AP Assembly Budget Session 2023
-
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది పార్టీ. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో గురువారం కీలక సమావేశం నిర్శహించారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి నియోజవర్గం నుంచి ఆయుదు ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని అయిదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని చెప్పారు. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారని తెలిపారు. ఇది ఒకరకంగా ఎన్నికల శంఖారావం అనుకోవచ్చన్నారు. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా మీటింగులు జరగనున్నాయని బొత్స పేర్కొన్నారు. ‘ఎవరికి ఎమ్మెల్యే..ఎవరికి ఎంపి టికెట్ ఇవ్వాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఈ పార్టీ వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. టికెట్లు ఇవ్వలేదన్న భావం మా నేతల్లో లేదు. కేశినేని నాని ఎందుకు పార్టీ నుంచి వెళ్లి పోయారు. అసలైన ఓటర్లు వుండేలా చూసే భాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఏపీతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మాకు ముఖ్యం. విశాఖలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే. రుషికొండలో ఐటీ సెజ్...అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీలు వైఎస్సార్ హయాంలో వచ్చినవే. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర విశాఖలో ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా చెప్పండి. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ పనులు రద్దు చేయించారు. ‘సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యర్థనపై ఇచ్చాం. పురందేశ్వరి మాట్లాడే ముందు ఆలోచించు. 22వ తేదీన సెలవు కావాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టొచ్చు. ప్రభుత్వం పరిశీలిస్తుంది. విశాఖలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలే. ఆ ప్రాజెక్టుల గురించి ఆ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. చదవండి: గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్ -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
అది దొంగల రాజ్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఇది మనం చెబుతోంది కాదు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో బట్టబయలైన అవినీతి బాగోతం. ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించిన వాస్తవం’ అని వెల్లడించారు. ‘అమరావతిలో భవన నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తే ఈ అవినీతి బండారం బయట పడింది. అందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అమరావతి నిర్మాణాల విషయంలో చంద్రబాబు అవినీతిపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన అంశంపై శాసనసభలో శుక్రవారం నిర్వహించిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ‘చంద్రబాబు తమను బెదిరించడంతోనే ఆయన చెప్పిన బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. మరో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి తామే నిధులు వసూలు చేసి, చంద్రబాబుకు అందించామని వెల్లడించార’ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిధులను కొల్లగొట్టిన తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇలా వివరించారు. ఐటీ దాడులతో వెలుగులోకి.. ► మొట్టమొదటగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ మొత్తం సమాచారం లభించింది. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో సోదాలు చేశారు. దాంతో మరింత సమాచారం లభించింది. ► ఆదాయ పన్ను శాఖ పరిశోధన విభాగం ఆ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఆదాయ పన్ను అప్రైజల్ రిపోర్ట్‌ను తయారు చేసింది. తాము నిర్వహించిన దాడుల్లో లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. తాము సేకరించిన ఆధారాలను ఆ వ్యక్తులకు చూపించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారు. చంద్రబాబు అవినీతి బాగోతం ఇలా.. ► అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. అందుకోసం పక్కాగా స్కెచ్ వేశారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాఫూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు. ► షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్‌ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్‌కు శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్‌తో చెప్పారు. ► దాంతో వినయ్ నంగల్లా హయగ్రీవమ్, అన్నై షలాఖా అనే కంపెనీలను మనోజ్‌కు అటాచ్ చేశారు. విక్కీ జైన్.. నయోలిన్, ఎవరెట్ అనే రెండు కంపెనీలను అటాచ్ చేశారు. మనోజ్‌కు వాళ్లెవరో కూడా తెలియదు. తాము ఇలా డబ్బులు ఇవ్వలేమని, కావాలంటే పార్టీకి ఫండ్ ఇస్తామని షాపూర్జీ పల్లోంజీ కంపెనీ చెప్పింది. తాము చెప్పినట్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనోజ్‌ను శ్రీనివాస్ బెదిరించారు. ఆ విషయాన్ని మనోజ్ ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వెల్లడించారు. ఆ వాంగ్మూలం కాపీలు కూడా ఉన్నాయి. ► ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్ బలోటాలకు అప్పగించారు. ఇదీ ఈ మోడస్ ఆఫ్ ఆపరెండీ. ఐటీ అధికారులు ఈ సమాచారాన్ని అంతా ఆ కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్ రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్ అంగీకరించి సంతకాలు కూడా చేశారు. ► శ్రీనివాస్‌తోపాటు రఘు, మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. ► చంద్రబాబుకు దుబాయిలో కూడా రూ.15.14 కోట్లను దినార్ల రూపంలో క్యాష్‌గా ఇచ్చినట్టు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో మనోజ్ అంగీకరించారు. దాంతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయి. ఆ కుంభకోణంలో చంద్రబాబుకు డబ్బులు చేర్చిన యోగేశ్ గుప్తానే ఈ వ్యవహారంలో కూడా ఉన్నారు. కోట్ల మళ్లింపునకు కోడ్ భాష ► ఆర్వీఆర్ రఘు వాట్సాప్ చాట్లను ఐటీ అధికారులు పరిశీలించగా.. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మనోజ్ వాసుదేవ్ సన్నిహితుడు యోగేశ్ గుప్తా నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో నిధుల మళ్లింపులో కూడా యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో ఆయనదే ప్రధాన భూమిక. ► ఈ అక్రమ లావాదేవీలను మనోజ్ కోడ్ భాషలో తన ఈ–మెయిల్ ఐడీకే మెయిల్ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించిన గుట్టును ఐటీ అధికారులు ఛేదించారు. ఇది రూ.2 వేల కోట్ల దోపిడీ ► ఐటీ అధికారులు విశాఖపట్నం, విజయవాడ, కడప, ఢిల్లీ, పూణేల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌తోపాటు మరికొందరిపై జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.రెండు వేల కోట్లు దొరికినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 2020 ఫిబ్రవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. 40 చోట్ల జరిపిన తనిఖీల్లో బోగస్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు, ఇన్వాయిసులు, బిల్లులు ఇతర ఆధారాలు లభించాయని చెప్పింది. ► రెండో దశ దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు 2022 సెప్టెంబర్ 28న చంద్రబాబుకు నోటీస్ ఇచ్చారు. ఈ కేసును డీసీఏసీ–సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో త్వరలో చంద్రబాబును కూడా విచారణకు పిలవనున్నారు. ► 2019లో అర్జంటుగా డబ్బులు ఇవ్వాలని మనోజ్ వాసుదేవ్‌కు చంద్రబాబు చెప్పారు. హయగ్రీవా, అన్నై షలాఖా అనే సంస్థలకు రూ.52.50 కోట్లు.. నవోలిన్, ఎవరెట్ కంపెనీలకు రూ.62.90 కోట్లు చొప్పున మనోజ్ చెల్లించారు. చంద్రబాబు ఆదేశాలతో మనోజ్.. ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఇప్పించారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు అతుల్ సోని, బాల వెంకటేశ్ ఫినిక్స్ ఇన్ఫ్రా, ఫోర్ ట్రేడింగ్, లక్ స్టోన్ అండ్ కో బోగస్ కంపెనీల ఖాతాల్లో రూ.41.90 కోట్లు జమ చేశారు. మొత్తం రూ.157.3 కోట్లు మళ్లించారు. ► ఈనాడు రామోజీరావు కుమారుడు కిరణ్ వియ్యంకుడు ఆర్వీఆర్ రఘుతోపాటు కృష్ణ, నారాయణ, శ్రీకాంత్, అనికెత్ బల్దోటాలకు ఈ రూ.157.3 కోట్లు చేరాయి. వారు ఆ నిధులను నేరుగా చంద్రబాబుకు చేర్చారు. ఈ వ్యవహారంలో నారా లోకేశ్ పీఏ రాజేశ్ కిలారి కీలక పాత్ర పోషించారు. ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్ ► ఇంతకు ముందు కూడా ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా అప్పుల గ్రోత్ రేటు ఇప్పుడు తక్కువ. ఇదే బడ్జెట్‌తో మన ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్క, చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లు పూర్తికాక ముందే మన ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసింది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కిన వెంటనే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ► ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇదే బడ్జెట్. అయినప్పటికీ ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లలేదు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ స్కీం ఎలా చేశారో మొన్న కూడా చెప్పాం. ఈ రోజు మళ్లీ చెబుతున్నాం. గత ప్రభుత్వం ఎలా ఉండేది.. మనందరి ప్రభుత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో, ఎంత మంచి జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఈడీ పట్టుకోదనే కేడీ చంద్రబాబు ధీమా ఇంతగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినా, తనను ఏ ఈడీ కూడా పట్టుకోదనే ఈ కేడీ చంద్రబాబు ధీమా. సీమెన్స్ కేసులో రూ.371 కోట్లు దోచేసిన చంద్రబాబు ఈ కేసులో రూ.172.44 కోట్లు దోపిడీ చేసినట్లు ఇప్పటిదాకా తేలింది. అమరావతి పేరిట ఏదో చేస్తున్నానని ప్రజలను మభ్యపెడుతూ ఇక్కడ చేసింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోపిడీ ఆధారాలతో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజలకు ముఖం ఎలా చూపిస్తావ్ చంద్రబాబూ.. అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణానికి చ.అడుగుకు రూ.12 వేలు చొప్పున దోచి పెట్టారు. ఇలా దోచేసిన డబ్బును ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనులను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారు. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా ఎమ్మెల్యేలు 23 మందిని కొన్నారు. నేడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారు. బాబు దోపిడీలో దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) బ్యాచ్‌లోని రామోజీరావుకూ వాటాలు అందాయి. అందుకే చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడినా ఈనాడు పత్రికలో రామోజీ రాయరు. ఈటీవీలో చూపరు. చంద్రబాబు, రామోజీరావు తోడు దొంగలు. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. -
అమరావతిలో బాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారాయన. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. ఈ మేరకు ప్రకటన చేస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు మంత్రి అమర్నాథ్. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి టీడీపీ పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన దొపిడీ ప్రజలకు తెలియాలి. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు. ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరగా ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి. చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని తెలిపారు మంత్రి అమర్నాథ్. సచివాలయం, కోర్టు నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది. మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి. మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు. తన పీఏ ఇచ్చే ఆదేశాలను ఫాలో కావాలని ఆయనకు బాబు చెప్పారు. చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది. అంతేకాదు.. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది. దాదాపు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న అమర్నాథ్.. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సభలో ప్రదర్శించారు. షాపూర్ జీ పల్లోంజి సంస్థకు రూ.8వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోచుకోవడానికి చంద్రబాబు అలవాటు పడ్డారని విమర్శించారు మంత్రి అమర్నాథ్. -
ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి!
సాక్షి, అమరావతి: పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న ఆ రెండు కులాలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. జోనల్ వ్యవస్థ వారికి రక్షణగా ఉంటుందని, చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. బోయ, వాల్మీకి సామాజిక వర్గం అధికంగా నివసించే రాయలసీమ ప్రాంతం ఇతర జోన్లో ఉంటుందని వివరించారు. ఇక దళిత క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసేందుకు వారికి ఎస్సీ హోదా నిరాకరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మతం మారినంత మాత్రాన దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని చెప్పారు. అందుకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించకూడదనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. ఈ మేరకు శాసనసభ శుక్రవారం విడివిడిగా రెండు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా చర్చలో ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. మాట మేరకు వాల్మీకి, బోయలకు న్యాయం నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో బోయ, వాల్మీకి సామాజిక వర్గాల వారు నన్ను కలిసి 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్నట్లు వాపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో తమవారికి ఎస్టీ హోదా ఉందని, పక్కనే ఉన్న బళ్లారి జిల్లాలోనూ తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని చెప్పారు. కానీ రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వకపోవడంతో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎస్టీలలో చేర్చాలని బోయ, వాల్మీకి కులాల వారు కోరడంతో అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చా. అయితే ఎస్టీ హోదా ఇవ్వడం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. కానీ చేతనైనంత సాయం చేయాల్సిన బాధ్యత, మానవత్వం మనలో ఉండాలి. ఆ మానవత్వంతోనే వారికి ఎస్టీ హోదా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోయ, వాల్మీకి కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి చరిత్ర, స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించాం. ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో కమిషన్ విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేసింది. వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, గత చరిత్రను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. బోయ, వాల్మీకి సహా అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఏకసభ్య కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపుతున్నాం. ఏజెన్సీలో ఎస్టీలకు అన్యాయం జరగదు.. బోయ, వాల్మీకి కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్న సిఫారసులపై కొందరు షెడ్యూల్(ఏజెన్సీ) ప్రాంతాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు. ఈ విషయంపై కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీలకు భరోసా కలిగిస్తూ వారికి కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉంది. కమిషన్ నివేదికలో కూడా ఈ విషయాలు పొందుపరిచారు. కమిషన్ చెప్పినట్లుగా మన రాష్ట్రంలో సిక్స్ పాయింట్ ఫార్ములా, జోనల్ వ్యవస్థ ఉన్నాయి. దీంతో చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదు. కారణం.. ఏజెన్సీ ప్రాంతాలన్నీ వేరే జోన్లోకి వస్తాయి కాబట్టి. రాయలసీమ ప్రాంతం వేరే జోన్లో ఉంటుంది. బోయ, వాల్మీకిలను ఎస్టీలలో చేర్చడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీల చదువులు, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారి ఉద్యోగాలు వారికే ఉంటాయి. నాన్ జోనింగ్ ఉద్యోగాల మీదే అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. కేవలం గ్రూప్–1 ఉద్యోగాలే నాన్ జోనింగ్ పరిధిలోకి వస్తాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో కేవలం 386 గ్రూప్–1 ఉద్యోగా>లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్ అంటే కేవలం 22 ఉద్యోగాల మీదే పోటీ ఉంటుంది. మిగిలినవి అన్నీ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాలు. అవన్నీ జోన్లకు సంబంధించినవే. మొత్తం ఉద్యోగాల్లో ఇవే 99 శాతం వరకూ ఉంటాయి. కాబట్టి ఏజన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగదు. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీ సోదర సోదరీ మణులకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. గిట్టనివారు ఓట్ల కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నా. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని మీ జగనన్నగా మాట ఇస్తున్నా. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే.. మరొకరికి అన్యాయం చేస్తున్నట్టు కాదు. అన్యాయం చేయాలనే అభిప్రాయంగానీ, ఉద్దేశంగానీ వైఎస్సార్సీపీకి మరీ ముఖ్యంగా మీ జగనన్నకు ఏమాత్రం లేదు. నా రాజకీయ ప్రయాణం మొదలైన తరువాత ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నా జీవితం చివరి వరకు కూడా వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటా. వారికి ఇసుమంతైనా అన్యాయం చేయనని హామీ ఇస్తున్నా. వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్.. ఈ రెండు తీర్మానాలతో ఆ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుంది. మనమంతా పాలకులం. మనం వాయిస్ ఆఫ్ ద వాయిస్‌లెస్ (గొంతులేని వారికి గొంతుకగా) ఉండాల్సిన అవసరం ఉంది. అలా చేయనప్పుడు మనం ఈ స్థానాల్లో ఉండటం కూడా వృథా అని నేను నమ్ముతున్నా. ఈ రెండు విషయాల్లో ఇంతకంటే మనం చేయగలిగేదేమీ లేదని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ అన్యాయానికి గురైన వారికి సాధ్యమైనంతవరకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే వాల్మీకి, బోయ కులాలు, దళిత క్రైస్తవులకు న్యాయం చేసేందుకు ఈ చట్ట సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాం. దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే ఎస్సీ హోదా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా నిరాకరించకూడదని రెండో తీర్మానం చేశాం. నాన్న (వైఎస్సార్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలా తీర్మానం చేశారు. మళ్లీ ఈ రోజు చట్టసభలో ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఇందులో ఏపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే దళితులు ఇంతకు ముందు ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అందరికీ తెలుసు. మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికీ అన్యాయం జరగదు. కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates: ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు రైతన్నల పక్షపాత బడ్జెట్ గ్రామ స్వరాజ్య బడ్జెట్ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్స్టాల్మెంట్లు, వైఎస్సార్ మత్యకార భరోసా జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత అక్టోబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన నవంబర్‌లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత డిసెంబర్లో జగనన్న చేదోడు జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ జనవరిలో వైఎస్సార్ ఆసరా జనవరిలో జగనన్న తోడు రెండో విడత జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000) ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు సీఎం జగన్ ప్రసంగం మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి నవంబర్, 2019లో మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు చేసింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌తో కలిసి డీల్ చర్చించారు బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్ మనోజ్ దుబాయిలో సీబీఎన్‌కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం ►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది ►కోట్లలో అవినీతి జరిగింది ►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది ►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది ►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు ►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది ►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి ►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు ►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది ►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు ►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు ►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి ►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి ►స్కిల్ స్కామ్‌లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు ►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు ►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత 03:17PM అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం ►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం ►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు ►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం ►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది ►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది ►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం ►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు ►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు ►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు ►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు Time: 03:10 PM ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం ► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున ►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున ►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం Time: 02:00 PM ►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున ►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్మెంట్ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం ►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు ►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు ►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం ►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం ►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం Time: 10:31 AM ►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం Time: 9:50 AM ►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం. ►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం ►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్. ►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు. ►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి. Time: 9:30 AM ►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు. ►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. -
Polavaram Project: పూర్తి చేసేది మేమే
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. దీనికోసం కేంద్రం నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానిది పర్యవేక్షణ బాధ్యత. అయితే డబ్బులు రావడంలో ఆలస్యమవుతోందన్న కారణంతో పనులు ఆగిపోకూడదని భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం మన డబ్బులు రూ.2,600 కోట్లు ఇచ్చాం. అవి కేంద్రం నుంచి తెచ్చుకోవడం కోసం వాళ్ల చుట్టూ తిరుగుతున్నాం. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఎల్లో మీడియా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తుందో, ఎవరెవరి హయాంలలో ప్రాజెక్టు కోసం ఏం చేశారో గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మీ జగనే. ► సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం. పోలవరం అంటే వైఎస్సార్... వైఎస్సార్ అంటే పోలవరం. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది ఆయన కొడుకుగా నేనే. మీ జగనే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబుకు పోలవరం అంటే ఏమిటో తెలియదని, ఆ ప్రాజెక్ట్ పేరు పలకడమే రాదని, అటువంటి చంద్రబాబుకు అసలు పోలవరం ప్రాజెక్ట్ పేరు ఎత్తే అర్హతే లేదని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే నిర్వచించారని గుర్తు చేశారు. చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా పోలవరం ప్రాజెక్టును పీల్చిపిప్పి చేసి యథేచ్ఛగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ అంశంపై శాసనసభలో గురువారం స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌పై ఎల్లో మీడియాలో ఇటీవల వచ్చిన కథనాన్ని చూశాం. అసలు పనులు చేసింది చంద్రబాబేనంటూ ఒక అభూత కల్పనతో కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు తాను ప్రజలకు మంచి చేసీ ఇదిగో ఫలానా మంచి చేశాను అని చెప్పి రాజకీయాలు చేయరు. కేవలం ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్ల మీద ఆధారపడి మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారు. ఒక అబద్ధాన్ని గొప్పగా వందసార్లు చెప్పించే చెప్పి అదే నిజమేనేమో అని భ్రమ కల్పించేలా గోబెల్స్ ప్రచారం చేయగల గొప్ప వ్యక్తి చంద్రబాబు. మాకున్న ఇబ్బంది, వాళ్లకున్న అనుకూలత ఇదే. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ పనులు చేసింది చంద్రబాబేనంటూ ఎల్లో మీడియాలో అభూత కల్పన సృష్టించేందుకు యత్నిస్తోంది. పోలవరం అనే పదం పలికే అర్హత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి.. వీళ్లను మోస్తున్న ఈనాడు దినపత్రిక రామోజీరావుకు ఉందా అని నేను అడుగుతున్నాను’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్టు ► 2004లో నాన్నగారు వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అంత వరకు వీళ్లకు ఈ ప్రాజెక్టు గురించి తెలుసా? 2004కు ముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం వెలగబెట్టారు? చంద్రబాబు 1995లో మొట్టమొదటసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014 వరకు అంటే 19 ఏళ్ల పాటు కనీసం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? అప్పుడు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 ఏ గాడిదలు కాస్తున్నారు? వీళ్లంతా ఈరోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు కట్టారని, ఉరుకులు, పరుకులు తీయించారని కలరింగ్ ఇస్తున్నారు. ► పోలవరం చంద్రబాబు ఒక్కరికే ఏటీఎం కాదు. చంద్రబాబుకు ఒక గజ దొంగల ముఠా ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అనే బ్యాచ్. ఈనాడు దినపత్రిక రామోజీరావు కొడుకు వియ్యంకుడుకి కూడా ఇది ఏటీఎం. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిలో పనులిచ్చారు. ఇంకా కొందరు ఉన్నారు. సుధాకర్ యాదవ్.. అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు. నామినేషన్ పద్ధతిలో పనులు తీసుకుని యథేచ్ఛగా దోచేశారు. వీళ్లు ఏ స్థాయిలో దోచారంటే చివరకి ప్రధాన మంత్రే పోలవరం ప్రాజెక్ట్ వాళ్ల ఏటీఎం అని నిర్వచించారు. నిధుల పారుదల మీదే టీడీపీ ధ్యాస ► వీళ్లు ఏ స్ధాయిలో దోచేశారు అన్నదానికి చిన్న ఉదాహరణ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేశాం. పనులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా కేటాయించాం. ఆ విధానంలో ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌లోనే ఖజానాకు రూ.800 కోట్లు ఆదా అయింది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పేరు చెబితే వారి జేబుల్లోకి నిధులు పారేవి. ఆ నిధులు లెక్కలు చూసుకునేందుకు ఈ పెద్దమనిషి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్లేవారు. ► ఒక్కో ప్రాజెక్టు కట్టడానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తే.. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తై ఫలితాలు ఇస్తుంది. అప్పట్లో వాళ్ల దృష్టంతా నిధుల పారుదల మీదే. పోలవరం ప్రాజెక్టును పీల్చి పిప్పి చేసి డబ్బులు ఎలా తీసుకోవాలన్నదానిపైనే వాళ్ల ధ్యాసంతా. అందుకే ఎక్కువ డబ్బులొచ్చే పనులు ముందు.. తక్కువ డబ్బులొచ్చే పనులు తర్వాత చేస్తూ వెళ్లారు. ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ డిజైన్. ► పోలవరంలో గోదావరి దాదాపుగా 2,400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్ నిర్మించాలి. ఇలా నీళ్లు మళ్లించాలంటే ముందుగా స్పిల్ వే నిర్మించాలి. స్పిల్ వే మీదుగా గోదావరి నదిని మళ్లించిన తర్వాతే ఈ 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి ప్రవాహంలో మొదటి కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ తర్వాత దిగువ నుంచి నీళ్లు రాకుండా రెండో కాఫర్ డ్యాం నిర్మించాలి. ఇలా కట్టడం ద్వారా మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మించాలి. అంటే ప్రధాన డ్యామ్ నిర్మించాలి. ఇదీ పద్దతి. చంద్రబాబు హయాంలో అసంపూర్ణంగా పనులు ► చంద్రబాబు ప్రభుత్వం స్పిల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసింది. పునాదులు తర్వాత గేట్లు పెట్టడం వంటివన్నీ అసంపూర్ణంగా వదిలేశారు. మరోవైపు 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా ఒకవైపు మొదటి కాఫర్ డ్యామ్, ఇంకోవైపు రెండో కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారు. ► కాఫర్ డ్యామ్ పూర్తయితేగానీ నీళ్లు రాలేని పరిస్థితి. అలాంటప్పుడు నీళ్లు ఇంకోవైపు డైవర్ట్ చేసే స్పిల్‌వే పని అవ్వకుండా కాఫర్ డ్యామ్ ఎలా పూర్తి చేస్తారు? అప్పుడు 2,400 మీటర్ల వెడల్పున ప్రవాహం ఎలా వెళ్తుంది? స్పిల్ వే పూర్తి కాలేదు. అఫ్రోచ్ ఛానెల్ పనులు జరగలేదు. స్పిల్ ఛానెల్ పనులు జరగలేదు. ఇలాంటప్పుడు నీళ్లు ఎలా మళ్లిస్తారు? ► కాబట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా ఆగిపోయాయి. కారణం సీజన్ వచ్చిందంటే గోదావరి నదిలో నీళ్లు వదిలేయాలి. మరో ఆప్షన్ లేదు. మెయిన్ లైన్లోంచే నీళ్లు వదలాలి. 2,400 మీటర్ల స్థానంలో 1,600 మీటర్ల మేర కాఫర్ డ్యామ్ కట్టి రెండు గ్యాప్‌లు నాలుగు వందలు మీటర్లు చొప్పున వదిలారు. అప్పుడు నీళ్లు ఉధృతంగా వచ్చే చోట కేవలం రెండు గ్యాపుల్లో నుంచి ప్రవహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డయాఫ్రమ్ వాల్‌ను దెబ్బ తీసింది. కాఫర్ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ► బుద్ధి ఉన్న వారెవరైనా.. స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారని గడ్డి పెట్టాల్సింది. కానీ అలా చేయలేదు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్‌కు పునాది గోడ వేశారు. ఇలా ఎందుకు కట్టారు.. బుద్దుందా అని రెండో ప్రశ్న అడగాలి. ► మనం అధికారంలోకి వచ్చాక 2020లో గోదావరిలో ఎప్పుడూ ఊహకందని విధంగా వరద వచ్చింది. గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద. స్పిల్ వే మీదుగా నీళ్లు మళ్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్పిల్‌వేలో పియర్స్ పౌండేషన్, గేట్లు పెట్టే పనులు జరుగుతున్నాయి. నీళ్లు అటువైపు మళ్లించడం సాధ్యం కాలేదు. రెండో వైపున చిన్న చిన్న గ్యాపుల్లోంచి నీళ్లు రావాలి. దాంతో కోతకు గురైంది. 12–18 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ► మనం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ రిపేరు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. అఫ్రోచ్ ఛానెల్ మీదుగా స్పిల్ ఛానెల్‌ను, స్పిల్ ఛానెల్ దిగువన పైలెట్ ఛానెల్‌ను పూర్తిగా నిర్మించాం. ఈ రోజు స్పిల్‌వే అన్ని రకాలుగా పూర్తైంది. నీళ్లు కూడా స్పిల్ వే మీదుగా వస్తున్నాయి. 48 గేట్లు పెట్టాం. అందువల్లే గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సమర్థవంతంగా స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. ► ఎగువ కాఫర్ డ్యామ్‌ను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది. ఆ రెండు ఖాళీలను కూడా పూర్తి చేశాం. జరిగన నష్టాన్ని ఇసుక వేసి వైబ్రో కంపాక్షన్ చేసి.. అన్ని రకాలుగా ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం. మెయిన్ డ్యామ్‌లో భాగమైన గ్యాప్ 3 వద్ద కాంక్రీటు పనులు పూర్తి చేశాం. ► 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించాం. అనూహ్య వరదల కారణంగా కాఫర్ డ్యామ్ దెబ్బతినకుండా అప్పటికప్పుడు ఒక మీటరు ఎత్తు కూడా పెంచగలిగాం. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశాన్ని కూడా పూడ్చాం. పనుల సీజన్ మొదలు కాగానే ఎంత వేగంగా పనిచేయాలో అంతవేగంగా పని చేశాం. ► ఇప్పటికి పోలవరం నిర్మాణంలో స్పిల్ వే పూర్తయింది. డెడ్‌స్టోరేజీ ద్వారా, రివర్స్సూస్ ద్వారా గోదావరి డెల్టాకు నీరిచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఎన్‌హెచ్‌పీసీ వాళ్లు డిజైన్స్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ సీజన్లో పనులు వేగంగా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ► వర్షాకాలం వచ్చినా మెయిన్ డ్యామ్ నిర్మిస్తున్నాం. 2022 నవంబర్‌లో తిరిగి దిగువ కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టాం. 2023 ఫిబ్రవరి 14 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎన్‌హెచ్‌పీసీ వారి ద్వారా డయాఫ్రం వాల్ టెస్టులు చేసి, ఆ రిపోర్టులను సీడబ్ల్యూసికి, డ్యామ్ డిజైన్ రివ్యూ ఫ్యానెల్‌కు పంపించాం. వాళ్లు ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి సమావేశం నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశాలలో సమాంతరంగా డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయించాం. అ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 12 నెలల నుంచి 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ వేగవంతం చేశాం. పోలవరం కోసమే ప్రధానితో సమావేశం ► సాంకేతికంగా అన్ని రకాల అనుమతులు లభించినందున ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. అందుకు అవసరమైన కేంద్ర ప్రభుత్వం సహకారం కోరేందుకే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాను. ప్రధానికి వివరించిన అజెండాలో ఈ పాయింట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు రూ.55,656.87 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. అందుకు సమయం పడుతుంది కాబట్టే అడ్హాక్ గ్రాంట్ కింద రూ.15 వేల కోట్లు కేటాయించమని ప్రధానిని కోరాం. ► సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడు ఆ మేరకు సర్దుబాటు చేసుకోవచ్చని చెప్పాం. ఈ రూ.15 వేల కోట్లు పూర్తిగా డ్యామ్ ఎత్తు 45.7 మీటర్ల వరకు నిర్మించడానికి సరిపోతుంది. దాంతో పాటు 41.15 మీటర్ల వరకు పూర్తిగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి కూడా సరిపోతుంది. ► తర్వాత కనీసం మూడేళ్లలో దశల వారీగా డ్యామ్‌లో నీటిని నింపుకుంటూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. అందులో ఎలాంటి తప్పూ లేదు. కావాలనే కొందరు సృష్టిస్తున్న అపోహలను నమ్మొద్దు. కేంద్ర ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం. భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి మేం వివరాలు ఇస్తాం.. మీరే డీబీటీ బటన్ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు వేయండి.. వారికి పరిహారం చెల్లించండి అని చెప్పాం. అంతా పద్ధతి ప్రకారం జరుగుతోంది. కొందరు ఉన్నవి లేనట్టుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదు. 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తాం ► ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నామని మాటి మాటికి దుష్ప్రచారం చేస్తున్నారు. 41.15 మీటర్ల ఎత్తుకే కడుతున్నారని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. డ్యామ్ పూర్తి ఎత్తు మేరకు అంటే 45.7 మీటర్లకు నిర్మిస్తాం. ► డ్యామ్ భద్రత కోసం సీడబ్లూసీ నిబంధనలను అనుసరించి ఒకేసారి డ్యామ్ అంతా నింపకూడదు. సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం నిల్వ సామర్థ్యంలో మొదటి ఏడాది 1/3వ వంతు,, రెండవ ఏడాది 2/3వ వంతు, మూడవ ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలి. ► తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి డ్యామ్‌లో నీటిని నిల్వ చేస్తాం. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం సర్దుబాటు చేయడానికి రెండేళ్ల వ్యవధి ఉంటుంది. కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ తర్వాత రెండేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో.. అంటే 194.6 టీఎంసీలను నిల్వ చేస్తాం. అప్పుడు నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి కూడా వాళ్లకు సమయం వెసులుబాటు కూడా ఉంటుంది. ► నిర్వాసితులకు మరింత మేలు చేసేందుకు ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఆ హామీ ప్రకారం కేబినెట్లో తీర్మానం చేసి జీవో కూడా ఇచ్చాం. 41.15 మీటర్లు వచ్చే లోపు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం. -
అందుకే ప్రధానిని కలిశా: ఏపీ సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కోసమే తాను ప్రధానిని కలిశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పోలవరంపై జరిగిన చర్చలో గురువారం ఆయన ప్రసంగించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు.. అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగాయి. ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పద్ధతి ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు కోసమే ప్రధానిని కలిశా. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సహాయం కోసమే చర్చించా. తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను అని సీఎం జగన్ అసెంబ్లీ ద్వారా తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. డ్యామ్ ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యాం నిర్మాణం జరుగుతుంది. సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు తొలి దశలో 41.15 మీటర్లవరకు కడతాం అని పేర్కొన్నారాయన. పోలవరంలో ప్రతీ ముంపు కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి తీరతామని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం నిర్మాణం చేపడుతున్నామని, పోలవరం పూర్తి చేసేది ముమ్మాటికీ జగనేనని, యెల్లో మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మొద్దని మరోసారి కోరారు సీఎం జగన్. ఇదీ చదవండి: పోలవరం పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదు -
పోలవరం పూర్తి చేసేది నేనే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని, ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత బాబుకు లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. గురువారం పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను. అవన్నీ అసత్య కథనాలు. పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ అభూత కల్పనలతో ఎల్లో మీడియా వార్తలు రాసింది. గోబెల్స్ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు. అసలు పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? అని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు?. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోటి వెంట పోలవరం అనే పేరు ఒక్కసారైనా రాలేదు. పైగా టీడీపీ హయాంలో పోలవరం నిధులను యథేచ్చగా దోచేశారు. టీడీపీ హయాంలో ఎక్కువగా డబ్బు వచ్చే పనులను ముందు చేశారు. తక్కువ డబ్బులు వచ్చే పనుల్ని తర్వాత చేపట్టారు. స్పిల్ వే పనుల్ని అసంపూర్ణంగా పునాదుల స్థాయిలోనే వదిలేసి.. కాఫర్ డ్యాం పనుల్ని మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదు. అసలు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారు?. అసలు బుద్ధి ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా?. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ విధానం.వాళ్ల ధ్యాస అంతా డబ్బు స్వాహా పైనే పెట్టారు. చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా సరే యెల్లో మీడియా పనులు ఆయనే చేశారంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. వాటిని ఎవరూ నమ్మొద్దు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం ఒక్క అడుగైనా జరిగిందా? అని ప్రశ్నించారాయన. చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్ఆర్ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్. అసలు పోలవరం అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపిన సీఎం జగన్.. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యిందని తెలిపారాయన. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. స్పిల్‌వే పూర్తి చేసి 48 గేట్లు పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేశాం. గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా.. స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగామని అసెంబ్లీలో ఆయన స్పష్టం చేశారు. -
‘పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది’
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు మహానేత వైఎస్సార్ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్సార్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్ నిధులు కేంద్రం నుంచి రావాలి అని స్పష్టం చేశారు. పోలవరం చంద్రబాబు ఏటీఎం.. ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. పోలవరానికి అయ్యే ప్రతీ పైసాను కేంద్రమే భరిస్తుంది అని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా మేమే కడతాం అని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?. 2013, 2014 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. అందుకు చంద్రబాబుకు కూడా అంగీకరించారు. తర్వాత పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. చంద్రబాబు హయాంలో 48 శాతం మాత్రమే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. పోలవరాన్ని తామే నిర్మాస్తామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో దోచుకో.. పంచుకో.. తినుకో అన్న పద్దతిలో పోలవరం నిధులను చంద్రబాబు కాజేశారు. రామోజీ బంధువుదే నవయుగ.. రామోజీకి అత్యంత సమీప బంధువులదే నవయుగ కంపెనీ. అలాంటి నవయుగ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారు. చంద్రబాబుకు డబ్బులు కావాల్సినప్పుడల్లా పోలవరం నిధులను వాడుకున్నారు. టీడీపీ హయాంలో డయాఫ్రం వాల్ నిర్మాణం కాకుండానే కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే గత వరదల్లో తీవ్ర నష్టం జరిగింది. మీరు నాశనం చేసిన డయాఫ్రం వాల్‌ను మేము కట్టాము. టీడీపీ తప్పిదం వల్ల రూ.2022 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: లోకేష్ యాత్రలో డబ్బుల గోల.. సోషల్ మీడియాలో వైరల్ -
పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం: సీఎం జగన్
Updates: 03:45PM అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు పూర్తి చేస్తాం గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా స్పిల్ వే ద్వారా వరదను నియంత్రిచగలిగాం పోలవరం పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి స్పిల్ వే పూర్తి చేసి 48 గేట్లు ఏర్పాటు చేశాం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేశాం ఎల్లో మీడియా తప్పుడు కథనాలు నమ్మొద్దు 45. 7 మీటర్ల ఎత్తు వరకూ డ్యాం నిర్మాణం జరుగుతుంది సీడబ్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలోనే 41.15 మీ వరకూ కడతాం పోలవరం ప్రాజెక్ట్ కోసమే ప్రధానిని కలిశా తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం పోలవరం ప్రారంభించింది మా నాన్నే.. పూర్తి చేసేది ఆయన కుమారుడే 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైనా రాలేదు టీడీపీ హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు వెళ్లలేదు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదు పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను గోబెల్స్ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు పోలవరంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ ఎల్లో మీడియా అభూత కల్పనలతో వార్తలు రాసింది పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? టీడీపీ ద్యాస అంతా డబ్బు స్వాహాపైనే పెట్టింది టీడీపీ హయాంలో పోలవరం నిధులు యధేచ్చగా దోచేశారు పోలవరం కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారు చంద్రబాబుకు పోలవరం ఏటీఏం అని ప్రధానే అన్నారు టీడీపీ హయాంలో ఎక్కువ డబ్బు వచ్చే పనులు ముందు చేశారు తక్కువ డబ్బు వచ్చే పనులు తర్వాత చేపట్టారు ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ విధానం టీడీపీ హయాంలో స్పిల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు స్పిల్ వే పనులు అసంపూర్ణంగా వదిలేశారు అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదు స్పిల్ వే పూర్తి కాకండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతింది బుద్ధి ఉన్న వారెవరైనా ఇలా చేస్తారా తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేసింది ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది మంత్రి అంబటి రాంబాబు ప్రసంగం ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు జాతీయ ప్రాజెక్టు అయినా మేము కడతా అని చంద్రబాబు అన్నారు 2013-14 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే అన్నారు విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు పోలవరానికి అయ్యే ప్రతిపైసాను కేంద్రమే భరిస్తుంది అన్నారు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు తామే కడతామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది పోలవరం పూర్తి చేసేది మేమే ►ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు(గురువారం) పోలవరం ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. దీపిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేసిందని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయము జయము చంద్రన్న పాటను ధనలక్ష్మీ ప్రస్తావించారు. ఆ పాటకు ఆస్కార్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ధనలక్ష్మీ. శాసనమండలి: సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలనేదే ప్రభుత్వ పాలసీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వెల్ఫేర్ వద్దు అని ప్రతిపక్షాలు చెప్పగలవా? గ్రోత్‌లో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఉంది. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చాం. 13 వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం’’ అని మంత్రి అన్నారు. ►మన ప్రభుత్వ విధానాలపై పొరుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ►విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఆర్మీకేలు ఉన్నాయని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నాం: మంత్రి కాకాణి ►రైతులకు అండగా నిలిచేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. పంటనష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పరిహారం అందజేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ధికి పునాది వేస్తున్నారు: కిలారి రోశయ్య ►సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రైతులకు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు ఆ ఘనత సీఎం జగన్‌దే: మంత్రి మేరుగ నాగార్జున ►పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న మనస్సున సీఎం వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. ►భావితరాల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. -
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులు చేసిన తప్పును సమర్ధించుకోవడానికి మా పార్టీ నేతలపై నిందలు వేయడం సిగ్గుచేటు. వాళ్లకు ఎమ్మెల్సీ వస్తే ఏమీ జరిగిపోదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు. అయినా ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. వారి సంబరాలు చేసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అహంకారంతో అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం. బీసీ అయిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు కరెక్ట్?. వారు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గుచేటు. జీవో నంబర్-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్-1 తీసుకొచ్చాం. జీవో నంబర్-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. 2024లో సీఎం జగనన్న వన్స్ మోర్ అని ప్రజలే అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని ఆయన కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో పార్టీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడిచేసిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే దాడిలో సుధాకర్‌బాబు మోచేతికి అయిన గాయం చూపించారు. సీఎంను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీవయ్య, వి.ఆర్.ఎలీజ, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, ఆర్థర్, తలారి వెంకట్రావు, రక్షణనిధి తదితరులున్నారు. చదవండి: స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే' -
టీడీపీ ‘సామాజిక’ చిచ్చు
సాక్షి, అమరావతి: సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ సభ్యులు సభలో ప్రవర్తిస్తున్నారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం విమర్శించారు. వాయిదా తీర్మానానికి ఆర్డర్లో రావాలని చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవం ఇవ్వలేని ప్రతిపక్షం ఉన్న సభలో సభాపతిగా ఉండటం బాధగా ఉందన్నారు. తన విధులను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలనే ఆలోచనతో సభను నడిపిస్తున్నట్లు చెప్పారు. తనకు పార్టీలపైనా, ఏ ఒక్క సభ్యుడిపైనా ప్రత్యేక అభిమానం లేదన్నారు. కానీ, టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనను ఇన్నాళ్లూ మౌనంగా సహించానన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై స్పీకర్ స్పందిస్తూ.. ‘సభాపతి స్థానానికి కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు పోడియంపైకి వచ్చి నినాదాలు చేస్తారు. చైర్‌ను చుట్టుముట్టి గుద్దుతారు. నా ముఖంపై వేళ్లు చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి ప్రవర్తించిన తీరు హేయంగా ఉంది. అచ్చెన్నాయుడు అయితే ఎత్తుగా ఉండటంతో కింద నుంచే సభ కనిపించకుండా నా ముఖానికి ఎదురుగా ప్లకార్డు అడ్డుపెడతారు. రామకృష్ణబాబు స్టీరియో కామెంట్లు చేస్తారు. అయినా మౌనంగానే భరించాను.. సహించాను. ఎమ్మెల్యే ఏలిజా (వైఎస్సార్సీపీ) వచ్చి మా హక్కులు రక్షించాలని కోరుతుంటే.. టీడీపీ సభ్యుడు నా ముఖానికి అడ్డుగా పెట్టిన ప్లకార్డును పక్కకు జరిపాను. అది కింద పడిపోయింది. అంతే.. వెంటనే స్పీకర్ కొట్టేశారంటూ గోలచేశారు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పి పంపిస్తున్నారు? ఇది మంచి సంస్కారం కాదు’.. అని టీడీపీ సభ్యులకు తమ్మినేని హితవు పలికారు. విలువైన సభా సమయం వృథా.. ఇక సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పీకర్ స్పష్టంచేశారు. ఇది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తుంటే సభను తప్పుదారి పట్టిస్తున్నారని.. సభ జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆర్డర్ ప్రకారమే సభను నడిపిస్తాం నిజానికి.. సభలో వాయిదా తీర్మానం అనేది ప్రశ్నోత్తరాల తర్వాత వస్తుందని స్పీకర్ చెప్పారు. గత ప్రభుత్వంలో 5–3–2016న అప్పటి సభలోనూ ఇదే చెప్పారన్నారు. ‘టీడీపీ వాళ్లు చెప్పింది వాళ్లకే గుర్తులేకపోవడం దురదృష్టకరం. ప్రొసీడింగ్ చదవకుండా సభలో గందరగోళం సృష్టించి, అగౌరవపరచడం దారుణం. ప్రశ్నోత్తరాలు జరుగుతుంటే.. అచ్చెన్నాయుడు వాయిదా తీర్మానమిచ్చి ‘మీరు ఇప్పుడే చదవాలి’ అంటారు. ఇదా సీనియారిటీ? సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి తొలిసారిగా గవర్నరుగా వచ్చిన వ్యక్తి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు నుంచి ఇప్పటివరకు విపక్ష సభ్యుల ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని అందరూ చూస్తున్నారు. జాతీయ మీడియా సైతం అటెన్షన్ చేసేలా గవర్నర్ రాకను కూడా తప్పుపట్టారు. గవర్నర్ రావడం కూడా టెబుల్ అజెండానా? దీనిని బీఏసీలో పెట్టాలనడం ఏమిటి? ఇది గవర్నర్ ఆఫీసు, అసెంబ్లీ సెక్రటేరియట్ మధ్య ఉండాల్సింది. కనీసం అది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు మాట్లాడటం శోచనీయం. ఏ శాసనసభలోనూ ఎవరూ టీడీపీ సభ్యుల్లా ప్రవర్తించి ఉండరు’.. అని స్పీకర్ అన్నారు. అది బీసీలకు ఇచ్చిన గౌరవం ‘సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.. నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పుకోగలిగిన గొప్ప నాయకుడు. నన్ను సభాపతిగా చేశారంటే.. సీఎం బలహీనవర్గాలకు ఇచ్చిన గౌరవం అది. ఇప్పుడు టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. కానీ, వాళ్లు కూడా సభకు రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. ఇదే నా అభిమతం’.. అని స్పీకర్ అన్నారు. ఎర్రగీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెన్షన్ ‘అసెంబ్లీ గౌరవాన్ని పెంచేలా ఎందరో మహానుభావులు స్పీకర్‌గా సేవలందించారు. వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. సభాపతి స్థానంలో ఎవరున్నా గౌరవించాలి. సభ్యులు నిరసన వ్యక్తంచేయడంలో అభ్యంతరంలేదు. కానీ, టీడీపీ సభ్యులకు సభాపతి స్థానం, సభావిలువలపై గౌరం లేదు. టీడీపీ సభ్యుల తీరు గర్హనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అందుకే సభ్యులు కారణం లేకుండా సభలో నినాదాలు చేయడం, చైర్ వద్దకు రావడం, వెల్‌లో బైఠాయించడం చేస్తే ఆటోమేటిగ్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ ఇస్తున్నాం’ అని స్పీకర్ ప్రకటించారు. -
స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే'
