Assembly meetings
-
డ్రైవర్ లేని కారులా ‘జీరో అవర్’
సాక్షి, అమరావతి: ‘జీరో అవర్.. డ్రైవర్‌లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్‌కు హితవు పలికారు. కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్ ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్ పోలీసులుగా కన్వర్షన్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి. – పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం తుంగభద్ర 33 గేట్లు మార్చాలి 75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి. – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి. – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం -
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్‌తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రేపు ఉభయసభల్లో వార్షిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. 25న శాసనసభ, శాసనమండలిలో 2024.25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్లో జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్, రామచంద్రునాయక్ హాజరయ్యారు. విపక్షం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీలో తాము చర్చించదలిచిన అంశాల జాబితాను అందజేశాయి. పక్షంరోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్, కనీసం 18 రోజులు సమావేశాలు జరగాలని బీజేపీ కోరాయి. అయితే గతంలో బడ్జెట్ జరిగిన సమావేశాల తీరుతెన్నులను వివరిస్తూ ఈ నెల 31 వరకు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా, ఈ నెల 31 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోజూవారీ ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ కోరాయి. అయితే ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ప్రభుత్వ పక్షం ప్రకటించింది. మొదట తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం బీఏసీలో నిర్ణయించిన మేరకు బుధవారం ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించి కేంద్రానికి తీర్మానం పంపుతారు. అనంతరం రుణమాపీ అంశంపైనా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాల బస్సుల ఫిట్నెస్, గ్రామపంచాయతీలుగా తండాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి డి.శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26న అసెంబ్లీకి విరామం ప్రకటించి.. తిరిగి 27న బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. 28న సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. కాగా శాసనమండలిలోనూ మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం జరిగింది. -
ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అత్యంత చిన్న వయసులోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడం... ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం నేపథ్యంలో అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2024–25 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్ సూచించగా...సీఎం రేవంత్‌రెడ్డి లాస్య నందిత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన సాయన్న తనకు అత్యంత సన్నిహితుడన్నారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఆయన మరణించగా... ఆయన వారసురాలిగా లాస్య కంటోన్మెంట్ నుంచి గెలుపొందారని, గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని చెప్పారు. సాయన్న, లాస్య నందిత ఇద్దరూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి, కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు. లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్ లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న అజాతశత్రువన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సాయన్న మంచి మిత్రులని, వారిద్దరూ కలిసి వచ్చి లాస్య నందితకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరగా, వెంటనే ఆమెకు టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో విజయపథంలో ముందుగా సాగిన లాస్య నందితను విధి వెంటాడిందన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశ అనంతరం ఒక ప్రమాదం ముంచుకొచి్చందని, అక్కడ్నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె... కొన్నాళ్లకు ఇంట్లో లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారని, రెండింటి నుంచి బయటపడినా, ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయిందని చెప్పారు. » రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ లాస్య నందిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. » రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే వారి ఇంటిని చేరుకున్నానని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. » బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు»ఎమ్మెల్యేలు బలాల, కూనంనేని సాంబశివరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సునీతాలక్ష్మారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఠా గోపాల్, శ్రీగణేశ్, పాయల్ శంకర్, కేపీ.వివేకానంద, రాజశేఖర్‌రెడ్డి తదితరులు లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. » లాస్య మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలిరోజు మంగళవారం ఉదయం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులరి్పంచనుంది. అనంతరం సభను 24వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తారు. తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేయనున్నారు. 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం అనంతరం, ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో స్కిల్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 25న మంత్రివర్గ భేటీ: అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకు రెండు విడతలుగత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగింది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. -
23 నుంచి అసెంబ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు మరుసటి రోజు 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సభ.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మరణంపై సంతాపం ప్రకటించిన తర్వాత వాయిదా పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ బిజినెస్‌ను చేపట్టే అవకాశం ఉంది. అలాగే 25న ఉభయ సభల్లో రాష్ట్ర వార్షిక (2024–25) బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 26న అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ చేపడతారు. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో సభకు మరోసారి విరామం ప్రకటించి తిరిగి ఈ నెల 30 నుంచి సమావేశాలు కొనసాగించే అవకాశముంది. అయితే సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తారు. గత ఏడాది డిసెంబర్లో తొలిసారిరాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా తొలి విడత అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు జరిగాయి. ఇక రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తదితర అంశాలు చోటుచేసున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అనర్హత కోసం బీఆర్ఎస్ పట్టు!పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మూడో శాసనసభ ఇప్పటివరకు రెండు విడతల్లో సమావేశం కాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భేటీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశముంది. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈసారి సమావేశాల సందర్భంగా అధికార పార్టీతో జట్టు కట్టడం ఆసక్తికరంగా మారనుంది. -
22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, విజయవాడ: ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. శ్వేత ప్రతాలపైనా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. -
జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించి, అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా మార్చి 31వ తేదీనాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. పదేళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయా లంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం జేఎన్టీయూలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ‘ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత’ అన్న అంశంపై సీఎం రేవంత్ ముఖాముఖి చర్చించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయా లని కొందరు అంటున్నారు. పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేనివారు దీక్షలు చేయడం వింత. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురూ ఏ పరీక్ష కూడా రాయడం లేదు. ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని. మరొ కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవీ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారు. గాందీలో దీక్ష చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి ఓ రాజకీయ నేత అండతో ఆందోళన చేశారు. గ్రూప్–1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయి. అందుకే నోటిఫికేషన్లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగుల కర్మాగారాలు కావొద్దు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. ప్రపంచంతోనే పోటీపడేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం లేకుండా, కేవలం ఇంజనీరింగ్ పట్టాలిస్తే వారికి ఉద్యోగాలు రావు. తాత్కాలిక ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం కంప్యూటర్ కోర్సులను కాలేజీలు కావాలనుకోవడం సరికాదు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను కనుమరుగు చేస్తే దేశానికే ప్రమాదం. ‘ఫీజు’ ఎప్పటికప్పుడు ఇస్తాం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీలు ఏమాత్రం దిగులు పడొద్దు. బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్గా ఇచ్చే యోచన చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచి్చన ఈ పథకాన్ని మరింత విజయవంతంగా నడిపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఏ ఏడాదికా ఏడాదిలో ఇచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాం. సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్లుగా రాష్ట్రం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. లోపాలను గుర్తించాలి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్య ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ చేసే స్వేచ్ఛనిస్తున్నాం. విద్యలో ఉన్న లోపాలను గుర్తించి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాం. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు చేయూతనిస్తాం. ఫార్మా రంగంలో పరిశోధనను ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహించబట్టే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రమైంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ ప్రతి పది మందిలో ఒకరు తెలుగు వాళ్లే ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఎంతో మంది సీఈవోలు ఉండబోతున్నారు. ఐటీఐల సిలబస్‌లో మార్పు దశాబ్దాల నాటి సిలబస్‌తో నడుస్తున్న ఐటీఐలకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ తోడ్పాటుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ఊహించని విధంగా అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలున్నా.. తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగం కనిపిస్తోంది. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్కిల్ పెంపుతోనే ఇది సాధ్యం.ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో లీడ్ పార్టనర్‌గా తెలంగాణ ఉండాలన్నది మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీలకు సామాజిక కోణం అవసరం: శ్రీధర్‌బాబు ప్రైవేటు కాలేజీలు సామాజిక కోణంలో విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి దిశగా కొత్త కోర్సులను రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నామని.. తర్వాత 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. 2030 నాటికి ఐటీలో బెంగళూరును అధిగమించడమే తమ లక్ష్యమని చెప్పారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 22వ తేదీ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు సమాచారం. అయితే మంత్రులందరూ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు ప్రచారం నడుస్తోంది. 24వ తేదీ నుంచి ఐదురోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ లీగల్ సెల్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు గత ఐదేళ్లలో టీడీపీ లీగల్ విభాగం అనేక పోరాటాలు చేసిందని, లాయర్లు చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, ఈ క్రమంలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానం ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు. టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు. -
రేవంత్ X అక్బర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్దకు అక్బరుద్దీన్ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి భారీగా పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో జెన్కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్ (తీగ), ట్రాన్స్పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు. దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్‌ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి జోక్యం... అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మా ముస్లిం నేతలను ఓడించారు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ కలసి పనిచేశాయి. నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలసి మజ్లిస్ పనిచేసింది. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బకాయిలు రాబడతారా? ‘విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్ 50.29 శాతం, హైదరాబాద్ సౌత్ 43 శాతంతో టాప్‌లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ బాధ్యత తీసుకొని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా?’అని రేవంత్ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్ చెప్పడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సాఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్‌కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్ నిజమైన జెంటిల్మాన్... గొప్ప నాయకుడు. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. సీఎంకు చాలెంజ్.. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్ ఆరోపించారు. మేము నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేయలేదు. షబ్బీర్ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్‌దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్‌కు చాలెంజ్’అంటూ కామెంట్స్ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్‌లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు. ఇదీ చదవండి: నేడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్ -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాంగ్రెస్ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్‌పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates: ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు రైతన్నల పక్షపాత బడ్జెట్ గ్రామ స్వరాజ్య బడ్జెట్ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్స్టాల్మెంట్లు, వైఎస్సార్ మత్యకార భరోసా జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత అక్టోబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన నవంబర్‌లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత డిసెంబర్లో జగనన్న చేదోడు జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ జనవరిలో వైఎస్సార్ ఆసరా జనవరిలో జగనన్న తోడు రెండో విడత జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000) ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు సీఎం జగన్ ప్రసంగం మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి నవంబర్, 2019లో మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు చేసింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌తో కలిసి డీల్ చర్చించారు బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్ మనోజ్ దుబాయిలో సీబీఎన్‌కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం ►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది ►కోట్లలో అవినీతి జరిగింది ►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది ►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది ►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు ►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది ►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి ►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు ►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది ►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు ►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు ►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి ►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి ►స్కిల్ స్కామ్‌లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు ►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు ►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత 03:17PM అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం ►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం ►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు ►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం ►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది ►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది ►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం ►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు ►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు ►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు ►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు Time: 03:10 PM ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం ► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున ►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున ►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం Time: 02:00 PM ►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున ►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్మెంట్ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం ►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు ►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు ►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం ►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం ►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం Time: 10:31 AM ►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం Time: 9:50 AM ►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం. ►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం ►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్. ►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు. ►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి. Time: 9:30 AM ►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు. ►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. -
ఆరు పద్దులకు ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. గురువారం సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు, ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56 లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా జోన్లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్‌లో పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ డెయిరీలు రేట్లు పెంచాల్సి వచి్చందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు గురువారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు ♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023 -
నేను రాను.. మీరు వెళ్లండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణాన్ని చూపించి చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మీడియా సమావేశం పెట్టి బోరున విలపించి అందరిలోనూ నవ్వుల పాలయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పి నానా హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చేతులెత్తేయడం, ఏడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దీంతో తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో శపథం చేసిన కారణంగా వెళ్లకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు. ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి నిరసనలు తెలపాలని సూచిస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగం వరకైనా ఉండాలని, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉండి తర్వాత నిరసన తెలిపి వచ్చినా బాగుంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాను వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని బాబు భావిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులతో జూమ్‌లో మాట్లాడిన చంద్రబాబు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. విద్యార్థులతో రెండో రోజూ శనివారం ఆయన జూమ్ కాల్లో మాట్లాడారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్, పోలండ్, హంగేరీలలో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు)ని చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు అవసరమైన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఆ ఖర్చును టీడీపీ నుంచి తిరిగి చెల్లిస్తామని తెలిపారు. పరిస్థితి క్లిష్టంగానే ఉందని, ఎవరూ వారి ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలను పాటించాలని చెప్పారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
అసెంబ్లీ సమావేశాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండు ఆర్డినెన్సులు.. తెలంగాణ హౌజింగ్ బోర్డు ఆర్డినెన్స్ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ 2021ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్‌రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. తొమ్మిది మందికి నివాళి ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది. శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కొత్త సభ్యులతో మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహ్మాన్, ఆర్.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు.