crop
-
రైతుల పంట బీమా కూడా మీకు భారమా బాబూ
-
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు!
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్ కాక.. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తొలుత గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజి్రస్టేషన్ చేసుకుని ఈ–పంట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.జియో కో– ఆర్డినేట్స్ పరిధిని పెంచాలి.. రాష్ట్రంలో ఈ–క్రాప్ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్ సరిగా పనిచేయక, యాప్ సకాలంలో ఓపెన్ కాక నమోదులో జాప్యం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
రైతు కంట నీరు మంచిది కాదు..
-
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్‌లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్‌లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్‌పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్దతు ధరకు సేకరణ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు... కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
పంట ఏదైనా.. మూడింతల ఆదాయం
సాక్షి, అమరావతి: అన్నదాత కల ఫలిస్తోంది. నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు పంటల్ని అమ్ముకునే వెసులుబాటు కలుగుతోంది. పండించిన పంటకు ప్రీమియం ధర దక్కుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జారీ చేస్తున్న గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్‌తో రైతుల తలరాత మారుతోంది. సర్టిఫికెట్స్ జారీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లూ ధ్రువీకరించే వ్యవస్థ లేక సాగు విధానాలను బట్టి పంట ఉత్పత్తులను ధ్రువీకరించే వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నప్పటికీ అత్యధిక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను దేశీయంగానే విక్రయించు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ సేంద్రియ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీ ఎస్‌వోపీసీఏ)ని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయాలని, రెండో దశలో పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్యూసీఐ గుర్తింపుతో.. ఇండో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ ఎస్వోపీసీఏకు ఇటీవలే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అక్రిడిటేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోనే గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మలిదశలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఎపెడా (ప్రొసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) నుంచి అక్రిడిటేషన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్టిఫికేషన్ జారీపై ఎంపిక చేసిన అధికారులు, రైతులకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో),భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో వివిధ స్థాయిల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్ పొందేందుకు పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా.. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా.. తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వార్ని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా నియమించారు. నంద్యాల జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఈ రైతు పేరు కురాకుల ఓబులేసు. రెండెకరాల్లో కొర్రలు సాగు చేశాడు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం గుర్తించిన క్లస్టర్లో ఆయన పొలం కూడా ఉంది. పొలం బడిలో చెప్పినట్టుగా తగిన మోతాదులో ఎరువులు వినియోగించాడు. ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారీ చేశాడు. మొత్తంగా ఎకరాకు రూ.4,500 పెట్టుబడి అయ్యింది. 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక పురుగు మందుల అవశేషాల పరీక్ష చేయించాడు. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేవని ల్యాబ్‌లో నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. కొర్రలు కనీస మద్దతు ధర రూ.2.500 ఉండగా.. ఈ సర్టిఫికేషన్ వల్ల క్వింటా రూ.7వేలకు అమ్ముకోగలిగాడు. పెట్టుబడి రూ.9 వేలు పోగా.. నికరంగా రూ.47 వేల ఆదాయం వచ్చింది. ఓబులేసు మాట్లాడుతూ.. ‘గతంలో పంటల్ని కనీస మద్దతు ధరకు కూడా కొనేవారు కాదు. ఈ ఏడాది గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల మంచి ఆదాయం వచ్చింది’ అంటూ ఆనందంగా చెప్పాడు. ఎమ్మెస్పీ కంటే రెండింతల ఆదాయం.. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్లలో ఎంపిక చేసిన రెండు క్లస్టర్స్‌లో 49 మంది రైతులు 63 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితుల కారణంగా ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,500 కాగా.. రైతులు క్వింటాకు రూ.2,900 నుంచి రూ.4,500 చొప్పున అదనంగా లబ్ధి పొందగలిగారు. 33 మంది రైతులు క్వింటా రూ.5,400 చొప్పున 161 క్వింటాళ్లను, ఏడుగురు రైతులు క్వింటా రూ.6 వేల చొప్పున 43 క్వింటాళ్లు, ఐదుగురు రైతులు క్వింటా రూ.6,300 చొప్పున 28 క్వింటాళ్లు, ఓ రైతు క్వింటా రూ.7 వేల చొప్పున 6 క్వింటాళ్లను విక్రయించారు. ఇలా ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.7.51 లక్షల ఆదాయాన్ని పొందారు. సర్టిఫికేషన్‌తో వ్యాపారులు సైతం పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోత కొచ్చిన కొర్రలను రైతులు ఎమ్మెస్పీకి రెండింతల ధరకు అమ్ముకోగలిగారు. 0.1 శాతం కంటే తక్కువ అవశేషాలు నాలుగేళ్లుగా వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకుని గడచిన ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాల్లో ‘గ్యాప్ క్లస్టర్స్’ను ఎంపిక చేశారు. ఈ క్లస్టర్లో గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం 1,487.47 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ, మిరప, అరటి, పసుపు, కూరగాయ పంటలను గుర్తించారు. వ్యవసాయ పంటలు సాగు చేసే 622 మంది రైతులతో 20, ఉద్యాన పంటలు సాగు చేసే 190 మందితో 13 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఏపీ ఎస్‌ఓపీసీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. గడచిన ఖరీఫ్ సీజన్ నుంచే గ్యాప్ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు వినియోగించేలా అవగాహన కల్పించారు. వివిధ దశల్లో రైతు క్షేత్రాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. పురుగు మందుల అవశేషాల స్థాయి 0.1శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. 99.99 శాతం ఆర్గానిక్ ఉత్పత్తులుగా గుర్తిస్తూ వారికి సర్టిఫికేషన్ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మలి దశలో రైతులను మార్కెటింగ్ ఏజెన్సీలు, ఎగుమతిదారులతో అనుసంధానం చేస్తారు. ఈ సర్టిఫికేషన్స్‌తో వారు పండించే ఉత్పత్తులకు మార్కెట్లో ప్రీమియం ధర లభించడంతోపాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా సర్టిఫికేషన్ జారీ గ్యాప్ సర్టిఫికేషన్ జారీ కోసం ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి క్యూసీఐ అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్‌తో మన రైతులు అంతర్జాతీయంగా పోటీపడే అవకాశం ఏర్పడింది. గడచిన ఖరీఫ్‌లో 1,487 ఎకరాల్లో 812 మంది రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్టిఫికేషన్ జారీ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – త్రివిక్రమ్‌రెడ్డి, ఎండీ, ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
పత్తి ఆహార పంట కూడా! కొన్ని దేశాల్లో ఏకంగా..
పత్తి పంటను కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని వాణిజ్య పంటగానే సాధారణంగా మనం పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నూనెను వంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చక్కను పశు దాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. మన దేశంలో 65 శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐసిఎసి) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తోంది. కిలో పత్తిని పండించడానికి 20 వేల లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఏసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో సాగు చేయదగిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఏసీ వాదన. పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఏసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తి సాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా. అయితే, దూదిలో 97% సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఏసీ లెక్క చెబుతోంది. సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసిఎసి అంటోంది. సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులను, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఏసీ సూచిస్తోంది. పంట కాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3% తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఏసీ అంటోంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబ పోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అదిరేటి వంగడాలు ‘అంతరిక్షం’ నుంచి? చైనా మాదిరి స్పేస్ బ్రీడింగ్) -
‘ఏఐ’ పంట!.. వ్యవసాయ రంగంపై చాట్ జీపీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది?
-కంచర్ల యాదగిరిరెడ్డి నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీ్వస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 1. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 2. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేíÙంచడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 3. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. 4. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేíÙంచి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా మారింది
-
పంట మార్పిడి చేశాడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు ...
-
వేధించే వేరుతొలుచు పురుగు
జహీరాబాద్: చెరకుతో పాటు ఇతర పంటలను వేరుతొలుచు పురుగు ఆశించి అపారనష్టం కలిగిస్తోంది. ఏటా వర్షాకాలంలో దీని ఉధృతి అధికంగా ఉంటోంది. చెరకు, పత్తి, కంది, మొక్కజొన్న, మిరప, అల్లం వంటి పంటలను సైతం దెబ్బతీస్తోంది. పంట వేసినప్పుడు ఈ పురుగు ఆశించి, పంటలేనప్పుడు భూమిలో దాగి ఉంటుందని డీడీఎస్–కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఎన్.స్నేహలత పేర్కొన్నారు. ఎప్పుడయితే మొదటి వర్షం పడుతుందో అప్పుడు భూమిలో ఉన్న పురుగులు వేప, రేగు, మునగ పంటలపై ఆశించి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయన్నారు. భూమిలో ఉన్న తల్లి పురుగులు 50–60 సెంటీ మీటర్ల లోతున 30–35 గుడ్లు పెడుతుందని, ఇలా పొదిగిన లద్దె దశలు కొత్తగా వేసిన పంటల వేరు వ్యవస్థను ఆశిస్తాయన్నారు. ఈ పురుగు యాసంగిలో కోశస్థ దశకు మారి భూమిలోనే ఉండిపోయి మళ్లీ వర్షాలు పడినప్పుడు బయటకు వస్తాయని, ఇలా వాటి జీవితచక్రాన్ని పూర్తి చేస్తాయన్నారు. నష్టపరిచే విధానం వేరుపురుగు ఆశించిన పంటను గమనిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి పంట వడలిపోతుంది. ఇలా వడలిన మొక్కలను పీకినప్పుడు చాలా సులభంగా బయటకు వస్తాయి. పప్పు దినుసుల్లో వేరు వ్యవస్థ నత్రజనిని ఆశించే బుడిపెలు కలిగి ఉంటాయి. వాటిని ఈ పురుగు ఆశించి నత్రజని సౌకర్యాన్ని అందకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా చెరకులో రటూన్(మొడెం) పంటను ఆశిస్తుంది. యాజమాన్య పద్ధతులు ● పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకోవాలిత ● రైతులు పెంట ఎరువులు వేస్తారు. మగ్గిన పెంటఎరువులో ఈ పురుగు ఎక్కువగా గుడ్లు పెడుతుంది. వీటి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చిలికిన పెంటను ఎరువుగా వేసుకోవాలి. ● మొక్కలు ఎండిపోయి, వడలిపోయినట్టు కనిపిస్తే మెటారైజియం అనే సూక్ష్మం 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడపాలి లేదా డ్రిప్ నీటివసతి కలిగి ఉంటే అందులో వదలాలి. ● వేసవి జల్లులు ముగిసిన వెంటనే పంట చుట్టూ ఉన్న వేప, అకేశియా చెట్లు ఉన్న చోట లైట్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల తల్లి పురుగు ఆకర్షితమై అందులో పడిపోతాయి. ఇలా పడిన వాటిని చంపివేయాలి. ● దశవర్ణి కషాయం 6 లీటర్లు ఒక ఎకరానికి కలిపి మొదళ్లను తడపాలి. -
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
మద్దతు ధరలపై 'ఈనాడు' తప్పుడు వార్తలు
-
తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
-
ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్‌కే ధాన్యం అమ్ముకోవాలా?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు తరలుతున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సైతం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించి, వేగంగా తూకం వేస్తే ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనవి 20 కేంద్రాలే.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోతల సీజన్ ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 20 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఇవి కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. మిగితా చోట్ల ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కాలేదు. ఇప్పటికే జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో వరిపంటను కోసం పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్లో మొత్తం 1.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 2.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మొత్తం 1,069 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలావరకు ధాన్యం ప్రైవేటుకు తరలుతోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టకుండా, కొంతమేరకు కొనుగోళ్లకే అధికారులు పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తేమ పేరుతో కొర్రీలు.. జిల్లాలో చాలాచోట్ల వరికోతలు పూర్తయ్యి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కావడం లేదు. ధాన్యం ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తోందని, తేమ శాతం సరిగ్గా ఉంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 17శాతం తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేపట్టాలి. కానీ జిల్లాలోని చాలా కేంద్రాల్లో 16 నుంచి 14 శాతం వరకు ఉంటేనే తీసుకుంటున్నారు. అప్పటివరకు రైతులతో మళ్లీ ఆరబోయిస్తున్నారు. కొన్నికేంద్రాల్లో తేమ శాతం ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకే విక్రయిస్తున్నారు. ‘ఈ ఫొటోలోని రైతు పేరు సాగర్. జిల్లాలోని తాడూరు మండలం చర్లఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు సాగర్ 14 రోజుల కిందట వరిపంటను కోశాడు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో జిల్లాకేంద్రంలో సమీపంలోని మిల్లుకు ధాన్యాన్ని తరలించాడు. మిల్లు నిర్వాహకుడు బస్తాకు కిలోన్నర చొప్పున కట్ చేసుకున్నాడని వాపోయాడు. గ్రామంలో అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయానికి ప్రైవేటు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’ తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నాం.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని చాలాచోట్ల ఇంకా వరికోతలు పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ధాన్యం సెంటర్లకు వస్తోంది. కేంద్రానికి వచ్చిన ధాన్యం నిర్ణీత తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. – మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జిల్లాలో ఏర్పాటుచేయనున్న కొనుగోలు కేంద్రాలు - 214 ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు - ప్రారంభమైనవి - 20