cherlapally jail
-
చర్లపల్లి జైలుకు కేటీఆర్.. పట్నం నరేందర్‌రెడ్డితో ములాఖత్
సాక్షి, హైదరాబాద్: లగచర్ల కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన కేటీఆర్ పట్నం నరేందర్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యాడరని వ్యాఖ్యానించారు.పట్నం మాతో ఒకే విషయాన్ని ప్రస్తావించారు. నా గురించి వదిలేయండి.. చేయని తప్పుకు జైల్లో ఉన్న 30 మంది రైతులను విడిపించాలని కోరారు, గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారని.. రైతులకు అండగా నిలవాలని కోరారు.’’ అని కేటీఆర్ చెప్పారు.సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారు. కొడంగల్ నుంచి కొండరెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్నవారు గద్దెకి కూర్చున్నారు. భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అరాచకాలు చేస్తోంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత ఊరు, నా సొంత నియోజకవర్గం అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉండరు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. -
పట్నం నరేందర్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: లగచర్ల అధికారుల దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది.తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే.. తన రిమాండ్‌ను కొట్టి వేయాలని నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరికాసేపట్లో విచారణ జరపనుంది.మరోవైపు నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణనువికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
కేటీఆర్ పేరు చెప్పలేదు.. చర్లపల్లి జైలు నుంచి పట్నం లేఖ
సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్? -
ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను భర్తతో సహా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు చర్లపల్లి జైలు అధికారులు అండర్ ట్రయల్ (యూటీ) ఖైదీ నెం.2001 కేటాయించారు. సోమవారం నాగేశ్వర్రావును అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం నాగేశ్వర్రావును పది రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు బుధవారం జైలులో నాగేశ్వర్రావుకు ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలకాంశాలు ప్రస్తావించారు. ప్రాథమిక విచారణలోనే నాగేశ్వర్రావు తన నేరం అంగీకరించినట్లు అందులో రాశారు. హస్తినాపురంలోని వెంకటరమణ కాలనీలో ఉండే బాధితురాలి ఇంటికి నాగేశ్వర్రావు ఆ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ఆ ఫీడ్‌ను సేకరించామని పేర్కొన్నారు. ఉదంతం జరిగిన తర్వాత కేసు నమోదైన విషయం తెలుసుకున్న నాగేశ్వర్రావు బెంగళూరు పారిపోయాడని, ఆదివారం రాత్రి నగరానికి చేరుకోగా పట్టుకున్నామని కోర్టుకు తెలిపారు. ఈ ఉదంతానికి సంబంధించిన మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేసి ఉన్న నాగేశ్వర్రావు పిస్టల్‌తో పాటు ఆయన ఇంటి నుంచి నేరం చేసినప్పుడు ధరించిన దుస్తులు తదితరాలు స్వాధీనం చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితురాలి ఇంటి దగ్గర, ఇబ్రహీంపట్నం రహదారిలో, అక్కడ నుంచి కొత్తపేటకు వచ్చే మార్గంలో ఇలా అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్ సేకరించామని పేర్కొన్నారు. బాధితురాలి నుంచి సీఆర్పీసీ 161 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం రికార్డు చేయడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించామని వివరించారు. నేరం జరిగిన ప్రాంతమైన బాధితురాలి ఇంటి నుంచి కీలకాధారాలుగా పరిగణించే రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్ స్వాధీనం చేసుకున్నట్లు వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిసిన పోలీసులు, కారు మరమ్మతులకు తీసుకువెళ్లిన మెకానిక్‌లు, బాధితురాలి ఇంటి వద్ద ఉన్న వారు సహా మొత్తం 17 మందిని సాక్షులుగా పరిగణిస్తూ వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. నాగేశ్వర్రావుకు చెందిన కారులో బాధితురాలు, ఆమె భర్తలతో కలిసి ప్రయాణించిన ఫుటేజ్‌ను బీఎన్ రెడ్డి నగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, దాన్ని రికవరీ చేశామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన నాగేశ్వర్రావు 2018లో బాధితురాలి భర్తను అరెస్టు చేశారు. అప్పట్లో తన కార్యాలయానికి వచ్చిన బాధితురాలిపై కన్నేశాడు. తన భర్తను కేసు నుంచి బయటపడేయాలని ఆమె కోరడంతో అంగీకరించినట్లు నటించాడు. ఆపై బెయిల్‌పై వచ్చిన బాధితురాలి భర్తను తన పొలంలో పనిలో పెట్టుకుని ఈ కథంతా నడుపుకుంటూ వచ్చాడని కేసు పూర్వాపరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. చదవండి: Kadem Project: ‘కడెం’ దడ మొత్తం 32 పేజీలు ఉన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలతో పాటు సాక్షుల వాంగ్మూలాలను పొందుపరిచారు. మరోపక్క జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నాగేశ్వర్రావుకు అధికారులు హైసెక్యూరిటీతో కూడిన సింగిల్ సెల్ కేటాయించారు. అతడు గతంలో అరెస్టు చేసిన నేరగాళ్లలో కొందరు జైల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైల్లో నాగేశ్వర్రావు బుధవారం పూర్తి ముభావంగా ఉన్నాడని తెలిసింది -
‘దిశ’ కేసు; చల్లారని ఆగ్రహ జ్వాలలు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులో నిందితులను వెంటనే ఉరి తీయకపోతే జైలు గోడలు కూలగొట్టి వారిని చంపేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. బుధవారం రాత్రి చర్లపల్లి జయశంకర్ విగ్రహం నుంచి చర్లపల్లి జైల్ వరకు ‘దిశ’ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు ప్రేంకుమార్ మాట్లాడుతూ అత్యాచార ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులపై విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ‘దిశ’ చట్టాన్ని చేసి నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల తరహాలో చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఒక్కసారిగా జైలు వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. చర్లపల్లి జైలులో ఐజీ తనిఖీలు చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని బుధవారం జైళ్లశాఖ ఐజీ సైదయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ‘దిశ’ కేసు నిందితులు ఉన్న మహనంది బ్యారక్ వద్ద భద్రతను పరిశీలించారు. వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. అవసరమైతే భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. ఆయన వెంట జైల్ పర్యవేక్షణాధికారి సంపత్, అధికారులు కృష్ణమూర్తి, వెంకటేశం ఉన్నారు. కస్టడీపై గోప్యత... ‘దిశ’ కేసు నిందితుల కస్టడీని కోరుతూ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలీసులు, జైల్ అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను ఏ సమయంలోనైనా కస్టడీకి తరలించవచ్చుననే ఉద్దేశంతో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే మీడియా వాహనాల హడావుడి కనిపించింది. అయితే నిందితుల తరలింపుపై పోలీసులు, జైల్ అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. బుధవారం నిందితులను వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతించినప్పటికీ వారి తరలింపుపై స్పష్టత లేదు. శాంతిభద్రతల నేపథ్యంలో రాత్రి వేళల్లోనే వారిని కస్టడికీ తీసుకెళ్లే అవకాశం ఉండవచ్చునని సమాచారం. -
చర్లపల్లి జైలుకు ఉన్మాదులు
షాద్‌నగర్‌టౌన్, షాద్‌నగర్ రూరల్: ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు ప్రియాంకరెడ్డిని హత్య చేసిన దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును మెజిస్ట్రేషన్ ఎదుట హాజరు పరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, నిందితులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటం.. బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముగ్గురు డాక్టర్లు పోలీస్ స్టేషన్‌కే వచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ సురేందర్, డాక్టర్ కిరణ్‌లు నిందితులకు సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో.. పట్టుబడిన నిందితులను షాద్‌నగర్ కోర్టులో శనివారం ఉదయం హాజరుపరచాల్సి ఉంది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో సమావేశం నిమిత్తం షాద్‌నగర్ కోర్టు జడ్జిలు అక్కడికి వెళ్లారు. దీంతో ఫరూఖ్‌నగర్ తహసీల్దార్ పాండునాయక్, ఆర్ఐ ప్రవీణ్ పోలీసు వాహనంలో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో తహసీల్దార్ పాండునాయక్ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు. వారికి తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. చర్లపల్లి జైల్ వద్ద పోలీసులతో వాగ్వివాదం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత... కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులను శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్దెత్తున్న జైలు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తూ జైలు వైపు దూసుకొచ్చారు. జైలు మెయిన్ గేట్‌కు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను తరలిస్తున్న వాహనాలు జైలు వద్దకు చేరుకునే సమయంలో చక్రిపురం నుంచి, చర్లపల్లి నుంచి జైలు వైపుగా వచ్చే వాహనాలను నిలిపేశారు. నిందితులను తరలిస్తున్న వాహనం సాయంత్రం 6:05 నిమిషాలకు జైలులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జైలు వైపు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు రోప్‌తో అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో వారందరిని పోలీసులు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లో వేర్వేరు సెల్‌లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వార్తలు: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! -
చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో గురువారం ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జైలు అధికారుల వేధింపులు తాళలేక ఓ ఖైదీ ఇనుప కడ్డీలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. గడిచిన మూడు నెలల కాలంలో 12 మంది ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. -
పరారైన ఖైదీ పట్టివేత
హైదరాబాద్ : చర్లపల్లి జైలు నుంచి తప్పించుకు పారిపోయిన ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. నిరంజన్ అనే జీవిత ఖైదీ 2014లో చర్లపల్లి జైలు ఖైదీల వ్యవసాయ క్షేత్రం నుంచి కాపలా సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. అప్పటి నుంచి వెతుకుతున్న పోలీసులు పరిగిలో సోమవారం రాత్రి పట్టుకున్నారు. అతడిని తిరిగి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. -
చర్లపల్లి జైలులో మావో ఖైదీల నిరాహార దీక్ష
హైదరాబాద్: ఏవోబీలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాల బంద్‌కు సంఘీభావంగా చర్లపల్లి జైలులో మావో రాజకీయ ఖైదీలు గురువారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. బ్యారక్‌లో ఉన్న మావో ఖైదీలు ఉదయం నుంచి అన్నపానీయాలు ముట్టుకోకుండా దీక్ష చేస్తున్నారు. -
చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు శనివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస్ బ్యారక్ లో 10 మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అయితే ఈ బాటిళ్లు మద్దెల చెరువు సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. భాను కిరణ్ వద్ద నుంచి సదరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. భాను కిరణ్‌కి మద్యం బాటిళ్లు ఎవరు అందజేశారు అనే అంశంపై ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా జైలులో మందు బాటిళ్లు దొరకడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చర్లపల్లి జైలు వద్ద ఖైదీల స్టాల్
కుషాయిగూడ (హైదరాబాద్) : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో సబ్బులు, ఫినాయిల్, కాటన్ వస్త్రాలు, కుర్చీలు, చెప్పుల స్టాండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు జైలు అధికారులు ఉత్పత్తుల విక్రయానికి పూనుకున్నారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే ఖైదీల బంధువులతో పాటు ఆ మార్గంలో వచ్చేవారు స్టాల్‌లోని వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
చర్లపల్లి జైలులోనే రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ : ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైల్లోనే విచారిస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకుంది. అయితే సెబాస్టియన్, ఉదయ సింహాలను మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు రేవంత్ రెడ్డిని మాత్రం జైల్లోనే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతారని వార్తలు వచ్చినా... చివరి నిమిషంలో అధికారులు తమ వ్యూహం మార్చుకున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చర్లపల్లి జైలులోనే రేవంత్ రెడ్డి!
-
బాబు డైరెక్షన్.. రేవంత్ యాక్షన్
ఎన్ని కోట్లయినా ఎమ్మెల్సీని గెలుచుకోవాలని వ్యూహం ♦ కనీసం ఐదుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్ ♦ డీల్ కుదిర్చే బాధ్యతలు రేవంత్‌కు ♦ ఐదేసి కోట్లు ఇస్తామంటూ నలుగురు ఎమ్మెల్యేలకు ఆఫర్ ♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు 50 లక్షల అడ్వాన్స్ ♦ స్టీఫెన్‌కు డబ్బులివ్వబోయి ఏసీబీకి చిక్కిన రేవంత్ సాక్షి, హైదరాబాద్: ‘ఎన్ని కోట్లు ఖర్చయినా సరే.. ఎలాగైనా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి. కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలనైనా కొనుగోలు చేయాలి’.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం. రాష్ర్ట విభజన తర్వాత 40 మంది ఎమ్మెల్సీలతో కొలువుదీరిన మండలిలో టీడీపీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకపోయింది. ఇప్పటికే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిపోవడం, మరొకరు పదవీ విరమణ చేయడంతో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే కోటాలో ఒకరిని మండలికి పంపాలన్న పట్టుదలతో బాబు ఉన్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించేందుకు సిద్ధపడ్డారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారు. రేవంత్ కోరుకున్నట్లు వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. అతణ్ని గెలిపించుకునేందుకు అన్ని విధాలా ఆర్థిక సాయం చేసేందుకు బాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే నోటిఫికేషన్ వెలువడటంతోనే రేవంత్ రంగంలోకి దిగారు. తెరవెనక బాబు మంత్రాంగం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బాబు పెద్ద మంత్రాంగమే నడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ఆర్థికావసరాలు ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నామినేటెడ్ ఎమ్మెల్యేను గుర్తించారు. వీరందరికీ రూ.5 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. డబ్బు సమకూర్చే బాధ్యతను టీడీపీకే చెందిన ఓ ఎంపీకి అప్పగించారు. సదరు ఎంపీ సూచనల మేరకు డబ్బును జూబ్లీహిల్స్‌లోని ఓ సినీ నిర్మాత ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి కొంత డబ్బును అడ్వాన్స్‌గా ఎమ్మెల్యేలకు చేరవేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగించారు. టీఆర్ఎస్ తీరుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అసంతృప్తితో ఉన్నారని అంచనాకు వచ్చిన రేవంత్.. ఆయనను ముగ్గులోకి దింపేందుకు టీడీపీ సానుభూతిపరుడు మాథ్యూస్ జెరూసలెం(మత్తయ్య)ను రంగంలోకి దింపారు. ఇది కొంత ఆలస్యం అవుతుండడంతో మరో మధ్యవర్తి సెబాస్టియన్ రంగ ప్రవేశం చేశారు. రూ.5 కోట్ల డీల్ కావడంతో బాబుతోనూ రేవంత్ మాట్లాడించినట్లు సమాచారం. ఈ తతంగంపై 29వ తేదీ రాత్రే ఏసీబీ చీఫ్ ఎకే ఖాన్‌కు స్టీఫెన్ ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకే రేవంత్‌తో స్టీఫెన్ సంభాషణలు సాగాయి. రేవంత్‌ను తన ఇంటికి కాకుండా, లాలాగూడలోని తన దగ్గరి బంధువు నివాసానికి పిలిపించారు. పోలింగ్‌కు ముందు రోజు మధ్యాహ్నం నుంచి డీల్‌లో భాగంగా అడ్వాన్స్ చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ముట్టజెప్పారు. స్టీఫెన్‌కు కూడా ముట్టజెప్పేందుకు ఆయన చెప్పిన చిరునామాకు వెళ్లి రేవంత్ ఆయన అనుచరులు చిక్కిపోయారు. రేవంత్ అరెస్టు కావడంతో అప్పటికే డబ్బు తీసుకున్న ఎమ్మెల్యే కూడా భయపడి అడ్వాన్స్ సొమ్మును అప్పటికప్పుడు వెనక్కి పంపించినట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రచారం చేశారు. దీంతో మిగతా ముగ్గురు కూడా తాము డబ్బు తీసుకోబోమంటూ మధ్యవర్తులకు సమాచారం పంపారు. వారి మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. అప్పటికే రేవంత్ వారితో ఒకటికి రెండు సార్లు ఫోన్లో మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఈ ఫోన్లతోనే నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులకు సమాచారం చేరిపోయింది. ఈ సమాచారం ఆధారంగానే గత నెల 29న టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఎవరెవరితో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ రంగ ప్రవేశంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణలో ఈ అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు రేవంత్‌ను పది రోజులపాటు కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. -
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి...
-
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి రేవంత్ తరలింపు
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు మంగళవారం తరలించారు. ఆయన్ను చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు. కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు. -
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి..
-
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు. కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు. -
మరో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం
చర్లపల్లి (హైదరాబాద్) : చర్లపల్లి జైల్లో ఖైదీలు యధేచ్చగా సెల్ఫోన్లు వాడేస్తున్నారు. తాజాగా మరో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ వెలుగు చూసింది. బుధవారం రౌడీషీటర్ ఖైసర్ సెల్‌ఫోన్ వాడుతున్నట్టు గుర్తించిన సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజుల వ్యవధిలో ఖైదీల వద్ద రెండు సార్లు సెల్ఫోన్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. -
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో మరో ఖైదీ ఆత్యహత్యకు పాల్పడ్డాడు. జీవిత శిక్ష అనుభవిస్తున్న శేఖర్ అనే ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శేఖర్ యాసిడ్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సోమవారం ఉదయం జైల్లో ఖైదీలు ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇదే విషయమై ఆదివారం ఉదయం శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు. అయితే శివకూమార్ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆరోపణలు అవాస్తవని జైలు అధికారులు తెలిపారు. -
చర్లపల్లి జైల్లో ఖైదీ అనుమానస్పద మృతి
హైదరాబాద్:చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు. గాయపడిన ఖైదీలు శీను నాయక్, సతీష్,అజార్, జహంగీర్ లుగా గుర్తించారు. శివకుమార్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఖైదీ మహబూబ్ నగర్ జిల్లా వాసిగా సమాచారం. -
'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం'
హైదరాబాద్:చర్లపల్లి జైలులో ఖైదీలకు స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవమని సూపరిండెంట్ కె.వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే 2 వేల మంది ఖైదీలకు స్వైన్ ఫ్లూ మందలు పంపిణీ చేశామన్నారు. స్వైన్ ఫ్లూ బారిన పడి ఓ ఖైదీ మృతి చెందడానే వార్తలను ఆయన ఖండించారు. మూడు రోజుల క్రితం మృతిచెందిన ఆ ఖైదీ స్వైన్ ఫ్లూ తో చనిపోలేదని.. గుండెపోటుతో మరణించాడని ఆయన తెలిపారు. -
చర్లపల్లి జైల్లో భారీగా గంజాయి స్వాధీనం
-
చర్లపల్లి జైల్లో సోదాలు : భారీగా గంజాయి స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదివారం తెల్లవారుజామున అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైలులోని కృష్ణ, బ్రహ్మపుత్ర బ్యారెక్‌లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఖైదీల నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు అంతపెద్ద మొత్తంలో గంజాయి ఎలా చేరింది అని జైలు అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారులను ఆదేశించారు. కాగా నిన్న జైలు ప్రాంగణలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు ఆవరణలోని అగరబత్తి తయారీ కేంద్రం వెనక బాగంలో భూమిలోపల కవర్లలో దాచి ఉంచిన సెల్ ఫోన్లను కనుగోన్నారు. వాటిలో ఓ సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ఆ ఫోన్‌కు సంబంధించిన కాల్ డేటాను గుర్తించే పనిలో నిమగ్నమైయున్నారు. -
ఆ ఖైదీలకు క్షమాభిక్ష, ములాఖత్‌లు కట్
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్‌లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్‌గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు.