chalo assembly
-
బీజేపీ చలో అసెంబ్లీ భగ్నం
ముషీరాబాద్(హైదరాబాద్): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు చేట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును కూడా కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణ రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ ముట్టడి..టీచర్ల అరెస్ట్
-
ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉపాధ్యాయులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులను పోలీసులు కాలర్ పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భద్రతను ఛేదించుకుని ముందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. -
చలో అసెంబ్లీకి అనుమతి లేదు..
సాక్షి, అమరావతి: చలో అసెంబ్లీకి అనుమతి లేదని.. ముట్టడికి యత్నిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ముసుగులో రెచ్చగొట్టేందుకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 31 వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంత ప్రజలు సహకరిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరాచక శక్తులపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ హెచ్చరించారు. -
విజయవాడ: ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
-
మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా బీసెంట్ రోడ్డులో ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు. 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద ప్యాప్టో చైర్మన్ సహా పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలనుండి లక్షా ఎనభైవేల మంది రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగులను దొంగలు, దోపిడీ దారుల మాదిరిగా ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి బైండోవర్ చేయడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయకపోతే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. -
నినాదాలతో హోరెత్తిన పోలీస్‌స్టేషన్
-
సీపీఎస్ విధానంపై ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ... విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఉద్యోగుల ‘ఛలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, సచివాలయం వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే వాహనాలను అటువైపు అనుమతిస్తున్నారు. అలాగే ప్యాఫ్టో యూనియన్ నాయకులను, ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 25 మందిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్యాఫ్టో నేతల నినాదాలతో పోలీస్‌స్టేషన్ హోరెత్తింది. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మూకుమ్మడిగా నినదించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు తీర్మానం చేయాలని, ఎన్ఎస్డీఎల్ రికవరీలను ఆపాలని, 653, 654, 655 జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఇది హేయమైన చర్య’
సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలిరాగా.. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదని చెప్పిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, గౌతం రెడ్డి.. సూర్యనారాయణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌పై ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉద్యోగులపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగుల నిరసన
-
చలో అసెంబ్లీ.. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత!
సాక్షి, విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూనియన్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. వందలసంఖ్యలో ఉద్యోగులు బ్యారేజీపై బైఠాయించి.. బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదంటూ.. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజితోపాటు పలుచోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీలోకి సిబ్బందిని, ఇతరులను అనుమతించారు. మరోవైపు విజయవాడలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత.. చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీని దిగ్బంధించి.. ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతోపాటు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు.. ‘చలో అసెంబ్లీ’కి తరలివస్తున్న ఉద్యోగులను పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
టీచర్ల పై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయం కోసం గొంతెత్తితే.. హక్కుల కోసం నినదిస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపొచ్చంటూ సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని తెలుగుదేశం సర్కారు కర్కశంగా కాలరాస్తోంది. తమకు తీరిన నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగా లను ప్రయోగించింది. ఈ కార్యక్రమానికి తరలి వస్తున్న వేలాది మంది టీచర్లపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించింది. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా ఉపాధ్యాయులపై సర్కారు రాక్షసత్వం ప్రదర్శించడం గమనార్హం. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 10,000 మంది టీచర్ల నిర్బంధం ఉద్యోగ విరమణ తరువాత జీవితానికి ఎలాంటి భరోసా కల్పించని సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహించారు. సీపీఎస్ రద్దు కోసం ఇప్పటికే ఎన్నో రూపాల్లో ఉద్యమించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపో వడంతో మంగళవారం ‘చలో అసెంబ్లీ’కి ఐక్య ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విఫలం చేయాలని ప్రభుత్వం వ్యూహం పన్నింది. అసెంబ్లీకి తరలివస్తున్న టీచర్లను సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో మోహరించి, ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో అనధికారికంగా 10,000 మందిని నిర్బంధించినట్లు సమాచారం. కొన్నిచోట్ల పోలీసు వలయాలను ఛేదించుకుని వేలాది మంది విజయవాడకు చేరుకున్నారు. వీరంతా అసెంబ్లీ వైపు వెళ్లకుండా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీచర్లు విజయవాడలోని లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వందలాది మంది పోలీసులు మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. నిరసన తెలుపుతున్న టీచర్లను లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. మహిళా ఉపాధ్యాయులను బలవంతంగా ఈడ్చిపారేశారు. నిరసనకారులను నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఉపాధ్యాయులను రాజధాని వరకు ఎలా రానిచ్చారంటూ పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీల అరెస్ట్ ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీచర్లను అరెస్ట్ చేయడం ఏమిటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఉపాధ్యాయులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎస్ రద్దుపై శాసన మండలిలో తాము ఎంతగా నిలదీసినప్పటికి ప్రభుత్వం తన వైఖరి ప్రకటించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో అరెస్టయిన టీచర్లకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ దమనకాండ సాగిస్తోందని ఆరోపించారు. పింఛన్ అడిగిన టీచర్లపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమని అన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తూ ఫైల్‌పై సంతకం చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గౌతంరెడ్డి గుర్తుచేశారు. టీచర్ల అక్రమ అరెస్ట్‌లను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న వారిని నిర్బంధించడం దారుణమని విమర్శించారు. కమిటీల పేరుతో సర్కారు కాలయాపన ‘‘చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం టీడీపీ ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం. విజయవాడలో మహిళా టీచర్లను పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీపీఎస్ రద్దుపై టీడీపీ ప్రభుత్వం లేఖలు, కమిటీల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఆఖరి రోజున చర్చిస్తామంటోంది. కేవలం ఒక్క రోజులో ఏం చర్చిస్తారు? సీపీఎస్ రద్దుపై అసెంబ్లీ, శాసన మండలిలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. సీపీఎస్‌కు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్ రద్దు కోసం ఎంతవరకైనా పోరాడుతాం’’ – బాబురెడ్డి, చైర్మన్, ఏపీ ఫ్యాప్టో పింఛన్ భిక్ష కాదు.. మా హక్కు ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం తన వైఖరి ఏమిటో వెల్లడించలేదు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికే పింఛన్ ఇస్తుంటే, 30 ఏళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు పింఛన్ కోరడం తప్పా? పింఛన్ భిక్ష కాదు.. అది మా హక్కు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా టీడీపీ ప్రభుత్వాలకు బుద్ధి రాకపోవడం శోచనీయం’’ – ఎన్.రఘురామిరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అరెస్ట్‌లు అప్రజాస్వామికం ‘‘ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. పింఛన్ ఇవ్వాలని కోరడం నేరమా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. సీపీఎస్‌ను రద్దు చేసేవారికే మా మద్దతు ఉంటుంది. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి’’ – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట తప్పిన ముఖ్యమంత్రి ‘‘సీపీఎస్ రద్దుపై గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారు. గతంలో కేబినెట్ సమావేశంలో అజెండాగా పెట్టి, చర్చించకుండా దాట వేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. సీపీఎస్ రద్దుపై తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ – సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల జేఏసీ అసెంబ్లీ చుట్టూ పోలీసు కవచం ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ వద్ద, పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. శాసనసభకు వచ్చే అన్ని మార్గాలను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒక కానిస్టేబుల్‌తో పహారా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వరకూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, కార్లు... ఇలా ప్రతి ఒక్క వాహనాన్ని జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు అసెంబ్లీ దాకా చేరుకోకుండా చక్రబంధాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట, రాజధాని గ్రామం మందడం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాత్కాలిక సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి అసెంబ్లీ మీదుగా అమరావతి గుడికి వెళ్లే ఆర్టీసీ బస్సులపై డేగ కళ్లతో నిఘా ఉంచారు. -
పెన్షన్ టెన్షన్
-
ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల చలో అసెంబ్లీ
-
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలోఅసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్‌ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్‌లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
ఉద్యమాన్ని అణచలేరు..
విజయనగరం పూల్‌బాగ్: ఉద్యమాలు చేసే నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయగలరేమో కాని ఉద్యమాన్ని అణచలేరని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక లోయర్ టాంక్బండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగత్‌సింగ్‌ను ఉరితీయగలిగారు గాని ఆయన ఆశయాలను కాదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికిన చంద్రబాబునాయుడు..ఓటుకు నోటు కేసులో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రధాని మోదీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్తున్న సీపీఐ నాయకులను అడ్డుకుని అరెస్ట్‌లు చేయడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర, పార్టీ నాయకులు ఎ. జగన్నాధం, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యశ్వంత్, బాషా, విశాలాంధ్ర బుక్హౌస్మేనేజర్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. మౌన ప్రదర్శన బొబ్బిలి: అన్యాయాలను ప్రశ్నిస్తున్న గొంతును రాష్ట్ర ప్రభుత్వం నొక్కేస్తోందని సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సీపీఐ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరు చూస్తుంటే మనం బ్రిటీష్ పాలనలో ఉన్నామా అన్న అనుమానం రేకెత్తుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఒమ్మి రమణ, ఇతర సభ్యులు కోట అప్పన్న, ఆర్. శకుంతల, ఎల్వీఆర్ మూర్తి, పండు సుజాత, రాకోటి నాగమ్మ, పి. చిన్న తదితరులున్నారు. కామేశ్వరరావు అరెస్ట్ విజయనగరం పూల్‌బాగ్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధనకోసం సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీపీఐ జిల్లా కార్యదర్శి పి. కామేశ్వరరావును విజయవాడలో కంకిపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ముందస్తు చర్యగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీపీఐ నేతలను ఆదివారం అరెస్టు చేసి సోమవారం ఉదయం విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో పార్వతీపురంలో ఆర్వీఎస్ కుమార్, బొబ్బిలిలో ఒమ్మి రమణ, సాలూరులో రామచంద్రరావును, రామభద్రపురం మండలం కొట్టక్కిలో ఆనందరావు, విజయనగరం లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర ఉన్నారు. -
హోదా ఆకాంక్షపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి కారుల్లో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను గ్రంథి శ్రీనివాస్ ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రంథి శ్రీనివాస్, నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు 31 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.సీతారామప్రసాద్, సీహెచ్.రంగారావులను ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కరీముల్లా బాషాలను అరెస్టు చేశారు. ఏలూరులో చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరిన సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుండి పవరుపేట రైల్వేస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావులను గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, బోనం ధనలక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణానికి చెందిన సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బొద్దాని నాగరాజులను రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలవరం మండలం సీపీఐ కన్వీనర్ జమ్మి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి.ఆంజనేయులుని గృహనిర్బంధం చేసి సోమవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆచంట మండలంలో సీపీఐ కార్యదర్శి వైట్ల విద్యాధరరావును ముందస్తు చర్యగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిడదవోలుకు చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకా భాస్కరరావును గృహ నిర్బంధం చేసి అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నాయకులు ఉండి మండల కార్యదర్శి కె.వెంకట్రావు, గణపవరం సీపీఐ కార్యదర్శి గంజిరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేతర లక్ష్మిలను అరెస్టు చేశారు. -
‘చలో అసెంబ్లీ’కి వైఎస్సార్సీపీ మద్దతు
విజయవాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీల అమలు కోసం సోమవారం నిర్వహించనున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులు కూడా పాల్గొని ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చాటిచెబుతాయని స్పష్టం చేశారు. వారు ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్సార్సీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభలు, దీక్షలు, యువభేరి సభలతో యువతలో చైతన్యం రగిల్చిందని మల్లాది విష్ణు చెప్పారు. కాంగ్రెస్ మద్దతు: రఘువీరా వామపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి చేపడుతున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిర్బంధాలతో ‘చలో అసెంబ్లీ’ ఆగదు: రామకృష్ణ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం వేధించినా ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జరిగి తీరుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జల్లి విల్సన్, రావుల వెంకయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు దాటినా విభజన చట్టానికి సంబంధించి ఇంత వరకు ఒక్క హామీ కూడా సక్రమంగా అమలుకాలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసమే చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టామని రామకృష్ణ చెప్పారు. -
‘చలో అసెంబ్లీ’ ని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, మహబూబ్‌నగర్: తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రాష్ట్ర ఆరెకటిక సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటికలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌జీ, రాంచందర్జీలు మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాలలో ఆరెకటిక కులం ఎస్సీ జాబితాలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసి ‘డి’ జాబితాలో ఉందన్నారు. దీని కారణంగా ఆరెకటికలకు సరైన విద్య అందక, ఉద్యోగాలు రాక రాజకీయ ప్రాధాన్యం లేక వెనకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల సంక్షేమానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వెనకబాటుకు, అన్యాయానికి గురైన తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. -
జిల్లాలో 40మంది ఉపాధ్యాయులు అరెస్టు
ఒంగోలు క్రైం: ప్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. అందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలకు చెందిన దాదాపు 40 మంది నాయకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నుంచే ఉపాధ్యాయుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకలకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లవద్దని, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలాల నుంచి బయటకు వెళ్లొద్దంటూ ఎస్సైలు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హుకుం జారీ చేశారు. అయినా ప్యాప్టో ఆధ్వర్యంలోని అన్ని సంఘాలకు చెందిన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని ముందస్తుగా బైండోవర్ చేయించుకున్నారు. మొత్తం 210 మంది ఉపాధ్యాయులను ముందస్తుగా బైండోవర్ చేశారు. -
నవంబర్ 1 నుంచి ‘పోరుబాట’
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 నుంచి ప్రజా సమస్యలపై పోరుబాట నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. నవంబర్ 1 నుంచి 4 వరకు రైతు భరోసా యాత్ర, నవంబర్ 10 నుంచి 20 వరకు పత్తి కొనుగోలు కేంద్రాల సందర్శన, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు పోరు సభల నిర్వహణ, నవంబర్ 7న నిరుద్యోగ సమస్యలపై చలో అసెంబ్లీ, 26న నిరుద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సభకు బీజేవైయం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మంచిర్యాలలో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలు చేశామని, పలు కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. అవినీతిపై పోరాడేందుకు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళితులు, గిరిజనుల సమస్యలపై పోరాటానికి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి ఎమ్మెల్యే చింతల, మద్యపాన నియంత్రణ కమిటీకి రాజేశ్వరరావులు నాయకత్వం వహిస్తారన్నారు. -
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
-
తొలి రోజే రచ్చ !
-
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై కాంగ్రెస్ తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలను గేట్ల వద్దే అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. రైతు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మాజీమంత్రి డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉదయమే గాంధీభవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ జెండాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి పాదయాత్రగా బయల్దేరారు. అయితే గాంధీభవన్ ప్రధాన గేటు దాటుతున్న సమయంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్తమ్, మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి, కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ మహిళా నేతలు నాంపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, నేరెళ్ల శారద, బండ కార్తీక రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు రాస్తారోకో చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచౌదరి ట్యాంక్‌బండ్ నుంచి పాదయాత్రగా వచ్చి నేరుగా అసెంబ్లీ వద్దకు చేరుకుని లోపలికి వెళ్లడానికి యత్నించారు. అరెస్టు చేయడానికి రావడంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేల బైఠాయింపు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభ, శాసన మండలి పక్ష నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, పొంగులేటి, జి.చిన్నారెడ్డి, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. అరెస్టులు అప్రజాస్వామికమంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇంత నిరంకుశత్వమా? నిజాంను మించిన కర్కశత్వం: కాంగ్రెస్ మండిపాటు రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినందుకు అరెస్టులు, నిర్బంధాలు విధించడం అప్రజాస్వామికమని ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం వారు మాట్లాడారు. ‘‘రైతులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచింది. వాటిని అమలు చేయాలని అడిగినందుకు అరెస్టులు చేయడం ఏం న్యాయం? రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదు. సభలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. కేసీఆర్ తీరు నిరంకుశత్వానికి, రాచరిక పాలనకు అద్దం పడుతోంది’’అని విమర్శించారు. నిజాంను మించిన కర్కశత్వం చూపిస్తున్నారని జానారెడ్డి, ఉత్తమ్ మండిపడ్డారు. నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పాలన కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అంటూ ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులను తమ రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ఎకరానికి నాలుగు వేలు ఇస్తామంటున్న సీఎం వెంటనే దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు పోలీసు స్టేషన్లలో ఎందుకు ఉంటున్నారో ప్రభుత్వం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను చర్చించకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికే అయితే 50 రోజులు నడిచినా, 500 రోజులు నడిచినా సభకు అర్థం లేదన్నారు. అలాగైతే టీఆర్ఎస్ కార్యాలయంలో అసెంబ్లీని నడుపుకోవచ్చునన్నారు. ప్రతిపక్ష పార్టీలను జైళ్లలో పెట్టి బీఏసీ సమావేశం పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమావేశాలు ఇంత దారుణంగా లేవన్నారు. రైతులకు బోనస్ ఇవ్వని సీఎం... కేసీఆర్ ఒక్కరేనని షబ్బీర్ అలీ విమర్శించారు. -
ఛలో అసెంబ్లీ.. కాంగ్రెస్ నేతల అరెస్టులు
-
ఛలో అరెస్టులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ 8వ శాసనసభ సమావేశాల నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల నుంచి భారీ ఎత్తున్న కార్యకర్తలను తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, 3 వేల మంది పోలీసులతో మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్లు పక్కల 4 కిలోమీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. సభలకు, ర్యాలీలకు అనుమతి లేదని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ హైవేతోపాటు జిల్లాల సరిహద్దులలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడిక్కడే అడ్డుకుంటుండగా.. పలువురు వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ, బిన్నురు, కరీంనగర్, జగిత్యాల ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అడ్డుకుని, ముఖ్య నేతలను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు గాంధీ భవన్ వద్ద పలువురు నేతలను అరెస్ట్ చేయటంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్గొండ ఉభయ జిల్లాలో రెండు రోజుల ముందు నుంచే అరెస్ట్ పర్వాలు కొనసాగాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సూర్యాపేట నుంచి బయలుదేరిన రేషన్ డీలర్లను అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో సోదాలు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన తనయుడు అరవింద్‌ను అదుపులోని తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్‌ను గృహ దిగ్భందం చేశారు. ప్రతిపక్షానికి నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. పోలీసులు అడ్డకున్నా సరే ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరతామని కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్రంగా స్పష్టం చేశారు. గాంధీ భవన్ వద్ద మళ్లీ ఉద్రికత్త ఛలో అసెంబ్లీ నేపథ్యంలో గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు యత్నంచిన ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇలా అరెస్టయిన వారిలో ఉన్నారు. అంతకు ముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి గృహ దిగ్భందం చేసినట్లు తెలుస్తోంది. -
ఏం జరిగినా సర్కారుదే బాధ్యత!
-
ఏం జరిగినా సర్కారుదే బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. 'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. 'ఛలో అసెంబ్లీ' విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మండిపడ్డారు. 'ఛలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది..
-
కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది..
సాక్షి, హైదరాబాద్ : ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తొలిరోజే నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. ఆ రోజు ఏం జరిగినా కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని, సీఎల్పీ నేత జానారెడ్డి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏం అంశంపైన అయినా చర్చకు సిద్ధంగా ఉందన్నారు. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేదే సమస్యలపై చర్చించుకునేందుకు అన్నారు. మూడు నుంచి నాలుగు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఇక పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో తెలుసు అని, ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడే మైక్ కట్ చేసిన విషయం తెలిసిందే అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదని అసెంబ్లీ సమావేశాలు చాలా హుందాగా జరుగుతున్నాయన్నారు. కాగా ఈ నెల 27 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే రైతుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్షం, రూ.లక్ష రుణ మాఫీకి సంబంధించిన వడ్డీ చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అమలు చేయకపోవడం, పంటలకు గిట్టుబాట ధర కల్పించకపోవడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. -
చలో అసెంబ్లీకి తరలిన సీపీఐ నాయకులు
అనంతపురం న్యూసిటీ : ‘అనంత’ రైతులు, కూలీలను ఆదుకోవాలంటూ సీపీఐ, రైతు సంఘం నేతలు చలో అసెంబ్లీకీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టేందుకు గురువారం వారు అమరావతికి బయలుదేరారు. అనంతపురం నుంచి కేరళకు తరలివెళ్లిన రైతులు, కూలీల దుర్భర జీవితాన్ని ప్రతిభింబించేలా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అనంతపురం రైల్వే స్టేషన్ ఆవరణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విలేకరులతో మాట్లాడారు. కేరళ, ఎన్టీఆర్ ప్రభుత్వం తరహాలో రైతులకు కరువు పింఛన్లు ఇవ్వాలన్నారు. ప్రతి రైతుకు రూ 20వేలు పరిహారం అందించాలన్నారు. ప్రతి మండలంలో ఉచిత గడ్డి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు కల్పించి వలసలను అరికట్టాలన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా రైతులను ఆదుకునేలా పోరాటం చేస్తామన్నారు. విజయవాడకు బయలుదేరిన వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీ జాఫర్, పీ నారాయణస్వామి, కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు ఎండీ సంజీవప్ప, తదితరులు పాల్గొన్నారు. -
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
- నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదాతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు, నిరుద్యోగులు అసెంబ్లీకి చేరుకోకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడమే కాక లాఠీలకు సైతం పనిచెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా అసెంబ్లీ వరకు చేపట్టిన ర్యాలీని కళాశాల దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన నిరుద్యోగులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు భీంరావునాయక్, బండి నరేశ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో రవి అనే ఓ టీవీ చానల్ కరస్పాండెంట్‌కి గాయాలయ్యాయి. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ లక్ష ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచి పరీక్ష వాయిదా వేయాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చే యాలని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రంథాలయానికి తాళం.. చలో అసెంబ్లీ నేపథ్యంలో అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని ఉదయం 6 గంటలకే పోలీసులు మూసేశారు. గ్రంథాలయం ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తారని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా తాళాలు వేశారు. గ్రంథాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో నిరుద్యోగులు.. పోలీసుల కళ్లుగప్పి ఒక్కొక్కరుగా అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దపెట్టున నినదిస్తూ అసెంబ్లీ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతోపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మరో 12 మంది గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల అణచివేత దారుణం..: ఆర్.కృష్ణయ్య నిరుద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ప్రభుత్వం పోలీసులతో అణచివేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. నిరుద్యోగులు అరెస్టయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నవారిపై నిరంకుశంగా ప్రవర్తిం చడం ఏమిటని ప్ర శ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో నిరుద్యోగు లు ఉండగా.. కేవలం 439 గ్రూప్-2 పో స్టులను భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. -
లక్ష మందితో చలో అసెంబ్లీ
హైదరాబాద్: నిరుద్యోగులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. గ్రూప్-2 పోస్టులను పెంచాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్-2 ఎక్జామ్‌ని 3 నెలలు పోస్టుపోన్ చేయాలని, గ్రూప్-2లో ఇంటర్వూ విధానం ద్వారా ఎంపిక విధానాన్ని తొలగించాలని, త్వరిత గతిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను వెంటనే నియమించాలనే డిమాండ్లతో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేయూసీలు ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. నిరుద్యోగ యువకులను అసెంబ్లీ వైపు రాకుండా నిలువరించేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఇందిరాపార్క్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఛలో హైదరాబాద్‌కు ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్ల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొంటున్నప్పటికీ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఛలో హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి వస్తున్న వర్కర్లను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు. -
'ఈ నెల 7న అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్: బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 7న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు కేంద్రంపై రాష్ట్రప్రభుత్వాలు ఒత్తిడి తేవాలని ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీలకు 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. బీసీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని విమర్శించారు. అందుకే అక్టోబర్ 7న అసెంబ్లీని ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య చెప్పారు. -
ఓయూ పీఎస్ ఎదుట విద్యార్ధులు ధర్నా
-
భౌతిక దాడులకు పాల్పడుతున్నారు
హైదరాబాద్ : ప్రజా సంఘాలు పిలుపుతో ఛలో అసెంబ్లీకి బయలుదేరిన వారిపై తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రొ. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రొ.లక్షణ్ మాట్లాడుతూ...అరెస్ట్ అయిన వారిపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ప్రొ.లక్ష్మణ్ అందోళన వ్యక్తం చేశారు. ఛలో అసెంబ్లీలో భాగంగా ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కాచిగూడ, డబీర్‌పుర, మలక్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రొ.లక్ష్మణ్‌పై విధంగా స్పందించారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అవి 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తమకివ్వాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాస్తే, మొదటి మంత్రివర్గం ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులకు పైనుంచి అనుమతి ఉంటేనే ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పారు. వీలుంటే అరెస్టు చేయడం, విచారించడం, న్యాయవ్యవస్థ ద్వారా విచారణ చేయడం పద్ధతి అని, మావోయిస్టుల విషయంలోనైనా.. మరెవరి విషయంలోనైనా ఇదే చేయాలని చెప్పారు. ఏకపక్షంగా చంపడం రాజ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వందేళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి కేబినెట్ ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా, తెలంగాణ పోలీసులైనా ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలను ఏమీ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిస్తే వాళ్లేమీ చేయరని తెలిపారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
-
అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం
వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీలో ఓ యువకుడు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆత్మాహుతియత్నం చేశాడు. పౌర హక్కుల సంఘాలకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు పెట్రోలు పోసుకుని, నిప్పు అంటించుకునే ప్రయత్నం చేస్తుండగా మీడియా ప్రతినిధులు, పోలీసులు గుర్తించి వెంటనే అతడి చేతిలోంచి అగ్గిపెట్టె లాగేసుకున్నారు. భగత్ సింగ్ దేశం కోసం త్యాగం చేసినట్లుగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ కుమార్ చెప్పాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.. తాను చచ్చిపోతాననే చెప్పాడు. కాసేపు.. తన పేరు భగత్ సింగ్ అని కూడా అతడు అన్నట్లు తెలుస్తోంది. భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజ్ కుమార్ అంటున్నాడు. అతడు ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియలేదు. అతడి మాటలను చూసి, అతడి మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ముందునుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినా, అతడు మాత్రం భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ పెట్రోలు సీసా పట్టుకుని వెళ్లాడు. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ లాంటి దళాలతో చాలా పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేశారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అయినా కూడా రాజ్ కుమార్ అసెంబ్లీ గేటుకు కేవలం 50 మీటర్ల దూరంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. -
అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం
-
సుందరయ్యపార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్ : ఓయూ నుంచి ఛలో అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాటతోపాటు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వీసీ అనుమతి లేకుండా ఓయూ క్యాంపస్‌లోకి భారీగా పోలీసులు ప్రవేశించారు. యూనివర్శిటీ అంతటా పోలీసులు మోహరించారు. ఓయూ లెక్చరర్లు క్వార్టర్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గత అర్థరాత్రి మానేరు హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా తాము ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ప్రజా సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
జిల్లాల్లో కొనసాగుతున్న నేతల అరెస్ట్
ఖమ్మం : ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే బీబీనగర్, చౌటుప్పల్ టోల్గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మధిర సర్కిల్లో కూడా వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పౌర హక్కుల సంఘం నేత భూపతి, వామపక్ష నేత మల్లేశంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో ఛలో అసెంబ్లీకి బయలుదేరిన 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ఛలో అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చిన 20 మంది విద్యార్థులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో శృతి, విద్యాసాగర్ రెడ్డి మరణించారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆరోపించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయిన ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు. -
చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల పిలుపు, పలు అరెస్ట్‌లు
-
చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల పిలుపు, పలు అరెస్ట్‌లు
హైదరాబాద్: ప్రజాసంఘాల చలో అసెంబ్లీ నేపథ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ క్యాంపస్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజాసంఘాల నేతలు, వామపక్షాల నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ హాస్టల్లో, నిజాం కాలేజీ హాస్టల్లో పోలీసులు అర్థరాత్రి సోదాలు నిర్వహించారు. చలో అసెంబ్లీకి బయల్దేరిన 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో 100 మంది విద్యార్థుల అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష నేతలు, విద్యార్థులను అరెస్ట్ చేశారు. అలాగే ప్రజాసంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి వచ్చే రహదారులపై చెక్ పోస్టులు పెట్టారు. చలో అసెంబ్లీకి ప్రజా సంఘాలు పిలుపునివ్వడంతో అసెంబ్లీకి వెళ్లే అన్నిదారుల వద్ద ఆంక్షలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. వరంగల్‌లో వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ ముట్టడికి ప్రజాసంఘాల నేతలను మందస్తు అక్రమ అరెస్టులను తెలంగాణ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గట్టం లక్ష్మణ్ ఖండించారు. నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అడుగడుగున వాహనాలు తనీఖీలు చేస్తున్నారు. బీబీనగర్, చౌటుప్పల్ టోల్గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో వామపక్ష నేత మల్లేశం సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఖమ్మం మధిర సర్కిల్లో చలో అసెంబ్లీకి బయల్దేరిన వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పౌరహక్కుల సంఘం నేత భూపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు తెలిసింది. విప్లవ కవి వరవరరావు ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగినట్టు సమాచారం. -
ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చలో అసెంబ్లీ
-
బెల్లంపల్లిలో పోలీసుల తనిఖీలు
వరంగల్ జిల్లాలో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ.. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి రాజధాని వెళ్లడానికి సిద్ధమవుతున్న శ్రేణులను మంగళవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక బలగాల సాయంతో అడ్డుకుంటున్నారు. పట్టణం నుంచి బయటకు వెళ్తున్న వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. -
కరీంనగర్లో ముందస్తు అరెస్టులు
కరీంనగర్: వరంగల్ ఎన్ కౌంటర్‌కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు కరీంనగర్ పోలీసులు సమాయత్తమయ్యారు. జిల్లా సరిహద్దులో పోలీసులు భారీగా మొహరించారు. జిల్లాకు చెందిన పౌరహక్కుల సంఘం, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. -
చలో అసెంబ్లీకి అనుమతి లేదు
వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులకు మద్దతుగా కొంత మంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరూ పాల్గొన కూడదని సూచించారు. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ ఎన్ కౌంటర్ కి నిరసనగా 371 ప్రజాసంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన సంగతి తెలిందే. -
రేపు ఛలో అసెంబ్లీ నిర్వహిస్తాం
హైదరాబాద్ : వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలో బుధవారం ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వరవరరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఛలో అసెంబ్లీ శాంతియుతంగా చేస్తామంటే పోలీసులు నిరాకరించారని తెలిపారు. ప్రజా ప్రతినిధుల సభకు 144 సెక్షన్ విధించడమంటే ప్రజాస్వామ్యం దాని స్వభావాన్ని కోల్పోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడమన్నారు. ఓ వేళ అటువైపు నుంచి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వరవరరావు వెల్లడించారు. ఛలో అసెంబ్లీలో 400 ప్రజా సంఘాలు పాల్గొంటాయని వరవరరావు తెలిపారు. -
వామపక్షాల ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్
హైదరాబాద్ : వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వామపక్షాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ భద్రతా దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. -
‘ఎన్కౌంటర్’పై 30న చలో అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని... ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై అత్యాచారం, హత్యానేరాల కింద కేసులు నమోదు చేయాలని ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీపీవీ)’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై ఈ నెల 30వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కోసం పది వామపక్షాలతో పాటు తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యావంతుల వేదిక, జర్నలిస్టుల ఫోరం, రైతాంగ సమితి, విరసం, ఎమ్మార్పీఎస్, అడ్వొకేట్స్ జేఏసీ, మున్సిపల్ జేఏసీ, మానవహక్కుల వేదిక, రైతు, రైతు కూలీ, మహిళా, కార్మిక, విద్యార్థి సంఘాలు, సంస్థలు, మేధావులు కలసి విశాల ప్రాతిపదిక న ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక’(టీపీవీ) ఏర్పాటైంది. వరంగల్ ఎన్కౌంటర్లో శ్రుతి, సాగర్లను పాశవికంగా హతమార్చడాన్ని టీపీవీ ఖండించింది. దీనిపై న్యాయవిచారణ జరిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. 30వ తేదీన చేపట్టనున్న చలో అసెంబ్లీ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విరసం నేత వరవరరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జానకిరాములు (ఆర్ఎస్పీ), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), విమలక్క (టఫ్), రాజేందర్‌రెడ్డి (అడ్వొకేట్స్ జేఏసీ), గురిజాల రవీందర్రావు (టీవీవీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఉద్యమ వేదిక), ఉ.సాంబశివరావు, పాశం యాదగిరి (సీనియర్ జర్నలిస్టు), సనావుల్లాఖాన్ తదితరులు విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ బోను ఎక్కాల్సిందేనని వరవరరావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలను పట్టించుకోకుండా, విలువలను పాటించకుండా వ్యవహరిస్తే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎండగడతారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని చుక్కారామయ్య డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణమే లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. మావోయిస్టుల ఎజెండానే తన ఎజెండా అన్న కేసీఆర్ వారిని అంతమొందించడమే ఆయన ఎజెండానా అని నిలదీశారు. ఉన్నతస్థాయిలో రాజకీయ నిర్ణ యం లేనిదే ఈ ఎన్కౌంటర్ జరగదని... శ్రుతి, సాగర్లను దారుణంగా చంపారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్ ఆరోపించారు. నా కడుపు కోత మరెవరికీ వద్దు... నాలాంటి కడుపుకోత మరో తల్లికి రాకూడదు. రాష్ట్రంలో ఎన్కౌంటర్లే ఉండకూడదు. పేదల కష్టాలను చూసి వారి కోసం పనిచేసేందుకు శ్రుతి వెళ్లింది. నా బిడ్డను దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, యాసిడ్ పోసి ఘోరాతిఘోరంగా హత్యచేశారు. - శ్రుతి తల్లి రమాదేవి -
చలో అసెంబ్లీ
- రైతు సంఘాల నిర్ణయం - కలెక్టర్‌కు అల్టిమేటం సాక్షి, చెన్నై : డెల్టాలోని జిల్లాల్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి దక్షిణ భారత నదుల అనుసంధాన అన్నదాతల సంఘం నిర్ణయించింది. తిరుచ్చి జిల్లా కలెక్టర్ పళని స్వామికి తమ గోడును వివరిస్తూ అల్టిమేటం ఇచ్చారు. నదుల అనుసంధానం, అకాల వర్షంతో నష్ట పోయిన రైతుల్ని ఆదుకోవాలని, కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటు, కావేరి జలాల పరిరక్షణ, రుణాల మాఫీ తదితర డిమాండ్లతో దక్షిణ భారత నదుల అనుసంధాన అన్నదాతల సంఘం చలో అసెంబ్లీకి సిద్ధం అయింది. ఇది వరకు సచివాలయం ముట్టడికి యత్నించి కొన్ని రోజుల పాటుగా గృహ నిర్భందంలో ఉన్న ఈ సంఘం నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి బిక్షాటనకు సిద్ధపడి అక్కడి పోలీసుల ఆగ్రహంతో ఇక్కడికి వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను శనివారం తిరుచ్చి కలెక్టర్ పళని స్వామిని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. అందులో రాష్ర్టం కరువుతో అలమటిస్తున్నా , పట్టించుకునే వాళ్లు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది కేంద్ర కరువు నివారణ బృందం డెల్టా జిల్లాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేసిందని వివరించారు. అయితే, ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు ఇంత వరకు బహిర్గతం కాలేదని మండి పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిని కోరితే, తిరుచ్చి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ రవిచంద్రన్‌ను అడిగి తీసుకోవాలని సూచించారన్నారు. అయితే, ఆయన తమను ఖాతరు చేయడం లేదని, అన్నదాతల గోడు ఆయనకు పట్టడం లేదని ఆరోపించారు. తమ గోడును పట్టించుకోక పోగా, కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కావేరి నదిలో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా, ఇంత వరకు అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పైన పేర్కొన్న డిమాండ్ల సాధన, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టే విధంగా ఈనెల 24న అసెంబ్లీ సమవేశాల్ని పురస్కరించుకుని చలో అసెంబ్లీకి సిద్ధం అవుతున్నామని హెచ్చరించారు. సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో రాస్తారోకోలతో తమ నిరసనను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అన్నదాతలు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
నిరసనల హోరు
-
MRPS కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
-
100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముట్టడికి యత్నించిన సుమారు 100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేనందున ఆందోళనకారులను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా అసెంబ్లీ పరిసరాల్లో నేడు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయి. ఎమ్మార్పీఎస్ ఛలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఆ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. -
అత్యుత్సాహం
మచిలీపట్నం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అతిగా స్పందించారు. అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు, సీఐటీయూ నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే గాక వారి రాకపోకలపై నిఘా ఉంచారు. అందుబాటులో లేనివారి ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుల మాదిరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అంగన్వాడీలను గుర్తించి నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసుల తీరుతో అంగన్వాడీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలీసుల అదుపులో 550 మంది... అంగన్వాడీలను సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి 11, 12 గంటల సమయంలో సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంగళవారం ఉదయమే తిరిగి పోలీస్‌స్టేషన్ వద్ద హాజరవుతామనే హామీ తీసుకుని వారిని విడిచిపెట్టారు. ఓ అడుగు ముందుకేసిన చిల్లకల్లు పోలీసులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను గరికపాడు చెక్‌పోస్ట్ వరకు వెంబడించి అక్కడ బస్సును నిలిపివేశారు. అందులో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 550 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వారిని విడుదల చేశారు. నేరస్తుల మాదిరిగా సెర్చ్... అతి తక్కువ జీతంతో నానా ఇబ్బందులు పడుతూనే గొడ్డుచాకిరీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అంగన్వాడీల సంఘ జిల్లా అధ్యక్షురాలు, గూడూరు వాసి రెజీనారాణిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. రెజీనారాణి ఇంటివద్ద లేకపోవడంతో ఆమె భర్తను, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి సెల్‌ఫోన్ ద్వారా ఆమెకు కాల్ చేసి, సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడ ఉన్నదీ గుర్తించారు. బందరు మండలంలోని సీతారామపురంలో అంగన్వాడీ కార్యకర్త ఇంటివద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అంగన్వాడీల రాస్తారోకో తమతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకోవటంపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు ప్రధాన సెంటర్లోని మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అతిగా ప్రవర్తించి, తమతో పాటు తమ బంధువులనూ అదుపులోకి తీసుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు, దిష్టిబొమ్మల దహనం మచిలీపట్నం కోనేరుసెంటరులో అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ తాలుకా పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. సోమవారం రాత్రి తమ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను ఇచ్చేవరకు ఆందోళన చేశారు. పెడనలో అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బంటుమిల్లి సెంటరు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గూడూరు సెంటరులో మచిలీపట్నం - విజయవాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటరులో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సీఐటీయూ గుడివాడ డివిజన్ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. చల్లపల్లి ప్రధాన సెంటరులో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించారు. జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. నందిగామలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. మేమేమైనా తీవ్రవాదులమా? : రెజీనారాణి గూడూరు : తనతో, తన కుటుంబ సభ్యులతో పోలీసులు దారుణంగా వ్యవహరించి అవమానించారని అంగన్వాడీల సంఘ జిల్లా అధ్యక్షురాలు రెజీనారాణి వాపోయారు. గూడూరు పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం సాయంత్రం నుంచి తన ఇంటి వద్ద పోలీసులు కాపు కాసి ఆందోళనకు గురిచేశారన్నారు. తనను హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో తాను కనిపించకపోయేసరికి తన భర్త, కుమారుడిని కూడా స్టేషన్‌కు తరలించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుమారుడి సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా తన ఆచూకీ కనుగొని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇంతలా వేధింపులకు గురిచేసేంత నేరం తామేమి చేశామని ఆమె ప్రశ్నించారు. తామేమైనా తీవ్రవాదులమా, టైస్టులమా అని నిలదీశారు. సమస్య పరిష్కారం కోసం శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతున్న మహిళలపై ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు. -
'అంగన్ వార్' ఉద్రిక్తం
-
సర్పంచ్ల సమరభేరి
హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన అధికారాలను బదలాయించకపోగా, జాయింట్ చెక్‌పవర్ తెచ్చి తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఐక్యవేదిక ఆరోపించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల సమయంలో ‘చలో అసెంబ్లీ’ నిర్వహించాలని, ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు చేపట్టాలని తీర్మానించింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారమిక్కడ నిర్వహంచిన రౌండ్ టేబుల్ భేటీలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, బీజేపీఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సీపీఐ నేత రాంనర్సయ్య, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు 22 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. -
అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నమహబూబ్నగర్ జిల్లా అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన అంగన్వాడీ కార్యకర్తలు జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని అడ్డుకునే సమయంలో పోలీసులు తమపై అనుచితంగా వ్యవహరించారని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. -
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల
-
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. -
ఓయూలో ‘చలో అసెంబ్లీ’ రగడ
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు, పోలీసుల మధ్య రగడ ఏర్పడింది. సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ కరాటే రాజు నేతృత్వంలో 12 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లు పై చర్చించి వెంటనే పార్లమెంట్‌కు పంపించాలనే డిమాండ్‌తో కార్యక్రమాన్ని చేపట్టినట్లు కరాటే రాజు చెప్పారు. చలో అసెంబ్లీ కోసం క్యాంపస్‌ను బంద్ చేశారు. వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద వేచిఉన్న పోలీసులు విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి ముళ్ళకంచె పొదను తోశారు. పోలీసులు విద్యార్థులను వారించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బయటకు వెళ్లనివ్వకపోవడంతో కోపొద్రిక్తులైన విద్యార్థులు పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించారు. విద్యార్థుల చర్యలను చాలా వరకు ఉపేక్షించిన పోలీసులు చివరకు భాష్పవాయువుగోళాలను ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఆందోళనలో ఆంజనేయులు, నెహ్రూనాయక్, మన్నేక్రిషాంక్, సంపత్‌నాయక్, సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ సమ్మెకు సిద్ధం: అశోక్‌బాబు
రాష్ట్ర సమైక్యత కోసం అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఏపీఏన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. జనవరి 16 నుంచి 20వ తేదీలోగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పారు. విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఏన్జీవో ఎన్నికలను రాజకీయా పార్టీలు ప్రభావితం చేయలేవని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు అశోక్‌బాబు బదులు ఇచ్చారు.