండి. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు పెత్తందారీ భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్దం జరుగుతుంది. రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదు... ఇక్కడ పేదవాడు మనవైపు ఉంటే.. అటువైపు ఉన్న పెత్తందార్లతో యుద్దం జరుగుతుంది. వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్దం జరుగుతుంది. ఒకవైపు మీ బిడ్డ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే మాట ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ నోట నుంచి వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలోని కేబినెట్లో ఈ రోజు 65 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కనిపిస్తారు. మీ బిడ్డ హయాంలో 5 గురు డిప్యూటీ సీఎంలు ఉంటే వారిలో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ సోదరులే కనిపిస్తారు. ఒకవైపు మీ బిడ్డ హయాంలో ప్రతి అడుగులోనూ నా అనే మాట వినిపిస్తుంది. చంద్రబాబు మాత్రం... కానీ అటువైపున మాత్రం ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న మాట వినిపిస్తుంది. బీసీల తోకలు కత్తరిస్తా అని అప్పట్లో వెటకారం చేసిన మాటలు వినిపిస్తాయి. చివరకి అక్కచెల్లెమ్మలను సైతం వదలకుండా... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా ? అని వెటకారం చేసిన మాటలుకనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు.... మీ బిడ్డ హయాంలో మనం చేసిన, కనిపిస్తున్న మంచికి మధ్య యుద్దం జరుగుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. వీరిది ఈ రోజు జగన్‌తో కాదు యుద్ధం, పేదలతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా నిలబడకపోవచ్చు. ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు. మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను మాత్రమే. నా ధైర్యం మీరే... నేను గర్వంగా చెప్తున్నాను. నా నమ్మకం మీరు. నా ధైర్యం మీరు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. వాళ్లు చెప్తున్న అబద్దాలను నమ్మకండి. వారు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ?లేదా ? అన్నదానిని మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు రాష్ట్రం పట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నలు ముఖాల్లో చిరునవ్వులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదీ చదవండి: 63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు -
రైతులతో ముచ్చటించిన సీఎం వైఎస్ జగన్
-
వాస్తవ దూరమైన కథనం.. అది ‘ఈనాడు’ ఆత్మఘోష
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో పగ్గాలు చేపట్టింది మొదలు సీఎం వైఎస్ జగన్ ప్రతీ అడుగు రైతు సంక్షేమం దిశగానే వేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్‌కు ముందుగానే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో పంట రుణాలు అందిస్తున్నారు. వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రైతులకు నేరుగా రూ.1.28 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్లకు పైగా బకాయిలను చెల్లించింది. ఇంతలా అన్నదాతలకు అండగా నిలుస్తుంటే కడుపు మంట తట్టుకోలేక ఈనాడు నిత్యం రోత రాతలు రాస్తూ ప్రభుత్వంపై అదే పనిగా బురద చల్లుతోంది. మూడేళ్లలో రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. మూడేళ్లలో ఇప్పటి వరకు రూ.23,875.29 కోట్లు అందించారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు బీమా పరిహారం ఇచ్చారు. రూ.లక్ష లోపు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్న్ ముగియకుండానే వడ్డీ రాయితీని అందిస్తున్నారు. ఇలా గత బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282.11కోట్లు చెల్లించారు. మూడేళ్లలో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మందికి రూ.1,612.80 కోట్ల పంట నష్టపరిహారాన్ని సీజన్ ముగియకుండానే అందించారు. ఆర్బీకేల ద్వారా 1.12 కోట్ల మందికి సేవలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా గత 27 నెలల్లో 1.12 కోట్ల మందికి సేవలందించారు. ఆర్బీకేల ద్వారా 34.65 లక్షల మంది రైతులకు రూ.564.50 కోట్ల విలువైన 19.22 లక్షల టన్నుల విత్తనాలు, 13.62 లక్షల మంది రైతులకు రూ.529.24 కోట్ల విలువైన 5.16 లక్షల టన్నుల ఎరువులు, 1.51 లక్షల మందికి రూ.14కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను పంపిణీ చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా కోసం జిల్లా, రాష్ట్ర, నియోజక వర్గ స్థాయిలో రూ.213 కోట్ల అంచనాతో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు తీసుకొచ్చారు. ఆర్బీకే స్థాయిలో రూ.587.64 కోట్లతో 6781, రూ.161.50 కోట్లతో 391 క్లస్టర్‌స్థాయిలో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జలకళ కింద రూ.5,715 కోట్లు వెచ్చిస్తూ రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా 2 లక్షల బోరు బావులు తవ్వుతున్నారు. ఉచిత విద్యుత్ కోసం మూడేళ్లలో రూ.25,561 కోట్లు ఖర్చు చేశారు. పంటవేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా మూడేళ్లలో రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6,903 కోట్ల విలువైన ఇతర పంటలను కొనుగోలు చేశారు. ఇవేమీ ఈనాడుకు కనిపించలేదు. సింగిల్‌కాలం వార్త కూడా రాసిన పాపాన పోలేదు. అందులో వాస్తవాలు లేవు.. అన్నదాతలు ఆత్మఘోష కధనం వాస్తవ విరుద్ధంగా ఉంది. 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు పేర్కొనటంలో వాస్తవం లేదు. 2020తో పోలిస్తే 2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2022లో ఇప్పటి వరకు 74 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులు పలు కారణాలతో చనిపోతుంటారు. అది రైతుల ఆత్మహత్యల కిందకు రావు. ఏ కారణంతో చనిపోయినా వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం అందచేస్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ తప్పుల తడకలే.. అడుగడుగునా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు భజన పత్రిక ఈనాడు ‘అన్నదాతల ఆత్మఘోష’ అంటూ సోమవారం వాస్తవ దూరమైన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఏపీలో 2020లో 889 మంది, 2021లో 1,065 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర ఆత్మహత్యలు పెరిగిపోయినట్లు అచ్చు వేసింది. వాస్తవానికి 2020లో 287 మంది, 2021లో 223 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు త్రిసభ్య కమిటీలు నిర్ధారించాయి. బాధిత కుటుంబాలకు రూ.7లక్షలు చొప్పున పరిహారం కూడా అందించారు. టీడీపీ హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్ప డితే అసలు వారు రైతులే కాదని, అవి ఆత్మహత్యలే కాదన్నట్లుగా రికార్డుల్లో కూడా నమోదు చేసేవారు కాదు. ఈ కారణంగా టీడీపీ హయాం లో ఐదేళ్లలో 1,004 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించగా, వారిలో పరిహారం ఇచ్చింది 531 మందికే. చంద్రబాబు ఎగ్గొట్టిన మిగతా 473 మంది బాధిత రైతు కుటుంబాలకు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.23.65కోట్ల పరిహారాన్ని అందించింది. రైతన్నలు ఏ కారణాలతో చనిపోయినా వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా త్రీమెన్ కమిటీ నిర్ధారణే కొలమానంగా ఆత్మహత్యకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు. మూడేళ్లలో 900 మంది మృత్యువాతపడగా, రూ.7 లక్షలు చొప్పున రూ.63 కోట్ల పరిహారాన్ని అందించారు. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సాగు సంబంధిత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలు కావు కాబట్టి రైతుల ఆత్మహత్యల పరిధిలోకి రావన్న విషయాన్ని ఈనాడు విస్మరించడం విడ్డూరంగా ఉంది. -
‘మత్తు’కు ముకుతాడు.. ఏపీ సర్కార్ చర్యలతో అడ్డుకట్ట
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది. (ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు ఆపరేషన్ పరివర్తన్ ఇలా.. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. ► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు. ► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది. ► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు. ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ ► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది. ► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. ► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. ► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు ► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు. ► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు. ► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు. ► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు. ► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు. ► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి. దేశంలోనే తొలిసారి గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గిరిజనుల జీవితాల్లో వెలుగు గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రాగులు పంట వేశాను ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం. – పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి మా బిడ్డల భవిష్యత్ కోసమే మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం. – బేతాయమ్మ, రైతు, వాకపల్లి ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. – లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి ఈ–క్రాపింగ్ చేస్తున్నాం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్ -
సాగు.. బహు బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో గత మూడేళ్ల కంటే మిన్నగా దిగుబడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు. ఈ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్‌లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది. మేలు చేస్తున్న వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ప్రారంభమైంది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా మినహా సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1 శాతం అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3 శాతం అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మొక్క నిలదొక్కుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరుకుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఈ సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు ç3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.50 కోట్ల విలువైన పురుగుల మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. గతేడాది కంటే మిన్నగా సాగు ఇక సాగు నీటి విడుదల, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగు జోరు పెంచారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు కాగా, జూలై మూడో వారం ముగిసే నాటికి 26.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 25 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 8.30 లక్షల ఎకరాల్లో పత్తి, 5.6 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.32 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. ఈసారి అప్పు చేయాల్సిన అవసరం లేదు నాకు మూడెకరాల సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తున్నా. రైతు భరోసా కింద æరూ.7,500, పంట బీమా పరిహారంగా రూ.18 వేలు వచ్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో చిన్న ట్రాక్టరుకు రూ.70 వేలు సబ్సిడీ అందింది. ఈసారి సాగుకు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. మంచి వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేశాను. – సానబోయిన శ్యామసుందర్, కొత్తపేట, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నా నాకు 12 ఎకరాల పొలం ఉంది. ఎంటీయూ 1061 రకం వరి వేశాను. మాను దశలో ఉంది. పెట్టుబడి సాయం, పంటల బీమా చేతికొచ్చింది. పెట్టుబడికి ఇబ్బంది లేదు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నా. – జి.శ్రీనివాసరావు, ఎస్ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం జిల్లా సాగు ఊపందుకుంటోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. నెలాఖరుకు కనీసం 50 శాతం దాటే అవకాశాలున్నాయి. విత్తనాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రికార్డు స్థాయిలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ జోరుగా సాగుతోంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రైతు గుండెల్లో గుడి కట్టుకున్న సీఎం వైఎస్ జగన్
-
తొలకరికి ముందే రైతన్నకు ‘భరోసా’
కరువన్నదే కానరాలేదు.. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ప్రతి రిజర్వాయర్ సకాలంలో నిండి కళకళలాడింది. అనంతపురం లాంటి కరువు జిల్లాతో సహా అన్ని చోట్లా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు మూడేళ్లుగా అత్యధికంగా సాగు నీరిచ్చాం. నేల తల్లి, వ్యవసాయం, మన గ్రామం, మన సంస్కృతి, రైతు కూలీలు, రైతుల కష్టంపై అవగాహన, మమకారం ఉండాలి. కానీ గత పాలకులకు ఇవేవీ లేవు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్ మొదలు కాకముందే.. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే.. జూన్ కంటే ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచా, కర్మణా గట్టిగా నమ్మి మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. రైతుల స్థితిగతులను మార్చేలా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి క్రమం తప్పకుండా క్యాలెండర్‌ను అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ నేరుగా జమ చేశారు. పథకం కింద ఈ నెలాఖరున అందించే సాయంతో కలిపితే మొత్తం రూ.3,758 కోట్లు రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయంగా జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను రుచి చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా.. వైఎస్సార్ రైతు భరోసాను అర్హులైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ భూములు) సాగు చేస్తున్న రైతులందరికీ అమలు చేస్తున్నాం. వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది రైతు భరోసా సాయాన్ని ఇవాళ గణపవరం వేదికగా విడుదల చేస్తున్నాం. తొలి విడత కింద ఖరీఫ్ సీజన్ మొదలుకాక ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.13,500 ఏటా అందచేస్తున్నాం. రైతన్నలకు మూడేళ్లలో రూ.1,10,093 కోట్లు నాలుగో ఏడాది మొదటి విడత సాయంగా ఇవాళ రూ.5,500 గణపవరం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పీఎం కిసాన్ పథకంలో భాగంగా మరో రూ.2 వేలను నెలాఖరుకి కేంద్రం విడుదల చేస్తుంది. ఏటా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు సుమారు రూ.7 వేల కోట్లను ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే అందిస్తున్నాం. ప్రస్తుతం అందిస్తున్న సాయాన్ని కూడా కలిపితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వైఎస్సార్ రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లైంది. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో రైతులకు రూ.1,10,093 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. రికార్డు స్థాయిలో దిగుబడి గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా గత మూడేళ్లలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. వడ్డీలేని రుణాలకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.782 కోట్లు ఇవ్వగా ఇప్పుడు మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు అందచేశాం. పారదర్శకంగా ఈ–క్రాప్, పరిహారం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా పంట నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పారదర్శకంగా ఈ–క్రాప్ అమలు చేస్తున్నాం. ఉచిత పంటల బీమాతో ఆదుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ.. రైతులకు మేలు చేయాలనే మంచి మనసుతో ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా దురదృష్టవశాత్తూ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను గత పాలకుల్లా వదిలేయకుండా, సాకులు చెప్పకుండా... పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా, కౌలు రైతులకు సీసీఆర్టీ కార్డులున్నా బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నాం. ఇంత పారదర్శకంగా చేస్తుంటే చంద్రబాబు దత్త పుత్రుడైన ఓ పెద్ద మనిషి రైతు పరామర్శ యాత్రకు బయలుదేరారు. కానీ ఆ యాత్రలో పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి రూ.7 లక్షలు పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారు. మనసు లేని నాయకుడు.. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగన్న నాయకుడు, రైతుల గుండెలపై గురిపెట్టి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబే. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో రుణమాఫీ చేస్తానని నమ్మించి ఐదేళ్లలో కేవలం రూ.15 వేలు కోట్లు మాత్రమే విదిల్చాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మి రైతులు మోసపోగా, తాకట్టుపెట్టిన వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నా మనసు కరగని నాయకుడు చంద్రబాబు. -
దుష్ట చతుష్టయం మొసలి కన్నీళ్లు
చెప్పిందే.. చేస్తా జగన్.. రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా, అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండడు. నిజాయితీ, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాడు రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దారుణంగా వంచించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే నోరెత్తని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుష్ట చతుష్టయం అంతా కలసి ఇవాళ రంధ్రాన్వేషణ చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టో హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును ప్రజల పక్షాన నిలబడి కనీసం ప్రశ్నించని, బాధ్యత లేకుండా తప్పించుకుని తిరిగిన ఆయన దత్తపుత్రుడిని ఏమనాలని నిలదీశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు పట్ల విపరీతమైన ప్రేమ చూపించి ఈ రోజు పరామర్శ యాత్రలంటూ పర్యటిస్తున్నారని విమర్శించారు. మొసలి కన్నీరు కారుస్తున్న వీరికసలు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ధ్వజమెత్తారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. టీడీపీ మేనిఫెస్టో చూపుతున్న సీఎం నాడు – నేడు.. ఎంత తేడా అంటే? చెప్పిన దానికంటే మిన్నగా.. అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని మూడేళ్లుగా అందిస్తున్నాం. 2014–19 మధ్య ఇలాంటి పథకం ఉందా? సొంత భూమి ఉన్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూముల సాగుదారులందరికీ వైఎస్సార్ రైతు భరోసా మాదిరిగా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? మేనిఫెస్టోలో రైతన్నకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ అంతకు మించి నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. అంటే ఐదేళ్లలో ప్రతి రైతు చేతిలో రూ.67,500 చొప్పున పెడుతున్నాం. మూడేళ్లలోనే అన్నదాతలకు వివిధ పథకాల ద్వారా రూ.1.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మాఫీ పేరుతో ముంచారు.. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని నమ్మించి ముష్టి వేసినట్లు కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్న గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించండి. ఈ మూడేళ్లలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.23,875 కోట్లు రైతు భరోసా ద్వారానే అందచేశాం. ఇంతగా సహాయపడే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? పారదర్శకంగా పరిహారం.. వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 65.65 లక్షల మంది రైతులకు మేం మూడేళ్లలో రూ.1,282 కోట్లు ఇస్తే.. ఐదేళ్లు పరిపాలన చేసిన ఓ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.782 కోట్లు. ఇప్పటి మాదిరిగా ఏ సీజ¯Œన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? పంట నష్టం జరిగితే అసలు పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి నుంచి.. సీజ¯Œన్ ముగిసేలోగా ఆర్బీకేల్లో జాబితాలు ప్రదర్శిస్తూ, ఇంకా ఎవరైనా మిస్ అయితే పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతూ ఇ–క్రాప్‌తో అనుసంధానించి పారదర్శకంగా చెల్లిస్తున్నాం. మూడేళ్లలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అందించిన సొమ్ముతో పాటు వచ్చే నెలలో అందించనున్న మొత్తాన్ని కూడా కలిపితే 31 లక్షల మంది రైతులకు దాదాపు రూ.5 వేల కోట్లు ఇన్సూరెన్స్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆర్బీకేల్లో అన్ని సేవలు.. విత్తనం నుంచి విక్రయాల వరకూ ప్రతి అడుగులోనూ రైతులకు సహాయపడుతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్నాం. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ చెల్లింపు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లాంటివి పారదర్శకంగా చేపట్టి అక్కడే జాబితా ప్రదర్శిస్తూ ఇస్తున్న వ్యవస్థ గతంలో ఉందా? విత్తనాలు మొదలుకుని పురుగు మందుల వరకూ నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌లు తీసుకొచ్చాం. గతంలో ఇలాంటివి ఉన్నాయా? గతంలో బ్యాంకు రుణాలు అందినప్పుడు బీమా సొమ్ము మినహాయించుకుని వారికి మాత్రమే వర్తింపజేసేవారు. మిగతా వారికి బీమా ఎలా కట్టాలో కూడా తెలియదు. రైతులు చెల్లించిన సందర్భాలు చాలా తక్కువ. ఇవాళ ప్రతి రైతు పేరుతో ఆర్బీకేలోనే ఇ–క్రాప్ బుకింగ్, ఇన్సూరెన్స్ నమోదు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు తావులేదు. నాకు ఓటు వేసినా, వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి రైతుకు మంచి జరుగుతోంది. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించని పంటలను కూడా రైతులు నష్టపోరాదని ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం గతంలో జరిగిందా? ఆక్వా రైతులకు రూ.2,403 కోట్ల సబ్సిడీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంటు సబ్సిడీ ఇస్తూ మూడేళ్లలో రూ.2,403 కోట్లు సబ్సిడీ కల్పించిన ఏకైక ప్రభుత్వం మనదే. కోవిడ్ సమయంలో నష్టపోకుండా వారికి తోడున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లోపు 87 శాతం మంది 70,518 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న 13 శాతం మంది అంటే ఐదు వేల మంది రైతులు 60 శాతం భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారు. ఆక్వాజోన్‌లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీ ఆక్వా సాగుదారుల్లో 5 ఎకరాలలోపు ఉన్న వారందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50 సబ్సిడీ కొనసాగుతుంది. మిగిలిన వారికి రూ.3.80 ఉంటుంది. ఈ మొత్తం కూడా సబ్సిడీ మొత్తమే. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈ రేటు ఇస్తున్నాం. అయితే పరిమితిని 10 ఎకరాల వరకు విస్తరింప చేయాలని ఎమ్మెల్యే వాసుబాబు కోరారు. ఆక్వాజో¯న్లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీని విస్తరిస్తాం. ఇది ప్రతి ఆక్వా రైతుకూ సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నా. పాడి రైతులను కాపాడి.. గతంలో పాడి రైతులు మోసాలకు గురై నష్టపోయారు. ఇవాళ అమూల్‌ను తీసుకొచ్చి లీటర్ పాల మీద పాడి రైతులకు రూ.5 నుంచి రూ.10 అదనంగా ఇస్తున్నాం. అమూల్ ఈ ధర ఇస్తోంది కాబట్టి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో సహా ప్రైవేట్ డెయిరీలన్నీ ఇదే మాదిరిగా చెల్లించక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రశ్నించని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి? 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ తరువాత టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే నైజం చంద్రబాబుది. చంద్రబాబు మేనిఫెస్టోతో పాటు లేఖలు కూడా రాశారు. ఇందులో చంద్రబాబు, దత్తపుత్రుడు సరిపోరన్నట్లుగా ప్రధాని ఫొటో కూడా పెట్టారు. ఆ మేనిఫెస్టోను బాబు అమలు చేయకుండా మోసగిస్తే కనీసం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి అడుగు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి? కొల్లేరు కోరికలు తీరుస్తూ... ఎమ్మెల్యే వాసు గణపవరాన్ని భీమవరంలో కలపాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో రీ సర్వే అడిగారు. ఈమేరకు ఆదేశాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో అమలవుతాయి. కొల్లేరు ప్రాంతంలో చెట్టున్నపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో తాగునీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కోసం కావాలన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తైంది. జూన్‌లో శంకుస్థాపన చేస్తా. ఉంగుటూరులో 6 సబ్స్టేషన్లు కావాలని అడిగారు. సర్వే చేయించి అవసరమైన చోట వచ్చేటట్లు చేస్తాం. ఏలూరు కాలువపై నారాయణపురం, ఉంగుటూరు, పూళ్ల, గుండుగొలను గ్రామాల్లో వంతెన నిర్మాణాలు అడిగారు. అవి కూడా చేస్తాం. నారాయణపురం, ఉండి రోడ్డులో వెంకయ్యవయ్యేరు కాలువపై కొత్త వంతెన అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. 48 పాత ఇందిరమ్మ కాలనీల్లో కనీస వసతులు కోసం విజ్ఞప్తి చేశారు. అవి కూడా చేపడతామని హామీ ఇస్తున్నా. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు కాకాణి గోవర్దనరెడ్డి, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను రైతులు గమనించాలి: సీఎం జగన్
-
వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్@ఏలూరు జిల్లా (ఫోటోలు)
-
చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు (గణపవరం): చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ఇక ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమై ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు. ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, రాజకీయాల గురించి ఆలోచన చేయనని.. ప్రజలకు మంచి చేయాలన్నది తన తపన’’ అని సీఎం అన్నారు. ‘‘ఈ మధ్య రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు. ఇవాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అదే’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తుచేసుకోండి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు. ‘చంద్రబాబు 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. చెత్తబుట్టలో వేసిన చంద్రబాబుగారి నైజాన్ని చూడండి. ఇవాళ మన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికీ జగనన్న రాసిన లేఖను అందించి.. ఏం మేలు జరిగిందో చూపిస్తూ, గుర్తుచేస్తూ, మేనిఫెస్టోలో ఏం జరిగిందో టిక్కు పెట్టిస్తున్నారు. మన అందరి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. జగన్ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలు అయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో... అదే చేస్తాడు. దేవుడు ఆశీస్సులు కావాలి.. మీరు చల్లని దీవెనలు ఇవ్వాలని' సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ రైతు భరోసా.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్