alimony
-
తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!
బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.వివరాలు ఇలా ఉన్నాయి...హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్ అంత భరణం ఎలా?తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. -
భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే ‘భరణం’ విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవనభృతిని నిర్ణయించడానికి ముందు ఎనిమిది అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.కుమారుడి కోసం కోటి రూపాయలుప్రవీణ్ – అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లయిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు, విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వీరి పెళ్లికి కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రా యపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కో ర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశమైంది.కోర్టు సూచించిన ఎనిమిది సూత్రాలు1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు2. భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు3. ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం4. ఆదాయ మార్గాలు, ఆస్తులు5. అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు6. కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయపోరాటానికి సహేతుకమైన మొత్తం8. మెయింటెనెన్స్ అలవెన్స్‌తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు -
భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!
జైపూర్ ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో ఫిర్యాది ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ, తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.75వేలు, అడ్వకేట్ ఫీజు, లిటిగేషన్ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా తన భార్యనెలకు రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్‌లు పొందుతోందని కౌంటర్ పిటిషన్ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్ అధికారి గార్గ్ మహిళ పిటిషన్‌ను కొట్టి వేశారు.భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు, విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. మెయింటెనెన్స్ అంటేభార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. -
చిల్లర భరణం.. భర్తకు షాకిచ్చిన కోర్టు
జైపూర్: భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తెచ్చిన ఓ భర్తకు కోర్టు షాకిచ్చింది. వాటిని తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమ విభేదాలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్ 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే.. దశరథ్ అరెస్ట్ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: శివలింగంపై కరెన్సీ నోట్లు విసిరి.. -
పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాలు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. చదవండి: రాజమౌళి డైరెక్షన్లో నటించను: చిరంజీవి ఈ క్రమంలో 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. కాగా పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: మణిరత్నం కల నెరవేరిందా? అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక పృథ్వీరాజ్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూ బిజీగా ఉన్నాడు. -
నాగ చైతన్య నుంచి ఒక్క పైసా కూడా వద్దని చెప్పిన సామ్!
Samantha Says No To Rs 200 Crore Alimony: సమంత-నాగ చైతన్య విడాకులకు సంబంధించి టాలీవుడ్లోనే కాదు, జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలం నుంచే వీరు విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్‌పై ఎక్కడా స్పందించని సమంత-నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే సాధారణంగా భార్య భర్తలు విడిపోతే భర్త ఆస్తిలోనుంచి కొంత వాటా భరణంగా భార్యకు దక్కుతుంది. తాజాగా సమంతకు అక్కినేని కుటుంబం నుంచి ఎంత భరణం లభిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: సమంత-చైతన్య విడాకులకు కారణం ఇతడేనా!? ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం సమంతకు దాదాపు రూ. 200 కోట్లు ఇస్తామని అక్కినేని కుటుంబం ఆఫర్ చేసిందట. అయితే నాగ చైతన్య నుంచి కాని, అక్కినేని కుటుంబం నుంచి కాని ఒక్క రూపాయి కూడా తనకు వద్దని సమంత పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.తనకు ఎలాంటి భరణం అవసరం లేదని, సొంతంగా తాను సంపాదించుకోగలనని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఏమాయ చేశావే సినిమా టైంలోనే సమంత, నాగ చైతన్య మంచి స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి సాన్నిహిత్యంగా ఉన్న వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారి 2017 అక్టోబర్6,7న హిందూ, క్రిస్ట్రియన్ సాంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు విభేదాలు వచ్చినంత మాత్రాన ఆ బంధాన్ని భరణంతో వెలకట్టాలని సమంత అనుకోవట్లేదట. అందుకే 200కోట్లను తీసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. 'విడాకుల వ్యవహారంతో సమంత హృదయం ముక్కలైపోయింది. ఆమె దీన్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. కానీ తన పర్సనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్‌కు ఇబ్బంది రాకుండా ఆమె పనిమీద దృష్టి పెడుతుంది' అంటూ ఆమె సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: హాట్ టాపిక్‌గా మారిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్టులు -
చై-సామ్ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల విషయం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం(అక్టోబర్ 2) మేము.. విడిపోతున్నాం అంటూ చై-సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే వారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకగా కారణలు ఏంటీ? వారు ఎందుకు విడిపోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే విడాకుల అనంతరం చై, సమంతకు ఇచ్చే భరణం అంశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్ ఫ్యామిలీ మ్యాన్ 2లో పలు అభ్యంతరకర సన్నివేశాల్లో సమంత నటించిన కారణంగానే చై-సామ్ మధ్య చెడిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు, విభేదాలు తలెత్తడంతో వారిని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారట. అప్పుడు వారి మధ్య మనస్పర్థలు తొలిగినప్పటికీ కొద్ది రోజులు మళ్లీ గొడవలు మొదలైయ్యేవని, దీంతో పలుమార్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక అందరూ కలిసి వారికి నచ్చజెప్పి ఒకటి చేసే ప్రయత్నం కూడా చేశారట. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో చివరికి ఇలా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకుల అనంతరం నాగ చైతన్య ఇచ్చే భరణం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. చదవండి: ChaySam Divorce Reason: సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణాలివేనా? ఈ విడాకుల ప్రాసెస్‌లో భాగంగా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ. 250 కోట్ల రూపాయల నుంచి రూ. 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కొందరూ మాత్రం రూ. 50 కోట్ల ఇచ్చే అవకాశం ఉందని అంటుండగా..మరికొందరెమో సమంత ఒక స్టార్ హీరోయిన్, ఇప్పటికే ఆమె ఎన్నో స్థిర, చర ఆస్తులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అలాంటి సామ్‌కు భరణం తీసుకునే అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చై నుంచి సామ్ భరణం తీసుకుంటుందా లేదా? అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎంతవరకు భరణం ఇస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని ప్రియురాలి హత్య
గాంధీనగర్/అహ్మదాబాద్: అతడు పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహమయి భార్య ఉంది. అయినప్పటికి మరో మహిళను ప్రేమించానన్నాడు.. ఆమెతో కలిసి సహజీవనం చేయసాగాడు. కానీ ప్రియురాలు అతడిని భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగింది. భార్యకు విడాకులు ఇస్తే.. ఆమెకు భరణంగా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని భావించి ప్రియురాలిని హత్య చేశాడు. గుజరాత్, అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో అతడికి వివాహం అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడికి స్వీటి పాటిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేయసాగారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా స్వీటి ఒత్తిడి చేయడంతో ఏడాది క్రితం అజయ్ ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ స్వీటి మాత్రం తన వివాహం చట్టబద్దం చేసుకోవాలని భావించింది. దాని కోసం అజయ్‌ను అతడి భార్యకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగింది స్వీటి. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. స్వీటి కోరినట్లు భార్యకు విడాకులు ఇస్తే.. భరణంగా ఆమెకు 25 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని అజయ్.. స్వీటిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో జూన్ 4న ఇదే విషయం మీద స్వీటి-అజయ్‌ల మధ్య ప్రారంభమైన గొడవ ముదిరింది. ఆ కోపంలో అజయ్.. స్వీటిని చంపేయాలని భావించాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత స్వీటి మృతదేహాన్ని తన స్నేహితుడు కిరిట్సింగ్ జడేజాకి చెందిన హోటల్ ప్రాంగణంలో పూడ్చి పెట్టాడు. ఇక జూన్ 5న స్వీటి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో అజయ్ చేసిన దారుణం వెలుగు చూసింది. ప్రసుత్తం అజయ్ వడోదర పోలీసులు కస్టడీలో ఉన్నాడు. -
మార్చి 5 లోగా రూ.5 లక్షలు ఇవ్వాలి.. లేదంటే
సాక్షి, హైదరాబాద్: విడాకులు తీసుకునే సమయంలో భార్యకు భరణంగా ఇస్తానన్న డబ్బు ఇవ్వని భర్తపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 5లోగా భరణంలో కొంత భాగం రూ.5 లక్షలు చెల్లించాలని లేకపోతే భర్తకు చెందిన ఆస్తులను వేలం వేయిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సూర్యాపేటకు చెందిన ఎ.లక్ష్మీతులసి, మహబూబ్‌నగర్ పట్టణంలోని షాషాబ్‌గుట్ట ప్రాంతానికి చెందిన ఎ.సురేందర్ భార్యాభర్తలు. వీరి మధ్య విభేదాలు రావడంతో 2006లో ఫ్యామిలీ కోర్టు వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ లక్ష్మీతులసి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ సమయంలో భార్యకు భరణంగా రూ.10 లక్షలు ఇస్తానని సురేందర్ పేర్కొన్నారు. 2006లో విడాకులు మంజూరైన సమయంలో తమకు ఏడాది, మూడేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారు పెద్దవాళ్లు అయ్యారని, ఈ నేపథ్యంలో భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ లక్ష్మీతులసి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. రూ.40 లక్షలు, తనకున్న భూమిలో కొంత భాగాన్ని పిల్లల పేరుతో రిజి స్ట్రేషన్ చేస్తానని గత విచారణ సమయంలో చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని లక్ష్మీతులసి ధర్మాసనానికి నివేదించారు. మహబూబ్‌నగర్ శివార్లలోని పాలకొండలో సురేందర్‌కు దాదాపు 7 ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం ఎకరా కోటి రూపాయల వరకు ధర పలుకుతోందని తెలిపారు. అలాగే వారసత్వంగా ఒక ఇంటిలో కొంత భాగం కూడా సురేందర్‌కు వచ్చిందని, ఇంత ఆస్తి ఉన్నా తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ భూముల విలువతోపాటు సురేందర్‌కు వచ్చే ఇంటి భాగం విలువ ఎంతుందో తెలుసుకొని తమకు నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్‌ను గత ఏడాది డిసెంబర్లో ఆదేశించింది. ఇటీవల ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. అయితే ఇప్పటికీ సురేందర్ డబ్బు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, మార్చి 5లోగా డబ్బు జమ చేయకపోతే ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరిస్తూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. చదవండి: 22 నుంచి హైకోర్టులో భౌతిక విచారణ నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు -
భరణంపై ఎన్నదగిన తీర్పు
భర్త నుంచి వేరుపడి విడిగా వుంటున్న భార్యకు మనోవర్తి చెల్లింపుపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. హింస కారణంగానో, వేధింపుల కారణంగానో దంపతులు కలిసివుండటం అసాధ్యమైనప్పుడు...వారి మధ్య ఇతరేతర కారణాలవల్ల విభేదాలు ఏర్పడినప్పుడు విడాకుల వరకూ పోవడం సర్వసాధారణం. కానీ విడాకుల తర్వాత కూడా మన దేశంలో మహిళలకు సమస్యలు తప్పడం లేదు. ఆర్థికంగా స్థోమతవుండి, తమంత తాము స్వతంత్రంగా జీవించగలిగినవారికి ఇబ్బంది వుండదు. కానీ నిరాధార మహిళలకు, ముఖ్యంగా పిల్లలను కూడా పోషించుకోవాల్సిన బాధ్యత వున్నవారికి రోజు గడవటం జీవన్మరణ సమస్య. ఇలా దిక్కూ మొక్కూ లేని మహిళల సంఖ్య గణనీయంగా వుంటోంది. తమకు న్యాయబద్ధంగా రావలసిన భరణం కోసం వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం, అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడటం తప్పడం లేదు. ఎప్పుడొస్తుందో...అసలు వస్తుందో రాదో తెలియని భరణం కోసం అప్పులు చేయడం, న్యాయవాదులను ఆశ్రయించడం ఒంటరి మహిళకు ప్రాణాంతకం. కూలీ పనులనో, చేస్తున్న చిరు ఉద్యోగాన్నో వదులుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అటు ఉపాధి దెబ్బతింటుంది, ఇటు చేతి చమురు వదులుతుంది. మన దేశంలో మనోవర్తి కేసు తేలడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతోందని ఒక అంచనా. పుట్టింటివారు సాయపడితే ఏమోగానీ...ఈలోగా పిల్లల్ని పెంచడం, వారిని ప్రయోజకుల్ని చేయడం ఎలాంటివారికైనా కష్టమే. పైగా తీర్పు వెలువరించే తేదీనుంచి మాత్రమే భరణం చెల్లింపు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నదగిన తీర్పునిచ్చింది. జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిల ధర్మాసనం న్యాయస్థానంలో మహిళ పిటిషన్ వేసిన తేదీనుంచే మనోవర్తి చెల్లింపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో మన న్యాయస్థానాలు ఒక్కోటి ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు చట్టాల్లోని అస్పష్టత కూడా ఒక కారణం. మనోవర్తి చెల్లింపునకు సంబంధించి ఒక చట్టమంటూ లేదు. హిందూ వివాహ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, గృహహింస చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఇవిగాక నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లోని సెక్షన్ 125 వగైరాల కింద భార్య మనోవర్తి కోరవచ్చు. భార్య దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి గానీ, లేదా న్యాయస్థానం చెల్లింపు కోసం ఆదేశాలిచ్చిన తేదీనుంచిగానీ మనోవర్తిని వర్తింపచేయొచ్చని సెక్షన్ 125 చెబుతోంది. మనోవర్తి కేసుల్ని పరిశీలించే న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఏమోగానీ...లేనిపక్షంలో తీర్పు వెలువరించిన తేదీనుంచే వర్తింపజేస్తాయి. వాస్తవానికి మనోవర్తి ఉద్దేశమే భర్త నుంచి విడివడిన భార్య మనుగడకు అవసరమైన మొత్తం అందుబాటులో వుండేలా చూడటం. తీర్పు వెలువరించిన తేదీనుంచి దాన్ని వర్తింపజేయడం ఆ ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. ఒక స్వచ్ఛంద సంస్థ నిరుడు ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సర్వే విడాకులు తీసుకుని వుంటున్న ఒంటరి మహిళల దుర్భర స్థితిగతులను వెల్లడించింది. 19 ఏళ్లక్రితం భర్తనుంచి విడిపోయిన ఒక మహిళకు అతగాడినుంచి ఒక్క పైసా కూడా భరణంగా రాలేదు. ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయింది. ఆమెకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన భరణం సంగతలావుంచి, కనీసం ఆమె తాలూకు వస్తువుల్ని కూడా అతని నుంచి ఎవరూ ఇప్పించలేక పోయారు. ఇన్నేళ్లుగా పిల్లల్ని సాకడం తనకు శక్తికి మించిన పనైందని ఆ మహిళ తెలిపింది. బందా న్యాయస్థానంలో ఆ మహిళ మాదిరే భరణం కోరుతూ దాఖలైన కేసులు 700కు పైగా వున్నాయంటే ఈ సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థమవుతుంది. భర్త హింసిస్తున్నప్పుడు, కనీసం మనిషిగా కూడా గుర్తించనప్పుడు ఆ దుర్భర పరిస్థితులను భరించలేక మహిళలు విడాకులు కోరుతారు. తీరా భరణం సాధించడం దానికదే హింసగా మారితే? వాస్తవానికి భరణం చెల్లించాలని తీర్పునిచ్చాక కూడా దాన్ని ఎగ్గొట్టడానికి చాలామంది చూస్తారు. తనకు ఇరవైయ్యేళ్లక్రితమే మనోవర్తి మంజూరైనా భర్త ఆచూకీ లేకుండా పోయాడని, ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించాకే దారికొచ్చాడని మరో మహిళ తెలిపింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు కూడా మహిళల నిస్సహాయ స్థితిని వెల్లడిస్తోంది. ఈ కేసులో మహిళ ఏడేళ్లనుంచి మనోవర్తి కోసం వివిధ కోర్టుల్లో పోరాడుతోంది. న్యాయస్థానం మంజూరు చేసిన తాత్కాలిక భరణాన్ని కూడా భర్త చెల్లించడం లేదు. ఇలాంటి కేసుల్లో సివిల్ కోర్టులు జారీ చేసే డిక్రీల పద్ధతిలో... అంటే ఆస్తుల్ని స్వాధీనపరుచుకోవడంలాంటి చర్యలతో ఒత్తిడి తేవొచ్చని, అవసరమైతే కోర్టు ధిక్కార నేరంకింద చర్య తీసుకోవచ్చని ఇచ్చిన ఆదేశం నిస్సహాయ మహిళలకు ఊరటనిస్తుంది. భరణం కోసం దరఖాస్తు చేసినప్పుడే తన ఆర్థిక పరిస్థితేమిటో, తనకున్న ఆదాయవనరులేమిటో భార్య చెప్పాలని... భర్త సైతం తన ఆస్తిపాస్తుల వివరాలివ్వాలని చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే మనోవర్తి కేసులో తీర్పు వెలువడేలోగా ఆస్తుల్ని అమ్ముకునే ప్రబుద్ధులుంటున్నారు. తమ దగ్గరేమీ లేదని బుకాయిస్తున్నారు. ముందే ఆ వివరాలు దాఖలు తప్పనిసరి చేస్తే ఇలాంటివారి ఆటకడుతుంది. సుప్రీంకోర్టు తీర్పులో మరో ముఖ్యాంశం వుంది. ఉన్నత విద్యావంతురాలై, ఉద్యోగం చేసే మహిళ కుటుంబం కోసం దాన్ని వదులుకుని, తర్వాత కాలంలో విడాకులు కోరవలసి వచ్చినప్పుడు అలాంటివారికి భరణం మంజూరు చేసినప్పుడు అందుకనుగుణంగా దాన్ని నిర్ణయించాలని ధర్మాసనం తెలిపింది. తాజా తీర్పు నిస్సహాయ మహిళల వెతల్ని తీర్చడంలో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. మనోవర్తి కేసుల్ని తేల్చడానికి నిర్దిష్ట గడువును కూడా విధించివుంటే మరింత బాగుండేది. -
భరణం అనగానే పేదలం అంటున్నారు
న్యూఢిల్లీ: వివాహ సంబంధ కేసులు పెండింగ్‌లో ఉండగా భార్యలు భరణం కోరితే భర్తలు.. దివాలా తీశామని, పేదరికంలో బతుకుతున్నామని చెబుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు కోరిన హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల బెంచ్ ఈ విధంగా స్పందించింది. భార్య భరణం కోరిందన్న కారణంతో ఉద్యోగం మానేయొద్దని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న భర్తకు సూచించింది. భార్యకు నెలకు రూ.15 వేల చొప్పున భరణం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ‘ఈరోజుల్లో నెలకు రూ.15 వేలతో పిల్లల బాగోగులు చూసుకోవడం సాధ్యమేనా? భార్యలు భరణం కోరిన వెంటనే.. తాము పేదరికంలో బతుకుతున్నామని, లేదా దివాలాతీశామని భర్తలు చెప్పడం సర్వసాధారణమైంది. మీ భార్య భరణం కోరిందని మీరు ఉద్యోగం మానేయొద్దు’ అని బెంచ్ భర్తకు సూచించింది. ఆ భరణం మొత్తం ఎక్కువని, హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయాలని భర్త తరఫు లాయర్ చేసిన వాదనల్ని తోసిపుచ్చింది. భర్త ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. తన భర్తకు నెలకు రూ.80 వేల వేతనంతో పాటు, ఇంటి అద్దె, వ్యయసాయ భూముల రూపంలో మరో 2 లక్షల ఆదాయం వస్తోందని పేర్కొన్న భార్య..నెలకు రూ.1.10 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. -
ప్రపంచ కుబేరుడి ‘విడాకుల ఖరీదు’ తెలిస్తే!
పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకున్నానంటూ అమెజాన్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ షాకింగ్ న్యూస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన కారణంగానే బెజోస్ తన భార్య నుంచి విడిపోతున్నారంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్ ప్రస్తుత సంపాదన 137 బిలియన్ డాలర్లని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా భరణం రూపంలో ఆయన.. తన భార్యకు సుమారు 60-70 బిలియన్ డాలర్లు(రూ. 42,38,10,00,00,000- నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లించనున్నారట. దీంతో బెజోస్ సంపద సగానికి తగ్గనుంది. ఈ క్రమంలో విడాకుల అనంతరం... ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలవనున్నారట. కాగా పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు. ఇక రచయిత్రి అయిన మెకెంజీ (48) న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా బెజోస్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే తన రచనలకు, మొదటి బెస్ట్ రీడర్ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు మెకంజీ బైస్టాండర్ రివల్యూషన్ (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. 1994లో ఆన్లైన్ బుక్సెల్లర్గా ఏర్పాటైన అమెజాన్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. ఇటీవలే అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే. జెఫ్ బెజోస్.. మెకాంజీకి చెల్లించనున్న భారీ భరణం నేపథ్యంలో మరికొంత మంది సెలబ్రిటీల విడాకుల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు, ఖరీదైనా విడాకుల గురించి మనం కూడా ఓసారి తెలుసుకుందాం. దిమిత్రి రైబోలోలెవ్- ఎలీనా రైబోలోలెవ్ బెజోస్ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు విడిపోయారు. ఈ క్రమంలో బిలియనీర్ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించారు. ఎలిక్ వైల్డిస్టీన్- జోక్లిన్ వైల్డిస్టీన్ ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్ 1999లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇందులో భాగంగా 3.8 బిలియన్ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు. రూపెర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్ మన్ అమెరికన్ మీడియా మెఘల్ రూపెర్ట్ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్ డాలర్లు భరణంగా ఇచ్చారు. బెర్నీ ఎలెస్టోన్- స్లావికా ఎలెస్టోన్ ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్ డాలర్లు. స్టీవ్ వీన్- ఎలైన్ వీన్ కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. స్టీవెన్ స్పీల్బర్గ్- ఎమీ ఇర్వింగ్ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు. -
నెలకు రూ. నాలుగు లక్షల భరణం
న్యూఢిల్లీ: భార్యనుంచి వేరుపడిన ఓ భర్తకు ఢిల్లీ కోర్టు దిమ్మతిరిగే షాక్ నిచ్చింది. వీరి కుమార్తె ఖర్చుల నిమిత్తం భార్యకు భరణంగా నెలకు రూ. నాలు గు లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు ప్రతియేటా ఈ మొత్తానికి 15 శాతం పెంచుతూ భరణం చెల్లించాలని కూడా అతడిని ఆదేశించింది. బిజినెస్ టర్నోవర్ రూ. వెయ్యికోట్లు ఉందంటూ ఓ బిజినెస్ మ్యాగజైన్‌లోని సూపర్‌రిచ్ కేటగిరీలో సదరు భర్త వార్తల్లోకి ఎక్కడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అతని రెండేళ్ల వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధించిన విషయాన్ని విస్మరించకూడదని అందుకే అతని మాజీ భార్య, కూతురు ఖర్చుల నిమిత్తం రూ. నాలుగు లక్షలే కాకుండా ప్రతియేటా 15శాతం పెంచుతూ ఉండాలని ప్రిన్సిపల్ జడ్జి నరోత్తమ్ కౌషల్ తీర్పునిచ్చారు. -
కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!
-
కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!
విజయవాడ: విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరి నుంచి ఈ కేసును విజయవాడ ఫ్యామిలీ కోర్టు విచారణ నడుస్తున్నప్పటికీ, ఎన్నడూ పృథ్వీరాజ్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మికి 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీరాజ్ కుటుంబం మొదట విజయవాడలో నివసించేంది. పృథ్వీరాజ్ కు సినిమాల్లో బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్ ఒకరు. ముఖ్యంగా ’ఖడ్గం’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో పృథ్వీరాజ్ లైమ్‌లైటులోకి వచ్చారు. ఇటీవలికాలంలో పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ.. మనసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇక ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, పృథ్వీరాజ్ ఆదాయ మార్గాలను పరిశీలించిన కోర్టు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది. -
సంపాదన స్థాయిని బట్టి మనోవర్తి: సుప్రీం
న్యూఢిల్లీ: విడాకులు పొందిన వారి స్థాయిని బట్టి మనోవర్తి నిర్ణయం ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టులు శాశ్వత మనోవర్తిని నిర్ణయించాలని సూచించింది. తన మొదటి భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని రూ. 16 వేల నుంచి రూ. 23 వేలకు కలకత్తా హైకోర్టు పెంచడాన్ని సవాలు చేస్తూ విడాకులు పొందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్ జీతం రూ. 63 వేల నుంచి రూ. 95 వేలకు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు భరణం పెంచిందని సుప్రీం కోర్టు గుర్తించింది. అయితే విడాకులు పొందిన వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. దీనిని దృష్టిలో పెట్టుకున్న కోర్టు భరణాన్ని రూ. 20 వేలకు తగ్గించింది. -
భార్య, భర్త మధ్యలో స్పేస్ టికెట్
లండన్: ఇంగ్లండ్‌లోని భారత సంతతికి చెందిన ఒక జంట విడాకుల వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడాకుల నేపథ్యంలో తనకు రావాల్సిన మొత్తాన్ని (భరణం) చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఠక్కర్ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నాడంటూ భార్య మీరా మానెక్ ఇంగ్లండ్‌లోని హైకోర్టును ఆశ్రయించింది. 2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. తన భర్త ఆశిష్ ఒక బిలియనీర్ అని, తన ఆస్తులను కేవలం 4,45,532 పౌండ్లుగా చెబుతున్నాడని వాస్తవానికి ఆయన దగ్గర భారీగా ఆస్తులున్నాయని మీరా వాదిస్తోంది. అయితే మారా గ్రూపు తన తల్లి, సోదరికి సంబంధించినదని దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశిష్ హైకోర్టుకు నివేదించాడు. దీంతో పాటు బ్రిటిష్ ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్స్ .. వర్జీనియా గలాక్టివ్ పేరుతో తొలి వాణిజ్య అంతరిక్ష విమానాన్ని ప్రకటించగానే తొలుత టికెట్ కొన్న అతి తక్కువ మందిలో ఠక్కర్ ఒకరని మీనా తెలిపింది. ఆ టికెట్ అసలు విలువ 1,60,000 పౌండ్లు అని ఇప్పుడు ఈ టికెట్లో కూడా తనకు వాటా కావాలని ఆమె పట్టుపడుతోంది. ఈ వ్యవహారంపై సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
భార్యకు పెద్దనోట్లతో భరణం, భర్తకు జైలు
కోల్‌కతా: విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యకు భరణం కింద రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను చెల్లించిన భర్త జైలుపాలయ్యాడు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. విడాకుల కోసం దరఖాస్తు చేయగా కోర్టులో కేసు నడుస్తోంది. మనోవర్తి కింద నెలకు 8 వేల రూపాయల చొప్పున భార్యకు చెల్లించాల్సిందిగా గతంలో కోర్టు ఆదేశించింది. కాగా నాలుగేళ్లుగా ఆయన భరణం చెల్లించలేదు. ఈ నెల నాటికి ఆయన మొత్తం 2.25 లక్షల రూపాయలు భార్యకు చెల్లించాల్సి వచ్చింది. భరణం చెల్లించకపోయిన విషయాన్ని ఆయన భార్య కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ మొత్తం నగదు ఆమెకు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రిటైర్డ్ ఇంజినీర్ తరపున ఆయన సోదరుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. సోదరుడి భార్యకు ఇవ్వాల్సిన భరణంలో రెండు లక్షల రూపాయలు కోర్టులో చెల్లించాడు. ఇవన్నీ 500, 1000 రూపాయల నోట్లు. అయితే రద్దయిన ఈ నోట్లను తీసుకునేందుకు రిటైర్డ్ ఇంజనీర్ భార్య తిరస్కరించింది. చట్టపరంగా చెల్లుబాటులో ఉన్న నోట్లను ఇవ్వాలని కోరింది. ఆమె వాదనకు జడ్జి కూడా అభ్యంతరం చెప్పలేదు. పెద్ద నోట్లను రద్దు చేసినా వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ తరఫు న్యాయవాది వాదించినా ఆమె అంగీకరించలేదు. చెక్, డీడీ రూపంలో ఇస్తామన్నా ఒప్పుకోలేదు. దీంతో గడువులోపల భరణం చెల్లించడంలో విఫలమైన రిటైర్డ్ ఇంజినీర్‌కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
విడాకుల కేసులో బాధితురాలికి రూ.15 లక్షల భరణం
మదనపల్లి క్రైం : ఇద్దరూ ఇష్టపడి విడాకులు తీసుకోవడానికి లోక్ అదాలత్‌కు వచ్చిన కేసులో న్యాయమూర్తులు ఆనంద్, జయరాజ్ యువతికి రూ.15 లక్షల భరణం ఇప్పించారు. గుర్రకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన వరపన సిద్దారెడ్డి కుమారుడు రవీంద్ర(25)కు అదే మండలం వెలిగల్లుకు చెందిన హరిత(20)తో ఐదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. ఇద్దరి మధ్య ఒద్దికలేకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శనివారం లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు దంపతుల సమ్మతి మేరకు విడాకులు మంజూరు చేశారు. బాధితురాలు హరితకు పరిహారంగా భరణం, కట్నం, బంగారు ఆభరణాలు, పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి రూ.15 లక్షలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మోహనరావు, ప్రదీప్‌కుమార్, ఏపీపీలు మాలతి, ఆవుల శివరాంరెడ్డి, న్యాయవాదులు అలకం మనోహర్ నాయుడు, చైతన్య, యసానుల్లా, ఆనంద్‌రెడ్డి, కోర్టు సిబ్బంది నాగమణి, మహిత తదితరులు పాల్గొన్నారు. -
భరణం ఎందుకు.. ఉద్యోగం చేసుకో!
చదువుకున్న భార్యకు కోర్టు సూచన కావాలంటే భర్త సాయం తీసుకోవచ్చని సలహా మాజీ భర్త మీద భారంగా మారొద్దని హితవు న్యూఢిల్లీ ''శుభ్రంగా చదువుకున్నావు.. విడాకులు తీసుకున్న తర్వాత భర్త మీద, అతడిచ్చే భరణం మీద ఆధారపడటం ఎందుకు, హాయిగా ఉద్యోగం చేసుకో. అంతేతప్ప మాజీ భర్తకు భారంగా మారొద్దు'' అని ఓ మహిళకు కోర్టు సలహా ఇచ్చింది. దాంతో ఎగిరి గంతేసిన సదరు భర్త.. ఆమెకు ఉద్యోగం వెతికి పెట్టడానికి సాయం చేస్తానని, ఆలోపు ఏడాది వరకు భరణం కూడా ఇస్తానని అంగీకరించాడు. దీంతో, ఆమకు నెలకు రూ. 12వేల చొప్పున భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన భర్త కంటే తానే ఎక్కువ చదువుకున్నట్లు భార్య కోర్టులో అంగీకరించింది. తనకు సంపాదించే సామర్థ్యం కూడా ఉందని తెలిపింది. అలాంటప్పుడు ఆమె ఏపీ పనిచేయకుండా కూర్చుని భర్త మీద ఆర్థికభారం మోపేందుకు వీల్లేదని జిల్లా జడ్జి రేఖారాణి అన్నారు. ఉద్యోగం వెతుక్కోడానికి భర్త సాయం కావాలంటే అతడికి ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ పంపుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే.. తాను బాగా చదువుకున్నా ఎప్పుడూ ఉద్యోగం చేయడం కాదు కదా.. కనీసం ఒంటరిగా ఎక్కడికీ ప్రయాణం కూడా చేయలేదని సదరు భార్య వాదించింది. అయితే ఆమె ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అని, తాను ఎంత చెప్పినా ఎప్పుడూ ఉద్యోగం చేయలేదని ఆ భర్త వాపోయాడు. ఉద్యోగాలు వెతుక్కోడానికి తనతో పాటు అతడు కూడా రావాలని భార్య కోరగా.. అసలు ఈ వాదన అసంబద్ధమని కోర్టు కొట్టేసింది. కోర్టుకు ఒంటరిగా రాగలిగినప్పుడు ఉద్యోగాలు వెతుక్కోడానికి ఎందుకు ఒంటరిగా వెళ్లలేదని జడ్జి రేఖారాణి ప్రశ్నించారు. చివరకు ఆమెకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ. 12 వేల చొప్పున చెల్లించాలని, వీలైనంత త్వరగా ఆమెతో ఉద్యోగం చేయించేలా చూడాలని జడ్జి తెలిపారు. -
నా భర్త మరొకామెతో.....
మైనర్ ఆడపిల్లల కష్టడీ తల్లికే! లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయి నాలుగేళ్లయింది. పిల్లలు లేరన్న అసంతృప్తి తప్ప మరే లోటూ లేదు. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మాది. ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. కొందరు స్నేహితుల సహవాసం వల్ల ఆయనకు నైట్‌పార్టీలు ఎక్కువయ్యాయి. మొదట్లో లైట్‌గా డ్రింక్ చేసేవారు. రానురాను క్లబ్‌లకు, పబ్‌లకు వెళ్లడం ఎక్కువైంది. తాగుడు కాస్తా వ్యసనంగా మారింది. డ్రగ్స్‌కి కూడా బానిసయ్యారు. కోపం పట్టలేక నిలదీశాను. ఛడామడా తిట్టేశాను. విషయం ఎలాగూ తెలిసిపోయింది కదా అని ఆయన ప్రవర్తన మరింత భయానకంగా మారింది. తాను ఏమి చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఒకరోజు గొంతు పిసకబోయారు. సమయానికి ఎవరో రాబట్టి సరిపోయింది కానీ... లేకుంటే ఏమయి ఉండేదో..? డీ అడిక్షన్ సెంటర్‌కు కానీ, హాస్పిటల్‌కు గానీ తీసుకు వెళ్దామని ప్రయత్నించాను కానీ, ఆయన వినడం లేదు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. ఆయనను బాగు చేసుకోవాలని ఉంది. దయచేసి కేసులు వేయమని సలహా ఇవ్వకండి. చికిత్స చేయించే మార్గం ఏమైనా ఉంటే సూచించండి. - బిందు శ్రీ, కోదాడ మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. భయపడకండి. అతనిని చికిత్సకు పంపే మార్గం ఉంది. కానీ కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. అంటే కేవలం ఒకటి రెండుసార్లు వెళ్తే సరిపోతుంది. మీరు మానసిక ఆరోగ్య చట్టం 1987ను అనుసరించి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, రిసెప్షన్ ఆర్డర్ పొందాలి. అంటే మత్తుపదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, అస్వస్థుడై మానసిక ప్రవర్తన మారిపోయిన వ్యక్తులను మానసిక రోగుల చికిత్సాలయంలో నిర్బంధించి, చికిత్స ఇవ్వమని ఇచ్చే ఆర్డర్. ఈ ఆర్డర్ మేరకు బలవంతంగా చికిత్సకు పంపవలసిందిగా మీరు రిసెప్షన్ పొందండి. అప్పుడు పోలీసులు మీ వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ గారు రోగిని వైద్యపరీక్షకు పంపి, అతని మానసిక స్థితిని బట్టి అతని సంక్షేమాన్ని, మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని మానసిక రోగుల చికిత్సాలయానికి గానీ వైద్యశాలకు గానీ తరలించమని ఆర్డర్స్ జారీ చేస్తారు. మీ వారు తప్పకుండా ఆరోగ్యవంతులవుతారు. మా పెళ్లయి పదిహేనేళ్లయింది. మాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వోద్యోగి అయిన నా భర్త మరొకామెతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో భరించలేక పిల్లలను తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం పుట్టింటికొచ్చాను. చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్లని పోషించుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల చదువులు తదితర ఖర్చులు భరించడం నా వల్ల కావడం లేదు. ఆయన దగ్గర నుంచి ఇంతవరకూ రూపాయి కూడా నాకు భరణం అందలేదు. ఇప్పుడు నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా? - బి. నాగమణి, ఏలూరు మీరు మీ పరిస్థితినంతా వివరిస్తూ, మీ ఆయన నుంచి భరణం ఇప్పించవలసిందిగా కోర్టువారిని కోరుతూ 125 సిఆర్పీసీ కింద అర్జీ పెట్టుకోండి. వీలయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన శాలరీ స్లిప్‌ను కూడా జతచేయండి. కుదరకపోతే సంబంధిత డిపార్టుమెంట్ వారిని సాక్షులుగా పిలవండి. కోర్టు వారు ఆయన సంపాదన సామర్థ్యాన్ని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద న్యాయబద్ధంగా రావలసిన మొత్తాన్ని ప్రతినెలా ఆయన జీతం నుంచి నేరుగా మీకే అందేలా ఏర్పాటు చేస్తారు. మా పెళ్లయి పదేళ్లయింది. మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. దాంతో నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. నా ఇద్దరు ఆడపిల్లలూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కష్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల కష్టడీ ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి? - కుమారి, విశాఖపట్నం మీరింకా లీగల్‌గా డైవోర్స్ తీసుకోలేదు. చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మీ పిల్లలు మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. సాధారణంగా ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి కష్టడీ మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అంగీకరించక తప్పదు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ పని చేసే మహిళలకు అండ... లైంగిక వేధింపుల చట్టం కేస్ స్టడీ సుజాత ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. ఉద్యోగరీత్యా భర్త విదేశాలలో ఉంటాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల వర్కర్‌గా, హుందాగా ఉండే మహిళగా సుజాతకి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో నిక్కచ్చి. ఎవరికి ఏ కష్టమొచ్చినా, స్పందించే ఆమెను అందరూ గౌరవించి, అభిమానిస్తారు. ఇంతలో కొత్తగా వచ్చిన ఆఫీసర్‌తో సమస్య మొదలైంది సుజాతకి. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి సుజాతపై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే సుజాతని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా సుజాతని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన సుజాత అతనితో అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది. ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ సుజాతని ఎంతో కృంగదీశాయి. ‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి గతంలో ఇక్కడ పని చేసి వేరే చోటికి బదిలీ అయిన తన పై అధికారి రెండు మూడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ విషయం గుర్తొచ్చి కొంత రిలీఫ్ కలిగింది. ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది సుజాత. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు. దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ సుజాతకి క్షమాపణ పత్రం రాసి ఇచ్చి, తనే ఓ మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు. పని చేసే చోట లైంగిక వేధింపుల గురించిన అవగాహన ఉండబట్టి సుజాత తన సమస్యను ధైర్యంగా పరిష్కరించుకోగలిగింది. -
మ్యారేజ్ కౌన్సెలింగ్
