birth day wishes
-
పోస్టల్ శాఖ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు
అవనిగడ్డ: సీఎం వైఎస్ జగన్‌కి రూ.10తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు పోస్టాఫీస్‌లో రూ.10 చెల్లిస్తే వారి అడ్రస్‌తో సందేశం చేరుతుంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్‌ల నుంచి వచ్చే సందేశాలను మంగళగిరి ప్రధాన పోస్టాఫీస్ ద్వారా ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 లోపు ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చి రూ.10 చెల్లించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపవచ్చని కృష్ణా జిల్లా అవనిగడ్డ పోస్టుమాస్టర్ సింహాద్రి రామలింగేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక హెడ్‌పోస్టాఫీస్ ద్వారా సీఎంకు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపించారు. -
సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌కు సోనియా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సవాయ్ మాధాపుర్కు చేరుకున్నారు. షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్ మాధాపూర్‌కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్లో ఉంటారు. డిసెంబర్ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు. ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం -
ప్రధాని మోదీ బర్త్‌డే.. విషెస్ చెప్పాలనుకుంటున్నారా ఇలా చేయండి!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు తపాల శాఖ ‘బర్త్ డే పార్శిల్’ పేరుతో ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు పోస్టల్ శాఖ విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి లేదా పోస్ట్‌మేన్‌ను కలిసి రూ.50 చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశం అక్టోబర్ రెండో తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో సుకన్య సమృద్ధి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు హరిప్రసాద్ చెప్పారు. పదేళ్లలోపు బాలికలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచి ఈ పథకంలో డబ్బు పొదుపు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో పోస్టల్ అధికారులు శోంఠి రవికిషోర్, జి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
డైనమిక్ సీఎం యోగి జీ.. హ్యాపీ బర్త్ డే: మోదీ స్పెషల్ విషెస్
నేడు (ఆదివారం) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు (జూన్ 5) సీఎం యోగి.. తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పలువురు ప్రముఖులు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది. రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రజానుకూల పాలన అందిస్తున్నారు. ప్రజాసేవలో ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలి’’ అని మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందించారు. ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు, పలువురు కేంద్ర మంత్రులు సీఎం యోగి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్‌లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూపీలో నేరాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. Birthday greetings to UP’s dynamic Chief Minister @myogiadityanath Ji. Under his able leadership, the state has scaled new heights of progress. He has ensured pro-people governance to the people of the state. Praying for his long and healthy life in service of the people. — Narendra Modi (@narendramodi) June 5, 2022 -
కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ బర్త్‌డే విషెస్
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నితిన్ గడ్కరీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు అతనికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును అనుగ్రహించాలని కోరుకొంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. -
చంద్రబాబుకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు. Wish you a happy birthday @ncbn garu. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2022 -
కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్
ఎన్ని ప్రయోగాలు చేసినా తీరని కళాదాహం. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగాడు. అతి సామాన్యుడిలా ఒదిగాడు. అతనే భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు..కమల్ హాసన్. నవంబర్ 7 కమల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని చూద్దాం. ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించాడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్నాడు. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. కమల్ హాసన్ వెండితెరపై అస్సలు కనిపించడు. అంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఆయన్ని చూస్తే కొత్తదనాన్ని చూసినట్టు ఉంటుంది. 1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. 1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్‌ను మలుపుతిప్పింది. 1978లో ‘మరో చరిత్ర’తో కమల్ చరిత్రే మారిపోయింది. ఇందులో కమల్, సరితలు చేసిన నటనకు.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. 1983లో కమల్, శ్రీదేవి జంటగా బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘మూన్రాంపిరై ’బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని దాన్ని ‘వసంత కోకిల’గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం హిందీలో ‘సద్మా’గా రీమేక్ అయింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎంపికయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘నాయకుడు’ మూవీలో నటనకుగాను రెండోసారి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాతో మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఆర్ట్ సినిమాలోని నాచురాలిటీ.. కమర్షియల్ సినిమాలోని సేలబులిటీ..రెండిటినీ మిక్స్ చేసి సరిహద్దు రేఖల్ని చెరిపేశాడు. సినిమా అంటే ఓ కళారూపం అన్న సత్యాన్ని తెలియజెప్పాడు. ప్రాంతాలు, భాషలు అనే అడ్డుగోడల్ని కూల్చేశాడు. సినిమా చుట్టూ అల్లిన లిల్లీపుట్ ఫార్మెట్ ను బద్ధలుకొట్టి..నిజమైన నాయకుడిగా నిలబడ్డాడు.. ఆ లోకనాయకుడు. నాయకుడుగా నటించినా.. బ్రహ్మచారిగా కనిపించినా.. తెనాలిగా మెప్పించినా.. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నా.. అది కమల్‌కే చెల్లింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్. అన్నీ అద్భుతాలే సాధిస్తే ఏమవుతుంది? అవార్డులు..రివార్డులూ వద్దన్నా చెంతకు చేరతాయి. అభినందనలు...ప్రశంసలూ వెతుక్కుంటూ వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త్వరలో ’విక్రమ్’తో పాటు ‘భారతీయుడు 2’ చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు. -
76వ వసంతంలోకి రాష్ట్రపతి: ప్రధాని మోదీ, సీఎంలు జగన్, కేసీఆర్ విషెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. చదవండి: నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని.. Birthday greetings to Rashtrapati Ji. Due to his humble personality, he has endeared himself to the entire nation. His focus on empowering the poor and marginalised sections of society is exemplary. May he lead a long and healthy life. @rashtrapatibhvn — Narendra Modi (@narendramodi) October 1, 2021 ఉప రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Warm greetings to Hon'ble President Shri Ram Nath Kovind Ji on his birthday. May the Almighty bless him with a long & healthy life in the service of our nation. @rashtrapatibhvn — YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2021 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఏపీ రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం పొందాలని.. దేశానికి ఇంకొన్నాళ్లు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. CM Sri KCR conveyed birthday greetings to Hon'ble President Sri Ram Nath Kovind Ji on behalf of Telangana Government and its people. "May God bless Sri Ram Nath Kovind Ji with good health and long life for serving the nation for many more years", CM wished.@Rashtrapatibhvn — Telangana CMO (@TelanganaCMO) October 1, 2021 -
తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారించాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్‌ను ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ)గా పేరుతో నిర్మించాడు. ఈ థియేటర్‌ను నిన్న ప్రారంభించాడు. ఆ థియేటర్లో తొలిసారి తన గురువు సినిమాను ప్రదర్శనకు ఉంచాడు. తనకు సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్ కమ్ములకు కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ సినిమాను ప్రదర్శించాడు. అయితే శుక్రవారం తన తల్లి మాధవి జన్మదినం సందర్భంగా ఆ టాకీస్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా థియేటర్ హాల్లో తల్లి మాధవి ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే మమ్ములు. ఈ ఏవీడీ (థియేటర్) నీకోసం. నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతా. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్ ప్రారంభానికి విజయ్ అందుబాటులో లేడు. Happy Birthday mummuluu ❤️ This one is for you! #AVD If you workout and stay healthy, I will work harder and give you more memories 😘🤗 pic.twitter.com/edGhLLnGn0 — Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2021 -
‘తగ్గేదే లే..’ అంటున్న ఫ్యాన్స్.. బయటకు వచ్చిన బన్నీ.. ఫోటో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 7). ఈ సందర్భంగా సినీ ప్రముకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గురువారం ఉదయం నుంచే హైదరాబాదులోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానుల బారులు తీరారు. భారి సంఖ్యలో అక్కడి చేరుకొని నినాదాలు చేయడంతో అల్లు అర్జున్ ఇంట్లో బయటకు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేశాడు. బర్త్‌డే సందర్భంగా పలువురు ఫ్యాన్స్ అందించిన మొక్కలను కానుకగా స్వీకరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. కాగా, బన్నీకి ఫ్యాన్స్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీగా ఎంత ఫాలోయింగ్ వచ్చినా సరే.. అభిమానుల విషయంలో బన్ని . సినిమా సెట్టయినా.. తన సొంత ఇల్లయినా.. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను పలకరించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ‘ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అని తరచు చెబుతుంటాడు అల్లు అర్జున్. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్.. బుధవారం విడుదల కాగా, యూట్యూబ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వ్యూస్‌ని సొంతం చేసుకుంది. చదవండి ఇప్పటికీ ఆ వంద నోటు అల్లు అర్జున్ దగ్గరే ఉంది! అయ్యయ్యో.. అల్లు అర్జున్ ఫోన్ పోయిందా! -
సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్సార్ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Birthday greetings to Andhra Pradesh CM Shri ysjagan Garu. I pray that Almighty blesses him with a healthy and long life. — Narendra Modi (narendramodi) December 21, 2020 ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. On the6 joyous occasion of Hon'ble Chief Minister of AndhraPradesh ysjagan's birthday, I would like to convey my warm felicitations to him and wish him many more happy returns of the day. — Edappadi K Palaniswami (CMOTamilNadu) December 21, 2020 Birthday greetings to the Chief Minister of Andhra Pradesh Shri ysjagan ji. May you be blessed with good health and long life. — Nitin Gadkari (nitin_gadkari) December 21, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ysjagan — Lok Sabha Speaker (loksabhaspeaker) December 21, 2020 ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.ysjagan HBDYSJagan — Vijayasai Reddy V (VSReddy_MP) December 21, 2020 జన్మదిన శుభాకాంక్షలు Warm birthday wishes to the young & dynamic Chief Minister of AndhraPradesh - Y. S. Jaganmohan Reddy. On this special day, I pray to Lord Venkateswara for your good health & long life.HBDYSJagan YSJaganBirthday ysjagan YSRCParty AndhraPradeshCM — Parimal Nathwani (mpparimal) December 21, 2020 "నేను విన్నాను.. నేను ఉన్నాను.." అని చెప్పి ప్రజల్లో భరోసా కల్పించడమే కాకుండా ఆ మాటను నిజం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.ysjagan HBDYSJagan HBDBestCMYSJagan — Buggana Rajendranath Reddy (IamBuggana) December 21, 2020 Wishing a happy birthday to Andhra Pradesh Chief Minister ysjagan from all the team UKinHyderabad — Dr Andrew Fleming (Andrew007Uk) December 21, 2020 Warm birthday greetings to Chief Minister of Andhra Pradesh Shri Y.S.Jaganmohan Reddy. My best wishes for a long and healthy life in the service of the people. ದೇವರ ಅನುಗ್ರಹ ಸದಾ ಇರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ. ysjagan — B.S. Yediyurappa (BSYBJP) December 21, 2020 Wishing a very happy birthday to Chief Minister of Andhra Pradesh Shri ysjagan Ji. Hope this year is filled with good luck, good health, and much happiness. — Dr. Ramesh Pokhriyal Nishank (DrRPNishank) December 21, 2020 పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి మనిషికీ ‘నేను ఉన్నాను’ అనే ధైర్యాన్ని ఇచ్చాడు. నవరత్నాలతో నమ్మకాన్ని నింపాడు. తన పాలనతో రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం ఆయన వైపు తొంగి చూసేలా చేశాడు. ‘దట్ ఈజ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి’ HAPPY BIRTHDAY జగన్ అన్న.HBDYSJagan ysjagan VSReddy_MP — MARGANI BHARAT RAM (BharatYSRCP) December 21, 2020 జనం కోసం పుట్టిన జననేత కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జగన్ అన్న HBDYSJagan — Biyyapu MadhuSudhan Reddy - MLA (BiyyapuMadhu) December 21, 2020 Hon’ble AP Governor Sri Biswa Bhusan Harichandan conveyed his warm wishes on birthday of AndhraPradeshCM Sri ysjagan Y S Jagan Mohan Reddy. The Governor wished that Lord Jagannath, Venkateswara & Maa Kanakadurga bless him with joy, prosperity & long life in service to people. — Governor of Andhra Pradesh (governorap) December 21, 2020 Wishing the honourable chief minister of Andhra Pradesh ysjagan many many happy returns of the day!!💐… May God bless you with the strength to lead AP to it’s glory!!! Thank you jagan Garu For the relief measures given to the Telugu film industry!! HBDYSJagan — Nagarjuna Akkineni (iamnagarjuna) December 21, 2020 -
సర్కారువారి పాటకి స్వాగతం
‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కీర్తీ సురేష్. దక్షిణాదిలో క్రేజీ ఆఫర్లతో దూసుకెళుతోన్న ఆమె పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా కీర్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్ కీర్తీ సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కారువారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని ట్వీట్ చేశారు మహేశ్‌బాబు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్ ప్రచార చిత్రం విడుదల నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘రంగ్ దే’లోని ఆమె ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. -
రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ, జాతికి మరింత కాలం సేవ చేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టపతి రామ్‌నాథ్ నేడు (గురువారం) 75వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!
న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ప్రధాని వాటికి బదులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు. ప్రధానికి ట్రంప్ బర్త్‌డే విషెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. గొప్పనేత, విశ్వాసపాత్రుడైన మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి’అని ట్విట్టర్లో ట్రంప్ ఆకాంక్షించారు. -
నాగార్జునకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: టాలీవుడ్ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ‘తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. (గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్) Wishing a very happy birthday to one of the most admired actors of Telugu cinema @iamnagarjuna. May God bless you with good health and more success in the years to come. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2020 -
ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్ డే ధనుష్’
తమిళ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లోను మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ధనుష్‌లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆయన నేడు (జూలై 28) 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ధనుష్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్‌డే విషెష్ తెలియజేశారు. దీంతో ‘అసురన్’, ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్’ హ్యాష్ ట్యాగ్లు ట్విటర్లో ట్రెండింగ్ అవుతున్నాయి. Happy birthday my bro @dhanushkraja ... to another fantastic year ahead 🤗😃 — Anirudh Ravichander (@anirudhofficial) July 28, 2020 ‘హ్యాపీ బర్త్‌డే మై బ్రో.. మరో అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెడున్నారు’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ట్విటర్లో ధనుష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ‘హ్యాపీబర్త్ డే ధనుష్, మీరు చాలా ప్రేమ, అదృష్టాన్ని పొందాలి’ అని హీరోయిన్ జెనిలియా ట్విటర్లో విష్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్, మరో అద్భుతమైన ఏడాదిలో అడుగుపెతున్నారు’ అని హీరోయిన్ కాజల్ బర్త్‌డే విషెష్ తెలియజేశారు. మలయాళ హీరో టోవినో థామస్ ధనుష్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసి బర్త్‌డే విషెష్ తెలియజేశారు. Happy Birthday brother!! ❤️ @dhanushkraja #HappyBirthdayDhanush pic.twitter.com/60EpzvQl4O — Tovino Thomas (@ttovino) July 28, 2020 వీరితో పాటు మెహ్రీన్ పిర్జాదా, ఐశ్వర్య రాజేష్, విష్ణు విశాల్, సంతోష్ నారాయన్ ట్విటర్లో ధనుష్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ధనుష్ ప్రస్తుతం తన నటించిన ‘జగామే తంతిరామ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ధనుష్ నటించే బాలీవుడ్ చిత్రం ‘అట్రాంగి రే’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. Happy birthday @dhanushkraja have a fab one 💕 — Kajal Aggarwal (@MsKajalAggarwal) July 28, 2020 -
ఎస్సెమ్మెస్‌కు స్పందించిన సీఎం.. బాలుడు సేఫ్..!
చేసిన సాయం ఊరకే పోదంటారు. అవును. ఆయన చేసిన సాయం ఊరకే పోలేదు. ఒక నిండు ప్రాణాన్ని బతికించింది. పసిమొగ్గగానే మట్టిలో కలిసిపోకుండా రక్షించింది. పొందిన మేలు మరువకుండా.. ఆత్మీయంగా అతన్ని పలుకరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆయన 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతియేడు మాదిరిగానే ఎంతోమంది ఖరీదైన కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. కానీ, అవన్నీ ఇవ్వని సంతృప్తి 101 రూపాయల మనీయార్డర్ ఒకటి ఇచ్చింది. అందులోని ప్రతి అక్షరం సీఎంతో పాటు అక్కడున్నవారందరి హృదయాలను తాకింది. ఓ పేదరాలు పంపిన ఎస్సెమ్మెస్‌పై సీఎం స్పందించిన తీరు ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టింది. ఫలితంగా మునుపెన్నడూ పొందని ఆత్మీయ శుభాకాంక్షలు ఫడ్నవీస్ సొంతమయ్యాయి. మరువలేని సాయం.. ఔరంగాబాద్ నియోజకవర్గంలోని కనాకోరి గ్రామానికి చెందిన వేదాంత్ భగవత్ (5)కు ప్రాణాంతక మూత్రాశయ క్యాన్సర్ సోకింది. కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే అతని తల్లిదండ్రులు అందినకాడల్లా అప్పులు చేసి పిల్లాన్ని రక్షించుకుందామనుకున్నారు. కానీ, వారి వద్దనున్న మొత్తం మందులకు కూడా సరిపోవడం లేదు. వేదాంత్‌ను కాపాడుకోవడానికి అతని మేనత్త రేణుకా సాహిల్ గొంధాలి కూడా అన్ని ప్రయత్నాలు చేసింది. వారి స్తోమతకు మించి అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేయూతనిచ్చే దిక్కే కరువయ్యారు. మరోవైపు వేదాంత్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. బాలున్ని రక్షించుకునేందుకు దార్లన్నీ మూసుకుపోయిన క్రమంలో రేణుక చివరి ప్రయత్నం చేద్దామనుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ దయనీయ పరిస్థితిని ఒక ఎస్సెమ్మెస్ ద్వారా విన్నవించింది. వేదాంత్ చికిత్సకోసం సాయమందించాలని అర్థించింది. ఆమె వినతిని ఆలకించిన సీఎం.. వేదాంత్ చికిత్స గురించి పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. వెంటనే చికిత్స కోసం రూ.1.90 లక్షలు మంజూరు చేశారు. ముంబైలోని ఎమ్మార్సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స అనంతరం పిల్లాడు పూర్తిగా కోలుకున్నాడు. తన అల్లుడి ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ నిజంగా దేవుడంటూ రేణుక రాసిన భావోద్వేగ లేఖలోని పంక్తులు.. ‘సీఎం సార్, మీరు నా ఎస్సెమ్మెస్ పట్ల స్పందించి ఓ చిన్నారి ప్రాణాలు కాపాడారు. వైద్యం అందక విలవిల్లాడుతున్న మా అన్నయ్య కొడుకు చికిత్సకు రూ.1.90 లక్షలు మంజూరు చేశారు. వాడి ప్రాణాలు నిలబెట్టారు. ఆయురారోగ్యాలతో మీరు కలకాలం వర్థిల్లాలి. జాతికి సేవ చేయాలి. వైద్యమందక ప్రాణాలు కోల్పోతున్న మరెంతో మంది బీద ప్రజలను ఆదుకోవాలి. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితుల్లో నా వంతుగా ఈ చిరు సాయం చేస్తున్నా’ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రేణుక రూ.101 విరాళం అందించి ఫడ్నవీస్‌కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. Renuka Gondhali sent me a text message as Vedant Pawar was in need of medical assistance & she got ₹1.90 lakh for his treatment from CMRF ! She remembered that & sent me a letter today & did an unforgettable gesture of donating ₹101 towards #CMReliefFund from her earnings ! pic.twitter.com/80232dI4HX — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 22, 2019 -
పుట్టిన రోజు శుభాకాంక్షలు.. జగన్ అన్న: ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. వైఎస్ జగన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ అన్న.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు కవితమ్మ అంటూ వైఎస్ జగన్ బదులిచ్చారు. Thank you for your warm wishes Kavithamma — YS Jagan Mohan Reddy (@ysjagan) December 21, 2018 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌లు వైఎస్ జగన్‌కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మమతా బెనర్జీకి ధన్యవాదాలు దీదీ(సోదరి) అంటూ వైఎస్ జగన్ రిప్లై ఇచ్చారు. Thank you for your wishes, Didi. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 21, 2018 -
హ్యాపీ బర్త్ డే పార్ట్నర్
చేసే ప్రతీ అల్లరి పనిలో ఇద్దరికీ వాటా ఉంటుందట. ఎప్పుడూ జట్టుగానే ఉంటారట ఎన్టీఆర్, ఆయన కుమారుడు అభయ్‌రామ్. ఆదివారం అభయ్‌రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘నాతో పాటు అల్లరి పనులు చేసే నా పార్ట్నర్ బర్త్‌డే ఇవాళ’ అంటూ తన కుమారుడితో దిగిన ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. ‘పార్ట్నర్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈరోజుతో వీడికి నాలుగు సంవత్సరాలు నిండుతాయి. అభయ్కు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. -
బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన క్రిష్
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్‌కు మధ్య మంచి స్నేహ బంధం నెలకొన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను అతి తక్కువ రోజుల్లో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. తన పనితనంపై ఉన్న నమ్మకంతో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ సినిమా బాధ్యతను అప్పగించారు. రేపు (జూన్10) బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘ఎన్టీఆర్’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్రిష్ బాలకృష్ణకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు", ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు", శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayNBK | #NTR | pic.twitter.com/oLbk9FLQWr — Krish Jagarlamudi (@DirKrish) June 9, 2018 -
‘నా రియల్ హీరో.. నా మెంటర్’
నేడు సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా సుధీర్ బాబు సమ్మోహనం ట్రైలర్‌ను కృష్ణ చేతుల మీదుగా రిలీజ్చేయించారు. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఉదయాన్నే విషెస్ తెలిపి, తండ్రితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. కొద్ది క్షణాల క్రితమే మహేష్ తన తండ్రికి బర్త్డ్ విషెస్ చెబుతూ... ‘ నా రియల్ హీరో.. నా మెంటర్.. నా ఆలోచన... నా బలం.. ప్రతీది నువ్వే. నీ కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది. హ్యాపి బర్త్‌డే నాన్న. ఎప్పటికీ ఎవర్గ్రీన్ సుపర్‌స్టార్ మీరే’ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ గడ్డం, మీసంతో కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నారు. My real hero.. my mentor.. my idol.. my pillar of strength.. my everything. Proud to be your son. Happy birthday Nana 🤗🤗- the forever evergreen superstar. 😊#HBDSuperStarKrishna ❤ pic.twitter.com/Ea7YKSHzx2 — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2018 -
జవాబు ఎక్కడ?
సెలబ్రిటీల బర్త్ డేలకు కొన్ని వందల విషెస్ అందుతుంటాయి. అన్ని శుభాకాంక్షలకు సమాధానం చెప్పాలంటే కొంచెం కష్టమే. మే 1న అనుష్కా శర్మ బర్త్ డే. అనుష్క ఫోన్ ఆమె ఫ్యాన్స్ విషెశ్తో నిండిపోయినట్టుంది. అవన్నీ చూసుకునే తీరిక ఆమెకు ఉండి ఉండకపోవచ్చు. అందుకేనేమో అమితాబ్ విషెశ్కు రిప్లయ్ ఇవ్వలేకపోయి ఉంటారు. అమితాబ్ బచ్చన్ ఊరుకుంటారా? ట్వీటర్లో తమాషాగా ‘‘అనుష్కా.. నేను అమితాబ్ బచ్చన్‌ను. నీ బర్త్‌డేకు ఎస్ఎమ్ఎస్ ద్వారా శుభాకాంక్షలు పంపాను. రెస్పాన్స్ రాలేదు. విషయం కనుక్కుంటే నువ్వు నంబర్ మార్చేశావన్నారు. మళ్లీ విషెస్ చెబుతున్నాను. హ్యాపీ బర్త్ డే. మంగళవారం జరిగిన ఐపీయల్ మ్యాచ్‌లో చాలా అందంగా కనిపించావు’’ అని ట్వీట్ చేశారు అమితాబ్. ‘‘థ్యాంక్యూ సో మచ్ సార్. ఈ ట్వీట్ పంపుతూనే మీ ఎస్ఎమ్ఎస్కు కూడా రిప్లయ్ ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుష్కా. -
భార్యకు ప్రేమతో...బిగ్‌బీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆలోచనల్ని, తన అనుభూతిని రాతరూపంలో ఎంత చక్కగా వివరిస్తాడో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తన సతీమణి జయాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా అందమైన లేఖ రాశారు. ప్రియమైన భార్య గుర్తుచేసుకుంటూ పలు విషయాలు తెలిపారు. ‘అర్థరాత్రి 12 కాగానే శుభాకాంక్షలు తెలుపడానికి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. స్వీటు తినిపించి తనను 70వ వసంతంలోకి ఆహ్వానించాను. ఆమె భార్యగా, తల్లిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోంది. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన లేఖలు, కురిపించిన ప్రేమ..ఒక్కసారిగా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఈ రోజు నాకు ప్రత్యేకం’ అని అమితాబ్ లేఖలో పేర్కొన్నారు. 1973 జూన్ 3న అమితాబ్, జయా బచ్చన్ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు అభిషేక్, శ్వేత. బాలీవుడ్లో అన్యోన్యమైన జంటగా బిగ్ బీ, జయ పేరు గడించారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ప్రముఖ నటిగా 1992లో జయాబచ్చన్‌కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. 2004లో జయాబచ్చన్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం అమితాబ్ తెలుగులో చిరంజీవి హిరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. -
‘నా బ్యాటింగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు’
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ ఆటగాడు వీవి రిచర్డ్స్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రిచర్డ్స్ 1952 మార్చి 07న జన్మించాడు. ఈ సందర్భంగా సచిన్ తన ట్వీటర్ అకౌంట్లో అతనితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. ‘నా బ్యాటింగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్టు చేశాడు. రిచర్డ్స్ విధ్వంకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ జట్టుకు చాలా సంవత్సరాలు తన సేవలు అందించాడు రిచర్డ్స్. బ్యాటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన రాబోయే తరాల వారికి స్పూర్తిగా నిలిచాడు. వెస్టిండీస్ జట్టులో బౌలర్ల హవా కొనసాగుతున్న రోజుల్లో కూడా రిచర్డ్స్ బ్యాటింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. రిచర్డ్స్ తన క్రికెట్ కెరీర్‌ను 1974 నవంబర్ 22న ఇండియాతో టెస్టు మ్యాచ్‌తో ప్రారంభించాడు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో 1991 ఆగస్టు 8న ఆడాడు. 1975లో వన్డేలలో ఆరంగ్రేటం చేశాడు. రిచర్డ్స్ 1984–1991 కరేబియన్ జట్టుకు కెప్టెన్సీ భాద్యతలు చేపట్టాడు. రిచర్డ్ష్ మొత్తం 121 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8,540 పరుగులు సాధించాడు. వెస్టిండీస్1975, 79 వరల్డ్ కప్ సాధించడంలో రిచర్డ్స్ కీలకపాత్ర పోషించాడు. -
మన్మోహన్‌కు మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రదాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు...ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాల’ని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. మన్మోహన్ సింగ్ అవిభక్త పంజాబ్‌లో 1932, సెప్టెంబర్ 26న జన్మించారు. జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.దేశంలో ఆర్థికాభివృద్ధికి దూరదృష్టితో మన్మోహన్ బాటలు వేశారని ప్రశంసించారు. Warm birthday wishes to our former Prime Minister, Dr. Manmohan Singh. May he lead a long life filled with good health. — Narendra Modi (@narendramodi) 26 September 2017