Deviprasad
-
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్
‘‘ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ’ వంటి మంచి సినిమాల తర్వాత నేను చేసిన మరో మంచి చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇలాంటి కథలకు హీరో ఎవరు? అనే దానిపై చర్చలు అనవసరం. ఈ సినిమా చూశాక హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్. విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా విశ్వనాథ్ మాగంటి తెరకెక్కించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కథకి ఎవరైతే నాయకుడు అవుతారో వారే హీరో. ఈ సినిమాలో విశ్వంత్ హీరో’’ అన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అరుదు. ఇది ప్రతి ఒక్కరి కథ’’ అన్నారు విశ్వంత్. ‘‘నా కుటుంబంతో కూర్చుని చూసే సినిమా చేయాలనుకుని ఈ కథ రాసుకున్నా’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘మా యూనిట్‌కి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలి’’ అన్నారు దుర్గా ప్రసాద్. -
ఆంధ్రా ఉద్యోగులను పంపిస్తాం
బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను త్వరలోనే వారి రాష్ట్రానికి పంపించి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు తీసుకు వస్తామని టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు అన్నారు. గురువారం ఆయన ఎక్సైజ్ భవన్‌లోని తన నూతన కార్యాలయంలో ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేషన్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆంధ్రలో తెలంగాణకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారని, 10–15 రోజుల్లో అక్కడి వారిని ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. ఈమేరకు రెండు రాష్ట్రాల కార్పొరేషన్ ఎండీలు కలసి మాట్లాడుకున్నారని తెలిపారు. త్వరలోనే 135 పోస్టులకు నోటిఫికేషన్ కార్పొరేషన్‌కు వివిధ స్థాయిల్లో మొత్తం 258 ఉద్యోగులు అవసరం కాగా, ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని దేవీప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిపోల కోసం 55 పోస్టులను కలుపుకొని త్వరలో135 పోస్టులకు నియామకాలు చేపట్టాలను కుంటున్నట్టు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అనుమతి ఇచ్చారని చెప్పారు. మద్యం విక్రయాలు పెరిగాయి... రాష్ట్రంలో డిమాండ్‌కు తగినంత మద్యం ఉత్పత్తి ఉందని దేవీప్రసాద్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు పెరిగాయని చెప్పారు. మద్యం పంపిణీ కోసం 18 డిపోలు ఉన్నాయన్నారు. అయితే రవాణా ఇబ్బందిగా మారిందని దుకాణదారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా డిపోలు పెట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. -
జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నాం
తిమ్మాపూర్ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీఎన్జీవో కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ తెలిపారు. ఎల్ఎండీ కాలనీలో అమరవీరుల స్థూపం వద్ద వారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం పోరాటం చేసిన టీఎన్జీవోలకు ప్రత్యేకత ఉందని, ఉద్యోగులు ప్రజలకు చేరువై మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటుకు ముందే ఉద్యోగుల హెల్త్‌కార్డులు, బకాయిలు, ప్రభుత్వ హామీలను, సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 74 ప్రకారం అన్నీ రాయితీలు వర్తిస్తున్నాయని తెలిపారు. కొత్త జిల్లాలతోపాటు కొత్త ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జోనల్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా చేయాలన్నారు. ఉద్యోగుల అభిప్రాయం మేరకు, సీనియార్టీ నష్టం కాకుండా కొత్త జిల్లాలకు పంపాలని కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన వారికి 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జోనల్ వ్యవస్థ రద్దు కాలేదని స్పష్టం చేశారు. కొత్త రూల్స్ తేవాల్సిన అసరముందన్నారు. పీఆర్సీ బకాయిలు రిటైర్డు ఉద్యోగులకు ముందుగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు సుద్దాల రాజయ్య, మహిళా ఉద్యోగుల అధ్యక్షురాలు రేచల్, ఎల్ఎండీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమేష్, పోలు కిషన్, టింగో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, అమరేందర్‌రెడ్డి, టీఎన్జీవో నాయకులు జి.శ్రీనివాస్, గంగారపు రమేష్, రాగి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొమురయ్య, రాజయ్య పాల్గొన్నారు. -
సర్కారుపై ఒత్తిడి తెద్దాం:దేవీ ప్రసాద్
సాక్షి, ఖైరతాబాద్: తెలంగాణలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ కార్డులు వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సెప్టెంబర్–2న జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మెకు ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, తెలంగాణ డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షులు హరినాద్బాబు, రాష్ట్ర అధ్యక్షులు హబీబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
టెట్, ఎంసెట్ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి
-ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు -సర్కారుకు టీఎన్జీవోల సంపూర్ణ మద్దతు -ప్రైవేట్ కళాశాలలు బంద్ ఉపసంహరించుకోవాలి కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఎన్జీవోలతో అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం తీరును ఖండించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేపడుతోందని సమర్థించారు. విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు టీఎన్జీవో సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టెట్, ఎంసెట్‌లను బహిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉపసంహరించుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసిన టెట్, ఎంసెట్ నిర్వహణకు ఉద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అవసరమనుకుంటే గౌరవ వేతనం లేకుండా విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కేంద్ర సంఘం నాయకులు రాజయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, వేముల రవీందర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్ పాల్గొన్నారు. -
'ఆలస్యం చేస్తే మరో ఉద్యమానికి సిద్ధం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బందిని రిలీవ్ చేయాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. గురువారం వారు కమలనాథన్ కమిటీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలు మేరకు విభజన జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనలో ఇప్పటికే ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. త్వరగా ఉద్యోగుల విభజన పూర్తి చేయకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని కోదండరాం, దేవీ ప్రసాద్ తెలిపారు. -
ఏపీ ఉద్యోగులూ మద్దతిస్తారు: దేవీప్రసాద్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తారనడంలో వాస్తవం లేదని టీఎన్జీవో మాజీ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఉద్యోగులు కూడా తనకు మద్దతిస్తారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు తెలిపారు. -
ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సివుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ పోటీచేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ తరపున ఆయన బరిలో దిగనున్నారు. -
'అశోక్ బాబు గోబెల్ ప్రచారం మానుకోవాలి'
కరీంనగర్: బ్రిటీష్ కాలం నాటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో మార్పులు తీసుకువస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దేవీ ప్రసాద్.. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులపై అశోక్ బాబు చేస్తున్న గోబెల్ ప్రచారం మానుకోవాలన్నారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో సమూల మార్పులకు తెలంగాణలోని 10 జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. -
'కెసిఆర్‌తో ఎటువంటి విభేదాలు లేవు'
మెదక్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్)తో తమకు ఎటువంటి విభేదాలు లేవని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులు అందరూ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ విషయంలో రెండు రాష్ట్రాలకు ఒకే నిబంధన వర్తింపచేస్తే తాము ఊరుకునేదిలేదని దేవీప్రసాద్ హెచ్చరించారు. ** -
దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా
టీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ఫైర్ హైదరాబాద్: టీఎన్జీవోస్ నేత దేవీప్రసాద్‌ను కాదని కొత్త ప్రభాకర్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి మెదక్ లోక్‌సభ టికెట్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ నుంచి వలస వచ్చినట్టు చెప్పుకున్న కేసీఆర్ సీఎం అయ్యారని, గుంటూరు విద్యార్థి కేటీఆర్ తెలంగాణలో ఉద్యోగానికి పనికిరాకున్నా మంత్రిని చేశారని విమర్శించారు. తెలంగాణ వ్యక్తినే సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలన్నారు -
బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్ అని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ స్థానికత రాదని ఆయన అన్నారు. తెలుగుదేశంలో పదవులు అనుభవించిన టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావువి దిగజారుడు రాజకీయాలని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్లే పార్లమెంట్లో టి.బిల్లు పాసైందని, సకలజనుల సమ్మెలో కీలక పాత్ర వహించిన మెదక్ జిల్లావాసికి దేవీప్రసాద్‌కు టికెట్ ఎందుకివ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. -