సాక్షి, అమరావతి: ఈసారి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి సభను అడ్డుకోవడమే లక్ష్యంగా నిత్యం రచ్చరచ్చ చేస్తున్న టీడీపీ సభ్యుల దుశ్చర్య సోమవారం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా సభాపతి తమ్మినేని సీతారాంపై దాడికి తెగబడ్డారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ వికృత చేష్టలను బయటపెట్టారు. సభాపతిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడిచేశారు. చివరకు మార్షల్స్‌ను కూడా పిడిగుద్దులు గుద్దుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. శాసనసభ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై స్పీకర్ తమ్మినేని తీవ్ర మనస్తాపంతో సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు నినాదాలు చేస్తూ నానా రచ్చచేశారు. సభ ప్రారంభం కాగానే గలాటా.. సభ సోమవారం ఉదయం ప్రారంభం కాగానే జీఓ–1 రద్దు మీద తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ముందుగా వాయిదా తీర్మానం చదివి వినిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. ‘వాయిదా తీర్మానం ఎప్పుడు చర్చకు అనుమతించాలో నాకు తెలుసు.. ముందు మీరు కూర్చోండి’ అంటూ స్పీకర్ కోరారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూ స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రాంభించారు. ఈ సమయంలో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెబుతుండగానే అచ్చెన్నాయుడు స్పీకర్ వైపు వేలు చూపిస్తూ ముందు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని సభలో చదివి వినిపించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తంచేస్తూ ‘చైర్‌ను మీరు డిక్టేట్ చేస్తున్నారా?’ అనడంతో టీడీపీ సభ్యులంతా ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. స్పీకర్ పోడియం ఎదుట వైఎస్సార్సీపీ సభ్యులను నెట్టివేస్తున్న టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొనాలని ఎంత చెప్పినా... ‘సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు.. దయచేసి పద్ధతి మార్చుకోండి..’ అని స్పీకర్‌తో సహా మంత్రులు హితవు పలికినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా వెల్ నుంచి పోడియంపైకి ఎక్కి స్పీకర్ చైర్‌కు ఇరువైపులా చేరి పెద్దఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు.. స్పీకర్ టేబుల్‌పై ఉన్న పుస్తకాలు, పత్రాలు చించివేస్తూ ఆయన ముఖంపైకి విసరడం ప్రారంభించారు. కిందనున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ సిబ్బంది వద్ద ఉన్న ప్రొసీడింగ్స్ కాపీలను పోడియంపైనున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అందించగానే అతను వాటిని చించి స్పీకర్‌పై విసరడం మొదలుపెట్టారు. ఓ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు స్పీకర్ చైర్‌ను చేతులతో కొడుతూ కాగితాలు చించి విసిరారు. ఈ సమయంలో స్పీకర్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ‘దయచేసి పోడియం దిగి మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోండి. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనండి’.. అంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు ఆయన్ను పట్టించుకోకుండా గొడవ చేస్తూనే ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై దాడి.. అదే సమయంలో.. తమ హక్కులు కాపాడాలంటూ వెల్ బయటి నుంచి విన్నవిస్తున్న చింతలపూడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సభాపతిపై జరుగుతున్న దాడిని గమనించి పోడియం పైకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని అడ్డుకోవడంతో ఆయనను టీడీపీ సభ్యులు తోసేసారు. స్పీకర్‌తోపాటు సహచర ఎమ్మెల్యే ఎలీజాపై టీడీపీ సభ్యులు భౌతిక దాడి చేస్తుండడంతో సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పోడియంపైకి వచ్చి వారిని అడ్డుకోబోయారు. ఆయనపైనా దాడికి పాల్పడుతూ పక్కకు తోసేయడంతో సుధాకర్‌బాబు పోడియం హ్యాండ్ రెయిలింగ్‌పై పడిపోయారు. దీంతో సుధాకర్‌బాబు ఎడమ మోచేతికి గాయమైంది. పట్టుతప్పితే ఆయనకు పెద్ద ప్రమాదమే జరిగేది. టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అయినా, టీడీపీ సభ్యుల అరాచకం ఆగలేదు. సుధాకర్‌బాబుతో పాటు ఎలీజాపై దాడిచేస్తూనే ఉన్నారు. వారి నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు సభలో ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు వెల్ నుంచి పైకి వెళ్లబోతుండగా వారిని తోసుకుంటూ టీడీపీ సభ్యులు కిందకు వచ్చేశారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెన్షన్ అయ్యాక.. మార్షల్స్‌పై పిడిగుద్దులు అర్ధగంట అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినందున దయచేసి సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినా, వారు అక్కడే బైఠాయించబోయారు. బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న మార్షల్స్‌పైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. చివరికి డోలాను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లగా, ఆయన వెంట మిగిలిన టీడీపీ సభ్యులు కవ్విస్తూ బయటకెళ్లారు. డిప్యూటీ సీఎంపై ‘డోలా’ అనుచిత వ్యాఖ్యలు తనపై జరిగిన దాడితో పాటు సభలో టీడీపీ సభ్యుల దుశ్చర్యకు మనస్తాపం చెందిన స్పీకర్ సీతారాం సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఇంతలో మార్షల్స్ టీడీపీ సభ్యులను బలవంతంగా వారి స్థానాల దగ్గరకు తీసుకెళ్లారు. రోజూ రచ్చచేయడం టీడీపీ సభ్యులకు అలవాటుగా మారిందని, ఈరోజు ఏకంగా సభాపతిపైనే దాడులకు తెగబడ్డారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనడంతో.. ‘నువ్వొక డిప్యూటీ సీఎం అంట్రా.. పనికిమాలిన నా కొడకా’.. అంటూ డోలా బాలవీరాంజనేయ స్వామి పరుష పదజాలంతో నానా దుర్భాషలాడడంతో మిగిలిన సభ్యులు ఆయన్ని వారించారు.అక్కడ నుంచి స్పీకర్, సీఎం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అటెండర్‌ను తోసేసి స్పీకర్‌పైకి దూసుకొచ్చి.. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో మాట్లాడుతుండగా, స్పీకర్ అటెండర్‌ను పక్కకు తోసేసిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి స్పీకర్‌కు అడ్డంగా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఓ వైపు వీరాంజనేయస్వామి, మరోవైపు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు చైర్‌పై స్పీకర్ చేతులు కూడా పెట్టుకోనీయకుండా ఇబ్బంది కల్గిస్తూ స్పీకర్ ముఖానికి ప్లకార్డులు అడ్డంపెట్టారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి స్పీకర్ ముఖంపై ప్లకార్డును అడ్డంగా పెట్టడంతో పాటు ఆయనపై చేయిచేసుకున్నారు. ప్ల్లకార్డు స్పీకర్ కంటికి తగలడంతో ఆయన దాన్ని పక్కకు తోసివేయడంతో అది కిందపడింది. దీంతో డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ చుట్టూ మూగి ఆయనపై దాడికి తెగబడ్డారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ బాబే
బటన్ నొక్కితే... నేను బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు బటన్ నొక్కగానే ప్రభుత్వ ఖాతా నుంచి అటూ ఇటు తిరిగి ఆయన ఖాతాలోకి డబ్బులు వచ్చాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? స్కిల్ స్కామ్‌లో నిధుల విడుదలపై కొందరు ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేసినా వెంటనే డబ్బులివ్వాలని అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశిస్తూ చంద్రబాబు నోట్ ఫైల్లో పేర్కొన్నారు. ఇంకో నోట్ ఫైల్లో సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి నిధులు నేరుగా విడుదల చేశామని చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ రాశారు. ఈ స్కామ్‌లో ఇన్ని సాక్షాధారాలను నేను చూపిస్తున్నా. ఈ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అనడానికి ఇంతకన్నా ఏం కావాలి...? – శాసనసభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు చేసిన స్కామ్ ఇది. ఉద్యోగులు, విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ దొంగల ముఠాగా ఏర్పడి లోపాయికారీ ఒప్పందంతో రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కాజేశారని ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎందుకు నోరు మెదపలేదు..? దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ సంస్థ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సృష్టించింది. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకుంది. చంద్రబాబు అవినీతి స్కిల్ ఇదీ’ అని మండిపడ్డారు. “కనీసం డీపీఆర్ లేదు. రూల్స్ బేఖాతర్.. ప్రొసీజర్స్ బేఖాతర్.. పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ బేఖాతర్. చంద్రబాబు చెప్పిందే వేదం’ అని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై శాసనసభలో సోమవారం చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఈ స్కామ్ జరిగిన తీరును వివరిస్తూ జీవోలు, ఎంవోయూలను సభలో స్లైడ్స్ ద్వారా ప్రదర్శిస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలు ఇవీ.. “షెల్’ డబ్బులు బాబు ఇంటికి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని ఆ పది కూడా దోచుకున్న మాదిరిగా ఈ వ్యవహారం ఉంది. అమెరికా, యూరప్‌లో లాటరీ తగిలింది.. 10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్‌గా రూ.10 లక్షలు కట్టండి.. ఆ తరువాత 10 వేల మిలియన్ డాలర్లు వస్తాయని చెబుతుంటారు. అదే మాదిరిగా సీమెన్స్ పేరుతో స్కామ్ జరిగింది. ఇలాంటి గొప్ప స్కామ్‌ను నడిపిన వ్యక్తి నారా చంద్రబాబే. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని మాయం చేశారు. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్లీ చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. న్యాయ పరిభాషలో పార్టనర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీజర్స్ లాంటిదీ ఈ స్కామ్. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం కేబినెట్లో ఒకటి చెప్పి ఆ ప్రకారం జీవో జారీ చేశారు. వాటికి విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత మరో ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేశారు. ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్ స్కామ్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. విదేశాల్లో షెల్ కంపెనీలకు ఈ స్కామ్ పాకింది. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చింది. ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఈడీ, సీఐడీ.. అన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. ముందుగానే ఊహించి.. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి..? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి..? చట్టానికి దొరక్కుండా ఏ ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి..? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి..? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి..? ఇవన్నీ ముందుగానే ఊహించుకుని రూపకల్పన చేశారు. ఒక క్రిమినల్ మాత్రమే ఇలా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ ఆయన. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ స్కిల్ స్కామ్ ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సిన మనుషులను చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? సీమెన్స్ కంపెనీలో ఓ ఉన్నతోద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడి ద్వారా దోపిడీకి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం, సీమెన్స్ కంపెనీ 90 శాతం భరిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా..? పోనీ చంద్రబాబు ముఖాన్ని చూసి ఇస్తారా...? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు...? ప్రభుత్వం వాటా ఎంత? మిగిలిన వారి వాటా ఎంత..? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది..? మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు..? ప్రతి స్ధాయిలో ఖర్చు ఎంత ఉంటుంది..? ఏ రకంగా నిధులు వస్తాయి..? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది..? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది..? ఇలా అన్ని కోణాల్లోనూ ఆధ్యయనం చేసి అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులోకి తేవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను సర్టిఫైడ్ చేయాలి. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ముందస్తుగానే ఆ కంపెనీలో లాలూచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు రూపొందించిన డీపీఆర్‌ను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక నోట్ పెట్టించారు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. చంద్రబాబుకు మాత్రమే ఇటువంటిది సాధ్యం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. గత ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి, ఆపై స్ధాయిలో చూసీ చూడనట్లు వదిలేశారు. ఏకంగా స్పెషల్ ఐటెమ్‌గా కేబినెట్లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం, వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అధ్యయనం చేయని, ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఇలా కేబినెట్‌కు నోట్ పెట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిపించారు. ఎల్లో మీడియా రాయదు.. దత్తపుత్రుడు ప్రశ్నించడు ఈ స్కామ్.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వింది కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది బయటకు పొక్కింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తుంటే వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ).. ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు, ఎవరూ రాయరు, ఎవరూ చూపరు, ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. గ్రాంట్ అనే పదమే లేకుండా ఒప్పందం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని, 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90 శాతం ఖర్చును సీమెన్స్, డిజైన్‌టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10 శాతం అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో పది శాతం, పన్నులతో కలిపి రూ.371 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మిగిలిన రూ.3 వేల కోట్లను సీమెన్స్ సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఉదారంగా ఇస్తుందంటూ కేబినెట్లో చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చిందంటే ఆ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆ పదమే ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం వాటా కాస్తా రూ.330 కోట్లు ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. కుంభకోణానికి ఇక్కడే బీజం పడింది. ఒప్పంద పత్రంలో వివరాలు నింపాల్సిన చోట ఖాళీగా విడిచిపెట్టారు. ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? సీమెన్స్ నుంచి పైసా రాలేదు గత ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేసినప్పుడు సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. అసలు ఆ ప్రాజెక్టు గురించే ఆ కంపెనీకి తెలియదు. గత ప్రభుత్వం ఐదు దఫాల్లో రూ.371 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరిన వెంటనే దఫాల వారీగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. నోట్ ఫైల్స్ మాయం.. క్లీనింగ్ ఆపరేషన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక విజిల్ బ్లోయర్ టీడీపీ హయాంలోనే 2018లో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణ మొదలు పెట్టినా ఆ తరువాత అందిన ఆదేశాలతో ఆ ఫైలును పక్కనపెట్టేసింది. ఏసీబీ దర్యాప్తు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఏసీబీ ముఖ్యమంత్రికి రిపోర్టు చేస్తుంది. ఈ వ్యవహారం గురించి బయటకు పొక్కడంతో ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా బోగస్ ఇన్వాయిస్లతో “సెన్ వ్యాట్’ కోసం క్లెయిమ్ చేశాయి. కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. 2017లోనే ఇది బయటపడింది. వాళ్లు బయటపెట్టినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే సాక్షాత్తూ చంద్రబాబే ఈస్కామ్‌లో అడుగులు వేయించారు కాబట్టి! ఆధారాలతో రుజువైనా ఎల్లో మీడియా గగ్గోలు ఈ స్కామ్‌పై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్ష సాధింపంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ బాధ వర్ణనాతీతం. ఇన్ని ఆధారాలతో రుజువై అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అంటున్నాయి. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నలుగురిని అరెస్టు చేసింది. సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. దొరికిపోవడంతో.. ఇంత దారుణంగా స్కామ్ చేసి దొరికిపోయారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తట్టుకోలేక ఉక్రోషంతో బాధపడుతున్నాయి. ఇన్ని దారుణాలు చేసిన ఈ గజదొంగల ముఠా చట్టం నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీఇన్నీ కావు. నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. వీళ్లను మళ్లీ ఏ రోజూ రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. సభ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు.. ఈ విషయంపై చర్చ జరుగుతుంటే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దగ్గర మీడియా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు. ఒక అబద్ధాన్ని నిజం చేయగలరు. అంతటి స్కిల్డ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. ఈ సభ ద్వారా వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలనే సాక్ష్యాలు, ఆధారాలను చూపిస్తున్నాం. అలాంటి స్కీమ్లే లేవన్న సీమెన్స్ మన అధికారులే కాకుండా ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించింది. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఎంఓయూలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ కోర్టుకు చెప్పింది. ఇది సీమెన్స్ అంతర్గతంగా విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ మేనేజ్మెంట్నుగానీ లీగల్ టీమ్నుగానీ సంప్రదించలేదని కూడా కోర్టుకు వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఆర్థిక సహాయంతో కూడిన కార్యక్రమాలను సీమెన్స్ ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు అలాంటి స్కీమ్‌లు ఏవీ తమ సంస్థలో లేవని కూడా స్పష్టం చేసింది. వారి అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అందజేశారు కూడా. అంటే రూ.371 కోట్లు తమకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి చేరాయి? అటు తిరిగి ఇటు తిరిగి షెల్ కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకున్నారు. రూ.371 కోట్లను చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు. ఆనేక షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బు చేతులు మారి మనీల్యాండరింగ్‌తో వీళ్ల చేతుల్లోకి వచ్చింది. -
‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే’
అమరావతి: గత కొన్ని రోజులుగా శాసనసభలో టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం, వాకౌట్ చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఏడు రోజులుగా డోలా వీరాంజనేయస్వామి పదేపదే స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారని, ఈరోజు స్పీకర్‌పై దాడికి దిగారన్నారు. ఈ రోజు శాసనసభ చరిత్రలో బ్లాక్ డే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో కూర్చొని దశ, దిశ చేస్తుంటాడని, సభకు రాడని మండిపడ్డారు మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం.. వాకౌట్ చేయడం ఇదే వారి పని. ఏడు రోజులుగా స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారు. ఈరోజు స్పీకర్ పై దాడికి దిగారు వెల్ లోకి వెళ్లడమే నేరం..పైగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. హద్దులు దాటి సభాపతి పై దాడి చేశారు. భర్తను కొట్టినమ్మ బావురుమన్నట్లుంది టీడీపీ తీరు. మాపై వారే దాడి చేసి...నింద మాపై వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చర్చ జరగకూడదనే పథకం ప్రకారం ఈరోజు గొడవ చేశారు’ అని మంత్రి తెలిపారు. -
దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు. ‘స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది. సీఎం జగన్ తన ప్రసంగంలో ఏమన్నారంటే... నిరుద్యోగుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే నిరుద్యోగులు,విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం గురించి ఈ సభలోనాలుగు మాటలు చెప్పాలి. స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారు అన్నది సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలి. అదే విధంగా సభ ద్వారా ప్రజలకు కూడా అవగతం కావాలి. అందుకనే ప్రత్యేకంగా ఈ అంశంపైన మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో నాలుగు మాటలు సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. దోపిడీ– బాబుకి తెలిసిన స్కిల్ స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లల స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది... ఇది నిజంగా చంద్రబాబునాయుడు గారికే మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది, ఏ రకంగా ఒక వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి ? అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ స్కాం ఎలా ఉందంటే.. రూ.100 పనిచేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో.. ఈస్కాం కూడా అలాగే ఉంటుంది. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. అమెరికాలో కానీ, యూరప్ లో కానీ మీకు లాటరీ తగిలింది. 10 మిలియన్ డాలర్లు మీ పేరుమీద వచ్చాయి. అర్జెంటుగా మీరు రూ.10 లక్షలు డబ్బులు కట్టండి. అది కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు వస్తాయని చెప్పి ఆ రూ.10 లక్షలు కట్టించుకుని వాటిని కూడా ఎత్తేసే కార్యక్రమం ఏమాదిరిగా జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ సీమెన్స్ పేరుతో పెద్ద స్కాం జరిగింది. స్కాం నడిపింది చంద్రబాబే... ఇలాంటి ఒక స్కాంను నడిపిన వ్యక్తి సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు గారేనని నా ప్రసంగంలో రకరకాల ఆధారాలతో సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చూపిస్తాను. ప్రభుత్వం సొమ్ము రూ.371 కోట్లు. ఈ డబ్బు హారతి కర్పూరంలా మాయమైపోయింది. ఈ స్కాం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ డబ్బు సెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ ద్వారా మరలా సెల్ కంపనీల నుంచి చంద్రబాబునాయుడు గారి దగ్గరకి వచ్చిన పరిస్థితి. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం... ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం. పార్టనర్స్ ఆఫ్ క్రైం ప్రొసీడ్స్ అనే పదానికి అర్ధం కూడా చెబుతుంది. అధికార దుర్వనియోగం పరిధిలోనికి కూడా వస్తుంది. కేబినెట్లో ఒకటి చెప్పి.. ఆ మేరకు ఒక జీవో విడుదల చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం, జీవోతో సంబంధం లేకుండా వేరొక ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేసే కార్యక్రమం జరిగింది. ప్రజా ధనాన్ని దోచేయడంలో చంద్రబాబు గారి చాతుర్యం చూడాలంటే... దానికి సరైన ఉదాహరణ సరిగ్గా ఈ స్కిల్ స్కాం. ఇది రాష్ట్రంలో మొదలై విదేశాలకు కూడా సెల్ కంపెనీల ద్వారా పాకిన పరిస్థితి. ఆ తర్వాత అటునుంచి మరలా డబ్బులు మన దేశంలోకి, హైదరాబాద్‌లోకి వచ్చాయి. ఈ స్కాం మన సీఐడీతో మొదలు పెడితే జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ ఇలా ఏజెన్సీలన్నీ దర్యాప్తు చేస్తున్న స్కాం. ఇలా దోచేసిన సొమ్మును సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు అక్కడ నుంచి మరలా దేశంలోకి తెప్పించి, దేశం నుంచి ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం రూ.371 కోట్ల దోపిడీ... చంద్రబాబు గారు ఆయన మనుషులు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి ఒకటి కాదు, రెండు కాదు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏకంగా రూ.371 కోట్లు దోచేశారు. యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం అన్నింటికన్నా బాధాకరం. ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబుగారి విజన్ ఏంటో బాగా కనిపిస్తోంది. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి ? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి ? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి ? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి ? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈవిజన్ రూపకల్పన చేసినట్టుగా రకరకాల అడుగుల్లో కనిపిస్తోంది. అవినీతికి విజన్... ఇవన్నీ ముందుగానే ఊహించుకుని ఇంత గొప్ప విజన్‌తో ఈ కార్యక్రమాలు చేసిన పరిస్థితులు చూస్తే.. ఒక క్రిమినల్ మాత్రమే ఈ విధంగా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ అతడు. చంద్రబాబు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈస్కిల్ డెవలప్మెంట్ స్కాం ఊపిరి పోసుకుంది. దీనికోసం తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వంలో ఒక పూర్తి స్ధాయి చర్చలేదు. ఏదైనా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సివచ్చినప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి. కానీ అటువంటిది ఎక్కడా చర్చ జరగలేదు.ఒక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు చేయించాలి. ఒక ఆలోచన ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందనేది పేపర్ మీద పెట్టి డీపీఆర్ చేయించాలి. అది కూడా లేదు. ఖర్చు ఎంతవుతుందనేది నిర్ధారణ చేయించాలి. అది కూడా లేదు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. సీమెన్స్ ఉద్యోగితో లోపాయికారి లాలూచీ... ఇది ఒక చంద్రబాబునాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది. సీమన్స్ ఇండియా అన్న కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడిని వాడుకుని ఈప్రాజెక్టు పేరుతో దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు అయితే.. ఇందులో ప్రభుత్వ వాటా పదిశాతం. అని చెప్పారు. 90 శాతం సీమెన్స్ పెట్టుకుంది అని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90శాతం పెట్టుకుందని స్కాంలో రూపకల్పన చేశారు. దాదాపుగా రూ.3000 కోట్లు ప్రైవేటు సంస్ధ అయిన సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇస్తుందా ? ఆలోచన చేయడానికైనా సాధ్యపడుతుందా ? చంద్రబాబు నాయుడు గారి అందమైన మొహాన్ని చూసి ఏమైనా ఇస్తున్నారా ? ఏరకంగా ఒక ప్రయివేటు సంస్ధ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది ? సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టును తీసుకోవాలనంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు ? దీనిలో ప్రభుత్వం వాటా ఎంత ? మిగిలి వారి వాటా ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది. మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు ? ప్రతిస్ధాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది ? ఏ రకంగా నిధులు వస్తాయి? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది ? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది ? ఇలా అన్నిరకాల కోణాల్లోనూ ఆధ్యయనం చేసి... అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లోనికి తీసుకుని రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను కూడా సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ఇదివరకే చెప్పుకున్నట్టు.. ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలాచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు.. తమకు తాముగా తయారుచేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్లంతట వాళ్లే ఒక మనిషిని గుర్తించి, ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రతిపాదన పెట్టించి, దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా విచారణచేయకుండా ఆ అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. అన్ని రూల్స్‌ను బేఖాతరు చేస్తూ... ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి కానీ, ఆ పై స్ధాయి కానీ అన్నింటినీ టోటల్‌గా ఓవర్ లుక్ చేశారు. ఏకంగా స్పెషల్ ఐటెంగా కేబినెట్లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అ«ధ్యయనం చేయని ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది.. నియామకాలకు, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ బాబుగారి పాలనలో ఆన్నీ పూర్తిగా బేఖారు చేసిన పరిస్థితులు. ఆయన పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, పద్దతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా బేఖాతర్. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడిపించారు. చంద్రబాబు టైంలోనే బయటపడిన స్కాం... ఈ స్కాం అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తవ్వింది కాదు. చంద్రబాబు గారు హయాంలోనే దీన్ని సెంట్ కనిపిస్తూ వచ్చింది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు వీరి దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఎవరైనా ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తూ ఉంటే ఎందుకు వీళ్లంతా మౌనంగా ఉన్నారు. ఇంతకముందు నేను చెప్పాను. దోచుకో, పంచుకో, తినుకో ( డీపీటీ ) ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు. ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. ఒప్పందంలో పచ్చి అవినీతి.. ఈ ఒప్పందం గురించి వస్తే.. ఇంతకంటే పచ్చి అవినీతి ఎక్కడా చూసి ఉండం. కారణం కేబినెట్లో ఒక విధంగా, ఆ కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చిన జీవోలో ఒక విధంగా ఉండి.. ఒప్పందం ఇంకో విధంగా ఉంది. కనీసం అదైనా కేబినెట్‌కు వచ్చిందో ?లేదో ? వచ్చిందని జీవో విడుదల చేశావు. కనీసం దాన్నైనా ఒప్పందంలోకి తీసుకువచ్చావా అంటే అదీ లేదు. కేబినెట్లోకి తీసుకొచ్చి, జీవో రూపంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా ఒప్పందం మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేబినెట్ ఆధారంగా జీవో విడుదల చేశారు. ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90శాతం ఖర్చును సీమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని మిగిలిన పది శాతం ఖర్చును అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన ప్రాజెక్టు వ్యయంలో పదిశాతం అంటే పనులతో కలుపుకుని రూ.370 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్ సంస్ధ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా... ప్రైవేటు సంస్ధ ఉదారంగా మనకు ఇస్తుందని కేబినెట్లోకి తీసుకొచ్చారు. జీవో విడుదల చేశారు. ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చిందని అంటే.. ఈ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదారంగా మనకు ఉచితంగా ఇచ్చినట్టు అర్ధం. అయితే కేబినెట్ నిర్ణయానికి ఈ జీవోకు విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ఒప్పందానికి వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం ఇవ్వవలసిన 10 శాతం కంట్రిబూషన్ కాస్తా ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం కంట్రిబ్యూషన్‌ను ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌గా మార్చేశారు. మొత్తం ఒప్పందం చూస్తే.. కేబినెట్ నిర్ణయం, తద్వారా వచ్చిన జీవోకు పూర్తిగా విరుద్ధంగా ఒప్పందం స్వరూపమే మార్చివేసారు. స్లైడ్స్ ద్వారా కేబినెట్ నిర్ణయం, జీవో ఆ తర్వాత ఎంఓయూను అసెంబ్లీలో వివరించిన సీఎం. కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపి జీవో ఇచ్చారు. జీవో తర్వాత ఒక తప్పుడు వ్యవస్ధను క్రియేట్ చేశారు. ఆ తర్వాత వీళ్ల చేసుకున్న ఒప్పందం చూస్తే.. పదిశాతం కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రూ.330 కోట్లు ఇచ్చేటట్టుగా నామకరణం చేసారు. ఇక్కడ స్కాంకు బీజం పడింది. కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో ఏ లెటర్ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న వివరాలేవీ పేర్కొనలేదు. అన్నీ ఖాలీలు ఉంచారు. ఒప్పందం వివరాలూ మాయం.... ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాలీగా విడిచిపెట్టారు. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు ? జీవో వేరు, ఒప్పందం వేరు. చంద్రబాబునారి స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టు పై ఈరకంగా ఒప్పందాలు జరుగుతాయా ? ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా ? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నదానికి ఏ రకంగా అడుగులు పడ్డాయన్నది ఊహకందని విధంగా జరుగుతుంది. ప్రభుత్వం నుంచి పదిశాతం డబ్బులు విడుదల చేసినప్పుడు, సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ఉదారంగా సీమెన్స్ నుంచి మనకు ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే... ఐదు దఫాల్లో కేవలం మూడు నెలలు కాలంలోనే ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రభుత్వం నుంచి ఇన్స్టాల్మెంట్ పోతుంది ఆ మొత్తం సెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. డబ్బులు ఇవ్వడం వీళ్లు రూట్ చేసుకోవడం.. వీళ్లకు రావాల్సింది తీసుకోవడం, మరలా సెకెండ్ ఇన్స్టాల్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను బటన్ నొక్కితో డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు బటన్ నొక్కితే అంతా ప్రభుత్వ ఖాతా నుంచి అటు తిరిగి, ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం. ఇంత దారుణంగా జరిగాయి. ఈ డబ్బు విడుదలపై ఆర్ధికశాఖ అధికారులు ప్రశ్నిస్తే...ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారంటే. సాక్షాత్తూ చంద్రబాబే. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తాను నోట్ ఫైల్లో చెప్పారు. ఇంకోక నోట్ ఫైల్లో .. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్‌పై రాశారు. ప్రధాన ముద్దాయి చంద్రబాబే... ఈ స్కాంలో ఇన్ని సాక్ష్యాధారాలు నేను చూపిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రధాన ముద్దాయి అవునా ?కాదా ? అని చెప్పడానికి ఇంకా నిదర్శనాలు కావాలా అని అడుగుతున్నాను ? ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఇక్కడ మన అధికారులే కాదు. సీమెన్స్ సంస్ధ అధికారులు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. సీఆర్పీసీ 164 కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు, తమకు ఎలాంటి సంబధం లేదని కోర్టులో చెప్పారు. ఇది సీమెన్స్ వాళ్లు అంతర్గతంగా విచారణ చేసుకుని ఇచ్చిన రిపోర్టు. వాళ్లు 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఒక అంశం అయితే... ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు తమకూ ఎలాంటి సంబందం లేదని... వాళ్లు కోర్టుకు తెలిపడం మరొక అంశం అయితే తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజిమెంట్‌కు కానీ, లీగల్ టీంకు కానీ సంప్రదించలేదని సీమెన్స్ కోర్టుకు తెలియజేశారు. అంతే కాకుండా సీమెన్స్ ఎలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఆర్ధిక సహాయంతో కూడిన కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని, ఇలాంటి స్కీంలు ఏవీ కూడా తమ సంస్ధలో లేవని చెప్పారు. వాళ్ల అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అధికారికంగా అందజేశారు. అంటే రూ.370 కోట్లు డబ్బులిచ్చారు. ఆ డబ్బులు మాకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరికి పోయాయి ? అటు తిరిగి ఇటు తిరిగి సెల్‌కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకునే కార్యక్రమం జరుగుతుంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నామని ఆలోచన చేయమని అడుగుతున్నాను. రూ.370 కోట్లు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఆయన మనుషులు పూర్తిగా తినేశారు. ఈ డబ్బు ఒకటి రెండు కాదు ఇప్పటివరకు ఆనేక సెల్‌కంపెనీల ద్వారా చేతులు మారి మనీల్యాండరింగ్ చేసి వీళ్ల చేతుల్లోకి వచ్చింది. వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2018 జూన్‌లో అంటే వాళ్ల ప్రభుత్వంలోనే ఒక విజిల్ బ్లోయర్ ఈ స్కాం గురించి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఏసీబీ విచారణ మొదలు పెట్టి.. ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాలతో విచారణ ముందుకు కొనసాగించకుండా ఏసీబీ ఆ ఫైలును పక్కనపెట్టేశారు. విచారణనూ అడ్డుకున్నారు... ఏసీబీని విచారణ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు. ఏసీబీ రిపోర్ట్స్ టు సీఎం. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా సెన్ వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఎంత గొప్పగా వీళ్లు రచన చేసినా ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే... దేవుడి మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు ఎక్కడో కచ్చితంగా పడతాయి. ఇన్ని కోట్లరూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. ఈ డబ్బులు బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్టుగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. 2017లోనే ఇది బయటపడింది. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఇది బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్లు చెప్పారు. వాళ్లు బయటపెట్టినా బాబుగారి ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకు స్పందించలేదు అంటే... ఈ స్కాంలో సాక్షాత్తూ చంద్రబాబునాయుడు గారే అడుగులు వేయించారు. చివరకు సీమెన్స్ సంస్ధ అంతర్గత విచారణ చేసి వాళ్లు తేల్చిన విషయాలు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లో మీడియా గగ్గోలు ఈ విషయాలన్నింటినీ మన సీఐడీ దర్యాప్తు చేస్తూ.. స్కాంకు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది. ఆసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్ల బాధ వర్ణనాతీతం. ఇంత దారుణమైన స్కాం జరుగుతుంటే... ఇన్ని ఆధారాలతో రుజువయ్యే పరిస్థితులు కనిపిస్తుంటే.. దీని మీద అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా చెబుతున్నాయి. నిజమేమిటంటే ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురిని అరెస్టు చేసి ఈడీ ట్వీట్ కూడా చేసింది. అందులో ఏముందంటే సీమెన్స్ ఇండస్ట్రీ ఎక్స్ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైయివేటు లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి వాళ్లను పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి, 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. పట్టుబడిన గజదొంగల ముఠా... ఇంత దారుణంగా స్కామ్ చేసి పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగలముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తట్టుకోలేక ఆక్రోషంతో బాధపడుతున్నారు. బమ్మిని తిమ్మిని చేయడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవి వాస్తవాలైతే... ఇవేవీ వాస్తవాలు కాదని అటు తిప్పి, ఇటు తిప్పి కథలు, కథలు అల్లి చంద్రబాబును కాపాడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ గజదొంగల ముఠా ఎంత దారుణంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. డీపీటీ అని నేను చెప్పినదానికి సాక్ష్యాధారాలు. ఇది చంద్రబాబుగారు చేసిన నిలువుదోపిడీ బాగోతం. ఈ గజదొంగల ముఠా ఇన్ని దారుణాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఎత్తులు..అన్నీ ఇన్నీ కాదు. నేరగాళ్లకు ఎప్పుడైనా సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. ఇటువంటి గజదొంగల ముఠాను ఇక మళ్లీ ఏరోజు కూడా రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం మీద చర్చ జరుగుతుంది. వక్రీకరించే కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ల దగ్గర మీడియా సంస్ధలు ఎక్కువగాఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్దం చేయగలుగుతారు. ఒక అబద్దాన్ని నిజం చేయగలుగుతారు. అంతా స్కిల్డ్ మ్యాన్‌పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. వాస్తవాలు ప్రజలకూ తెలియాలి... కాబట్టి కనీసం ఈ సభ ద్వారానైనా వాస్తవాలేంటి అన్నది మన ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలతో చూపించాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు: కన్నబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సోమవారం కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కన్నబాబు కీలక అంశాలను వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ అని ఆరోపణలు చేశారు. కాగా, కన్నబాబు మాట్లాడుతూ.. 201-19 మధ్య చంద్రబాబు కొన్ని సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి, ఫైబర్ నెట్ వంటి సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రూ. 3,356 కోట్ల ప్రాజెక్ట్ అని మోసం చేశారు. సీమెన్స్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ఆమోదం తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా నిధులు మళ్లించారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి కాకుండా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలించారు. తప్పు జరినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు. స్కామ్‌తో మాకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే వాళ్ల మనుషులని అర్థం. చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన ఒప్పందం ఇదే. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదు. మేం అధికారంలోకి వచ్చాకే స్కామ్ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు. తన బాబు తన స్కిల్ చూపించి రూ.371 కోట్లు కొట్టేశారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు.. లూటీ చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే స్కిల్ చంద్రబాబుకు ఉంది. ఈ స్కామ్‌పై పూర్తి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్! -
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం వద్దకొస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్!
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. తాను గౌతమ బుద్దుడు కాదన్న తమ్మినేని..లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉందన్నారు. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని స్పీకర్ కీలక రూలింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?.. బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? అంటూ స్పీకర్ మండిపడ్డారు. తన చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. తనకు సభ్యులంతా సమానమేనన్న తమ్మినేని.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. స్పీకర్ చైర్‌ను టచ్ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించానని తెలిపారు. ‘సభలో దాడులు చేయమని టీడీపీ సభ్యులకు ఎవరు చెప్పారు?. సభను సజావుగా నడిపించడమే నా కర్తవ్యం. సభ్యుల హక్కులు పరిరక్షించడం నా బాధ్యత. టీడీపీ నేతలు పేపర్లు చించి నాపై వేస్తుంటే.. పూలు చల్లుతున్నారనే భావించా. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారు. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. కాగా సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. చదవండి: టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే’ -
ఏపీ అసెంబ్లీ.. స్పీకర్‌పై టీడీపీ సభ్యుల దాడి!
సాక్షి, అమరావతి:టీడీపీ సభ్యుల తీరు రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాక.. ఏకంగా సహచర సభ్యులు, స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సభ కొలువైంది. అయితే, ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై దూషణలకు దిగారు. వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెట్టేశారు. దీంతో వెల్లంపల్లి కిందపడబోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దూషించారు. పచ్చపార్టీ నేతల తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఇది బ్లాక్ డే గా అభిప్రాయపడ్డారు. చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు: సీఎం జగన్
Live Update అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం Time: 03:32PM ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు సీమెన్స్సంస్థ కూడా ఇంటర్నెల్ దర్యాప్తు జరిపింది ప్రభుత్వ జీవోతో తమకు సంబంధం లేదని సీమెన్స్చెప్పింది తీగ లాగితే డొంక కదిలింది షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్లీ చంద్రబాబు జేబులోకే డబ్బులు ఈ స్కాంపై గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు వచ్చింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకపోవడంతో జీఎస్టీ అధికారులు కూపీ లాగారు. 2017లో ఈ స్కామ్‌ను జీఎస్టీ అధికారులు వెలికితీశారు స్కిల్లర్, డిజైన్‌టెక్ సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా క్లెయిమ్ చేశారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించినట్టు గుర్తించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్‌కు పాల్పడ్డారు రూ. 371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు చంద్రబాబు చేతిలో ఎక్కువ మీడియా ఉంది.. నిజాన్ని అబద్దం చేయగలడు.. అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు బాబును కాపాడేందుకు ఈ గజదొంగల ముఠా ప్రయత్నాలు చేస్తోంది స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన అతిపెద్ద స్కామ్ ఇది 90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు సుమారు రూ. 3 వేల కోట్లు సీమెన్స్ఇస్తుందని ప్రచారం చేశారు ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్కడైనా రూ. 3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? డీపీఆర్‌ను సైతం తయారు చేయించలేదు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ. 3,356 కోట్లు ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం.. అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు మిగిలిన 3 వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని జీవోలో చెప్పారు గ్రాంట్‌గా ఇస్తే మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ప్రస్తావనే లేదు జీవో వేరే.. ఒప్పందం వేరే.. మరి సంతకాలు ఎలా చేశారు 3 నెలల కాలంలోనే 5 దఫాల్లో రూ. 371 కోట్లు విడుదల చేశారు చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా నేను బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.. చంద్రబాబు బటన్ నొక్కితే ఆయన ఖాతాల్లోకి సొమ్ము రూ. 371 కోట్లు చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు మనీలాండరింగ్ ద్వారా ఆయన చేతుల్లోకి డబ్బు వచ్చింది చంద్రబాబు బటన్ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్ చేశారు ఇవన్నీ ఒక్క క్రిమినల్ మాత్రమే చేయగలడు బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్ ఊపిరి పోసుకుంది వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371 కోట్లు కొట్టేశారు లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారు చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే పూర్తి చర్చ జరగాలి సీమెన్స్ అనే ప్రైవేట్ సంస్థ రూ. 3 వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారు సీమెన్స్ కంపెనీలోని వ్యక్తితో లాలూచీ పడ్డారు ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు నోరు మెదపలేదు? దత్తపుత్రుడు కూడా ఈ స్కామ్‌పై ప్రశ్నించలేదు ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదు దోచుకు, పంచుకో, తినుకో అన్నదే వారి విధానం ఎవడూ రాయడు, ఎవడూ చూపడు, ఎవడూ అడగడు జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు కేబినెట్ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారు 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవో చెప్పారు ఒక క్లస్టర్‌కు రూ. 546 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు Time: 03:26PM ►ఇండస్ట్రీస్, స్కిల్‌ను కనెక్ట్ చేస్తున్నాం: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►ఇప్పటి వరకు 72.5 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించాం. ►స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు. ►రూ. 3,356 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి మోసం చేశారు. Time: 03:10PM చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ. ►సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే ఆయన మనుషులు అని అర్థం: కన్నబాబు ►చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన్ ఒప్పందం అదే. ► రాష్ట్రంలో మొదలై విదేశాలకు పాకిన కుంభకోణం ► దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు ► హవాలా మార్గంలో మళ్లీ దేశంలోకి సొమ్ముల మళ్లింపు ► చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్ స్కామ్ ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు ► తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెట్టిన బాబు. ► సీమెన్స్ ముసుగు తొడిగి అక్కడ ఉద్యోగితో లోపాయికారీ ఒప్పందం ► కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటంఎగా కేబినెట్ ఆమోదం. ►సీమెన్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. ►10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డబ్బులు విడుదల చేశారు. ►ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్లేకుండానే గ్రీన్ సిగ్నల్ ► రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం. ► జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న బాబు సర్కార్. ► ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి జోవోల అంశాలు కనుమరుగు. ► ప్రభుత్వం ఇచ్చే దాన్ని ఆర్థిక సహాయంగా పేర్కొంటూ ఒప్పందం. ► జీవో అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ► ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. ► డబ్బు విడుదలకు ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలు. ► వాటిని కొట్టేసి.. తానే స్వయంగా విడుదల చేసిన చంద్రబాబు. ► తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్. ► జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి వచ్చిన స్కామ్. ► ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. Time: 02:30PM ►శాసన సభకు ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయి: స్పీకర్ తమ్మినేని ►ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలు అడ్డుకోవడం, స్పీకర్‌ను దూషించడం, అనైతికంగా వ్యవహరిస్తే వరుసగా 5 సెక్షన్లపాటు సస్పెండ్ చేయొచ్చు. Time: 01:30PM ►పలు శాఖల అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో చర్చ. ►వివిధ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రులు Time: 12:50PM ►టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున ►చంద్రబాబు టీడీపీ సభ్యులను రెచ్చగొట్టి పంపిస్తున్నారు. ►బీసీ వ్యక్తి స్పీకర్‌గా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. ►ఎస్సీ సభ్యులను పురిగొల్పి స్పీకర్‌పై దాడి చేయిస్తున్నారు. ►రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. Time: 12:20PM ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►తాను గౌతమ బుద్దుడు కాదన్న స్పీకర్ ►సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయం. ►పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని రూలింగ్ ఇచ్చిన స్పీకర్. Time: 11:50AM ►టీడీపీ సీనియర్ సభ్యులే దాడులు చేయడం దురదృష్టకరం: స్పీకర్ తమ్మినేని ►నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా? ►బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? ►నా చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదు. Time: 11:20AM ►టీడీపీ సభ్యులకు సంస్కారం లేదు: మంత్రి విడదల రజని ►సభలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చేశారు. ►చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారు. ►టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే జీవో నెం.1 ►స్పీకర్‌పై టీడీపీ సభ్యులు భౌతికంగా దాడి చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్. ►టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై కూడా దాడి చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ►సభలో గొడవలు సృష్టించాలనేదే టీడీపీ కుట్ర. ►బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు. Time: 10:40AM ►చంద్రబాబుకు దాడులు చేయించడం అలవాటే: మంత్రి సీదిరి అప్పలరాజు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. ►సభలో కావాలనే టీడీపీ సభ్యులు దాడులు చేశారు ►స్పీకర్ అటెండర్‌ను పక్కకు నెట్టేశారు. ►టీడీపీ సభ్యుల దాడులను టీవీల్లో ప్రదర్శించాలి. ►సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరం: మంత్రి అంబటి. ►చంద్రబాబు సభకు రాకుండా దాడులు చేయిస్తున్నారు. ►టీడీపీ సభ్యులకు స్పీకర్ అంటే గౌరవం లేదు. ►టీడీపీ సభ్యులు నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే ఎలీజా. ►సభాపతిని టీడీపీ సభ్యులు అవమానించారు. ►టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలి. Time: 10:10AM ► ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ► ఒకరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ Time: 10:00AM ►స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ►వైఎస్సార్సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు. ►సుధాకర్ బాబుపై దూషణలకు దిగిన టీడీపీ సభ్యులు. ►వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నెట్టేసిన బుచ్చయ్య చౌదరి. ►బుచ్చయ్య చౌదరి నెట్టడంతో కిందపడబోయిన వెల్లంపల్లి. ►డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా దూషణలు. ►టీడీపీ ఎమ్మెల్యే డోలా నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ►చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. ►దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాలి. ►సభలో గొడవ చేయించింది చంద్రబాబే. ►టీడీపీ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించారు. Time: 9:35AM ►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల దౌర్జన్యం. ►స్పీకర్ పట్ల వద్ద టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన. ►పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరిన టీడీపీ సభ్యులు. ►స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని టీడీపీ సభ్యులు ►స్పీకర్ ముఖంపై ఫ్లకార్డు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోలా. ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం. ►సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్ అసంతృప్తి. Time: 9:20AM ► చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ►పట్టభద్రుల ఎన్నిక ప్రత్యేకమైన ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఎన్నిక.. ►చంద్రబాబు చేసుకున్నవి ఆఖరి విజయోత్సవాలు. ►2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు. ►అసెంబ్లీలో చంద్రబాబు శాశ్వతంగా అడుగుపెట్టే అవకాశం లేదు. ►ఏపీలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది. ►నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది. ►నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీలోపాటు బీమా పరిహారం కల్పిస్తాం. ►రైతులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ►ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి అంబటి రాంబాబు ►సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. ►ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు ►సభలో అచ్చెన్నాయుడు భాష సరిగా లేదు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►జీవో నెం1 అందరికీ వర్తిస్తుంది. సాక్షి, అమరావతి: ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం పలు శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించనుంది. 10 సవరణ బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. -
టీడీపీ స్కిల్ స్కాంపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే.. జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం. వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం. మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి. అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ. కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ. రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు. గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు. రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్‌కు ఎంవోయూ చేసుకున్నారు. డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి. జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు. సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు. 10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల. గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. సుమన్ బోస్కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు. నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు. చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు. -
‘స్మార్ట్ మీటర్లపై టీడీపీ, కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు గానూ 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 1)స్మార్ట్ మీటర్లు కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ కోసం మొత్తం రూ. 3,406.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, రక్షణ అనుబంధ పరికరాల కోసం 2286.22 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. 5692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్ లలో కేటాయించడం ద్వారా దీనిని ప్రభుత్వం భరిస్తోంది. 2) కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం లిమిట్ పెంచడానికి పెట్టిన కండీషన్ కోసం రైతులకు ఇచ్చే విద్యుత్ కు మీటర్లు పెట్టామని తెలుగుదేశం సభ్యులు ఆరోపించడం భావ్యం కాదు. రైతులందరికి మేలు చేసేలా వారు వినియోగించిన విద్యుత్ బిల్లులను డిబిటి ద్వారా డబ్బులు వారి ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం స్మార్ట్ మీటర్లు భిగించడం ద్వారా ఏ రైతు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాడనే లెక్కలు తేల్చడం కోసమే పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించాము. అక్కడ డిఆర్బిఎ మీటర్లు పెట్టాం. 1.9.2020, జిఓ నెం. 22 ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 18వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఉండటం వల్ల అందుబాటులో ఉన్న ఐఆర్‌డిఎ మీటర్లు, అనుబంధ సామగ్రితో ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశాం. 3) శ్రీకాకుళం జిల్లాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ కోసం వినియోగించిన విద్యుత్ 101.5 మిలియన్ యూనిట్లు ఉంటే మీటర్లు ఏర్పాటు వల్ల 67.76 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్లు తేలింది. అంటే ఏడాదికి 33.75 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పైలెట్ ప్రాజెక్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగిప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది. 4) ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉచిత వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. డొమెస్టిక్ మాటర్లు మాత్రమే పెట్టారు. ప్రతిచోటా మనకంటే రెట్టింపు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కోసం 2021లో 6480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవడం జరిగింది. అప్పటి రేట్ల ప్రకారం అధిక వ్యయం అవుతుండటంతో సదరు టెండర్లను రద్దు చేయడం జరిగింది. కరోనా పాండమిక్ తరువాత రేట్లు కొంత మేర తగ్గడంతో తిరిగి 2022లో అప్పటి రేట్ల ప్రకారం రూ.5692.35 కోట్లతో సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచాం.టెండర్ ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉంది. దీనిని ఎవరికో ఇచ్చేశామని, మాకు కావాల్సిన వారికి కట్టబెట్టామనే విధంగా మాట్లాడటం కూడా సరికాదు. 5) తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ ప్రభుత్వంకు రాసిన లేఖలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని పేర్కొన్నట్లుగా సభలో మాట్లాడారు. అది వాస్తవం కాదు. మీటర్ల ఏర్పాటుపై అన్ని రకాల మీటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో రాశారు. దీనిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరం. 6) చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఎం మాట్లాడారో అందరికీ తెలుసు. ఉచిత విద్యుత్ ఇచ్చే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆయన మాట్లాడలేదా? వ్యవసాయం దండగ అని అనలేదా? ఈ ప్రభుత్వం రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయం కోసం ఉచితంగా అందిస్తోంది. తెలుగుదేశం హయాంలో అర్థరాత్రి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎంత మంది రైతులు చీకట్లో పాము కాటుకు గురయ్యారు, ఎంత మంది విద్యుత్ షాక్ తో మృతి చెందారో తెలుగుదేశం సభ్యులు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు భిగించాలనే నిర్ణయం కోసం వాస్తవంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత వినియోగం అవుతుందో తెలుసుకునేందుకే. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే. ఇది కూడా కేంద్రప్రభుత్వం, సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నాం. దీనిపై టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిబిటి కోసం స్వచ్ఛందంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10,025 మంది రైతులు మినహా మిగిలిన రైతులంతా ఖాతాలను తెరిచారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలు 175 నియోజకవరాగల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడించారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీకి అంత నమ్ముకం ఉంటే లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదు?. మేము గెలిస్తే డబ్బులతో గెలిచామంటున్నారు. టీడీపీ గెలిస్తే ప్రజా తీర్పు అంట?. కానీ.. వైఎస్సార్సీసీ మాత్రం ప్రజా తీర్పుతో గెలిచింది. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. వైఎస్సార్సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు అంటూ కామెంట్స్ చేశారు.