Adulterated alcohol
-
కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు?!
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే! అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి. మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు. వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం. అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది. మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్‌లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు. ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన. నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు. నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం? ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కల్తీ మద్యం కలకలం?
నాగర్‌కర్నూల్ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్‌కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ వద్ద కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ పరమేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని మోతీ వైన్స్‌లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్ ఈఎస్ ఫయాజుద్దీన్‌ను వివరణ కోరగా మోతీ వైన్స్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
AP: రాష్ట్రంలో కల్తీ మద్యం లేనేలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేనేలేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశంతోనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 90 వేల మద్యం నమూనాలే పరీక్షించేవారని చెప్పారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా ఏటా 1.50 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల నమూనాలను ఐదు ప్రాంతీయ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగిన ప్రమాణాల మేరకు ఉన్నవాటినే మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. అక్కడ మృతుల్లో ఎవరూ కల్తీ మద్యం వల్ల మరణించలేదని వైద్య పరీక్షల నివేదికలు కూడా స్పష్టం చేశాయని చెప్పారు. కొత్త డిస్టిలరీలకు అనుమతివ్వలేదు 2018 తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మద్యం బ్రాండ్లను తయారు చేస్తున్న డిస్టిలరీలకు గత ప్రభుత్వ హయాంలో 2018లోనే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. సారా తయారీ, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ చేపట్టిందన్నారు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించడంతోపాటు 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేసినట్టు తెలిపారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని వాటి సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించినట్టు వివరించారు. మద్యం విక్రయ సమయాలను కూడా కుదించామన్నారు. దాంతో రాష్ట్రంలో 2018–19తో పోలిస్తే 2019–20లో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్ విక్రయాలు 59 శాతం తగ్గాయని వివరించారు. ఇక 2020–21లో అయితే మద్యం విక్రయాలు 40 శాతం, బీర్ విక్రయాలు 77 శాతం తగ్గాయని చెప్పారు. సారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో సారా, అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను వినియోగించి ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలు, జియో ట్యాగింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామన్నారు. 2020లో సెబ్‌ను ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేసి, 70 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. సారా, అక్రమ మద్యం అరికట్టేందుకు గతంలో ‘ఆపరేషన్ నిఘా’ నిర్వహించగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ పరివర్తన్–2.ఓ’ నిర్వహిస్తున్నామన్నారు. గడచిన 10 రోజుల్లోనే 2,051 కేసులు నమోదు చేసి 1,260మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 26,375 లీటర్ల సారా, 89 వాహనాలను జప్తు చేసి 10.05 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వివరించారు. సారా, అక్రమ మద్యం విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. -
సారాయి సాధ్యమేనా?
ఏమైనా లాజిక్ ఉందా...? నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతం.. పోలీస్‌స్టేషన్‌తో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలున్న జంగారెడ్డిగూడెం లాంటి చోట అందరి కళ్లుగప్పి నాటు సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? ఎక్కడో మారుమూలన, నిర్జన ప్రాంతంలో అలా జరుగుతోందంటే నమ్మవచ్చేమో..! విపక్షం కాస్త లాజిక్‌గా ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాటుసారా కాసేవారికి అండగా నిలిచే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎస్ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యులు మంగళవారం కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో సీఎం స్పందిస్తూ అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమవుతోందని తెలిపారు. టీడీపీ సభ్యులు నాగరికంగా ప్రవర్తించాలని, సభ జరగకూడదనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని, వారు ప్రస్తావిస్తున్న అంశాలపై తాను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కళ్లుగప్పి సారా తయారీ సాధ్యమేనా? దాదాపు 55 వేల జనాభా నివసిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా సారా కాయగలరా? అని సీఎం ప్రశ్నించారు. పైగా అది ఒక మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. 2011 లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉండగా ప్రస్తుతం దాదాపు 55 వేల మంది నివసిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు, మహిళా పోలీస్‌లున్నారని చెప్పారు. వారందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మవచ్చని, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో సారా కాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు పొంతన ఉందా? ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచుతోందంటూ మరోవైపు జనం సారా తాగుతున్నారని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా అనే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు మరో రూ.25 వేల కోట్లు రుణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని చంద్రబాబు అంటున్నారు. మద్యం విక్రయాలు బాగా పెంచి ఆదాయం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాటు సారా తాగి మనుషులు చనిపోయారని చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు’ అని మండిపడ్డారు. ‘ఈనాడు’ వక్రభాష్యం ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని తాను వ్యాఖ్యానించినట్లు ఈనాడులో వ్యంగ్యంగా రాశారని సీఎం పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 44 వేలు కాగా పదేళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇప్పుడు దాదాపు 55 వేల మంది ఉన్నట్లు చెప్పామన్నారు. దేశంలో 2 శాతం మరణాల రేటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, ఆ మరణాలు.. వృద్ధాప్యం, అనారోగ్యం, మరే ప్రమాదం వల్లైనా కావచ్చన్నారు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటుగా తీసుకుంటే ఏటా దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారని, అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుందన్నారు. ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకరించి రాసిందన్నారు. నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదన్నారు. వేర్వేరు చోట్ల వారం వ్యవధిలో చోటు చేసుకున్నాయని, మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయన్నారు. అప్పుడు ఏ రాద్ధాంతం జరగలేదన్నారు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి పాతిపెట్టిన భౌతిక కాయానికి పోస్టుమార్టమ్ నిర్వహించిందన్నారు. నిజంగానే అది సారా మరణం అయితే ప్రభుత్వం పోస్టుమార్టమ్ నిర్వహిస్తుందా? అని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారం... ‘ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి.. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఢంకా భజాయించాలి... ఆ విధంగా గోబెల్స్ ప్రచారం చేయాలి. ఓ అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు విశ్వసిస్తారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు.. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదేపదే అదే విషయాన్ని చెబుతారు. కొన్ని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు కలసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..’ అని సీఎం జగన్ మండిపడ్డారు. జరగని దాన్ని జరిగినట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయడానికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతే కానీ ఇలాంటి ప్రవర్తనతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని టీడీపీ సభ్యులకు సూచించారు. బడ్జెట్ చర్చల్లో విపక్షం పాలుపంచుకోవాలని, సలహాలు ఇస్తే నోట్ చేసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే వ్యవహరిస్తూ కొత్త రూల్ ప్రకారం సస్పెండ్ కాదలచుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. -
CM YS Jagan: ‘కల్తీ’ మాటలేల!
మరోసారి స్పష్టంగా చెబుతున్నా... కల్తీ మద్యం తయారీదారులను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను తీసుకొచ్చాం. అక్రమ, కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఎస్ఈబీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కానీ.. లేని విషయాన్ని ఉన్నట్టుగా, సహజ మరణాలనూ అక్రమ మద్యం వల్ల చనిపోయినట్లుగా భ్రమలు కల్పిస్తూ యాగీ చేయడం తప్పని టీడీపీ సభ్యులకు ఈ సభ ద్వారా చెబుతున్నా. ఇప్పటివరకు అక్రమ మద్యంపై ఎస్ఈబీ 13 వేల కేసులను నమోదు చేసింది. అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే తపనతో కఠినంగా వ్యవహరిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ కల్తీ మద్యం వల్ల చనిపోయారనే భ్రమలు కల్పించేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్య సమస్యలతోపాటు సహజ మరణాల పాలైన వారిని కల్తీ మద్యం మృతులుగా పేర్కొంటూ టీడీపీ సభ్యులు సోమవారం శాసనసభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి జగన్ స్పందించి విపక్షం ఆరోపణలను తిప్పికొట్టారు. కల్తీ మద్యం, అక్రమ మద్యం దందాకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే... ఏమిటీ ‘అసహజ’ ధోరణి? 2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994. దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు 12 శాతం అని పరిగణిస్తే ప్రస్తుతం అక్కడ 54,880 మంది ఉండవచ్చు. మొత్తం మున్సిపాలిటీలో వారు చెబుతున్న మరణాలే 18. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఆ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సహజ మరణాలు నెలకు 2 శాతం వరకు ఉంటాయని అంచనా వేసుకున్నా... నెలకు కనీసం 90 మంది సహజంగానే అంటే అనారోగ్యం, వయోభారం, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడటం మనం ఇక్కడే చూస్తున్నాం. చంద్రబాబు హయాంలోనూ.. కల్తీ మద్యం తయారీదారులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది...? గతంలో చంద్రబాబు హయాంలో అక్రమ మద్యం తయారీ జరిగింది. అది ఇప్పుడే కొత్తగా జరుగుతున్నదీ కాదు. అప్పుడూ జరిగింది... ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. నేను కాదనడం లేదు. కాబట్టే... స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా కల్తీ మద్యం తయారీ లాంటివి గుర్తిస్తే ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మాకు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పాం. తాగుడు తగ్గించడమే లక్ష్యం మా ఉద్దేశం, తపన అంతా.. మద్యం వినియోగాన్ని తగ్గించాలన్నదే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన 43 వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేశాం. చంద్రబాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉండేవి. అంతేకాకుండా ఆ మద్యం షాపులకు అనుబంధంగా పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు. 50 మంది నుంచి 60 మంది వరకు అక్కడే కూర్చొని మద్యం తాగేవారు. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి రాగానే పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేశాం. గతంలో బడి పక్కన, గుడి పక్కన ఇలా గ్రామంలో ఎక్కడపడితే అక్కడే మద్యం దొరికేది. రాత్రి 12 గంటలు.. ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టం వచ్చినట్లు తాగించేవారు. లాభాపేక్షే ధ్యేయంగా ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా అమ్మేవారు. అందువల్లే ప్రభుత్వం చేపట్టింది.. మద్యం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను నివారించడం దాదాపుగా అసాధ్యం. గతంలో ఎటు చూసినా బెల్టు షాపులే. పల్లెల్లో అనధికారికంగా ఏర్పాటు చేసి విక్రయాలు సాగించేవారు. ధనార్జనే ధ్యేయంగా నడిచే ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలుంటే మద్యం వినియోగాన్ని తగ్గించలేమనే ఉద్దేశంతో ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసింది. మద్యం షాపులను కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫలానా సమయానికి మూసివేయాలంటే కచ్చితంగా అదే సమయానికి మద్యం షాపులు మూసి వేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని తీసుకొచ్చాం. దీనివల్ల ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా అడ్డుకోగలిగాం. వాటివల్ల తలెత్తే దుష్పరిణామాలను అడ్డుకోగలిగాం. కల్తీకి ఆస్కారం లేకుండా.. వీటితోపాటు షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం తగ్గింది. కానీ ఈ రకంగా రేట్లు అధికంగా నిర్ణయించడంతో అక్రమ మద్యానికి ఆస్కారం లభిస్తోందని కొంతమంది చెప్పారు. ధరలను తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అరికట్టగలుగుతామని ఎస్ఈబీ నివేదిక నివేదిక ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అదే అభిప్రాయం చెప్పాయి. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకుని మళ్లీ ధరలు తగ్గించాం. ఇక అప్పటి నుంచి మన ధరలు ఎక్కువని, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి అవకాశం లేదు. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది? -
తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
40కి చేరిన కల్తీ మద్యం మరణాలు
సమస్తిపూర్/పట్నా: బిహార్‌లో కల్తీమద్యం తాగి మూడు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్తీపూర్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురు, శుక్రవారాల్లో గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో 33 మంది చనిపోయారు. తాజాగా, శనివారం సమస్తీపూర్ జిల్లా పటోరీ పోలీస్‌స్టేషన్ పరిధి రుపౌలీ పంచాయతీలో ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ మానవ్‌జీత్ ధిల్లాన్ చెప్పారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. -
‘నకిలీ’ ప్రతాపం
కేఈ బ్రదర్స్. ఈ పేరు చెప్పగానే దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకు గుర్తొచ్చేది మద్యం వ్యాపారం. దీని ద్వారానే వారు ఆర్థికంగా ఎదిగి.. రాజకీయాల్లో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంతో పాటు నకిలీ మద్యం కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. డోన్ మండలం ఉడుములపాడులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ పేరు చేర్చారు. ఆయనతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో టీడీపీ నాయకులు..అది కూడా కేఈ అనుచరులే ఎక్కువగా ఉండడం గమనార్హం. గోవా, కర్ణాటక కేంద్రంగా నకిలీ మద్యం తయారీ వీరి కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. కేసులను పరిశీలిస్తే మద్యం రాకెట్ గోవా నుంచి కర్నూలు వరకూ విస్తరించినట్లు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో నకిలీ మద్యం వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతోంది. గోవా, కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. గోవాలోని ఓ బేవరేజస్‌లో నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుళ్లు అతికించి వేల కేసులను ‘సీమ’కు సరఫరా చేసేవారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలకు కూడా ఇది సరఫరా అయ్యేది. కంటైనర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసేవారు. దీంతో పాటు నాటుసారా ఎక్కువగా కాసేవారు. ఈ దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. తాజాగా డోన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును పరిశీలిస్తే ఏళ్ల తరబడి నకిలీ మద్యం దందా ఎలా సాగిందో స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో వారికి కొందరు ఎక్సైజ్ అధికారుల అండ కూడా ఉండేది. ఫలితంగా భారీ ముడుపులు స్వీకరించేవారని తెలుస్తోంది. ఐదేళ్ల కిందటే గుట్టురట్టు నకిలీ మద్యం కర్నూలు జిల్లాకు సరఫరా అవుతోందని 2014 డిసెంబర్ 7న అనంతపురం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. 8వ తేదీ రాత్రి నిఘావేసి గుత్తి హైవేలో ఓ కంటైనర్‌ను పట్టుకున్నారు. అందులో వేల సంఖ్యలో మెక్‌డొవెల్స్, ఇతర బ్రాండ్ల పేరిట ఉన్న మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా మొత్తం నకిలీ మద్యమని తేలింది. ఈ కేసులో అప్పట్లో ఎనిమిది మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఏ1గా గోవాలోని డ్రైవర్ గుల్జార్ హుస్సేన్, ఏ2గా జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిందర్లాల్, ఏ3గా బెంగళూరు వాసి కార్గో రమేశ్, ఏ4గా బంటిసింగ్(గోవా), ఏ5గా రమేశ్‌సింగ్(హర్యానా), ఏ6, ఏ7, ఏ8గా బెంగళూరు వాసులు రామయ్య, శివన్న, రాకేశ్‌లపై చార్జ్‌షీటు వేశారు. అప్పటి మంత్రి జోక్యంతో కేసు తారుమారు కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గోవాకు వెళ్లి అక్కడి బేవరేజస్ను పరిశీలించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తేలడంతో రామయ్య అనే వ్యక్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కర్నూలు జిల్లా డోన్‌కు తీసుకెళుతున్నట్లు అప్పట్లో నిందితులుచెప్పినట్లు తెలిసింది. తాజాగా డోన్ పరిధిలో నమోదైన నకిలీ మద్యం కేసులో పేర్కొన్న వ్యక్తుల్లోని కొందరు అప్పట్లో ఈ కంటైనర్‌ను రప్పించారు. ఈ విషయం విచారణలో తేలింది. అయితే అప్పటి ప్రభుత్వ ‘పెద్ద’ జోక్యంతో కేసును తారుమారు చేశారని తెలుస్తోంది. కంటైనర్‌ను పట్టుకున్న పోలీసులు అది ఎక్కడికి వెళుతోంది? ఎవరు తెప్పించారనేది చార్జ్‌షీట్‌లో పొందపరచలేదు. ‘గుత్తికి కంటైనర్ చేరిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ స్థలానికి తీసుకురండి’ అని డ్రైవర్ చెప్పినట్లు పేర్కొని కేసును మూసేశారు. కంటైనర్ ఎక్కడికి వెళుతోందనేది తెలుసుకోవాలని ఎక్సైజ్ పోలీసులు భావించి ఉంటే ఫోన్‌కాల్ ఆధారంగా పట్టుకోలేరా అనేది తేలాల్సిన ప్రశ్న. కాగా ఈ కేసు ఎఫ్ఐఆర్ 2014లో నమోదు కాగా చార్జ్‌షీట్ మాత్రం 2018లో వేశారు. తరచూ నకిలీ మద్యం సరఫరా గోవా, కర్ణాటక నుంచి నకిలీ మద్యం తరచూ సరఫరా అయ్యేది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటం, జిల్లాలో కేఈ బ్రదర్స్ హవా నడవడంతో ఎక్సైజ్ పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో నకిలీ దందా యథేచ్ఛగా సాగింది. అలాగే ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్‌ను కూడా వీరు సరఫరా చేసేవారు. మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా నూట్రల్ ఆల్కహాల్)బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటకలో ఆర్ఎస్(రెక్టిఫై స్పిరిట్)బేస్డ్తో తయారు చేస్తారు. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్, ఆర్ఎస్ సింగిల్ఫిల్టర్. ఆర్ఎస్తో పోలిస్తే ఈఎన్ఏ బేస్డ్ మద్యం తయారీకి వాడే స్పిరిట్ ధర ఎక్కువ. దీంతో ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్ తక్కువ ధరతోనే లభిస్తుంది. దీంతో క్వార్టర్, డిప్లు ఎక్కువగా కర్ణాటక, గోవా నుంచి దిగుమతి చేసుకుంటారని తెలుస్తోంది. ట్యాక్స్ భారం కూడా ఉండదు. దీంతో వాటికి స్టిక్కర్లు అంటించి ఇక్కడి వైన్‌షాపుల్లో విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు. సెకండ్స్, థర్డ్తోనే థ్రెట్ బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్‌షాపుల్లో విక్రయిస్తారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చేది ‘సెకండ్స్’. స్పిరిట్, మరిన్ని రసాయనాలతో ఇక్కడే తయారుచేసేది థర్డ్. సెకండ్స్‌తో పాటు థర్డ్ విక్రయాలు జోరుగా సాగించారు. వీటిని సేవించి ఆరోగ్యం గుల్ల చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపడంతో ‘డోన్’లోని ‘నకిలీ ముఠా’ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తే జిల్లాతో పాటు కర్ణాటక, గోవాలోని నకిలీ మద్యం తయారీ స్థావరాలు, ఇంకొందరు పెద్దమనషుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అయ్యప్పగౌడ్ అరెస్ట్ డోన్ టౌన్: నకిలీ మద్యం కేసులో 3వ నిందితుడిగా ఉన్న అయ్పప్పగౌడ్ను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గత ఐదేళ్లుగా డోన్‌లోని మద్యం సిండికేట్ కార్యాలయ వ్యవహారాలు చూసేవాడు. ఇతనితో నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇంకా 24 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కూడా ఉన్నారు. -
నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్
టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డోన్ : సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్ లాభాల్లో కేఈ ప్రతాప్‌కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్‌లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్‌గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్‌షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలింది గత డిసెంబర్ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్ రెడ్డి, కంబాలపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్ ఖలాల్‌ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది. నిందితులు వీరే 1.వినోద్‌ఖలాల్ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్ గౌడ్ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్ (టీడీపీ)10. రోహిత్ ఖలాల్ (హుబ్లీ) 11.రాకేష్ ఖలాల్ (హుబ్లీ) 12.సునీల్ ఖలాల్ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్ గౌడ్ (టీడీపీ) 25.డీలర్ రాము గౌడ్ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్ (నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్) 27.టీఈ కేశన్న గౌడ్ (మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ) 28.చిట్యాల లోకనాథ్ గౌడ్ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త) 30.కంబాల పాడు కేఈశ్యామ్ (మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్‌గౌడ్ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.) సిండికేట్ ఇష్టారాజ్యం మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్‌శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి. -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
కర్నూలు, డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఉప్పరి రాంబాబు తన ఇంటిలో అండర్‌గ్రౌండ్‌లో బంకర్ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి, ఇతర ప్రదేశాలకు తరలిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గత నెల 29న సోదాలు చేసి నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుకు తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన శ్రీనివాసగౌడ్, ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీనివాసరావులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటక నుంచి ముడిసరుకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి స్పిరిట్, క్యారామిల్, మూతలు తదితర ముడి సరుకు తెప్పించి నకిలీ మద్యాన్ని రాంబాబు తయారు చేసేవాడు. వీటి కొనుగోలుకు ఉడుములపాడుకు చెందిన ఈడిగ నాగభూషణం, డోన్ పట్టణానికి చెందిన ఫజల్, ఈడిగ రవి ఆర్థికంగా డబ్బు సమకూర్చేవారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని బనగానపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, శివ, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మురళీధర్‌గౌడ్, కొత్తపల్లెకు చెందిన రాజశేఖర్ తదితరులతో పాటు మరికొంత మంది ద్వారా విక్రయించేవాడు. రూ.8 లక్షల విలువ చేసే ముడిసరుకు స్వాధీనం నిందితుడి నుంచి పోర్డ్ ఐకాన్ ఏపీ 21ఏఈ 3007 నంబరు కారు, 720 క్వాటర్ బాటిళ్లతో పాటు రాంబాబు ఇంటిలోని బంకర్లో 17 బస్తాల్లో ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు, 245 లీటర్ల స్పిరిట్, 4 వేల మ్యాక్‌డోల్ బ్రాంది, 2 వేల ఇంపీరియల్ బ్లూ మద్యం బ్రాండ్ ఖాళీ మూతలు, 10 వేల గోలా క్యాప్స్, క్యారమిల్, ఏస్సేన్, మద్యం మీటర్, 19 ఖాళీ క్యాన్లు, 2 డ్రమ్ములు, 800 ఖాళీ క్వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాంబాబుతో పాటు ఉడుములపాడుకు చెందిన నాగభూషణం, రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ముడి సరుకు రవాణా అసలు సూత్రధారుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీసీ చెప్పారు. సమావేశంలో నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ క్రిష్ణకిషోర్‌రెడ్డి, కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శివశంకర్‌రెడ్డి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐలు శ్రీధర్‌రావు, రమణారెడ్డి, సిబ్బంది లక్ష్మినారాయణ, సుధాకర్‌రెడ్డి, లాలప్ప, శంకర్‌నాయక్, ధనుంజయ ఉన్నారు. -
టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ
కర్నూలు డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు. అండర్‌గ్రౌండ్ కేంద్రంగా.. ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్ గ్రౌండ్లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్‌డోల్ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్ పౌడర్, కెమికల్ ఫ్లేవర్ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. అన్నీ బ్రాండ్లు ఇక్కడే ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్ కలార్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడించలేం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సీఐ శిరీషాదేవి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐ రమణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్ నాయక్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. -
కాస్టిలీ బాటిల్...చీప్ మిక్సింగ్!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 28.01.2018: వీరఘట్టంలో జనాతా వైన్స్ పేరుతో నిర్వహిస్తోన్న దుకాణంలో కల్తీ మద్యం వెలుగుచూసింది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను పోలిన నకిలీ మూతలను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తయారీ చేయించి తీసుకొచ్చినట్లు ఆధారాలు దొరికాయి. 01.02.2018: ఆమదాలవలస పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో బెల్ట్‌షాప్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు చేశారు. అక్కడ దొరికిన మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ నంబర్లు ఆధారంగా ఆరా తీశారు. ఆ సరుకు సమీపంలోని రవితేజ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వచ్చినట్లు తేలింది. అంతేకాదు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తే కల్తీ మద్యం అని రూఢీ అయ్యింది. దీంతో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ నెల 15వ తేదీన సీజ్ చేశారు. రాజధాని స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తేనో, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తేనో ఈ రెండు అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి! అసలే మద్యం మహమ్మారి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తుంటే మరోవైపు చాపకింద నీరులా కల్తీ మద్యం మరింత ప్రమాదకర స్థాయిలో పట్టణాల్లో, గ్రామాల్లో విస్తరిస్తోంది. గత నెల రోజు వ్యవధిలోనే 11 మద్యం దుకాణాలను ఇదే కారణంతో సీజ్ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ కల్తీ భూతం విస్తరణకు బెల్ట్‌షాపులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. నెల రోజుల్లో 210 బెల్ట్‌షాపులపై దాడులు చేసి 192 మంది నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోకి తీసుకున్నా ఏమాత్రం నకిలీ మద్యం జోరు తగ్గట్లేదు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికికారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న విపరీత ధోరణిపై విమర్శలు వస్తున్నా తీరు మారట్లేదు! చంద్రబాబు సంతకం చేసినా.... బెల్ట్ షాపులు మూసేయిస్తానని చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తొలిరోజే చేసిన సంతకం చెల్లుబాటు కావట్లేదు! బెల్ట్‌షాపులు మూతపడలేదు సరికదా కల్తీ మద్యం అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. అక్రమార్కులు బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్‌లిక్కర్, తక్కువ ఖరీదు మద్యం కల్తీ చేసి నకిలీ మూతలను టాంపరింగ్ చేస్తున్నారు. ఈ సరుకు బెల్ట్‌షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో కోటబొమ్మాళి, శ్రీకాకుళం, పాతపట్నం కూడా భారీఎత్తున నకిలీ మూతలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ మూతల రంగు, టైటిల్, లెటరింగ్, లేబుళ్లు... అన్నీ మక్కీకిమక్కీగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ నకిలీ మూతల తయారీకే ఒక పరిశ్రమ నడుస్తోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మూతకు రూపాయి చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లాకు తీసుకొచ్చి మద్యం అక్రమార్కులకు రూ.3 నుంచి రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. షాపుల్లో, ఇళ్లల్లో కల్తీ.. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో పట్టుబడిన నకిలీ మూతలను బట్టిచూస్తే మద్యం కల్తీ అంతా వైన్ షాపుల్లో లేదంటే అక్రమార్కుల ఇళ్లల్లో జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతోంది. జిల్లాలో 239 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిద్వారా మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.60 కోట్ల వరకూ జరుగుతున్నాయి. మరోవైపు దుకాణానికి నెలనెలా రూ.50 వేల చొప్పున అధికార పార్టీలో కీలక నాయకుడి అనుచరులు మామ్మూళ్లు వస్తున్నారు. వీటన్నింటికీ తోడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో వైన్‌షాపుల నిర్వాహకులు కొందరు బ్రాండెడ్ మిక్సింగ్‌కు తెగిస్తున్నారు. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలను తొలగించి అందులోనుంచి కొంత మద్యం తీసేస్తున్నారు. ఆ మేరకు తక్కువ ఖరీదు మద్యం, చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నారు. కొన్నిచోట్ల నీళ్లు కలిపేస్తున్నారు. ఇటీవల రాజాంలో ఈ తరహా ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాటిళ్లకు నకిలీమూతలను బిగించేసి యథావిధిగా నకిలీ సీళ్లనే వేసేస్తున్నారు. ఈ కల్తీ సరుకు విక్రయాలు బెల్ట్‌షాపుల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో బెల్ట్‌షాపుల్లో విక్రయాలు ఎక్కువగా రాత్రిపూట జరుగుతున్నాయి. వెలుతురు సరిగా లేని ఆ దుకాణాల్లో నకిలీ మూతలను మందుబాబులు గుర్తించలేకపోతున్నారు. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమా? కల్తీ మద్యం వ్యవహారాలను అరికట్టేందుకు తరచుగా తనిఖీలు నిర్వహించాలి. వైన్‌షాపుల్లో మద్యం శాంపిళ్లు తీసి ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలి. మరోవైపు నకిలీమూతల తయారీదారులు, పంపిణీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడే మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్ శాఖలో ఈ తరహా చర్యలు కనిపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు, మామూళ్ల వ్యవహారాలే ఈ అలక్ష్యానికి కారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 3వ తేదీన సాక్షాత్తూ జిల్లా ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు రూ.4.50 లక్షల భారీ మొత్తాన్ని పట్టుకున్న వ్యవహారమే దీనికి పరాకాష్ట. గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం కార్యాలయానికి కూడా జిల్లాలో అక్రమ మద్యం వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తున్నట్లు తెలిసింది. -
కల్తీ కిక్కు
అనకాపల్లి కేంద్రంగా నిర్భీతిగా తయారీ జిల్లాలోని పలు ప్రాంతాల్లోవిచ్చలవిడిగా అమ్మకాలు సూత్రధారులుఅధికార టీడీపీ నేతలే పాత్రధారులు మద్యం వ్యాపారులు బడుగు జీవితాలతో ఆటలు పట్టించుకోని ఆబ్కారీ అధికారులు ఏడాది క్రితం.. విజయవాడలో ఐదుగురు బడుగులను కల్తీ మద్యం కాటేసింది.. అక్కడి దాకా ఎందుకు.. మన జిల్లాలోనే పది నెలల క్రితం ఎలమంచిలిలో ఓ నిండు జీవితం కల్తీ కాటుకు బలైపోయింది.. ఇలా వెలుగు చూస్తున్న ‘కల్తీ’ విషాదాలు ఒకటో రెండో మాత్రమే.. వెలుగు చూడకుండానే మలిగిపోతున్న జీవితాలెన్నో.. మత్తుకు బానిసలై.. కల్తీ బారిన పడి మగవారు ప్రాణాలు కోల్పోతుంటే.. వారిపైనే ఆధారపడిన కుటుంబాలకు దిక్కులేకుండాపోతోంది.. వీటిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం కల్తీబాబులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారు.. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మళ్లీ మామూళ్ల మత్తులోకి జారుకోవడం పరిపాటిగా మారింది. సరిగ్గా ఇదే.. కల్తీ మద్యం వ్యాపారులకు అవకాశంగా మారుతోంది.. అనకాపల్లి కేంద్రంగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్దీ ఇదే పరిస్థితి.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువులే ఈ రాకెట్ సూత్రధారులు.. వారి అండతో చీప్ లిక్కర్ లాభాల రుచి మరిగిన మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వైన్‌షాపులు.. వాటికి అనుబంధంగా పెట్టుకున్న బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేస్తున్నారు. విశాఖపట్నం: అనకాపల్లి పరిసరాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. కశింకోట మండలం ఎన్జీపాలెంలోని టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ ఇల్లు కల్తీ మద్యం తయారీ కేంద్రంగా మారింది. నూతనగుంటపాలెం గ్రామంలో టీడీపీ ప్రజాప్రతినిధి బంధువైన ఓ వైన్ షాపు యజమాని, ఆయన బావమరిది పక్కా ప్రణాళికతో ఆ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలు, అనకాపల్లి పట్టణంలోని కొన్ని వైన్ షాపులకు, బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కల్తీ మద్యం తయారీ ఇలా ప్రభుత్వ డిపో నుంచి వచ్చిన మద్యం బాటిళ్ల కప్పులను టెస్టర్ ద్వారా తొలగిస్తారు. బాటిళ్లలోని మద్యాన్ని ఒక బకెట్లో వేసి.. అందులో చీప్‌లిక్కర్, మరికొంత నీరు కలిపి మళ్లీ యధావిధిగా బాటిళ్లలో నింపుతారు. అనంతరం మూతలు అమర్చి వాటికి సపోర్టుగా ఉండే సిల్వర్ రేకును టెస్టర్‌తో నొక్కి పెడతారు. సరిగ్గా గమనిస్తే కల్తీ మద్యం బాటిళ్ల కప్పులు టెస్టర్‌తో నొక్కినట్లు కనిపిస్తాయి. మద్యం తాగే వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే చీప్ లిక్కర్ కలుపుతారు. దీంతో కల్తీ మద్యమని ఎవరికీ అనుమానం రాదు. రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఓసీ, డీఎస్పీ బ్రాండ్ల మద్యం ఎక్కువగా కల్తీ అవుతున్నట్టు తెలుస్తోంది. సీల్, స్టిక్కర్లపై పొరపాటున సందేహం వచ్చి ఎవరైనా అడిగినా.. మద్యం బాటిల్ తెరిస్తే స్పిరిట్ వాసన గుప్పుమంటోందని కొనుగోలుదారులెవరైనా ప్రశ్నించినా.. షాపుల యజమానులు వారిపై కలబడిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? అనకాపల్లి పరిసరాల్లో కల్తీమద్యం ఏరులైపారుతున్నట్టు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చినా మామూళ్లు తీసుకుని ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ఎక్సైజ్ అధికారికి కల్తీ మద్యం వ్యాపారులు కారు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీదారులు టీడీపీ నేతకు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రతి నెలా నజరానాలు సమర్పిస్తుండటంతో తనిఖీలు చేపట్టాల్సిన సదరు అధికారి ఏమాత్రం పట్టించుకోకుండా కల్తీ మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపినట్టు చెబుతున్నారు. గతంలో అనకాపల్లిలోని ఏఎంఏఎల్ కళాశాల జంక్షన్ వద్ద ఉన్న ఓ వైన్‌షాపులో, ఓ సినిమా థియేటర్ సమీపంలోని బార్‌లోనూ, అనకాపల్లి మార్కెట్‌యార్డు ముందున్న మరో బార్లో నకిలీ మద్యం అమ్మకాలు జరగ్గా.. అప్పట్లో ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నాళ్లు కల్తీ, నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట పడింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. మళ్లీ ఇటీవల కాలంలో కల్తీ విక్రయాలు పెచ్చుమీరిపోయాయి. కాగా, మామూలుగా పంచాయతీకి ఒక వైన్షాపుతోపాటు ఒక బెల్టు షాపు ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అలాంటిది అనకాపల్లి పరిసరాల్లో ఒక్కో పంచాయతీలో ఐదారు బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. -
కల్తీ మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఓ షాపుపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ వైన్ షాపులో సీల్ వేసి ఉన్న మద్యం బాటిళ్ల నుంచి కొంత మేర మద్యాన్ని వేరు చేసి ఆ మేరకు నీరు కలిపి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. నీరు కలిపిన తొమ్మిది బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపుపై, నిర్వాహకులు నర్సింగ్ గౌడ్, బాబులపై కేసులు నమోదు చేశారు. -
‘సిట్’ దర్యాప్తు పూర్తి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కల్తీ మద్యం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సిట్ బృందం సభ్యులు మాత్రం ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతున్నారు. సంఘటన జరిగి మూడు నెలలైంది. కల్తీ మద్యం వల్ల మృతి చెందిన కుటుంబాలను రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలు పరామర్శించారు. కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మృతుల కుంటుంబాలకు సాయం చేస్తున్నామని ప్రకటించి తూతూమంత్రంగా సాయం చేసి చేతులు దులుపుకున్నారు. కల్తీ మద్యం కాటుకు గురైన వారు ఇంకా కొందరు చావలేక, బతకలేక మంచంలోనే ఉన్నారు. సుమారు 50మంది వరకు ఈ కల్తీ మద్యం బారిన పడ్డారు. అధికారికంగా 35మంది వరకు కల్తీ మద్యం బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. చాలామంది కల్తీమద్యం బారిన పడినవారిని కూడా సిట్ దర్యాప్తు బృందం విచారించింది. అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్నవారిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పోలీస్ కస్టడీకి నిందితులను తీసుకొని విచారించిన తరువాత కూడా కేసు కొలిక్కి రాలేదు. సిట్ దర్యాప్తు పూర్తయినా కేసు మాత్రం ముగియలేదని సమాచారం. ఎందుకంటే మద్యం కల్తీ జరిగిందా? లేదా? అనేది సిట్ దర్యాప్తు బృందం నిర్ధారించలేదు. కేసును సంపూర్ణంగా దర్యాప్తు చేపట్టిన సిట్ బృందానికి రెండు అనుమానాలు నేటికీ తీరలేదు. బార్లో వారు ఇచ్చిన నీళ్లు కలుపుకొని మద్యం సేవించిన వారు మృతి చెందారు. బయట మినరల్ వాటర్ కలుపుకొని మద్యం సేవించిన వారు కూడా మృతిచెందిన వారిలో ఉన్నారు. బార్లో నీళ్లు, బయట మినరల్ వాటర్ కలుపుకొని తాగిన వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. మద్యంలో ఎవరో కావాలని కల్తీ కలిపి ఉంటారనేది బార్ వారు, నిందితుల వాదన. అదే నిజమనుకుంటే బార్లో నీటిని మద్యంలో కలిపి తాగినవారు మాత్రమే చనిపోవాలి. లేదా అస్వస్థతకు గురికావాలి. కానీ మద్యం బయటకు తెచ్చుకొని మినరల్ వాటర్ కలిపి తాగిన వారు కూడా బాధితులు కావడం వల్ల మద్యంలోనే కల్తీ జరిగి ఉంటుందని భావించాల్సి వస్తున్నది. ఈ అనుమానాలకు పోలీసుల వద్ద సరైన సమాధానాలు లేవు. ఈ అనుమానాలు నివృత్తి అయితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. మద్యం కల్తీ జరిగిందంటే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేసిందని, బాట్లింగ్ కంపెనీల్లోనే మద్యం కల్తీ జరిగిందని సిట్ బృందం సభ్యులు నిర్ధారించే పరిస్థితుల్లో లేరు. పై వివరాలు పోలీస్ కమిషనర్‌కు ఇప్పటికే సిట్ బృందం సభ్యులు వివరించారు. అంటే దీనిని బట్టి సిట్ బృందం పోలీస్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా నివేదిక రాలేదని సీపీ గౌతం సవాంగ్ చెబుతున్నారు. -
కల్తీ కాటుకు ఒకరు బలి
వినుకొండ (గుంటూరు) : కల్తీ మద్యానికి మరో వ్యక్తి బలయ్యాడు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పకొండ గ్రామానికి చెందిన నూలి సుబ్బయ్య(40) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ బెల్ట్ షాపులో మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. కల్తీ మద్యం తాగడం వల్లే సుబ్బయ్య మృతిచెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. -
కల్తీ మద్యం తాగి.. ఇద్దరు అస్వస్థత
చర్ల : ఖమ్మం జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఇద్దరు గిరిజనులు అస్వస్థత గురైయ్యారు. చర్ల మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన భాస్కర్, కోయం త్రిమూర్తులు శనివారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్‌షాపులో మద్యం సేవించారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
'నేనెక్కడికీ పోలేదు.. కోర్టుకు హాజరవుతా'
-
'నేనెక్కడికీ పారిపోలేదు.. కోర్టుకు హాజరవుతా'
విజయవాడ: కల్తీ మద్యం ఘటన జరిగిన తర్వాత తాను పరారీలో ఉన్నమాట అవాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. తాను రేపు కోర్టుకు హాజరు అవుతానని చెప్పారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే మల్లాది విష్ణు కనిపించకుండా వెళ్లారు. తాజాగా అజ్ఞాతం వీడిన ఆయన తాను పరారీలో ఉన్నది అవాస్తవం అని చెప్పారు. కొన్ని కార్యక్రమాల దృష్ట్యా తాను వెళ్లాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. మద్యం కేసులో తనకు నోటీసులు అందాయని చెప్పిన ఆయన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విష్ణు సమావేశం నిర్వహించారు. -
విజయవాడలో సంచలనాలు
► ఈ ఏడాది జనవరి 30న భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందారు. వన్‌టౌన్‌లోని కేఎల్‌రావునగర్‌లో సిలిండర్ పేలి నలుగురు అశువులుబాశారు. ► ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గాచేస్తున్న మచిలీపట్నంకు చెందిన అనూహ్య హత్యాచార ఘటనలో నిందితుడు చంద్రభానుకు అక్టోబర్‌లో ముంబయి కోర్టు ఉరిశిక్ష విధించింది. ► రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఆగస్టు 19న తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి 15 రోజులు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ► జులైలో మాచవరం స్టేషన్ పరిధిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ► హిమబిందుపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, జులై 28న ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ► సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న సూర్యారావుపేటను హై సెక్యూరిటీ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. అక్కడ ఆగస్టు 1న రెండు గంటల్లో ఆరు దొంగతనాలు జరిగాయి. ► అంతర్రాష్ట దొంగ సాహును విజయవాడ పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. ► విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ సాయికుమార్‌ను నియమించారు. ► కృష్ణలంక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► విజయవాడలో బయటపడిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు పలువురు నేతలకు సంబంధాలు ఉండటం విశేషం. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళా టైలర్ జ్యోత్స్నరెడ్డి తన వ్యాపార అవసరాల కోసం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పంటకాలువ రోడ్డులో ఉన్న కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించింది. రోజువారీ వడ్డీకి వీరు డబ్బులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమెను వారు లొంగదీసుకున్నారు. ఆమె సీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి. ► విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. -
కక్షలు కన్నీళ్లు
గుంటూరు జిల్లాలో ఘటనలు రాజధానిగా రూపాంతరం చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతించిపోతున్న 2015 నేరపరంగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందడం, సంవత్సరం మొదట్లోనే విజయవాడలోని భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందడం, కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు ప్రాణాలొదలడం, కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అష్టకష్టాలు పడటం, ఏఎన్‌యూలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి, పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో జిల్లావాసులు కన్నుమూయడం కన్నీటి జ్ఞాపకాలే. ఇక చోరీలు ఈ ఏడాది విచ్చలవిడిగా జరిగాయి. మన రాష్ర్ట దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు చెలరేగిపోయాయి. చైన్‌స్నాచింగ్‌లు ఊహకందనంత రీతిలో జరిగాయి. గ్రూపు తగాదాలు, ముఠా కక్షలు పెచ్చుమీరాయి. ఇక రాజధాని నేపథ్యంలో ఏర్పడిన భూతగాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపి అన్నదమ్ములను కోర్టుకు లాగాయి. ెుుత్తంమీద 2015 సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాలపై రక్తచరిత్రనే లిఖించింది. గుంటూరు : గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరాలు అనేకం జరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మోసాలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు, నమ్మక ద్రోహాలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాలతో 2015లో రాజధాని రక్తసిక్తంగా మారింది. తుళ్లూరులో భూ కబ్జాలు పెరిగి వివాదాలు చెలరేగాయి. రక్తసంబంధాలు కూడా చూడకుండా దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో రిషితేశ్వరి, జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో చిన్నారి మృతి వంటి సంఘటనలు, విజయవాడలో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్‌మనీ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దొంగల హల్చల్ గత రెండేళ్లతో పోలిస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దొంగల ముఠాలు స్వైర విహారం చేశాయి. చైన్‌స్నాచింగ్, ఇళ్లల్లో జరిగే దొంగతనాలకు లెక్కే లేకుండాపోయింది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టి పక్కకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా ఇరాని, పార్ధివ్, బిహారీ ముఠాలు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ►చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై మంత్రి అనుచరులు దాడిచేసి హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ►గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో వైద్యం కోసం చేరిన పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపాయి. సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కాంట్రాక్టర్లపై వేటు పడింది. ►తుళ్లూరులో చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన చెరుకు పంటను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. ►లింగాయపాలెంలో రాజేష్ అనే రైతుకు చెందిన ఏడు ఎకరాల భూమిలో వేసిన అరటి తోటను సీఆర్డీఏ అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. ►మంగళగిరిలో రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన సంచలనం కలిగించింది. ►మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంఘటన ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ►ఏసీబీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లకుపై అక్రమ ఆస్తులను గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం కలిగించింది. ► గుంటూరు నగరంలో ఒకేరోజు గంట వ్యవధిలో ఎనిమిది చైన్‌స్నాచింగ్‌లు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► గుంటూరు-విజయవాడల్లో సిమీ ఉగ్రవాదులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సూర్యాపేట ఎన్కౌంటర్ ఉదంతంతో బయటకు రావడంతో అంతా హడలిపోయారు. ►గుంటూరు జీజీహెచ్‌లో సిబ్బంది అవినీతి వల్ల ఇద్దరు తల్లులు తనకు మగబిడ్డ పుట్టాడంటూ గొడవకు దిగి ఆడశిశువును పట్టించుకోకపోవడంతో మృతిచెందిన దారుణ సంఘటన సంచలనం కలిగించింది. ►బాపట్ల మండలం చుండూరుపల్లిలో సాంబశివరావు అనే ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.5 కోట్ల సొత్తు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. దొంగను పట్టుకుని చోరీ సొత్తును పోలీసులు వారం వ్యవధిలోనే రికవరీ చేయడం మరో సంచలనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కలిగించింది. రిషితేశ్వరి సంఘటన జరిగిన నాలుగు రోజులకే వట్టిచెరుకూరు మండలంలో ఓ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ర్యాగింగ్ విషయంలో తనపై చర్యలు తీసుకుంటారేమోననే భయంతో కళాశాల భవనం పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెల్దుర్తి మండలానికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని తనపై కొంతమంది విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద వెంకటరమణ అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది సుత్తితో దాడిచేసి తలపై కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. -
కల్తీ మద్యం బాధితులకు ఇంకా అందని సాయం
-
కల్తీ మద్యానికి మరొకరు బలి
అమరావతి(గుంటూరు): కల్తీ మద్యానికి మరొకరు బలయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండమూడి లింగారావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు బుధవారం మృతిచెందాడు. ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కల్తీ మద్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. -
జనజీవనంలో ‘మందు’ పాతర
విశ్లేషణ విజయవాడలో ఇటీవల జరిగిన కల్తీ మద్యం దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఐదుగురు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇది మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ దుర్ఘటనలు సృష్టించే విషాదం ఎప్పటికీ కదలిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించారు. వారి గోడుతో స్పందించి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. దీనితో ఈ అంశానికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. విజయవాడ తాజా దుర్ఘటన అనేక సామాజిక అంశాలను ఎత్తి చూపింది. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉన్న మానవ వనరులు విలువైనవని, 35 సంవత్సరాల లోపు యువతరం 60 శాతం ఉందని, ఈ వనరు దేశం ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ఎందరో మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది అతిశయోక్తి కాదు. కాకపోతే దేశంలో మానవ వనరులు ఏ తీరులో ఉన్నాయి? వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? తగిన నైపుణ్యం లేకపోవడం ఒక లోపం కాగా, మద్యపానంతో ఈ వనరులు అధికశాతం నిర్వీర్యం కావడం మరో వాస్తవం. గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యసనం కారణంగా 65 శాతం ప్రజలు పూర్తిగా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అమాయకత్వం, బలహీనతలను ఆసరా చేసుకుని సాగుతున్న కల్తీ మద్యం అమ్మకాలకు అధికార యంత్రాంగం మద్దతు, రాజకీయ జోక్యం తోడై పేదల రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే ‘స్వర్ణబార్’ తరహా ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం మద్యం ఇచ్చే ఆదాయం మత్తుకు బానిసలవుతున్నాయి. మద్యం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80 లక్షల కుటుంబాలు రకరకాల ఇక్కట్లకు గురి అవుతున్నాయని ‘సామాజిక సర్వే’ చెబుతున్నది. సంపాదన మొత్తం మద్యం పైనే వెచ్చించే వారు 5 శాతం ఉండగా, 50 శాతం ఆదాయాన్ని తగలేస్తున్నవారు 40 శాతం మించి ఉన్నారు. దీనికి బానిసలైన వారి సగటు ఆయుర్దాయం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. కాగా, గత రెండు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారు 25 శాతం పెరిగిన సంగతి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మద్యంలో 5 శాతం మన దేశంలోనే వినియోగిస్తున్నారు. అయితే దేశంలో తాగుతున్న మొత్తం మద్యంలో 2/3 వంతు వరకు రికార్డులలోకి ఎక్కడం లేదు. అంతర్జాతీయ బెవరేజెస్ వినియోగం గురించి వివరించే ‘లాన్సెట్’ పత్రిక ఈ విషయం వెల్లడించింది. ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే కల్తీ కల్లు, కాపుసారా, గుడుంబాల వినియోగం కూడా భారత్‌లో ఎక్కువేనని ఆ పత్రిక పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవహారాల మీద తాజా నివేదికలు అందించే ‘అసోసియేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ నివేదిక ప్రకారం మద్యం పరిశ్రమ దేశంలో ఏటా 30 శాతం మేర విస్తరిస్తున్నది. 2015 చివరకు చూస్తే దేశంలో ఖర్చయిన మద్యం 20 బిలియన్ లీటర్లనీ, వీటి మీద ప్రజలు పెట్టిన ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌తో (ఐఎంఎఫ్ఎల్) పాటు, దిగుమతి చేసుకుంటున్న విదేశీ మద్యానికి కూడా డిమాండ్ పెరుగుతున్నదని పారిశ్రామిక వర్గాల అధ్యయనంలో తేలింది. మద్యం అమ్మకాలతో ఖజానాకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తున్నది. దీనితో అధికారంలోకి ఎవరు వచ్చినా, ఎన్నికల ముందు మద్య నిషేధం మీద హామీ ఇచ్చినా దీని జోలికి వెళ్లడం లేదు. గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ (తిరువనంతపురం) వెలువరించిన నివేదిక ప్రకారం, చాలా రాష్ట్రాల ఆదాయాలలో 20 శాతం మద్యం ద్వారానే సమకూరుతున్నది. ఈ ఆదాయం రెండు దశాబ్దాల నుంచి పెరుగుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు సమకూరిన ఆదాయం రూ. 21,800 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-05 నాటి మద్యం ఆదాయం రూ. 2,367 కోట్లు. ఇదే పదేళ్ల వ్యవధిలో 2013-14 నాటికి రూ. 10,923 కోట్లకు చేరుకుంది. అంటే 460 శాతం పెరుగుదలతో, సగటు సంవత్సర వృద్ధి 46 శాతమన్నమాట. ఈ పెరుగుదల మరే ఇతర వనరుల్లోను కనిపించకపోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఆదాయం రూ. 10,927 కోట్లు. ఆపై 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మన రాష్ట్రానికి సమకూరిన ఆదాయం రూ. 5,544 కోట్లు. అంటే 2015-16 చివరి వరకు లెక్కిస్తే మరో రూ. 3000 కోట్లు ఆదాయం ఆర్జించనున్నది. వెరసి ఈ సంవత్సరం ఆదాయం రూ. 8,544 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే మద్యం ఆదాయం మత్తులో ప్రభుత్వం కూరుకుపోయిందా? ఆదేశిక సూత్రాల ప్రకారం సంక్షేమ రాజ్యస్థాపన రాజ్యాంగం ప్రధాన లక్ష్యం. పేదలకు పెద్దపీట వేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని అంతా ప్రకటిస్తారు. అయితే ఒక పక్క పింఛన్లు, సబ్సిడీ బియ్యం, గృహ నిర్మాణం, ఆరోగ్య పథకాలు వంటివి ఇస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసే మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేయిస్తున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సెన్సైస్ కర్ణాటకలో జరిపిన అధ్యయనంతో తేల్చింది. ఇలాంటి ఆదాయాన్ని పౌర సేవలకు వినియోగించడం నేరమని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇది కొన్ని సందర్భాలలో తప్ప ప్రభుత్వాలు గుర్తుంచుకోలేదు. మద్యం మీద ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తే, దామాషా ప్రకారం ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం రూ. 2 ఖర్చు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు మద్య నిషేధం విషయంలో మీనమేషాలు లెక్కించడం సరికాదు. అయినా మద్య నిషేధం సాధ్యం కాదని వాదించేవారూ ఉన్నారు. ఇదొక పలాయన వాదమే. మద్యం ఆదాయం లేకుండా మనుగడ సాగిస్తున్న, వృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఆదాయం లేకున్నా గుజరాత్ 10 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నది. నిషేధం ప్రయత్నం ఇక్కడా జరిగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేకోద్యమం ఆరంభించారు. నిషేధించడం, మళ్లీ ఎత్తివేయడం జరిగింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు కూడా తన ఎన్నికల ప్రణాళికలో నిషేధం అమలును చేర్చారు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించిన ఫైలు మీద తొలిరోజే ముఖ్యమంత్రి సంతకం చేసినా, క్షేత్ర స్థాయిలో వాటి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారానికి పూనుకున్నది. ఫోన్ చేస్తే డోర్ డెలివరీ సౌకర్యం కూడా వచ్చిందని కూడా వినికిడి. పైగా ధరలు తగ్గించి, విక్రయాలు పెంచి అధికారులకు లక్ష్యా లను కూడా నిర్దేశిస్తున్నారు. ఇదేమి సంక్షేమం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో ద్వితీయ స్థానం మద్యానిదే. 2014-15 సంవత్సరంలో అన్ని రకాల వస్తువుల మీద సమ కూరిన మొత్తం ఆదాయం రూ. 35,126.60 కోట్లు. అందులో మద్యం ద్వారా లభించినది రూ. 11,480 కోట్లు. కాగా 2015-16 సంవత్సరం రాబడిలో ఇందులో 15 శాతం పెరుగుదల ఉండవచ్చునని అంచనా. ‘మద్యం రాబడి పెరుగుతున్నదంటే అర్థం, పేద కుటుంబాల పిల్లలకు పోషకాహారం తగ్గిపోతున్నట్టు లెక్క’ అని సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేర్కొంది. మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే, అసమానతలు కూడా అంత తీవ్రంగా పెరుగుతాయని కూడా ఆ సంస్థ వెల్లడించింది. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జన జీవితాన్ని ‘మందు’ పాతర ధ్వంసం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు పంచు తున్న ఉచిత మద్యం పాఠశాలలకు వెళ్లే బాలలను కూడా ఆ వ్యసనానికి బానిస లయ్యేటట్టు చేస్తున్నదని కొన్నేళ్ల క్రితం లోక్‌సత్తా చేపట్టిన అధ్య యనం ద్వారా వెల్లడైంది. సమాజంలో విషమ పరిస్థితులు సృష్టిస్తున్న మద్యాన్నీ, దాని మీద వచ్చే ఆదాయాన్నీ ఒక పెద్ద వనరుగా ప్రభుత్వాలు పరిగణిం చడం సమంజసం కాదు. ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజారోగ్యమే మిన్న. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి. మొ. 9989024579) -
మాజీ ఎమ్మెల్యే విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్
విజయవాడ లీగల్ : కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌రావు ముందస్తు బెయిలు కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏపీపీ నోటీసు నిమిత్తం ఈ నెల 18కి వాయిదా వేశారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. -
మద్యం దుకాణంలో ఎక్సైజ్ సోదాలు
రంగారెడ్డి జిల్లా నాగోల్‌లో ఉన్న రత్న మద్యం దుకాణంలో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు జరిపారు. పలు ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై సోదాలు చేశారు. ఇంకా అధికారుల పరిశీలన కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టంగుటూరులో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
-
కల్తీ మద్యం వల్లే మరణాలు
-
కల్తీ మద్యం వల్లే మరణాలు
విజయవాడ : కల్తీ మద్యం సేవించడం వల్లే కృష్ణా జిల్లా విజయవాడలో మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. కల్తీ మద్యం మృతులకు మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. విజయవాడ కృష్ణలంక నెహ్రు నగర్ లోని స్వర్ణ బార్లో సోమవారం కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, సుమారు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం అందరికీ విదితమే. -
కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప
కల్తీ మద్యం విక్రయ దారులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడారు. బాధితులకు మద్యం విక్రయదారుల నుంచే నష్ట పరిహరం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి
-
కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతి
విజయవాడ : విజయవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక కృష్ణలంక నెహ్రు నగర్ లోని స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. బార్ ను సీజ్ చేశామని, లిక్కర్ ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తెలిపారు. ఎక్సైజ్ అధికారులు మద్యం శాంపిల్స్‌ను సేకరించి బార్‌ను సీజ్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ...ప్రభుత్వ ఆస్పత్రిలో సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. మృతుల వివరాలు....1. ఆకుల విజయ్ (46), 2. మీసాల మహేశ్ (40), 3. మునగాల శంకర్ రావు (45), 4. పరస గోపీ (48), 5. మాదాసు నాంచారయ్య (60) -
మద్యం దుకాణం సీజ్: ముగ్గురి అరెస్టు
కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రం తిమ్మరాజుపేటలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం మధ్యాహ్నం దుకాణంపై దాడి చేశారు. ఎలాంటి సీళ్లు లేని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. -
మందులోనూ కల్తీ
వైన్‌షాపుల్లోని బాటిళ్లలో నీళ్లు కలిపి అక్రమ అమ్మకాలు ఎస్టీఎఫ్ దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలు నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో9 నెలల్లో 51 కేసులు బాటిళ్లు తెరిచి ఏమాత్రం అనుమానం రాకుండా మళ్లీ సీల్ మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ప్రత్యేక నిపుణులు సాక్షి, హైదరాబాద్: నిఖార్సైన మందు కూడా మద్యం దుకాణాల్లో దొరకడం లేదు. అన్ని చోట్ల కల్తీ మాదిరే మందు బాటిళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. డిమాండ్ ఉన్న, ఖరీదైన మద్యం బాటిళ్లలో నీళ్లు, చీప్‌లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ కల్తీ అధికంగా ఉంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) జరిపిన దాడుల్లో దొరికిన కల్తీ మద్యం సీసాల సీల్ చూసి అధికారులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సీసాలో మద్యాన్ని ప్రయోగశాలలో పరిశీలిస్తే తప్ప కల్తీ అయినట్లు వారు గుర్తించలేకపోయారు. సీల్ చేసిన మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ వేసే రంగుల లేబుళ్లను కూడా అంటిస్తారని, పర్మిట్ రూంలలో మందు బాబులు తాగేసిన లూజ్ సేల్ బాటిళ్లపైన ఉండే లేబుళ్లను తెప్పించి అనుమానం రాకుండా అతికించి విక్రయిస్తారని ఎస్టీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మినహా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఎస్టీఎఫ్ అధికారులు వైన్‌షాపులపై దాడులు చేసి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని దుకాణాలను సీజ్ చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 51 కేసులు నమోదుచేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి శశిధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్ ముద్రించిన లేబుళ్లతో సీల్ చేసిన మద్యం సీసాలనే అమ్మాల్సి ఉన్నా దుకాణదారులు అదనపు ఆదాయం కోసం కల్తీకి పాల్పడుతున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి మామూళ్లు ఇచ్చి వారి చేతులను కట్టేస్తున్నారు. కల్తీ ఎలా జరుగుతుందంటే... సాధారణ మూతలు ఉన్న సీసాలతో పాటు కల్తీకి అవకాశం లేకుండా సీసా మధ్యలో ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ తొడుగులు ఉండే ప్రీమియం మద్యం సీసాల మూతలను కూడా ఏమాత్రం అనుమానం రాకుండా తీసి యథాతథంగా అమరుస్తున్నారు. ఈ సీసాల మూతలు తీసే నిపుణులు హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఉన్నట్లు సమాచారం. దుకాణ యజమానులు లేదా వారికి తెలియకుండా అందులో పనిచేసే వర్కర్లు సీసాల మూతలు తీసే నిపుణులను సంప్రదించి ప్రణాళిక బద్ధంగా కల్తీ చేస్తారు. రూ.300 నుంచి 450 ఎంఆర్పీ కలిగిన 750 ఎంఎల్ సాధారణ మద్యం సీసాలు 12 కలిగిన కేస్‌లను అజ్ఞాత ప్రాంతానికి తరలించి ఆ సీసాల మూతలు తీసి ఓ బకెట్లో మద్యం నింపి అందులో సగం వరకు నీళ్లు, కొంత చీప్ లిక్కర్ కలిపి మళ్లీ సీసాల్లోకి నింపుతారు. కొత్త బాటిల్‌పై ఉన్నట్లే సీల్ చేసి, వాటిపైన లేబుళ్లను కూడా అతికించి దుకాణాలకు తరలిస్తారు. ఇదంతా చేసినందుకు నిపుణులకు ఒక కేస్‌కు రూ. 1,000 వరకు చెల్లిస్తారు. -
లూజు మద్యం.. కల్తీ తథ్యం!
ఎక్సైజ్ ఉన్నతాధికారుల దాడుల్లో బహిర్గతం 4 షాపుల్లో కల్తీమద్యం విక్రయం మహబూబాబాద్ : మానుకోటలో మద్యం కల్తీ పరంపర కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎక్సైజ్ అధికారులే దీనికి ఊతమిస్తున్నారనే ఆరోపణ బలంగా విన్పిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గాని క్షేత్రస్థారుులో కదలిక రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ తరహాలోనే ఇటీవల పలు షాపులు సీజ్ అయ్యూరుు. పట్టణంలో 13 మద్యం దుకాణాలున్నారుు. అన్నింటికీ పర్మిట్ రూములున్నారుు. కానీ నిబంధనలను వీరు విస్మరిస్తున్నారు. లూజు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అడ్డగోలుగా ధర పెంచి అమ్ముతున్నారు. అర్ధరాత్రి వరకు వైన్స్‌లు తెరిచే ఉంటున్నారుు. అధికారులకు మామూళ్లు ఇచ్చేందుకే తాము అధిక ధరలు వసూలు చేస్తున్నామని వైన్స్ యజమానులే చెబుతున్నారు. దాడుల పరంపర గతేడాది మార్చి 8న ఎక్సైజ్ డీసీ నర్సిరెడ్డి పట్టణంలోని పలు వైన్స్‌లపై అకస్మాత్తుగా దాడులు చేశారు. షాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా అది కల్తీ మద్యమని తేలింది. రెండు షాపులను సీజ్ చేసినా యజమానులు జరిమానా చెల్లించి మళ్లీ తెరిచారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప దాడులు చేపట్టడం లేదు. ఇటీవల కురవి రోడ్‌లోని తెలంగాణ, అంజనా వైన్స్‌పై దాడులు చేసి లూజు మద్యాన్ని సేకరించారు. తెలంగాణ వైన్స్‌లోని లూజు మద్యం కల్తీ అని తేలడంతో సీజ్ చేశారు. ఈ నెల 8న పట్టణంలోని జై అంజనా వైన్స్‌పై ఈఎస్టీఎఫ్ ఏఈపీ శ్రీనివాసరావు, సీఐ చంద్రశేఖర్ దాడి చేసి కేసు నమోదు చేశారు. ఇక్కడి మద్యం కల్తీదని ల్యాబ్ రిపోర్టులో తేలితే ఆ షాపుపైనా చర్యలు తప్పవని తెలిసింది. సిబ్బంది ఉన్నా కదలరేం? ఇలా వరుసగా కల్తీ కంపు బయటపడుతున్నా.. స్థానిక ఎక్సైజ్ అధికారులు మాత్రం వైన్స్ నిర్వాహణ సక్రమంగానే ఉందనడం వారి గమనార్హం! పట్టణంలో ఎక్సైజ్ సీఐ కార్యాలయంతో పాటు ఈఎస్ కార్యాలయం ఉంది. సిబ్బంది సరిపడా ఉన్నారు. అరుునా దాడులకు పూనుకోవడం లేదు. గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తూ వైన్స్‌ను మాత్రం విస్మరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వారి గుడుంబా కేంద్రాలపై మాత్రమే దాడులు చేస్తున్నారనే ఆరోపణా ఉంది. మానుకోటలో లారీల కొద్ది బెల్లం దిగుమతి అవుతున్నా ఎక్సైజ్ అధికారులు అడ్డుకోవడం లేదు. నల్లబెల్లం, పటి క విక్రయించే దుకాణదారులపైనా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఎక్సైజ్ అధికారులపై చర్యలు చేపట్టాలని, తర్వాతే అక్రమ మద్యం దందా, బెల్లం వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
కల్తీ మద్యం తాగి యువకుడి మృతి
దొడ్డబళ్లాపురం : కల్తీ మద్యం సేవించి ఓ యువకుడు మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు... దొడ్డబళ్లాపురం తాలూకాలోని కల్లురదేవనహళ్లికి చెందని లోకేష్(25) డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన ఇతను పనులకు వెళ్లకుండా మద్యం మత్తులో ఉండేవాడు. ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి చేరుకున్న అతను తిరిగి నిద్ర లేవలేదు. అతన్ని నిద్రలేపేందుకు తల్లి అంజినమ్మ ప్రయత్నించింది. ఆ సమయంలో అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఇరుగుపొరుగువారిని పిలిచి విషయం తెలిపింది. గమనించిన వారు అతను మరణించినట్లు తెలపడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. -
కల్తీ కిక్
బిరడా విప్పు.. స్పిరిట్ పోయూ.. {పాణాలు కోల్పోతున్న పేదలు జోరుగా నకిలీ ‘మందు’ దందా లక్షలు గడిస్తున్న అక్రమార్కులు స్పందించని ఆబ్కారీ శాఖ ఫిర్యాదు చేస్తేనే దాడులు పచ్చని కాపురంలో చిచ్చు రోడ్డున పడుతున్న కుటుంబాలు ములుగు : జిల్లాలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కాసులకు కక్కుర్తి పడి మద్యం దందా నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో ప్రాణాంతక స్పిరిట్, నీళ్లు కలిపి రూ.లక్షలు గడిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శిక్షణ పొందిన కొంత మందిని వైన్‌షాప్‌ల నిర్వాహకులు రోజువారి కూలీ కింద రూ.300 నుంచి రూ.500 ఇచ్చి రప్పిస్తున్నారు. వీరితో మద్యం బిరడ, లేబుల్ ఏర్పడకుండా తీరుుంచి స్పిరిట్, నీళ్లతో కల్తీ చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లలో ఏర్పడకుండా కలిపి ఎప్పటిలాగే బిరడా, లేబుల్ వేస్తున్నారు. మ ద్యం ప్రియులకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మద్యం సేవించిన మద్యం ప్రియులు, నిరుపేదలు తల నొప్పి, వాంతులు, శరీరం వేడెక్కడం, కాళ్లు లా గడం, కళ్లు తిరగడం వంటి వాటితో అచేతన స్థితిలోకి చేరుకుంటున్నారు. మరికొందరు ప్రాణా లు వదులుతున్నారు. ఈ దందా అమ్మకాలు ఆబ్కా రీ అధికారులకు తెలిసిన మామూలుగా తీసుకుం టున్నారు. అమ్మకాలు భూపాలపల్లి, వర్ధన్నపేట, ములుగు, కొత్తగూడ, గణపురం, వరంగల్ పట్టణా ల్లో అధికంగాృజరుగుతున్నట్లు ఆబ్కారీ దాడుల్లో నిర్ధారణ అరుుంది. కల్తీ ఇలా.. కల్తీ రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి మ ద్యం బాటిల్ బిరడను తీసి కల్తీ చేయడం, రెండోది బా టిల్ లేబుల్ కింద ఉన్న తొలగించి తిరిగి యథాస్థానానికి అమర్చడం. మద్యం బాటిళ్ల బిరడ(మూత)ను పీ కేసి బాటిల్ నుంచి 25 శాతం ఒరిజినల్ మద్యాన్ని బ యటకు తీస్తారు. తీసిన మద్యం స్థానంలో అతి ప్ర మాదకర స్పిరిట్ లేదా నీళ్లతో నింపుతారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా బాటిల్లేబుల్, బె రడును డబ్లుకం సహాయంతో అమరుస్తారు. మద్యం కల్తీకి మహారాష్ట్ర, పూణే, బీహార్లలో దొరికే స్పిరిట్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఈ స్పిరిట్ మద్యంలో కలిసినా అనుమానం రాకుండా ఉంటుంది. గ్రామాలకు తరలింపు ఇలా తయూరైన మద్యంను వ్యాపారులు ద్విచక్రవాహనాలు, ఆటోలలో మూరుమూల ప్రాంతాల్లోని బెల్ట్దుకాణాలు తరలిస్తున్నారు. ఊళ్లలో ఎవరు అడితే వారు ఉండదని వారి ధీమా. ఇక పల్లెలకు, తండాలకు, గూ డెలకు తరలిస్తే అధికారుల దాడి జరిగిన సమయంలో తమకు ఇబ్బందులు కలుగవని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే చేస్తున్న కల్తీ మద్యం సుమారు పది రోజులు నిల్వగా ఉంటే అసలు స్వరూపాన్ని బయటపెడుతుందని అధికారులు తెలిపారు. కల్తీ అనుమానం రాకుండా ఉండేందుకు వ్యాపారులు రాత్రి సమయాల్లో మద్యాన్ని కల్తీచేసి రెండు రోజుల గడువులో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కల్తీ అయిన మద్యం గడువులోగా పూర్తికాని పక్షంలో వ్యాపారులే నేరుగా మద్యాన్ని పారబోస్తున్నారు. ఫిర్యాదులు వస్తేనే దాడులు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా కల్తీ మద్యం అమ్మకాలు సాగుతున్నా ఆబ్కారీ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుం చి కల్తీ మద్యంపై ఫిర్యాదు అందితే తప్పా దాడులు నిర్వహించడం లేదు. గత జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో కేవలం 22 వైన్‌షాపులపై మాత్రమే దాడులు చేశారు. జిల్లాకేంద్రంలో కల్తీ వ్యాపారం జోరందుకు న్నా అధికారులుచూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ వ్యాపారం చేసే వైన్‌షాపుల యజమానుల నుంచి ఎక్సైజ్ అధికారులకు, సంబంధిత అధికారులకు నెలవారీగా ముడుపులు అందుతున్న కారణంగా దాడులపై వెనుకడుగు వేస్తున్నట్లు మద్యం ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జీవితాలను బుగ్గిపాలు చేసే మద్యం కల్తీ వ్యాపారాన్ని అరికట్టాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. -
కల్తీ మద్యం... బతుకు ఛిద్రం
సంగారెడ్డి క్రైం: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్ని కల్తీ చేస్తున్న అక్రమార్కులు మందుబాబుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై సీల్ ఉన్నప్పటికీ కల్తీకి చేసేస్తున్నారు. బాటిల్లోని మద్యాన్ని సిరంజితో తీయడం అందులో నీటిని గానీ స్పిరిట్‌తో తయారు చేసిన మద్యాన్ని కానీ కలిపేస్తున్నారు. ఈ తరహా మోసాలను అరికట్టడం ఎక్సైజ్ శాఖకు సవాల్‌గా మారింది. జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో మద్యం ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉంటోందని మందుబాబులు అంటున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం కల్తీ అవుతోందని, ఆ మద్యం తాగిన వారికి కాళ్లు, చేతులు లాగడం, శరీరం నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. పేరుకే ఎంఆర్పీ జిల్లాలోని చాలా దుకాణాల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతోపాటు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు మద్యం బాటిళ్లకు రూ.5 నుంచి రూ.40 వరకు ఎంఆర్ పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టముంటే కొనండి లేదంటే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లకు ఉచితంగా ఇవ్వాల్సిన కవర్‌కు సైతం రూ.3 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఉదయం 10.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకే మద్యం విక్రయాలు కొనసాగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, జిల్లా ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు. దీంతో అర్ధరాత్రి దాకా పీకలదాకా తాగుతున్న మందుబాబులు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా 162 మద్యం దుకాణాలు కొనసాగుతుండగా, మొత్తం 11 సర్కిళ్లు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 6 సర్కిళ్ల (సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్)లో 87 మద్యం దుకాణాలున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలోని ఐదు సర్కిళ్ల (మెదక్, సిద్దిపేట, గజ్వేల్, మిర్దొడ్డి, రామాయంపేట)లో 75 మద్యం దుకాణాలున్నాయి. మద్యం కల్తీ కాకుండా, అధిక ధరకు విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. కానీ వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో ఎక్సైజ్ అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని సైతం తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహించినా అవన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో మద్యం వ్యాపారులు ఆడింది ఆటా, పాడింది పాటగా తయారైంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించడం, మద్యాన్ని కల్తీ చేసేయడం వ్యాపారులకు అలవాటుగా మారిపోయింది. దీంతో మందుబాబులు జేబుతో పాటు శరీరాన్నీ గుల్ల చేసుకుంటున్నారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేయడంతో మందుబాబులంతా అక్కడ తాగేసి రోడ్లపై చిందులు వేస్తున్నారు. దీంతో ఆ దారి వెంట వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
'జడ్పీ చైర్మన్ పై చర్యలు తీసుకోండి'
-
'జడ్పీ చైర్మన్ పై చర్యలు తీసుకోండి'
కర్నూలు: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ కమిషనర్ ను ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఇది అంశంపై కర్నూలు ఎస్పీ, కలెక్టర్లకూ ఫిర్యాదు చేశారు.దీనిపై జిల్లా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కమీషన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయూలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిహెచ్.విజయ్ మోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం దారుణమైన విషయమన్నారు. కేసులో నిందితుడిగా ఉండి కూడా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అరుునా అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కూడా ఆయనను అరెస్టు చేయూలని కోరుతోందన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు జెడ్పీ చైర్మన్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి నిలదీశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న సీఎం ఈ విషయంపై స్పందించకపోవడం సరికాదన్నారు. మొన్నటి దాకా అజ్ఞాతంలో ఉన్న చైర్మన్ సోమవారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని బట్టి ఉన్నత స్థాయిలో మ్యానేజ్ చేసుకొని వచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. తక్షణం అరెస్టు చేయకపోతే డీజీపీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులను కలుస్తామని, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉన్నత స్థాయి నుండి వచ్చిన ఆదేశాలకు లొంగి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎమ్మెల్యేలు గౌరుచరిత, ఐజయ్య ఆరోపించారు. ఇప్పటికైనా అరెస్టు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. -
‘మత్తు’.. మామూలే!
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కల్తీమద్యం, కల్లు, నాటు సారా ఏరులై పారుతున్నా ఎక్సైజ్‌శాఖ మత్తు వీడడంలేదు. మద్యం విక్రయాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన బార్కోడ్ విధానం అమలుపై కూడా సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కల్తీని నిరోధించేం దుకు నిర్దేశించిన సీసీ కెమెరాల ఏర్పాటు వంటి నిబంధనలను పట్టించుకోవడం లేదు. వైన్‌షాపుల వద్ద ఉండాల్సిన పర్మిట్‌రూమ్‌ల విషయాన్ని కూడా గాలికొదిలేశారు. అంతా ‘మామూలు’గా తీసుకుంటున్న ఆబ్కారీశాఖ అధికారులు చాలాచోట్ల పర్మిట్‌రూమ్‌లు లేకుండా సాగిస్తున్న వ్యాపారంపై కూడా కళ్లు మూసుకుంటున్నారు. జిల్లాలో ఏటా రూ.180కోట్లకు పైగా మద్యం అమ్ముడవుతుంది. ఇక చీకటిమాటుగా సాగే కల్తీకల్లు, నాటుసారా, మట్కా తదితర వాటికి లెక్కేలేదు. జిల్లాలో మూడు ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 199 వైన్‌షాపులు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం దుకాణాలతో పాటు పాటు రెస్టారెంట్లలో అమ్ముడుపోయే మద్యం బాటిళ్లకు బార్కోడ్ అమలుచేయాలని ప్రభుత్వం మూణ్నెళ్ల క్రితమే ఆదేశించినా.. ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. షాపులకు వచ్చే అసాంఘిక శక్తులను అదుపులో పెట్టడం, బార్లలో గొడవపెట్టే వారిని నియంత్రించేందుకు ఉద్ధేశించిన సీసీ కెమెరాల ఏర్పాటును అధికారులు మరిచిపోయారు. ఇందుకోసం మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు మాముళ్లు పుచ్చుకుని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియంత్రణ కరువు జిల్లా నైసర్గికంగా రెండు ఇతర రాష్ట్రాల సరిహద్దుతో పాటు మారుమూల ప్రాంతం అధికంగా ఉండడంతో మద్యం అక్రమవ్యాపారం మూడు పూలు, ఆరుకాయలుగా సాగుతోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలుగ్రామాల్లో కల్తీకల్లు, నాటుసారా విక్రయాలను విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే విషయాన్ని ‘సాక్షి’ ఇటీవల వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక, మ హారాష్ట్ర ప్రాంతాల నుంచి పన్నులు చెల్లించని మద్యం, కల్తీకల్లులో తయారీలో వినియోగించే క్లోరల్‌హైడ్రేట్(సీహెచ్) సరఫరా అవుతున్నా అధికారులకు కనిపించడంలేదు. అయితే ఇలాంటి ఘటనలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అధికారులకు భారీగా కాసులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో కొందరు అధికారుల అండ చూసుకుని కొన్ని వైన్‌షాపులు సిండికేట్‌గా మారి ఎంఆర్పీ ధరల కంటే మద్యంను అధికధరలకు అమ్ముతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ఒక్కోబాటిల్‌పై రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ అవసరమని పలువురు కోరుతున్నారు. -
‘చీప్’గా చేస్తున్నారు..!
మూతతీయ్.. కల్తీచెయ్ - మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం - భువనగిరి డివిజన్లో కల్తీ మద్యం అమ్మకాలు - అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు భువనగిరి : లాభార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు అడ్డదారులు వెతుకుతున్నారు. యథేచ్ఛగా మద్యా న్ని కల్తీ చేస్తూ మద్యం ప్రియులప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల మద్యం ఫుల్‌బాటిళ్ల మూతలు తీసి అందులో స్పిరిట్, నీళ్లు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు పట్టణంలో ఈ రకంగా కల్తీ చేసిన మద్యం సీసాలను స్థానికులు ఎక్సైజ్ అధికారులకు పట్టించా రు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. అయితే ఇదంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీకే మద్యా న్ని విక్రయించాలనే నిబంధనను మద్యం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం : ఏడుకొండలు ఎక్సైజ్ సీఐ ఆలేరు ఆలేరులోని ఓ దుకాణంలో మద్యం కల్తీ జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాం. ఆ షాపు నుంచి మద్యం షాంపిళ్లను సేకరించాం. వాటిలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై నిగ్గు తేల్చాలని కోరాం. నివేదిక రాగానే తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం. కల్తీ ఇలా.. మద్యం వ్యాపారులు పలు చోట్ల సిండికేట్‌గా మారి ప్రతి మండలంలో ఒక హోల్‌సేల్ దుకాణాన్ని అనధికారికంగా నడుపుతున్నారు. ఆ దుకాణం నుంచి ఆయా మండలాల్లోని బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దీంతో ఎక్కువగా అమ్మకాలు ఉండే దుకాణాన్ని ఎంపిక చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం కల్తీ చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన అనుభవం కలిగిన వ్యక్తులను నియమించినట్లు తెలిసింది. రాత్రి మద్యం దుకాణం మూసే సమయం, లేదంటే ఉదయాన్నే దుకాణంలోకి వచ్చి తాము ఎంచుకున్న బాటిళ్ల మూతలను సీల్ చిరిగిపోకుండా పైకి తీస్తారు. వెంటనే అందులోంచి క్వార్టర్ సీసా మద్యం తీసి కొన్ని నీళ్లు, మరికొంత స్పిరిట్ కలిపి దాని మూతను యథావిథిగా బిగిస్తారు. ఇదంత ఒక గంటలోపు పూర్తి చేస్తారు. అనంతరం ఆయా మద్యం సీసాల నుంచి తీసిన మద్యాన్ని ఒక సీసాలో పోస్తారు. నాలుగు బాటిళ్లకు ఒక బాటిల్ చొప్పున అదనపు మద్యం తయారు చేయడం జరుగుతుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఎక్కువగా అమ్మకాలు ఉన్న బ్రాండ్ మద్యం సీసాల్లో ఈ రకమైన కల్తీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారుల వత్తాసు మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం చేస్తున్నారు. ఇటీవల ఆలేరులో ఇలా పట్టుకున్నసమయంలో ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇది పెద్ద సమస్య కాదని కామన్ అంటూ ఓ అధికారి అన్నట్లు ఫిర్యాదు దారులు ‘సాక్షి’కి చెప్పారు. కాగా ఇప్పటికే ముగిసిన బోనాల పండగ, దసరా,బతుకమ్మ పండగల నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బొమ్మలరామారం, భువ నగిరి,బీబీనగర్ ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలను అధికారులు నిరోదించారు. మళ్లీ పండగల నేపథ్యంలో డివిజన్‌కు పొరుగన గల హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి నకిలి మద్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. -
జిల్లాలో విరివిగా కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం ప్రియులకు నిఖార్సైన సరుకు దొరకడంలేదు. లక్షల రూపాయల లెసైన్స్ ఫీజుతో కొత్తగా షాపులు పెట్టిన పలువురు మద్యం వ్యాపారులు... వీలైనంత త్వరగా ఆదాయం రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియులకు కిక్ లేకుండా చేస్తున్నారు. కిక్ ఎక్కకపోవడంతో మద్యం ప్రియులు మరింత తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన అదనపు ఆదాయూన్ని మద్యం వ్యాపారులు... పలువురు ఎక్సైజ్ అధికారులకు వాటాగా ముట్టచెబుతూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఈ ఏడాది 2014-15 మద్యం సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 234 (వైన్స్ షాపు) మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. లాటరీలో షాపు దక్కిన వారు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లెసైన్స్ ఫీజు చెల్లించారు. జూలై 1 నుంచి మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. పెట్టుబడి త్వరగా రావాలనే ఉద్దేశంతో పలువురు మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో పెగ్గుల రూపంలో (లూజ్) మద్యం విక్రయించకూడదనే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఈ పనిచేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు వైన్ షాపు ఆవరణలో డ్రమ్ముల్లో మద్యాన్ని పోసి పెగ్గుల రూపంలో అమ్ముతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా నీళ్లు కలిపి మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఒకట్రెండుసార్లు ఫిర్యాదు చేస్తే మాత్రం వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి మొక్కుబడి తనిఖీల్లోనే భారీగా కల్తీ మద్యం పట్టుబడుతోంది. ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా... ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు (ఆల్కహాల్ స్ట్రెంత్) 25 శాతం ఉంటుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇది ఎక్సైజ్ శాఖ పరీక్షల్లో తేలుతుంది. కొత్త మద్యం సీజన్ మొదలై 42 రోజులే అయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కల్తీ మద్యం కేసులు నమోదుయ్యాయి. ఫిర్యాదుల ఆధారంగానే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నింటా కల్తీ మద్యమేనని నిర్ధారించారు. ఇలా అన్ని కేసుల్లోనూ నీళ్లు కలిపినట్లు విశ్లేషణ పరీక్షల్లో తేలింది. ఎక్సైజ్ అధికారులు 27 షాపుల్లో సేకరించిన శాంపిల్స్‌లో 17దుకాణాల్లో కల్తీ మద్యమని తేలడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఘటనలు.. * జూలై చివరవారంలో భూపాలపల్లిలోని కళ్యాణి వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు ఆరు మద్యం సీసాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. రెండు శాంపిల్స్ కల్తిగా తేలాయి. ఇదేప్రాంతంలోని గాయత్రి వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరించగా... ఒకటి కల్తీగా నిర్ధారణ అయింది. * ములుగు మండలం మల్లంపల్లిలోని దుర్గా వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరిస్తే అన్నీ కల్తీగా నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 42 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణపురం(ఎం)లోని దుర్గా వైన్స్‌లో ఆరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అన్ని శాంపిల్స్ కల్తీగానే తేలాయి. * కొత్తగూడలోని కనకదుర్గ వైన్స్‌లో నాలుగు శాంపిల్స్ సేకరించారు. ఇక్కడ కల్తీ అని తేలలేదు. అయితే మద్యాన్ని సీసాల్లోంచి తీసి పెగ్గుల రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ నెల 8న వర్ధన్నపేటలోని సన్ని వైన్స్‌లో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఎక్సైజ్ అధికారులు దాడుల జరిపిన సమయంలో సన్ని వైన్స్‌లో నీటి జగ్గుల్లో మద్యం ఉండడం, గ్లాసుల్లో మద్యం పోసేందుకు అవసరమైన గౌరలు ఉన్నాయి. వర్ధన్నపేటలోని తిరుమల వైన్స్‌కు చెందిన రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలను ఒక గుర్తింపులేని గోదాంలో నిల్వ చేస్తే స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. వాస్తవంగా అధికారులు రూ.8 లక్షల విలువైన మద్యం పట్టుకున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మద్యం నిల్వలను తక్కువ చేసి ప్రకటించినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేటలోని ఎక్సైజ్ అధికారులు ఇక్కడి వైన్స్ షాపులతో కుమ్మక్కై నేరుగా బెల్ట్ షాపులకు తరలించేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
నో కిక్
ప్రొద్దుటూరు: కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు దాదాపు సమాజంలోని అన్ని వర్గాల వారు ఎంతో కొంత మేరకు మద్యం సేవిస్తున్న వారే. ఇందు కోసం ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఏ ఒక్కరు మద్యం సేవించడంపై సంతృప్తి చెందడం లేదు.మద్యం కల్తీయే ఇందుకు అసలు కారణం. ప్రొద్దుటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. వీటి పరిధిలో నెలకు రూ.6కోట్ల వ్యాపారం జరుగుతోంది. కొంత మంది వ్యాపారులు విచ్చల విడిగా మద్యం కల్తీ చేసి అమ్ముతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోంది. కల్తీ ఇలా ... వ్యాపారులు ప్రతి నెల దుకాణానికి సంబంధించిన మద్యాన్ని కడప పరిధిలో ఉన్న డిపో నుంచి కొనుగోలు చేస్తారు. మద్యాన్ని తెచ్చిన వెంటనే దుకాణంలో దించడం, కల్తీ చేయడం జరుగుతోంది. ఇందుకుగాను నైపుణ్యం గల కొంత మంది వ్యక్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు సీల్ తీయకుండానే పరికరంతో మద్యం బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో కల్తీ చేస్తారు. కొన్ని బాటిళ్లకు సీల్ తీయడం కల్తీ చేసిన తర్వాత తిరిగి అతికించడం జరుగుతోంది. తక్కువ ధర గల చీఫ్ లిక్కర్ లాంటి క్వార్టర్ బాటిల్లో 6 ఔన్స్‌లకు గాను రెండు, మూడు ఔన్స్‌ల వరకు డెరైక్ట్‌గా నీటిని కలుపుతున్నారు. ధర అధికంగా ఉన్న మద్యానికి సంబంధించి ఆ బాటిళ్లను ఓపెన్ చేసి వాటిలో చీఫ్ లిక్కర్‌ను కలుపుతారు. చాలా కాలంగా పట్టణంలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులు కల్తీ మద్యంపై తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంత తాగినా కిక్ ఎక్కడం లేదని, బాటిళ్లలో నీరు కలుపుతున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అప్పుడప్పుడు శాంపిళ్లు తీసి పంపుతున్నా పరిస్థితి మాత్రం యధావిధిగానే ఉంది. ఒరిజనల్ మద్యం ఎక్కడ లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రొద్దుటూరుకు వచ్చిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మద్యం కల్తీపై గట్టి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఓ మద్యం వ్యాపారి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రివిలైజ్ రూపంలో అధికంగా టాక్స్ వసూలు చేస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేయాల్సి వస్తోందని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉన్న ప్రొద్దుటూరులోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం. క్వార్టర్‌పై రూ.10 పెంపుదల నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యానికి డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి యధావిధిగా రూ.10 చొప్పున పెంచి అమ్ముతున్నారు. ఈ విధంగా ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే బీరు బాటిల్‌పై రూ.20-40 వరకు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. -
మనీ.. మందూ..మార్బలం
అంతిమ ఘట్టంలో చివరి అస్త్రాలు తీస్తున్న టీడీపీ తెలుగు తమ్ముళ్ల దగుల్బాజీ వ్యూహాలు జోరుగా కల్తీ మద్యం పంపిణీ విశాఖ డెయిరీ పాత్రపై అనుమానాలు నోట్ల పంపిణీలోనూ వెన్నుపోటే సగానికి సగం నొక్కేస్తున్న నేతలు ముత్తంశెట్టి మనుషుల రంగ ప్రవేశం సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నోటు, నాటు, ఓటు... ఇదీ అనకాపల్లిలో టీడీపీ నేతల చివరి మజిలీ. అయితే అన్నిచోట్లా ఈ ఆఖరి అస్త్రం తిరగబడుతోంది. పీకలదాకా తాగించినా జనం ఛీ కొడుతున్నారు. ‘చంద్రబాబుకు ఓటెయ్యాలా? ఎందుకు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. నోట్ల కట్టలు పంచుతున్నా ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ‘ఓటేస్తే మా బతుకులు తాకట్టు పెడతాడేమో’ అని సందేహిస్తున్నారు. ఒక్కరు కా దు, ఇద్దరు కాదు... వేల మంది అనకాపల్లిని అడ్డాగా చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే మకాం వేశారు. అనకాపల్లిలోని ఏ లాడ్జీకి వెళ్ళి నా తెలుగు తమ్ముళ్లే దర్శనమిస్తున్నారు. వీరిలో చాలామంది గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి మనుషులే. ఈ పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలియడంతో ఓట్ల బేరం మొదలు పెట్టారు. అంతా చీప్ లిక్కరే ఊళ్లల్లో చీప్ లిక్కర్ తాండవిస్తోంది. గంటా వారి సారా సామ్రాజ్యం నెల రోజుల క్రితమే దీన్ని దించినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఆయన వర్గీయులదే సారా వ్యాపారం కావడం, ముందుగానే సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం తెప్పించుకున్నారు. చెరువుల్లో, బావుల్లో దాచిపెట్టిన పచ్చగ్యాంగ్ ఇప్పుడు దాన్ని జనం మీదకు వదులుతున్నారు. నిఘా వర్గాల కళ్లుగప్పి ఊళ్లల్లోకి తీసుకెళ్తున్నారు. మద్యం తాగిన అనేక మంది అస్వస్థతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. చోడవరంలోని మూడు గ్రామాల్లో వాంతులు విరోచాలు అయినట్టు స్థానికులు చెబుతున్నారు. లేబుళ్లు లేని బాటిళ్లు పరిశీలించిన గ్రామస్తులు కల్తీ మద్యంగా చెబుతున్నారు. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదమని వైద్యులంటున్నారు. చెప్పింది వెయ్యి... ఇచ్చింది సగమే కశింకోట, రాంబిల్లి మండలాల్లో ఓటర్లకు వింత అనుభవం ఎదువుతోంది. మూడు రోజుల క్రితం టీడీపీ శ్రేణులు ఓటుకు వెయ్యి ఇస్తామని ప్రకటించారు. తీరా పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో దాన్ని రూ. 500 చేతుల్లో పెడుతున్నారు. రాంబిల్లి మండంలోని కొన్ని గ్రామాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్థానిక టీడీపీ శ్రేణులే సగం నొక్కేసినట్టు తేలడంతో ఆ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. డబ్బులు తీసుకున్నా, తగిన బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ నాయకత్వం మండల నేతలపై ఆగ్రహించినట్టు తెలిసింది. పాయకరావుపేట, యలమంచలి నియోజవర్గాల్లో విశాఖ డెయిరీ వాహనాల ద్వారా డబ్బు సంచులు వెళ్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వాహనాలను పోలీసులు ఏమాత్రం తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ డెయిరీ ఓ టీడీపీ నేత గుప్పిట్లో ఉండటం, ఆయన ఆదేశాల మేరకు ఉద్యోగులే స్వయంగా డబ్బు పంపిణీకి ఉపక్రమించడం పలుచోట్ల వివాదాస్పదమవుతోంది. ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుగుతున్న వైనం కూడా సందేహాలు రేపుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. హవాలా గ్యాంగ్ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి కొరియర్స్ ఇక్కడకు రావడం, కేవలం టీడీపీ డబ్బును గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేయడం స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది. అవి నిజమైన నోట్లేనా? అనకాపల్లి ప్రజలకు ఈ సందేహాలు వస్తున్నాయి. రిక్షా కార్మికులకు, మురికివాడల్లో ఉన్న వారికి టీడీపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి రూ. 500 కొత్త నోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో కొన్ని నకిలీ నోట్లని తేలింది. దీంతో ఆగ్రహించిన వారు టీడీపీ శ్రేణులను నిలదీశారు. విషయం బయటకు పొక్కకుండా వాటికి బదులు మరొకటి ఇచ్చినట్టు తెలిసింది. అయితే నియోజకవర్గంలో పంచిన ఈ నోట్లన్నీ నిజమైనవేనా? లేకపోతే నకిలీ నోట్లు పంచుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే అచ్యుతాపురంలోనూ ఎదురైంది. నొక్కేద్దాం బాసూ! ‘జనం డబ్బులిచ్చినా ఓట్లేసేట్టు లేరు. ఓడిపోయే పార్టీ రేపు మనకు నయా పైసా ఇవ్వదు. ఇదే అదను నొక్కేద్దామా?’ డబ్బు పంపిణీలో టీడీపీ నేతల ముచ్చట్లు ఇవి. స్థానిక నాయకత్వంపై నమ్మకం కుదరని ముత్తంశెట్టి వర్గీయులు మండలానికో త్రిసభ్య కమిటీ వేసుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే డబ్బు పంపకం జరపాలని నిర్ణయించుకున్నారు. భుజాలరిగేలా జెండా మోసినా గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన మండలస్థాయి నేతలు వచ్చిన డబ్బును నొక్కేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు అనకాపల్లి: తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికారు. డబ్బుతో ఓటర్లను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పట్టణంలోని గవరపాలెంలో ఉన్న దాసరిగెడ్డ సమీపంలో సోమవారం సాయంత్రం రూ.50వేల నగదుతో ఉన్న తెలుగుతమ్ముళ్లను ఎన్నికల నిఘా అధికారులు వల వేసి పట్టుకున్నారు. నగదు ఉన్న వ్యక్తి నుంచి వివరాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆర్డీవోకు అందిస్తామని అధికారులు తెలిపారు. -
నల్లబెల్లం వ్యాపారులపై కేసులు పెట్టండి
=నాటుసారా కేంద్రాలపై దాడులు చేయండి =ఎంఆర్పీకి విక్రయించకుంటే చర్యలు =ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ =5 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమావేశం తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, నాటుసారా తయారీని నిరోధంచాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ ఆదేశించారు. తిరుపతిలో బుధవారం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో రాష్ట్ర కమిషనర్‌తో పాటు, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ టి.ప్రసాద్ సమావేశమయ్యారు. ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నాటుసారా తయారీ కోసం నల్ల బెల్లం సరఫరా చేసే వ్యాపారస్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించడాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. పక్క రాష్ట్రాల మద్యం రాకుండా నిరోధించాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని ఆదేశించారు. ఎక్కైడైనా కల్తీ మద్యం దొరికితే సంబంధి స్టేషన్ సీఐ, ఆ జిల్లా ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఎంఆర్పీ ధరల సిండికేట్, కల్తీ మద్యంపై ఫిర్యాదులు అందాయంటూ ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ చైతన్యమురళిపై మండిపడ్డారు. అలాగే వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎక్సైజ్ సీఐ ఖాజాబీ పట్టణంలోని మద్యం వ్యాపారస్తులతో కుమ్మక్కై కల్తీ మద్యం విక్రయాలకు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందాయని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్లు చంద్రమౌళి(చిత్తూరు), జీవన్‌సింగ్(అనంతపురం), ప్రేమ్‌ప్రసాద్(కర్నూలు), నాగలక్ష్మి(కడప), చైతన్యమురళి(నెల్లూరు)తో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పలమనేరులో జోరుగా కల్తీ మద్యం
పలమనేరు, న్యూస్‌లైన్: ఎమ్మార్పీ ధరలతో మద్యం విక్రయాలు చేపడితే లాభాలు రావని తెలుసుకున్న వ్యాపారులు కల్తీపై దృష్టి పెట్టారు. పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం మూడు ఫుల్లులు, ఆరు క్వార్టర్లుగా సాగుతోంది. కల్తీ మద్యం తయారు చేసేందుకు ప్రత్యేక కూలీల ను నియమించుకున్నారు. వారికోసం ప్రత్యేక గోడౌన్లు సైతం ఇక్కడ వెలిశాయి. మద్యం ప్రియులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బాటిల్‌ను ఓపెన్ చేసి తిరిగి అలాగే సీల్ చేయడంలో వీరు సిద్ధహస్తులు. కొందరు మద్యం దుకాణ యజమానులే ఈకల్తీ మద్యాన్ని తయా రు చేస్తున్నట్టు సమాచారం. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా నెలవారి తనిఖీలు చేపడుతూ వారి టార్గెట్ కోసం మద్యం వ్యాపారులకు సహకరిస్తూ ఈ వ్యాపారాన్ని మరింత ప్రో త్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలమనేరు పట్టణంతోపాటు మండలం, గంగవరం మండలాల్లో 12 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 5,500 మద్యం బాక్సులు, 3 వేలకు పైగా బీర్ బాక్సుల వ్యాపా రం సాగుతోంది. ఈ దఫా రెన్యువల్స్‌కు నాలు గు దుకాణాలు ముందుకు రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులే వారిని బుజ్జగించి దుకాణా లు కొనసాగించేలా చేశారు. మద్యం వ్యాపారం లో సిండికేట్ లేకపోవడం, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి రావడంతో వీరికి లాభాలు రాకపోగా నష్టాలు వస్తున్నాయి. లాభం పొందాలనే ఉద్దేశంతో కల్తీకి సిద్ధపడ్డారు. మద్యం కల్తీ ఇలా.. పట్టణంలోని పలు మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తయారీ కోసం రహస్య గోడౌన్లను ఏర్పాటు చేశారు. ఫుల్ బాటిల్‌ను ఏ మాత్రం అనుమానం రాకుండా ఓపెన్ చేసి అందులోంచి క్వార్టర్ మందును పక్కకు తీసి నీరు పోసి ప్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాల బాటిళ్లను ఓపెన్ చేసి తిరిగి ప్యాక్ చేయడానికి ప్రత్యేక పరికరాలు, హీట్ మిషన్లను, ఇంజక్షన్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు చేయడానికి చేయి తిరిగిన పని వారు సైతం ఉన్నట్టు సమాచారం. వీరికి యజమానులే భోజనం పెట్టి రోజుకు రూ.500 కూలి ఇస్తున్నారు. ఇలా పక్కకు తీసిన మద్యాన్ని రకరకాల క్వార్టర్ బాటిళ్లలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి కేసుల్లో నింపేస్తున్నారు. లిక్కర్ బాటిళ్లపై ఉన్న లేబుళ్లను సైతం అలాగే తీసి అంటిస్తున్నారు. పట్టణంలోని వీవీ మహాల్ ఎదురుగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యాన్ని ఎలా విక్రయిస్తున్నారంటే.. సేకరించిన కల్తీ మద్యాన్ని లూజ్ సేల్స్ రూపంలోనూ, బెల్టు షాపులకు అప్పుగానూ సంబంధిత యజమానులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పట్టణంలోని మూడు చోట్ల రోజుకు రూ.30 వేల దాకా కల్తీ మద్యా న్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన ప్రతి నెలా లక్షలాది రూపాయల మద్యాన్ని వీరు అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు తెలియందేమీ కాదు పలమనేరు ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఈ మధ్య ఎక్సైజ్ ఏసీ నాగేశ్వరరావ్ దాడులు చేశారు. నాలుగు రోడ్లు వద్ద మద్యం దుకాణంలో భారీగా కల్తీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వీటికి ఈఏఎల్ (ఎక్సైజ్ అదేసివ్ లేబుల్) లేకుండా ఉండడం, వాటి కింద రంధ్రాలు ఉండడం, బిరడాలు లూస్ కాబడి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి మద్యాన్ని ల్యాబొరేటరీకి పంపారు. ఈ విషయమై పలమనేరు ఎక్సైజ్ ఎస్ఐ సందీప్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా కల్తీ మద్యంపై తమకు సమాచారం ఉందన్నారు.