beggar
-
మిలియనీర్లకు మించి అదిరిపోయే విందు : సోషల్‌మీడియాలో సందడే సందడి!
ప్రతిరోజూ ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా, మరికొన్నిఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఒక బిచ్చగాడి కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ భారీ విందు ఇవ్వడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది. స్టోరీ ఏంటంటే..దేవాలయాల వద్ద, వివిధ కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే విన్నాం. చేసే వృత్తి భిక్షాటన అయినా, ఖరీదైన ఆస్తులు, ఇల్లు కలిగి ఉండటం తెలుసు. కానీ స్వయంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక కుటుంబం దాదాపు 20 వేలమందికి పసందైన విందు ఇవ్వడం లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అది కూడా ఇంట్లోని పెద్దావిడ చనిపోయి, 40వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంBeggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 202420వేల మంది అతిథులు, 2 వేల వాహనాలు గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను వేదిక వద్దకు తరలించడానికి సుమారు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కోసం, సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు పలు మాంసాహార వంటకాలను వడ్డించారు. ఇందుకోసం 250 మేకలను వినియోగించినట్టు సమచారం. వీటితోపాటు మటర్ గంజ్ (స్వీట్ రైస్), అనేక తీపి వంటకాలతో అతిథుల నోరు తీపి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు, అటు సానుకూలంగా,ఇటూ ప్రతికూలంగానూ కామెంట్స్ చేశారు. -
ఇక నుంచి అప్పులు వీళ్లనే అడుగుదాం సార్!
-
బిచ్చగాడి ఇంట్లో ఫంక్షన్..
-
ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్ దిలీప్‌కుమార్ రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ? -
లిప్‌లాక్ సీనా..? హీరోయిన్ ఎవరైనా సరే ఓకే చెప్తా: హీరో
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన చాలామంది నటీనటులు ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో నటుడు కవిన్ ఒకరు. లిఫ్ట్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత డాడా చిత్రంతో మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా స్టార్ చిత్రం ఈయనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తాజాగా కవిన్ కథానాయకుడిగా నటించిన బ్లడీ బెగ్గర్ చిత్రం దీపావళి సందర్భంగా గత నెల 31వ తేదీన విడుదలై ప్రదర్శింపబడుతోంది. నవంబర్ 7న తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక భేటీలో ఏ హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు అలాంటి కోరిక ఏమీ లేదని బదులిచ్చారు. అయితే కథకు అవసరమైతే ఏ నటితోనైనా లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి సిద్ధమే అని పేర్కొన్నారు. ఇలా ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం కవిన్ ప్రస్తుతం మాస్క్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత నయనతార జంటగా ఒక చిత్రం చేయనున్నారు. దీనికి కిస్ అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్న వైవిధ్య భరిత కథా చిత్రం అని సమాచారం. దీంతో ఈ చిత్రంలో నయనతార, కవిన్‌ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. -
డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు
హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు బెడద ఎక్కువే. లేదు అంటే వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం ఇచ్చేంత వరకు ఇబ్బంది పెడుతుంటారు. కొన్నిసార్లు పెన్నులు, బుక్స్ అమ్ముతాం అని చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అలాంటి ఓ బెగ్గర్ వల్ల టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంది.తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ కాస్తంత బిజీగా ఉన్న నివేదా.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. తాజాగా అడయార్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు డబ్బులు అడిగాడని, ఇవ్వనని చెప్పేసరికి ఓ పుస్తకం చూపించి రూ.100 అడిగాడని.. సరే కదా అని 100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడని నివేదా చెప్పింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)దీంతో పుస్తకం ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నానని.. అయితే ఆ బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి తన దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడని నివేదా పేతురాజ్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది.మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేసింది. తమిళంలో దాదాపు ఇన్నే చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్) -
బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్‌లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు. -
తొలి డిజిటల్ బెగ్గర్ కన్నుమూత!
రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్ కోడ్లతో కూడిన ట్యాగ్లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!! -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
కాలితో తన్నిన ఆఫీసర్.. యాచకుడి దుర్మరణం
సాక్షి, ఆర్మూర్: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారులో ఆర్మూర్ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్ లేవని బదులిచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ వెల్లడించారు. బిక్షం అడిగితే కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు. శివరాం డబ్బుల… pic.twitter.com/NQIi59uLYb — Telugu Scribe (@TeluguScribe) February 24, 2024 Video Credits: Telugu Scribe -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్‌లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్‌లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా) -
కోటీశ్వరుడైన ముంబై బిచ్చగాడు.. మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?
హైదరాబాద్: సాధారణంగా చేయి చాచడానికే చాలా అవమానకరంగా భావిస్తూ ఉంటాం అలాంటిది భిక్షాటనను ప్రొఫెషన్ గా ఎంచుకుని అందులో కోటానుకోట్లు ఆర్జిస్తున్నాడు ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్. ఎటువంటి టాక్స్ మినహాయింపు లేకుండా నెలకు సుమారు రూ.7 కోట్లు సంపాదించే ప్రొఫెషనల్ బిచ్చగాడైన భరత్ జైన్ ఇటీవల రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశాడు. దీంతో అనుమానమొచ్చిన ఐటీ శాఖ ఆయన ఇంటిపై సోదాలు జరపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కథనాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా కాళ్ళు చేతులూ చక్కగా ఉన్నవారు కూడా భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా బయట రాష్ట్రాలకు చెందినవారని అందరికీ తెలిసిందే. వీరి వెనుక ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఉండి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమీషనర్ సీవీ ఆనంద్ గతంలో సంచలనం సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్ కథనాన్ని గుర్తుచేశారు. భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను మించిన ముష్టియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, నలుగురు భార్యలతో కలిసి ఆయన నివాసముండటానికి లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు. ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగ లాగితే డొంకంతా కదిలింది. భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భరత్ జైన్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చినవాడు కాదు. ఐఐఎం కోల్‌కతాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే ఆతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళ ఆర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళుతుందట. ఇది కూడా చదవండి: బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్ -
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం
యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..) -
శభాష్ పూల్పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం!
వేలూరు(చెన్నై): భిక్షాటన చేయగా.. వచ్చిన సొమ్మును సీఎం సహాయనిధికి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యాచకుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చా డు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్‌కు అందజేశారు. అనంతరం పూల్ పాండి మాట్లాడుతూ.. తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని, వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు. చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. ‘పిచ్చి ప్రేమ’తో బిచ్చగాడిలా..
ప్రేమ.. కొందరి జీవితాల్లో ఇది మధుర జ్ఞాపకం.. మరికొందరకి ఇది మరణశాసనం. అవును.. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటూ.. మింగేసే అనకొండలూ ఉంటాయి.. ముఖ్యంగా వలపు వలలో చిక్కి.. బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో..ఈ లోకంలో! మనసిచ్చిన మగువ చీత్కరిస్తే.. వలచిన వనిత నిర్ధయగా వదిలేస్తే.. ఆ బతుకు నిత్యనరకం.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ.. స్వచ్ఛమైన ప్రేమకోసం పిచ్చివాడిగా మారిన ఓ యువకుడి దీనగాథకు మూడేళ్ల కాలం సాక్ష్యంగా.. నిలిచింది.. ఈ కన్నీటి వ్యథను మీరూ చదవండి..! సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడు ఉన్నత విద్యావంతుడు. ఎంతో కొంత అందగాడు కూడా.. పీజీ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు సార్లూ విఫలం కావడంతో.. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతితప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. సమీప బంధువు కంట బడడంతో మూడేళ్ల దుర్భర జీవితం నుంచి బయటపడి తోబుట్టువుల చెంతకు చేరుకున్నాడు. వివరాలు.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో 35 ఏళ్ల యువకుడు ఒకరు మతితప్పిన స్థితిలో మూడేళ్లుగా సంచరిస్తున్నాడు. కన్యాకుమారి రైల్వేస్టేషన్ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా, బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలుకరించాడు. మాట కలిసి.. మలుపు తిరిగి ఆ యువకుడు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్‌తో మాట కలిపాడు. అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారౖణెంది. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకెళ్లగా వారు ఆ యువకుడికి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండుకొట్టించారు. తరువాత స్నానం చేయించి కొత్త గుడ్డలు తొడిగి తెన్నమలైలోని అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి అతడు తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35)గా గుర్తించారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ 2018 నవంబర్ 13వ తేదీన తాను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి జాడకానరాలే దు. ఈ నేపథ్యంలోనే మురుగన్ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా,వారు తగిన ఆధారాలు చూపి న తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. రెండుసార్లు ప్రేమ విఫలం కావడంతోనే.. ఈ సందర్భంగా ముత్తు సోదరుడు అయ్యనార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యారి్థనిని, ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు, అయితే ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్ వల్ల మూడేళ్ల తరువాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశా డు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీ సులు ఎంతో మానవత్వంతో తన సోదరుడిని క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. -
భిక్షాటన చేసే రామకృష్ణ అనే సాధువు గుండె పోటుతో మృతి
-
కాకినాడ: యాచకుడి మృతి.. సంచుల నిండా కరెన్సీ నోట్లు
సాక్షి, కాకినాడ రూరల్: కాకినాడలో ఓ యాచకుడు హఠాన్మరణం చెందాడు. విషయం తెలిసి వెళ్లిన పోలీసులకు మైండ్‌బ్లాక్ అయ్యింది. అతను ఉంటున్న గదిలో నోట్ల సంచులు బయటపడ్డాయి. కరప మండలం వేళంగిలో ఈ ఘటన జరిగింది. బిక్షాటన చేసే సాధువు రామకృష్ణ గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి ఉంటున్న గదిలో రెండు సంచులు కనిపించాయి. వాటి నిండా నోట్ల కట్టలు.. చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధిజారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు గ్రామస్ధులు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల దాకా బయటపడింది. రామకృష్ణ ఐదేళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. జనాలకు రక్షరేకులు కడుతూ.. భిక్షాటన చేసుకుంటూ వచ్చాడు. స్థానిక చేపల మార్కెట్ సమీపంలో ఓ గదిలో ఉంటూ.. సమీపంలో సత్రంలో తింటూ ఉండేవాడు. గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. తనికీ చేపట్టగా నోట్ల సంచులు బయటపడ్డాయి. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్
ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్ కొనాలని నిశ్చయించకున్నాడు. అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx — Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022 (చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్ వాల్ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్) -
బోయకొండ బతికొచ్చాడు.. మరి ఆ శవమెవరిది ?
భిక్షాటనకు వెళ్లిన కొడుకు ఏదో జరిగి చనిపోయాడనుకుని గుక్క పట్టి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు.. యాచక వృత్తి చేసుకునే తమ వద్ద అంత్యక్రియలు జరపడానికి కూడా స్థోమత లేదనడంతో మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శవాన్ని పూడ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన ఆ పోలీసులను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇంతవరకు ఓకే.. సీన్ కట్ చేస్తే.. చనిపోయాడనుకున్న వ్యక్తి నేను బతికే ఉన్నా అని ప్రత్యక్షమయ్యాడు. దీంతో కంగారు పడడం పోలీసుల వంతు అయింది. మరి చనిపోయిందెవరా ! అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ మ్యాటర్‌ఏంటంటే.. పలమనేరు పట్టణంలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల సమక్షంలో ఈనెల 7న అంత్యక్రియలు నిర్వహించిన పోలీసుల సాక్షిగా మృతి చెందిన వ్యక్తి తాను బతికే ఉన్నానంటూ ఇంటికి చేరిన సంఘటన ఆదివారం పలమనేరులో సంచలనం సృష్టించింది. 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలో ఫిట్స్‌తో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పది రోజులుగా చికిత్స పొందుతూ ఈనెల 7న ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనాథ శవం కావడంతో వారు మున్సిపల్ అధికారుల ద్వారా అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మృతదేహాన్ని గమనించిన కొందరు గంగవరం మండలం చిన్నూరుకు చెందిన బోయకొండగా గుర్తుపట్టారు. దీంతో పోలీసులు చిన్నూరులోని బోయకొండ తల్లిదండ్రులు వెంకటరమణ, ఎల్లమ్మకు సమాచారం ఇచ్చి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వారు తమబిడ్డేనని యాచనకు ఎక్కడో వెళ్లి చనిపోయాడని అనుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లమంటే భిక్షాటన చేసుకునే తమకు అంత్యక్రియలు చేసేందుకు స్థోమత లేదని వాపోయారు. దీంతో పోలీసులు, స్థానిక లారీవర్కర్ యూనియన్‌తో కలసి పట్టణ సమీపంలోని వడ్డోనికుంట శ్మశానవాటికలో ఈనెల 8న అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసుల సేవలపై ‘మానవత్వం చాటుకున్న పోలీసులంటూ’ జనం మెచ్చుకున్నారు. బతికే ఉన్నానంటూ వచ్చిన బోయకొండ ఇలా ఉండగా భిక్షాటనకు వెళ్లిన వెంకటరమణ కుమారుడు బోయకొండ ఆదివారం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. తాను బయటకు వెళ్లానని కుటుంబీకులకు తెలపడంతో చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడంటూ సంబరపడ్డారు. మృతిచెందిన వ్యక్తి మొహం కూడా తమ కొడుకులాగే ఉండడంతో తమ బిడ్డేననుకున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఆ శవమెవరిది ? బోయకొండ బతికే ఉండడంతో తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలిస్తే గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు అయింది. వెంకటరమణ మాట నమ్మి మృతుడెవడో తెలుసుకోకుండానే తొందర పడ్డామేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఇలాఉండగా కొందరు ఆదివారం సైతం మానవత్వం చూపిన పోలీసులను సన్మానించడం కొసమెరుపు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్ఎంఓ శారదను వివరణ కోరగా తాము గుర్తుతెలియని వ్యక్తి గనుకే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా బోయకొండ బతికున్నప్పుడు మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలియడం లేదన్నారు. దీనిపై విచారిస్తామన్నారు. -
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సాధారణంగా ఏ ఆధారం లేని వాళ్లు, పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు బిక్షాటన చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో అన్నీ బాగున్నా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్ధేశంతో కూడా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గతంలో దర్జాగా బతికిన కొంతమంది అనుకోని కారణాల వల్ల ఒంటరి వారుగా మారి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసే పరిస్థితి వస్తుంటుంది. ఇలా ఇతరులను వేడుకుంటూ యాచించే వారి గత అనుభవాలు తెలిస్తే ఎంతో భాదేస్తుంది. తాజాగా ఓ యాచకురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటం విని స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆమె గురించి తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది! వివరాల్లోకి వెళితే.. యూపీలోని వారణాసికి చెందిన స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ భారత్క చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకోడంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుంది. గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అంత బాగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు. -
బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది!
Karnataka Beggar Death: అంతిమ సంస్కారం.. ఇది జీవితంలో చివరి ఘట్టం. ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉంది.. మధ్యలో ఎలా బ్రతికాం అన్నది కాదు.. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక, బీదా అనే తేడా ఉండదు. ధనం ఉన్నవారికి కాస్త గ్రాండ్ అంతిమ వీడ్కోలు పలికితే, బీద వారు వారు స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటుకాని బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బందే తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫలానా బిచ్చగాడు చనిపోయాడంటే సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక యాచికుడ్ని ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. హుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివశిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలో ప్రతి ఒక్కరికి హుచ్చబస్య గురించి బాగా సుపరిచితుడు. అందర్ని పలకలరిస్తూ కేవలం రూపాయి మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్యకు రూపాయి ధర్మం చేయడం వలన మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు. ఇక ఆలయాల్లో లేదా స్కూళ్లలో తలదాచుకునేవాడు. అయితే, ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట హచ్చబస్య. ఆయన్ను అక్కడ అంతా అదృష్ట బస్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది.