Akun Sabarwal
-
టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్.. నాడు ఏం జరిగింది?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంది. ఇప్పటికే అతని కాల్ లిస్ట్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు నలుగురు మహిళా నటులు ఉన్నారని సమాచారం. ఈ లింక్ వెనుక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కొత్త కాదు. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్ చేసిన అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) నాటి విచారణలో ఏం తేల్చారు దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. (ఇదీ చదవండి: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..) దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది. ఈడీ ఎంట్రీతో ఆయన బదిలీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం అబ్కారీ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్స్.. అక్కడా ఇదే స్టైల్ బాలీవుడ్ బాద్షా షారుక్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో దుమారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి క్లీన్ చిట్ వచ్చింది..అతను నిర్దోషిగా తేల్చి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వదిలేసింది. మరి ఆర్యన్ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికి సమాధానాలు దొరకలేదు. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన) ఆర్యన్ కేసుకు ముందు కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్‌కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడా కేసు సైలెంటైపోయింది. సినిమా రంగంలోనే ఎందుకు? సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్లలో కొందరు ఈ డ్రగ్స్ కల్చర్‌కు అలవాటు పడుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిట్ నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
వైద్యుల నిర్లక్ష్యం.. నిరుపేదకు 8 లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం ఓ బాధితుడికి అండగా నిలిచింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి ఉపాధి కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురైన యోగా మాస్టర్‌కు రూ.8 లక్షలు నష్టపరిహారం ఇప్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లికి చెంది న పి.దేవయ్య(31) యోగా శిక్షకుడు. జాతీయ పోలీసు అకాడమీలో కూడా పనిచేశారు. యోగాలో అంతర్జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2018 ఫిబ్రవరి 24 సికింద్రాబాద్‌లోని పైల్స్ క్లినిక్‌లో రూ.25 వేల ప్యాకేజీతో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. డిశ్చార్జి అయిన తర్వాత రక్తస్రావం కావడంతో మరుసటిరోజు అదే క్లినిక్‌లో సంప్రదించాడు. దీంతో యశోదా హాస్పిటల్‌కు వెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమని డాక్టర్లు చెప్పడంతో దేవయ్య కుటుంబసభ్యులు, సన్నిహితులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌ను సంప్రదించారు. ఆయన స్పందించి రూ.5.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించారు. కానీ, నెలన్నర పాటు యశోద హాస్పిటల్లో చికిత్స చేసుకున్న దేవయ్యకు మొత్తం రూ.18 లక్షల ఖర్చు అయింది. మిగతా డబ్బుల కోసం తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, మరికొంత అప్పు చేసి హాస్పిటల్ బిల్లు చెల్లించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పైల్స్ క్లినిక్‌పై తెలంగాణ వినియోగదారుల సహాయకేంద్రాన్ని ఆశ్రయించారు. సహాయ కేంద్రం నిర్వాహకులు హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఇరవై రోజుల్లో కేసును పరిష్కరించి దేవయ్యకు రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఈ చెక్కును పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం దేవయ్యకు అందజేశారు. న్యాయం జరిగింది: దేవయ్య ‘తీవ్ర అనారోగ్యానికి గురై, ఉపాధి కోల్పోయిన నాకు కేటీఆర్, వినియోగదారుల సహాయ కేంద్రం అండగా నిలిచింది. ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యం చేసిన హాస్పిటల్ నుంచి రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఉచితంగా ఇరవై రోజుల్లోనే సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేశారు’అని దేవయ్య తెలిపారు. -
62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 11 లక్షల మంది రైతుల నుండి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఖరీఫ్‌లో 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,09,885 మంది రైతుల నుండి 40.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రబీలో ఇప్పటివరకు 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుండి 22.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిం దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర పంటకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించేలా, కనీస మద్దతు ధర చెల్లింపులతో రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్‌వేర్‌ను పౌరసరఫరాల శాఖ అభివృద్ధి చేసింది. రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులను సేకరించింది. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సప్ నంబర్ 7330774444లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూంకు 506 ఫిర్యాదులు రాగా 477 పరిష్కరించింది. ముమ్మర పర్యటనలు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్లగొండ, సూర్యాపేట్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అకాల వర్షాలు, మండుటెండల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచనల మేరకు కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రతిరోజూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యోగులందరూ ఆ దిశగా పనిచేయాలని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులను జారీచేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన జూన్ 1 నుంచి రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని ఆదేశించారు. చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్ఓ) పరిధిలో రేషన్ కార్డుల జారీ, 6ఏ కేసుల పరిష్కారం, రేషన్ డీలర్ల నుంచి గోనె సంచుల సేకరణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బుధవారం సీఆర్ఓ కార్యాలయంలో కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల జారీని వేగం చేయడానికి శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధికారులతో 2 కమిటీలను వేసి అవి చేసిన సిఫారసులు అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను త్వరితగతిన ఎలా పరిష్కరించాలనే దానిపై హెచ్ఎండీఏ పరిధికి సంబంధించి ఇద్దరు, గ్రామీణ ప్రాంతాలకు చెంది మరో ఇద్దరు ఉన్నతాధికారులతో 2 కమిటీలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులను డీసీఎస్ఓలు, ఏసీఎస్‌ఓల లాగిన్‌కు వచ్చిన 7 రోజుల్లో కార్డుల జారీ పూర్తి చేయాలి’ అని అన్నారు. -
పౌరసరఫరాల ఐటీ సేవలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాలశాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అమలుతీరుపై అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) దేశాల అధికారుల బృందం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది పేదప్రజలకు సేవలందిస్తున్న పౌరసరఫరాల శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న విధానం బాగుందని కొనియాడింది. శుక్రవారం ఇండోనేసియా, కంబో డియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన 13 మంది అధికారులు పౌర సరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్‌తో సమావేశమయ్యారు. శాఖలో చేపట్టిన వినూత్న చర్యలు, సంస్కరణలు, విధానాలపై 18 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, ఈ–పాస్, ఐరిస్ విధానం, టి–రేషన్ యాప్, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ విధానం, రేషన్‌షాపులు, రేషన్ కార్డుల సంఖ్య, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా సరుకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖలో చేపట్టిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. -
39 లక్షల టన్నులు.. 3,732 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. 39 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో ఏప్రిల్‌లో 14.25 లక్షల టన్నులు, మేలో 20.22 లక్షలు, జూన్‌లో 5.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,732 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఐకేపీ 1,366, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) 2,163, డీసీఎంఎస్, ఐటీడీఏ 203 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తాయి. కనీస వసతులపై దృష్టి పెట్టండి యాసంగి ధాన్య సేకరణ ఏర్పాట్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బుధవారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అప్పటికప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగువ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లుల సామర్థ్యం మేరకు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాలని, పౌరసరఫరాల శాఖకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి బియ్యం ఎగవేతదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపులు జరపకూడదన్నారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టు కొని ప్రాధాన్యత క్రమంలో జిల్లాల వారీగా గోనె సంచులను కేటాయించడం జరుగుతోందని, స్థానికంగా ఎక్కడైనా అవసరమైతే రేషన్ డీలర్ల నుంచి ఒక్కో గోనె సంచి ధర రూ.16 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. అంతా నిఘా నీడలో.. ప్రభుత్వానికి, రైతులకు, మిల్లర్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)ను మరింత అభివృద్ధి చేశామని అకున్ సబర్వాల్ చెప్పారు. రైస్‌మిల్లు సీడింగ్ సామర్థ్యం తెలుస్తుందని, మిల్లులకు ధాన్యం కేటాయించడానికి వాటి మిల్లింగ్/బాయిలింగ్ సామర్థ్యం సమాచారం ఉంటుందని తెలిపారు. ధాన్యం కేటాయించిన 7 రోజులకైనా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే ఆయా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, జిల్లా మేనేజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. ఆన్లైన్లో రైతుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని, జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చడం జరుగుతుందని తెలిపారు. -
