Clouds
-
ఇళ్ల ధరలు కాదు... ఇళ్లే ఆకాశాన్ని అంటాయి!
‘ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి’ అంటుంటారు. ఈ ఆర్టిస్ట్ మాత్రం ‘ధరలు కాదు ఇళ్లే ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది!’ అనుకొని మాయజాలాన్ని సృష్టించాడు. మహా పట్టణాలు భవంతులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మాణాలతో నేల నిండిపోయింది. పైన ఆకాశం మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ‘ఫ్లోటింగ్ బిల్డింగ్స్’ ఏఐ ఆర్ట్ సిరీస్‌ను సృష్టించాడు. వీటికి ముంబై మహానగరాన్ని నేపథ్యంగా తీసుకొని ‘ముంబై సర్రియల్ ఎస్టేట్’ అనే కాప్షన్ ఇచ్చాడు. ‘మీరు సరదాకు ఇలా చేశారు గానీ ఆకాశం కూడా బిల్టింగ్లతో కిక్కిరిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’ అని భవిష్యవాణి చెప్పాడు ఒక నెటిజనుడు. -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
ఇదేం మేఘంరా బాబు, ఇక్కడ మాత్రమే వర్షమా?
-
శ్రీకాకుళం: కమ్ముకున్న కారు మబ్బులు..
శ్రీకాకుళం: రోజంతా ఎండవేడి, ఉక్కపోతగా ఉన్న వాతావరణం బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేయడంతో పగటి పూటే చిమ్మచీకట్లు అలముకున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు శ్రీకాకుళం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేశాయి. -
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాహ్! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే..
నీలాకాశం, తెల్లటి మేఘాల నీడలో బెజవాడ నగరం కొత్త అందాలను సంతరించుకుంది. దుర్గాఘాట్, కృష్ణా నది తీరం, ప్రకాశం బ్యారేజ్.. బ్యూటీఫుల్‌గా మెరిసిపోయాయి. మనసును రంజింప చేసే ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. సమర్పణం విజయవాడ దుర్గాఘాట్‌లో సోమవారం కృష్ణవేణి సాక్షిగా అర్ఘ్యం సమర్పిస్తున్న దృశ్యం దర్పణం మేఘాల ఘుమఘుమలు.. పుడమికి నీలి ఆకాశం సరిగమలు.. దుర్గాఘాట్‌లో దర్పణంలా వాననీటిలో ఆకాశం ప్రతిబింబం మేఘాల తెరచాప ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంపై దట్టంగా అలుముకున్న మేఘాల తెరచాప మేఘాల హొయలు కృష్ణా నది తీరంపై అందంగా హొయలు పోతున్న మేఘమాలలు నీలాకాశం నీడలో.. నీలాకాశం నీడలో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు సంస్మరణం అక్టోబర్ 21న జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నీలాకాశం నీడలో పోలీసు సిబ్బంది కవాతు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్‌లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్‌పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్‌పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్‌కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్‌లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్‌లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
Photo Feature: కాషాయం మెరిసే.. నింగి మురిసే...
ఆకాశంలో ఏదో ప్రళయం వచ్చినట్లు మేఘాలు ఇలా కాషాయ వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఆ వర్ణాన్ని ఇలా నీటిలో చూసుకుని నింగి మురిసిపోయింది. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువుపై ఆకాశంలో శనివారం సాయంత్రం ఈ అద్భుతమైన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి. పాలకు వరుస జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రం వద్ద పాలకోసం శనివారం ఉదయం ప్రజలు ఇలా చెంబులు, గ్లాసులు, టిఫిన్‌బాక్సులు, ప్లాస్టిక్ బాటిళ్లతో వరుస కట్టిన దృశ్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, దేవరుప్పల తెప్పలపై చేపల వేట.. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ప్రాజెక్టు దిగువన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తెప్పలపై ఉత్సాహంగా చేపల వేట కొనసాగిస్తున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల. పొలాల వద్దే వ్యాక్సినేషన్ తిరుమలగిరి (సాగర్)/పెద్దవూర: ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంకల్పించడంతో వైద్యాధికారులు కూడా నడుం బిగించారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, గిరిజన గూడాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ ముమ్మరంగా కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రజలెవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులే పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. శనివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేశారు. -
Photo Feature: గ్రీన్ బ్యూటీ.. ‘స్నో’యగాలు
సాక్షి, అరకులోయ/ పాడేరు: అందాల అరకు వర్షాకాలంలో చూపే హొయలు అంతా ఇంతా కాదు. ఏ వైపు చూసినా ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత అద్భుతంగా మారి కనువిందు చేస్తుంటుంది. ఉన్నత పర్వత శ్రేణులు ఒక వైపు, పచ్చని పంట భూములు మరోవైపు.. వానా కాలంలోనూ ప్రభాత వేళ దర్శనమిచ్చే మంచు తెరలతో వన సీమ మనోజ్ఞరూపం నేత్రపర్వం చేస్తోంది. పాడేరు ఘాట్‌లో ఒక వైపు వర్షం కురుస్తుండగా మరో వైపు కొండల నిండా మంచు తెరల నడుమ మేఘాలు కమ్ముకోవటంతో అమ్మవారి పాదాల నుంచి వంట్లమామిడి ప్రాంతం దిగువుకు మబ్బులు దారిపొడవునా ఆహ్లాదపరిచాయి. -
మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..
ఇక్కడ మనకు వానాకాలం.. కానీ దుబాయ్‌లో ఇప్పుడు ఎండలు మండిపోయే వేసవికాలం. టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోవడంతో జనం హహాకారాలు చేస్తున్న పరిస్థితి. మరెలాగని ఆలోచించిన దుబాయ్ ప్రభుత్వం.. మేఘాలకు కరెంటు షాక్‌లు ఇచ్చి వాన కురిపించింది. మేఘాలకు కరెంట్ షాక్ ఇవ్వడమేంటి? దాంతో వాన కురిపించడమేంటి? అనే డౌట్లు వస్తున్నాయి కదా.. మరి ఆ సంగతులేమిటో తెలుసుకుందామా? ఎండల మంటలు.. దుబాయ్‌లో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. పగటివేళ ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దుబాయ్ వాతావరణ శాఖ రంగంలోకి దిగి కసరత్తు చేసింది.‘క్లౌడ్ సీడింగ్ (మేఘ మథనం)’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించగలిగితే.. వాతావరణాన్ని కాస్త చల్లబడేలా చేయవచ్చని నిర్ణయానికి వచ్చింది. ఈ దిశగా ప్రభుత్వంనుంచి అనుమతి పొందింది. డ్రోన్లతో షాకులిచ్చి.. మేఘ మథనంలో రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. మేఘాలపై కొన్ని రకాల రసాయనాలు, ఉప్పు వంటివి చల్లడం.. మేఘాలకు విద్యుత్ షాక్ ఇవ్వడం వంటివాటి ద్వారా వానలు పడే అవకాశం ఉంటుంది. ఇందులో దుబాయ్ అధికారులు కరెంటు షాక్ ఇచ్చే పద్ధతిని ఆచరించారు. పెద్దసైజు డ్రోన్ల సాయంతో మేఘాలకు విద్యుత్ షాక్ ఇచ్చారు. దానితో వర్షాలు కురిశాయి. నీటి కరువును ఎదుర్కొనేందుకు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వానలు చాలా తక్కువగా పడతాయి. ఏడాది సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు మాత్రమే. ఇటీవల మరింతగా తగ్గిపోతోంది. దీంతో దుబాయ్ ప్రభుత్వం 2017లోనే మేఘ మథనంపై దృష్టి సారించింది. రూ.112 కోట్ల (1.5 కోట్ల డాలర్ల)తో తొమ్మిది వేర్వేరు ప్రాజెక్టులకు చేపట్టింది. మేఘాలపై రసాయనాలు చల్లడం కాకుండా షాక్ ఇచ్చే పద్ధతిపై దుబాయ్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా డ్రోన్లను మేఘాలపైకి పంపి కరెంటు షాక్ ఇచ్చే ప్రాజెక్టును అమలు చేశారు. షాక్‌తో వాన పడేదెట్లా? మేఘాలు అంటే నీటి ఆవిరి దట్టంగా ఒకచోట కూడి ఉండటమే. వాటిలో నీటి ఆవిరి కణాలు దూరం దూరంగా ఉంటాయి. సాధారణంగా భారీగా మేఘాలు ఏర్పడినప్పుడు నీటి ఆవిరి ఎక్కువై బరువు పెరగడం, లేదా వాతావరణ పీడనంలో మార్పుల వల్ల మేఘాలపై ఒత్తిడి వల్ల వర్షం పడుతుంది. ఎండాకాలంలో ఈ పరిస్థితులు ఉండవు, మేఘాలు పెద్దగా ఏర్పడవు కాబట్టి వానలు కురవవు. ప్రస్తుతం దుబాయ్‌లో మేఘాలు వాటంతట అవే కురిసే పరిస్థితి లేక మేఘ మథనాన్ని ఆశ్రయించారు. ►డ్రోన్లతో మేఘాలకు విద్యుత్ షాక్‌లు ఇచ్చినప్పుడు నీటి ఆవిరి కణాల్లో స్వల్పంగా అయస్కాంత శక్తి పుడుతుంది. ఉదాహరణకు.. మనం వెంట్రుకలను దువ్వినప్పుడు దువ్వెనలో స్వల్పంగా పుట్టే విద్యుత్ కాగితం ముక్కలను ఆకర్షించినట్టుగా.. నీటి ఆవిరి కణాలు ఆకర్షించుకుని కలిసిపోతాయి. తుంపర్లుగా, నీటి బొట్లుగా మారి వర్షం కురుస్తుంది. దుబాయ్‌లో జరిగింది ఇదే. పెళ్లి రోజు వాన పడొద్దని.. వానలు పడటం కోసం ఉద్దేశించిన మేఘ మథనాన్ని మరో రకంగా కూడా ఉపయోగించుకున్న ఘటనలు ఉన్నాయి. ►బ్రిటిష్ రాణి కుమారుడు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ల వివాహం వానాకాలంలో జరిగింది. పెళ్లి జరిగే రోజు వర్షంపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఆ రోజున వాన పడకుండా ఉండేందుకు.. ముందురోజే భారీస్థాయిలో మేఘమథనం చేసి మేఘాలన్నింటినీ ఖాళీ చేసేశారు. పెళ్లి జరిగిన రోజున చుక్క వాన పడలేదు. ►2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలోనూ చైనా ఇదే పనిచేసింది. ప్రారంభోత్సవం రోజున వాన పడకుండా ఉండేందుకు.. అంతకుముందు రోజే రసాయనాలు నిం పిన రాకెట్లను మేఘాలకన్నా పైకి పంపి పేల్చివేసింది. ఆ రసాయనాల కారణంగా మేఘాలు ఖాళీ అయిపోయాయి. ప్రారంభోత్సవం సాఫీగా జరిగిపోయింది. -
Photo Story: జాలువారుతున్న కారుమబ్బులు
సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – చింతలమానెపల్లి భానుడి కిరణాలు.. బంగారు వర్ణాలు.. కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది. – చింతలమానెపల్లి ఇవి కూడా చూడండి: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు -
గ్రహణాన్ని చూడలేకపోయాను: మోదీ
న్యూఢిల్లీ : దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన సూర్యగ్రహణం కొద్ది సేపటి క్రితం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సూర్యుడు సప్తవర్ణాలతో కనువిందు చేశాడు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, చిన్నారులు, ప్రముఖులు ఆసక్తి కనబరిచారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సూర్య గ్రహణాన్ని చూడలేకపోయానని తెలిపారు. ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల గ్రహణాన్ని వీక్షించే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘చాలా మంది భారతీయుల మాదిరిగానే.. నేను కూడా ఈ అద్భుత సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు చాలా ఉత్సాహం కనబరిచాను. దురదృష్టవశాత్తు గ్రహణం ఏర్పడిన సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం వల్ల నేను సూర్యున్ని చూడలేకపోయాను. అయితే కోజికోడ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాను. అలాగే నిపుణలతో మాట్లాడుతూ ద్వారా ఈ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందిచుకున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. -
మేఘాలే తాకాయి.. ‘హిల్’ హైలెస్సా..
ఎత్తయిన పచ్చని కొండలు.. వాటి మధ్య దవళవర్ణ శోభితమైన మేఘాలు తాకుతూ వెళితే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది. అటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వేదికయ్యాయి. ఏజెన్సీలోని ఘాట్ రోడ్లు, రంపచోడవరం సమీపంలోని భూపతిపాలెం ప్రాజెక్టు, సున్నంపాడు, మారేడుమిల్లి వద్ద కొండకొండకూ మధ్య తేలియాడుతూ వెళుతున్న మేఘమాలికలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. -
భూమి లోడితే దొరికేది మాయేనంట!
ఆ పొద్దు శనివారం. గడపట అలికి బొట్లు పెడతా ఉండా! నా చెల్లెలు పద్మ వచ్చి నాపక్కన కుసుండే. నేను ఆ యమ్మ మొగంకల్ల ఎగ జూస్తి. మొగం సప్పిడిగా పెట్టుకొని ఉండె. ‘‘యాల పద్మా అట్లుండావు?’’ అని అడిగితి. ‘కాదక్కా, మా ఇంటి పక్కన నరసమ్మ మంచి లై కనుక్కొనింది. ఇబుటికి సుమారు నెల నుండి గమనిస్తా ఉండా. నేను ఇంటికాడ ఉన్నింది చూసిందంటే నీల్లకు చెమ్ము ఎత్తుకుని ఒచ్చేస్తుంది. వాళ్ళింట్లో సంగటి తిని మా ఇంట్లోకి వచ్చేది నోరు కారాలు అని ఆరస్తా. నోరు మంటగిని కాసిన్నినీల్లు ఇమ్మ తాగల్ల అనేది. మా ఇంట్లో ఉండ పెద్ద చెమ్ము, అది లీటరు నీల్లు పడుతుంది. దానినిండుకు పట్టిస్తే గుక్క తిప్పుకోకుండా, పైకి ఎత్తిన చొమ్ము దించకుండా నిమిసానికి తాగేసి చొమ్ము ఆడ పెట్టేసి మూతి తుడ్సుకొని ఎలిపోతుంది. మేము వారానికి రెండు క్యాండ్లు నీల్లు కొంటే ఆయమ్మ ఒగ క్యాను నీల్లు కొంటుంది. ఆనీల్లను సుమారు వారం పది దినాలు సరిజేస్తుంది. లీటరు నీల్లు పట్టే బాట్లు ఎత్తుకొస్తుంది మాఇంటికి. వాటిని బట్టుకుపోయి మొగునికిస్తుంది. దినాము వాళ్ళింట్లో అన్నందినేది మా ఇంట్లో నీల్లు తాగేసిపోతే పొదుపు గాదా. మా ఇంట్లో మేము నలుగురం తాగల్ల. ఇంగా వొచ్చే వాళ్లకు పొయ్యే వాళ్లకు ఎట్లా లేదన్నా దినానికి రెండు లీటర్ల నీళ్లు పంచాల్సి వస్తా ఉంది. ఇల్లు ఏమారి బీగం ఎయ్యకుండా ఆదమర్సినామంటే చిన్నగా లబ్బరు సీసా ఎత్తకొచ్చి నీళ్లు దొంగతనం కూడా చేస్తుంది. నా మొగుడు నన్నుకన్నమాటలు తిడతా ఉండాడు. ఇట్లే ఆయమ్మను నువ్వు చేరదీస్తావుండు ఇంట్లో నీల్లన్నీ తాగేసి పోతుంది అని. అది కాదక్కా మేమూ కొనే నీల్లె కదా,ఇరవై లీటర్లనీల్లకి ఇరవై రూపాయలిస్తుండాం. ఆయమ్మ ఇరంపరం లేకుండా అట్లా తాగితే ఎట్లా? దీనట్లాడిదే ‘మనింటిదీపమే కదా అని ముద్దుపెట్టుకుంటే మూతంతా కాలిందట’ ఈ పొద్దు మల్లా కాసిన్ని నీల్లు ఇయ్యి అని అడిగే. మా ఇంటికి నీల్లకోసం రావద్దు అని మగాన గొట్టినట్టు జెప్పిన నిట్టూరం అయితే గానీ అని. ఇబ్బుటికే నేను నీల్లోనికి పది క్యాండ్లకి అప్పు. ఈసారికి వాడు నాకు నీల్లు ఇస్తాడో లేదో’’ అని దాని బాదంతా ఎలగక్కి మల్లా వస్తాకా అని ఎలిపాయె!‘‘చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నంట’’ ఇట్లాడిదే నర్సి అనుకొని నేను నా పన్లన్నీ ముగించుకునేకుందికి అన్నం పొద్దు అయింది. మడికాడికి పదామని దావలోకి వస్తి. నేను పద్దన్నేదిబ్బలో పేడతట్టి ఎయ్యను దావింటి వచ్చినబడు మా తోడికోడలు మేనమామ ఊరు నుండి వస్తా ఉండే. ఆయన ఇబుడు తిరుక్కుని ఊరికిఎలిపోతా ఉండాడు. నాకు ఎదురుబడే.‘‘ఏమప్ప ఇంతలో వస్తా ఉండావు, మల్ల అంతలోనే ఎలిపోతా ఉండావు’’ అంటి. ‘‘పాక, మీ ఊర్లో తాగను నీల్లు పుట్ల. మీయక్క క్యాను నీల్లు అయిపోయినాయని బోరునీల్లు ఇస్తాది, అవి తాగి పడిసం బడితే ఎట్లమ్మ’’ అనే. నేను ఉండుకొని ‘అయ్యో మా ఇంట్లో తాగుదువురా అంటే ‘లేదులేమ్మా పని ఉంది’ అనిఎలిపాయ ఆయప్ప! ఆ మర్సునాడు అంతా కూలీలకు ఎలబారే పొద్దయింది. అరుపులు గెట్టిగా ఇనిపిస్తావుంటే ఇంట్లోనుండి ఈదిలోకి వొచ్చి చూస్తి. మా చిన్నమ్మ చిన్నాయన కొట్లాడుకుంటా ఉండారు. నేను పుట్టి బుద్దెరిగిందే వాళ్లిద్దరూ వాళ్ళ సద్దు నలుగురినేటిగా రంపులాడిందే లేదు. వాళ్లకు బిడ్డలు పాపలు లేరు. ఉండేది ఇద్దురే. మా చిన్నాయన ఏ పనికీ పాటకూ పోడు. ఏయాలకీ మా చిన్నమ్మే కూలి చేసి ఇంట్లోకి ముప్పై మూడు తెచ్చేయల్ల. ఆ యప్పమాత్రానికి తెల్లగ గుడ్డలేసుకొనేది,ఈ యమ్మ కూలి చేసిన డబ్బుల్ని అల్లింబెల్లం మాటలు జెప్పి ఉబ్బించి తీసుకునేది,ఈకుంటే రంపుజేసి పెరుక్కుని టౌనుకు బోయి ఆ బస్టాండెంటి తిరిగేది. ‘‘లత్తగవ్వలన్నీ ఒక దరికి చేరినట్టు’’ ఈనికి దోడుమైనోళ్లతో టీలు తాగేది,అట్లా పొద్దుబోగొట్టుకునేది. మావిటేల ఆయమ్మ నోటికి వక్కాకు, నాలుగుబాండాలు నల్లకవర్ లో తీసుకొని ఇంటికొచ్చేది. ఆయమ్మ ఏంపనికి పోయింటివి అంటే నేను ఆడ పనుంటే పోతిని ఈడపనుంటే పోతిని అని దస్తు కొట్టేది. ఇట్లా తోసుకుంటా దొబ్బుకుంటా పోతావుండారు. నేను ఉండుకొని ఈల్ల సద్దు ఎబుడూ బయట రాదే అని ఏమీల్లకు పోయేకాలం అని దండించి యాల రంపు మీకు అని అడిగితి. నేను పాతానే మా చిన్నాయన బుజం మీద గుడ్డేసుకొని ఎలిపాయ. మా చినమ్మ ‘‘కాదు పాపా నేను ఎర్రటెండకు నెత్తురుచ్చ్చలు పోసుకొని పొగులంతా కష్టపడితే ఇచ్చేది ఇన్నూరురూపాయలు. ఒగనాడు పనుంటే పది ఇరవై దినాలు పని చిక్కదు. ఆ ఇన్నూరు రూపాయలతో సంసారానికి అన్నీ కొనే పనే. అనకవగా వాడుకోవల్ల. ఇవిటి కొదవకు తాగే నీల్లు నెలకి నాలుగు క్యాండ్లు కావల్ల. నా దగ్గర డబ్బుల్లేక క్యానోనికి ముందు చేసిన అప్పు ఈలేక ఈ వారం నీల్లు కొనుక్కోలే. ఒగ చొమ్ము నీల్లుంటే అన్నం బెట్టి అవి ఆడ బెడితి. నువ్వు కాసిన్ని తాగి నాకు కాసిన్ని బెట్టు ఇవే ఉండాయి అంటే, గిన్నెడు కూడు తినేసి చొమ్మునీల్లు కడుపునిండా తాగేసి మిగిలిన నీల్లతో చేయికడుక్కుంటాడు. చేతులు కడిగేకి వారగా మనూరు నీల్లు ముంచి పెట్టిన. ఎంత కండకావరం వుంటే అట్లాపని చేస్తాడు. అయినా నారాతే సరిలేదు. మాయమ్మ యాలగ్నాన నేలేసిందో. ఒగటే అగసాట్లు. నేనెట్లా అన్నం దినేది ఈ బాదకన్నా నేను ఏడన్నపడి సచ్చిపోదామా అనిపిస్తా ఉంది’’ అని ఆయమ్మ ఏడ్సె! నేను పానీ ఊరుకో అని మా ఇంట్లో చొమ్ము నీల్లు ఎత్తకపోయి ఆయమ్మకు ఇచ్చి అన్నం తినమని సర్దిచెప్పి వొస్తి . ఆ పొద్దంతా మేఘాలు ఆడతా ఉండాయి. ఆ రేయి అందరూ నిద్దర పానంక సడి సప్పుడు లేకుండా వొచ్చింది వాన. అదే వాన ఎడతెరిపి లేకుండా రెయ్యి పొగులు రెండు దినాలు కురిసి నిల్సి పోయింది. వాన బడితే మాఊరి రోడ్డంటి బండ్లు కాని ఆటోలు గాని రాలేవు. మన్సులు నడిచేదానికే ఇబ్బంది ఆరోడ్డులో. ఇంక బండ్లు దిగబడిపోతాయి. ఇంగ ఈ నీళ్లబండోడువొచ్చి అబుటికే నాలుగు దినాలయ్యింది. సందకాడ అన్నం తిందామని గిండ్లల్లో అన్నం బెట్టుకున్నాం, నీల్ల డబ్బాలో చూస్తే చెమ్మునీల్లు మాత్రమే ఉండాయి. ఇంట్లో మేము ఐదుమంది ఉన్నాం. ఆనీల్లు చాలవని చెమ్ముఎత్తుకొని మాఇంటి చుట్టుపక్కల ఉండే ఇండ్ల కాడికి పొయ్యి ‘‘ఒగ చొమ్మునీల్లు పోయమ్మ, మాఇంట్లో నీల్లు ఐపోయినాయి, ఈ రేయిరేతిరి గడిస్తే తెల్లారికి నామొగున్నిఅంపించి తెమ్మంటా’’ అని అడిగితి. ‘‘అయ్యో నాయనా మా ఇంట్లోన అయిపోయినాయి’’ అనే ఆయమ్మ. రెండో ఇంటికిబోతి. ఆయమ్మ ‘‘వానబడి క్యానోడు రాలే మాకు ఇబుటికి అయ్యేటిగా ఉండాయి’’ అనే. మా బజారులోని ఇండ్లు అన్నీతిరిగి ఒట్టిచెమ్ము ఎత్తుకుని యింటికొస్తి.ఆయాలకి ఇంట్లోవాళ్ళు ఉన్నినీల్లు తలా గుక్కెడు తాగినారు. నేను అన్నం తినాలంటే నీల్లులేవు.మాఊరి ట్యాంకి నీల్లే గొంతులో కడి అడ్డం బడకుండాకాసిన్ని మింగి పొనుకుంటి. ఆ తెల్లారే సరికి ముక్కులు మూసుకు పోయినాయి .ఒరే నీల్లు మారిందానికి దాని స్వరూపం అబుడే చూపించిందే అనుకొని అంగిల్లో గసాలమాతర ఒగటి తెచ్చుకొని మింగి అట్లే టమాటా చెట్లల్లో గెడ్డి తొగేకి గొల్లోళ్ళకు పనికిబోతి. నా జతకి గంగుల చినమ్మ,మా ఆడబిడ్డ,నీలా చినమ్మ,పెద్దమ్మ జయమ్మ అంతా ఐదారుమంది జమై పనిలోకి దిగితిమి. నేను వంకోని గెడ్డి తొగతా ఉంటే ముక్కుల్లో నుంచి నీల్లు జలజలా కారతావుంది.పాపా గొంతు మారిందే య్యాలమ్మా’ అనిఅడిగే మా చిన్నమ్మ. ‘‘రాత్రి మా ఇంట్లో తాగే నీల్లయిపోయినాయి. రాత్రి మా బజారులో ఏడిండ్లు తిరిగినా చొమ్మునీళ్లు పుట్ల. ఎంతన్న దుడ్డు పెట్టి నీల్లు కొనే కాలం.గ్లాసు నీల్లు దొరకలేదే పానం బోయేటపుడు కూడా ఇంతే కదా’’అంటి. నా కంట్లో నీల్లు కారినాయి.మా చినమ్మ ఉండుకొని ‘‘మనూరి ట్యాంక్ నీల్లు గన బాగుంటే మనకు ఈ కర్మేల. నాకు పెండ్లి అయిన కొత్తల్లో మాయత్త నాకు కడుపునిండా సంగటి పెట్టేదిలేదు. అబుడు బోరింగ్ నీల్లు ఉండేవి. నేను నిద్దర లేస్తానే నీల్ల కడవ ఎత్తుకొని బిందెకు నీల్లుకొట్టి పరగడుపుతోనే నాలుగైదు దోసిల్లు గుక్క దిప్పుకోకుండా కడుపునిండే దాకా తాగేసేది. కడుపు సల్లగా అయ్యేది. ఆ బోరింగుని చూస్తే కన్నతల్లిని చూసినట్టు నాకు. ఆ నీల్లు గూడా చెక్కిరినీల్లు ఉన్నట్టు ఉండేవి’’ అనే! ఇంతలో మా చిన్నిపెద్దమ్మ వుండుకొని ‘‘మీకాలాన్నన్నా బోరింగునీల్లు. మేము ఈ ఊరికి కాపరానికి వచ్చినబుడు ఏట్లో నీల్లు తాగతా ఉండేది. ఇబుడన్న బిందెలు. ఆ కాలాన మొంటికడవలతో మోసేది. మా ఇంట్లో మేము ఐదు మంది తోడుకోడాల్లం. నాకాటికి పెద్దతోడికోడాలు కిట్టిని,నన్ను నీల్లు మొయ్యను పెట్టిండ్రి. అది పడమట గడ్డ నుంచి వచ్చిండేది. బలే శతమానం మన్సి. మనుసుల్లో కూడేది లే. నేను చిన్నగా ఉండా పెద్దపెద్ద కడవలతో నీల్లు నేను మోయలేను. నీల్లకు ఇద్దరం బోతే అది కడవనిండా నీల్లు ముంచుకొని కడవను అవలీలగా భుజానికి ఎత్తుకొని తిరిగి చూడకుండా రివ్వున వచ్చేసేది. నేను కడవెత్తేవాళ్లకోసం చూసి వాళ్ళ చేత ఎత్తించుకొని వచ్చేది. ఎబుడన్నాకడవెత్తు అక్కా అంటే ఏమి అంతలావు మొగుల్ని మోస్తారు నీల్ల కడవ మోయ్లేరా అనేసి ఎలిపోయేది. నేను కడవ మోకాటిపైన పెట్టుకొని అది బుజానికి ఎగసక సుమారు నూరు కడవలన్నా ఒక్కల గొట్టుంటా. అట్లా ఏట్లో నీల్లు తాగేటబుడు ఎవురికే గాని ముక్కు గాని చెక్కుగాని నొచ్చిండ్ల’’ అనే! ఇంతలో మా ఆడబిడ్డ ఉండుకొని ‘‘నేను నా కొడుక్కి నీల్లాడినబుడు బాలింతగా నెల దినాలు ఉడికి నీల్లే తాగల్ల. నెలదాటతానే బాయికి పూజ చేసి ఆ బాయి నీల్లు చేదుకొని పెద్దోళ్ళు గుక్కెడు తాగమంటే,నేను ఉడికినీల్లు తాగి మొగం వాసి పోయివుండి చొమ్ము నీల్లు తాగేస్తి’’ అనే!మావొదిన ఉండుకొని ‘‘ఊరులో ఉన్నంతసేపు ఊరునీల్లు తాగేది.పొలిం మిందపోతే బాయినీల్లు. సీనివాసపురంలో పేరు మోసిన బాయి ఇసక బాయి. పద్నాలుగు మెట్లు కూడా ఉండవు అంత చిన్న బాయి. ఆడోల్లు ఆ బాయిలోకి భయంలేకుండా దిగేది. పొరపాటుగా పడినా కూడా దర్లు పట్టుకోవచ్చు. నల్లపూస పన్న్యాకూడా కనపడుతుంది. ఆ బాయినీల్లు అంత తెల్లగా ఉండేవి,సల్లగా ఉండేవి. రుసి టెంకాయ పాలన్నట్లు ఉండేవి. ఎండాకాలం నాకు ఒళ్ళు ఉష్ణమయ్యేది. ఆ బాయిలో నీల్లు తాగితే ఉడుకు తగ్గిపోయేది. దిగువబాయి,గుండు బాయి, దావారబాయి, చిన్నప్పరెడ్డి బాయి, చెంగారెడ్డిబాయి, కమ్మోల్ల బాయి,కటువుబాయి, కోమటోల్ల బాయి ఇట్లా ఎన్నుండేవో.వాన్లు తలకిందులై, వాన్లుపడక మిషన్లు కనిపెట్టి ఎబుడైతే బోర్లు ఏసినారో ఆ బాయిలు ఎండిపోయే. కంటికి కనుపించే నీల్లు కనుమరుగైపోయినాయి. ఈ బోర్లు ఎయ్యను మరిగిరా, కంటికి కనిపించని నీల్లలో ఏమొస్తావుండాయో ఏమో . తెల్లారి కడవకు నీల్లు బట్టిపెడితే మాయిటేలకు తెల్లగా బిల్లగడతా ఉండాయి అవి తాగితే కీల్లనొప్పులు.మా సిన్నాయనకు డొక్కలోనొప్పి అని ఆస్పత్రికి పోతే కిడ్నీలో రాల్లున్నాయంట. ఈ బిల్లగట్టిన నీల్లు తాగినదానికే అంట ఆ జబ్బు. మేము ఎబుడూ గాని ఇట్లా జబ్బులు ఇనలేదు.ఈ రోగాలకు భయపడే వొగర్నిజూసి వొగరం ఊరంతా ఈ క్యాను నీల్లుకొని తాగే దానికి మరిగిరి. ఈ నీల్లుకు అలవాటుపడి ఊరిట్యాంకునీల్లు తాగినా ఒంటవు. కూలీకి పోయిన తావుకి కూడా లబ్బరు సీసాల్లో నీల్లు బోసుకొచ్చుకుంటావుండారు. ఈ క్యాను నీల్లల్లో ఏమి మందులు కలపతారో మనం చూసినామా, ఈ నీల్లకి ఇంకేమి కొత్త రోగం పుడుతుందో.అసలు నీల్లు కొన్నెబుడు నుండి నోటారా తెంపుగా నీల్లు తాగి ఎన్నాలయిందో. లబ్బరు క్యాండ్లలో నీల్లు ఎండాకాలం అయితే గోరెచ్చగా అయిపోతాయి, కడుపునొప్పొస్తే తాగతామే అట్లుంటాయి’’ అనే. నర్సిపెద్దమ్మ ఉండుకొని ‘‘ఇట్టాకాలం చూస్తామనుకోలేదు. ఏబుడన్నా ఇమ్ముతప్పొయ్యి ఆకిలి అయితే అన్నం అడిగేదానికి చిన్నతనమని నీల్లు బొయ్యమనేవాళ్ళం. ఎవురన్నఇండ్లకు వచ్చినా చొమ్ములో నీల్లు ముంచకపోయి గబుక్కున ఇచ్చేవాల్లం. మన బీదాబిక్కీ ఇండ్లల్లో కట్లు,నీల్లు కొనేవాల్లం కాదు. ఇబుడు కొంటా ఉండాం. పల్లెలు టౌన్డ్లు ఒగటైపాయే!’’ అనే.నా చెల్లెలు ఉండుకోని ‘‘నిన్న ఏమి జరిగిందో తెలుసా,మా వొదినోల్లు కొడుకు బిడ్డకు తొట్లు కట్టినారు. ఇంటింటికి బొయి చెప్పినారు. అదేపనిగా చెప్పినారే అని టౌన్ కి బోయి బాలింత సామగ్రి తీసుకోని,బాలింతకు రైకి,చిన్నబిడ్డకు గుడ్డలు,సాంగ్యానికి బీము,తెల్లగడ్డలు,సీకాయి,వాము,పసుపు,సతాపాకు ఇవన్నీ తట్టకు పెట్టుకోని ఉడికి నీల్లు ఒక బిందెకి కాసుకోని అందరం బోతిమి. వాళ్ళు ఒచ్చినోల్లకు అన్నాలు కూరలు జేసినారు. మా వొదిన వాల్ల అత్త అందరికీ వొడ్డిస్తా ఉండే. ఆయమ్మ వొలిపిక్కరం మన్సి. నా వాల్లొచ్చినారు మునిగే చిప్ప గెంటి, మీ వాల్లొచ్చినారు తేలే చిప్పగెంటి అనే రకం. ఆయమ్మకు కాగలిగినోల్లకు వారగా చొమ్ముతో క్యాన్నీల్లు పోసింది. బయటోల్లకు ఊర్లో నీల్లు బోసింది. వాల్లంతా ఊర్లో నీల్లు నోట్లోబోసుకునే కుందికి ఉప్పగాతెల్సినాయి. మాకు క్యానునీల్లు బొయలేదని తినే ఆకు కాడనుండి లేసి సగానికి సగం మంది ఎలిపోయిరి. ఏరుబద్దరం చేసింది అనే పేరయిపోయే’’ అనే. మా ఉరి గంగవ్వ మా పక్కనే యాపమాను కింద యాపగింజలు ఏరుకుంటా మా మాట్లు ఇని మాకాడకి వచ్చి కూసునే. మేము మానుకు యాలాడ దీసిన లబ్బరు సీసాలో నీల్లు దాగి వక్కాకు నమలతానేను యడబిడ్డంత ఉండేటప్పుడు మనూర్లో గెంతోబుల తాత ఉండేవాడు. ముసలిముర్దాపు. నడలేడు. దేకేది. కంటిసూపు మట్టం. ఆయప్ప తత్వాలు జెబ్బేది.పనీ పాటకు పోకుండా ఇండ్లకాడ ఉండే ముసలి ముతక, చిన్నబిడ్లు తల్లులు పొద్దుపాకుంటే ఆయప్ప కాడికి బొయ్యికుసుండేది. ఆ యప్ప తత్వాలు,పాటలు, కథలు జెప్పేవాడు. నాకిప్పటికీ గుర్తుంది అయన జెప్పింది.‘‘మనల్ని తొట్టతొలీగా భూదేవి ఆడమగా అని రెండు బొమ్మలు జేసి పానం బోసి బతుకుబోండి అంటే వాల్లు బూమంతా తిరిగి ఆకలేసి తొలీత మొన్ను తిందామని చేతులు మొంట్లో పెట్టినారంట. అది జూసి బూదేవి పైకి లేసి మీరు తినేకి, తాగేకి, బతకడానికి కావాల్సినవన్నీ బూమిపైనే ఉండాయి అవే మీకు మంచి జేస్తాయి. మీకు చెడు జేసేవి అన్నీ నా కడుపులో దాసుకుంటా, ఎట్టిపరిస్థితి లోనూ నన్ను తోడకండి అని జెప్పి మాయమయిందంట. అదే కాక ఆవు ఈనితే బిడ్డతో పాటు మ్యాయ బడుతుంది. అది ఏ జంతువు నోట్లో బడకుండా పుట్టలో ఏస్తాం. భూమిని లోడితే మనకు దొరికేది ఆ మ్యాయే అంట. అందుకే ఆ తల్లి నాపైనవి మీ బతుక్కి సరిపోతాయి అంటే ఈడేమో ఎయ్యి రెండేలు అడుగుల లోతులు బోర్లేసి పాతాళలోకం నుండి నీల్లు పైకి రప్పించి అవి తాగి సస్తా వుండాము. ఇంగా ఎట్లా కాలం సూడాల్సి వొస్తుందో. ఆ యాలకి మేముండములే అనే ‘ఆ యవ్వ వక్కాకు ఎర్రగ నవిలి పుక్కిట దవడకు తోసి. ఆ యాలకి పొద్దు గూట్లోపడే. మేము మా గూట్లకు బొయ్యి ముడుక్కుంటిమి. ఆ పద్దన్నే క్యానోడు ఊర్లోకి వచ్చే! అర్థాలు కన్నమాటలు = బూతులు దోడుమైనోళ్లతో= ఆయప్పలాంటివాల్లతో దస్తు = గొప్పలు, గచ్చులు ఒక్కల గొట్టుంటా = వక్క మారిగా పగలగొట్టటం దర్లు = పక్క గోడలు ఒంటవు = పట్టవుఇమ్ముతప్పొయ్యి = ఇబ్బందై ఎడ బిడ్డ = వయసుబిడ్డ ముసలి ముర్దాపు = ముడిగి పోవడం, వంగిపోవడం · -
ఆకాశంలో ‘దేవకన్య’
దేవకన్య నేలకు దిగి వస్తున్నట్లు భలే ఉంది కదా.. మేఘాలు రకరకాల ఆకారాలతో మనకు రోజూ కన్పిస్తాయి. కానీ ఇలా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం చూస్తాం. చూడగానే సరిపోదు వెంటనే సెల్ఫోన్లోనో లేదా కెమెరాలోనో బంధించాలి. అప్పుడే ఆ అద్భుతాన్ని మనం నలుగురికి పంచగలం. అచ్చం డానీ ఫెరారోలాగా అన్నమాట. డానీ ఫెరారో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన వాడు. 57 ఏళ్ల ఫెరారో తన భార్యతో కలసి కారులో వెళుతుండగా ‘దేవకన్య’ కనిపించిందట. ఆ సమయంలో కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న తనకు ఆ రూపం ఎంతో సాంత్వన చేకూర్చిందని ఫెరారో చెబుతున్నాడు. అయితే ఆ ఆకారం కొద్దిసేపే ఉందట. తన కెమెరాలో బంధించి ఆ రూపాన్ని శాశ్వతంగా పదిల పరుచుకోవాలని భావించాడట. దీంతో ప్రపంచ నలుమూలల్లో నెటిజన్లు ఈ దేవకన్యను దర్శించుకునే భాగ్యం దక్కింది. -
మా మబ్బులు పోయాయి.. మీరెక్కడైనా చూశారా..!
మా ఇంట్లో దొంగతనం జరిగిందండీ.. బంగారం, డబ్బు పోయింది.. విలువైన వస్తువులు పోయాయి.. అవి పోయాయి.. ఇవి పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. అయితే ఇరాన్ అనే దేశం ఉంది కదా.. అది కూడా ఇజ్రాయెల్ అనే దేశంపై ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేసిందో తెలుసా.. దొంగతనం చేసిందట. అవునా దేశాలు కూడా దొంగతనాలు చేస్తాయా అనుకుంటున్నారా.. ఇజ్రాయెల్ ఏం దొంగతనం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇరాన్‌కు మాత్రమే సొంతమైన మేఘాలను దొంగతనం చేసిందట. అదేంటి మేఘాలను దొంగతనం చేయడం ఏంటి? అయితే ఇదేదో ప్రాంక్ చేసే వార్త కాదు. నిజంగానే ఇజ్రాయెల్ దొంగతనం చేస్తోందని ఇరాన్ మిలిటరీ జనరల్ గోలం రెజా జలాలీ మీడియాకు వెల్లడించారు. దీంతో ఇరాన్లో వర్షం రాకుండా చేస్తోందని పెద్ద అభియోగమే మోపాడు. అంతేకాదు వచ్చిన మేఘాలను కూడా వర్షం కురవకుండా చేస్తోందని ఆరోపించాడు. ఇందుకే తమ దేశంలో ఎప్పటినుంచో కరువు తాండవిస్తోందని, దీనికి కారణం ఇజ్రాయెల్ అని విరుచుకుపడ్డాడు ఆ పెద్దాయన. ఇంకో విషయం తమ దేశంలోని మంచును కూడా ఇజ్రాయెల్ దొంగిలిస్తోందట. ఈయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలయ్యాయి. కాగా, మేఘాలను, మంచును దొంగిలించడమేంటి.. అసలు అది సాధ్యమే కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పాపం మరి ఏమి చేసి వారి మేఘాలను కాపాడుకుంటారో చూడాల్సిందే. -
చెల్పూరు గ్రామాన్ని కమ్ముకున్న కారు మేఘాలు
గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కారు మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులంతా మబ్బులను చూసి కంగారు పడ్డారు. చెల్పూరు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. -
తాపం తగ్గించకుంటే శాపమే!
సమకాలీనం కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషులవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహిత్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరాకరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. పిడుగుపాటుకు మను షులు చనిపోతారని విన్నాం కానీ, ఇంత మందా? ఒకేరోజు 13 మంది! ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో 62 మంది పిడుగుపాటుకు గురై చనిపోగా, ఉత్తర కోస్తాలోనే 37 మంది మరణిం చారు. పొరుగున ఉన్న ఒడిశాలో కిందటేడు 36 గంటల వ్యవధిలో 34 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఏపీలో పదమూడు గంటల వ్యవధిలో 36,749 పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. (కొన్ని భూమివైపొచ్చి పిడుగులయ్యాయి, మరికొన్ని మేఘాల మధ్యే మెరుపులుగా ముగిసాయి). ఇదంతా ఏమిటి? అంటే, నిపుణులు కూడా ‘ఏమో...! ఇదైతే అసాధారణమే!!’ అంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు భూతాపం పెరగటం వల్ల వచ్చిన ‘వాతావరణ మార్పుల (క్లైమెట్ చేంజ్) కారణంగానే’ అంటే... చాలా మంది నమ్మట్లేదు. ‘ఆ.. మీరు అన్నిటికీ వాతావరణ మార్పు కారణం అంటారులే’ అన్నట్టు ఓ అపనమ్మకపు చూపు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పెచ్చు మీరిన వడదెబ్బ చావులయినా, అకాలవర్షాలు–వరదలతో ముప్పైనా, ఇప్పుడీ పిడుగుపాటు మరణాలయినా, ఉత్తరాదిని హడలెత్తిస్తున్న ఇసుక తుపాన్లు–వేడిగాలి దుమార మైనా..... అంత తీవ్రత చూపడానికి వాతావరణ మార్పే కారణం అని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తు న్నారు. పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఆందో ళన చెందినట్టు, భూతాపోన్నతి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని అందరూ అంగీ కరించినా, ఇంత త్వరగా ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందుకే, చాలామంది దాన్నంత తీవ్రంగా పరిగణించలేదు. భవిష్యత్ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయనే ధ్యాస కూడా లేదు. రాబోయే పెనుప్రమాదాలకి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ స్పష్టమైన సంకేతాలే! ‘వాతావరణ మార్పు’ అన్నది కేవలం పర్యావరణానికే పరిమిత మైన అంశం కాదు. అనేకాంశాల సంకలనం! మార్పు లకు వేర్వేరు కారకాలున్నట్టే, ప్రభావం వల్ల పుట్టే విపరిణామాలకూ వైవిధ్యపు పార్శా్వలున్నాయి. ప్రభుత్వ విధానాలు, మనుషుల సంస్కృతి, ఆహా రపు అలవాట్లు, జీవనశైలి, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, ఎల్లలెరుగని స్వార్థం–సౌఖ్యం... ఇవన్నీ కారకాలు– ప్రభావితాలు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కొంతయితే, మానవ తప్పిదాలు పెచ్చుమీరి ప్రమా దస్థాయిని ఎన్నోరెట్లు పెంచుతున్నాయి. వాటిని నియంత్రించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. స్వచ్ఛంద సంస్థలకు తగు చొరవ–ప్రాతినిధ్యం కరువైంది. పౌరులు పూనికవహించడం లేదు. వెరసి సమస్య జటిలమౌతోంది. తీవ్రత గుర్తించి అప్రమత్త మయ్యేలోపే పరిస్థితులు చేయి దాటుతున్నాయి. తెలివితో ఉంటే మంచిది వాతావరణ మార్పు, మెళ్లో పెద్ద బోర్డు తగిలించు కొని వచ్చే భౌతికాకారం కాదు. ఈ రోజు (గురు వారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షాన్నే తీసు కోండి. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్మలాకాశం, నగరమంతా చిట్టుమని కాసిన ఎండ. అరగంటలోనే ఏమైందో అన్నట్టు ఉరుకులు పరుగులతో కమ్ము కొచ్చిన మబ్బులు. ఆకాశమంతా నల్ల టార్పాలిన్ కప్పేసినట్టు, నిమిషాల్లో కుండపోతగా వర్షం. రోడ్లన్నీ జలమయం! ఇదీ క్యుములోనింబస్ మేఘాల దెబ్బ. ‘సాధారణాన్ని మించిన ఉష్ణోగ్ర తలు నమోదయినపుడు ఇది జరుగుతూ ఉంటుం ద’ని నిపుణులు చెబుతున్నారు. వాటి రాకను, ఆ మేఘాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని, సగటును అంచనా వేయడం కూడా కష్టం. ఇవే మెరుపులు, ఉరుములు తద్వారా పిడుగుల్ని కురిపిస్తాయి. భూతా పోన్నతి ప్రత్యక్ష ప్రభావమే ఈ పిడుగుపాట్లు! మన దేశంలో పిడుగుపాటు మరణాల పరిస్థితి దారుణం. జాతీయ నేర నమోదు బృందం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత దశాబ్ది, ఏటా సగటున 2000 మంది పిడుగుపాటుతో మరణించారు. తుపాన్లు, వరదలు, వడదెబ్బ, భూకంపాలు... ఇలా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యపు మరణాలతో పోల్చినా పిడుగుపాటు మరణాలే ఎక్కువ. గత మూడేళ్లతో పోల్చి చూసినా ఈ సంవత్సరం పరిస్థితి అసాధారణంగా ఉందని వాతావరణ అధికారులే చెబుతున్నారు. ఏ అభివృద్ధి చెందిన సమాజంలో నైనా ఈ మరణాల రేటు తగ్గుతుందే కాని పెరగదు. అమెరికాలో, పిడుగుపాటు మరణాల్ని కచ్చితంగా లెక్కించడం మొదలైన ఈ 75 ఏళ్లలో అతి తక్కువ మరణాలు, కేవలం 16 గత సంవత్సరం నమోద య్యాయి. 2013లో నమోదయిన 23 మరణాల సంఖ్య మీద ఇది రికార్డు! ప్రతి పది లక్షల మంది జనాభాకు పిడుగుపాటు మృతుల నిష్పత్తి అమె రికాలో సగటున 0.3 అయితే, ఐరో పాలో 0.2 గా నమోదవుతోంది. భారత్‌లో ఇది 2గాను, జింబా బ్వేలో 20 గాను, మాలవిలో 84 గాను ఉంది. పిడుగుపాటు మరణాలు అమెరికాలో తగ్గటానికి కారణాలేమిటి? అని ఓ అధ్యయనం జరిగింది. ప్రజల్లో అవగాహన పెరగటం, పిడుగు నిరోధక నిర్మాణాలు, సకాలంలో వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మనుషుల సంఖ్య తగ్గడం ప్రధాన కారణాలుగా తేలింది. ఆ తెలివిడి మనకూ ఉండాలి. వేడి తగ్గించుకుంటే, చెట్లు సమృ ద్ధిగా ఉంటే పిడుగులు మనుషుల జోలికీ, ఏ ఇతర జీవుల జోలికీ రావు. ఒత్తిడి పెంచుతున్నాం! భూపర్యావరణంలో ఉష్ణోగ్రత అసాధారణమైనపుడు మేఘాలపై ఒత్తిడి పెరిగి పైకి, పైపైకి అతి శీతలంవైపు వడివడిగా సాగుతాయి. ఫలితంగా మేఘాల్లో అంతర్గతంగా ఆ తాడనంలో పుట్టే మెరుపు నిజానికొక విద్యుత్ విడుదల! అత్యధిక సందర్భాల్లో ఇది మేఘాల మధ్యే జరిగి మనకొక మెరుపులా కన బడుతుందంతే! కానీ, తీవ్రంగా ఉన్నపుడు అట్టడు గున ఉండే మేఘ వరుసవైపునకు వస్తూ రుణావేశం (నెగెటివ్ చార్జ్)గా పనిచేస్తుంది. వర్షపు మేఘం– భూమి మధ్య అసమతౌల్యతను సవరించే క్రమంలో ఈ రుణావేశం, కిందికి పయనించి... భూమిపైని ధనావేశం (పాజిటివ్ చార్జ్)తో కరెంట్‌గా కలిసి పిడు గవుతుంది. ఇది సాధారణంగా మనిషిని యాంటెన్నా చేసుకోదు. భూమ్మీద టవర్లనో, ఎల్తైన నిర్మాణాలనో, చెట్లనో, కడకు భూమినో వాహకంగా ఎంచుకుం టుంది. అందుకే చెట్ల కింద, రక్షణ లేని టవర్ల వద్ద, ఇంటి బాల్కనీల్లో, ఆరు బయట నిలబడొద్దంటారు. పరంపరగా మెరుపులొస్తున్నపుడు సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్ మాట్లాడొద్దంటారు. భూమితో ‘ఎర్తింగ్’ అయ్యేలా ఉండొద్దంటారు. మేఘాల్లో పుట్టే ఈ నెగెటివ్ చార్ఎ్జ సగటున గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తుంటుంది. గాలి బలహీన వాహకం అవడం వల్ల మెరుపు పుట్టినపుడు ఉద్భవించే ఉష్ణం ఆ గాలిని అత్యంత వేగంగా వ్యాపింప/కంపింప చేయడం వల్లే ఆకాశంలో పెద్ద శబ్దాలతో ఉరుములు పుడతాయి. ఈ మెరుపు ఓ బలహీన వాహకం (గాలి)లో పుట్టించే ఉష్ణం (53,540 డిగ్రీల ఫారెన్హైట్) సూర్యుని ఉపరితల ఉష్ణం(10,340 డిగ్రీల ఫారెన్హైట్) కన్నా అయిదు రెట్లు అధికం! అందుకే, ఈ కరెంటు ఒక చెట్టులోకి వ్యాపించినపుడు పుట్టే ఉష్ణం ఆ చెట్టులో ఉండే మొత్తం తేమను లాగి మోడు చేస్తుంది. పిడుగు స్థాయిని బట్టి కొన్నిసార్లు బతికి, మనుషులు ఏదో రకమైన వైకల్యానికి గురవుతారు. ఇక మన తెలుగు భూభాగంపై ఈసారి పిడుగుల తాకిడి పెరగటానికి ఓ కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే శీతల మేఘాలు, ఉత్తర భారతం నుంచి వేడిగాలులు కలవడంతో కరెంట్ వల్ల 124 మైళ్ల మేర మేఘాచ్ఛాదనం ఏర్పడిందని, అదే ఇందుకు కారణమై ఉండవచ్చని ఓ అభి ప్రాయం. నియంత్రిస్తేనే మనుగడ తెలిసి తెలిసీ... మనం మన దైనందిన చర్యల ద్వారా భూతాపోన్నతికి కారణమౌతున్నాం. పారిస్ ఒప్పం దంలో భాగంగా పెద్ద హామీలిచ్చి వచ్చాక కూడా మన ప్రభుత్వ విధానాలు మారలేదు. వివిధ సంస్థల నిర్వాకాలు, కార్పొరేట్ల కార్యకలాపాలు, వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలి... దేనిలోనూ మార్పు రాలేదు. శిలాజ ఇంధన వినియోగం తగ్గలేదు. జలరవాణా ఊసే లేదు! ఆశించిన స్థాయిలో థర్మల్ విద్యుదు త్పత్తి తగ్గలేదు. పైగా భూగర్భ గనుల కన్నా ఉప రితల గని తవ్వకాల్నే ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. బొగ్గుతో విద్యుదుత్పత్తిలో ‘సూపర్ క్రిటికల్’ వంటి ఆధునిక సాంకేతికతకు మారకుండా, పాత ‘సబ్–క్రిటికల్’ పద్ధతిలోనే సాగి స్తున్నాం. కార్బన్‌డయాక్సైడ్‌ను విరివిగా విడుదల చేయడమే కాక జలాన్ని విస్తారంగా దుర్వినియో గపరుస్తున్నాం. సౌర–పవన విద్యుత్తు వాటా పెద్దగా పెరగలే! ఇకపై ప్రతి కొత్త వాహనం విద్యుత్ బ్యాటరీతో నడిచేదే రావాలన్న మాట గాలికి పోయింది. అడవుల విస్తీర్ణ శాతం పెంచాలన్నది ఉట్టి మాటయింది. పైగా, 1988 జాతీయ అటవీ విధా నానికి తూట్లు పొడుస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తాజా ముసాయిదా ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వారి ముందుంది. దీన్ని నిశి తంగా ఖండిస్తూ ప్రజలు, పౌరసంఘాలు చేతన పొంది కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తెస్తాయో చూడాలి! చేయీ చేయీ కలిపితేనే.... కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషు లవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహి త్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరా కరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. ఉన్నొక్క సజీవ గ్రహాన్ని కాపాడుకుందాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కొవ్వులతో భూమికి చల్లదనం!
లండన్: వంట వండేటప్పుడు విడుదలయ్యే కొవ్వు కణాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి మేఘాలు ఏర్పడేందుకు తోడ్పడతాయని, దీంతో భూమి చల్లబడే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వేపుళ్లు చేసే సమయంలో కొవ్వు పదార్థాలు వెలువడటంతో పాటు ఏరోసాల్ తుంపరల్లో సంక్లిష్ట త్రీడీ నిర్మాణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఈ త్రీడీ నిర్మాణాలు ఏర్పడటం వల్ల మేఘాల ఏర్పాటును ప్రభావితం చేసే కొవ్వు కణాల జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏరోసాల్ తుంపరలపై కొవ్వు కణాలు పొరలాగా ఏర్పడి మేఘాలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేస్తాయని తమ పరిశోధనల్లో తెలిసిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన క్రిస్టియన్ ఫ్రాంగ్ వివరించారు. తుంపరల లోపల ఈ కొవ్వు కణాలు ఏం చేస్తాయో గుర్తించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ కొవ్వు కణాలన్నీ క్రమపద్ధతిలో ఒక చోటుకు చేరి ఓ సిలిండర్ మాదిరిగా ఏర్పడి మేఘాలు ఏర్పడటంలో భాగమైన నీటిని పీల్చుకునే తత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఓజోన్ రసాయనానికి ఈ కొవ్వు కణాలు నిరోధకతను కలిగి ఉంటాయని, దీంతో అవి ఎక్కువ కాలం మనగలుగుతాయని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. -
చినుకు..కునుకు
- కరువని మేఘాలు - ఎండుతున్న పైర్లు - ముందుకు సాగని ఖరీఫ్ - అయోమయంలో రైతన్న - ఈ ఏడాది నష్టాలేనని పెదవి విరుపు కర్నూలు అగ్రికల్చర్ /పత్తికొండ రూరల్ : ముందుస్తుగా ఊరించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పలు మండలాల్లో ఇరవై రోజులుగా వాన చినుకే కరువైంది. తొలకరి జల్లులతో పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూమిలో తేమ శాతం లేకపోవడంతో మొలకదశలోనే పైర్లు వాడిపోతున్నాయి. జూన్ నెలలో 13 మండలాల్లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. వివిధ మండలాల్లో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ భూమిలో పదును శాతం తక్కువగా ఉంది. గత ఏడాది జూన్ నెలలో సాధారణ వర్షపాతంకంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి కళకళలాడుతూ కనిపించాయి. ఈ ఏడాది కూడా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసినా పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..నీరు లేక వెలవెలబోతుఆన్నయి. వేరుశనగ సాగుకు జూలై 15వరకు అవకాశం ఉందని.. అంతవరకు విత్తనాలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురవకపోవడంతో విత్తనాలకు డిమాండ్ అంతగా కనిపించడం లేదు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించగా 36వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. జిల్లాకు బీటీ విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు కేటాయించగా..4లక్షల ప్యాకెట్లు మాత్రమే అమ్మకం అయ్యాయి. వానలు తక్కువే.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చేస్తోంది. ఈ మేరకు ఎర్రనేలల్లో పత్తి వేయవద్దని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచిస్తునఆనరు. వర్షాధారం క్రింద నల్లరేగడిలో మాత్రమే పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు. సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి పంటల్లో ఒకసారి గుంటెక పాయడం వల్ల పైపొర కదిలి బెట్టకు రాకుండా ఉంటాయని సలహాలు ఇస్తున్నారు. సాగు ఇలా.. ఖరీఫ్ సాధారణ సాగు: 6,36,403 హెక్టార్లు ఇప్పటి వరకు సాగైంది: 1,50,904 హెక్టార్లు పంట సాధారణ విస్తీర్ణం సాగైంది పత్తి 2,08,221 97,742 వేరుశనగ 1,10,124 19,399 మినుము 5,521 5,318 కంది, 13,255, మొక్కజొన్న 4,725, ఉల్లి 2,691, కొర్ర 802, ఆముదం 2,867 హెక్టార్లలో సాగు చేశారు. ================= జూన్‌లో లోటు వర్షపాత శాతమిలా.. మండలం వర్షపాతం లోటు శాతం గోనెగండ్ల 61 కొత్తపల్లి 54 తుగ్గలి 58 ప్యాపిలి 45 దొర్నిపాడు 41 శ్రీశైలం 40 ఆళ్లగడ్డ 14 నందికొట్కూరు 12 చిప్పగిరి 7 హొళగుంద 6 జాపాడుబంగ్లా 6 రుద్రవరం 5 మిడుతూరు 3 పత్తికొండ, దేవనకొండ, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఉయ్యలవాడ, ఆదోని, పెద్దకడుబూరు మండలాల్లో వర్షాలు అంంతంతమాత్రంగానే కురిశాయి. నీటి పారుదల పరిస్థితి.. గత ఏడాది జూన్ నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో జూలై నెలలోనే రైతులు వరి నారు పోసుకున్నారు. ఈ సారి వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆయకట్టు సాగుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీ కెనాల్ కింద 1,21,678 హెక్టార్లు, బోర్లు, బావులు కింద 1,14,703 హెక్టార్లు, లిప్ట్ ఇతర నీటి వసతి కింద 20,278 హెక్టార్ల భూములు ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఆయకట్టు సాగు కలసి వస్తేందా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతోంది. -
మరింత ఆసక్తిగా టైటాన్‌పై జీవాన్వేషణ
వాషింగ్టన్: విశ్వంలో ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాలు, ఉపగ్రహాల్లో అత్యంత ఎక్కువగా భూమిని పోలిన లక్షణాలున్నదిగా శనిగ్రహానికి చెందిన ఉపగ్రహం టైటాన్ ను భావిస్తారు. ద్రవరూప మీథేన్ ప్రవహించిన ఆనవాళ్లు ఉపరితలంలో కలిగి ఉండటం టైటాన్ ప్రత్యేకత. భూమిని పోలిన టైటాన్‌పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చేలా భూమిపై మాదిరిగానే టైటాన్‌పై అసాధారణంగా మేఘాలు కనిపించాయి. అక్కడి వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ మేఘాలు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శనిగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనల కోసం నాసా పంపిన కాసినీ ఆర్బిటర్ ద్వారా టైటాన్‌పై మేఘాలు ఏర్పడటాన్ని గుర్తించారు. టైటాన్ స్ట్రాటో స్పియర్‌లో ఈ మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే దశాబ్దం క్రితం నాసా ప్రయోగించిన వయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సైతం టైటాన్‌పై మేఘాలను గుర్తించింది. తాజాగా కనిపించిన మేఘాలు టైటాన్‌పై జీవాన్వేషణలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఊరిస్తున్న మేఘాలు
రాయికోడ్: భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశంలోని మేఘాలు ఊరిస్తున్నాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో వాతావరణం చల్లబడుతున్నప్పటికీ వానలు కురవడంలేదు. మండలంలో సాగువుతున్న పత్తి మొక్కలు వర్షాలు లేక ఎండుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురవాలని కోరుకుంటున్న రైతులకు నిరాశే ఎదురైంది. ఆగష్టులో సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా నమోదైంది. 215 ఎంఎం వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా 50 శాతం వర్షాపాతమే కురిసింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురై వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోఘాకాశంలో దట్టంగా అలుముకుంటున్న నల్లని మేఘాలు రైతులకు ఊరిస్తున్నాయి. భారీ వర్షాలు కురవాలని మండల రైతాంగం వేడుకుంటోంది. -
భాగ్యనగరంలో భారీవర్షం
హైదరాబాద్: భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. బుధవారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం మొదలైంది. పొద్దున్నే వర్షం రావడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగొడిగా సాగుతోంది. ఈసీఎల్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కోటి, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘాలు దట్టంగా అలముకోవడంతో రాత్రిని తలపిస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. దీంతో వీధి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా వెలుగు రాలేదు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీలు నీట ముగిగాయి. పరిగి, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ లో రహదార్లు జలమయం అయ్యాయి. -
ఆకాశంలో మబ్బుల పందిరి
నీలిమేఘాలు ఊరిస్తున్నాయి. పగలంతా సూరీడు నిప్పులు చెరుగుతుండటం, సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ, ఉరుములు ఉరుముతూ, కారుమబ్బులు నిండుకుండల్లా నీలాకాశంలో కమ్ముకుంటుండటంతో రైతుల్లో ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ చిత్రమే ఇది. బుధవారం ప్రత్తిపాడు– గొట్టిపాడు పంటపొలాల మధ్యన కమ్మేసిన కారుమబ్బులివి. – ప్రత్తిపాడు -
సొరంగ మార్గంలో చేతికందే మేఘాలు!
లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమాన్ని తలపెడుతోంది. ఆ దేశంలోని అతి పొడవైన సొరంగ మార్గంలో అబ్బురపడే మార్పులు చేయనుంది. 18 మైళ్ల పొడవున ఉన్న ఈ సొరంగంలో ఏర్పాటుచేసిన రహదారి పక్కనే పామ్ చెట్లు, మంచి గ్రీనరీ పెంచడంతోపాటు సొరంగం పై భాగంలో కృత్రిమ మేఘాలు సృష్టించనుంది. మాంచెస్టర్ నుంచి షెఫీల్డ్ మధ్య ఉన్న ఈ భారీ సొరంగంలో నుంచి వెళుతున్నవారు తీవ్ర మానసిక ఒత్తిడిలకు లోనవడమే కాకుండా లాస్ట్రోపోబియా, డిసోరియేంటేషన్(భ్రాంతి చెందే స్థితి), నీరసానికి గురవడంవంటి రోగాలకు గురవుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. దీంతో వారిని ఆ భారి నుంచి బయటపడేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో నార్వే, చైనా దేశాల్లో ఈ తరహాలో నిర్మించిన రెండు సొరంగాలను బ్రిటన్ స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమానికి తెరతీస్తోంది. సొరంగ మార్గాల్లో ఈ తరహా మార్పులు చేసే విధానం 50 ఏళ్ల కిందటే రాగా ఇప్పుడిప్పుడే ఒక్కో దేశం వాటిని తమకు అనునయించుకుంటోంది. సొరంగ మార్గాల్లో తక్కువగా ఉండే వెళుతురు, గాలి, టన్నెల్ వాతావరణం అందులో డ్రైవింగ్ చేస్తున్నవారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని, అది ఎంతమొత్తంలో అనేది ఊహించడం కష్టం కాదని వారు చెబుతున్నారు. అందుకే సమూలంగా ఇక మార్పులు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.