agarwal
-
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది. వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది. -
ప్రభుత్వ లాంఛనాలతో నేడు అగర్వాల్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/సంతోష్‌నగర్: అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్, దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. గురువారం కన్ను మూసిన అగర్వాల్ అంత్యక్రియలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక క్షిపణి తయారీ కార్యక్రమంలో డాక్టర్ అరుణాచలం, డాక్టర్ అబ్దుల్ కలాంతో కలసి అగర్వాల్ పనిచేశారు. అగర్వాల్ హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. ఇదిలా ఉండగా డీఆర్డీఓ హైదరాబాద్ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ ఆర్అండ్డీలో ఉద్యోగులు శుక్రవారం అగర్వాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ అండ్ ఎస్టేట్ మేనే జర్ షేక్ గౌస్ మోహినుద్దీన్ పాల్గొన్నారు. -
‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ (84) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో జన్మించిన రామ్ నరైన్.. 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్‌లో చేరారు. ఆ మిషన్‌కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేసి.. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. రామ్ నరైన్ చేసిన సేవలకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్‌నగర్‌లోని నివాసం నుంచి రామ్ నరైన్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.అగ్ని క్షిపణులకు ఆద్యుడు: డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్రెడ్డిఅగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలలో రామ్ నరైన్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్ పాడ్స్ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారని చెప్పారు. రామ్ కృషి వల్లే ఈరోజు భారతదేశం రక్షణరంగంలో చాలా ముందుందన్నారు. రామ్ నరైన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. -
కొత్త పన్ను విధానంలోనే 66% రిటర్నులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
నూతన విధానమే ఎంపిక
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
Rashi Agarwal: కళను 'రాశి' పోస్తోంది..!
ఒక ఠావు పేపర్ తయారు కావాలంటే పది లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. రాసుకోవడానికి ఒక రీము పేపర్ సిద్ధం అవ్వాలంటే పాతికేళ్లు పెరిగిన చెట్టు కొమ్మలను సమూలంగా నరకాలి. చెట్టును నరక్కుండా, నీటిని వృథా చేయకుండా ఒక డైరీ తయారయితే? అంతకంటే ఇంకేం కావాలి? ఇంతే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వృథాను హరాయించుకోవడానికి భూమాత పడే యాతన కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి తెర తీసింది సూరత్‌లో ఓ ఆర్కిటెక్ట్. స్టేషనరీ వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్‌ని కలగలుపుతూ చేసిన ప్రయోగమే రుహానీ రంగ్. ఆ ప్రయోగం వెనుక దాగిన నేపథ్యాన్ని వివరించింది రాశి అగర్వాల్. ఆమె మదిలో వెలిగిన ఈ ఆలోచన తొమ్మిది వేల కిలోల పత్తికి పుస్తక రూపాన్నిచ్చింది.మనదేశంలో కళ ఉంది!‘‘నేను ఆర్కిటెక్చర్ ఫైనలియర్లో ఉన్నప్పుడు మన సంప్రదాయ నిర్మాణాలు, కళలు, చేతివృత్తుల అధ్యయనం కోసం విస్తృతంగా పర్యటించాను. ఢిల్లీ నుంచి జైపూర్, అహ్మదాబాద్, కచ్, పాండిచ్చేరి నుంచి పూనా వరకు పరిశీలిస్తే మనదేశంలో రకరకాల కళలు, కళా నైపుణ్యాలున్న పని వాళ్లున్నారని తెలిసింది. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదికలు తగినంతగా లేవు.అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి, నా వృత్తిలో ఇంటీరియర్ డిజైనింగ్‌కు దోహదం చేసే విధంగా ఒక ప్రయోగం చేశాను. అది విజయవంతమైంది. రకరకాల కళలను ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రుహానీ రంగ్’ పేరుతో ఆర్ట్ స్టార్టప్ మొదలు పెట్టాను. ప్లానర్ బుక్ కవర్ పేజీ మీద మధుబని ఆర్ట్ ఉంటే ఇంట్లో అందమైన షో పీస్ ఉన్నట్లే. ప్లానర్ బుక్‌ని కార్నర్ స్టాండ్‌లో అందంగా అమరిస్తే డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హస్త కళలను పునరుద్ధరించగలుగుతున్నాను. రుహానీ రంగ్ను ఐదు వేల రూపాయలతో మొదలు పెట్టాను. నాతో కలిసి 50 మంది కళాకారులు, 40 మంది ఇతర ఉద్యోగులు పని చేస్తున్నారు. వస్త్రాలను తయారు చేసే భారీ పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు వస్తుంటాయి. ప్రతి బేలు లోనూ మెషీన్లో అమరికకు తగినట్లు ఉపయోగించగా మిగిలిన పత్తి వృథా అవుతూ ఉంటుంది.అది భూమిలో కలిసి పోవాల్సిందే తప్ప మరో పనికి ఉపయోగించేవారు కాదు. ఎందుకూ పనికి రాదని వదిలేస్తున్న ఆ పత్తే నా కుటీర పరిశ్రమకు ముడిసరుకు. నాకు కోవిడ్ సమయం కూడా మంచే చేసింది. ఆ టైమ్‌లో పెద్ద చిన్న పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. హస్తకళాకారులు పని లేక ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కొక్కరిని కలిసి నా ఆలోచన చెప్తుంటే వాళ్లు ఉత్సాహంగా నాకు మరికొన్ని ఐడియాలు చెప్తూ తమ అనుభవాన్ని జోడించారు.అలా 2020లో మొదలు పెట్టిన నా కుటీర పరిశ్రమ ఇంత వరకు హ్యాండ్ మేడ్ పేపర్‌తో ప్లానర్స్, క్యాలెండర్లు, నోట్‌బుక్స్, జర్నల్స్, స్కెచ్ బుక్స్ వంటి 15 వేల ఉత్పత్తులకు రూపమిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే నలభై వేల ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. ఆర్ట్ పీస్ కేవలం కళాభిరుచి, కళారాధన కోసమే కాదు. అది మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. అప్పుడే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని వివరించింది రాశి అగర్వాల్.ఇవి చదవండి: పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు! -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్‌లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్‌గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్‌తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్‌బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్‌పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పర్యావరణంపై యంగ్ టాలెంటెడ్ వుమెన్ వారియర్‌గా.. 'ఈష్న అగర్వాల్'
"పర్యావరణ ప్రేమికురాలైన ఈష్న అగర్వాల్ డాక్యుమెంటరీ 'శాలరీ' దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్ 28)లో ప్రదర్శించబడింది. పర్యావరణంపై ఉప్పు పరిశ్రమ చూపుతున్న ప్రభావం, ఉప్పును పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకొని ఈష్న అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రపంచ ప్రతి నిధుల నుంచి ప్రశంసలు లభించాయి." 'కాప్ 28లో నా డాక్యుమెంటరీని ప్రదర్శించడం నాకు మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న ఎంతో మంది యువతీ, యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. చర్చను రేకెత్తించే, మార్పును ప్రేరే పించే, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి యువతకు ఉంది. వాతావరణ మార్పును కేవలం ఒక సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశంగా భావిస్తాను. విభేదాలకు అతీతంగా అందరికీ ఒకే భూమి పేరిట ఐక్యత రాగం ఆలపించడానికి ఇది మంచి తరుణం' అంటుంది అగర్వాల్. పర్యావరణ కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆగర్వాల్‌కు హిందు స్థానీ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రతిభ చూపుతుంది. తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించింది. మోటివేషనల్ స్సీకర్‌గా కూడా రానిస్తోంది. వ్యక్తిత్వ వికాసం నుంచి పర్యావరణ సంక్షోభం వరకు ఎన్నో అంశాలపై ప్రసంగాలు చేసింది. ఇవి చదవండి: ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా! -
ఏపీ నుంచే నేరుగా విదేశాలకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్‌తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్లో ‘ఆంధ్రప్రదేశ్–విమానయానం ద్వారా కనెక్టివిటీ’ అనే అంశంపై లవ్ అగర్వాల్ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్ అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేటు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా సదుపాయాల్ని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే సాధ్యం విమానయానం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నప్పుడు.. ఆ సౌకర్యాలు ఏపీకి ఎందుకు కల్పించలేకపోతున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్లను అగర్వాల్ ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ ద్వారానే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణాల మధ్య, రాష్ట్ర పట్టణాలకు దేశంలోని ఇతర పట్టణాలతో కనెక్టివిటీని పెంచేందుకు తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా విశాఖ నుండి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, సమీప నగరాలైన భువనేశ్వర్, కలకత్తాలకు సర్వీసులు అవసరమన్నారు. వీటితో పాటు థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలకు విమాన సర్వీసులను నడపాల్సిన అవసరం ఉందని వివరించారు. సుమారు రెండు కోట్ల మంది తమ విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం విమానాశ్రయంపై ఆదారపడుతున్నారని చెప్పారు. మరోపక్క తిరుమలకు ప్రతిరోజూ వచ్చే లక్ష మంది భక్తులకు విమాన సర్వీసును అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. 3 కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు గల ఏకైక రాష్ట్రం ఏపీనే అని వాణిజ్య శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్ తెలిపారు. దేశంలో రెండవ పొడవైన సముద్ర తీర ప్రాంతం గల ఏపీకి విస్తృత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా నుండి ప్రజలు అధిక సంఖ్యలో వారణాసికి వెళుతుంటారని, వారి సౌకర్యార్థం వారణాసికి విమాన సర్వీసులను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. -
బికనీర్‌వాలా చైర్మన్ అగర్వాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: స్వీట్స్, స్నాక్స్ బ్రాండ్ బికనీర్‌వాలా చైర్మన్ కేదార్నాథ్ అగర్వాల్ (86) సోమవారం కన్నుమూశారు. ‘కాకాజీ’ అంటూ అంతా ఆప్యాయంగా పిల్చుకునే అగర్వాల్ మరణం తమకు తీరని లోటని సంస్థ డైరెక్టరు, ఆయన కుమారుడు రాధే మోహన్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు రసగుల్లాలు, భుజియా వంటి తినుబండారాలను విక్రయించిన అగర్వాల్.. అంచెలంచెలుగా బికనీర్‌వాలాతో దేశ, విదేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాల్లో 60 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. -
వృత్తి అగర్వాల్‌కు ఐదో పతకం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రీడల్లో శుక్రవారం ఆమె ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. గుజరాత్లో జరిగిన గత జాతీయ క్రీడల్లో వృత్తి మూడు రజతాలు, ఒక కాంస్యంతో నాలుగు పతకాలు సాధించింది. ఈసారి ఆమె మూడు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఫైనల్లో రష్మిక–శివాని జోడీ జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ ఈవెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రష్మిక –శివాని ద్వయం 6–4, 6–7 (5/7), 10–5తో షర్మదా బాలూ–సోహా సాదిక్ (కర్ణాటక) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. -
ఫిట్టా.. ఫట్టా
ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయ నేత గెలవడం అంటే...తనకు ఓటేసిన లక్షల మంది ప్రజల ఆశల్ని మోయడం. అంతటి బరువు బాధ్యతల్ని మోసే నేత ఆరోగ్యంగా ఉండాలి..అంతకన్నా ముందు ఆ నేత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి...అది వారి హక్కు అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). ఏళ్లనాటి ఈ డిమాండ్ ఇంకా డిమాండ్‌గానే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతల ఆరోగ్యంపై అవగాహన నిజంగా ప్రజల హక్కుగానే భావించాలా? అయితే ఎందుకు? 2015లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు తమ ఆర్థిక పరమైన ఆస్తులను ప్రకటించినట్లే తమ ఆరోగ్య స్థితిగతుల్ని కూడా ప్రకటించాలని ఐఎమ్ఎ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజాసేవ చేయగలరా లేదా అని తెలుసుకోవడం తమ అభ్యర్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఓటరు హక్కు ’’ అని అప్పటి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెకె అగర్వాల్ స్పష్టం చేశారు. అది తప్పనిసరి చేయాలి.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు, అభ్యర్థి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. వైద్య పరీక్షలో ముందుగా ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తిస్తే సదరు అభ్యర్థి ఉద్యోగానికి అనర్హులవుతారనేది మనకి తెలుసు. అలాగే క్రీడల్లో కూడా ఫిట్నెస్ పరీక్ష జరపకుండా ఆడటానికి అనుమతించరు. అలాంటప్పుడు పాలనకు బాధ్యత వహించే రాజకీయ నేతను ఎలా అనుమతిస్తారు? ప్రపంచంలోని అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేత ఆరోగ్యాన్ని తనిఖీ చేయకుండా ఎన్నికలలో పోరాడటానికి అనుమతివ్వడం సరైనదేనా? అనేవి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. దీనిని దృష్టిలో ఉంచుకునే... ‘‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మార్చి దీని కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు అప్పటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎ మార్తాండ పిళ్లై. యువతపై ప్రభావం... మన దేశంలో రాజకీయ నాయకులను సెలబ్రిటీలుగా పరిగణిస్తారని, వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి యువ తరాన్ని ప్రభావితం చేస్తాయని ఐఎంఏ అంటోంది. నేతలు ఊబకాయంతో ఉండడం అలాగే పొగ తాగటం లేదా మద్యపానం వంటి దురలవాట్లు కలిగి ఉండడం... యువ తరానికి తప్పుడు సందేశం ఇస్తుందనేది తమ ఆందోళనగా పేర్కొంది. రాజకీయ నేత... అట్టడుగు స్థాయిలో పని చేయగలమని, శారీరకంగా చురుగ్గా ఉన్నామని, ఏ సమయంలోనైనా ఆకస్మిక విపత్తు సంభవించిన ప్రదేశాలకు రాగలమని, మైళ్ల దూరం నడిచి ప్రజలకు కావలసిన సేవలు అందించగలమనే నమ్మకం ప్రజలకు అందించాలి. ఐఎంఎ నాటి ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని నేతలు ఇప్పటికైనా గుర్తించి...తప్పనిసరి నిబంధన రాకున్నా...ఆస్తుల వెల్లడి తరహాలోనే స్వచ్ఛందంగానైనా తమ ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే... అది గొప్ప మార్పుకు దారి తీయవచ్చు. అనారోగ్యంతో మరణిస్తే... ఒక నేత తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే... ఉపఎన్నిక అనివార్యమై. అది ప్రజాధనం వృధాకి కారణం అవుతుంది. నాయకులు అంటే ప్రజలకు సేవకులు అనేది అందరూ చెప్పే మాటే... అయితే ఒడిదుడుకులను ఎదుర్కొని తమకు 5ఏళ్ల పాటు సేవలు అందించే శారీరక మానసిక సామర్థ్యం నేతలకు ఉందో లేదో తెలుసుకోవడం ప్రజల హక్కు కూడా. –డా.బీఎన్‌రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా...చెప్పింది చేయగలరు.. ఏ మనిషైనా ఆరోగ్యం అత్యవసరం అనేది తెలిసిందే. నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా నేతలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. కాబట్టి... నేతల ఆరోగ్య వివరాలు ప్రజల హక్కు అనేది నిర్వవాదం.. దీనిపై తాజాగా ఐఎంఎ ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ...గతంలో చేసిన ఈ డిమాండ్ ఎప్పటికీ సజీవమే అని నేను భావిస్తున్నా. –డా.గుత్తా సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు, ఐఎంఏ. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్‌లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్‌ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు. -
అంకిత భావమే అమోఘ విజయం
నలుగురు నడిచే దారిలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దారి మార్చి వెళ్లే వారికి మాత్రం సవాలక్ష ప్రశ్నలు ఎదురొస్తుంటాయి. వాటికి అదేపనిగా సమాధానాలు చెప్పడం కంటే ఎంచుకున్న దారిలో వేగంగా నడవడానికే కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు. అంకిత్ అగర్వాల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ద్వారా ఇన్సూరెన్స్ సెక్టార్లో గెలుపు జెండా ఎగరేశాడు... ‘మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తో పనిలేదు’ అనే అంకిత్ అగర్వాల్ హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగాడు. మూడు వేలమందికి పైగా ఇన్సూరెన్స్ ఏజెంట్లను కలిశాడు. ‘ఇన్సూరెన్స్ దేఖో’ ప్రారంభించడానికి ముందు ఊరూవాడా అనే తేడా లేకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ దేఖో’కు సంబంధించిన ఆలోచనలను ఇతరులతో, మిత్రులతో పంచుకునేప్పుడు ‘పిచ్చి ముదిరింది’ అన్నట్లుగా చూసేవాళ్లు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఏమిటీ కర్మ’ అని మందలించేవాళ్లు కొందరు. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో ఎంబీఏ(ఫైనాన్స్) చేశాడు అంకిత్. అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి అంకిత్ రాజీనామా చేసి, ఇన్సూర్టెక్ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘తెలివి తక్కువ పనిచేశావు’ అన్నవాళ్లే ఎక్కువ. ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి అడుగు పెట్టిన తరువాత ఆఫ్‌లైన్(ఇన్సూరెన్స్ ఏజెంట్స్) సామర్థ్యాన్ని, ఆన్లైన్లో తనకు పనికివచ్చే సాంకేతికతను బాగా ఉపయోగించుకున్నాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగులు ఖాళీగా ఉండాలని మొదటి లక్ష్యంగా నిర్ణయించుకున్నాను’ నవ్వుతూ అంటాడు అంకిత్. ఎందుకంటే, సంప్రదాయ ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగ్‌లు నోటుబుక్స్, బోలెడు డాక్యుమెంట్స్‌తో నిండిపోయి భారంగా ఉంటాయి! అందుకే స్మార్ట్‌ఫోన్ ప్లస్ యాప్ ద్వారా ఆ బ్యాగులు తేలికయ్యేలా చేయడంలో అంకిత్ విజయం సాధించాలనుకున్నాడు. అయితే అంకిత్ వేసే ప్రతి అడుగులో ప్రతికూల మాటలు వినిపించేవి. అవేమీ పట్టించుకోకుండా ‘మొదటి దశలో ఏజెంట్. ఆ తరువాత టెక్’ అంటూ తన దారిలో తాను వెళ్లాడు అంకిత్. ‘ఆర్మీ ఆఫ్ ఏజెంట్స్’ పేరుతో యువబృందానికి తయారుచేసుకొని గట్టి శిక్షణ ఇచ్చాడు. ఈ బృందంలో ఎక్కుమందికి ఇన్సూరెన్స్‌కు సంబంధించిన విషయాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ప్రసిద్ధ నినాదం ‘రోటీ కప్డా మకాన్’లో ‘బీమా’ చేర్చి తన బృందంతో ఊరూవాడా తీసుకెళ్లాడు అంకిత్. గురుగ్రామ్(హరియాణా) కేంద్రంగా చిన్నగా మొదలైన ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ప్రయాణం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించింది. తమ అవసరాలకు సరిపోయే పాలసీలను ఎంచుకోవడంతో పాటు ఎన్నో విధాలుగా వియోగదారులకు దారి చూపే నేస్తంగా మారింది ఈ ఇన్సూర్టెక్ స్టార్టప్. ‘పిచ్చి అగర్వాల్’ అని చాటుమాటుగా వెక్కిరించినవాళ్లే ఈ విజయం చూసి ‘అగార్వల్ మెథడ్’ అని గొప్పగా పిలుచుకునేవారు! ‘ఇన్సూరెన్స్‌దేఖో అనేది ఇన్సూరెన్స్ సెక్టార్లో భారీ మార్పు తీసుకురావడమే కాదు సామాజిక ప్రభావాన్ని కలిగించింది’ అంటాడు కార్దేఖో గ్రూప్ కో–ఫౌండర్ అమిత్ జైన్. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ఇటీవల ముంబైకి చెందిన ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ‘వెరాక్’ను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఎంతోమంది యంగ్‌స్టర్స్ అంకిత్‌ను ‘వన్–పాయింట్ అడ్వైజ్’ అడుగుతుంటారు. అతడి నోటి నుంచి వచ్చే ‘అంకితభావం’ అనే జవాబును ఊహించడం కష్టం కాదేమో! నా కంపెనీ లాభాలతో దూసుకుపోతుంది అని చెప్పడం నా లక్ష్యం కాదు. నా అసలు సిసలు విజయం ఆరులక్షల గ్రామాల్లోకి ఇన్సూరెన్స్‌ను తీసుకెళ్లడం. – అంకిత్ అగర్వాల్ -
గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్‌కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్‌కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్‌లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్‌కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్‌ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్‌లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్‌లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్‌లర్స్ టీమ్‌కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్‌ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్‌ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్‌కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్ కన్నుమూత
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్‌గా పని చేసి.. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. pic.twitter.com/uy7JzOyGWK — Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021 చదవండి: కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష -
ఇంటికి రా... నీ పని చెప్తా...
జనవరి 23 శనివారం. ఢిల్లీలో డాక్టర్ కె.కె.అగర్వాల్ టీకా తీసుకున్నారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఢిల్లీలో ప్రముఖ కార్డియాలజిస్ట్. మెడికల్ అసోసియేషన్స్– ఆసియా అధ్యక్షుడు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తుంటారు. తాను కోవిడ్ టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన ఫేస్బుక్ లైవ్ పెట్టారు. టీకాతో భయం లేదని చెబుతున్నారు. ఇంతలో భార్య ఫోన్ మోగింది. ‘ఏంటి... నువ్వు టీకా తీసుకున్నావా?’ అని అడిగారామె. లైవ్ వెళుతోంది. ‘అవును’ అన్నాడీయన. ‘ఇంటికిరా నీ సంగతి చెప్తా’ అందామె. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్ అయిపోయింది. కాని ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ‘నువ్వు లైవ్‌లో ఉన్నప్పుడు నీ భార్య ఫోనెత్తకు’ అని ఇప్పుడు దేశమంతా సందేశం అందుతోంది. దాంతోపాటు డాక్టర్ కె.కె.అగర్వాల్ వీడియో కూడా. ఇదంతా జరిగి ఒక నాలుగైదు రోజులవుతోంది. అసలేం జరిగిందంటే డాక్టర్ కె.కె.అగర్వాల్ ఢిల్లీలో పేరు మోసిన కార్డియాలజిస్ట్. టీవీ పర్సనాలిటీ. పద్మశ్రీ కూడా వచ్చిందాయనకు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన కరోనా అవగాహన వీడియోలు, జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మొన్నటి శనివారం తాను కోవిడ్ వాక్సిన్ తీసుకుంటూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. ‘ఇదిగోండి.. నా వయసు 63. నేను బ్లడ్ థిన్నర్లు వాడతాను. అయినా సరే నేను వాక్సిన్ తీసుకున్నాను. నాకేం కాలేదు. కాబట్టి మీరూ వేయించుకోండి’ అని ఆయన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. భార్య నుంచి. ఆయన లైవ్‌లో ఉండి ఫోన్ ఎత్తాడు. భార్య: ఏంటి... నువ్వు వాక్సిన్ వేయించుకున్నావా? అగర్వాల్: అవును. అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి వెళ్లాను. ఖాళీ ఉంది వేయించుకోండి అంటే వేయించుకున్నాను. భార్య: నన్నెందుకు తీసుకెళ్లలేదు. అగర్వాల్: నీకు సోమవారం వేస్తారు. భార్య: వాక్సిన్ వేయించుకున్నది గాక ఇంకా ఏంటేంటో చెప్తావా... ఇంటికిరా నీ పని చెప్తా... దాంతో అగర్వాల్ గారి ముఖం వాడిపోయింది. ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. భార్యకు ఎంతటివాడైనా భయపడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నిన్న (బుధవారం) డాక్టర్ గారు తన ఫేస్బుక్ వాల్ మీద వీడియో రిలీజ్ చేశారు. ‘నా భార్య కోప్పడటం సబబే. నా ఆరోగ్యం గురించి వర్రీ అయ్యింది. టీకా గురించి అందరికీ సందేహాలు ఉన్నాయి కదా. తను పక్కన ఉన్నప్పుడు వేయించుకోవాల్సింది అని ఆమె ఉద్దేశ్యం. నేనేమో ఆమెకు చెప్పకుండా ఈ పని చేశాను. దీనిని పెద్దగా చర్చ పెట్టాల్సిన పని లేదు’ అన్నాడాయన. అయితే ఈ వెర్షన్‌ను సగంమంది నెటిజన్లు నమ్ముతుంటే అగర్వాల్ ఒక్కడే వెళ్లి అలా టీకా వేయించుకోవడం గురించి ఆమెకు నిజంగా కోపం వచ్చిందని మిగిలిన సగం అన్నారు. ‘అయినా భర్తను అదిలించి అదరగొట్టే శక్తి భార్యకు కాక ఇంకెవరికి ఉంటుంది’ అని మరికొందరు అన్నారు. అగర్వాల్ భార్య పేరు వీణాఅగర్వాల్. ప్రస్తుతం కెకె అగర్వాల్‌తో పాటు ఆమె కూడా అందరికీ తెలిశారని మాత్రం చెప్పక తప్పదు.