వరికి అభిషేకం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో 5 టన్నుల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను (ఈవేయింగ్ మెషీన్), ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపే యంత్రాలను (ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్) ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రబీ నుంచి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. అనంతరం ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయబోతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ శనివారం చర్లపల్లిలోని మెట్‌వే ఇండియా ఫ్యాక్టరీలో ఈ యంత్రాల పనితీరును పరిశీలించారు. మార్చి 31 నాటికి అన్ని గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ యంత్రాలను సాఫ్ట్వేర్ ద్వారా పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేస్తామని చెప్పారు. దీని ద్వారా వేయింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎనిమిదో తరగతి విద్యార్థి అభిషేక్ కనిపెట్టిన ధాన్యాన్ని నింపే యంత్రాన్ని వచ్చే యాసంగి (రబీ) నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. విద్యార్థి అభిషేక్‌కు అభినందన.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అభిషేక్ ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్‌ను తయారుచేశారు. అభిషేక్ తల్లిదండ్రులు రాజవ్వ, లక్ష్మీరాజ్యం, సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మీన్, స్కూల్ హెడ్మాస్టర్ ఉమారాణి, గైడ్ వెంకటేశంలు శనివారం పౌరసరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్‌కు ఈ యంత్రం పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ అభిషేక్‌కు రూ. 10 వేల నగదు, రోబో బొమ్మను బహూకరించి, అభిషేక్‌కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ యంత్రాన్ని కనిపెట్టిన అభిషేక్‌ను అభినందించారు. యంత్రానికి సంబంధించి కొన్ని మార్పులు సూచించారు. అభిషేక్ తయారు చేసిన యంత్రం చిన్నదిగా ఉందని, హమాలీలకు సరిపోయే విధంగా ఎత్తును పెంచాలని కోరారు. ప్రస్తుతం ఈ యంత్రం 20 కేజీల బరువును మాత్రమే తూకం చేసే విధంగా ఉందని, దీన్ని 40–45 కిలోల బస్తా బరువు మోసే విధంగా, కొద్దిగా వెడల్పుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మార్పులు చేసిన తరువాత కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. యంత్రం భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వరి అభిషేక్ పేరుతో పేటెంట్ హక్కులు.. తెలంగాణ ప్రభుత్వం పేరుతో పాటు ’వరి అభిషేక్’ పేరుతో పేటెంట్ హక్కులను తీసుకుంటామని అకు న్ సబర్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మెషీన్‌తో నలుగురు చేసే పనిని ఒక్కరే చేయవచ్చు. దాని బరువును కూడా కొలవవచ్చు. బస్తా నిండిన తర్వాత ఎక్కడ నిల్వ చేయాలో అక్కడి వరకు ఈ యంత్రంతోనే తరలించవచ్చు. రైతులకు సమయం, డబ్బు ఆదా చేయడమే కాకుండా, శ్రమ కూడా తగ్గుతుంది. ఈ యంత్రాన్ని రైతులు వారి పొలంలో, ఇళ్ల వద్ద, ఐకేపీ సెంటర్లలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రం ద్వారా కూలీల కొరతనూ అధిగమించవచ్చు. -
వినియోగదారుల పాత్ర ఉండాలి: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తుల ఫొటో లు, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్ షాపుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి.. వినియోగదారుల సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసి షాపు యాజమాన్యంపై విజయం సాధించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటో వాడుకున్నందుకు సలహా కేంద్రం రూ.10 వేల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని వినియోగదారుల సలహా కేంద్రం బి.ఆకాశ్ కుమార్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఆకాశ్‌ను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ అభినందించారు. ఇటువంటి కేసు మా విభాగానికి రావడం ఇది తొలిసారి అని, ఆకాశ్ లాగా ప్రతి ఒక్క వినియోగదారుడు వివిధ రూపాల్లో జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. -
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్‌కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్‌కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్‌షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్‌లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
మేలుకో.. మేలు తెలుసుకో
వినియోగదారులకు అండగా పౌర సరఫరాల శాఖ రిడ్రెసల్ సెల్, వినియోగదారుల ఫోరంమోసాల బారి నుండిచట్టం ద్వారా రక్షణనిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారమే లక్ష్యంఫోరంలో 94,105 కేసులకుగానూ 89,057 కేసుల పరిష్కారరిడ్రెసల్ సెల్లో 3,275 కేసులకు పరిష్కారం చట్టం.. వినియోగదారుల చుట్టం.. మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకే వినియోగదారుల చట్టం ఉంది. వినియోగదారుల ఫోరం పేరిట ఏర్పడిన ఈ చట్టానికి, 1986 డిసెంబర్ 24న రాష్ట్రపతి ఆమోదం లభించి, అదేరోజు నుండి అమల్లోకి వచ్చింది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా మూడు అంచెలుగా ఫోరం ఉంటుంది. రూ.20 లక్షల లోపు పరిహారం కోసం జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటిలోపు హైకోర్టు, రూ.కోటి పైబడి పరిహారం కోసం సుప్రీంకోర్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే వినియోగదారుల ఫోరంలో నేరుగా కేసు దాఖలు చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర వినియో గదారుల ఫోరంలో నాలుగేళ్లలో 5,684 కేసులు నమోదు కాగా, 2,999 కేసులు పరిష్కార మ య్యాయి. 2,685 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరంలలో 94,105 కేసులు నమోదు కాగా, 89,057 కేసులు పరిష్కారమయ్యాయి. 5,048 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వినియోగదారులకు వారి హక్కులపట్ల అవగాహన కల్పించడమే కాకుండా, ఉచితంగా సమస్యలను పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలా పౌర సరఫరాలశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఏర్పా టైంది. దీనికి వచ్చిన ఫిర్యాదులపై గత ఏడాది కాలంలో తూనికలు, కొలతల శాఖ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, విత్తన, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, పెట్రోల్ పంపులు, వే బ్రిడ్జీలు, బహుళజాతి సంస్థల గోదాములు, నగల దుకాణాలు, ఫైర్ క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వ హించి 3,059 కేసులను నమోదు చేసి, రూ. 25.08 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది. సోమ వారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలలో పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదా రుల వ్యవహారాల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కాలంలో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం హెల్ప్‌లైన్‌కు వివిధ అంశా లకు సంబంధించి 3,344 ఫిర్యాదులను నమోదు చేసింది. 3,275 కేసులను పరిష్కరించింది. ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం.. నష్టం జరిగిందని, మోసపోయామని భావించిన వినియోగదారులు రిడ్రెసల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించిన తరువాత ప్రతివాదుల సంజాయిషీకి రెండు, మూడు వారాల కాలపరిమితి విధిస్తూ నోటీసు జారీ చేస్తారు. ఒక నిర్ణీత తేదీనాడు వారిని కేంద్రానికి పిలిపించి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. ఇరుపక్షాలకు అంగీకారయోగ్యమైన పరిహారాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. రిడ్రెసల్ సెల్లో ప్రతి శనివారం ఈ ‘కౌన్సెలింగ్’ నిర్వహిస్తారు. ఇది ఉచితం. సమస్య పరిష్కారంకాని పక్షంలో జిల్లా వినియోగదారుల ఫోరంకు కేసును బదిలీ చేస్తారు. బాధితులకు అండగా ఫోరం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఆ హక్కుకు భంగం కలిగితే ఒక తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో రాసి రాష్ట్ర వినియోగదారుల సమాచార, సలహా, సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. త్వరితగతిన సమస్యలు పరిష్కారం కావడంతో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇలా.. ప్రతిచోట వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. అడుగడుగునా దగా పడుతూనే ఉన్నారు. తినే ఆహారం మొదలు వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల వరకు అన్నీ కల్తీ, నకిలీమయమే. రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, బ్యాంకులు ఇలా రకరకాల సంస్థలు వినియోగ దారులను మోసం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల్లో కల్తీల వల్ల అన్నదాత బలి అవుతున్నాడు. వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోగలిగితే ఇలాంటి మోసాల బారి నుంచి వినియోగదారుల చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు. – సాక్షి, హైదరాబాద్ ►రాంబాబు ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులో రూ.30 వేలు పెట్టి ఎల్ఈడీ టీవీ కొన్నాడు. వారం తిరగక ముందే మరమ్మతుకు గురైంది. దాని స్థానంలో కొత్త టీవీ కావాలని కోరితే ఆ షాపు యాజమాన్యం నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ►ప్రశాంత్ ఓ హోల్‌సేల్ షాపులో నూనె ప్యాకెట్ కొని ఇంటికొచ్చి తెరిచి చూడగా అది నాసిరకమని తేలింది. ఇదేంటని షాపు సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రశాంత్‌ను అక్కడి నుంచి గెంటేశారు. -
తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, తాండూర్, మేడ్చల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, అక్కడి పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఆయా అధికారులతో మాట్లాడారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన చివరి గింజను కూడా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాల ప్రభావం రైతాంగం మీద ఏమాత్రం పడకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 7330774444, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో, నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. తేమ శాతం విషయంలో రైతాంగానికి అధికారులు అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉంటుందన్నారు. మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడైనా టార్పాలిన్ల కొరత ఉంటే దాన్ని అధిగమించాలని, వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో భారీగా ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఖరీఫ్ కార్యాచరణపై పౌరసరఫరాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, సంస్థ మేనేజర్లతో అకున్ సబర్వాల్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కనీస మద్దతు ధరపై రైతుల్లో అవ గాహన కల్పించేలా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి 5 కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీపీసీల్లో తేమ కొలిచే యం త్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లతోపాటు తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయిలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. ఈ కమిటీలో డీసీఎస్వోలు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, మార్కెటింగ్, ఆర్టీఏ అధికారులు, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ, కనీసమద్దతు ధర వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా చెల్లించాలని, కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై టోల్ ఫ్రీ నంబర్.. ధాన్యం ఎంత కొనుగోలు చేశాం, ఎంత తిరస్కరించింది, చెల్లింపులు వంటి వాటిని ఆన్లైన్లో ఏ రోజుకారోజు పొందుపర్చాలని అధికారులను అకున్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీ, పౌరసరఫరాలు, ఎఫ్‌సీఐ సాంకేతిక సిబ్బందికి కేంద్రాల ఏర్పాటుకు ముందే శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌లో పౌరసరఫరాల భవన్లో టోల్ ఫ్రీ నంబర్ 180042500333 ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గోదాములకే తొలి ప్రాధాన్యత మిల్లర్ల నుంచి సేకరించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను స్టోరేజ్ చేయడానికి ప్రభుత్వ గోదాములకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అకున్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో జిల్లాల వారీగా గన్నీ సంచులను కేటాయించామని, 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు 8.59 కోట్ల గోనె సంచులు అవసరం అవుతాయని అంచనా వేశామని చెప్పారు. -
పారదర్శకంగా నాణ్యత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: బంకుల్లో పెట్రోల్, డీజిల్ తూకం, నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకం గా ఉండేందుకు తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా గాజుతో తయారు చేసిన 5 లీటర్ల ఓ కొత్త జార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాజు జార్‌ను యుఎస్పీ టైప్ క్లాస్–ఏతో తయారు చేశారు. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడటంతోపాటు సరైన తూకాన్ని సూచిస్తుంది. ఈ జార్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. సోమవారం పౌరసరఫరాల భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో జరిగిన సమావేశంలో ఈ పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ పరికరాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సూచించారు. వీటిని వినియోగించేందుకు తూనికల కొలతల శాఖ నుంచి ధ్రువీకరణపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, హెచ్‌పీసీఎల్ డీజీఎం (రిటైల్) రాజేశ్, బీపీసీఎస్ మేనేజర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా హాళ్లలో పక్కాగా ఎంఆర్పీ అమలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో వస్తువుల ఎంఆర్పీ, పరిమాణం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే సంస్థలపై కేసులు నమోదు చేసి, అధిక మొత్తం లో జరిమానాలు విధిస్తామ న్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. 23, 24 తేదీల్లో జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు మల్టీప్లెక్స్, సినిమాహాళ్ల యజమానులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానీయాలు, ప్యాకింగ్ చేయని ఇతర ఉత్పత్తులధర, పరిమాణం తెలుపుతూ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించి స్టిక్కర్ అంటించేందుకు అనుమతించామని, సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలన్నారు. అధిక ధరలు వసూ లు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
వినియోగదారులను మోసం చేస్తే కేసు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్‌తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
-
నోటీసులు.. ఆపై సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. డీలర్లను తొలగించి వారి స్థానంలో జూలై 5 నుంచి మహి ళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. సరుకుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు... గౌరవ వేతనం, కమీషన్ల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించడం తెలిసిందే. సరుకుల కోసం ఈ నెల 28లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు డెడ్‌లైన్ పెట్టగా 17,200 మంది డీలర్లకుగాను గురువారం సాయంత్రానికి కేవలం 609 మందే డీడీలు కట్టారు. దీంతో వారిపై చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులను వెలువరించే అవకాశాలున్నాయి. అయితే డీలర్ల సమ్మె నేపథ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎంసీహెచ్ఆర్డీలో గురువారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 5 నుంచి పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీని చేపట్టాలని, స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైతే గడువు పొడిగించాలని సూచించారు. మహిళా సంఘాలకు బాధ్యతల అప్పగింత... పేదలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న చోట ఎన్ఆర్ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టాలని అధికారులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ రేషన్ షాపులవారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు వాటిని పర్యవేక్షించాలని సూచించారు. రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు డీలర్షిప్ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1న మీ–సేవ కేంద్రాల్లో అధికారులు డీడీలు కట్టించాలన్నారు. సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాళ్లు, యూత్ బిల్డింగ్‌లను గుర్తించాలని సబర్వాల్ పేర్కొన్నారు. వేయింగ్ మెషిన్లను సమకూర్చుకునేందుకు తూనికలు, కొలతలశాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి సరుకులను తరలించేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలని, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని అకున్ సబర్వాల్ అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు, ఫిర్యాదులతోపాటు సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444ను అందు బాటులో ఉంచామని అకున్ సబర్వాల్ తెలిపారు. మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్ పంపిణీలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్వోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని చెప్పారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదు: రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ డీలర్ల సమ్మె విరమించే ప్రసక్తే లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. భయపెట్టేందుకు అక్రమంగా 14 వేల మంది డీలర్లను సస్పెండ్ చేయడం విచారకరమని వాపోయారు. డీలర్లకు నోటీసులు మాత్రం అందలేదని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన సుమారు రూ.600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా డీలర్లకు వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, భయపెట్టడం తగదని హితవు పలికారు. బంగారు తెలంగాణలో రేషన్ డీలర్ల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె విరమణకు అంగీకరించని నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. గ్రామాల్లోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేయించేలా ఏర్పా ట్లు చేస్తోంది. ఈ నెల 28 వరకు డీలర్లకు డెడ్‌లైన్ విధించడంతో అంతవరకు వేచిచూసిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా డీఎస్వోలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 28 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా ల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకురావాలని ఆదేశించారు. అదే రోజున గ్రామాల వారీగా సరుకుల పంపిణీ చేసే ప్రాంతాన్ని గుర్తించడం, మహిళా సంఘాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సరుకుల పంపిణీకి డీలర్లు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సరుకులు అందించడం బాధ్యత.. ఈ నెల 28 వరకు మీ–సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రీలీజ్ ఆర్డర్) తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పౌర సర ఫరాల శాఖ మంగళవారం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. పేదలకు నిత్యావసర సరుకులను సకాలంలో అం దించాల్సిన కనీస బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని పేర్కొంది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కం ట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగిస్తామంది. సకాలంలో సరుకులు ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. -
రేషన్ డీలర్ల సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీకి డీలర్లు అంగీకరించలేదు. ముందు చెప్పినట్లు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని, సరుకులకు డీడీలు కట్టబోమని డీలర్లు స్పష్టం చేశారు. గౌరవ వేతనం, కమీషన్ల పెంపు, పాత బకాయిల విడుదల తదితర సమస్యల పరిష్కారానికి జూలై 1 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె విషయమై డీలర్ల సంఘం ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం చర్చలు జరిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుతోపాటు సంఘం ప్రతినిధులు బత్తుల రమేశ్, నాగరాజు, సంజీవరెడ్డి, కొండల్‌రెడ్డి, అన్వర్ పాషా, ప్రసాద్‌గౌడ్, సురేందర్ తదితరులు చర్చలకు హాజరయ్యారు. కేరళ, తమిళనాడు మాదిరి డీలర్లకు వేతనాలివ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సంఘం నేతలు కమిషనర్‌ను కోరారు. అకున్ సబర్వాల్ స్పందిస్తూ.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారని, సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రేషన్ దుకాణాల నిర్వహణతో వచ్చే ఆదాయం, లాభంపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్, పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌కు సమర్పిస్తామని.. మూడు రోజుల తరువాత మళ్లీ చర్చలకు పిలుస్తామని వివరించారు. కానీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని డీలర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేయడంతో.. మహిళా సంఘాలతో రేషన్ పంపిణీకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీకి సిద్ధం: అకున్ సబర్వాల్ డీలర్ల సమ్మె చట్ట విరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016, నిత్యావసర సరుకుల చట్టం–1955 ప్రకారం సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. డీలర్లు సమ్మెకు వెళ్లినా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పేదలకు సరుకులు అందించే కనీస బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉందని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా తమ వద్ద ఉందని చెప్పారు. -
‘ధాన్యం కొనుగోలు నిధుల విడుదల’
సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వంద శాతం నిధులను విడుదల చేశా మని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. రబీలో 3,313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుంచి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని శాఖ కొనుగోలు చేసిందని, దీని కోసం రూ.5,601.97 కోట్లు విడుదల చేశామన్నారు. వినియోగదారుల ఫిర్యా దుల కోసం ఫేస్బుక్, ట్విట్టర్ హ్యాండిల్‌ను గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు. ఇప్పటికే వినియోగదారుల ఫిర్యాదు కొరకు సమాచార సలహా, సహాయ కేంద్రం (రిడ్రెసల్ సెంటర్) టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నా యి. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నెం: 1800 425 00333 , ఫేస్బుక్ ConsumerInformation RedressalCentre, , ట్విట్టర్ Telangana Consumer Info and Redressal Center, వెబ్సైట్. www.consumeradvice.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సబర్వాల్ వివరించారు. -
‘రేషన్ డీలర్లు చేసేది సామజిక సేవే’
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామ’ని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్ సెంటర్ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్ సెంటర్‌ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఇటీవల నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్ ఫ్రీ నెంబర్, ఫేస్బుక్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. -
తూకంలో తేడాలు రానివ్వొద్దు’
సాక్షి, హైదరాబాద్: ఉత్పత్తుల విక్రయాల విషయంలో తూకంలో తేడాలు రావొద్దని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో విత్తన కంపెనీల ప్రతినిధులు సోమ వారం అకున్ సబర్వాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ పలు విజ్ఞప్తులు చేశారు. అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని, తూకంలో తేడా లేకుండా, రైతాంగానికి నష్టం కలగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన తూకం కంటే తక్కువ పరిమాణంలో విక్రయిస్తే రైతుల కు నష్టం చేసిన వారవుతారని, ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలపై సీనియర్ ఆఫీసర్లను పంపి ఉత్పత్తిదారులకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక తప్పుల విషయంలో కేసులు నమోదు చేసే విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ, తూకాల్లో రైతులను మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులతో విక్రయిస్తున్న పలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 154 కేసులు నమోదు చేసి, రూ.2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. -
తూనిక.. రైతు రక్షణకు పూనిక
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్‌కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బియ్యం నిల్వలకు గోదాములు చూపించాలి
సాక్షి, హైదరాబాద్: గోదాముల్లో బియ్యం (బాయిల్డ్ రైస్) నిల్వలకు అవసరమైన స్థలాన్ని చూపించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి విజ్ఞప్తి చేశారు. డిమాండుకు సరిపడా గోదాముల సంఖ్యను పెంచాలని కోరారు. శుక్రవారం ఆయన ఎఫ్‌సీఐ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. బియ్యం నిల్వలకు సరిపడా నిల్వ స్థలం చూపించడమే కాకుండా, బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోదాముల్లో అన్లోడింగ్ చేసుకోవాలని ఎఫ్‌సీఐ అధికారులను కోరారు. నిల్వ సమస్య తీవ్రంగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం రబీలో పౌరసరఫరాలశాఖ 39.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని, మిల్లర్ల నుంచి 23.93 లక్షల మెట్రిక్ టన్నుల (90%) బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 11 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అవసరమన్నారు. ప్రతి రైస్ మిల్లు నుంచి ప్రతిరోజు 40 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని సబర్వాల్ అన్నారు.