కలిసి ఉంటే కలదు సుఖం. మరి కలసి ఉండలేకపోతే? కష్టం తప్పదా? కష్టమే. కానీ ఏ కష్టమూ కూడా... కలిసి ‘ఉండాల్సివచ్చినంత’ కష్టం కాదు. అలాగని విడిపోయాక అంతా సుఖమేం కాదు.. విడిపోయాకా కొన్ని కష్టాలుంటాయి. ఆ కష్టాలను ఎలాగో నెగ్గుకొచ్చినా... డబ్బు కష్టం మాత్రం గట్టెక్కలేనిదిగా అనిపిస్తుంది. అలాంటి వారికి భరోసాగా చట్టం ఉంది. భరణం ఇప్పిస్తుంది. భరణం భార్య రైట్. భర్త గారి బాధ్యత. ప్రశ్న - జవాబు మా పెళ్లయి పదిహేనేళ్లయింది. మాకు ముగ్గురు పిల్లలు కలిగాక ప్రభుత్వోద్యోగి అయిన నా భర్త మరొకామెతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. అది భరించలేక పిల్లలను తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం పుట్టింటికొచ్చాను. చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్లని పోషించుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల చదువులు తదితర ఖర్చులు భరించడం నా వల్ల కావడం లేదు. మా పుట్టింటివారికి కూడా అంత ఖర్చులు భరించే స్థోమత లేదు. ఆయన దగ్గర నుంచి ఇంతవరకూ రూపాయి కూడా నాకు భరణం అందలేదు. ఇప్పుడు నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా? - నిరుపమ, నెల్లూరు మీ పరిస్థితి అర్థమైంది. ఉన్నతోద్యోగంలో ఉండీ మీ భర్త అలా చేయడం చాలా తప్పు. మీరు మీ పరిస్థితినంతా వివరిస్తూ, మీ ఆయన నుంచి భరణం ఇప్పించవలసిందిగా కోర్టువారిని కోరుతూ 125 సిఆర్పీసీ కింద అర్జీ పెట్టుకోండి. వీలయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన శాలరీ స్లిప్‌ను కూడా జతచేయండి. కుదరకపోతే సంబంధిత డిపార్టుమెంట్ వారిని సాక్షులుగా పిలవండి. కోర్టు వారు ఆయన సంపాదన సామర్థ్యాన్ని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద న్యాయబద్ధంగా రావలసిన మొత్తాన్ని ప్రతినెలా ఆయన జీతం నుంచి నేరుగా మీకే అందేలా ఏర్పాటు చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నేర్పుగా వ్యవహరిస్తే, ఇంత వరకూ మీరు మీకోసం, మీ పిల్లల పోషణ కోసం పెట్టిన ఖర్చులు కూడా ఆయన నుంచి రాబట్టుకోవచ్చు. మాకు వివాహమై తొమ్మిది సంవత్సరాలయింది. మేమిద్దరం ఓ ఏడాదిపాటు కలిసి అన్యోన్యంగా జీవించాము. తర్వాత మా అత్తమామలు మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల మా ఇద్దరికీ చీటికిమాటికీ బాగా గొడవలు అయ్యేవి. వాళ్లు నన్ను అదనపు కట్నం కోసం సూటీపోటీ మాటలనేవారు. తన వాళ్లని సంతృప్తి పరచడం కోసం మొదట మా వారు మాటలతో వేధించేవారు. తర్వాత్తర్వాత నాపై చేయి చేసుకోవడం, హింసించడం వరకూ వెళ్లింది. రెండేళ్ల క్రితం ఓ రోజు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించి, నన్ను, నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనుంచి వెళ్లగొట్టేశారు. గత్యంతరం లేక నా ఇద్దరు పిల్లల్నీ తీసుకుని పుట్టింటికి చేరాను. నాన్న రిటైరై చాలా కాలం అయింది. పెళ్లి కావాల్సిన ఇద్దరు పిల్లల బాధ్యత ఇంకా ఆయన మీద ఉంది. దానికి తోడు నా భారం, నా పిల్లల భారం కూడా ఆయన మీద పడింది. ఇదిలా ఉండగా తనకు విడాకులు కావాలని కోరుతూ కోర్టులో కేసు వేసినట్లు సమన్లు పంపించారు. అయితే మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నాకు భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదు. కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేయాలి? నా పిల్లల పోషణ ఎలా? - అనురాధ, వరంగల్ మీ వారు విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారంటున్నారు. పైగా అది మీకిష్టం లేదంటున్నారు. సరైన సాక్ష్యాధారాలు చూపకుండా విడాకులు మంజూరు కావు. కాబట్టి మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కంజూగల్ రైట్స్ (వివాహ హక్కుల పునరుద్ధరణ కోసం) కేసు వేయండి. అప్పుడు కోర్టు వారు మీ భర్త వేసిన విడాకుల కేసు, మీరు వేసిన రెస్టిట్యూషన్ కేసు రెండూ కలిపి విచారిస్తారు. మీ పిల్లల పోషణ, మీ పోషణ కోసం మీరు కోర్టులో 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. మీ వారు ప్రభుత్వోద్యోగి అంటున్నారు కాబట్టి ఆయన ఆర్జిన శ క్తిని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది. దిగులు పడకండి. మీ సంసారం చక్కదిద్దడానికి మీ తలిదండ్రులు, మీ తరఫున ఇతర పెద్దమనుషులను తీసుకుని మీ వారి దగ్గరకు వెళ్లి ఒకసారి మాట్లాడి చూడమనండి. కోర్టులో భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి మీ వారు మనసు మార్చుకుని మీతో కాపురం చేయవచ్చునేమో ప్రయత్నించి చూడండి. ఒకవేళ హెరాస్మెంట్ తట్టుకోలేన నుకుంటే 498 ఎ కింద కేసు ఫైల్ చేయవచ్చు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు డిగ్రీ చదివానంటున్నారు కాబట్టి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా మీకు చేతనైన ఏదో ఒక పని చేయడం ప్రారంభించండి. బెస్టాఫ్ లక్. నేను జీవితంలో కష్టపడి పైకొచ్చాను. రాత్రిపూట పని చేస్తూ, పగలు చదువుకుంటూ, మంచి ఉద్యోగం సంపాదించి ఒక పేదింటి పిల్లను పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఉన్నంతలో ఆమెను బాగా చూసుకుంటున్నాను. ఒకరోజున బాగా తలనొప్పి రావడంతో ఆఫీసు నుంచి ముందే వచ్చేశాను. ఆ సమయంలో నా భార్యను మా బెడ్రూమ్లో నా చిన్ననాటి స్నేహితునితో చూడకూడని పరిస్థితుల్లో చూశాను. నాతోపాటు మా హౌస్ ఓనర్, నా ఫైల్స్ లోపల పెట్టేందుకు వచ్చిన నా కార్ డ్రైవర్ కూడా ఆ దృశ్యాన్ని చూశారు. దాంతో నా మనసు విరిగిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టింది. బతకాలనిపించడం లేదు. -దుష్యంత్, అహమ్మదాబాద్ ముందు మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఎంతో కష్టపడి మిమ్మల్ని మీరు నిరూపించుకుని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మీరు, మీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్ల ఆత్మహత్య లాంటి హీనమైన ఆలోచనలు చేయవద్దు. ఎంతో విలువైన మీ జీవితాన్ని అర్ధంతరంగా అంతం చేసుకోవాలనుకుంటున్న మీ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోండి. వెంటనే మీరు అడల్ట్రీ/క్రుయెల్టీ గ్రౌండ్ కింద డైవోర్స్ కేస్ కౌంటర్ ఫైల్ చేయండి. మీ భార్య చేసిన పనికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయంటున్నారు కాబట్టి మీకు వెంటనే విడాకులు మంజూరు అయే అవకాశం ఉంది. విడాకులు తీసుకున్నాక మీకిష్టమైన రీతిలో జీవించవచ్చు. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
వచ్చేదాంట్లో పోతే ఎలా!
భరణం భరణం అడిగేటపుడు నెలనెలా కొంత అడిగేకన్నా మొత్తం ఒకేసారి ఇవ్వమనటం మంచిది. ఎందుకంటే నెలనెలకూ వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు కనక దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లంటే నూరేళ్ల పంట!! పాట వరకూ ఓకే. కానీ ఇది అందరికీ వర్తిస్తుందనుకోలేం. మన దేశంలో ప్రతి వెయ్యిలో 15 పెళ్లిళ్లు విడాకులతో ముగుస్తున్నాయి. స్వీడన్, అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం బాగా ‘వెనకబడినట్టే’. కానీ ఇది సంతోషించాల్సిన వెనకబాటు. ఈ సంతోషాన్నిలా ఉంచితే, అత్యధిక శాతం విడాకుల కేసులలో భరణం దగ్గరే గొడవ మొదల వడం మనం గమనిస్తున్నాం. 90 శాతం విడాకుల కేసుల్లో పరస్పర అంగీకారం ఉండదని, భరణం కోసం పోరాటం తప్పదని చెబుతారు బాలీవుడ్లో ఎందరో సెలబ్రిటీల విడాకుల్ని హ్యాండిల్ చేసిన న్యాయవాది మృణాళినీ దేశ్‌ముఖ్. విడాకుల కేసులు చూసే న్యాయవాది వందనా షా అయితే తన సొంత అనుభవాన్ని రంగరించి... ‘‘విడాకులు కోరుకునే మహిళలు ఆర్థిక వ్యవహారాల్ని మొదట గాడిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు భర్తతో కలిసి బ్యాంకు ఖాతా ఉంటే దాన్ని విడదీసుకోవాలి. నగలు లాకర్లో ఉంటే వాటిని తను తీయగలిగేట్టు చూడాలి. వీటన్నిటి తరవాతే విడాకుల గురించి ఆలోచించాలి’’ అని హెచ్చరిస్తుంటారు. 14 ఏళ్ల కిందట ఆమె భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. అప్పుడు చేతిలో రూ.750 మాత్రమే ఉన్నాయి. పెళ్లికి ముందే తల్లిదండ్రులు చనిపోవటంతో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీని పరిస్థితి. చివరికి తన పనిమనిషి ఇంట్లోనే తలదాచుకుందామె. విడాకుల విచారణలో... తనకు పెళ్లి సమయంలో వచ్చిన దుస్తులు, బహుమతులు ఇచ్చేస్తే చాలంది. అయినా కేసు పదేళ్లు సాగింది. చివరికి విచారణకు హాజరవుతూనే ‘లా’ చదివిందామె. ఇపుడు వందన తనలాంటి మహిళల తరఫున వాదిస్తూ వారికి న్యాయం చేయటానికి ప్రయత్నిస్తోంది. మగవాళ్లకూ భరణం! చాలా కేసుల్లో.. భర్త జీతంలో పన్ను చెల్లించదగ్గ ఆదాయంలో 25 నుంచి 35 శాతం భరణంగా ఇస్తారు. అయితే వ్యాపారాలు నిర్వహించే వారి విషయంలో ట్యాక్సబుల్ ఇన్కమ్ అనే సూత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోదు. అదే విధంగా సదరు మహిళ పనిచేస్తున్నా సరే... ఆమె గౌరవంగా బతకడానికి భరణం అవసరమని కోర్టు భావిస్తే మంజూరు చేస్తుంది. సహజంగా భరణం అడిగేది మహిళలే అయినా... హిందూ, పార్శీ చట్టాలు మగవాళ్లకూ భరణం అడిగే అవకాశం కల్పిస్తున్నాయి. విడిపోవడం తప్పదనుకున్నప్పుడు... విడిపోదామనుకున్న మహిళలు తమ వాదనకు తగ్గ ఆధారాలు ముందు సంపాదించాలి. భర్త వేరొకరితో ఉంటున్నారని ఆరోపిస్తే దానికి తగ్గ ఆధారాలు పెట్టుకోవాలి.భరణం అడిగేటపుడు నెలనెలా కొంత అడిగేకన్నా మొత్తం ఒకేసారి ఇవ్వమనటం మంచిది. ఎందుకంటే నెలనెలకూ వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు కనక దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు ఒకేసారి తీసుకునే మొత్తం క్యాపిటల్ రిసీట్ కిందికి వస్తుంది. కాబట్టి దీనిపై ఎలాంటి పన్నూ ఉండదు. అయితే స్థిరాస్థులను ఒకేసారి బదలాయింపు చేసినా పన్ను వర్తిస్తుంది. ఖర్చులు పెరిగి భరణం సరిపోని పక్షంలో ఎక్కువ అడగాలంటే మరో పిటిషన్ వేయాలి. అందుకే ఒకేసారి మొత్తం తీసుకోవటం ఉత్తమం.ఇల్లు, భూముల వంటి స్థిరాస్థుల విషయంలో అది ఎవరిపేరిట ఉందో వారికే లీగల్‌గా హక్కుంటుంది. కాకపోతే అది కొనటానికి డబ్బు తానే పెట్టానని, కనక అవతలి వ్యక్తి నిరూపిస్తే ఆ వ్యక్తికీ చెందుతుంది. అందుకే ఆస్తిని అమ్మేసి ఇద్దరూ పంచుకోవటమనేది ఉత్తమ మార్గం. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేవారు కనక విడిపోదామనుకున్న పక్షంలో మహిళకు భరణం అడిగే హక్కుండదనే ఇటీవలి తీర్పులు చెబుతున్నాయి. వారికి పిల్లలున్నా సరే.. వివాహం కాదు కనక భరణం మంజూరు చేయలేమని కోర్టులు చెబుతున్నాయి. -
సుజానే 400 కోట్లు అడగలేదు
విడాకుల సమయంలో తనకు 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ సుజానే డిమాండ్ చేసిందని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని, అవన్నీ కట్టుకథలని హృతిక్ రోషన్ కొట్టిపారేశాడు. ఈ కథనాలపై తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెళ్లగక్కాడు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మీడియాలో హృతిక్ - సుజానేల విడాకుల విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, సుజానే అంటే ఇప్పటికీ తనకెంతో ప్రేమ అని హృతిక్ అంటున్నాడు. పదమూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్లు ఇటీవలే విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ విడాకుల విషయంలో, ఆమె భరణం కోరినట్లు వస్తున్నవన్నీ కట్టు కథలని, తన ఇష్టసఖిని బద్నాం చేస్తున్నారని అన్నాడు. తన సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డాడు. Fabricated news articles. Demeaning my loved ones. Testing my patience — Hrithik Roshan (@iHrithik) July 30, 2014 -
హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ ట్రైలర్ కు వచ్చిన సానుకూల స్పందన ద్వారా వచ్చిన ఆనందం మాటుమాయమైంది. హృతిక్ ను మనోవర్తి కింద 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ లో పరస్పర అంగీకారంతో హృతిక్, సుజానేలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తుది తీర్పు అక్టోబర్ 31 తేదిన వెలువడనుంది. ఇప్పటికే హృతిక్ దంపతులకు జన్మించిన హ్రిహాన్, హ్రేదాన్ లను సుజానేలకు అప్పగించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా తమ పిల్లలతో హృతిక్ దంపతులు కలిసి కనిపించారు. ఇటీవల కాలంలో సుజానే కుటుంబ సభ్యులతో హృతిక్ కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. పిల్లల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను, విభేదాలను పక్కన పెట్టాలని హృతిక్, సుజానేలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.