American Indians
-
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు. -
విద్యార్థిని దివ్యకు కన్నీటి వీడ్కోలు
విజయవాడరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి గత నెల 29వ తేదీన గుండెనొప్పితో హఠాన్మరణం చెందిన అవుతు దివ్య మృతదేహం శనివారం రాత్రి కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ నుంచి ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం నున్న తీసుకొచ్చి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తుందనుకున్న దివ్యను విగతజీవిలా చూడాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు అవుతు సురేంద్రరెడ్డి, స్వప్న, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దివ్యతోపాటు చదువుకున్న విద్యార్థినులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లగా గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉప సర్పంచ్ కలకోటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోలారెడ్డి చంద్రారెడ్డి, బుజ్జి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సోదరుడు సతీష్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడు మృతి
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం (ఆగస్టు 27) న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
భార్యాభర్తల చీటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్‌కు చెందిన చాట్ల సంజీవ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంజీవ్ కుమారుడికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్‌ను నమ్మించారు. అమెరికాలోని వైట్ హౌస్‌లో పనిచేసే సుమంత్ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్‌కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు. అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లి సుమంత్‌ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్‌కు చెక్కేశారు. కొత్త సిమ్ కార్డును తీసుకొని యూఎస్‌లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్ చాట్‌లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్ పత్రాలను సృష్టించి, సంజీవ్‌కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
దేవరపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే సాయిసూర్య అవినాష్ (26) సోమవారం వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, 2023 జనవరిలో ఆమె సోదరుడు సాయి సూర్య అవినాష్ ఉన్నత చదువు (ఎంఎస్)కు అమెరికా వెళ్లాడు. అక్క ఇంటి వద్ద ఉంటూ ఉన్నత చదువుకుంటున్నాడు. ఆదివారం అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలూ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లాయి. అక్కడ సాయిసూర్య అవినాష్ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) మెగా కన్వెన్షన్ సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో మే 24 నుంచి 3 రోజులపాటు మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభలో భాగంగా వైఎస్సార్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సభలకు వైఎస్సార్సీపీ నేతలు, రాజన్న అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.వైఎస్సార్ ప్రజలందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు.పొలిటికల్ సెషన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ వైఎస్సార్ అభిమానులు. సీఎం జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసంగాల మధ్యలో జోహార్ వైయస్ఆర్ నినాదాలతో, హొరెత్తించారు. -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
అమెరికాలో భూకంపం!
న్యూయార్క్: యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. అమెరికాలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభించింది. పొరుగున ఉన్న న్యూజెర్సీ సైతం భూకంపం భారీన పడిందని పలు వెలుగులోకి రాగా..భూకంపం ప్రభావం ఏ మేరకు చూపందనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని భవనాలు కంపించాయని ఏఎఫ్‌పీ మీడియా ప్రతినిధి నివేదించారు. భూకంపం వచ్చిన సమయంలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తుంది. ప్రకంపనలతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. Notable quake, preliminary info: M 4.8 - 7 km N of Whitehouse Station, New Jersey https://t.co/DuTYZ1kb4X — USGS Earthquakes (@USGS_Quakes) April 5, 2024 ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్ వరకు తూర్పు వైపు లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించినట్లు నెటిజన్లు ట్వీట్లు,పోస్ట్‌లు పెడుతున్నారు. #WATCH : Streamer captures moment earthquake hit New Jersey and felt in New York City#NewYorkCity #NewYork #earthquake #JUSTIN #LatestNews #USNews #USA #NewJersey pic.twitter.com/spo8RcHI17 — upuknews (@upuknews1) April 5, 2024 https://t.co/pf77R31SX6 — SkyQueen (@Triquetra331) April 5, 2024 -
US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!
రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్‌లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్‌లు సందర్శకులతో రౌండ్ ట్రిప్‌లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర. ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది. మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్‌కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్, వీసా వగైరా చెకింగ్లు చేశారు. అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్‌లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం. అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్‌లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్‌కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ ! వేముల ప్రభాకర్ (చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!) -
హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు!
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు. దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
అమెరికాలో కాజీపేట విద్యార్థి దుర్మరణం
కాజీపేట: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూని వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నాడు. ఈనెల 9న మిత్రులతో కలిసి వెస్ట్ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడు తుండగా, వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్‌కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్‌పోర్ట్ టౌన్‌కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..
అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వారి కోసం మరో కొత్త సంస్థ పురుడుపోసుకొంది. ‘గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా- గ్రాడా’ పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవల జరిగిన ‘గ్రాడా’ గ్రాండ్ లాంచ్‌లో రాయలసీమ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టారు. నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు సంస్థ చేపడుతుందని నిర్వహకులు తెలిపారు. ‘గ్రాడా’ అసోసియేషన్ గురించి వివరించారు. ఇన్స్పిరేషన్, ఇంటరాక్షన్ , ఇన్‌క్లూజన్ అనే మూడు ఫండమెంటల్స్‌పై ‘గ్రాడా’ పనిచేస్తుందని తెలిపారు. అలాగే సంస్థ తరుపున చేపట్టే కార్యక్రమాలను వివరించారు. -
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన. కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థి.. స్వగ్రామం చేరిన మృతదేహం
పార్వతీపురం మన్యం: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన పాలకొండకు చెందిన ఓ విద్యార్థి విగతజీవిగా సొంతూరుకు శనివారం చేరాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పాలకొండ శోకసంద్రమైంది. చదువే లోకంగా జీవించిన ఆ విద్యార్థి కలలు కల్లలయ్యాయి. తమ బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... పాలకొండలోని బట్టి మఠం కాలనీలో రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాకోటి సాయినికేష్(21), కుమార్తె లేఖ ఉన్నారు. సాయినికేష్ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం గత నెల డిసెంబర్ ఆఖరులో అమెరికా వెళ్లాడు. హర్ట్‌పోర్టు సిటీలో సీక్రెడ్ యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ ఎంఎస్‌లో చేరాడు. అమెరికా వెళ్లిన 15 రోజుల్లోనే ఈ నెల 12న శుక్రవారం తాను ఉంటున్న గదిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సాయినికేష్‌తో పాటు అదే గదిలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన మరో తెలుగు విద్యార్థి కూడా మృతి చెందాడు. విష వాయువు పీల్చడంతోనే వీరిద్దరు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం సాయినికేష్ మృతదేహం ఇక్కడకు రాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ మృతికి పూర్తి కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయినికేష్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో పాలకొండ పట్టణంలో విషాదం అలముకుంది. -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి