Charge Sheet
-
ఐదు నెలల కూటమి సర్కార్ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఐదు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. కూటమి నేతలకు ఎలా పాలించాలో తెలియక వైఎస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే ఈ ఐదు నెలల్లో జరిగాయన్నారు.కేంద్రంతో పొత్తులో ఉండి కూడా కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయడం లేదు. ప్రతీకారంపై పెట్టిన దృష్టి పథకాల అమలుపై పెట్టడం లేదు. అప్పుల మీద పెట్టిన దృష్టి సంక్షేమంపై పెట్టలేదు. గతంలో అమ్మఒడి పథకంపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి వచ్చాక ప్రతీ బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం తలకిందులైంది. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ చేసిన పాఠశాలల అభివృద్ధిని మీరు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ పోతిన మహేష్ నిలదీశారు.గతంలో డిజిటల్ విద్యపై విద్యార్థులను ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులకు డిజిటల్ విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు?. పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం కూటమి వచ్చాక కుంటుపడింది. పేదలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామంటే దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తుంటే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం దారుణం. కూటమి వచ్చాకే మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.’’ అని పోతిన మహేష్ మండిపడ్డారు.వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాళ్లని కూడా మోసం చేశారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి సమావేశాలు పెట్టరు గానీ మద్యం పాలసీపై మాత్రం మంత్రి వర్గ సమావేశాలు పెడతారు. గతంలో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఊసే లేదు. రైతు భరోసా, పంట రుణాలు, పంట నష్టాలపై ఎందుకు మాట్లాడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల గురించి ఎందుకు మాట్లాడం లేదు? 30 వేల కోట్లు ఉంటేనే నిర్వాసితులకు న్యాయం చేయగలమని పవన్ మాట్లాడారు. ఆ 30 వేల కోట్లు మీరు ఇస్తారా? కేంద్రం నుంచి తెస్తారా?. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే.. వాళ్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా మార్చడంపై చంద్రబాబు, పవన్ దృష్టి పెడుతున్నారు. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు దాని ఊసే లేదు ..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ ట్విట్టర్లోనే వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం రావు. బీసీలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌లు బీసీ రక్షణ చట్టం ఎందుకు చేయడం లేదు?. అమరావతి నిర్మాణానికి అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇప్పటికే రూ.26 వేల కోట్లు అప్పు తెచ్చారు. అమరావతి నిర్మాణానికి అమరావతే నిధులు తెచ్చుకుంటుందన్న చంద్రబాబు ఇపుడు అప్పులెందుకు?. అమరావతి నిధుల కోసమే పశ్చిమ నియోజకవర్గం త్యాగం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే వారాలబ్బాయి లా తయారయ్యాడు.. దీనికి పవన్ కల్యాణ్ జవాబు చెప్పాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.పవన్ కల్యాణ్ ఆయన శాఖలను వదిలేసి ఇతర శాఖలలో తలదూర్చుతూ.. సకల శాఖామంత్రిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్‌లు జగన్ భజన మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. జగన్, షర్మిళల విషయమేమి రాష్ట్ర సమస్య కాదు.. వారి మీద దృష్టి తగ్గించి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలి అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు. -
నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై ఛార్జ్ షీట్
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. ఈ కేసులో సిట్ అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రజ్వల్‌పై హోలెనరసిపూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు. ఆ వివరాలతో 2000పైగా పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.2019 నుంచి 2022 మధ్య హోలెనరసిపురలోని తన నివాసంలో పనిచేసిన పనిమనిషిని హెచ్డీ రేవణ్ణ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు రేవణ్ణ మహిళలను లైంగికంగా వేధించారని చార్జిషీట్లో పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు. -
ఆన్లైన్లో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్‌షీట్?
సాక్షి,న్యూఢిల్లీ : యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ స్కూల్ విద్యార్ధి యూజీసీ- నెట్ నకిలీ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రాంలో షేర్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. సదరు విద్యార్ధిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జూన్ 18న నిర్వహణ.. ఆ వెంటనే పరీక్ష రద్దు కేంద్ర విద్యా శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ-నెట్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే కేంద్రం ఆ పరీక్షను జూన్ 18న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. అనూహ్యాంగా యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ అయ్యిందని కేంద్రానికి సమాచారం అందింది.వెంటనే ఆ మరుసటి రోజే (జూన్19) పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సత్వరమే విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీచేశారు. స్కూల్ విద్యార్థిపై CBI ఛార్జ్‌షీట్!దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పేపర్ లీకేజీ జరిగిందా? జరిగితే అందుకు కారకులు ఎవరనేది ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ తన దర్యాప్తులో జూన్ 18న జరిగిన పరీక్షకు సంబంధించి లీకైన ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్‌ను ఓ పాఠశాల విద్యార్థి టెలిగ్రామ్‌లో షేర్ చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. ఈ అంశంపై సదరు పాఠశాల విద్యార్ధిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుందని సమాచారం. యూజీసీ పరీక్ష కొత్త తేదీలు ఇవేకేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిద్ధమైంది. ఇప్పటికే ఆ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్సెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. -
కేజీవాల్‌పై ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం జూలై 15కి వాయిదా వేసింది.ఈ కేసులో కేజ్రీవాల్ ప్రతిస్పందనకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఈ కేసును జూలై 15కి వాయిదా వేసింది.కాగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. 232 పేజీల ఛార్జ్ షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ కేసులో కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్‌గా, కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. లిక్కర్ స్కాంలో పొందిన డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఆరోపించింది. కేజ్రీవాల్, వినోద్ చౌహన్తో వాట్సాప్ చాట్లను ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పేరును కూడా ప్రస్తావించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్ల లావాదేవిలు జరిగినట్లు ఈడీ తెలిపింది. కవిత దగ్గర నుంచి రెండు బైకుల్లో నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడు. ముత్త గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయి.అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌తో కలిసి ఏడు కోట్ల రూపాయలను అవార్ల ద్వారా అరవింద్ సింగ్ ఇచ్చారు. 45 కోట్ల రూపాయలను గోవాకు హవాలా ద్వారా సాగర్ పార్టీలకు చేరవేశారు. ముత్త గౌతమ్‌కు సంబంధించిన చారియట్ మీడియా ద్వారా మీడియా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగాయి. చారియట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు తోపాటు చాలామందికి లింకులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.మరోవైపు కేజ్రీవాల్, ఆప్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణకు తీసుకుంది. కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.కాగా మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, జూన్ 26న అవినీతి కేసులో ఆప్ అధినేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో గత వారం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు దర్యాప్తు సంస్థకు కోర్టు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది. -
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. -
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్‌తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్‌షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్‌షీట్‌లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్‌లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్‌రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్‌షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్‌పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్‌కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్‌కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్‌గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది. మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్‌పై ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
15 నిర్వాకాలు.. 50 అంశాలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాల పేరిట కాంగ్రెస్ ఆ పార్టీపై చార్జిషీట్ వేసింది. ‘నయవంచన’పేరుతో విడుదల చేసిన అభి యోగ పత్రంలో.. తెలంగాణకు చేసిన ద్రోహం, నిధుల విడుదలలో వివక్ష, రైతులు, పేదలు, యువతకు దోఖా, ప్రాజెక్టుల కేటాయింపు, విద్యాసంస్థల ఏర్పాటులో మోసం పొందుపరిచింది. దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, రైతు వ్యతిరేక బీజేపీ, సామాన్యుడిపై ధరల మోత, పబ్లిసిటీ సర్కార్, దేశ సార్వ¿ౌమత్వానికి భంగం, నిరంకుశత్వ మోదీ, పెరిగిపోయిన నిరుద్యోగం, ఎలక్టోరల్ బాండ్ల స్కామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోదీ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం తదితర అంశాలను మోదీ నిర్వాకాల పేరుతో ప్రస్తావించింది. మోదీ జుమ్లాలు: మోదీ జుమ్లాలంటూ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు, 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, 2022 కల్లా అందరికీ ఇళ్లు, 100 రోజుల్లో నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ, నిత్యావసరాల ధరల తగ్గింపు, అవినీతిని రూపుమాపడం, నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన, చైనా ఆక్రమణ వంటి అంశాల్లో బీజేపీ మాట తప్పిందని, మోసం చేసిందని పేర్కొంది. కాకినాడలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం నుంచి డాలర్‌తో రూపాయి విలువను రూ.40కి తీసుకెళ్తానని చెప్పి రూ.85కు దిగజార్చడం.. వరకు మొత్తం 50 అంశాలను ఈ 15 నిర్వాకాల్లో ప్రస్తావించింది. ప్రజలకు ప్రశ్నలు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వినియోగించనున్న ఈ చార్జిషీట్లో ప్రాసతో కూడిన 7 ప్రశ్నలను తెలంగాణ ప్రజలకు చార్జి షీట్ ద్వారా కాంగ్రెస్ వేసింది. యువతా.. ఈ మోసాలను సహిద్దామా?, రైతులారా.. ఈ వంచకులను క్షమిద్దామా?, దళిత, గిరిజనులారా ఈ దగాకోరులను నమ్ముదామా?, బీసీల్లారా ఈ అహంకారులను ఆదరిద్దామా?, ఈ భారం ఇంకా భరిద్దామా?, మహిళలారా.. ఈ అసమర్థులకు మద్దతిద్దామా?, ఈ కార్పొరేట్ శక్తులకు తలొగ్గుదామా? అంటూ ప్రశ్నలు సంధించింది. ‘పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..’అనే నినాదంతో బీజేపీపై చార్జిషీట్‌ను ముగించింది. -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్‌లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్‌పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్‌గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్‌కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్‌పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్‌కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్‌కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్‌జగన్‌కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్‌ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్‌కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్‌ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్‌పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్‌ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
బీఆర్ఎస్ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్ చార్జిషీట్‌ను విడుదల చేసింది. యూత్ చార్జిషీట్లోని అంశాలివే.. ♦ దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు. ♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్‌ను నిర్మించారు. ♦ సీఎస్ఆర్ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ♦ ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్ నడుస్తోంది. ♦ ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది. ♦ పదో తరగతి నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ♦జాబ్ కేలండర్ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ♦ రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు. ♦యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. ♦కేసీఆర్ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్‌కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది. -
ఈఎస్ఐ స్కామ్‌లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది. మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్మాల్ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాప్‌లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్‌ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు. -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్‌షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్‌షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
సీబీఐ ఛార్జ్‌షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్‌రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్‌రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్‌ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్‌మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
ఆక్సిజన్ కుంభకోణంపై సీఐడీ చార్జ్‌షీట్!
వరంగల్: వరంగల్‌కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్ టెండర్ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్ టెండర్‌ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులతోపాటు వరంగల్ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఆక్సిజన్ దందా... ఆక్సిజన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్ కాంట్రాక్టర్ లక్షల రూపాయలు సూపరింటెండెంట్‌కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారులపై కేసు నమోదు.. ఆక్సిజన్ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్‌రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్ రఘురాం, అశోక్‌కుమార్, ఏ.ఎన్.ఆర్ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్‌రావు, తుంగతుర్తి సురేందర్, డాక్టర్ సత్యదేవ్, నరేంద్రకుమార్, బెంజీమెన్ సామెల్, కొండ్రు నాగేశ్వర్రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్ శేషాచారి నరసింహన్, వరికొటి విష్ణుమోహన్లను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేశారు. కుంభకోణం వెలుగుచూసింది ఇలా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్ టెండర్ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో రూ.180కు లభించే ఆక్సిజన్ సిలిండర్‌ను ఏకంగా డబుల్ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్ ‘టెండర్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సిలిండర్‌లో ఎంత కెపాసిటీ గేజ్‌తో ఆక్సిజన్ నింపాలి.. ఎంత గేజ్‌తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ.. కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలింది.. ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్ పద్ధతిన టెండర్ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది. ఒక్కో సిలిండర్‌కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. -
ఏది నిజం?: బాధితులనే దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?
నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్ జగన్ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది. వైఎస్ జగన్‌ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందనేది వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో ఆలస్యమవుతోంది కాబట్టి, వేగంగా చేసేలా దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఇదీ జరుగుతున్న వాస్తవం. కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్ జగన్‌ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి నిందితులకు కొమ్ముకాసే దగాకోరు పాత్రికేయం చరిత్రలో ఎక్కడైనా ఉందా? బాధితులనే దోషులుగా చూపించే కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా? ఇదేం తీరు రామోజీరావ్? ఇంకెన్నాళ్లు ఇలా..? హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్‌తో వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్‌ట్రిక్స్‌నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... ♦ హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్ జగన్ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? ♦ నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? ♦ నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? ♦ జగన్‌ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్‌పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? ♦ నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? ♦ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్ ఫుడ్స్ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్ ఫుడ్స్ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టుకు రావటం... హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? లోతైన దర్యాప్తు అవసరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుతున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణలో భాగంగానే ఎన్ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్ వేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం. -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్‌పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్‌లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు, 30 పేజీల చార్జిషీట్.. 3 ఏళ్లు జైలు శిక్ష?
లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్ ఓ ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. కాగా మనోజ్‌పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్ఓ తెలిపారు. ఏ శిక్ష పడే అవకాశం ఉంది! జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.