ఏపీ ఉద్యోగుల అవసరం లేదు: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణలో నిరహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అవసరంలేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తెలంగాణ ఉద్యోగులకు ఉందని ఆయన తెలిపారు. ఈనెల 19న సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించడమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. -
'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తమ ఉద్యోగులు ఏవరూ పనిచేయరని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. -
మరో పోరాటానికి సిద్ధం: దేవీప్రసాద్
హైదరాబాద్ : ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం నాంపల్లిలోని గగన్‌విహార్ భవన్లో తెలంగాణ వాణిజ్య పన్నుల నాన్గె జిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర ్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, సంఘం నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ఐఏఎస్ అధికారులకు తప్పుడు సమాచారంతోనే కేంద్రం ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు కేటాయింపులు జరుగుతున్నాయే తప్ప బదిలీలు కావనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకువచ్చేలా కృషి చే స్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ చైర్మన్ వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్రం చేస్తున్న గందరగోళం వల్లనే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ కీర్తి స్తూపం నుంచి చేపట్టిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏఒక్క ఉద్యోగీ ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేయడానికి వీల్లేదని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడి ఉద్యోగులు మాత్రమే ఉండాల న్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. -
మెదక్ ఎంపీగా దేవీప్రసాద్ పోటీచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మెదక్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా టీఎన్జీఓస్ కేంద్ర కమిటీ బాధ్యులు దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, గౌరవ అధ్యక్షుడు శ్యామ్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాకు చెందిన దేవీప్రసాద్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. టీఎన్జీఓస్ను ఏకతాటిపై నడిపి 42 రోజుల సకలజనుల సమ్మె ఉద్యోగుల సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2న తెలంగాణ సంబరాలు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పిస్తామన్నారు. ప్రతి కార్యాలయంలోను సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎన్జీఓస్ నేతలు యాదమ్మ, శ్యామ్, నర్సింలు,సతీశ్, సిద్ధిరామ్, సుశీల్‌కుమార్, రవి, చారి, యాదవరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించండి
టీఆర్ఎస్ వార్‌రూం, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వండి: దేవీప్రసాద్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలి స్థానికత ఆధారంగా విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు కరీంనగర్ : తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్‌రూంకు, టీఎన్జీవో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు వెంటనే సమాచారం అందించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సచివాలయంలో ఈ ప్రాంత ఉద్యోగులు మాత్రమే పనిచేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగులం సీమాంధ్రలో పనిచేయమని, అదేవిధంగా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేయొద్దని అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉన్న మూడు వేల మంది తెలంగాణ ఉద్యోగులు జన్మభూమిపై మమకారంతో ఇక్కడే పనిచేసేందుకు వాంటరీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారని తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు సీమాంధ్ర ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంపొందించవద్దని కోరారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని కేసీఆర్ చెప్పిన మాటను తప్పుపట్టవద్దన్నారు. అది ఒక్క కేసీఆర్ మాటే కాదని, నాలుగున్నర లక్షల తెలంగాణ ఉద్యోగుల మాటతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. ఆయా హెడ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదని చెప్పారు. జాబితాను బహిరంగంగా వెల్లడిస్తే తప్పుడు సమాచారమిచ్చిన ఉద్యోగుల వివరాలు బయటపడి అపాయింటెడ్ డే, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలోపు పరిశీలించే అవకాశం ఉండేదన్నారు. స్థానికత ఆధారంగా విభజన జరిగేంత వరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ సూచించారు. ఇప్పటివరకు 23 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన సచివాలయంలో తెలంగాణ జిల్లాల వారిని పట్టించుకోలేదన్నారు. అందుకే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. 58ః42 ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియలో మంజూరీ పోస్టులను కాకుండా వర్కింగ్ పోస్టులను విభజించడం సరికాదన్నారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన తెలంగాణలోని నాలుగు వందల పోస్టులను వెంటనే పునరుద్ధరించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. -
స్థానికత ఆధారంగానే విభజన: దేవీప్రసాద్
కరీంనగర్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఆయన స్వాగతించారు. 204 శాఖల్లో 50వేల మంది ఉద్యోగులు వివరాలను వెల్లడించాలని దేవీప్రసాద్ శనివారమిక్కడ అన్నారు. సకల జనుల సమ్మె రోజులను ప్రత్యేక సెలవులుగా ప్రకటించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలన్నారు. -
30లోగా పీఆర్సీ నివేదికను అందజేయండి: టీఎన్జీవోస్
హైదరాబాద్: పదో పీఆర్సీ నివేదికను 70 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్‌తో రూపొందించి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవోస్) నేతలు విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ నే తృత్వంలో నేతలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వేణుమాధవ్ , చారి, తదితరులు బుధవారం సచివాలయంలో ఈ మేరకు పీఆర్సీ కమిషనర్ అగర్వాల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ గడువును ప్రభుత్వం మే 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పీఆర్సీ నివేదికను త్వరగా అందజేయాలని వారు కోరారు. వివిధ శాఖలు కోరిన విధంగా వేతనాలను నిర్ధారించాలని విన్నవించారు. అనామలీస్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేకుండా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంచాలి
పెన్షనర్ల విభజనా అలాగే జరగాలి: దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ఉద్యోగులను విభజిస్తే.. సమ్మెకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మహిళా విభాగం చైర్మన్ రేచల్తో కలసి విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం ఉద్యోగులను కేటాయించినా, పింఛన్లను జనాభా ప్రాతిపదికన ఇచ్చినా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన విభాగాల్లో నూటికి నూరుపాళ్లు పోస్టులన్నీ తెలంగాణ వారికే దక్కాలన్నారు. 70 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఓపెన్ కోటా కింద తెలంగాణలో పని చేస్తున్నారని... వారు ఆప్షన్ ఇచ్చిన వెంటనే వారిని పంపించివేయాలన్నారు. సీమాంధ్రలోని తెలంగాణవారిని వెనక్కి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 5 లక్షల 40 వేల ఉద్యోగాలకుగాను 3 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. ఖాళీలను తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి పూరించాలన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని అమరుల సహాయనిధికి అందజేస్తామన్నారు. -
ఆందోళనలో పాల్గొంటే తెలంగాణ ద్రోహులే
హైదరాబాద్ సీమాంధ్ర ఉద్యోగులకు దేవీప్రసాద్ హెచ్చరిక హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుకు వ్యతిరే కంగా ఏపీఎన్జీవోలు నిర్వహించే ఆందోళనల్లో హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు పాల్గొంటే, వారిని తెలంగాణ ద్రోహులుగా భావిస్తామని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. ఏజీవర్సిటీ తెలంగాణ బోధనేతర సంఘం 2014 క్యాలెండర్‌ను మంగళవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు అభద్రతా భావానికిలోనై తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని ఆయన కోరారు. 610 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులను సరిగా పాటించక తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టడం వల్లే ఉద్యమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఏర్పడబోతున్న తరుణంలో ఏజీ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్సిటీ నియామకాల్లో తెలంగాణ వాటా దక్కేలా చూడాలని వర్సిటీ వీసీ పద్మరాజుకు సూచించారు. వర్సిటీ ఉద్యోగులకు కూడా రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా ఐఆర్‌ను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడ్డుతగిలితే ప్రళయమే : శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ బిల్లుకు అడ్డుతగిలితే తెలంగాణలో మరోసారి తలపెట్టే ఉద్యమం ప్రళయాన్ని తలపించేలా ఉంటుందని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం సీమాంద్ర ప్రజల మీద కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన సీమాంద్ర పాలకులపైనే తమ పోరాటమన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం, తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీతో దోస్తీచేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీల జెండాలను, గద్దెలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజీ వర్సిటీ వీసీ పద్మరాజు, రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు, వర్సిటీ విద్యార్థి వ్యవహారాల అధికారిణి మీనాకుమారి, మధుపాల్రావు, జయరాం, పరమేశ్, నర్సింగ్‌రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
వారికి బుద్ధి చెప్పేందుకే...సకల జన భేరి
సుబేదారి, న్యూస్‌లైన్ : తెలంగాణ ఇస్తామని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగానే టీఎన్జీవోలు కదనరంగంలోకి దూకాల్సి వస్తోందని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యమం మళ్లీ ఉధృతరూపం దాల్చకముందే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో టీఎన్జీఓల భేరి సభ గురువారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా దేవీప్రసాద్ మాట్లాడారు. టీఎన్జీఓ అన్న నాలుగు అక్షరాల పోరాటానికి రూపమే సకల జన భేరి అని తెలిపారు. సచివాల యంలో మూడు వేల మంది సీమాంధ్ర అధికారులు ఉంటే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు 800 మంది మాత్రమే ఉన్నారని, దీన్ని నిరసిస్తూ సచివాలయంపై తెలంగాణ జెండా ఎగురవేయడానికి సకలజన భేరి సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రకటన చేసినప్పటికీ... ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ, పాలకులు అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నందున అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని పార్టీల నేతలు ఒక్కటి కావడమే కాకుండా కేంద్రం యూ టర్న్ తీసుకునేలా వివిధ యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కారణంగానే తెలంగాణలో మళ్లీ బలిదానాలు చోటుచేసుకుంటున్నాయని, బిడ్డలకే తల్లిదండ్రులు తలకొరివి పెట్టాల్సిన దుస్థితి సీమాంధ్ర నాయకుల వల్ల ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికీ గడువే... ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యలే కాదు, ఏ విషయమూ స్పష్టం తెలియదని దేవీప్రసాద్ ఎద్దేవా చేశారు. పదో పీఆర్సీ చైర్మన్ కొన్ని అంశాలపై సమాధానం చెప్పాలని లేఖ పంపితే రెండు నెలల గడువు అడిగారని గుర్తు చేశారు. ఇక రాజ్యాంగ వ్యతిరేకంగా సమ్మె ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే రెండు వారాల అడిగారని.. ఇలా సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పలేని వ్యక్తి నాయకుడెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. విభజన వద్దంటూ మూర్ఖపు వాదనకు దిగుతున్న అశోక్‌బాబు వంటి వారికి బుద్ధి చెప్పడమే కాకుండా స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఈనెల 29న తెలంగాణ సకల జనభేరి నిర్వహిస్తున్నామని దేవీప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణను ఇందు లో ప్రకటిస్తామని వివరించారు. టీఎన్జీఓల స్ఫూర్తితోనే ఉద్యమంలోకి... : కడియం తాను టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి రావడానికి టీఎన్జీఓలే స్ఫూర్తి అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు టీఎన్జీవోల నేత పరిటాల సుబ్బారావు చేసిన విజ్ఞప్తితో పాటు.. స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనులను వివరించినా తెలంగాణ ఉద్యమంలో లేరు కదా అంటూ ప్రశ్నించిన ఉపాధి హమీ కూలీల సూచనలు ఆలోచనకు పురిగొల్పాయని వివరించారు. తాను టీఆర్ఎస్లోకి రాగానే, తెలంగాణ ప్రకటన రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటన రావడానికి కానీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి కానీ టీఎన్జీవోలే కారణమని కొనియాడారు. చరిత్ర తెలియన అజ్ఞాని, ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు.. నిజాంకాలంలో తెలంగాణ ప్రజలు బానిసలని చెప్పడం గర్హనీయమని కడియం పేర్కొన్నారు. అయితే, నిజాం కాలంలో ఆ బానిసలే బందూకులు పట్టుకుని రాజులను తరిమినట్లుగా అశోక్‌బాబుకు జరగకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నాయకులు పోరాడిన సమయంలో టీ టీడీపీ ఫోరం నేతలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని శ్రీహరి ప్రశ్నించా రు. సీమాంధ్ర రాజకీయ పార్టీల వైఖరిని తెలియజేయడానికి, సీమాంధ్ర దుష్ర్పచారాన్ని తిప్పికొట్టడానికితెలంగాణ సకలజనుల భేరి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు వరంగల్ నుంచి 20వేల మందిని హైదరాబాద్‌కు తరలించునున్నామని కడియం వివరించారు. మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎత్తిచూపుతున్నాయి - టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి సీమాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నాయని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ వైఖరిని వారు మార్చుకోవాలని సూచించారు. అలాగే, తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో బిల్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టీఎన్జీఓల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణ ప్రజలదే, దీన్ని చాటిచెప్పడానికే నిజాం కాలేజీలో తెలంగాణ సకల జనుల భేరి నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెనక్కితీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులను ఆదుకోవడానికి సహకరించిన టీఎన్జీవోలకు టీఆర్ఎస్ ఎప్పటికీ రుణ పడి ఉంటుందన్నారు. పాట, మాటలతో ఉత్తేజపరిచిన సురేందర్ నంది అవార్డు గ్రహీత, జిల్లా వాసి, సినీ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ తన మాట, పాటలతో టీఎన్జీవోల భేరి సభను ఉత్తేజపరిచారు. తెలంగాణకు అడ్డుపడుతున్నాడని చంద్రబాబుపై, మౌనంగా ఉంటున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రశ్నిస్తూ పాట పడిన ఆయన.. ఇక్కడ పుట్టిన మహానుభావులను కీర్తిస్తూ కూడా పాట పాడారు. అనంతరం సకల జనుల భేరి సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో టీఎన్జీఓల రాష్ట్ర నాయకురాలు రేచల్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, ఇంజినీర్ల సంఘం నాయకుడు శివాజీ మాట్లాడగా, శ్రీనివాస్, అసనుద్దీన్, సాదుల ప్రసాద్, ఇబ్రహీం హుస్సేన్, సదానందం, రత్నాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్, సంపత్‌రావు, స్వర్గం హరి, సాంబయ్య, అబ్దుల్లా, జహంగీర్, రాగి శ్రీనివాస్, దాస్యానాయక్, ఉపేందర్‌రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, ప్రతాప్, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
సకల జన భేరితో సమాధానం చెబుదాం: దేవీప్రసాద్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై ఆధిపత్యం కోసమే సీమాంధ్రులు ఉద్యమం చేస్తున్నారని టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షతన 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకలజన భేరికి సన్నాహకంగా జనభేరి సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేవీప్రసాద్ మాట్లాడుతూ, టీఎన్జీఓల ప్రతి పోరాటం ప్రజల పక్షానే సాగిందన్నారు. 1952లో ఫజల్ అలీ కమిషన్ ఎదుట తిరుగుబాటు జెండా మొదలు, నేటి ఉద్యమం వరకు ప్రజల పక్షానే పోరాడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న సీమాంధ్రులు..చరిత్రను తెలుసుకోవాలన్నారు. 1956కు పూర్వమే చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, వైద్యశాల, ఎముకల ఆస్పత్రి, డ్రైనేజి వ్యవస్థతో హైదరాబాద్ ప్రపంచంలోని ఐదు సుందర నగరాల్లో ఒకటిగా కీర్తి గడించిందన్నారు. విలీన సమయం నుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాటకు దక్కాల్సిన 5 లక్షల 20 వేల ఉద్యోగ్లాలో కేవలం 2 లక్షలు మాత్రమే దక్కాయన్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టి ఈ ప్రాంత వెనుకబాటు తనానికి కారణమైంది మీరుకాదా అని సీమాంధ్రులను ఆయన ప్రశ్నించారు. 610 జీఓ, 36 జీఓ, గిర్గ్లానీ కమిటీల ద్వారా సీమాంధ్రులు లక్షలాది ఉద్యోగాలు కొల్లగొట్టిన విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్లే కడుపు మండి ప్రజల పక్షాన టీఎన్జీఓలంతా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా వత్తిడి తేవాలన్నారు. ఏపీ సేవ్ పేరిట ఏపీఎన్జీఓలు నిర్వహించిన సభకు రాష్ట్ర ప్రభుత్వం రాచమార్గంలో సహకరించిందన్నారు. వేలాది మంది సీమాంధ్రుల మధ్య దుబ్బాక ముద్దుబిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను చాటి చెప్పాడన్నారు. ఒకడి నినాదాన్నే సహించలేని సీమాంధ్రులు నాలుగున్నర కోట్ల ప్రజల నినాదాలిస్తే ఆ సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. విభజన అనివార్యమని, అందుకు సహకరించాలని ఏపీఎన్జీఓలను దేవీప్రసాద్ కోరారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని రాజకీయ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. సీమాంధ్రను చూసైనా ఐక్యమై ప్రజల ఆకాంక్ష మేరకు అధిష్టానంపై వత్తిడి చేసేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌పై కిరికిరి చేయవద్దని...హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదం ఇచ్చారు. అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాలతో ఈ ప్రాంతంలోని బిడ్డలు పరాయి బిడ్డలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలనీ, మహిళ పోస్టులను పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా నియమించాలని టీఎన్జీఓల కేంద్ర కమిటీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. టీఎన్జీఓల కార్యాచరణలో నిజాయితీ ఉందనీ, ఆ మేరకు పనిచేయడం వల్లే ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. 29న నిర్వహించనున్న సకలజన భేరికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రుల భార్యలు ఏం చేశారని టీఎన్జీఓల మహిళా విభాగం అధ్యక్షులు రేచల్ ప్రశ్నించారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్, కేంద్రకమిటీ సభ్యులు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటమన్నారు. సెక్రటేరియట్లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కారణంగానే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. సమావేశంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, టీఎన్జీఓల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి, శ్వాంరావు తదితరులు మాట్లాడుతూ, సకలజన భేరికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జీతం కోసం పీఆర్సీ జీవితం కోసం తెలంగాణ నినాదంతో ముందుకు సాగుదామన్నారు. ఈ సందర్భంగా సకలజన భేరి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.